TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson జానపద కళలు

Telangana SCERT TS 8th Class Telugu Study Material Pdf ఉపవాచకం 5th Lesson జానపద కళలు Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide Upavachakam 5th Lesson జానపద కళలు

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
జానపద కళలు అంటే ఏమిటి ? కొన్నింటి పేర్లు తెల్పండి.
జవాబు.
జానపదం అంటే గ్రామం. జానపద కళలు అంటే పల్లె ప్రజల పాటలు, గేయాలు, సాహిత్యం, కళారూపాలను కలిపి జానపద కళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, సిందు భాగోతాలు, చిడుతల రామాయణం, కోలాటం, భజన, తుపాకి రాముడు, పిట్టల దొర మొదలైనవి జానపద కళలకు ఉదాహరణలు.

భాగవతం, రామాయణం, గ్రామదేవతల కథలు, వీరుల కథలు మొదలైనవి. జానపద కళల ద్వారా ప్రచారంలోకి వచ్చినాయి. నిరక్షరాస్యులైన పల్లె ప్రజలకు వినోదంతో పాటు నీతిసూత్రాల ఆలోచనను ఈ కళలు అందిస్తాయి.

ప్రశ్న 2.
‘యక్షగానం’ గురించి వివరించండి.
జవాబు.
తెలుగు జానపద సాహిత్య ప్రక్రియల్లో యక్షగానం ఒకటి. వీటిని ఆడే వారిని యక్షగాన కళాకారులు అంటారు. కొన్ని చోట్ల వీటిని భాగోతాలని, నాటకాలని కూడా అంటారు. పాటలు, పద్యాలు, దరువు, ఆదితాళం మొదలగు ప్రక్రియలతో ఇది సాగుతుంది. ఎక్కువగా వీటిని రాత్రిపూట ప్రదర్శించేవారు. గ్రామంలోని కొందరు యువకులు ‘మ్యాల్లం’ గట్టి యక్షగానాన్ని నేర్చుకుని ప్రదర్శించేవారు.

ప్రజాకళలు ఎప్పుడూ ప్రజల వినోదానికి మాత్రమే ఉపయోగించేవారు కాని సంపాదన కోసం కాదు. నృత్య, నాటక, సంగీత గాత్రాల కలబోత ఇది. ఆయాపాత్రల్లో నటులు నటించి నవరసాలు ఒలకబోస్తుంటే ప్రజలు పరవశంగా స్పందించేవారు. యక్షగానాలు కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన ఒక ప్రక్రియ. నాటకాలు అయినా యక్షగానాలు అయినా దైవ ప్రార్థనతో మొదలుపెట్టేవారు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson జానపద కళలు

ప్రశ్న 3.
గొల్ల సుద్దుల గురించి రాయండి.
జవాబు.
గొల్లలు చెప్పే సుద్దులు గొల్ల సుద్దులు. సుద్దులు అంటే మాటలు. ఇందులో ప్రధాన కథకుడు కాక అటూ ఇటూ ఇద్దరు ఉంటారు. కథకుడు పాడే పాటను అతనికి ఇరువైపులా ఉన్న ఇద్దరు చెవిని చేత్తో కప్పి సాగదీసి వంత పాడతారు. ఈ ప్రదర్శనలో వీరణాలు అనబడే పెద్ద డోలు కొమ్ములను ఉపయోగిస్తారు. గొల్లసుద్దుల ప్రదర్శనలో కథకుడు జనం మధ్య నుండి వేదిక మీదికి వస్తాడు. మిగిలిన ఇద్దరు చెరొక మూల నుండి గొర్రెలను అదిలిస్తున్నట్లు వేదిక పైకి వస్తారు.

