TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

These TS 8th Class Telugu Bits with Answers 9th Lesson అమరులు will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు 1

ప్రశ్నలు:

ప్రశ్న 1.
బొమ్మలో ఏం జరుగుతున్నది?
జవాబు.
బొమ్మలో అమరవీరుల స్తూపం ఉన్నది. దాని ముందు ప్రజలు నిలబడి అమరవీరులకు వందన సమర్పణ చేస్తున్నారు.

ప్రశ్న 2.
స్థూపాలను ఎందుకు కట్టిస్తారు ?
జవాబు.
గొప్పవారికి గుర్తుగా, వారు చేసిన పనులకు గుర్తుగా స్థూపాలను కట్టిస్తారు.

ప్రశ్న 3.
స్తూపం వద్ద ఎందుకు నివాళులు అర్పిస్తారు ?
జవాబు.
జాతి కోసం ప్రాణాలర్పించిన అమరులను గుర్తు చేసుకుంటూ, తాము కూడా వారి బాటలో నడుస్తామని ఆశిస్తూ వారిని గౌరవించటానికి స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు.

ప్రశ్న 4.
అమరవీరులకు ఎట్లా నివాళులు అర్పించాలో మీకు తెలుసా ?
జవాబు.
నిటారుగా నిలబడి తల నిటారుగా ఉంచి కుడిచేయి కుడి కణత మీద ఉంచి గౌరవ పూర్వకంగా నివాళులు అర్పించాలి. కొంతమంది కవితల ద్వారా గాని, పాటల ద్వారా గాని, ఇతర కళల ద్వారాగాని నివాళులు అర్పిస్తారు.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

నేపథ్యం / ఉద్దేశం:

ప్రశ్న.
అమరులు పాఠ్యభాగ నేపథ్యం వివరించండి.
జవాబు.
ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు. నాటి పోరాటంలో 360కి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవితల ద్వారా నివాళులు అర్పించాడు.
తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటివరకు అమరులైన వీరి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. (1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో “ప్రత్యేక తెలంగాణా బాహాటంగా సాధిస్తాం” అని ఉన్నది. దాన్ని గమనించండి. )

పాఠ్యభాగ వివరాలు:

ప్రశ్న.
అమరులు పాఠ్యభాగ వివరాలు తెల్పండి.
జవాబు.
ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది ఆచార్య కె. రుక్నుద్దీన్ రాసిన ‘విప్లవ ఢంకా’ అనే కవితా సంకలనంలోనిది.

కవి పరిచయం:

ప్రశ్న.
అమరులు గేయ రచయితను పరిచయం చేయండి. (లేదా) అమరులు పాఠ్యభాగ కవిని గురించి రాయండి.
జవాబు.
సామాజిక స్పృహ కలిగిన సాహితీవేత్త ఆచార్య కె. రుక్నుద్దీన్. ఈయన మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ మండలం రాచూరు గ్రామంలో జన్మించాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. ‘జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశాడు. 1969 సం॥లో “విప్లవఢంకా” మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం తుదిశ్వాస వరకు కొనసాగింది. ప్రయాణం, శెలిమె, సూక్తిసుధ, కిన్నెరమెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు చేశాడు. ఎన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు అందుకున్నాడు. (పరీక్షల్లో గీత గీసిన వాక్యాలు రాస్తే చాలు)

ప్రవేశిక:

ప్రశ్న.
అమరులు పాఠ్యభాగ ప్రవేశికను వివరించండి.
జవాబు.
వలస పాలనలోని వివక్షపై, తమ ప్రాంత విముక్తి కోసం, స్వపరిపాలన కోసం, సహజవనరుల సంరక్షణ కోసం, తమదైన భాష, సంస్కృతులను కాపాడుకోవటం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఆశయసిద్ధి కొరకు పోరాడి అమరులైన వీరులకు కవి ఎట్లా నివాళులు అర్పించాడో తెలుసుకుందాం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

కఠినపదాలకు అర్థాలు:

అసువులు = ప్రాణాలు
మాన్యులు = గౌరవనీయులు
పాసిన = పాయుట, వదిలిపెట్టుట
రుద్రుడు = శివుడు
సౌహార్దత = మంచి మనసు
జోహారులు = నివాళులు
పరిపాలన = ఏలుబడి
క్రాంతి = విప్లవం
సతి = భార్య
పతి = భర్త
లావు = బలము, ఎక్కువ, అధికం
ఉద్బోధ = సందేశం
అంధులు = గ్రుడ్డివారు, కళ్ళు లేనివారు
రుధిరం = రక్తం
సిక్త = తడిసిన
యమపాశం = యముని చేతిలోని దండం (పాశం)
ప్రతిజ్ఞ = ప్రతిన
భూవలయం = భూమండలం

గేయం – అర్థాలు – భావాలు:

1. మాకై అసువులు బాసిన
మాన్యులార ! ధన్యులార !
మాతృభూమి స్వేచ్ఛ కొరకు
బలియయ్యిన ప్రబలులార !
తెలంగాణ గర్భమ్మున
గలిగిన శ్రీ రుద్రులార
తను వొడ్డిన ఘనులారా !
సౌహార్దతతోడ నిచ్చు
జనని, సఖుల, సేవలకై
జోహారులు, జోహారులు
సకలజనుల సమూహములు
సమర్పించు జోహారులు

అర్థాలు:

మాకై = మాకోసం
అసువులు = ప్రాణాలను
పాసిన = వదిలిన
మాన్యులార = గౌరవనీయులారా !
ధన్యులార = ధన్యులారా !
మాతృభూమి = జన్మభూమి యొక్క
స్వాతంత్ర్యం కోసం = స్వేచ్ఛ కొరకు
బలి + అయ్యిన = ప్రాణాలు కోల్పోయిన
ప్రబలులార = బలవంతులారా !
తెలంగాణ గర్భమ్మున = తెలంగాణ తల్లి కడుపులో నుండి
కలిగిన = జన్మించిన
శ్రీ రుద్రులారా = = శివ స్వరూపులారా !
జనని = తల్లి యొక్క
సఖుల = మిత్రుల యొక్క
సేవలకు + ఐ = సేవకోసం
తనువు + ఒడ్డిన = శరీరం త్యాగం చేసిన
ఘనులారా = మహనీయులారా !
సౌహార్దత తోడన్ = మంచి మనసుతో
ఇచ్చు = మేమిచ్చు
జోహారులు జోహారులు = నివాళులు
సకల జనుల సమూహములు= ప్రజలందరూ కలిసి
సమర్పించు = మీకు అందించు
జోహారులు = నివాళులు (అందుకోండి)

భావం :
ఓ మాన్యులారా! ధన్యులారా! మహనీయులారా! రుద్రరూపులారా! ఈ తెలంగాణ తల్లి కడుపున పుట్టి మాతృభూమికి స్వేచ్ఛ కలిగించటానికి మీరు మీ ప్రాణాలనే త్యాగంచేశారు. అటువంటి ఘనులైన మీకు మా ప్రజలందరం కలిసి జోహారు చేస్తున్నాము. అందుకోండి.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

2. ఏ తల్లి కడుపు పంటల కొరకో
నీ తల్లి కడుపు మంటల మాడెను
ఏ సతి సౌభాగ్యమ్ముల కొరకో
నీ సతి కుంకుమ గోల్పోయెను
ప్రత్యేక తెలంగాణ కొరకై
ప్రవహించిన నీ రక్తం
పాపాత్ముల పరిపాలన
పటాపంచలౌ పర్యంతం
క్రాంతి విడదు – శాంత పడదు

