TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

These TS 8th Class Telugu Bits with Answers 3rd Lesson బండారి బసవన్న will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

చదువండి ఆలోచించి చెప్పండి.

గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా. ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామభక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
కంచర్ల గోపన్న ఎవరు ?
జవాబు.
కంచర్ల గోపన్న గోలకొండ పాలకుడైన అబుల్ హసన్ తానాషా పాలనాకాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉండేవాడు. గోపన్న గొప్ప శ్రీరామభక్తుడు.

ప్రశ్న 2.
అతనిపై మోపిన అభియోగమేమిటి ?
జవాబు.
ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడని అతనిపై అభియోగం మోపబడింది.

ప్రశ్న 3.
గోపన్న ఎట్లా బంధ విముక్తుడయ్యాడు ?
జవాబు.
గోపన్న తన కీర్తనలతో శ్రీరాముని వేడుకున్నాడు. కరుణించిన శ్రీరాముడు గోపన్న ఇవ్వవలసిన సొమ్ము తానే చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.

ప్రశ్న 4.
గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా ?
జవాబు.
గోపన్న వంటి భక్తులకు మనదేశం పెట్టింది పేరు. అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని మీద భక్తితో సుమారు ముప్పై మూడువేల సంకీర్తనలు రాశాడు. దైవాన్ని తప్ప మానవులను స్తుతించను, వారిపై కీర్తనలు రాయను అన్నందుకు ఘోరశిక్షలను అనుభవించాడు. క్షేత్రయ్య మొవ్వ వేణుగోపాలస్వామి భక్తుడు. మధురభక్తితో పదాలు రచించి ఆ దేవుని కీర్తించాడు. తరిగొండ వెంగమాంబ, అక్క మహాదేవి రచయిత్రులు కూడ భగవంతునిపై కీర్తనలు, వచనాలు రాశారు.

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

పాఠం ఉద్దేశం:

ప్రశ్న.
బండారి బసవన్న పాఠం ఉద్దేశం తెల్పండి.
జవాబు.
బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి “నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి. లేకపోతే మీ సపర్యలు స్వీకరించను” అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉ న్న మాడలను (బంగారు నాణేలు) జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు.
బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్వం తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ప్రశ్న.
ద్విపద ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
ఈ పాఠం ద్విపద. ఇది దేశికవితా ప్రక్రియ. ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని “ద్విపద కావ్యం” అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన ‘బసవపురాణం’ తృతీయాశ్వాసంలోనిది.

కవి పరిచయం:

ప్రశ్న.
పాల్కురికి సోమనాథకవి పరిచయం రాయండి.
జవాబు.
(పరీక్షలో గీతగీసిన వాక్యాలు రాసే సరిపోతుంది)
దేశి సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి
ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవకవి. ఓరుగల్లు సమీపాన గల పాలకుర్తి (పాలకురికి) పాల్కురికి సోమన జన్మస్థలం.

బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిపశతకము, చతుర్వేదసారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలయినవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలయిన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీభాషా పదాలను యధేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో ‘మణి ప్రవాళ శైలి’ని వాడిన తొలికవి.

ప్రవేశిక:

ప్రశ్న.
బండారి బసవన్న పాఠ్యభాగం సందర్భం తెల్పండి.
జవాబు.
సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్చీలుడుగనే నిలబెడతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసేవారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

కఠినపదాలకు అర్థాలు:

దండ నాయకుడు = సేనాధిపతి
ప్రధానితనము = మంత్రిత్వము
దండించు = శిక్షించ
అపహరించు = దొంగిలించు, కాజేయు
అర్థం = ధనం
కై = కయి = చేయి
గైకొను = తీసుకొను
కించిత్ = కొంచెం
ఆస్యము = ముఖము
ప్రహసితం = నవ్వు
జననాథుడు = రాజు
సురతరువు = దేవతావృక్షం, కల్పవృక్షం
కామారి = కామ + అరి = మన్మథుని శత్రువైన శివుడు
సోముడు = చంద్రుడు
పుల్లు = గడ్డి
మృగపతి = మృగరాజు = సింహం
పడియ = నీటి మడుగు
చూతం = మామిడి
తమ్మి = తామర
తేటి = తుమ్మెద
మ్రాను = చెట్టు
వరవుడము = దాస్యము
ఒడయల ధనము = దేవరల సొమ్ము
పాది తఱిగిన = కుదురు తప్పిన, స్థిరత్వం లేని
దట్టుడు = సమర్థుడు
మాడలు = బంగారు నాణేలు
అగ్గలము = అధికము
కొదమ = పిల్ల
చకోరము = వెన్నెల పక్షి

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

పద్యాలు-ప్రతిపదార్థాలు – భావాలు:

బండారి బసవన్న దండనాయకుని
రప్పించి “మాయర్ల మొప్పించి పొమ్ము
దప్పేమి ? సాలుఁ బ్రధాని తనంబు
‘దండింప రా’దను తలఁపున నిట్లు
బండార మంతయుఁ బాడు సేసితివి
పరధనం బపహరింపని బాస యండ్రు
పరధనం బెట్లొకో బసవ ! కైకొంటి
వేయు మాటలునేల వెఱతుము నీకు
మాయర్థ మొప్పించి నీయంత నుండు”
మనవుడుఁ గించి త్ప్రహసితాస్యుఁడగుచు
జననాథునకు బసవన మంత్రి యనియె
“బరమేశు భక్తియన్ సురతరువుండ
హరుభక్తియన్ కనకాచలంబుండ
గామారి భక్తి చింతామణి యుండ
సోమార్ధ ధరు భక్తి సురధేనువుండ
బగుతుఁడాసించునే పరధనంబునకు
మృగపతి యెద్దెస మేయునే పుల్లు ?

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

అర్థాలు:

బండారి బసవన్న = బండారి బసవన్న అనే పేరుగల
దండనాయకుని = సేనాపతిని
రప్పించి = పిలిపించి
మా + అర్థము = మా సొమ్మును
ఒప్పించి = అప్పగించి
పొమ్ము = వెళ్ళుము
తప్పు + ఏమి = అలా చేయడంలో తప్పులేదు.
ప్రధానితనంబు = మీ మంత్రిత్వము
చాలున్ = ఇకపై మాకు అక్కరలేదు.
దండింపరాదు = నన్నెవరూ శిక్షించరులే
అనుతలపునన్ = అనే ఆలోచనతో
బండారము + అంతయును = ధనాగారమంతా
పాడు + చేసితివి = నాశనం చేశావు
పరధనంబు = ఇతరుల సొమ్మును
అపహరింపని = కాజేయను అని
బాస + అండ్రు = ఒట్టు వేసుకున్నావు అంటారు.
బసవ = ఓ బసవన్నా !
పరధనంబు = ఇతరుల సొమ్మును
ఎట్లు = ఎలా
కైకొంటివి + ఒకొ = తీసుకున్నావయ్యా ?
వేయు మాటలున్+ఏల = ఇన్ని ఎక్కువ మాటలు ఎందుకు?
నీకు వెఱతుము = నిన్ను చూసి భయపడతాము
మా + అర్థము + ఒప్పించి = మా ధనం అప్పగించి
నీ + అంతన్ + ఉండుము = నీ దారిన నువ్వుండు
అనవుడు = అని రాజు బిజ్జలుడు పలుకగా
కించిత్ = కొంచెముగా
ప్రహసిత + ఆస్యుడు + అగుచు = నవ్వుతో నిండిన ముఖము కలవాడై
బసవన మంత్రి = మంత్రియైన బసవడు
జననాథునకు = రాజుతో
అని = ఇలా అన్నాడు.
పరమ + ఈశు = పరమేశ్వరుని యందు
భక్తి + అన్ = భక్తి కలిగి ఉండుట అనే
సురతరువు + ఉండ = కల్పతరువు ఉండగా
హరు భక్తి + అన్ = ఈశ్వరునియందు భక్తి అనే
కనక + అచలంబు + ఉండ = మేరు పర్వతం ఉండగా
కామ + అరిభక్తి = మన్మథుని శత్రువైన శివుడు అనే
చింతామణి + ఉండ = చింతామణి ఉండగా
సోమ + అర్థధరు భక్తి = చంద్రవంకను తలపై ధరించిన శివుని యందు భక్తి అనే
సురధేనువు + ఉండ = కామధేనువు ఉండగా
పగతుడు = శత్రువైనా సరే
పరధనంబునకు = ఇతరుల సొమ్ము కోసం
ఆసించునే = ఆశపడతాడా ?
మృగపతి = జంతువులకు రాజైన సింహం
పుల్లు = గడ్డి
మేయునే = తింటుందా ?

