AP Board 6th Class Maths Textbook Solutions Study Material Guide

AP Board 6th Class Maths Textbook Solutions Study Material Guide

Andhra Pradesh SCERT AP State Board Syllabus 6th Class Maths Study Material Guide Pdf free download, 6th Class Maths Textbook Solutions in English Medium and Telugu Medium are part of AP Board 6th Class Textbook Solutions.

Students can also go through AP Board 6th Class Maths Notes to understand and remember the concepts easily. Students can also read AP 6th Class Maths Bits with Answers for exam preparation.

AP State Board Syllabus 6th Class Maths Textbook Solutions Study Material Guide

6th Class Maths Textbook State Syllabus Pdf Download English Medium | AP 6th Class Maths Study Material Pdf

SCERT 6th Class Maths Textbook Solutions in English Medium New Syllabus

AP 6th Class Maths Solutions Chapter 1 Numbers All Around us

SCERT 6th Class Maths Textbook Solutions Chapter 2 Whole Numbers

6th Class Maths State Syllabus Solutions Chapter 3 HCF and LCM

Telangana 6th Class Maths Textbook Solutions Pdf Chapter 4 Integers

TS 6th Class Maths Guide Pdf Chapter 5 Fractions and Decimals

AP 6th Class Maths Study Material Pdf Chapter 6 Basic Arithmetic

AP Board 6th Class Maths Solutions Chapter 7 Introduction to Algebra

SCERT Class 6 Maths Solutions Chapter 8 Basic Geometric Concepts

State Board 6th Class Maths Textbook Solutions Chapter 9 2D-3D Shapes

6th Class Maths State Syllabus English Medium Chapter 10 Practical Geometry

AP State 6th Class Maths Textbook English Medium Chapter 11 Perimeter and Area

SSC 6th Class Maths Textbook Solutions Chapter 12 Data Handling

AP 6th Class Maths Solutions in Telugu Medium New Syllabus

SCERT Maths Textbook Class 6 Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు

6th Class Maths Textbook Answers Chapter 2 పూర్ణాంకాలు

6th Class Maths Textbook State Syllabus Pdf Download Chapter 3 గ.సా.కా – క.సా.గు

6th Class Maths Government Textbook Chapter 4 పూర్ణసంఖ్యలు

AP Class 6 Maths Solutions Chapter 5 భిన్నాలు – దశాంశ భిన్నాలు

TS 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం

6th Class Maths Guide State Syllabus Chapter 7 బీజ గణిత పరిచయం

SCERT 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు

AP 6th Class Maths Guide Pdf Chapter 9 ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు

TS 6th Class Maths Study Material Pdf Chapter 10 ప్రాయోజిక జ్యామితి

6th Class Maths SCERT Solutions Chapter 11 చుట్టుకొలత – వైశాల్యం

AP 6th Class Maths Textbook Pdf Chapter 12 దత్తాంశ నిర్వహణ

AP State Board Syllabus 6th Class Textbook Solutions & Study Material

AP Board 6th Class Textbook Solutions Study Material Guide

AP Board 6th Class Textbook Solutions Study Material Guide

Andhra Pradesh SCERT AP State Board Syllabus 6th Class Textbook Solutions Study Material Pdf in English Medium and Telugu Medium are part of AP Board Solutions.

AP State Board Syllabus 6th Class Textbook Solutions Study Material Guide

AP Board 6th Class English Textbook Solutions Study Material Guide

AP Board 6th Class English Textbook Solutions Study Material Guide

Andhra Pradesh SCERT AP State Board Syllabus 6th Class English Textbook Solutions Study Material Guide Pdf free download are part of AP Board 6th Class Textbook Solutions.

AP State Board Syllabus 6th Class English Textbook Solutions Study Material Guide

AP Board 6th Class English Important Questions and Answers

AP Board 6th Class Science Textbook Solutions Study Material Guide

AP Board 6th Class Science Textbook Solutions Study Material Guide

Andhra Pradesh SCERT AP State Board Syllabus 6th Class Science Study Material Guide Pdf free download, 6th Class Science Textbook Solutions in English Medium and Telugu Medium are part of AP Board 6th Class Textbook Solutions.

Students can also go through AP Board 6th Class Science Notes to understand and remember the concepts easily. Students can also read AP Board 6th Class Science Important Questions for exam preparation.

AP State Board Syllabus 6th Class Science Textbook Solutions Study Material Guide

AP 6th Class Science Study Material Pdf | AP State Syllabus 6th Class Science Textbook Pdf Download in English Medium

AP 6th Class Science Study Material Pdf English Medium

SCERT 6th Class Science Textbook Solutions Sem 1

Sixth Class Science Guide Sem 2

AP 6th Class Science Guide Telugu Medium

SCERT Class 6 Science Solutions Sem 1

AP 6th Class Science Textbook Telugu Medium Sem 2

AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం

AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం

SCERT AP 6th Class Science Study Material Pdf 12th Lesson కదలిక – చలనం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 12th Lesson Questions and Answers కదలిక – చలనం

6th Class Science 12th Lesson కదలిక – చలనం Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. ఎముకలతో ఉండే కీళ్ళు ……………… కు సహాయపడతాయి. (కదలికల)
2. కదలిక సమయంలో ………………. సంకోచించడం వల్ల ఎముక లాగబడుతుంది. (కండరాలు)
3. మణికట్టులో ఉండే ఎముకలు ………………. కీళ్ళ ద్వారా కలుపబడి ఉంటాయి. (మడత బందు)

II. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. కదలని కీళ్ళు ఉండే చోటు
A) మోకాలు
B) భుజం
C) మెడ
D) పుర్రె
జవాబు:
D) పుర్రె

2. బోలుగా ఉండే ఎముకలు గలది
A) ఆవు
B) పిచ్చుక
C) గేదె
D) పాము
జవాబు:
D) పాము

3. కండరాలను ఎముకలకు కలిపే దారాల వంటి నిర్మాణాలు
A) టెండాన్
B) లిగమెంట్లు
C) మృదులాస్థి
D) ఏవీకావు
జవాబు:
A) టెండాన్

AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం

4. మన తలను పైకి, కిందికి, పక్కలకు కదల్చడానికి ఉపయోగపడే కీలు
A) జారెడు కీలు
B) మడతబందు కీదు
C) బంతి గిన్నె కీలు
D) బొంగరపు కీలు
జవాబు:
D) బొంగరపు కీలు

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మానవ శరీరంలోని వివిధ రకాల కీళ్ళ గురించి ఒక లఘు వ్యాఖ్య రాయండి.
జవాబు:

  1. రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీలు అంటారు.
  2. కీళ్ళు రెండు రకాలు. అవి కదిలే కీళ్ళు మరియు కదలని (స్థిర) కీళ్ళు.
  3. కదిలే కీళ్ళు నాలుగు రకాలు. అవి 1) బంతిగిన్నె కీలు 2) మడతబందు కీలు, 3) జారెడు కీలు, 4) బొంగరపు కీలు.

1) బంతి గిన్నె కీలు :
ఒక ఎముక యొక్క గుండ్రని చివరి భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది. ఈ కీలులో ఎముక అన్ని వైపులకు సులభంగా తిరుగుతుంది. ఈ కీలును బంతి గిన్నె కీలు అంటారు. ఈ కీలు భుజం, తుంటి భాగాలలో ఉంటుంది.

2) మడత బందు కీలు :
ఒక తలుపు యొక్క మడత వలె ఎముకలు ఒక దిశలో కదలడానికి సహాయపడే కీళ్ళని మడత బందు కీళ్ళు అంటారు. మోచేయి మరియు మోకాలి వద్ద ఇవి ఉంటాయి.

3) జారెడు కీలు :
ఎముకలు ఒకదానిపై ఒకటి జారటానికి ఉపయోగపడే కీలును జారెడు కీలు అంటారు. ఇది వెన్నెముక, మణికట్టు మరియు చీలమండలలో ఉంటుంది.

4) బొంగరపు కీలు :
పుర్రెను వెన్నెముకకు కలిపే కీలుని బొంగరపు లేదా మెడ కీలు అంటారు. ఇది తల భారాన్ని భరిస్తుంది.

ప్రశ్న 2.
కండరాలు, ఎముకల వలన కలిగే ఉపయోగాలేవి?
జవాబు:

  1. కండరాలు స్థాన చలనం మరియు శరీర కదలికలకు సహాయపడతాయి. అవి శరీరానికి నిర్దిష్ట ఆకారాన్ని మరియు సౌష్టవాన్ని అందిస్తాయి.
  2. ఎముకలు కండరాలకు ఆధారాన్ని అందిస్తాయి. శరీర కదలికలు మరియు శరీర ఆకృతిలో కీలకపాత్ర వహిస్తాయి.

ప్రశ్న 3.
బంతి గిన్నె కీలు, మడతబందు కీళ్ళ మధ్య భేదాలేవి?
జవాబు:

బంతి గిన్నె కీలు మడత బందు కీలు
1) ఈ కీలులో ఒక ఎముక యొక్క గుండ్రటి చివరి భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది. 1) ఈ కీలు తలుపు యొక్క మడత వలె ఎముకలను ఒకే దిశలో కదిలించడానికి సహాయపడుతుంది.
2) ఇది కదలికలో 360° భ్రమణాన్ని కలిగి ఉంది. 2) ఇది దాదాపు 180° కదలికలను కలిగి ఉంది.
3) భుజాలు మరియు తుంటి భాగాలలో ఉంటుంది. 3) ఇది మోకాలు మరియు మోచేతుల వద్ద ఉంటుంది.

ప్రశ్న 4.
చేప శరీరం ఈదడానికి ఎలా అనుకూలంగా రూపొందించబడింది?
జవాబు:
చేప శరీరం పడవ ఆకారంలో ఉండి, నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది. చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. చేప ఈదేటపుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోక దానికి వ్యతిరేకదిశలో కదులుతుంది. దీని వలన ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధమైన క్రమబద్దమైన కుదుపుతో శరీరాన్ని ముందుకు తోస్తూ ఈదుతుంది. చేపతోక కూడ చలనంలో సహాయపడుతుంది.

AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం

ప్రశ్న 5.
నేను ఎవరినో ఊహించండి.
అ) నేను తలుపులు కిటికీలు కదిలినట్లుగానే అవయవాలను కదిలించడానికి పనికి వస్తాను.
ఆ) రెండు ఎముకలను కలపడానికి సహాయపడతాను.
ఇ) పుర్రెను, పైదవడను కలుపుతూ ఉంటాను.
ఈ) నేను చిన్న చిన్న ఎముకల గొలుసులా ఉంటాను.
ఉ) నేను ఎముకనూ, కండరాన్నీ కలుపుతూ ఉంటాను.
జవాబు:
అ) మడతబందు కీలు
ఆ) సంధిబంధనం (లిగమెంట్)
ఇ) కదలని కీలు
ఈ) వెన్నెముక
ఉ) స్నాయుబంధనం (టెండాన్)

ప్రశ్న 6.
ఒకవేళ మీ శరీరంలో ఎముకలు, కీళ్ళు లేనట్లయితే ఏమి జరుగుతుందో ఊహించి రాయండి.
జవాబు:
మన శరీరంలో ఎముకలు, కీళ్ళు లేకపోతే

  1. మన శరీరానికి ప్రత్యేకమైన ఆకారం ఉండదు.
  2. కదలికలు మరియు చలనము సాధ్యంకాదు.
  3. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఆకారం లేకుండా గుండ్రని బంతిలా ఉంటాము.

ప్రశ్న 7.
ఒకవేళ మీ వేళ్ళల్లో ఒకే ఎముక ఉన్నట్లయితే ఏమేమి సమస్యలు వస్తాయి?
జవాబు:
మనం నిత్యం చేసే అనేక పనులు చేతివేళ్ళలోని ఎముకల వలననే సాధ్యపడతాయి. మన వేళ్ళల్లో ఒకే ఎముక ఉంటే

  1. మనం వేళ్ళను మడవలేము.
  2. మనం ఏ వస్తువునూ పట్టుకోలేము లేదా వాడుకోలేము.
  3. దీని వలన ఆహారం తీసుకోవటం కష్టమవుతుంది.
  4. మనం ఏ వస్తువునూ ఉపయోగించలేము.
  5. జీవ పరిణామంలో మనం చాలా వెనుకబడిపోతాము.

ప్రశ్న 8.
బంతి గిన్నె కీలు చక్కని బొమ్మగీసి, భాగాలు గుర్తించండి. అది ఉండే చోటు, ఉపయోగాలు రాయండి.
జవాబు:
బంతి గిన్నె కీలు భుజము మరియు తుంటి భాగాలలో ఉంటుంది.
ఉపయోగాలు :

  1. చేతులు భుజానికి ఈ కీలు ద్వారా అతికి ఉండటం వల్ల చేతులను తిప్పడానికి వీలవుతుంది. తద్వారా మనం వివిధ రకాల పనులు చేయగలుగుతాం.
    AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 1
  2. తుంటి భాగాలలో తొడ ఎముక అమరి ఉండి కాళ్ళను కదపడానికి సహాయపడుతుంది. దీని వలన మనం నడవడం, పరుగెత్తడం వంటి పనులు చేయగలుగుతాం.

ప్రశ్న 9.
పక్షులలో చలనాన్ని మీరు ఎలా ప్రశంసిస్తారు?
జవాబు:
పక్షుల ఎగిరే లక్షణం గురించి నేను ఆశ్చర్యపోతాను.

వాటికి అద్భుతమైన రెక్కలు మరియు ఆకర్షణీయమైన ఈకలు ఉన్నాయి. వాటి శరీరం పడవ ఆకారంలో ఉంటుంది. ఎముకలు’ తేలికగా, బోలుగా ఉంటాయి. వాటి శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది.

ఈ ఎగిరే లక్షణం వలన దూరపు ప్రాంతాలు వెళ్ళడానికి పక్షులకు సాధ్యమౌతుంది. నాకు ఎగరడానికి రెక్కలు ఉంటే బాగా ఉంటుందని అనిపిస్తుంది.

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 133

ప్రశ్న 1.
ఈ క్రింది పనులు చేయండి :
• చేతిలో బంతి, ఎదురుగా వికెట్లు ఉన్నాయని ఊహించి, మీ చేతిలోని బంతిని వికెట్ల మీదికి విసరండి.
• కింద పడుకొని నడుము దగ్గర నుండి కాలిని గుండ్రంగా తిప్పడానికి ప్రయత్నించండి.
• మీ చేతిని మోచేయి దగ్గర, కాలిని మోకాలు దగ్గర వంచండి.
• చేతులను పక్కలకు చాచండి. కొన్ని ఆహార పదార్థాలను నమలండి, చేతులను వంచి భుజాలను తాకండి.
• అదే విధంగా ఇతర శరీర అవయవాలను కూడా కదిలించండి.
• మీ పరిశీలనను పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 2

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 134

ప్రశ్న 2.
ఎడమచేయి పిడికిలి బిగించండి. మోచేయివద్ద వంచి భుజాన్ని బొటనవేలితో తాకండి. పటంలో చూపిన విధంగా కుడిచేయితో ఎడమచేతి దండ చేయిని తాకండి.
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 3
• మీ మోచేయి పై భాగాన లోపల ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని గుర్తించారా?
జవాబు:
అవును, ఈ ఉబ్బెత్తు నిర్మాణాన్ని కండరం అంటారు. ఇవి కదలికకు ఉపయోగపడతాయి.

కృత్యం – 3

6th Class Science Textbook Page No. 134

ప్రశ్న 3.
పటంలో చూపిన విధంగా అరచేయి నేలవైపు ఉండే విధంగా చేతిని ముందుకు చాపండి. ఈ చేతి వేళ్ళను ఒకదాని తర్వాత మరొకటి మడవండి. మళ్ళీ యథాస్థానానికి తీసుకురండి. చేతివేళ్ళు, మణికట్టు మధ్య మీ అరచేయి వెనుకభాగం పరిశీలించండి. కండరాల కదలిక గురించి అధ్యయనం చేయండి.
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 4
• వేళ్ళను మడిచి, యథాస్థానానికి తెచ్చినప్పుడు ఉపయోగపడే వివిధ రకాల కండరాలను గుర్తించగలిగారా?
జవాబు:
అవును, ఒక జత కండరాలు వేలు మడవటానికి, తెరవటానికి ఉపయోగపడుతున్నాయి.

ఇదే విధంగా కాలివేళ్లను కదిలించి కాలి కండరాల కదలికను గమనించండి.

పై కృత్యాలు చేసిన తరువాత కదిలే శరీర భాగాలకు, కండరాలకు ఏమైనా సంబంధం ఉందనిపిస్తోందా?
ఈ కింద సూచించిన పనులను చేయండి.
ఈ పనులు చేస్తున్నపుడు కండరాలలో ఏవైనా కదలికలున్నట్లు అనిపిస్తోందేమో గమనించండి.
• కనురెప్పలు టపటపలాడించడం
• బరువు ఎత్తడం
• నమలడం
• బొటనవేలు కదిలించడం
• ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు
జవాబు:

పనులు కండరాల కదలిక
* కనురెప్పలు టపటపలాడించడం నుదుటి కండరాలు
* బరువు ఎత్తడం శరీరంలోని వివిధ కండరాలు
* నమలడం ముఖ కండరాలు
* బొటనవేలు కదిలించడం ముంజేతి కండరాలు
* ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఛాతీ కండరాలు

AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 136

ప్రశ్న 4.
మీ స్నేహితుని నోరు తెరచి కింది దవడని కిందికి, పైకి, పక్కకు కదిలించమని అడగండి. అతని ముఖంలో కదలికలను జాగ్రత్తగా పరిశీలించండి.
– మీ స్నేహితుని చెవి దగ్గర ఎముకల్లో ఏదైనా కీలును గమనించారా?
జవాబు:
అవును, ఇక్కడ క్రింది దవడ పుర్రెతో కలుస్తుంది. ఈ క్రింది దవడ మాత్రమే పుర్రెలో కదిలే కీలు.

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 136

ప్రశ్న 5.
ఒక చేతిని మడిచి నడుము దగ్గర ఉంచండి. ఇప్పుడు మెల్లగా భుజంతోపాటు చేతిని పైకి లేపండి. మరో చేతిలో వేలితో మెడనుండి భుజం వరకు జరపండి. అక్కడ ఉన్న ఎముకలను కనుక్కోవడానికి ప్రయత్నించండి. భుజం నుంచి మెడ వరకు రెండు ఎముకలు ఉంటాయి. పైకి కనిపించే ఎముకను గుర్తించడానికి ప్రయత్నించండి. దానిని జత్రుక అంటారు. దాని వెనుకవైపు ఉండే ఎముకను రెక్క ఎముక అంటారు. ఈ రెండింటిని కలిపి భుజాస్థులు. అంటారు. పటం గమనించినట్లైతే జత్రుక, రెక్కఎముక (Shoulder-blade) తో ఎక్కడ కలిసిందో చూడవచ్చు. ఇప్పుడు జత్రుక, రెక్కఎముకల మధ్య గల కీలును గుర్తించడానికి ప్రయత్నించండి.
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 5
జవాబు:
జత్రుక, రెక్క ఎముక’ మధ్య బంతి గిన్నె కీలు ఉంది.

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 137

ప్రశ్న 6.
ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చి, కొంతసేపు అలాగే ఉంచండి. ఛాతిలో ఉండే ఎముకలను మెల్లగా ఒత్తి చూడండి. ఎముకలు ఛాతి మధ్య నుండి వీపు వరకు ఉన్నట్లు గుర్తిస్తారు. ఇవి ఎన్ని ఉన్నాయో లెక్కించండి. వీటినే పక్కటెముకలు అంటారు. పక్కటెముకలు (ఆసక్తికరంగా) వంగి వుండి ఛాతి ఎముక, వెన్నెముకలను కలిపి ఒక పెట్టెలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని “ఉరఃపంజరం” అంటారు. మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలు ఉరఃపంజరంలో ఉండి రక్షింపబడతాయి. అవి ఏమిటి?
జవాబు:
మన శరీరంలోని ముఖ్యభాగాలైన గుండె, ఊపిరితిత్తులు ఉరఃపంజరంలో రక్షించబడతాయి.

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 137

ప్రశ్న 7.
మీ స్నేహితుడిని వంగి చేతులతో కాలివేళ్ళను పట్టుకోమని చెప్పండి. ఇప్పుడు అతని వీపు మధ్యభాగంలో మెడ కింది నుండి నడుము వరకు వేలితో తాకుతూ పరిశీలించండి. మీకు వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది. దీనినే ‘వెన్నెముక’ అంటారు. ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని ‘వెన్నుపూసలు’ అంటారు. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది.

కృత్యం – 8

6th Class Science Textbook Page No. 137

ప్రశ్న 8.
పటంలో చూపిన విధంగా రెండు చేతులతో నడుము కింది భాగంలో నొక్కండి. రెండువైపుల ఒకే విధమైన ఎముక ఉండడం గమనిస్తారు. ఈ ఎముక నిర్మాణాన్ని ‘ఉరోమేఖల’ అంటారు. ఇక్కడ కాలి ఎముకలు ఎముకల సమూహాల ద్వారా వెన్నెముక అడుగు భాగానికి అతుక్కొని ఉంటాయి. దీనినే “శ్రోణి మేఖల” అంటారు. ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది.
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 6

AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం

కృత్యం – 9

6th Class Science Textbook Page No. 138

ప్రశ్న 9.
ఎముకలు కదలడానికి కండరాలు ఉపయోగపడతాయని తెలుసుకున్నాం.
• ఒక ఎముకను మరొక ఎముక ఎలా కదిలిస్తుంది?
• ఎముకల మధ్య ఏమైనా అమరికలుంటాయా?
• అవయవం కదలికకు ఎముకల లిగమెంట్లు మాత్రమే సరిపోతాయా?
• మన శరీరంలోని అస్థిపంజరం పూర్తిగా ఒకే ఎముకతో తయారవుతుందా?
జవాబు:

  1. కీళ్ల వద్ద ఎముకలను కలుపుతూ తంతువులు ఉంటాయి. వీటి వలన రెండవ ఎముక కదులుతుంది.
  2. ఎముకల మధ్య ఉన్న ఈ తంతువులను లిగమెంట్లు లేదా సంధిబంధనాలు అంటారు.
  3. అవయవాల కదలికకు లిగమెంట్లు మాత్రమే సరిపోవు. వీటి కదలికకు కండరాలు తోడ్పడతాయి.
  4. లేదు. మన శరీరంలోని అస్థిపంజరం 306 ఎముకలతో ఏర్పడుతుంది.

