TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download అపరిచిత గద్యాలు Questions and Answers.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

అపరిచిత గద్యాలు (మార్కులు 5):

1. కింది గద్యభాగాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

“శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దివాడు. సాహిత్యంపై ప్రత్యేక అభిమానం కలవాడు. భువనవిజయమనే సభామండపంలో సాహిత్యగోష్ఠి నిర్వహించేవాడు. అనేక కవి పండితులను పోషించేవాడు. ఆయన ఆస్థానంలోని ఎనిమిది మంది ప్రసిద్ధ కవులను అష్టదిగ్గజాలు అని పిలిచారు. అందులో అల్లసాని పెద్దన అగ్రగణ్యుడు. వారిలో తెనాలి రామకృష్ణుడు వికటకవిగా పేరు పొందాడు. రాయలు రాజు మాత్రమే కాదు, కవి కూడా. దేశభాషలందు తెలుగు లెస్స అని చాటాడు. ఆయన కాలం తెలుగుభాషకు స్వర్ణయుగమై భాసిల్లింది.

ప్రశ్నలు:

1. శ్రీకృష్ణదేవరాయలు ఏ కాలము వాడు ?
2. శ్రీకృష్ణదేవరాయల సభాభవనం పేరు ఏమి ?
3. ‘అష్టదిగ్గజాలు’ అంటే ఎవరు ? వారిలో అగ్రగణ్యుడు ఎవరు ?
4. తెలుగుభాషకు ఎవరి కాలం స్వర్ణయుగం ?
5. తెనాలి రామకృష్ణుడు ఏ విధంగా పేరు పొందాడు ?

2. కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

“ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని, తెలుగునేలను వైభవ స్థితిలో నిలిపిన కాకతీయ రాజులలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. అతడు ఉత్తమ పరిపాలకుడు మాత్రమే కాదు, మానవ ధర్మాన్ని, కళామర్మాన్ని ఎరిగిన సాహితీమూర్తి. సంస్కృతాంధ్రభాషల్లో అనుపమానమైన పాండిత్యాన్ని సొంతం చేసుకున్న సత్కవీంద్రుడు. సంగీత సాహీత్య నృత్య చిత్రలేఖన శిల్పకళలకు ఇతోధిక ప్రాధాన్యత నిచ్చి, వాటి విస్తృతికి విశేష సహకారమందించిన రసహృదయుడు, సహృదయుడు. ఎంతటి మహోన్నతులకయినా, చంద్రునిలో మచ్చలా ఏవో బలహీనతలుంటాయి. వేట ప్రతాపరుద్రుని బలహీనత. క్రమం తప్పకుండా వేట వినోదాన్ని ఆస్వాదించేవాడు ప్రతాపరుద్రుడు. ఆ వ్యసనం నుండి మహారాజును దూరం చేయాలని ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయినాడు మంత్రి యుగంధరుడు.

ప్రశ్నలు:

1. కాకతీయుల రాజధాని ఏది ?
2. రెండవ ప్రతాపరుద్రుడు ఏయే భాషల్లో పండితుడు ?
3. ప్రతాపరుద్ర చక్రవర్తి యొక్క బలహీనత ఏమిటి ?
4. యుగంధరుడు ఎవరు ?
5. ప్రతాపరుద్రుడు లలితకళలను ఎలా పోషించాడు ?

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

3. కింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

“ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో, నరసరావుపేటకు ఏడుమైళ్ళ దూరంలో “కోటప్పకొండ” ఉంది. ఆ కొండ మీద 600 అడుగుల ఎత్తున కోటేశ్వర స్వామి గుడి ఉంది. పూర్వపు శాసన ఆధారాలను బట్టి క్రీ.శ. 11వ శతాబ్దానికే ఈ గుడి ఉందని తెలుస్తోంది. ఈ కొండ ఎత్తు 1587 అడుగులు. ఈ కొండ చుట్టూ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న నీటి గుంటలున్నాయి. వీనిని “దొనలు” అంటారు. ఈ కొండ మధ్యలో “పాపనాశనము” అనే తీర్థం ఉంది. ఇది శివుడు త్రిశూలంతో కొడితే ఏర్పడింది. దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.

ప్రశ్నలు:

1. కోటప్ప కొండ ఎక్కడ ఉంది ?
2. కోటప్ప కొండపై ఎవరి గుడి ఉంది ? అది ఎంత ఎత్తు ?
3, కోటప్ప కొండపైనున్న గుడి యొక్క ప్రాచీనత ఎట్టిది ?
4. దొనలు అంటే ఏమిటి ?
5. పాపనాశనం తీర్థం ప్రత్యేకత ఎటువంటిది ?

4. కింది గద్యభాగాన్ని చదువండి. కింద ఇచ్చిన ఐదు వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి బ్రాకెట్లలో రాయండి.

“అంతరించిపోతున్న తెలుగుభాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాలవైపు దృష్టిని సారించాడాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని. వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని, ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి
పొందాయి.

