TS 10th Class Telugu Model Paper Set 6 with Solutions

Reviewing TS 10th Class Telugu Model Papers Set 6 can help students identify areas where they need improvement.

TS SSC Telugu Model Paper Set 6 with Solutions

‘సమయం: 3 గం.
మార్కులు : 80

విద్యార్థులకు సూచనలు :

 1. జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
 2. పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.

పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)

కింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు 1, 2 వాక్యాలలో రాయండి. (5 × 1 = 5 మా.)

రామలక్ష్మణులు దండకారణ్యం నువీంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు. అతని తల, మెడ కనబడడం లేదు. కడుపు భాగంలో ముఖముంది.’ రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. యోజనం పొడవు వ్యాపించిన చేతులు. ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు.

అతని పేరు కబంధుడు, తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరితరం కాదు. కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు. అన్నదమ్ములిద్దరూ. తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు. కబంధుడు కుప్పకూలాడు. రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు.

తన గురించి చెప్పుకున్నాడు. శాపకారణంగా తనకీ వికృతరూపం ప్రాప్తించిందన్నాడు. శ్రీరాముడు కబంధునితో ‘మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది. అతని రూపం, ఉండే చోటు, శక్తి సామర్థ్యాలు తెలియవు. వాటిని చెప్పవలసిందని’ అడిగాడు. సమాధానంగా కబందుడు ‘శ్రీరామా ! నాకిప్పుడు దివ్యజ్ఞానం లేదు. నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది. అప్పుడు చెప్పగల’నన్నాడు. కబంధుని శరీరానికి అగ్నిసంస్కారం చేశారు రామలక్ష్మణులు. ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
రామలక్ష్మణులను పట్టుకున్న రాక్షసుడి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రామలక్ష్మణులను పట్టుకున్న కబంధుడు అనే రాక్షసుడికి తల, మెడ కనబడలేదు. అతడి కడుపు భాగంలో ముఖముంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. అతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉన్నాయి. అతడు ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు.

ప్రశ్న 2.
‘కబంధ హస్తాలు’ అనే జాతీయం ఎలా పుట్టింది ?
జవాబు:
కబంధుడు అనే రాక్షసుడికి, యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉన్నాయి. అతడు ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతని చేతుల్లో తప్పించుకోడం ఎవరితరమూ కాదు. తప్పించుకోడానికి వీలు కాని చేతులు అనే అర్థంలో, ఈ విధంగా కబంధ హస్తాలు అనే జాతీయం పుట్టింది.

TS 10th Class Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 3.
కబంధుడికి దివ్యజ్ఞానం తిరిగి ఎట్లా వస్తుంది ?
జవాబు:
కబంధుని శరీరాన్ని దహిస్తే అతడి నిజరూపమూ, దివ్యజ్ఞానమూ వస్తాయి.

ప్రశ్న 4.
కబంధుడు రామలక్ష్మణులను ఎట్లా పట్టుకున్నాడు ?
జవాబు:
కబంధుడు తన సమీసంలోకి వచ్చిన రామలక్ష్మణులను, అమాంతంగా తన రెండు చేతులతోనూ, పట్టుకున్నాడు.

ప్రశ్న 5.
రామలక్ష్మణులు కంబంధుణ్ణి ఏ సహాయం అడిగారు ?
జవాబు:
రామలక్ష్మణులు, తమకు, రావణుని రూపం గురంచి, అతడు ఉండే చోటును గురించి, రావణుని శక్తి సామర్థ్యాలను గురించి చెప్పవలసిందని, కబంధుణ్ణి అడిగారు.

ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యాన్ని పాదభంగం లేకుండా రాసి భావం రాయండి.

ప్రశ్న 6.
తల్లీ ! నీ ప్రతిభా ………………….. సంధ్యాభానువేతెంచెడిన్.
జవాబు:
తల్లీ ! నీ ప్రతిభా విశేషములు భూతప్రేత హస్తమ్ములన్
డుల్లేన్ కొన్ని తరాలదాక! ఇపుడ్డుడల్ వోయె ; సౌదామనీ
వల్లీ పుల్లవిభావళుల్ బ్రతుకుత్రోవలూపు కాలమ్ములున్
మళ్ళెన్ ! స్వచ్ఛతరోజ్జ్వల ప్రథము సంధ్యాభానువేతెంచెడిన్.