భావం:
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. “మా ధనాన్ని అప్పగించి పోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా ! మరి ఎట్లా దొంగిలించావు? ఎక్కువ మాటలు ఎందుకు గానీ నిన్ను ఏమయిన అనడానికి నాకు భయం కలుగుతున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు” అన్నాడు.

అప్పుడు మంత్రి బసవన చిరునవ్వుతో “పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం (మేరు పర్వతం) నా ఆధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా ? సింహం ఎక్కడైన గడ్డి మేస్తుందా ?

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

II. క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగం ?
జూత ఫలంబులు సుంబించు చిలుక
బ్రాతి బూరుగు మ్రాని పండ్లు గగ్గోనునె ?
రాకామల జ్యోత్స్నఁ ద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటిఁ ద్రావ
విరిదమ్మి వాసన విహరించుతేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరుల ?
నెఱుఁగునే యల దిగ్గజేంద్రంబు కొదమ
యెఱపంది చను సీక ? నెఱుఁగవు గాక
యరుదగు లింగ సదర్థుల యిండ్ల
వరవుడ నా కొక సరకెయర్థంబు
పుడమీశ ! మీ ధనంబునకుఁ జేసాఁప
నొడయల కిచ్చితి నొడయలధనము
పాదిగదఱిఁగిన భక్తుండఁగాను
గాదేని ముడుపు లెక్కలు సూడు” మనుచు
దట్టుఁడు బసవన దండనాయఁకుఁడు
పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ
నచ్చెరువై లెక్క కగ్గలంబున్న

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

అర్థాలు:

క్షీర + అబ్ధి లోపలన్ = పాల సముద్రంలో
క్రీడించు హంస = విహరించే హంస
పడియల = నీటి మడుగులలోని
నీరు + త్రావంగన్ = నీళ్ళు తాగడానికి
కోరును + ఏ = ఇష్టపడుతుందా ?
చూతఫలంబులు = మామిడిపళ్ళను
చుంబించు = ముద్దాడే (తినేటువంటి)
చిలుక = రామచిలుక
బ్రాతి = ఏ విధంగానైనా
బూరుగుమ్రాని = బూరుగు చెట్టు యొక్క
పండ్లు = పళ్ళు
కన్ + కొనును + ఎ = చూస్తుందా ?
రాకా + అమంజ్యోత్స్నన్ = పున్నమినాటి స్వచ్ఛమైన వెన్నెలను
త్రావు = తాగుతుండే
చకోరము = వెన్నెల పక్షి
చీకటిన్ = చీకటిని
త్రావన్ = తాగడానికి
ఆకాంక్ష +చేయును + ఏ = కోరుతుందా ?
విరి + తమ్మివాసన = విరిసిన కమలం యొక్క సువాసనలో
విహరించు తేటి = తిరుగాడే తుమ్మెద
పరిగొని = పక్కకు తిరిగి
బబ్బిలి విరులన్ = ప్రబ్బలి పూలను
సుడియును + ఏ = చుట్టుకుంటూ తిరుగుతుందా?
అల దిక్ + గజ + ఇంద్రంబు = ఆ దిగ్గజము యొక్క
కొదమ = పిల్ల
ఎఱపందిచను + చీక = పంది దగ్గర పాలు తాగడానికి
ఎఱుగును + ఏ = ఇష్టపడుతుందా ?
పుడమి + ఈశ = ఓ రాజా!
ఎఱుగవు + కాక = నీకు తెలియదేమో !
అరుదు + అగు = విశిష్ఠులైన
లింగ = లింగధారులైన
సదర్థుల + ఇండ్ల = గొప్ప జంగమదేవరల ఇళ్ళలో
వరవుడ = దాసుడను
అర్థము = ధనము
నాకున్ + ఒక సరకు + ఎ = లెక్కలోనిదా ?
మీ ధనంబునకు = మీ డబ్బు కోసం
చేయి + చాపను = అడగను
ఒడయల ధనము = దేవరల సొమ్ము
ఒడయలకున్ + ఇచ్చితిన్ = దేవరలకే ఇచ్చాను
పాదిగ తఱిగిన = స్థిరత్వం తప్పిన
భక్తుండన్ + కాను = భక్తుణ్ణి కాను
కాదు + ఏని = కాదనుకుంటే (నీవు నమ్మకుంటే)
ముడుపులెక్కలు = దాచిన ధనం లెక్కలు
చూడుము + అనుచు = చూసుకో అంటూ
దట్టుడు = సమర్థుడైన
బసవన దండనాయకుడు = బసవన్న సేనాపతి
పెట్టెలు = డబ్బుదాచిన పెట్టెలు
ముందటన్ + పెట్టి = రాజు ముందుంచి
తాళములు పుచ్చుడు = తాళములు తెరవగానే
చూడన్ + అచ్చెరువు + ఐ = చూడడానికి ఆశ్చర్యం కలిగిస్తూ
మాడలు = బంగారు నాణేలు
ఉప్పొంగుచున్ = పెట్టెలలో నుండి పొంగి పోతున్నట్లుగా
లెక్కకు + అగ్గలంబు + ఉన్న = ముందున్న లెక్క కంటె చాలా ఎక్కువగా ఉండేసరికి

భావం :
పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా ? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి ఐనా చూస్తుందా ? నిండు పున్నమి నాటి వెన్నెలను కోరు చకోరపక్షి చీకటిని ఆస్వాదిస్తుందా ? తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూలకోసం పరుగులు తీస్తుందా ? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా ? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి ? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు ? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను.

ఇతరుల ధనంతో నాకేం పని ? మీ ధనం కోసం నేను చేయి చాపను. నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్కచూసుకో” అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముంగటే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండ మాడలు (బంగారు నాణేలు) తళతళలాడుతున్నాయి. లెక్కపెట్టి చూడగా ఉండవలసిన వాటికన్న ఎక్కువనే ఉన్నాయి.

