TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

These TS 8th Class Telugu Bits with Answers 1st Lesson త్యాగనిరతి will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

చదువండి-ఆలోచించి చెప్పండి.

దధీచి మహా తపశ్శాలి. చ్యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకొంటుండగా వాటిని దాచిపెట్టుమని దధీచికి దేవతలు ఇచ్చిపోయారు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దధీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు. అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకొమ్మన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
దధీచి ఎవరు ?
జవాబు.
దధీచి గొప్ప తపస్వి. చ్యవన మహర్షి కుమారుడు.

ప్రశ్న 2.
దధీచి చేసిన త్యాగం ఏమిటి ? ఎందుకు ?
జవాబు.
దధీచి తన శరీరాన్ని యోగాగ్నిలో దహించివేసుకొని తన ఎముకలను దేవతలకు ఆయుధాలుగా ఇచ్చాడు.

ప్రశ్న 3.
త్యాగం అంటే ఏమిటి ?
జవాబు.
తన కష్టనష్టాలను లెక్కచెయ్యకుండా పరహితం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేయడమే త్యాగం.

ప్రశ్న 4.
మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లను తెలుపండి.
జవాబు.
జీమూత వాహనుడు, బలిచక్రవర్తి, ఏకలవ్యుడు, హరిశ్చంద్రుడు మొదలైన వారు గొప్ప త్యాగధనులు.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

పాఠం ఉద్దేశం :

ప్రశ్న.
త్యాగనిరతి పాఠం నేపథ్యం వివరించండి.
జవాబు.
పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబిచక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారాడు. ఇంద్రుడు డేగ రూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది.

పాఠ్యభాగ వివరాలు:

ప్రశ్న.
త్యాగనిరతి పాఠ్యభాగ వివరాలు తెల్పండి.
జవాబు.
త్యాగనిరతి పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే ‘ఇది ఇట్లా జరిగింది’ అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాక ముందు వాగ్రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు.

కవి పరిచయం :

ప్రశ్న.
త్యాగనిరతి పాఠం రచించిన కవిని పరిచయం చేయండి.
జవాబు.
రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి నన్నయ. ఇతనికి వాగనుశాసనుడనే బిరుదు ఉన్నది. 11వ శతాబ్దం వాడు.

వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వంలో 4వ ఆశ్వాసంలో “శారదరాత్రులు” అనే పద్యం
(11వ శతాబ్దం) వరకు తెలుగులోకి అనువదించాడు. “ఆంధ్రశబ్ద చింతామణి” అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ‘అక్షరరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థసూక్తి నిధిత్వం’ అనే లక్షణాలున్నాయని చెప్పుకున్నాడు.
(గమనిక : జవాబు రాసేటప్పుడు గీతగీసిన వాక్యాలు రాస్తే చాలు.)

ప్రవేశిక:

మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత, రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. అది ఎట్లానో తెలియజేయడం ఈ పాఠం నేపథ్యం.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

కఠినపదాలకు అర్థాలు :

భూతము = ప్రాణి
బుభుక్షావేదన = ఆకలిబాధ
పాడి = న్యాయము, ధర్మము
కపోతం = పావురం
ఖాదయంతి = తింటాయి
శ్యేనం = డేగ
అధముడు = నీచుడు
ఆశ్రితులు = ఆశ్రయించినవారు
పరిత్యాగం = విడిచిపెట్టుట
ఒండు = మరొకటి
మహిషం = దున్న
ఖగం = పక్షి, విహగము
వరాహం = పంది
ఉపశమించు = శాంతించ
విహితము = విధించబడిన, చెప్పబడిన
అసి = కత్తి
అపుత్రిక = చిన్నకత్తి
కర్తనము = కత్తిరించుట
అంగము = శరీరభాగము
కడు = మిక్కిలి
ధరణి = భూమి
నాథుడు = భర్త
ధరణీనాథుడు = భూ భర్త = రాజు
తొరుగు = కారుచుండగా
వాసవ దహనులు = ఇంద్రుడు, అగ్నిదేవుడు
ఉన్నతి = ఔన్నత్యం
చనుట = వెళ్ళుట

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

పద్యాలు-ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు:

ఆ॥ నిన్ను సత్య ధర్మ నిర్మలుఁగా విందు
నట్టి నీకు బాడియయ్య ? యిప్పు
డతి బుభుక్షితుండనై యున్న నాకు నా
హార విఘ్న మిట్టులాచరింప ? ………. 1

ప్రతిపదార్థం:

అయ్య = ఓ రాజా ! శిబి చక్రవర్తీ !
నిన్ను = నిన్ను గురించి
సత్య ధర్మనిర్మలున్ + కాన్ = సత్యము, ధర్మము పాటించే పవిత్రునిగా
విందున్ = విని ఉన్నాను
అట్టి నీకు = అంత గొప్పవాడివైన నీకు
ఇపుడు = ఈ సమయంలో
అతి = మిక్కిలి
బుభుక్షితుండను + ఐ = ఆకలి గొన్నవాడనై
ఉన్న నాకున్ = ఉన్నటువంటి నాకు
ఇట్టులు = ఈ విధంగా
ఆహార విఘ్నము = భోజనానికి ఆటంకము
ఆచరింప = కలిగించుట
పాడి + అ = న్యాయమేనా ?

తాత్పర్యం:
ఓ శిబి చక్రవర్తీ ! నీవు సత్య ధర్మాలను ఆచరించటం చేత కళంకం లేనివాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా ?

వ॥ సర్వ భూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు, నిదినాకు, భక్ష్యంబు గానినాఁడు
బుభుక్షావేదనం జేసి ప్రాణ వియోగంబగు, నట్లయిన నా పుత్రులు భార్యయు జీవింపనేర,
రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింససేయుట ధర్మవిరోధంబు .. 2

ప్రతిపదార్థం :

సర్వభూతంబులు = ప్రాణులన్నియు
ఆహారంబున = తిండితినుట చేత
జీవించి = బతికి
వర్ధిల్లున్ = వృద్ధిపొందును.
ఇది = ఈ పావురము
నాకు = డేగనైన నాకు
భక్ష్యంబు + కానినాడు = ఆహారం కాకపోతే
బుభుక్షావేదనన్ + చేసి = ఆకలిబాధ వలన
ప్రాణ వియోగంబు + అగున్ = ప్రాణములు పోవును
అట్లు + అయిన = అలా జరిగితే
నా పుత్రులు = నా బిడ్డలు
భార్యయు = భార్యయును
జీవింపనేరరు = బ్రతకలేరు
ఒక్క కపోతంబు = ఒక్క పావురాన్ని
రక్షించి = కాపాడి
పెక్కు జీవులకు = అనేక ప్రాణులకు
హింస + చేయుట = బాధ కలిగించుట
ధర్మ విరోధంబు = ధర్మానికి విరుద్ధము

తాత్పర్యం :
అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృద్ధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లైతే పిల్లలు, భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా!

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

క॥ ధర్మజ్ఞులైన పురుషులు
ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్
ధర్మముగా మదిఁ దలఁపరు
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్ ……..3

ప్రతిపదార్థం:

ధర్మజ్ఞులు + ఐన = ధర్మమును తెలిసిన
పురుషులు = మనుషులు
ధర్మువునకు = ధర్మానికి
బాధ + చేయు = హాని కలిగించే
ధర్మువున్ + ఐనన్ = ధర్మాన్నైనా సరే
మదిన్ = మనసులో
ధర్మముగా = ధర్మము అని
తలపరు = ఆలోచించరు
ధర్మువు = ధర్మమెప్పుడూ
సర్వంబునకు = ఎల్లరకు
హితంబుగ = మేలు కలిగించేదిగ
వలయున్ = ఉండవలెను.

తాత్పర్యం:
ధర్మం తెలిసినవారు ధర్మానికి కీడుచేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనస్సులో తలచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి.

వ॥ ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు.
‘శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి’ యను వేదవచనంబు
గలదు గావున దీని నాకు నాహారంబుగా నిమ్మనిన
దానికి శిబి యిట్లనియె …………. 4

ప్రతిపదార్థం:

ఈ + కపోతంబు = ఈ పావురాన్ని
నాకు = డేగనైన నాకు
వేదవిహితంబు + ఐన = వేదములు నిర్దేశించిన
ఆహారంబు = ఆహారము
శ్యేనాః = డేగలు
కపోతాన్ = పావురాలను
ఖాదయంతి = తింటాయి
అను = అనునది
వేదవచనంబు+కలదు = వేదములు చెప్పిన మాట ఉన్నది.
కావున = అందుచేత
నాకున్ = నాకు
దీనిన్ = ఈ పావురము
ఆహారంబుగా = భోజనంగా
ఇమ్ము = ఇవ్వవలసినది
అని న= అనగా
దానికి = ఆ డేగకు
శిబి = శిబి చక్రవర్తి
ఇట్లు + అనియె = ఇలా అన్నాడు.

తాత్పర్యం:
ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. “డేగలు పావులను తింటాయి” అనే వేద వాక్యం ఉన్నది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వుమని అడిగిన డేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

తే॥ ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను
నాశ్రయించె నాశ్రితునెట్టి యధముఁడయిన
విడువఁడనినను నేనెట్లు విడుతు దీని ?
నాశ్రిత త్యాగమిది ధర్మువగునె ? చెపుమ ………..5

ప్రతిపదార్థం:
ఈ + పక్షి = ఈ పక్షియైన పావురము
ప్రాణభయమున = ప్రాణం పోతుందనే భయంతో
వచ్చి = నా దగ్గరకు వచ్చి
నన్నున్+ఆశ్రయించెన్ = నా శరణు కోరింది.
ఎట్ట = ఎటువంటి
అధముడు + అయిన = నీచుడైనా కూడా
విడువడు = వదిలిపెట్టడు
అనినను = అంటారు గదా !
నేను = రాజునైన నేను
దీనిన్ = ఈ పక్షిని
ఎట్లు విడుతును = ఎలా వదిలిపెట్టగలను ?
ఇది = ఇలా
ఆశ్రిత త్యాగము = శరణు అన్నవారిని విడిచిపెట్టటం
ధర్మువు + అగును + ఎ = ధర్మము అనిపించుకుంటుందా ?
చెపుము + అ = నీవే చెప్పుము

తాత్పర్యం:

ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడయినా రక్షించుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు.

వ॥ నీవు పక్షివయ్యును ధర్మమెఱింగినట్లు పలికితి, శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండెద్ది?
నీ యాఁకలి దీననకాని యొంట నుపశమింపదే ? నీ యత్నం బాహారార్థం బేని యిప్పు డివ్వనంబున మృగ
మహిష వరాహ ఖగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద, నిక్కపోతంబు వలని యాగ్రహం బుడుగుము,
దీని నేనెట్లును విడువ’ననిన శ్యేనం బిట్లనియె ……. 6

ప్రతిపదార్థం :

నీవు = నీవు
పక్షివి + అయ్యును = పక్షివై యుండి కూడా
ధర్మము+ఎఱింగిన + అట్లు = ధర్మాలు తెలిసిన వానివలె
పలికితి = మాట్లాడావు
శరణ + ఆగత = శరణు అంటూ వచ్చినవారిని
పరిత్యాగంబు కంటె = విడిచిపెట్టుట కంటె
మిక్కిలి = ఎక్కువైన
అధర్మంబు = అధర్మం
ఒండు + ఎద్ది = వేరొకటి ఏమున్నది ?
నీ + ఆకలి = నీ ఆకలి
దీనన కాని = దీనితోనే తప్ప
ఒంటన్ = వేరొకదానితో
ఉపశమింపదు + ఏ = శాంతించదా ?
నీ యత్నంబు = నీ ప్రయత్నము
ఆహార + అర్థంబు + ఏని = ఆహారం కోసమే ఐతే
ఇప్పుడు = ఈ సమయంలో
ఈ + వనంబున = ఈ
మృగ = జింకల
మహిష = దున్న
వరాహ = పందుల
ఖగ = పక్షుల
మాంసంబులు = మాంసములను
దీనికంటె = ఈ పావురం కంటె
మిక్కిలిగా = ఎక్కువగా
పెట్టెదన్ = తినడానికి పెడతాను
ఈ + కపోతంబువలని = ఈ పావురం విషయంలో
ఆగ్రహంబు = పట్టుదల
ఉడుగుము = విడిచిపెట్టు
దీనిని = ఈ పావురాన్ని
నేను = నేను
ఎక్కువైన
ఎట్లును = ఏ పరిస్థితిలోనూ
విడువను = వదిలిపెట్టను
అనిన = అని రాజు పలుకగా
శ్యేనం = డేగ
ఇట్లు + అనియె = ఇలా అన్నది.

తాత్పర్యం:
నీవు పక్షివి ఐనప్పటికీ ధర్మం తెలిసిన దానివలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టటం కన్న అధర్మం మరొకటుంటుందా ? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా ? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు ? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీని కన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. దీన్ని మాత్రం నేను విడువను. అని శిబి చెప్పగా డేగ ఇట్లా బదులు పలికింది.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

ఆ॥ నాకు విహిత భక్షణంబిది; యిప్పక్షి
బూని కావ నీకు బుద్ధియేని
యవని నాథ ! దీని యంత నీ మాంసంబు
దూచి నాకుఁ బెట్టు తొలగ కిపుడ ……..7

ప్రతిపదార్థం:

అవని నాథ = ఓ రాజా!
ఇది = ఈ పావురము
నాకు = డేగనైన నాకు
విహిత భక్షణంబు = విధించబడిన ఆహారము
పూని = = పట్టుదలతో
ఈ + పక్షిన్ = ఈ పావురాన్ని
కావన్ = రక్షించడానికి
నీకు = నీకు
బుద్ధి + ఏని = ఇష్టమైతే
దీని + అంత = దీనితో సమానమైన
నీ మాంసంబు = నీ శరీర మాంసాన్ని
తూచి = తూకంవేసి
తొలగక = తప్పించుకోకుండా
ఇప్పుడు + అ = ఇప్పుడే
నాకున్ + పెట్టు = నాకు ఆహారంగా పెట్టు

తాత్పర్యం:
ఓ రాజా ! ఈ పావురం నాకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే, దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరరీం నుంచి నాకు పెట్టుమని అడిగింది.

చ॥ అనిన ‘ననుగ్రహించితి మహా విహగోత్తమ’ యంచు సంతసం
బున శిబి తత్క్షణంబ యసి పుత్రిక నాత్మశరీర కర్తనం
బనఘుఁడు సేసి చేసి తన యంగమునం గల మాంసమెల్లఁ బె
ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్ ………… 8

ప్రతిపదార్థం:

అనినన్ = ఆ డేగ ఇలా పలుకగా
శిబి = శిబి చక్రవర్తి
మహావిహగ + ఉత్తమ = ఓ శ్రేష్ఠుడైన పక్షిరాజా !
ననున్ = నన్ను
అనుగ్రహించితి = కరుణించావు
అంచు = అని పలుకుతూ
సంతసంబున = సంతోషముతో
అనఘుడు = పుణ్యాత్ముడైన ఆ శిబి
తత్ + క్షణంబు + అ = వెంటనే
అసి పుత్రికన్ = చిన్న కత్తితో
ఆత్మ = తన యొక్క
శరర = దేహమును
కర్తనంబు = కత్తిరించుట
చేసి చేసి = ఎన్నోసార్లు చేసి
తన = తన యొక్క
అంగంబునన్ + కల =శరీరము నందున్న
మాంసము + ఎల్లన్ = మాంసమంతయు
ఆ + తులన్ = త్రాసులో
పెట్టినను = పెట్టినా
కపోత భాగము = పావురము ఉన్నవైపు
కడిందిగ = మిక్కిలిగా
డిందుచున్ + ఉండెన్ = దిగిపోతూ ఉన్నది.

తాత్పర్యం:
అనగా సంతోషించిన శిబి పక్షులన్నింటిలో గొప్ప దానివైన నీవు నాపై దయ చూపావు అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో | వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

క॥ దానికి నచ్చెరువడి ధర
ణీ నాథుఁడు తనువు నందు నెత్తురు దొరుఁగం
దాన తుల యెక్కె నంతన్
వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్ ……… 9

ప్రతిపదార్థం :

ధరణీ నాథుడు = శిబి మహారాజు
దానికిన్ = ఆ విచిత్రానికి
అచ్చెరు + పడి = ఆశ్చర్యపడి
తనువునందు = తన శరీరమందు
నెత్తురు = రక్తము
తొరుగన్ = కారుచుండగా
తాను + అ = తానే
తుల + ఎక్కెన్ = త్రాసులో కూర్చున్నాడు
అంత = వెంటనే
వాసవ దహనుల్ = ఇంద్రుడు, అగ్నిదేవుడు
వాని = ఆ రాజు యొక్క
గుణ + ఉన్నతికిన్ = గుణముల ఔన్నత్యానికి
మెచ్చి = మెచ్చుకొని

తాత్పర్యం:
తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవటంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు. ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్నిదేవుడు మెచ్చుకొని ..

వ॥ శ్యేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబులఁ జూపి
‘నీ ధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు గావున
నీ కీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్తిల్లుచుండు’మని
శిబికి వరంబిచ్చి ఇంద్రాగ్నులు చనిరి. ……….. 10

ప్రతిపదార్థం :

శ్యేన కపోత రూపంబులు = డేగ పావురం రూపాలను
విడిచి = వదిలిపెట్టి
నిజరూపంబులన్ చూపి = తమ స్వీయరూపాలను చూపించి
నీ ధైర్యశౌర్య + ఆది = నీ ధైర్యము, శౌర్యము మొదలైన
గుణంబులు = లక్షణాలు
అనన్య సాధారణంబులు = ఇతరులెవ్వరికీ లేనివి
కావున = అందువలన
నీ కీర్తి = నీ యశస్సు
నిత్యంబు + ఐ = శాశ్వతమై
శబ్ద బ్రహ్మంబు + కల + అంతకాలంబు = శబ్దము ఉన్నంతకాలము
వర్తిల్లుచున్ = స్థిరముగా
ఉండుము + అని = ఉండిపోతావు అని
శిబికి = శిబి చక్రవర్తికి
వరంబు + ఇచ్చి = వరమిచ్చి
ఇంద్ర + అగ్నులు = ఇంద్రుడును, అగ్నియును
చనిరి = వెళ్ళారు.

తాత్పర్యం:
డేగ, పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు, అగ్ని వారి నిజరూపాలతో సాక్షాత్కరించి “నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యంకావు. కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది” అని వెళ్ళిపోయారు.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

ఆలోచించండి – చెప్పండి:

ప్రశ్న 1.
సత్యధర్మ నిర్మలుడని శిబి చక్రవర్తిని ఎందుకన్నారు ? (టెక్స్ బుక్ 4)
జవాబు.
శిబి చక్రవర్తి సత్యం వ్రతంగా కలవాడు. ఆడినమాట తప్పనివాడు. అన్ని ధర్మములు తెలిసినవాడు. ధర్మం తప్పక ఆచరించేవాడు. నిర్మలమైన మనస్సు, ప్రవర్తన కలవాడు. అందుచేత ఆయనను సత్యధర్మ నిర్మలుడన్నారు.

ప్రశ్న 2.
“ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్” దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. (టెక్స్ట్ బుక్ 4)
జవాబు.
‘సత్యం మాట్లాడండి. ధర్మం ఆచరించండి.’ అనే విషయాలను వేద శాస్త్రాలు చెబుతున్నాయి. కాని వాటిని పాటించే సమయంలో వాటివల్ల అందరికీ మేలు జరుగుతుందా, లేదా అని పరిశీలించాలి. ఒకవేళ కీడు కలిగేట్లైతే అప్పుడు వాటిని సరి చూసుకోవాలి. ఏ నియమాలైనా ప్రజలమేలు కోసం ఏర్పాటు చేయబడేవే. అందుకే కవి నన్నయ ధర్మం అందరికీ మేలు కలిగించాలి అని ప్రయోగించాడు.

ప్రశ్న 3.
‘ఆశ్రితులను ఎందుకు విడిచి పెట్టరాదు ? (టెక్స్ బుక్ 4)
జవాబు.
బలహీనుడు బలవంతుని వద్దకు రక్షణ కోసం వస్తాడు. అతడు తనను కాపాడగలడు అనే నమ్మకంతో వస్తాడు. కనుక అతనికి ఆశ్రయమిచ్చి కాపాడటం బలవంతుని కర్తవ్యం. ఎన్ని ఆటంకాలు కలిగినా వారి నమ్మకాన్ని వృథా చేయకుండా కాపాడాలి. అందుకే ఆశ్రితులను విడిచిపెట్టరాదు.

ప్రశ్న 4.
ఏ సందర్భంలో ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు ? (టెక్స్ బుక్ 4)
జవాబు. జంతువుల వలన, ఇతరుల వలన భయం కలిగినప్పుడు, శత్రువులు దండెత్తినప్పుడు, దుష్టుల వలన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, తాను తలపెట్టిన మంచి పనులకు ఆటంకాలు కలిగినప్పుడు, తన కష్టాన్ని ఇతరులు దోచుకుంటున్నప్పుడు – ఇలా అనేక సందర్భాల్లో ఇతరులు మనను ఆశ్రయిస్తారు.

ప్రశ్న 5.
డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది ? (టెక్స్ బుక్ 5)
జవాబు.
పావురం డేగకు సహజమైన ఆహారం. శిబి దానికి ఆశ్రయం ఇచ్చాడు. వదిలిపెట్టనంటున్నాడు. ధర్మబద్ధమైన తన ఆహారం తినకపోతే ఆకలితో చనిపోతానని, ఆపై తన భార్య, పిల్లలు కూడా బతకరని డేగ చెప్పింది. నీవు చెప్పింది ధర్మమే ఐనా నేను ఆశ్రయమిచ్చిన పావురాన్ని నీకు ఆహారం కానివ్వను. మరేది కోరినా తెప్పించి యిస్తాను అన్నాడు శిబి. అందుకని డేగ తన ఆకలిని తీర్చుకోడానికి శిబి మాంసాన్ని కోరింది.

ప్రశ్న 6.
‘అనుగ్రహించితి మహా విహగోత్తమ’ అని శిబి చక్రవర్తి అనటాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు?(టెక్స్ట్ బుక్ 5)
జవాబు.
పావురాన్ని తప్ప వేరే ఏ ఆహారాన్నైనా కోరుకో. తెప్పించి ఇచ్చి నీ ఆకలి తీరుస్తాను. పావురాన్ని మాత్రం వదలను అన్నాడు శిబి చక్రవర్తి. అప్పుడు డేగ పావురం బరువుకు సరితూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి కోసి యిస్తే ఒప్పుకుంటాను అన్నది. అందుకే శిబి పరమ సంతోషంతో “ఓ పక్షి రాజా ! నన్ను అనుగ్రహించావు. పావురాన్ని కాపాడతానన్న నా మాట నిలబెట్టావు” అని డేగతో అన్నాడు.

ప్రశ్న 7.
బలి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు కదా ! త్యాగం ఆవశ్యకత ఏమిటి ? (టెక్స్ట్ బుక్ 5)
జవాబు.
త్యాగం అనేది గొప్ప పుణ్యకార్యం. మనకు అక్కరలేని దాన్ని ఇచ్చేసి త్యాగం చేశాను అనుకోవడం త్యాగం అనిపించుకోదు. తనను ఎవరైనా ఆశ్రయించినప్పుడు వారి కోరిక తీర్చడానికి అవసరమైతే తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి. అటువంటి వారే చరిత్రలో నిలచిపోతారు. ఆదర్శప్రాయులౌతారు. అందుకే త్యాగం చాలా గొప్ప గుణం.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
త్యాగం అంటే ఏమిటి ? త్యాగంలోని గొప్పతనం ఏమిటి ?
జవాబు.
తనకు ఉన్నదానిలో కొంత ఇతరులకు ఇవ్వడమే త్యాగం. ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని తనను ఆశ్రయించిన వారికి కావలసిన దానిని ఇవ్వడమే త్యాగం. ఇందులో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా త్యాగం చేసిన వారు మహనీయులు. మనం త్యాగం చేసినందువలన ఆ ఫలితాన్ని పొందినవారు, వారి ఆత్మీయులు ఎంతో సంతోషపడతారు. ఆ సంతోషం మనకెంతో తృప్తినిస్తుంది. అదీ త్యాగంలోని గొప్పతనం.

ప్రశ్న 2.
ఇతరులకోసం, సమాజంకోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి.=
జవాబు.
భారతదేశాన్ని పరాయిపాలన నుంచి విడిపించి ప్రజలు పడుతున్న బానిసత్వపు బాధలను తొలగించడానికి ఎంతోమంది నాయకులు తమ సర్వస్వాన్నీ త్యాగంచేసి ఉద్యమంలో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ప్రకాశం పంతులు మొదలైన ఎందరో నాయకులు ధనాన్ని ఆస్తులను త్యాగం చేశారు. భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటివారు ప్రాణాలను త్యాగం చేశారు. డా. ద్వారకానాథ్ కొట్నీస్ యుద్ధసైనికుల కోసం అమోఘమైన సేవలందించాడు.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది వాక్యాల ఆధారంగా పాఠంలోని పద్యపాదాలను గుర్తించి రాయండి.

అ) ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి
జవాబు.
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్.

ఆ) ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం
జవాబు.
ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు.

ఇ) ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మమవుతుందా చెప్పు
జవాబు.
శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి యధర్మం బొండెద్ది ?

2. కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి.

బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటెగాదు.
చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు
గ భావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగు బాల.

అ) ‘చెట్టు’ అను పదానికి సరిపోయే పదం ( )
ఎ) తరువు
బి) గురువు
సి) ఫలం
డి) గుణం
జవాబు.
ఎ) తరువు

ఆ) త్యాగానికి గురువులు ఎవరు ? ( )
ఎ) మానవులు
బి) చెట్లు
సి) పక్షులు
డి) జంతువులు
జవాబు.
బి) చెట్లు

ఇ) తనువును చీల్చి ఇచ్చేవి ( )
ఎ) మేఘాలు
బి) నదులు
సి) చెట్లు
డి) పక్షులు
జవాబు.
సి) చెట్లు

ఈ) చచ్చుట పదానికి వ్యతిరేకార్థం ( )
ఎ) పెరుగుట
బి) తరుగుట
సి) బ్రతుకుట
డి) మేల్కొనుట
జవాబు.
సి) బ్రతుకుట

ఉ) పై పద్యానికి తగిన శీర్షిక ( )
ఎ) భారం
బి) ప్రాణం
సి) యోగం
డి) త్యాగం
జవాబు.
డి) త్యాగం

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

III. స్వీయరచన.

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి.
జవాబు.
ఎవరైనా ఆహారం తినేది ఆకలి తీర్చుకోవడానికే. ఎంతో పనిచేసి, కడుపు ఆకలితో కాలిపోతూంటే, భోజనం చేద్దామని కూర్చొన్న వ్యక్తికి, ఆటంకం కలిగిస్తే ఆ వ్యక్తి చాలా బాధపడతాడు. ఆకలితో నీరసించిపోతాడు. ఇక పని చేయలేడు. పనిచేయలేడు కాబట్టి తిండికి కావలసిన ధనం సంపాదించలేడు. చివరికి ఆరోగ్యమే పాడయ్యే ప్రమాదముంది. అందుకే ఆహారం తినేటప్పుడు విఘ్నం కలిగించకూడదంటారు.

సైన్సుపరంగా కూడా కారణముంది. భోజనం చేసే సమయంలో కడుపులోని జీర్ణరసాలు ఉత్తేజంగా ఉంటాయి. భోజనానికి ఆటంకం కలిగిస్తే, ఆ ఊరిన రసాలు పేగుల మీద ప్రభావం చూపి అనారోగ్యం కలిగిస్తాయి.