వీరి వేషధారణ మోకాళ్ళదాక మడిచిన పెద్ద అంచు ఉన్న పంచె, నెత్తికి రుమాలు, చెవులకు దిద్దులు, ముంజేతికి కడియాలు, వెండి బిళ్లల మొలతాడు, భుజం మీద గొంగళి, కాళ్ళకు గజ్జెలు, చేతి కర్రతో గమ్మత్తుగా ఉంటారు. రకరకాల యాసభాషలతో మొదటి నుండి చివరి వరకు నవ్వుల జల్లుల వలె ఉంటుంది. కథని ఇష్టం వచ్చినట్లు మలుచుకుంటూ పోతారు. పాడే పాటల్లో సమాజంపై చెడును తొలగించే ప్రయత్నం కనబడుతుంది.

ప్రశ్న 4.
పగటి వేషగాడిని గురించి రాయండి.
జవాబు.
జానపద కళాకారులలో పగటి వేషగాళ్ళకు ప్రాధాన్యత ఉంది. వీళ్ళ వేషం, భాష నవ్వు పుట్టించే విధంగా ఉంటాయి. ఇతని మాటలు వింటే పగలపడి నవ్వుతారు. ఇతని మాటలు సరిగ్గా తుపాకి రాముడికి సరిపోతాయి. చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతూ పైకి ఎన్నో డాంబికాలు చెపుతున్నప్పటికి తన వెనుకనున్న లేమిని గుర్తించండని అందరిని నవ్విస్తూ ఇంటింటికి తిరిగి యాచిస్తుంటారు. ఇది పగటి వేషాల్లో ఒక రకమని చెప్పవచ్చు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson జానపద కళలు

1. అవగాహన – ప్రతిస్పందన:

ప్రక్క చిత్రాన్ని గురించి ఐదు వాక్యాలు రాయండి.

TS 8th Class Telugu Guide Upavachakam 5th Lesson జానపద కళలు 1

జవాబు.
1. ప్రక్క చిత్రంలో ఉన్నది తుపాకి రాముడు (పిట్టల దొర).
2. పగలబడి నవ్వే మాటలు, వేషధారణ.
3. పైకి మడిచిన కాకి ప్యాంటు, చినిగిన చొక్కా, ఇంగ్లీషు దొరల టోపి, కాళ్ళకు బూట్లు.
4. మాటకు నేను నవాబును, పూటకు లేని గరీబుని అనేది అతనికి సరిపోయే వాక్యం.
5. కట్టె తుపాకి, గొప్ప గొప్ప మాటలతో పిల్లలందరిని నవ్విస్తాడు.

ఆ) కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

జానపదులు అనగా పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళలను జానపద కళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, సిందు భాగోతాలు, చిడుతల రామాయణం, కోలాటం, భజన, తుపాకిరాముడు, పిట్టలదొర మొదలగునవి జానపద కళలకు ఉదాహరణలు. భాగవతం, రామాయణం, భారతం, గ్రామదేవత కథలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు, వీరుల కథలు లాంటివి ఏండ్లకేండ్లుగా ఈ జానపద కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చినాయి. పల్లె ప్రజలు నిరక్షరాస్యులు. అట్లాంటి కాలంలో వాళ్లకు వినోదంతో పాటు నీతిసూత్రాల ఆలోచనను కలిగించేందుకు జానపద కళలు ఉపయోగపడేవి. వీటిలో యక్షగానాలు, గొల్లసుద్దులు, తుపాకి రాముడు గురించి తెలుసుకుందాం.

ప్రశ్న 1.
జానపదులు అంటే ఏమిటి ?
జవాబు.
పల్లె ప్రజల కళలను జానపద కళలు అంటారు.

ప్రశ్న 2.
మీకు తెలిసిన జానపద కళల పేర్లు రాయండి.
జవాబు.
యక్షగానం, కోలాటం, ఒగ్గుకథ, పిట్టలదొర.

ప్రశ్న 3.
జానపద కళల్లో ఇతివృత్తాలు ఏమిటి ?
జవాబు.
భాగవతం, రామాయణం, భారతం, గ్రామ దేవతల కథలు, వీరుల కథలు.

ప్రశ్న 4.
జానపద కళలకు ఎట్లా ప్రచారం జరిగేది ?
జవాబు.
ఒకరినుండి ఒకరికి మౌఖికంగా ప్రచారం జరిగేది.