అర్థాలు :

ఏ తల్లి = ఎవరో తల్లి
కడుపు పంటల కొరకు + ఓ = కన్న బిడ్డల కోసమో
మీ తల్లి కడుపు = మీ అమ్మసంతానం (మీరు)
మంటల మాడెను = మంట గలిసి పోయింది
ఏ సతి = ఎవరో భార్యల యొక్క
సౌభాగ్యమ్ముల కొరకు + ఓ = పసుపు కుంకుమల కోసం
నీ సతి = నీ భార్య
కుంకుమ + కోల్పోయెను = తన నుదుటి కుంకుమ పోగొట్టుకుంది
ప్రతి + ఏక = ప్రత్యేక = ప్రత్యేకమైన
తెలంగాణా కొరకు + ఐ = తెలంగాణ రాష్ట్రం కోసం
ప్రవహించిన = కాలువలు గట్టిన
నీ రక్తం = నీ నెత్తురు
పాప + ఆత్ముల = దుర్మార్గుల యొక్క
పరిపాలన = ఏలుబడి
పటాపంచలు + ఔ = నాశనమయ్యే
పర్యంతం = సమయం వచ్చే వరకు
క్రాంతి విడదు = విప్లవం
శాంత పడదు = శాంతింపదు

భావం :
ఎవరో తల్లి కన్న సంతానాన్ని కాపాడటానికి, ఎవరో పతివ్రతల సౌభాగ్యం కాపాడటానికి నీ ప్రాణాలను ధార పోశావు. తెలంగాణ గడ్డపై దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పడేవరకు కాల్వలు గట్టిన అమరవీరుల రక్తం ప్రవాహం ఆగదు. శాంతించదు.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

3. మీ వొక్కొక్క రక్తపు చుక్కే
లారైన విషమ్ముల గ్రక్కే
ఈ వీరుల ఉద్రేకాస్త్రం
ఈ వీరుల ఉద్బోధార్థం
నీ పెట్టిన రక్తపు తిలకం
నా పాలిటి దీక్షా బంధం
అధికారాంధుల పాలిటి
రుధిరసిక్త యమపాశం
అమరవీరులైన మీ యొక్క

అర్థాలు :

మీ = అవసరమైన మీ యొక్క
ఒక్క + ఒక్క = ప్రతి ఒక్క
రక్తము + చుక్క + ఏ = నెత్తురు బొట్టూ
ఈ వీరుల = ఈ ఉద్యమ వీరుల యొక్క
లావు + ఐన = అధికమైన
విషములన్ + క్రక్కే = విషాన్ని ప్రసరించే
ఉద్రేక + అస్త్రం = ఆవేశం అనే ఆయుధం
ఈ వీరుల = పోరాటం సాగిస్తున్న వీరులను
ఉద్బోధ + అర్థం = ప్రోత్సహించటానికే
నీవు + పెట్టిన = నీవు దిద్దిన
రక్తము + తిలకం = వీర తిలక
నా పాలిటి = నా విషయంలో
దీక్షా బంధం = దీక్షపూని కట్టిన కంకణం
అధికార + అంధుల పాలిటి = అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన వారికి
రుధిరసిస్త = రక్తంతో తడిసిన
యమపాశం = యముని పాశం వంటిది

భావం :
అమర వీరులైన మీ యొక్క ప్రతి నెత్తురు చుక్కా ఉద్యమ వీరుల చేతిలో విషాన్ని చిమ్మే ఆవేశమనే ఆయుధం ఔతుంది. వీరులను ఉత్సాహపరుస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం నాచేతికి కట్టుకున్న దీక్షా కంకణం. అధికారమదంతో కళ్ళుమూసుకుపోయిన పాలకులకు నెత్తురుతో తడిసిన యమపాశం వంటిది.

4. రక్త తర్పణమ్మయినా
రక్తితోడ యిచ్చేస్తాం
మీ యడుగుల జాడల్లో
మాయడుగుల నుంచేస్తాం
అనంతాకాశం
సువిశాల భూవలయం
మధ్యనున్న ఓ సమస్త ప్రాణులారా !
మా ప్రతిన వినుడు
ప్రత్యేక తెలంగాణా
బాహాటంగా సాధిస్తాం !
మృతవీరుల ఆత్మలలో
అమృత వర్షం కురిపిస్తాం.

అర్థాలు :

రక్త తర్పణమ్ము + అయినా = నెత్తురు ధార పోయుమన్నా
యిచ్చేస్తాం = త్యాగం చేస్తాం
మీ + అడుగు జాడల్లో = మీ కాలి గుర్తుల్లో
మా + అడుగులన్ = మా పాదాలను
ఉంచేస్తాం = కలిపేస్తాం
అనంత + ఆకాశం = విశాలమైన ఆకాశానికి
సువిశాల = మిక్కిలి విస్తారమైన
భూవలయం = భూగోళానికీ
మధ్యన + ఉన్న = మధ్యలో ఉన్న
ఓ సమస్త ప్రాణులారా = సమస్తమైన జీవులారా!
వినుడు = వినండి
మా ప్రతిన = మా ప్రతిజ్ఞను
ప్రతి + ఏక = ప్రత్యేకమైన
తెలంగాణా = తెలంగాణా రాజ్యాన్ని
సాధిస్తాం = సంపాదిస్తాం
మృతవీరుల = చనిపోయిన వీరుల యొక్క
ఆత్మలలో = ఆత్మలపైన
అమృతవర్షం = అమృతాన్ని వర్షంలాగా
కురిపిస్తాం = కురిసేట్లు చేస్తాం

భావం :
సంతోషంతో మా నెత్తురు ధారపోస్తాం. మీ కాలి జాడలను అనుసరించి మేము నడుస్తాం. ఆకాశానికి భూమికి మధ్య నివసించే ప్రాణులందరూ మా ప్రతిజ్ఞ వినండి. ప్రత్యేక తెలంగాణ రాజ్యాన్ని మేము సాధించి తీరుతాం. అమర వీరుల ఆత్మల మీద అమృత వర్షం కురిపిస్తాం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఆలోచించండి – చెప్పండి:

ప్రశ్న 1.
“మాకై అసువులు బాసిన” అనటంలో మాకు అంటే ఏవరు ? (టెక్స్టపేజి నెం.91)
జవాబు.
మాకై అసువులు బాసిన అంటే ‘మా కోసం ప్రాణాలర్పించిన’ అని అర్థం . మాకు అంటే తెలంగాణ ప్రజలు.

ప్రశ్న 2.
“జోహార్లు అంటే ఏమిటి ? ఎవరికి జోహార్లు సమర్పిస్తాం ?” ఎందుకు సమర్పించాలి ? (టెక్స్ట పేజి నెం.91)
జవాబు.
జోహార్లు అంటే నమస్కారాలు. ప్రజల సమస్యల కోసం పోరాడి మరణించిన వారికి, ప్రజాసేవలో మరణించిన వారిని, అమర జవానులకు జోహార్లు సమర్పిస్తాం. మనకోసం మన బాగు కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు గనుక వారిపట్ల కృతజ్ఞతా సూచకంగా జోహార్లు సమర్పించాలి. (నేటి కాలంలో జోహార్లు అంటే చనిపోయిన వారికి ఇచ్చే శ్రద్ధాంజలి అని పొరబడుతున్నారు. జోహార్లు బ్రతికున్న వారికీ చెబుతారు. జోహారు శిఖిపింఛమౌళి… అని ప్రసిద్ధ గేయం కూడా ఉంది).