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

ఆలోచించండి – చెప్పండి:

ప్రశ్న 1.
‘సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి ? (టెక్స్ట్ బుక్ 24)
జవాబు.
సురతరువు పాలసముద్రం నుండి పుట్టి దేవలోకంలో ఉన్న గొప్ప వృక్షము. కనకాచలం దేవలోకంలో ఉన్న బంగారపుకొండ. పార్వతీదేవి నివాసం చాలా ఎత్తైనది. సురధేనువు పాలసముద్రం నుండి పుట్టి బ్రహ్మర్షి వసిష్ఠుని ఆశ్రమంలో పూజలందుకుంటున్న కామధేనువు. చింతామణి పాలసముద్రం నుంచి పుట్టింది. కోరిన కోరికలు తీర్చే రత్నం. ఇలా ఇవన్నీ చాలా గొప్పవి. వాటిని తుచ్ఛమైన వాటితో పోల్చరాదు. అలాగే శివభక్తులు చాలా గొప్పవారు. ఆ భక్తిలో మునిగినవారు అల్పమైన కోరికలకు లొంగరు అని చెప్పటం కవి ఉద్దేశం.

ప్రశ్న 2.
‘బగుతుడాసించునే పరధనమునకు’ దీనిపై మీ అభిప్రాయమేమిటి ? (టెక్బాక్ 24)
జవాబు. పగతుడు అంటే శత్రువు. శత్రువు మనపైన దాడిచేయటానికి కారణం రాజ్యం మీదనో, భూమి మీదనో, ధనం మీదనో ఆశ కలిగి ఉండటం. అటువంటి శత్రువు కూడా శివభక్తి కలిగి ఉన్నప్పుడు ఇతరుల ధనాన్ని కోరడు. అటువంటిది శివభక్తి వ్రతంగా బ్రతికే బసవన్న రాజు ధనాన్ని కోరడు అని కవి బసవని భక్తిని గురించి వర్ణించాడు అని నా అభిప్రాయం.

ప్రశ్న 3.
‘శివ భక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు ? (టెక్బాక్ 25)
జవాబు.
హంస శ్రేష్ఠమైన పక్షి. మానస సరోవరంలో విహరిస్తుంది. చిలుక పలుకు నేర్చి రామనామం జపించే ఉత్తమమైన పక్షి. అల్పమైన పండ్లను కోరదు. మామిడిపండ్లు మాత్రమే తింటుంది. చకోరం వెన్నెలపక్షి. చంద్ర కిరణాలతో అమృతాన్ని ఆస్వాదిస్తుందే తప్ప మంచుతుంపర్లు పీల్చదు. తుమ్మెద… పూలలో రాణియైన తామర పువ్వులోని సుగంధాన్ని పీలుస్తూ తిరుగుతుంది. ప్రబ్బలి పూల జోలికి పోదు. శివభక్తులు కూడ అల్పులను ఆశ్రయించరు. వారు గొప్పవారు అని చెప్పడానికే కవి అలా పోల్చాడు.

ప్రశ్న 4.
“ఒడయల కిచ్చితి నొడయల ధనము” అనడంలో అర్థం ఏమై ఉంటుంది ? (టెక్స్ట్ బుక్ 25)
జవాబు.
ఈ సమస్త ప్రపంచము ఈశ్వరుని ప్రసాదమే. మనం నాది నాది అని భ్రమ పడుతున్నాం. మనది అనేది ఏదైనా శివుడిచ్చినదే. జంగం దేవరలు సాక్షాత్తు శివుని అవతారం. కాబట్టి వారికి మనమిచ్చేది ఏదైనా మనసొంతంకాదు. వారి సొమ్మే వారికిస్తున్నాము అని కవి వివరించాడు.

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
“అచంచల భక్తి పారవశ్యం కల్గిన వాళ్ళు ధనాశకు లోనుకారు” దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
ఏనుగు కుంభస్థలాన్ని బద్దలుచేసి తినే సింహం గడ్డిమేయదు. పాలసముద్రంలో హాయిగా విహరించే హంస నీటిమడుగులలో నీరు తాగదు. దోరమామిడిపళ్ళ రుచి మరిగిన చిలుక బూరుగు చెట్టుపైన కాసే దూదికాయలను తినదు. స్వచ్ఛమైన పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోర పక్షి చీకట్లను ఆరగించదు. విరిసిన పద్మాలలో సుగంధాన్ని పీల్చి ఆనందించే తుమ్మెద బబ్బిలి పూలవాసన కోరదు. దేవతల ఏనుగు యొక్క సంతానము పందిపాలను తాగటానికి ఇష్టపడదు. అలాగే అచంచల భక్తి పారవశ్యం కల్గినవాళ్ళు ధనాశకు లోనుకారు.

ప్రశ్న 2.
ద్విపదను రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:

1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.

అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.
జవాబు.
“మా యర్థ మొప్పించి పొమ్ము.”
ఈ పాదం రాజు బిజ్జలుడు దండనాయకుడైన బసవన్నతో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది ?
జవాబు.
“విరిదమ్మి వాసన విహరించు తేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరుల”
ఈ పాదములు దండనాయకుడైన బసవన్న రాజైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

ఇ) సింహం ఎక్కడైనా గడ్డిమేస్తుందా ?
ప్రశ్న : ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు అన్నారు ? ఎవరితో అన్నారు ? (లేదా)
“మృగపతి యెద్దెస మేయునే పుల్లు” ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు ఎవరితో అన్నారు ?
జవాబు.
ఈ పాదం మంత్రి, దండనాయకుడు ఐన బసవన్న ప్రభువైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

2. కింది పద్యం చదవండి. ఖాళీలను పూరించండి.

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ !

అ) ఖరము అంటే _____________.
జవాబు.
గాడిద

ఆ) కూడు అంటే _____________.
జవాబు.
అన్నం

ఇ) గంగి గోవు పాలను _____________ తో పోల్చాడు.
జవాబు.
భక్తి కలుగు కూడు

ఈ) ఈ పద్యాన్న _____________ రాశాడు.
జవాబు.
వేమన

ఉ) ఈ పద్యం _____________ శతకంలోనిది.
జవాబు.
వేమన

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బండారి బసవన్న స్వభావాన్ని రాయండి.
జవాబు.
బండారి బసవన్న గురించి పాల్కురికి సోమనాథుడు గొప్పగా రాశాడు. బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. జంగమ దేవరలను సాక్షాత్తు పరమశివునిగా భావించి పూజిస్తాడు. ఈ జగమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు. అందుకే ఈశ్వరుడు మనకిచ్చినదానిని శివభక్తులకు సమర్పించటంలో తప్పులేదంటాడు. పరులధనానికి ఎప్పుడూ ఆశించడు. సత్యధర్మవ్రతుడు కనుక రాజుముందైనా సరే నిర్భయంగా మాట్లాడగలడు. ఎంతటి రాజోద్యోగులైనా అతడిని తప్పు పట్టాలంటే భయపడతారు. బసవన్న తన ఉద్యోగ విధులను, గృహధర్మాలను, శివారాధనను క్రమం తప్పకుండా సమర్థవంతంగా నిర్వహించేవాడు.

ఆ) బండారి బవసన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా ! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు?
జవాబు.
బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు. ఎందుకంటే అతడు తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించాడు. అన్నింటిని మించి గొప్ప శివభక్తుడు.

