TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 1st Lesson త్యాగనిరతి Textbook Questions and Answers.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

చదువండి – ఆలోచించి చెప్పండి. (TextBook Page No. 2)

దధీచి మహా తపశ్శాలి. చ్యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకొంటుండగా వాటిని దాచిపెట్టుమని దధీచికి దేవతలు ఇచ్చిపోయారు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దధీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు. అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమ్మన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకొమ్మన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
దధీచి ఎవరు ?
జవాబు.
దధీచి గొప్ప తపశ్శాలి. చ్యవన మహర్షి పుత్రుడు.

ప్రశ్న 2.
దధీచి చేసిన త్యాగం ఏమిటి ? ఎందుకు
జవాబు.
దధీచి దేవతల కోసం తన ఎముకలను దానం చేశాడు. ఆ ఎముకల నుండి వజ్రాయుధం ఏర్పడింది. రాక్షస సంహారం కోసం తన ఎముకలను దధీచి త్యాగం చేశాడు.

ప్రశ్న 3.
త్యాగం అంటే ఏమిటి ?
జవాబు.
తనకున్నదానిలో సమాజ హితం కోసం ఫలాపేక్షరహితంగా అర్పించడమే త్యాగం. త్యాగం ప్రత్యుపకారాన్ని ఆశించదు.

ప్రశ్న 4.
మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లను తెలుపండి.
జవాబు.
నాకు తెలిసిన త్యాగమూర్తులలో ముఖ్యమైన వారు.

  1. దధీచి,
  2. శిబి,
  3. తిలక్,
  4. ప్రకాశం పంతులు,
  5. కొమురం భీం,
  6. దామోదరం సంజీవయ్య,
  7. డొక్కా సీతమ్మ.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No. 4)

ప్రశ్న 1.
సత్యధర్మ నిర్మలుడని శిబి చక్రవర్తిని ఎందుకన్నారు ?
జవాబు.
శిబి చక్రవర్తి గొప్పరాజు. ఆడినమాట తప్పనివాడు. అతని మనస్సు నిర్మలం. ఎల్లప్పుడు ధర్మాన్నే ఆచరించే స్వభావం కలవాడు. తన సమీపానికి వచ్చి రక్షణ పొందిన పావురాన్ని రక్షించాడు. ఆకలితో ఉన్న డేగకు తన మాంసాన్ని అందించాడు. ధర్మాన్ని పరిరక్షించాడు. అందుకే శిబిని సత్యధర్మనిర్మలుడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ప్రశ్న 2.
“ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్” దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి.
జవాబు.
‘ధర్మం’ అనేది అన్నింటికి మేలు చేసేదై ఉండాలి. ఏ ప్రాణికి హాని చేకూర్చనిదై ఉండాలి. అప్పుడే మన ధర్మం లోకంలో స్థిరంగా నిలువగలుగుతుంది. ధర్మాన్ని రక్షిస్తే అది అందరినీ రక్షిస్తుంది.

ప్రశ్న 3.
ఆశ్రితులను ఎందుకు విడిచి పెట్టరాదు ?
జవాబు.
ఆశ్రితులు రక్షణ కోరి వస్తారు. అటువంటి వారిని ఎన్ని అవాంతరాలైనా రక్షించాలి. ఒకవేళ ఆశ్రితులను విడిచిపెడితే వారికి ముప్పు కలుగుతుంది. అందువల్ల ఆశ్రితులను రక్షించి, వారికి మనోధైర్యాన్ని అందించాలి.

ప్రశ్న 4.
ఏ సందర్భంలో ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు ?
జవాబు.
ఆపదలు కలిగినప్పుడు, భయం వెంటాడు తున్నప్పుడు, ధనదారిద్య్ర్యం ఉన్నప్పుడు, దొంగలు వెంటాడుతున్నప్పుడు, రోగాలు పట్టి పీడిస్తున్నప్పుడు ఇతరులు మమ్ములను ఆశ్రయిస్తారు.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 5)

ప్రశ్న 1.
డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది ?
జవాబు.
శిబి చక్రవర్తిలోని త్యాగనిరతిని లోకానికి తెలియ జేయడం కోసం తన ఆకలిని తక్షణం తీర్చుకోవడం కోసం డేగ శిబి మాంసాన్ని కోరింది.

ప్రశ్న 2.
“అనుగ్రహించితి మహా విహగోత్తమ” అని శిబి చక్రవర్తి అనటాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
శిబి చక్రవర్తికి పావురాన్ని రక్షించాలనే కోరిక తీవ్రంగా ఉంది. కాని డేగ, పావురాన్ని వదులు కోవడానికి అంగీకరించలేదు. కాని చివరకు డేగ శిబి మాంసాన్ని కోరింది. అది విని ‘నేను అనుగ్రహించ బడ్డాను’ అని పలికాడు. దీనివల్ల శిబికి పావురాన్ని రక్షించాలనే కోరిక నెరవేరింది. శిబి చక్రవర్తిలోని భూతదయ లోకానికి తెలిసింది.

ప్రశ్న 3.
శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు కదా ! త్యాగం ఆవశ్యకత ఏమిటి ?
జవాబు.
మానవజన్మ దుర్లభమైంది. దాన్ని సార్థకం చేసు కోవాలంటే త్యాగం అవసరం. తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని సమాజ సేవకు త్యాగం చేయాలి. త్యాగం వల్ల నవసమాజ నిర్మాణం ఏర్పడుతుంది. స్వార్థం క్రమంగా తొలగుతుంది. ఆత్మసంతృప్తి మిగులుతుంది. అందువల్ల అందరూ త్యాగాన్ని అలవరచుకోవాలి.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:

ప్రశ్న 1.
త్యాగం అంటే ఏమిటి ? త్యాగంలోని గొప్పతనం ఏమిటి ?
జవాబు.
‘త్యాగం’ అంటే వదులుకోవడం. మానవీయ సంబంధాలకు పునాది ఈ త్యాగం. మానవ జీవితంలో త్యాగాన్ని మించిన ఉత్తమ గుణం మరొకటి కనిపించదు. సమాజంలో ఎంతో మంది మహనీయులు సమాజ శ్రేయస్సు కోసం తమ సంపదను, తమ సుఖాలను, కుటుంబాలను త్యాగం చేశారు. అవసరమైతే తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధపడతారు.

తిలక్, నెహ్రూ, ప్రకాశం పంతులు వంటి మహనీయులు తమ సంపదను, దేశం కోసం త్యాగం చేశారు. అట్లే తెలంగాణ రాష్ట్రావిర్భావం కోసం ఎందరో బలిదానం చేశారు. వారి త్యాగాల వల్లే రాష్ట్రం సిద్ధించింది.

ఈ త్యాగం వల్ల స్వార్థం నశిస్తుంది. వసుధైక కుటుంబ భావన కలుగుతుంది. మన సంస్కృతిలోని ఔన్నత్యం ప్రపంచానికి తెలుస్తుంది. త్యాగమయమైన జీవితాలు భావితరాలవారికి ఆదర్శంగా నిలుస్తాయి. అందువల్ల త్యాగ గుణాన్ని మానవులంతా అలవరచుకోవాలి.

ప్రశ్న 2.
ఇతరుల కోసం, సమాజం కోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి.
జవాబు.
మన సమాజంలో ఎందరో మహనీయులు సమాజ హితం కోసం ఎన్నో త్యాగాలను చేశారు. వారి త్యాగాలు జాతిని జాగృతం చేశాయి. ఎందరికో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రసాదించాయి. ముఖ్యంగా పురాణ వాఙ్మయంలో దధీచి, శిబి, కర్ణుడు మొదలైనవారు ఎన్నో త్యాగాలు చేశారు. దధీచి తన ఎముకలనే చేశాడు.

మహాత్మాగాంధీ, తిలక్, నెహ్రూ, పటేల్ వంటి మహనీయులు తమ సర్వస్వాన్ని దేశం కోసం త్యాగం చేశారు. వారి త్యాగాల వల్లే మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. మదర్ థెరీసా త్యాగానికి మారుపేరుగా నిలిచింది. తన జీవితాన్ని అనాథల కోసం త్యాగం చేసింది.