వాక్యాలు:

ప్రశ్న 1.
కందుకూరి పూర్తిపేరు వీరేశలింగం పంతులు.
జవాబు.
ఒప్పు

ప్రశ్న 2.
చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం.
జవాబు.
తప్పు

ప్రశ్న 3.
సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించాడాయన.
జవాబు.
తప్పు

ప్రశ్న 4.
కందుకూరి గొప్ప సంఘసంస్కర్త.
జవాబు.
ఒప్పు

ప్రశ్న 5.
తెలుగుభాషా సంస్కృతులను పునరుజ్జీవింపచేశారు కందుకూరి.
జవాబు.
ఒప్పు

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

5. కింది పేరా చదువండి. క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“జీవావరణం మీద, పర్యావరణం మీద మనుష్యులు ఇంత కక్ష కట్టారెందుకో? ఇలా ఉన్న చెట్లన్నింటినీ నరికేసుకుంటూ పోతే, చివరికి మనిషికి మిగిలేదేమిటి ? అయినా ఇప్పటికే అనుభవిస్తున్నారు కదా ! గ్రీన్ హౌజ్ ఎఫెక్టునీ……… ఆమ్ల దర్పాలనీ, ఆధునిక కాలుష్యకారక సమస్యలన్నింటికీ చెట్లు నరికివేతే కారణమని, ఈ మానవమేధావులే తేల్చి చెబుతారు. మళ్ళీ ఉన్న చెట్లన్నింటినీ నరికి భవనాలూ, నగరాలూ నిర్మిస్తారు. వాళ్ళ అభివృద్ధి ఎటు పోతోందో వాళ్ళకే అర్థం కావడం లేదు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
కాలుష్యానికి కారణం ఏమిటి ?
జవాబు.
కాలుష్యానికి కారణం చెట్లు నరికివేత,

ప్రశ్న 2.
మానవులు చెప్పేదే చేస్తున్నారా ?
జవాబు.
లేదు. మనుషులు జీవావరణ, పర్యావరణాలపై కక్ష కట్టారు.

ప్రశ్న 3.
మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేస్తోందా ?
జవాబు.
మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేయడం లేదు.

ప్రశ్న 4.
చెట్లు లేకపోతే ఏమౌతుంది ?
జవాబు.
చెట్లు లేకపోతే

  1. గ్రీన్ హౌజ్ ఎఫెక్టు
  2. ఆమ్ల దర్పాలు కలుగుతాయి.

ప్రశ్న 5.
పై పేరా దేనిని బోధిస్తోంది ?
జవాబు.
పై పేరా పర్యావరణ పరిరక్షణను గురించి చెపుతోంది.

6. కింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

“శ్రీ రావూరి భరద్వాజగారు స్వయంకృషితో సామాన్యుడి స్థాయి నుండి సమున్నత స్థాయి వరకు ఎదిగిన తపస్వి. ఆయన చదువు అంతంతమాత్రమే. ఆంగ్లం అసలే తెలియని ఆయన తన బలహీనతలన్నీ సవరించుకొని, తనదైన సొంత శైలిలో రచనలు చేపట్టారు. అనేక కథలు, నవలలు రాశారు. “పిడికెడు మెతుకుల కోసం – నేను వ్యవసాయ కూలీగా పనిచేశాను.” వారి గురించి వారే చెప్పిన మాటలివి. ‘ఒకానొక అవమానం, నన్ను చదువు వైపు మళ్ళించింది.” ఇవి కూడా వారి మాటలే…….అటువంటి వీరిని “జ్ఞానపీఠం” అనే అత్యున్నత పురస్కారం
వరించింది.

ప్రశ్నలు:

1. రావూరి భరద్వాజగారి ప్రత్యేకత ఎట్టిది ?
2. భరద్వాజగారు తన గురించి తానే చెప్పుకున్న మాటలు ఏవి ?
3. భరద్వాజగారిని వరించిన విశిష్ట పురస్కారం ఏది ?
4. భరద్వాజగారి పాండిత్యం ఎటువంటిది ?
5. భరద్వాజగారు ఏమి రచించారు ?

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

7. కింది గద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి.

“పూర్వం నుండి మనకు తులసి, రావి, వేపచెట్లను పూజించే సంప్రదాయం ఉంది. అనాది నుండి మనం తులసిని దేవతగా పూజిస్తూ వస్తున్నాం. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. పూర్వకాలంలో తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులు వచ్చినప్పుడు రోగి దగ్గర వేపాకులు ఉంచేవారు. వేపాకులను ఒంటికి రాసేవారు.

స్నానం చేయించే ముందు వేపాకులు ముద్దగా నూరి, నూనె, పసుపు కలిపి ఒంటికి రాసేవారు. ఎందుకనగా, తట్టు, ఆటలమ్మ వస్తే దేహంపై పొక్కులు వస్తాయి. కొన్ని పచ్చిగా ఉండి దురద పెడ్తుంది. అలా దురద రాకుండా ఉండడానికి, గోకటం మానడానికి, ఈ వేపాకు, పసుపు దోహదపడతాయి. ఈ రకంగా వైద్యశాస్త్రానికి సంబంధించిన వేప, సంస్కృతీపరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకొంది.

