TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

Telangana SCERT TS 8th Class Telugu Study Material Pdf ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide Upavachakam 3rd Lesson చిందు ఎల్లమ్మ

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
చిందు భాగోతం గురించి వ్రాయండి.
జవాబు.
చిందు భాగోతం అన్నా, యక్షగానం అన్నా ఒక్కటే. ఇది ఒక జానపద కళ. యక్షగానం పుస్తకాల్లో నుండి కొన్ని పౌరాణిక అంశాలను తీసుకొని ప్రదర్శనలిస్తారు. పొద్దున మొదలు పెట్టిన ఈ ప్రదర్శన సాయంత్రం దీపాలు వెలిగే వరకు సాగుతూ ఉంటుంది. భాగోతాన్ని అంబ కీర్తనతో మొదలుపెడతారు. అంబ కీర్తనంటే ప్రార్థన గీతమే. తెర వెనుక వేషాలు, మేకపులు పూర్తయ్యేవరకు పిల్లలతో వేయిస్తారు. ఇటు పిల్లలకు నేర్పినట్లు తెర వెనుక వేషాలు పూర్తయ్యే వరకు ఇది కొనసాగుతుంది.

అసలు భాగవతం గణపతి ప్రార్థన, సరస్వతీ ప్రార్థన తర్వాత అసలు ప్రదర్శన మొదలవుతుంది. తాళం వేయడానికి రకరకాల రాగాలను ఉపయోగించేవారు. ఆదితాళం, భూపాలం, కాంభోజ, మోహన రాగాలకు పాటలు, పద్యాలు పాడుతారు. జుళువ తాళం రాజు పాత్రలకు ఉపయోగిస్తారు. దీనికి సుత్తిగంతు, కత్తెర అడుగు, కుంగి ఒప్పెనము, చక్రములు అనే అడుగులు ఉంటాయి.

వాయిద్యాలుగా, మద్దెల, తాళాలు, గజ్జెలు, పుంగి అనబడే సన్నాయి ఉండేవి. హార్మోనియం అనేవి తర్వాత వచ్చినవి. ఎండిన సొరకాయతో చేసిన వాయిద్యాన్ని పుంగి అంటారు. అందరికి అన్ని వాయిద్యాలు వచ్చి ఉండాలి. ఈ చిందు భాగోతుల వాళ్ళకు వేరే వృత్తి ఉండదు. ప్రదర్శనల ద్వారా వచ్చిన దాన్ని లేదంటే బాకీ తెచ్చుకుని కూలి పనులకు పోయి జీవనం గడుపుతారు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

ప్రశ్న 2.
చిందు ఎల్లమ్మను గురించి రాయండి.
జవాబు.
చిందు భాగోత కళాకారిణి చిందు ఎల్లమ్మ. స్త్రీ, పురుష పాత్రలను సమర్థవంతంగా పోషించగలిగిన కళాకారిణి చిందు ఎల్లమ్మ. నిజామాబాద్ జిల్లా చిన్నాపురం అనే గ్రామం చిందు ఎల్లమ్మది. వారి కుటుంబం అంతా తాతలకాలం నుండి చిందు భాగోతాలతోనే జీవనం గడిపేవారు. ఎల్లమ్మకు నాలుగవ ఏట మొఖానికి రంగుపూసి బాలకృష్ణుని వేషం వేశారు. అప్పటినుండి బాలకృష్ణుడు, రంభ, బబృవాహనల చిత్రాంగద, సుందరకాండలో సీత, సతీ సావిత్రిలో సావిత్రి వంటి వేషాలు వేసేది.

రాజు, వాలి, ధర్మాంగుడు, కుశలుడు, హనుమంతుడు వంటి పురుష వేషాలను కూడా ప్రదర్శించేది. అంతేకాక ‘సారంగధర, చెంచులక్ష్మి, సతీసావిత్రి, ప్రహ్లాద, మైరావణ, మాంధాత చరిత్ర, రామాంజనేయ, సతీ అనసూయ, సతీతులసి, బాలనాగమ్మ వంటి ఇరవై ఐదు భాగవతాల్లో పురుష వేషం ధరించేది.

చిందుగానంతో, నటనతో, తెలంగాణతో పాటు అనేక ప్రాంతాలను మెప్పించిన కళాతపస్వి. 2005 నవంబర్ 9న నిజామాబాద్ జిల్లా అమ్డాపూర్లో మరణించింది.

1. అవగాహన – ప్రతిస్పందన:

అ) కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చిందోల్ల ఆట అంటే పెద్దోల్లు (పై కులస్థులు) రారని చిందు యక్షగానం అంటం.
భాగోతం పొద్దుగాల్ల పదిగొట్టంగ మొదలైతే, రాత్రి ఆరయితది, యేడు అయితది పూర్తి అయేసరికి …………….. గూట్లె దీపాలు వెట్టే యాల్ల అయితదనుకో ……………
మేం యక్షగానం పుస్తకాలు తీసికొచ్చి సదువుకుంటం …. సదివి దాంట్ల ఇష్టమైనవి తీసుకుంటం. లేకుంటే ఆకులు మార్చేస్తం. పక్కన పెట్టేస్తం…. సారమున్నది తీసుకొని సారం లేనిది ఇడిసిపెడతం.
ఒకటే పుస్తకంల కెల్లి చిరుతల భాగోతులు, దాసరోల్లు, మేము తీసుకున్నా మా దరువులకు అనుకూలంగా మార్చుకుంటం. “ఇన్నవ సీత …………” అని చిరుతల దరువుకు అనుకూలంగా వాళ్లు మార్చుకుంటే, “ఇన్నావా ……………… సీతా ……….. మాతా……………” అని మేం పాడుతం. సారమంతా అదే. పాటంతా అదే. వేషమూ అదే. కాని దరువులే
వేరు.

