TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 6th Lesson తెలుగు జానపద గేయాలు Textbook Questions and Answers.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

చదువండి – ఆలోచించి చెప్పండి: (Text Bok Page No.56)

చిక్కుడుపూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలో
చిక్కుడు తెంపా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
చిక్కుడు తెంపాసీరాములు లేదా తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా సీతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో
బీరలు పూసే బీరలు కాసే తీగో నాగో ఉయ్యాలో
బీరలు తెంపా శివయ్య లేడా తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా పార్తమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో

ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఈ గేయం దేన్ని గురించి చెప్తుంది ?
జవాబు.
ఈ గేయం సీతారాముల వివాహవేడుకల గురించి చెప్తున్నది.

ప్రశ్న 2.
ఈ గేయాన్ని ఏమంటారో తెలుసా ?
జవాబు.
ఈ గేయాన్ని జానపదగేయం అని అంటారు.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 3.
ఇట్లాంటి మరికొన్ని గేయాలు పాడండి.
జవాబు.
జగడపు చనవుల

జగడపు జనవుల జాజర
సగినల మంచపు బాజర ॥
మొల్లలు తురుములు ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై
చల్లే రతివలు జాజర. ॥
భారపు కుచముల పైపై గడు సిం-
గారము నెరపెటి గందవొడి
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ॥
బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకు మదంబుల జాజర ॥

చూడవమ్మ యశోదమ్మ

చూడవమ్మ యశోదమ్మ
వాడల వాడల వరదలివిగో
పొంచి పులి వాలు పెరుగు
మించు మించు మీగడలు
వంచి వారలు వట్టిన
కంచపుటుట్ల కాగులివిగో
పేరీ పేరని నేతులు
చూరల వెన్నల జున్నులను
అరగించి యట సగబాళ్ళు
పారవేసిన బానలివిగో
తెల్లని కనుదీగెల సోగల
చల్లలమ్మేటి జవ్వనుల
చెల్లినట్లనే శ్రీ వేంకటపతి
కొల్లలాడిన గురుతులివిగో

ప్రశ్న 4.
ఇట్లాంటి గేయాల గొప్పతనం ఏమిటి ?
జవాబు.
ఇట్లాంటి గేయాలు జాతి సంస్కృతీ వైభవాలను, భాషావిన్యాసాలను, తెలుగు భాషామహిమను తెలియజేస్తాయి.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

ఆలోచించండి – చెప్పండి: (Text Book Page No.59)

ప్రశ్న 1.
తెలుగు జానపద గేయ చరిత్ర ప్రాచీనమైనదని ఎట్లా చెప్పగలం ?
జవాబు.
తెలుగు జానపదగేయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనది. అనతికాలం నుండి జనపదుల నోటి నుండి అప్రయత్నంగా వెలువడిన సాహిత్యమే జానపద గేయం. తెలుగు భాషా చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపదగేయ సాహిత్యం కూడా అంతే ప్రాచీనమైంది.

ప్రశ్న 2.
పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తి భావం ఎట్లాంటిది ?
జవాబు.
పురాణగాథలను విద్వాంసులు చదివి తెలుసుకుంటారు. కాని, గ్రామీణులు పౌరాణిక గాథలపై భక్తి విశ్వాసాలు ప్రదర్శిస్తారు. గ్రామీణులు పాటల ద్వారా గ్రహిస్తారు. అందువల్లనే పౌరాణిక గాథలపై గ్రామీణులకు మక్కువ.

ఆలోచించండి- చెప్పండి: (TextBook Page No. 61)

ప్రశ్న 1.
“ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలదే” – దీనిని ఏ సందర్భంలో వాడారు ? దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
ఈ వాక్యాన్ని జానపద గేయాల్లో వీరగాధలకున్న ప్రాధాన్యాన్ని తెలియజేయు సందర్భంలో వాడారు. ఈ ప్రాంతంలో పుట్టి లేతదైన చిగురుకొమ్మ కూడా మిక్కిలి బలిష్టమైనది అని చెప్పడానికే ఈ వాక్యాన్ని ప్రయోగించారని తెలుసుకున్నాను.

ప్రశ్న 2.
‘వీరగీతాల ధ్యేయం వేరు. ఇతర జానపదగేయాల ధ్యేయం వేరు.’ దీనిని వివరించండి.
జవాబు.
దేశస్వాతంత్ర్య సంపాదన కోసం ఎందరో వీరులు అమరులు అయ్యారు. వారు ప్రజానీకానికి స్పూర్తిగా నిలుస్తారు. జగతిని జాగృతం చేశారు. అందుకే వీరగీతాలకు ఉన్న ప్రాధాన్యం జానపద గేయాల్లో లేదు. ఇంతటి ప్రాధాన్యం ఇతర జానపద గేయాలకు అంతగా ఉండదు.

ప్రశ్న 3.
‘భక్తిగీతాలు కొందరికి జీవనోపాధి.’ ఎట్లాగో చెప్పండి.
జవాబు.
భక్తిగీతాలను దేవాలయాల్లో కొందరు పాడుతుంటారు. దీని వల్ల భక్తిపారవశ్యానికి గురైన భక్తులు కానుకలను ఇస్తారు. దీంతో భక్తి గీతాలు కొందరికి జీవనోపాధిగా తోడ్పడుతున్నాయి. ఆర్థికంగా ముందుకు వెళ్తున్నారు.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No. 62)

ప్రశ్న 1.
నిష్కపటము, నిర్మలమైన హృదయం కలిగి ఉండడం అంటే ఏమిటి ?
జవాబు.
మానవ హృదయం కల్మషంగా ఉండకూడదు. ఎల్లప్పుడు మనస్సులు ప్రశాంతంగా ఉండాలి. నిర్మలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే చేయదలచు కున్న పనులు నిరాటకంగా సాగుతాయి.

ప్రశ్న 2.
జానపదగేయాలు ప్రచారానికి అత్యుత్తమ సాధనం. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
జనసామాన్యంలోకి వార్తలుగాని, ప్రభుత్వ సంక్షేమ పథకాలుగాని, పురాణగాథలుకాని త్వరగా వెళ్ళాలంటే జానపద గేయాలే ప్రధాన సాధనాలు అయ్యాయి. ఈ జానపదగేయాలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం సంక్షేమపథకాలను తీసుకొని వెళ్ళవచ్చు.

ప్రశ్న 3.
జానపదగేయ సంపదను రక్షించుకోవడానికి ఏం చేయాలి ?
జవాబు.
తెలుగుసాహిత్యంలో జానపద వాఙ్మయానికి విశేషమైన స్థానం ఉంది. ఇది మన వారసత్వ సంపద దాన్ని పరిరక్షించుకోవడానికి ప్రాచీన గేయాలను పరిష్కరించి ముద్రించాలి. పాఠ్యాంశాల్లో జానపద గేయాలను చేర్చాలి. పాఠశాల స్థాయి నుండే జానపదగేయాలపట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలి.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:

ప్రశ్న 1.
“జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమదర్పణం” – చర్చించండి.
జవాబు.
తెలుగు సాహిత్యం అత్యంత ప్రాచీనమైందిగా పేర్కొనవచ్చు.

జానపదగేయాలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. పలనాటి వీరచరిత్ర, అల్లూరి సీతారామరాజు వంటి వీరగాథలు, రామాయణపు పాటలు, భాగవత పాటలు, జానపద గేయాల్లో ప్రముఖ స్థానం ఆక్రమించాయి. వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు కూడా తెలుగు వారి సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయి. తరతరాల వారసత్వ సంపదగా నిలిచిన జానపద గేయ సాహిత్యాన్ని మనమంతా పరిరక్షించాలి. భావితరాలకు తరగని ఆస్తిగా అందివ్వాలి.

ప్రశ్న 2.
మీకు తెలిసిన జానపద గేయాలు పాడండి. వాటి గురించి మాట్లాడండి.
జవాబు.

1. రావోయి నా రేడ

రచన : శ్రావ్యశ్రీ

నిన్నె కోరితినోయి – చిన్నవాడ
మన్నించు నా కోర్కె – వన్నెకాడ
ఎవ్వరి నే నెన్నడు – ఎరుగని దాన
నిన్నె నా మదిలోన – నిలిపిన దాన
నీ వంటె నా కెపుడు – మక్కువగాన
నీ కంటె నా వయసు – తక్కువగాన ॥నిన్నె॥
ప్రశాంతమె నా మనసు – పడుచువాడ
వసంతమె నీ చెలిమి – వయసు కాడ
మరులు గొలుప రావోయి – మా వాడ
మన్మథ రూపునీది – నా రేడ ॥నిన్నె॥
తేనె లొలుకు కావ్యాలు – నీదుబాట
తీయని భావాలు – నీదుపాట
స్వేచ్ఛనొసగు నామదికి – నీదుబాట
వినగదోయి చెలికాడ – నాదు మాట ॥నిన్నె॥

2. అందగాడా

రచన : వింజమూరి శివరామారావు

అందగాడా ! నా చందురూడా – చందురాడా ! వెన్నెల్లరేడా ! ||అంద||
మల్లే పూవుల కారు – మళ్లీ రాదంటారు.
త్రోవా త్రోవాయేదో – తావీ నింపీ రావో ||అంద||
గండు కోయిల గొంతు – యెండు నింకంటారు
తోటా తోటల యేదో పాటా నింపీ రావో ||అంద||
గండు కోయిల గొంతు – యెండు నింకంటారు
తోటా తోట యేదో పాటా నింపీ రావో
విను వీధిలో ప్రొద్దూ – కనుదాటే నంటారు
నాల్గు దిక్కుల యేదో – వెల్గు నింపీ రావో ||అంద||
తెలి మల్లే తావీ, కోయిల తీయని పాట, వె
న్నెల చక్కని వెల్లూ, నా వలపూ నింపీరావో ||అంద||

వివరణ :
జానపదగేయాలు ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉంటాయి. లయాత్మకంగా ఉంటాయి. పామరులు కూడా పాడుకోవడానికి అనుగుణంగా ఉంటాయి. తెలుగు భాషలోని మాధుర్యాన్ని జాతికి అందిస్తాయి.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:

ప్రశ్న 1.
కింద ఇచ్చిన అంశాల పేరా సంఖ్య, ఆ అంశాలకు సంబంధించిన కీలక విషయాలను పట్టికలో రాయండి.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు 1

జవాబు.

అంశం పేరా సంఖ్య కీలక (ముఖ్యమైన) విషయాలు
పౌరాణిక గేయాలు 4, 5 రామాయణ, భారత, భాగవత గాథలు ఉంటాయి. పామర జనరంజకంగా ఉంటాయి.
చారిత్రక గేయాలు 6, 7, 8 చారిత్రక వీరగాథలకు చెందిన పాటలు ఉంటాయి. హైదరాబాద్ విమోచనోద్యమంలోని గీతాలు ప్రసిద్ధి పొందాయి.
శ్రామిక గేయాలు 13 రైతుల, కార్మికుల పాటలు బహుళ ప్రచారం పొందాయి. వృత్తికి సంబంధించిన పాటలు శ్రామికులు పాడుకుంటారు.
పిల్లల పాటలు 14, 15 పిల్లల పాటలు, జోల పాటలు, అందరిని అలరిస్తాయి. పిల్లల ఆటలపాటలు వీనుల విందు చేస్తాయి.

ప్రశ్న 2.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే. బడిలో చదివే చదువు కొంతే. సమాజం నుంచి నేర్చుకొనే చదువు కొండంత. పసి పిల్లలు ఆటలాడకుంటే వాళ్ళ మనస్సు చెడుతుంది. దేహ ఆరోగ్యం చెడుతుంది. శారీరక శిక్షణ అన్నది జానపదులు తమకుతామే సహజంగా నేర్చుకున్నదేగాని ఒకరు నేర్పింది కాదు. పసిపిల్లలకు పెద్దలు చెప్పే కథలవల్ల వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది. అనేక విషయాలను వారు ఆలోచించేటట్లు చేస్తాయి. ప్రశ్నించే మనస్తత్త్వాన్ని పెంపొందిస్తాయి. పొడుపుకథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు. ముక్తపదగ్రస్త్రాలు పదజ్ఞానానికి సాటి అయింది మరొకటిలేదు. ఇవి జానపదులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయి. సంస్కృతికి సంబంధించిన విషయాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఈ జానపద సాహిత్యం కాపాడుతుంది.

అ)
జానపదులు సహజంగా నేర్చుకున్నది ఏమిటి ?
జవాబు.
జానపదులు సహజముగా నేర్చుకున్నది శారీరక శిక్షణ.

ఆ) పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం ఏమిటి ?
జవాబు.
పెద్దలు చెప్పే కథలవల్ల వినోదమే కాక విజ్ఞానం కూడా కలుగుతుంది.

ఇ) పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది ఎక్కడ ?
జవాబు.
పిల్లలు సమాజం నుంచి ఎక్కువగా చదువు నేర్చుకుంటారు.

ఈ) జానపద సాహిత్యం దేనికి హేతువు ?
జవాబు.
జానపద సాహిత్యం నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు.