అలాగే మనం మనసులో కల్మషం లేకుండా ఉండాలి. సత్యం మాట్లాడాలి. ధర్మాన్ని ఆచరించాలి. ఏ తప్పు చేయకూడదు. ఎవరికీ కీడు చెయ్యాలని ప్రయత్నించకూడదు. అలా మంచి ప్రవర్తన కలవారిలో ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం నిర్భయంగా మాట్లాడగలం.

ఇ) భక్తుడు పరధనాన్ని ఆశించడు. ఎందుకు ? (లేదా)
బండారి బసవన్న పాఠంలో భక్తుడిని వేటితో పోల్చారు ? పరధనాన్ని వేటితో పోల్చారు ?
జవాబు.
భక్తుడు ఎప్పుడూ పరధనాన్ని ఆశించడు. ఎందుకంటే పరుల సొమ్ము పామువంటిది. నీచమైనది. కష్టపడి సంపాదించుకున్నదే మన సొంతం అని భక్తుడు నమ్ముతాడు. శివభక్తుడు మానవులలో ఉత్తమమైనవాడు. ఆ భక్తి అతనికి కల్పతరువు, కామధేనువు, మేరుపర్వతం, చింతామణి వంటిది. ఇవి ఉన్నవాడికి ఏది కోరితే అది లభిస్తుంది. అలాగే శివభక్తి కలవాడు పరధనాన్ని కోరడమంటే సింహం గడ్డి మేసినట్లు. అందుచేత శివభక్తుడు పరధనాన్ని ఆశించడు.

ఈ) “క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ” అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి? (లేదా)
బండారి బసవన్న పాఠంలో శివభక్తుణ్ణి వేటితో పోల్చారు ?
జవాబు.
సింహం గడ్డిమేయడానికి ఇష్టపడదు. మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తినదు. పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోరపక్షి చీకటిని ఆస్వాదించదు. తామరపూల వాసన పీల్చే తుమ్మెద ఉమ్మెత్త పూల దగ్గరకి పోదు. ఏనుగుపిల్ల పంది దగ్గర పాలు తాగదు. అలాగే పాలసముద్రంలో విహరించే హంస కుంటలలో నీరు తాగదు అని కవి వర్ణించాడు. ఉత్తమమైనవారు ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. అల్పమైన వాటికి ఆశపడరు అని కవి ఉద్దేశం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

బసవని గురించి తెలుసుకున్నారు కదా ! భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో రాయండి. (లేదా)
బండారి బసవన్న పాఠం ఆధారంగా శివభక్తుల గుణగణాలు రాయండి. (లేదా) బసవన్న భక్తితత్పరత గురించి రాయండి.
జవాబు.
పాల్కురికి సోమనాథుడు బండారి బసవన్న ద్వారా భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాడు.

బసవన్న భక్తి : బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలతో పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. అందుకే అతనిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నది. ఎవ్వరితోనైనా నిర్భయంగా మాట్లాడగలిగేవాడు. అందరూ అతడిని గౌరవించేవారు.

భక్తుని లక్షణాలు : బసవని వ్యక్తిత్వం తెలుసుకున్న తరువాత భక్తుని లక్షణాలు ఎలా ఉండాలో మనకు అర్థమౌతుంది. భక్తునికుండవలసిన ప్రధాన లక్షణం స్వచ్ఛమైన మనసు. నిర్మలమైన మనసుతో భగవంతుని ఆరాధిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. భక్తుడైనవాడు దేవుని మాత్రమే గాక ఆయన భక్తులను కూడ దేవునితో సమంగా భావించాలి. వారిని ఆదరించి వారి కోరికలు నెరవేర్చాలి.

భక్తులు కోరినదిచ్చేటప్పుడు మనదేదో వారికి దానం చేస్తున్నామన్న అహంకారం ఉండకూడదు. వారి సొమ్ము వారికిస్తున్నామన్న భావనతో దానం చేయాలి. భక్తుడు ఇతరుల సొమ్మును ఆశించకూడదు. సత్యవ్రతం కలిగి ఉండాలి. ఆడినమాట తప్పకూడదు. ఇలా నడుచుకొనేవాడు నిజమైన భక్తుడు.

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

అదనపు ప్రశ్నలు:

ఆ) బండారి బసవన్న పాఠం సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి. (లేదా) బండారి బసవన్న గొప్ప శివభక్తుడని నిరూపించండి.
జవాబు.
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిచి ధనాగారం నుండి తీసిన ధనం మాకు అప్పగించి మీరిక వెళ్ళవచ్చు. ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనం ఆశించనని ప్రతిజ్ఞ చేశారుకదా! అని అన్నాడు. బసవన్న “శివభక్తి అనే కల్పవృక్షం, శంకరునిపై భక్తి అనే బంగారు (మేరు పర్వతం నా అధీనంలో ఉండగా ఇతరుల ధనాన్ని ఆశిస్తానా” అని అన్నాడు.

హంస మడుగు నీటిని త్రాగనట్లే, మామిడి పండ్లు తినే చిలుక బూరుగ చెట్టు పండ్ల వైపు కన్నెత్తి చూడనట్లే, చకోరపక్షి చీకటిని ఆస్వాదించనట్లే, ఏనుగుపిల్ల పందిపాలు త్రాగదని తెలియదా! శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేంపని? మీ ధనంకోసం నేను చేయిచాపను. నేను న్యాయం తప్పను. మీకు నామీద నమ్మకం లేకపోతే మీ సొమ్ము లెక్కచూసుకోండి అని బసవన్న పలికాడు.

ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి, తాళాలు తీయించి, మూతలు తెరిపించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెలనిండా బంగారు నాణేలు (మాడలు) ఉన్నాయి. తళతళలాడుతున్న ఆ నాణేలను లెక్కించిచూడగా, లెక్కకన్నా ఎక్కువగానే ఉన్నాయి. నిజాయితీపరుడైన బసవన్న ఏ రాజద్రోహం చేయలేదని బిజ్జలుడు గ్రహించాడు. శివుని భక్తివల్ల తీసిన ధనమంతా మరల ధనాగారంలోకే రావటంతో బసవన్న పరమ శివభక్తుడు అని చెప్పవచ్చును.

ఇ) బండారి బసవన్న రాజద్రోహం చేయలేదని ఎలా చెప్పగలవు ? (లేదా) బసవన్న నిజాయితీ ఎటువంటిది ?
జవాబు.
బసవన్న తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించిన గొప్ప భక్తుడు. మనసులో కల్మషం లేకుండా సత్యం పల్కుతూ, ధర్మాన్ని ఆచరిస్తూ, ఆత్మవిశ్వాసంతో ఎవరికీ కీడు చేయకుండా, ఉ న్న విషయం నిర్భయంగా మాట్లాడేవాడు.

ప్రపంచమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు. అందుకే ఈశ్వరుడు మనకిచ్చిన దానిని శివభక్తులకు సమర్పించడంలో తప్పులేదంటాడు బసవన్న. తన ఉద్యోగ విధులను, గృహధర్మాన్ని, శివారాధనను క్రమం తప్పకుండా నిజాయితీగా ఆచరించే బసవన్న రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే బిజ్జలుడు ఆ సొమ్ము ఉన్న పెట్టెలను తెచ్చి తెరిపించగా అందులో మాడలు అందులోనే తళతళలాడుతూ ఉన్నాయి. సొమ్ము అంతా లెక్కకు సరిపోయింది కనుక రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు.