ఆ) ‘అందరూ ధర్మాన్ని ఆచరించాలి’ అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
‘సత్యం మాట్లాడండి. ధర్మం ఆచరించండి.’ అనే విషయాలను వేద శాస్త్రాలు చెబుతున్నాయి. కాని వాటిని పాటించే సమయంలో వాటివల్ల అందరికీ మేలు జరుగుతుందా, లేదా అని పరిశీలించాలి. ఒకవేళ కీడు కలిగేట్లైతే అప్పుడు వాటిని సరి చూసుకోవాలి. ఏ నియమాలైనా ప్రజలమేలు కోసం ఏర్పాటు చేయబడేవే. అందుకే కవి నన్నయ ధర్మం అందరికీ మేలు కలిగించాలి అని ప్రయోగించాడు.

ఇ) ఇతరుల కొరకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చో రాయండి.
జవాబు.
ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కాపాడాలి. మనం రక్తం దానం చేయవచ్చు. మన పనులను వాయిదా చేసుకొని వారిని హాస్పటల్స్కు తీసుకుని వెళ్ళవచ్చు. మన వాహనంలోనే ప్రమాదానికి గురైన వ్యక్తులను తరలించవచ్చు. నాన్న మనకోసం ఇష్టమైన వస్తువు తెచ్చినప్పుడు చెల్లికి అదే కావాలని అడిగితే తన కోసం మనం దాన్ని తాగ్యం చెయ్యవచ్చు. బస్సులోను, రైలులోను మనకంటే పెద్దవారు నిలబడి మనం కూర్చుని ఉంటే మన సీటు వారికోసం త్యాగం చెయ్యవచ్చు.

ఈ) “త్యాగనిరతి” అనే శీర్షిక పాఠానికి ఏ విధంగా తగినదో రాయండి.
జవాబు.
ఈ పాఠంలో డేగ పావురాన్ని తినడానికి వెంటపడింది. పావురానికి ఆశ్రయమిచ్చి శిబి చక్రవర్తి పావురం కోసం ఏమైనా త్యాగం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. రాజు త్యాగ గుణాన్ని ఉపయోగించుకోడానికి డేగ పావురాన్ని త్యాగం చేసింది. డేగ రాజు శరీరంలోని మాంసాన్ని పావురం బరువుకు సరిపడ తూచి యిమ్మన్నది. అలా తూచడంలో చివరికి రాజు తానే త్రాసులో కూర్చుని తన ప్రాణాలనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. తన త్యాగ గుణాన్ని దేవతలు మెచ్చుకున్నారు. అందుచేత ఈ పాఠానికి “త్యాగనిరతి” అనే శీర్షిక తగి ఉన్నది.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

అదనపు ప్రశ్నలు:

ప్రశ్న 1.
“శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండెద్ది” అని శిబి అన్నాడు కదా! శరణాగతులను ఎందుకు విడువకూడదు ?
(లేదా)
శరణుకోరిన వారిని వదలకూడదు. ఎందుకు ?
(లేదా)
శరణాగత పరిత్యాగం అధర్మం అంటే నీకేమి అర్థమైంది ?
జవాబు.
తనను ఆశ్రయించినవారు శరణాగతులు. తనను కాపాడ గల్గినవారి వద్దకే, గొప్పనమ్మకంతో వస్తారు. ఆశ్రయమిచ్చిన వారిని కాపాడటం ధర్మం, కర్తవ్యం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆశ్రితులను కాపాడాలి శరణాగతులను వదలకూడదు. వారిని కాపాడకుండా వదిలిపెడితే అది అధర్మం అవుతుంది.

ప్రశ్న 2.
త్యాగం అంటే ఏమిటి ? త్యాగం ఎందుకు చేయాలి? దేనిని గొప్పత్యాగం అంటారు ? త్యాగగుణం ఎందుకు కలిగి ఉండాలి ?
జవాబు.
తనకి ఉన్నంతలో కొంత ఇతరులకి ఇవ్వడమే త్యాగం. ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని తనను ఆశ్రయించిన వారికి కావలసిన దానిని ఇవ్వడమే త్యాగం. ఆశ్రయించినవారి కోసం తన ప్రాణాలనైనా సంతోషంగా ఇవ్వడానికి సిద్ధపడడాన్ని గొప్పత్యాగం అంటారు.

త్యాగ ఫలితాన్ని పొందినవారు, వారి ఆత్మీయులు ఎంతో సంతోషపడతారు కనుక ఆ సంతోషం మనకెంతో తృప్తినిస్తుంది. అదీ త్యాగంలోని గొప్పతనం.
అనిర్వచనీయమైన ఆనందం, సంతృప్తి పొందటం కోసం త్యాగ గుణం కలిగి ఉండాలి.

ప్రశ్న 3.
శిబిచక్రవర్తి వంటి వాళ్ళ కీర్తి శాశ్వతమని వివరించండి.
జవాబు.
ప్రాణభయంతో ఆశ్రయించిన వారు నీచులే అయినా వారిని విడిచి పెట్టడం ధర్మం కాదు. ఆహారమే కావలసివస్తే అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి. వాటిని తిని ప్రాణాలు నిలుపుకోవచ్చు అని డేగతో అన్నాడు. ఆ డేగ శిబితో పావురం తనకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. దీన్ని కాపాడాలనుకుంటే దాని బరువుకు తూగినంత మాంసం నీ శరీరం నుండి నాకు పెట్టమని అన్నది. తన ప్రాణాలను సైతం లక్ష్యపెట్టక ఆశ్రయించిన పావురాన్ని కాపాడటానికి సిద్ధపడ్డ శిబి చక్రవర్తిలాంటి వాళ్ళ కీర్తి శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

ప్రశ్న 4.
త్యాగనిరతి పాఠం ద్వారా డేగ దృష్టిలో ధర్మం అంటే ఏది ?
జవాబు. అన్ని ప్రాణులు ఆహారం తీసుకొనే బ్రతుకుతాయి. ఆహారం లేకపోతే ప్రాణులు ఉండవు. డేగకు పావురం వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. డేగలు పావురాలను తింటాయి. కాబట్టి పావురాన్ని చంపి తినుట తప్పుకాదని, అది ధర్మబద్ధమే అని డేగ ఉద్దేశం.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి. (లేదా) త్యాగనిరతి పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి. (లేదా) పావురాన్ని రక్షించుటకు శిబి చక్రవర్తి చేసిన త్యాగాన్ని వివరించండి. (లేదా)
శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసివ్వటంలో ఆంతర్యం ఏమిటి ? (లేదా) శిబి చక్రవర్తి త్యాగ గుణాన్ని సొంతమాటల్లో వ్రాయండి. (లేదా) త్యాగ గుణం గొప్పతనాన్ని కవి ఎలా వివరించాడు ?
జవాబు.
ఇంద్రుడు, అగ్నిదేవుడు డేగ పావురాల రూపంలో శిబిచక్రవర్తి త్యాగ గుణాన్ని పరీక్షించడానికి వచ్చారు. శరణుకోరి వచ్చిన పావురానికి శిబి అభయమిచ్చాడు. అలా శరణన్న వారిని రక్షించటంలో ఎంతో ఆనందం ఉంటుంది. లోకంలో ఎంతోమంది ఉన్నా పావురం తన దగ్గరికే వచ్చిందంటే తన మీద ఎంతో నమ్మకం ఉండబట్టే గదా అని తలచుకుంటే శిబి గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ ఆనందం అనుభవించే వారికే తెలుస్తుంది.

అలాగే ధర్మాధర్మాల గురించి వాదించిన మీదట డేగ పావురానికి సరితూగినంత మాంసం శిబి శరీరం నుంచి తూచి ఇవ్వమన్నప్పుడు “నన్ననుగ్రహించితివి మహావిహగోత్తమ !” అంటూ ఎంతో సంతోషించాడు శిబి, తాను అన్నమాట నిలబెట్టుకోగలుగుతున్నాను గదా అని. అంతేగాక ఒకరిని రక్షించడానికి, మరొకరి ఆకలి తీర్చడానికి తాను ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాడు. రెండు విధాలుగా ధర్మాన్ని రక్షించగలిగానన్న ఆనందం, అనుభూతి ఎంతో గొప్పవి. ఆ ఆనందం అనుభవించే వారికే బాగా అర్థమౌతుంది.

ఆ) త్యాగనిరతి పాఠం ఆధారంగా శిబి చక్రవర్తికి, డేగకు మధ్య జరిగిన సంభాషణ రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.

సంభాషణ

డేగ: ఓ శిబి చక్రవర్తీ ! నువ్వు గొప్ప సత్యధర్మ పరుడవని విన్నాను. మరి ఆకలిగొన్నవాడినైన నా ఆహారాన్ని తిననీకుండ చేస్తున్నావెందుకు ? నేను ఆకలితో చనిపోతే నా పిల్లలు, భార్య బతకరు. ఇన్ని ప్రాణాలు పోవడానికి నీవు కారణమౌతావు. ఇది నీకు ధర్మమా ?
శిబి చక్రవర్తి : నేను నీ ఆహారమైన పావురాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను. నీ ఆకలి తీర్చడానికి నీకేం కావాలో కోరుకో ఇస్తాను.
డేగ : పావురాలు మా జాతికి ఆహారమని వేదాల్లో కూడా చెప్పబడింది. కనుక నాకీ పావురాన్నిచ్చే సెయ్.
శిబి చక్రవర్తి : అడవిలోని ఏ జంతువుల మాంసం కావాలన్నా తెప్పించి ఇస్తాను. ఈ పావురాన్ని విడిచిపెట్టను. నేను ఆడిన మాట తప్పను.
డేగ : అయితే దీని బరువుకు సమానమైన మాంసము నీ శరీరం నుండి కోసి యివ్వు.
శిబి చక్రవర్తి : చాలా సంతోషం. తప్పక ఇస్తాను. (భటులతో-) భటులారా ! త్రాసు తీసుకురండి.
భటులు : చిత్తం మహాప్రభూ ! (త్రాసు తెచ్చారు. శిబి మాంసం కోసి త్రాసులో పెట్టాడు. రెండవ వైపు పావురాన్ని ఉంచారు.)
శిబి చక్రవర్తి : ఏమి ఆశ్చర్యం ! ఎంత మాంసం ఉంచినా తూగడం లేదు ! నేను స్వయంగా త్రాసులో కూర్చుంటాను. (కూర్చున్నాడు.)
డేగ : భళా ! శిబి చక్రవర్తీ ! నీ త్యాగనిరతి అపూర్వం. మెచ్చాను నీ త్యాగానికి.
శిబి చక్రవర్తి : మహానుభావా ! ఎవరు మీరు ?
డేగ : నేను ఇంద్రుడను. ఈ పావురం అగ్నిదేవుడు. నీ త్యాగాన్ని పరీక్షించడానికి ఈ రూపాలలో వచ్చాము. నీ ధైర్య శౌర్యాదిగుణాలు చాలా గొప్పవి. నీ కీర్తి ఆచంద్రతారార్కంగా వర్ధిల్లుతుంది.

IV. సృజనాత్మకత/ప్రశంస.

ప్రశ్న 1.
అన్ని దానాల్లోకెల్ల అన్నదానం గొప్పది. శరీరంలోని అవయవదానం ఇంకా గొప్పది. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తాపత్రికలకు లేఖ రాయండి.
జవాబు.

వరంగల్,
ది.XX.XX.XXXX

గౌరవనీయులైన పత్రికా సంపాదకులకు,

నమస్తే తెలంగాణ పత్రిక

పుట్టుకతోనే అవయవలోపాలతో కొందరు పుడుతూ ఉంటే, ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకునేవారు కొందరు. కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు – వీటిలో ఏ అవయవం లేకపోయినా బాధాకరమే.

మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అందాలను చూసి ఆనందించాలన్నా, చక్కని సంగీతం వినాలన్నా, సుందరమైన ప్రదేశాలకు వెళ్ళాలన్నా కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు తప్పనిసరి. ఇవేకాదు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు వంటి అవయవభాగాలు ముఖ్యమైనవే. రక్తం అవయవ భాగం కాకపోయినా, అవయవమంత ప్రాముఖ్యమున్నదే.

కళ్ళు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రక్తంవంటి వాటిని దానమిచ్చి మన చుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవజన్మకు సార్థకత.
జీవించి ఉండగానే, కళ్ళు, మూత్రపిండాలు వంటివి దానం చేయవచ్చు. మరణించాక కూడా జీవించి ఉండడానికి మార్గం అవయవదానం.

తమ మరణానంతరం, తమ కళ్ళను దానం చేస్తామంటూ, ఎంతోమంది నేటికాలంలో ముందుకొస్తున్నారు. అలా నేత్రదానంతో ఎంతోమంది అంధులకు వెలుగునిస్తూ, మరణించాక కూడా జీవించడం గొప్ప విషయం.

అలాగే ఇటీవల బెంగుళూరుకు చెందిన వ్యక్తి గుండె చెన్నైకి చెందిన మరొక వ్యక్తికి మార్పిడి చేయడం ద్వారా ఆ వ్యక్తికి ప్రాణం పోశారు. అలాగే ఇటీవల విజయవాడకు చెందిన మణికంఠ దానం చేసిన గుండె, నేత్రాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం మరికొందరిని జీవించగలిగేట్లు చేశాయి.

ఇలా అవయవ దానం వల్ల కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఇటువంటివారు రాబోయే తరాలకు స్ఫూర్తిదాతలు. చనిపోయాక కూడా జీవించాలంటే అవయవదానమే మార్గం. అవయవ దానానికి అందరూ ముందుకు వచ్చేలా మీ పత్రిక ద్వారా చైతన్యం కలిగించమని విజ్ఞప్తి.

ఇట్లు
బాలభాను,
ఒక పాఠకుడు.

చిరునామా :
నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయం,
రోడ్ నెం. 10, బంజారా హిల్స్
హైదరాబాద్.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

V. పదజాల వినియోగం

1. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

ఉదా : కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు.
కపోతములు = పావురములు

అ) ఆశ్రితులను వదలివేయుట ధర్మువు కాదు.
జవాబు.
ధర్మువు = ధర్మము

ఆ) ఉత్తముడు పరుల హితమునే కోరతాడు.
జవాబు.
హితమునే = మేలునే

ఇ) ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణా రాష్ట్రం సిద్ధించింది.
జవాబు.
పరిత్యాగం = పూర్తిగా విడిచిపెట్టుట

ఈ) దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక !
జవాబు.
వర్ధిల్లు = వృద్ధిపొందు

ఉ) బుభుక్షితుడు రుచి పట్టించుకోకుండా ఆరగిస్తాడు.
జవాబు.
బుభుక్షితుడు = ఆకలితో ఉన్నవాడు.

2. కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.

ఉదా : ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి.
వర్షం : సంవత్సరం, వాన

అ) న్యాయం ఆలోచిస్తే పాలల్లో నీళ్ళు కలపడం ధర్మం కాదు.
జవాబు.
పాడి : న్యాయం, పాలు

ఆ) అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది.
జవాబు.
వనం : అడవి, నీరు

VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. కింది వాక్యాలను చదవండి. అవి ఎటువంటి వాక్యాలో గుర్తించి జతపరచండి.
ఉదా : లోపలికి రావచ్చు – అనుమత్యర్థక వాక్యం

అ) దయచేసి వినండి  1. ఆశ్చర్యార్థక వాక్యం
ఆ) రమ చక్కగా రాయగలదు  2. ప్రశ్నార్థక వాక్యం
ఇ) ఆహా ! ఎంత బాగుందో !  3. సామర్థ్యార్థక వాక్యం
ఈ) అల్లరి చేయవద్దు  4. ప్రార్థనార్థక వాక్యం
ఉ) గిరి ! ఎక్కడున్నావు ?  5. నిషేధార్థక వాక్యం

అ) 4
ఆ) 3
ఇ) 1
ఈ) 5
ఉ) 2

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

2. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

అ) ఇంద్రాగ్నులు =
జవాబు.
ఇంద్ర + అగ్నులు = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

ఆ) త్యాగమిది =
జవాబు.
త్యాగము + ఇది = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

ఇ) ఆహారార్థం =
జవాబు.
ఆహార + అర్థం = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

ఈ) నేనెట్లు =
నేను + ఎట్లు = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

ఉ) శౌర్యాది =
శౌర్య + ఆది = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలను లేదా కథలను లేదా సంఘటనలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు : త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయులు.
  2. సమాచారాన్ని సేకరించిన విధానం : ఉపాధ్యాయుని ద్వారా / ఇంటిలోని పెద్దల (తాత/నానమ్మ/ అమ్మమ్మ) ద్వారా / గ్రంథాలయ పుస్తకాల ద్వారా

ఆ) నివేదిక :
విషయ వివరణ :
“తనకు ఎంతో అవసరమైనప్పటికిని లెక్కచేయకుండా ఇతరులకు ఇవ్వడాన్నే త్యాగం అంటారు.” దానం, త్యాగం అనే రెండు పదాలు దగ్గర అర్థాన్నిచ్చేవిగా ఉన్నా వీటి మధ్య ఎంతో తేడా ఉంది.

తనకున్నంతలో ఇతరులకు ఇవ్వడం దానం అయితే, తనకున్నా లేకున్నా ఇతరులకు ఇవ్వగలిగే గుణాన్ని త్యాగంగా చెప్పవచ్చు. అలాంటి త్యాగబుద్ధి గలిగిన ఇద్దరు మహాపురుషుల గూర్చి, నేను నివేదికలో పొందు పరుస్తున్నాను.

1. రంతిదేవుడు

“అతిథి దేవో భవ” అనేది మన సాంప్రదాయం. దాన్ని అక్షరాల ఆచరించి శాశ్వత కీర్తి పొందిన రంతిదేవుని కథ నాకెంతోగానో నచ్చింది.

రంతిదేవుడు ఒక మహారాజు. అమిత దానశీలి. తన రాజ్యాన్ని, సంపదలను దానం చేసి భార్యా బిడ్డలతో అడవికి వెళ్ళాడు. అడవిలో కాయ, కసరులు తింటూ కడుపు నింపుకొనేవాడు, దైవికంగా లభించినది తిని తృప్తిపడేవాడు తప్ప దేన్నీ కోరేవాడు కాదు. భవిష్యత్ అవసరాలకు కూడా దేన్నీ దాచుకొనేవాడు కాదు. ఒకసారి 48 రోజులు పాటు అతనికి, అతని

కుటుంబానికి ఏమీ లభించలేదు. 49వ రోజున కొంత ఆహారం లభించింది. కుటుంబమంతా కూర్చుండి తినడానికి ఉపక్రమించ బోతుండగా ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు. అతనికి ఆహారం పెట్టాడు. తర్వాత ఒక బీదవాడు వచ్చాడు. రంతిదేవుడు అతని ఆకలి కూడా తీర్చి పంపాడు. తర్వాత ఒకడు, తన కుక్కల క్షుద్బాధ తీర్చమని వేడుకోగా వాటికి ఆహారం పెట్టాడు. చివరికి కొద్ది పాయసం మాత్రమే మిగిలింది. దాన్నే తలా కాస్తా తాగుదామనుకోగా, ఒక ఛండాలుడు వచ్చాడు. ఉన్న పాయసం అతనికి ఇచ్చి, ఆకలి బాధ తట్టుకోలేక రంతి దేవుడు స్పృహ తప్పి పోయాడు. మరుక్షణమే దేవుడు ప్రత్యక్షమై అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు.

2. బలిచక్రవర్తి

రాక్షస రాజైన బలి చక్రవర్తి మహా బలవంతుడు. అతనికి ఎదురొడ్డి పోరాడలేక దేవతలు మహావిష్ణువును శరణు కోరతారు. ఎలాగైనా బలి చక్రవర్తిని చంపనైనా చంపు లేదా మాపై ఆధిపత్యం చలాయించకుండానైనా చూడ మంటారు. అప్పుడు విష్ణువు వారికి అభయమిచ్చి, తాను వామనరూప ధారియై బలి వద్దకు వెళ్తాడు. గొడుగు ధరించి వచ్చిన ఆ వామనమూర్తిని చూడగానే రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి మనస్సెందుకో కీడు శంకించింది.

దివ్యదృష్టితో అతడు శ్రీ మహావిష్ణువని గ్రహించి బలిని, అతనికి దానమివ్వవద్దని ఎంత చెప్పినా బలి చక్రవర్తి ససేమిరా వినడు. తన కులం, వంశం, దేశం నాశనమైనా, చివరికి తాను చనిపోయినా ఆడిన మాట తప్పను అని వామనునికి 3 అడుగుల నేల దానం చేస్తాడు. 2 అడుగులకే భూమ్యాకాశాలను ఆక్రమించిన వామనుడు, తన 3వ అడుగు ఎక్కడ పెట్టాలో చెప్పమంటాడు. అప్పుడు బలి, తన శిరస్సు పైన ఉంచమంటాడు. వామనుడు, బలి శిరస్సుపై తన పాదాన్ని ఉంచి పాతాళానికి తొక్కి వేస్తాడు. దాంతో దేవతలకు బలి చక్రవర్తి పీడ విరగడైంది.

ఇ) ముగింపు :
ఈ విధంగా తమ సచ్చీలత, త్యాగనిరతి అనే గుణాలతో చరిత్రలో నిలిచిపోయిన ఇరువురు మహాపురుషుల కథలు చదువుతుంటే నాలో ఎంతో ఉత్తేజం, ఉద్వేగం కలిగాయి. ఇలాంటి మహాపురుషులను కన్న భరతభూమికి వందనాలు అర్పించాలనిపించింది.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

విఘ్నము = ఆటంకము, అడ్డంకి
భూతములు = ప్రాణులు, జీవులు
ఆహారము = అన్నము, భోజనము
పుత్రులు = కుమారులు, కొడుకులు
భార్య = సతి, ఇల్లాలు, పెండ్లము
కపోతము = పావురము, పారావతము
పక్షి = ఖగము, పులుగు
వనము = అడవి, అరణ్యం
మిక్కిలి = ఎక్కువ, అధికము, కడిది
అవని = భూమి, పుడమి, ధాత్రి
వాసవుడు = ఇంద్రుడు, పాకారి
తనువు = శరీరము, దేహము
దహనుడు = అనలుడు, అగ్ని, పావకుడు

నానార్థాలు:

ఆగ్రహము = పట్టుదల, కోపము
పాడి = న్యాయము, ధర్మము, తీర్పు స్వభావం, ఆచారం
తుల = త్రాసు, సమానము
భూతము = ప్రాణి, గతము

ప్రకృతులు – వికృతులు:

ప్రకృతి – వికృతి
సత్యము – సత్తెము
ధర్మము – దమ్మము
ఆహారము – ఓగిరము
మతి – మది
హితము – ఇతము
పక్షి – పక్కి
యత్నము – జతనము
మృగము – మెకము
గుణము – గొనము
శబ్దము – సద్గు
బ్రహ్మ – బమ్మ, బొమ్మ
ఆశ్చర్యము – అచ్చెరువు
కీర్తి – కీరితి
అగ్ని – అగ్గి

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

వ్యుత్పత్త్యర్థాలు:

పక్షి = పక్షములు కలది (పక్షి)
ఖగము = ఆకాశమున తిరుగునది. (పక్షి)
దహనుడు = దహించు స్వభావము కలవాడు. (అగ్ని)
బుభుక్ష = తినవలెనను కోరిక (ఆకలి)
పుత్రుడు = పున్నామ నరకము నుండి రక్షించువాడు. (కొడుకు)

సంధులు:

విఘ్నమిట్టులు = విఘ్నము + ఇట్టులు = ఉత్వసంధి
వియోగంబగు = వియోగంబు + అగు = ఉత్వసంధి
ఇమ్మనిన = ఇమ్ము + అనిన = ఉత్వసంధి
అధముడయిన = అధముడు + అయిన = ఉత్వసంధి
మాంసమెల్ల = మాంసము + ఎల్ల = ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

ఇంద్రాగ్నులు = ఇంద్ర + అగ్నులు = సవర్ణదీర్ఘసంధి
శరణాగత = శరణ + ఆగత = సవర్ణదీర్ఘసంధి
ఆహారార్థం = ఆహార + అర్థం = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

గుణోన్నతి = గణ + ఉన్నతి = గుణసంధి
విహగోత్తమ = విహగ + ఉత్తమ = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

ఎట్టియధముడు = ఎట్టి + అధముడు = యడాగమసంధి
మిక్కిలి యధర్మము = మిక్కిలి +అధర్మము = యడాగమసంధి
తులయెక్కె = తుల + ఎక్కె = యడాగమసంధి
సూత్రం : సంధిలేని చోట స్వరం కంటే పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

సమాసములు:

ఇంద్రాగ్నులు – ఇంద్రుడును, అగ్నియును – ద్వంద్వ సమాసము
వాసవదహనులు – వాసవుడును, దహనుడును – ద్వంద్వ సమాసము
తనయంగము – తనదైన అంగము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
సర్వభూతములు – సర్వములైన భూతములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
పెక్కుజీవములు – అనేకములైన జీవములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
వేదవిహితము – వేదముచేత విహితము – తృతీయా తత్పురుష సమాసము
విహగోత్తముడు – విహగములలో ఉత్తముడు – షష్ఠీ తత్పురుష సమాసము
అవనినాథుడు – అవనికి నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసము
గుణోన్నతి – గుణములందు ఉన్నతి – సప్తమీ తత్పురుష సమాసము
ఒక్క కపోతము – ఒక్కటైన కపోతము – ద్విగు సమాసము
శబ్ద బ్రహ్మము – శబ్దమనెడి బ్రహ్మము – రూపక సమాసము

ఎసైన్మెంట్:

పదజాలం :

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
ఋభుక్షావేదన = ……………….
జవాబు.
ఋభుక్షావేదన భరించడం ఎవరివల్లా కాదు.

ప్రశ్న 2.
పరిత్యాగం = ……………….
జవాబు.
సీతా పరిత్యాగం చేసిన శ్రీరాముడు అనంతరం ఎంతో దుఃఖించాడు.

ప్రశ్న 3.
చనుట = ……………….
జవాబు.
మా పాఠశాల విద్యార్థులు విహార యాత్రకు చనిరి.

ప్రశ్న 4.
ఆశ్రితులు = ……………….
జవాబు.
ఆశ్రితులను కాపాడటం కనీస ధర్మం

ప్రశ్న 5.
పాడి =
జవాబు.
ప్రతి ఒక్కరు పాడి కల్గి ఉండాలి.

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

అర్థాలు:

కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు సరైన అర్థాన్ని గుర్తించండి.

ప్రశ్న 6.
లోకంలోని భూతములు అన్నీ ఆహారం తిని జీవిస్తాయి. ( )
A) ప్రాణులు
B) పిశాచాలు
C) మృములు
D) పక్షులు
జవాబు.
A) ప్రాణులు

ప్రశ్న 7.
పూర్వకాలంలో కపోతములు వార్తలు చేరవేసేవి. ( )
A) చిలుకలు
B) కాకులు
C) పావురాలు
D) ఎలుకలు
జవాబు.
C) పావురాలు

ప్రశ్న 8.
మనం బలాన్నిచ్చే ఆహారం తినాలి. ( )
A) కూరలు
B) భోజనం
C) పళ్ళు
D) ఆకులు
జవాబు.
B) భోజనం

ప్రశ్న 9.
బుభుక్షితులకు ఏ పదార్థమైనా రుచిగానే ఉంటుంది. ( )
A) దాహం వేసినవారికి
B) నిద్రవచ్చిన వారికి
C) అలిసిపోయినవారికి
D) ఆకలి వేసినవారికి
జవాబు.
D) ఆకలి వేసినవారికి

పర్యాయపదాలు:

కింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించండి.