ప్రశ్న 3.
“కడుపు పంటల – కడుపు మంటల” – దీనిని గురించి మీకేమి అర్థమయింది ? (టెక్స్టపేజి నెం.92)
జవాబు.
కడుపు పంటలు అంటే ప్రేమతో కడుపార కన్న సంతానం. కడుపు మంటలు మనసుకు కలిగిన గాయాలు, కడుపార కన్న సంతానాన్ని కోల్పోవడం. ఒక తల్లి కన్న బిడ్డను బ్రతికించడానికి మరొక తల్లి కన్నబిడ్డ బలియై పోయాడు అని ఈ వాక్యానికి అర్థం.

ప్రశ్న 4.
ఈ “పాపాత్ముల పరిపాలన” అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ? (టెక్స్టపేజి నెం.92)
జవాబు.
పాపాత్ములు అంటే పాపం చేసినవారు. దుర్మార్గాలు చేసేవారంతా పాపాత్ములే. అటువంటి దుష్టులు దేశాన్ని పాలిస్తుంటే ప్రజల బాధలు వర్ణించరానివి. అందుకే పాపాత్ముల పరిపాలన అంతం చేస్తాం అన్నాడు కవి.

ప్రశ్న 5.
“మీ యడుగుజాడల్లో మాయడుగుల నుంచేస్తాం!” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు ? (టెక్స్టపేజి నెం.92)
జవాబు.
మంచివారు తన తరువాతి వారికి ఆదర్శమయ్యేలా ఎలా ఎలా నడుచుకున్నారో అలాగే మేము నడుచుకుంటాం అని అర్థం. మీ అడుగు జాడల్లో మా అడుగు వేసి నడుస్తాం అంటే మిమ్మల్ని మేం అనుసరిస్తాం అని అర్థం.

ప్రశ్న 6.
ఈ ‘అమృతవర్షం కురిపించడం అంటే ఏమిటి ? (టెక్స్టపేజి నెం.92)
జవాబు.
అమృతం అంటే చావులేనిది. చనిపోయిన వారు మనకిక కనిపించరు. అమృతం తాగటం వల్ల అసలు చావే ఉండదు. దేశం కోస ప్రాణత్యాగం చేసిన వారు కనిపించకుండా పోయినా వారి ఆత్మల మీద అమృతం చల్లితే మన దగ్గరే ఉన్నట్లు ఉంటుందని భావం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమం గురించి మాట్లాడండి.
జవాబు.
తెలంగాణా రాష్ట్రం కోసం ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అంటే 60 ఏళ్ళుగా ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించింది. కానీ అది చల్లారిపోయింది. ఆ తర్వాత గత 15 ఏళ్ళగా జరిగిన ఉద్యమం 2009లో పల్లెపల్లెలకూ పాకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యేలా చేసింది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి, వాటి సందర్భం రాయండి.

అ) సకలజనుల సమూహములు.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం పాటుపడి ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్న ప్రజలు పలికిన మాటలు ఇవి.
అర్థం : మాన్యులు, ధన్యులు, శివ స్వరూపులైన అమర వీరులారా! మీకు ప్రజలంతా మంచి మనసుతో నివాళులు అర్పిస్తున్నాము.

ఆ) క్రాంతి విడదు శాంత పడదు.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమించిన వీరుల రక్తం ఏరులై ప్రవహించింది. ఈ దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు ఈ ప్రవాహం ఆగదు అని ప్రజలు అమరుల ముందు ప్రతిజ్ఞ చేశారు.
అర్థం : ఈ రక్త ప్రవాహం ఆగదు. శాంతించదు.

ఇ) రుధిరసిక్త యమపాశం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : అమర వీరులు నుదుట ధరించిన రక్తతిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది. అధికారుల మదాన్ని అణచివేస్తుంది. అని ప్రజలు అమరులకు జోహారులర్పిస్తూ పలికారు.
అర్థం : వీరులు ధరించిన రక్తతిలకం అధికారుల పాలిట నెత్తుటితో తడిసిన యమపాశమౌతుంది.

ఈ) అమృతవర్షం కురిపిస్తాం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది రాసిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : ప్రజలు అమర వీరుల బాటలో నడుస్తామని, వారివలనే మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించియైనా ప్రత్యేక తెలంగాణా సాధిస్తామని, వారి ఆత్మలకు శాంతి కలిగిస్తామని ప్రతిజ్ఞ చేసిన సందర్భం.
అర్థం : వీరుల ఆత్మలు శాంతించేలా అమృతం వానగా కురిపిస్తాము.

ఉ) రక్తితోడ ఇచ్చేస్తాం. (అదనపు ప్రశ్న)
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : అమర వీరులకు జోహార్లు చేస్తూ ప్రజలు పలికిన మాటలివి. అమరు వీరుల త్యాగాలతో ప్రజలందరికీ ప్రోత్సాహం లభించింది. వారిలో స్ఫూర్తి నింపింది. అని చెప్పిన సందర్భంలోనిదీ వాక్యం.
అర్థం : మాతృభూమి రక్షణ కోసం మీరిచ్చిన స్ఫూర్తితో రక్తం ధారపోయమన్నా సంతోషంగా ధార పోస్తాం.

ఊ) బాహాటంగా సాధిస్తాం. (అదనపు ప్రశ్న)
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. రచించిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు జోహారులర్పిస్తూ ప్రజలు ప్రతిజ్ఞ చేస్తూ పలికిన మాటలివి.
అర్థం : లోకమంతా తెలిసేలా ప్రత్యేక తెలంగాణా సాధిస్తాం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

2. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2009 నాటికి మహోద్యమమయింది. ఈ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు, పిల్లల నుండి పెద్దల వరకు సకల జనులు పాల్గొన్నారు. ఉద్యమం శాంతియుతంగా నడవాలని ఉద్యమ నాయకత్వం కోరింది. తెలంగాణకై ప్రజలందరు ఆత్మవిశ్వాసంతో పోరాడాలని, అధైర్యంతో బలిదానాలు చేయవద్దని చెప్పింది. ఆ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అమరవీరుల ఆశయం సిద్ధించింది. ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించింది. తెలంగాణలోని ఆబాలగోపాలం ఘనంగా సంబురాలు జరుపుకున్నది. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి అందరం కృషి చేయాలి. అదే మనం అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి.

ప్రశ్నలు :

అ. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది ?
జవాబు.
తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది.

ఆ. ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ?
జవాబు.
ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు అందరూ పాల్గొన్నారు.

ఇ. ఉద్యమం పట్ల నాయకత్వానికి ఉన్న ఆలోచన ఏమిటి ?
జవాబు.
ఉద్యమం శాంతియుతంగా నడవాలని, ఆత్మహత్యలు వంటి ప్రాణాలు పోగొట్టుకునే పనులు చేయకుండా ఆత్మవిశ్వాసంతో ఉద్యమం నడపాలని నాయకత్వం కోరింది.

ఈ. ఆబాలగోపాలం అంటే అర్థమేమిటి ?
జవాబు.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అని అర్థం.