వాక్యాలు:

ప్రశ్న 1.
తులసిని మనము నేడు దేవతగా పూజిస్తున్నాం.
జవాబు.
తప్పు

ప్రశ్న 2.
తులసిలో ఔషధ గుణాలున్నాయని శాస్త్రజ్ఞుల కథనం.
జవాబు.
ఒప్పు

ప్రశ్న 3.
వేపకు వైద్యశాస్త్రంలోనే ప్రాధాన్యత ఉంది.
జవాబు.
తప్పు

ప్రశ్న 4.
దురద రాకుండా, గోకకుండా పసుపు, వేపాకులు ఉపయోగపడతాయి.
జవాబు.
ఒప్పు

ప్రశ్న 5.
తట్టు, ఆటలమ్మ వ్యాధులకు, పూర్వం వైద్యం లేదు.
జవాబు.
తప్పు

8. కింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

“పింగళి వెంకయ్య గారు గతంలో మిలటరీ సర్వీసు చేసినందుకు, అప్పటి బ్రిటిష్ భారతప్రభుత్వం బెజవాడ చిట్టినగర్లో ఇచ్చిన స్థలంలో పూరిగుడిసె వేసుకొని కాలాన్ని గడిపారు. వెంకయ్య మీద భక్తిశ్రద్ధలు గల పెద్దలు డాక్టరు కె.ఎల్.రావు, జి.యన్.రాజు వంటివారు జనవరి 15వ తేదీ 1963లో సన్మానం చేసి కొంత నిధిని అందించారు. ఆ తర్వాత ఆరు నెలలకే అంటే 1963 జూలై 4న వెంకయ్య కీర్తి శేషులయ్యారు. తన మృతదేహం మీద జాతీయ పతాకాన్ని కప్పాల్సిందిగా వెంకయ్య కోరారు. శ్మశానం దగ్గర దాన్ని తీసి, రావిచెట్టుకు కట్టమన్నారు. ఆయన చివరి కోరిక నెరవేరింది.

ప్రశ్నలు:

1. పింగళి వెంకయ్యగారు ఏ శాఖలో ఉద్యోగం చేశారు ?
2. నాటి బ్రిటిష్ భారతప్రభుత్వం, వెంకయ్య గారికి ఎక్కడ స్థలం ఇచ్చింది ?
3. వెంకయ్యగారికి 1963లో సన్మానం చేసిన పెద్దలు ఎవరు ?
4. వెంకయ్యగారు ఎప్పుడు కీర్తిశేషులయ్యారు ?
5. వెంకయ్యగారి చివరి కోరిక ఏమిటి?

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

9. కింది గద్యాన్ని చదివి, దిగువ నిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఉప్పు సత్యాగ్రహంలో లక్ష్మీబాయమ్మ స్త్రీలకు నాయకురాలిగా ఉండి, ‘దేవరంపాడు’ శిబిరానికి ప్రాతినిధ్యం వహించేది. ఈ శిబిరం బాగా పనిచేసిందని ప్రశంసలు పొందింది. వివిధ గ్రామాల నుండి వందలమంది సత్యాగ్రహులు ఈ శిబిరానికి వచ్చేవారు. వారిని పోలీసులు అరెస్టు చేసేవారు. అయినా స్త్రీలు భయపడక ధైర్యంగా వారినెదుర్కొన్నారు. మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయినా లక్ష్మీబాయమ్మ నాయకత్వంలోని స్త్రీలు జంకలేదు. సత్యాగ్రహం మానలేదు.

శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులోను, దుర్గాబాయమ్మ చెన్నపురిలోను, రుక్మిణమ్మ వేదారణ్యంలోనూ మరికొందరు స్త్రీలు భిన్న ప్రాంతాలలోనూ చూపిన సాహసోత్సాహములు, ఆంధ్రుల ప్రతిష్ఠను విస్తరింపజేశాయి | అని ఆంధ్రపత్రిక 1932లో వీరిని ప్రశంసించింది.”

ప్రశ్నలు:

ప్రశ్న 1.
లక్ష్మీబాయమ్మ ఉప్పు సత్యాగ్రహంలో ఏ శిబిరానికి నాయకత్వం వహించింది ?
జవాబు.
లక్ష్మీబాయమ్మ ‘దేవరంపాడు’ శిబిరానికి నాయకత్వం వహించింది.

ప్రశ్న 2.
సత్యాగ్రహులు శిబిరానికి ఎక్కడ నుండి వచ్చేవారు ?
జవాబు.
సత్యాగ్రహులు వివిధ గ్రామాల నుండి శిబిరానికి వచ్చేవారు.