కృత్యం – 10

6th Class Science Textbook Page No. 138

ప్రశ్న 10.
మీటరు పొడవున్న స్కేలు తీసుకోండి. మోచేయి మధ్యకు వచ్చేటట్లు చేతి కింద ఉంచండి. పటంలో చూపించినట్లు తాడుతో గట్టిగా కట్టమని మీ స్నేహితుడిని అడగండి. ఇప్పుడు మోచేయి దగ్గర వంచడానికి ప్రయత్నించండి. సాధ్యమైందా?ఎముకలు వంగవు అని మనకు తెలుసు కదా! మానవ అస్థిపంజరం అనేక ఎముకలతో ఏర్పడింది.
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 7
• ఎముకలు వంగకపోతే ఏమవుతుంది?
• మన శరీరంలోని ఎముకలు తమదైన రీతిలో కదులుతాయి. అదెలా సాధ్యమవుతుంది?
జవాబు:

  1. ఎముకలు వంగకపోతే జీవుల కదలిక సాధ్యం కాదు. మనం ఏ పనీ చేయలేము.
  2. మన శరీరంలోని ఎముకల కదలికకు కీళ్ళు, లిగమెంట్లు, కండరాలు తోడ్పడతాయి.

కృత్యం – 11

6th Class Science Textbook Page No. 139

ప్రశ్న 11.
మాడిపోయిన బల్బును, కొబ్బరి చిప్పను సేకరించండి. కొబ్బరి చిప్పను తీసుకొని దానిలో మాడిపోయిన బల్బును ఉంచండి. బల్బును అటుఇటు తిప్పండి. కొబ్బరిచిప్పలో బల్బు కావలసిన వైపుకు సులభంగా తిరుగుతుంది.

ఒక ఎముక యొక్క గుండ్రటి చివరి భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది. ఈ కీలులో ఎముక అన్నివైపులా సులభంగా తిరుగుతుంది. ఈ కీలును “బంతిగిన్నె కీలు” అంటారు. ఈ కీలు భుజం తుంటి భాగాలలో ఉంటుంది.
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 8

కృత్యం – 12

6th Class Science Textbook Page No. 139

ప్రశ్న 12.
మీ చేతిని తిన్నగా చాపి, మోచేతిని మరో చేయి అరచేతితో పట్టుకోండి. మోచేతి కీలు వద్ద మీ చేతిని అన్ని దిక్కుల్లో తిప్పడానికి ప్రయత్నించండి.
• ఇది మోచేతి దగ్గర సాధ్యమేనా? లేదు. ఎందుకు?
జవాబు:
సాధ్యం కాదు. మోచేతి దగ్గర మడత బందు కీలు ఉంటుంది. ఇది చేతిని ఒక వైపుకు మాత్రమే కదలటానికి అనుమతినిస్తుంది.

• మీ ఇంట్లో ఇటువంటి మడతబందును ఎక్కడ గమనించవచ్చును?
జవాబు:
మన ఇంట్లో ఇటువంటి మడతబందును తలుపుల వద్ద గమనించవచ్చు.

కృత్యం – 13

6th Class Science Textbook Page No. 140

ప్రశ్న 13.
మీరు చక్కగా నిలబడి మోకాలు వంగకుండా అరచేతిని నేలకు ఆనించేలా వ్యాయామాలు చేస్తుంటారు. మీ శరీరంలోని ఏ భాగం ఈ కదలికలకు కారణమవుతుంది? జ. వెన్నెముక వలన ఈ కదలికలు సాధ్యమవుతాయి.

AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం

కృత్యం – 14

6th Class Science Textbook Page No. 140

ప్రశ్న 14.
మీ తలను పైకి, కిందికి, పక్కలకు కదల్చండి.
• తల కింద ఏదైనా కీలు ఉందని ఆలోచిస్తున్నారా?
జవాబు:
అవును. తల కింద కీలు ఉంటేనే కదలిక సాధ్యమౌతుంది.

• తలకు, మెడకు మధ్య కీలు లేకపోతే ఏమవుతుందో ఊహించండి.
జవాబు:
తల కింద కీలు లేకపోతే తలను పైకి, కిందకు కదిలించలేము.

కృత్యం – 15

6th Class Science Textbook Page No. 141

ప్రశ్న 15.
జంతువులు ఒకచోటు నుండి మరొక చోటుకు ఎలా కదులుతున్నాయో పరిశీలించండి. మీ పరిశీలనను పట్టికలో రాయండి.

జంతువు చలనానికి ఉపయోగపడే శరీర భాగం జంతువు చలించే విధానం
ఆవు కాళ్ళు
మనిషి నడవడం, పరిగెత్తడం,….
నత్త
పక్షి దుముకడం, ఎగరడం,
కీటకం
చేప

జవాబు:

జంతువు చలనానికి ఉపయోగపడే శరీర భాగం జంతువు చలించే విధానం
ఆవు కాళ్ళు నడవటం, పరిగెత్తటం
మనిషి కాళ్ళు నడవడం, పరిగెత్తడం,….
నత్త పాదం పాకటం
పక్షి కాళ్ళు, రెక్కలు దుముకడం, ఎగరడం,
కీటకం కాళ్ళు, రెక్కలు నడవటం, ఎగరటం
చేప వాజములు, తోక ఈదటం, గెంతటం

• చేపలు మానవుల లాగే ఈదుతాయా? తేడా ఏమిటి? ఏ లక్షణాలు ఈదడంలో చేపకు ఎలా సహాయపడతాయి?
జవాబు:
చేపలు ఈదే విధానానికి, మనిషి ఈదే విధానానికి తేడా ఉంటుంది. మానవుడు చేతులు, కాళ్ళను ఆడించడం ద్వారా ఈదుతాడు. చేపలు వాజాల సహాయంతో ఈదుతాయి. తోకలోని పుచ్చవాజము చేప శరీరాన్ని సమతాస్థితిలో ఉంచడానికి దోహదపడుతుంది. చేప శరీరం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది. తోక దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. దీనివల్ల ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధంగా చేపలు నీటిలో చలిస్తాయి.

కృత్యం – 16

6th Class Science Textbook Page No. 141

ప్రశ్న 16.
పేపరుతో పడవను తయారు చేయండి. నీటిలో వదలండి. పటం (ఎ) లో చూపినట్లు కోసుగా ఉండేవైపు పట్టుకొని ముందుకు తోసి, గమనించండి. తరువాత పటం (బి)లో చూపిన విధంగా పక్కనుంచి తొయ్యండి. గమనించండి, ఏ పద్ధతిలో పడవ సులభంగా కదులుతుంది? ఎందుకో ఆలోచించండి.
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 9
జవాబు:
నీటిలో ముందుకు తోసినపుడు పడవ సులభంగా కదులుతుంది. ఎందుకంటే పటం పడవ ముందు భాగం మొనతేలి ఉంటుంది. అందువలన నీటిలో చొచ్చుకొని పోతుంది. మొనతేలిన భాగాలు ఘర్షణను సులభంగా అధిగమిస్తాయి.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 144

ప్రశ్న 1.
కీళ్ళ వ్యాధుల నిపుణుడు (ఆర్థోపెడిక్) గారిని సంప్రదించి కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
మోకాలి నొప్పి అనేది కీళ్ల నొప్పుల యొక్క అత్యంత సాధారణ రూపం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలలో కనిపిస్తుంది. మృదు కణజాల గాయాల నుండి మోకాలి నొప్పి తలెత్తుతుంది.

కీళ్ళ నొప్పుల అంశంపై వివరాలను సేకరించడానికి కీళ్ళ వ్యాధుల నిపుణుడిని (ఆర్థోపెడిక్) కలవడం జరిగింది. ఆయన అందించిన సమాచారం దిగువన ఇవ్వబడినది.

  • కీళ్ళ నొప్పులు అధిక శారీరక శ్రమ, అధిక వ్యాయామం, ఎక్కువ సేపు ఆటలు ఆడటం వలన కలుగుతాయి.
  • ఆర్డెటిస్ వలన కూడ కీళ్ళ నొప్పులు వస్తాయి. కీలులోని మృదులాస్థి అరిగిపోవడం వలన ఈ పరిస్థితి తలెత్తుతుంది.
  • కీళ్ళ వద్ద వాపు వంటిది ఏర్పడిన సందర్భాలలోను కీళ్ళ నొప్పులు కలుగుతాయి.
  • అలాగే ప్రమాదాలు జరిగినపుడు, ఏదైనా గాయం తగిలినప్పుడు కీళ్ళ నొప్పి వస్తుంది.
  • వయసు పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పులు కూడా పెరుగుతాయి.
  • కీళ్ళ నొప్పులకు వైద్యుడు రోగ నిర్ధారణ చేసి యాంటి ఇన్‌ఫ్లమేటరీ లేదా ఇతర మందులను సూచిస్తారు.
  • కీళ్ళ నొప్పులను తగ్గించడంలో ఫిజియోథెరపీ ఉపకరిస్తుంది. ఎలక్ట్రోథెరపీ, హాట్/కోల్డ్ థెరపీ, అల్ట్రాసౌండ్, ఇంటర్ ఫరెన్షియల్ కరెంట్ థెరపీ వంటి పలురకాలు ఫిజియోథెరపీ పద్ధతులు కీళ్ల నొప్పులను తగ్గించడానికి దోహదపడుతున్నాయి.

AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం

ప్రశ్న 2.
మీరు మీ ఇంటి దగ్గర నిర్వహించే వివిధ కార్యకలాపాలలో ఏయే కీళ్ళు పాల్గొంటాయో తెలిపే జాబితా పేర్కొనండి.
జవాబు:
కీళ్ళతో సంబంధం లేకుండా మనం ఎటువంటి కదలికను చేయలేము. మన రోజువారీ కార్యకలాపాలలో వాటికి కీలక పాత్ర ఉంది.

పనులు పాల్గొనే కీళ్ళు
1. నడవటం మడత బందు కీళ్ళు
2. రాయటం జారెడు కీళ్ళు
3. బంతి విసరటం బంతి గిన్నె కీళ్ళు
4. కారు నడపటం బంతి గిన్నె కీళ్ళు మరియు మడత బందు కీళ్ళు
5. ఆటలు ఆడటం జారెడు కీళ్ళు, బంతి గిన్నె కీళ్ళు మరియు మడత బందు కీళ్ళు
6. దుమకటం బంతి గిన్నె కీళ్ళు మరియు మడత బందు కీళ్ళు

ప్రశ్న 3.
అంతర్జాలం (ఇంటర్నెట్) నందు కోడి అస్థిపంజరం మొత్తాన్ని పరిశీలించి, వివిధ రకాల కీళ్ళు, ఎముకలు, కండరాలు, టెండాన్లు, లిగమెంట్ల జాబితా తయారుచేయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 10

ప్రశ్న 4.
అంతర్జాలం (ఇంటర్నెట్) నందు మేక కీళ్ళను గుర్తించి, కీళ్ళ జాబితా తయారుచేయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 11

ప్రశ్న 5.
ఎక్స్-రే ఫిల్ములను సేకరించి, అవి ఏ శరీర భాగాలకు సంబంధించినవో తెలియజేసే ఒక నివేదిక రాయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 12
జారెడు కీళ్ళు :
కొద్ది కదలికను మాత్రమే అనుమతించే కీళ్ళు ఇవి. జారెడు కీళ్ళలో ఒక ఎముక మరొకదానిపైకి జారడానికి అనుమతిస్తుంది. మణికట్టులోని జారెడు కీళ్ళు వంచుటకు ఉపయోగపడతాయి. ఇవి చాలా చిన్న ప్రక్క ప్రక్క కదలికలను చేస్తాయి. చీలమండలు మరియు వెన్నెముకలలో జారెడు కీళ్ళు ఉన్నాయి.

AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 13
బొంగరపు కీలు :
ఇది గుండ్రని కదలికను మాత్రమే అనుమతిస్తుంది. పుర్రెను వెన్నెముకకు కలిపే కీలుని బొంగరపు లేదా మెడ కీలు అంటారు.

బంతిగిన్నె కీలు :
ఒక ఎముక యొక్క బంతి ఆకారపు ఉపరితలం మరొకటి ఎముక గిన్నెలాంటి ఆకారంలో అమరిపోతుంది. బంతి మరియు గిన్నె కీళ్ళకు ఉదాహరణలు : తుంటి మరియు భుజం.
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 14

మడత బందు కీలు :
ఎముకల చివరలను ముందుకు మరియు వెనుకకు కదిలించడానికి ఈ కీలు ఉపయోగపడును. ఈ కీలులో కదలిక ఒకే దిశలో ఉండును.
ఉదాహరణలు :
మోకాలు మరియు మోచేతులు. పక్కటెముకలు వంగి ఉంటాయి. ఇవి ఛాతీ ఎముక మరియు వెన్నెముకలను కలిపి ఒక పెట్టెలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని ఉరః పంజరం అంటారు.
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం 15

AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

SCERT AP 6th Class Science Study Material Pdf 11th Lesson నీడలు – ప్రతిబింబాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 11th Lesson Questions and Answers నీడలు – ప్రతిబింబాలు

6th Class Science 11th Lesson నీడలు – ప్రతిబింబాలు Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. కాంతి ……………….లో ప్రయాణిస్తుంది. (ఋజు మార్గం)
2. కాంతిని ఇచ్చే పదార్థాన్ని ……………… అంటారు. (కాంతి జనకం)
3. ఒక వస్తువును తాకిన తర్వాత వెలుతురు తిరిగి వెనక్కు మరలటాన్ని …………… అంటారు. (పరావర్తనం)
4. ఆకుపచ్చ చెట్టు ద్వారా ఏర్పడిన నీడ యొక్క రంగు ……………. (నలుపు)

II. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. పారదర్శక పదార్థాన్ని గుర్తించండి.
A) కాగితం
B) చెక్క
C) గాజు
D) నూనె కాగితం
జవాబు:
C) గాజు

2. నీడను ఏర్పరచే పదార్థం
A) పారదర్శక పదార్థం
B) పాక్షిక పారదర్శక పదార్థం
C) కాంతి నిరోధక పదార్థం
D) పైవన్నీ
జవాబు:
C) కాంతి నిరోధక పదార్థం

AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

3. నీడ ఏర్పడటానికి కావలసినవి
A) కాంతి వనరు
B) కాంతి నిరోధక పదార్థం
C) తెర
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కింది ఇచ్చిన వస్తువులను పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక పదార్థాలుగా వర్గీకరించండి.
కార్డ్ బోర్డ్, డస్టర్, పాలిథీన్ కవర్, నూనె కాగితం, గాజుపలక, కళ్ల అద్దాలు, చాక్బస్, బంతి, బల్ల, పుస్తకం, కిటికీ అద్దం, అరచేయి, మీ పుస్తకాల సంచి, అద్దం, గాలి, నీరు. మీ పరిసరాలలో ఏ పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి?
జవాబు:
ఎ) పారదర్శక పదార్థాలు :
గాజు పలక, కిటికీ అద్దం, కళ్ల అద్దాలు, గాలి, నీరు

బి) అపారదర్శక పదార్థాలు :
కార్డ్ బోర్డ్, డస్టర్, చాక్ పీస్, బంతి, బల్ల, పుస్తకం, అరచేయి, పుస్తకాల సంచి, అద్దం

సి) పాక్షిక పారదర్శక పదార్థాలు :
పాలిథీన్ కవర్, నూనె కాగితం

ప్రశ్న 2.
“పూర్తిగా పారదర్శకమైన పదార్థాలను మనం కాంతి సమక్షంలోనూ చూడలేము.” ఇది సరియైనదా? కాదా? మీ సమాధానాన్ని సమర్థించండి.
జవాబు:
అవును, పూర్తిగా పారదర్శక వస్తువుల ఉనికిని కాంతిలో మనం గుర్తించలేము. ఎందుకంటే ఇవి కాంతిని తన గుండా వెళ్ళడానికి అనుమతిస్తాయి. కాబట్టి మనం వాటిని కనుగొనలేము.
ఉదా : గాలి, గాజుపలక.

ప్రశ్న 3.
మన వెనుక ఉన్న వస్తువులను మనం ఎందుకు చూడలేం?
జవాబు:
కాంతి ఋజుమార్గంలో ప్రయాణిస్తుంది కావున, మన వెనుక ఉన్న వస్తువుల నుండి ప్రతిబింబించే కాంతి మన కళ్ళకు చేరలేదు. కాబట్టి మన వెనుక ఉన్న వస్తువులను మనం చూడలేము.

ప్రశ్న 4.
ఒక అపారదర్శక వస్తువుకు నీడ ఏర్పడాలంటే ఏమేమి కావాలి?
జవాబు:
అపారదర్శక వస్తువు నీడను ఏర్పరచాలంటే

  1. కాంతి జనకం
  2. అపారదర్శక వస్తువు
  3. తెర కావాలి.

AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

ప్రశ్న 5.
సమతల దర్పణాన్ని కుంభాకార దర్పణంగా ఉపయోగించవచ్చా? కాకపోతే ఎందుకు?
జవాబు:
లేదు, మనం సమతల దర్పణాన్ని వెనుక వాహనాలను చూడటానికి ఉపయోగించలేము. ఎందుకంటే సాదా అద్దం వాహనం వెనుక ఉన్న అన్ని వస్తువులను చూపించలేదు. కుంభాకార దర్పణం వస్తువులను చిన్నదిగా చూపటం వలన దూరపు వాహనాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి మనం కుంభాకార దర్పణాన్ని వెనుక వాహనాలను చూడటానికి ఉపయోగిస్తాము.

ప్రశ్న 6.
ఒకే వస్తువుకు వివిధ ఆకారాలు గల నీడలు ఎందుకు ఏర్పడతాయి? వివరించండి.
జవాబు:

  1. ఒకే వస్తువుకు వేర్వేరు నీడలు ఏర్పడతాయి.
  2. ఎందుకంటే కాంతి జనకం యొక్క స్థానాన్ని బట్టి నీడ ఆకారం మార్చబడుతుంది.
  3. అంతేగాక కాంతిజనకంతో వస్తువు చేసే కోణం బట్టి కూడా దాని నీడలు మారతాయి.
  4. కాబట్టి మనం ఒకే వస్తువు నుండి వేర్వేరు నీడల ఆకారాలను మరియు వేర్వేరు వస్తువుల నుండి ఒకే నీడను పొందవచ్చు.

ప్రశ్న 7.
నీడకు, ప్రతిబింబానికి తేడాలేవి?
జవాబు:

నీడ ప్రతిబింబం
1) నీడకు రంగు ఉండదు. 1) ప్రతిబింబం రంగును కల్గి ఉంటుంది.
2) అపారదర్శక వస్తువులు కాంతి మార్గాన్ని అడ్డుకున్నప్పుడు నీడలు ఏర్పడతాయి. 2) కాంతి పరావర్తనం లేదా వక్రీభవనం కారణంగా ప్రతిబింబం ఏర్పడుతుంది.
3) నీడ వస్తువు గురించి ఎటువంటి సమాచారం ఇవ్వదు కాని అది వస్తువు యొక్క ఆకారం గురించి ఇస్తుంది. 3) ప్రతిబింబం వస్తువు గురించి రంగు, నిర్మాణం మొదలైన వాటి గురించి మరింత సమాచారం ఒక అవగాహనను ఇస్తుంది.
4) కాంతిజనకం స్థానం మీద ఆధారపడి నీడ పరిమాణం మార్చవచ్చు. 4) ప్రతిబింబం పరిమాణంలో ఏమాత్రం మారదు. ఇది ఎల్లప్పుడూ వస్తువు యొక్క పరిమాణంతో సమానంగా ఉంటుంది.
5) నీడను ఏర్పరచటానికి తెరను కలిగి ఉండటం తప్పనిసరి. 5) అద్దంలో ప్రతిబింబమును తెర లేకుండా చూడవచ్చు.

ప్రశ్న 8.
ఉదయం నుండి సాయంత్రం వరకు తన నీడలో మార్పు రావడాన్ని మాలతి గుర్తించింది. తనకు కొన్ని సందేహాలు కలిగాయి. ఆ సందేహాలు ఏమిటో ఊహించి, రాయండి.
జవాబు:

  1. ఎందుకు నీడలు ఎప్పుడూ నల్లగా ఉంటాయి?
  2. కొన్నిసార్లు నీడలు ఎందుకు చిన్నవి మరియు పెద్దవిగా ఉంటాయి?
  3. మన నీడలు ఎప్పుడూ మనల్ని ఎందుకు అనుసరిస్తాయి?
  4. నీడను బట్టి సమయాన్ని మనం ఊహించగలమా?

ప్రశ్న 9.
కాంతి ఋజుమార్గంలో ప్రయాణిస్తుందని నీవెలా వివరించగలవు?
జవాబు:

  1. పటం ఎ, బి లలో వస్తువులను, వాటిపై పడే కాంతి మార్గాన్ని, ఏర్పడే నీడలను గమనించవచ్చును.
    AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు 1
  2. కాంతిని సరళరేఖామార్గంలో ప్రయాణించే కిరణాలుగా భావించి మనం పై పటాలలో కాంతి మార్గాన్ని తెలిపే బాణం గుర్తులను పొడిగించాం.
  3. అంటే కాంతి సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుందని భావించినపుడు మాత్రమే వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను ఊహించగలం, వివరించగలం, గీయగలం.
  4. ప్రాచీనకాలంలో ప్రజలు వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించడం ద్వారానే కాంతి సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుందనే అవగాహన ఏర్పరచుకొన్నారు.

ప్రశ్న 10.
కాంతికి పరావర్తనం చెందే లక్షణం లేకపోతే మనం మన చుట్టూ ఉన్న ఏ వస్తువులనూ చూడలేము. కాంతికున్న ఈ పరావర్తన ధర్మాన్ని నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:
దృష్టిజ్ఞానము జీవులకు చాలా కీలకం.

  1. ఇది కాంతి పరావర్తనం ద్వారా సాధ్యం.
  2. జీవులకు దృష్టిని ప్రసాదించే ఈ దృగ్విషయం పట్ల నేను ఆశ్చర్యపోతున్నాను.
  3. మన చుట్టూ ఉన్న వస్తువులను, వివిధ రంగులను, జంతువులను, పక్షులను చూసే అవకాశం కల్పించే కాంతి పరావర్తన ధర్మాన్ని నేను ప్రశంసిస్తాను.
  4. అందమైన ప్రకృతిని చూడటం ద్వారా నేను సంతోషంగా ఉన్నాను.
  5. దీనికి కారణమైన కాంతిని నేను అద్భుత విషయంగా భావిస్తున్నాను.

AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

ప్రశ్న 11.
మీ నిత్యజీవితంలో కాంతి పరావర్తనాన్ని ఎక్కడ గమనించారో తెల్పండి.
జవాబు:
కాంతి యొక్క పరావర్తనం కారణంగా, మనం అద్దంలో మన ప్రతిబింబాన్ని చూస్తున్నాము.