ప్రశ్న 10.
ఎంత ఎక్కువ పనిచేస్తే అంత అధికంగా ఫలితం ఉంటుంది. ( )
A) పని, ఫలితం
B) ఎక్కువ, అధికం
C) ఎంత, అంత
D) ఎక్కువ, పని
జవాబు.
B) ఎక్కువ, అధికం

ప్రశ్న 11.
సతికి శివుడు శరీరంలో సగభాగం ఇచ్చాడు. ఇల్లాలిని విష్ణువు గుండెలపై పెట్టుకున్నాడు.
A) సతి, ఇల్లాలు
B) శరీరం, గుండె
C) శివుడు, విష్ణువు
D) హృదయం, ఎద
జవాబు.
A) సతి, ఇల్లాలు

ప్రశ్న 12.
తండ్రి కుమారులను ప్రయోజకులను చేస్తాడు. కొడుకులు తండ్రికి చేయూతనిస్తారు. ( )
A) ప్రయోజకులు, చేయూత
B) తండ్రి, కొడుకు
C) కుమారులు, కొడుకులు
D) చేస్తాడు, ఇస్తాడు
జవాబు.
C) కుమారులు, కొడుకులు

ప్రశ్న 13.
ఆటంకాలు కలిగినప్పుడు ఆ అడ్డంకులను దాటుకొని ముందుకు సాగాలి. ( )
A) ఆటంకాలు, అడ్డంకులు
B) దాటు, ముందుకు
C) కలుగు, సాగు
D) ముందుకు, వెనుకకు
జవాబు.
A) ఆటంకాలు, అడ్డంకులు

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

నానార్థాలు:

కింది వాక్యాలలోని గీతగీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.

ప్రశ్న 14.
నీకు అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంటే ముందు నీ కోపం తగ్గించుకో. ( )
A) సాధించు
B) ఆగ్రహము
C) సాధన
D) నీకు
జవాబు.
B) ఆగ్రహము

ప్రశ్న 15.
త్రాసులో పంచదారతో సమానంగా కందిపప్పు ఉంచారు. ( )
A) పంచ
B) పప్పు
C) ఉంచు
D) తుల
జవాబు.
D) తుల

ప్రశ్న 16.
గతంలో ప్రాణులు అన్నీ అనాగరికంలో ఉన్నాయి. ( )
A) భూతము
B) యోగము
C) ప్రేతము
D) కరణము
జవాబు.
A) భూతము

ప్రశ్న 17.
పాలవ్యాపారి పాలు, న్యాయంగా పోయాలి. ( )
A) సుడి
B) పాడి
C) బేడి
D) గడి
జవాబు.
B) పాడి

వ్యుత్పత్త్యర్థాలు:

కింది వానికి వ్యుత్పత్త్యర్థాలు / వ్యుత్పత్తి పదాలు గుర్తించండి.

ప్రశ్న 18.
పున్నామ నరకం నుంచి రక్షించేవాడు. ( )
A) పుత్రుడు
B) మిత్రుడు
C) శత్రువు
D) దత్తుడు
జవాబు.
A) పుత్రుడు

ప్రశ్న 19.
ఖగము ( )
A) నేలపై తిరుగునది
B) నీటిలో తిరుగునది
C) ఆకాశంలో తిరుగునది
D) తనచుట్టూ తాను తిరుగునది
జవాబు.
C) ఆకాశంలో తిరుగునది

ప్రశ్న 20.
తీవ్రంగా పోవునది ( )
A) కపోతం
B) ఖగం
C) కెరటం
D) శ్యేనం
జవాబు.
D) శ్యేనం

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

ప్రకృతి – వికృతులు:

కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు ప్రకృతి / వికృతులు గుర్తించండి.

ప్రశ్న 21.
తల్లిదండ్రులకు సంతసం కలిగించటం పిల్లల కర్తవ్యం. ( )
A) సంతోసం
B) సంతోశం
C) సంతోషం
D) షంతోషం
జవాబు.
C) సంతోషం

ప్రశ్న 22.
ఈ కాలంలో కొందరు విద్యార్థుల ప్రతిభ అచ్చెరువు గొలుపుతుంది. ( )
A) అబ్బురము
B) ఆశ్చర్యం
C) అద్భుతం
D) సంతసం
జవాబు.
B) ఆశ్చర్యం

ప్రశ్న 23.
మంచిగుణములు కలవానిని అందరూ ఇష్టపడతారు. ( )
A) గొనము
B) గోనము
C) గోణము
D) గునము
జవాబు.
A) గొనము

ప్రశ్న 24.
పెద్దగా శబ్దము చేయకండి. ( )
A) సెబ్దము
B) పెద్దము
C) సెబదము
D) సద్దు
జవాబు.
D) సద్దు

భాషాంశాలు :

సంధులు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 25.
ఇమ్మనిన – విడదీయండి. ( )
A) ఇమ్మ + అనిన
B) ఇమ్ము + అనిన
C) ఈ + అనిన
D) ఈ + మనని
జవాబు.
B) ఇమ్ము + అనిన

ప్రశ్న 26.
ధర్మజ్ఞులు + ఐన – ఏ సంధి ? ( )
A) ఉత్వసంధి
B) ఇత్వసంధి
C) వృద్ధిసంధి
D) అత్వసంధి
జవాబు.
A) ఉత్వసంధి

ప్రశ్న 27.
ఏ ఓ అర్లు ఆదేశంగా వచ్చేది ఏ సంధి ? ( )
A) సవర్ణదీర్ఘసంధి
B) యణాదేశసంధి
C) గుణసంధి
D) వృద్ధిసంధి
జవాబు.
C) గుణసంధి

ప్రశ్న 28.
శరణాగత ఎలా విడదీయాలి ? ( )
A) శరణు + ఆగత
B) శరణం + ఆగత
C) శరణ + అగత
D) శరణ + ఆగత
జవాబు.
D) శరణ + ఆగత

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

సమాసాలు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 29.
గుణోన్నతి – విగ్రహవాక్యం ( )
A) గుణములు మరియు ఉన్నతి
B) గుణముల యందు ఉన్నతి
C) గుణముల చేత ఉన్నతి
D) గుణముల యొక్క ఉన్నతి
జవాబు.
D) గుణముల యొక్క ఉన్నతి

ప్రశ్న 30.
సర్వభూతములు – ఏ సమాసం ? ( )
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
B) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
C) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
D) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
జవాబు.
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రశ్న 31.
సమాసంలో మొదటి పదం సంఖ్యను తెలిపేది ఏ సమాసం ? ( )
A) ద్వంద్వ సమాసం
B) రూపక సమాసం
C) ద్విగు సమాసం
D) బహువ్రీహి సమాసం
జవాబు.
C) ద్విగు సమాసం

ప్రశ్న 32.
వాసవుడును, దహనుడును ( )
సమాస పదం
A) వాసవుడు దహనుడు
B) వాసవదహనులు
C) వాసవదహనుడు
D) వాసవదహన
జవాబు.
B) వాసవదహనులు

వాక్య రూపాలు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 33.
దయచేసి చదవండి. ఇది ఏ వాక్యం ? ( )
A) ఆశ్చర్యార్థక వాక్యం
B) ప్రశ్నార్థక వాక్యం
C) ప్రార్థనార్థక వాక్యం
D) అనుమత్యర్థక వాక్యం
జవాబు.
C) ప్రార్థనార్థక వాక్యం

ప్రశ్న 34.
ఈ చిత్రం ఎంత అందంగా ఉందో ! ( )
A) ఆశ్చర్యార్థక వాక్యం
C) ప్రార్థనార్థక వాక్యం
B) ప్రశ్నార్ధక వాక్యం
D) అనుమత్యర్థక వాక్యం
జవాబు.
A) ఆశ్చర్యార్థక వాక్యం

ప్రశ్న 35.
నీవు శిబి చక్రవర్తి గురించి విన్నావా ? ( )
A) ప్రేరణార్థక వాక్యం
B) ప్రశ్నార్థక వాక్యం
C) అనుమత్యర్థక వాక్యం
D) ప్రార్థనార్థక వాక్యం
జవాబు.
B) ప్రశ్నార్థక వాక్యం

ప్రశ్న 36.
మీరు వెళ్ళవద్దు ( )
A) ప్రేరణార్థకం
B) ప్రశ్నార్థకం
C) అనుమత్యర్థకం
D) నిషేధార్థకం
జవాబు.
D) నిషేధార్థకం

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

సామాన్య – సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 37.
శిబి పావురాన్ని చూశాడు. శిబి ఆశ్రయమిచ్చాడు. సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) శిబి పావురాన్ని చూస్తూ ఆశ్రయమిచ్చాడు.
B) శిబి పావురాన్ని చూసి ఆశ్రయమిచ్చాడు.
C) శిబి పావురాన్ని చూడాలని ఆశ్రయమిచ్చాడు.
D) శిబి పావురాన్ని చూడకుండానే ఆశ్రయమిచ్చాడు.
జవాబు.
B) శిబి పావురాన్ని చూసి ఆశ్రయమిచ్చాడు.

ప్రశ్న 38.
డేగ వచ్చి అడిగింది. విడిచిపెట్టలేదు. సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) డేగ వచ్చి అడిగినా విడిచిపెట్టలేదు.
B) డేగ వచ్చి అడిగింది కాబట్టి విడిచిపెట్టలేదు.
C) డేగ వచ్చి అడగలేదని విడిచిపెట్టలేదు
D) డేగ వచ్చి అడిగింది కానీ విడిచిపెట్టలేదు.
జవాబు.
D) డేగ వచ్చి అడిగింది కానీ విడిచిపెట్టలేదు.

క్రియను గుర్తించుట:

గీతగీసిన పదాలు ఏ క్రియాపదాలో గుర్తించండి.

ప్రశ్న 39.
శిబి శరీరంలో మాంసం మొత్తం వేసినా త్రాసు తూగలేదు. ( )
A) క్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
D) అప్యర్థకం

ప్రశ్న 40.
పావురం వచ్చి శిబిని శరణు కోరింది. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
A) క్త్వార్థం

ప్రశ్న 41.
వానలు పడితే పంటలు పండుతాయి. ( )
A) క్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
B) చేదర్థకం

ప్రశ్న 42.
వర్తమాన కాల అసమాపక క్రియను ఏమంటారు ? ( )
A) క్త్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
C) శత్రర్థకం

ఛందస్సు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 43.
చంపకమాలలోని గణాలను గుర్తించండి. ( )
A) భరనభభరవ
B) నజభజజజర
C) సభరనమయవ
D) మసజసతతగ
జవాబు.
B) నజభజజజర

ప్రశ్న 44.
పద్య లక్షణాలను తెలిపేది ఏది ? ( )
A) ఛందస్సు
B) వ్యాకరణం
C) సంధి
D) సమాసం
జవాబు.
A) ఛందస్సు

ప్రశ్న 45.
అన్ని ప్రాణులు ఆహారం తిని జీవిస్తాయి. – గీతగీసిన పదం ఏ గణం ? ( )
A) భగణం
B) రగణం
C) తగణం
D) మగణం
జవాబు.
D) మగణం

ప్రశ్న 46.
గురువును ఏ గుర్తుతో సూచిస్తారు ? ( )
A) U
B) I
C) O
D) C
జవాబు.
A) U

TS 8th Class Telugu Bits 1st Lesson త్యాగనిరతి

అలంకారాలు:

ప్రశ్న 47.
ఒకే హల్లు చాలాసార్లు ఆవృత్తి అయితే అది ఏ అలంకారం ? ( )
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) లాటానుప్రాస
D) యమకం
జవాబు.
A) వృత్త్యనుప్రాస

ప్రశ్న 48.
భక్షణ అయిన పక్షికి రక్షణ ఇచ్చాడు. ఇందులోని అలంకారం ఏది ? ( )
A) ఛేకానుప్రాస
B) లాటానుప్రాస
C) యమకం
D) వృత్త్యనుప్రాస
జవాబు.
D) వృత్త్యనుప్రాస

TS 8th Class Telugu Bits with Answers Pdf

TS 8th Class Telugu Important Bits | TS 8th Class Telugu Bit Bank

TS 8th Class Study Material

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download వ్యాసాలు Questions and Answers.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను ‘వర్ణమాల’ లేదా ‘అక్షరమాల’ అని అంటారు.
ఉదా : ‘అ’ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు. అంటే అక్షరం. తెలుగుభాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు.
అవి :

  1. అచ్చులు
  2. హల్లులు
  3. ఉభయాక్షరాలు

అచ్చులు :
అ – ఆ – ఇ – ఈ – ఉ – ఊ – ఋ – ౠ – ఎ – ఏ – ఐ – ఒ – ఓ – ఔ
ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలు అని రెండు విధాలు.

అ) హ్రస్వాలు : ఒక మాత్రకాలంలో ఉచ్చరించే అచ్చులను ‘హ్రస్వాలు’ అంటారు.
అవి : అ – ఇ – ఉ – ఋ – ఎ – ఒ (మాత్ర అంటే కనురెప్పపాటు కాలం)

ఆ) దీర్ఘాలు : రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను ‘దీర్ఘాలు’ అంటారు.
అవి : ఆ – ఈ – ఊ – ౠ – ఏ – ఓ – ఔ

హల్లులు :
క ఖ గ ఘ ఙ
చ చ ఛ జ షు ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ
శ ష స హ ళ ఱ
ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను ఈ కింది విభాగాలు చేశారు.
అ) క, చ, ట, త, – పరుషాలు
ఆ) గ, జ, డ, ద, బ – సరళాలు
వీటిని అల్పప్రాణాలు అని కూడా అంటారు.
ఇ) ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ లు మహాప్రాణాలు, వర్గయుక్కులు అని అంటారు.
ఈ) ఙ, ఞ, ణ, న, మ – అనునాసికాలు
ఉ) య, ర, ల, వ – అంతస్థాలు
ఊ ) శ, ష, స, హ – ఊష్మాలు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

సూచన : “ఱ” అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి బదులు ఇప్పుడు ‘ర’ ను వాడుతున్నారు. అట్లే చ, జే లు వాడుకలో లేవు, వీటికి బదులుగ చ, జ లను వాడుతున్నారు.

ఉభయాక్షరాలు : మూడు. అవి సున్న ‘మ్’ (పూర్ణబిందువు), అరసున్న ‘C’, విసర్గ :’. ఈ మూడింటిని అచ్చులతోను, హల్లులతోనూ ఉపయోగించడంవల్ల వీటిని ‘ఉభయాక్షరాలు’ అని వ్యవహరిస్తారు.

సూచన : అరసున్నకు గ్రాంథికభాషలో ప్రాధాన్యమున్నది. విసర్గ సంస్కృతపదాలకు మాత్రమే చేరుతుంది.
అక్షరమాలలో ఎట్లా ఉన్నా ‘హల్లు’ అనేది పొల్లుగా పలికే ధ్వని. ‘మ్’, ‘అ’ అనే ధ్వనులు కలిసి ‘మ’ అయింది. మొదటిది హల్లు, రెండోది అచ్చు.

కొన్ని అక్షరాల్లో రెండేసిగాని, మూడేసిగాని హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి మూడురకాలు.
1. ద్విత్వాక్షరం
2. సంయుక్తాక్షరం
3. సంశ్లేషాక్షరం

1) ద్విత్వాక్షరం : ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని “ద్విత్వాక్షరం” అంటారు.
ఉదా : ‘క్క’ = క్ + క్క (క్) + అ = క్క – ఇక్కడ కకారం రెండుసార్లు వచ్చింది.
2) సంయుక్తాక్షరం : ఒక హల్లుకు వేరే ఒత్తు చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు. హల్లుకు చెందిన హల్లు యొక్క
ఉదా : న్య = న్ + య్ (్య) + అ = న్య – ఇక్కడ నకార, యకారాలనే రెండు హల్లులు వచ్చాయి.
3) సంశ్లేషాక్షరం : ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారు.
ఉదా : = క్ + ష్ + మ్ + ఇ = ఇక్కడ కకార, షకార, మకారాలనే హల్లులు మూడు కలిశాయి.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

లింగాలు:

కింది వాక్యాలను చదువండి.

  • గీత లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు.
  • ప్రదీప్ సందీప్ లు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు.
  • పిల్లి ఎలుకను వెంబడించింది.
  • చెట్టుమీద కోతులు దుంకుతున్నాయి.

పై వాక్యాలలో గీత, లత, ప్రదీప్, సందీప్, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలించండి. గీత, లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు.
ప్రదీప్, సందీప్, నాన్న – అనేవి పురుషులకు (మగవారికి) చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను ‘పుంలింగ పదాలు’ అంటారు.
పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలు పురుషులనుకానీ, స్త్రీలనుకానీ సూచించవు. ఇట్లాంటి పదాలను నపుంసక లింగ పదాలు అంటారు.
దీని ప్రకారం
పురుష వాచక శబ్దాలను పుంలింగాలనీ
స్త్రీ వాచక శబ్దాలను స్త్రీలింగాలనీ
పై రెండు కానటువంటి (మానవ సంబంధం కాని) వాటిని అనగా వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలను నపుంసకలింగ పదాలని చెప్పవచ్చు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

విభక్తులు:

కింది వాక్యాలను గమనించండి.
అ. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి, బతుకమ్మ పండుగ ప్రతీక.
ఆ. హెూళి పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు.
ఇ. పీర్లను ఇత్తడితో, వెండితో తయారుచేస్తారు.
ఈ. వాణి పూజ కొరకు పూలను కోసింది.
ఉ. కృత్రిమమైన రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాం.

పై వాక్యాల్లో గీతగీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదువండి.
ఉదా || పీర్ల ఇత్తడి వెండి తయారుచేస్తారు.

పై వాక్యంలో పదాలమధ్య సంబంధం సరిగా లేనట్టుగా అనిపిస్తున్నది. పీర్ల ఇత్తడి వెండి అనే వాక్యం ఉండదు. ఇప్పుడు ను, తో అనే ప్రత్యయాలను ఉపయోగించి చదువండి.

“పీర్లను ఇత్తడితో, వెండితో తయారుచేస్తారు.” ఇట్లా పదాల మధ్య అర్థసంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని “విభక్తి ప్రత్యయాలు” అంటారు.

విభక్తి ప్రత్యయాలు:

ప్రత్యయాలు  విభక్తులు
అ. డు, ము, వు, లు  ప్రథమా విభక్తి
ఆ. ని(న్), ను(న్), ల(న్), కూర్చి, గురించి  ద్వితీయా విభక్తి
ఇ. చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్)  తృతీయా విభక్తి
ఈ. కొఱకు(న్), కై (కోసం)  చతుర్థీ విభక్త
ఉ. వలన(న్), కంటె(న్), పట్టి  పంచమీ విభక్తి
ఊ. కి(న్), కు(న్), యొక్క, లో(న్), లోపల(న్)  షష్ఠీ విభక్తి
ఎ. అందు(న్), న(న్)  సప్తమీ విభక్తి
ఏ. ఓ, ఓరి, ఓయి, ఓసి  సంబోధన ప్రథమావిభక్తి

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

భాషా భాగాలు:

వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని “నామవాచకాలు” అంటారు. నామవాచకానికి బదులుగా వాడే పదాలను “సర్వనామాలు” అంటారు. పనిని తెలియజేసే పదాలను “క్రియాపదాలు” అంటారు. నామవాచకాల గుణాన్ని తెలిపే పదాలను “విశేషణాలు” అంటారు.

అవ్యయం:

కింది వాక్యాలను చదువండి.
నిదానమే ప్రధానం అట్లని సోమరితం పనికిరాదు.
మనిషికి వినయం అలంకారం. అయితే అతివినయం పనికిరాదు.
ఆహా ! ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో !

ఈ వాక్యాల్లో ఉన్న “అట్లని, అయితే, ఆహా !” మొదలైన పదాలను చూశారుకదా ! ఇవి పుంలింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. అట్లాగే వీటికి విభక్తులు లేవు. ఏకవచన, బహువచనమనే తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను ‘అవ్యయాలు’ అంటారు.

సమాపక, అసమాపక క్రియలు:

ప్రతి వాక్యంలోనూ చివర ఉన్న క్రియలు పని పూర్తయిందని తెలుపుతున్నాయి. ఇట్లా పని పూర్తయినట్లు తెలిపే క్రియలను “సమాపక క్రియలు” అంటారు. వాక్యం మధ్యలో ఉన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. పని పూర్తికానట్లు తెలిపే క్రియలను “అసమాపక క్రియలు” అంటారు.

2. కింది వాక్యాల్లో సమాపక, అసమాపక క్రియలు గుర్తించండి.

అ. చెంబుతో నీళ్ళు ముంచుకొని, తాగుతుంది.
అసమాపక క్రియ – ముంచుకొని
సమాపక క్రియ – తాగుతుంది

ఆ. ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు.
అసమాపక క్రియ – ఆపివేసి
సమాపక క్రియ – వెళ్ళిపోయాడు

ఇ. పరీక్ష చేసి, కాలు విరిగిందని చెప్పాడు.
సమాపక క్రియ – చెప్పాడు
అసమాపక క్రియ – విరిగిందని

ఈ. దగ్గరకు తీసుకొని, కన్నీళ్ళు తుడిచింది.
అసమాపక క్రియ – తీసుకొని
సమాపక క్రియ – తుడిచింది.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

అర్థాన్ని బట్టి వాక్యాల్లో రకాలు:

క్రియలనుబట్టే కాకుండా అర్థాన్ని బట్టి కూడా వాక్యాలలో తేడాలుంటాయని గమనించండి.
ఉదా : అ. ఆహా ! ఎంత బాగుందో !
ఆ. ‘చేతులు కడుక్కో’
ఇ. మన రాష్ట్ర రాజధాని ఏది ?

పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అదెట్లాగో చూద్దాం !
ఆహా ! ఎంత బాగుందో! ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆశ్చర్యాన్ని తెలియజేసేవాక్యం ‘ఆశ్చర్యార్థక వాక్యం’.
ఇక రెండో వాక్యం ‘చేతులు కడుక్కో’. ఇది “విధిగా చేయాలి” అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయాల్సిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యం ‘విధ్యర్థక వాక్యం’.
ఇక మూడో వాక్యం మన రాష్ట్ర రాజధాని ఏది ? ఇది ప్రశ్నార్ధకాన్ని సూచిస్తుంది. ప్రశ్నించే విధంగా ఉండే వాక్యమే ‘ప్రశ్నార్థక వాక్యం’.

కింది వాక్యాలను చూద్దాం.

  • అతడు వస్తాడో ? రాడో ?
  • రేపు వర్షం పడవచ్చు.
  • ఈ రోజు ఎండ కాస్తుందో ? లేదో ?

ఈ మూడు వాక్యాల్లో పని జరుగుతుందో లేదో అనే సందేహం వ్యక్తం అవుతున్నది.
పని జరుగుతుందో లేదో అనే ‘సందేహం’ కలిగేటట్లున్న వాక్యం “సందేహార్థక వాక్యం”.

  • లోపలికి రావచ్చు.
  • కొద్దిసేపు టీవీ చూడవచ్చు.
  • మీరు వెళ్ళవచ్చు.

ఈ వాక్యాలు అనుమతిని ఇస్తున్నట్లుగా ఉన్నాయి. అంటే ఇవి ‘అనుమత్యర్థక వాక్యాలు. ‘
ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం”.

  • ఇతరులను ఎగతాళి చేయవద్దు.
  • నీటిని వృధా చేయవద్దు.
  • ఎక్కువ సేపు నిద్రపోవద్దు.

ఈ వాక్యాలు ఆయా పనులను చేయవద్దని చెబుతున్నవి (నిషేధిస్తున్నవి). కనుక ఇవి “నిషేధార్థక వాక్యాలు”.
ఒక పనిని చేయవద్దనే (నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం “నిషేధార్థక వాక్యం”.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

సంధులు:

క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలను గమనించండి.
అ. ఇప్పటికైనా జాగ్రత్తపడుతారని ఆశ.
ఆ. నీళ్ళెంత ఎక్కువగా ఉంటే తామర అంత వృద్ధిచెందుతుంది.
ఇ. అవి ఎక్కడుంటాయో తెలియదు.
పై వాక్యాల్లో ఇప్పటికైనా అనే మాటలో
మొదటిపదం – ఇప్పటికి
రెండవపదం ఐనా

నీళ్ళెంత అనే మాటలో
మొదటిపదం – నీళ్ళు
రెండవపదం – ఎంత

ఎక్కడుంటయో అనే మాటలో
మొదటిపదం – ఎక్కడ
రెండవపదం – ఉంటయో
పై వాటిని ఇట్లా విడదీయవచ్చు.

ఇప్పటికైనా = ఇప్పటికి + ఐనా
నీళ్ళెంత = నీళ్ళు + ఎంత
ఎక్కడుంటయో = ఎక్కడ + ఉంటయో
ఇట్లా రాయడాన్ని విడదీసి రాయడం అంటారు.

కింది వాటిని పరిశీలించండి.
1. వారు + ఉండిరి = వారుండిరి
2. ఎవరికి + ఎంత = ఎవరికెంత
3. ఇంక + ఒకరు = ఇంకొకరు

పై ఉదాహరణల్లో రెండేసి పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటం గమనించారుకదా ! ఇట్లా రాయడాన్ని కలిపిరాయడం అంటారు. దీనికే ‘సంధి’ అని పేరు.

కింది పదాలను కలిపిన విధానాన్ని పరిశీలించండి.
నేడు + ఇక్కడ = నేడిక్కడ (డ్ + ఉ + ఇ) = ఇ (డి)
వారు + ఇచ్చట = వారిచ్చట (ర్ + ఉ + ఇ) = ఇ (రి
పై మొదటిపదంలో (నేడు) చివరి అచ్చు (పూర్వస్వరం( ‘ఉ’; రెండవ పదం (ఇక్కడ) లో మొదటి అచ్చు (పరస్వరం) ‘ఇ’. ‘ఉ’ కారానికి ‘ఇ’ కారం కలిసినప్పుడు ‘ఇ’ కారమే నిలబడింది. అంటే సంధి జరిగిందన్నమాట. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది. దీనినే ‘సంధి’ అంటాం.
పూర్వ, పర స్వరాలకు పరస్వరం ఏకాదేశమగుట సంధి. (ఏకాదేశమంటే ఒకవర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చిచేరడం.)

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ఉత్వసంధి :

ఈ కింది పదాలను గమనించండి.
అ. రాముడు + అతడు = రాముడతడు = ఉ + అ = అ
ఆ. సోముడు + ఇతడు = సోముడితడు = ఉ + ఇ = ఇ
ఇ. మనము + ఉంటిమి = మనముంటిమి = ఉ + ఉ = ఉ
ఈ. అతడు + ఎక్కడ = అతడెక్కడ = ఉ + ఎ = ఎ

మొదటి పదంలోని చివరి అచ్చు ‘ఉ’, రెండవ పదంలోని మొదటి అచ్చుతో కలిసినపుడు మొదటి పదంలోని అచ్చు (ఉ) లోపిస్తుంది. రెండో పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీనినే ‘ఉత్త్వసంధి’ అంటాం.
”ఉకారాన్ని ఉత్తు అంటారు. – ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది.

అత్వసంధి:

కింది పదాలను పరిశీలించండి.

అ. రామయ్య = రామ + అయ్య
ఆ. మేనత్త / మేనయత్త = మేన + అత్త
ఇ. సెలయేరు = సెల + ఏరు
ఈ. ఒకానొక = ఒక + ఒక
సంధిని విడదీసినప్పుడు ఏర్పడే రెండు పదాలలో మొదటి పదాన్ని ‘పూర్వపదం’ అని, రెండవ పదాన్ని ‘పరపదం’ అని అంటారు.

పూర్వపదం చివర ఉన్న అచ్చు ఏది ?
పరపదం మొదట ఉన్న అచ్చు ఏది ?
పూర్వపదం చివరి అచ్చుకు పరపదం మొదటి అచ్చు కలిస్తే ఏం ఏర్పడింది ?

పై ఉదాహరణలు చూసినప్పుడు మొదటి పదం చివరన ‘అ’ అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదట అ, ఏ, ఒ మొదలైన అచ్చులు ఉన్నాయి. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అచ్చు ‘అ’ లోపించి రెండవ పదం మొదటి అచ్చు వచ్చి చేరితే కింది విధంగా ఉంటాయి.

