TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson పి.వి.నరసింహారావు

Telangana SCERT TS 8th Class Telugu Study Material Pdf ఉపవాచకం 6th Lesson పి.వి.నరసింహారావు Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide Upavachakam 6th Lesson పి.వి.నరసింహారావు

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
పి.వి. నరసింహారావును గురించి రాయండి.
జవాబు.
భారత రాజకీయాలలో అపర చాణక్యుడు వంటివాడు పి.వి. నరసింహారావు. వారి పూర్తి పేరు పానులపర్తి వెంకట నరసింహారావు. కవి, అనువాదకుడు, పాత్రికేయుడు, కథకుడు, నవలా రచయిత. 14 భాషలు మాట్లాడగలిగిన బహు భాషావేత్త. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి.

నిజాం వ్యతిరేక పోరాటంలో రాటుతేలిన నాయకుడు. రాజకీయ రంగంలో శాసనసభ్యునిగా, రాష్ట్ర విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, కేంద్ర విదేశాంగ శాఖామంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రిగా మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళు నడిపిన దేశ ప్రధానమంత్రిగా చరిత్రలో చిరకాలం నిలిచేవాడు పి.వి. నరసింహారావు.

ప్రశ్న 2.
పి.వి. నరసింహారావు బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు.
కరీంనగర్ జిల్లా భీందేవర పల్లి మండలం వంగర గ్రామం పి.వి. నరసింహారావు స్వగ్రామం. వారు పుట్టింది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం. లక్నేపల్లి గ్రామం 1921వ సంవత్సరం జూన్ 28వ తేదీన సీతారామారావు. రుక్మాబాయమ్మలకు జన్మించాడు. వంగరకు చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయిలు వీరి దత్త తల్లిదండ్రులు.

1924లో బాసరలో జ్ఞాన సరస్వతి సన్నిధిలో వీరి అక్షరాభ్యాసం జరిగింది. వంగర ప్రభుత్వ పాఠశాలలో ఓనమాలు దిద్దారు. 1928 నుండి 1930 వరకు హుజూరాబాద్ పాఠశాలలో 3,4 తరగతులు చదివారు. 1936లో హన్మకొండలో డిస్టింక్షన్ మార్కులతో మెట్రిక్ పాసయ్యాడు. 1938లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు రాష్ట్రంలో ఎక్కడా చదువకుండా నిర్బంధం విధించారు. మహారాష్ట్రలోని పూనెలో బి. ఎస్సి,, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. పట్టా పొందారు.

ప్రశ్న 3.
పి.వి.నరసింహారావుగారు పాత్రికేయ వృత్తిని ఎట్లా నిర్వహించారు ?
జవాబు.
భారతదేశంలో సాహితీ పరిమళాలు వెదజల్లిన అతి కొద్దిమంది రాజకీయవేత్తలలో పి.వి. అగ్రతాంబూలానికి అర్హుడు. 1948లో ‘కాకతీయ’ పత్రికను స్థాపించి తొలితరం పత్రికా రచయితలలో ఒకడయ్యాడు. ‘కాకతీయ’ పత్రికలో ‘జయ’ అనే మారుపేరుతో అనేక రచనలు చేశాడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో “గొల్లరామవ్వ” కథను ‘విజయ’ అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో రాశాడు.

విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలను హిందీలోకి ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించాడు. ఈ రచనకు పి.వి.కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు పొందాడు. ‘పన్లక్షత్ కోనతో” అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ అనే పేరుతో అనువదించాడు.