  1. కాంతిని పరావర్తనం చెందించి చీకటి ప్రాంతాలను వెలుగుతో నింపవచ్చు.
  2. కాంతి పరావర్తనం వలన రియర్ వ్యూ మిర్రర్ లో మనం వెనుక వచ్చే వాహనాలను చూడగలము.
  3. కాంతి పరావర్తనం వలన సూక్ష్మదర్శిని ద్వారా మనం సూక్ష్మజీవులను చూడగలము.
  4. కాంతి పరావర్తనం వలన మనకు దృష్టి జ్ఞానం కలుగుతుంది.
  5. మనం ప్రతిరోజు చూసే వస్తువులు, ఫోటోలు, ఇ.ఎన్.టి. డాక్టర్లు వాడే దర్పణాలు మొదలగు వాటిలో కాంతి పరావర్తన ధర్మాన్ని గమనించవచ్చు.

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 119

ప్రశ్న 1.
మీ గది తలుపు, కిటికీలు అన్నీ మూసి గదిని చీకటి చేయండి. బల్బ్ లేదా కొవ్వొత్తి వెలిగించి గదిలోని ఏదో ఒక వస్తువును చూడండి. మీరు చూస్తున్న ఆ వస్తువుకు, మీ కళ్లకు మధ్య ఒక అట్టను ఉంచండి. ఇప్పుడు మీకు ఆ వస్తువు కనిపిస్తుందా? కాంతి ఉన్నా కూడా ఆ వస్తువు ఎందుకు కనబడటం లేదు? అట్టముక్కను అడ్డుగా ఉంచడం వల్ల ఏం జరిగింది?
AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు 2
1) వస్తువు మీకు కనబడుతుందా?
జవాబు:
వస్తువు నాకు కనిపించలేదు.

2) కాంతి ఉన్నప్పటికీ అది ఎందుకు కనిపించదు?
జవాబు:
కాంతి కళ్ళకు చేరలేదు. కనుక వస్తువు కనిపించదు.

3) మీరు వస్తువు మరియు మీ మధ్య ఒక అట్టను పట్టుకున్నప్పుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
అట్ట కాంతిని నిరోధిస్తుంది కాబట్టి కళ్ళకు చేరదు.

4) ఆ వస్తువు నుండి మన కంటికి చేరేది ఏమిటి?
జవాబు:
దృష్టి భావాన్ని కలిగించే దాని కాంతి.

5) కాంతి ఎక్కడ నుండి వస్తుంది?
జవాబు:
కొన్ని పదార్థాలు కాంతిని ఇస్తాయి. కాంతిని ఇచ్చే పదార్థాన్ని కాంతి జనకం అంటారు.

6) ఏ వస్తువులు మనకు కాంతిని ఇస్తాయి?
జవాబు:
సూర్యుడు, ప్రకాశించే బల్బ్, వెలిగించిన కొవ్వొత్తి మొదలైనవి.

7) కాంతి వనరు కోసం మీరు మరికొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా.?
జవాబు:
సూర్యుడు, నక్షత్రాలు, మంట, కొవ్వొత్తి, బల్బ్, మిణుగురు పురుగు.

8) నీడలను ఎప్పుడు చూస్తాము? ఇది పగటిపూట లేదా రాత్రి సమయంలోనా?
జవాబు:
పగటిపూట నీడను చూస్తాము.

9) రాత్రి నీడలు ఏర్పడతాయా?
జవాబు:
సాధారణంగా రాత్రి సమయంలో నీడలు ఏర్పడవు. రాత్రి సమయంలో కాంతిని ఉపయోగించడం ద్వారా నీడలు ఏర్పడతాయి.

10) సూర్యరశ్మి, బత్ లేదా మరే ఇతర కాంతి లేనప్పుడు నీడలు ఏర్పడటం సాధ్యమేనా?
జవాబు:
కాంతి లేకుండా నీడలు ఏర్పడటం సాధ్యం కాదు.

11) నీడను ఏర్పరచడానికి మనకు ఏమి అవసరం?
జవాబు:
నీడను ఏర్పరచడానికి మనకు కాంతి, కాంతి నిరోధక పదార్థం మరియు తెర అవసరం.

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 120

ప్రశ్న 2.
టార్చ్ సహాయంతో పుస్తకం, పెన్, డస్టర్, పాలిథీన్ కవర్ మరియు గాజు పలక వంటి వస్తువుల నీడలను ఏర్పరచండి.
పై వస్తువుల నీడలో మీకు ఏమైనా తేడాలు ఉన్నాయా? అన్ని వస్తువులు నీడను ఏర్పరుస్తాయా?
1) ఏ వస్తువులు నీడలను ఏర్పరుస్తాయి?
జవాబు:
పుస్తకం, పెన్ను, డస్టర్

2) ఏ వస్తువులు నీడలను ఏర్పరచవు?
జవాబు:
గాజు, పాలిథీన్ కవర్.

3) కొన్ని వస్తువులు నీడలను ఎందుకు ఏర్పరుస్తాయో ఆలోచించండి. మరికొన్ని ఎందుకు ఏర్పరచటం లేదు?
జవాబు:
కాంతిని అనుమతించే పారదర్శక పదార్థాలు నీడలను ఏర్పరచవు. కాంతిని అనుమతించని అపారదర్శక పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి. నీడ అంటే, కాంతి నిరోధించబడిన ప్రాంతమే.

AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

కృత్యం – 3

6th Class Science Textbook Page No. 122

ప్రశ్న 3.
ఒక పత్రం, టార్చ్ లైట్ తీసుకొని చీకటి గదిలో ఈ కృత్యం చేయండి. పటంలో చూపినట్లు పత్రంపైకి టార్చ్ లైట్ తో కాంతిని ప్రసరింపజేయండి. (పత్రానికీ, టార్చ్ కి మధ్య సుమారు 30 సెం.మీ. దూరం ఉండేటట్లు చూడండి.)
AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు 3
1) మీ గదిలో పత్రం నీడ ఎక్కడ ఏర్పడింది?
జవాబు:
గదిలో పత్రం నీడ గోడ మీద ఏర్పడింది.

2) ఇప్పుడు పత్రం క్రింద నుండి కాంతిని ప్రసరింపచేయండి. పత్రం నీడ ఎక్కడ ఏర్పడింది?
జవాబు:
పత్రం నీడ గది పై కప్పు మీద ఏర్పడింది.

3) ఇదే కృత్యాన్ని ఆరుబయట చేయండి. నీడ ఏర్పడిందా?
జవాబు:
లేదు, నీడ ఏర్పడలేదు.

4) దీనిని బట్టి మీకు ఏమి అర్థమయింది?
జవాబు:
నీడ ఏర్పడాలంటే తెర అవసరమని అర్థమయ్యింది.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 124

ప్రశ్న 4.
ఒకే పరిమాణం, వేరువేరు రంగు కలిగిన 4 బంతులను తీసుకొండి. పటంలో చూపినట్లు ఒక్కొక బంతి నీడను టార్చ్ సహాయంతో గోడపై ఏర్పరుస్తూ, మీ స్నేహితులను ఒక్కొక్కరిని ఆ నీడలు చూసి బంతుల రంగులు కనుక్కోవడానికి ప్రయత్నించమని అడగండి. మీ స్నేహితులకు మీ చేతిలోని బంతి కనబడకూడదు. నీడ మాత్రమే కనపడాలి.
AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు 4
1) మీ స్నేహితులు నీడను చూసి బంతి రంగు కనుక్కోగలిగారా?
జవాబు:
లేదు, వాళ్ళు బంతి రంగును ఊహించలేకపోయారు.

2) నీడను చూసి ఆ నీడను ఏర్పరిచిన వస్తువు రంగు కనుక్కోవడం సాధ్యమవుతుందా? కాదా? ఎందుకు?
జవాబు:
వస్తువు యొక్క నీడను గమనించడం ద్వారా దాని రంగును ఊహించడం సాధ్యంకాదు. ఎందుకంటే వస్తువు రంగు ఏదైనా నల్లటి నీడలను మాత్రమే ఏర్పరుస్తుంది. నీడ అంటే కాంతి లేని ప్రాంతం. అందువల్ల వస్తువు యొక్క రంగుతో సంబంధం లేకుండా నీడ ఏర్పడును. నీడ రంగులేనిది.

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 125

ప్రశ్న 5.
ఒక పుస్తకం, పెన్, డస్టర్, బంతి, గుండ్రని పళ్లెం మొదలైన వస్తువులను ఒకదాని తర్వాత ఒకటి సూర్యుని వెలుగులో ఉంచి వాటి నీడల ఆకారాలను పరశీలించండి. వాటి నీడలు ఏర్పరచేటప్పుడు ఆ వస్తువుల వివిధ ముఖాలను సూర్యునికి అభిముఖంగా ఉంచుతూ వాటి నీడల్లో ఏర్పడే మార్పులను గమనించండి. మీ పరిశీలనలతో కింది ప్రశ్నలకు ఆలోచించి సమాధానాలు ఇవ్వండి.
1) బంతి నీడకు, గుండ్రని పళ్లెం నీడకూ ఏమైనా పోలిక ఉందా? ఉంటే ఏమిటది?
జవాబు:
అవును, రెండు నీడలూ గుండ్రని ఆకారంలో ఉంటాయి.

2) పెన్నును సూర్యునికెదురుగా నిలువుగా, అడ్డంగా పట్టుకున్నప్పుడు ఏర్పడే నీడల్లో ఏమైనా తేడా ఉందా?
జవాబు:
పెన్ను అడ్డంగా, ఆపై నిలువుగా పట్టుకున్నప్పుడు పెన్ను నీడ భిన్నంగా ఉంటుంది. పెన్నును నిలువుగా పట్టుకున్నప్పుడు నీడ వస్తువు ఆకారంలో కనిపిస్తుంది. పెన్నును అడ్డంగా తిప్పినప్పుడు నీడ గుండ్రంగా ఉంటుంది.

3) డస్టర్ కు ఉండే వివిధ ముఖాలను సూర్యునికి ఎదురుగా ఉంచినప్పుడు ఏర్పడే నీడలలో ఏం తేడా గమనించారు?
జవాబు:
డస్టర్ లో ఉండే వివిధ ముఖాలు సూర్యునికి ఎదురుగా ఉంచినప్పుడు నీడలలో తేడాలను గమనించవచ్చు. డస్టర్ తలం మారినపుడు నీడ ఆకారం కూడా మారిపోయింది. కొన్ని సార్లు నీడ పొడవుగా కనిపిస్తుంది మరియు కొన్ని సార్లు కాదు.

4) వస్తువు యొక్క వివిధ ముఖాలను సూర్యుని వైపుగా తిప్పుతుంటే ఆ వస్తువుతో ఏర్పడిన నీడ ఆకారం ఎందుకు మారుతుంది?
జవాబు:
వస్తువు యొక్క వివిధ ముఖాలను సూర్యుని వైపు తిప్పుతుంటే దాని తలాలు మారుతూ కాంతిని నిరోధించిన ప్రాంతానికి తగ్గట్టు నీడలు ఏర్పడ్డాయి.

AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 126

ప్రశ్న 6.
దీర్ఘచతురస్రాకారపు కార్డ్ బోర్డ్ ముక్కను తీసుకోండి. సూర్యునికాంతిని లేదా టార్చ్ లైట్ ను ఉపయోగించి ఆ కార్డ్ బోర్డ్ ముక్కతో వివిధ ఆకారాల నీడలను ఏర్పరచడానికి ప్రయత్నించండి. తదుపరి ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
1) ఆ కార్డ్ బోర్డ్ ముక్కతో చతురస్రాకారపు నీడను ఏర్పరచగలిగారా?
జవాబు:
కాంతి వనరు ముందు దీర్ఘచతురస్రాకార కార్డ్ బోర్డ్ ను కొంచెం వంచినప్పుడు అది చదరపు ఆకారపు నీడను ఏర్పరుస్తుంది.

2) త్రిభుజాకార నీడను ఏర్పరచగలిగారా?
జవాబు:
మనం వస్తువును కాంతి వైపు క్రమంగా తిప్పినప్పుడు చదరపు నీడ త్రిభుజంగా మారుతుంది.

3) వృత్తాకార నీడను ఏర్పరచగలిగారా?
జవాబు:
లేదు. వృత్తాకార నీడను ఏర్పరచలేకపోయాము.

4) ఏ ఇతర ఆకారాల నీడలు ఏర్పరచగలిగారు?
జవాబు:
దీర్ఘచతురస్రాకారం, చదరము, సరళరేఖ, రాంబస్, త్రిభుజం వంటి ఆకారాలను ఏర్పరచగలిగాము.

5) ఒకే వస్తువుకు వివిధ ఆకారాల నీడలు ఎందుకు ఏర్పడుతున్నాయి?
జవాబు:
కాంతి కిరణాలు అనుసరించే సరళరేఖ మార్గం కారణంగా, ఒక వస్తువు యొక్క స్థానాన్ని మార్చి మనం వేర్వేరు ఆకారాలను పొందవచ్చు.

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 126

ప్రశ్న 7.
1) పిన్‌హోల్ కెమెరాకు గుండుసూదితో రెండు రంధ్రాలు ఏర్పరిస్తే ఏం జరుగుతుందో ఊహించండి. తర్వాత కెమెరాకు రెండు రంధ్రాలను ఏర్పరచి కొవ్వొత్తిని చూడండి. మీ పరిశీలన మీ నోటు పుస్తకంలో రాయండి.
2) మీరు ఊహించినది సరయినదేనా? పోల్చుకోండి.
జవాబు:
పిన హోల్ కెమెరాకు రెంండు రంధ్రాలు చేస్తే ఆశ్చర్యంగా రెండు ప్రతిబింబాలు ఏర్పడ్డాయి.’ అంటే రెండు రంధ్రాలు రెండు కటకాల వలె పనిచేశాయి.

కృత్యం – 8

6th Class Science Textbook Page No. 128

ప్రశ్న 8.
భూతద్దం తీసుకొని తెల్లని డ్రాయింగ్ షీట్ తో ఏర్పరచిన తెరపై చెట్టు యొక్క ప్రతిబింబం పడేటట్లు చేయండి.
1) షీట్ తెర మీద ఏర్పడిన ప్రతిబింబంలో మీరు ఏమి గమనిస్తారు?
జవాబు:
తెలుపు డ్రాయింగ్ షీట్ తెరమీద ఏర్పడిన ప్రతిబింబం తలక్రిందులుగా, చిన్నదిగా ఉంది.

2) పిన్పల్ కెమెరా ద్వారా మరియు భూతద్దం ద్వారా ఏర్పడిన ప్రతిబింబాల మధ్య ఏ తేడా ఉంది?
జవాబు:
భూతద్దం ద్వారా ఏర్పడిన ప్రతిబింబం పి ల్ కెమెరాతో ఏర్పడిన దానికంటే స్పష్టంగా ఉందని నేను గమనించాను.

AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

కృత్యం – 9

6th Class Science Textbook Page No. 129

ప్రశ్న 9.
మీ తరగతి గది తలుపు కిటికీలను మూసి గదిని చీకటి చేయండి. మీ స్నేహితులలో ఒకరిని తన చేతిలో అద్దాన్ని పట్టుకోమనండి. ఒక టార్చ్ లైట్ ముందు భాగాన్ని మందపాటి కాగితం లేదా అట్టతో మూసివేసి, ఆ కాగితానికి సన్నని రంధ్రం చేయండి. టార్చి లైట్ ను వెలిగించి ఆ సన్నని రంధ్రం గుండా వచ్చే కాంతిని మీ స్నేహితుని చేతిలో ఉన్న అద్దంపైన పడేట్లు చేయండి. పటంలో చూపినట్లు ఆ అద్దంపై పడిన కాంతి తిరిగి అద్దం నుండి బయలుదేరి ఆ గదిలోని మరొక స్నేహితునిపై పడేట్లుగా అద్దాన్ని సరిచేసి పట్టుకోమని మీ మొదటి స్నేహితునికి చెప్పండి.
AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు 5
1) పై కృత్యంలో మీరేం పరిశీలించారు?
జవాబు:
ఏదైనా వస్తువుపై కాంతి పడినపుడు, అది తిరిగి వెనుకకు మరలుతుంది. దీనిని పరావర్తనం అంటారు.

2) అద్దాన్ని పట్టుకున్న మీ మొదటి స్నేహితునితో టార్చ్ లైట్ కాంతి. అద్దం మీద పడకుండా ఏదైనా పుస్తకాన్ని అద్దానికి అడ్డుగా ఉంచమని చెప్పండి. ఇప్పుడు టార్చ్ లైట్ ను వెలిగించి కాంతిని పుస్తకంపై పడేట్లు చేయండి. ఆ కాంతి పరావర్తనం చెంది మీ రెండో స్నేహితునిపై పడిందా? లేదా? ఎందువల్ల?
జవాబు:
అద్దం స్థానంలో పుస్తకం ఉంచినప్పుడు నా స్నేహితుడిపై కాంతి పడలేదు. ఎందుకంటే పుస్తకం యొక్క ఉపరితలం అద్దంలా మృదువైనది కాదు. మృదువైన ఉపరితలాలపై పరావర్తనం ప్రభావవంతంగా ఉంటుంది.

3) పుస్తకంపై పడిన కాంతి పరావర్తనం చెందలేదా?
జవాబు:
పుస్తకంపై పడిన కాంతి పరావర్తనం చెందుతుంది. కానీ అది క్రమ రహిత పరావర్తనం. ఎందుకంటే పుస్తక ఉపరితలం అద్దంలా మృదువైనది కాదు.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 131

ప్రశ్న 1.
ఒక గాజు దిమ్మెను ఒక చివర పట్టుకుని ఎండలో నిలబడండి. మీ చేతి నీడ, గాజు దిమ్మె నీడలను పరిశీలించండి. ఏం గమనించారో వివరించండి.
జవాబు:
a) గాజు దిమ్మె నీడను ఏర్పరచదని నేను కనుగొన్నాను.
b) నా చేతి నీడను గమనించాను.
c) దీని అర్థం గాజు దిమ్మె పారదర్శక వస్తువు మరియు చేయి అపారదర్శక వస్తువు.
d) అపారదర్శక వస్తువులు మాత్రమే స్పష్టమైన నీడను ఏర్పరుస్తాయని నేను నిర్ధారించుకొన్నాను.
e) మరియు పారదర్శక వస్తువులు నీడలను ఏర్పరచవు.

ప్రశ్న 2.
ఏదైనా అపారదర్శక వస్తువుపై ఒక ప్రత్యేకమైన రంగు గల కాంతిని ప్రసరింపజేస్తే దాని నీడకు రంగు ఉంటుందా? లేదా? ఊహించండి. ప్రయోగం చేసి చూడండి. (పారదర్శక రంగు కాగితాలు (డ్రామాలైట్ల .. కాగితాలు) టార్చ్ ముందు అమర్చి ప్రత్యేకమైన రంగు గల కాంతిని పొందవచ్చు.)
జవాబు:
a) రంగు గల కాంతిలో అపారదర్శక వస్తువులు నీడలను ఏర్పరచుతాయి.
b) కాని వాటి నీడలకు రంగు ఉండదు.
c) ఎందుకంటే నీడ కాంతిని నిరోధించే ప్రదేశం.
d) ఇది కాంతి రంగు ద్వారా ప్రభావితం కాదు.

ప్రశ్న 3.
మామూలు విద్యుత్ బల్ట్, ట్యూబ్ లైట్ లలో ఏది కచ్చితమైన ఆకారం గల నీడలు ఏర్పరుస్తుంది? ప్రయోగం చేసి కనుక్కోండి. కారణం తెలపండి.
జవాబు:
a) ఎలక్ట్రిక్ బల్బ్ మరియు ట్యూబ్ లైట్లలో ఎలక్ట్రిక్ బల్బ్ వలన స్పష్టమైన మరియు కచ్చితమైన ప్రతిబింబము ఏర్పడుతుంది.
b) ఎలక్ట్రిక్ బల్బ్ గుండ్రని ఆకారంలో ఉంటుంది.
c) ఇది ఎక్కువ కాంతిని ఇస్తుంది.
d) మరియు దీని కాంతి తీవ్రంగా ఉంటుంది.
e) విద్యుత్ బల్బ్ లో కిరణాలు ఒక కేంద్ర బిందువు నుండి వస్తాయి. అందుకే విద్యుత్ బల్బ్ కచ్చితమైన మరియు స్పష్టమైన నీడలను ఏర్పరుస్తుంది.
f) కాని ట్యూబ్ లైట్లో కిరణాలు అలా ఉండవు.
g) ఇక్కడ కాంతి జనకం పొడవుగా ఉంటుంది.
h) మరియు కాంతి వేరు వేరు వైపుల నుండి వస్తువులపై పడుతుంది.
i) కాబట్టి నీడ కచ్చితంగా, అంత స్పష్టంగా ఉండదు.

AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

ప్రశ్న 4.
నీ గదిలో గోడపైన ఒక అద్దం ఉంది. ఆ గదిలో నీ స్నేహితుడు ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. గోడపైన ఉన్న అద్దంలో నీవు అతనికి కనిపించడం లేదు. అద్దంలో నీవు నీ స్నేహితునికి కనిపించడానికి నీవు నీ స్థానాన్ని ఎలా మార్చుకుంటావు? వివరించండి.
జవాబు:
a) ఒక చిన్న టెక్నిక్ తో అద్దంలో నా స్నేహితుడికి నేను కనిపించవచ్చు.
b) పరావర్తనం వలన అద్దంలో ప్రతిబింబం ఏర్పడును.
c) పడిన కాంతి అంతే కోణంలో పరావర్తనం చెందును.
d) అందుకే నా స్నేహితుడు నాకు కనిపించినప్పుడు నేను అతనికి కనిపిస్తాను.
e) కాబట్టి నా స్నేహితుడు నాకు కనిపించే వరకు నేను నా స్థలాన్ని సర్దుబాటు చేస్తాను.
f) నా స్నేహితుడు నాకు కనిపించినప్పుడు, నేను కూడా నా స్నేహితుడికి కనిపిస్తాను.