ఉ. అమరవీరులకు మనమిచ్చే నివాళి ఏమిటి ?
జవాబు.
తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటమే మనం అమర వీరులకిచ్చే నివాళి.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. అమరవీరులను కవి “తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!” అని ఎందుకు సంబోధించారు ?
జవాబు.
అమరవీరులను కవి ‘తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!’ అని సంబోధించాడు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వీరశైవం వ్యాప్తిలో ఉండేది. శివ భక్తులను సాక్షాత్తు శివ స్వరూపులుగా భావిస్తారు. అందుకే అక్కడి ప్రజలనందరినీ కవి రుద్రులుగానే భావించి శ్రీరుద్రులారా అని సంబోధించాడు. ఓరుగల్లును పాలించిన కాకతీయులందరి పేర్లలోనూ ‘రుద్ర’ అనే పేరు చేరుతుంది. రుద్రదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. రుద్రుడు అంటే కోపం, పరాక్రమానికి గుర్తు కనుక కవి అమర వీరులను శ్రీరుద్రులారా అని సంబోధించాడు.

ఆ. అమరవీరుల పట్ల మనమెట్లాంటి గౌరవాన్ని చూపాలి ?
జవాబు.
మాతృభూమి కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు మన మందరం కలిసి నివాళులర్పించాలి. వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకొని మనం వారి బాటలోనే నడవాలి. మనదేశాన్ని గౌరవించాలి. మన తోడివారిని కాపాడటానికి ఎటువంటి త్యాగనికైనా సిద్ధపడాలి. అమరవీరుల ఆత్మలకు శాంతి కలిగించాలి. మనకు సిద్ధించిన స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకూడదు. మన రాజ్యం అభివృద్ధి కోసం మనమందరం కలిసి కృషి చెయ్యాలి. సుఖశాంతులతో ఐకమత్యంతో జీవించాలి. ఇదే మన అమర వీరులు కోరినది. అప్పుడే వారి ఆత్మ శాంతిస్తుంది.

ఇ. అధికారాంధుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది ?
జవాబు.
అధికారాంధులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అధికారమదంతో వారి కళ్ళు మూసుకుపోయి ఇతరులను తమ బానిసలుగా చూస్తారు. వారి స్వేచ్ఛను హరిస్తారు. వారి ప్రవర్తన, ఆహార విహారాలు, జీవితం తమ ఆధీనంలో ఉంచుకుంటారు. వారి చేత వెట్టి చాకిరీ చేయిస్తారు. ఇక చదువు సంధ్యల గురించి చెప్పవలసిన పనిలేదు. అటువంటి వారి అధికారాన్ని సహించకూడదు. ఆత్మవిశ్వాసంతో వారిని ఎదుర్కొని తమ హక్కులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదే.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఈ. కవి ప్రతిజ్ఞలోని విషయాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
కవి ‘ప్రత్యేక’ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరతామని బాహాటంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు తెలంగాణా వీరులు’ అని రాశాడు. సుమారు పన్నెండు సంవత్సరాల నించి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం సాగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు అధికారులు మంత్రులు ఏవేవో కారణాలు చెబుతూ వారి ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటే తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో సమృద్ధంగా జీవించాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడాల్సిందే. అప్పుడే ఏ అభివృద్ధియైనా సాధ్యమౌతుంది. కాబట్టి తెలంగాణా సాధించే తీరతామని ప్రతిజ్ఞ చేస్తున్నాడు.

ఉ. కవి అమరులు అనే కవితలో అమరవీరులను ఎలా సంబోధించాడు ? ఎందుకు ? (అదనపు ప్రశ్న)
జవాబు.
కవి ఈ కవితలో అమరవీరులను ‘మాన్యులార; ధన్యులార, ప్రబలులార, శ్రీరుద్రులార, ఘనులార’ అని సంబోధించాడు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులార’ అని సంబోధించాడు. అమరవీరులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం దీక్ష వహించారు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులారా’ అని సంబోధించాడు. వీరులు వారి ప్రయత్నంలో వీరమరణం పొంది తల్లి భూమి రుణం తీర్చుకున్నారు. అందుకే ‘ధన్యులార’ అనే సంబోధన పరాక్రమంలో సాక్షాత్తు రుద్రులే కనుక ‘శ్రీరుద్రులార’ అని సంబోధించాడు. పోరాటంలో తమ బల పరాక్రమాలు చూపించారు గనుక ‘ప్రబలులార’ అని సంబోధించాడు. ఇంతటి ఘనకార్యానికి పూనుకున్నారు కాబట్టి ‘ఘనులార’ అని సంబోధించాడు.

ఊ. ఈ కవితలో కవి ‘రక్తం’ అనే పదం ఎన్ని చోట్ల ఎలా ఉపయోగించాడు ? (అదనపు ప్రశ్న)
జవాబు.

  1. ప్రత్యేక తెలంగాణ కోసం అమర వీరులు చిందించిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయే వరకు శాంతించదు. ప్రవహిస్తూనే ఉంటుంది.
  2. అమరువీరుల ఒక్కొక్క రక్తపు చుక్క అధికంగా విషాన్ని కక్కుతుంది. శత్రువులను అంతం చేస్తుంది.
  3. అమరవీరులు దిద్దిన రక్త తిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది.
  4. వారి రక్తం అధికార మదంతో విర్రవీగే వారి పాలిట రక్తంతో తడిసిన యమపాశం వంటిది.
  5. ప్రజలు తమ రక్తం తర్పణ చేసియైనా తెలంగాణ విముక్తికోసం పోరాడుతారు.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. కవి నాడు చేసిన ప్రతిజ్ఞ నేడు సాకారమైంది కదా! దీనికి పాటుబడిన వారిని గురించి వివరించండి.
జవాబు.
కవి ఆచార్య రుక్నుద్దీన్ పన్నెండేళ్ళ క్రితం రాసిన కవిత ఇది. ప్రత్యేక తెలంగాణ కోసం అమరవీరులు ముమ్మరంగా పోరాటం జరిపారు. లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలంతా వారి త్యాగాలను మరచి పోకుండా వారి బాటలోనే నడుస్తామని ప్రత్యేక తెలంగాణ సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోడానికి నాటి నుండి నేటి వరకు ఉద్యమం ఆపలేదు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. చివరికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ శ్రీ జయశంకర్, ఆమరణ నిరాహారదీక్ష చేసిన. శ్రీ.కె.సి.ఆర్. ఐ.కా.స. నాయకుడు శ్రీ కోదండరాం వంటి మేధావులు, రాజకీయ నాయకులతో పాటు వేలాది మంది సామాన్యజనం కూడా భాగస్తులే. ఉద్యమంలో భాగంగా ఆత్మాహుతి చేసుకున్న విద్యార్థుల పాత్ర తక్కువేమీ కాదు. సుమారు 60 రోజలు విధులు బహిష్కరించి సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు ఇలా అందరూ తమ వంతు కృషివల్లే తెలంగాణా రాష్ట్రం సాకారమైంది.

ఆ. అమరులు కవితా సారాంశాన్ని రాయండి. (అదనపుప్రశ్న)
జవాబు.
‘అమరులు’ అనే కవితను ఆచార్య కె. రుక్నుద్దీన్ రచించారు. ఈ కవితలో అమరవీరులకు ప్రజాసమూహం నివాళులర్పించిన విధాన్ని కవి వివరించాడు.

తెలంగాణ ప్రజలకోసం, మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన ధన్యజీవులారా! మీకు జోహార్లు. వీరులారా! మీ జీవితం తెలంగాణ భూమిపుత్రుల సేవలలోనే తరించింది. ఈ సమాజమంతా మీకు జోహార్లు అర్పిస్తుంది. ఇక్కడి ప్రజల సుఖసంతోషాల కోసం మీరు, మీ కుటుంబసభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యేవరకు విశ్రమించదు. శాంతించదు. మీ ఒక్కొక్క రక్తపుచుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం చిమ్ముతుంది.

