TS 8th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

Telangana SCERT TS 8th Class Telugu Study Material Pdf ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్ Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide Upavachakam 2nd Lesson షోయబుల్లాఖాన్

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
షోయబుల్లా ఖాన్ గురించి వ్రాయండి.
జవాబు.
హైదరాబాద్ ప్రభుత్వం పత్రికలపై ఉక్కుపాదం మోపుతున్న కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా ప్రచురణ చేస్తూ “ఇమ్రోజ్” పత్రికను నడిపిన ధీశాలి షోయబుల్లా ఖాన్. నిజాం ప్రభుత్వ విధానాలు, రజాకారుల దుశ్చర్యలను గురించి సునిశితంగా వ్యాసాలు రాసిన కలం యోధుడు ఆయన. సత్య ప్రకటన తన జీవితానికి చరమ గీతం పాడుతుందని తెలిసినా నిజాలను రాయడంలో వెనుకంజ వేయని ధీశాలి.

హైదరాబాదు రాష్ట్రంలో మానుకోట తాలూకాలో జన్మించాడు. షోయబుల్లా ఖాన్ తండ్రి హబీబుల్లాఖాన్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు. అతను మహాత్మాగాంధీ అభిమాని. హైదరాబాదు ప్రభుత్వం మతకలహాలు సృష్టిస్తూ రాష్ట్రమంతటా లూటీలు, గృహ దహనాలు, హత్యలు రజాకారుల ద్వారా చేయించింది.

జాతీయవాది, గాంధీ అభిమాని అయిన షోయబుల్లాఖాన్ “తాజ్వీ” అనే ఉర్దూ పత్రికలో ఖాసీంరజ్వీ క్రూరమైన పనులను ధైర్యంగా విమర్శించేవాడు. ఆ కారణంగా 1948 ఆగస్టు 22వ తేదీన మధ్య రాత్రి 12.30 గంటలకు “నేటి భావాలు” అనే వ్యాసాన్ని పూర్తి చేసుకొని ఇంటిముఖం పట్టిన షోయబుల్లాఖాన్ని రజాకారులు భయంకరంగా కాల్చి చంపారు.

ప్రశ్న 2.
షోయబుల్లాఖాన్కి బెదిరింపు ఉత్తరాలు రాసిందెవరు ? ఎందుకు ?
జవాబు.
జాతీయవాది అయిన షోయబుల్లాఖాన్ మతాలకు అతీతంగా పని చేసేవాడు. హైదరాబాదు ప్రభుత్వపు మతోన్మాదపు పనులు రజాకారులు ఖాసీంరజ్వీ నాయకత్వంలో ప్రజలపై చేస్తున్న దాష్టికాన్ని భరించలేకపోయేవాడు. వాటిని ఖండిస్తూ తాజ్వి అనే ఉర్దూ పత్రిక ద్వారా వ్యాసాలు రాసేవాడు. హైదరాబాదు ప్రభుత్వ దుష్టబుద్ధిని, నిజాం విధానాలను, ప్రజా వ్యతిరేక పనులను ఇమ్రోజ్ అనే పత్రిక ద్వారా ప్రజలను చైతన్యపరిచేవాడు.

నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రోత్సహిస్తున్నాడని, గాంధీ మార్గంలో నడుస్తూ జాతీయోద్యమానికి సహకరిస్తున్నాడని, తమ మతంవాడై ఉండి తమను విమర్శిస్తున్న సంపాదకీయ వ్యాసాలను చూసి నిజాం ప్రభుత్వం వణికిపోయింది. ఖాసీంరజ్వీ షోయబుల్లాఖాన్ను బెదిరిస్తూ లేఖలు రాసేవారు. చివరికి అదే కారణంగా 22-8-1948 అర్ధరాత్రి రజ్వీ అనుచరులు షోయబుల్లాఖాన న్ను చంపారు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

1. అవగాహన – ప్రతిస్పందన:

అ) కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

వీరపత్ని భర్తపై బడి నీవెందుకు అరచలేదు. ఆ దుష్ట శక్తులను వెన్నంటి తుపాకితో కాల్చి అయ్యో ఎంతటి ప్రమాదం సంభవించినది. అవుజా నేను బిగ్గరగా అరచిన యెడల పిరికితనమవుతుంది. వీరుడై చచ్చినవాడికే స్వర్గం. ఇదే నిజమైన అహింసా సిద్ధాంతం. తల్లిని జూచి అమ్మా! నేనేలాగైన యీ లోకాన్ని విడిచిపోతాను. నీవు వీరమాత వనిపించుకొమ్ము. అవుజా నీవు నిండు చూలాలివి. నీవు నా ధర్మపత్నివని కీర్తినిలుపవా ? నీవు వీరమాత వౌతావు. మీరు యిట్లా ఏడిస్తే నా ధైర్యం సన్నగిల్లుతోంది. ఆనాడు మన బాపు మనను విడిచిపోయిన నాడు నన్ను ఏమని ఓదార్చినావమ్మా! అబ్బా !!

ప్రశ్న 1.
పై పేరాలోని వీరపత్ని ఎవరు ?
జవాబు.
అవుజా, షోయబుల్లాఖాన్ భార్య వీరపత్ని.

ప్రశ్న 2.
ఎలా చచ్చిన వాడిది స్వర్గం ?
జవాబు.
వీరుడి వలె చచ్చిన వాడిది స్వర్గం.

ప్రశ్న 3.
పై పేరాలోని బాపు ఎవరు ?
జవాబు.
మహాత్మాగాంధీ.