ఉ) పొడుపు కథలు, ముక్తపదగ్రస్త్రాలు వీటి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
పొడుపు కథలు బుద్ధికి పదునుపెట్టే సమస్యల వంటివి. ముక్తపదగ్రస్త్రాలు పదజ్ఞానానికి సంబంధించింది.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

III. స్వీయరచన:

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) జానపదగేయాలను ఎందుకు భద్రపరచాలి ?
జవాబు.
జానపదగేయాలు మన సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయి. జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే. జానపదగేయాలు ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. బుద్ధికి పదును పెట్టే సమస్యలు, ముక్తపదశాస్త్రాలు జానపద గేయాల్లో విశిష్టమైనవిగా పేర్కొనవచ్చు. వివిధ పురాణగాథలు, చారిత్రకథాంగాలు, పారమార్థిక అంశాలు జానపద గేయాల్లో కనిపిస్తాయి. జానపద గేయాల్లో సరళమైన భాష ఉంటుంది. పామర జనరంజకంగా ఉండే ఈ జానపద గేయాలు తరతరాల మన సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తాయి. ఇటువంటి జానపదగేయాలను వారసత్వ సంపదగా భావించాలి. మనం వీటిని జాగ్రత్తగా భద్రపరచాలి.

ఆ) జానపదగేయాల్లో రామాయణ సంబంధమైన గేయాలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి ?
జవాబు.
రామాయణం భారతీయులకు ఆదికావ్యం. రామాయణకథ బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. రామాయణం అనువాదాలలో మూలభాగంలో లేని గాథలు ఎన్నో కనిపిస్తాయి. సీతారాములు ఆదర్శ దంపతులుగా నిలిచారు. సీతారాములు సకల మానవాళికి ఆరాధ్యులు. శాంతాకల్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవ కల్యాణం, రాములవారి అలుక, సుగ్రీవవిజయం, అంగదరాయభారం, లక్ష్మణమూర్ఛ, లంకాయాగం, శ్రీరామపట్టాభిషేకం, ఊర్మిళాదేవినిద్ర తదితరములు రామాయణంలోని కొన్ని ఘట్టాలను వివరిస్తున్నాయి. తెలుగు వారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్య దైవం. సీత పుట్టుక, సీతాకళ్యాణం మొదలైనవి ఉన్నాయి.

ఇ) ‘గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది’ – దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సంసార విషయాలు స్త్రీలకే బాగా తెలుస్తాయి. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచడం, కుటుంబాన్ని సమర్థవంతంగా నడపగలగడం, గృహసంబంధమైన వేడుకలు మొదలైన వాటిల్లో స్త్రీలకే ప్రాధాన్యం ఎక్కువ.

జానపదగేయాల్లో కూడా స్త్రీలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా తల్లి తన కుమారుడిని రామునిగానో, కృష్ణునిగానో, కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో తలచుకొని తన్మయత్వం పొందుతుంది. పిల్లల అభివృద్ధి కోసం స్త్రీలు ఎన్నో త్యాగాలను చేస్తారు. స్త్రీకి పురుషుని కంటే ఓర్పు చాలా ఎక్కువ. కుటుంబజీవనం ఇంతగా వృద్ధి పొందడానికి స్త్రీలే ప్రధానకారణమని చెప్పవచ్చు.

ఈ) శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
జానపదగేయాల్లో శ్రామిక గేయాలకు ప్రత్యేకస్థానం ఉంది. ధాన్యం దంచుతున్నప్పుడు, నాగలి పట్టి దున్నుతున్నప్పుడు, నాట్లు నాటుతున్నప్పుడు, విత్తనాలు చల్లుతున్నప్పుడు శ్రామికులు అప్రయత్నంగా గీతాలను పాడుతారు. ఈ పాటలను పాడుతున్నప్పుడు శ్రామికులు తమ శ్రమను మరచిపోతారు. పాటలు పాడుతున్నప్పుడు వారికి శారీరక శ్రమ కలుగదు.

శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “స్త్రీల పాటల్లో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది” – ఎట్లాగో వివరించండి.
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే. వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అనేక రకాల పాటలు పాడతారు. లాలిపాటలు, జోలపాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలచుకొని, ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.

జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం. పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లి పాటలు, ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగుపాటలు, కట్నాలపాటలు, అవిరేణిపాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లిపాటలే. ఈ పాటలన్నిటిలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. సీత సమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీతవామనగుంటలు, సుభద్రసారె. రుక్మిణిదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి అతి రమణీయములు.

(లేదా)

ఆ) “జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి” – దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు.
ఇతర భాషలలోని జానపద గేయాల లాగే తెలుగు జానపద గేయాలు కూడా విలక్షణమైన సాహిత్య సాంస్కృతిక విలువ సంతరించుకున్నాయి. ప్రజల నోటినుండి అప్రయత్నంగా వెలువడిన ఈ గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయచరిత్ర కూడా అంత ప్రాచీనమైనట్టిది.

ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహితం కావడం చేత తెలుగులోని శిష్ట సాహిత్యంకంటే జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి.

వాస్తవానికి జానపదగేయాలు శక్తిని, చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పరిగ్రహించాయి. అందువల్ల మతపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు, సౌందర్యం, సంపద, విషాదవృత్తాంతాలు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం యావత్తూ జానపద గేయాలలో మధుర మంజుల శృతిలో ప్రతిధ్వనిస్తుంది. తెలుగువారి దైనందిన జీవితంలో కవితాసౌరభం గుభాళిస్తుంది.

మనోల్లాసానికి, ఆనందానికి మాత్రమే కాక ఈ గేయాలను పడవనడిపేవారు, కుప్పనూర్చేవారు, పొలందున్నేవారు, బరువులు మోసేవారు, కాయకష్టంచేసే ఇతర ప్రజలు శ్రమ పోగొట్టుకునే నిమిత్తం పాడుకుంటారు. వీటిలో సరళమైన భావాలు, ఇతివృత్తం ఉంటాయి. ఇందలి కవితను ఆస్వాదించేందుకు కేవలం మేధస్సుకంటే మృదు హృదయం అవసరం. తెలుగు జానపదం ఎంతో మధురమైంది. ఈ జానపద వాఙ్మయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

IV. సృజనాత్మకత / ప్రశంస:

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) వారం రోజుల పాటు వివిధ జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. ఏ కళారూపం ఏ రోజు, ఏ సమయంలో ప్రదర్శించబడుతుందో, ఎక్కడ ప్రదర్శించబడుతుందో మొదలైన వివరాలతో ఒక ఆహ్వాన పత్రికను తయారుచేయండి.
జవాబు.

జానపద కళావారోత్సవాలు ఆహ్వాన పత్రిక

జై తెలంగాణ !                                                                                                       జై జై జానపదం !

దసరా పండుగను పురస్కరించుకొని వరంగల్లోని భద్రకాళీ ఆలయంలో జానపద కళా రూపాలను ప్రదర్శిస్తున్నాము. తరతరాల వారసత్వంగా మనకు సిద్ధించిన ఈ జానపదకళారూపాలను దర్శించి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాము.

