TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం

Telangana SCERT TS 8th Class Telugu Study Material Pdf ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide Upavachakam 1st Lesson చిత్రగ్రీవం

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏవి ?
జవాబు.
చిత్రగ్రీవం తనకు మూడు వారాల వయస్సు ఉన్నప్పుడు తన గూట్లోకి వచ్చిన నల్ల చీమను ముక్కుతో పొడిచి రెండు ముక్కలు చేసింది. అయితే ఆ చీమ దానికి తినడానికి పనికిరానిది. ఆ విషయం గ్రహించిన చిత్రగ్రీవం తన జీవితంలో మళ్ళీ ఎప్పుడూ మరో చీమను చంపలేదు.

తాను చేసిన పని పొరపాటు అని గ్రహించిన పావురం తిరిగి ఆ తప్పును తిరిగి చేయకపోవడం నాకు ఆశ్చర్యం కల్గించింది.

ప్రశ్న 2.
మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులని రచయిత ఎందుకు అన్నాడు ?
జవాబు.
“ఏనుగులు, పావురాలు తమ తమ యజమానుల పట్ల గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. వీటిని మించి యజమాని పై విశ్వాసాన్ని ప్రదర్శించే ప్రాణిని తాను చూడలేదని రచయిత చెప్పాడు.
అడవులలోని ఏనుగులు, నగరాల్లోని పావురాలు తమ యజమానులంటే ప్రాణం ఇస్తాయి. అవి రోజంతా, ఎక్కడెక్కడ తిరిగినా, ఏ ఆకాశ సీమలో ఎగిరినా, చివరకు అవి వాటికి ఉన్న అద్భుతమైన ‘అంతఃప్రేరణాబలం’తో తమ మిత్రుడూ, సహచరుడూ అయిన మానవుడి పంచకే చేరుతాయి”.
అందువల్లనే రచయిత, మానవులను పావురాలకు మిత్రులు, సహచరులు అని అన్నాడు.

ప్రశ్న 3.
పిల్లల పెంపకంలో పక్షులకు, మనుషులకు మధ్య ఉన్న పోలికలు చెప్పండి.
జవాబు.
పక్షులు గుడ్డు నుండి పిల్లలు బయటికి రాకముందే శ్రద్ధగా పొదుగుతాయి.

తల్లులు కూడా గర్భంతో ఉన్నప్పటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. చంటి పిల్లలకు తల్లి తన పాలను నోటికి అందించినట్లే పక్షి పిల్లల నోటికి కూడా తల్లి పక్షి ఆహారాన్ని అందిస్తుంది. పిల్లలకు మెత్తని పడకని ఏర్పాటు చేయడంలో మనుషులు ఎంత శ్రద్ధ చూపుతారో పక్షులు కూడా మెత్తటి దూది, చెట్ల ఆకులు మొదలైన వాటిని పేర్చి సౌకర్యంగా అమరుస్తాయి. చంటిపిల్లల కోసం తల్లులు పదార్థాలను మెత్తగా ఉడకబెట్టి శ్రద్ధగా మెదిపి కొంచెం కొంచెంగా నోటికి అందిస్తారు. అలాగే పక్షులు కూడా గింజల్ని, విత్తనాల్ని గొంతులో నానబెట్టి, మెత్తబర్చి పిల్ల పక్షుల నోట్లో పెడతాయి.

తల్లిదండ్రులు పిల్లలకు పాకడం, లేచి నిలబడటం, నడవడం నేర్పడానికి చేతులు పట్టుకుని జాగ్రత్తపడతారు. నడక నేర్చుకునేటప్పుడు పిల్లలు కిందపడి ఏడుస్తుంటే లాలించి ధైర్యం చెప్తారు. పక్షులు కూడా ఎగరడానికి భయపడుతున్నపుడు ఎగిరి కింద పడుతున్నపుడు లాలించి ధైర్యం చెప్పి రెక్కలు నిమిరి ఎగరడం నేర్పిస్తాయి. మనుషులు తమ పిల్లల్ని రకరకాల ప్రమాదాల నుండి, నిప్పు నుండి, నీటి నుండి రక్షించుకున్నట్టే పక్షులు కూడా రకరకాల జంతువుల నుండి డేగలు, గ్రద్దలు వంటి పెద్ద పక్షుల నుండి కాపాడుకోవడానికి పిల్లల్ని తమ రెక్కల కింద దాచుకుంటాయి.

