TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 8th Lesson చిన్నప్పుడే Textbook Questions and Answers.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

చదువండి – ఆలోచించి చెప్పండి: (TextBook Page No.78)

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే 1

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పై బొమ్మలోని సన్నివేశం ఎక్కడ జరుగుతుండవచ్చు ?
జవాబు.
పై బొమ్మలోని సన్నివేశం గ్రామంలోని ‘రచ్చబండ’ వద్ద జరుగుతున్నది. చెట్టు నీడలో గ్రామస్థులు సమావేశమయ్యారు. ఒక నాయకుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు.

ప్రశ్న 2.
మీ గ్రామంలో ఇట్లాంటి దృశ్యం ఎప్పుడైనా చూశారా ? ఎప్పుడు ?
జవాబు.
మా గ్రామంలో ఇటువంటి దృశ్యం నేను చూశాను. మా గ్రామంలో గ్రామప్రజలు, రాములవారి గుడివద్ద గ్రామ సభలకు సమావేశం అవుతూ ఉంటారు.

ప్రశ్న 3.
మాట్లాడుతున్న నాయకుడు ఏం చెప్పుతున్నాడని మీరు అనుకుంటున్నారు ?
జవాబు.
మాట్లాడుతున్న నాయకుడు, గ్రామప్రజలకు వారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉండియుంటాడు. రాబోయే ఎన్నికలలో ఎలా ఓటు చేయాలో చెపుతూ ఉంటాడు. ఆ గ్రామానికి ఉన్న సమస్యలను తీర్చుకొనే మార్గాన్నీ, ఆ విషయంలో వారు అనుసరింపవలసిన కర్తవ్యాన్నీ వారికి అతడు గుర్తు చేస్తూ ఉండి యుంటాడు.

ప్రశ్న 4.
స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఇట్లాంటి దృశ్యాలు ఊరిలో కనిపించేవని మీకు తెలుసా ?
జవాబు.
ఇటువంటి దృశ్యాలు ప్రతి ఊరిలో కనిపించేవని నాకు తెలియదు. కానీ మా ముత్తాతగారు, స్వాతంత్ర్యోద్యమకాలంలో ఇలాంటి దృశ్యాలు కనిపించేవని మా నాన్నగారికి చెప్పేవారట.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.82)

ప్రశ్న 1.
“వరికోతల రోజులు. అయినా పొలాల్లో ఎవరూ లేరు” ఈ వాక్యాన్నిబట్టి మీకేమి అర్థమయింది ?
జవాబు.
వెంకట్రావుకు స్వాగతం చెప్పడానికి గ్రామ ప్రజలంతా ఉత్సాహంతో ఉన్నారు. స్వాగత సన్నాహాల్లో మునిగి పోయారు. అందుకోసం వరికోతల రోజులైనా పొలాల్లో ఎవరూ లేరని అర్థం అయింది.

ప్రశ్న 2.
ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడమంటే ఏమిటి ?
జవాబు.
ఆత్మీయులైన వ్యక్తులు, బంధువులు, ప్రముఖ నాయకులు, సంఘసంస్కర్తలు మొదలైనవారు తమ . ప్రాంతాలకు వస్తున్నప్పుడు మర్యాద పూర్వకంగా వారికి ఎదురుగా వెళ్ళి స్వాగతం పలుకుతారు. పిమ్మట వారిని సగౌరవంగా వెంటబెట్టుకొని తమ ప్రాంతానికి తీసుకొని వస్తారు. దీన్నే ఎదురేగి తీసుకొని రావడం అని అంటారు.

ప్రశ్న 3.
“పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు” కదా ! వాళ్ళు అట్లా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయి ?
జవాబు.
పిల్లలందరు నాయకుణ్ణి చుట్టిముట్టి అమితోత్సాహంతో చుట్టిముట్టారు. ఉసిరికాయలను అందించారు. ఆ నాయకులు తమపట్ల అపరిమితమైన వాత్సల్యాన్ని ప్రదర్శించడంతో పిల్లలు మిక్కిలి చనువుతో చుట్టేసి ఉండవచ్చు. తమ సమస్యలను వారిదృష్టికి తీసుకొని రావడానికి జరిగే ప్రయత్నం కూడా ఒక కారణం అని తెలుస్తుంది.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.83)

ప్రశ్న 1.
పిల్లలు చెప్పిన విషయాలను బట్టి ఆనాటి గ్రామాల పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
పిల్లలు చెప్పిన విషయాలను బట్టి ఆనాటి గ్రామాల పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయని తెలుస్తున్నది. దొరల పాలన సాగేదని, దొరలు పేదలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేవారని తెలుస్తుంది. ప్రతి చిన్న తప్పుకు కఠినమైన శిక్షలు అమలు చేసేవారని అర్థం అవుతున్నది. గ్రామ పెత్తందార్లు నిజాం పేరు చెప్పి ప్రజలపై పెత్తనం చెలాయించే వారిని కూడా తెలుస్తున్నది.

ప్రశ్న 2.
“మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా” అని నాయకుడు అనడంలోని ఉద్దేశమేమి ?
జవాబు.
నిజాం పాలనలో సామాన్య ప్రజల జీవితం దుర్భరంగా ఉండేది. అవమానాలతో అప్పులు, రోగాలతో ఉండేది. ఉద్యమం కొనసాగించి స్వాతంత్ర్యం వ్యక్తిగత గౌరవంతో బ్రతకడానికి పిల్లలకు అవకాశం ఇవ్వాలని లేకపోతే పిల్లలకు అప్పులు, రోగాలు మిగిల్చినవారము అవుతామని నాయకుని ఉద్దేశం.

ఇవి చేయండి :

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:

ప్రశ్న 1.
‘చిన్నప్పుడే’ కథ చదివారు కదా ! దీని ఆధారంగా స్వాతంత్ర్యానికి ముందు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించండి, మాట్లాడండి.
జవాబు.

