TS 8th Class Telugu పదవిజ్ఞానం

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download పదవిజ్ఞానం Questions and Answers.

TS 8th Class Telugu పదవిజ్ఞానం

అర్థాలు:

అ:

అంధకారం = చీకటి
అంపి = పంపి
అగ్గలం = అధికం
అజ్ఞాతం = ఎవరికి తెలియని
అడలు = భయపడు
అధ్యాత్మము = దైవసంబంధమైన జ్ఞానం
అనివార్యం = తప్పనిసరి
అపారమైన = అధికమైన
అమల = నిర్మలమైన, స్వచ్ఛమైన
అరిష్ఠం = కీడు
అర్చన = పూజ
అర్ధం = ధనం, సొమ్ము
అర్థి = వేడుకొనువాడు
అలుపు = అలసట
అవ్యాజము = కపటంలేనిది, సహజమైనది
అసువులు = ప్రాణాలు

ఆ:

ఆకాంక్ష = తీవ్రమైనకోరిక
ఆతంకం = ఆరాటం
ఆదేశం = ఆజ్ఞ
ఆలాపన = రాగం తీయుట, పాడుట
ఆశ్రితుడు = ఆశ్రయం కోరినవాడు

TS 8th Class Telugu పదవిజ్ఞానం

ఇ:

ఇబ్బడి = ఎక్కువ
ఇడుములు = కష్టాలు, తిప్పలు

ఈ:

ఈగి = త్యాగం

ఉ:

ఉత్కృష్టం = శ్రేష్ఠం, గొప్పది
ఉత్పాదకం = పుట్టించునది
ఉదారంగా = గొప్పగా
ఉద్బోధ = సందేశం
ఉభయతారకం = ఇద్దరిని తరింపచేసేది (మేలుకల్గించేది)

ఊ:

ఊతం = ఆధారం

ఎ:

ఎడద = హృదయం, ఎద
ఎరుక = తెలుసు

TS 8th Class Telugu పదవిజ్ఞానం

ఒ:

ఒప్పించు = అప్పగించు, అంగీకరింపజేయు
ఒరులు = ఇతరుల

ఔ:

ఔషధం = మందు

క:

కంటకం = ముల్లు
కంబళి = గొంగడి
కకావికలం = చెల్లాచెదురు
కర్దమం = బురద, అడుసు
కడిందిగ = ఎక్కువగా
కపోతం = పావురం
కర్షకుడు = రైతు
కల్పతరువు = కోర్కెలు తీర్చే దేవతా వృక్షం
క్వణం = శబ్దం, సవ్వడి, చప్పుడు
కామారి = శివుడు
కార్చిచ్చు (కారుచిచ్చు) = అడవిలో దట్టమైన మంటలు
కూర్మి = స్నేహం, సోపతి
కృప = దయ, కరుణ
కేదారం = పొలం
క్రోధం = కోపం
క్షీరాబ్ది = పాలసముద్రం

TS 8th Class Telugu పదవిజ్ఞానం

ఖ:

ఖగం = పక్షి
ఖలం = పాపము

గ:

గటక / గట్క = మక్క జొన్న రవ్వతో చేసే వంటకం
గిడస = ఎండిపోవుట, శుష్కించుట
గప్పాలు = గొప్పలు, బాతాలు
గుడము = బెల్లం

ఘ:

ఘాతం = దెబ్బ

చ:

చందనం = గంధం
చలువ = చల్లదనం
చాకచక్యం = నేర్పు
చిందిలిపాటు = తొందరపాటు
‘చూతఫలం’ = మామిడి పండు
చెట్ట = కీడు
చేవ = సారం, శాగ

జ:

జగతి = ప్రపంచం, దునియ
జమీందారు = భూస్వామి
జిహ్వ = నాలుక
జైకొట్టుట = మద్దతు తెలుపుట
జ్యోత్స్న = వెన్నెల

TS 8th Class Telugu పదవిజ్ఞానం

ఠ:

రికాణా = నివాసం
ఠీవి = వైభవం

త:

తనువు = శరీరం, పెయ్యి
తపసి / తాపసి = ఋషి
తమ్మి = పద్మం, తామరపువ్వు
తరువు = చెట్టు
తలంపు = కోరిక
తుల = తరాజు, తక్కెడ

ద:

దండి = తీవ్రం
దక్కు = లభించు, దొరుకు
దప్పిక = దాహం, దూప
దాస్యం = సేవ, శాత, ఊడిగం
దృఢంగా = గట్టిగా
దోష = తప్పు
దోయిలి = దోసిలి

ధ:

ధర్మువు = ధర్మం
ధామం = నిలయం
ధృతి = ధైర్యం

న:

నికృష్టం = నీచం
నిక్షేప = నిధి, లిబ్బి
నిమగ్నం = లీనం
నిమజ్జనం = అనుపుట, మునగడం
నీరము = నీరు
నుడువుట = చెప్పుట

TS 8th Class Telugu పదవిజ్ఞానం

ప:

పడియ = మడుగు
పరిజనం = సేవకులు, నౌకర్లు
పరిమళం = మంచి వాసన
పాడి = న్యాయం
పాదుషా = రాజు
పార్శ్యం = వైపు పక్కన
పాశం = తాడు
పుల్లు = గడ్డి
పేర్మి = ప్రేమ
ప్రగతి = అభివృద్ధి
ప్రతిన = ప్రతిజ్ఞ, ఒట్టు
ప్రతిష్ఠ = కీర్తి, స్థాపన
ప్రస్థానం = ప్రయాణం
ప్రహసితం = పెద్ద నవ్వు
ప్రేయం = ప్రియం, ఇష్టం

బ:

బండారం = ధనాగారం, కోశాగారం, ఖజానా
బాస = ప్రతిజ్ఞ, ఒట్టు
బ్రాహ్మి ముహూర్తం = సూర్యోదయానికి మూడు గడియల ముందు కాలం
బుగులు = భయం
బుభుక్షితుడు = ఆకలిగొన్నవాడు
బేరీజు = అంచనా (లెక్కవివరం)

భ:

భంగి = విధము, తీరు
భంజన = విఱుచు / విరుచు
భూతము = ప్రాణి (పంచభూతాల్లో ఒకటి)
భూషణం = ఆభరణం, నగ

మ:

మందుడు = తెలివితక్కువవాడు
మక్కువ = ఇష్టం
మహత్తు = గొప్పతనం, మహిమ
మహిషం = దున్నపోతు
మాత్సర్యం = పగ, ఓర్వలేనితనం
మాన్యులు = గౌరవించదగినవారు
మిరం = కారం
మిసిమి = కాంతి
మేచక = నల్లని
మోర = ముఖం
మైత్రి = స్నేహం, సోపతి
మౌక్తికం = ముత్యం

TS 8th Class Telugu పదవిజ్ఞానం

య:

యతి = సన్న్యాసి, ముని

ర:

రకం = పన్ను
రాకామల జ్యోత్స్న = పున్నమినాటి తెల్లని వెన్నెల
రీతి = విధం
రుద్రుడు = శివుడు
రుధిరం = రక్తం, నెత్తురు

ల:

లేశం = కొంచెం, కొద్దిగ
లోభి = పిసినారి, పిసినిగొట్టు

వ:

వడుకుడుపులు = చేనేత వస్త్రములు
వనట = శోకం, ఏడుపు
వరాహం = పంది
వలపల = కుడివైపు
వశం = స్వాధీనం
వసియించు = నివసించు
వ్యాఘ్రం = పెద్దపులి
విఘ్నం = ఆటంకం, అడ్డంకి
విమల = స్వచ్ఛమైన
విరివిగ = అధికంగా, బాగా
విరులు = పూలు
విలసిల్లు = ప్రకాశించు, ఒప్పు
విహంగం = పక్షి
విహారం = వేడుకగా తిరుగుట
వృశ్చికం = తేలు
వెఱచు = భయపడు
వేత్త = బాగాతెలిసినవాడు.