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

SCERT AP 6th Class Science Study Material Pdf 10th Lesson విద్యుత్ వలయాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 10th Lesson Questions and Answers విద్యుత్ వలయాలు

6th Class Science 10th Lesson విద్యుత్ వలయాలు Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ………… అంటారు. (కరెంట్)
2. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ………………………… నియంత్రిస్తుంది. (స్విచ్)
3. విద్యుత్ ను తమగుండా ప్రవహింపజేసే పదార్థాలను ……………………. అంటారు. (విద్యుత్ వాహకాలు)
4. విద్యుత్ బల్బును …………………. కనిపెట్టాడు. (థామస్ ఆల్వా ఎడిసన్)

II. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. బల్బులో కాంతిని ఇచ్చే భాగం
A) లోహపు మూత
B) గాజు కోటరం
C) ఫిలమెంట్
D) ధృవాలు
జవాబు:
C) ఫిలమెంట్

2. విద్యుత్ బంధకాన్ని గుర్తించండి.
A) జడ పిన్ను
B) ఇనుప మేకు
C) ప్లాస్టిక్ స్కేలు
D) పెన్సిల్ ములుకు
జవాబు:
C) ప్లాస్టిక్ స్కేలు

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

3. ప్రస్తుతం మనం వాడుతున్న బల్బులోని ఫిలమెంట్ ను దీనితో తయారుచేస్తున్నారు.
A) ఇనుము
B) రాగి
C) టంగ్ స్టన్
D) దూది
జవాబు:
C) టంగ్ స్టన్

III. ఈ క్రింది. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
విద్యుత్ వలయం అనగానేమి? పటం సహాయంతో వివరించండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 10
విద్యుత్ ఘటంలోని విద్యుత్ ధన ధృవం నుంచి ప్రారంభమై విద్యుత్ పరికరాల్లో ప్రయాణించి తిరిగి రుణ ధృవాన్ని చేరుతుంది. దీనినే విద్యుత్ వలయము అంటాము. విద్యుత్ వలయం పూర్తి అయినప్పుడు మాత్రమే విద్యుత్ పరికరాలు పనిచేస్తాయి.

ప్రశ్న 2.
టార్చిలైటు యొక్క భాగాలేవి?
జవాబు:
టార్చిలైటులో ప్రధానంగా విద్యుత్ ఘటాలు, బల్బు, స్విచ్, లోహపు తీగలు ఉంటాయి. ఇవన్నీ లోహపు పాత్రలో ఒక పద్ధతిలో కలపబడి స్విచ్ వేసినప్పుడు బల్బు వెలిగే విధంగా అమర్చబడి ఉంటాయి.

ప్రశ్న 3.
కింది వాటిని విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలుగా వర్గీకరించండి.
ఎ) నీరు
బి) ప్లాస్టిక్ పెన్ను
సి) పెన్సిల్ ములుకు
డి) పొడిగా ఉన్న నూలుగుడ్డ
ఇ) తడిగా ఉన్న నూలుగుడ్డ
ఎఫ్) పొడిగా ఉన్న కట్టె
జి) తడిగా ఉన్న కట్టె
జవాబు:
విద్యుత్ వాహకాలు :
నీరు, పెన్సిల్ ములుకు, తడిగా ఉన్న నూలు గుడ్డ, తడిగా ఉన్న కట్టె.

విద్యుత్ బంధకాలు :
ప్లాస్టిక్ పెన్ను, పొడిగా ఉన్న నూలు గుడ్డ, పొడిగా ఉన్న కట్టె.

ప్రశ్న 4.
కింది పటంలో చూపిన విధంగా టార్చిలైటులో ఘటాలను అమర్చినప్పుడు ఏమి జరుగుతుంది?
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 2
జవాబు:
టార్చిలైట్ పటంలో విద్యుత్ ఘటాలు తిప్పి ఉన్నాయి. అందువలన విద్యుత్ ప్రవాహం జరగదు. కాబట్టి బల్బు వెలగదు. విద్యుత్ ఘటాలను సరిచేసినట్లయితే వెలుగుతుంది.

ప్రశ్న 5.
చేతికి రబ్బరు తొడుగు వేసుకొని వీధి దీపాలను బాగుచేస్తున్న ఒక వ్యక్తిని చూసి నీహారికకు అనేక సందేహాలొచ్చాయి. ఆ సందేహాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:

  1. విద్యుత్ దీపాలు బాగుచేస్తున్న వ్యక్తి చేతికి రబ్బరు తొడుగు ఎందుకు వేసుకున్నాడు?
  2. రబ్బరు తొడుగుకు విద్యుత్ కి ఉన్న సంబంధం ఏమిటి?
  3. రబ్బరు తొడుగు ఉండటం వల్ల మనం ఎలా రక్షించబడతాము?
  4. విద్యుత్తు తీగపైన ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. ఎందుకు?

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 6.
ఒక ఘటం, స్విచ్, బల్బులను వలయంలో కలిపినప్పుడు బల్బు వెలగలేదు. కారణాలు ఏమై ఉంటాయో ఊహించి రాయండి.
జవాబు:
విద్యుత్ వలయంలో విద్యుత్తు ధన ధృవం నుంచి ఋణ ధ్రువానికి ప్రయాణిస్తుంది. కావున విద్యుత్ వలయంలో పరికరాలను ఒక పద్ధతిలో కలపాలి. లేనట్లయితే విద్యుత్ ప్రసరణ జరగదు, బల్బు వెలగదు.

ప్రశ్న 7.
నీకు ఇచ్చిన పదార్థాలు వస్తువులు విద్యుత్ వాహకాలో, విద్యుత్ బంధకాలో ఏ విధంగా పరీక్షించి తెలుసుకుంటావు?
జవాబు:

  • ఒక పదార్థం విద్యుత్ వాహకం అవునో కాదో తెలుసుకోవటానికి నేను విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేస్తాను.
  • పరిశీలించాల్సిన పదార్థాన్ని విద్యుత్ వలయంలో పెట్టినప్పుడు బల్బు వెలిగితే దాని ద్వారా విద్యుత్తు ప్రసరించింది అని అర్ధం. కావున అది విద్యుత్ వాహకం.
  • బల్బ్ వెలగకపోతే ఆ పదార్థం ద్వారా విద్యుత్తు ప్రసరించలేదు అంటే అది విద్యుత్తు బంధకమని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 8.
ఒక ఘటం, స్విచ్, బల్బు ఉన్న విద్యుత్ వలయ పటాన్ని గీయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 3

ప్రశ్న 9.
నిత్య జీవితంలో విద్యుత్ ను ఏయే పనులలో ఉపయోగిస్తున్నామో ఒక జాబితా రాయండి.
జవాబు:
విద్యుత్ మన నిత్య జీవితంతో చాలా ముడిపడి ఉంది.

  1. ఇంటిలో వెలుతురు కోసం విద్యుత్ బల్బు వెలిగిస్తాము.
  2. గాలి కోసం ఉపయోగించే ఫ్యాను విద్యుత్ వల్ల పనిచేస్తుంది.
  3. వేడి నీటి కోసం హీటర్ గీజర్ వాడతాము.
  4. వేసవిలో చల్లదనం కోసం వాడే ఏ.సి.లు విద్యుత్ తో పనిచేస్తాయి.
  5. వీధిలైట్లు, వాహనాల్లోని దీపాలు వెలగటానికి విద్యుత్ కావాలి.
  6. పరిశ్రమలు పనిచేయటానికి విద్యుత్ కావాలి.
  7. విద్యుత్ వాహనాలు, రైళ్లు నడపటానికి విద్యుత్ కావాలి.
  8. మిక్సీ, గైండర్, ఓవెన్, ఫ్రిజ్ వంటి అనేక గృహోపకరణాలు పనిచేయడానికి విద్యుత్ కావాలి.

కృత్యాలు

కృత్యం – 1 ఘటాన్ని పరిశీలిద్దాం

6th Class Science Textbook Page No. 110

ప్రశ్న 1.
టార్చిలైట్ బల్బును లేదా ఒక విద్యుత్ బల్బు (పటం)ను జాగ్రత్తగా పరిశీలించండి.

టార్చిలైట్ బల్బ్ లో ఒక లోహపు దిమ్మ. దానిపైన గాజుబుగ్గ ఉన్నాయి కదా ! లోపల ఉన్న రెండు తీగలను గమనించండి. ఒక తీగ లోహపు దిమ్మకు, రెండో తీగ దిమ్మ మధ్యలో ఉన్న ఆధారానికి కలిపి ఉంటాయి. ఈ రెండు తీగలూ ధృవాలుగా పనిచేస్తాయి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 4

విద్యుత్ బల్బ్ లో దిమ్మ వెనుకవైపు రెండు ఉబ్బెత్తు భాగాలుంటాయి. గాజు కోటరం వాటిని పరిశీలించండి. దిమ్మ పగులగొట్టి లోపలి తీగలు ఎలా అమర్చి ఉన్నాయో పరిశీలించండి. (గాజు ముక్కలు గుచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి) టార్చ్ బల్బ్ కు, విద్యుత్ బల్బుకు తేడాలను గుర్తించండి.

బల్బు లోపల ఉన్న రెండు తీగల మీదుగా ఒక సన్నని స్పింగులాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం దీన్నే ‘ఫిలమెంట్’ అంటారు.

• బల్బుకూ, ఘటానికి రెండు ధృవాలు ఎందుకు ఉంటాయి?
జవాబు:
బల్బ్ కు, ఘటానికి రెండు ధృవాలు ఉంటాయి. వీటిలో ఒకటి ధన ధృవము, రెండవది ఋణ ధృవము. ధన ధృవము నుండి ఋణ ధృవానికి విద్యుత్ ప్రవహిస్తుంది. అందువలన ఇవి రెండు ధృవాలు కలిగి ఉంటాయి.

• ఘటం సహాయంతో బల్బు ఎలా వెలుగుతుంది?
జవాబు:
ఘటం లోపల రసాయన పదార్థాలు ఉంటాయి. వీటి నుండి విద్యుత్ ఉత్పత్తి కావటం వలన బల్బ్ వెలుగుతుంది.

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

కృత్యం – 2 సాధారణ విద్యుత్ వలయాలు

6th Class Science Textbook Page No. 110

ప్రశ్న 2.
పటం – (బి) నుండి (జి) వరకు చూపిన విధంగా విద్యుత్ వలయాన్ని వేరు వేరు విధాలుగా కలపండి. బల్బు వెలుగుతున్నదో లేదో గమనించి, మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 5
పట్టిక

వలయం అమరిక బల్బు వెలుగుతుందా (అవును/కాదు)
పటం – బి
పటం – సి
పటం – డి
పటం – ఇ
పటం – ఎఫ్
పటం – జి

• పై పటాలలో దేనిలో బల్బ్ వెలుగుతుంది ? వేటిలో బల్బ్ వెలగదు? ఎందుకు?
జవాబు:
(డి), (ఇ) పటాలలో మాత్రమే బల్బ్ వెలుగుతుంది. విద్యుత్ ప్రవహించడానికి ఒక మూసి ఉన్న మార్గం ఉంది. కాని మిగిలిన పటాలలో విద్యుత్ ప్రసార మార్గం మూసిలేదు.

వలయం అమరిక బల్బు వెలుగుతుందా (అవును/కాదు)
పటం – బి కాదు
పటం – సి కాదు
పటం – డి అవును
పటం – ఇ అవును
పటం – ఎఫ్ కాదు
పటం – జి కాదు

కృత్యం – 3 స్విచ్ (మీట) ఎలా పనిచేస్తుంది?

6th Class Science Textbook Page No. 112

ప్రశ్న 3.
పటంలో చూపిన విధంగా ఒక చెక్క పలకపైన గాని లేదా ఒక థర్మకోల్ షీటుపైన గాని వలయాన్ని అమర్చండి.
వలయంలో A, B ల వద్ద రెండు డ్రాయింగ్ పిన్నులు అమర్చండి. ఒక పిన్నీసును తీసుకొని దాని ఒక కొన (B) వద్ద తాకేటట్టుగాను, రెండవ కొన విడిగా ఉండేటట్లుగాను అమర్చండి. బల్బు వెలుగుతుందా ? ఇప్పుడు పిన్నీసు రెండవ కొనను (A) కి తాకించండి. ఇప్పుడు బల్బు వెలుగుతుందో లేదో గమనించండి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 6
• పిన్నీసు రెండవ కొన (A) ని తాకనప్పుడు బల్బు ఎందుకు వెలగలేదు?
జవాబు:
రెండవ కొనని తాకనపుడు విద్యుత్ వలయం పూర్తి కాలేదు. అందువలన బల్బ్ వెలగలేదు.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 113

ప్రశ్న 4.
రెండు ఘటాలున్న ఒక టార్చిలైటును తీసుకొని, దానిలో ఘటాలను సాధ్యమైనన్ని విధాలుగా అమర్చండి. ఏ సందర్భంలో బల్బు వెలుగుతుందో గమనించండి. ప్రతిసారి మీ అమరికను పటం ద్వారా చూపండి. ఘటాలను ఒక నిర్దిష్టమైన పద్దతిలో అమర్చినప్పుడు మాత్రమే టార్చిలైటు బల్బు వెలుగుతుంది. ఎందుకో గమనించండి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 7
జవాబు:

ఘటాల కలయిక బల్బ్ వెలుగుతుంది / వెలగలేదు
++ (ధన, ధన) వెలగలేదు
+- (ధన, ఋణ) వెలుగుతుంది
– – (ఋణ, ఋణ) వెలగలేదు

కృత్యం – 5 విద్యుత్ వాహకాలు, బంధకాలను గుర్తిద్దాం

6th Class Science Textbook Page No. 114

ప్రశ్న 5.
కృత్యం-3లో ఉపయోగించిన విద్యుత్ వలయాన్ని తీసుకోండి. పటంలో చూపిన విధంగా A, B ల మధ్య ఉండే పిన్నీసును తొలగించండి.

ఇప్పుడు A, B లను తాకేటట్లుగా జడపిన్ను, పిన్నీసు, పెన్సిల్, రబ్బరు, ప్లాస్టిక్ స్కేలు, అగ్గిపుల్ల, లోహపు చేతి గాజు, గాజుతో చేసిన చేతి గాజు, పేపరు క్లిప్పు, ఉప్పు నీరు, నిమ్మరసం మొదలయిన వస్తువులను ఒకదాని తరవాత మరొకటి ఉంచండి. ఏయే సందర్భాలలో బల్బు వెలుగుతుందో పరిశీలించి పట్టికలో నమోదు చేయండి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 8
జవాబు:

పట్టిక :

వస్తువు పదార్థం బల్బు వెలుగుతుందా (అవును / కాదు)
1. జడపిన్ను లోహం అవును
2. రబ్బరు రబ్బరు కాదు
3. ప్లాస్టిక్ స్కేలు ప్లాస్టిక్ కాదు
4. అగ్గిపుల్ల చెక్క కాదు
5. గణిత పేటికలోని డివైడరు లోహం అవును
6. పేపరు ముక్క కాగితం కాదు
7. ఇనుప మేకు లోహం అవును
8. గాజు ముక్క గాజు కాదు
9. పెన్సిల్ గ్రాఫైట్ అవును
10. లోహపు ముక్క లోహం అవును
11. చాక్ పీసు సున్నం కాదు
12. పేపర్ క్లిప్పు లోహం అవును

దీని ఆధారంగా పట్టికలోని వస్తువులను విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలుగా వర్గీకరించి క్రింది పట్టికలో రాయండి.
జవాబు:

విద్యుత్ వాహకాలు విద్యుత్ బంధకాలు
జడపిన్ను రబ్బరు
గణిత పేటికలోని డివైడరు ప్లాస్టిక్ స్కేల్
ఇనుపమేకు అగ్గిపుల్ల
పెన్సిల్ పేపర్ ముక్క
లోహపు ముక్క గాజు ముక్క
పేపర్ క్లిప్ చాక్ పీస్

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 118

ప్రశ్న 1.
పాఠంలోని కృత్యం -4లో కొన్నిసార్లు బల్బు వెలగడం గమనించాం. ఈ సందర్భాలలో కూడా బల్బు వెలగకుండా చేయగలనని నిహారిక సవాలు చేయడమే గాక వెలగకుండా చేసి చూపించింది. ఆమె ఏమేమి చేసి ఉండవచ్చు?
జవాబు:
ఘటాలను సరిగా కలిపినప్పటికి బల్బు ధృవాలను మార్చితే బల్బు వెలగదు. ఈ విధంగా నిహారికా బల్బు వెలగకుండ చేసి ఉండవచ్చు.

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 2.
పటంలో చూపిన విధంగా వలయాన్ని కలపండి.
ఎ) బల్బు వెలుగుతుందా? ఎందుకు?
బి) బల్బు వెలిగే విధంగా వలయాన్ని పూర్తి చేయండి.
సి) ఇవ్వబడిన పటం నందు ఘటం, బల్బుల అమరికను పరిశీలించి సరిగ్గా ఉన్నవో లేవో చూడండి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 9
జవాబు:
ఎ) పటంలో చూపిన వలయంలో బల్బు వెలగదు. దీనికి కారణం రెండు ఘటాలు ధన ధృవము వైపు కలపబడి ఉన్నాయి.
బి)AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 10a
సి) ఇవ్వబడిన పటంలో ఘటాల, బల్బు అమరిక సరిగా లేదు. బల్బ్ యొక్క రెండు ధృవాలు ఘటం యొక్క ఋణ ధృవానికి కలపబడి ఉన్నాయి. ఇది సరి కాదు బల్బ్ యొక్క ధన ధృవము ఘటం యొక్క ధన ధృవానికి, బల్బ్ యొక్క ఋణ ధృవం ఘటం యొక్క ఋణ ధృవానికి కలపాలి.

ప్రశ్న 3.
థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొన్న విధానాన్ని గురించి చదివారు కదా ! బల్బు కనిపెట్టడంలో అతను పడిన శ్రమను నీవెట్లా అభినందిస్తావు?
జవాబు:
థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచానికి విద్యుత్ బల్బు అందించిన మహనీయుడు. ఇతను ప్రతీది ప్రయోగాలు చేసి, నేర్చుకొనే మనస్తత్వం కలవాడు. తన జీవిత కాలంలో వెయ్యికి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడంటే అతని శ్రమ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ కోసం తను దాదాపు వెయ్యికి పైగా పదార్థాలు పరిశీలించారు. అంటే అతని పట్టుదల అర్థమవుతుంది.

విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ కోసం అతను నూలు దారాన్ని, వెదురు కర్రను కూడా ఉపయోగించాడంటే అతని అంకితభావం అర్థమవుతుంది. ఎడిసన్ యొక్క ఇటువంటి కృషి వలన ప్రపంచం నేడు వెలుగుతో నిండి ఉంది. కావున ప్రపంచానికి వెలుగు నింపిన శాస్త్రవేత్తగా ఎడిసన్ ను కీర్తించవచ్చు.

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 4.
కింది పటంలో చూపిన విధంగా వలయాలను కలపండి. ప్రతి సందర్భంలో మీరేమి గమనించారో నమోదు చేయండి.
జవాబు:

  1. మొదటి సందర్భంలో రెండు ఘటాల ధన ధ్రువాలు ఒకదానితో ఒకటి కలపబడి ఉన్నాయి. కావున విద్యుత్ ప్రసరించదు. అందువలన బల్బు వెలగలేదు.
  2. రెండవ సందర్భంలో రెండు ఘటాలు సరైన విధానంలో కలపబడి ఉన్నాయి. అనగా ఒక ఘటము యొక్క ధన ధ్రువం రెండవ ఘటము యొక్క ఋణ ధ్రువానికి కలపబడి ఉంది. కావున విద్యుత్ ప్రసరించి బల్బ్ వెలుగుతుంది.
  3. మూడవ సందర్భంలో విద్యుత్ ఘటం ఒకటి ఉంది. కావున బల్బు వెలిగినప్పటికి తక్కువ కాంతితో వెలుగుతుంది.
  4. నాలుగవ సందర్భంలో మూడు ఘటాలు ఉపయోగించబడ్డాయి. అవి కూడా సరైన వరుసలో కలుపబడి ఉన్నాయి. కావున బల్బు వెలుగుతుంది అయితే మూడవ సందర్భంలో కంటే మూడు రెట్లు ప్రకాశవంతంగా బల్బు వెలగడం గమనించవచ్చు.

దీన్ని బట్టి ఘటాల సంఖ్య పెరిగితే బల్బు కాంతి తీవ్రత పెరుగుతుంది. వాటిని సరైన పద్ధతిలో అమర్చినపుడే బల్బ్ వెలుగుతుంది.

AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం

AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం

SCERT AP 6th Class Science Study Material Pdf 9th Lesson జీవులు – ఆవాసం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 9th Lesson Questions and Answers జీవులు – ఆవాసం

6th Class Science 9th Lesson జీవులు – ఆవాసం Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. జీవులు జీవించే ప్రదేశంను ……………………… అంటారు. (నివాసం)
2. మృత్తిక ఆవాసంలోని ………………….. అంశం. (నిర్జీవ)

II. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. కింది వానిలో సజీవుల లక్షణం కానిది ………….
A) ప్రత్యుత్పత్తి
B) పెరుగుదల
C) శ్వాస తీసుకోకపోవడం
D) విసర్జన
జవాబు:
C) శ్వాస తీసుకోకపోవడం

AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం

2. కింది వానిలో భౌమ్య ఆవాసం
A) కొలను
B) తోట
C) సరస్సు
D) నది
జవాబు:
B) తోట

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సజీవులకు ఉండే సామాన్య లక్షణాలు ఏవి?
జవాబు:
జీవులు వేర్వేరు నిర్దిష్ట లక్షణాలను చూపుతాయి.

1) చలనం :
చాలా జీవులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళతాయి. వీటి కదలికలకు కాళ్ళు, రెక్కలు, వాజములు వంటి అవయవాలు ఉన్నాయి. మొక్కల వంటి కొన్ని జీవులు నేలలో స్థిరంగా ఉన్నందున ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళవు.

2) ఆహారం :
ఆహారాన్ని తీసుకోవటం జీవుల లక్షణం. ఇవి శక్తిని పొందడానికి ఆహారాన్ని తీసుకుంటాయి.

3) పెరుగుదల :
జీవులు ఎప్పటికప్పుడు పెరుగుతాయి. వీటిలో పెరుగుదల ఒక సాధారణ దృగ్విషయం.

4) శ్వాసక్రియ :
అన్ని జీవులు తమ పరిసరాల నుండి గాలిని పీల్చుకుంటాయి. చాలా జీవులకు దాని కోసం ప్రత్యేకమైన అవయవాలు ఉన్నాయి. మొక్కల వాయువుల మార్పిడి కోసం పత్ర రంధ్రాలు అనే ప్రత్యేక భాగాలు ఉన్నాయి.

5) విసర్జన :
మొక్కలు మరియు జంతువులు రెండూ జీవన ప్రక్రియలలో వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. విసర్జన అనే ప్రక్రియ ద్వారా అవి వాటిని విసర్జిస్తాయి.