భావం : ఓ తెలంగాణ తల్లీ ! కొన్ని తరాల నుండి ప్రతిభా విశేషాలు స్వార్థపరులైన దెయ్యాలు, పిశాచాల చేతులలో రాలిపోయాయి. ఇప్పుడింక ఏ ఆటంకాలు లేవు, విచ్చుకొన్న క్రొత్త మెరుపు తీగ (స్వాతంత్ర్యపు) కాంతులు జీవనమార్గాలు చూపించే కాలం వచ్చింది. నిర్మలమైన ప్రకాశంతో తొలి సంధ్యా సూర్యకిరణం వస్తోంది.

(లేదా)

ప్రశ్న 7.
భవదీయార్చన సేయుచో ……………. సర్వేశ్వరా.
జవాబు:
భవదీయార్చన సేయుచోఁ బ్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెం
డవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా సమో
త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో
గ విధానం బవి లేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా !

భావం : ఓ సర్వేశ్వరా ! నీ పూజ చేసేటపుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ, మూడో పుష్పం ఏకాగ్రత. ఇది భక్తియోగ విధానం. ఈ మూడు పుష్పాలూలేని పూజలను నీవు అంగీకరించవు.

ఇ) కింది పద్యాన్ని చదివి అర్థం చేసుకొని, ఇచ్చిన ఖాళీలను పూరించండి. (5 × 2 = 10 మా.)

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !

ప్రశ్నలు :

ప్రశ్న 7.
పాముకు విషం ……….. లో ఉంటుంది.
జవాబు:
తల

ప్రశ్న 8.
వృశ్చికమనగా …………………..
జవాబు:
తేలు

ప్రశ్న 9.
శరీరమంత విషం …………….. ఉంటుంది.
జవాబు:
ఖలునకు

ప్రశ్న 10.
పై పద్య మకుటం ………………
జవాబు:
సుమతీ

TS 10th Class Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 11.
పై పద్యాన్ని రచించిన కవి …………..
జవాబు:
బద్దెన

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (4 × 3 = 12 మా.)

అ) కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 12.
దాశరథి శతకకర్త కంచెర్ల గోపన్నను పరిచయం చెయ్యండి.
జవాబు:
దాశరథి శతకాన్ని రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న రచించాడు. ఈ గోపన్న ఖమ్మం జిల్లాలోని “నేలకొండపల్లి గ్రామ నివాసి. ఈయన భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు.

ఈ కవి భద్రాచల శ్రీరామచంద్రుని పేరున దాశరథీ శతకాన్ని రాశాడు. ఈ గోపన్న కవి శ్రీరామునిపై ఎన్నో “కీర్తనలు రచించిన వాగ్గేయ కారకుడు. ఈయన కవిత్వంలో అందమైన శబ్దాలంకారాలు ఉంటాయి.

ప్రశ్న 13.
“ఎట్టి దుష్కర్ముని నే భరించెద గాని సత్యహీనుని మోవజాలను” అనే మాటలు ఎవరు ఎవరితో అన్నారు ? ఆ సందర్భాన్ని రాయండి.
జవాబు:
ఈ మాటలు బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహా భాగవతములోని ‘దానశీలము’ అనే పద్యభాగంలోనివి. సందర్భము : ఈ మాటలను పూర్వము భూదేవి బ్రహ్మగారితో చెప్పిందని, బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యుడితో చెప్పాడు.

వామనుడిగా విష్ణుమూర్తియే వచ్చాడని, అతడికి మూడు అడుగుల నేలను దానం చేయవద్దనీ శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి సలహా చెప్పాడు. అప్పుడు బలిచక్రవర్తి, “ఏది అడిగినా ఇస్తానని మొదట చెప్పాను. ఇచ్చిన మాటను తప్పడం కన్నా పాపం లేదు. ఇప్పుడు దానం ఇవ్వనని చెప్పి, వామనుడిని తిప్పి పంపలేను” అని శుక్రాచార్యుడితో చెప్పాడు. ఆ సందర్భంలోనే, వెనుక భూదేవి బ్రహ్మగారితో “తాను ఎటువంటి చెడ్డపని చేసిన వాడినైనా భరిస్తాను. కాని, అబద్ధం ఆడినవాడిని మాత్రం మోయలేను” అని చెప్పిందన్న మాటలను, బలిచక్రవర్తి శుక్రాచార్యునితో చెప్పాడు.