1) రామయ్య లాంటి పదాల్లో సంధి ఎప్పుడూ అవుతుంది. (నిత్యం)
2) మేనత్త, మేనయత్త లాంటి పదాల్లో సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. (వైకల్పికం)
3) సెలయేరు లాంటి పదాలు ‘సెలేరు’ లాగా మారకుండా ‘సెలయేరు’ లాగానే ఉంటాయి. (నిషేధం)
4) ఒకానొక లాంటి పదాలు ‘ఒకొక’లాగా మారకుండా మరోరూపంలోకి అంటే ‘ఒకానొక’లా మారుతాయి. (అన్యకార్యం)
(మొదటి పదం చివరి అచ్చు పూర్వ స్వరం. రెండోపదం మొదటి అచ్చు పరస్వరం.)
‘అ’ కు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ) పరమైతే ఏర్పడే సంధి ‘అత్వసంధి’.
అత్తు (అత్తు అంటే హ్రస్వమైన ‘అ’) నకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు.
బహుళం : సంధి నిత్యంగా, వైకల్పికంగా నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని ‘బహుళం’ అంటారు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ఇత్వ సంధి:

కింది పదాలను కలిపి రాయండి.
అ. ఏమి + అది = ఏమది
ఆ. ఎవరికి + ఎంత = ఎవరికెంత
ఇ. మరి + ఇప్పుడు = మరిప్పుడు
ఈ. అవి + ఏవి = అవేవి

పై పదాలను విడదీసిన క్రమాన్ని, కలిపిన క్రమాన్ని గమనించండి.

మొదటి పదం చివరి అచ్చు “ఇ” కారం. (ఇత్తు). రెండవ పదాల మొదట్లో అన్నీ అచ్చులే వచ్చినవి. ఈ విధంగా “ఏమి” మొదలైన పదాల ‘ఇ’ కారానికి (ఇత్తునకు అచ్చు పరమైనపుడు సంధి జరుగుతుంది. కొన్ని చోట్ల ఇట్లా సంధికార్యం జరుగదు. ఆ పదాలను చూద్దాం.
ఉదా : ఏమి + అయ్యె = ఏమయ్యె – సంధి జరిగింది.
ఏమి + అయ్యె = ఏమియయ్యె – సంధి జరగక యడాగమం వచ్చింది.

ఒకసారి సంధి (నిత్యము) జరిగి, మరొకసారి సంధి జరుగక (నిషేధము) పోవడాన్ని వ్యాకరణ పరిభాషలో ‘వికల్పము’ (వైకల్పికము) అంటారు.
“ఏమి” మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము అని తెలుస్తుందికదా ! దీనినే ఇత్వసంధి అంటారు. ఏమ్యాదులయందు ‘ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.

ఆమ్రేడిత సంధి:

ఔరౌర ! ఎంత గొప్పపని చేశావు.
ఆహాహా ! ఎంతో ఆనందం కలిగించావు.
పై వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే
ఔరౌర = ఔర + ఔర
ఆహాహా = ఆహా + ఆహా – అవుతున్నాయి కదా !
ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు. పై పదాలను గమనిస్తే…

ఔర = ఔర్ + అ
ఆహా = ఆహ్ + ఆ
ఆ పదాల చివర అచ్చులు కనబడుతున్నాయి. వాటికి ఆమ్రేడితం వచ్చి చేరితే ఏమవుతుందో చూద్దాం.
ఔర + ఔర = ఔరౌర ఔ (ర్ + అ) = ఔర అని ఉండగా అకారం లోపించి ఔర్ + ఔర అని ఉంటుంది. ఆమ్రేడిత పదంలోని ‘ఔ’ వచ్చి చేరి “ఔరౌర” అని అయింది.
అట్లాగే ఆహా + ఆహా = ఆ(హ్ + ఆ) + ఆహా = ఆహాహా
దీనివల్ల అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఇది ‘ఆమ్రేడిత సంధి’.
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు.

ఈ కింది పదాలను చదువండి.
అ) పగలు + పగలు = పట్టపగలు
ఆ) చివర + చివర = చిట్టచివర
పై పదాలు కలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పగలు + పగలు = పట్టపగలు అవుతోంది. అంటే మొదటి పదంలోని పగలులో ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ పోయి దానికి బదులుగా ‘ట్ట’ వచ్చింది. అప్పుడు పట్టపగలు అయింది. అట్లనే చిట్టచివర పదం కూడ.

మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.
అ) నడుమ + నడుమ = నట్టనడుమ
ఆ) కొన + కొన = కొట్టకొన
ఇ) కడ + కడ = కట్టకడ
“ద్విరుక్తటకారమనగా ‘ట్ట’ (ద్విత్వము)”.
ఆమ్రేడితం పరంగా ఉంటే నడుమ, కొన, మొదలైన శబ్దాలలో మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలు పోయి వాటి స్థానంలో ‘ట్ట’ వస్తుందని చూశాం కదా !
ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చుమీది అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

సవర్ణదీర్ఘ సంధి:

కింది పదాలను పరిశీలించండి. సంధి జరిగిన విధానం గమనించండి.
అ) శివాలయం = శివ + ఆలయం = అ + ఆ
ఆ) మునీంద్రుడు = ముని + ఇంద్రుడు = ఇ + ఇ = ఈ
ఇ) భానూదయం = భాను + ఉదయం = ఉ + ఉ = ఊ
ఈ) మాతౄణం = మాతృ + ఋణం = ఋ + ఋ = ౠ
పై పదాలను విడదీసినపుడు మొదటి (పూర్వ), రెండవ (పర) పదాల్లో ఒకేరకమైన అచ్చులున్నాయికదా ! అట్లా ఆ రెండు అచ్చులు కలిసినప్పుడు వాటివాటి దీర్ఘాలు వచ్చాయి.
అ/ఆ + అ/ఆ = ఆ
ఉ/ఊ + ఉ/ఊ = ఊ
ఇ/ఈ + ఇ/ఈ = ఈ
ఋ/ౠ + ఋ/ౠ = ౠ
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు (సవర్ణాలు) వచ్చి చేరినపుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దీనినే సవర్ణదీర్ఘసంధి అంటాం.
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ‘ఏకాదేశం’ అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చిచేరడం.
ఒకేరకమైన అచ్చులను ‘సవర్ణాలు’ అంటాం.

గుణసంధి:

కింది పదాలను చూడండి.

  • రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
  • పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
  • వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
  • దేవర్షి = దేవ + ఋషి (అ + ఋ = అర్)

పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.
‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’ (TS 8th Class Telugu Grammar వ్యాకరణం 1)
‘అ’ కారానికి ‘ఉ’ పరమైనప్పుడు ‘ఓ’ (TS 8th Class Telugu Grammar వ్యాకరణం 2)
‘అ’ కారానికి ‘ఋ’ – పరమైనప్పుడు ‘అర్’
అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’
ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.
‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.
‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.

సమాసాలు:

ద్వంద్వ సమాసం:

కింది వాక్యాలు చదువండి.
అ. మాకు దేశభక్తి ఉన్నది.
ఆ. సురేశ్ వేసుకున్నది తెల్లచొక్క
ఇ. లక్ష్మీపతి దయ నాపై ఉన్నది.
ఈ. ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చాడు.
ఉ. పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది.
ఊ. మాధవునికి పది ఎకరాల పొలం ఉన్నది.

పై వాక్యాల్లో గీతగీసిన పదాల అర్థాలను గమనించండి.
దేశభక్తి – దేశమునందు భక్తి
తెల్లచొక్క – తెల్లనైన చొక్క
లక్ష్మీపతి – లక్ష్మియొక్క పతి
గురుదక్షిణ – గురువుకొరకు దక్షిణ
కూరగాయలు – కూర మరియు కాయ
పది ఎకరాలు – పది సంఖ్యగల ఎకరాలు

పై పదాల్లో వేరువేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి కదా !
ఈ విధంగా అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్తపదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు.
సమాసంలో మొదటి పదాన్ని ‘పూర్వపదం’ అని, రెండవ పదాన్ని ‘ఉత్తరపదం’ అనీ అంటారు. సమాసంలో ఉండే పదాల, అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు (పేర్లు) ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఒక సమాసం గురించి తెలుసుకుందాం.

కింది వాక్యాన్ని పరిశీలించండి.

“గురుశిష్యుల బంధం చాలా గొప్పది”.

ఈ వాక్యంలో గురుశిష్యులు అనే మాటలో రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు, శిష్యుడు అని. ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటారు. ఇందులో గురువు, శిష్యుడు ఇద్దరూ ముఖ్యులే. ఇట్లా రెండుకాని అంతకంటే ఎక్కువగాని సమప్రాధాన్యంగల పదాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వసమాసం అంటారు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ద్విగు సమాసం:

ఈ పదాలను పరిశీలించండి.
నవరసాలు
చతుర్వేదములు
షట్చక్రవర్తులు
పంచపాండవులు
దశ దిశలు
ఈ పదాలలో మొదటి (పూర్వ) పదం సంఖ్యా వాచకంగా వుండి, రెండవపదం (పర) నామవాచకంగా ఉంది. వీటికి విగ్రహవాక్యాలు ఇట్లా ఉంటాయి.
నవరసాలు – తొమ్మిది సంఖ్యగల రసాలు
చతుర్వేదములు – నాలుగు సంఖ్యగల వేదములు
షట్చక్రవర్తులు – ఆరు సంఖ్యగల చక్రవర్తులు
పంచపాండవులు – ఐదు సంఖ్యగల పాండవులు
దశదిశలు – పది సంఖ్యగల దిక్కులు
మొదటి (పూర్వ) పదం సంఖ్య అయితే తర్వాత (పర) పదం ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయివుంటుంది.
పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ‘ద్విగు సమాసం’.

తత్పురుష సమాసం:

కింది వాక్యం చదువండి.
‘రాజభటుడు వచ్చాడు’

పై వాక్యంలో వచ్చిన వాడు రాజా ? భటుడా ? అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందిన వాడని చెప్పడానికి ‘రాజు యొక్క భటుడు’ అంటాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రత్యయమైన “యొక్క” వాడినాం.

తిండి గింజలు – తిండి ‘కొరకు’ గింజలు
పాపభీతి – పాపం ‘వల్ల’ భీతి

పై రెండు వాక్యాలను కూడ గమనిస్తే రెండు పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాం. పై విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తరపద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం.

సమాసంలో ఉండే రెండు పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తరపదం.
పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు.

తత్పురుష సమాసం రకాలు

కింది పట్టికను చూడండి. చదువండి.

తత్పురుష సమాసం రకాలు  విభక్తులు  ఉదాహరణ
ప్రథమా తత్పురుషం  డు, ము, వు, లు  మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య భాగం (సమాసంలోని మొదటి పదం ప్రథమావిభక్తిలో ఉన్నది కనుక ప్రథమా తత్పురుషం)
ద్వితీయా తత్పురుషం  ని, ను, ల, కూర్చి, గురించి  జలధరం జలమును ధరించినది
తృతీయా తత్పురుషం  చేత, చే, తోడ, తో  బుద్ధిహీనుడు – బుద్ది చేత హీనుడు
చతుర్థీ తత్పురుషం  కొరకు, కై  దూడగడ్డి – దూడకొరకు గడ్డి
పంచమీ తత్పురుషం  వలన (వల్ల), కంటే, పట్టి  దొంగభయం – దొంగవలన భయం
షష్ఠీ తత్పురుష  కి, కు, యొక్క లో, లోపల  రామబాణం – రాముని యొక్క బాణం
సప్తమీ తత్పురుషం  అందు, న  దేశభక్తి – దేశమునందు భక్తి

 

కింది వానిని చదువండి.
అసత్యం – సత్యం కానిది
అధర్మం – ధర్మం కానిది
అన్యాయం – న్యాయం కానిది
ఇట్లా వ్యతిరేకార్థం తెలిపితే అది నఞ తత్పురుషం (న అంటే వ్యతిరేకార్థం).

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

సంక్లిష్ట, సంయుక్త వాక్యాలు:

కింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి.

వాక్యం  అసమాపక క్రియ  సమాపక క్రియ
ఉదా : సీత బజారుకు వెళ్ళి, బొమ్మ కొన్నది  వెళ్ళి  కొన్నది
1) రాజు పద్యం చదివి, భావం చెప్పాడు  చదివి  చెప్పాడు
2) వాణి బొమ్మ గీసి, రంగులు వేసింది.  గీసి  వేసింది
3) కావ్య మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది.  ఎక్కి  వెళ్ళింది
4) రంగయ్య వచ్చి, వెళ్ళాడు  వచ్చి  వెళ్ళాడు.
5) వాళ్ళు అన్నం తిని, నీళ్ళు తాగారు.  తిని  తాగారు

కింది వాక్యాలు చదువండి. కలిపి రాసిన విధానం చూడండి.
ఉదా : గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది.

కింది వాక్యాలను కలిపి రాయండి.

అ) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు.
విమల వంట చేస్తూ పాటలు వింటుంది.

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు.
అమ్మ నిద్రలేచి ముఖం కడుక్కుంది.

ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడి పండ్లు తెచ్చాడు.
జవాబు.
రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు.

పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. కర్త పునరుక్తం కాలేదు.
ఇట్లా రెండు లేక మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది. ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు, అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీనినే ‘సంక్లిష్ట వాక్యం’ అంటారు.

కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయండి.

అ) రజిత అన్నం తిన్నది. రజిత బడికి వెళ్ళింది.
జవాబు.
రజిత అన్నం తిని బడికి వెళ్ళింది.

ఆ) వాళ్ళు రైలు దిగారు. వాళ్ళు ఆటో ఎక్కారు.
జవాబు.
వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు.

ఇ) రాజన్న లడ్డూలు తెచ్చాడు. రాజన్న అందరికీ పంచాడు.
జవాబు.
రాజన్న లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు.

3. కింది వాక్యాలు చదువండి. కలిపి రాయండి.

ఉదా : రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.

అ) వర్షాలు కురిసాయి. పంటలు బాగా పండాయి.
జవాబు.
వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు బాగా పండాయి.

ఆ) అతనికి కనిపించదు. అతడు చదువలేడు.
జవాబు.
అతనికి కనిపించదు కాబట్టి చదువలేదు.

పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పై వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పురాలేదు. వాక్యాలమధ్య కొన్ని అనుసంధాన పదాలు వచ్చాయి. ఇట్లా రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి ‘సంయుక్త వాక్యాలు’ అవుతాయి. అనుసంధాన పదాలు అంటే కావున, కానీ, మరియు, అందువల్ల మొదలైనవి.
సంయుక్తవాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మరికొన్ని మార్పులు ఎట్లా ఉంటాయో గమనించండి.

అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
జవాబు.
వనజ చురుకైనది, అందమైనది. రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం.

ఆ) దివ్య అక్క, శైలజ చెల్లెలు.
జవాబు.
దివ్య, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామ పదాలు ఒకేచోట చేరి చివర బహువచనం చేరడం.

ఇ) ఆయన డాక్టరా ? ఆయన ప్రొఫెసరా ?
జవాబు.
ఆయన డాక్టరా, ప్రొఫెసరా ? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించటం.

కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) వారు గొప్పవారు. వారు తెలివైనవారు.
జవాబు.
వారు గొప్పవారు మరియు తెలివైనవారు.

ఆ) సుధ మాట్లాడదు. సుధ చేసి చూపిస్తుంది.
జవాబు.
సుధ మాట్లాడదు కాని చేసి చూపిస్తుంది.

ఇ) మేము రాము. మేము చెప్పలేము.
జవాబు.
మేము రాము, చెప్పలేము.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ఛందస్సు:

కింది వానిని చదివి తెలుసుకోండి.

ఛందస్సు : పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు.
అ) “లఘువు” – క్షణకాలంలో ఉచ్చరించేది. దీనిని ‘ల’ అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “|” (నిలువుగీత). లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 3

ఆ) “గురువు” – రెండు క్షణాల కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘గ’ అని సూచిస్తారు. దీని గుర్తు “U”. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 4

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ఇ) కింది పదాలకు గురులఘువులు గుర్తించండి.
చిక్కని
పాలపై
ధనము
చెందిన
పాకము
పంచదార
మూర్ఖులు
అందం
పుణ్యముల్
నమోనమః
రైతులు
గౌరీపతి
జవాబు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 5

గణాలు : గణం అంటే మాత్రల సముదాయం. అంటే గురు లఘువుల సమూహం. ఈ గణాలలో ఏక అక్షర (ఒకే అక్షరం) గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి.

ఏక (ఒకే) అక్షర గణాలు. ఆ ఒకే అక్షరం లఘువు అయితే ” అనీ, గురువు అయితే ‘U’ అనీ గుర్తు ఉంటుంది.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 6

రెండు అక్షరాల గణాలు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 7

రెండు అక్షరాల గణాలు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 8

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ఈ కింది పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేసిన తీరు చూడండి.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 10

ఉత్పలమాల:

ఛందస్సులో గణవిభజన తెలుసుకున్నారు కదా! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 9

పై పాదాల్లో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలున్నాయి.
10వ అక్షరానికి (లె-రీ); (యు-చుం); అనే అక్షరాలకు యతి చెల్లింది.
పై పాదాలలో ప్రాసగా క్క-క్కి-అనే హల్లు వచ్చింది.
పై పాదాల్లో 20 అక్షరాలున్నాయి.
పై పద్య పాదాలు “ఉత్పలమాల” వృత్త పద్యానివి.

నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్త పద్యం అంటారు.
పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. యతి అక్షరానికి అదే అక్షరంగానీ, వర్ణమైత్రి కలిగిన మరో అక్షరంగానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని ‘యతి నియమం’ అంటారు.
పద్య పాదాలలో రెండవ అక్షరానికి ప్రాస అని పేరు. పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాస” నియమం అంటారు.

పై ఉదాహరణ ననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.

  1. ఇది వృత్త పద్యం.
  2. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో వరుసగా భ ర న భ భ ర వ అనే గణాలు వస్తాయి.
  4.  ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థానం.
  5. ప్రాస నియమం వుంటుంది.
  6. ప్రతి పాదంలోను 20 అక్షరాలుంటాయి.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

చంపకమాల:

ఈ కింది పద్య పాదాలను పరిశీలించండి.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 11

పై పద్యపాదాలలోని గణాలను పరిశీలిస్తే ప్రతి పాదంలోను న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇట్లా ప్రతిపాదంలోను పై గణాలు రావడం చంపకమాల పద్య లక్షణం. పై పద్యపాదాల్లో ‘అ’కు ‘ఆ’తో, ‘బు’ కు ‘పు’తో యతిమైత్రి చెల్లింది. ప్రాసగా ని – న అనే హల్లులు ఉన్నవి. పై పాదాల్లో 21 అక్షరాలున్నాయి.

  1. ఇది వృత్త పద్యం.
  2. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో వరుసగా న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు వస్తాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
  5. ప్రాస నియమం వుంటుంది.
  6. ప్రతి పాదంలోను 21 అక్షరాలుంటాయి.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

అలంకారాలు:

కింది దానిని చదువండి.

ఇల్లు, మనిషి, పెళ్ళి మంటపం, ఫంక్షన్లు, వాహనం ఏదైనాసరే అందంగా కనిపించాలంటే వివిధరకాలుగా అలంకరణ చేస్తాం. అప్పుడే ఆ వస్తువు అందం కనిపిస్తుంది. అట్లనే పద్యాలలో, కవితల్లో కూడా వినసొంపుగా ఉండడానికి అలంకారం ఉంటుంది.

ఇది మనబడి
అక్షరాల బడి
సరస్వతి దేవి ఒడి
మనకు నేర్పును నడబడి
పోదాం పద వడివడి

పై కవితలో ‘డి’ అనే అక్షరం అనేక సార్లు రావడం వల్ల కవిత అందంగా, వినసొంపుగా ఉన్నది కదా! ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారం. అర్థం వల్ల అందం కలిగితే అర్థాలంకారం అవుతుంది. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి తెలుసుకుందాం.

కింది వాక్యాలు పరిశీలించండి.
అ) గడ గడ వడకుచు తడబడి జారిపడెను.
రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది ?
పై వాక్యాల్లో వరుసగా ‘డ’, ‘త్త’ అనే అక్షరాలు అనేకసార్లు వచ్చాయి కదా! ఇట్లా ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని ‘వృత్త్యను ప్రాస’ అలంకారం అంటారు.

ఉపమాలంకారం:

కింది వాక్యాలను చదువండి. తేడా చెప్పండి.

ఆమె ముఖం అందంగా ఉన్నది.
ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.

పై వాక్యాల్లోని తేడాను చూస్తే ‘ఆమె ముఖం అందంగా ఉన్నది’ అనే పదానికి బదులు ‘ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది’ అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది కదా! ఇట్లా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్నే ‘ఉపమాలంకారం’ అంటాం. పై వాక్యాన్ని బట్టి చూస్తే ఉపమాలంకారంలో నాలుగు అంశాలను గమనించవచ్చు. అవి :

  1. ఉపమేయం : దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం ఉపమేయం)
  2. ఉపమానం : దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం ఉపమానం)
  3. సమానధర్మం : ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం (అందంగా ఉండడం – సమానధర్మం)
  4. ఉపమావాచకం : పోలికను తెలిపే పదం. (వలె – ఉపమావాచకం)
    “ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.”

ఉత్ప్రేక్షాలంకారం:

కింది వాక్యం చదువండి.

“ఈ మేఘాలు గున్న ఏనుగులా! అన్నట్టు ఉన్నాయి.”
దేన్ని దేనితో పోల్చారు ?
పై వాక్యంలో కనిపిస్తున్న పోలిక ఊహించి చెప్పబడింది. పై వాక్యంలో
ఉపమేయం : మేఘాలు
ఉపమానం : గున్న ఏనుగులు
అంటే మేఘాలను ఏనుగు పిల్లలవలె ఊహిస్తున్నామన్నమాట- దీనిని బట్టి పోలికను ఊహించి చెబితే అది “ఉత్ప్రేక్ష” అలంకారం.

TS 8th Class Telugu Grammar లేఖలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download వ్యాసాలు Questions and Answers.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 1.
మీ పాఠశాలలో మాతృభాషా దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకున్నారో తెలియజేస్తూ, మాతృభాష ప్రాముఖ్యత – ప్రయోజనాలు వివరిస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

జనగామ,
ది. XX.XX.XXXX.

మిత్రుడు మదన్కు !

మీ పాఠశాలలో మాతృభాషా దినోత్సవం జరుపుకున్నట్లు రాశావు.

మా పాఠశాలలో కూడా ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం జరుపుకున్నాము. ఆ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యగారు మాతృభాష గొప్పదనం గూర్చి చాలా చక్కగా మాట్లాడారు.

తల్లిపాలు తాగి పెరిగిన బిడ్డకు, పోతపాలు తాగి పెరిగిన బిడ్డకు ఎంత తేడా ఉంటుందో, మాతృభాషలో విద్య నేర్చుకుంటున్నవారికీ, ఇతర భాషలో విద్య నేర్చుకుంటున్నవారికీ అంతే తేడా ఉంటుంది.

మాతృభాష అంటే చిన్నప్పటినుండి మన పెద్దలనుండి, మన పరిసరాలనుండి నేర్చుకునే భాష. నేర్చుకుంటున్నాము అనే విషయం కూడా తెలియకుండా నేర్చుకునే భాష, అలవడే భాష. మాతృభాషలో ఉండే నుడికారాలు, జాతీయాలు తేలికగా పట్టుబడతాయి. వాటిని సందర్భానుసారంగా ఉపయోగిస్తూ, నలుగురినీ మెప్పించవచ్చు. అదే పరాయి భాష అయితే అంత తేలికగా నుడికారాలు, జాతీయాలు పట్టుబడవు. అవి పట్టుబడినట్లు అనిపించినా, మాతృభాషలోని పదాలు ఉపయోగించినంత సహజంగా వాటిని ఉపయోగించలేము.

నేడు ఆంగ్లభాషను నేర్చుకున్నవారు, అందులో చదువుకుంటున్నవారు, ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు గొప్ప అనీ, మాతృభాషలో మాట్లాడేవాడు తక్కువ అనే న్యూనతాభావం పెరిగిపోతోంది. ఇది సరైందికాదు. ఏ విషయాన్నయినా మాతృభాషలో చెపితే, అర్థం చేసుకోవడం తేలిక. మాతృభాషలో పట్టు చిక్కాక, ఇతర భాషలను నేర్చుకోవడం తేలిక. మాతృభాష పునాది వంటిది. పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తుల భవనాన్నయినా కట్టవచ్చు. మాతృభాష బాగా నేర్చుకుంటే ఇతర భాషలెన్నయినా నేర్చుకోవచ్చు.

నీ అభిప్రాయాలు రాయకోత్తూ

ఇట్లు
మీ మిత్రుడు
హరి గోవింద్

చిరునామా :
G. మదన్,
C/o G. వెంకటశేఖర్,
దీనదయాళ్ పురం,
పర్కాల,
వరంగల్ జిల్లా.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 2.
వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రాలను ఇప్పించవలసినదిగా కోరుతూ ప్రధానోపాధ్యాయునకు లేఖ రాయండి.
జవాబు.

కాజీపేట,
ది. XX.XX.XXXX.

గౌ. ప్రధానోపాధ్యాయుల వారికి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
కాజీపేట.

నమస్కారాలు. నేను మన పాఠశాలలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారు ప్రభుత్వోద్యోగి. వారికి ఈ వూరు నుండి నల్గొండకు బదిలీ అయినది. మేము ఒక వారం రోజుల్లో అక్కడికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి నేను అక్కడ పాఠశాలలో చేరేందుకు వీలుగా నా వ్యక్తిత్వ, విద్యా, బదిలీ సర్టిఫికెట్లను ఇప్పించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. వీలైనంత త్వరగా ఇప్పించిన యెడల తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయించమని విన్నవిస్తూ ……

మీ విధేయ విద్యార్థి
బి. రాజేష్,
8వ తరగతి.

చిరునామా :
ప్రధానోపాధ్యాయులు,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, కాజీపేట.

ప్రశ్న 3.
రక్తదానం అవసరాన్ని తెలియజేస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు.

దేవరకొండ,
ది. XX.XX.XXXX.

ప్రియమైన మిత్రునకు,

నీ మిత్రుడు రాంబాబు వ్రాయునది. ఒక ముఖ్యవిషయం గురించి తెలియజేస్తున్నాను. రక్తం యొక్క ఉపయోగాలు నీకు కూడా తెలుసుగదా ! రోగులకు రక్తం ప్రాణదాత. అనారోగ్యవంతునకు శరీరంలో రక్తం తగ్గిపోతోంది. ఆపరేషన్ల సమయంలో రోగి చాలా రక్తాన్ని కోల్పోతాడు. ఆ సమయంలో శరీరంలోకి పంపేందుకు రక్తం చాలా అవసరం. ఎవరో ఒకరు రక్తాన్ని దానం చేస్తేనే రోగి మరల బ్రతుకుతాడు. అంటే రక్తదానం చాలా గొప్పది. ఒక జీవికి ప్రాణం పోస్తుంది.

ప్రతి మనిషి జీవితంలో ఒకసారైనా రక్తదానం చేయడం అవసరం అని పెద్దలు చెబుతారు. రెడ్ క్రాస్ సంస్థ కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరించి ఉంచి, అవసరమైన రోగులకు ఉపయోగిస్తున్నాయి. విద్యార్థులమైన మనం ఈ విషయాల్ని తెలుసుకొని, ఆచరించాలని నీకు వ్రాస్తున్నాను. పరీక్షలు కాగానే సెలవులకు ఇక్కడకు రాగలవు.

నీ మిత్రుడు,
రాంబాబు

చిరునామా :
ఎ. జగదీష్ కుమార్,
8వతరగతి,
వివేకానంద మెమోరియల్ హైస్కూల్,
చిట్యాల,
నల్గొండ (జిల్లా).

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 4.
మీ పాఠశాలలో ‘గ్రంథాలయ వసతి’ కల్పించమని కోరుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు.

తాడిమళ్ళ,
ది. XX, XX, XXXX.

గ్రంథాలయాధికారి గారికి,
గ్రంథాలయాల కార్యాలయం,
కరీంనగర్.