వేదిక : భద్రకాళీ దేవస్థాన కళామండపం, వరంగల్
సమయం : రాత్రి 7 గం॥ నుండి 9 గం||ల వరకు

ప్రదర్శించే రోజు – ప్రదర్శించే జానపదకళారూపం
1) 13. 10. 18 – సీతాకళ్యాణం – తోలుబొమ్మలాట
2) 14.10.18 – సుగ్రీవ విజయం (యక్షగానం)
3) 15.10.18 – రాధాకళ్యాణం – కురువంజినృత్యం
4) 16.10.18 – వాలివధ – వీధి భాగవతం
5) 17.10.18 – వీరాభిమన్యు – హరికథ
6) 18.10.18 – రుక్మిణీ కళ్యాణం – బుర్రకథ
7) 19. 10. 18 – శ్రీకృష్ణలీలలు – ఒగ్గు కథ

ఇట్లు,
కాకతీయ జానపద కళాతరంగిణి,
వరంగల్.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

V. పదజాల వినియోగం:

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరో రెండు పదాలను రాయండి.

ఉదా : మల్లెపూవు సౌరభం వెదజల్లుతుంది.
సౌరభం = సువాసన, పరిమళం.

అ) గృహజీవనానికి స్త్రీలే ఆలంబనం.
జవాబు.
ఆలంబనం = ఆధారం, ఆశ్రయం

ఆ) భక్తి మార్గం-మోక్ష సాధనం.
జవాబు.
మోక్షం = కైవల్యం, ముక్తి

ఇ) కాయ కష్టం చేసేవారు కొందరు. తినేది అందరూ.
జవాబు.
కష్టం = ఇక్కట్లు, శ్రమ

2. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) పురోగతి :
జవాబు.
విద్యార్థులు చదువులో పురోగతి సాధించాలి.

ఆ) రూపురేఖలు :
జవాబు.
నూతన రాష్ట్రావిర్భావంతో ప్రజల రూపురేఖలు మారాయి.

ఇ) కూనిరాగాలు :
జవాబు.
కొందరు స్నానాలగదిలో కూనిరాగాలు తీస్తారు.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

అ) మామయ్య ఇంటికి వచ్చాడు. మామయ్య కాఫీ తాగాడు.
జవాబు.
మామయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగాడు.

ఆ) కొమ్మ విరిగిపోయింది. కొమ్మ కింద పడింది.
జవాబు.
కొమ్మ విరిగి కిందపడింది.

ఇ) శత్రువులు భయపడ్డారు. శత్రువులు పారిపోయారు.
జవాబు.
శత్రువులు భయపడి పారిపోయారు.

2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) శివ అన్నం తిన్నాడు. రాజు పండ్లు తిన్నాడు.
జవాబు.
శివ అన్నం, రాజు పండ్లు తిన్నారు.

ఆ) ఆమె పూలు తెచ్చింది. ఆమె కొబ్బరి కాయ తెచ్చింది.
జవాబు.
ఆమె పూలు మరియు కొబ్బరికాయ తెచ్చింది.

ఇ) నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి. వర్షం పడలేదు.
జవాబు.
నల్లని మబ్బులు కమ్ముకొన్నా వర్షం పడలేదు.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

తత్పురుష సమాసం:

కింది వాక్యం చదువండి.

‘రాజభటుడు వచ్చాడు’.

పై వాక్యంలో వచ్చిన వాడు రాజా ? భటుడా ? అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందిన వాడని చెప్పడానికి ‘రాజు యొక్క భటుడు’ అంటాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రత్యయమైన “యొక్క” వాడినాం.

తిండి గింజలు తిండి ‘కొరకు’ గింజలు
పాపభీతి – పాపం ‘వల్ల’ భీతి

పై రెండు వాక్యాలను కూడా గమనిస్తే రెండు పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాం. పై విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తరపద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం.

‘సమాసంలో ఉండే రెండు పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తరపదం.
పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు.

కింది పట్టికను చూడండి. చదువండి.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు 2

కింది వానిని చదువండి.
అసత్యం – సత్యం కానిది.
అధర్మం – ధర్మం కానిది
అన్యాయం – న్యాయం కానిది
ఇట్లా వ్యతిరేకార్థం తెలిపితే అది నఞ తత్పురుషం (నఇ’ అంటే వ్యతిరేకార్థం).

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 3.
కింది పదాలు చదువండి. వాటికి విగ్రహ వాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు 3

జవాబు.

సమాసపదం విగ్రహవాక్యం

సమాసం పేరు

అ) గదాధరుడు గదను ధరించినవాడు ద్వితీయా తత్పురుష
ఆ) అగ్నిభయం అగ్ని వలన భయము పంచమీ తత్పురుష
ఇ) గుణహీనుడు గుణము చేత హీనుడు తృతీయా తత్పురుష
ఈ) ధనాశ ధనము నందు ఆశ సప్తమీ తత్పురుష
ఉ) దైవభక్తి దైవము నందు భక్తి సప్తమీ తత్పురుష
ఊ) అజ్ఞానం జ్ఞానం కానిది నఞ తత్పురుష

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
పెండ్లిళ్ళలో లేదా శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలను సేకరించి నివేదికను రాయండి.
జవాబు.
1. పెండ్లింట:
సీతా కల్యాణ వైభోగమే ……………

సీతా కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే ||సీ||
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ నవనేత్ర రమణీయ గాత్ర ||సీ||
భక్త జన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల
పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేతధామ ||సీ||
సర్వలోకాధార సమరైకధీర
గర్వమానసదూర కనకాగధీర
నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ రాఘవిదార నతలో కాధార ||సీ||
పరమేశనుత గీత భవజలధిపోత
తరణికుల సంజాత త్యాగ రాజనుత ||సీ||

2. శ్రామిక గేయం :
రైతు కష్టాలు

రైతు కష్టాలు తెలియు రాజులెక్కడా ?
కాడి, మేడి పట్టిన – కాపుకు తప్ప
విత్తనాల కథలు – నెత్తిన మొత్తు
ఎరువుల రేట్లు – ఎగబ్రాకెను
పురుగు మందులు – నకిలీయయ్యె
ట్రాక్టర్ అద్దెలు – ఆకాశానంటె
అన్ని కష్టాలలో – పంట పండిస్తే
గిట్టుబాటు ధర – దక్కదాయెను
పెట్టుబడి అప్పు – ఉరితాడయ్యె
ఇంతలో సెజ్జలు – ఎస్. ఇ. జడ్లు
పొలాలను కాజేసి బ్రతుకును మాపి
రైతు క్షేమమంటూ దగా కోరు మాటలు
రాజ్యమేలుతుంటే ప్రజాస్వామ్యమే పూజ్యం
అందుకే ఆత్మహత్య లధికమయ్యెను.