TS 8th Class Telugu పదవిజ్ఞానం

శ:

శీలం = నడవడి
శంభుడు = శివుడు (మంగళకరుడు)
శాకం = కూర
శీతం = చల్లని
శ్యేనం = డేగ
శ్రేయం = మేలు

స:

సంయమి = ఋషి
సంహారం = చంపుట
సఖుడు = స్నేహితుడు, దోస్త్, సోపతిగాడు
సతతం = ఎల్లప్పుడు
సమత = సమానత్వం
సమాహితం = అంగీకరించబడినది, సమకూర్చబడినది
సర్వత్ర = అంతట
సార్వభౌముడు = చక్రవర్తి
సాలు = సంవత్సరం
సింగారించిన = అలంకరించిన
సుకుమారం = మృదువైన
సుధ = అమృతం
సురతరువు =కల్పవృక్షం
సూనృతం = మంచిమాట, సత్యం, నువ్వద్దె
సృజన = సృష్టి
సైచు = సహించు
సొగసు = అందం, సక్కదనం
సౌహార్ధం = స్నేహం, సోపతి
స్పర్శ = తాకుట

హ:

హలం = నాగలి
హసితాస్యుడు = నవ్వు ముఖం కలవాడు
హితం = మేలు, మంచి

TS 8th Class Telugu పదవిజ్ఞానం

పర్యాయపదాలు:

అంధకారం = చీకటి, తమస్సు, తిమిరం
అసువులు = ప్రాణములు, ఉసురు, జీవములు
ఆకలి = అంగద, క్షుత్తు, బుభుక్ష
ఆలంబనం = ఆధారం, ఆశ్రయం, ఊత
ఇడుములు = ఇబ్బందులు, కడగండ్లు, కష్టాలు
ఉడుపులు = గుడ్డలు, పుట్టములు, బట్టలు, వస్త్రాలు
కర్దమం = బురద, అడుసు, పంకం
కష్టం = ఇక్కట్టు, శ్రమ, ఇడుము
కాంక్ష = ఇచ్ఛ, కోరిక, వాంఛ
కాపు = రైతు, కర్షకుడు, కృషీవలుడు, హాలికుడు, సైరికుడు
కుప్పలు = రాసులు, ప్రోగు, ప్రోవు
కేతనం = పతాకం, జెండా, ధ్వజం
క్వణము = శబ్దము, సవ్వడి, చప్పుడు
చిచ్చు = అగ్ని, జ్వలనం, అనలం, అంగారం
జననాథుడు = రాజు, నృపుడు, ప్రభువు, భూమీశుడు
తనువు = శరీరం, దేహం, మేను, ఒడలు, పెయ్యి
తాపసి = తపస్వి, తబిసి, ఋషి, యోగి, మౌని
ధృతి = ధైర్యం, బింకం, గట్టితనం
నినాదము = ధ్వని, మోత, శబ్దం
నిశీథిని = రాత్రి, యామిని, నిశ
నీర = నీళ్ళు, ఉదకం, జలం,. తోయం
పశువు = గొడ్డు, జంతువు, పసరం
పరిమళం = తావి, సువాసన, సౌరభం
పాదము = అడుగు, అంఘ్ర, చరణము
పుడమి = భూమి, నేల, అవని, వసుధ, ధరిత్రి, ఇల
భార్య = పత్ని, కళత్రం, ఆలు, పెండ్లము
మంచు = తుహినం, నీహారం, హిమం
మైత్రి = స్నేహం, చెలిమి, సోపతి
మోక్షం = కైవల్యం, ముక్తి, నిర్వాణం
వాన = వర్షము, వృష్టి, చిత్తడి
విలువ = వెల, ఖరీదు, మూల్యం
వెండి = రజతము, ధౌతము, రూప్యము
వేసవి = వేసంగి, గ్రీష్మము, ఎండాకాలం
సఖులు = స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు
సమూహం = గుంపు, బృందం, సముదాయం
సైరికుడు = కాపు, హాలికుడు, రైతు
హంస = మరాళము, చక్రాంగము, మానసౌకము
హలము = సీరము, నాగలి, కుంతలము
హృదయం = ఎద, మది, మనస్సు, గుండె

