TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఇల్లు – ఆనందాల హరివిల

Telangana SCERT TS 8th Class Telugu Study Material Pdf ఉపవాచకం 4th Lesson ఇల్లు – ఆనందాల హరివిల Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide Upavachakam 4th Lesson ఇల్లు – ఆనందాల హరివిల

ప్రశ్నలు – జవాబులు:

ప్రశ్న 1.
కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి.
జవాబు.
ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం చిన్న కుటుంబాల్లో ఉండదు. చిన్న కుటుంబంలో సభ్యులు సుఖసంతోషాలను పంచుకోవడానికి మనుషులను వెతుక్కోవలసి వస్తుంది. అమ్మ, నాన్నా, పిల్లలతోపాటు తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో కలిసి ఉండడం వల్ల అనుబంధాలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ద్వారా పిల్లలకు సమాజ స్థితిగతులు, ఆచార వ్యవహారాలు అలవడుతాయి. కలిసిమెలిసి ఉన్నప్పుడే కుటుంబం అయినా, సమాజం అయినా పరస్పర సహకారాలను అందించుకోగలదు. అభివృద్ధిని సాధించగలదు. మన తరం పెరిగి కుటుంబ సభ్యుల సంఘీభావంతో వసుధైక కుటుంబ భావనను తర్వాతి తరానికి అందించవచ్చు.

ప్రశ్న 2.
వ్యష్టి కుటుంబం అంటే ఏమిటి ? ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి?
జవాబు.
‘వ్యష్టి కుటుంబం’ అంటే భార్యాభర్తలూ, పిల్లలూ మాత్రమే ఉన్న చిన్న కుటుంబం. ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటి పైనే ‘వ్యష్టి కుటుంబం’ ఆధారపడియుంటుంది. వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయించుకొనే అధికారం లభిస్తాయి.

ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికీ ప్రాధాన్యం లేకపోవడం వల్లా, స్వార్థం పెరిగిపోవడం వల్లా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. చిన్న కుటుంబం అనే భావం బలపడింది. అందువల్లనే వ్యష్టి కుటుంబాలు ఏర్పడుతున్నాయి.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఇల్లు - ఆనందాలహరివిల్లు

ప్రశ్న 3.
దేశానికి కుటుంబవ్యవస్థ వెన్నెముక అనడానికి కారణాలు రాయండి.
జవాబు.
సమాజానికి కుటుంబం వెన్నెముక. మంచి కుటుంబం, మంచి సమాజం వల్ల, మంచి దేశం ఏర్పడుతుంది. మంచి కుటుంబాలతో దేశం నిండితే, ఆ దేశం సిరి సంపదలతో నిండుతుంది.
మన చక్కని కుటుంబవ్యవస్థ, మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టింది.

దేశం అంటే చక్కని కుటుంబాల సమాహారమే. కుటుంబాలు అన్నీ చక్కగా సిరిసంపదలతో ఉంటే, దేశం బాగా ఉన్నట్లే, కుటుంబ వ్యవస్థ వల్లే, దేశీయ జీవన సంస్కృతులు నిలుస్తున్నాయి. కాబట్టి దేశానికి కుటుంబవ్యవస్థ వెన్నెముక.

ప్రశ్న 4.
భారతీయ కుటుంబ వ్యవస్థను గురించి వివరించండి.
జవాబు.
భారతీయ కుటుంబ వ్యవస్థ, విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే 3 మూలస్తంభాల మీద ఆధారపడి ఉంది. అందరి సుఖంలో నా సుఖం ఉన్నది అనే త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. అంతర్జాతీయ సమాజం నుండి ప్రశంసలు అందుకున్నది భారతీయ వ్యవస్థ. తీయని అనుబంధాల సమాహారం, ఆత్మీయతల మందిరం కుటుంబం. వ్యక్తి సమాజంలో ఒంటరిగా బ్రతకలేడు.

పోషణ, భద్రత, కుటుంబ వ్యవస్థకు ముఖ్యాంశాలు. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వడం, సంస్కృతిని వారసత్వంగా అందించడం కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. తల్లిదండ్రులను గౌరవిస్తూ పెద్దలకు విధేయంగా ఉంటూ, పిల్లలకు మార్గదర్శకంగా, ప్రేమగా ఉండటం కుటుంబ పౌరుల బాధ్యత. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో సరదాగా జీవితాన్ని ఎవరి· బాధ్యతలను వారు నిర్వర్తిస్తూ రేపటి తరానికి కుటుంబ విలువల్ని చాటడమే భారతీయ కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పదనం.

1. అవగాహన – ప్రతిస్పందన:

అ) చిత్రాన్ని చూసి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

TS 8th Class Telugu Guide Upavachakam 4th Lesson ఇల్లు - ఆనందాల హరివిల 1

ప్రశ్న 1.
ప్రక్క చిత్రంలో కుటుంబాన్ని ఏమి కుటుంబం అంటారు ?
జవాబు.
వ్యష్టి కుటుంబం.

ప్రశ్న 2.
పిల్లల్ని బేబికేర్ సెంటర్కి ఎందుకు పంపిస్తారు ?
జవాబు.
దంపతులు ఇద్దరూ ఉద్యోగులు అయినపుడు పిల్లల బాధ్యత బేబికేర్ సెంటర్కి అప్పజెప్తారు.

ప్రశ్న 3.
చిత్రంలోని అబ్బాయి తాతయ్య, నానమ్మలు ఎక్కడ ఉండి ఉంటారు ? ఊహించండి.
జవాబు.
వారి సొంత గ్రామంలో గాని, వృద్ధాశ్రమంలో గాని ఉండి ఉండొచ్చు.