ఆర్యా,

నేను తాడిమళ్ళ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదువుతున్నాను. మా పాఠ్యపుస్తకాలలోని పాఠాలకు సంబంధించి ఉపాధ్యాయులు చెప్పిన విషయాలేకాక అదనంగా సమాచారం సేకరించవలసి వస్తోంది. మా పాఠశాలలో గ్రంథాలయం లేదు. మా ఊళ్ళో ఉన్న గ్రంథాలయానికి వెళ్ళేందుకు వారి పనివేళలు మాకు అనుకూలంగా లేవు.

అందువలన దయచేసి మా పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడేలా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయించవలసిందిగా మనవి చేస్తున్నాను. గ్రంథాలయానికి దినపత్రికలు కూడా వచ్చే ఏర్పాటు చేస్తే మాకు ప్రతిరోజూ వార్తా విశేషాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుని తగిన ఏర్పాట్లు చేయించవలసిందిగా మరొక్కమారు విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇట్లు,
విధేయుడు,
బి. గోపాల్.
పదవ తరగతి
ప్రభుత్వ పాఠశాల, తాడిమళ్ళ.

ప్రశ్న 5.
మీ పాఠశాలలో జరిగిన గురుపూజోత్సవం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

బీబీనగర్,
ది. XX.XX.XXXX.

ప్రియ మిత్రుడు ఆనందు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవ దినంగా ప్రకటించింది కదా ! ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు డా॥ రాధాకృష్ణ గారి జీవిత విషయాలను మాకు తెలిపారు. మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరిని ఆ రోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాము. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు
నీ మిత్రుడు,
హరి.

చిరునామా :
ఎస్. ఆనంద్,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
భువనగిరి,
నల్గొండ జిల్లా.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 6.
‘కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణం’ గురించి సోదరికి లేఖ రాయండి.
జవాబు.

హైదరాబాద్,
ది. XX.XX.XXXX.

ప్రియమైన సోదరి లక్ష్మికి రాయు జాబు,

ఉభయకుశలోపరి. నేను బాగానే చదువుకుంటున్నాను. నువ్వు ఎలా చదువుకుంటున్నావు ? నీ ఉత్తరం అందింది. మన పల్లెటూరిలో కనిపించే ప్రకృతి అందాలు నగరాలలో మచ్చుకైనా కనబడవు.

పొద్దస్తమానం రోడ్లవెంట తిరిగే రకరకాల వాహనాలు కలిగించే రణగొణధ్వనులకు చెవులు చిల్లులు పడతాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మేం కళాశాలకు వెళ్ళేటప్పుడు ఈ రొద విపరీతంగా ఉంటుంది.

అంతేకాక పరిశ్రమల పొగ గొట్టాలనుంచి, వాహనాల నుంచి వెలువడే పొగలు ఊపిరి ఆడనీయక ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇంకా ఇళ్లనుంచి వెలువడే వ్యర్థాలు, పరిశ్రమల వ్యర్థాలు, రోగకారక వ్యర్థరసాయనాలు మొదలైన వాటితో నిండి కాలువలు, చెరువులు, నదులు కలుషితమైపోయి చూడడానికే భయం గొలుపుతాయి.

ఈ విధంగా హెూరెత్తించే శబ్దాలు, కలుషితమైన గాలి, నీరుల వల్ల నగర వాతావరణం జీవించడానికి దుర్భరంగా తయారవుతున్నది. ఈ కాలుష్య నియంత్రణకు ఇప్పటినుండే చర్యలు చేపట్టకపోతే రాబోవు కాలంలో ఇక్కడ జీవనం దుర్లభమయ్యే ప్రమాదం ఉన్నది. మన ఊరి విశేషాలతో వెంటనే జవాబు రాయగలవు. ఇంతే సంగతులు, చిత్తగించవలెను.

ఇట్లు
నీ సోదరి,
పార్వతి.

చిరునామా
లీలావతుల లక్ష్మి,
D/o భాస్కరాచార్యులు,
మహాలక్ష్మీ గుడి వీధి,
యడవల్లి గ్రామం,
కరీంనగర్ జిల్లా.

ప్రశ్న 7.
చూసిన యాత్రాస్థలమును వివరిస్తూ, ఇతర ప్రాంతములో చదువుతున్న నీ సోదరికొక లేఖ వ్రాయుము.
జవాబు.

సూర్యాపేట,
ది. XX.XX.XXXX.

ప్రియమైన సోదరికి,

నీ అన్నయ్య వ్రాయునది. సంక్రాంతి సెలవులకు మా పాఠశాల ఉపాధ్యాయులు మమ్మల్ని విహారయాత్రలకు తీసుకొని వెళ్ళారు. మన రాష్ట్రంలో విహారయాత్రకు స్థలంగా పేరుపొందిన నాగార్జున సాగరు వెళ్ళాము. పూర్వము బౌద్ధపండితుడైన నాగార్జునుడు ఇక్కడే నివసించాడట. ఈయన తత్త్వవేత్తయేగాక, ఆయుర్వేద పండితుడు కూడా. కృష్ణానదిపై ఇక్కడ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టబడింది. రెండు కొండల మధ్య ఇది నిర్మించబడినది. ఆనకట్ట వెనుక సరోవరం కలదు.

సరోవరం నీటిలో చారిత్రక శిథిలాలు మునిగిపోకుండా వాటిని కొండపై నిర్మించిన మ్యూజియంలో ప్రభుత్వం భద్రపరిచింది. మ్యూజియంలో అనేక పాలరాతి శిల్పాలు, బౌద్ధవిగ్రహాలు, పనిముట్లు మొదలైనవి చాలా చూశాము. చుట్టూ గల ప్రకృతి దృశ్యాలు కూడా రమణీయంగా ఉన్నాయి. మా ఉపాధ్యాయులు అన్ని వివరాలు తెలియజేశారు. ప్రకృతి దృశ్యాలు – చారిత్రక ప్రసిద్ధి గల స్థలాలన్నీ నీవు కూడా తప్పక చూడాలని కోరుతున్నాను. అమ్మానాన్నలకు నా నమస్కారాలు చెప్పగలవు.

ఇట్లు
నీ ప్రియమైన అన్నయ్య,
కె. గంగాధర్.

చిరునామా :
కె. సుజాత,
8వ తరగతి,
రామకృష్ణ మెమోరియల్ హైస్కూల్,
కోదాడ.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 8.
పుస్తక విక్రేతకు లేఖ.
జవాబు.

తిమ్మారెడ్డిపల్లె,
ది. XX.XX.XXXX.

గౌరవనీయులైన మేనేజరు గార్కి,
శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్,

ఆర్యా!
మీరు ప్రచురించిన గ్రంథాలు విద్యార్థులకు విజయసోపానాలుగా ఉపయోగపడుతున్నవనడంలో సందేహం లేదు. కనుక మాకు అవసరమైన గ్రంథములను మీరు వి.పి.పి. ద్వారా పంపించినచో మేము డబ్బు చెల్లించి తీసుకొనగలము. ప్రస్తుతం రూ. 200/-లు అడ్వాన్సుగా మనియార్డరు ద్వారా పంపుతున్నాము. కనుక వెంటనే ఈ క్రింద తెలియచేసిన గ్రంథములను పంపించగలరు.
1. వ్యాససుధ 10 కాపీలు.
2. ఇంగ్లీషు – హిందీ – తెలుగు నిఘంటువు 5 కాపీలు.
3. 8వ తరగతి తెలుగు క్వశ్చన్ బ్యాంక్ 5 కాపీలు.

ఇట్లు
తమ విశ్వాసపాత్రుడు,
పి. భగవాన్ తిమ్మారెడ్డిపల్లె,
మెదక్ జిల్లా.

చిరునామా
మేనేజరుగారికి,
శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్,
హైదరాబాద్.

ప్రశ్న 9.
ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లె గొప్పదనాన్ని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

భైంసా,
ది. XX.XX.XXXX.

ప్రియమిత్రుడు గోపీ,

నేనిక్కడ బాగా చదువుకుంటున్నాను. నీ చదువెట్లా సాగుతోంది. బాగానే చదువుతున్నావనుకుంటాను. ఈ మధ్యే బోయి భీమన్న గారు రాసిన జానపదుని జాబు పుస్తకం చదవడం జరిగింది.

పచ్చని వరి చేలు, ఆ చేలకు నీరు అందించే కాలువలు, చల్లని గాలులు, పచ్చని చెట్లు వీటన్నింటితో పల్లెటూరి వాతావరణం ఎంతో బావుంటుంది. చల్లనిగాలికి జోరుమంటూ పైరుచేలు ఎంతో ఆనందాన్ని కూరుస్తాయి. నీటి బోదెలు, ఆ బోదెలుకు తీసే పిల్లబోదెలు, ఆ మట్టి వాసన మనసును ఆకర్షిస్తాయి.

అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యపరచేది ఆ పల్లె మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు. కులం, మతం పట్టింపు లేకుండా ఒకర్నొకరు బాబాయి, మామయ్య, అబ్బాయి, ఆయా, అమ్మా, అత్తమ్మ, అక్క, తమ్ముడు, బావా వంటి పిలుపులతో పలకరించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ ఇంట్లో ఏ పెండ్లీ, పేరంటం జరిగినా, అది ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని వేడుకగానే భావించడం, బాధ్యత పంచుకోవడం ఆనందించాల్సిన విషయం.

నీ అభిప్రాయాలు తెలియచేయకోరతాను.

ఇట్లు
నీ ప్రియమిత్రుడు
భగవాన్

చిరునామా :
బొబ్బా గోపీ
C/o. బొబ్బా రమణరావు,
సాలెవీధి,
చిట్యాల,
నల్గొండ జిల్లా.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 10.
నేత్రదానం చేయవలసిందిగా అందరిని ప్రోత్సహిస్తూ పత్రికలో ప్రచురించ వలసిందిగా సంపాదకునికి లేఖ.
జవాబు.

కాచిగూడ,
ది. XX.XX.XXXX,

గౌరవనీయులైన ‘వార్త’,
ప్రధాన సంపాదకుల వారికి,

ఆర్యా!
“సర్వేంద్రియాణాం నయం ప్రధానమ్” అన్న సూక్తి అందరికీ తెలిసిందే. మానవునికి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కళ్ళు కనిపించకపోతే అతని జీవితం అంధకార బంధురమవుతుంది. కనుక మిగిలిన అన్ని అవయవాల కంటే కళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

మనిషి మరణించిన కొన్ని గంటలలోపు అతని కన్నులను అతని శరీరం నుండి వేరు చేసి వేరొకరికి వాటిని అమర్చుట ద్వారా వారికి చూపు తెప్పించవచ్చునని, ఆ కళ్ళు మరల చక్కగా పనిచేయునని నేటి విజ్ఞాన శాస్త్రం నిరూపించింది. కనుక ప్రతి వ్యక్తి నేత్రదానం చేయుటకు ముందుకు రావాలి.

నేత్రదానాన్ని చేయవలసిందిగా ప్రజలను ప్రోత్సహిస్తూ నేను రాసిన ఈ లేఖను మీ పత్రికలో ప్రచురించుట ద్వారా అందరికీ తెలియజేయవలసినదిగా నా మనవి.

ఇట్లు
S.M. పూర్ణ,
కామకోటినగర్,
కాచిగూడ.

చిరునామా
ప్రధాన సంపాదకులు,
వార్త దినపత్రిక,
హైదరాబాద్.

ప్రశ్న 11.
కంప్యూటర్ విద్య ఆవశ్యకాన్ని వివరిస్తూ నీ మిత్రునికొక లేఖ వ్రాయుము.
జవాబు.

పరకాల,
ది. XX, XX, XXXX.

మిత్రుడు రమణకు,
ఉభయకుశలోపరి. నేను పరీక్షలు బాగానే వ్రాస్తున్నాను, పరీక్షలు పూర్తికాగానే కంప్యూటర్ కోర్సులో చేరుతాను. ఎందుకంటే నేడు కంప్యూటర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఉంది, అక్కడ లేదు అనే సందేహమే లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమౌతూ, ఇరవై ఒకటో శతాబ్దాన్ని కంప్యూటర్ శాసిస్తోంది. మన నిత్యజీవితంలోని ప్రతి విషయంపై కంప్యూటర్ ప్రభావముంటుంది. సమాచార విప్లవానికి ఈ కంప్యూటర్ ద్వారాలు తెరిచింది. ప్రస్తుతం కంప్యూటర్పై అవగాహన లేనిదే సమర్థవంతంగా రాణించలేం.

వస్తున్న మార్పులను ఆకళించుకొని ముందుకు పోవాలంటే కంప్యూటర్ విద్య తప్పనిసరి. అందుచే అన్ని విధాలుగా నేను ఆలోచించి గుర్తింపు పొందిన కంప్యూటర్ కోర్సులో చేరాలనుకుంటున్నాను. నీవు కూడా కంప్యూటర్ విద్యను అభ్యసించి భవిష్యత్తుకు మంచి పునాదిని వేసుకొనగలవని ఆశిస్తున్నాను.

ఇట్లు
నీ మిత్రుడు,
రఘునాథ్.

చిరునామా :
సాకేటి వెంకట రమణ,
10వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మహబూబాబాద్,
వరంగల్ జిల్లా.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 12.
పారిశుధ్య సమస్యను గురించి పురపాలక సంఘ ఆరోగ్య శాఖాధికారి గారికి లేఖ.
జవాబు.

సూర్యాపేట,
ది. XX.XX.XXXX.

ఆరోగ్య శాఖాధికారి గారికి,
పురపాలక సంఘ కార్యాలయం,
సూర్యాపేట.

అయ్యా!
మాది రజక వీధి. మా ఇంటి పరిసరాలలో ఎక్కడా పురపాలక సంఘంవారు చెత్తకుండీలను ఏర్పాటు చేయలేదు. అందుచే ఇక్కడివారు తమ ఇండ్లలోని చెత్తను తెచ్చి వీథుల్లో పారవేస్తున్నారు. ఆ చెత్త అంతా గాలికి రోడ్లమీదికి, ఇండ్లలోనికి వచ్చి చేరుతున్నది. కుక్కలు, పందులు, చెత్తకుప్పలను కదల్చి రోడ్డంతా చెత్తతో నిండేట్లుగా చేస్తున్నాయి. ఇక వాన కురిస్తే పరిస్థితి భరించలేని విధంగా ఉంటున్నది. రాత్రిపూట దోమలు విపరీతంగా ప్రజలను బాధిస్తున్నాయి.

వాటివలన మలేరియా వంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉన్నది. కనుక మీరు వెంటనే శ్రద్ధ తీసుకొని తగిన సిబ్బంది నేర్పాటుచేసి రోడ్లను శుభ్రపరచండి. రోడ్డుపై రెండు చివరలందు రెండు చెత్తకుండీలను ఏర్పాటు చేయండి. దోమల మందు చల్లించండని కోరుతున్నాను.

ఇట్లు
తమ విధేయురాలు,
అంజలి బొబ్బా.

చిరునామా :
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
సూర్యాపేట.

ప్రశ్న 13.
మాతృభాషా ప్రయోజనాలను వివరిస్తూ మిత్రునికి లేఖ వ్రాయుము.
జవాబు.

నకిరేకల్,
ది. XX.XX.XXXX.

ప్రియమైన మిత్రుడు సోమరాజుకు,
ఉభయకుశలోపరి. ఇటీవల మన ప్రభుత్వం “తెలుగువారమందరం – తెలుగే మాట్లాడదాం” అనే నినాదం ఇచ్చింది. అది చూసి చాలా ఆనందం కలిగింది. జనని, జన్మభూమిలాగే మాతృభాష కూడ ఎంతో గొప్పది. మన మాతృభాష తెలుగును గురించి తేటతేటతెలుగనీ, తేనెలొలుకు తెలుగనీ ఎంతోమంది ఎన్నోరకాల కీర్తించారు. మమ్మీ, డాడీ ఆనండంలో కంటె అమ్మా – నాన్న అనడంలో ఉన్న ఆనందం మనకు తెలియంది కాదు. మాతృభాషలో ఎవరేం చెప్పినా, ఏం చదివినా వెంటనే అర్థమై, బాగా గుర్తుండిపోతాయి. ఎవరైనా సరే మాతృభాషలో భావగ్రహణ, భావవ్యక్తీకరణ చేసినంత చక్కగా మరే భాషలోనూ చేయలేరు.

ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. మన భాషమీద మనకి గౌరవం ఉంటేనే ఇతర భాషల వారూ మనభాషని గౌరవిస్తారు. అందుకు గుర్తుగా ఈ రోజునే మా పాఠశాలలో మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకున్నాం. అందుకే ఎన్ని భాషలైనా నేర్చుకుందాం – తెలుగులోనే మాట్లాడదాం. మన మాతృభాషపై నీ అభిప్రాయాలు తెలుపుతూ లేఖవ్రాయి. మీ తల్లిదండ్రులకు నా నమస్కారాలని చెప్పు.

ఇట్లు
నీ ప్రియమైన మిత్రుడు,
రమేష్.

చిరునామా :
కె. సోమరాజు,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
చిట్యాల,
నల్గొండ జిల్లా.

TS 8th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 14.
నీవు చదివిన ఒక మంచి పుస్తకాన్ని గురించి, నీ స్నేహితునికి లేఖ రాయుము.
జవాబు.

ఆదిలాబాద్,
ది. XX.XX.XXXX.

ప్రియమైన మిత్రుడు రవికి నీ స్నేహితుడు వ్రాయునది,
ఉభయకుశలోపరి, ఇటీవల మా పాఠశాలలోని గ్రంథాలయమున “నీతి చంద్రిక” అనే పుస్తకాన్ని చూసి తీసుకొని సంపూర్ణంగా చదివాను. నాకా పుస్తకము చాలా నచ్చింది. పరవస్తు చిన్నయసూరి గారిచే రచింపబడిన ఆ గ్రంథములో నీతికథలు సులభశైలిలో పఠనాసక్తిని కలిగిస్తాయి. అందలి పాత్రలన్నియు జంతువులు, పక్షులయినను మానవ స్వభావాలను తెల్పుతాయి. రాజకుమారులను విజ్ఞానవంతులుగా చేయటానికి విష్ణుశర్మ అను పండితుడా కథలను చెప్పాడు. నీతిచంద్రికను ఆమూలాగ్రంగా చదివిన విద్యార్థి నీతిమంతుడై విజ్ఞానాభివృద్ధిని పొందుతాడనడంలో అతిశయోక్తి లేదు. నువ్వుకూడా ఓసారి ఆ గ్రంథమును సంపాదించి చదువు.

ఇట్లు
నీ మిత్రుడు,
సంతోష్.

చిరునామా :
కె. రవి,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
బెల్లంపల్లి.
పిన్ : ……………..

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download వ్యాసాలు Questions and Answers.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 1.
‘మాతృభాష ప్రాముఖ్యం’ ను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
తల్లి నుండి బిడ్డ నేర్చుకొనెడి భాషే మాతృభాష, తల్లిఒడిలోని శిశువు మాతృస్తన్యముతో పాటే మాతృభాషామృతాన్ని కూడా పానం చేస్తుంది. మానసికమైన భాషపరంపరను వ్యక్తులు పరస్పరం తెలియజేసుకోవడానికి ఉపయోగించే వాగ్రూపమైన సాధనమే భాష. బాల్యం నుండియే తెలుసుకోవడానికి అనువైనది మాతృభాష, బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోవడానికి తొలి ఆధారం మాతృభాష. అయిదేండ్ల ప్రాయం విద్యార్థికి మాతృభాషలోనే విద్యాభ్యాసం ప్రారంభించడం మన సంప్రదాయం. విద్యను బాలబాలికలు మాటలు వచ్చినది మొదలు ఏ భాషను ఉపయోగించుకొనుటకు అలవాటుపడతారో దానిలోనే నేర్చుకోవడం సులభం.

ప్రాచీన కాలము నుండి మన విజ్ఞానమంతయు సంస్కృతమునందే కలదు. మెకాలే విద్యావిధానం అమలు జరగడంతో ఆంగ్లభాష దేశంలో నిర్బంధ విద్య అయింది. అది ప్రపంచ భాష అయినందున, దాన్ని నేర్చుకోవాలనే తపన స్వదేశీయులలో కూడా పెరిగింది. ఆంగ్లభాష ప్రాబల్యం పెరిగి మాతృభాష నిర్లక్ష్యం కావడం జరిగింది. పానుగంటివారి ‘సాక్షి’ వ్యాసాలలోని “స్వభాష” అనే వ్యాసంలో జంఘాల శాస్త్రి మాతృభాష మాట్లాడలేని వారిని వ్యంగ్యంగా పరిహసించాడు. బోధన, పరిపాలన మాతృభాషలోనే జరగడం తల్లిపాలవంటిది అని, పరాయిభాషలో జరగడం పోతపాలవంటిదని 1913లో దేశభక్తి కొండా వెంకటప్పయ్యగారు అన్న మాటలు మనం జ్ఞప్తియందుంచుకోవాలి.

1947లో దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రాథమిక, మాధ్యమిక ఉన్నత స్థాయి విద్య మాతృభాషలోనే జరుపబడుచున్నది. కాని ప్రభుత్వం జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంకనూ ఆంగ్లంలోనే నడుస్తున్నవి. విశ్వవిద్యాలయ స్థాయిలో పూర్తిగా మాతృభాషా బోధన జరగడం లేదు. కారణం మాతృభాషలో విద్యాభ్యాసం చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేకపోవడమే. రష్యా వంటి పెద్ద దేశములలో భాషలనేకం ఉన్నను రష్యన్ భాషకే ప్రాధాన్యత. చైనా, జర్మన్, ఫ్రాన్సు దేశాలు ఇంగ్లీషుకు ప్రాధాన్యతనిస్తూ మాతృభాషలోనే బోధనా, పాలనలు జరుపుకొంటున్నందున అవి పురోగతిని సాధిస్తున్నాయనే సత్యాన్ని మనం గుర్తించాలి.

మాతృభాషలో భావ వ్యక్తీకరణ సులభమగును. ఎక్కువ శ్రద్ధతో నేర్చుకోవచ్చును. సంభాషణ, విషయ విశ్లేషణ చేయడం తేలిక, జ్ఞానార్జన, అవగాహన, మూర్తిమత్వ వికాసాలకు మాతృభాషా బోధన తోడ్పడుతోంది. ఆయా రాష్ట్రాల్లో మాతృభాషా విద్యాబోధన, పాలనలకు ఎక్కువ స్థానం కలిగించి, నేర్చినవారికి ఉద్యోగావకాశాలు రాష్ట్రస్థాయిలో కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది.

అధికార భాషా సంఘం, ప్రభుత్వం, విద్యాధికులు మాతృభాషలో విద్యాబోధనకు మరింతగా కృషి చేయాలి. మాతృభాషలో విద్యాబోధన చేయడం ఇంగ్లీషును నిర్బంధంగా ఒక స్థాయి వరకు నేర్పించడం చాలా అవసరం. మాతృభాషతో పాటు ఇతర భాషలను కూడా నేర్చే విద్యార్థికి సమాధానాలు వ్రాసే భాషను ఎన్నుకొనే స్వేచ్ఛను కల్పించాలి.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 2.
పరిసరాలు కాలుష్యంతో నిండిపోతున్న నేటి మనిషి జీవన విధానంలో “పర్యావరణ పరిరక్షణ” కు ఎంత ప్రాముఖ్యత ఉందో ఒక వ్యాసం రాయండి.
జవాబు.
ఉపోద్ఘాతం : భూమి, గాలి, నీరు మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. ప్రకృతిని మనిషి చాలా విధాలుగా కలుషితం చేస్తున్నాడు. పర్యావరణం అంటే పరిసరాల ‘వాతావరణం’ అని అంటారు. మన పరిసరాలు శుభ్రంగా ఉండటం వల్లనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాము. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ పరిరక్షణ అనబడుతుంది.

విషయవిశ్లేషణ : సృష్టిలో ఏ ప్రాణికైనా ప్రాణాధారమైంది నీరు. మనదాహాన్ని తీర్చడానికి, పంటలు పండించుకోవడానికి నీటిని ఉపయోగిస్తున్నాం. చెట్లు స్వచ్ఛమైన గాలినిస్తూ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తున్నాయి. అయితే రానురాను జనాభా పెరుగుదల మూలంగాను, నాగరికత మోజు వల్లను, మన చుట్టు వున్న ప్రదేశాలను మనమే పాడుచేసుకుంటున్నాము. కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు పెరిగి వాతావరణం కాలుష్యంతో నిండిపోతున్నది. ఉష్ణోగ్రత పెరిగిపోయి అనావృష్టి లేక అతివృష్టిని కల్గించేలా భయానక మార్పులు ఏర్పడుతున్నాయి. ఉన్న అడవులను నరికి వేయడం అంటే తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడం. దీనివల్ల ప్రకృతిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

పరిరక్షణ చర్యలు : పర్యావరణ పరిరక్షణకై ప్రపంచ సంస్థలు, మన ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకునే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. ఇంటిలోని చెత్తను ఇంటి ముందు పారవేయకుండా, వీధి చివర కుండీ ఏర్పాటు చేసుకొని అందులో పారవేయాలి. నీటి కుళాయిల వద్ద, మురికి కాల్వల వద్ద చెత్తా చెదారం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మలేరియా, టైఫాయిడ్, రోగకారకమైన దోమలు విజృంభించకుండా డి.డి.టి వంటి మందులు చల్లుకోవాలి. మురికివాడలకు శుభ్రత గూర్చి తెలియజేయాలి.

ప్రజలను చైతన్య పరచాలి. ప్రతి ఇంటి దగ్గర చెట్లను నాటాలి, ఇంకుడు గుంతలు ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. పరిశుభ్రతతోనే మనందరి ఆరోగ్యం, అభివృద్ధి ఉందని ప్రతి ఒక్కరు గ్రహించాలి. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి. వాటి వాడకం వల్ల ప్రజలకు జరిగే నష్టాలను వారికి వివరించాలి. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవంగా పాటింపచేయాలి. పర్యావరణ పరిరక్షణలో అందరు భాగస్వాములు కావాలి.

ప్రశ్న 3.
‘చలనచిత్రాలు – సమాజంపై వాటి ప్రభావం’ గురించి వ్యాసం రాయండి.
జవాబు.
పరిచయం : సగటు మనిషి ఆశలను, ఊహలను ప్రభావితం చేసే శక్తిమంతమైన ఆధునిక మాధ్యమం చలన చిత్రం. కష్టజీవులు కాయకష్టాన్ని మరచిపోవడానికి ప్రాచీన కాలంలో సృష్టించుకున్న ఆటపాటలతో కూడిన తోలుబొమ్మలాటలవంటి కళారూపాలే యక్షగానాలుగా, నాటకాలుగా, సినిమాలుగా పరిణతి చెందాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దివ్యలోకాలను, నవ్యభావాలను కళ్ళకు కడుతున్న చలన చిత్రాలు సమాజంపై కలిగించే ప్రభావం అంతా ఇంతా కాదు.

వినోదదాయకాలు : ప్రతిరోజు తమ దినచర్యలతో తలమునకలయ్యే సగటు మనిషికి విశ్రాంతిని, వినోదాన్ని అందించే సాధనంగా చలనచిత్రాలు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా రెక్కాడితేగానీ డొక్కాడని నగర జీవులకూ, విలాసవంత జీవితాన్ని గడిపేవారికీ కూడా అందుబాటులో ఉండి వినోదాన్నందించే కళారూపం చలనచిత్రం.

విజ్ఞానదాయకాలు : పండితుల నుంచి పామరుల వరకు కోట్లాది మందిని ఆకర్షించే ఈ కళారూపం విజ్ఞానాన్ని అందించే మాధ్యమాలలో కూడా ముందంజలో ఉన్నది. సామాన్యులకు కొరుకుడుపడని శాస్త్రీయ అంశాలను సైతం ఆసాంతం కట్టిపడేసే కల్పనా చాతుర్యంతో సులభంగా అర్థమయ్యేట్లు చెప్పగలిగే ఏకైక మాధ్యమం సినిమా. దుష్ప్రభావాలు : చలనచిత్ర మాధ్యమానికి వినోదాన్ని, విజ్ఞానాన్ని కలిగించడం ఒక పార్శ్వమైతే దానివల్ల సమాజంపై పడే దుష్ప్రభావాలు రెండవ పార్శ్వం. మితిమీరిన కల్పనలు, హద్దు మీరిన హింసాప్రవృత్తి, విశృంఖలత్వం, విచక్షణలేని సన్నివేశాలు, బాధ్యతలేని కళాకారులు, కేవలం వ్యాపార ధోరణి మొదలైన అంశాల వల్ల సమాజంలో ముఖ్యంగా యువతీ యువకులలో కలిగే చెడ్డ అలవాట్లు చెప్పలేనన్ని.