ప్రశ్న 14.
‘భూమిక’ పాఠం రచయితను గురించి రాయండి.
జవాబు:
‘భూమిక’ పాఠాన్ని ‘గూడూరి సీతారాం’ గారు వ్రాశారు. గూడూరి సీతారాం గారు, 1936లో కరీంనగర్ జిల్లా ‘హనుమాజీ పేట’ గ్రామంలో జన్మించారు. ఈయన, సుమారు 80 కథలు వ్రాశారు. ఈయన

 1. మా రాజు,
 2. లచ్చి,
 3. పిచ్చోడు,
 4. రాజమ్మ రాజీ రకం వంటి ప్రసిద్ధ కథలు వ్రాశారు.

తెలంగాణ సాహిత్యంలో పేద కులాల జీవితాలనూ, అట్టడుగు వర్గాల భాషనూ, ఈయన అక్షరబద్ధం చేశాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ తొలికరం కథలకు, ఈయన దిక్సూచిగా నిలబడ్డాడు.
తెలంగాణ భాషనూ, యాసనూ ఒలికించడం, ఈయనకు గల ప్రత్యేకత.

ప్రశ్న 15.
చదువు మానవుని జీవన వికాసానికి బాటలు వేస్తుందని ఎలా చెప్పగలవు ?
జవాబు:
విద్య వలన వినయమూ, వినయము వల్ల పాత్రత, పాత్రత వల్ల ధనమూ, ధనము వల్ల ఈ లోకంలోనూ, పరలోకంలోనూ, సుఖములూ వస్తాయని – భర్తృహరి చెప్పాడు. ఇది నిజము.

మనిషికి చదువు వల్ల మంచిచెడులను గ్రహించే విచక్షణ, వివేకమూ కల్గుతాయి. ప్రపంచ విషయాలు అన్నీ తెలుస్తాయి. గౌరవం పెరుగుతుంది. ఉపాధి దొఱకుతుంది. చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది. చదువు వల్ల, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం లభిస్తుంది.

భాగ్యరెడ్డి వర్మ చిన్నప్పుడు చదివిన చదువువల్లే ఆయన జీవితం మంచిదారిలో నడిచింది. ఆయన ధర్మశాస్త్రాలు, చరిత్ర చదివి అంటరాని వర్గాల వారి కష్టాలను, అర్థం చేసుకోగలిగాడు. ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే, చదువు ఒక్కటే మార్గం అని ఆయన గ్రహించాడు. అది హిందువుల కోసం, ఎన్నో పాఠశాలలు పెట్టించాడు. చదువు మానవుని జీవన వికాసానికి బాటలు వేస్తుందని, దీనిని బట్టి చెప్పవచ్చు.

ఆ) కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో జవాబులు రాయండి. (3 × 7 = 21 మా.)

ప్రశ్న 16.
ఆడినమాట తప్పనని, వామనునకు దానం తప్పక ఇస్తానని, బలిచక్రవర్తి శుక్రునితో ఏమి చెప్పాడు ?
జవాబు:
“ఓ మహాత్మా ! నీవు నిజం చెప్పావు. లోకంలో గృహస్థులు ఈ ధర్మాన్నే పాటించాలి. ఏమి అడిగినా ఇస్తానని చెప్పి, ధనంపై దురాశతో ఇప్పుడు ఇవ్వనని చెప్పలేను. ఎటువంటి వాడినైనా మోస్తాను కాని ఆడితప్పిన వాడిని మోయలేనని భూదేవి చెప్పింది కదా ! సత్యంతో బ్రతకడం మానధనులకు ఉత్తమ మార్గం.