మీ ఆవేశం ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రతి నిమిషం ప్రబోధిస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం మాకు స్ఫూర్తినందిస్తుంది. అది అధికార మదంతో బలిసిన వారికి యమపాశమవుతుంది. మీ అడుగులలో అడుగేస్తూ మా నెత్తురు ధారపోస్తాం. రక్తతర్పణలను చేస్తాం. నింగి, నేలలో విస్తరించిన సమస్త ప్రాణులారా! మా ప్రతిజ్ఞ వినండి. బాహాటంగానే తెలంగాణను సాధిస్తాం. అమరుల ఆత్మలు శాంతించే విధంగా అమృతవర్షం కురిపిస్తాం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

IV. సృజనాత్మకత/ప్రశంస.

ప్రశ్న 1.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాన్ని గురించి ఒక కవిత/గేయం రాయండి.
జవాబు.
అమరవీరులకు భక్త్యంజలి

మరణించిన మహావీరులు
నిజంగా మరణించరు
అమరులైన ఆ వీరులు
ఆ చంద్ర తారార్కంగా
అందరి హృదయాల్లోనూ
అత్యున్నతమైన ప్రేమ
పీఠాలను అధివసించి ఉంటారు
ఆదిత్యుని అంశువుల వలె
అనంతమైన ప్రకాశాన్ని వెదజల్లుతుంటారు
నిరంతరం మనకు నిండు వెలుగు బాటల్ని
చూపుతుంటారు నిత్యం మనకు
అభ్యుదయ పథం నిర్దేశిస్తుంటారు.

V. పదజాల వినియోగం:

1. కింది పదాలకు పర్యాయపదాలు (అదే అర్థం వచ్చే పదాలను) రాయండి.

అ) సమూహం = ______________
జవాబు.
గుంపు, సముదాయం

ఆ) అసువులు = ______________
జవాబు.
ప్రాణములు, ఉసురు

ఇ) స్వేచ్ఛ = ______________
జవాబు.
విడుదల, స్వాతంత్ర్యం

ఈ) సఖులు = ______________
జవాబు.
స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు గల నానార్థాలు (వేరు వేరు అర్థాలు) రాయండి.

అ) ఈ వర్షంలో కురిసిన పెద్ద వర్షం ఇది.
జవాబు.
సంవత్సరం, వాన

ఆ) అమృతంతో పాయసం చేశారు. అమృతంతో చేతులు కడిగారు.
జవాబు.
పాలు, నీరు

3. కింది వృత్తంలో గల ప్రకృతి, వికృతి పదాలను గుర్తించి రాయండి.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు 3

ప్రకృతి – వికృతి
ప్రతిజ్ఞ – ప్రతిన
ఆకాశం – ఆకసం
భాగ్య – బాగ్గెం
శ్రీ – సిరి

సంధులు:

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.
అ) ఉద్రేకాస్త్రం = ఉద్రేక + అస్త్రం = సవర్ణదీర్ఘసంధి
ఆ) మొట్టమొదలు = మొదలు + మొదలు = ఆమ్రేడిత సంధి
ఇ) లావైన = లావు + ఐన = ఉత్వసంధి
ఈ) అనంతాకాశం = అనంత + ఆకాశం = సవర్ణదీర్ఘ సంధి
ఉ) ఒక్కొక్క = ఒక్క + ఒక్క = ఆమ్రేడిత సంధి

2. కింది వాక్యాలను చదువండి. తేడా చెప్పండి.

ఆమె ముఖం అందంగా ఉన్నది.
ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.

పై వాక్యాల్లోని తేడాను చూస్తే ‘ఆమె ముఖం అందంగా ఉన్నది’ అనే దానికి బదులు ‘ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది’ అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది. కదా! ఇట్లా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్నే ‘ఉపమాలంకారం’ అంటాం. పై వాక్యాన్నిబట్టి చూస్తే ఉపమాలంకారంలో నాలుగు అంశాలను గమనించవచ్చు. అవి :

  1. ఉపమేయం – దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం – ఉపమేయం)
  2. ఉపమానం – దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం – ఉపమానం)
  3. సమానధర్మం – ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒకేవిధమైన ధర్మం. (అందంగా ఉండడం – సమానధర్మం)
  4. ఉపమావాచకం – పోలికను తెలిపే పదం. (వలె – ఉపమావాచకం)
    “ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.”

3. కింది ఉదాహరణలు చదువండి. దేనిని దేనితో పోల్చారో, వాటిలోని సమానధర్మం ఏమిటో చెప్పండి.

అ) ఏకలవ్యుడు అర్జునుడి వలె గురితప్పని విలుకాడు.
జవాబు.
ఉపమాన ఉపమేయాలకు చక్కనిపోలిక చెప్పటమే ఉపమాలంకారం. ఈ వాక్యంలో ఏకలవ్యుడిని అర్జునునితో పోల్చారు. (ఏకలవ్యుడు – ఉపమేయం, అర్జునుడు – ఉపమానం) గురి తప్పకుండా బాణాలు వేయడం సమానధర్మం. పోలికను తెలిపే పదం ‘వలె’ ఉపమావాచకం.

ఆ) తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
జవాబు.
ఈ వాక్యంలో పిల్లలను సీతాకోకచిలుకలతో పోల్చారు. కనుక ఉపమాలంకారం. పిల్లలు – ఉపమేయం. సీతాకోక చిలుకలు ఉపమానం. అటూ ఇటూ తిరగడం సమానధర్మం. ‘లాగా’ అనే పోలికను తెలిపే పదం ఉపమావాచకం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా వచ్చిన పాటలను లేదా ఉద్యమకాలంలో జరిగిన ఒక కార్యక్రమం గురించి వివరాలు సేకరించి నివేదిక రాయండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు : తెలంగాణ ఉద్యమకాలంలో వచ్చిన పాటలు/ఒక కార్యక్రమం వివరాలు
  2. సమాచారాన్ని సేకరించిన విధానం : పాటలను వినడం ద్వారా ఉద్యమ సందర్భంలో ఆయా కార్యక్రమాలు దగ్గరగా చూడడం ద్వారా

ఆ) నివేదిక :

1. నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణ

పల్లవి : నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణా నా తెలంగాణా
నవ్వేటి బతుకులా నా తెలంగాణా నా తెలంగాణా || 2 ||

చరణం 1 :
పారేటి నీళ్ళల్ల పానాదులల్లా || 2 ||
పూసేటి పువ్వుల్ల ………………… పునాసాలల్లా
కొంగు జాపిన నేల ……………….. నా తెలంగాణా నా తెలంగాణా
పాలు తాపిన తల్లి ………………… నా తెలంగాణా నా తెలంగాణా

చరణం 2 :
తంగేడి పువ్వుల్ల …………. తంబల మంతా
తీరాక్క రంగుల్ల ……………. తీరిచ్చి నావూ ……………….
తీరొ రంగుల్ల ……………………. తీరిచ్చినావూ
బంగారు చీరలు బాజారులన్నీ || 2 ||
బతుకమ్మ పండుగ నా తెలంగాణా ………………… నా తెలంగాణా
బంతిపూల తోట నా తెలంగాణా …………………… నా తెలంగాణా ॥ నాగేటి ॥