ప్రశ్న 3.
ఎన్నిసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు ?
జవాబు.
మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

ప్రశ్న 4.
గుంటూరు ఉప్పు సత్యాగ్రహానికి నాయకురాలు ఎవరు ?
జవాబు.
శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులో నాయకత్వం వహించింది.

ప్రశ్న 5.
ఆంధ్రపత్రిక స్త్రీల ఉప్పు సత్యాగ్రహంపై ఏమి రాసింది ?
జవాబు.
వివిధ ప్రాంతాల్లో స్త్రీలు చూపిన సాహసోత్సాహాలు, ఆంధ్రుల ప్రతిష్ఠను విస్తరింపజేశాయని ఆంధ్రపత్రిక రాసింది.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

10. కింది గద్యాన్ని చదివి, దిగువ నిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“MIT లో అబ్దుల్ కలాం ఆలోచనను ప్రొఫెసర్లు స్పాండర్, కే.ఏ.వి. పండవై, నరసింగరావు గార్లు తీర్చిదిద్దారు. వారు వారి నిశిత బోధన వల్ల ఏరోనాటిక్స్ పట్ల కలాంలోని జ్ఞానతృష్ణను మేల్కొల్పారు. క్రమంగా విస్తృత పరిజ్ఞానమును కలాంగారి మనస్సు సమీకరించుకొంది. విమాన నిర్మాణాంశాల ప్రాముఖ్యం తెలిసింది. పై ముగ్గురు ప్రొఫెసర్లు, వారి శ్రేష్ఠమైన వ్యక్తిత్వాలతో కలాంగారికి సహకరించారు.

అబ్దుల్ కలాం రెండురోజుల్లో విమాన నిర్మాణం డిజైన్ పూర్తి చేసి శ్రీనివాసన్ గారి మెప్పును పొందారు. వీడ్కోలు సభలో ప్రొఫెసర్ స్పాండర్, కలాంగారిని తనతోపాటు కూర్చో పెట్టుకొని ఫోటో తీయించుకున్నారు. “మన విమానాన్ని మనమే తయారుచేసుకుందాం” అనే వ్యాసాన్ని తమిళంలో రాసి అబ్దుల్ కలాంగారు బహుమతిని పొందారు. కలాంగారు బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటికల్లో ట్రైనీగా చేరి, ఇంజన్ వోవర్ హాలింగ్లో పనిచేసి వీరు ఎంతో అనుభవాన్ని గడించారు. తరువాత వైమానిక దళంలో ఉద్యోగిగా చేరి ఎంతో మంచి అనుభవాన్ని గడించారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
MIT లో కలాం గారి ఆలోచనలను తీర్చిదిద్దిన ప్రొఫెసర్లు ఎవరు ?
జవాబు.
MIT లో కలాంగారి ఆలోచనలను తీర్చిదిద్దినవారు

  1. ప్రొఫెసరు స్పాండర్
  2. కే.ఏ.వి పండవై
  3. నరసింగరావుగారు

ప్రశ్న 2.
కలాంగారి జ్ఞానతృష్ణను మేల్కొల్పిన వారు ఎవరు ?
జవాబు.
స్పాండర్, పండవై, నరసింగరావు గారు అనే ప్రొఫెసర్లు కలాంగారిలోని జ్ఞానతృష్ణను మేల్కొల్పారు.

ప్రశ్న 3.
కలాంగారు విమాన నిర్మాణం డిజైన్ ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు ?
జవాబు.
కలాంగారు విమాన నిర్మాణం డిజైన్ను రెండురోజుల్లో పూర్తి చేశారు.

ప్రశ్న 4.
బెంగళూరులో కలాంగారు ఏ సంస్థలో చేరి, శిక్షణను పూర్తి చేసుకున్నారు ?
జవాబు.
కలాంగారు బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటికల్లో ట్రైనీగా చేరారు.

ప్రశ్న 5.
తమిళంలో ఏ వ్యాసం రాసి కలాంగారు బహుమతిని పొందారు ?
జవాబు.
మన విమానాన్ని మనమే తయారుచేసుకుందాం’ అనే వ్యాసాన్ని కలాం గారు తమిళంలో రాసి బహుమతిని పొందారు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

11. కింది గద్యాన్ని చదివి, దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“గోల్కొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్షా విద్యాప్రియుడు. ఈతని ఆస్థానములో కవులు, పండితులు హిందువులలో, మహమ్మదీయులలో ఉండిరి. విద్యాగోష్ఠి సాగుచుండెను. పాదుషావారు పండితులను బాగుగా సన్మానించుచుండిరి. ఇబ్రహీం కుతుబ్షా చాలాకాలం విజయనగరము నందు రాజాదరణమున పెరిగిన వాడగుటచే ఆంధ్రభాషా మాధుర్యమును గ్రోలినవాడు. ఆంధ్రభాషయందు అభిమానము గలిగి ఆంధ్రకవులను సత్కరించు చుండెను.