ఈ) మీ పాఠం ఆధారంగా “భక్తి” అంటే మీరేమనుకుంటున్నారో రాయండి. (లేదా)
జవాబు.
బండారు బసవన్న పాఠం ఆధారంగా “భక్తి” భావన గురించి రాయండి.
బండారి బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలు చేయటమే కాకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. ఆత్మవిశ్వాసం, నిర్భయత్వంగల ఇతడిని అందరూ గౌరవించేవారు.
భక్తులకుండాల్సిన లక్షణాలన్నీ బసవన్నలో ఉన్నాయి. స్వచ్ఛమైన మనసు, దైవభక్తులను దైవస్వరూపులుగా భావించుట, వారిని ఆదరించి వారి కోర్కెలు తీర్చుట, అహంకారం లేకుండా మనవద్ద ఉన్న వారి సొమ్ము వారికిస్తున్నామనే భావనతో సంతోషంగా దానం చేయటం, పరుల సొమ్ము ఆశించకుండా సత్యవ్రతం కల్గి, ఆడినమాట తప్పకుండా నడుచుకొనేవాడే నిజమైన భక్తుడు అని బసవన్నను చూస్తే తెలుస్తుంది.

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

IV. సృజనాత్మకత/ ప్రశంస:

ప్రశ్న 1.
ద్విపద రూపంలోనున్న ఈ పాఠ్యాంశ విషయాన్ని సంభాషణ రూపంలో రాయండి.
జవాబు.
బండారి బసవన్న … కోశాగారంలోని సొమ్మును జంగందేవరకు దానం చేశాడని అధికారులు బిజ్జల మహారాజుకు నివేదించారు. రాజు అతనిని దండించాలని సైనికులను పిలుచుకురమ్మని పంపించాడు.

సంభాషణ

రాజు : భటులారా ! బసవన్న దండనాయకుని వెంటనే పిలుచుకురండి.
భటులు : చిత్తం మహాప్రభూ ! (భటులు బసవన్నతో కలిసి ప్రవేశం)
రాజు : దండనాయకా ! నీవు ధనాగారంలోని సొమ్ము దానం చేశావని అభియోగం. దీనికి నీ సమాధానమేమి?
బస : ప్రభూ ! మీ సొమ్ము నేను తాకలేదు. ఇది అబద్ధం.
రాజు : మా అధికారులు కళ్ళతో చూసిన నిజం నాకు చెప్పారు. వెంటనే మా సొమ్ము మాకప్పగించు. నువ్వు పదవి నుండి తప్పుకో.
బస : నేను అపరాధం చెయ్యలేదు.
రాజు : నీ మాటలు భయం కలిగిస్తున్నాయి. మా ధనం మా కప్పగించి వెంటనే వెళ్ళిపో. పరధనానికి ఆశించను అని ప్రతిజ్ఞ చేసి ఇలా మా ధనం కాజేయవచ్చునా ?

బస : (చిరునవ్వుతో) కామధేనువు, కల్పవృక్షము, మేరుపర్వతము, చింతామణి వంటి శక్తివంతమైన ఈశ్వరభక్తి నా దగ్గర ఉండగా నా కంటె ధనవంతుడెవరు ? నీ సొమ్ము నేనాశిస్తానా ? సింహం గడ్డిమేస్తుందా ? పాలసముద్రంలో తిరిగే హంస నీటిగుంటలలో తిరుగుతుందా? మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తింటుందా ? వెన్నెల తాగే చకోర పక్షి చీకటిని కోరుతుందా ? తామరపూల సుగంధాన్ని పీల్చే తుమ్మెద ప్రబ్బలి పూలజోలికి వెళుతుందా ? ఏనుగుపిల్ల పంది పాలు తాగుతుందా ? జంగం దేవరలకు దాసుడను. డబ్బు నాకొకలెక్కా? మీ డబ్బు కోసం నేనెప్పుడూ చెయ్యి జాపను. ఆడిన మాట తప్పేవాడిని కాను. ఈశ్వర ప్రసాదితమైన సొమ్ము ఈశ్వరభక్తునికే ఇచ్చాను. నమ్మకపోతే లెక్కలు చూసుకో.

రాజు : ఖజానాలో ధనం పెట్టెలు తీసుకురండి. (భటులు తెస్తారు) తెరవండి. (తెరిచారు) ఏమి ఆశ్చర్యం ! ఉండవలసిన సొమ్ము కంటె ఎంతో ఎక్కువ సొమ్మున్నది ! మమ్మల్ని మన్నించు బసవన్నా ! నీ భక్తి తెలుసుకున్నాము.

V. పదజాల వినియోగం:

గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి.

అ) క్షీరాబ్ధిని మథించినప్పుడు అమృతం పుట్టింది.
క్షీరాబ్ధి = పాలసముద్రం

ఆ) కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు.
మృగపతి = జంతువులకు రాజు సింహ

ఇ) పుడమీశులు ప్రజలను చక్కగా పరిపాలించారు.
పుడమీశులు = రాజులు

2. కింది ప్రకృతి వికృతులను జతపరచండి.

అ) ఆశ్చర్యం  ఎ) బత్తి
ఆ) భక్తి  బి) దెస
ఇ) దిశ  సి) పుడమి
ఈ) పృథ్వి  డి) అచ్చెరువు

జవాబు.
అ) డి
ఆ) ఎ
ఇ) బి
ఈ) సి

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పట్టికను పూరించండి.

సంధిపదం విడదీసి రాయండి సంధి పేరు
ఉదా : క్షీరాబ్ధి క్షీర + అబ్ది సవర్ణదీర్ఘసంధి
1. కనకాచలం కనక + అచలం సవర్ణదీర్ఘ సంధి
2. నాకొక నాకు + ఒక ఉత్వసంధి
3. కాదేని కాదు + ఏని ఉత్వసంధి
4. అతనికిచ్చెను అతనికి + ఇచ్చెను ఇత్వసంధి
5. పుట్టినిల్లు పుట్టిన + ఇల్లు అత్వసంధి
6. ఏమిటిది ఏమిటి + ఇది ఇత్వసంధి
7. నాయనమ్మ నాయన + అమ్మ అత్వసంధి
8. పుడమీశ పుడమి + ఈశ ఇత్వ సంధి

2. కింది పదాలను విడదీయండి.

ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)

ఉదా : పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఆ) సర్వేశ్వరుడు = సర్వ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)

ఉదా : వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
ఇ) గంగోదకం = గంగా + ఉదకం (ఆ + ఉ = ఓ)

ఉదా : దేవర్షి = దేవ + ఋషి (అ + ఋ = అర్)
ఈ) మహర్షి = మహా + ఋషి (అ + ఋ = అర్)

పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.
‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’ TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న 1
‘అ’ కారానికి ‘ఉ’ – పరమైనప్పుడు ‘ఓ’ TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న 2
అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’
‘అ’ కారానికి ‘ఋ’ పరమైనప్పుడు ‘అర్’
ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.
‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.
‘అ’ కారానికి, ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అట్లు ఆదేశంగా వస్తాయి.

3. కింది పదాలను కలిపి, సంధి ఏర్పడిన విధానాన్ని తెలపండి.