చరణం 3 :
వరద గూడు గడితె వానొచ్చునంటా
బురద పొలం దున్న బురి సున్న రంతా || 2 ||
శివుని గుళ్ళో నీరు …………. సీమలకు సెక్కరి
వాన కొరకు జడకొప్పులేసీ || 2 ||
వాగుల్లా వంకల్ల నా తెలంగాణా ……………….. నా తెలంగాణా || నాగేటి ||

చరణం 4 :
కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు || 2 ||
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు
జొన్న కర్రల జండ జోరున్న దేమీ || 2 ||
అళై భళై తీసె నా తెలంగాణా …………………. నా తెలంగాణా
తిండి పంచిన ఆర్తి నా తెలంగాణా …………………… నా తెలంగాణా || నాగేటి ||

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

2. ఉస్మానియా క్యాంపస్లో

ఉస్మానియా క్యాంపస్లో ………… ఉదయించిన కిరణమా ………… వీర తెలంగాణమా .
వీర తెలంగాణమా ………… నాలుగు కోట్ల ప్రాణమా
కాకతీయ ప్రాంగణంలో ………… కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాలుగు కోట్ల ప్రాణమా
భలె ……… భలె ………… భలె ………… || ఉస్మానియా ||
నల్లగొండ నడిబొడ్డున నాటిన ఓ ఖడ్గమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా …………
మహబూబ్నగర్ మట్టిలోన
మొలచిన మందారమా ………… వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……… కోట్ల ప్రాణమా
భలె ……… భలె ………… భలె ………… || ఉస్మానియా ||
హైదరాబాద్ బడిలోన చేసిన బలిదానమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా …………
రంగారెడ్డి ఫ్యాక్టరీలో మోగిన నగారమా వీర తెలంగాణమా
భలె ……… భలె ………… భలె ………… || ఉస్మానియా ||
మెదక్ సీమ గాలిలోన త్యాగాలా గంధమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా
నిజామాబాద్ నుదుటి మీద దిద్దిన ఓ కుంకుమ …………
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా …………
భలె ……… భలె ………… భలె ………… ॥ ఉస్మానియా ||
కరీంనగర్ రైతుకూలీ చిందించిన రక్తమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా
అరెరె రరెరె ఆదిలాబాద్ అడవుల్లో రాజుకున్న రౌద్రమా ………… వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా
భలె ……… భలె ………… భలె ………… || ఉస్మానియా ||
వరంగల్లు గడ్డమీద చేసిన నినాదమా ………… వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా
ఖమ్మం, మొట్టు పెల్లలోన ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా
భలె ……… భలె ………… భలె ………… || ఉస్మానియా ||

ఇ) ముగింపు :
మాట కన్నా పాట సామాన్యులకు తొందరగా చేరుతుంది. వారిని ఉత్తేజితుల్ని చేస్తుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో మంది కవులు రాసిన పాటలు ప్రజలలో చైతన్యం నింపడానికి ఎంతగానో తోడ్పడ్డాయి.

తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన ఒక కార్యక్రమం

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు 2

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఆ) నివేదిక :

సకల జనుల సమ్మె

తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన వివిధ రకాల కార్యక్రమాలలో నేను ప్రత్యక్షంగా చూచిన సకలజనుల సమ్మె గూర్చి పొందు పరుస్తున్నాను.

సిరిసిల్ల R.D.O ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ ఆక్షన్ కమిటి 42 రోజుల పాటు వివిధ రూపాలలో తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించింది. డివిజన్లోని అన్ని మండలాల్లోని ఉద్యోగులు స్వచ్ఛందంగా 42 రోజులు తమ విధులను బహిష్కరించి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రోజుకు కొంతమంది నిరాహార దీక్షలో కూర్చోవడం … జానపద గీతాలు పాడే గాయకులను తీసుకువచ్చి ఉద్యమ గీతాలు పాడించడం, వంటా వార్పు, రోడ్ల దిగ్బంధనం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యోగులు చేస్తున్న ఈ ఉద్యమానికి అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజల నుండి భారీ మద్దతు లభించింది.

రోజుకో కుల సంఘాలు ర్యాలీగా వచ్చి వీరి ఉద్యమానికి మద్దతు తెలియజేశాయి. రోజురోజుకు తీవ్రమౌతున్న ఈ ఉద్యమాన్ని అణచడానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో బెదిరింపులకు పాల్పడింది. తాత్కాలిక ఉద్యోగులతో పని చేయిస్తామని… ఉద్యోగాలు పోతాయని ఎన్ని రకాలుగా భయపెట్టినా ఉద్యోగులు లొంగలేదు.

చివరకు ……. విద్యార్థులు నష్టపోతారని, ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుందని ……………. ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించాయి. ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు వక్తలచే తెలంగాణ ఆవశ్యకత గూర్చి ఉపన్యాసాలు ఇప్పించడం, కళాకారులచే పాటలు పాడించడం, వంటా వార్పు లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు ……… కొన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తితో సమ్మె విరమించి విధుల్లో చేరారు.

ఇ) ముగింపు :
ఒక నెల జీతం 4 రోజులు లేటైతేనే తల్లడిల్లే ఉద్యోగులు 42 రోజులు “సకల జనుల సమ్మె” లో పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఈ 42 రోజుల సమ్మె కాలంలో ఇంటి అద్దె, పాల బిల్లు, పేపరు బిల్లు, కరంటు బిల్లు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. అయినా ఉద్యోగులు ధైర్యంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా వీరికి
బాగా సహకరించారు.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

జనని = మాత, అమ్మ, తల్లి, అంబ
తనువు = శరీరం, దేహం, మేను
ఆకాశం = గగనం, విహాయసం, ఖం
అస్త్రం = శరం, బాణం, తూపు
అధికారం = పదవి, ఏలుబడి
భూమి = ధర, ధాత్రి, ధరణి
గర్భము = కడుపు, పొట్ట
రక్తము = రుధిరము, నెత్తురు

నానార్థాలు:

తనువు = శరీరం, అల్పమైనది
వర్షం = వాన, సంవత్సరం,
అమృతం = పాలు, నీరు, నేయి, సుధ
పాసిన = వదలిన, పాడైపోయిన

ప్రకృతులు – వికృతులు:

ప్రకృతి – వికృతి
భూమి – బూమి
విషము – విసము

సంధులు:

మాకై = మాకు + ఐ = ఉత్వసంధి
తనువొడ్డిన = తనువు + ఒడ్డిన = ఉత్వసంధి
రక్తతర్పణమ్మయినా = రక్త తర్పణమ్ము + అయిన = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైతే సంధి అవుతుంది.

అధికారాంధులు = అధికార + అందులు = సవర్ణదీర్ఘ సంధి
ఉద్బోధార్థ = ఉద్బోధ + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
పాపాత్ములు = పాప + ఆత్ములు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

స్వేచ్ఛ = స్వ + ఇచ్ఛ = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమవుతాయి.

సమాసములు:

తెలంగాణ గర్భము = తెలంగాణ యొక్క గర్భము = షష్ఠీ తత్పురుష సమాసం
జనుల సమూహములు = జనుల యొక్క సమూహములు = షష్ఠీ తత్పురుష సమాసం
రక్తపు చుక్క = రక్తము యొక్క చుక్క = షష్ఠీ తత్పురుష సమాసం
రక్తపు తిలకం = రక్తము యొక్క తిలకం = షష్ఠీ తత్పురుష సమాసం
యమపాశం = యముని యొక్క పాశం = షష్ఠీ తత్పురుష సమాసం
అధికారాంధులు = అధికారముతో అంధులు = తృతీయాతత్పురుష సమాసం
రుధిరం = రుధిరముతో సిక్తం = తృతీయాతత్పురుష సమాసం

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఎసైన్మెంట్:

పదజాలం :

సొంతవాక్యాలు:

కింది పదాలను సొంత వాక్యాలలో రాయండి.