వివరణ :
జానపద గేయాల్లో పెండ్లి వేడుకలకు సంబంధించిన గేయాలు ఎక్కువగా కనిపించాయి. రామాయణ పాటలు, రుక్మిణీ కళ్యాణానికి సంబంధించిన పాటలు హృద్యంగా ఉన్నాయి. పెండ్లి పాటలోని భాష సరళంగాను, హృద్యంగాను ఉంటుంది. జానపద కళావాఙ్మయాన్ని తరతరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

TS 8th Class Telugu 6th Lesson Important Questions తెలుగు జానపద గేయాలు

I. అవగాహన – ప్రతిస్పందన:

పరిచిత గద్యాలు:

1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

జానపద గేయ వాఙ్మయంలో చారిత్రక గేయాలకు విశిష్ట స్థానం ఉంది. ఇతివృత్తం, శైలి, కథా కథన విధానాలలో తక్కినవానికంటే ఇవి భిన్నంగా ఉంటాయి. వీటిలో వీరరసం ప్రధానంగా ఉంటుంది. అందుచేత ఈ గేయాలను వీరగీతాలని వ్యవహరిస్తారు. వీరరస ప్రధానమైన సంఘటన జరిగిన వెంటనే చారిత్రక లేదా వీరగీతం ఉద్భవిస్తుంది. వీరగీతాల ధ్యేయం వేరు.

ఇతర జానపద గేయాల ధ్యేయం వేరు. వీరగీతాలు కేవలం వినోదానికి, ఉల్లాసానికి మాత్రమే కాదు. అవి వీరత్వాన్ని, దేశభక్తిని ఉద్బోధించి ఉద్దీపింపచేస్తాయి. తెలుగునాడు తొలినుండి వీర సీమగా వాసికెక్కింది. ఈ సీమలో ఎందరో వీరాధివీరులు జన్మించారు. ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలదే.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
జానపద గేయ వాఙ్మయంలో వేటికి విశిష్ట స్థానం ఉంది ?
జవాబు.
చారిత్రక గేయాలకు

ప్రశ్న 2.
వీటిలో ఏ రసానికి ప్రాధాన్యత ఉంటుంది ?
జవాబు.
వీరరసం

ప్రశ్న 3.
ఈ గేయాలను ఏమని వ్యవహరిస్తారు ?
జవాబు.
వీరగీతాలు

ప్రశ్న 4.
చారిత్రక గేయాలు వేటిని ఉద్బోధిస్తాయి?
జవాబు.
వీరత్వాన్ని, దేశభక్తిని

ప్రశ్న 5.
ఎక్కడ పుట్టిన కొమ్మ చేవగలది?
జవాబు.
తెలుగునాడులో

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు మూడు మోక్ష సాధనాలని భారతీయుల విశ్వాసం. ఈ మూడింటిలో భక్తిమార్గం అత్యంత సులభమైనట్టిది. తెలుగునాట శైవ, వైష్ణవాది కీర్తనలు వేలసంఖ్యలో ప్రజా బాహుళ్యంలో అధిక ప్రచారం పొందాయి. అదృష్టవశాత్తు అతి ప్రాచీనమైన భక్తిగీతాలు కొన్ని మనకు లభ్యమవుతున్నాయి. ఈ భక్తి గీతాలు పాడుకుంటూ జంగంవారు, హరిదాసులు తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు. ఇదే వారి జీవనోపాధి.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
మోక్ష సాధనాలు ఏవి ?
జవాబు.
భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు

ప్రశ్న 2.
వీటిలో సులభమైనది ఏది?
జవాబు.
భక్తి మార్గం

ప్రశ్న 3.
ఏ గీతాలు తెలుగునాట ప్రచారం పొందాయి ?
జవాబు.
శైవ, వైష్ణవ భక్తి గీతాలు

ప్రశ్న 4.
భక్తిగీతాలతో ఎవరు జీవనం సాగిస్తున్నారు ?
జవాబు.
జంగమ, హరీదాసులు

ప్రశ్న 5.
‘జీవనోపాధి’ విడదీయండి.
జవాబు.
జీవన + ఉపాధి.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

3. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

భారతదేశం తత్త్వవేత్తలకు పుట్టినిల్లు. పండితులే కాక పామరులు సైతం, వేదాంత సత్యాలను పాడుకుంటారు. వాటి గురించి చర్చించుకుంటారు. వీటిని ‘తత్వాలు’ అని అంటాం. సంఘవ్యవస్థలోని కులభేదాలను ఎక్కువ తక్కువలను ఈ గీతాలలో ఖండించారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశం దేనికి పుట్టినిల్లు ?
జవాబు.
తత్త్వవేత్తలకు

ప్రశ్న 2.
వేదాంత సత్యాలను ఎవరు పాడుకుంటారు ?
జవాబు.
పండిత పామరులు

ప్రశ్న 3.
తత్త్వాలలో వేనిని ఖండించారు ?
జవాబు.
కులభేదాలను, ఎక్కువ తక్కువలను

ప్రశ్న 4.
‘పుట్టినిల్లు’ విడదీయుము.
జవాబు.
పుట్టిన + ఇల్లు

ప్రశ్న 5.
‘తత్త్వవేత్త’ విగ్రహవాక్యం రాయండి.
జవాబు.
తత్త్వమును తెలిసినవారు

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

II. స్వీయరచన:

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)

ప్రశ్న 1.
జానపద గేయ సంపదను రక్షించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేవి ? (లేదా)
జానపద గేయాలను ఎందుకు భద్రపరచాలి?
జవాబు.
జానపద గేయ సంపదను రక్షించుకోవడం వల్ల ప్రయోజనాలెన్నో ఉన్నాయి. జానపదగేయాలు మన సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయి. జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే. జానపదగేయాలు ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. బుద్ధికి పదును పెట్టే సమస్యలు, ముక్తపదశాస్త్రాలు జానపద గేయాల్లో విశిష్టమైనవిగా పేర్కొనవచ్చు.

వివిధ పురాణగాథలు, చారిత్రకథాంగాలు, పారమార్థిక అంశాలు జానపద గేయాల్లో కనిపిస్తాయి. జానపద గేయాల్లో సరళమైన భాష ఉంటుంది. పామర జనరంజకంగా ఉండే ఈ జానపద గేయాలు తరతరాల మన సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తాయి. ఇటువంటి జానపదగేయాలను వారసత్వ సంపదగా భావించాలి. మనం వీటిని జాగ్రత్తగా భద్రపరచాలి.

ప్రశ్న 2.
శ్రమైక సౌందర్యంలో ‘శ్రామిక గేయాలు’ వివరించండి.
జవాబు.
కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేందుకే కాక కష్ట నివారణకు కూడా ఉదయిస్తుంది. స్త్రీ, పురుషులు కాయకష్టం చేస్తున్నప్పుడు శ్రమ కనబడకుండా ఉండేందుకు, అలసట లేకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోటి నుండి కూనిరాగాలు వెలువడతాయి. సామూహిక కర్తృత్వంలో ఇటువంటి రాగాలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి.