దాతకు తగినంత ధనము, దానిని ప్రతిగ్రహించే ఉత్తముడు దొరకడం దుర్లభం. పూర్వం పాలించిన రాజులు, చనిపోతూ తాము సంపాదించిన ధనాన్ని మూటకట్టుకొని పోలేదు. వారికి నేడు పేరు కూడా లేదు. శిబిచక్రవర్తి వంటి దాతలను లోకం నేటికీ మరచిపోలేదు. విష్ణుమూర్తి అంతటి మహాత్ముడు అడిగితే నాబోటివాడు తప్పక ఇవ్వాలి.

కాబట్టి నాకు నరకం దాపురించినా, బంధనం ప్రాప్తించినా, దుర్మరణం సంభవించినా, నా వంశం అంతా నశించినా, ఏమైనా, వచ్చినవాడు త్రిమూర్తులలో ఎవరయినా, నేను అబద్దం ఆడకుండా దానం తప్పక ఇస్తాను. మానధనులు మరణం సంభవించినా అన్నమాటను తప్పరు” అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో చెప్పాడు.

(లేదా)

పార్వతీ దేవి భోజనానికి రమ్మంటే వ్యాసుడు ఏమన్నాడు ? ఆమె వ్యాసుని ఎలా తృప్తిపరచింది ?
జవాబు:
కాశీ నగరాన్ని శపించడం తగదని మందలించి, పార్వతి వ్యాసుని భోజనానికి తన ఇంటికి రమ్మని పిలిచింది. అప్పుడు వ్యాసమహర్షి పార్వతీ మాతతో

‘అమ్మా ! ఇప్పటికే సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు పదివేల మంది శిష్యులు ఉన్నారు. శిష్యులతో కలిసి భుజించాలనే వ్రతము నాకు ఉంది. ఇంతమందికి భోజనం పెట్టడం అసాద్యం. కాబట్టి అంతకు ముందురోజు లాగే నేనూ, శిష్యులూ ఉపవాసం ఉంటాము” అని చెప్పాడు.

వ్యాసుని మాటలు విని పార్వతి నవ్వి “ఓ మునీశ్వరా ! నీవు నీ శిష్యులను అందరినీ వెంట బెట్టుకొని భోజనానికి రా, విశ్వనాధుని దయతో ఎంతమంది అతిథులు వచ్చినా వారందరికీ, కామధేనువు ఉన్నట్లుగా కడుపునిండా కోరినట్లు భోజనం పెడతాను” అని చెప్పింది. వ్యాసుడు సరే అని గంగలో స్నానం చేసి శిష్యులతో పార్వతి ఇంటికి వెళ్ళాడు. ఆమె వ్యాసునికి, శిష్య సహితంగా తృప్తిగా భోజనం పెట్టింది.

TS 10th Class Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 17.
‘కొత్తబాట’ పేరు కథకు ఎట్లా సరిపోయిందనుకుంటున్నారు ?
జవాబు:
పాకాల యశోదారెడ్డి తన గ్రామంలో వచ్చిన మార్పుల గురించి చెప్పిన కథకు ‘కొత్తబాట’ అని పేరు పెట్టారు. ‘కొత్తబాట’ అంటే కొత్తదారి అని అర్థము. యశోదారెడ్డి ఊరిలో ప్రజలు పాత ఆచారాలను వదలి కొత్తదారి పట్టారు. అందువల్ల కథకు ఆ పేరు సరిపోతుంది. ఆ గ్రామ ప్రజలు పట్టిన కొత్తదారి ఇది.

 1. గ్రామంలో పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు సామాన్యుల కంటికి కనబడకుండా బండ్లకు తెరలు కట్టే ఆచారం, నేడు పోయింది.
 2. రచ్చబండపై గ్రామపెద్దతో కలిసి గ్రామస్థులు అందరూ నేడు కూర్చుంటున్నారు.
 3. గ్రామపెద్ద రంగరాయడి వంటి పెత్తనాన్ని నేడు గ్రామాల్లో ప్రజలు ధిక్కరిస్తున్నారు.
 4. పోలీసు పటేళ్ళ పెత్తనం, ప్రజలు పోలీసులకు లంచాలివ్వడం పోయింది.
 5. ప్రజలు చీటికిమాటికీ తగవులు, కొట్లాటలు మానారు. పంచాయితీలు, జరిమానాలు నేడు లేవు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో తీర్పులు ఇస్తున్నారు.
 6. రాత్రి దొంగతనాలు లేవు. ప్రజలకు శిక్షలు లేవు. ప్రజలు ముష్టి ఎత్తుకోడం మానివేశారు. వారు మంచి వేషాలు వేసుకుంటున్నారు.
 7. పెళ్ళిళ్ళలో కూడా మేనాలు, పల్లకీలు, ప్రజలు నేడు మోయడం లేదు.
 8. పనిమనుషులను తమతోడి వారుగా చూస్తున్నారు.