6) కొత్త జీవులకు జన్మనివ్వడం :
సజీవులన్నీ కొత్త జీవులకు జన్మనిస్తాయి. జంతువులలో కొన్ని గుడ్లు పెట్టటం ద్వారాను, మరికొన్ని పిల్లలను కనడం ద్వారాను కొత్త జీవులను పుట్టిస్తాయి. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలనీ, పిల్లల్ని కనే జంతువులను శిశోత్పాదకాలనీ అంటారు. మొక్కలు విత్తనాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి.

7) ఉద్దీపనలకు ప్రతిస్పందించడం :
పరిసరాలలోని ఉద్దీపనలకు అనుగుణంగా సజీవులన్నీ ప్రతిస్పందనను చూపుతాయి. జీవుల ప్రతిస్పందనలకు కారణమైన పరిసరాలలోని మార్పును ఉద్దీపన అంటారు.

ప్రశ్న 2.
చెట్టులో చలనం కనబడనప్పటికీ అది సజీవి అని మీరు ఎలా చెప్పగలరు?
జవాబు:

  • చెట్టు కదలనప్పటికి అది జీవుల యొక్క క్రింది లక్షణాలను కలిగి ఉంది.
  • చెట్టు మొదలు పెరుగుదల చూపిస్తుంది.
  • ఆహారం తీసుకోవడం, శ్వాస తీసుకోవడం, వ్యర్థాలను విసర్జించడం, విత్తనాల ద్వారా మొక్కలను ఉత్పత్తి చేయటం, ఉద్దీపనలకు ప్రతిస్పందించటం చేస్తుంది.
  • కాబట్టి చెట్టు సజీవి అని నేను చెప్పగలను.

AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం

ప్రశ్న 3.
ఆవాసం అనగానేమి? మన ఇల్లు ఆవాసమని ఎలా చెప్పగలరు?
జవాబు:
జీవులు నివసించే ప్రదేశాలను ఆవాసాలు అంటారు.

  • ఆవాసాలు మొక్కలు మరియు జంతువులకు నివాస స్థలాలు. అవి వాటి జీవనానికి అనుకూలమైన పరిస్థితులను ఇస్తాయి.
  • వేడి మరియు చలి, వర్షం మొదలైన వాటి నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి ఇళ్ళలో నివసిస్తున్నాము. ఇల్లు మన ఆవాసము.
  • మనం జంతువులను మరియు పక్షులను పెంపుడు జంతువులుగా ఇళ్లలో పెంచుతాము.
  • పండ్లు మరియు కూరగాయలను ఇచ్చే కొన్ని మొక్కలను కూడా పెంచుతాము. కావున ఇల్లు ఒక ఆవాసం.

AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం

ప్రశ్న 4.
కొలనులోని వివిధ ప్రదేశాలలో జీవించే జీవుల జాబితా రాయండి.
జవాబు:

కొలనులోని ప్రదేశం జీవించే జీవులు
1. కొలను ఉపరితలం పై భాగం తూనీగ, మేఫ్లె, కింగ్ ఫిషర్ వంటి కీటకాలు, పక్షులు కొలనుపై ఎగురుతూ, మధ్యలో కొలను నీటిలో నిలబెట్టిన వెదురుబొంగు లేదా కర్రలపై సేదదీరుతూ ఉంటాయి. కొలను ఉపరితలం నుండి ఇవి ఆహారాన్ని పొందుతాయి.
2. కొలను ఉపరితలం నీటిపై గుండ్రంగా తిరిగే కీటకం, గుంట, గురుగు, మేథ్లె యొక్క డింభకాలు, పిస్టియా వంటి పూర్తిగా నీటిపై తేలే మొక్కలు. తామర వంటి వేర్లు భూమిలో ఉండి నీటి ఉపరితలంపైకి పెరిగే మొక్కలు. (నీటి ఉపరితలంపై నివసించే జీవులకు తగినంత రక్షణ లేకపోవటం వలన ఇతర జీవులకు త్వరగా ఆహారంగా మారుతుంటాయి.) నీటి ఉపరితలంపై బోలెడంత ఆహారం లభిస్తున్న కారణంగా నీటిలో ఈదే చేపలు సాధారణంగా ఆహారం కోసం కొలను ఉపరితలానికి వస్తుంటాయి.
3. కొలను అంచులు చాలా రకాలైన గడ్డి మొక్కలు, కప్పలు, కొంగలు, పీతలు మొదలైనవి. చేపలు సాధారణంగా ఇక్కడ గుడ్లను పెడుతుంటాయి.
4. కొలను మధ్యభాగం నీటి బొద్దింక, జలగ, దోమల డింభకాలు ఈ ప్రదేశంలో జీవిస్తుంటాయి. చేపలు, ఎండ్రకాయలు ఈదుతూ కనిపిస్తాయి.
5. కొలను అడుగు హైడ్రిల్లా వంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, కొన్ని జీవుల డింభకాలు జీవిస్తుంటాయి. ఈ ప్రదేశంలో కాంతి సరైనంత లభించదు. ఇక్కడ ఆహారం చనిపోయి, కుళ్లుతున్న పదార్థం రూపంలో లభిస్తుంది.

ప్రశ్న 5.
“నేనొక సజీవిని. నాకు నాలుగు కాళ్ళు ఉంటాయి. నేను నీటిలోనూ, నేల మీదా జీవించగలను” నా ఆవాసంలో నాతో పాటు జీవించే ఇతర జీవుల పేర్లు రాయండి.
జవాబు:

  • నీటిలో మరియు భూమిపై నివసించే నాలుగు కాళ్ళ జీవి కప్ప.
  • కప్ప యొక్క ఆవాసాలలో తాబేలు, చేప, కొంగ, నత్త, పీత, నీటిపాము, కీటకాలు వంటి జీవులు ఉంటాయి.

ప్రశ్న 6.
సూక్ష్మజీవులను గురించి మరింతగా తెలుసుకోవడం కోసం నీవేమి ప్రశ్నలను అడుగుతావు?
జవాబు:
ప్రశ్నలు :

  • సూక్ష్మజీవులు అంటే ఏమిటి?
  • అతిచిన్న సూక్ష్మజీవి అంటే ఏమిటి?
  • మనం సూక్ష్మజీవులను కంటితో చూడగలమా?
  • అన్ని సూక్ష్మజీవులు మనకు హానికరమా?
  • సూక్ష్మజీవులను పరిశీలించడానికి ఉపయోగించే పరికరం ఏమిటి?

ప్రశ్న 7.
వానపాము ఉద్దీపనకు ప్రతిస్పందిస్తుంది అని ఏ విధంగా ఋజువు చేస్తావు? (కృత్యం – 5)
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం 1
ఉద్దేశం :
వానపాములో కాంతికి అనుగుణంగా చూపే ప్రతిస్పందన.

ఏమేమి అవసరం :
గాజు జాడీ, నల్లని కాగితం, టార్చిలైటు, తడిమట్టి, వానపాము.

ఏమి చేయాలి :
దగ్గరలో లభించే తడి మట్టి నుండి ఒక వానపామును సేకరించండి. ఒక గాజు జాడీని తీసుకోండి. పటంలో చూపినట్లుగా నల్లని కాగితంతో గాజు జాడీ సగ భాగాన్ని కప్పండి. జాడీలో కొంత తడిమట్టిని వేసి, వానపామును కాగితంతో కప్పని ప్రదేశంలో ఉంచండి. జాడీని ఒక మూతతో కప్పి దానికి చిన్న రంధ్రాలను చేయండి. జాడీపై టార్చిలైటు సహాయంతో కాంతి పడేలా చేయండి.

ఏమి పరిశీలిస్తావు :
వానపాము జాడీలోని చీకటి ప్రదేశంలోనికి అనగా నల్లని కాగితంతో కప్పిన ప్రదేశంలోనికి వెళ్ళిపోతుంది.

ఏమి నేర్చుకున్నావు :
వానపాము కాంతికి (ఉద్దీపన) అనుగుణంగా స్పందించింది.

AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం

ప్రశ్న 8.
కొలనులోని వివిధ ప్రదేశాలను చూపే పటం గీయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం 2

ప్రశ్న 9.
ఆవాసం పాడుగాకుండా ఉంచటం కోసం ఏమి చర్యలను తీసుకుంటారు?
జవాబు:

  • మనం కొలనులు, సరస్సులు, నదులు మరియు భూమి సమీపంలో వ్యర్థాలను వేయకూడదు.
  • అడవులను నరికివేయకూడదు.
  • పరిశ్రమలు వ్యర్థాలను గాలిలోకి, నీటిలోకి విడుదల చేయకూడదు.
  • ప్లాస్టిక్ కవర్లను వాడకూడదు.
  • ప్లాస్టిక్, టైర్లు మరియు పాలిథీన్ కవర్లను కాల్చకూడదు.
  • బోరు బావులను విచక్షణారహితంగా తవ్వకూడదు.

కృత్యాలు

కృత్యం – 1 సజీవులు – నిర్జీవులు

6th Class Science Textbook Page No. 95

ప్రశ్న 1.
మీకు తెలిసిన ప్రాణం ఉన్న జీవుల జాబితాను తయారు చేయండి. ఏదైనా జీవించి ఉంది అని మీరు అనుకుంటే అందుకు కారణాలను చెప్పడం మాత్రం మర్చిపోకండి.
జవాబు:
కుక్క – ఇది శ్వాస తీసుకుంటుంది
చెట్టు – దీనికి పెరుగుదల ఉంది
గేదె – కాళ్ళతో కదులుతుంది

గేదె మాదిరిగానే కుర్చీలు, బల్లలకు కూడా నాలుగు కాళ్ళు ఉంటాయి కదా ! మరి అవి ఎందుకు కదలవు?
జవాబు:
కుర్చీలు మరియు బల్లలు నిర్జీవులు కాబట్టి అవి కదలలేవు.

• చెట్లు కదలవు కాని అవి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. వాటినుండి కొత్త మొక్కలు వస్తాయి. అసలు మనం ఒక వస్తువు సజీవమైనదో నిర్జీవమైనదో ఎలా చెప్పగలం?
జవాబు:
అవును, చెట్లు సజీవులు. కానీ అవి కదలలేవు. ఇది మినహా దీనికి అన్ని జీవ లక్షణాలు ఉన్నాయి.

• అసలు ఒక వస్తువు సజీవమైనదో నిర్జీవమైనదో ఎలా చెప్పగలవు?
జవాబు:
జీవులకు పెరుగుదల మరియు శ్వాస వంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. వీటి ద్వారా మనం వస్తువు సజీవమైనదో నిర్జీవమైనదో చెప్పగలం.

• జీవులకు అనేక లక్షణాలు ఉన్నాయని మీరు గమనిస్తారా?
జవాబు:
అవును, జీవులకు స్పష్టమైన లక్షణాలు ఉన్నాయి.

• సజీవులలో ఉండే సాధారణ లక్షణాల ఆధారంగా మనం నిర్జీవులను వేరుచేయగలమా?
జవాబు:
అవును. సజీవులలో ఉండే సాధారణ లక్షణాల ఆధారంగా మనం నిర్జీవులను వేరుచేయగలం.

• నీవు కూడా ఒక సజీవివేనని నీకు తెలుసా? అలా అని ఎలా చెప్పగలవు?
జవాబు:
అవును నేను కూడా సజీవినే. ఎందుకంటే చలనం, పెరుగుదల, శ్వాస మరియు పునరుత్పత్తి వంటి జీవ లక్షణాలు ఉన్నాయి.

కృత్యం – 2 జీవుల లక్షణాలను పోల్చుదాం!

6th Class Science Textbook Page No. 96

ప్రశ్న 2.
సజీవుల లక్షణాలను మొక్కలు, జంతువులు మరియు రాళ్ళతో పోల్చండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం 3
• మీలో ఉన్న లక్షణాలు మొక్కలలోనూ జంతువులలోనూ కూడా ఉన్నాయా?
జవాబు:
అవును. ఎక్కువగా మొక్కలు మరియు జంతువులు నా లాంటి లక్షణాలను కలిగి ఉన్నాయి, కాని మొక్కలు కదలలేవు.

• మొక్కలలోని లక్షణాలను, మీతో కానీ మరే జంతువుతో కానీ పోల్చినప్పుడు ఏ విధంగా భిన్నంగా ఉన్నాయి?
జవాబు:
మొక్కలకు కదిలే లక్షణం లేదు.

• మొక్కలలో, జంతువులలో ఒకే రకంగా ఉండే సాధారణ లక్షణాలేవి?
జవాబు:
1) పెరుగుదల 2) కదలిక 3) ఆహారం తీసుకోవడం 4) శ్వాసించడం 5) వ్యర్థాలను విసర్జించడం 6) వేడికి ప్రతిస్పందించడం 7) స్పర్శకు ప్రతిస్పందించడం 8) కాంతికి ప్రతిస్పందించడం 9) కొత్తవాటికి (జీవులకు) జన్మనివ్వడం.

• మీరు కూడా మిగిలిన జంతువుల లాంటివారే అని అంగీకరిస్తారా?
జవాబు:
అవును. అన్ని జీవనక్రియలు జంతువుల మాదిరిగానే ఉన్నాయని నేను అంగీకరిస్తున్నాను. కాని మానవులు, ఎక్కువ మేధస్సు మరియు సాంస్కృతికత కలిగిన జీవులు.

• రాళ్ళలో ఉండే ఏయే లక్షణాలను మీరు పరిశీలించారు?
జవాబు:
రాళ్ళకు జీవ లక్షణాలు లేవు. కాబట్టి అవి నిర్జీవులు.

కృత్యం – 3 ఉద్దీపనకు ప్రతిస్పందన

6th Class Science Textbook Page No. 97

ప్రశ్న 3.
ఒక మొనదేలిన వస్తువుపై కాలు పెట్టినప్పుడు మీరేమి చేస్తారు? మీ కాలును వెనక్కు తీసుకుంటారు కదా? కింది పట్టికలో ఇవ్వబడిన పరిస్థితులకు మీరెలా స్పందిస్తారో, మీ స్నేహితులతో చర్చించి రాయండి.

ఉద్దీపన ప్రతిస్పందన
మొనదేలిన వస్తువు పైన కాలు పెట్టినప్పుడు
మంటను ముట్టినప్పుడు
ఐస్ క్రీమ్ ను తాకినప్పుడు
ప్రకాశవంతమైన కాంతిని చూచినపుడు కళ్ళు ఆర్పడం
చీమ/దోమ కుట్టినప్పుడు
చింత లేదా నిమ్మ గురించి విన్నపుడు నోట్లో నీరు

జవాబు:

ఉద్దీపన ప్రతిస్పందన
మొనదేలిన వస్తువు పైన కాలు పెట్టినప్పుడు పాదాన్ని వెనక్కి తీసుకోవడం
మంటను ముట్టినప్పుడు చేయిని వెనక్కి తీసుకోవడం
ఐస్ క్రీమ్ ను తాకినప్పుడు చేయిని వెనక్కి తీసుకోవడం
ప్రకాశవంతమైన కాంతిని చూచినపుడు కళ్ళు ఆర్పడం
చీమ/దోమ కుట్టినప్పుడు కుట్టిన చోట గీరటం
చింత లేదా నిమ్మ గురించి విన్నపుడు నోటిలో నీరు ఊరటం

• మన మాదిరిగానే అన్ని జీవులు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయా?
జవాబు:
అవును. అన్ని జీవులు ఉద్దీపనలకు ప్రతిస్పందించే లక్షణాన్ని కలిగి ఉంటాయి.

• జంతువుల మాదిరిగా మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయా?
జవాబు:
అవును. మొక్కలు జంతువుల వలే ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి.

AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం

కృత్యం – 4 – మైమోసా (అత్తి – పత్తి)

6th Class Science Textbook Page No. 98

ప్రశ్న 4.
‘టచ్ మీ నాట్’ (అత్తిపత్తి లేదా మైమోసా) మొక్కను పరిశీలించడం చాలా కుతూహలంగా ఉంటుంది కదా ! ఈ మొక్కను తాకినప్పుడు అది ఎలా ప్రతిస్పందిస్తుంది?
• మీరు ఈ మొక్కను తాకినప్పుడు అది ఎలా స్పందించింది?
జవాబు:
మైమోసాను తాకినప్పుడు, అది దాని ఆకులను మూసివేస్తుంది.

• తిరిగి పూర్వస్థితిని పొందడానికి ఎంత సమయం పడుతుంది?
జవాబు:
దాని మునుపటి స్థితిని తిరిగి పొందడానికి దాదాపు 15 నుండి 20 నిమిషాలు పడుతుంది.

కృతం – 5

విత్తనాలకు ప్రాణం ఉందా, లేదా?

6th Class Science Textbook Page No. 98

ప్రశ్న 5.
విత్తనాలు మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. మొక్కలకు ప్రాణం ఉందని మనకు తెలుసు. అదేవిధంగా విత్తనాలకు కూడా ప్రాణం ఉందని చెప్పవచ్చా? విత్తనాలకు ఉండే సజీవ లక్షణాల గురించి చర్చిద్దాం.
• విత్తనాలు ఆహారాన్ని తీసుకుంటాయా? అవి ఎక్కడి నుంచి తీసుకుంటాయి?
జవాబు:
విత్తనాలలో ఆహారం నిల్వ ఉంటుంది కాబట్టి అవి ఆహారం తీసుకోవు. నిల్వ ఆహారాన్ని కొద్ది మొత్తంలో వాడుకొంటాయి.

• చాలాకాలం వరకు విత్తనాలు అలాగే ఉంచితే అవి చనిపోతాయా?
జవాబు:
అవును. విత్తనాలు ఎక్కువ కాలం నిల్వ చేస్తే చనిపోవచ్చు.

• విత్తనాలను భూమిలో నాటినప్పుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది మొలకెత్తుతుంది. సజీవ లక్షణం చూపుతుంది.

కృత్యం – 6 నీటిలో సూక్ష్మజీవులు

6th Class Science Textbook Page No. 100

ప్రశ్న 6.
చెరువు, బావి, బోరుబావి వంటి వాటిలోని నీటిని వేరు వేరు గ్లాసుల్లో సేకరించండి. స్లెడ్ పైన నీటి చుక్కవేసి దానిపైన కవర్‌ స్లిపను ఉంచండి. సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. మీరు పరిశీలించిన వాటికి బొమ్మలు గీయండి. వాటి ఆకారాలను గురించి చర్చించండి.
AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం 4

• మీరు ఏవైనా సూక్ష్మజీవులను నీటి నమూనాలలో చూశారా?
జవాబు:
నేను వివిధ రకాల సూక్ష్మజీవులను చూశాను. కొన్ని సన్నగా దారం వలె మరియు కొన్ని గుండ్రంగా ఉన్నాయి.

• అన్ని నీటి నమూనాలలో ఒకే రకమైన సూక్ష్మజీవులు ఉన్నాయా?
జవాబు:
లేదు. వేర్వేరు నీటి నమూనాలలో వివిధ రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి.

• సూక్ష్మజీవులు లేని నీరు ఏది?
జవాబు:
అన్ని నీటి నమూనాలలో సూక్ష్మజీవులు ఉన్నాయి. కాని బోరు బావి నీటిలో తక్కువగా ఉన్నాయి.

• ఏ నీటి నమూనాలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నాయి? ఎందుకు?
జవాబు:
కొలను నీటిలో ఎక్కువ సూక్ష్మజీవులు ఉన్నాయి. ఎందుకంటే ఇది తగినంత గాలి, సూర్యరశ్మి ఉన్న ఆవాసము.

• బోరు నీటిలో, చెరువు నీటిలో కనపడే సూక్ష్మజీవులలో తేడా ఏమిటి?
జవాబు:
బోరు నీటిలో సూక్ష్మజీవులు కదులుతూ ఉన్నాయి. చెరువు నీటిలో ఆకుపచ్చని సూక్ష్మజీవులు ఎక్కువగా ఉన్నాయి.

కృత్యం – 7 ఎవరు, ఎక్కడ నివసిస్తారు?

6th Class Science Textbook Page No. 100

ప్రశ్న 7.
జీవుల పేర్లు, అవి ఎక్కడ జీవిస్తాయో దాని ప్రకారం పట్టిక పూరించండి. మీకు సహాయపడటానికి కొన్ని ఉదాహరణలు నింపబడ్డాయి.
AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం 5
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం 6
• ఒకటి కన్నా ఎక్కువ గడులలో ఎన్ని జీవులు ఉన్నవి? వాటిని అక్కడ ఎందుకు ఉంచారు?
జవాబు:
ఒకటి కంటే ఎక్కువ వరుసలో రెండు జీవులు ఉన్నాయి. అవి ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో నివసిస్తున్నాయి.

• కప్పను ఏ గడిలో చేరుస్తారు?
జవాబు:
నేను కప్పను రెండవ మరియు మూడవ వరుసలో ఉంచాను.

కృత్యం – 8

6th Class Science Textbook Page No. 102

ప్రశ్న 8.
కొలనులో ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో జీవించగలిగిన జీవుల పేర్లు తెలపండి. వీటిని కొలనులో వేరు వేరు ప్రదేశాలలో జీవించగలిగేలా చేస్తున్న అంశాలు ఏమిటి?
జవాబు:
ఎ) కప్పలు, కొంగలు, పీతలు కొలనులో ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో జీవించగల జీవులు.
బి) వీటి ఆహారపు అలవాట్లు మరియు శరీర నిర్మాణం కొలనులోని వివిధ ప్రాంతాలలో ఉండటానికి వీలు కల్పిస్తాయి.

• కొలనులోని వివిధ ప్రదేశాలను విడివిడిగా ఆవాసం అనవచ్చా? ఎందుకని? ఎందుకని అనలేం?
జవాబు:
అనవచ్చు. కొన్ని జీవులు కొలనులో వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తాయి కాబట్టి దీనిని ఆవాసంగా పిలుస్తారు. కొలనులోని వివిధ ప్రదేశాలలో వేరు వేరు జీవులు నివసిస్తున్నాయి. అచ్చటి పరిస్థితులు, భిన్న జీవన వైవిధ్యం వలన వీటిని ఆవాసాలుగా పిలవవచ్చు.

• కొలనులో కాళ్ళు కలిగిన జంతువులేమైనా ఉన్నాయా?
జవాబు:
ఉన్నాయి. కప్పకు కాళ్ళు ఉన్నాయి.

• కొలనులో ఉన్న అన్ని జంతువులకు తోకలు ఉన్నాయా?
జవాబు:
లేదు. కొలనులో ఉన్న అన్ని జంతువులకు తోకలు లేవు.

• కొలనులోని జంతువులన్నీ ఈదుతాయా?
జవాబు:
లేదు. కొంగలు మొ|| జీవులు కొలనులో ఈదలేవు.

• నీటి కొలను ఉపరితలంను ఆవాసంగా కలిగిన జీవులు ఏవి?
జవాబు:
పాండ్ స్కేటర్, మేఫె యొక్క డింభకాలు మరియు తూనీగలు.