ప్రశ్న 4.
నీవు వీరమాతవు అవుతావని ఎవరు, ఎవరితో అన్నారు ?
జవాబు.
షోయబుల్లాఖాన్ తన తల్లితో అన్నారు.

ప్రశ్న 5.
ఏది నిజమైన అహింసా సిద్ధాంతం ?
జవాబు.
పిరికివాని వలె అరవకుండా, వీరుని వలె మరణించడమే అహింసా సిద్ధాంతం.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

ఆ) కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

ఇట్లుండగా మహాత్ముడి అకాలమరణవార్త అకస్మాత్తుగా షోయబు విన్నాడు. నిర్ఘాంతపడ్డాడు. ఇంట తన గదిలో వెక్కివెక్కి యేడుస్తున్నాడు. బలమైన అతని శరీరం దుఃఖావేశంతో వణికిపోవుచున్నది. నోరు పెకలటం లేదాతనికి. ఇంతలో తన తల్లి వచ్చి నాయన ఏడవకుము. ఆయన మహాత్ముడు అతనికి అంతా సమానమే. చావుబ్రతుకుల్లో ఆయనకు భేదం లేదు. హిందూ, ముస్లింలలో సోదర భావాన్ని పెంపొందించుటకై ఆయన మహెూత్కృష్టమైన సేవజేశాడు. నీవు దుఃఖించుట మానుము. నాయనా ? ఏది ఒకసారి నవ్వుము. అని దీనంగా బ్రతిమాలుతున్న తన తల్లిని జూసి షోయబుల్లాఖానుడు అమ్మా ! రేపు నీ కొడుకు స్వాతంత్ర్యము కొరకు బలైతే నీవు దుఃఖించవా యని యడిగినాడు.
జవాబు.
ప్రశ్నలు :
1. ఎవరి మరణవార్త విని ఎవరు నిర్ఘాంతపోయారు ?
2. హిందూ ముస్లింలలో సోదరభావం కోసం కృషి చేసిందెవరు ?
3. చావు బ్రతుకుల్లో తేడా లేనిది ఎవరికి ?
4. దుఃఖావేశంతో వణుకుతున్నది ఎవరు ?
5. పై పేరాకు శీర్షికను పెట్టండి.

ఇ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పత్రికలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా ప్రచురణ చేయడానికి సాహసించని పరిస్థితులు. అయినప్పటికీ తన ‘ఇమ్రోజు’ పత్రిక ద్వారా నిజాం ప్రభుత్వ విధానాలను, రజాకార్ల దుశ్చర్యలను ఎండగట్టిన కలం యోధుడు, సత్య ప్రకటన తన జీవితానికి చరమగీతం పాడుతుందని తెలిసినా వెనుకంజవేయని ధీశాలి, నిజాన్ని నిర్భయంగా రాసి రజాకార్ల చేతిలో బలైన అమరుడు షోయబుల్లాఖాన్.

ప్రశ్న 1.
ప్రభుత్వం ఎవరిపై ఉక్కుపాదం మోపుతున్నది?
జవాబు.
పత్రికలపై

ప్రశ్న 2.
ఎవరికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు ?
జవాబు.
ప్రభుత్వానికి

ప్రశ్న 3.
ఏ పత్రిక ద్వారా ప్రభుత్వ విధానాలను రజాకార్ల దుశ్చర్యలను ఎండగట్టారు ?
జవాబు.
‘ఇమ్రోజు’ పత్రిక

ప్రశ్న 4.
రజాకార్ల చేతిలో బలైన అమరుడు ఎవరు ?
జవాబు.
షోయబుల్లాఖాన్

ప్రశ్న 5.
ఈ పేరాకు ‘శీర్షిక’ను రాయండి.
జవాబు.
కలం యోధుడు/రజాకార్లను ఎదిరించిన ధీశాలి.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

ఇ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పత్రికలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా ప్రచురణ చేయడానికి సాహసించని పరిస్థితులు. అయినప్పటికీ తన ‘ఇమ్రోజు’ పత్రిక ద్వారా నిజాం ప్రభుత్వ విధానాలను, రజాకార్ల దుశ్చర్యలను ఎండగట్టిన కలం యోధుడు, సత్య ప్రకటన తన జీవితానికి చరమగీతం పాడుతుందని తెలిసినా వెనుకంజవేయని ధీశాలి, నిజాన్ని నిర్భయంగా రాసి రజాకార్ల చేతిలో బలైన అమరుడు షోయబుల్లాఖాన్.

ప్రశ్న 1.
ప్రభుత్వం ఎవరిపై ఉక్కుపాదం మోపుతున్నది?
జవాబు.
పత్రికలపై

ప్రశ్న 2.
ఎవరికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు ?
జవాబు.
ప్రభుత్వానికి

ప్రశ్న 3.
ఏ పత్రిక ద్వారా ప్రభుత్వ విధానాలను రజాకార్ల దుశ్చర్యలను ఎండగట్టారు ?
జవాబు.
‘ఇమ్రోజు’ పత్రిక

TS 8th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

ప్రశ్న 4.
రజాకార్ల చేతిలో బలైన అమరుడు ఎవరు ?
జవాబు.
షోయబుల్లాఖాన్

ప్రశ్న 5.
ఈ పేరాకు ‘శీర్షిక’ను రాయండి.
జవాబు.
కలం యోధుడు/రజాకార్లను ఎదిరించిన ధీశాలి.

Leave a Comment