ముగింపు : ఏ కళారూపమైనా సామాజిక బాధ్యతను విస్మరిస్తే దాని వల్ల సమాజానికి కలిగే మేలు కంటే కీడే ఎక్కువ. అది తోలుబొమ్మలాటైనా, డిజిటల్ సినిమా అయినా లక్ష్యాత్మకంగా ఉంటేనే సమాజానికి మేలు.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 4.
‘బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న బాధ్యతను గురించి వ్యాసం రాయండి.
జవాబు.
ఉపోద్ఘాతం : ఐదు నుండి పద్నాలుగేళ్ళలోపు వయసు వారిని బాలలు అంటారు. చదువుకుంటూ, ఆడుకుంటూ గడపాల్సిన పిల్లలు కార్మికులుగా మారటమే బాల కార్మిక సమస్య.

బాలల బ్రతుకులు : అసలు చిన్నపిల్లల్లో అంతమంది కార్మికులుగా ఎందుకు మారుతున్నారన్న విషయాన్ని పరిశీలించాల్సి వుంది. గ్రామీణ ప్రాంతాల్లో తమ పొట్టలను నింపుకోడానికి నిరేపేద కుటుంబాలవారు తమ పిల్లలను వ్యవసాయ కూలీలుగా మారుస్తున్నారు. పసిప్రాయంలోనే పల్లెల నుండి పట్టణాలకు ఇంటి పనివాళ్ళుగా వెళ్తున్నారు. విధి లేక స్వీట్ షాపులలో, బీడీ కంపెనీలలో తక్కువ జీతానికే పని చేస్తున్నారు.

ఆ పిల్లలు ఆయా సంస్థల్లో ఉదయం ఆరు గంటలనుండి రాత్రి 10 గంటల వరకు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటారు. ఇలా వాళ్ళ బ్రతుకులు ఆటపాటలకు దూరమై రాను రాను మరీ దుర్భరమౌతున్నాయి. ఈ డబ్బును అనుభవిస్తున్న తల్లిదండ్రులు తాము ఎంతటి ఘోరానికి పాల్పడుతున్నామో తెలుసుకోలేకపోతున్నారు.

ప్రభుత్వ – ప్రజల కర్తవ్యం : సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయకులు బాలకార్మిక వ్యవస్థను దారుణమని ఉపన్యసిస్తున్నప్పటికీ దానికి మూలకారణాన్ని తెలుసుకునేందుకు, తెలిసినా నిర్మూలించేందుకు ఆసక్తిని చూపించడంలేదు. ఇకనైనా ప్రభుత్వం, ప్రజలు చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ మహెూద్యమాన్ని విజయవంతం చేయాలి. బాలకార్మిక వ్యవస్థ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సామాజిక విద్యా కార్యక్రమాలను అమలుచేయాలి. కుటుంబ నియంత్రణ ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. కుటుంబ నియంత్రణ విషయంలో భారత్ చైనా మాదిరిగా కఠినంగా వ్యవహరించాలి. భారతీయులందరూ మతంతో సంబంధం లేకుండా, ఒకే బిడ్డను కలిగియుండేలా నిబంధనలు విధించి అమలుచేయాలి.

జనాభాను నియంత్రించనంతవరకు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అవి ఫలవంతం కావు. ప్రజలు కూడా తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు కృషి చేయాలి. తమ సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లల భవిష్యత్తును బలి చేయడం మానుకోవాలి. కుటుంబ భారం వారిపై పడకుండా చూసుకోవాలి. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే బాలల జీవితాల్లో వెలుగు రేఖల్ని సమీప భవిష్యత్తులోనే చూడగలుగుతాం. ఇది మన కర్తవ్యంగా భావించాలి. లక్ష్య సాధనలో భాగంగా ప్రతి సంవత్సరం ఏప్రియల్ 30న బాలకార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ప్రశ్న 5.
మన సంస్కృతి గొప్పదనాన్ని చెప్పే అంశాల్ని విశ్లేషిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
ఒక జాతికాని, ఒక దేశం కాని తనదైన వైలక్షణ్యంతో భౌతికంగాను, మానసికంగాను దైనందిన జీవితం లోను, శాశ్వత జీవితంలోనూ సాధించిన ప్రగతిని, సంభవించే మూల్యాలను నాగరికత అనీ, సంస్కృతి అనీ పండితులు అంటున్నారు.

మన సంస్కృతిలో భాగమైన నమ్మకాలు, అభిరుచులు, ఆచార వ్యవహారాలు, నీతి నియమాలు, లలిత కళలు రాజకీయంగా, సామాజికంగా ఎన్ని మార్పులు వచ్చినా అంత తొందరగా మారవు. ఇది మన సంస్కృతి గొప్పతనం. మన సంస్కృతి గొప్పదనాన్ని చాటే అంశాలు మన ప్రార్థనా మందిరాలు, పండుగలు, పెళ్ళిళ్ళు, ఆహార విహారాలు, కట్టుబాట్లు.

మనకు బడిలేని ఊరైనా ఉంటుందేమో కాని గుడిలేని ఊరు ఉండదు. ప్రతి ఊరిలో ప్రసిద్ధి చెందిన శైవ, వైష్ణవ గుడులేకాక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వంటి గ్రామదేవతల గుడులు కూడా ఉండేవి. ఒక ఊరిలోని గ్రామదేవత ఉత్సవానికి, జాతరకు ప్రక్క గ్రామాలవారు, దూర ప్రదేశాల వాళ్ళు వస్తారు.

ఆటవికుల మేడారం సమ్మక్క జాతరలో, కీసలాపురం భీమదేవుని జాతరలో గ్రామీణులు, నాగరికులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. ముస్లింల మొహర్రం పండుగలో హిందువులు సమధికోత్సాహంతో పాల్గొంటారు.

హైదరాబాదు నగరం వెలుపల జహంగీరు పీరీల దర్గా, ఉర్సు, కాజీపేట దర్గా, హన్మకొండ రెడ్డి నవాబు దర్గా, కరీంనగరం, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని అనేక దర్గాలకు పోయి మ్రొక్కులు చెల్లిస్తారు.
పెండ్లిళ్ళ విషయానికి వస్తే, పేద, ధనిక భేదాలు చూడకుండా, ఒక యింట్లో పెండ్లి జరిగితే వాడవాళ్ళు, బంధువులు పనిపాటల్లో పాలుపంచుకునేవారు.

గ్రామాలన్నీ దాదాపు స్వయం సమృద్ధంగా ఉండేవి. పొట్టకై, బట్టకై ఇతర ప్రాంతాల మీద ఆధారపడడం తక్కువ. ఆయా ఋతువుల్లో ప్రకృతి మాత ప్రసాదించే పండ్లు తినడం, ఏయే కాలాలలో, ఋతువులలో వాతావరణానికి అనుగుణంగా శరీరానికి పోషకాలందుతాయో ఆ ఆహారపదార్థాలనే తినడం మన సంస్కృతి విశేషం. ఇలా తినే ఆహార పదార్థాలకు, ఆరోగ్యానికి, జీవన విధానానికి సంబంధం ఏర్పరచడం మన సంస్కృతి ప్రత్యేకత.

అందుకే రకరకాల భాషలు, సంప్రదాయాలు, ఆచారాలు, మతాలు ఉన్నా మన సంస్కృతి గొప్పదనం భిన్నత్వంలో ఏకత్వం.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 6.
‘స్త్రీలందరూ విద్యావంతులైతే, వరకట్న నిర్మూలన జరుగుతుంది’ – దీనిపై మీ అభిప్రాయాలను తెలుపుతూ వ్యాసం
రాయండి.
జవాబు.
ఉపోద్ఘాతం : స్త్రీ విద్యావ్యాప్తికి జరిగిన ప్రచారం వల్ల, సమాజంలో వచ్చిన చైతన్యం వల్ల స్త్రీలలో విద్యావంతుల శాతం బాగా పెరిగింది.

విషయ విశ్లేషణ : స్త్రీ విద్యావంతురాలైతే వరకట్న నిషేధ చట్టాలపై అవగాహన ఏర్పడుతుంది. ‘వరకట్నం’ ఇవ్వడం హేయమైన చర్య అనే చైతన్యం స్త్రీకి ఏర్పడుతుంది. చట్టప్రకారం వరకట్నం ఇవ్వడం నేరమనే విషయం తెలుస్తుంది. ఈ చైతన్యం కొంతవరకు వరకట్న నిర్మూలనకు దోహదపడుతుంది.

వరకట్న దురాచారం ఏర్పడడానికి ఒక ముఖ్యకారణం మన సమాజవిధానం. పెళ్ళయ్యాక స్త్రీని పోషించాల్సిన బాధ్యత మగవాడిదనేది అనాదిగా ఏర్పడిన ఆచారం. స్త్రీ తాను విద్యావంతురాలై మగవాడికి ఆర్థికంగా అండగా నిలిచినప్పుడు వరకట్నం తీసుకోవడానికి మగవాడు వెనుకంజ వేస్తాడు.

స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబ సమస్యల పరిష్కారంలో పురుషునికి అండగా నిలబడుతుంది. అలాంటి విద్యావంతురాలిని వివాహం చేసుకొనేటప్పుడు పురుషులు వరకట్నం గురించి ఆలోచించరు. స్త్రీ తాను విద్యావంతురాలైతే సమస్యలను అర్థం చేసుకోగలుగుతుంది. సమాజంలో ఉన్న కొన్ని గుడ్డి అభిప్రాయాలను తోసివేయగలుగుతుంది. వరకట్నం ఎక్కువ ఇవ్వకపోతే, నలుగురూ తనను, తన కుటుంబాన్ని తక్కువగా చూస్తారు, గేలిచేస్తారు వంటి పిచ్చి అభిప్రాయాన్ని తోసివేయగలుగుతుంది.

ముగింపు : స్త్రీ విద్యావంతురాలైతే, ఆర్థికంగా తన కాళ్ళమీద తాను నిలబడగలుగుతుంది. తనను పోషించే బాధ్యతకోసం మగవాడు వరకట్నం అడిగే సంప్రదాయాన్ని అడ్డుకోగలుగుతుంది. అందువల్ల స్త్రీ విద్య వ్యక్తిగా ఆమెకు, సమాజానికి చాలా అవసరం.

ప్రశ్న 7.
చక్కని నీతులు చెప్పిన కొందరు శతకకవుల గొప్పదనాన్ని వర్ణిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు.
ఉపోద్ఘాతం : శతక కవులు తమ జీవితానుభవాలను సూటిగా, స్పష్టంగా అర్థమయ్యేట్లు తేలిక పదాల్లో వివరించారు. సంఘంలోని దురాచారాలను, కుళ్ళును ఎత్తి చూపడానికి వెనకాడలేదు. ఏ విషయాన్ని వివరించినా, ఉదాహరణ చెప్పి, అందులోని నీతిని వివరించారు. మానవ జీవిత ధ్యేయాన్ని వివరించడానికి ప్రయత్నించారు. సమాజంలో సుఖశాంతులతో బతకడానికి కావలసిన నీతి నియమాలను వివరించారు.

విశ్లేషణ : వేమన శతకంలో మన నిత్యజీవితానికి ఉపయోగపడే ఎన్నో నీతులు చెప్పబడినవి. అడుగడుగునా అవి మన ప్రవర్తనను తీర్చి దిద్దుతాయి. చంపదగిన శత్రువు చేతికి చిక్కినా కూడా చంపకుండా విడిచిపెడితే అది అతనికి తగిన శిక్ష అని, కులాలు, మతాలు అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని ఇలా ఎన్నో నీతులు బోధించాడు వేమన.

సుమతి శతకంలో ఎవరు చెప్పినా వినాలి కాని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని, కండబలం కంటే బుద్ధి బలం గొప్పది అని ఇలా ఎన్నో నీతులు బోధించాడు బద్దెన కవి.
సుభాషిత రత్నాలలో ఏనుగు లక్ష్మణ కవి విద్య యొక్క గొప్పదనాన్ని చెప్తూ, పవిత్రమైన వాణి పురుషుని సుభాషితుని చేస్తుందని, వాగ్భూషణమే సుభూషణం అని, మిగిలిన భూషణాలన్నీ నశిస్తాయని ప్రస్తావించాడు.

భాస్కర శతకంలో మారద వెంకయ్య కవి అనేక సూక్తులను వివరించాడు. దానం చేయాలి అనే సంకల్పం ఉంటే ఏదో ఒక విధంగా ప్రయత్నించి దానం చేస్తాడు అని, అర్థం చేసుకోకుండా చదివే చదువు ఎంత గొప్పదైనా వ్యర్థం అవుతుంది అని, గొప్పవారు తమ గురించి ఆలోచించకుండా ఇతరుల సుఖం కోసం ప్రయత్నిస్తారు అని ప్రస్తావించాడు. ముగింపు : ఇలా ఎందరో శతక కవులు ఎన్నో సూక్తులను మనకందించారు. వాటన్నిటినీ తెలుసుకుంటూ, ఆచరిస్తూ మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 8.
ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పతనాన్ని గూర్చి వ్యాసం రాయండి.
జవాబు.
పరిచయం : నగర జీవితంతో పోలిస్తే పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పైరగాలులతో, పిల్లకాలువలతో భూలోక నందనవనంలా భాసించే పల్లెటూళ్ళు ప్రకృతి రమణీయతకూ సుఖసంతోషాలకూ పుట్టిళ్ళు.

పాడిపంటలు : పల్లెటూళ్ళలో పక్షుల కిలకిలా రావాలతో, కోడి కూతలతో తెల్లవారుతుంది. పాడిపంటలతో కళకళలాడే పల్లెలు పచ్చని పొలాలతో అలరారుతూ ఉంటాయి. ఆవులు, గేదెలు, ఎడ్లు మొదలైన పాడిపశువులతో; కోళ్ళు, కుక్కలు, పావురాళ్ళు వంటి పెంపుడు జంతువులు, పక్షులతో కలిసి మెలిసి ఉండే పల్లె ప్రజల జీవితం ఎంతో ఆహ్లాదంగా
గడిచిపోతుంది.

పల్లెసొగసులు: “అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం” అని ఒక కవి చెప్పినట్లు పల్లెల్లో ప్రకృతి సౌందర్యం పరమ రమణీయంగా ఉంటుంది. ఆయా ఋతువులలో పూచే గులాబి, బంతి, మందార వంటి రంగు రంగుల పువ్వులతో; విరగకాచే జామ, అరటి, మామిడి, పనస వంటి రకరకాల పళ్ళతోటలతో మనోహరంగా ఉంటాయి. కొబ్బరి తోటలు, చెరకు తోటలు ఉన్న పల్లెల సొగసులు వర్ణించడానికి మాటలు చాలవు. పిల్ల కాలువల హెుయలు, సెలయేళ్ళ గలగలలూ, కనులకు ఇంపుగా, వీనులకు సొంపుగా ఉంటాయి. కాలుష్యం లేని వాతావరణం, చక్కని గాలి, వెలుతురు, ప్రశాంత జీవనం పల్లెవాసుల సొంతం.

ముగింపు : ఈ విధంగా ప్రకృతి ఒడిలో సహజ సుందర దృశ్యాల నడుమ పల్లె జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి స్వచ్ఛమైన గాలులు, రంగురంగుల దృశ్య చిత్రాలూ ఆకలి దప్పులను మరిపిస్తాయి.

ప్రశ్న 9.
అవయవదానం విశిష్టత
జవాబు.
ఉపోద్ఘాతం : పుట్టుకతోనే అవయవలోపాలతో కొందరు పుడుతూ ఉంటే, ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకునేవారు కొందరు. కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు – వీటిలో ఏ అవయవం లేకపోయినా బాధాకరమే.

విషయ విశ్లేషణ : మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అందాలను చూసి ఆనందించాలన్నా, చక్కని సంగీతం వినాలన్నా, సుందరమైన ప్రదేశాలకు వెళ్ళాలన్నా కళ్ళు, ముక్కు, కాళ్ళు చేతులు తప్పనిసరి. ఇవేకాదు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు వంటి అవయవభాగాలు ముఖ్యమైనవే. రక్తం అవయవ భాగం కాకపోయినా, అవయవమంత ప్రాముఖ్యమున్నదే.

కళ్ళు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రక్తంవంటి వాటిని దానమిచ్చి మన చుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవజన్మకు సార్థకత.
జీవించి ఉండగానే, కళ్ళు, మూత్రపిండాలు వంటివి దానం చేయవచ్చు. మరణించాక కూడా జీవించి ఉండడానికి మార్గం అవయవదానం.

తమ మరణానంతరం, తమ కళ్ళను దానం చేస్తామంటూ, ఎంతోమంది నేటికాలంలో ముందుకొస్తున్నారు. అలా నేత్రదానంతో ఎంతోమంది అంధులకు వెలుగునిస్తూ, మరణించాక కూడా జీవించడం గొప్ప విషయం.

అలాగే ఇటీవల బెంగుళూరుకు చెందిన వ్యక్తి గుండె చెన్నైకి చెందిన మరొక వ్యక్తికి మార్పిడి చేయడం ద్వారా ఆ వ్యక్తికి ప్రాణం పోశారు. అలాగే ఇటీవల విజయవాడకు చెందిన మణికంఠ దానం చేసిన గుండె, నేత్రాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం మరికొందరిని జీవించగలిగేట్లు చేశాయి.
ముగింపు : ఇలా అవయవ దానం వల్ల కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఇటువంటివారు రాబోయే తరాలకు స్ఫూర్తిదాతలు.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 10.
స్వచ్ఛ భారత్
జవాబు.
పరిచయం : వ్యక్తిగత శుభ్రత వ్యక్తి ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో, మన పరిసరాల పరిశుభ్రత సమాజ ఆరోగ్యానికీ అంతే ముఖ్యం.

దురదృష్టవశాత్తు మన దేశ ప్రజల్లో సరైన అవగాహనలేక వీధులు, పేటలు, గ్రామాలు, పట్టణాలు అన్నీ అపరిశు భ్రతకు చిరునామాగా తయారయ్యాయి. దీనివల్ల అనేక కాలుష్యాలు, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి తోడు సురక్షిత మంచినీటి సౌకర్యాలు తగినంతగా లేకపోవడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటున్నది. దేశంలోని 120 కోట్ల జనాభాలో అధికశాతం మందికి మరుగుదొడ్ల సౌకర్యం లేదు.

పట్టణాలతో పోలిస్తే పల్లెటూళ్ళల్లోనే పారిశుద్ధ్య సమస్య ఎక్కువ. ఈ సమస్యవల్ల పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల పెనుప్రమాదంలో పడిపోతున్నాయి.

ఈ దుస్థితిని తొలగించేందుకు గ్రామ ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించేలా వారిలో చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. 1986లోనే మనదేశంలో కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య పథకం రూపుదిద్దుకున్నది. దానిని 1999లో సంపూర్ణ పారిశుద్ధ్య పథకంగా మార్చారు. తరువాత అదే పథకం ‘నిర్మల్ భారత్ అభియాన్’గా మారింది. ఇలా ఎన్ని పేర్లు మారినా, పాలకులు ఎంతమంది మారినా పరిస్థితి ఆశించినంత మెరుగుపడలేదు.

స్వచ్ఛభారత్కు గాంధీజీనే ఆదర్శం అంటూ మన ప్రధాని నరేంద్రమోడీ ఈ పథకాన్ని అక్టోబరు 2, 2014న దిల్లీలోని గాంధీసమాధి అయిన రాజాట్ నుంచి ప్రారంభించారు. నాటి నుంచి ఈ ఉద్యమంలో సామాన్యుడి నుంచి వివిధరంగాల్లో అగ్రశ్రేణిలో ఉన్న ప్రముఖులు ఎంతోమంది పాల్గొంటున్నారు. ఇంట్లో ఉన్న చెత్తను ఊడ్చి రోడ్డు మీద పోసి చేతులు దులుపుకోవడం కాకుండా మన ఇల్లు వంటిదే మన వీధికూడా, దానిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అనే స్ఫూర్తితో భారతీయులు అందరూ చేతులు కలుపుతున్నారు.

అనేక కారణాలవల్ల కలుషితమైపోయిన భారతీయుల పవిత్రనది గంగను ప్రక్షాళన చేయడానికి మనదేశం వేలకోట్లు వెచ్చిస్తున్నది. 2019 నాటికి స్వచ్ఛభారత్ కోసం 62 వేలకోట్లను మన ప్రభుత్వాలు ఖర్చు పెట్టబోతున్నాయి. ఈ ఖర్చును 3 : 1 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అంతేకాక స్వచ్ఛభారత్కు నిధుల సమీకరణకోసం ప్రత్యేకంగా 2 శాతం స్వచ్ఛభారత్ పన్ను విధిస్తున్నట్లు భారత ఆర్థికమంత్రి ప్రకటించారు కూడా. స్వచ్ఛభారతినిధిని ఏర్పాటు చేసి అందుకు ఇచ్చే విరాళాలకు నూటికి నూరుశాతం పన్ను రాయితీ కూడా మంత్రి ప్రకటించారు. ముగింపు : ఎన్నో రంగాలలో ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోతున్న మనదేశం పరిశుభ్రతకు మారుపేరుగా రూపొంది అందరి ప్రశంసలూ పొందేరోజు ఎంతోదూరంలో లేదనడంలో సందేహం లేదు.

ప్రశ్న 11.
ఆరోగ్యమే మహాభాగ్యం
జవాబు.
పరిచయం : ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండే స్థితి. మనిషి జీవన పోరాటంలో నిత్యం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటాడు. బతుకుదెరువు కోసం రకరకాల అగచాట్లు పడతాడు. అట్లా కష్టపడే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే తాను కష్టపడి సాధించినదంతా ఆరోగ్య రక్షణకే వెచ్చించవలసి వస్తుంది. అందువల్లనే ఆరోగ్యాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు అంటారు పెద్దలు.

ఉద్దేశ్యం : ప్రాచీన కాలంలో మానవులు శరీరశ్రమ ఉన్న పనులే ఎక్కువ చేసేవారు. రాను రానూ శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్నకొద్దీ శరీరశ్రమ తగ్గిపోతున్నది. నిప్పుపుట్టించడానికి గంటల తరబడీ తిప్పలుబడ్డ దశ నుండి మీటనొక్కితే వేల ‘వాట్ ‘ల శక్తితో సెకన్లలో కొండలనైనా పిండిచేయగల యంత్రాలను కనిపెట్టే దశకు మనిషి ఎదిగాడు. రోజువారీ పనుల ద్వారా గానీ, వృత్తి ఉద్యోగాల ద్వారాగానీ తగిన వ్యాయామం శరీరానికి అందడంలేదు. మానవ శరీర నిర్మాణం ఒక అద్భుత వ్యవస్థ. శరీరానికి తగినంత వ్యాయామం ఉంటే తిన్న అన్నం తేలికగా జీర్ణం అవుతుంది.

అంతేగాక పరిసరాల పరిశుభ్రత, శుచిగా ఉండడం, శుభ్రం చేసిన ఆహారాన్ని తీసుకోవడం మొదలైన అంశాలు కూడా ఆరోగ్యాన్ని కాపాడతాయి.
రోగం వచ్చాక నయం చేసుకొనే ప్రయత్నం చేసుకోవడం కంటే ముందుగానే జాగ్రత్తలు పాటించడంవల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పరిశుభ్రత పాటించడం, మితాహారం తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం, భోజనం నిద్రలకు వేళలు పాటించడం మొదలైన జాగ్రత్తలు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. మన వైద్య విధానం ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ముగింపు :
ఎంత సంపన్నుడైనా ఆరోగ్యం సరిగా లేకపోతే అతడూ పేదవాడే. ఎంత పేదవాడైనా ఆరోగ్యవంతుడైతే అతడు సంపన్నుడే. అందువల్లనే ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి నిత్య సత్యం.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 12.
అవినీతి నిర్మూలన కర్తవ్యం
జవాబు.
ఉపోద్ఘాతం:
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అన్ని రంగాల్లోనూ దేశం బాగా అభివృద్ధి చెందింది. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రభావాల వల్ల కూడా మనదేశం పురోగమిస్తుంది. కాని దురదృష్టవశాత్తు అవినీతి కూడా పెచ్చు పెరిగింది. అక్రమ సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారడం వల్ల అన్ని కోణాల్లోనూ అవినీతి విశృంఖల విహారం చేస్తున్నది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులలో అవినీతి జాడ్యం బాగా విస్తరించింది. చిన్న పంచాయితీ మెంబరు నుండి దేశ ప్రధాని వరకూ అవినీతి ఆరోపణలకు గురి అవుతున్నారు.

రాజకీయ నాయకులు తమ పార్టీల నిధుల కోసం ఎంతటి అవినీతి పనులకు పాల్పడుతున్నారో మనం తెలుకుంటూనే ఉన్నాం. దేశ రక్షణశాఖకు సంబంధించిన ఆయుధాల కొనుగోలు వ్యవహారాల్లో ఒక దేశ ప్రధానిపైనే ఆరోపణలు రావడం ఎంతో విచారకరం. రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తల అక్రమ సంపాదనలు దేశ, విదేశీ బ్యాంకుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలుంటాయన్న వాస్తవం మనకు తెలిసిందే.

అన్ని రంగాల్లో అవినీతి :
అంతేగాదు, బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవుల్లో ఉన్న అధికారులు తమ స్వార్థసంకుచిత ప్రయోజనాల కోసం లంచాలు స్వీకరించడం పరిపాటి అయింది. నేడు ప్రజలు కూడా తమ పనులు త్వరగా ముగియడం కోసం అధికారులకు ముడుపులు ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. చౌకధరల దుకాణాల్లో సరుకులను దాచి అక్రమ లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ విధంగా అవినీతి అన్ని రంగాల్లోనూ తాండవిస్తుంది.

అందరి కర్తవ్యం :
ఈ అవినీతిని అన్ని రంగాల్లోనూ అరికట్టడానికి అందరూ, ముఖ్యంగా విద్యార్థులు, యువత ముందుకు రావాలి. అవినీతి నిరోధక శాఖ మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అవినీతిపరులైన ఉద్యోగులను, అధికారులను, నాయకులను నిర్ధాక్షిణ్యంగా శిక్షించే విధంగా చట్టంలో మార్పులు రావాలి. అవినీతిపరులైన రాజకీయ నాయకులు ముఖ్య పదవులను నిర్వహించకుండా ఉండాలి. అవినీతి నిర్మూలన ప్రజలందరి లక్ష్యం కావాలి. ఉద్యోగుల్లో పనిపట్ల అంకితభావం పెరగాలి. లేకపోతే ఈ దేశం నైతికంగా పతనమౌతుంది.

“అవినీతిని దూరంచేయాలి – ప్రగతిని సాధించాలి”.

ప్రశ్న 13.
నదులు – ప్రయోజనాలు
జవాబు.
ఉపోద్ఘాతం :
సాధారణంగా నదులన్నీ పర్వతాలలో చిన్న సెలయేరులుగా పుట్టి ప్రవహించి దారిలో అనేక నీటి కాలువలను తనలో కలుపుకుంటూ రానురాను విస్తరించి మహానదులుగా ప్రవహిస్తాయి. మన దేశంలో నదులు ఎక్కువగా ఉన్నాయి. గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి, కావేరి, యమున, తుంగభద్ర మొదలైనవి మన దేశమున గల ముఖ్యమైన నదులు. సాధారణంగా నదులన్నీ పశ్చిమం నుండి తూర్పునకు ప్రవహిస్తాయి.