• కొలనులో పెరిగే మొక్కల పత్రాలన్నీ ఒకే విధంగా ఉన్నాయా?
జవాబు:
కొలనులోని అన్ని మొక్కల పత్రాలు ఒకే రకంగా లేవు. వేరు వేరు మొక్కల పత్రాలు వేరువేరుగా ఉన్నాయి.

• నీటి అడుగు భాగంలో జీవిస్తున్న పిస్టియా వంటి మొక్కల పత్రాలు, నీటి పై భాగంలో తేలియాడే తామర పత్రాలలో ఏమైనా భేదాలు ఉన్నాయా?
జవాబు:
ఎ) నీటిలో పెరుగుతున్న (పిస్టియా వంటి) మొక్క యొక్క ఆకులు నీటి ప్రవాహాన్ని తట్టుకోవటానికి చిన్న గొట్టపు ఆకులను కలిగి ఉంటాయి.
బి) ఉపరితలంపై తేలియాడే (తామర) మొక్కలు సూర్యరశ్మిని గ్రహించడానికి పెద్ద ఆకులను కలిగి ఉంటాయి.

AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం

కృత్యం – 9 – చెట్టు ఒక ఆవాసం

6th Class Science Textbook Page No. 103

ప్రశ్న 9.
కొలను ఆవాసం అయినట్లే మొక్కలు, చెట్లు కూడా ఆవాసాలే. పక్షులు, కోతులు, ఉడుతలు, పాములు, చీమలు, సాలెపురుగులు, గొంగళి పురుగులు, ఈగలు, చిమటలు, కందిరీగలు, కీచురాళ్ళు, చిన్న చిన్న నాచుమొక్కలు, దోమలు వంటి జీవులు చెట్లపై ఉండటాన్ని చూస్తుంటాం. ఇవి చెట్లపైన కనబడే ప్రదేశాన్ని బట్టి వర్గీకరించండి. పట్టికలో రాయండి. మీకు తెలిసిన జీవులను కూడా జతచేయండి.

చెట్టు మొదలు దగ్గర చీమలు ……
కాండం పైన
కొమ్మల మధ్య కోతులు ….
పత్రాల పైన లేక పత్రాల లోపల

జవాబు:

చెట్టు మొదలు దగ్గర చీమలు, పాములు, గొంగళి పురుగులు, చిమటలు, చిన్న మొక్కలు, దోమలు
కాండం పైన చీమలు, గొంగళి పురుగులు, చిమటలు, దోమలు, ఉడుతలు, తేనెటీగలు, కందిరీగలు, సాలెపురుగులు
కొమ్మల మధ్య పక్షులు, కోతులు, గొంగళి పురుగులు, ఉడుతలు, దోమలు, తేనెటీగలు, కందిరీగలు, పాములు, చీమలు, సాలెపురుగులు
పత్రాల పైన లేక పత్రాల లోపల చీమలు, సాలెపురుగులు, గొంగళి పురుగులు, తేనెటీగలు, చిన్న కీటకాలు

కృత్యం – 10 – మన ఇంటిలో జీవించే జీవులు

6th Class Science Textbook Page No. 104

ప్రశ్న 10.
మనం ఇంటిలో పెంచుకుంటున్న పెంపుడు జంతువులు మన ఇంటిలోనే కాక ఇతర ప్రదేశాలలో కూడా జీవిస్తుంటాయా? ఏయే ప్రదేశాలలో అవి జీవిస్తుంటాయో రాయండి.
జవాబు:
అవును. మా పెంపుడు జంతువులు కూడా ఇతర ప్రదేశాలలో నివసిస్తాయి.
కుక్క – ఇది వీథుల్లో నివసిస్తుంది.
పిల్లి – ఇది కూడా వీథిలో నివసిస్తుంది.
చిలుకలు – చెట్టు మీద జీవిస్తాయి.

• కొన్ని రకాలైన జంతువులు, మొక్కలు మాత్రమే మన పరిసరాలలో ఎందుకు జీవిస్తున్నాయి?
జవాబు:
ఆహారం మరియు ఆశ్రయం కోసం కొన్ని జంతువులు మన పరిసరాలలో నివసిస్తాయి. మన ఆహారం మరియు అవసరాల కోసం మనం కొన్ని మొక్కలను పండిస్తాము.

కృతం – 11 నీటి మొక్కలను భూమిపై పెరిగే మొక్కలతో పోల్చుట

6th Class Science Textbook Page No. 105

ప్రశ్న 11.
హైడ్రిల్లా లేదా వాలిస్ నేరియా వంటి నీటి మొక్కలను సేకరించండి. అదేవిధంగా తులసి వంటి నేలపై పెరిగే మొక్కలను సేకరించి రెండింటిని పోల్చండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.

నేలపై పెరిగే మొక్క (తులసి) నీటి మొక్క (వాలిస్ నేరియా/హైడ్రిల్లా)
కాండం గట్టిగా, దృఢంగా లేతగా, మెత్తగా
పత్రం వెడల్పుగా, ఆకుపచ్చగా సన్నగా, గుండ్రంగా
వేరు తల్లి వేరు వ్యవస్థ పీచు వేరు వ్యవస్థ
ఇతరాలు నిలువుగా పెరుగుతుంది నీటి వాలు వైపు పెరుగుతుంది

మీ పరిశీలనల ఆధారంగా నీటి మొక్క నీటిలో పెరగటానికి ఎలా అనుకూలంగా ఉంటుందో రాయండి.
జవాబు:
నీటి మొక్కలు పీచు వేరు వ్యవస్థ కలిగి, కాండం లేతగా, మెత్తగా ఉండి నీటిలో పెరగటానికి అనుకూలతను కలిగి ఉంటాయి.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 108

ప్రశ్న 1.
ఒక చిలగడదుంపను, సీసాను, ఉప్పు, నీటిని తీసుకోండి. సీసా నిండుగా నింపి, నీటిలో ఉప్పు కలిపిన తరువాత చిలగడ దుంపను నీటిలో ఉంచండి. కొన్నిరోజులపాటు పరిశీలించిన తరువాత ఏమి జరిగిందో రాయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం 7

  • ఉప్పు నీటిని పీల్చుకోవడం ద్వారా తీపి చిలగడదుంప ఉబ్బిపోతుంది.
  • మొక్క నుండి తొలగించబడినప్పటికీ, చిలగడదుంపలో జీవక్రియ మార్పులు కొనసాగాయి.
  • ఇది పెరిగి వేర్లు మరియు కాండం ఏర్పరచింది.
  • అందువలన చిలగడదుంప కూడా ఒక జీవి అని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
కింది ఆవాసాలలో ఒకటి కన్నా ఎక్కువ జీవులు వేటిలో నివసిస్తాయో గుర్తించండి. వాటిని గురించి రాయండి.
అలాగే ఒక జంతువు ఏయే ఆవాసాలలో ఉంటుందో కూడా రాయండి. (కింది సమాచారం ఉపయోగించుకోండి.)
“జీర్ణకోశం, నీటి గుంట, వంట గది, తోట, చెట్టు, గడ్డి, నేల లోపల.”
జవాబు:

  1. జీర్ణకోశం : బాక్టీరియా, నులి పురుగులు, కొంకి పురుగులు
  2. నీటి గుంట : ఆకుపచ్చ గడ్డి, కప్పలు, కొంగలు, పీతలు, నత్తలు మొదలైనవి.
  3. వంటగది : బొద్దింక, బల్లులు, ఎలుకలు, చీమలు, ఈగలు మొదలైనవి.
  4. తోట : ఎలుకలు, తేనెటీగలు, సీతాకోకచిలుక, చీమలు, వానపాములు, తొండలు, పురుగులు మొదలైనవి.
  5. చెట్టు : పక్షులు, తేనెటీగలు, ఉడుతలు, దోమలు, క్రిమి లార్వాలు, చీమలు, చెదపురుగులు
  6. నేల లోపల : చీకటి పురుగులు, పాములు, ఎలుకలు, వానపాములు, నత్తలు, పీతలు, చెదపురుగులు, చీమలు మొదలైనవి.
  7. గడ్డి : మిడతలు, చీమలు, క్రిముల లార్వా మొదలైనవి.

ప్రశ్న 3.
సాలెపురుగు గూడులోని సాలీడును పరిశీలించండి. సాలీడు తన ఆవాసాన్ని ఏ విధంగా వినియోగించుకుంటుందో రాయండి.
జవాబు:

  • సాలెపురుగుల ఆవాసం ఒక ప్రత్యేక ప్రోటీన్లో రూపొందించబడింది.
  • సాలీడు సన్నని దారాలతో తన ఇంటిని నిర్మించుకొంటుంది.
  • సాలీడు కీటకాలను పట్టుకోవటానికి తన ఆవాసాన్ని వాడుకొంటుంది.
  • అనుకోకుండా అటు వచ్చిన కీటకాలు సాలీడు వలలో చిక్కుకొంటాయి.
  • వలలోని అలజడి కారణముగా సాలీడు కీటకాన్ని గుర్తిస్తుంది.
  • సాలీడు కొన్ని విషపూరిత పదార్థాలను పురుగుల శరీరంలోకి విడుదల చేసి వాటిని స్తంభింపజేస్తుంది. మరియు ఆహారాన్ని ద్రవ రూపంలోకి మార్చుకొంటుంది.
  • ఈ ద్రవ రూపమైన ఆహారం సాలీడు చేత గ్రహించబడుతుంది.
  • సాలీడు తన నివాసాలను ఆ విధంగా ఆహారం సంపాదించటానికి వాడుకొంటుంది.

ప్రశ్న 4.
ఒక హైడ్రిల్లా మొక్కను సేకరించండి. ఒక గ్లాసులోని నీటిలో దానిని ఉంచి, వారం రోజులపాటు పరిశీలించండి. హైడ్రిల్లా పెరుగుదలలో ఏయే మార్పులను గమనిస్తావు?
జవాబు:

  • హైడ్రిల్లా నీటి అడుగున పెరిగే మొక్క.
  • దీనికి ప్రత్యేకమైన వేర్లు ఉండవు.
  • ఆకులు చాలా చిన్నవి మరియు మొనతేలి లావుగా ఉన్నాయి.
  • ఆకులో ప్రత్యేకమైన ఈ నెలు లేవు.
  • ఆకులు నేరుగా కాడ లేకుండా కాండంతో జతచేయబడి ఉన్నాయి.
  • మనం ఈ హైడ్రిల్లాను ఒక గ్లాసు నీటిలో ఉంచినప్పుడు అది ఒకరోజులో ఒక అంగుళం పెరుగుతుంది.
  • ఇది కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్క సూర్యరశ్మి నుండి ఆహారాన్ని పొందుతుంది.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ పటంను తీసుకుని, మడ అడవులు పెరిగే ప్రదేశాన్ని రంగుతో నింపి గుర్తించండి.
జవాబు:
ఊదా :
AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం 8

ప్రశ్న 6.
నీ పెంపుడు జంతువైన కుక్క/ఆవు/పిల్లి నీ పట్ల ప్రేమతో మెలిగే అనుభవాలను రాయండి.
జవాబు:

  • కుక్క / పిల్లి / ఆవు వంటి జంతువులను పెంపుడు జంతువులుగా పిలుస్తారు.
  • మనిషి తన అవసరాలను తీర్చుకోవడానికి ప్రాచీన కాలంలో ఈ జీవుల పెంపకం చేశాడు.
  • రక్షణ మరియు ఆహారం కోసం మానవుడు వీటిని పెంచాడు.
  • మా ఇంట్లో నేను కుక్కను పెంచుతున్నాను. అది ప్రతి రోజు నాతో వాకింగ్ కి వస్తుంది.
  • నేను బయటి నుండి రాగానే పరిగెత్తుకొంటూ నా దగ్గరకు వస్తుంది.
  • ఆహారం పెట్టినపుడు ప్రేమగా తోక ఆడిస్తుంది.
  • బయటివారు ఎవరైనా ఇంటికి వస్తే అరిచి హెచ్చరిస్తుంది.
  • మా కుక్కతో మాకు చక్కటి అనుబంధం ఉంది.

ప్రశ్న 7.
మీ పాఠశాలలోని వివిధ ఆవాసాలను తెలియజేస్తూ ఒక పటంను గీయండి.
జవాబు:

AP Board 6th Class Science Solutions Chapter 9 జీవులు – ఆవాసం

ప్రశ్న 8.
మీ పాఠశాల సారస్వత సంఘ సమావేశంలో ఉపన్యసించటం కోసం “జంతువులకూ జీవించే హక్కు ఉన్నది” అన్న అంశం తయారుచేయండి.
జవాబు:
సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ వందనములు.

మన భూమి రకరకాలైన జీవరాశులతో నిండి ఉంది. మొక్కలు, జంతువులు, పశుపక్ష్యాదులు ముఖ్యమైనవి. ఇందులో మానవుడు తెలివైన జంతువు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం పుట్టిన మానవుడు అన్ని జీవరాశల పైన ఆధిపత్యాన్ని సాధించాడు.

అడవులను నరకడం, జంతువులను వేటాడటం, పశువులను బలి ఇవ్వడం వంటి చర్యల వల్ల జంతువులు, పశువులు, పక్షులు వాటి ఆవాసాలను కోల్పోతున్నాయి. ఫలితంగా అవి అంతరించిపోతున్నాయి. కొన్ని జంతువులు, పక్షులు పూర్తిగా కనిపించకుండా పోయాయి. దీనివల్ల ప్రకృతిలో సమతుల్యత దెబ్బ తింటుంది. పర్యవసానంగా మానవుని మనుగడ కష్టమవుతుంది.

ఈ భూమిపై ప్రతి జీవరాశికి జీవించే హక్కు ఉంది. కాబట్టి వేటాడటం, బలి ఇవ్వడం వంటి దుశ్చర్యలను మానివేసి మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. తెలివిగా ఉందాం!

జీవిద్దాం! జీవించనిద్దాం!

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

SCERT AP 6th Class Science Study Material Pdf 8th Lesson దుస్తులు ఎలా తయారవుతాయి Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 8th Lesson Questions and Answers దుస్తులు ఎలా తయారవుతాయి

6th Class Science 8th Lesson దుస్తులు ఎలా తయారవుతాయి Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. కృత్రిమ దారాలను మండించినపుడు …………. వాసన వస్తుంది. (ఘాటు)
2. పీచు → …………. → వస్త్రం. (దారం)
3. దూది నుంచి గింజలను వేరుచేయడాన్ని …………… అంటారు. (జిన్నింగ్)
4. …………… పీచు (దారం)ను బంగారు దారం అంటారు. (జనపనార)
5. సహజ దారాలకు (పోగులకు) ఉదాహరణ ………….. (నూలు, ఉన్ని)

II. సరియైన సమాధానాన్ని గుర్తించండి.

1. కృత్రిమ దారపు పోగును గుర్తించండి.
A) నూలు
B) ఉన్ని
C) అక్రిలిక్
D) జనపనార
జవాబు:
C) అక్రిలిక్

2. నూలు వడకడానికి ఉపయోగించే సాధనం
A) సూది
B) కత్తి
C) చరఖా
D) కత్తెర
జవాబు:
C) చరఖా

3. దారం నుంచి వస్త్రం తయారు చేసే ప్రక్రియ.
A) వడకడం
B) జిన్నింగ్
C) నేయడం
D) కత్తిరించడం
జవాబు:
C) నేయడం

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

4. జనపనార లభించే మొక్క భాగం
A) వేరు
B) పత్రం
C) పుష్పం
D) కాండం
జవాబు:
D) కాండం

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
వివిధ దారాలతో తయారయిన మీ ఇంటిలో మీరు ఉపయోగించే వస్తువులను పేర్కొనండి.
జవాబు:
చొక్కా – కాటన్
చీర – సిల్క్
స్వెట్టర్ – ఉన్ని
వాకిలి పట్టాలు – కొబ్బరి పీచు
లగేజి కవర్ – పాలిథీన్
గొడుగు – PVC
రైన్ కోట్ – PVC
గన్నీ బ్యాగ్ – జనపనార

ప్రశ్న 2.
దారపు పోగు కంటే దారం దృఢమైనది. ఎందుకు?
జవాబు:
దారంలోని సన్నని పోగుల వంటి నిర్మాణాలను దారపు పోగులు అంటారు. అనేక దారపు పోగుల కలయిక వలన దారం ఏర్పడుతుంది. దారపు పోగుల సంఖ్య పెరిగే కొలది దారం మందం మరియు గట్టితనం పెరుగుతుంది. అందువలన దారపు పోగు కంటే దారం బలంగా ఉంటుంది.

ప్రశ్న 3.
సహజ దారాలకు, కృత్రిమ దారాలకు మధ్య గల భేదాలను తెలపండి.
జవాబు:

సహజ దారాలు కృత్రిమ దారాలు
1) ఇవి మొక్కలు మరియు జంతువుల నుండి ఉత్పన్నమవుతాయి. 1) ఇవి రసాయనాల నుండి ఉత్పన్నమవుతాయి.
2) నీటి శోషణ సామర్థ్యం ఎక్కువ. 2) నీటి శోషణ సామర్థ్యము తక్కువ.
3) కాల్చినప్పుడు తీవ్రమైన వాసనలతో కూడిన బూడిదను ఏర్పరుస్తాయి. 3) కాల్చినపుడు ముడుచుకుపోయి ప్లాస్టిక్ వాసనను ఇస్తాయి.
4) ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. 4) ఆరటానికి తక్కువ సమయం పడుతుంది.
5) బట్టలు ముతకగా ఉంటాయి. 5) బట్టలు మృదువుగా ఉంటాయి.

ప్రశ్న 4.
నూలు దారాలతో రెయిన్ కోటును తయారు చేస్తే ఏమవుతుంది?
జవాబు:
వర్షం నుండి రక్షణ పొందటానికి రెయిన్ కోటులు వాడతారు. ఇవి నీటిని పీల్చుకోని స్వభావము కల్గి ఉంటాయి. కానీ నూలు దారాలు నీటిని బాగా పీల్చుకుంటాయి. నూలు దారాలతో రెయిన్ కోటు తయారుచేస్తే అవి నీటిని పీల్చుకొని తడిపేస్తాయి. కావున నూలు దారాలు రెయిన్ కోటు తయారీకి పనికిరావు.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 5.
జనపనార దారంను పొందే విధానం రాయండి.
జవాబు:
జనపనార మొక్క యొక్క కాండం నుండి జనపనార లభిస్తుంది. జనుము కోసిన తరువాత కొన్ని రోజులు నీటిలో నానబెడతారు. కాండం నీటిలో నానబెట్టినప్పుడు అది కుళ్ళిపోయి పై తొక్క సులభంగా ఊడిపోతుంది. ఈ కాండం బెరడు నుండి జనపనార వస్తుంది. ఈ దారంను నేయడం ద్వారా మనం గోనె సంచులను తయారుచేసుకోవచ్చు.

ప్రశ్న 6.
పత్తి మొక్క నుంచి నూలు వస్త్రాన్ని పొందడంలో గల దశలను తెలియజేసే ఫ్లోచార్టును రాయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 1a

ప్రశ్న 7.
సిరి తన పుట్టినరోజు సందర్భంగా బట్టతో చేసిన సంచులను తన తోటి విద్యార్థులకు బహుమతిగా ఇచ్చింది. మీరు ఆమెను ఎలా ప్రశంసిస్తారు?
జవాబు:
సిరి తన పుట్టినరోజున గుడ్డ సంచులను బహుమతిగా ఇచ్చింది. ఇది నిజంగా అభినందించాల్సిన అంశం. ఎందుకంటే: పాలిథీన్ కవర్లు నేలలో కుళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాక పరిసరాలను కలుషితం చేస్తాయి. ఇవి వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా నేల పెర్కొలేషన్ సామర్థ్యాన్ని నివారిస్తాయి. కానీ గుడ్డ సంచులు తేలికగా కుళ్ళి మట్టిలో కలిసిపోతాయి మరియు పర్యావరణానికి హాని కలిగించవు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి సిరి మంచి ప్రయత్నం చేసింది కావున అభినందించాలి.

ప్రశ్న 8.
పాలిథీన్ సంచులకు బదులుగా సహజ దారాలతో చేసిన సంచుల వాడకాన్ని ప్రోత్సహించే కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  • ప్లాస్టిక్ వద్దు – పర్యావరణమే ముద్దు
  • ప్లాస్టిక్ ఒక భూతం – గుడ్డ సంచులే హితం
  • ప్లాస్టిక్ కు నో చెప్పండి – చేతి సంచులకు యస్ చెప్పండి
  • ప్లాస్టిక్ ను వదిలేద్దాం – భూమిని బ్రతికిద్దాం
  • పరిష్కారంలో ఒక భాగంగా ఉండండి – కాలుష్యంలో కాదు
  • అరగని అన్నం మనకు కష్టం – కలవని ప్లాస్టిక్ నేలకు నష్టం

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 87

ప్రశ్న 1.
మీ ఇంటిలో వివిధ రకాల గుడ్డలను ఉపయోగించి తయారుచేసిన వస్తువులు ఏమేమి ఉన్నాయో వాటి జాబితా రాయండి. వాటిని నూలు, పట్టు, ఉన్ని, పాలిస్టర్, టెర్లిన్, నైలాన్ మొదలైన వాటిలో ఏవి దేనితో తయారయ్యా యో వర్గీకరించండి. మీ పట్టికలో మరికొన్ని చేర్చేందుకు ప్రయత్నించండి. మీ ఇంటిలో ఉండే పెద్దలు, ఉపాధ్యాయులు సహకారం తీసుకుని ఏ గుడ్డ ఏదో గుర్తించండి.

గుడ్డ రకం తయారుచేసిన వస్తువులు
1. నూలు
2. పట్టు కుర్తా, చీర
3. ఉన్ని మేజోళ్ళు ………
4. పాలిస్టర్
5. టెర్లిన్ చీర, ………..

జవాబు:

గుడ్డ రకం తయారుచేసిన వస్తువులు
1. నూలు నూలు చొక్కా సంచి, చీర, ధోవతి, గుమ్మం తెరలు, డ్రస్‌లు
2. పట్టు కుర్తా, చీర, తాళ్లు
3. ఉన్ని మేజోళ్లు, స్వెట్టర్లు
4. పాలిస్టర్ చొక్కాలు, చీరలు, ప్యాంటులు, ధోవతులు
5. టెర్లిన్ చీర, ఓణీలు, చొక్కాలు

1. మీ ఇంటిలో ఏ రకం బట్టలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?
జవాబు:
మా ఇంట్లో ఎక్కువగా కాటన్ మరియు పట్టు బట్టలు ఉపయోగిస్తున్నారు.