ప్రశ్న 4.
పావురాల గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు.
ప్రాచీనకాలం నుండి పావురాలు మానవ నివాసాల్లో గూడును ఏర్పరచుకొని జీవిస్తున్నాయి. పావురాలను పెంచుకునేది ఓ కళ. భారతదేశంలో పిగిలిపిట్ట, బంతి పావురం అనే రెండు విశిష్టమైన పావురాల జాతులను భారతదేశం ప్రపంచానికి అందించింది. రాజుల కాలం నుండి రాజులు, సామాన్యులు పావురాలకు తమ ఇళ్ళలో స్థానాలను కల్పించారు. కలకత్తా నగరం పావురాలకు ప్రసిద్ధి. పావురాలు వేరు వేరు బృందా కలిసి ఎగురుతాయి.

అలా కలగలిసి గంటల తరబడి ఎగిరి తిరిగి విడిపోయి తమ యజమానుల ఇళ్ళకు చేరుకుంటాయి. రకరకాల రంగుల్లో ఉన్నా తమ యజమాని ఇళ్ళను గుర్తించడం పావురాలకున్న ప్రత్యేకమైన జ్ఞానం. అద్భుతమైన దిశా పరిజ్ఞానం అనేది పావురానికున్న ప్రత్యేక లక్షణం. పావురాల్లో వార్తలను చేరవేసే పావురాలు ప్రత్యేకంగా ఉంటాయి. గిరికీల పావురాలు వార్తలు చేరవేయడానికి పనికిరావు. గిరికీల పావురాలు తెలివైనవి. శత్రువుల దాడి నుండి తప్పించుకొనే శక్తి కలవి. పావురం కంటిలో సూర్యరశ్మిని తట్టుకునే ఒక రెప్ప వంటి పొర ఉంటుంది.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం

1. అవగాహన – ప్రతిస్పందన:

అ) కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పక్షి ప్రపంచంలో రెండు దృశ్యాలు అతి మనోహరమైనవి. గుడ్డు బద్దలుగొట్టి తల్లిపక్షి పిల్లపక్షిని ఈ ప్రపంచపు వెలుగులోకి తీసుకురావడం అందులో మొదటిది. అలా వచ్చిన పిల్లపక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లిపక్షి పెంపకం కొనసాగించడం రెండోది. చిత్రగ్రీవం పెంపకం ఎంతో అనురాగంతో సాగింది. మనం చిన్న పిల్లల్ని ఎత్తుకొని లాలిస్తే ఆ పిల్లలకు ఎలాంటి హాయీ సౌఖ్యమూ లభిస్తాయో చిత్రగ్రీవానికి తన తండ్రిపక్షి, తల్లిపక్షుల నుంచి అలాంటి వెచ్చదనం లభించింది.

ప్రశ్న 1.
పక్షి ప్రపంచంలో మనోహరమైన మొదటి దృశ్యం ఏది ?
జవాబు.
గుడ్డు బద్దలుకొట్టి తల్లిపక్షి, పిల్లపక్షిని ప్రపంచంలోకి తీసుకురావడం.

ప్రశ్న 2.
తండ్రి పక్షి నుండి పక్షి పిల్లలకు లభించే సౌఖ్యం ఏమిటి ?
జవాబు.
చిన్న పిల్లలని ఎత్తుకుని లాలిస్తే కలిగే హాయి, సుఖం.

ప్రశ్న 3.
పై పేరాలో ఏ పక్షి గురించి వివరించబడింది ?
జవాబు.
చిత్రగ్రీవం అనే పావురం గురించి వివరించబడింది.

ప్రశ్న 4.
చిత్రగ్రీవం అంటే ఏమిటి ?
జవాబు.
అందమైన రంగురంగుల మెడ గలది.

ప్రశ్న 5.
పై పేరాకు శీర్షికను పెట్టండి.
జవాబు.
పక్షి ప్రపంచం.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం

ఆ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పది లక్షల జనాభా ఉందని మనం చెప్పుకునే కోల్కతా మహా నగరంలో కనీసం ఇరవై లక్షల పావురాలు ఉంటాయి. నాకో పెంపుడు పావురం ఉంది. దాని పేరు “చిత్రగ్రీవం”. ‘చిత్ర’ అంటే ‘ఉల్లాసభరితమైన రంగులతో నిండిన’ – అని అర్థం. ‘గ్రీవం’ అంటే కంఠం. నా పావురం మెడ చిత్ర విచిత్ర వర్ణభరితం అన్నమాట. అప్పుడప్పుడు మా పావురాన్ని ‘హరివిల్లు మొనగాడు’ అని ముద్దుగా పిలుస్తుంటాను. దాని తండ్రిపక్షి ఓ గిరికీల మొనగాడు. తల్లి పక్షి ఓ వార్తల పావురం. ఆ రోజుల్లో అది అతి సుందరమైన కులీన వంశానికి చెందిన పావురం.