నదులు – ఉపయోగాలు :
భారతదేశం వ్యవసాయం ప్రధాన వృత్తిగా గల దేశం. ఈ దేశంలో ఎక్కువ భాగం వ్యవసాయం నదులందించు నీటిపై ఆధారపడియున్నది. నదీ ప్రవాహం కొంత దూరం ప్రయాణించిన తరువాత కొన్ని పాయలుగా చీలి డెల్టా నేలలను ఏర్పరుస్తున్నాయి. అందువల్ల నేడు మానవుడు ఆ నదీ ప్రవాహములపై ఆనకట్టలు కట్టి నీటిని వృధాగా సముద్రంలో కలువకుండా ఆపి ఆ నీటిని కాలువల ద్వారా సరఫరా చేసికొని లక్షల ఎకరాలలో పంట పండించుటకు ఉపయోగిస్తున్నాడు. అంతే కాక నీటినుండి విద్యుదుత్పత్తి కూడా చేసుకోగలుగుతున్నాడు. ఈ విధంగా నేడు నదీజలం త్రాగునీటి నివ్వటమే గాక, పంటలు పండించుటకు, విద్యుదుత్పత్తికి కూడా ఉపయోగపడుచున్నది.

పూర్వము ప్రవహించు నదులను పుణ్యతీర్థములుగా భావించెడివారు. అందులో స్నానం చేసిన వారి పాపములు తొలగిపోవునను నమ్మకము కలిగియుండుటచే స్థానికులే కాక దూరప్రాంతముల నుండి కూడా యాత్రికులు వచ్చి నదులలో స్నానం చేసేవారు. ప్రవాహజలం ఆరోగ్యప్రదంగా ఉండేది. పూర్వం నదులను సరకుల రవాణాకు రహదారులుగా కూడా ఉపయోగించుకునేవారు.

ముగింపు :
ఇలా బహుళ ప్రయోజనములను కలిగించు నదులకు వరదలు వచ్చినచో సమీప ప్రాంతాలకు నష్టం కలుగుతుంది. కనుక తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 14.
పరిసరాల పరిశుభ్రత
జవాబు.
ఉపోద్ఘాతం :
మన చుట్టూ ఉన్న చెట్టు, చేమ, గాలి, వెలుతురు, నీరు వగైరాలే పరిసరాలు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంవల్లే మనం ఆరోగ్యంగా బతకగలం. నీరు ప్రాణధారణకు, దాహాన్ని తీర్చటానికి, పంటలు పండటానికి ఉపయోగపడుతోంది. చెట్లు శుభ్రమైన గాలినిస్తూ కాలుష్యాన్ని నివారిస్తున్నాయి.

కాలుష్యాలు – నష్టాలు :
రాను రాను జనాభా పెరుగుదల మూలంగాను, నాగరికత మోజువల్లను మన పరిసరాలను మనమే పాడుచేసుకుంటున్నాము. కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు పెరిగి వాతావరణం కాలుష్యంతో నిండిపోతోంది. ఉష్ణోగ్రత పెరిగిపోయి అనావృష్టి లేక అతివృష్టిని కలిగించేలా దురదృష్టకర మార్పులు ఏర్పడుతున్నాయి. అడవులను నరికివేయటం వల్ల వరదలేర్పడి జననష్టం, పంటనష్టం ఏర్పడుతోంది.

పరిసరాల పరిశుభ్రతకై ప్రపంచ సంస్థలు, మన ప్రభుత్వాలు తీవ్రచర్యలు తీసుకుంటున్నాయి.

ప్రజల కర్తవ్యం :
ఇళ్ళలోని చెత్తను ఇంటిముందు పారవేయకుండా, వీధి చివర కుండీ ఏర్పాటు చేసుకుని అందులో పారవేయాలి. కుళాయిలవద్ద, మురికి కాల్వలవద్ద చెత్తనిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మలేరియా, టైఫాయిడ్ వ్యాప్తిచేసే రోగకారకమైన దోమలు విజృంభించకుండా డి.డి.టి. వంటి మందులు చల్లుకోవాలి. మురికివాడల వాసులకు శుభ్రత గూర్చి తెలియచేయాలి. చెట్లను నాటాలి. పారిశుద్ధ్య కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. గాలి, వెలుతురులు వచ్చేలా ఇళ్ళు నిర్మించుకోవాలి. పరిసరాల పరిశుభ్రతతోనే మనందరి అభివృద్ధి ఉందని గ్రహించాలి. దీనికై అందరం ఉద్యమించాలి.

ప్రశ్న 15.
ఉగ్రవాదం – దుష్ఫలితాలు
జవాబు.
ఉపోద్ఘాతం: మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఎదుటివాళ్ళ మీద బలప్రయోగం చేయడం, భయోత్పాతం పుట్టించడం, చంపడం వంటి చర్యలతో తమ కోరికల్ని, ఆశయాల్ని లక్ష్యాల్ని సాధించటమే ‘ఉగ్రవాదం’ అని చెప్పవచ్చు. ఉగ్రవాదం నేడు మనదేశంలో అన్ని మూలలా విస్తరిస్తోంది. ఒక ముఠా, ఒక సంఘం, ఒక వర్గం సాయుధ పోరాటానికి దిగడం అధికమైపోయింది.

దుశ్చర్యలు : ఉగ్రవాదులు ఆధునిక మారణాయుధాలను, తుపాకులను, చేతిబాంబులను, డైనమైట్లను, విష రసాయనాలను, రకరకాల వాహనాలను సమకూర్చుకుని రహస్య స్థావరాల్లో ఉండి, తమ లక్ష్యసాధనలో అడ్డంగా నిలిచే వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. నేడు ఉగ్రవాదులు రహస్య స్థావరాల్లో సైనిక శిక్షణ కూడా పొందుతున్నారు. మన దేశంలో ఉగ్రవాదం ఈ రకంగా పెరిగిదంటే దానికి ప్రధాన కారణం మన పొరుగున ఉన్న మతోన్మాద దేశాలు. ఈ దేశాలు ఉగ్రవాదులకు అన్ని రకాలుగా సహకరిస్తూ, మరొక పక్క శాంతి వచనాలను పలకటం వింతగా తోస్తుంది. తమను ఎదిరించిన వారిని చంపటం, ప్రతీకార చర్యలకు పాల్పడటం ఉగ్రవాదుల ఉన్మాదచర్యలుగా రూపుదాలుస్తున్నాయి.

ప్రభుత్వ – ప్రజల కర్తవ్యం : మిజోరంలో, పంజాబులో, అసోంలో నిత్యం ఉగ్రవాదుల కిరాతక చర్యలు సాగుతున్నాయి. హైదరాబాదు, ముంబయి, బెంగుళూరులో జరిగిన బాంబు పేలుళ్ళ ఘటనలు ఉగ్రవాదుల దుశ్చర్యలే. మన పార్లమెంటు మీద కూడా దాడి చేసి నాయకులను హతమార్చటానికి ప్రయత్నించడం సిగ్గుచేటు, ఛత్తీస్ ఘడ్లో నక్సల్స్ ప్రభావం తీవ్రంగానే ఉంది. వారు తమ లక్ష్యసాధన కోసం ఎంతోమంది అమాయక ప్రజలను, అధికారులను బలి తీసుకుంటున్నారు.

నేడు ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాద దుష్ఫలితాల్ని గ్రహించి బందోబస్తు చర్యలు తీవ్రతరం చేస్తున్నాయి. మన భారత ప్రభుత్వం కూడా ఉగ్రవాదంపై ఉక్కుపాదాన్ని మోపాలని ఆశిస్తోంది. ప్రపంచ దేశాల పరస్పర సహకారం పెంపొంది త్వరలో ఉగ్రవాదం తెరమరుగు కాగలదన్న ఆశ చిగురుతోంది.

“ఉగ్రవాదాన్ని నిర్మూలించు – దేశాన్ని ప్రగతి పథంలో నడిపించు”

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 16.
జనాభా సమస్య
జవాబు.

ఈనాటి భారతదేశం సమస్యల విషవలయం. వాటిలో ప్రధానమైనది జనాభా సమస్య. ఇది అన్ని సమస్యలకు మూలం. అన్ని అనర్థాలకు ప్రధాన కారణం.

ఈ జనాభా సమస్య ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఉంది. కానీ మన దేశంలో ఈ సమస్య విపరీతంగా ఉంది. ప్రపంచంలోని అత్యధిక జనాభా గల దేశాలలో మనదేశం రెండవది. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ జనాభా సుమారు నలభై కోట్లు. ఈనాడు దేశ జనాభా సుమారు నూట ఇరవై ఒక్క కోట్లకు చేరుకొన్నది. మనం వైద్య రంగంలో సాధించిన ప్రగతికి ఫలితంగా మరణాల సంఖ్య తగ్గిపోయింది. జననాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. మరియు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో నుండి లక్షలాది మంది కాందిశీకులు మనదేశానికి రావడంతో జనాభా సమస్య మరింత విషమించింది.

ఈ జనాభా సమస్య వల్ల ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య, ఆర్థిక సమస్య వంటి క్లిష్ట పరిస్థితులెన్నో దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. దేశంలో కోట్లాదిమంది ప్రజలు కడుపునిండా రోజుకు ఒక్కపూటయినా అన్నం దొరకని దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దారిద్ర్యం వారిని పట్టిపీడిస్తున్నది.

స్వాతంత్ర్యానంతరం మనదేశం అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించడానికి కృషి చేస్తున్నాం. ఎన్నో ప్రణాళికలను చేపడుతున్నాం. ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. పంటలు సమృద్ధిగా పండిస్తున్నాం. అయినా ఆహార సమస్యను పరిష్కరించ లేకపోతున్నాం. ఎన్ని ఉద్యోగాలు కల్పించినా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేక పోతున్నాం. దానికి కారణం జనాభా పెరుగుదల.

ఈ విషయాన్ని గుర్తించి ఐక్యరాజ్య సమితితో పాటు వివిధ దేశాధినేతలు జనాభా పెరుగుదలను అదుపు చేయడానికి ప్రజలు కుటుంబ నియంత్రణ పాటించాలని, తద్వారా పరిమిత కుటుంబాలు, చింతలు లేని కుటుంబాలు కావాలని చాటి చెప్పారు. ప్రతిపౌరునకు పరిమిత కుటుంబ అవసరం తెలియాలి. పరిమిత కుటుంబాన్ని కలిగియుండాలి.
కాబట్టి ప్రజలు మూఢనమ్మకాలను వదిలి జనాభా పెరుగుదలను అరికట్టి ప్రభుత్వానికి సహకరించినప్పుడే, ఈ దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా విరాజిల్లుతుంది.

ప్రశ్న 17.
విద్యార్థులు – సంఘసేవ
జవాబు.
ఉపోద్ఘాతం : విద్యను అర్థించువారు విద్యార్థులు. సంఘమునకు చేయు సేవ సంఘసేవ. విద్యార్థులు బాల్యము నుండే సంఘమునకు సేవచేయు అలవాటును కలిగియుండవలెను. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కనుక సంఘసేవ పట్ల ఆసక్తి గల విద్యార్థులు భవిష్యత్తులో ప్రజానాయకులై దేశమును అన్ని రంగములలోనూ అభివృద్ధిలోనికి తీసుకొని రాగలరు.

సంఘ సేవలో విద్యార్థుల విధులు – పాత్ర : విద్యార్థులలో సేవాభావమును అభివృద్ధి చేయుటకై పాఠశాలలో స్కౌట్స్ మరియు గైడ్స్, ఎన్.సి.సి వంటి పథకములు ప్రవేశపెట్టబడినవి. ఇవేకాక కళాశాలలయందు జాతీయ సేవా పథకం (N.S.S) అను దానిని ప్రవేశపెట్టారు. వీటిలో ఉత్సాహవంతులు అయిన విద్యార్థులు సభ్యులుగా చేరవచ్చు. ఆ విద్యార్థుల్ని సేవా పథకంలో పాల్గొనచేయుటకు ఒక ఉపాధ్యాయుడు నాయకత్వము వహించును.

విద్యార్థులు అనేక విధాలుగా సంఘసేవ చేస్తూ జాతీయాభ్యుదయానికి సహకరించవచ్చును. తామున్న ప్రాంతములోను, మురికివాడలకును పోయి అక్కడివారికి పరిశుభ్రత యొక్క అవసరమును వివరించి అందరూ శుభ్రముగా ఉండునట్లు చూడవచ్చును. చదువురాని వయోజనులకు విద్య నేర్పవచ్చును. పట్టణాలలో రహదారి నిబంధనలను తప్పకుండా ఉండునట్లు చేయుటలో పోలీసువారికి విద్యార్థులు సహకరించవచ్చును. ఉత్సవాలు, సభలు జరుగునపుడు విద్యార్థులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొని అక్కడి జనులకు అవసరమైన సేవలు చేయవచ్చును.

ముగింపు : ఈ విధంగా విద్యార్థులు బాల్యం నుండి తమ యింటిలో అమ్మ నాన్నలకు వారు చేయు పనిలో సహకరించడంతో పాటు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనుట వలన మంచి పనులు చేయుచున్నాము అన్న తృప్తి వారికి కలుగుతుంది. దేశానికి సేవ చేసినట్లు అవుతుంది.

“దేశ సేవ కంటే దేవతార్చన లేదు. సానుభూతికంటే స్వర్గంబు లేదు”. – కరుణశ్రీ

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 18.
ప్రపంచ శాంతి
జవాబు.
ఉపోద్ఘాతం : శాంతి అంటే “ఓర్పు” అని అర్థం. ప్రపంచంలో అనేకచోట్ల ప్రజలు ప్రకృతి వైపరీత్యాలవల్ల, అలజడుల వల్ల, ఉగ్రవాదం వల్ల అల్లకల్లోల పరిస్థితుల్లో కూడు, గూడు, గుడ్డ కోల్పోయి విలవిలలాడుతున్నారు. భూమిపై ఉన్న ఈ ప్రాణాలు ఇలాంటి కష్టనష్టాలు పాలు కాకుండా సుఖసంతోషంగా జీవించడమే ప్రపంచశాంతి.

విషయ వివరణ : ప్రకృతి వైపరీత్యాలను ముందుగా ఊహించి, నివారించడానికి శాస్త్రజ్ఞులు ఒకప్రక్క కృషిచేస్తున్నారు. మరొకప్రక్క శాస్త్ర విజ్ఞానాన్ని అణ్వస్త్రాలుగా మార్చి మరియు మారణాయుధాలతో ఉగ్రవాదం మొదలైన అహంకారధోరణులతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా సంభవించినవే రెండు ప్రపంచ యుద్ధాలు, వాటివల్ల ఎన్నో దేశాలు, ప్రజలు, సంపద నశించి పోవడం జరిగింది. కోలుకునేందుకు ఎంతో సమయం పట్టింది.

మానవతా ధోరణి పెరగలవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రపంచశాంతి సాధనకై నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించి, ప్రపంచశాంతికై అహరహం పాటుబడడం జరిగింది. శ్రీలంక తమిళుల సమస్య, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలు పలుదేశాల శాంతికి విఘాతం కల్గిస్తున్నాయి. వీటిని నివారించాలి.

ప్రపంచశాంతి సాధన ప్రయత్నాలు :
అగ్రరాజ్యాలు వగైరా అన్ని రాజ్యాలవారు అణ్వాయుధాలను విసర్జించాలి. అణు పరిజ్ఞానాన్ని అభివృద్ధికే వినియోగించాలి. శాంతి, సౌభాగ్యం ప్రాతిపదికగా అన్ని దేశాలు ముందుగా సాగాలి. అందరిలో విశ్వమానవ సౌభ్రాతృత్వ భావం పెంపొందే ప్రయత్నం సాగాలి. అహంకార ధోరణులు విసర్జించాలి. రెండు ప్రపంచ యుద్ధాలు కల్గించిన నష్టాలను పరిగణనలోనికి తీసుకొని, మూడవ ప్రపంచ యుద్ధమే వస్తే మానవ మనుగడయే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది.

పట్టు విడుపులు ప్రదర్శించి, అగ్ర రాజ్యాలు, వర్థమాన రాజ్యాలు మానవతా విలువలు ప్రదర్శించడానికి ముందుకు సాగితే ప్రపంచశాంతి అలవోకగా సాధ్యమవుతుంది. ప్రపంచశాంతి అవశ్యకత పాఠశాల స్థాయినుండే బాల్య హృదయాలలో నిలచిపోయే పాఠ్యాంశాలు తీసుకొని రావాలి. అప్పుడే శాస్త్రవిజ్ఞాన అభివృద్ధి ఫలాలు మానవాళికి అందుతాయి.

ప్రశ్న 19.
కంప్యూటర్
జవాబు.
ఉపోద్ఘాతం:
ఆధునిక యుగంలో విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి నిలువుటద్దంగా నిలిచింది కంప్యూటర్ అనబడే గణనయంత్రం. గణనను అతివేగంగా నిర్వహించే ఎలక్ట్రానిక్ సాధనం కంప్యూటర్.
పనినిబట్టి, అవసరాన్ని బట్టి ఒక్కొక్క కంప్యూటర్ను ఒక్కొక్క విధంగా తయారుచేస్తారు. వాటిలోని యాంత్రిక వ్యవస్థ వేరువేరుగా ఉంటుంది.

భాగాలు : 1) కంట్రోల్ యూనిట్, 2) ఇమీడియట్ యాక్షన్ స్టోర్, 3) అర్థమెటిక్ యూనిట్ మరియు 4) రిజిస్టర్స్. ఈ నాలుగు భాగాలను కలిపి “సెంట్రల్ కంట్రోలింగ్ యూనిట్” అంటారు.

ఇన్పుట్ యూనిట్, బ్యాంకింగ్ స్టోర్, ఔట్పుట్ యూనిట్ అనేవి కంప్యూటర్లోని ఇతర ముఖ్య భాగాలు. వివిధ కోర్సులు : పాస్కల్, కోబాల్, ఒరాకిల్, జావా, సి,సి + + మొదలగు అభివృద్ధి చెందే కోర్సులు ఎన్నో వచ్చాయి.

ఉపయోగాలు :
కూడిక, తీసివేత, భాగహారం వంటి మౌళిక అంకగణిత ప్రక్రియలను, విలువలను పోల్చడం వంటి పనులను కంప్యూటర్ సులభంగా చేస్తుంది. అపరిమితమైన దత్తాంశ వివరాలను అవసరమైనపుడు వాడుకోవడానికి వీలుగా భద్రపరచి ఉంచుతుంది. నేడు వీటిని వాడని రంగం లేదు. అకౌంట్ల నిర్వహణ, జీతాల మదింపు, ఇతర అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఇది చేతి వ్రాతలను యథాతథంగా సృష్టిస్తుంది. కర్మాగారాలలో యంత్రాల పనిని సమన్వయపరుస్తుంది. వీటి వాడకం వలన శ్రామిక శక్తి వినియోగం తగ్గిపోతుంది.

తప్పులు, ఆలస్యాలకు అవకాశం ఉండదు. నాణ్యత పెరుగుతుంది. అమెరికా వంటి దేశాలలో కంప్యూటర్ల ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. వైద్యరంగంలో నేడు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మామూలు ఎక్స్రేలో చూడలేని శరీర భాగాల్ని కంప్యూటర్నుపయోగించి స్కానింగ్ పద్ధతి ద్వారా వైద్యులు పరిశీలించగలరు.

సూచనలు :
కంప్యూటర్ టెక్నాలజి నిపుణులు దేశీయ వనరులతో చక్కటి కంప్యూటర్ నిర్మాణానికి దీక్ష వహించాలి. కంప్యూటర్లలో వాడే పరికరాల ఉత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి.

ముగింపు :
కంప్యూటర్ లేని జీవితాన్ని నేడు ఊహించలేము. కావున కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి ప్రతి విద్యార్థి కంప్యూటర్ జ్ఞానం కచ్చితంగా పొందాలి. సమాచార విప్లవానికి వెన్నెముకగా నిలుస్తున్న కంప్యూటర్ విద్యను అభ్యసించి మనమందరం అభివృద్ధి సాధించాలి.

TS 8th Class Telugu Grammar వ్యాసాలు

ప్రశ్న 20.
మతసామరస్యం
జవాబు.
ఉపోద్ఘాతం : సమాజంలోని మానవులకు మతం పుట్టుక నుండి సంక్రమిస్తుంది. అదే విధంగా మత ప్రభావం ప్రతి వ్యక్తిపై పుట్టుక నుండి మరణించేంత వరకూ తప్పనిసరిగా ఉంటుంది. సమాజంలో ఎవరి మతం వారికి గొప్పగా కనిపిస్తుంది. ఒకప్పుడు సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి, సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి ‘మతాన్ని’ మన పెద్దలు ప్రవేశపెట్టారు.

వివిధ మతాలు : మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. హిందూ, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధం, సిక్కు మొదలైన మతాలను ప్రముఖంగా చెప్పవచ్చు. ఇంకా ఎన్నో మతాలు ఉన్నాయి.

పరమార్థం-లక్ష్యాలు : ప్రపంచంలో మతాలు ఎన్ని ఉన్నా అవన్నీ ధర్మాన్ని, సత్యాన్ని, అహింసనూ, విశ్వప్రేమనూ బోధిస్తుంటాయి. అయితే ఆయా మతాల ఆచార వ్యవహారాల్లో మాత్రం చాలా తేడాలు ఉన్నాయి. దేశంలో ఎన్నో మతాల వారు జీవిస్తున్నారు. అయినా వారందరూ ఐకమత్యంగానే జీవిస్తున్నారు. సహజీవనాన్ని సాగిస్తున్నారు. ఇందువల్లే మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం భాసిల్లింది. మనదేశం లౌకికవాదానికి కట్టుబడి ఉంది. ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. ప్రభుత్వం ఏ మతాన్ని ప్రచారం చేయదు.

మతకలహాలు : రాను రాను దేశంలోను, ప్రపంచంలోను పాలకుల్లో స్వార్థచింతన బాగా పెరిగింది. లౌకికవాదం నేతిబీరకాయ వంటిదిగా తయారైంది. మతానికి రాజకీయరంగు పులుముతున్నారు. మతం పేరుతో పార్టీలు ఆవిర్భవిస్తున్నాయి. నాయకులు మతప్రమేయంతో యాత్రలు చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొడుతున్నారు. కొన్ని సందర్భాలలో మనదేశంలో ఎన్నో మతకలహాలు ఏర్పడ్డాయి. “బాబ్రీమసీదు విధ్వంసం” జరిగి ఇంతకాలమైనా దాని తీవ్రపరిణామాలు ఇంకా చల్లారలేదు. గుజరాత్లో కూడా మతకలహాలు జరిగాయి. మారణహోమం జరిగింది. కొంతమంది మతఛాందసులు దేశంలో మతం పేరుతో ప్రజలమధ్య చిచ్చుపెడుతున్నారు.

నివారణ చర్యలు : ప్రభుత్వాలు మతసామరస్యానికి తీవ్రంగా కృషిచేయాలి. మతాలమధ్య చిచ్చు పెట్టేవారిని ఉక్కుపాదంతో అణచివేయాలి. మతాలమధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి. ప్రజలు కూడా మతం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. రెచ్చగొట్టే చర్యలకు లోనుకాకూడదు. అరాచకశక్తులను అణచివేసే విధంగా చట్టాలు ఉండాలి. మతసామరస్యంతో అందరూ కలసి మెలసి జీవితాన్ని అలవరచుకోవాలి.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download కరపత్రాలు / నినాదాలు Questions and Answers.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 1.
నగర, గ్రామాలలో కాలుష్య నివారణను పోగొట్టి స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలంటే ప్రజల బాధ్యత ఏమిటో తెలియజేస్తూ “కరపత్రం” తయారు చేయండి.
జవాబు.

కాలుష్య నివారణ – మనందరి బాధ్యత

  1. నేడు ఎక్కడ చూసినా మురికి, కాలుష్యం నాట్యం చేస్తున్నాయి.
  2. నా ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలు, వీధులు, ఊరూ ఎట్లా ఉంటే నాకేమిటి అనే ధోరణి పెరిగిపోతోంది.
  3. మన ఇంటినే కాదు మన వీథిని, మన ఊరును / పల్లెను శుభ్రంగా ఉంచుకోకపోతే రోగాలబారిన పడేది మనమే.

కాలుష్య నివారణకు నేడే నడుం బిగిద్దాం

  • ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. నేలలో త్వరగా కలిసిపోయే నార, కొబ్బరి వంటి వాటితో చేసే వస్తువులు వినియోగిద్దాం.
  • వీలైనంతవరకు నడక ద్వారాను లేదా సైకిలు ఉపయోగించడం ద్వారాను పెట్రోలు, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గిద్దాం.
  • పర్యావరణ హానికరం కాని వ్యర్థాలను, పర్యావరణానికి హానిచేసే వ్యర్థాలను విడివిడి డబ్బాలు / బుట్టలతో నిల్వచేసి, మున్సిపల్ సిబ్బందికి అందచేద్దాం.
  • హానికర రసాయనాలతో తయారయ్యే సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు, షాంపూలు వంటి వాటిని ఉపయోగించడం తగ్గించుకుందాం.
  • చెట్లను పెంచుదాం. ఉన్న చెట్లను కొట్టి వేయకుండా కాపాడుదాం.
  • రోడ్ల ప్రక్కన, ఆరు బయలు ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన మానివేద్దాం.
  • మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం మున్సిపల్ కార్మికుల బాధ్యతేకాదు. మనందరి బాధ్యత.
  • వారంలో ఒకసారి మన వీథుల్ని మనమే శుభ్రం చేసుకుందాం. ‘స్వచ్ఛభారత్’ ఉద్యమాన్ని ముందుకు తీసికెళదాం.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 2.
ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మానవాళి నీటిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవలసిన అవసరం ఉంది. నీటిని దుర్వినియోగం చేయకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు.

నీరు – పొదుపు

మిత్రులారా!

‘నీరే ప్రాణాధారం’ – అనే సంగతి అందరికీ తెలిసిందే. తాగేందుకు మాత్రమే కాక మన దినసరి కార్యక్రమాల్లో ఎన్నో పనులకు నీరు అవసరం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న నీటి లభ్యత క్రమక్రమంగా తగ్గిపోతోంది.

భూమిపైన జనాభా పెరగటంతో నీటి వాడుక పెరిగిపోతోంది. ఇదివరకటి కంటె ఇప్పుడు ఇళ్ళలో నీటికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవటం సులభమయింది. మోటార్ల సహాయంతో ఇంట్లో ప్రతిచోటా పంపులు ఏర్పాటు చేసుకొంటున్నారు. దీనితో అవసరానికి మించిన వాడకం జరుగుతోంది. ఇది ఇలాగే జరిగితే భావితరాలవారికి నీరే మిగలదు. కాబట్టి ప్రతీవారు నీటిని అవసరమైనంతవరకే వాడాలి. నీటి పంపులను వృథాగా వదిలెయ్యకూడదు. పిల్లలు అవసరమైనంతవరకే నీరు వాడేలా చూడాలి. ఇంట్లో వాడిన నీరు భూమిలోకి ఇంకేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుని నీటి కొరత రాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి.

మీరు నీటిని అవసరమైనంతవరకే వాడుతూ ప్రతివారికీ ఈ విషయం చెప్పి తెలిసేలా చేయండి. నీటిని పొదుపు చేసేలా చూడండి.

ఇట్లు
జలరక్షక మండలి సభ్యులు

ప్రశ్న 3.
‘వందేమాతరానికి వందేళ్ళు” పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు.
వందేమాతరానికి వందేళ్ళు

మిత్రులారా !