2. ఏ బట్ట ఎలాంటిదో ఎలా గుర్తించగలవు?
జవాబు:
తాకటం మరియు చూడటం ద్వారా దుస్తులు రకాన్ని గుర్తిస్తాము.

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 87

ప్రశ్న 2.
ఏదైనా ఒక గుడ్డముక్కను తీసుకోండి. భూతద్దంలో దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఒక్కొక్కదారాన్ని నెమ్మదిగా లాగండి. దానిని పరిశీలించండి. మీరు ఏమి గమనించారు?
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 2
1. మీరు ఏమి గమనించారు?
జవాబు:
దారము పోగుల వంటి చిన్న నిర్మాణాలను కలిగి ఉంది. ఒక దారాన్ని తీసుకోండి. దాని చివరలు వేళ్ళతో నలపండి. భూతద్దం ద్వారా గమనించండి.

2. దారం చివరన మరింత సన్నని దారాలు కనిపించాయా?
జవాబు:
అవును దారంలో సన్నని నిర్మాణాలు ఉన్నాయి.

3. ఒక సూది తీసుకోండి. ఈ దారాన్ని సూదిలో గుచ్చండి. సూది కన్నంలోకి దారం దూర్చగలిగారా? కష్టంగా ఉంది కదూ! సూదిలో దారం దూర్చడానికి మీ ఇంటిలో పెద్ద వాళ్లు ఏమి చేస్తారో ఎప్పుడైనా గమనించారా?
జవాబు:
సాధారణంగా మనం సూది రంధ్రములోకి దారము ఎక్కించలేకపోయినప్పుడు, మనం దారము చివరను మెలి తిప్పుతాము లేదా లాలాజలంతో చివరి భాగాన్ని గట్టిగా చేస్తాము.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

కృత్యం – 3

6th Class Science Textbook Page No. 88

ప్రశ్న 3.
కొన్ని సహజ, కృత్రిమ గుడ్డ ముక్కలను సేకరించండి. కింది పట్టికలో సూచించిన లక్షణాలను పరిశీలించండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.

లక్షణం సహజ వస్త్రం కృత్రిమ వస్త్రం
1. నీటిని పీల్చుకొనే సామర్థ్యము
2. ఆరటానికి పట్టే సమయం
3. కాలిస్తే వచ్చే వాసన
4. మండించిన తరువాత మిగిలినది
5. సాగే గుణం
6. నునుపుదనం

జవాబు:

లక్షణం సహజ వస్త్రం కృత్రిమ వస్త్రం
1. నీటిని పీల్చుకొనే సామర్థ్యము ఎక్కువ తక్కువ
2. ఆరటానికి పట్టే సమయం ఎక్కువ తక్కువ
3. కాలిస్తే వచ్చే వాసన మసి వాసన ప్లాస్టిక్ వాసన
4. మండించిన తరువాత మిగిలినది బూడిద ముడుచుకుపోతుంది
5. సాగే గుణం తక్కువ ఎక్కువ
6. నునుపుదనం తక్కువ ఎక్కువ

1. ఏ రకమైన వస్త్రాలు నునుపుగా ఉన్నాయి?
జవాబు:
ప్రకృతిలో కృత్రిమ వస్త్రాలు నునుపుగా ఉన్నాయి.

2. ఏ రకమైన వస్త్రాలు తొందరగా ఆరాయి?
జవాబు:
కృత్రిమ వస్త్రాలు తక్కువ సమయంలో ఆరాయి.

3. వస్త్రాల నునుపుదనం, అవి ఆరడానికి పట్టే సమయం మధ్య ఏదైనా సంబంధాన్ని గుర్తించావా?
జవాబు:
అవును, నునుపైన బట్టలు ఆరబెట్టడానికి తక్కువ సమయం పడుతుంది.

4. కాల్చినప్పుడు బూడిదగా మారిన వస్త్రాలు ఏమిటి?
జవాబు:
సహజ దారాలు కాల్చినపుడు బూడిదను ఇచ్చాయి.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 89

ప్రశ్న 4.
మీ చుట్టుపక్కల లేదా పొలాలలో నుండి పత్తి కాయలను సేకరించండి. కాయల్లో తెల్లటి దూది ఉంటుంది. దూదిలో నుంచి గింజలను వేరుచేయండి. కొంచెం దూదిని తీసుకోండి. దాన్ని భూతద్దంలో గానీ మైక్రోస్కోపు కింద ఉంచి గానీ పరిశీలించండి.
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 3
1. మీరు ఏమి గమనిస్తారు?
జవాబు:
నేను చిన్న వెంట్రుకల నిర్మాణాలను గమనిస్తాను. ఇవి పత్తి యొక్క దారపు పోగులు.

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 89

ప్రశ్న 5.
పత్తికాయల నుంచి దూదిని తీసి గింజలను ఏరివేయండి. కొంత దూదిని ఒక చేతితో తీసుకోండి. మరొక చేతి చూపుడువేలు, బొటనవేళ్లతో కొద్దిగా దూదిని పట్టుకుని మెల్లగా లాగండి. దానిని పురిపెడుతూ లాగండి.
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 4
1. దూది దారంగా రావడాన్ని గమనిస్తారు. ఇది గట్టిగా ఉంటుందా? ఉండదా?
జవాబు:
పత్తి లేదా ఉన్ని నుండి మనం తయారుచేసే దారం నేయడానికి ఉపయోగపడేంత బలంగా లేదు. పత్తి నుండి బలమైన దారం పొందడానికి రాట్నం మరియు తకిలి అనే పరికరాలు వాడతారు.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 91

ప్రశ్న 6.
ఒక గోనె సంచిని సేకరించండి. దానిలో నుండి ఒక దారాన్ని లాగండి. భూతద్దం కింద దారాన్ని పెట్టి పరిశీలించండి. జనపనార దారం సన్నని దారాలతో తయారయినట్టుగా గమనిస్తారు. దారాలు ఎలా కనిపిస్తున్నాయో పరిశీలించండి. వాటిని నూలు దారాలతో పోల్చండి.
జవాబు:
పత్తి మాదిరిగా, జనపనార దారం కూడా దుస్తుల తయారీకి ఉపయోగపడుతుంది. దీనిని “గోల్డెన్ దారపు పోగు” అని కూడా అంటారు. జనపనార బట్ట కాటన్ దుస్తులు వలె ఉండదు. ఇది గట్టి, బలమైనది మరియు మరింత కఠినమైనది.

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 92

ప్రశ్న 7.
కొబ్బరి ఆకులతో చాప ఎలా అల్లుతారు?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 5
కొబ్బరి ఆకులను లేదా రెండు వేరు వేరు రంగుల కాగితపు చీలికలను తీసుకోండి. కొబ్బరి ఆకుకు ఉన్న ఈ నెను తీసివేసి ఆకును రెండుగా చేయండి. ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా ఆకులను అమర్చండి. ఇంకొక ఆకును తీసుకుని పేర్చిన ఆకులు ఒకసారి పైకి ఒకసారి కిందికి వచ్చేలా అడ్డంగా దూర్చండి. (నవారు మంచం అల్లినట్లు) ఇలా ఆకులన్నీ దూర్చండి. చివరికి మీకు చదునుగా ఉండే చాప తయారవుతుంది. ఇదే విధంగా రంగుల కాగితాలు ఉపయోగించి అల్లండి.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 94

ప్రశ్న 1.
బట్టతో సంచి తయారుచేయండి. దాని మీద రంగురంగుల గుడ్డ ముక్కలతో డిజైన్లు కుట్టండి. పాఠశాలలో ప్రదర్శించండి.
జవాబు:

ప్రశ్న 2.
వివిధ రకాల దుస్తుల చిత్రాలు సేకరించండి. వాటి పేర్లు రాయండి. స్క్రాప్ బుక్ తయారుచేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం :

  1. ఈ స్క్రుకను విద్యార్థులు ఎవరికి వారే తయారు చేసుకోవాలి.
  2. బట్టలషాపు యజమానుల సహకారం తీసుకుని సేకరించిన దుస్తుల పేర్లు తెలుసుకుని రాయవచ్చు.

ప్రశ్న 3.
మీ ఉపాధ్యాయులతో లేదా మీ తల్లిదండ్రులతో చర్చించి మన రాష్ట్రంలో గల నూలు మిల్లులను చూపించే చార్టు తయారు చేయండి.
జవాబు:

ప్రశ్న 4.
చేనేత కార్మికులు, పత్తి రైతుల గురించిన సమాచారాన్ని వార్తాపత్రికల నుండి సేకరించండి. ఏదైనా ఒక దానిపైన మీ విశ్లేషణ రాయండి.
జవాబు:
విద్యార్థులు వారి నైపుణ్యం బట్టి ఎవరికి తోచిన రీతిలో వారు ఈ ప్రశ్నకు జవాబు వ్రాసి, విశ్లేషణ చేయాలి. ఉపాధ్యాయుని సలహా తీసుకోండి.

ప్రశ్న 5.
కృత్రిమ దారాలు కాల్చినపుడు ఘాటైన వాసన వస్తుందని చెప్పడానికి నీవు ఏమి ప్రయోగం చేశావు? ఆ ప్రయోగ విధానాన్ని రాయండి.
జవాబు:
వివిధ కృత్రిమ వస్త్రం ముక్కలను తీసుకొని ఒకదాని తరువాత ఒకటి కాల్చుతూ పరిశీలనలు నమోదు చేయండి. ఉన్ని త్వరగా కాలిపోదు. నైలాన్, పాలిస్టర్, టెరీలిన్, రేయాన్ వంటి దారాలు వాటిని కాల్చినప్పుడు అవి తీవ్రమైన వాసనను ఇస్తాయి. మరియు కుచించుకుపోతాయి.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 6.
ఈ లోగోలను పరిశీలించండి. వీనికి సంబంధించిన సమాచారం సేకరించండి.
జవాబు:

  • ‘ఆప్కో’ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత నేత కార్మికుల సహకార సంఘం యొక్క సంక్షిప్తీకరణ.
  • ఆప్కో 1976లో స్థాపించబడింది.
  • కో-ఆప్టెక్స్ అంటే తమిళనాడు చేనేత సహకార సమాజం యొక్క సంక్షిప్తీకరణ.
  • కో-ఆప్టెక్స్ చేనేత వస్త్రాల యొక్క మార్గదర్శక మార్కెటింగ్ సంస్థ.
  • దాని నెట్ వర్క్ ద్వారా భారతదేశం అంతటా విస్తరించి ఉన్న 203 షోరూమ్ ల ద్వారా వ్యాపారం సాగిస్తుంది.
  • 1935లో స్థాపించబడిన ఈ సంస్థ వార్షిక టర్నోవర్ రూ. 1000 కోట్లు.
  • వస్త్ర రంగుల సీతాకోకచిలుక లోగో అనేది కో-ఆప్టెక్స్ యొక్క నాణ్యత, మన్నిక మరియు సరసమైన వాణిజ్యానికి పర్యాయపదంగా మారింది.

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

SCERT AP 6th Class Science Study Material Pdf 7th Lesson కొలుద్దాం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 7th Lesson Questions and Answers కొలుద్దాం

6th Class Science 7th Lesson కొలుద్దాం Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. మిల్లీమీటరు ……………. కొలవడానికి ప్రమాణం. (పొడవు)
2. ఎక్కువ దూరాన్ని కొలవడానికి …………. ను ప్రమాణంగా ఉపయోగిస్తారు. (కి.మీ.)
3. ఒక వస్తువు ఆక్రమించిన సమతలం కొలతను ……………. అంటాం. (వైశాల్యం )

II. సరియైన సమాధానాన్ని గుర్తించండి.

1. సెంటీమీటరు స్కేలును ఉపయోగించి కొలవగలిగిన అతిచిన్న కొలత
A) సెంటీమీటరు
B) మిల్లీమీటరు
C) మీటరు
D) మైక్రోమీటరు
జవాబు:
B) మిల్లీమీటరు

2. ఘనాకార వస్తువుల ఘనపరిమాణం ఇలా కొలుస్తారు.
A) మీటరు
B) చదరపు మీటరు
C) క్యూబిక్ మీటరు
D) సెంటీమీటరు
జవాబు:
C) క్యూబిక్ మీటరు

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

3. అక్రమాకార ఉపరితలాల వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించేది
A) దారం
B) గ్రాఫ్ కాగితం
C) కొలపాత్ర
D) స్కేలు
జవాబు:
B) గ్రాఫ్ కాగితం

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఒక తరగతి గది పొడవు 20మీ. వెడల్పు 15మీ. ఆ గది వైశాల్యాన్ని లెక్కించండి.
జవాబు:
హాల్ యొక్క పొడవు (l) = 20 మీ.
హాల్ యొక్క వెడల్పు (b) = 15 మీ.
హాల్ యొక్క వైశాల్యం A = l × b = 20 మీ × 15 మీ = 300 మీ² = 300 చ.మీ.

ప్రశ్న 2.
రాము వాళ్ళ నాన్న 60 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు ఉన్న స్థలం కొన్నాడు. దానిలో 40 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు గల స్థలంలో ఇల్లు కట్టాడు. మిగిలిన ప్రదేశంలో తోట పెంచాలనుకున్నాడు. తోటకు ఎంత స్థలం వస్తుందో రాము కనుక్కోవాలనుకున్నాడు. అతనికి సహాయం చేయండి.
జవాబు:
దీర్ఘచతురస్రాకార ప్లాట్ యొక్క ప్రాంతం A = L1 × B1
ఇక్కడ L1 = 60 అడుగులు, B1 = 50అడుగులు
A1 = L1 × B1 = 60 అడుగులు × 50 అడుగులు = 3000 చదరపు అడుగులు
ఇంటి వైశాల్యం A2 = L2 × B2
ఇక్కడ L2 = 40 అడుగులు, B2 = 40 అడుగులు
A2 = L2 × B2 = 40 అడుగులు × 40 అడుగులు = 1600 చదరపు అడుగులు
మిగిలిన ప్రాంతం A3 = A1 – A2 = 3000 – 1600 = 1400 చ. అడుగులు
A3 = 1400 చదరపు అడుగులు. కాబట్టి తోట 1400 చదరపు అడుగులలో ప్రణాళిక చేయబడినది.

ప్రశ్న 3.
తాపీ మేస్త్రీని కలిసినప్పుడు ఇల్లు (డాబా) కట్టేటప్పుడు ఏ విధంగా కొలతలు తీసుకుంటాడో తెలుసుకోవడానికి ఏయే ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
ప్రశ్నలు :

  • ఒక ప్రాంతం యొక్క పొడవు మరియు వెడల్పును కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి?
  • గోడను నిర్మించడానికి అవసరమయ్యే ఇటుకలను ఎలా అంచనా వేస్తారు?
  • కాంక్రీటు సిద్ధం చేయడానికి మనం ఎంత సిమెంట్ మరియు ఇసుకను కలపాలి?
  • ఇటుకలను విరగగొట్టటానికి ఉపయోగించే పరికరం ఏమిటి?

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

ప్రశ్న 4.
స్కేలు ఉపయోగించి లోహపు తీగ మందాన్ని కొలవగలమా? వివరించండి.
జవాబు:

  • ఒక లోహపు తీగె మరియు పెన్సిల్ తీసుకోండి.
  • పెన్సిల్ చుట్టూ లోహపు తీగను చుట్టలుగా చుట్టండి.
  • ఇప్పుడు స్కేల్ ఉపయోగించి లోహపు తీగె యొక్క పొడవును కొలవండి.
  • ఆ పొడవును పెన్సిల్ చుట్టూ ఉన్న లోహపు తీగ చుట్టల సంఖ్యతో విభజించండి. అప్పుడు మనకు మెటల్ వైర్ యొక్క మందం లభిస్తుంది.

ప్రశ్న 5.
ఒక అరటిపండు ఘనపరిమాణం లెక్కించడానికి మీరు ఏ పద్ధతిని అనుసరిస్తారు? దాన్ని వివరించండి.
జవాబు:

  • అరటి పండు ఘనపరిమాణం కొలవటానికి కొలజాడీ, నీరు, దారము తీసుకోవాలి.
  • కొలజాడీలో కొంత నీరు తీసుకొని దాని ఘనపరిమాణం నిర్ధారించుకోవాలి.
  • ఘనపరిమాణం కొలవవలసిన అరటిపండుకు దారం కట్టి నీరు ఉన్న కొలజాడీలో ముంచాలి.
  • అరటిపండు నీటిలో మునగటం వలన నీటి మట్టం పెరుగుతుంది.
  • పెరిగిన నీటి మట్టం అరటిపండు ఘనపరిమాణానికి సమానం.

ప్రశ్న 6.
గ్రాఫ్ పేపర్‌ను ఉపయోగించి మీ అరచేతి వైశాల్యాన్ని ఎలా లెక్కిస్తారో వివరించండి.
జవాబు:

  • గ్రాఫ్ పేపర్ తీసుకొని దానిపై మీ అరచేయి ఉంచండి.
  • పెన్సిల్ ఉపయోగించి మీ అరచేతి యొక్క హద్దు రేఖలను గీసి మీ చేతిని తొలగించండి.
  • ఇప్పుడు అరచేతి సరిహద్దు లోపల పూర్తి చతురస్రాల సంఖ్యను లెక్కించండి.
  • తరువాత సగం లేదా సగం కంటే ఎక్కువ ఉన్న చతురస్రాలను పూర్తి చతురస్రంగా లెక్కించండి.
  • సగం కంటే తక్కువ ఉన్న చతురస్రాలను లెక్కించకుండ వదిలేయండి.
  • లెక్కించిన చతురస్రాలు ‘n’ ఉంటే అరచేతి యొక్క వైశాల్యం ‘n’ cm’ అవుతుంది.
  • ఈ ప్రక్రియ ద్వారా అరచేతి యొక్క వైశాల్యం కనుగొనవచ్చు.

ప్రశ్న 7.
కొయ్య సామగ్రి తయారుచేసేటప్పుడు వడ్రంగి కచ్చితమైన కొలతలు తీస్తాడు కదా! మీరెప్పుడైనా చూశారా? అతని పనితీరును మీరు ఎలా అభినందిస్తారు?
జవాబు:

  • వడ్రంగులు లోహపు టేపుతో కొలతలు తీసుకుంటారు.
  • అతను కొలతలను చాలా కచ్చితంగా మరియు మిల్లీమీటర్లతో తీసుకుంటాడు.
  • ఈ పనికి అతని అనుభవం ఉపయోగపడుతుంది.
  • ఏదైనా తప్పు కొలత తీసుకుంటే అది అతను తయారుచేస్తున్న ఫర్నిచర్ పై ప్రభావం చూపుతుంది.
  • కాబట్టి వడ్రంగుల పని నాణ్యత ఈ కొలతలపై ఆధారపడి ఉన్నందున కొలతలపై అతని మనస్సును ఏకాగ్రతగా ఉంచుతారు.
  • లేకపోతే వడ్రంగులు సమయం, పేరు మరియు డబ్బు కోల్పోవలసివస్తుంది.

ప్రశ్న 8.
గడియారంలో రెండు అంకెల మధ్య దూరం కచ్చితంగా సమానంగా ఉంటుంది. ఇలా కచ్చితమైన దూరం ఉండే వస్తువులు, విషయాల జాబితా రాయండి.
జవాబు:

  • కిలోమీటర్ రాళ్ళ మధ్య ఒకే విధంగా ఉంటుంది.
  • వాహనాల ముందు మరియు వెనుక చక్రాల మధ్య వ్యాసార్థం, సమానంగా ఉంటుంది.
  • ఫ్యాన్ రెక్కల మధ్య దూరం సమానం మొదలైనవి.

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 72

ప్రశ్న 1.
మీ స్నేహితులందరూ ఒక్కొక్కరుగా మీ తరగతి గదిలోని బల్ల అంచును ‘జాన’లలో కొలవండి.ఎవరికి ఎన్ని జానలు వచ్చాయో పట్టికలో నమోదు చేయండి.
పట్టిక -1
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 1

విద్యార్థి పేరు జానల సంఖ్య
1. వివేక్ 8
2. లిఖిత 9
3. రాజు 7
4. శ్రీదేవి 8
5. శ్రీనివాస్ 6

• టేబుల్ పొడవు కొలిచినప్పుడు జానల సంఖ్య అందరికీ సమానంగా వచ్చిందా?
జవాబు:
టేబుల్ పొడవు కొలిచినపుడు అందరి జానల సంఖ్య సమానంగా లేవు.

• టేబుల్ పొడవును సూచించే జానల సంఖ్య ఎవరికి ఎక్కువగా వచ్చింది? ఎందుకు?
జవాబు:
లిఖితకు జానల సంఖ్య ఎక్కువగా వచ్చింది.

• ఒకే బల్లను కొలిచినప్పటికీ ఒక్కొక్కరికి జానల సంఖ్యలో తేడా ఎందుకు వచ్చింది?
జవాబు:
ఒకే పొడవును కొలిచినప్పటికి చిన్న చేతులు ఉన్న వారికి ఎక్కువ జానలు వచ్చాయి.

ఇదేవిధంగా విద్యార్థులందరూ కలిసి వారివారి అడుగులతో మీ తరగతి గది పొడవును కొలిచి పట్టిక -2లో – నమోదు చేయండి.
పట్టిక – 2

విద్యార్థి పేరు అడుగుల సంఖ్య
1. వీరు 9
2. లక్ష్మి 8
3. శాంతి 10
4. శ్యామ్ 8
5. రాజు 7

• తరగతి గది పొడవును వేరు వేరు విద్యార్థులు కొలిచినపుడు అడుగుల సంఖ్య ఒకే విధంగా వచ్చిందా?
జవాబు:
వేరు వేరు విద్యార్థులకు అడుగుల సంఖ్య వేరుగా ఉంది.

• ఎవరు కొలిచినప్పుడు అడుగుల సంఖ్య ఎక్కువ వచ్చింది? ఎందుకు?
జవాబు:
శాంతి కొలిచినపుడు అడుగుల సంఖ్య ఎక్కువగా వచ్చింది.

• ఎవరు కొలిచినప్పుడు అడుగుల సంఖ్య తక్కువ వచ్చింది? ఎందుకు?
జవాబు:
రాజు కొలిచినపుడు అడుగుల సంఖ్య తక్కువగా వచ్చింది.

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 75

ప్రశ్న 2.
మీ తరగతిలోని మీ మిత్రుని ఎత్తు మీటరు స్కేలుతో ఎలా కొలుస్తావు?
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 2
1) ముందుగా మీ మిత్రుని వీపు గోడకు ఆనించి నిటారుగా నిలబడమనండి. కచ్చితంగా అతని తల పైభాగం మీద ఉండే విధంగా గోడ మీద ఒక గీత గీయండి.
2) ఇప్పుడు నేల నుంచి ఈ గీత వరకు గోడ మీద ఉన్న దూరాన్ని ఒక స్కేలుతో కొలవండి.
3) ఇదే విధంగా మీ మిత్రుని ఎత్తును మిగిలిన విద్యార్థుల ఎత్తును కూడా కొలవండి.
ఈ కొలతలన్నింటినీ మీ నోట్ బుక్ లో నమోదు చేయండి.