అద్దంకి గంగాధర కవి ‘తపతీ సంవరణోపాఖ్యాన కావ్యము’ను రచించి, ఈ పాదుషాకు అంకితమిచ్చియున్నాడు. ఇబ్రహీం పాదుషా సేనానియైన అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్రమునకు కృతిభర్త.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
విద్యాప్రియుడయిన గోల్కొండ చక్రవర్తి ఎవరు ?
జవాబు.
విద్యాప్రియుడయిన గోల్కొండ నవాబు “ఇబ్రహీం కుతుబ్షా”.

ప్రశ్న 2.
ఇబ్రహీం కుతుబ్షాకు తెలుగుభాషా మాధుర్యము ఎలా తెలిసింది ?
జవాబు.
ఇబ్రహీం కుతుబ్షా చాలాకాలం విజయనగరంలో రాజాదరణలో పెరిగాడు. అందువల్ల ఆయనకు ఆంధ్రభాషా మాధుర్యము తెలిసింది.

ప్రశ్న 3.
తపతీ సంవరణోపాఖ్యానమును అంకితముగొన్న ప్రభువు ఎవరు ?
జవాబు.
తపతీ సంవరణోపాఖ్యానాన్ని ‘ఇబ్రహీం కుతుబ్షా’ అంకితం తీసుకొన్నాడు.

ప్రశ్న 4.
యయాతి చరిత్రను అంకితం పొందినది ఎవరు ?
జవాబు.
యయాతి చరిత్రను ఇబ్రహీం కుతుబ్షా సేనాని అమీరాఖాన్’ అంకితం పొందాడు.

ప్రశ్న 5.
అద్దంకి గంగాధర కవి రాసిన కావ్యం ఏది ?
జవాబు.
అద్దంకి గంగాధర కవి “తపతీ సంవరణోపాఖ్యానము” అనే కావ్యాన్ని రాశాడు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

12. కింది గద్యాన్ని చదివి, దిగువనిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“విద్యారణ్యుల వారి ఆశీర్వాదంతో సంగమ వంశరాజులు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1335లో స్థాపించారు. వీరు కళలను పోషిస్తూ, కవులను ఆదరిస్తూ, ఆశ్రితులకు అగ్రహారాలు ఇస్తూ క్రీ.శ 1485 దాకా పాలించారు. ఈ వంశంలోని కడపటి రాజులు అతి దుర్భలులై అవినీతిపరులుగా మారినందువల్ల వీరి కొలువులోనే ఉన్న దండనాయకుడు సాళువ నరసింహరాయలు సామ్రాజ్యాన్ని సంరక్షించడానికి క్రీ.శ 1485లో అధికారాన్ని హస్తగతం చేసుకొని వజ్ర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు తాళ్ళపాక అన్నమయ్యగారిని సత్కరించి సంకీర్తనలను ప్రోత్సహించాడు. పిల్లలమణ్ణి పినవీరయ్యను పోషించి కృతి పుచ్చుకున్నాడు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
సంగమరాజులు ఎవరి ప్రోత్సాహంతో ఎప్పుడు, ఏ రాజ్యం స్థాపించారు ?
జవాబు.
సంగమరాజులు, విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో 1335లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.

ప్రశ్న 2.
సంగమ వంశరాజులు పాలించిన సామ్రాజ్యం ఏది ?
జవాబు.
సంగమ వంశీయులు పాలించిన రాజ్యం విజయనగర సామ్రాజ్యం.

ప్రశ్న 3.
సాళువ నరసింహరాయలు ఎవరు ? ఎప్పుడు అతడు విజయనగర సామ్రాజ్య పాలకుడయ్యాడు ?
జవాబు.
సాళువ నరసింహరాయలు సంగమ వంశరాజుల దండనాయకుడు. ఇతడు 1485లో విజయనగర పాలకుడయ్యాడు.

ప్రశ్న 4.
పిల్లలమఱి పినవీరయ్యను పోషించిన ప్రభువు ఎవరు ?
జవాబు.
పిల్లలమర్రి పినవీరయ్యను సాళువ నరసింహరాయలు పోషించాడు.

ప్రశ్న 5.
సంకీర్తనాచార్యుడు అన్నమయ్యకు ఏ రాజు ప్రోత్సాహం లభించింది ?
జవాబు.
అన్నమయ్యకు సాళువ నరసింహరాయల ప్రోత్సాహం లభించింది.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

13. కింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

“తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాల్లో మనుచరిత్రను మొట్టమొదట లెక్కపెడతారు. ఆంధ్రప్రబంధ కవులలో ప్రధమపూజ అల్లసాని పెద్దన గారికే చేస్తారు. ఆదికవులు, కవిబ్రహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు, కవి సార్వభౌములు మొదలైన ఆజానుబాహులు ఎందరున్నా, మన సాహితీ రంగంలో ఒక జానెడు ఎత్తుగా కనిపించే జాణ ఆంధ్రకవితా పితామహ బిరుదాంకితులు అల్లసాని పెద్దనగారే. దీనికి కారణం కృష్ణరాయలవారు అందరికన్నా పెద్దనగారికి పెద్దపీట వేయడమే కాదు. ఆయన సహజంగా ఉన్నతుడు. దానికి కారణం ఆయనలో పూర్వకవుల శుభలక్షణాలన్నీ కేంద్రీకృతం అయ్యాయి.