అట్లే తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎందరో యువకులు, కళాకారులు, పోరాట యోధులు, విద్యార్థులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఎందరో ప్రాణాలను పోగొట్టుకున్నారు. వారి త్యాగాల వల్లనే మనం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఈ రకంగా ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచారు.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:

1. కింది వాక్యాల ఆధారంగా పాఠంలోని పద్యపాదాలను గుర్తించి రాయండి.

అ) ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి __________________
జవాబు.
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్

ఆ) ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం __________________
జవాబు.
నాకు విహిత భక్షణంబిది; యిప్పక్షిఁ.

ఇ) ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మమవుతుందా చెప్పు __________________
జవాబు.
నాశ్రిత త్యాగమిది ధర్మువగునె ? చెపుమ

2. కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి.

‘ఆ॥ ‘బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటెగాదు
చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగుబాల.

అ) ‘చెట్టు’ అను పదానికి సరిపోయే పదం-
ఎ) తరువు
బి) గురువు
సి) ఫలం
డి) గుణం
జవాబు.
ఎ) తరువు

ఆ) త్యాగానికి గురువులు ఎవరు ?
ఎ) మానవులు
బి) చెట్లు
సి) పక్షులు
డి) జంతువులు
జవాబు.
బి) చెట్లు

ఇ) తనువును చీల్చి యిచ్చేది-
ఎ) మేఘాలు
బి) నదులు
సి) చెట్లు
డి) పక్షులు
జవాబు.
సి) చెట్లు

ఈ) చచ్చుట పదానికి వ్యతిరేకార్థం-
ఎ) పెరుగుట
బి) తరుగుట
సి) బ్రతుకుట
డి) మేల్కొనుట
జవాబు.
సి) బ్రతుకుట

ఉ) పై పద్యానికి తగిన శీర్షిక-
ఎ) భారం
బి) ప్రాణం
సి) యోగం
డి) త్యాగం
జవాబు.
డి) త్యాగం

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

III. స్వీయరచన:

1.కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి.
జవాబు.
ఈ లోకంలో ప్రాణులన్నీ ఆహారం తినే జీవిస్తాయి. ఆహారం తినకుండా ఏ ప్రాణీ జీవించలేదు. ‘కోటి విద్యలు కూటి కొరకే’ అని మన పెద్దలంటారు. అటువంటి ఆహారాన్ని సంపాదించుకొని తినే సమయంలో ఇతరులు ఆటంకాలను కల్పించకూడదు. ఆటంకాలను కల్పించడం వల్ల సంపాదించుకున్న ఆహారాన్ని తృప్తిగా తినలేడు. అన్నం తినకపోతే ప్రాణాలు నిలువవు. జీవించడానికి ముఖ్య సాధనం ఆహారం. అటువంటి ఆహారాన్ని తినే సమయంలో ఎవరూ, ఎలాంటి ఆటంకాలను కల్పించకూడదు.

ఆ) ‘అందరూ ధర్మాన్ని ఆచరించాలి’ అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
‘ధర్మం’ అంటే సక్రమమైన మార్గం. ఏదైతే సంఘాన్ని కట్టుబాటులో ఉంచుతుందో అదే ధర్మం. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది. ధర్మం ద్వారానే సమాజంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు. ధర్మ ప్రవర్తనే మనిషిని ఉన్నతుడిగా చేస్తుంది.

ధర్మం తెలిసినవారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని భావించరు. ధర్మం అనేది అన్నింటికీ మేలు కలిగించేదిగానే ఉండాలి. అందుకే “అహింసా పరమో ధర్మః” అన్నారు. అంటే హింస చేయకుండుటయే గొప్ప ధర్మం. అందువల్ల అందరూ ధర్మాన్ని ఆచరించాలి.

ఇ) ఇతరుల కొఱకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చో రాయండి.
జవాబు.
మానవ జన్మ దుర్లభమైంది. దానిని మనం సార్థకం చేసుకోవాలి. మనం తోటివారికి వీలైనంతగా త్యాగం చేయాలి. త్యాగం చేయడం వల్ల ఆత్మసంతృప్తి కలుగుతుంది. స్వార్థాన్ని కొంత వీడి త్యాగం చేయాలి. కూడు, గూడు లేక ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు తన ఆహారంలో కొంత వారికి త్యాగం చేయవచ్చు. విలాసవంతమైన వస్తువులను వాడడం తగ్గించి, ఆ ధనాన్ని పేదలకు అందించాలి.

ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు స్వచ్ఛందంగా శ్రమశక్తిని త్యాగం చేయాలి. ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తాన్ని, అవసరమైతే అవయవాలను త్యాగం చేయాలి. ఈ రకంగా మనం తోటివారికి ఎన్నో రకాలుగా త్యాగం చేయవచ్చు.

ఈ) “త్యాగనిరతి” అనే శీర్షిక పాఠానికి ఏ విధంగా తగినదో రాయండి.
జవాబు.
ఈ పాఠానికి ‘త్యాగనిరతి’ అనే శీర్షిక అన్ని విధాలుగా తగినదిగా ఉంటుంది. ఈ పాఠ్య భాగంలో ‘శిబి’ తన త్యాగనిరతిని చాటాడు. ఒక పక్షి కోసం తన మాంసాన్ని కోసి ఇచ్చాడు. రెండు మూగ జీవాలను రక్షించాడు. శిబికి త్యాగం చేయాలనే బుద్ధి స్థిరంగా ఉంది. ఆ బుద్ధి వల్లనే తోటి ప్రాణికి సహాయం చేయాలనుకున్నాడు. అందువల్ల ఈ పాఠానికి ‘త్యాగబుద్ధి’ అనే శీర్షిక అన్ని విధాలుగా తగినదిగా ఉంటుంది.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి.
జవాబు.
మానవ జీవితం దుర్లభమైంది. దాన్ని మానవులంతా సార్థకం చేసుకోవాలి. ఈ లోకంలో త్యాగాన్ని మించిన సుగుణం మరొకటి లేదు. దేనినైనా స్వీకరిస్తూ ఎవడు తన చేతిని ముడుచుకుంటాడో వాడే అత్యల్పుడు. ఎవడు ఇస్తూ కూడా తన చేతిని దాచుతాడో వాడే నిజమైన త్యాగి.

త్యాగి అందరినీ సమదృష్టితో చూస్తాడు. త్యాగికి స్వపరభేదాలు ఉండవు. లోకం మనకేమీ ఋణపడిలేదని, లోకానికే మనం ఋణపడి ఉన్నామని త్యాగి భావిస్తాడు. త్యాగం స్వార్థచింతనను దూరం చేస్తుంది. త్యాగం లేనిదే లోకంలో ఏ మహత్తరమైన పనీ సిద్ధించదు.

మన నాయకులు గతంలో త్యాగాలు చేయకపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదికాదు. స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహనీయులు తమ ధన, ప్రాణాలను త్యాగం చేశారు. అట్లే తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం శ్రీ కాంతాచారి వంటివారు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. వారి త్యాగాల పునాదులపైనే బంగారు తెలంగాణ నిలిచింది. ఎందరో కవులు, గాయకులు, కళాకారుల, త్యాగాలు తెలంగాణ సిద్ధించడానికి కారణమయ్యాయి.

మదర్ థెరీసా త్యాగానికి ప్రతిరూపంగా నిలిచారు. ఆమె అనాథల కోసం తన జీవితాన్నే త్యాగం చేశారు. తిలక్, నేతాజీ వంటివారు తమ సంపదను, సుఖాన్ని దేశం కోసమే త్యాగం చేశారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

IV. సృజనాత్మకత/ప్రశంస:

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) అన్ని దానాల్లోకెల్ల అన్నదానం గొప్పది. శరీరంలోని అవయవదానం ఇంకా గొప్పది. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తా పత్రికలకు లేఖ రాయండి.
జవాబు.

లేఖ

కరీంనగర్,
X X X X X

గౌరవనీయులైన పత్రికా సంపాదకుడు,
‘ఈనాడు’ పత్రికా కార్యాలయం,
కరీంనగర్.

అయ్యా !!

అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. దానికంటే మనలోని అవయవాలను తోటివారికి దానం చేయడం శ్రేష్ఠం. ఈ కాలంలో అవయవదానం వల్ల ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. వీటన్నింటిని దూరం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అవయవదానం వల్ల తోటివారిని సజీవంగా ఉంచే అవకాశం దొరుకుతుంది. కళ్ళను, కిడ్నీలను, గుండెను మొదలైన వాటిని దానంచేసే గుణాన్ని చిన్నతనం నుండే అలవరచుకోవాలి. అవయవదానంపై అవగాహన కలిగించే విధంగా ప్రభుత్వం ముఖ్యాంశాలను రూపొందించాలి. పత్రికలు కూడా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలి. మీ పత్రిక ఈ విషయంలో అన్ని పత్రికలకంటే ముందుంటుందని ఆశిస్తున్నాను. మీ పత్రిక ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
మీ విశ్వాసపాత్రుడు,
X X X X X.

చిరునామా :
గౌరవనీయులైన పత్రికా సంపాదకుడు,
ఈనాడు’ పత్రికా కార్యాలయం,
కరీంనగర్,
తెలంగాణ రాష్ట్రం.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

V. పదజాల వినియోగం:

ప్రశ్న 1.
గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

ఉదా : కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు.
కపోతములు = పావురములు

అ) ఆశ్రితులను వదలి వేయుట ధర్మువు కాదు.
జవాబు.
ధర్మువు = ధర్మము

ఆ) ఉత్తముడు పరుల హితమునే కోరతాడు.
జవాబు.
హితమునే = మేలునే

ఇ) ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
జవాబు.
పరిత్యాగం = సమర్పించడం

ఈ) దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక !
జవాబు.
వర్ధిల్లు = వృద్ధిపొందు

ఉ) బుభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు.
జవాబు.
బుభుక్షితుడు = ఆకలితో బాధపడువాడు’

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

2. కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.

ఉదా : ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి.
వర్షం = సంవత్సరం, వాన

అ) న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో నీళ్ళు కలపడం ధర్మం కాదు.
పాడి : __________, __________
జవాబు.
పాడి : న్యాయము, ధర్మము, తీర్పు

ఆ) అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది.
వనం : __________, __________
జవాబు.
వనం : అరణ్యం, జలము, సమూహము

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

VI. భాషను గురించి తెలుసుకుందాం.

ప్రశ్న 1.
కింది వాక్యాలను చదువండి. అవి ఎటువంటి వాక్యాలో గుర్తించి జతపరచండి.
ఉదా : లోపలకి రావచ్చు – అనుమత్యర్థక వాక్యం

అ) దయచేసి వినండి 1) ఆశ్చర్యార్థక వాక్యం
ఆ) రమ చక్కగా రాయగలదు 2) ప్రశ్నార్థక వాక్యం
ఇ) ఆహా ! ఎంత బాగుందో 3) సామర్థ్యార్థక వాక్యం
ఈ) అల్లరి చేయవద్దు 4) ప్రార్థనార్థక వాక్యం
ఉ) గిరి ! ఎక్కడున్నావు ? 5) నిషేధార్థక వాక్యం

జవాబు.
అ) 4
ఆ) 3
ఇ) 1
ఈ) 5
ఉ) 2

ప్రశ్న 2.
కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

అ) ఇంద్రాగ్నులు = _______ + _______ = _______
జవాబు.
ఇంద్ర + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి

త్యాగమిది = _______ + _______ = _______
జవాబు.
త్యాగము + ఇది = ఉత్వ సంధి

ఇ) ఆహారార్థం = _______ + _______ = _______
జవాబు.
ఆహార + అర్థం = సవర్ణదీర్ఘ సంధి

ఈ) నేనెట్లు = _______ + _______ = _______
జవాబు.
నేను + ఎట్లు = ఉత్వసంధి

ఉ) శౌర్యాది = _______ + _______ = _______
జవాబు.
శౌర్య + ఆది = సవర్ణదీర్ఘ సంధి

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలను లేదా కథలను లేదా సంఘటనలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
అ) మహనీయమూర్తులు

1) మదర్ థెరీసా :
మదర్ థెరీసా త్యాగానికి ప్రతీకగా నిలిచింది. ఈమె తన జీవితాన్ని అనాథల కోసం, అభాగ్యుల కోసం త్యాగం చేసింది. కుష్ఠురోగుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం నిరంతరం కృషి చేసింది. ధన్యజీవిగా నిలిచింది.

2) బాలగంగాధర్ తిలక్ :
సమాజానికి, స్వాతంత్ర్య పోరాటానికి తన సర్వస్వాన్ని అర్పించిన మహనీయుడు తిలక్. ఈ గున మహారాష్ట్రలో సంభవించిన ప్లేగువ్యాధి బాధితులకు, అనావృష్టితో అలమటిస్తున్న బాధితులకు తన సంపదనంతా త్యాగం చేశాడు. లోకమాన్యుడిగా గుర్తింపు పొందాడు.

3) ప్రకాశం పంతులు గారు :
దేశ స్వాతంత్ర్యం కోసం మహోన్నతమైన తన న్యాయవాద వృత్తిని వదులుకున్నాడు. తన సంపదనంతా పేద ప్రజల కోసం త్యాగం చేశాడు. పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నెలకొల్పాడు.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

ఆ) సంఘటనలు :

తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు :
తెలంగాణ పోరాటానికి ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో తెలంగాణ కోసం బలిదానాలు చేశారు. అంతేగాదు ఎంతో మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కూడా బంగారు తెలంగాణ కోసం త్యాగం చేశారు. అమరవీరులుగా కీర్తి పొందారు. వారి త్యాగాల ఫలితంగానే నవతెలంగాణ సిద్దించింది.

త్యాగం

అన్ని సద్గుణాల్లోను ‘త్యాగం’ ఎంతో గొప్పది. ఇది మానవుడికి అజరామరమైన కీర్తిని సంపాదించి పెడుతుంది. మనం కన్న సంతానం కన్నా, మనం సంపాదించిన ధనం కన్నా, మనం చేసిన మంచి పనుల కన్నా శాశ్వతత్వాన్ని సమకూర్చి పెట్టేది త్యాగం ఒక్కటే! అందుకనే “నకర్మణా నప్రజయా ధనేన, త్యాగేనైకేన అమృతత్వమానసుః” అని వేదం ఘోషిస్తుంది. దానం – త్యాగం యీ రెండూ దగ్గర లక్షణాలు కలవిగానే కనిపించినా రెండింటిలో చాలా తేడా వుంది.

తన దగ్గర వున్న దానిలో యితరులకు యివ్వడం దానం. తనకు మిక్కిలి అవసరమైనదని తెలిసి కూడా, దానిని లెక్క పెట్టకుండా యితరులకు యిచ్చేయడం త్యాగం. భారతీయ సంస్కృతి యీ త్యాగానికి పెద్దపీట వేసింది. త్యాగ ధనుల్ని ప్రాతః స్మరణీయులుగా భావించి నిత్యం ఆరాధించింది. అలాంటి త్యాగానికి సంబంధించిన ఎన్నో కథల్లో భాగవతంలోని ‘రంతిదేవుని’ చరిత్ర వినదగ్గది.

రంతిదేవుడు గొప్ప మహారాజు. తన దగ్గర వున్న సంపదనంతా ప్రజలకు దానం చేశాడు. చివరకు ఏమీలేని నిర్ధన స్థితిలో భార్యాబిడ్డలతో మిగిలిపోయాడు. తినడానికి, తాగడానికి ఏమీ లభించని పరిస్థితిలో 48 రోజులు గడిపాడు. అప్పుడు ఆయన ముందు అకస్మాత్తుగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్షమయ్యాయి. నకనకలాడే భార్యా బిడ్డలతో ఆ ఆహారాన్ని తీసుకోడానికి సిద్ధపడ్డాడు. అంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘అయ్యా ! ఆకలితో బాధపడుతున్నాను. నాకేమైనా పెట్టండి’ అని దీనంగా అడిగాడు. రంతిదేవుడు ఆ పరిస్థితిలో కూడా అతడికి సగ భాగం యిచ్చేశాడు. ఆ తరువాత మరొక అతిథి వచ్చాడు. అతడికి తన దగ్గర వున్న సగభాగం యిచ్చాడు.