  1. ఊరి మునసబు (పటేలు) తప్పిపోయిన పశువులను బందెల దొడ్డిలో పెట్టించేవాడు. వాటిని విడిపించుకొని రావాలంటే, పటేలుకు పదిరూపాయిలు ఇవ్వాల్సి వచ్చేది.
  2. దున్నపోతుకు మోతాడు అంటే ముట్టెకు తాడు వేయకపోతే, అది ఎవరినైనా బుస్సుమని పొడవడానికి వెడితే ముప్ఫైరూపాయలు జరిమానా మాలిపటేలు తీసుకొనేవాడు.
  3. ప్రభుత్వ పన్ను కట్టకపోతే రైతుల భుజాలపై రాతిబండలు ఎత్తించేవారు.
  4. కూలికి వెళ్ళి పొయ్యిలోకి కట్టెపుల్లలు ఏరుకుంటే, స్త్రీలను సిగపట్టుకొని కొట్టేవారు. ఎవరైనా అందుకు అడ్డం వస్తే వారినీ కర్ర తీసుకొని కొట్టేవారు.
  5. అడవిలో పేడ ఏరుకొని తెచ్చుకుంటే, పోలీసు పటేలు మందలించి తట్ట లాగుకొనేవాడు.
  6. గ్రామంలో మునసబు, కరణాలు పెత్తందార్లుగా ఉండేవారు. వారు పల్లె ప్రజలపై అడుగడుగునా పెత్తనం చేసేవారు.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:

1. పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారో చర్చించండి.

అ) వీండ్లందరెవరో ఎరికేనా ?
జవాబు.
పిల్లలందరూ నాయకులను చుట్టేశారు. వారికి ఉసిరికాయలను ఇచ్చారు. పిల్లల అభిమానానికి సంతోషించిన వెంకట్రావు పిల్లలను ప్రశ్నించుచున్న సందర్భంలోని మాటలివి.

ఆ) నేను సంగిశెట్టి కొడుకును.
జవాబు.
పిల్లలు ఇచ్చిన ఉసిరికాయలను నాయకులు ఆనందంతో తిన్నారు. పిమ్మట నాయకుల్లో ఒకడు నెత్తినుండి కారేటంత నూనె పెట్టుకున్న ఒక బాబుని చూచి “మీరు ఎవరబ్బాయివి ? అని అడిగాడు. అది విని బాలుడు సమాధానం ఇస్తున్న సందర్భంలో పలికిన మాటలివి.

ఇ) మన సంతానమంతా హాయిగా బతుకుతారు.
జవాబు.
పిల్లలు తమ బాధలను నాయకులకు చెప్పారు. గ్రామ పెద్దలు కూడా తమ కష్టాలను చెప్పుకున్నారు. మాటలు విని చలించిపోయిన ఒక నాయకుడు పలుకుతున్న సందర్భంలోని మాటలివి.

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

నిజాం రాష్ట్రంలో సాంస్కృతికంగా, భాషాపరంగా అణచివేయబడిన తెలంగాణ ప్రజల్లో వారి మాతృభాష, సంస్కృతి పట్ల గాఢాభిమానం కలిగించటంలో ఆనాడు తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు ఎంతో దోహదం చేశాయి. తెలంగాణలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించటం ద్వారా వారి జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయుల్లో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి, రావి నారాయణరెడ్డి ముఖ్యులు. జాతిని చైతన్యపరిచే లక్ష్యంతోనే మాడపాటి హనుమంతరావు ఆంధ్రోద్యమాన్ని తెలంగాణలో అంటే అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించాడు.

ప్రశ్నలు :

అ) అణచివేతకు గురైన వారెవరు ?
జవాబు.
తెలంగాణ ప్రజలు అణచివేతకు గురైన వారు.

ఆ) వాళ్ళు ఏ ఏ విషయాల్లో అణిచివేతకు గురి అయ్యారు ?
జవాబు.
వాళ్ళు సాంస్కృతికంగా, భాషాపరంగా అణిచివేతకు గురి అయ్యారు.

ఇ) తెలంగాణలో ఆంధ్రోద్యమం ఎందుకు విస్తరించింది ?
జవాబు.
తెలంగాణలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించడం ద్వారా ఆంధ్రోద్యమం విస్తరించింది.

ఈ) తెలంగాణ ప్రజల్లో భాషాసంస్కృతులపట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలేవి ?
జవాబు.
తెలంగాణ ప్రజల్లో భాషాసంస్కృతులపట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలు ఇవి – అలనాటి తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు ముఖ్యమైనవి.

ఉ) తెలంగాణలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయులు ఎవరు ?
జవాబు.
తెలంగాణలో జాతీయ, సాంస్కృతిక వికాసం కోసం కృషి చేసిన మహనీయులలో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి మొదలైన వారు ప్రముఖులు.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) వెంకట్రావు స్వభావాన్ని తెల్పండి.
జవాబు.
వెంకట్రావు ఆంధ్రమహాసభ కార్యకర్త. ప్రజలు చిన్నా, పెద్దా, వెంకట్రావును తమ ధన ‘మాన’ ప్రాణ రక్షకునిగా భావించేవారు. అతడు ఆంధ్రమహాసభకు కార్యకర్తగా ఉండి, దీక్షతో గ్రామీయుల సమస్యలను తీసుకొని పనిచేసేవాడు. వెంకట్రావు తన కృషితో అడుగడుక్కీ నిందలూ, నేరాలూ మోపడం, లంచాలు లాగడం వంటివి లేకుండా గ్రామపెత్తందార్ల నుండి ప్రజలకు రక్షణ కల్పించాడు.

పెద్దా చిన్నా, స్త్రీ, పురుషుడూ అనే తేడా లేకుండా ప్రతివారినీ, దుర్భాషలాడటం, వారిపట్ల నీచంగా ప్రవర్తించడం, వంటివి గ్రామాల్లో జరుగకుండా, వెంకట్రావు కట్టడి చేశాడు. దయతో గ్రామపెత్తందార్లు ఇచ్చే కూలితో, విధి విరామం లేకుండా జీవితాంతం వారికి వెట్టిచాకిరీ చేయవలసిన అవసరం లేకుండా, వెంకట్రావు కృషిచేశాడు.

ఆ) వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలేవి ?
జవాబు.
వెంకట్రావు వంటి యువకులు, ప్రజలకు కలిగే కష్టనష్టాల్ని నివారించడానికి ప్రయత్నిస్తారు. ప్రజలకు అండగా ఉండి, వారి పక్షాన తాము అన్యాయాన్ని ఎదిరించి పోరాడతారు. యజమానుల దుర్మార్గాల్ని అరికట్టడానికి, కృషిచేస్తారు. యువకులను పోగుచేసి, వారి సాయంతో గ్రామీయుల సమస్యలను తీర్చి, వారికి సుఖ సంతోషాలు కలిగిస్తారు. ప్రజలకు అండగా, సహాయకులుగా ఉంటారు. ఇతరుల మేలు కోసమే వారు పనిచేస్తారు. వారు స్వార్థానికి చోటివ్వరు.