ఈ విధంగా గ్రామాల్లో ప్రజలు కొత్తబాట పట్టారు. అందువల్ల ఈ కథకు ఈ పేరు బాగా సరిపడింది.

(లేదా)

“తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు” అనే వాక్యాలు మీరు సమర్థిస్తారా ? ఎందుకు ?
జవాబు:
తెలుగు పిల్లలు ఇంట్లో వ్యావహారిక భాషను మాట్లాడతారు. కాని వారు ఒకప్పుడు బడులలో గ్రాంథిక భాషనే నేర్చుకొనేవారు. ఆ రోజుల్లో పాఠశాల, కళాశాలల్లోని తెలుగు పాఠ్య పుస్తకంలోని పాఠాలు అన్నీ గ్రాంథిక భాషలోనే ఉండేవి. పిల్లలు ఆనాడు జవాబులు సైతమూ తెలుగు గ్రాంథిక భాషలోనే వ్రాయవలసి వచ్చేది.

ఆనాడు చిన్నయసూరి వ్రాసిన నీతిచంద్రికలోని “మిత్రలాభము, మిత్రభేదము” వంటి పాఠాలు, పాఠ్యపుస్తకాల్లో ఉండేవి. పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు వ్రాసిన “సాక్షి” వ్యాసాలు వంటి పాఠాలు, విద్యార్థులు బడులలో చదివేవారు. ఇంట్లో మాత్రము వ్యావహారిక భాషనే మాట్లాడేవారు. వ్యావహారికంలోనే వ్రాసేవారు.

 1. ఉదాహరణకు గ్రాంథికంలో “యశస్వి ఇట్లనియె” అని ఉంటుంది. ‘వ్యావహారికంలో అయితే, “యశస్వి ఇల్లా అన్నాడు” అని వ్రాస్తారు.
 2. గ్రాంథికంలో “దానవేంద్రుండిట్లనియె” అని ఉంటుంది. వ్యావహారికంలో అయితే, “దానవేంద్రుడు ఇలా అన్నాడు” అని ఉంటుంది.
 3. మన గోలకొండ పాఠంలో వలె, గ్రాంథిక భాషలో “పట్టణములో సందడిగా సంచరించుచుండెను” అని ఉంటుంది. అదే వ్యావహారికక భాషలో “పట్టణంలో సందడిగా సంచరించేవి” అని ఉంటుంది.
 4. చిన్నయసూరి ‘మిత్రలాభము’ పాఠంలో “గోదావరీ తీరమున ఒక బూరుగు వృక్షము కలదు” అని ఉంటుంది. అది గ్రాంథిక రచన. ఆనాడు బడులలో పిల్లలు, గ్రాంథిక భాషలోనే చదివేవారు. వ్రాసేవారు. ఇళ్ళల్లో మాత్రం “గోదావరీ తీరంలో ఒక బూరుగు చెట్టు ఉండేది.” అని చదివేవారు. అలాగే వ్రాసేవారు.

దీనిని బట్టి సామల సదాశివగారు వ్రాసినట్లు “తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్ళో చదివే భాష వేరు” అన్న మాటను నేను సమర్థిస్తాను.

ప్రశ్న 18.
‘అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు చిహ్నం,’ సమర్ధించండి.
జవాబు:
రామలక్ష్మణులు, దశరథ మహారాజునకు పుత్రులు: దశరథుని పెద్ద భార్య కౌసల్యకు రాముడూ, మరొక భార్య సుమిత్రకు లక్ష్యణుడూ పుట్టారు. లక్ష్మణుడు బాల్యము నుండి రామునికి సేవ చేయడమే గొప్పగా భావించేవాడు. లక్ష్మణుడు, రామునికి బహిఃప్రాణము వంటివాడు.

విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణకు రామునితోపాటు లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. లక్ష్మణుడు అన్న మాటపై శూర్పణఖ ముక్కు చెవులను కోశాడు. సీతారామలు వనవాసానికి వెడుతుండగా రాముని విడిచి ఉండలేక తనను కూడా వెంట తీసుకొని వెళ్ళమని లక్ష్మణుడు రాముడిని ప్రాధేయపడ్డాడు.

త్రిలోకాధిపత్యం కంటే, తనకు రాముని సేవాభాగ్యం గొప్పదని లక్ష్యణుడు చెప్పి రామునికి సేవచేసే అదృష్టం తనకు ఇమ్మని అన్నను కోరి, భార్యను విడిచి అన్న వెంట లక్ష్మణుడు అడవికి వెళ్ళాడు. తల్లి చెప్పినట్లు లక్ష్మణుడు, రాముడిని తనకు తండ్రిగా, సీతను తనకు తల్లిగా భావించి వనంలో సేవించాడు.

లక్ష్మణుడు వనవాసకాలంలో రాముని వెంట ఉండి, విరాధుని, కబంధుని చంపడంలో అన్నకు సాయం చేశాడు. శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. మారీచుడే బంగారు లేడిగా మారి వచ్చి ఉంటాడని సీతారాములకు చెప్పాడు. సీతను రావణుడు అపహరించినపుడు, లక్ష్మణుడు అన్నకు ఎంతో ధైర్యం చెప్పాడు.

లక్ష్మణుడు యుద్ధంలో రావణ పుత్రులయిన ఇంద్రజిత్తును, అతికాయుడిని చంపాడు. రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం వల్ల, లక్ష్మణుడు స్పృహ తప్పాడు, అప్పుడు రాముడు లక్ష్మణునికై ఎంతో బాధపడ్డాడు. లక్ష్మణుని వంటి .తమ్ముడు ఎక్కడా తనకు దొరకడని, రాముడు కన్నీరు కార్చాడు.

ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. అప్పుడు రాముడు గొప్ప ఆనందంతో లక్ష్మణుడు మరణించి ఉంటే, తన విజయానికి అర్థమే లేదనీ, అప్పుడు సీతతో గాని, తన ప్రాణాలతో గాని, తనకు ప్రయోజనం ఏమీ ఉండదనీ చెప్పాడు, దీనిని బట్టి రామలక్ష్మణుల వంటి అన్నదమ్ముల అనుభంధం, మరెక్కడా కనబడదని తెలుస్తోంది.

(లేదా)

రామలక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణను చేసిన తీరును తెలపండి.
జవాబు:
రామలక్ష్మణులు దశరథుని పుత్రులు. ధనుర్విద్య నేర్చారు. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి, రాక్షసులు తన యజ్ఞానికి విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞ రక్షణకు రాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ కోరాడు. రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ, యజ్ఞరక్షణకు తానే వస్తానని దశరథుడన్నాడు.

తన యజ్ఞానికి మారీచ సుబాహులు విఘ్నాలు కలుగజేస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. రాక్షసుల మీదికి రాముణ్ణి పంపలేనన్నాడు దశరతుడు. విశ్వామిత్రునికి కోపం వచ్చింది. వశిష్ఠ మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశం చేశాడు. ఆ విద్యల మహిమవల్ల రామలక్ష్మణులకు ఆకలిదప్పులు ఉండవు. మార్గమధ్యంలో తాటక అనే రాక్షసి రాగా విశ్వామిత్రుని మాటపై రాముడు తాటక బాహువులు ‘ఖండించాడు. లక్ష్మణుడు దాని ముక్కు, చెవులు కోశాడు. శబ్దవేధి బాణంతో రాముడు తాటకను చంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. మారీచ సుబాహులు యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడిపై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. ఆగ్నేయాస్త్రంతో రాముడు సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన రాక్షసులను, ‘వాయవ్యాస్త్రం’తో తరిమారు. మహర్షి యజ్ఞం చక్కగా పూర్తయ్యింది.

ఇ) సృజనాత్మకత (1 × 7 = 7 మా.)