ప్రపంచంలో మిగతాదేశాలు నాగరికత నేర్వకముందే వేదవిజ్ఞానం ద్వారా మనదేశం సర్వతో ముఖాభివృద్ధి చెందింది. ఎంతోమంది చక్రవర్తులు మనదేశాన్ని ప్రజానురంజకంగా పరిపాలించారు. అలాంటి మనదేశానికి వర్తకం పేరుతో వచ్చిన బ్రిటిష్వారు మనరాజుల మధ్య తగవులు పెట్టి మనదేశాన్ని హస్తగతం చేసుకున్నారు. పరిపాలన వారిదైంది. వారి నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించేందుకు మన నాయకులు వంద సంవత్సరాలు (1857 నుండి) పోరాడాల్సి వచ్చింది. గాంధీజీ నాయకత్వంలో అహింసా పద్ధతిలో పోరాటం చేసి మనం స్వాతంత్ర్యం దక్కించుకున్నాం.

ఆ సమయంలో ఎందరో కవులు ప్రజలకు ఉత్తేజం కలిగేలా, దేశభక్తి రగుల్కొనేలా ఎన్నో గీతాలు రాశారు. ఆ సమయంలో బంకించంద్ర ఛటర్జీ రాసిందే వందేమాతరం గీతం. అప్పట్లో ఆ గీతం మనదేశంలో నింపిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ‘వందేమాతరం’ అనేది నినాదంగా మారి ప్రజల కంఠాల్లో మారుమ్రోగి బ్రిటీష్వాళ్ళని తరిమేసేందుకు స్ఫూర్తినిచ్చింది. అలాంటి వందేమాతరం గీతం రాయబడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో ఉ త్సవాలు జరుగుతున్నాయి. మనందరం కూడా మన ఊళ్ళో ఉత్సవాలు చేద్దాం. ఆనాటి పోరాటాన్ని గుర్తు చేసుకుందాం. మరొక్కమారు స్ఫూర్తిని పొందుదాం.

గొంతెత్తి నినదిద్దాం, వందేమాతరం అని,
రండి, తరలిరండి, అందరూ రండి. కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యండి.

ఇట్లు,
ఐక్యప్రజావేదిక.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 4.
మనదేశ గొప్పతనాన్ని వర్ణిస్తూ భారతీయ విలువలు కాపాడడానికి అందరూ బాధ్యత తీసుకోవాలని ఒక “కరపత్రం” తయారు చేసి ప్రదర్శించండి.
జవాబు.

భారతీయ విలువలు కాపాడుకుందాం !

మిత్రులారా !

అఖండ సౌభాగ్య సంపదలు కలిగినది మన భారతదేశం. శాంతికి నిలయం. సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలం. ప్రపంచానికే తలమానికం. మహాత్ముడు నేర్పిన అహింసను తప్పక పాటించాం. అన్నదమ్ములమన్న మధుర భావంతో జీవించాం.

ఇప్పుడు జాతి, కుల, మత వివక్షలు మనలను పిశాచాల్లాగా పీడిస్తున్నాయి. అవినీతి, లంచగొండితనం సమాజంలో వేళ్ళూనుకుపోయాయి. ఈ సామాజిక రుగ్మతలను (రోగాలను) తొలగించి ప్రజలలో మానవత్వపు విలువలను కాపాడడానికి మనమందరం చేయి చేయి కలిపి ముందడుగు వేద్దాం.

మిత్రులారా ! కలిసి రండి.

యువ మిత్ర మండలి,
మహబూబ్ నగర్.

ప్రశ్న 5.
బహుళ ప్రయోజనాలను చేకూర్చే నదుల ప్రాముఖ్యం వివరిస్తూ, ఆ నదులు కాలుష్యం బారిన పడకుండా చూడడానికి ప్రజలను చైతన్యపరుస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు.

నదులను కాపాడుకుందాం !

ప్రజలారా !

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్నో నదులతో భారతదేశం పవిత్రమవుతోంది. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, తుంగ, భద్ర మొదలైన నదులున్నాయి. నదులకు మానవ జీవితానికి అవినాభావ సంబంధం ఉన్నది.

నదుల మీద కడుతున్న ఆనకట్టలతో, నీటిని నిల్వచేసి వ్యవసాయానికి నీరు అందించుకోగలుగుతున్నాం. నదుల్లో చేపల వంటి విలువైన జలసంపదను పెంచుకోగలుగుతున్నాం. విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. కానీ మన స్వార్థంతో నేడు మనకు ప్రాణాధారమైన నదులను కలుషితం చేస్తున్నాం. పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నాం. ఇక మీద పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి కలపకుండా చూడాలి.

నదుల్లో మల, మూత్రాదులను వదిలి కలుషితం చేస్తున్నాం. మల, మూత్రాదులను నదుల్లో కలపకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
పశువులను, బట్టలను నదులలో కడగడం, ఉతకడం వంటి నదులను కలుషితం చేసే పనులను ఆపాలి.

ఇకనైనా చైతన్యవంతులమవుదాం. నదుల కాలుష్యాన్ని అరికడదాం.
రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 6.
అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకు, వదాన్యులకు ఒక ‘కరపత్రం’ ద్వారా విజ్ఞప్తి చేయండి.
జవాబు.

మనవి

మనదేశంలో ఎంతోమంది అనాథలైన బాలబాలికలు, ముసలివారు, పేదవాళ్ళు ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం లోతుగా పరిశీలించి, హృదయం కరిగిపోయి, బాగా డబ్బున్న ఒక యువకుడు ఎంతో ఉన్నత విద్యను అభ్యసించినవాడే. తన వాటాకు వచ్చిన 50 ఎకరాల పొలంలో అనాథశరణాలయాన్ని, వృద్ధాశ్రమాన్ని స్థాపించాడు. అనాథలైన బాలబాలికలను, వృద్ధులను, పేదవారిని చేరదీసి వాళ్ళకు కావలసిన అన్ని సౌకర్యాలు కలిగిస్తూ పోషిస్తున్నాడు. ఇటువంటి బరువు మోయడం, ఒక్కరివల్ల అయ్యే పనికాదు. “గడ్డిపరకలు అన్నీ కలిసి పెద్దతాడై ఏనుగును” కూడా బంధించవచ్చు. మన భారతీయ సంప్రదాయం చాలా గొప్పది. అటువంటి వారిని మనకు తోచిన విధంగా ఆదుకోవడం మన కర్తవ్యం. మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆ యువకుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోవడమే కాదు తమవంతు సహాయాన్ని కూడా అందిస్తున్నారు.

నేను ఈ మధ్య అక్కడకు వెళ్ళాను. అక్కడున్న బాలబాలికలను, వృద్ధులను, పేదవారిని చూశాను. నా హృదయం కరిగి పోయింది. బాధతో నిండిపోయింది. నేను కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఆశ కలిగింది. – “భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు” అని మనం ప్రతిరోజూ పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం.

కాబట్టి మనం కూడా మన పాఠశాల విద్యార్థుల పక్షాన కొంత డబ్బును, దుస్తులను, దుప్పట్లను, సబ్బులను, తలనూనెను, ఇంకా ఇతరములైన వస్తువులను సేకరించి వారికి అందించుదాం. మనం కూడా సమాజసేవలో పాలుపంచుకొందాం. సమాజ శ్రేయస్సే మన శ్రేయస్సు.

నేను ప్రేమతో వ్రాసిన ‘కరపత్రాన్ని’ చదివి బాలబాలికలేగాక, ధనవంతులు, ప్రముఖ వ్యాపారవేత్తలు తమవంతు సాయాన్ని అందించగలరని ప్రార్థించుచున్నాను.

“తోటి వారికి చేయూతనిద్దాం. మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం”
పేదరికంలేని సమాజాన్ని స్థాపిద్దాం.

ప్రశ్న 7.
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేసేలా ఒక ‘కరపత్రాన్ని’ తయారు చేయండి.
జవాబు.

శాంతి

స్నేహితులారా!

శాంతి అందమైన, ప్రశాంతమైన, ప్రకాశవంతమైన చల్లని తెల్లని కాంతులు విరజిమ్మే పండువెన్నెల వంటిది. అనంతమైన నీలాకాశంలో నిర్భయంగా రెక్కలు పరచుకొని ఎగిరే తెల్లపావురం వంటిది. ‘తనశాంతమె తనకు రక్ష’ అని సుమతీ శతకంలో చెప్పారు.

విరోధం మంచిదికాదు. విరోధం పెరిగినపుడు అన్నీ ప్రమాదాలే. పాము విషజంతువు. అది కాటువేస్తే ప్రాణం పోతుంది అని తెలిసి కూడా ఎవరైనా పాము వద్దకు వెళతారా? విరోధం కూడా పాములాంటిదే. అందుకే ఎవరితోనూ విరోధం పెంచుకోకండి.

స్నేహం, సోదరభావం పెంచుకుందాం. అందరం కలిసి మెలిసి శాంతియుతంగా జీవిద్దాం. జీవితాలు సుఖమయం చేసుకుందాం.

రండి. అందరూ శాంతిని పాటించండి.

శాంతి మిత్ర మండలి,
గాంధీనగర్,
కొత్తగూడెం.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 8.
వరకట్నానికి రోజూ ఎంతోమంది బలైపోతున్నారు. వీటిని గురించి పత్రికల్లో, టీ.వి.ల్లో రోజూ చూస్తూనే ఉన్నాం. వరకట్నం లాంటి భయంకరమైన దురాచారాన్ని నిర్మూలించాలనే భావం ప్రజల్లో కలిగేటట్లు “కరపత్రం” తయారు చేయండి.
జవాబు.

వరకట్నం – ఒక పెనుభూతం

యువతీయువకులారా ! మేల్కొనండి. వరకట్న పిశాచాన్ని తరిమి కొట్టండి. ఈనాడు వరకట్నం యువతులపాలిట జీవన్మరణ సమస్య అయింది. ఈ సమస్యకు ఎంతోమంది స్త్రీలు బలైపోతున్నారు. ఆ విధంగా బలైన ఆడపడుచు మన అక్కగాని, చెల్లిగాని అయితే మన గుండెలు ఎంత ఆక్రోశిస్తాయో ఒక్కసారి ఆలోచించండి. ఈ భయంకరమైన దురాచారాన్ని రూపుమాపకపోతే ఎంతో విజ్ఞానాన్ని సాధించినా మానవజాతికే సిగ్గుచేటు. మనం సంతలోని పశువులం కాదు. “చదువులేని వాడిని వింతపశువు” అన్నారు. చదువుకున్నవారు వెఱపశువులు కాకూడదు. వివాహం అనేది స్త్రీకి ఎంత ముఖ్యమో, పురుషులకూ అంతే ముఖ్యం. వివాహం స్త్రీ, పురుషుల పవిత్రబంధం. ఆడంబరాలకు పోవద్దు. నిరాడంబరంగా పెండ్లి చేసుకోండి. “కట్నం వద్దు, కన్యయే ముఖ్యం” అని భావించండి.

సంస్కారవంతమైన విద్య నేర్వండి.
సాంఘిక దురాచారమైన “వరకట్న సమస్య” కు సమాధికట్టండి.

ప్రశ్న 9.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు.

మహిళలపై వివక్ష ఇంకానా? – ఇకపై సాగదు

దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధించిందని ప్రతిదినం మనం అనుకునే మాటల్లో ఒకటి. అభివృద్ధి అంటే కేవలం సాంకేతికంగానే కాదు. విలువలతో కూడిన అభివృద్ధి కావాలి. దేశ జనాభాలో సగం మంది స్త్రీలున్నారు. సమాజాభివృద్ధిలో స్త్రీలది కీలకమైన పాత్ర. ఎంత చదువుకున్నా నేటికీ స్త్రీలు ఇంటా బయటా కూడా వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు.

ఈనాడు స్త్రీలపై జరుగుతున్న దాడులు సభ్యసమాజానికే సిగ్గుచేటుగా ఉన్నాయి. ఎంతోకాలంగా ఈ దాడులు జరుగుతున్నాయి. మహిళాసంఘాలు, ప్రభుత్వాలు, యువకులు దీనిని ఖండిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం, ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. దేశరాజధాని నడిరోడ్డులో నిర్భయపై జరిగిన అత్యాచారంగానీ, నిన్నగాకమొన్న ముంబాయిలో అనూహ్యపైన జరిగిన అత్యాచారంగానీ చూస్తుంటే ప్రపంచం ముందు భారతదేశం సిగ్గుతో తలవంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఇటువంటి సంఘటనలు చూసి స్త్రీ సమాజం భయపడాల్సిన అవసరం లేదు. నేడు స్త్రీలు ఉన్నత విద్యను చదువుతున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నారు. రాజకీయంగా ఎదిగారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, హెూంమినిష్టర్లు, కలెక్టర్లు, డాక్టర్లు ఇలా ఎన్నోరంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. మహిళల్లో చైతన్యం రావాలి. చట్టాలు తీసుకురావాలి. వాటిని గట్టిగా అమలుపరచాలి. చట్టాలు చేయడంలో స్త్రీల భాగస్వామ్యం ఉండాలి.

ఎందరో స్త్రీలు లాయర్లుగా, న్యాయమూర్తులుగా కూడా ఉన్నారు. ప్రొఫెసర్లు, మేధావులు ఉన్నారు. వీరంతా కూడా సంఘాలుగా ఏర్పడి మహిళాలోకానికి ధైర్యం చెప్పాలి. పురుషులు కూడా మహిళలకు ధైర్యాన్ని కలుగజేయాలి. దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలిగానీ, అధైర్యపడి ఎదుటివాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు.

మహిళలపై దాడులను ఖండిద్దాం. మహిళలపై వివక్షను ఎదిరిద్దాం.
మహిళల్లారా! మేల్కొనండి. ధైర్యంతో ముందడుగు వేయండి.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 10.
మన పరిసరాల్లో జీవించే పశు పక్ష్యాదుల పట్ల మనం ఏ విధంగా మసలు కోవాలో తెలుపుతూ ఒక కరపత్రం రాయండి.
జవాబు.

కరపత్రం

ప్రియమైన స్నేహితులారా !

మనం సంఘజీవులం. మనతోబాటు సమాజంలో ఎన్నో ఇతర ప్రాణులు కూడా జీవిస్తున్నాయి. ఆ ప్రాణులకు కూడా సుఖం, దుఃఖం, బాధ, ప్రేమ వంటి భావాలు ఉంటాయి. వాటికీ, మనకూ ప్రధానమైన భేదమల్లా మనం మాట్లాడగలం. అవి మాట్లాడలేవు. అంతే.

అటువంటిది మనం ఆ మూగజీవాలను పట్టించుకోకపోవటం అమానుషం. మన సంతోషం కోసం, సుఖం కోసం వాటిని బలితీసుకోవడం రాక్షసత్వం. జీవహింస చెయ్యొద్దు. మనలో కొంతమంది రకరకాల జంతువుల్ని పక్షుల్ని తెచ్చి సరదా కోసం ఇంట్లో బంధించి పెంచుతుంటారు. ఇది కూడా చాలా అన్యాయమే. వాటి స్వేచ్ఛను మనం హరించకూడదు.

జంతువులను పెంచుతున్నామనుకుంటాంగాని వాటికి తగిన వసతి కల్పించటం లేదు. వాటిని ఉంచే చోటునుగాని, వాటినిగాని శుభ్రంగా ఉంచటం మన కర్తవ్యం. వాటికి వేళప్రకారం తగినంత ఆహారం పెడితేనే అవి ఆరోగ్యంగా ఉంటాయి. వాటిచేత మనకు కావలసిన పనులు చేయించుకుంటున్నాం. వాటి కనీస అవసరాలు తీర్చడం మన కర్తవ్యం.

అందుకే అందరం ఒక్కటై జంతువులను, పక్షులను, ఇతర జీవాలను కాపాడుదాం. వాటిని హింసించకుండా ప్రేమగా చూసుకుందాం. వాటిని మన నేస్తాలుగా, కుటుంబ సభ్యులుగా ఆదరించుదాం. మనతోపాటూ వాటికికూడా జీవించే హక్కును కల్పించుదాం.

ఇట్లు
జీవావరణ పరిరక్షణ సమితి.

ప్రశ్న 11.
నగరంలో ప్రధాన సమస్య అయిన అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యపరచేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు.

అధిక జనాభా సమస్యను అధిగమిద్దాం

మిత్రులారా!

పొట్టచేత పట్టుకొని, జీవనోపాధికోసం, బ్రతుకు తెరువుకోసం పల్లెల నుండి నగరాలకు వలస వస్తున్న జనం రోజు రోజుకూ ఎక్కువయిపోతున్నారు.

ఉండటానికి నీడ దొరకక, నగర శివార్లలో, మురికి కాలువల ప్రక్క రోడ్ల ప్రక్క ఎక్కడపడితే అక్కడ నీడ వెతుక్కుంటున్నారు. ఫలితంగా మురికి వాడలు పెరుగుతున్నాయి. రోగాలు ముసురుకుంటున్నాయి.

అందరికీ ఉద్యోగాలు దొరకక నిరుద్యోగం పెరిగిపోతోంది.
భవనాలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు వీటి నిర్మాణంతో నగర ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. జల, వాయు, కాలుష్యాలు పెరిగిపోతున్నాయి.

ప్రజలందరి రాకపోకలతో విపరీతమైన రద్దీ పెరిగి, వాహనాల వాడకం పెరిగి శబ్దకాలుష్యం పెరిగిపోతోంది. ఏ వస్తువు ధరా సామాన్యుడికి అందుబాటులో లేదు.
ఇప్పుడు నగరాలు కాంక్రీటు అడవులయిపోయాయి. ఎక్కడా పచ్చని చెట్టు కనబడే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, శాంతిభద్రత సమస్య పెరిగిపోతుంది.

ఇప్పుడే మేల్కొందాం.
నగరాల వలస వ్యామోహం నుండి ప్రజలు బయటపడాల్సిన సమయం వచ్చింది.
నగర జీవనాన్ని విలువల జీవనంగా నడుపుకోనిదే భవిష్యత్తు లేదు.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ముఖాముఖి (ఇంటర్వూలు) / నినాదాలు / సంభాషణలు

ప్రశ్న 1.
మీ పాఠశాల వార్షికోత్సవానికి ప్రముఖులు వస్తున్నారు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి.
జవాబు.
పాఠశాల వార్షికోత్సవానికి యం.యల్.ఏ గారు వస్తే ఇంటర్వ్యూకు వేసే ప్రశ్నలు :

  1. మీరు రాజకీయాలలోకి ఎలా వచ్చారు ?
  2. మీకు చిన్నప్పటినుండీ రాజకీయాలంటే ఆసక్తి ఉందా ?
  3. మీరు పోటీ చేసినప్పుడు ఏ విధంగా ప్రచారం చేసారు ?
  4. మీరు గెలిచినపుడు మీకు ఏమనిపించింది ?
  5. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏమిటి ?
  6. మీరు మీ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు ?
  7. విద్యార్థులకు రాజకీయాలు అవసరమా ?
  8. ఒకవేళ మీరు విద్యామంత్రి అయితే పాఠశాలల అభివృద్ధికి ఏం చేస్తారు ?

ప్రశ్న 2.
బడిఈడు పిల్లలందరూ బడికి వెళ్ళి చదువుకోవాలనే సందేశమిచ్చేలా నినాదాలు రాయండి.
జవాబు.
ఎ) పిల్లలందరూ బడికెళ్ళాలి – పెద్దలందరూ పనికెళ్ళాలి.
బి) ఆటపాటలు పిన్నవయస్సులో – పనిపాటలు పెద్దవయసులో.
సి) పిల్లల భవితకు చదువే మూలం చదవని పిల్లలు జాతికి భారం.
డి) బడిఈడు పిల్లలను పనికి పంపడం నేరం వారి కష్టంపై ఆధారపడి బతకడం ఘోరం.
ఇ) బాలలందరినీ బడికి పంపడం పెద్దల మొక్కు – ఆటపాటలతో చదువుకోవడం బాలల హక్కు.
ఎఫ్) బడిఈడు పిల్లలందరూ బడిలోనే.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 3.
వరకట్న దురాచారంపై ఇద్దరు మిత్రుల సంభాషణ రాయండి.
జవాబు.
లలిత, కవిత అనే స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటారు.
లలిత : కవితా ! ఏం చేస్తున్నావు ? పేపర్లో ఏమిటి తదేకంగా చదువుతున్నావు ?
కవిత : ఏమీ లేదు. వరకట్నానికి మరొక స్త్రీ బలైపోయిందట, దాని గురించి.
లలిత : ఓ ! అదా ! పేపరులో ఇటువంటి వార్తలు మనకు రోజూ మామూలేగా.
కవిత : అవును. ఈ వరకట్నం దురాచారం ఎట్లా అవుతుంది?
లలిత : అదేమిటి ? నీకు తెలియదా ?
కవిత : విన్నాను. కానీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నా.
లలిత : అయితే, ముందు వరకట్నం అంటే ఏమిటో చెప్పు.
కవిత : ఆ, తెలుసులే, తమ కూతురును పెళ్ళిచేసుకుంటున్నందుకు ఆడపిల్ల తల్లిదండ్రులు మగపెళ్ళి వారికిచ్చే కట్నకానుకలు.
లలిత : మరి తెలిసి కూడా అడుగుతున్నావేమిటి ?
కవిత : నాకు వరకట్నం అంటే ఏమిటో తెలుసుగానీ అది దురాచారం ఎట్లా అవుతుందో అంతు బట్టడంలేదు.
లలిత : ఇప్పుడు నువ్వేకదా వరకట్నానికి మరొక స్త్రీ బలి అని చదివావు. దాని కారణంగా ఎంతోమంది స్త్రీలు బలైపోతున్నారు. దురాచారమని చెప్పడానికి ఇది చాలదా.
కవిత : మరి కట్నాలూ, కానుకలూ మన సంప్రదాయం కదా !
లలిత : కొన్ని సంప్రదాయాలు ఆచరణలోకి వచ్చేటప్పటికి, వైరుధ్యం కనిపిస్తుంది. ఉద్దేశ్యం, లక్ష్యం పూర్తిగా నాశనమవుతాయి.
కవిత : అంటే వరకట్న సంప్రదాయం మంచిదనేగా నీ ఉద్దేశ్యం.
లలిత : అగ్ని సాక్షిగా జరిగే పెళ్ళి ఒక పవిత్రకార్యం. భగవంతుని కల్యాణం వంటిది. ఆ కల్యాణంలో ఎవరికి తోచిన కట్నకానుకలు వారు సమర్పించుకోవచ్చు. కానీ మీరు ఇంత చెల్లించకపోతే ఊరుకోం అంటూ నిర్బంధాలు విధించడంతోనే సమస్యలు మొదలవుతాయి. అట్లా మొదలైన వరకట్నం సమస్య ఇప్పుడు ఒక పెద్ద దురాచారమై ఎంతో విలువైన మన అక్కాచెల్లెళ్ళ ధన మాన ప్రాణాలను హరించి వేస్తోంది.
కవిత : నాకు అర్థమైంది. వరకట్నం ముమ్మాటికీ దురాచారమే.
లలిత : అదిగో బెల్లు కొట్టారు. వరకట్న దురాచారాన్ని ఆపడానికి మనమేం చేయాలో మరొకసారి మాట్లాడుకుందాం.

TS 8th Class Telugu Grammar కరపత్రాలు / నినాదాలు

ప్రశ్న 4.
‘ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు’ – దీనిపై రాము – సోము మధ్య జరిగిన సంభాషణను ఊహిస్తూ 10 వాక్యాలలో రాయండి.
జవాబు.
బళ్ళో భోజన విరామంలో ఒక చోట కూర్చొని అన్నం తింటూ రాము – సోము మాట్లాడుకుంటున్నారు.
రాము : సోమూ ! ఏవిట్రా ! ఇవాళ నువ్వు బాక్సులో పచ్చడి మాత్రమే తెచ్చుకున్నావు ?
సోము : అవున్రా. మా అమ్మకు వంట్లో బాగాలేదు. నాకేమో వంట చేయడం రాదు. మా అక్క చేస్తుంటే బడికి ఆలస్యమవుతుందని తొందరగా వచ్చేశా.
రాము : మీ అమ్మ ఏమి చదువుకున్నారు ? ఉద్యోగం చేస్తారా ?
సోము : మా అమ్మ ఎంఏ చదువుకున్నది. ఉద్యోగం రాలేదు. నాకు ఇంటి దగ్గర హెూంవర్క్ అంతా మా అమ్మే దగ్గరుండి చేయిస్తుంది.
రాము : మరి మీ అక్క ఏమి చదువుతుంది ?
సోము : మా అమ్మ అంత చదువుకున్నా ఉద్యోగం రాలేదని మా అక్కను ఇంటర్ పూర్తయ్యాక పై చదువులకు పంపలేదు.
రాము : అదేమిటి ? చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేయాలని ఏముంది ? అయినా మీ కుటుంబ సభ్యులందరికీ ఏ లోటు లేకుండా చూసుకోవడంలో మీ అమ్మ పడే శ్రమ ముందు ఏ ఉద్యోగం పనిచేస్తుంది ? పైగా ఆమె చదువుకోవడం వల్లనే కదా నువ్వు రోజూ నిశ్చింతగా హెూంవర్క్ చేయగలుగుతున్నావు.
సోము : నిజమేరా ! అయితే చదువు ఉద్యోగం కోసం కాదంటావా ?
రాము : చదువు కేవలం ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఏలడం కోసం మాత్రమే కాదు. వ్యక్తిత్వం కోసం ప్రపంచ జ్ఞానం కోసం, సాధారణ పరిజ్ఞానం కోసం. ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు దానికి మీ అమ్మను మించిన గొప్ప ఉదాహరణ ఏముంది ?
సోము : నువ్వు చెప్పింది బాగుందిరా రాము. నేను ఈ రోజే మా నాన్నతో మాట్లాడి మా అక్కను పై చదువులకు పంపమని గట్టిగా పట్టుబడతాను.
రాము : సరే ! సరే! అదిగో గంట కొట్టే వేళయింది., ఇదిగో నా బాక్సులో ఉన్న కూరను చెరి సగం చేసుకుందాం తీసుకో. (ఇద్దరూ అన్నం తిని తరగతికి వెళతారు)

TS 8th Class Physical Science Important Questions

TS 8th Class Physical Science Important Questions

TS 8th Class Physics Physical Science Important Questions

TS 8th Class Study Material

TS 8th Class Social Guide Telangana Pdf | TS 8th Class Social Study Material Telangana Pdf English Medium

Telangana SCERT Class 8 Social Solutions | 8th Class Social Question Bank Pdf Telangana

8th Class Social Study Material Telangana Pdf Theme I Diversity on the Earth

8th Class Social Guide Telangana Pdf Theme II Production, Exchange and Livelihoods

Telangana SCERT Class 8 Social Solutions Theme III Political Systems and Governance

8th Class Social Question Bank Pdf Telangana Theme IV Social Organisation and Inequities

TS 8th Class Social Study Material Pdf Download Theme V Religion and Society

Telangana SCERT 8th Class Social Solutions Theme VI Culture and Communication

TS 8th Class Social Study Material Telangana Pdf English Medium

TS 8th Class Social Guide Telangana Pdf

TS 8th Class Study Material

TS 8th Class Hindi Guide Pdf Telangana | TS 8th Class Hindi Study Material Pdf Download Telangana

TS 8th Class Hindi Study Material Telangana Pdf Download | 8th Class Hindi Guide Telangana

Telangana SCERT Class 8 Hindi Solutions | 8th Class Hindi Guide Pdf 2023 Telangana

TS 8th Class Hindi रचना

TS 8th Class Hindi Study Material Telangana Pdf Download

TS 8th Class Hindi Guide Pdf Telangana

TS 8th Class Study Material

TS 8th Class Hindi Bits with Answers Pdf

TS 8th Class Hindi Important Bits | TS 8th Class Hindi Bit Bank

TS 8th Class Study Material

TS 8th Class Telugu Guide Answers Study Material Pdf Download Telangana

TS 8th Class Telugu Study Material Pdf – TS 8th Class Telugu Guide Telangana Pdf Download

Class 8 Telugu Textbook Solutions Telangana | TS 8th Class Telugu Guide Answers

TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం

TS 8th Class Telugu Study Material Grammar

TS 8th Class Telugu Guide Answers

TS 8th Class Telugu Study Material Telangana

TS 8th Class Study Material

TS 8th Class English Important Questions Telangana

TS 8th Class English Important Questions Telangana

TS 8th Class Study Material