ఇ) వెంకట్రావుతో నేటి యువతను పరిశీలించి, పోల్చండి.
జవాబు.
వెంకట్రావు పరోపకారి. సంఘసేవకుడు. ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావించి, వాటిని తీర్చడానికి ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తాడు. విజయం సాధిస్తాడు. ప్రజలందరూ వెంకట్రావును, తమ ధన, మాన, ప్రాణరక్షకునిగా భావించారు. నేటి యువకులు ఎక్కువగా స్వార్థపరులు. తమ సంగతి తాము చూసుకుంటున్నారు. తమకు మేలు చేస్తామంటే ఇతరులకు హాని చేయడానికి కూడా నేటి కొందరు యువకులు ముందుకు వస్తున్నారు. అయితే నేటి యువతలో కూడా చాలామంది మంచివారున్నారు. వారు కూడా వెంకట్రావువలె పరోపకారులుగా, సంఘసేవకులుగా పనిచేస్తున్నారు.

ఈ) “మనం ఈ రోజు స్వార్థ రహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బ్రతుకుతారు” అని ఒక నాయకుడు ఎందుకు అని ఉంటాడు ?
జవాబు.
ఆ రోజుల్లో గ్రామపెత్తందార్లు అనగా కరణం, మునసబులు, గ్రామనౌకర్లు, పోలీసు అధికారులు, పోలీసులు వగైరా నైజాం ప్రభువు వద్ద పనిచేసే చిన్న అధికారులు మాటిమాటికీ ప్రజల్ని బెదిరించి, తిట్టి, కొట్టి, జరిమానాలు విధించి వసూలు చేసేవారు. ప్రజలు వారికి నమస్కారాలు పెట్టవలసి వచ్చేది.

ఆ పెత్తందార్లు తమకు కావలసిన వస్తువులను ప్రజల నుండి బలవంతంగా తీసుకుపోయేవారు. అడవుల్లో పుల్లముక్కలు ఏరుకోడానికి కాని, పేడ ఏరుకోడానికి కాని ప్రజలకు అనుమతి లేదు.

అందుకే ఆ నాయకుడు తామంతా ధైర్యంగా పట్టుదలతో ఆ పెత్తందార్లకు ఎదురు తిరిగితే, తమకు స్వాతంత్ర్యం వస్తుందనీ, తమ పిల్లలు హాయిగా బతుకుతారని చెప్పి, ప్రజలకూ, కార్యకర్తలకూ ధైర్యాన్నీ నూరిపోశాడు.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) ‘చిన్నప్పుడే’ కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా ! నాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా ? కారణాలు ఏమిటి ?
జవాబు.
నిజాం చక్రవర్తి పరిపాలనలో ఆనాడు తెలంగాణ ప్రాంతం ఉండేది. గ్రామంలో పెత్తందార్లు ప్రజలను మాటిమాటికీ హింసించి జరిమానాలు విధించేవారు. ప్రజలు పెత్తందార్లంటే భయంతో ఉండేవారు. ఊరి దొరలు ప్రజల బర్రెలను బందెల దొడ్డిలో పెట్టించేవారు. చేలో దూడపడితే ఊరి పటేలు 10 రూపాయలు జరిమానా పుచ్చుకునేవాడు. ఒక దున్న పక్కవారిపై బుస్సుమంటే దానికి మోతాడు వేయలేదనే నేరం మోపి, మాలీ పటేలు వారివద్ద 30 రూపాయలు వసూలు చేసేవాడు.

ఆడవారు కూలికి వెళ్ళి చేలో కట్టెలు ఏరుకుంటే, దొరగారి శేగిదారు ఆడవాళ్ళను కొప్పు పట్టుకొని కొట్టేవాడు. ఎవరైనా అడ్డుపడితే వారిని సైతం కొట్టేవాడు. వండుకొన్న తిండిని కూడా గిర్దావరుల కోసం పట్టుకుపోయేవారు. ఆనాడు అడవులలో పేడ ఏరుకున్నా తట్టలు లాగుకొనేవారు, మందలించేవారు. ఈ విధంగా గ్రామ పెత్తందార్లు, నిజాం పేరు చెప్పి ప్రజలపై పెత్తనం సాగించేవారు.

అప్పుడే ఆంధ్రమహాసభ బయలుదేరింది. ఆ మహాసభ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళి, ప్రజలకు ధైర్యం చెప్పేవారు. మహాసభవారి కృషి ఫలితంగా గ్రామం పెత్తందార్లు మాటిమాటికీ నిందలు మోపి లంచాలు లాగడం ఆగిపోయింది. వెంకట్రావు వంటి కార్యకర్తల కృషి వల్ల చిన్నా, పెద్దా ఆడా, మగ అనే తేడా లేకుండా, తిట్టడం, నీచంగా ప్రవర్తించడం ఆగిపోయింది. వెట్టిచాకిరీ నిర్మూలనం అయ్యింది.

ఏమయినా ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో చిన్న పిల్లలకు సైతం గ్రామపెత్తందార్ల కిరాతక కృత్యాలు తెలిశాయి. వారు కూడా ధైర్యంగా ఎదురు తిరగడం మొదలుపెట్టారు. పిల్లలు చదువులు ప్రారంభించారు.

IV. సృజనాత్మకత / ప్రశంస:

1. కింది అంశాల గురించి సృజనాత్మకంగా రాయండి.

అ) ఈ పాఠం ఆధారంగా చేసుకొని, మీ అనుభవాలతో ఒక చిన్న కథ రాయండి.
జవాబు.
మా ఊరు చిన్న పల్లెటూరు. తరతరాలుగా ప్రజలు మంచినీరు లేక బాధపడుతున్నారు. ఎందరు నాయకులు వచ్చినా, ఎన్ని ఎన్నికలు వచ్చినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. మా ఊరిలో రాము, గోపి అనే ఇద్దరు యువకులు ఇంజనీరింగ్ చదివారు. వాళ్ళు మా గ్రామానికి మంచినీటి సదుపాయం కల్పించినవారికే ఓటు వేస్తామని ప్రజలచే కట్టు కట్టించారు. దానితో ఎమ్.ఎల్.ఎ మరియు ఎమ్.పి గార్లు పట్టుబట్టి, మా గ్రామానికి కోటి రూపాయిలు నీటి సదుపాయానికి మంరు చేయించారు.