వరుసగా వచ్చి అడిగే ఆర్తులతో ఆహారం అయిపోయింది. చివరకు పానీయం మాత్రమే మిగిలింది. కనీసం ఆ నీరైనా తాగి ఆకలిని తీర్చుకుందామని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ దాహార్తుడు వచ్చి మంచినీరు యివ్వమని కోరాడు. రంతిదేవుడు ఎంతో ఆప్యాయతతో “అన్నా! కష్టాలు ఎవరికైనా వస్తాయి. రా అన్నా. ఈ నీరు త్రాగు.” అని తన వద్ద మిగిలి ఉన్న మధుర పానీయాలను కూడా యిచ్చి వేశాడు. ఇదీ అసలైన త్యాగం చేసిన మహానుభావుడు రంతిదేవుడు.

అతని త్యాగానికి అంతటి విలువవుంది. అందుకనే మన త్రివర్ణ పతాకంలో త్యాగానికి ప్రతిరూపమైన కాషాయరంగుకి అగ్రస్థానం కల్పించబడింది. కాబట్టి మనమంతా ఆ త్యాగాన్ని అలవాటు చేసుకుని, ఆధునిక కవితకు అడుగుజాడ శ్రీ గురజాడ చెప్పినట్లుగా ‘సొంత లాభం కొంత మానుకో’ తోటివారికి పాటుపడదాం – మన భారత మాత కీర్తి పతాకను జగజ్జేగీయమానంగా ఎగురవేద్దాం !

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

TS 8th Class Telugu 1st Lesson Important Questions త్యాగనిరతి

I. అవగాహన – ప్రతిస్పందన:

1.1) కింది పద్యం చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అనిన ‘ననుగ్రహించితి మహా విహగోత్తమ’ యంచు సంతసం
బున శిబి తత్క్షణంబ యసి పుత్రిక నాత్మశరీర కర్తనం
బనఘుఁడు సేసి చేసి తన. యంగమునం గల మాంసమెల్లఁ బె
ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పై పద్యంలో తన శరీరం నుండి మాంసం తీసింది ఎవరు ?
జవాబు.
శిబి చక్రవర్తి

ప్రశ్న 2.
మహా విహగోత్తమ అని ఏ పక్షిని సంబోధించారు ?
జవాబు.
డేగను

ప్రశ్న 3.
త్రాసు లేదా తక్కెడ అనే అర్థంలో, పై పద్యంలో ఏ -పదాన్ని వాడారు ?
జవాబు.
‘తుల’

ప్రశ్న 4.
‘తక్కెడ’ ఎటువైపు మొగ్గు చూపింది ?
జవాబు.
పావురం వైపు

ప్రశ్న 5.
పై పద్యం ప్రకారం సంతోషంగా ఉన్నది ఎవరు ?
జవాబు.
శిబిచక్రవర్తి

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

2) కింది పద్యం చదువండి. తప్పు, ఒప్పులను గుర్తించండి.

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్న 1.
ఉప్పు కర్పూరం ఒకేలా ఉండవు.
జవాబు.
(✔)

ప్రశ్న 2.
వీటి రుచి ఒకే విధంగా ఉంటుంది.
జవాబు.
(x)

ప్రశ్న 3.
విశ్వదాభిరామ వినురవేమ అన్నది మకుటం.
జవాబు.
(✔)

ప్రశ్న 4.
పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.
జవాబు.
(✔)

ప్రశ్న 5.
ఈ శతక రచయిత వేమన.
జవాబు.
(✔)

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబిచక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారాడు. ఇంద్రుడు డేగ రూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబిచక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
శిబి ఏ పర్వతం పై యజ్ఞం చేశాడు ?
జవాబు.
భృగుతుంగ

ప్రశ్న 2.
పావురంగా మారింది ఎవరు ?
జవాబు.
అగ్ని

ప్రశ్న 3.
డేగగా మారింది ఎవరు ?
జవాబు.
ఇంద్రుడు

ప్రశ్న 4.
ఎవరికి ఎవరంటే భయం ?
జవాబు.
పావురానికి డేగ అంటే

ప్రశ్న 5.
‘యజ్ఞం’ వికృతి పదం ఏది ?
జవాబు.
జన్నం

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

II. స్వీయరచన.

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)

ప్రశ్న 1.
‘త్యాగనిరతి’ పాఠ్యభాగ కవిని గురించి రాయండి.
జవాబు.
‘త్యాగనిరతి’ పాఠము ఆదికవి నన్నయ భట్టుచే రచించబడిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలో తృతీయాశ్వాసం నుండి గ్రహించబడినది. కాలం 11వ శతాబ్దం. వాగనుశాసనుడు అను బిరుదు కూడా కలదు. ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ అను గ్రంథమునూ రచించెను. ఈయన రాజమహేంద్రవరాన్ని పాలించిన తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. నన్నయ తన కవిత్వంలో “అక్షరరమ్యత, ప్రసన్న కథా కలితార్ధ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం” ఉన్నాయని ప్రకటించాడు.

ప్రశ్న 2.
నన్నయ తన కవిత్వం గురించి ఏమని చెప్పుకున్నాడు ?
జవాబు.
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియలో ‘ఇతిహాసం’ ఒకటి. దీనిలో కథా కథనానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. రామాయణ, భారతాలను ‘ఇతిహాసాలు’ అంటారు. భారత అవతారిక యందు నన్నయ తాను రచించబోవు కావ్యమున పాటించదలచిన కొన్ని శిల్ప సంబంధమైన ఆదర్శములను పేర్కొన్నాడు. భారత పరమార్థాన్ని తెల్పడంలో ఒకచోట ‘ప్రసన్న కథా కలితార్థయుక్తి’, మరొక పద్యంలో ‘అక్షరరమ్యత’, ఇంకొక చోట ‘నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం’ అభివ్యక్తమవుతుండగా, నిశ్చలదీక్షతో నన్నయ భట్టారకుడు జగద్దితం కోసం భారత రచన చేసానని చెప్పుకున్నాడు.

“సారమతిం గవీంద్రులు ‘ప్రసన్న కథా కలితార్థయుక్తి’లో
నారసి మేలు నా నితరు’లక్షర రమ్యత’ నాదరింప’ నా
నారుచిరార్థ ‘సూక్తి నిధి’ నన్నయ భట్టు తెనుంగునన్ మహా
భారత సంహితా రచన బంధురడయ్యె జగద్దితంబుగన్”

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

ప్రశ్న 3.
‘శిబి చక్రవర్తి’ త్యాగం ద్వారా మీరు గ్రహించిన ‘నీతి’ ఏమిటి ?
జవాబు.
తనకున్న దానిలో సమాజ హితం కోసం ఫలాపేక్ష రహితంగా అర్పించడమే త్యాగం. త్యాగం ప్రత్యుపకారాన్ని ఆశించదు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయని శిబి చక్రవర్తి త్యాగ గుణానికి తార్కాణంగా నిలుస్తాడు. ఆయన త్యాగం లోకానికి ఆదర్శంగా నిలిచింది. స్వార్థాన్ని తొలగించి, ఆత్మ సంతృప్తిని కలిగించే త్యాగ గుణం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఈ పాఠం ద్వారా గ్రహించాను.

ప్రశ్న 4.
ప్రతి ఒక్కరూ ఎంతో కొంత త్యాగబుద్ధి కలిగి ఉండాలి. ఎందుకు ?
జవాబు.
ప్రతి ఒక్కరూ ఎంతో కొంత త్యాగబుద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే మానవ జన్మ దుర్లభమైంది. దానిని మనం సార్థకం చేసుకోవాలి. మనం తోటివారికి స్వార్థం వీడి, త్యాగం చేయాలి. ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నాదులను ఇవ్వాలి. బీదలకు వస్త్రాదులను పంచాలి. మనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వడం వల్ల మనకేమి తగ్గిపోదు. అంతేగాక సాయం పొందినవారు సంతోషపడతారు. అందుకే పెద్దలు ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అన్నారు.

ప్రశ్న 5.
త్యాగం వల్ల సమాజానికి జరిగే మేలేమిటి ?
జవాబు.
పరోపకారం కోసం నదులు ప్రవహిస్తున్నాయి. గోవులు పాలిస్తున్నాయి, చెట్లు పండ్లు, పూలను ఇస్తున్నాయి. మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాల నుండి ఎంతో నేర్చుకున్నాడు. అందుకే పరోపకారం పుణ్యం. పరపీడనమే పాపమని గ్రహించాడు. ప్రకృతితో మమేకమై తానూ దాతృత్వాన్ని చాటాడు. “కొలను ఎంత చిన్నదైనా, దరి చేరిన వారి దాహం తీరుస్తుంది”. సముద్రం ఎంత పెద్దదైనా ఎవరి దాహం తీర్చలేదు.” కనుక మన దగ్గర లేదని కాకుండా ఉన్నదానిలో కొంత ఇతరులకు ఇవ్వడం మానవ ధర్మం. దీనివల్ల ధనిక, పేద అనే భేదభావం తొలగిపోతుంది. కలసికట్టుగా ఉండటం వల్ల ఒకరి కష్టంలో మరొకరు సాయం అందిపుచ్చుకోవచ్చు.