ప్రశ్న 1.
చిందాటను యక్షగానమని ఎందుకు పిలిచేవారు ?
జవాబు.
చిందోళ్ళ ఆట అంటే అగ్రకులాలవాళ్ళు చూడటానికి రారని యక్షగానం అన్నారు.

ప్రశ్న 2.
పేరాను బట్టి భాగోతాల ప్రదర్శన సమయం ఏది ?
జవాబు.
పొద్దున పది నుండి సాయంత్రం ఆరు వరకు.

ప్రశ్న 3.
చిందాటకు కథాంశం ఎక్కడి నుండి తీసుకోబడేది ?
జవాబు.
యక్షగానాల పుస్తకాల నుండి తీసుకోబడేది.

ప్రశ్న 4.
చిందాటలాంటివే మరి రెండు పేర్లను చెప్పండి.
జవాబు.
చిరుతల భాగోతులు, దాసరోల్లు.

ప్రశ్న 5.
పై పేరాలోని విషయం ఎవరు వివరిస్తున్నారు ?
జవాబు.
చిందు ఎల్లమ్మ.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

ఆ) కింది పేరాను చదివి తప్పు ఒప్పులు గుర్తించండి.

ఇగ దీపావళి అయినంక ఊల్లల్లకు బయల్దేరితే సంకురాత్రి, శివరాత్రి దాకా భాగోతాలు ఆడుతనే ఉంటం ఊర్లల్ల. మళ్లీ వానాకాలం అప్పుడే ఇంటికొస్తం. ఆరుద్రకార్తెకు ఊరంతా అడివి పాలైతరుగద ఇగ …………. మమ్మల్ని ఎవరు చూస్తరు.

ఇగ అప్పుడు అడక్కచ్చుకున్నదుంటే తింటం. లేకుంటే బాకీ తెచ్చుకుంటం. కొందరు కూలీకి పోతరు.
ఈ వయసుల నేను కూడా మా మేళం తోటి పోతా. లేకుంటే ‘ఎల్లమ్మ బృందం’ అని ఎట్లంటరు.

మాకు అందరి కళారూపాలు నచ్చుతయి. హైదరాబాదుల కథల మల్లవ్వ ఉంటది. ఆమె కథలు మంచిగ చెపుతది… నాకు మనసౌతది. అది శారదకాల్లది.

ప్రజలు మమ్ముల ఎప్పటినుంచో బతికించుకుంటున్నరు గనీ, సర్కారు మాత్రం మమ్ములను నటరాజ రామకృష్ణ వల్ల పట్టించుకున్నది. ఒకసారాయన చిందు పాడమని అన్నడు. ఆయన కోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడినం. తన షాలువా తీసి నాకు కప్పిండు. సింధును సర్కారుకు గుర్తుజేసిండు ఆయన. మాకు సర్కారును సూపిచ్చిండు.

ప్రశ్న 1.
హైదరాబాద్ మల్లవ్వ మంచి కథలు చెప్పేది.
జవాబు.

ప్రశ్న 2.
చిందు భాగోతులవాళ్ళు ఆరుద్రకార్తెలో ఆటలు మొదలుపెట్టేవారు.
జవాబు.

ప్రశ్న 3.
చిందు భాగోతం గురించి ప్రభుత్వం పట్టించుకోవడానికి కారణం నటరాజ రామకృష్ణ.
జవాబు.

ప్రశ్న 4.
చిందు ఎల్లమ్మ చెప్పినట్టే ఎల్లమ్మ బృందం వినేవారు.
జవాబు.

ప్రశ్న 5.
చెంచులక్ష్మి భాగోతం ఆడినందుకు ఎల్లమ్మకు షాలువా కప్పారు.
జవాబు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

ఇ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

నేను చిందు ఎల్లమ్మను. మాది నిజామాబాద్ జిల్లాలోని చిన్నాపురమనే పల్లెటూరు. మా ఊర్ల అందరికి సిన్నప్పటి నుండి భాగోతం నేర్పుతుండె. పెద్దోళ్ళు నాకు నాలుగేండ్లు ఉండంగ నా ముఖంకు రంగు ఏసిండ్రు. భాగోతం మొదలు పెట్టినప్పుడు ముందుగల్ల గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన చేస్తం. భాగోతం అన్నా యక్షగానం అన్నా రెండూ ఒకటే. భాగోతంల ఏ పాటకు ఆ పాట రాగం వేరేగుంటది. జుళువ తాళం ఉరుకుడు మీద, చల్తీగా పడే తాళం నటన చల్తీ పోవాలంటే జుళువ తాళం పడతది.

ప్రశ్న 1.
చిందు ఎల్లమ్మ ఎక్కడ పుట్టింది ?.
జవాబు.
నిజామాబాద్ జిల్లా చిన్నాపురం

ప్రశ్న 2.
ఉరుకుడు మీద చల్తీగా పడే తాళం ఏది ?
జవాబు.
జుళువ తాళం

ప్రశ్న 3.
ఎల్లమ్మకు ఏ వయసులో ముఖానికి రంగు వేసినారు ?
జవాబు.
నాలుగేండ్ల వయసు

TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

ప్రశ్న 4.
భాగోతం మొదలు పెట్టినప్పుడు ముందుగ ఎవరి ప్రార్థన చేస్తారు ?
జవాబు.
గణపతి, సరస్వతి ప్రార్థనలు

ప్రశ్న 5.
భాగోతానికి మరోపేరు ?
జవాబు.
యక్షగానం

Leave a Comment