అయితే ప్రజల భాగస్వామ్యం లేనిదే ప్రాజెక్టు మొదలు పెట్టమన్నారు. నీటి సదుపాయం మా పక్క గ్రామాలవారికి కూడా ఉపయోగిస్తుంది. రాము, గోపి నడుం కట్టారు. ప్రతి ఇంటికి నెలకు రూ. 30 చొ॥న 5 నెలలు వసూలు చేశారు. ధనవంతులు మరింతగా సాయం చేశారు. మా గ్రామాల తరపున 1 లక్ష రూపాయల మొత్తం ప్రజలు ప్రభుత్వానికి కట్టారు. అంతే ఏడాదిలో మా గ్రామాలకు కుళాయిలు వచ్చాయి. రామునూ, గోపీనీ మా గ్రామప్రజలు సత్కరించారు. ప్రభుత్వం కూడా వారికి ‘యువరత్న’ బిరుదు ఇచ్చి గౌరవించింది. మా ఊళ్ళో వాళ్ళందరికీ వాళ్ళు, కుళాయి రాము, కుళాయి గోపి అయ్యారు.

(లేదా)

ఆ) వెంకట్రావువలె గ్రామం బాగుకోసం పాటు పడుతున్న వాళ్ళు నేడు కూడా ఉంటారు. అటువంటి వారి సేవలను ప్రశంసిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు.

అభినందన పత్రం

మాది ఆదిలాబాదు నగరం. మా మునిసిపాలిటీ వారు వీధులలో చెత్త ఎత్తేందుకు కాంట్రాక్టర్లను ఏర్పాటుచేశారు. మురికి కాలువలను శుభ్రం చేయడం కూడా వారి పనే. కాని ఆ కాంట్రాక్టరు స్థానిక రాజకీయ ప్రముఖునికి బంధువు. దానితో మా నగరం పరిశుభ్రత విషయం, కాంట్రాక్టరు పట్టించుకోలేదు.

అప్పుడే రాజారావు అనే యువకుడు నగరంలోని పిల్లలను పోగుచేసి ఒక సంఘం పెట్టాడు. వారంతా కాంట్రాక్టరు ఇంటి దగ్గర, రాజకీయ ప్రముఖుని ఇంటి దగ్గరా వరుసగా నాలుగురోజులు ధర్నా చేశారు. దానితో నగర ప్రజలు మేల్కొన్నారు. తమ వీధిని బలవంతంగా కాంట్రాక్టరును అడిగి, శుభ్రం చేయించుకుంటున్నారు. రాజారావు మిత్రులు రోజూ నగరం అంతా తిరిగి, శుభ్రంగా లేకపోతే కమీషనరుకు ఫిర్యాదు చేస్తున్నారు. కమిషనరు శ్రద్ధ తీసుకోకపోతే తిరిగి ధర్నా చేయడానికి సిద్ధపడతారు.

ఈ దెబ్బతో మా నగరం ఇప్పుడు కళకళలాడుతోంది. రాజారావుకూ, మిత్రులకూ మీ పత్రిక ముఖంగా నా అభినందనలు అందిస్తున్నా.

ఇట్లు, యస్. గంగరాజు,
8వ తరగతి, గాంధీజీ హైస్కూలు,
ఆదిలాబాదు.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

V. పదజాల వినియోగం:

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకొండి. రాయండి.

అ) వెంకట్రావుకు పెట్టే దండంలో పెత్తందార్లకు పెట్టే దండంలో తేడా కనిపించింది.
జవాబు.
దండం = నమస్కారం

ఆ) ఆ నాయకుడు పిల్లలకు అవ్యాజ బంధువైపోయాడు.
జవాబు.
అవ్యాజ = కపటములేని (సహజమైన)

ఇ) సర్కారీ రకం కట్టలేదని ఆ పిల్లవాని తండ్రికి బండలెత్తారు.
జవాబు.
రకం = పన్ను

ఈ) ఆ బువ్వలోనే మీరం, ఉప్పుపోసుకొని పిల్లవాడు తిన్నాడు.
జవాబు.
మీరం = కారం, మిరియం

ఉ) కష్టాల సంగతి నాయనకు ఎరుక.
జవాబు.
ఎరుక = జ్ఞానం, తెలుసు

2. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి.

ఉదా : ఊళ్ళోని యువకుడు వెంకట్రావుకు దండం పెట్టాడు.
పర్యాయపదాలు : దండం : నమస్కారం, అంజలి

అ) పిల్లల పట్ల ఆయనకు గల ప్రేమకు విలువ కట్టలేం.
జవాబు.
పర్యాయపదాలు : విలువ = ఖరీదు, మూల్యం

ఆ) పిల్లలు తమ కష్టాలను కుప్పలుగా కురిపించారు.
జవాబు.
పర్యాయపదాలు : కుప్పలు : ప్రోగులు, రాశులు

ఇ) పిల్లలందరూ గభాలున అతని వద్దకు చేరుకున్నారు.
జవాబు.
పర్యాయపదాలు : గభాలున : గుభేలున, గుభిల్లున

ఈ) నీ చేతులకు వెండి కడియాలున్నాయి.
జవాబు.
పర్యాయపదాలు : వెండి : రజతం, కలధౌతం.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

3. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు రాయండి.

అ) నాయకులు ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు.
జవాబు.
మొగం (వికృతి) – ముఖం (ప్రకృతి)

ఆ) అతడు పట్టలేని సంతసం తో పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు.
జవాబు.
సంతసం (వికృతి) – సంతోషం (ప్రకృతి)

ఇ) మనం ధైర్యంగా కష్టపడి పనిచేస్తే మన పిల్లలు సుకంగా ఉంటారు.
జవాబు.
సుకం (వికృతి) – సుఖం (ప్రకృతి)

ఈ) గారవం పొందాలంటే మంచి పనులు చేయాలి.
జవాబు.
గారవం (వికృతి) – గౌరవం (ప్రకృతి)

VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. కింది పట్టికలోని ఖాళీలను పూరించండి.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే 2

జవాబు.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
రాజ్యకాంక్ష రాజ్యమునందు ఆకాంక్ష సప్తమీ తత్పురుష సమాసం
విజయగర్వం విజయం వల్ల గర్వం పంచమీ తత్పురుష సమాసం
అష్టదిక్కులు అష్ట సంఖ్యగల దిక్కులు ద్విగు సమాసం
బలరామకృష్ణులు బలరాముడును, కృష్ణుడును ద్వంద్వ సమాసం
ప్రజలభాష ప్రజల యొక్క భాష షష్ఠీ తత్పురుష సమాసం
అక్రమము క్రమము కానిది నఞ తత్పురుష సమాసం

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

ఆమ్రేడిత సంధి :

కింది వాటిని చదువండి.