“ఏ దేశంలో త్యాగమనే గుణం అపారంగా ఉంటుందో, ఆ దేశం ఉన్నత లక్ష్యాలను అందుకోవడం ఖాయం. త్యాగం ఎంత నిస్వార్థంగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది.”

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)

ప్రశ్న 1.
శిబి చక్రవర్తి గొప్పతనం గురించి మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
“త్యాగానికి మారుపేరు శిబి చక్రవర్తి” పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు.
“పరోపకార్థం ఇదం శరీరం” అన్న మాటకు నిజరూపం శిబి చక్రవర్తి. మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత, రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి త్యాగ గుణానికి తార్కాణంగా నిలుస్తాడు. పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నాడు. అగ్ని పావురంగా మారాడు. ఇంద్రుడు డేగ రూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు.

ఆకలితో ఉన్న డేగ, పావురాన్ని, విడిచిపెట్టమని శిబిని కోరింది. “శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి” అని వేదాలలో చెప్పబడింది కదా ! అప్పుడు శిబి, నీవు పక్షివైనా ధర్మం తెలిసిన దానివలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచి పెట్టడం కన్న అధర్మం వేరే ఉందా ? అని అంటాడు. ఓ రాజా ! నీవు దీని కాపాడాలనుకుంటే దాని ‘బరువుకు తగిన మాంసం నీ శరీరం నుండి నాకు పెట్టమని డేగ అడిగింది. అందుకు సంతోషించిన శిబి తన మాంసాన్ని కోసి, తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేసాడు. శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవడంతో శిబి తానే తక్కెడలో కూర్చుని ఆత్మార్పణ భావన త్యాగగుణాన్ని ప్రదర్శించాడు.

ప్రశ్న 2.
‘త్యాగ ధనుల కీర్తి శాశ్వతం’ వివరించండి.
జవాబు.
“బ్రతికినన్ని నాళ్ళు ఫలము లిచ్చుటెగాదు, చచ్చిగూడ చీల్చి యిచ్చు తనువు, త్యాగ భావమునకు తరువులే గురువులు” అన్నారు కరుణశ్రీ. మనచుట్టూ ఉన్న నదులు, గోవులు, చెట్లు, పక్షులు, మేఘాలు ఇలా అన్నీ త్యాగభావాన్ని తెలియజేస్తున్నాయి. కానీ మనలో ఏ కొద్దిమంది మాత్రమే త్యాగబుద్ధితో జీవిస్తున్నారు. త్యాగధనులకు ఆదర్శాలుంటాయి. ఇతరులకు కోరికలుంటాయి. తనకోసం చేసేది స్వార్థమైతే, ఇతరుల కోసం చేసేది త్యాగమౌతుంది.

కూడబెట్టడమే స్వభావంగా గల సముద్రుడు అట్టడుగునే ఉంటాడు. దానగుణం గల మేఘుడు ఉన్నత ఆకాశంలో ఠీవిగా గర్జిస్తుంటాడు. అలాగే త్యాగి కూడా అంతే. దధీచి దేవతల కోసం / రాక్షస సంహారం కోసం తన ఎముకలనే త్యాగం చేసి చరిత్ర పుటల్లో, మన మనస్సుల్లో నిలిచాడు. శిబి చక్రవర్తి తన తనువునే త్యాగం చేసి లోకానికి ఆదర్శంగా నిలిచాడు. ఇలా ఎందరో మహనీయులు ఆత్మార్పణం చేసి ధన్యులైనారు.

వారంతా ధనాన్ని ఆశించో లేక ఎక్కువ కాలం భూమిపై జీవించాలనో భావనతో కాక ఇహపరలోకాల్లో శాశ్వతకీర్తిని పొందే త్యాగ ధనులయ్యారు.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

III. సృజనాత్మకత

ప్రశ్న 1.
మీ గ్రామంలో ఏదేని ఒక వృత్తి గొప్పదనాన్ని తెలుపుతూ, మీ మిత్రునికి / మిత్రురాలికి లేఖ రాయండి.
జవాబు.

లేఖ

బాసర,
X X X X X.

ప్రియ మిత్రుడు/మిత్రురాలు ప్రవీణ్ కు / ప్రవీణకు,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. ఈ లేఖలో మా గ్రామంలోని స్వర్ణకార వృత్తివారలను గూర్చి తెలియజేస్తున్నాను. మెడలో హారాలు, చేతులకు కడియాలు, గాజులు, వేళ్ళకు ఉంగరాలు ………………… ఇలా ఎన్నో ఆభరణాలు ఎంతో చక్కగా తీర్చిదిద్దే స్వర్ణకారుల నైపుణ్యం ఇంత అని చెప్పలేము. బంగారాన్ని మూసలో పెట్టి బొగ్గుల కొలిమిలో ఉంచి కరిగిస్తారు. బంగారాన్ని, వెండిని వివిధ ఆకృతులుగా తీర్చిదిద్దడంలోగానీ, రత్నాలను పొదగడంలో గానీ సున్నితమైన పనితనం కనిపిస్తుంది. సన్నని వస్తువులను చేసేటప్పుడు వారికళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి కూడా. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆభరణాలు చేసే వారి నేర్పుకు, ఓర్పుకు మనం జేజేలు చెప్పాల్సిందే. మీ ఊరిలోని వృత్తివాళ్ళను గూర్చి తెలియజేయవల్సిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,/మిత్రురాలు,
కె. ఫణి/ఫణిశ్రీ.

చిరునామా :
D. ప్రవీణ్, / ప్రవీణ,
8వ తరగతి,
జగిత్యాల, కరీంనగర్ జిల్లా.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

ప్రశ్న 2.
శిబి, పావురం, డేగ మాటలను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు.

సంభాషణ

పావురం : ఓ శిబి చక్రవర్తీ ! రక్షించు! కాపాడు! నీవే నాకు దిక్కు,
శిబి : ఓ పావురమా ! ఎంత అందంగా ఉన్నావు. నీకొచ్చిన కష్టం ఏమిటి ?
పావురం : అదిగో ! వచ్చేస్తోంది. ఆ డేగ నన్ను తినాలని చూస్తోంది. రక్షించు.
శిబి : తప్పకుండా. నీ రక్షణ నాది. నీకు అభయం ఇస్తున్నాను.
డేగ : రాజా ! ఆ పావురం నాకు ఆహారం. కాన దానిని విడిచిపెట్టు.
శిబి : నీ పొట్ట నింపుకోవడానికి దీని ప్రాణాలు తీయడం తప్ప మరొక మార్గం లేదా !
డేగ : రాజా ! డేగలు పక్షులను వేటాడి చంపడం ధర్మం. ఇందులో తప్పు లేదు. అయినా దీన్ని రక్షించాలని నీవు అనుకుంటే దీనితో సమానమైన మాంసాన్ని ఇవ్వు.
శిబి : పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు.
డేగ, పావురం : నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యం కావు కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది.

ప్రశ్న 3.
డేగ, శిబి చక్రవర్తి మధ్య జరిగిన సన్నివేశాన్ని సంభాషణ రూపంలో రాయండి.
జవాబు.