ప్రశ్నలు:

1. తెలుగు పంచకావ్యాల్లో మొదట లెక్కపెట్టదగిన కావ్యం ఏది ?
2. ఆంధ్ర ప్రబంధ కవులలో ఎవరిని శ్రేష్ఠునిగా గౌరవిస్తారు ?
3. ‘ఆంధ్రకవితా పితామహుడు’ అనే బిరుదు పొందిన కవి ఎవరు ?
4. పెద్దన కవి సహజంగా ఉన్నతుడు కావడానికి కారణం ఏమిటి ?
5. పెద్దన గారిని ఆదరించిన కవి రాజు ఎవరు ?

14. కింది వచనాన్ని చదివి, దాని దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“సాహితీ సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన గీతం’, ‘గీతాంజలి’. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా, అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతి నికేతన్’ పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి, ‘గురుదేవుడు’ గా కీర్తింపబడ్డారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి ఎవరు ?
జవాబు.
అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి “రవీంద్రనాథ్ ఠాగూర్”.

ప్రశ్న 2.
ఏ రెండు దేశాలకు ఠాగూర్, జాతీయ గీతాలను అందించాడు ?
జవాబు.
భారత్, బంగ్లాదేశ్లకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు.

ప్రశ్న 3.
రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన విద్యాసంస్థ ఏది ?
జవాబు.
రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతినికేతన్’ అనే విద్యాసంస్థను నెలకొల్పాడు.

ప్రశ్న 4.
రవీంద్రుని ప్రసిద్ధ రచనలు రెండింటిని రాయండి.
జవాబు.
రవీంద్రుడు 1) గీతాంజలి 2) జనగణమన గీతం రచించాడు.

ప్రశ్న 5.
రవీంద్రుని బహుముఖ ప్రజ్ఞను వివరించండి.
జవాబు.
రవీంద్రుడు కవి, రచయిత, తత్త్వవేత్త, సంగీతజ్ఞుడు, చిత్రకారుడు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

15. కింది వచనాన్ని చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“పద్యనాటక రచయితలలో ప్రత్యేకస్థానాన్ని అందుకున్న వారు తిరుపతి వేంకట కవులు. వీరు 1) దివాకర్ల తిరుపతిశాస్త్రి 2) చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. వీరు శతావధానులు. తమ అవధానాలతో వీరు ఆంధ్రదేశం అంతా పర్యటించి, సాహిత్య ప్రపంచంలో నూతనోత్తేజాన్ని కలిగించారు. వీరి అవధానాలతో స్ఫూర్తి పొందిన ఎందరో వ్యక్తులు సాహిత్యరంగంలో అడుగిడి కృషి చేశారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో వీరికి ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన శిష్యులున్నారు. విశ్వనాథ, వేటూరి, కాటూరి, పింగళి వారలు వీరి శిష్యులే. వీరు రచించిన పాండవోద్యోగ విజయ నాటకాలకు లభించిన ప్రసిద్ధి ఇంతింతనరానిది. పశులకాపరి నుండి పండితుల వరకు అందరి నాల్కలపై వీరి పద్యాలు నాట్యం చేస్తున్నాయి.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
తిరుపతి వేంకట కవులు ఎవరు ?
జవాబు.
తిరుపతి వేంకట కవులు జంట కవులు. వీరు 1) దివాకర్ల తిరుపతి శాస్త్రి 2) చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.

ప్రశ్న 2.
వీరు సాహిత్య రంగంలో నూతనోత్తేజాన్ని దేని ద్వారా కల్పించారు ?
జవాబు.
వీరు అవధానాల ద్వారా సాహిత్యరంగంలో నూతనోత్తేజాన్ని కలిగించారు.

ప్రశ్న 3.
వీరి ప్రసిద్ధికెక్కిన నాటకాలు ఏవి ?
జవాబు.
‘పాండవోద్యోగ విజయాలు’ అనే వీరి నాటకాలు ప్రసిద్ధి పొందాయి.

ప్రశ్న 4.
వీరి శిష్యులలో ఇద్దరిని పేర్కొనండి.
జవాబు.
వీరి శిష్యులలో 1) విశ్వనాథ సత్యనారాయణ 2) వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రసిద్ధులు.

ప్రశ్న 5.
అందరి నాల్కలపై నాట్యం చేసే వీరి పద్యాలు ఏ నాటకాలలోనివి ?
జవాబు.
వీరి పాండవోద్యోగ విజయాలు అనే నాటకాలలో పద్యాలు ప్రజల నాల్కలపై నాట్యం ఆడుతున్నాయి.

16. కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

గాంధీ మహాత్ముడు పోరుబందరులో జన్మించాడు. అక్కడ అతని బాల్యంలో చదువు ఏ మాత్రమూ సాగలేదు. అతని తండ్రి పోరుబందరు నుండి రాజకోట వచ్చి కొత్త ఉద్యోగంలో చేరాడు. అక్కడ గాంధీ విద్యార్థి జీవితం ప్రారంభం అయింది. అతడు ముందుగా సబర్బను స్కూలులోను, ఆ తరువాత హైస్కూలులోను చేరి చదువుకున్నాడు. విద్యార్థి దశలో అతను ఎక్కువ బిడియంతో ఉండి ఎవరితోను కలిసిమెలిసి ఉండేవాడు కాదు. ఒకనాడు పరీక్షాధికారి అయిదు మాటలు చెప్పి వాటి వర్ణక్రమాన్ని వ్రాయమన్నాడు. వాటిలో కెటిల్ అనే మాటను గాంధీ తప్పుగా వ్రాశాడు.

ప్రశ్నలు:

1. గాంధీ ఎక్కడ జన్మించాడు?
2. అతడు ఏయే స్కూళ్లల్లో చదువుకున్నాడు?
3. విద్యార్థి దశలో అతను ఎలా ఉండేవాడు?
4. అతడు పరీక్షలో దేనిని తప్పుగా వ్రాశాడు?
5. గాంధీ తండ్రి పోరుబందరు నుండి ఎక్కడకు వచ్చాడు ?

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

17. కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

“కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం – ఈ ఐదింటిని లలిత కళలంటారు. ఈ కళల్లో కృష్ణరాయలకు తగినంత చొరవ ఉండేది. ఆయన ఆస్థానంలో కవులు, గాయకులు, నాట్యకారులు, చిత్రకారులు, శిల్పులు ఉండేవారు. వారు తమ తమ కళలను అద్భుతరీతిలో ప్రదర్శించి రాయల మన్ననలందుకొనేవారు. కళలు మానవుని హృదయాన్ని స్పందింపజేసే స్వభావం కలవి. కళలను ఆనందించలేనివాడు రాయిలాగే జడుడని చెప్పవచ్చు.”

ప్రశ్నలు:

1. లలితకళ లేవి?
2. కవులు రాయల మన్ననలందుకొనడానికి గల కారణమేమి?
3. కళలను ఆనందించలేని వాడు రాయిలాగే జడుడు అంటే అర్థం ఏమిటి?
4. సంగీతం పాడేవారిని గాయకులంటారు. అలాగే చిత్రాలను వేసే వారిని ఏమంటారు?
5. కళల స్వభావం ఏమిటి ?

18. కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

చదువుకోని సామాన్య ప్రజలకు తరతరాలుగా వస్తున్న నోటిమాటల భాష ఒక్కటే వాడుకలో ఉండగా, చదువుకున్న వాళ్ళకు, ఆ భాషతో పాటు గ్రంథాల్లో ఉన్న కావ్య భాష కూడా అవసరమైంది. కావ్యాలు రాసేటప్పుడు తమకు పూర్వులు రాసిన భాషలోనే తాము కూడా రాస్తూ వచ్చారు. పూర్వులు ఉపయోగించిన ఛందస్సులనే తామూ ఉపయోగిస్తూ వచ్చారు.

కానీ కావ్యాలను గురించి నోటితో చెప్పేటప్పుడు వాడుక భాషలోనే వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ వచ్చిన ఆ వివరణలనూ, వ్యాఖ్యానాలను రాయడం మొదలుపెట్టేసరికి కావ్య భాషా ప్రభావం కొంత చొరబడుతూ వచ్చింది. ఇది వ్యావహారిక, గ్రాంథిక భాషలను కలిపినట్లనిపిస్తుంది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడానికి వీలులేదు. అయినా వచన రచనా సంప్రదాయానికి వాడుక భాషే ప్రధానంగా ఉండేది.

ప్రశ్నలు:

1. చదువుకున్న వాళ్లకు ఏ భాష అవసరమైంది ?
2. కావ్యాలను నోటితో ఏ భాషలో చెప్పేవారు ?
3. వ్యాఖ్యానాలు చేసేటప్పుడు ఏ భాష ఉండేది ?
4. వచన రచనకు వాడిన భాష ఏది ?
5. చదువుకోని వాళ్ళ భాష ఏమిటి ?

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

19. కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

20వ శతాబ్దపు తొలి రోజులలో కుటుంబ నియంత్రణను బూతు మాట క్రింద జమకట్టేవారు. అటువంటి సమయంలో నర్స్గా పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబ నియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఆమె యూరపు వలసవెళ్ళి 1916లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రిపై దాడి చేశారు. అయినా ఆమె చలించకుండా 1923లో కుటుంబ నియంత్రణ పరిశోధనాశాలను నెలకొల్పారు.