ప్రశ్న 1.
అసువులు : ______________
జవాబు.
అసువులు = ప్రాణాలు
ఎందరో వీరులు అసువులు త్యాగం చేస్తేనే స్వాతంత్య్రం సిద్ధించింది.

ప్రశ్న 2.
సౌహార్దత : ______________
జవాబు.
సౌహార్దత = మంచి మనసు
మనిషికి సౌహార్దత అవసరం. అదే మనిషికి ఆభరణం.

ప్రశ్న 3.
లావు : ______________
జవాబు.
లావు = బలం
లావు వాడికంటే నీతిపరుడు బలవంతుడు.

ప్రశ్న 4.
యమపాశం : ______________
జవాబు.
యమపాశం = యముని చేతిలో పాలనాదండం (పాశం)
ఎంతకాలం బ్రతికినా ఏదో ఒకరోజు యమపాశానికి చనిపోవలసినదే.

ప్రశ్న 5.
అమృతం : ______________
జవాబు.
అమృతం = చావుని కలిగించనిది, మృతి నొందింపనిది
అమృతం తాగిన దేవతలు అమరులు, సురలు.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

అర్థాలు :

కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

ప్రశ్న 6.
తెలంగాణా ఆశయ సాధనలో ఎందరో అసువులు కోల్పోయారు. ( )
A) ప్రాణాలు
B) అవయవాలు
C) డబ్బులు
D) నగలు
జవాబు.
A) ప్రాణాలు

ప్రశ్న 7.
నా సఖులు చాలా మంచివారు. ( )
A) సోదరులు
B) స్నేహితులు
C) అన్నలు
D) తమ్ములు
జవాబు.
B) స్నేహితులు

ప్రశ్న 8.
సతి తన పతి క్షేమం కోసం నోములు నోస్తుంది. ( )
A) అక్క
B) చెల్లెలు
C) అమ్మ
D) భార్య
జవాబు.
D) భార్య

ప్రశ్న 9.
పాపాత్ములతో స్నేహం చేయరాదు. ( )
A) మంచివారు
B) పిచ్చివారు
C) దుర్మార్గులు
D) సన్మార్గులు
జవాబు.
C) దుర్మార్గులు

ప్రశ్న 10.
మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి. ( )
A) కాలిగుర్తుల్లో
B) వీథిలో
C) ఊరిలో
D) ఇంటిలో
జవాబు.
A) కాలిగుర్తుల్లో

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

నానార్థాలు:

కింది వాక్యాలో గీతగీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.

ప్రశ్న 11.
తనువుకు తగిలిన గాయాలు తేలికగానే మానిపోతాయి. చీమ చాలా తనువైన ప్రాణి. ( )
A) వేలు, కాలు
B) శరీరము, అల్పము
C) మనసు, ముఖము
D) ఏనుగు, దోమ
జవాబు.
B) శరీరము, అల్పము

ప్రశ్న 12.
తనను పాసిన స్నేహితుని కోసం రాము చాలా బాధపడ్డాడు. పాసిన పదార్థం తినరాదు. ( )
A) విడిచిన, వదిలిన
B) పాడైన, చెడిన
C) విడిచిన, పాడైన
D) వచ్చిన, వెళ్ళిన
జవాబు.
C) విడిచిన, పాడైన

ప్రశ్న 13.
గరుడుడు పాములకు అమృతం ఇచ్చాడు. దాహం వేసిన వారికి కొంచెం అమృతం ఇవ్వాలి. ( )
A) అన్నం, పాలు
B) పాలు, నూనె
C) నీళ్ళు, చారు
D) పీయూషం, నీరు
జవాబు.
D) పీయూషం, నీరు

ప్రశ్న 14.
వర్షం తొందరగా వర్షం వచ్చేసింది. ( )
A) సంవత్సరం, వాన
B) వారం, వర్జ్యం
C) వరం, నరం
D) వీర, బూర
జవాబు.
A) సంవత్సరం, వాన

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

పర్యాయపదాలు:

కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలను గుర్తించండి. ( )

ప్రశ్న 15.
పార్వతీదేవి లోకాలకే జనని.
A) జానకి, జనులు
B) తల్లి, అమ్మ
C) అక్క, చెల్లి
D) అత్త, అమ్మ
జవాబు.
B) తల్లి, అమ్మ

ప్రశ్న 16.
శ్రీకృష్ణుడు దేవకి గర్భమున జన్మించాడు. ( )
A) కడుపు, పొట్ట
B) చెయ్యి, ఛాతి
C) కాలు, పాదం
D) గర్వము, గౌరవం
జవాబు.
A) కడుపు, పొట్ట

ప్రశ్న 17.
మనం రక్తం దానం చేస్తే ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ( )
A) నీళ్లు, పానీయం
B) చల్ల, మజ్జిగ
C) అవయవం, కీలు
D) రుధిరం, నెత్తురు
జవాబు.
D) రుధిరం, నెత్తురు

ప్రశ్న 18.
స్వరాజ్య సమరంలో ఎంతో మంది తమ అసువులు ధారపోశారు. ( )
A) రక్తం, నెత్తురు
B) ప్రాణాలు, ఉసురు
C) నెయ్యి, నూనె
D) పాలు, నీళ్ళు
జవాబు.
B) ప్రాణాలు, ఉసురు

ప్రశ్న 19.
రోడ్డు ప్రమాదం జరిగినచోట జనం సమూహాలుగా చేరారు. ( )
A) ఒక్కరు, ఇద్దరు
B) మెల్లగా, నిదానంగా
C) బృందాలు, గుంపులు
D) కలిసి, ఒక్కటిగా
జవాబు.
C) బృందాలు, గుంపులు

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ప్రకృతులు – వికృతులు:

కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి / వికృతి గుర్తించండి.

ప్రశ్న 20.
శివుడు విసం కంఠంలో దాచుకున్నాడు. ( )
A) విషం
B) విశం
C) వీసం
D) విశ్వం
జవాబు.
A) విషం

ప్రశ్న 21.
ఆకసంలో మబ్బులు కమ్ముకున్నాయి. ( )
A) ఆకషం
B) అక్కసం
C) ఆకాశం
D) అక్కా
జవాబు.
C) ఆకాశం

ప్రశ్న 22.
భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు. ( )
A) ప్రతిగ్య
B) ప్రతిగ్న
C) ప్రతిగ్న
D) ప్రతిన
జవాబు.
D) ప్రతిన

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

భాషాంశాలు :

సంధులు:

కింది సంధులను గుర్తించండి.