సంభాషణ

డేగ : రాజా ! ఆ పావురం నాకు ఆహారం. కాన దానిని విడిచిపెట్టు.
శిబి : నీ పొట్ట నింపుకోవడానికి దీని ప్రాణాలు తీయడం తప్ప మరొక మార్గం లేదా !
డేగ : రాజా ! డేగలు పక్షులను వేటాడి చంపడం ధర్మం. ఇందులో తప్పు లేదు. అయినా దీన్ని రక్షించాలని నీవు అనుకుంటే దీనితో సమానమైన మాంసాన్ని ఇవ్వు.
శిబి : పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు.
డేగ : నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యం కావు కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

IV. భాషాంశాలు

పదజాలం:

పర్యాయపదాలు:

1. సత్యము : నిజం, యథార్థం
2. తనువు : శరీరం, దేహం, కాయం
3. హితము : మేలు, శ్రేయము
4. కపోతము : పావురము, శ్యేనము
5. పుత్రుడు : కుమారుడు, సుతుడు, ఆత్మజుడు
6. ఆగ్రహం : కోపం, కినుక, క్రోధము
7. నెత్తురు : రక్తము, రుధిరము
8. అసి : ఖడ్గము, కత్తి, కరవాలం

నానార్థాలు:

1. పాడి = న్యాయము, ధర్మము, తీర్పు
2. హితము = మేలు, లాభం, క్షేమం
3. సత్తువ = బలము, సామర్థ్యము, శక్యము
4. గుణము = స్వభావం, వింటినారి, దారము

వ్యుత్పత్త్యర్థాలు:

1. సత్యము : సత్పురుషులయందు స్థిరముగా ఉండెడిది (నిజము)
2. పక్షి : పక్షములు కలది (పిట్ట)
3. బ్రహ్మ : ప్రజలను వర్ధిల్ల చేయువాడు. (విధాత)
4. అనఘుడు : పాపము లేనివాడు (పుణ్యాత్ముడు)
5. పుత్రుడు : పున్నామ నరకము నుండి రక్షించువాడు (కుమారుడు)
6. దహనుడు : కాల్చెడి స్వభావం కలవాడు (అగ్ని)

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి -వికృతి

1. ధర్మము – దమ్మము
2. పక్షి – పక్కి
3. ఆహారం – ఓగిర
4. సంతోషం – సంతసం
5. నిత్యం – నిచ్చెలు
6. కీర్తి – కీరితి
7. ఆశ్చర్యం – అచ్చెరువు
8. రూపం – రూపు
9. అగ్ని – అగ్గి
10. త్యాగము – చాగము
11. గుణము – గొనము
12. బ్రహ్మ – బమ్మ

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
త్యాగం =
జవాబు.
త్యాగం = దానం
ఫలాపేక్ష రహితంగా అర్పించడమే త్యాగం.

ప్రశ్న 2.
ఆదర్శం =
జవాబు.
ఆదర్శం = నిలువు
శిబి చక్రవర్తి త్యాగం లోకానికి ఆదర్శంగా నిలిచింది.

ప్రశ్న 3.
వర్ధిల్లు =
జవాబు.
వర్ధిల్లు = వృద్ధి
దేశంలో సుఖశాంతులు వర్థిల్లు గాక !

వ్యాకరణాంశాలు:

1. సవర్ణదీర్ఘ సంధి :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది.
ఉదా : ఆహారార్థం = ఆహార + అర్థం
శౌర్యాది = శౌర్య + ఆది
ఇంద్రాగ్నులు = ఇంద్ర + అగ్నులు
శరణాగత = శరణ + ఆగత

2. గుణసంధి :
‘అ’ కారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
ఉదా : విహగోత్తమా = విహగ + ఉత్తమా
గుణోన్నతి = గుణ + ఉన్నతి

3. గసడదవాదేశ సంధి :
ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంగా వస్తాయి.
ఉదా : బాధసేయు = బాధ + చేయు
వచనంబుగలదు = వచనంబు + కలదు

4. యడాగమ సంధి :
సంధి లేనిచోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా : నాయాకలి = నా + ఆకలి

5. ఉత్వసంధి :
ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఉదా : ఇట్లనియె = ఇట్లు + అనియె
నేనెట్లు = నేను + ఎట్లు
త్యాగమిది = త్యాగము + ఇది
మాంసమెల్ల = మాంసము + ఎల్ల
ధర్మమెరింగి = ధర్మము + ఎరింగి

6. త్రికసంధి :
1. ఆ, ఈ, ఏ లు త్రికములనబడును. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
2. ద్విరుక్తంబగు హల్లులు పరమైనచో, ఆచ్ఛిక దీర్ఘంబునకు హ్రస్వంబగు
ఉదా : ఇప్పక్షి = ఈ + పక్షి
అక్కపోతం = ఆ + కపోతం

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

సమాసాలు:

సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు

1. సర్వభూతములు – సర్వములైన భూతములు – విశేషణ పూర్వపద కర్మధారయం
2. సత్యధర్మములు – సత్యమును, ధర్మమును – ద్వంద్వ సమాసం
3. కపోతభాగము – కపోతము యొక్క భాగము – షష్ఠీ తత్పురుష సమాసం
4. నిజరూపము – తన యొక్క రూపము – షష్ఠీ తత్పురుష సమాసం
5. నీకీర్తి – నీ యొక్క కీర్తి – షష్ఠీ తత్పురుష సమాసం
6. ఇంద్రాగ్నులు – ఇంద్రుడును, అగ్నియును – ద్వంద్వ సమాసం
7. ప్రాణభయము – ప్రాణము వలన భయము – పంచమీ తత్పురుష సమాసం
8. నాయాకలి – నా యొక్క ఆకలి – షష్ఠీ తత్పురుష సమాసం
9. వేదవచనం – వేదము యొక్క వచనం – షష్ఠీ తత్పురుష సమాసం
10. శరణాగతుడు – శరణమును పొందినవాడు. – ద్వితీయా తత్పురుష సమాసం
11. అధర్మం – ధర్మము కానిది – నఞ తత్పురుష సమాసం
12. మహిషవరాహములు – మహిషమును, వరాహమును – ద్వంద్వ సమాసం
13. వేదవిహితము – వేదము చేత విహితం – తృతీయా తత్పురుష సమాసం
14. ధరణీనాథుడు – ధరణికి నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసం

సంక్లిష్ట వాక్యం:

ప్రశ్న 1.
పావురం శిబి చక్రవర్తిని సమీపించింది. రక్షణ కోరింది.
జవాబు.
పావురం శిబి చక్రవర్తిని సమీపించి, రక్షణ కోరింది.

ప్రశ్న 2.
డేగ, పావురాలు ఇంద్రాగ్నులుగా మారారు. శిబిని ప్రశంసించారు.
జవాబు.
డేగ, పావురాలు ఇంద్రాగ్నులుగా మారి, శిబిని ప్రశంసించారు.

ప్రశ్న 3.
శిబి తన శరీరాన్ని కత్తితో కోసాడు. మాంసాన్ని తక్కెడలో ఉంచాడు.
జవాబు.
శిబి తన శరీరాన్ని కత్తితో కోసి, మాంసాన్ని తక్కెడలో ఉంచాడు.

గురులఘువులు:

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి 1

దీనిలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు ఉన్నాయి. కనుక ఇది పద్యపాదము.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు:

I:

1వ పద్యం :
ఆ॥ నిన్ను సత్య ధర్మ నిర్మలుఁగా విందు
నట్టి నీకు బాడియయ్య యిప్పు
డతి బుభుక్షితుండనై యున్న నాకు నా
హార విఘ్న మిట్టులాచరింప ?

ప్రతిపదార్థం:
నిన్ను = నిన్ను
సత్యధర్మ నిర్మలున్ + కాన్;
సత్య = సత్యాన్ని
ధర్మ = ధర్మాన్ని ఆచరించడం వల్ల
నిర్మలున్ + కాన్ = కళంకం లేనివానిగా
విందున్ = వింటున్నాడు
అట్టి = అటువంటి కీర్తి కల
నీకున్ = నీకు
ఇప్పుడు = ఇప్పుడు
బుభుక్షితుండు + ఐ + ఉన్న = మిక్కిలి ఆకలితో బాధపడుతున్న
నాకున్ = నాకు
ఆహార విఘ్నము = తిండికి ఆటంకము
ಇట్టు = ఈ విధంగా
ఆచరింప= ఆచరించడం
పాడి + అయ్య = న్యాయమా ?

భావం : ఓ శిబి చక్రవర్తీ ! నీవు సత్య, ధర్మాలను ఆచరించటంచేత కళంకం లేనివాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా ?