పి.వి. రాజకీయ, సాహిత్య అనుభవాలను రంగరించి ఆంగ్లంలో రాసిన ‘ది ఇన్సైడర్’ అనే నవలకు విశేష ప్రాచుర్యం లభించింది. తాత్త్వికుడు, ప్రజాహితైషి చేసిన నిర్విరామ విఫలయత్నాల విషాద గాథే ‘ది ఇన్సైడర్’. ఈ గ్రంథం 1998లో వెలువడింది. ఈ గ్రంథం ‘లోపలి మనిషి’ పేరుతో తెలుగులోనికి కూడా అనువదించబడింది. తన చిన్ననాటి ఆత్మీయ మిత్రులు కాళోజీ నారాయణ రావు, రామేశ్వర రావులతో పి.వి. చేసిన సాహితీ చర్చలు వారి సాహితీ తృష్ణకు నిదర్శనాలు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson పి.వి.నరసింహారావు

1. అవగాహన – ప్రతిస్పందన:

అ) కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కవిగా, అనువాదకుడుగా, పాత్రికేయుడుగా, కథకుడిగా, నవలా రచయితగానే కాకుండా పద్నాలుగు భాషలు మాట్లాడగల్గిన బహుభాషావేత్తగా సుపరిచితులు. 1983లో న్యూఢిల్లీలో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫెడల్ కాస్ట్రోను అబ్బురపరిచిన ధీశాలి. పి.వి. పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే. ఐనా భూస్వామ్య పోకడలకు దూరంగా తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిలో యాభై ఎకరాల భూమిని భూదానోద్యమానికి దానమిచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే భూసంస్కరణలకు శ్రీకారం చుట్టి చరితార్థుడయిన పి.వి. నరసింహారావు జీవిత విశేషాలను ‘తెలుసుకుందాం.

ప్రశ్న 1.
1983లో క్యూబా అధ్యక్షుడు ఎవరు ?
జవాబు.
ఫెడల్ కాస్ట్రో

ప్రశ్న 2.
అలీనదేశాల, శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడిందెవరు ?
జవాబు.
పి.వి. నరసింహారావు.

ప్రశ్న 3.
వారసత్వ భూమి అంటే ఏమిటి ?
జవాబు.
తాతల, తండ్రుల నుండి ఆస్తిగా వచ్చిన భూమి.

ప్రశ్న 4.
నరసింహారావుగారు ఎన్ని భాషలు మాట్లాడగలరు ?
జవాబు.
పద్నాలుగు భాషలు.

ప్రశ్న 5.
శ్రీకారం చుట్టడం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రారంభించడం.

ప్రశ్న 6.
పి.వి. నరసింహారావుగారి పూర్తి పేరు ఏమిటి ?
జవాబు.
పాములపర్తి వెంకట నరసింహారావు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson పి.వి.నరసింహారావు

ఆ) కింది పేరాను చదివి తప్పు ఒప్పులు గుర్తించండి.

పి.వి. రాజకీయ ప్రస్థానం ఓటమితో ప్రారంభమయింది. 1952లో స్వతంత్ర భారత తొలి సాధారణ ఎన్నికలలో ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. పడిలేచిన కడలి తరంగం వలె తిరిగి 1957 నుండి 1972 వరకు నాలుగు సార్లు మంథని శాసనసభా నియోజకవర్గం నుండి జయకేతనం ఎగురవేశాడు. 1962లో రెండోసారి శాసనసభకు ఎన్నికయిన పి.వి. రాష్ట్ర జైళ్ళు, ప్రజా సంబంధాలు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయా శాఖల్లో పలు సంస్కరణలు చేపట్టి అందరి ప్రశంసలు పొందాడు.

ప్రశ్న 1.
పి.వి. రాజకీయ ప్రస్థానం విజయంతో మొదలైంది.
జవాబు.

ప్రశ్న 2.
1952లో సాధారణ ఎన్నికల్లో బద్దం ఎల్లారెడ్డి ఓడిపోయారు.
జవాబు.

ప్రశ్న 3.
మంథని శాసనసభ నియోజక వర్గం నుండి పి.వి. నాలుగుసార్లు గెలిచారు.
జవాబు.

ప్రశ్న 4.
1962లో విద్యాశాఖ మంత్రిగా పి.వి. నరసింహారావుగారు పనిచేశారు.
జవాబు.