జానపదగేయాల్లో శ్రామిక గేయాలకు ప్రత్యేకస్థానం ఉంది. ధాన్యం దంచుతున్నప్పుడు, నాగలి పట్టి దున్నుతున్నప్పుడు, నాట్లు నాటుతున్నప్పుడు, విత్తనాలు చల్లుతున్నప్పుడు శ్రామికులు అప్రయత్నంగా గీతాలను పాడుతారు. ఈ పాటలను పాడుతున్నప్పుడు శ్రామికులు తమ శ్రమను మరచిపోతారు. పాటలు పాడుతున్నప్పుడు వారికి శారీరక శ్రమ కలుగదు.

శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

అ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)

ప్రశ్న 1.
జానపద గేయాల్లో స్త్రీల పాటలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. సమర్థించండి.
(లేదా)
స్త్రీల పాటల గురించి రాయండి. వివరించండి.
జవాబు.
“శిశుర్వేత్తి పసుర్వేత్తి వేత్తి గాన రసంఫణిః” అన్నారు పెద్దలు. పాటతో అందరిని ఆనంద డోలికలలో ఓలలాడించవచ్చు. జీవితంలో ప్రతి ఒక్కరికి తల్లి తోడు ఎంతో అవసరం. తల్లితో సమానమైన స్త్రీ మూర్తులను గౌరవించే సంస్కృతి ఆనాటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలైన వారి నుండి గ్రహించాము. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే జానపదగేయాల్లో స్త్రీల పాటలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే. వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అనేక రకాల పాటలు పాడతారు. లాలిపాటలు, జోలపాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలచుకొని, ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.

స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం. పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లి పాటలు, ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి.

కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగుపాటలు, కట్నాలపాటలు, అవిరేణిపాటలు, వియ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లిపాటలే. ఈ పాటలన్నిటిలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. సీత సమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీతవామనగుంటలు, సుభద్రసారె. రుక్మిణిదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి అతి రమణీయములు.

ప్రశ్న 2.
బతుకమ్మ పాటల్లో ఉన్న ఆనందమెట్టిదో తెల్పండి.
జవాబు.
భారతదేశం తత్త్వవేత్తలకు పుట్టినిల్లు. పండితులే కాక పామరులు సైతం వేదాంత సత్యాలను పాడుకుంటారు. సంఘ వ్యవస్థలోని కుల భేదాలను ఎక్కువ, తక్కువలను ఈ గీతాలలో ఖండించారు. వరలక్ష్మీపాట, బొడ్డెమ్మపాట, బతుకమ్మ పాట మొదలైనవి తెలంగాణలో బహుళ ప్రచారం పొందాయి.

బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలో ఘనంగా జరిగే పండుగ. ప్రత్యేకంగా ఇది స్త్రీల పండుగ. శరదృతువులో వచ్చే ఈ పండుగలో బతుకమ్మను పూలతో పేరుస్తారు. బతుకమ్మ అంటే సాక్షాత్ గౌరమ్మే. బతుకమ్మను పేర్చడానికి తంగేడుపూలు, బంతిపూలు, గునుగుపూలు, కనకాంబరాలు, గన్నేరు, మంకెన, గులాబీ, గుమ్మడి మొదలైన పూలు వాడుతారు.

బతుకమ్మ నిలవడానికి మధ్యలో ఆముదపు ఆకులు, గుమ్మడి, కాకర, బీరతీగ ఆకులు ముక్కలు చేసి, నింపుకుంటూ పూలను గోపురంలా నిలబెడతారు. తొమ్మిది రోజులు జరిగే ఈ పండుగలో మొదటి రోజు బతుకమ్మ ‘ఎంగిలిపువ్వు బతుకమ్మ’ అంటారు. ఆ తర్వాత వరుసగా మరో ఎనిమిది రోజులు బతుకమ్మను పేరుస్తారు.

చివరి రోజు పేర్చే బతుకమ్మను ‘పెద్ద బతుకమ్మ’ లేదా ‘చద్దుల బతుకమ్మ’ అంటారు. బతుకమ్మ అంటే బతుకు నిచ్చే తల్లి అని అర్థం. బతుకమ్మను తీసుకొని అమ్మలక్కలు అందరూ కలిసి చెరువు కట్ట దగ్గరో, గుడి దగ్గరో చేరి బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ, పాడుతూ, ఆడతారు. తరువాత బతుకమ్మను చెరువు నీటిలో విడిచిపెడతారు. ఆ సమయంలో పాడే బతుకమ్మ పాట చాలా బాగుంటుంది.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ! బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

శ్రీ గౌరి నీ పూజ ఉయ్యాలో – చేయ -బూనితినమ్మ ఉయ్యాలో
ఇలా భక్తి భావంతో పాడుతూ తమ జీవితాలను ఆనందమయం చేయమని ప్రార్థిస్తారు. అమ్మలక్కలందరూ కలిసి పూజించటం వల్ల స్నేహం, అనురాగం వృద్ధి అవుతాయి. అత్తగారింటికి కుమార్తెను పంపుతూ కూతురిని సీతగా, అలాగే పెళ్ళికొడుకును శ్రీరామునిలాగా భావించి సంతోషించే ఈ పాట చూడండి.

“శ్రీరాముని తల్లి ఉయ్యాలో – ప్రేమతో శాంతనూ ఉయ్యాలో” ఇలా ఎన్నో పాటలు మన సంస్కృతిని, సంప్రదాయాలను చెబుతాయి. ఆ వేడుకల్లో స్త్రీల పాటలు సమాజంలోని రాబోయే తరాలవారి బుద్ధులను, మనసును సుసంపన్నం చేస్తాయి. తమ జీవితాలు బాగుండాలని, ఆనందంగా ఉండాలని ఆ బతుకమ్మను పూజించే అమ్మలు గల ఈ నేల ‘తల్లి” సార్థకమైంది.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

III. సృజనాత్మకత:

ప్రశ్న 1.
మీ పాఠశాలలో నిర్వహించే పద్యపఠన పోటీలకు సంబంధించి ఒక ఆహ్వాన పత్రిక తయారు చేయండి.
జవాబు.

పద్య పఠన పోటీలు (ఆహ్వాన పత్రిక)

ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులకు ఇదే మా ఆహ్వానం. జిల్లా స్థాయిలో పద్యపఠన పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీలు రెండు స్థాయిలలో జరుగును.
మొదటి స్థాయి : 8, 9, 10 తరగతుల వారు భాస్కర శతకం, దాశరథి శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకాలలోని పద్యాలు ఎవరు ఎక్కువ చెబుతారో, వారిలో మొదటి ముగ్గురికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది.
రెండవ స్థాయి : 6,7 తరగతుల వారు వేమన, సుమతీ శతక పద్యాలు ఎవరు ఎక్కువ ధారణ చేసి చెబుతారో, వారిలో తొలి ముగ్గురికి బహుమతులు.