ఔరౌర ! ఎంత గొప్పపని చేశావు.
ఆహాహా ! ఎంతో ఆనందం కలిగించావు.

పై వాక్యాలలో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే
ఔరౌర = ఔర + ఔర
ఆహాహా = ఆహా + ఆహా – అవుతున్నాయి కదా !

ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.
పై పదాలను గమనిస్తే……….
ఔర = ఔర్ + అ
ఆహా = ఆహ్ + ఆ

ఆ పదాల చివర అచ్చులు కనబడుతున్నాయి. వాటికి ఆమ్రేడితం వచ్చి చేరితే ఏమవుతుందో చూద్దాం.
ఔర + ఔర = ఔరౌర

ఔ (ర్ + అ) = ఔర అని ఉండగా అకారం లోపించి ఔర్ + ఔర అని ఉంటుంది. ఆమ్రేడిత పదంలోని ‘ఔ’ వచ్చి చేరి “ఔరౌర” అని అయింది.

అట్లాగే ఆహా + ఆహా : = ఆ (హ్ + ఆ) + ఆహా = ఆహాహా
దీనివల్ల అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఇది ‘ఆమ్రేడితసంధి’.
“అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగానగు.”

2. కింది పదాలను కలిపి రాయండి.

అ) అప్పుడు + అప్పుడు = ____________
జవాబు.
అప్పుడప్పుడు

ఆ) ఏమి + ఏమి = ____________
జవాబు.
ఏమేమి

ఇ) ఊరు + ఊరు = ____________
జవాబు.
ఊరూరు

ఈ) ఇంట + ఇంట = ____________
జవాబు.
ఇంటింట

ఉ) ఓరి + ఓరి = ____________
జవాబు.
ఓరోరి.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

ద్విరుక్తటకార సంధి:

ఈ కింది పదాలను చదువండి.

అ) పగలు + పగలు = పట్టపగలు
ఆ) చివర + చివర = చిట్టచివర
పై పదాలు కలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పగలు + పగలు = పట్టపగలు అవుతోంది.
అంటే మొదటి పధంలోని పగలులో ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ పోయి దానికి బదులుగా ‘ట్ట’ వచ్చింది. అప్పుడు పట్టపగలు అయింది., అట్లనే ‘చిట్టచివర’ పదం కూడ.

మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.
అ) నడుమ + నడుమ = నట్టనడుమ
ఆ) కొన + కొన = కొట్టకొన
ఇ) కడ + కడ = కట్టకడ
ద్విరుక్తటకారమనగా ‘ట్ట’ (ద్విత్వము)

‘ఆమ్రేడితం’ పరంగా ఉంటే నడుమ, కొన,కడ మొదలైన శబ్దాలలో మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలు పోయి వాటి స్థానంలో ‘ట్ట’ వస్తుందని చూశాం కదా !
ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చుమీది అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది.

3. క్రింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.

ప్రశ్న 1.
బయలు + బయలు = ____________
జవాబు.
బట్టబయలు – మొదటి ‘బయలు’ లోని ‘బ’ తర్వాత గల ‘యలు’ స్థానంలో, ‘ట్ట’ వచ్చి “బట్టబయలు” అయ్యింది.

ప్రశ్న 2.
అంత + అంత = ____________
జవాబు.
అంతంత – ఇక్కడ మొదటి ‘అంత’లోని అచ్చునకు ఆమ్రేడితం పరంగా ఉన్నందువల్ల సంధి జరిగి ‘అంతం” అని అయింది.

ప్రశ్న 3.
తుద + తుద = ____________
జవాబు.
తుట్టతుద – ఇక్కడ మొదటి ‘తుద’లో దు తర్వాత గల ‘త’ స్థానంలో ‘ట్ట’ వచ్చి ‘తుట్టతుద’ అయింది.

ప్రశ్న 4.
ఎన్ని + ఎన్ని = ____________
జవాబు.
ఎన్నెన్ని – ఇక్కడ మొదటి ‘ఎన్ని’లోని అచ్చునకు ఆమ్రేడితం పరంగా ఉన్నందువల్ల సంధి జరిగి ‘ఎన్నెన్ని’ అయింది.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
మీ తాత / అమ్మమ్మ / నాయనమ్మలను అడిగి ఒక కథ చెప్పించుకుని వాళ్ళు చెప్పినట్లుగానే రాసి నివేదికను తరగతిలో ప్రదర్శిచండి.
జవాబు.

కుందేలు ఉపాయం

ఒక అడవిలో ఒక సరస్సు ఉండేది. దాని మధ్యలో చిన్న దీవి ఉండేది. ఆ దీవిలో రకరకాల పండ్ల చెట్లు ఉండేవి. ఆ పండ్లను తినాలని చాలా జంతువులకు ఆశగా ఉండేదిగానీ అక్కడకు వెళ్లడానికి సాహసించేవికాదు. ఎందుకంటే ఆ సరస్సు నిండా మొసళ్లు ఉండేవి. ఒకరోజు దాహం తీర్చుకోడానికి సరస్సు దగ్గరకు వచ్చిన కుందేలుకు దీవిలోని పండ్లను చూసి నోరూరింది. ఎలాగైనాసరే ఒక్కసారి అక్కడకు వెళ్లి కడుపునిండా పండ్లు తినాలనే కోరిక కలిగింది. ఆ రాత్రంతా బాగా ఆలోచిస్తే దానికో ఉపాయం తట్టింది.

మర్నాడు ఉదయాన్నే సరస్సు దగ్గరకు వెళ్లి మొసళ్లను ఒడ్డుకు రమ్మంటూ కేకలు పెట్టింది. ‘మమ్మల్ని బయటకు రమ్మనే ధైర్యం ఎవరికుందబ్బా’ అనుకుంటూ అవి బయటకు వచ్చాయి. ‘మీకో శుభవార్త చెబుదామని పరుగెత్తుకుంటూ ఇలా వచ్చాను. మన మృగరాజుగారు అడవిలోని జంతువులన్నింటికీ విందు భోజనం ఏర్పాటుచేసి బహుమతులు కూడా ఇవ్వాలనుకుంటున్నారు. అందుకని మిమ్మల్ని లెక్కపెట్టే పని నాకు అప్పగించారు. మీరు నన్ను ఏమీ చెయకుండా ఉంటే లెక్కపెట్టి రాజుగారికి విన్న విస్తాను’ అంది ఎంతో వినయంగా. ‘మమ్మల్ని నువ్వెలా లెక్కపెడతావ్’ అని అనుమానంగా అడిగిందో మొసలి.