ఉదా : మహా + ఇంద్రుడు = మహేంద్రుడు – అ + ఇ = ఏ TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న 1
అ) దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు – అ + ఇ = ఏ TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న 1
ఆ) గణ + ఈశుడు = గణేశుడు – అ + ఈ = ఏ TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న 1
ఇ) నర + ఉత్తముడు = నరోత్తముడు – అ + ఉ = ఓ TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న 1
ఈ) నవ + ఉదయం = నవోదయం – అ + ఉ = ఓ TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న 1
ఉ) బ్రహ్మర్షి = బ్రహ్మ + ఋషి – అ + ఋ = అర్

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ఈ బసవని వంటి పరమ భక్తులలో ఒకరి కథను సేకరించి, మీ సొంతమాటల్లో రాసి దాన్ని తరగతిలో చెప్పండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు : “మహా శివభక్తుడు – చిఱుతొండ నంబి”
  2. సమాచారాన్ని సేకరించిన విధానం : గ్రంథాలయ పుస్తకం ద్వారా

ఆ) నివేదిక :
విషయ వివరణ :

చిఱుతొండ నంబి మహా శివభక్తుడు. అతని భార్య తిరువెంగనాచి కూడా మహా శివభక్తురాలు. వారికి లేక లేక కలిగిన ముద్దుల సంతానమే సిరియాళుడు. ఈ దంపతులిరువురు ప్రతిరోజు స్నానం – పూజ ముగించుకొన్న పిమ్మట, మడితో వంట వండి, ఒకరిద్దరు అతిథులకు భోజనం పెట్టిన పిమ్మట తాము భుజించే సాంప్రదాయం గలవారు. వీరి కుమారుడు సిరియాళుడు కూడా తల్లిదండ్రుల మాట జవదాటని వాడై, మహా శివభక్తి గలవాడై, దిన దిన ప్రవర్ధమానంగా అనేక విద్యలనభ్యసిస్తూ పెరుగుతున్నాడు. ఈ దంపతులిద్దర్నీ పరీక్షించాలనే ఉద్దేశంతో శివుడు, పార్వతి ఇద్దరూ వృద్ధ దంపతుల రూపంలో చిఱుతొండ నంబి ఇంటికి వచ్చారు.

వారి రాకకు ఎంతో ఆనందించిన చిఱుతొండ నంబి దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణులను సాదరంగా ఆహ్వానించి, వారికి శాకాహార భోజనం వండి, తినడానికి పిలిచారు. అప్పుడు ఆ కపట బ్రాహ్మణుడు మాకు నరమాంసం లేనిదే గొంతులోకి ముద్ద దిగదని చెప్పగా విని చిఱుతొండ నంబి దంపతుల గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది. మనిషి మాంసం ఎలా తేగలమని బెంగతో వారు చింతాక్రాంతులై ఉండగా తనను చంపి వండమని వారి పుత్రుడు సిరియాళుడు కోరాడు. ఎంతో దుఃఖభరితమైన మనసుతో వారు తమ పుత్రుణ్ణి చంపి వండడానికి సిద్ధపడ్డారు.

అప్పుడు శివుడు, సిరియాళుని వద్దకు వెళ్ళి నీ తల్లిదండ్రులు నిన్ను చంపి వండుతారు, ఇల్లు వదలి పారిపొమ్మనగా సిరియాళుడు తిరస్కరించి, శివపూజకు నా దేహం అర్పించుటకంటే భాగ్యమేమున్నదని పలికాడు. చివరకు అతణ్ణి చంపి వృద్ధ బ్రాహ్మణులకు వండి పెట్టారు. నీ కుమారుడు సిరియాళుడు లేనిదే నేను భుజింపనని శివుడనగా, చిఱుతొండ నంబి దుఃఖించుచుండగా ‘చిఱుతొండా ! ఒక్కసారి సిరియాళా అని పిలువు’ అని శివుడు అనగానే చిఱుతొండడు ‘సిరియాళా’ అని పిలువగానే శివ వర ప్రభావంతో సిరియాళుడు బ్రతికి వచ్చాడు.

ఇ) ముగింపు :
శివుని పూజకోసం, అతిథి దేవుళ్లను సంతృప్తి పరచడం కోసం కన్న కొడుకునే చంపిన తల్లిదండ్రులను చూచి వారి మూఢ భక్తికి ఆశ్చర్యం వేసింది. చివరికి సిరియాళుడు బ్రతికి రావడం మాత్రం నాకు చాలా ఆనందం కలిగించింది.

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

బాస = ఒట్టు, ప్రతిజ్ఞ, వాగ్దానం
ధనం = అర్ధం, డబ్బు
జననాథుడు = ప్రజాపతి, రాజు, పుడమీశుడు
హరుడు = శివుడు, పరమేశుడు, సోమార్థ ధరుడు
చూతము = రసాలము, ఆమ్రము, మామిడి
తమ్మి = తామర, కమలం, పద్మం
సురధేనువు = కామధేనువు, సురభి
పగతుడు = శత్రువు, విరోధి, అరి
కనకము = బంగారము, కాంచనము
తేటి = తుమ్మెద, బంభరం

నానార్థాలు:

అర్థము = డబ్బు, ప్రయోజనము, పదానికి చెప్పే భావం
దెస = దిక్కు, విధము
మృగము = జింక, జంతువు

ప్రకృతులు – వికృతులు:

ప్రకృతి – వికృతి
భాష – బాస
భక్తి – బత్తి
మృగం – మెకం
హంస – అంచ

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

సంధులు:

మాయము = మా + అర్థము = యడాగమసంధి
బాసయండ్రు = బాస + అండ్రు = యడాగమసంధి
మంత్రియనియె = మంత్రి + అనియె = యడాగమసంధి
చింతామణియుండ = చింతామణి + ఉండ = యడాగమసంధి
సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటే పరంగా ఉన్న స్వరానికి యడాగమం ఔతుంది.

రాకామల = రాకా + అమల = సవర్ణదీర్ఘ సంధి
కామారి = కామ + అరి = సవర్ణదీర్ఘ సంధి
సోమాయాధరుడు = సోమ + అధరుడు = సవర్ణదీర్ఘసంధి
ప్రహసితాస్యుడు = ప్రహసిత + ఆస్యుడు = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.

అర్థమొప్పించి = అర్థము + ఒప్పించి = ఉత్వసంధి
తప్పేమి = తప్పు + ఏమి = ఉత్వసంధి
ఎట్లోకో = ఎట్లు + ఒకో = ఉత్వసంధి
అరుదగు = అరుదు + అగు = ఉత్వసంధి
మాడలుప్పొంగుచు = మాడలు + ఉప్పొంగుచు = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి ఔతుంది.

పాడు సేసితివి = పాడు + చేసితివి = గసడదవాదేశసంధి
ఫలంబులు సుంబించు = ఫలంబులు + చుంబించు = గసడదవాదేశసంధి
పండ్లు గన్గొనునె = పండ్లు + కన్గొనునె = గసడదవాదేశసంధి
ఆకాంక్ష సేయునే = ఆకాంక్ష + చేయునే = గసడదవాదేశసంధి
చను సీక = చను + చీక = గసడదవాదేశసంధి
లెక్కలు సూడు = లెక్కలు + చూడు = గసడదవాదేశసంధి
సూత్రం : ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

సమాసములు:

పరధనంబు  పరుల యొక్క ధనంబు  షష్ఠీ తత్పురుష సమాసం
జననాథుడు  జనులకు నాథుడు  షష్ఠీ తత్పురుష సమాసం
మృగపతి  మృగములకు పతి  షష్ఠీ తత్పురుష సమాసం
కామారి  కాముని యొక్క అరి (శత్రువు)  షష్ఠీ తత్పురుష సమాసం
సోమార్గధరుడు  సోమార్థుని ధరించినవాడు  ద్వితీయాతత్పురుష సమాసం
ప్రవసితాస్యుడు  ప్రహసితమైన ఆస్యము కలవాడు  బహువ్రీహి సమాసం
బసవన దండనాయకుడు  బసవన అనే పేరుగల దండనాయకుడు  సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
చూత ఫలంబులు  చూతము అనే పేరు గల ఫలములు  సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
హరుభక్తి  హరుని యందు భక్తి  సప్తమీ తత్పురుష సమాసం

ఎసైన్మెంట్:

పదజాలం :

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
అపహరించు : _____________
జవాబు.
పరుల ధనం అపహరించుట మహాపాపం.