ఈ బహుమతి ప్రదానం కలెక్టర్గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది.
పోటీల తేది : × × × × × ఉ॥ 9 గం॥ నుండి
ప్రాంగణం : జెడ్.పి. హైస్కూల్, భద్రాచలం.

ఇట్లు,
జెడ్.పి. హైస్కూల్, భద్రాచలం,
ఖమ్మం జిల్లా.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

IV. భాషాంశాలు:

పదజాలం:

పర్యాయపదాలు:

ప్రశ్న 1.
కాయం : ___________
జవాబు.
దేహము, తనువు, శరీరం

ప్రశ్న 2.
స్త్రీ : ___________
జవాబు.
మహిళ, ఇంతి, వనిత

ప్రశ్న 3.
సీత : ___________
జవాబు.
వైదేహి, జానకి

ప్రశ్న 4.
కళ్యాణం : ___________
జవాబు.
పరిణయం, వివాహం, పెండ్లి

ప్రశ్న 5.
శత్రువు : ___________
జవాబు.
వైరి, విరోధి, పగతుడు

ప్రశ్న 6.
పర్వతం : ___________
జవాబు.
కొండ, అద్రి, నగము

ప్రశ్న 7.
గృహం : ___________
జవాబు.
ఇల్లు, సదనం, నికేతనం

ప్రశ్న 8.
కుమారుడు : ___________
జవాబు.
పుత్రుడు, తనయుడు, సుతుడు

ప్రశ్న 9.
నాగలి : ___________
జవాబు.
హలం, సీరం

ప్రశ్న 10.
అమృతం : ___________
జవాబు.
సుధ, పీయూషం

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

వ్యుత్పత్త్యర్థాలు:

ప్రశ్న 1.
సాహిత్యం : ___________
జవాబు.
హితముతో కూడినది (వాఙ్మయం)

ప్రశ్న 2.
రాజు : ___________
జవాబు.
రంజింపచేయువాడు (ప్రభువు)

నానార్థాలు:

ప్రశ్న 1.
అర్థం : ___________
జవాబు.
శబ్దార్థం, సంపద, ప్రయోజనం

ప్రశ్న 2.
దళం : ___________
జవాబు.
ఆకు, సేన, గుంపు

ప్రశ్న 3.
రాజు : ___________
జవాబు.
ప్రభువు, చంద్రుడు

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి – వికృతి
1. భాష – బాస
2. ముఖము – మొగము
3. రూపం – రూపు
4. నిద్ర – నిదుర
5. యత్నం – జతనం
6. హలం – నాగేలు
7. హృదయం – డెందం
8. గృహం – గీము
9. కుమారుడు – కొమరుడు
10. విశ్వాసం – విసువాసము
11. స్త్రీ – ఇంతి
12. నిత్యం – నిచ్చెలు
13. కథ – కత
14. కావ్యం – కబ్బం

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

వ్యాకరణాంశాలు:

సంధులు:

1) సవర్ణదీర్ఘ సంధి :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది.

ఉదా : పట్టాభిషేకం = పట్ట + అభిషేకం
రామాయణం = రామ + అయనం
అభీష్టానుగుణం = అభీష్ట + అనుగుణం
పారమార్థిక = పారమ + అర్థిక
వైష్ణవాది = వైష్ణవ + ఆది
బాహుళార్థ = బాహుళ + అర్థ
నామృతం = నాద + అమృతం
తారావళి = తార + ఆవళి
భద్రాచలం = భద్ర + అచలం

2) గుణసంధి :
‘అ’ కారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.

ఉదా : పురాణేతిహాసాలు = పురాణ + ఇతిహాసాలు
మనోల్లాసం = మన + ఉల్లాసం
విమోచనోద్యమం = విమోచన + ఉద్యమం
జీవనోపాధి = జీవన + ఉపాధి
పుత్రకామేష్టి = పుత్రకామ + ఇష్టి

3) యణాదేశ సంధి :
ఇ, ఉ, ఋలకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా య,వ,ర లు ఆదేశంగా, వస్తాయి.

ఉదా : ప్రత్యేకం = ప్రతి + ఏకం
అత్యుత్తమ = అతి + ఉత్తమం

4) ఇత్వసంధి : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
ఉదా : వాసికెక్కు = వాసికి + ఎక్కు

5) ఉత్వసంధి : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఉదా : మేలైన = మేలు + ఐన
అందమైన = అందము + ఐన

6) అత్వసంధి : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా : విన్నప్పుడు = విన్న + అప్పుడు
మోస్తున్నప్పుడు = మోస్తున్న + అప్పుడు
ఎంతైనా = ఎంత + ఐనా

7) అనునాసిక సంధి: వర్గ ప్రధమాక్షరములకు న, మ లు పరమైనప్పుడు ఆ వర్గ పంచమాక్షరాలు ఆదేశంగా వస్తాయి.
ఉదా : వాఙ్మయం = వాక్ + మయం
తన్మయం = తత్ + మయం

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

సమాసాలు:

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) ఇతరభాషలు ఇతరములైన భాషలు విశేషణ పూర్వపద కర్మధారయం
2) శిష్ట సాహిత్యం శిష్టమైన సాహిత్యం విశేషణ పూర్వపద కర్మధారయం
3) విషాదవృత్తం విషాదమైన వృత్తం విశేషణ పూర్వపద కర్మధారయం
4) వీరకృత్యాలు వీరమైన కృత్యాలు విశేషణ పూర్వపద కర్మధారయం
5) ఇతరగాథలు ఇతరములైన గాథలు విశేషణ పూర్వపద కర్మధారయం
6) అప్రయత్నం ప్రయత్నం లేకుండా నఞ తత్పురుష
7) రెండవదశ రెండు సంఖ్యగల దశ ద్విగు సమాసం
8) తల్లితండ్రులు తల్లియును, తండ్రియును ద్వంద్వ సమాసం
9) భాషాసంస్కృతులు భాషయును, సంస్కృతియును ద్వంద్వ సమాసం
10) దైవసమానం దైవముతో సమానం తృతీయా తత్పురుష
11) ఊర్మిళాదేవి నిద్ర ఊర్మిళాదేవి యొక్క నిద్ర షష్ఠీ తత్పురుష
12) సీతాకళ్యాణం సీత యొక్క కళ్యాణం షష్ఠీ తత్పురుష
13) సుగ్రీవ విజయం సుగ్రీవుని యొక్క విజయం షష్ఠీ తత్పురుష
14) అంగదరాయబారం అంగదుని యొక్క రాయబారం షష్ఠీ తత్పురుష
16) లక్ష్మణ మూర్ఛ లక్ష్మణుని యొక్క మూర్ఛ షష్ఠీ తత్పురుష
17) రామపట్టాభిషేకం రాముని యొక్క పట్టాభిషేకం షష్ఠీ తత్పురుష
18) ప్రజలదృష్టి ప్రజల యొక్క దృష్టి షష్ఠీ తత్పురుష
19) బొబ్బిలి కథ బొబ్బిలి యొక్క కథ షష్ఠీ తత్పురుష
20) ఆంధ్రదేశం ఆంధ్ర అనే పేరుగల దేశం సంభావన పూర్వపద కర్మధారయం