ప్రశ్న 1.
చిత్రగ్రీవం అంటే ఏమిటి ?
జవాబు.
చిత్ర విచిత్ర వర్ణాలతో కూడిన మెడ కలది.

ప్రశ్న 2.
ఏ పావురం వార్తలను అందించేది ?
జవాబు. తల్లిపక్షి

ప్రశ్న 3.
కోల్కతాలో ఎన్ని లక్షల పావురాలుంటాయి ?
జవాబు.
ఇరవై లక్షలు

ప్రశ్న 4.
తండ్రిపక్షి గొప్పదనమేమి ?
జవాబు.
గిరికీల మొనగాడు.

ప్రశ్న 5.
తల్లిపక్షి ఏ వంశానికి చెందినది ?
జవాబు.
కులీన వంశ.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం

ఇ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చిత్రగ్రీవం తండ్రిపక్షి ఓ గిరికీల మొనగాడు. తల్లిపక్షి ఓ వార్తల పావురం. ఆ రోజుల్లో అది అతి సుందరమైన కులీన వంశానికి చెందిన పావురం. ఆ రెండు విశిష్టమైన పావురాలు జత కట్టాయి. గుడ్లు పెట్టినాయి. వాటికి పుట్టిన చిత్రగ్రీవం అందువల్లనేమో ! తర్వాతి రోజుల్లో యుద్ధ రంగాల్లోనూ, శాంతి సమయాల్లోనూ అమోఘంగా పని చెయ్యగల వార్తా హరియైన పావురంగా రూపొందింది. తల్లిపక్షి నుండి తెలివితేటలు సంపాదించుకున్నది. తండ్రిపక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం సంతరించుకున్నది.

ప్రశ్న 1.
ఈ పేరా ఎవరి గురించి చెబుతున్నది ?
జవాబు.
చిత్రగ్రీవం గురించి

ప్రశ్న 2.
పూర్వకాలంలో వార్తలు టి ద్వారా పంపేవారు ?
జవాబు.
పావురాల ద్వారా

ప్రశ్న 3.
చిత్రగ్రీవం తల్లిదండ్రి నుండి ఏం సంపాదించుకున్నది?
జవాబు.
తెలివితేటలు, వేగం, చురుకుదనం, సాహసం

ప్రశ్న 4.
పై పేరాకు శీర్షిక పెట్టండి.
జవాబు.
‘చిత్రగ్రీవం’

ప్రశ్న 5.
తల్లి పక్షి ఎలాంటిది ?
జవాబు.
అతిసుందరమైన కులీన వంశానికి చెందిన తెలివైన పక్షి

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం

ఈ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

నా పెంపుడు ఏనుగు పేరు ‘కరి’. నాకో పెంపుడు పావురం కూడా ఉంది. దాని పేరు ‘చిత్రగ్రీవం’. ‘చిత్ర’ అంటే ఉల్లాసభరితమైన రంగులతో నిండిన అని అర్థం. ‘గ్రీవం’ అంటే కంఠం. నా పావురం మెడ చిత్ర విచిత్ర వర్ణభరితం అన్నమాట. అందుకే నా పావురాన్ని అప్పుడప్పుడు ‘హరివిల్లు మొనగాడు’ అని ముద్దుగా పిలుస్తుంటాను.

ప్రశ్న 1.
‘చిత్రగ్రీవం’ ముద్దుపేరు ఏమిటి ?
జవాబు.
హరివిల్లు మొనగాడు

ప్రశ్న 2.
‘చిత్రగ్రీవం’ అంటే అర్థం ఏమిటి?
జవాబు.
చిత్రవిచిత్ర వర్ణభరితమైన మెడ కలది.

ప్రశ్న 3.
‘కరి’ ఎవరి పేరు ?
జవాబు.
ఏనుగు పేరు

ప్రశ్న 4.
‘వర్ణభరితం’ అనగా ఏమిటి ?
జవాబు.
రంగులమయం

ప్రశ్న 5.
పై పేరాకు శీర్షికను సూచించండి.
జవాబు.
చిత్రగ్రీవం

Leave a Comment