2వ పద్యం :
వ॥ సర్వ భూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు,
నిదినాకు, భక్ష్యంబు గానినాఁడు బుభుక్షావేదనంజేసి
ప్రాణ వియోగంబగు, నట్లయిన నా పుత్రులు
భార్యయు జీవింపనేర, రొక్క కపోతంబు రక్షించి పెక్కు
జీవులకు హింస సేయుట ధర్మవిరోధంబు

అర్థాలు:
సర్వభూతంబులు = అన్ని ప్రాణులు
ఆహారంబున = తిండి వలన
జీవించి = బ్రతికి
వర్దిల్లున్ = వృద్ధి చెందుతాయి
ఇది = ఈ పావురం
నాకు = నాకు
భక్ష్యంబు + కానినాడు = ఆహారం కాకపోయినట్లైతే
బుభుక్షా వేదనన్ + చేసి = ఆకలిబాధచేత
ప్రాణవియోగంబు + అగున్ = ప్రాణాలు పోతాయి
అట్లు + అయిన = ఆ విధంగా జరిగితే
నా పుత్రులు = నా కుమారులు
భార్యయు = భార్య
జీవింపనేరు = జీవించలేరు
ఒక్క కపోతంబు = ఒక్క పావురాన్ని
రక్షించి = కాపాడి
పెక్కు = అనేక విధములైన
జీవులకు = ప్రాణులకు
హింస + చేయుట = = హింసించడం
ధర్మ విరోధంబు = ధర్మానికి వ్యతిరేకం

భావం :
అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృద్ధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లైతే నా పిల్లలు, భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా !

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

3వ పద్యం : (కంఠస్థపద్యం)

క॥ ధర్మజ్ఞులైన పురుషులు
ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్
ధర్మముగా మదిఁ దలఁపరు
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్

ప్రతిపదార్థం:
ధర్మజ్ఞులు + ఐన = ధర్మాన్ని తెలిసినటువంటి
పురుషులు = మానవులు
ధర్మవునకు = ధర్మానికి
బాధ + చేయు = బాధ కలిగించే
ధర్మవు + ఐనన్ = ధర్మమైనదిగా
మది = మనస్సులో
తలపరు = తలచుకోరు
ధర్మువు = ధర్మమనేది
సర్వంబునకు = సమస్తమైన వాటికి
హితంబుగ = మేలు చేకూర్చేదిగా
వలయున్ = ఉండాలి.

భావం :
ధర్మం తెలిసినవారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనస్సులో తలచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి.

4వ వచనం :

వ॥. ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు.
‘శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి’ యను వేదవచనంబు
గలదు గావున దీని నాకు నాహారంబుగా నిమ్మనిన
దానికి శిబి యిట్లనియె

అర్థాలు:
ఇ + కపోతంబు = ఈ పావురము
నాకు = నాకు
వేదవిహితంబు + ఐన = శాస్త్రముచే విధింపబడిన
ఆహారంబు = ఆహారము
శ్యేనాః = డేగలు
కపోతాన్ = పావురాలను
ఖాదయంతి = తింటాయి
అను = అనునట్టి
వేదవచనంబు = వేదవాక్యము
కలదు = ఉంది
కావున = అందువల్ల
దీనినిన్ = ఈ పావురాన్ని
నాకు = నాకు
ఆహారంబుగా = ఆహారంగా
ఇమ్ము + అనిన = ఇవ్వమని అడుగగా
దానికి = ఆ డేగకు
శిబి = శిబి చక్రవర్తి
ఇట్లు = ఈ విధముగా
అని = పలికాడు

భావం :
ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. “డేగలు పావురాలను తింటాయి” అనే వేద వాక్యం ఉన్నది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వుమని అడిగిన డేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

5వ పద్యం : (కంఠస్థపద్యం)

తే॥ ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను
నాశ్రయించె నాశ్రితునెట్టి యధముఁడయిన
విడువఁడనినను నేనెట్లు విడుతు దీని ?
నాశ్రిత త్యాగమిది ధర్మువగునె ? చెపుమ

ప్రతిపదార్థం:
ప్రాణభయమున = ప్రాణభయంతో
వచ్చి = ఇక్కడికి వచ్చి
ఈ + పక్షి = ఈ పక్షి
నన్నున్ = నన్ను
ఆశ్రయించెన్ = ఆశ్రయించింది
ఆశ్రితున్ = ఆశ్రయించిన వాడిని
ఎట్టి = ఎటువంటి
అధముడు + అయిన = నీచుడైనా
విడువడు = విడిచిపెట్టడు
అనినను = అన్నా కూడా
ఏను = నేను
ఎట్లు = ఏ విధముగా
దీనిన్ = ఈ పావురాన్ని
విడుతు = విడువగలను ?
ఆశ్రిత = ఆశ్రయించినవారిని
త్యాగము = విడిచిపెట్టడం
ఇది = ఇది
ధర్మువు + అగునే = ధర్మము కాగలదా ?
చెప్పుము + ఆ = చెప్పవలసింది

భావం : “ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడయినా రక్షించుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను ? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో” నీవే చెప్పు.

II.

6వ వచనం :

వ॥ నీవు పక్షివయ్యును ధర్మమెఱింగినట్లు పలికితి, శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండెద్ది ? నీయాఁకలి దీననకాని యొంట నుపశమింపదే ? నీ యత్నం బాహారార్థం బేని యిప్పు డివ్వనంబున మృగ మహిష వరాహ ఖగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద, నిక్కపోతంబు వలని యాగ్రహం బుడుగుము, దీని నేనెట్లును విడువ’ ననిన శ్యేనం బిట్లనియె……..

అర్థాలు:
నీవు = నీవు
పక్షివి + అయ్యును = పక్షివైనా
ధర్మము = ధర్మము
ఎఱింగినట్లు = తెలిసినవానివిలాగా
పలికితి = పలికావు
శరణ + ఆగత = శరణుపొందిన వారిని
పరిత్యాగంబు + కంటె = విడిచిపెట్టడం కన్నా
మిక్కిలి = మిక్కిలి
అధర్మంబు = అధర్మము
ఎద్ది = ఏది ?
నీ ఆకలి = నీ ఆకలి
దీననకాని యొంట = ఈ పావురాన్ని తింటేగాని
ఉపశమింప = తీరదా ?
నీ యత్నం = నీ ప్రయత్నము
ఆహారార్ధంబు + పని = ఆహారం కోసమే అయితే
ఇప్పుడు = ఈ సమయంలో
ఈ + వనంబున = ఈ అరణ్యంలోని
మృగ = జింకలు
మహిష = దున్నలు
వరాహ = పందులు
దీనికంటే = ఈ పావురం కంటే
మిక్కిలిగా = ఎక్కువగా
పెట్టెద = పెడతాను
ఈ + కపోతంబు వలనె = ఈ పావురము పై
ఆగ్రహంబు = కోపము
ఉడుగుము = తగ్గించుకొనుము
దీనిన్ = దీనిని
నేను = నేను
ఎట్లును = ఏ విధముగాను
విడువను = విడిచిపెట్టను
అనిన = అని పలుకగా
శ్యేనంబు = డేగ
ఇట్లు = ఈ విధముగా
అనియె = పలికింది

భావం :
నీవు పక్షివి ఐనప్పటికీ ధర్మం తెలిసిన దానివలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టటం కన్న అధర్మం మరొకటుంటుందా ? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా ? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు ? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీని కన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచి పెట్టు. దీన్ని మాత్రం నేను విడువను. అని శిబి చెప్పగా డేగ ఇట్లా బదులు పలికింది.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

7వ పద్యం :
ఆ॥ నాకు విహిత భక్షణంబిది; యిప్పక్షిఁ
బూని కావ నీకు బుద్దియేని
యవని నాథ! దీని యంత నీ మాంసంబు
దూచి నాకుఁ బెట్టు తొలగ కిపుడ

ప్రతిపదార్థం:

అవని నాథ ! = ఓ మహారాజా !
నాకు = నాకు
ఈ + పక్షి = ఈ పక్షి
విహిత భక్షణంబు = ప్రకృతి చేత నిర్ణీతమైన ఆహారము
ఈ పక్షికిన్ = ఈ పావురాన్ని
కావ = రక్షించాలని
నీకు = నీకు
బుద్ధియేని = ఆలోచన ఉన్నట్లైతే
దీని + అంత = దీని బరువంత
నీ మాంసంబు = నీ మాంసాన్ని
తూచి = సరిచూచి
నాకున్ = నాకు
తొలగక = మానక
ఇపుడు + ఆ = ఇప్పుడే
పెట్టు = పెట్టుము

భావం :
“ఓ రాజా ! ఈ పావురం నాకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే, దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు పెట్టు”మని అడిగింది.