మీరందరూ ఒక వరుసగా ఉంటే లెక్కపెట్టేస్తాను’ అంది కుందేలు. అది చెప్పినట్టుగానే చేశాయి మొసళ్లు. వాటి వరుస సరస్సు ఒడ్డు నుంచి దీవి వరకూ ఉంది. కుందేలు వాటి మీద నుంచి దీవికి చేరుకుని చక్కగా కడుపు నిండా పండ్లూ, దుంపలూ తిని వచ్చింది. ‘ఎప్పుడో వెళ్లినదానివి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావ్ ?’ అంటూ గట్టిగా అరిచిందో మొసలి. మీరెందరు ఉన్నారో లెక్క కచ్చితంగా తేలక అవస్థ పడుతున్నాను. ‘ఒక్కసారి మళ్లీ నిలబడితే ఈసారి సరిగ్గా లెక్క పెడతాను’ అంది కుందేలు. దాని మాట ప్రకారం మళ్లీ వరుసగా నిలబడ్డాయి మొసళ్లు. తన ఉపాయంతో కడుపు నిండుగా పండ్లూ, దుంపలూ తిన్న కుందేలు వాటి మీద నుంచి చెంగు చెంగున దూకుతూ సరస్సు నుంచి బయటపడింది.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

TS 8th Class Telugu 8th Lesson Important Questions చిన్నప్పుడే

II. స్వీయరచన:

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)

ప్రశ్న 1.
మానవ సమాజానికి నిజమైన/విలువైన ఆస్తులు ఏవి ?
జవాబు.
మానవ సమాజానికి నిజమైన లేదా విలువైన ఆస్తులు అంటే మిద్దెలు, డబ్బు, నగలు కాదు. స్వతంత్రం, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం
– ఇదే నేటిమానవ సమాజానికి వజ్ర, వైఢూర్యాలు, దివ్య భవనాలు, నగలు, నాణ్యాలు, ఆస్తి, ఆదాయం అని చెప్పవచ్చు.

III. సృజనాత్మకత:

ప్రశ్న 1.
‘బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన రోగకారకమని తెలుపుతూ, ఒక ప్రకటన రాయండి.
జవాబు.

బహిరంగ ప్రకటన

ప్రియమైన గ్రామస్థులారా ! ఆలోచించండి. చైతన్యవంతులవండి. పూర్వపు అనారోగ్యపు విధానాలకు స్వస్తి పలకండి. నవ సమాజంలో ఆరోగ్యం వైపు అడుగులు వేయండి. కాలపరిస్థితులు మారాయి. జాగ్రత్తగా ఉండకపోతే వ్యాధుల బారిన పడతాము. మురుగు కాలువలలో, చెత్తా చెదారం వంటి వాటిపై ఈగలు, దోమలు సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని మనపైకి దండెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేసి, వ్యాధులకు ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పటికైనా గ్రహించండి. మరుగుదొడ్లు నిర్మించండి. ఒకప్పుడు మనుష్యులు స్వేచ్ఛగా తిరిగేవారు. ప్రస్తుతం ప్రజలు దోమతెరల మధ్య, మస్కిటో కాయిల్స్ మొదలైన వాటిమధ్య బ్రతికే పరిస్థితి తెచ్చుకొన్నాం. పశువుల్లా బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయవద్దు. నాగరికత తెలిసి కూడా అనాగరికంగా ప్రవర్తించడం మానండి. మరుగుదొడ్లు వాడండి.

జై స్వచ్ఛభారత్ !! జైజై స్వచ్ఛభారత్ !!!

ఇట్లు,
ఆరోగ్య మిత్ర కార్యవర్గబృందం,
సిద్ధిపేట, మెదక్ జిల్లా.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

IV. భాషాంశాలు:

పదజాలం:

పర్యాయపదాలు:

ప్రశ్న 1.
కొడుకు = ____________
జవాబు.
పుత్రుడు, తనయుడు, ఆత్మజుడు

ప్రశ్న 2.
బంగారం = ____________
జవాబు.
హేమం, సువర్ణం, కాంచనం

ప్రశ్న 3.
రైతు = ____________
జవాబు.
కర్షకుడు, కృషీవలుడు

ప్రశ్న 4.
స్త్రీ = ____________
జవాబు.
మహిళ, వనిత, ఇంతి

ప్రశ్న 5.
చెట్టు = ____________
జవాబు.
తరువు, వృక్షం, మహీరుహం

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి – వికృతి

1. గౌరవం – గారవం
2. సంతోషం – సంతసం
3. స్త్రీ – ఇంతి
4. ముఖం – మొగం
5. భాష – బాస
6. రాత్రి – రాతిరి
7. స్నేహం – నెయ్యం
8. భృంగారము – బంగారం
9. పండితుడు – పంతులు

నానార్థాలు:

ప్రశ్న 1.
విధి = ____________
జవాబు.
కాలం, ధాత, ఆజ్ఞ, కర్తవ్యం

ప్రశ్న 2.
వార్త = ____________
జవాబు.
వృత్తాంతం, సమాచారం, నడత, భాషణం

ప్రశ్న 3.
ఉత్సాహం = ____________
జవాబు.
సంతోషం, ప్రయత్నం, పట్టుదల, బలం

ప్రశ్న 4.
బంధం = ____________
జవాబు.
కట్టు, చేరిక, పట్టుకొనుట, శరీరం

ప్రశ్న 5.
ఎఱుక = ____________
జవాబు.
గుఱుతు, తెలివి, సోదె, పరిచయం

ప్రశ్న 6.
పశువు = ____________
జవాబు.
జంతువు, ప్రాణి, ప్రమథ గణం, ఆత్మ

ప్రశ్న 7.
శక్తి = ____________
జవాబు.
బలిమి, పార్వతి, బల్లెము, సామర్థ్యం

ప్రశ్న 8.
హితం = ____________
జవాబు.
మేలు, లాభం, క్షేమం

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
ఎరుక = ____________
జవాబు.
ఎరుక = తెలుసు
అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుక.

ప్రశ్న 2.
మాటామంతి = ____________
జవాబు.
మాటామంతి = కులాసాగా మాట్లాడటం
నాయకులు పచ్చని పచ్చికపై హాయిగా కూర్చుని మాటామంతి సాగించారు.

ప్రశ్న 3.
దుర్భరం = ____________
జవాబు.
దుర్భరం =భరించలేని
నిజాం పాలనలో సామాన్య ప్రజల జీవితం దుర్భరంగా ఉండేది.