TS 8th Class Telugu పదవిజ్ఞానం

నానార్థాలు:

అరిష్ట = కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు
అర్థం = శబ్దార్ధం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు
కాలం = నల్లని, సమయం, మరణం, ఇనుము
చీకటి = అందకారం, దుఃఖం, రాత్రి
చేవ = సారము, ధైర్యము, పొగరు
తలపు = అభిప్రాయం, ఆలోచన, జ్ఞప్తి
దిక్కు = దిశ, శరణము, వైపు
పాడి = న్యాయము, ధర్మము, తీర్పు స్వభావం,ఆచారం
పావని = ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు
మిసిమి = కాంతి, నవనీతం, సంపద
మూలం = వేరు, మొదలు, ఊడ, కారణం, పునాది
మౌక్తికం = ముత్యం, ఏనుగు కుంభస్థలం, మేఘం, శంఖం
వనము = అడవి, జలము, సమూహము
వెఱచు = భయపడు, సంకోచించు
శక్తి = బలం, సామర్థ్యం, పార్వతి
శ్రేయం = సుకృతం, శుభం, మేలు, ధర్మం
సుధ = పాలు, సున్నం, అమృతం
హంస = అంచ, పరమాత్మ, తెల్లగుఱ్ఱం, మాత్సర్యం
హితం = లాభం, క్షేమం, ఇష్టం, ఉపకారం
క్షీరము = పాలు, తీపు, నీళ్ళు, పాలపిట్ట, మఱిచెట్టు

TS 8th Class Telugu పదవిజ్ఞానం

ప్రకృతి – వికృతి:

అగ్ని – అగ్గి
అద్భుతము – అబ్బురము, అబ్రము
ఆశ్చర్యం – అచ్చెరువు
ఆహారము – ఓగిరము
కుల్య – కాలువ
కులం – కొలం
ఖని – గని
గుణం – గొనం
దీపం – దివ్వె, దివ్వియ
దోషం – దోసం
ధర్మం – దమ్మం
పశువు – పసువు, పసరం
పుణ్యెం – పున్నెం
ప్రేమ – ప్రేముడి
భృంగారము – బంగారము
భక్తి – బత్తి, బగితి
ముఖము – మొగము, మోము
రాశులు – రాసులు
రాత్రి – రాతిరి
విద్య – విద్దె
వైద్యుడు – వెజ్జు
సంతోషము – సంతసం
సహాయం – సాయము
హృదయం – ఎద, ఎడద, డెందం

TS 8th Class Telugu పదవిజ్ఞానం

వ్యుత్పత్త్యర్థాలు:

అంధకారము = లోకులను అంధులుగా చేయునది – చీకటి
కామారి = మన్మథుని శత్రువు – శివుడు
కైమోడ్పు = చేతులు జోడించి చేయునది – నమస్కారము
పక్షి = పక్షములు కలది (పక్షి)
పయోనిధి = పయస్సుకు (నీటికి) నిధి – (సముద్రం)
పుత్రుడు = పున్నామ నరకమునుండి రక్షించువాడు (కొడుకు)
పౌరులు = పురంలో నివసించువారు – ప్రజలు
శ్యేనము = తీవ్రంగా పోవునది – డేగ
సంయమి = సంయమము (ఇంద్రియ నిగ్రహం) కలవాడు – ఋషి
సైరికుడు = సీరముతో (నాగలి) నేలను దున్నువాడు – రైతు
సోమార్ధధరుడు = చంద్రవంకను శిరస్సున ధరించినవాడు – శివుడు
హాలికుడు = హలముతో (నాగలి) నేలను దున్నువాడు – రైతు

Leave a Comment