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

విశేషాంశాలు:

1. ఇతిహాసం :
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ఇతిహాసం ఒకటి. ఇతిహాసాలు గ్రంథస్తం కాకముందు ఆశు రూపంలో ఉన్నాయి. కథాకథనానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. దీనికి తొలికథ, పూర్వకథ అని పేర్లు ఉన్నాయి. రామాయణ, భారతాలను ఇతిహాసాలు అని అంటారు.

2. పురాణం :
వేదముల యొక్క సారాన్ని తెలిపేవి పురాణాలు. పూర్వం జరిగిన కథ అని చెప్పవచ్చు. పురాణాలు మిత్ర సమ్మితాలు. పురాణాల్లో ఐదు లక్షణాలు ఉంటాయి. అవి.

  1. సర్గ,
  2. ప్రతి సర్గం,
  3. వంశం,
  4. మన్వంతరం,
  5. వంశానుచరితం.

మహాపురాణాలు 18, ఉప పురాణాలు 18. వీటిని వ్యాసుడు రచించాడు.

పదాలు – అర్థాలు:

I. అర్థాలు:

అప్రయత్నం = ప్రయత్నం లేకుండా
చైతన్యం = కదలిక
స్రవంతి = ప్రవాహం
పరిగ్రహించు = తీసుకొన
యావత్తు = అంతా, మొత్తం
సౌరభం = సువాసన
కాయకష్టం = శారీరక కష్టం
ఇతివృత్తం = కథ
అభీష్టం = కోరిక
కృత్యాలు = పనులు
అధికం = ఎక్కువ
గాథలు = కథలు

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

II. అర్థాలు:

వాఙ్మయం = సాహిత్యం
ఉద్భవించు = పుట్టు
విస్తరించు = వ్యాపించు
ఉద్భోధ = సందేశం
విస్తరించి = వాసికెక్కు
పామరులు = నిరక్షరాస్యులు
వాసికెక్కు= ప్రసిద్ధి చెందు
పామరులు = నిరక్షరాసులు
వాస్తవికం = యథార్థం
పరిహాసం = ఎగతాళి
వధూవరులు = భార్యాభర్తలు
ఆవిష్కృతం = ప్రకటితం
రమణీయం = అందము
పరిణమించు = రూపుదాల్చు
వ్యాప్తి = విస్తృతి
తన్మయం = పరవశత్వం

III. అర్ధాలు:

మార్థవం = మృదుత్వము
గ్రోలటం = ఆస్వాదించడం
నిత్యం = ఎల్లప్పుడు
సంగ్రహం = సంక్షిప్తం
విస్తరించడం = వ్యాపించడం
భాషా విషయక = భాషా సంబంధమైన
బృహత్తర = చాలా పెద్దదైన

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

పాఠం ఉద్దేశం:

తెలుగువారి ఆచార సంప్రదాయాలను, తాత్త్వికతను, చరిత్రను తెలిపే తెలుగు జానపదగేయాల గొప్పతనం, వైవిధ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

ప్రక్రియ – వ్యాసం:

ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘వ్యాసం’ ఒకటి. ఇది వచన రూపంలో ఉంటుంది. చారిత్రక, రాజకీయ,, సాంస్కృతిక, విద్యా, వైజ్ఞానిక మొదలైన రంగాలకు సంబంధించిన విషయాలు వ్యాసంలో చర్చించబడతాయి.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం.

రచయిత పరిచయం:

రచయిత పేరు : ఆచార్య బిరుదురాజు రామరాజు
పాఠ్యభాగం పేరు : తెలుగు జానపద గేయాలు
జననం : 16.4. 1925
మరణం : 8.2.2010
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా, దేవునూరు గ్రామం.
వృత్తి : కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడుగా, డీన్గా పనిచేశాడు.
ఇతర రచనలు : “తెలుగు జానపద గేయ సాహిత్యం” ఈయన పరిశోధన గ్రంథం. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగునపడిన మాణిక్యాలు, ఉర్దూ-తెలుగు నిఘంటువు, తెలుగు జానపదరామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

ప్రవేశిక:

జానపద సాహిత్యమనగానే గుర్తుకువచ్చేది గేయమే. పదాలని, పాటలని జానపదులు పిలుచుకునే లయాత్మక రచనలు జానపదగేయాలు. ఈ గేయాలలో ఆయా ప్రాంతప్రజల భావోద్వేగం, దైనందిన జీవితం, చరిత్ర, సంస్కృతి, భాష మొదలైనవి కనిపిస్తాయి. సామూహిక ప్రచారం, సరళభావం, జనప్రియత్వం వీటి లక్షణాలు. సాంస్కృతిక వారసత్వంగా వచ్చే ఈ జానపదగేయాల్లోని ఔన్నత్యాన్ని తెలుసుకుందాం.

పాఠ్యభాగ సారాంశం:

తెలుగు సాహిత్య చరిత్రలో జానపద గేయాలకు సమున్నతమైన స్థానం ఉంది. జానపద సాహిత్యం’ తరతరాల మన వారసత్వ సంపద. తెలుగు జానపద సాహిత్యానికి ఎంతో ప్రాచీనత ఉంది. ఉద్యమాలు, గాథలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఈ గేయాల ద్వారానే జనసామాన్యంలోకి వెళ్ళాయి.

జానపదగేయాల్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ముఖ్యంగా పౌరాణిక గాథలు, చారిత్రక గేయాలు, పారమార్థిక గేయాలు, స్త్రీలపాటలు శ్రామిక గేయాలు, పిల్లల పాటలు ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. వీటితోపాటు కరుణరస ప్రధాన గేయాలు కూడా బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి.

వివిధ విషయాలు గ్రామీణ ప్రజలకు చేరాలంటే ఈ జానపద గేయాలే ప్రధాన సాధనం. ఈ గేయాలు సరళమైన తెలుగు భాషలో ఉంటాయి. లయ ప్రధానంగా ఉంటాయి. పామరులు కూడా ఉల్లాసంగా జానపద గేయాలను పాడుకోవడానికి అనువుగా ఉంటాయి.

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu Guide 6th Lesson తెలుగు జానపద గేయాలు 4

Leave a Comment