ప్రశ్న 2.
వరవుడము : _____________
జవాబు.
వరవుడము చేసేవారు అణిగిమణిగి ఉండాలి.

ప్రశ్న 3.
దట్టుడు : _____________
జవాబు.
దట్టుడు ఎంతటి కార్యాన్ని అయినా ధైర్యంగా పూర్తి చేస్తాడు.

ప్రశ్న 4.
పడియ : _____________
జవాబు.
ఎండాకాలంలో నీరు దొరకనిచోట పడియనీటిపై ఆధారపడతారు.

ప్రశ్న 5.
పుల్లు : _____________
జవాబు.
ఆకలి వేస్తే సింహం పుల్లు మేస్తుందా ?

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

అర్థాలు:

కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు సరైన అర్థం గుర్తించండి.

ప్రశ్న 6.
తల్లి అగ్గలమైన ప్రేమతో బిడ్డలను చూసుకుంటుంది. ( )
A) అగ్గివంటి
B) అధికమైన
C) గుగ్గిలమైన
D) బుగ్గియైన
జవాబు.
B) అధికమైన

ప్రశ్న 7.
కుందేలు మృగపతిని ఉపాయంతో చంపింది. ( )
A) ప్రజాపతి
B) భూపతి
C) సింహము
D) ఎలుక
జవాబు.
C) సింహము

ప్రశ్న 8.
వింధ్య పర్వతం కనకాచలంతో పోటీపడి పెరిగింది. ( )
A) మేరు పర్వతం
B) ఆరావళి పర్వతం
C) హిమాలయ పర్వతం
D) కైలాస పర్వతం
జవాబు.
A) మేరు పర్వతం

ప్రశ్న 9.
బాస చేసి తప్పకూడదు. ( )
A) వాగ్దానం
B) నగ
C) భాష
D) పని
జవాబు.
A) వాగ్దానం

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

పర్యాయపదాలు:

కింది వాక్యాలలోని గీతగీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

ప్రశ్న 10.
పగతుడు దండెత్తి వచ్చినపుడు రాజు శత్రువును ధైర్యంగా ఎదుర్కొని, ఆ విరోధిని మట్టుబెట్టాలి. ( )
A) దండెత్తు, ధైర్యం
B) విరోధి, మట్టుబెట్టు
C) శత్రువు, ఎదుర్కొను
D) శత్రువు, విరోధిని
జవాబు.
D) శత్రువు, విరోధిని

ప్రశ్న 11.
తమ్మి వికసించగానే తామర పైన తుమ్మెద తిరుగుతూ పద్మంలోని మకరందాన్ని పీల్చుకుంటుంది. ( )
A) తుమ్ము, తుమ్మి
B) తుమ్మి పువ్వు, తమ్మ పువ్వు
C) తామర, పద్మం
D) తమలపాకు, తంబాకు
జవాబు.
C) తామర, పద్మం

ప్రశ్న 12.
హరుడు బోళాశంకరుడు. పరమేశుని తలవగానే వరాలిస్తాడు. ( )
A) శంకరుడు, పరమేశుడు
C) విష్ణువు, హరి
B) బోళా, వరాలు
D) ఇంద్రుడు, పాకారి
జవాబు.
A) శంకరుడు, పరమేశుడు

ప్రశ్న 13.
వేసవిలో చూత ఫలాలు విరివిగా దొరుకుతాయి. రసాల వృక్షం మీద కోయిల కూస్తుంది. మామిడిపండ్లు ఎవరైనా ఇష్టపడతారు. ( )
A) వేసవి, వృక్షం
B) రసాలం, మామిడి
C) ద్రాక్ష, అరటి
D) మామిడి, బత్తాయి
జవాబు.
B) రసాలం, మామిడి

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

నానార్థాలు:

కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.

ప్రశ్న 14.
మృగములన్నిటిలోను మృగము వేగంగా అందంగా పరుగెత్తుతుంది. ( )
A) సింహము, పులి
B) జంతువు, జింక
C) కంగారు, నక్క
D) ఏనుగు, జింక
జవాబు.
B) జంతువు, జింక

ప్రశ్న 15.
అర్థము వలన ఎన్నో అర్ధములు సాధించవచ్చు. ( )
A) ధనం, ప్రయోజనం
B) సగం, డబ్బు
C) ప్రయోజనం, సగం
D) డబ్బు, సొమ్ము
జవాబు.
A) ధనం, ప్రయోజనం

ప్రశ్న 16.
దిక్కుకు వెళ్తే విధం తెలుసుకొన్న తర్వాతే ప్రయాణం చెయ్యాలి. ( )
A) నిరాశ
B) దిశ
C) నిశ
D) పేరాశ
జవాబు.
B) దిశ

ప్రశ్న 17.
ఈ పండు తింటే ప్రయోజనం ఉంటుందా ? ( )
A) ఫలం
B) నిష్ఫలం
C) సఫలం
D) విఫలం
జవాబు.
A) ఫలం

ప్రకృతి – వికృతులు:

కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు ప్రకృతి / వికృతి గుర్తించండి.

ప్రశ్న 18.
హంస నడక వయ్యారంగా ఉంటుంది. ( )
A) హంశ
B) అంశ
C) అంచ
D) అన్ష
జవాబు.
C) అంచ

ప్రశ్న 19.
భక్తి వలన ముక్తి లభిస్తుంది. ( )
A) బకితి
B) బగితి
C) భగితి
D) బత్తి
జవాబు.
D) బత్తి

ప్రశ్న 20.
రామప్ప శిల్పాలు అచ్చెరువు గొల్పుతాయి. ( )
A) ఆశ్చర్యము
B) ఆశచర్యము
C) ఆ చెరువు
D) ఆశ్చర్యము
జవాబు.
A) ఆశ్చర్యము

ప్రశ్న 21.
తుఫాను సమయంలో నలుదెసల చీకట్లు కమ్ముకున్నాయి. ( )
A) దేశం
B) దిశ
C) దాశ
D) దోసె
జవాబు.
B) దిశ

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

భాషాంశాలు :

సంధులు:

కింది సంధులను అడిగిన విధంగా గుర్తించండి.