ప్రశ్న 4.
ఆ దంపతులు ఇద్దరూ ఒకేసారి బయటికి ఎందుకెళ్తుండొచ్చు ?
జవాబు.
వ్యాపారం కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు.

ప్రశ్న 5.
పింకివాళ్ళ కుటుంబాన్ని ఏం కుటుంబం అంటారు ?
జవాబు.
ఉమ్మడి కుటుంబం అంటారు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఇల్లు - ఆనందాలహరివిల్లు

ఆ) కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

అలాగని వ్యష్టికుటుంబం వల్ల ఇబ్బంది అని చెప్పలేం. వ్యష్టి కుటుంబంలో ఉన్నప్పటికీ కుటుంబ భావనలు పిల్లలకు వివరించి చెప్పగలగాలి…. పెద్దల బలాన్ని పొందాలి, బలగాన్నీ పెంపొందించుకోవాలి. యాంత్రికత తగ్గాలి. మానవశక్తి, యుక్తి, నైపుణ్యాలు మన వారసత్వ సంపదను పెంచేలా ఉపయోగపడాలి. ఎవరి సంపాదన వారికి ఉండటం మంచిదే. అయినా సమస్యలను పరస్పరం ఆలోచించుకొని పరిష్కరించుకోవాలి.

బాధ్యతలు పంచుకోవడం వల్ల యజమాని భారం తగ్గుతుంది. అంత మాత్రాన మానవ సంబంధాలు విచ్ఛిన్నం కాకూడదు. యంత్రశక్తి మీదనే ఆధారపడి బద్దకస్తుడు కాకూడదు. యంత్రశక్తి అంతా ఏదో రకంగా ప్రకృతిపై ఆధారపడే ఉన్నది. ప్రకృతి వనరులను వాడుకోవడం మనకు ధర్మమే కాని వాటిని దోచుకోవడం, నిరుపయోగం చేయడం మన లక్ష్యం కాకూడదు.

జవాబు.
ప్రశ్నలు :
1. యాంత్రికత అంటే ఏమిటి ?
2. కుటుంబ భావనలు పిల్లలకు వివరించాలి అంటే ఏమిటి ?
3. బాధ్యత పంచుకోవడం వల్ల ఏం జరుగుతుంది ?
4. వ్యష్టి కుటుంబం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి ?
5. అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలతో ఉండే కుటుంబాన్ని ఏమంటారు ?

ఇ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కాలాలు మారినా, ఏళ్లు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది. విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు మూలస్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉన్నది. “అందరి సుఖంలో నా సుఖం ఉన్నది. వారి కోసమే నా జీవితం” అనే త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. పోషణ, భద్రత కల్పించడం కుటుంబ వ్యవస్థలో మౌలికాంశాలు. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైంది. గౌరవప్రదమైంది. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతటి ఉన్నత స్థానం ఇచ్చారో అర్థమౌతుంది.

ప్రశ్న 1.
కుటుంబ వ్యవస్థ ఏ మూలస్తంభాలపై ఆధారపడింది ?
జవాబు.
విశ్వసనీయత, సమగ్రత, ఏకత

ప్రశ్న 2.
ఏ త్యాగ భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక ?
జవాబు.
“అందరి సుఖంలో నా సుఖం ఉన్నది. వారి కోసమే నా జీవితం”

ప్రశ్న 3.
కుటుంబ వ్యవస్థలో మౌలికాంశాలు ఏవి ?
జవాబు.
పోషణ, భద్రత కల్పించడం

ప్రశ్న 4.
కుటుంబంలో ఎవరి పాత్ర కీలకం ?
జవాబు.
తల్లి

ప్రశ్న 5.
ఈ పేరాలో నానుడి ఏది ?
జవాబు.
‘ఇంటికి దీపం ఇల్లాలు’

TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఇల్లు - ఆనందాలహరివిల్లు

ఈ కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే సూత్రం ఆధారంగా సమిష్టి కుటుంబం, కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చింది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ మొత్తం కుటుంబానికి అక్కరకు వచ్చేదే అమలయ్యేది. స్వార్థపరతకు తావు తక్కువ. ‘మన’ అనే భావనకు అందరూ లోనై ఉండేవారు. రైతు కుటుంబాల్లో ఐతే ఇంటిల్లిపాది ఇంటి పనుల్లో, బయటి పనుల్లో పాలుపంచుకొనేవారు.

శ్రామిక వర్గం అంతా దాదాపు అలానే ఉండేది. ఊరిలో ఏదన్నా పెళ్ళి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసేవారికి ఆనందం కలిగించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నెముక అయింది. సిరి సంపదలను పోగు చేసింది. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది ఆనాడు. మన ఇతిహాసాలైన రామాయణ, భారతాలు ఈ సమిష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి.

ప్రశ్న 1.
స్వార్థపరతకు ఎక్కడ తావు తక్కువ ?
జవాబు.
సమిష్టి కుటుంబంలో

ప్రశ్న 2.
దేశానికి వెన్నెముక ఏది అయింది ?
జవాబు.
సంఘీభావం

ప్రశ్న 3.
సమిష్టి కుటుంబ వ్యవస్థను ఏవి ప్రతిబింబిస్తాయి ?
జవాబు.
రామాయణ, భారతాలు

TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఇల్లు - ఆనందాలహరివిల్లు

ప్రశ్న 4.
ఏ భావనకు అందరూ లోనై ఉండేవారు ?
జవాబు.
‘మన’

ప్రశ్న 5.
ఏ సూత్రం ఆధారంగా కుటుంబ వ్యవస్థ బలాన్ని పొందింది ?
జవాబు.
‘కలిసి ఉంటే కలదు సుఖం’

Leave a Comment