8వ పద్యం (కంఠస్థ పద్యం) :
చ॥ అనిన ‘ననుగ్రహించితి మహా విహగోత్తమ’ యంచు సంతసం
బున శిబి తత్క్షణంబ యసి పుత్రిక నాత్మశరీర కర్తనం
బనఘుఁడు సేసి చేసి తన యంగమునం గల మాంసమెల్లఁ బె
ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్

ప్రతిపదార్థం:

అనినన్ = అని చెప్పగా
మహత్ = గొప్పవాడివైన
విహగ + ఉత్తమ = పక్షులలో శ్రేష్ఠమైనవాడా !
ననున్ = నన్ను
అనుగ్రహించితి = అనుగ్రహించావు
అంచు = అంటూ
అనఘుడు = పాపరహితుడైన
శిబి = శిబి చక్రవర్తి
సంతసంబున = సంతోషంతో
తత్ + క్షణంబు = ఆ క్షణంలోనే
అసిపుత్రికన్ = చిరుకత్తితో
ఆత్మ = తన యొక్క
శరీర = శరీరాన్ని
కర్తనంబు సేసి చేసి = కత్తిరించి కోసి కోసి
తన = తన యొక్క
అంగమునన్ = అవయవాల యందు గల
మాంసము + ఎల్లన్ = మాంసమునంతటిని
పెట్టినను = సమర్పించిననూ
ఆ + తులన్ = ఆ త్రాసులో
కపోతభాగము = పావురం ఉన్న పక్షమే
కడిందిగ = మిక్కిలిగా
డిందుచున్ = దిగిపోతూ
ఉండెన్ = ఉన్నది

భావం :
అనగా సంతోషించిన శిబి పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు. అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

9వ పద్యం :

క॥ దానికి నచ్చెరువడి ధర
ణీ నాథుఁడు తనువు నందు నెత్తురు దొరుఁగం
దాన తుల యెక్కె నంతన్
వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్

ప్రతిపదార్థం:

దానికిన్ = దానికి
ధరణీ నాథుడు = భూ భర్త అయిన శిబి
అచ్చెరువు + పడి = ఆశ్చర్యం పొంది
తనువునందు = శరీరమందు
నెత్తురు = రక్తము
తొరుగన్ = కారుతుండగా
తాన్ = తాను
తుల + ఎక్కెన్ = త్రాసులోకి ఎక్కగా
అంతన్ = అంతట
వాసవ దహనుల్ = ఇంద్రుడు, అగ్ని
వాని = ఆ శిబి చక్రవర్తి యొక్క
గుణ + ఉన్నతికి = శిబి చక్రవర్తి యొక్క గొప్ప గుణాలను
మెచ్చి = మెచ్చుకొని

భావం :
తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవటంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు. ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్ని దేవుడు మెచ్చుకొని………..

10వ వచనం :

వ॥ శ్యేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబులఁ
జూపి ‘నీధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు
గావున నీకీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత
కాలంబు వర్తిల్లుచుండు’ మని శిబికి వరంబిచ్చి యింద్రాగ్నులు చనిరి.

అర్ధాలు:

శ్యేనకపోత రూపంబులు = డేగ, పావురాల యొక్క రూపాలు
విడిచి = విడిచిపెట్టి
నిజరూపంబులన్ = తమ సహజ రూపాలను
జూపి = చూపించి
నీధైర్య శౌర్యాది = నీ ధైర్య పరాక్రమాది
గుణంబులు = గుణాలు
అనన్య సాధారణంబులు = ఇతరులలో ఉన్నవి కావు
కావున = అందువల్ల
నీకీర్తి = నీ యశస్సు
నిత్యంబై = శాశ్వతమై
శబ్ద బ్రహ్మంబు = శబ్దబ్రహ్మము
కల + అంతకాలంబును = ఉన్నంత కాలం వరకు
వర్ధిల్లుచున్ + ఉండెడు + అని = వ్యాపించి ఉంటుందని
శిబికి = శిబి చక్రవర్తికి
వరంబు = వరాన్ని
ఇచ్చి = అనుగ్రహించి
ఇంద్ర + అగ్నులు = ఇంద్రుడు, అగ్ని
చనిరి = వెళ్ళారు

భావం :
డేగ, పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు, అగ్ని వారి నిజరూపాలతో సాక్షాత్కరించి “నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యం కావు. కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని వెళ్ళిపోయారు.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

పాఠం నేపథ్యం:

పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబిచక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారాడు. ఇంద్రుడు డేగరూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబిచక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది.

ప్రక్రియ ఇతిహాసం:

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియలో ‘ఇతిహాసం’ ఒకటి. ఇతిహాసం అంటే ‘ఇది ఇట్లా జరిగింది’ అని అర్థం. ఇందులో కథాకథనానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఇది గ్రంథస్థం కాక ముందు వాగ్రూపంలో ఉండేది. రామాయణ, భారతాలను ‘ఇతిహాసాలు’ అని అంటారు.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే ‘ఇది ఇట్లా జరిగింది’ అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాక ముందు వాగ్రూపంలో ఉండేవి. భారత, రామాయణాలను ఇతిహాసాలు అంటారు.

ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

కవి పరిచయం:

కవి పేరు : నన్నయ భట్టు
పాఠ్యభాగం పేరు : త్యాగనిరతి
కాలం : 11వ శతాబ్దం
రచనలు : మహాభారతంలోని ఆది, సభా పర్వాలు పూర్తిగాను, అరణ్యపర్వంలో 4వ ఆశ్వాసంలోని “శారదరాత్రులు” అనే పద్యం వరకు, ఆంధ్రశబ్ద చింతామణి.
బిరుదులు : ఆదికవి, వాగనుశాసనుడు.

శైలి : ఈయన శైలి మూడు విధాలు :

  1. అక్షరరమ్యత
  2. ప్రసన్నకథా కలితార్థయుక్తి
  3. నానారుచిరార్థసూక్తి నిధిత్వం.

విశేషాంశాలు : ఈయన రాజమహేంద్రవరాన్ని పాలించిన తూర్పుచాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి. ఇతనికి మహాభారత రచనలో నారాయణ భట్టు సహకరించాడు.

విద్యార్థులకు సూచనలు:

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న “పదవిజ్ఞానం” పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

ప్రవేశిక:

మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత, రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. అది ఎట్లానో తెలుసుకుందాం.

పాఠ్యభాగ సారాంశం:

ఒక డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. ఆ పావురం డేగ నుండి తప్పించుకొని శిబి చక్రవర్తిని సమీపించింది. రక్షణ కోరింది. అదే సమయంలో డేగ శిబిని సమీపించింది. తనకు ఆహారంగా లభించిన పావురాన్ని విడిచిపెట్టమని శిబిని కోరింది. అది విని శిబి – “నీ పొట్ట నింపుకోవడానికి దీని ప్రాణాలు తీయడం తప్ప మరొక మార్గం లేదా !” అని ప్రశ్నించాడు.

డేగ శిబి మాటలు విని “రాజా ! డేగలు పక్షులను వేటాడి చంపడం ధర్మం. ఇందులో తప్పు లేదు. అయినా దీన్ని రక్షించాలని నీవు అనుకుంటే దీనితో సమానమైన మాంసాన్ని ఇవ్వు” అని అడిగింది. ఆ వెంటనే సంతోషించిన శిబి చక్రవర్తి తన శరీరాన్ని కత్తితో కోసి, మాంసపు ముద్దను తక్కెడలో ఉంచాడు. ఎంత మాంసాన్ని ఉంచినా పావురం ఉన్న త్రాసుపళ్ళెం పైకి లేవలేదు. చివరకు తానే ఆ త్రాసులో కూర్చోవాలనుకున్నాడు. పిమ్మట డేగ, పావురాలు తమ తమ నిజరూపాలను ప్రదర్శించాయి. ఇంద్రాగ్నులుగా మారి శిబి చక్రవర్తి త్యాగాన్ని ప్రశంసించారు. శిబి చక్రవర్తి త్యాగం లోకానికి ఆదర్శంగా నిలిచింది.

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu Guide 1st Lesson త్యాగనిరతి 2

Leave a Comment