ప్రశ్న 22.
పరమేశుని సృష్టి చాలా గొప్పది. పరమేశ – ఎలా విడదీయాలి ? ( )
A) పరమే + శ
B) పర + మేశ
C) పరమ + ఏశ
D) పరమ + ఈశ
జవాబు.
D) పరమ + ఈశ

ప్రశ్న 23.
గుణసంధిలో ఇ ఉ ఋ లకు ఏవి ఆదేశంగా వస్తాయి ? ( )
A) ఏ ఓ అర్
B) య వ ర
C) ఆ ఈ ఊ ౠ
D) ఐ ఔ
జవాబు.
A) ఏ ఓ అర్

ప్రశ్న 24.
ఇందులో నా తప్పేమీ లేదు. తప్పేమి – ఏ సంధి ? ( )
A) గుణసంధి
B) ఉత్వసంధి
C) వృద్ధిసంధి
D) యణాదేశ సంధి
జవాబు.
B) ఉత్వసంధి

ప్రశ్న 25.
మా అర్థము మాకే దక్కుతుంది. మా + అర్థము – కలిపి రాయండి. ( )
A) మా అర్థము
B) మార్థము
C) మాయర్థము
D) మాయార్థము
జవాబు.
C) మాయర్థము

సమాసాలు:

కింది సమాసములను అడిగిన విధంగా గుర్తించండి.

ప్రశ్న 26.
పరధనం ఆశించుట మహాపాపం. పరధనము – విగ్రహవాక్యం ఏమిటి ? ( )
A) పర మరియు ధనము
B) పరుని యొక్క ధనము
C) పరుని యందు ధనము
D) పరుని కొరకు ధనము
జవాబు.
B) పరుని యొక్క ధనము

ప్రశ్న 27.
వసంత కాలంలో చూతఫలాలు బాగా వస్తాయి. చూతము అనే పేరుగల ఫలము ఏ సమాసం ? ( )
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
B) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
C) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
D) అవ్యయీభావ సమాసం
జవాబు.
C) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

ప్రశ్న 28.
హరుని యందు భక్తి ముక్తికే గదా! హరుని యందు భక్తి – ఏ సమాసం? ( )
A) సప్తమీ తత్పురుష సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) ద్వితీయా తత్పురుష సమాసం
D) చతుర్థీ తత్పురుష సమాసం
జవాబు.
A) సప్తమీ తత్పురుష సమాసం

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

వాక్యాలు – రకాలు:

కింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.

ప్రశ్న 29.
డబ్బు నాకొక లెక్కా ? ( )
A) ఆశ్చర్యార్థకం
B) ప్రార్థనార్థకం
C) ప్రేరణార్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు.
D) ప్రశ్నార్థకం

ప్రశ్న 30.
మీరు దయచేయవచ్చు. ( )
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రార్థనార్థకం
D) విధ్యర్థకం
జవాబు.
B) అనుమత్యర్థకం

ప్రశ్న 31.
ఇతరులను ఎగతాళి చేయవద్దు. ( )
A) నిషేధార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) అనుమత్యర్థకం
D) ప్రేరణార్థకం
జవాబు.
A) నిషేధార్థకం

ప్రశ్న 32.
ఆహా! బంగారు నాణేలు భలే తళ తళ లాడుతున్నాయి. ( )
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రార్థనార్థకం
D) విధ్యర్థకం
జవాబు.
A) ఆశ్చర్యార్థకం

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

సామాన్య – సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 33.
మా సొమ్ము మా కివ్వండి. దయచేయండి – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) మా సొమ్ము మాకిచ్చి దయచేయండి.
B) మా సొమ్ము మాకిస్తూ దయచేయండి.
C) మా సొమ్ము మాకివ్వడానికి దయచేయండి.
D) మా సొమ్ము దయచేసి మాకివ్వండి.
జవాబు.
A) మా సొమ్ము మాకిచ్చి దయచేయండి.

ప్రశ్న 34.
ధనం కోసం చేయిచాపను. ధర్మం తప్పను – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) ధనం కోసం చేయిచాస్తూ ధర్మం తప్పను.
B) ధనం కోసం ధర్మం తప్పి చేయిచాపను.
C) ధనం కోసం చేయిచాపను మరియు ధర్మం తప్పను.
D) ధర్మం తప్పను చేయిచాపి ధనం కోసం.
జవాబు.
C) ధనం కోసం చేయిచాపను మరియు ధర్మం తప్పను.

ప్రశ్న 35.
భక్తుడు పరధనాన్ని ఆశించడు. న్యాయం తప్పడు – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) భక్తుడు పరధనం ఆశించి న్యాయం తప్పడు.
B) భక్తుడు పరధనాన్ని ఆశించడు మరియు న్యాయం తప్పడు.
C) భక్తుడు న్యాయం తప్పి పరధనం ఆశించడు.
D) భక్తుడు పరధనం కోసం న్యాయం తప్పడు.
జవాబు.
B) భక్తుడు పరధనాన్ని ఆశించడు మరియు న్యాయం తప్పడు.

క్రియను గుర్తించుట:

క్రింది వాక్యాలు ఏ రకమైన క్రియలో గుర్తించండి.

ప్రశ్న 36.
ధనాగారం తాళం తీసి ధనం ఇచ్చాడు. ( )
A) క్త్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
A) క్త్వార్థం

ప్రశ్న 37.
నామీద నమ్మకం లేకపోతే సొమ్ము లెక్క చూసుకో. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
C) చేదర్థకం

ప్రశ్న 38.
నేను భగవంతుని చూస్తూ ధ్యానం చేస్తాను. ( )
A) క్వార్థం
B) శత్రర్ధకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
B) శత్రర్ధకం

ప్రశ్న 39.
వర్తమానకాల అసమాపక క్రియను ఏమంటారు ? ( )
A) క్త్వార్థం
B) చేదర్థకం
C) అప్యర్థకం
D) శత్రర్ధకం
జవాబు.
D) శత్రర్ధకం

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

ఛందస్సు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 40.
ద్విపద ఎన్ని పాదాలలో నడుస్తుంది ? ( )
A) 2
B) 4
C) 6
D) 8
జవాబు.
A) 2

ప్రశ్న 41.
ద్విపదలోని గణాలు ఏవి ? ( )
A) 1 సూర్య 2 ఇంద్ర 2 సూర్య
B) 3 సూర్య 2 ఇంద్ర 5 సూర్య
C) 2 ఇంద్ర 1 సూర్య
D) 6 ఇంద్ర 2 సూర్య
జవాబు.
C) 2 ఇంద్ర 1 సూర్య

ప్రశ్న 42.
ప్రాసలేని ద్విపదను ఏమంటారు ? ( )
A) సీసం
B) కందం
C) పంచచామరం
D) మంజరీద్విపద
జవాబు.
D) మంజరీద్విపద

ప్రశ్న 43.
ధేనువు కామధేనువు వలె ఉంది. – గీతగీసిన పదం ఏ గణం ? ( )
A) ర గణం
B) త గణం
C) భ గణం
D) మ గణం
జవాబు.
C) భ గణం

అలంకారాలు:

సరియైన అలంకారాన్ని గుర్తించండి.

ప్రశ్న 44.
పరమేశ్వరుని భక్తి అనే సురతరువు ఉన్నది. ( )
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) యమకం
జవాబు.
C) రూపకం

ప్రశ్న 45.
బసవన్న జంగమదేవరలను భగవంతుని వలె భావించి సేవించాడు. ( )
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) యమకం
జవాబు.
A) ఉపమ

TS 8th Class Telugu Bits 3rd Lesson బండారి బసవన్న

ప్రశ్న 46.
ఉపమాన ఉపమేయాలకు అందమైన పోలికచెప్తే అది ఏ అలంకారం ? ( )
A) ఉత్ప్రేక్ష
B) ఉపమ
C) రూపకం
D) యమకం
జవాబు.
B) ఉపమ

Leave a Comment