ప్రశ్న 19.
జీవనభాష్యం గజల్స్లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవితను వ్రాయండి.
జవాబు:
శాంతి సమీరం వీచితే
కోపాగ్నిభం నీరవుతుంది
పదిమంది పెద్దలు నడిస్తే
లోకానికది దారవుతుంది.
నేలను దున్ని విత్తితే
తప్పక ఆశల పైరవుతుంది
కులమత గోడలు కూల్చితే
ఆ సమాజమే నీ ఊరవుతుంది
వాగులు వంకలు కలిస్తే
ఎడతెగని పారే ఏరవుతుంది
సత్యం ధర్మం న్యాయం నీదయితే
జగతిలో చెరగని నీ పేరవుతుంది
ఆపన్నుల ప్రేమను కాచితే
ఆనందం నీ సహవాసమవుతుంది.

(లేదా)

స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో తెలిపేలా నినాదాలు – సూక్తులు రాయండి.
జవాబు:
ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా – ప్రతి మానవుడు తల్లకి బిడ్డే
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో – అక్కడ దేవతలు పూజలందుకుంటారు.
సృష్టికి మూలం స్త్రీ – ప్రేమకు పెన్నిధి స్త్రీ
స్త్రీ లేని ఇల్లు – గుండెలేని శరీరం
ఇంటిని ఇల్లాలు – కంటిని రెప్పలు కాపాడుతాయి.
ఇంటికి దీపం ఇల్లాలు
స్త్రీలే జాతికి మణిదీపాలు – స్త్రీలే జగతికి ఆణిముత్యాలు
స్త్రీ సమాజానికి వెన్నుముక – పల్లె సీమలు దేశానికి వెన్నుముక
కన్నతల్లి, తల్లిని కన్న దేశం – స్వర్గాని కన్నా గొప్పది.

పార్ట్ – B

సూచనలు :

 1. విద్యార్థులు జవాబులను ఈ ప్రశ్నాపత్రంలోనే నిర్దేశించిన విధంగా కేటాయించిన స్థలంలో రాయాలి.
 2. పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ ప్రశ్నా పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ జవాబు పత్రంతో జత చేయండి.

I. భాషాంశాలు

అ) పదజాలం :

కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి. (2 × 1 = 2 మా.)

ప్రశ్న 1.
కర్తవ్యం : ……………………..
జవాబు:
కర్తవ్యం : గురువుల, తల్లిదండ్రుల మాట వినడం, ప్రతివారికీ కర్తవ్యం.

ప్రశ్న 2.
దుర్లభము : …………………..
జవాబు:
దుర్లభం : మూర్ఖులను ఒప్పంచడం దుర్లభము.

కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/B/C/D) బ్రాకెట్లో రాయండి. (8 × 1 = 8 మా.)

ప్రశ్న 3.
క్రూర మృగాలను చూస్తే ఎవరైనా జడుసుకుంటారు – (గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.)
A) మచ్చిక చేసుకొంటారు
B) భయపడతారు
C) ఆనందిస్తారు
D) నవ్వుతారు
జవాబు:
B) భయపడతారు

ప్రశ్న 4.
‘పాలిపెర” అనే పదానికి అర్థము
A) మేర
B) గుర్తు
C) గొడుగు
D) మెరుపు
జవాబు:
B) గుర్తు

ప్రశ్న 5.
‘హాలికుడు దేశానికి వెన్నెముక. కర్షకులు లేకుండా తిండి దొరకదు కదా!’ ఈ వాక్యంలో పర్యాయపదాలు
A) దేశం, హాలికుడు
B) కర్షకుడు, వెన్నెముక
C) తిండి, కర్షకుడు
D) హాలికుడు, కర్షకుడు
జవాబు:
D) హాలికుడు, కర్షకుడు

ప్రశ్న 6.
నెహ్రూ పుత్రిక ఇందిరాగాంధీ. ఆయన తాను జైలులో ఉన్నప్పుడు తన కూతురుకు రాసిన లేఖలు ప్రసిద్ధములైనాయి. ఈ వాక్యంలో పర్యాయపదాలు.
A) నెహ్రూ, ఇందిరాగాంధీ
B) లేఖలు, ప్రసిద్ధము
C) పుత్రిక, కూతురు
D) నెహ్రూ, జైలు
జవాబు:
C) పుత్రిక, కూతురు