వ్యాకరణాంశాలు:

సంధులు:

1. సవర్ణదీర్ఘ సంధి :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది.
ఉదా : జీవితాంతం = జీవిత + అంత
గాడాభిమానం = గాఢ + అభిమానం

2. గుణసంధి :
‘అ’ కారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
ఉదా : అమితోత్సాహం = అమిత + ఉత్సాహం

3. అత్వసంధి :
ఉత్తునకు సంధి బాహుళకముగా వస్తుంది.
ఉదా : లింగయ్య = లింగ + అయ్య
బువ్వెట్లా = బువ్వ + ఎట్లా
చిన్నప్పుడు = చిన్న + అప్పుడు

4. ఉత్వసంధి :
ఉత్తునకు అచ్చుపరమగునపుడు సంధియగు.
ఉదా : మీరెవరు = మీరు + ఎవరు
నాకొక = నాకు + ఒక
పిల్లలందర = పిల్లలు + అందరు
పేరేమి = పేరు + ఏమి
కష్టాలున్నాయి = కష్టాలు + ఉన్నాయి
బాలురంత = బాలురు + అంత
వేరొక = వేరు + ఒక

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

సమాసాలు:

సమాసం పేరు విగ్రహవాక్యం

సమాసపదం

1. అగ్రజాతులు అగ్రమైన జాతులు విశేషణ పూర్వపద కర్మధారయం
2. మానప్రాణములు మానమును, ప్రాణమును ద్వంద్వ సమాసం
3. ఉసిరికాయ ఉసిరి అనే కాయ సంభావన పూర్వపద కర్మధారయం
4. పదిరూపాయలు పది సంఖ్యగల రూపాయలు ద్విగు సమాసం
5. ముప్పై రూపాయలు ముప్పది సంఖ్యగల రూపాయలు ద్విగు సమాసం
6. ఆగమనవార్త ఆగమనము యొక్క వార్త షష్ఠీ తత్పురుష సమాసం
7. మావూరు మా యొక్క ఊరు షష్ఠీ తత్పురుష సమాసం
8. తమకష్టాలు తమ యొక్క కష్టాలు షష్ఠీ తత్పురుష సమాసం
9. రైతు యువకుడు యువకుడైన రైతు విశేషణ ఉత్తరపద కర్మధారయం
10. దివ్యభవనం దివ్యమైన భవనం విశేషణ ఉత్తరపద కర్మధారయం
11. అవ్యాజబంధువు అవ్యాజమైన బంధువు విశేషణ ఉత్తరపద కర్మధారయం
12. అమితోత్సాహం అమితమైన ఉత్సాహం విశేషణ ఉత్తరపద కర్మధారయం
13. పెద్దగొంతు పెద్దదైన గొంతు విశేషణ ఉత్తరపద కర్మధారయం

వాక్యాలు :

ప్రశ్న 1.
ఔరౌర ! ఎంత గొప్పపని చేసావు.
జవాబు.
ఆశ్చర్యార్థక వాక్యం.

ప్రశ్న 2.
మీరెవరబ్బాయి ?
జవాబు.
ప్రశ్నార్థక వాక్యం

ప్రశ్న 3.
నాకొక ఉసిరికాయ ఇవ్వవా
జవాబు.
ప్రార్థనార్థక వాక్యం.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:

ప్రశ్న 1.
సంతోషించాడు. దగ్గరకు తీసుకొన్నాడు. (సంక్లిష్ట)
జవాబు.
సంతోషించి, దగ్గరకు తీసుకొన్నాడు.

ప్రశ్న 2.
గ్రామ పెత్తందార్లు నిందలు మోపారు. నేరాలు మోపారు. (సంయుక్త)
జవాబు.
గ్రామ పెత్తందార్లు నిందలు మరియు నేరాలు మోపారు.

పదాలు – అర్ధాలు:

I. అర్థాలు:

నేరుగా = తిన్నగా
గ్రామీయులకు = గ్రామ ప్రజలకు
నిరుత్సాహం = ఉత్సాహం లేకపోవడం
సన్నాహాలు = ప్రయత్నాలు
విధిగా = తప్పక
పెత్తందార్లు = పెత్తనం చేసేవారు
నగ్నం = స్పష్టంగా
అడుగడుగుకు = ప్రతి అడుగుకు
దుర్భాషలు + ఆడటం = తిట్టడం
విధివిరామం లేకుండా = నిర్విరామంగా (విశ్రాంతి లేకుండా)
జీవితాంతం (జీవిత + అంతం) = జీవితం చివరివరకూ
బావి = నూయి
ఆగమన వార్త = వచ్చినారన్న వార్త
మాటా మంతీ = మాట్లాడడం
పరిహాసము = వేళాకోళం
గభాలున = తొందరగా (అకస్మాత్తుగా)
బోర్లించిన = వెలికలగ ఉన్నదానిని బోర్లించి (త్రిప్పి) పెట్టుట
పట్టలేని సంతోషం = ఇముడ్చుకోలేనంతటి ఆనందం
నిమిరాడు = రాచాడు
అమితోత్సాహం (అమిత + ఉత్సాహం) = ఎక్కువ ఉత్సాహం
చిరపరిచితము = చాలా కాలంగా తెలియడం
అవ్యాజ బంధువు = అకారణమైన చుట్టం
పరస్పరము = ఒకరికొకరు

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

II. అర్థాలు:

ఎరుక = తెలియడం
బర్రె = గేదె
బందెల దొడ్డి = పశువులను బంధించే దొడ్డి
మోతాడు = ముట్టెతాడు
మాలిపటేలు = గ్రామాధికారి
సర్కారీ రకం = ప్రభుత్వ పన్ను
బండలెత్తు = రాళ్ళు భుజాల పైకి ఎత్తి మోయించడం (శిక్ష)
కట్టెపుల్లలు = కర్రపుల్లలు
అయ్య = తండ్రి
శేగిదారు = గుమస్తా
కుప్పలుగా కురిపించారు = పోగులు పెట్టారు.
బువ్వ = అన్నము
పసులు కాడ నుండి = పశువుల వద్ద నుండి
గిర్దావరు = ఒక అధికారి
మిరం = కారం
జంగల్ = అడవి
అధ్వాన్నంగా = పనికిరానివిగా
సంతానానికి = బిడ్డలకు
స్వార్థరహితంగా = తన సంగతి చూసుకోకుండా విశ్వమానవ
సౌభ్రాతృత్వం = ప్రపంచ మనుష్యుల సోదరత్వం
సహనశక్తి = ఓర్చుకొనే శక్తి
పరహితం = ఇతరులకు మేలు

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

పాఠం ఉద్దేశం:

ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు, ఉపేక్షకు గురికావడాన్ని నిరసిస్తూ, ‘ఆంధ్రోద్యమం విస్తరించింది. ఆ సందర్భంగా సభల ద్వారా, పత్రికల ద్వారా, రచనల ద్వారా, ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలపడం ఈ పాఠం ఉద్దేశం.