ప్రశ్న 5.
అంతరించిపోయిన జానపద కళలలో రెండింటి పేర్లు వ్రాయండి.
జవాబు.
పరస, రుంజ, తుపాకి రాముడు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson జానపద కళలు

ఇ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

” కొన్నిచోట్ల యక్షగానాలను భాగోతాలని, నాటకాలని కూడా అంటారు. పాటలు, పద్యాలు, దరువు, ఆదితాళం మొదలగు ప్రక్రియలతో ఇది సాగుతుంది. ఎక్కువగా వీటిని రాత్రిపూట ప్రదర్శించేవారు. గ్రామంలోని కొందరు యువకులు ‘మ్యాల్లం’ గట్టి యక్షగానాన్ని నేర్చుకుని ప్రదర్శించేవారు. ప్రజాకళలు ఎప్పుడూ ప్రజల వినోదానికి మాత్రమే ఉపయోగించేవారు కాని సంపాదన కోసం కాదు. నృత్య, నాటక సంగీత గాత్రాల కలబోత ఇది. ఆయా పాత్రల్లో నటులు నటించి నవరసాలు ఒలకబోస్తుంటే ప్రజలు పరవశంగా స్పందించేవారు. యక్షగానాలు కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన ఒక ప్రక్రియ.

ప్రశ్న 1.
యక్షగానాలకు ఉన్న మారుపేర్లు ఏవి ?
జవాబు.
భాగోతాలు, నాటకాలు

ప్రశ్న 2.
ఇవి ఏ ప్రక్రియలతో సాగుతాయి ?
జవాబు.
పాటలు, పద్యాలు, దరువు, ఆదితాళం మొ॥

ప్రశ్న 3.
‘మ్యాల్లం’ అనగా ఏమి ?
జవాబు.
మేళం

ప్రశ్న 4.
యక్షగానం వేటి కలబోత ?
జవాబు.
నృత్యనాటక సంగీత గాత్రాలు

ప్రశ్న 5.
ప్రజాకళలు ఎప్పుడూ దేనికై ఉపయోగించారు ?
జవాబు.
ప్రజల వినోదానికై

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson జానపద కళలు

ఈ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

గొల్ల సుద్దులంటే గొల్లలు చెప్పే సుద్దులు. సుద్దులు అంటే సంగతులు లేదా మంచిమాటలు. ఈ ప్రదర్శనలో వీరణాలు (పెద్దడోళ్ళు), కొమ్ములను ఉపయోగిస్తారు. గొల్లసుద్దులు రూపకం రానురాను ఎన్నో మార్పులకు గురయింది. ఇప్పుడు ఈ ప్రదర్శనకు డప్పు, డోలక్ను వాయిద్యాలుగా ఉపయోగిస్తున్నారు. పాడేటి పాటల్లో సమాజంలోని చెడును తొలగించే ప్రయత్నం కనబడుతుంది. ఈ కళారూపాలు వినోదాన్నందించటమే కాకుండా విజ్ఞానదాయకంగా కూడా ఉంటాయి.

ప్రశ్న 1.
‘సుద్దులు’ అర్థం ఏమిటి ?
జవాబు.
సంగతులు లేదా మంచి మాటలు

ప్రశ్న 2.
ప్రస్తుతం ఈ ప్రదర్శనకు వాయిద్యాలు ఏవి ?
జవాబు.
డప్పు, డోలక్

ప్రశ్న 3.
‘వీరణాలు’ అంటే ఏమిటి ?
జవాబు.
పెద్దడోళ్ళు

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson జానపద కళలు

ప్రశ్న 4.
వీరి పాటల్లోని ప్రయత్నం ఏమిటి ?
జవాబు.
సమాజంలోని చెడును తొలగించడం

ప్రశ్న 5.
ఇవి వినోదంతో పాటు దేన్ని అందిస్తున్నాయి?
జవాబు.
విజ్ఞానాన్ని

Leave a Comment