ప్రశ్నలు:

1. కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ పేరేమి ?
2. ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు ?
3. మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళినది?
4. 1923లో సాంగర్ దేనిని నెలకొల్పినది ?
5. ఎప్పుడు కుటుంబ నియంత్రణను బూతుమాట కింద జమకట్టేవారు ?

20. కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగసంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్క పెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుద్ధప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు.

‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు లేడు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు’ స్మరించగానే మనకు ముందు స్ఫురించేది బ్రౌను నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి, 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణ అయింది. ఈ కృషిలో బ్రౌను ఏనుగుల వీరాస్వామి సహాయం పొందాడు. వీరాస్వామి. రచించిన కాశీయాత్ర గురించిన పుస్తకం చారిత్రక దృష్ట్యా విలువైనది.

ప్రశ్నలు:

1. తెలుగు.సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం భావ్యం ?
2. బ్రౌను సంపాదించిన పుస్తకాలను ఏమంటారు ?
3. పండితులతో బ్రౌను చేయించిన పనులేమిటి ?
4. నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు వచ్చింది ?
5. కాశీయాత్రను గురించి పుస్తకము రచించినదెవరు ?

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

21. కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

విజ్ఞానశాస్త్రం ఎంతో పెరిగింది. దానివల్ల మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది. దాని ఫలితంగా జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులన్నీ సాహిత్య ప్రక్రియల్లో కనపడుతూ ఉంటాయి. సామాన్య మనుషుల జీవితం, వాళ్ళ జీవితంలో సమస్యలు చిత్రించి, పరిష్కారం సూచించడమే సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని అనే భావం ఏర్పడింది. అందువల్ల సాహిత్యం ఇదివరకటిలాగా పండితులకు, జమీందారులకు పరిమితం కాదు. సాహిత్యం కేవలం చదివి ఆనందించడానికే అన్న అభిప్రాయాలు మారిపోయాయి. సామాన్యులలోకి సాహిత్యం వచ్చేసింది. అందుకు అనువైన ప్రక్రియలే కథానిక, నాటిక, ప్రహసనం, నవల మొదలైనవి.

అందుకే వీటిలోని భాష వినగానే అర్థమయ్యేటంతగా సరళంగా ఉండటం ప్రధాన లక్షణమైంది. అంతేకాక రోజువారీ జీవితంలో సామాన్య ప్రజలు మాట్లాడే భాషే ‘వ్యావహారికం’ అనే పేరున ఒక స్పష్టమైన రూపంతో పత్రికల వల్ల బాగా ప్రచారం అయింది. ముఖ్యంగా నాటకాల్లో, నాటికల్లో కథ అంతా పాత్రల సంభాషణ ద్వారానే జరుగుతుంది కనుక, ఆయా పాత్రలకు ఉచితమైన భాష ఆయా పాత్రల చేత పలికించడం అనేది ముఖ్యమైన లక్షణమైంది. ఉదాహరణకి, ఒక నాటికలో ఏమీ చదువుకోని ఒక పల్లెటూరి మనిషి గ్రాంథికభాషలో సంభాషణ జరిపినట్లు రచయిత రాస్తే ఆ నాటిక లక్ష్యమే దెబ్బతిని హాస్యాస్పదం అవుతుంది.

ప్రశ్నలు:

1. దేనివల్ల మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది ?
2. సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని ఏమిటి ?
3. భాషకు ప్రధాన లక్షణం ఏమిటి ?
4. వ్యావహారికం అంటే ఏమిటి ?
5. నాటకాల్లో, నాటికల్లో వాడే భాషకు ముఖ్యమైన లక్షణమేది ?

22. కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

భాష నేర్చుకోవడం రెండు రకాలు. భాష కోసం భాష, విషయం కోసం భాష, భాషా స్వరూప స్వభావాలను సమగ్రంగా అధ్యయనం చేయడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయాలను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటినీ అధ్యయనం చెయ్యడం రెండో రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకాలుగా తయారయింది. ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రమాణ) భాష, సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది.

కాని దాన్ని గురించి చెప్పడానికీ, రాయడానికీ ఆధునిక భాషే కావాలి. ఎందువల్లనంటే ఏ కాలంలో జీవించేవాడి ఆలోచనా, అలవాట్లూ ఆ కాలంనాటి భాషలోనే సాగుతుంటాయి కనుక. ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. వివిధ శాస్త్ర విషయాలను వివరించడానికే కాదు, పూర్వ భాషా సాహిత్యాలను వివరించడానికి కూడా ఆధునిక భాషే కావాలి.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

ప్రశ్నలు:

1. భాషను ఏయే రకాలుగా నేర్చుకొంటాము ?
2. భాష ఎన్ని రకాలుగా తయారయింది ?
3. ప్రాచీన భాష ఎందుకు ఉపయోగిస్తుంది ?
4. ఆధునిక భాష ఉపయోగం ఏమిటి ?
5. ఏ భాష ప్రయోజనం పరిమితం ?

Leave a Comment