ప్రక్రియ కథానిక:

తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘కథానిక’ ప్రక్రియ ఒకటి. ఇది ఒక వచన ప్రక్రియ. కథ, కథానిక అనే పదాలు ఈనాడు పర్యాయపదాలుగా వాడుతున్నాము. ఇది జీవితపు ముఖ్యసన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తుంది. సంక్షిప్తత దీని ప్రధాన లక్షణం. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. కథనం, సంభాషణలు, శిల్పం కథానికలోని ప్రధాన అంశాలు.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది; సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది; ఇటువంటి వచన ప్రక్రియనే “కథానిక” అంటారు. కథనం, సంభాషణలు, శిల్పం కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తతా లక్షణమే కథానిక ప్రత్యేకత. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారుస్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

రచయిత పరిచయం:

పాఠం పేరు : “చిన్నప్పుడే”
రచయిత : వట్టికోట ఆళ్వారుస్వామి
పాఠ్యభాగం దేని నుండి గ్రహింపబడింది : 1945 లో “మీజాన్” పత్రికలో ప్రచురితమైన కథానిక ఇది
రచయిత జననం : 1915 నవంబరు 1న, నల్గొండ జిల్లాలోని “చెరువుమాదారం”లో జన్మించారు.
ప్రతిభ : ఆళ్వారుస్వామి సుప్రసిద్ధ నవలా రచయిత. గొప్ప సాహితీవేత్త. తొలితరం కథా రచయిత.
జైలుజీవితం : నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు.
ఆంధ్రమహాసభాధ్యక్షులు : ఆంధ్రమహాసభ నల్గొండ జిల్లా శాఖకు ఈయన అధ్యక్షులుగా పనిచేశారు.
గ్రంథమాల స్థాపకులు : దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలు ముద్రించారు. “తెలంగాణ” పత్రికను నడిపించారు.
నవలా రచయిత : ఈయన రచించిన ‘ప్రజలమనిషి’, ‘గంగు’ నవలలు బాగా ప్రజాదరణ పొందాయి. వీరు అనేక కథలూ రాశారు.
నైజాం వ్యతిరేకోద్యమం : ఆళ్వారుస్వామి గారు హైదరాబాదు సంస్థాన ప్రజలలో స్ఫూర్తినీ, సాంస్కృతిక చైతన్యాన్నీ రగిలించారు.
మరణం : వీరు తన 46వ ఏటనే, అనగా 5-2-1961న కన్నుమూశారు.

ప్రవేశిక:

రజాకార్ల అఘాయిత్యాలకు, పెత్తందార్ల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. అట్లా తిరగబడటానికి ప్రేరణనిచ్చినవారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలనందించేటందుకు వాళ్ళు ఏవిధమైన ప్రయత్నం చేశారు ? ఆనాటి సాంఘిక పరిస్థితులెట్లా ఉండేవి ? ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనం కోసం.. ఈ పాఠం చదువుదాం ………….

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

పాఠ్యభాగ సారాంశం:

ఆంధ్రమహాసభ కార్యదర్శి వెంకట్రావు కార్యకర్తలతో రంగాపురం గ్రామానికి వెళ్ళాడు. గ్రామస్థులు ఊరేగింపుగా ఆ కార్యకర్తలను గ్రామంలోకి తీసికొని వెళ్ళే ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతలో ఆ కార్యకర్తలకు ఒక రైతు యువకుడు వచ్చి ‘దండం’ పెట్టాడు. వెంకట్రావు గ్రామాల్లోని పెత్తందార్లు పెట్టే బాధల నుండి ప్రజల్ని విముక్తుల్ని చేస్తున్నాడు. ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. ప్రజలు వెంకట్రావును తమ ధన, మాన, ప్రాణ రక్షకునిగా భావిస్తున్నారు.

ఇంతలో కొందరు ఆ ఊరిపిల్లలు ఉసిరికాయలు కోసి తెచ్చుకొని తింటూ, కార్యకర్తల దగ్గరికి వచ్చారు. నాయకులు పిల్లలతో మాట్లాడుతున్నారు. తన పేరు లింగయ్య అని ఒక పిల్లవాడు చెప్పాడు. ఆ పిల్లలంతా సంగం పంతులు పెట్టిన బడిలోకి వెడుతున్నారు. ఆ నాయకులు అడిగితే, ఒక పిల్లవాడు తన చేతిలోని ఉసిరికాయను ప్రేమగా ఇచ్చాడు. దానిని ఆ కార్యకర్త తీసుకున్నాడు. అది చూసి పిల్లలు ఎన్నో ఉసిరికాయలు వారికిచ్చారు. ఆ పిల్లల ప్రేమకు, కార్యకర్తలు మురిసిపోయారు.

ఆ పిల్లలు, ఆ నాయకులు తమను బతికించడానికి వచ్చారని చెప్పారు. ఆ పిల్లలను అడిగి నాయకులు వారి కష్టాల్ని తెలుసుకున్నారు. తమ బర్రెను వారి ఊరి దొర, బందెల దొడ్డిలో పెట్టించాడని ఒకడు చెప్పాడు. మరొకడు తమ దూడ చేలో పడిందని, పటేలు పది రూపాయలు వసూలు చేశాడన్నాడు. తన తల్లి పుల్లలు ఏరితే, ఆమెను కొప్పు పట్టుకొని దొరగారి శేగిదారు కొట్టాడని ఇంకొకడు చెప్పారు. సంగిశెట్టి కొడుకు తన తండ్రికే ఆ కష్టాలు తెలుసునన్నాడు.

చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఆ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి పట్టిందని ఆ నాయకులు బాధపడ్డారు. వారు స్వార్థం లేకుండా, ధైర్యంగా పట్టుదలగా పనిచేస్తే వారి సంతానం హాయిగా బతుకుతారని ఒక నాయకుడన్నాడు. ఇంతలో ఊరి ప్రజలు ఆ నాయకులను తమ గ్రామంలోకి వాద్యాలతో తీసుకువెళ్ళడానికి వచ్చారు.

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu Guide 8th Lesson చిన్నప్పుడే 3

Leave a Comment