ప్రశ్న 7.
‘దశరథుని కుమారుడు’ అనే వ్యుత్పత్తి కలిగిన పదము.
A) సౌమిత్రి
B) కరుణాపయోనిధి
C) దాశరథి
D) కోదండపాణి
జవాబు:
C) దాశరథి

ప్రశ్న 8.
నామము, హారము అనే వేరువేరు అర్థాలు కలిగిన పదము
A) వేరు
B) తేరు
C) తీరు
D) పేరు
జవాబు:
D) పేరు

ప్రశ్న 9.
తెలుగులో తొలితరం కథ ‘గుణవతియగు స్త్రీ’ – గీత గీసిన పదానికి వికృతి
A) కద
B) కత
C) కదా
D) ఖత
జవాబు:
B) కత

TS 10th Class Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 10.
రాతిరి భోజనం ఎక్కువగా చేయకూడదు. ఈ వాక్యంలోని ప్రకృతి పదాన్ని గుర్తించండి.
A) రాతిరి
B) భోజనం
C) రాతి
D) ఎక్కువగా
జవాబు:
B) భోజనం

ఆ) వ్యాకరణాంశాలు:

కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/B/C/D) బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)

ప్రశ్న 11.
త్రిక సంధికి ఉదాహరణ
A) ముత్తైదువ
B) అమ్మహాసాద్వి
C) కట్టనుగు
D) కమలానన
జవాబు:
B) అమ్మహాసాద్వి

ప్రశ్న 12.
నగర . అరణ్యము ఈ పదాన్ని కలిపి రాయగా ……………….
A) నగరణ్యము
B) నగరారణ్యము
C) నగారారణ్యము
D) నగురారణ్యము
జవాబు:
B) నగరారణ్యము

ప్రశ్న 13.
“ఎడారి దిబ్బలు” అను మాటకు విగ్రహవాక్యం ……………..
A) ఎడారి అయిన దిబ్బలు
B) ఎడారి కొరకు దిబ్బలు
C) ఎడారి యొక్క దిబ్బలు
D) ఎడారి లాంటి దిబ్బలు
జవాబు:
C) ఎడారి యొక్క దిబ్బలు

ప్రశ్న 14.
కదులు అని వేటిని అంటారు.
A) మఱి, ఏమి, అది
B) అది, అవి, ఇది
C) ఎదురు, కోన, చివర
D) ఆహా, ఔర, ఓహో
జవాబు:
C) ఎదురు, కోన, చివర

ప్రశ్న 15.
విగ్రహ వాక్యము నందు ‘కొఱకు’ అను పదం వస్తే ఆ సమాసం
A) ద్వితీయా తత్పురుష సమాసం
B) చతుర్థీ తుత్పురుష సమాసం
C) పంచమీ తత్పురుష సమాసం
D) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
B) చతుర్థీ తుత్పురుష సమాసం

TS 10th Class Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 16.
‘మత్తేభం’ లో యతి స్థానము
A) 10వ అక్షరం
B) 11 వ అక్షరం
C) 14 వ అక్షరం
D) 13వ అక్షరం
జవాబు:
C) 14 వ అక్షరం

ప్రశ్న 17.
`భ,ర,న,భ,భ,ర,వ అనే గణాలు వరుసగా ఉండే పద్యం
A) ఉత్పలమాల
B) మత్తేభం
C) శార్దూలం
D) చంపకమాల
జవాబు:
A) ఉత్పలమాల

ప్రశ్న 18.
‘గురువు పాఠం బోధించాడు.’ ఇది …………..
A) సంయుక్త వాక్యం
B) సామాన్య వాక్యం
C) పరోక్ష వాక్యం
D) అనుకృతి వాక్యం
జవాబు:
B) సామాన్య వాక్యం

ప్రశ్న 19.
అనేకార్థాలను కలిగి యుంటే అది
A) స్వభావోక్తి
B) అతిశయోక్తి
C) రూపకాలంకారం
D) శ్లేష అలంకారం
జవాబు:
D) శ్లేష అలంకారం

ప్రశ్న 20.
‘నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష’ అను వాక్యంలోని అలంకారం
A) శ్లేషాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) రూపకాలంకారం
D) ఉపమాలంకారం
జవాబు:
C) రూపకాలంకారం

Leave a Comment