ప్రశ్న 23.
తనువొడ్డిన – విడదీయండి. ( )
A) తనువు + ఒడ్డిన
B) తనువు + వొడ్డిన
C) తను + ఒడ్డిన
D) తనువొడ్డిన
జవాబు.
A) తనువు + ఒడ్డిన

ప్రశ్న 24.
మాకై – ఏ సంధి ? ( )
A) అత్వసంధి
B) ఉత్వసంధి
C) వృద్ధిసంధి
D) ఇత్వసంధి
జవాబు.
B) ఉత్వసంధి

ప్రశ్న 25.
స్వ + ఇచ్ఛ – కలిపి రాసే విధానం ( )
A) స్వాచ్ఛ
B) స్వయిచ్ఛ
C) స్వేచ్ఛ
D) స్వేచ్ఛ
జవాబు.
C) స్వేచ్ఛ

ప్రశ్న 26.
‘అ’ కారానికి ఏవి పరంగా ఉంటే ఏ ఓ అర్లు వస్తాయి ? ( )
A) అ ఇ ఉ ఋ
B) య వ ర
C) ఏ ఐ ఓ ఔ
D) ఇ ఉ ఋ
జవాబు.
D) ఇ ఉ ఋ

ప్రశ్న 27.
దీర్ఘాలు ఏకాదేశంగా వచ్చేది ఏ సంధి ? ( )
A) గుణసంధి
B) ఉత్వసంధి
C) సవర్ణదీర్ఘసంధి
D) ఇత్వసంధి
జవాబు.
C) సవర్ణదీర్ఘసంధి

ప్రశ్న 28.
అనంతాకాశం – ఎలా విడదీయాలి ? ( )
A) అనంత + అకాశం
B) అనంత + ఆకాశం
C) అన + అంతాకాశం
D) అనంతా + కాశం
జవాబు.
B) అనంత + ఆకాశం

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

సమాసాలు:

ప్రశ్న 29.
‘చేత, తోడ’ ప్రత్యయాలు ఏ విభక్తి ? ( )
A) చతుర్థీ విభక్తి
B) ద్వితీయా విభక్తి
C) తృతీయా విభక్తి
D) షష్ఠీ విభక్తి
జవాబు.
C) తృతీయా విభక్తి

ప్రశ్న 30.
‘అధికారాంధులు’ ఏ సమాసం ? ( )
A) తృతీయా తత్పురుష సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) పంచమీ తత్పురుష సమాసం
D) చతుర్థీ తత్పురుష సమాసం
జవాబు.
A) తృతీయా తత్పురుష సమాసం

ప్రశ్న 31.
‘జనుల సమూహములు’ – విగ్రహవాక్యం ( )
A) జనుల వలన సమూహములు
B) జనుల యొక్క సమూహములు
C) జనుల కొరకు సమూహములు
D) జనుల యందు సమూహములు
జవాబు.
B) జనుల యొక్క సమూహములు

వాక్యాలు – రకాలు:

కింది వాక్యాలు ఎటువంటి వాక్యాలో గుర్తించండి.

ప్రశ్న 32.
ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ? ( )
A) ప్రశ్నార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) అనుమత్యర్థకం
D) విద్యర్థకం
జవాబు.
A) ప్రశ్నార్థకం

ప్రశ్న 33.
ఆహా ! అద్భుతమైన స్ఫూర్తినిచ్చారు. ( )
A) ప్రశ్నార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) అనుమత్యర్థకం
D) విద్యర్థకం
జవాబు.
C) అనుమత్యర్థకం

ప్రశ్న 34.
మీరు అక్కడకి వెళ్ళవద్దు. ( )
A) ప్రశ్నార్థకం
B) నిషేధార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు.
B) నిషేధార్థకం

ప్రశ్న 35.
మీరంతా ఆ పని చేయగలరు. ( )
A) ప్రశ్నార్థకం
B) నిషేధార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు.
D) ప్రేరణార్థకం

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

క్రియను గుర్తించుట:

ప్రశ్న 36.
తెలంగాణా ఉద్యమం చేసి అమరులయ్యారు. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
A) క్త్వార్థం

ప్రశ్న 37.
స్ఫూర్తిని అందిస్తూ వీరులు ప్రబోధం చేశారు. ( )
A) క్త్వార్థం
B) శత్రర్ధకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
B) శత్రర్ధకం

ప్రశ్న 38.
ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ మాతృభూమి విముక్తికై పోరాడుతూనే ఉన్నారు. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
D) అప్యర్థకం

ప్రశ్న 39.
ఉద్యమంలో పాల్గొంటే వీరుల వీరత్వం అందరికీ తెలుస్తుంది. ( )
A) క్త్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
B) చేదర్థకం

సామాన్య – సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:

ప్రశ్న 40.
ఉద్యమం చేశారు. తెలంగాణా సాధించారు – సంక్లిష్టవాక్యం గుర్తించండి. ( )
A) ఉద్యమం చేస్తూ తెలంగాణా సాధించారు
B) ఉద్యమం చేసి తెలంగాణా సాధించారు
C) ఉద్యమం చేయాలని తెలంగాణా సాధించారు
D) తెలంగాణా సాధించి ఉద్యమం చేశారు.
జవాబు.
B) ఉద్యమం చేసి తెలంగాణా సాధించారు

ప్రశ్న 41.
దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు మేము విశ్రమించము. శాంతించము – సంక్లిష్టవాక్యం గుర్తించండి. ( )
A) దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు మేము విశ్రమించము మరియు శాంతించము.
B) దుర్మార్గుల పాలన అంతమైతేనే మేము విశ్రమించి శాంతిస్తాము.
C) దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు మేము విశ్రమించం కాని శాంతిస్తాము.
D) మేము శాంతించం విశ్రమించం దుర్మార్గుల పాలన అంతమయ్యేవరకు
జవాబు.
A) దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు మేము విశ్రమించము మరియు శాంతించము.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

అలంకారాలు:

కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి.

ప్రశ్న 42.
సీత మోము చంద్రబింబం వలె మనోహరంగా ఉంది ( )
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) స్వభావోక్తి
జవాబు.
A) ఉపమ

ప్రశ్న 43.
ఆమె ముఖం చంద్రబింబమేమో అన్నట్లుంది ( )
A) ఉపమ
B) రూపకం
C) ఉత్ప్రేక్ష
D) అతిశయోక్తి
జవాబు.
C) ఉత్ప్రేక్ష

ప్రశ్న 44.
ప్రవర్తన అనే సముద్రం దాటటానికి సత్యము ఓడవలె సహాయపడుతుంది. ( )
A) స్వభావోక్తి
B) అతిశయోక్తి
C) ఉత్ప్రేక్ష
D) ఉపమ
జవాబు.
D) ఉపమ

కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

“రక్త తర్పణమ్మయినా, రక్తితోడ ఇచ్చేస్తాం
మీ యడుగుల జాడల్లో మాయడుగుల నుంచేస్తాం
అనంతాకాశం సువిశాల భూవలయం
మధ్యనున్న ఓ సమస్త ప్రాణులారా! మా ప్రతిన వినుడు
ప్రత్యేక తెలంగాణా బాహాటంగా సాధిస్తాం
మృతవీరుల ఆత్మలలో అమృత వర్షం కురిపిస్తాం”

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ప్రశ్నలు :

ప్రశ్న 45.
పై కవితలో “మీయడుగులు” అంటే ఎవరివి ?
జవాబు.
అమరవీరులవి

ప్రశ్న 46.
“మాయడుగులు” అంటే ఎవరివి ?
జవాబు.
తెలంగాణ ప్రజలవి

ప్రశ్న 47.
సమస్త ప్రాణులు ఎక్కడున్నారు ?
జవాబు.
ఆకాశానికి భూమికి మధ్య

ప్రశ్న 48.
ప్రజల ప్రతిన ఏమిటి ?
జవాబు.
ప్రత్యేక తెలంగాణా బాహాటంగా సాధిస్తాం

ప్రశ్న 49.
అమృత వర్షం ఎక్కడ కురిపిస్తారు ?
జవాబు.
మృతవీరుల ఆత్మలలో

Leave a Comment