ప్రశ్న 5.
పి.వి. రాజకీయ జీవితం పడి లేచిన కడలి తరంగం.
జవాబు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson పి.వి.నరసింహారావు

ఇ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

భారత రాజకీయాలలో అపర చాణక్యుడనే పేరు, గాంధీ, నెహ్రూ కుటుంబాలకు చెందని తొలి కాంగ్రెస్ నేతగా ప్రధాని పదవీకాలాన్నీ పూర్తిచేసిన అరుదైన ప్రతిష్ఠ, మైనారిటీ ప్రభుత్వాన్ని నిలకడగా, నిబ్బరంగా అయిదేళ్ళు నడిపించిన ‘తెలుగు నేతృత్వం’ ఇవన్నీ తలచుకోగానే గుర్తుకు వచ్చే పేరు మన తెలంగాణ ముద్దుబిడ్డ పాములపర్తి వేంకట నరసింహారావు, కరీంనగర్ జిల్లా భీందేవరపల్లి మండలం వంగర ఆయన స్వగ్రామం. చిన్నప్పుడు గణితం సబ్జెక్టు అంటే అమితంగా ఇష్టపడేవాడు. టెన్నిస్ క్రీడను బాగా ఆడేవాడు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో L.L.B. పట్టా పొందాడు.

ప్రశ్న 1.
భారత రాజకీయాలలో అపర చాణక్యుడని ఎవరికి పేరు ?
జవాబు.
పి.వి.నరసింహారావు

ప్రశ్న 2.
ఈయన ఏయే కుటుంబాలకు చెందని కాంగ్రెస్ నేతగా పేరు పొందారు ?
జవాబు.
గాంధీ, నెహ్రూ

ప్రశ్న 3.
పి.వి. స్వగ్రామం ఏది ?
జవాబు.
వంగర

ప్రశ్న 4.
ఏ సబ్జెక్టు అంటే వీరికి ఇష్టం?
జవాబు.
గణితం

ప్రశ్న 5.
L.L.B. పట్టా ఏ విశ్వవిద్యాలయం నుండి పొందారు. ?
జవాబు.
నాగపూర్

TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson పి.వి.నరసింహారావు

ఈ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

భారతదేశంలో సాహితీ పరిమళాలు వెదజల్లిన అతికొద్దిమంది రాజకీయవేత్తలలో పి.వి. అగ్రతాంబూలానికి అర్హుడు. 1948లో ‘కాకతీయ’ పత్రికను స్థాపించి తొలితర పత్రికా రచయితలలో ఒకడయ్యాడు. కాకతీయ పత్రికలో ‘జయ’ అనే మారు పేరుతో అనేక రచనలు చేసాడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ‘గొల్ల రామవ్వ’ కథను ‘విజయ’ అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో రాశాడు. ‘విశ్వనాథ’ వారి ‘వేయి పడగలు’ నవలను హిందీలోకి ‘సహస్ర ఫణ్’ పేరుతో అనువదించారు. ఈ రచనకు పి.వి. కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు పొందారు. పి.వి. ఆంగ్లంలో రాసిన ‘ది ఇన్సైడర్’ అనే నవలకు విశేష ప్రాచుర్యం లభించింది. తన చిన్ననాటి ఆత్మీయ మిత్రులు కాళోజీ, రామేశ్వరరావులతో ఎన్నో సాహితీ చర్చలు చేశారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పి.వి. స్థాపించిన పత్రిక ఏది ?
జవాబు.
కాకతీయ

ప్రశ్న 2.
తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన కథ ఏది ?
జవాబు.
గొల్లరామవ్వ

ప్రశ్న 3.
వీరు హిందీలోకి అనువదించిన గ్రంథం ఏది ?
జవాబు.
సహస్రఫణ్

TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson పి.వి.నరసింహారావు

ప్రశ్న 4.
వీరు ఆంగ్లంలో రాసిన నవల ఏది ?
జవాబు.
ది ఇన్సైడర్

ప్రశ్న 5.
పి.వి. సాహిత్య మిత్రులు ఎవరు ?
జవాబు.
కాళోజీ, రామేశ్వరరావు

Leave a Comment