వేరు వేరు విద్యార్థుల ఎత్తులను నమోదు చేసిన కొలతలను జాగ్రత్తగా పరిశీలించండి.

• విద్యార్థులందరికీ ఒకే విధమైన కొలతలు వచ్చాయా?
జవాబు:
విద్యార్థులందరికీ ఒకే విధమైన కొలతలు రాలేదు. దీనికి కారణం గోడపై గుర్తించిన గీత విద్యార్థి తలపై ఉండకపోవటం.

• ఒకవేళ రాకపోయినట్లయితే, తేడా రావడానికి కారణం ఏమై ఉండవచ్చు?
జవాబు:
మీటర్ స్కేల్ ను సరిగా ఉపయోగించకపోవటం.

కృత్యం -3

6th Class Science Textbook Page No. 76

ప్రశ్న 3.
ఒక రూపాయి నాణాలను పది తీసుకుని వాటిని ఒక దానిపైన ఒకటి ఉండేటట్లు పటంలో చూపిన విధంగా అమర్చండి. వాటి మందాన్ని స్కేలుతో కొలిచి, ఆ విలువను నాణాల సంఖ్యతో భాగించినట్లయితే ఒక నాణెం మందం తెలుస్తుంది.
ఇదే విధంగా, మీ పాఠ్యపుస్తకంలోని ఒక పేజి మందాన్ని కొలవడానికి ప్రయత్నించండి.
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 3
జవాబు:
పుస్తకం మందాన్ని కొలిచి దానిని పుస్తక పేజీలతో భాగిస్తే ఒక పేజీ మందం తెలుస్తుంది.
ఉదా : పుస్తక మందం = 10 సెం.మీ.
పుస్తక పేజీల సంఖ్య = 100 మంది
పేజీ మందం = 10/100 = 0.01 సెం.మీ. = 0.1 మీ.మీ.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 77

ప్రశ్న 4.
వక్ర మార్గం యొక్క పొడవును మీరు ఎలా కనుగొంటారు?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 4
వక్రరేఖ పొడవును కొలవడం :

  • కొలవవలసిన వక్రరేఖ రెండు చివరల దగ్గర, గుండు సూదులను పటంలో చూపిన విధంగా గుచ్చాలి.
  • ఇప్పుడు దారం తీసుకొని మొదటి బిందువు దగ్గర ఉన్న గుండుసూదికి ముడివేయాలి.
  • దారాన్ని B, C, D బిందువుల గుండా E దగ్గర ఉన్న గుండుసూది వరకు తీసుకెళ్ళాలి.
  • ఇలా చేసేటప్పుడు, దారం ఎక్కువ బిగుతుగా లేదా ఎక్కువ వదులుగా ఉండకుండా జాగ్రత్తపడాలి.
  • అంతేకాకుండా ప్రతిబిందువు దగ్గర దారం వక్రరేఖతో ఏకీభవించేలా చూడాలి. దారం, వక్రరేఖ చివరి బిందువు చేరిన తర్వాత, ఆ బిందువు దగ్గర దారాన్ని తెంపాలి.
  • ఇప్పుడు దారాన్ని ‘A’ దగ్గర గుండుసూది నుండి విడదీసి, దాన్ని తిన్నగా మీటరు స్కేలు పొడవు వెంబడి ఉంచి, దాని పొడవును కొలవాలి.
  • ఈ దారం పొడవే వక్రరేఖ పొడవు అవుతుంది.

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 77

ప్రశ్న 5.
కింద ఇవ్వబడిన డ్రాయింగ్ చార్టుల చిత్రాలను పరిశీలించండి.
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 5
పై చార్టులను చూసి అందులో ఏది పెద్దదో, ఏది చిన్నదో మీరు చెప్పగలరా? చూసి చెప్పలేకపోతే, ఏది పెద్దదో ఏది చిన్నదో ఎలా నిర్ణయిస్తావు?
జవాబు:
రెండు A, పరమాణపు తెల్ల కాగితాలను తీసుకోండి. పటంలో చూపినట్లు ఆ తెల్ల కాగితాలను కత్తిరించండి. ఒకే పరిమాణం గల ఖాళీ అగ్గిపెట్టెలను కొన్నింటిని తీసుకొని వాటిని ఒక్కొక్క కాగితంపై పేర్చండి. ఏ కాగితంపై పేర్చడానికి ఎన్నెన్ని అగ్గిపెట్టెలు పట్టాయో లెక్కించండి. ఏ కాగితంపైన పేర్చడానికి ఎక్కువ అగ్గిపెట్టెలు అవసరమయ్యాయో ఆ కాగితం పెద్దదని మీరు గుర్తించి ఉంటారు. కానీ ఆ కాగితం రెండో దానికంటే ఎంత పెద్దదో కచ్చితంగా చెప్పలేరు. దీన్ని బట్టి కాగితం వంటి సమతలం పెద్దదో, చిన్నదో తెలియాలంటే దాని ఉపరితలాన్ని కొలవాలి అని తెలుస్తుంది. ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే వైశాల్యం అంటారు.

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 79

ప్రశ్న 6.
అట్ట ముక్కవైశాల్యం కనుగొనే పద్ధతిని వివరించండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 6

  • పటంలో చూపిన విధంగా 4 సెం.మీ పొడవు, 2 సెం.మీ వెడల్పు ఉండే దీర్ఘ చతురస్రాకారంలో ఒక అట్ట ముక్కను కత్తిరించాలి.
  • దీని వైశాల్యాన్ని కొలవటానికి సెం.మీ. గ్రాఫ్ కాగితం తీసుకోవాలి. దీనిపై ప్రతిభాగం వైశాల్యం / చదరపు సెంటీమీటరుకు సమానం.
  • ఈ గ్రాఫ్ కాగితం పైన ప్రతి చదరం యొక్క భుజం పొడవు 1 సెం.మీ. ఉంటుంది. ఈ గ్రాఫ్ కాగితంపైన పైనుండే ప్రతి చదరం వైశాల్యం ఒక చ. సెం.మీ.కి సమానం.
  • పటంలో చూపిన విధంగా అట్టముక్కను గ్రాఫ్ కాగితం పైనుంచి, దాని – చుట్టూ పెన్సిల్ గీత గీయాలి.
  • ఇప్పుడు అట్టముక్కను తొలగించి ఏర్పడిన ఆకారాన్ని – PQRS గా గుర్తించాలి. ఇప్పుడు అట్టముక్క చుట్టూ గీసిన రేఖ లోపలి భాగంలో ఉన్న చదరాలను లెక్కించాలి.
  • ఇందులో ‘8’ చదరాలు ఉంటాయని గమనిస్తాము.
  • PORS వైశాల్యం = అట్టముక్క చుట్టూ గీసిన రేఖ లోపల ఉన్న చదరాల మొత్తం వైశాల్యాలకు సమానం = 8 × 1 చదరం వైశాల్యం = 8 × 1 చ.సెం.మీ = 8 చ.సెం.మీ. ఈ కృత్యంలో మనం ఉపయోగించిన అట్టముక్క క్రమాకారంలో ఉన్న ఒక దీర్ఘచతురస్రం అని స్పష్టం అవుతున్నది.

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 80

ప్రశ్న 7.
అక్రమాకార సమతలాన్ని, ఏదైనా ఆకు వైశాల్యాలను ఎలా కొలవాలో తెలుసుకుందాం.
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 7
జవాబు:

  • పటంలో చూపిన విధంగా ఒక ఆకును గ్రాఫ్ కాగితం పైన ఉంచి, దాని చుట్టూ పెన్సిల్ తో హద్దురేఖను గీయాలి.
  • ఇప్పుడు ఆకును తీసివేసి దానిచేత ఏర్పడిన హద్దు రేఖను పరిశీలించాలి.
  • హద్దు రేఖ లోపల ఉన్న పూర్తి చదరాలను సగం లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం ఉన్న చదరాల సంఖ్యనూ వేరువేరుగా లెక్కించాలి.
  • పూర్తి చదరాల సంఖ్యకు, సగం లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం గల చదరాల సంఖ్యను కలపాలి.
  • హద్దురేఖ లోపల ఉన్న ఈ మొత్తం చదరాల సంఖ్య ఆకు వైశాల్యాన్ని తెలుపుతుంది. హద్దు రేఖ లోపలి భాగంలో ‘n’ చదరాలు ఉంటే ఆకు వైశాల్యం ‘n’ చ. సెం.మీ. అవుతుంది.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 84

ప్రశ్న 1.
పటిక, కలకండ సేకరించండి. వాటి ఘనపరిమాణాన్ని కొలిచి పట్టికలో రాయండి.
జవాబు:
నీటిలో పటిక మరియు కలకండ కరుగుతాయి. కావున కొలపాత్రలో కిరోసిన్ తీసుకోవడం ద్వారా కలకండ మరియు పటిక పరిమాణాన్ని కొలుస్తారు.
కొలతలు క్రింది పట్టికలో నమోదు చేయబడ్డాయి.

విద్యార్థి యొక్క పేరు కలకండ ఘనపరిమాణం పటిక ఘనపరిమాణం
1. రమేష్ 30 CC 40 CC
2. వెంకట్ 28.5 CC 42.1 CC
3. గీతా 27.6 CC 41.8 CC
4. షాహీనా 25.1 CC 42.7 CC
5. లిఖిత 21 CC 42 CC
  • విద్యార్థులు కొలిచే కలకండ, యొక్క అన్ని ఘనపరిమాణాలు సమానంగా ఉండవు.
  • విద్యార్థులు కొలిచే పటిక యొక్క అన్ని ఘనపరిమాణాలు కూడా సమానంగా ఉండవు.
  • విద్యార్థుల రీడింగులను గమనించడంలో పారలాక్స్ లోపం ఉంది. కాబట్టి వారి రీడింగులలో చిన్న వైవిధ్యం ఉంది.

ప్రశ్న 2.
గ్రామ పంచాయితీ, కార్యాలయానికి వెళ్ళి గ్రామ రెవెన్యూ అధికారి పొలాల వైశాల్యాలను ఎలా కొలుస్తారో వివరాలు సేకరించండి. ఇందుకోసం మీరు ఆయన్ని ఏయే ప్రశ్నలు అడగదలుచుకున్నారో రాయండి.
జవాబు:

  • వ్యవసాయ భూముల ప్రాంతాలు మనకు తెలిసిన సాధారణ సాధనాలతో కొలవబడవు.
  • వారు సర్వే గొలుసులను ఉపయోగిస్తారు ఇవి లింకులలో చేయబడతాయి.
  • పొలం కొలతలు ఎక్కువ దూరాన్ని కలిగి ఉన్నందున, VRO వీటిని కొలిచేందుకు గొలుసులను ఉపయోగిస్తారు.

ప్రశ్నలు :

  1. మీరు కొలత కోసం టేప్ ఎందుకు ఉపయోగించరు?
  2. సర్వే గొలుసును ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏమిటి?
  3. మీరు గొలుసుతో ఖచ్చితమైన కొలతను పొందుతారా?
  4. స్థలం యొక్క పొడవును కొలవడానికి మేము మీటర్ స్కేల్ ను ఉపయోగించవచ్చా?
  5. ఎకరాల భూమిని కొలవడానికి మనకు ఎన్ని లింకులు అవసరం?

ప్రశ్న 3.
ఏదైనా శుభలేఖను కార్డు, కవరులతో సహా సేకరించండి. వాటి కొలతలు కొలవండి. తేడా లెక్కించండి. మీరు అనుసరించిన పద్దతిని నమోదు చేయండి.
జవాబు:
1. కవర్ల కొలతలు :
కవర్ పొడవు L1 = 25 సెం.మీ.
కవర్ యొక్క వెడల్పు B1 = 20 సెం.మీ.

2. కార్డు యొక్క కొలతలు:
కార్డు యొక్క పొడవు L2 – 23 సెం.మీ.
కార్డు యొక్క వెడల్పు B2 = 17 సెం.మీ.

  • కవర్ మరియు కార్డు యొక్క పొడవు మరియు వెడల్పులను స్కేల్ తో కొలుస్తారు.
  • కార్డు కవర్ కంటే కొంచెం చిన్నదిగా ఉండటం వలన కవర్ లో సరిపోతుంది.

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

ప్రశ్న 4.
సి.డి, సిమ్ కార్డు, మొబైల్ ఫోన్ వైశాల్యం ఎంత ఉంటుందో ఊహించండి. తరువాత గ్రాఫ్ పేపర్ తో కొలిచి చూడండి. ఏవేవి దాదాపు సమానంగా ఊహించగలిగారో రాయండి.
జవాబు:

వస్తువు ఊహించినది గ్రాఫ్ పేపర్ లో కొలిసినది
సిడి 10 cm 2 cm
సిమ్ కార్డ్ 1 cm 1 cm
ఫోన్ 15 cm 22 cm

గ్రాఫ్ పేపర్ ఉపయోగించి కొలిచినపుడు సిడి, సిమ్ కార్డు ఫోన్ వైశాల్యాలు నేను ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉన్నాయి.

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

SCERT AP 6th Class Science Study Material Pdf 6th Lesson అయస్కాంతంతో సరదాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 6th Lesson Questions and Answers అయస్కాంతంతో సరదాలు

6th Class Science 6th Lesson అయస్కాంతంతో సరదాలు Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. అయస్కాంతంచే ఆకర్షించబడే పదార్థాలను ……. అంటారు. (అయస్కాంత పదార్థాలు)
2. కాగితం ………….. పదార్థం కాదు. (అయస్కాంత పదార్ధం)
3. పూర్వకాలంలో నావికులు కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి ……….. ఉపయోగిస్తారు. (అయస్కాంత దిక్సూచి)
4. ఒక అయస్కాంతానికి ఎల్లప్పుడు …………… ధృవాలు ఉంటాయి. (రెండు)

II. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. అయస్కాంతం ద్వారా ఆకర్షించబడే వస్తువు
A) చెక్క ముక్క
B) సాధారణ సూది
C) రబ్బరు
D) కాగితం ముక్క
జవాబు:
B) సాధారణ సూది

2. స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఎల్లప్పుడు చూపే దిక్కులు
A) ఉత్తరం – తూర్పు
B) దక్షిణం – పశ్చిమ
C) తూర్పు – పడమర
D) ఉత్తరం – దక్షిణం
జవాబు:
D) ఉత్తరం – దక్షిణం

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

3. అయస్కాంతాలు తమ ధర్మాలను కోల్పోయే సందర్భంలో
A) ఉపయోగించినప్పుడు
B) నిల్వ చేసినపుడు
C) సుత్తితో కొట్టినపుడు
D) శుభ్రం చేసినపుడు
జవాబు:
C) సుత్తితో కొట్టినపుడు

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మీ తరగతి గదిలోని అయస్కాంత మరియు అనయస్కాంత పదార్థాల జాబితా తయారు చేయండి.
జవాబు:

అయస్కాంత పదార్థాలు అనయస్కాంత పదార్థాలు
1. ఇనుప మేకు గోడ
2. టేబుల్ ఫ్రేమ్ బల్ల
3. ఇనుప కుర్చీ నల్ల బల్ల
4. కిటికీ చువ్వలు చెక్క కిటికీ

ప్రశ్న 2.
ఒక అయస్కాంతానికీ, ఒక ఇనుపకడ్డీకి ఒకే పరిమాణం, ఆకారం, రంగు ఉన్నాయి. వాటిలో ఏది అయస్కాంతమో, ఏది ఇనుపకడ్డీయో ఎలా కనుక్కొంటారు? వివరించండి.
జవాబు:

  • ఒక అయస్కాంతము ఉపయోగించి ఇచ్చిన వాటిలో ఏది అయస్కాంతమో, ఏది ఇనుపకడ్డీనో కనుగొనవచ్చు.
  • అయస్కాంతం యొక్క రెండు ధృవాలచే ఆకర్షింపబడిన దానిని ఇనుప కడ్డీగా నిర్ధారించవచ్చు.
  • అయస్కాంతం యొక్క ఒక ధృవముచే ఆకర్షింపబడి మరొక ధృవముచే వికర్షించబడితే దానిని అయస్కాంతంగా నిర్ధారించవచ్చు.
  • అయస్కాంతం యొక్క విజాతి ధృవాలు వికర్షింపబడటమే దీనికి కారణం. ఇనుప ముక్కకు ధృవాలు ఉండవు కావున వికర్షణ సాధ్యము కాదు.

ప్రశ్న 3.
శ్రీవిద్యకు వాళ్ల ఉపాధ్యాయురాలు భూమి ఒక అయస్కాంతం అని చెప్పింది. కానీ శ్రీవిద్యకు చాలా సందేహాలు కలిగి టీచరు కొన్ని ప్రశ్నలడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలేమై ఉండవచ్చు?
జవాబు:

  • భూమి అయస్కాంతం అని ఎలా చెప్పగలము?
  • భూమి ఇనుప వస్తువులతో పాటు మిగిలిన వాటిని ఎలా ఆకర్షిస్తుంది?
  • భూమికి అయస్కాంత ధర్మము ఎలా వస్తుంది?
  • మొత్తం భూమి అయస్కాంతంగా పని చేస్తుందా?

ప్రశ్న 4.
భూమి ఒక అయస్కాంతమా? నీవెలా చెప్పగలవు?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 1

  • అయస్కాంతాన్ని స్వేచ్ఛగా పురి లేని దారానికి వ్రేలాడతీయండి.
  • అది ఎల్లప్పుడు ఉత్తర, దక్షిణ ధృవాలను చూపుతుంది.
  • దీనికి కారణం భూమి ఒక అయస్కాంతంగా పనిచేయటమే.
  • భూ అయస్కాంత ధృవాలకు వ్యతిరేకంగా అయస్కాంత ధృవాలు ఆకర్షించటం వలన ఇలా జరుగును. దీనిని బట్టి భూమి ఒక అయస్కాంతం అని చెప్పవచ్చు.

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

ప్రశ్న 5.
కింద ఇచ్చిన పదార్థాలలో ఏవి అయస్కాంత పదార్థాలో, ఏవి అనయస్కాంత పదార్థాలో ఊహించండి. తర్వాత ఒక దండాయస్కాంతంతో పరీక్షించి మీరు ఊహించిన వాటిని సరిచూసుకోండి. అన్ని పదార్థాలనూ పరిశీలించాక మీరేమి చెప్పగలరు? ప్లాస్టిక్, ఇనుము, సీలు (ఉక్కు, కర్ర అల్యూమినియం, బంగారం, వెండి, రాగి, కాగితం, గుడ్డ.
జవాబు:

అయస్కాంత పదార్థాలు అనయస్కాంత పదార్థాలు
ఇనుము, స్టీలు ప్లాస్టిక్, కర్ర, కాగితం, గుడ్డ, బంగారం, వెండి, రాగి, అల్యూమినియం.

ప్రశ్న 6.
దండాయస్కాంతం బొమ్మ గీసి, ధృవాలను గుర్తించండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 2

ప్రశ్న 7.
భూమి ఒక పెద్ద అయస్కాంతం అని తెలుసుకుని సూర్య ఆశ్చర్యపోయాడు. ఆ విషయాన్ని కనుక్కొన్న శాస్త్రవేత్తల ఆలోచనను ప్రశంసించాడు. అయస్కాంతాలకు సంబంధించి మీరు ప్రశంసించదలచిన అంశాలేమైనా ఉన్నాయా? ఎలా ప్రశంసిస్తారు?
జవాబు:

  • నేను ఈ క్రింది విషయాలలో అయస్కాంతాలను అభినందిస్తున్నాను.
  • ప్రతి అయస్కాంతానికి రెండు ధృవాలు ఉంటాయి. మనం ఒక అయస్కాంతాన్ని రెండు ముక్కలుగా విడదీస్తే, ప్రతి ముక్క రెండు ధృవాలను అభివృద్ధి చేస్తుంది మరియు అవి రెండు స్వతంత్ర అయస్కాంతాలుగా పనిచేస్తాయి.
  • స్వేచ్ఛగా వ్రేలాడతీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర-దక్షిణ దిశలో ఉంటుంది. క్రొత్త ప్రదేశాలలో దిశలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది.
  • అయస్కాంత ప్రేరణ కారణంగా ఇనుపమేకు అయస్కాంతం వలె పనిచేయటం ఆసక్తికరంగా ఉంది.
  • అయస్కాంత లెవిటేషన్ ధర్మం విద్యుదయస్కాంత రైళ్లను నడపడానికి సహాయపడుతుంది.
  • అయస్కాంతాల ఆకర్షణ లక్షణం అయస్కాంత పదార్థాలను వాటి మిశ్రమాల నుండి వేరు చేయడానికి సహాయపడుతుంది.
  • ఈ ఆకర్షణ లక్షణాన్ని ఉపయోగించి భారీ బరువు ఉన్న అయస్కాంత పదార్థాలను ఎత్తడానికి ఎలక్ట్రికల్ క్రేన్లకు సాధ్యమౌతుంది.
  • మోటార్లు, స్పీకర్లు మొదలైన వివిధ పరికరాలలో అయస్కాంతాలు ఉపయోగపడతాయి.

ప్రశ్న 8.
నిత్య జీవితంలో అయస్కాంతాలను ఎక్కడెక్కడ వినియోగిస్తారో రాయండి.
జవాబు:

  • మన నిత్య జీవితంలో చాలా సందర్భాలలో అయస్కాంతాలు ఉపయోగిస్తాము.
  • రేడియో మరియు టి.వి. స్పీకర్లలో అయస్కాంతాలు వాడతారు.
  • ఎలక్ట్రిక్ మోటార్ లో అయస్కాంతాలు వాడతారు.
  • ఇంటి తలుపులు, షోకేలో అయస్కాంతాలు వాడతారు.
  • ఆఫీస్ బల్లపై గుండుసూదుల పెట్టెలో అయస్కాంతం ఉంటుంది.
  • గాలిలో ప్రయాణించే ఎలక్ట్రిక్ ట్రైన్లలో అయస్కాంతం వాడతారు.
  • సెల్ ఫోన్ కవర్, హాండ్ బాగ్ లో అయస్కాంతాలు ఉంటాయి.
  • కొన్ని ఆటబొమ్మలలో అయస్కాంతం ప్రధాన ఆకర్షణ.
  • సముద్ర నావికులు వాడే దిక్సూచిలో అయస్కాంతం ఉంటుంది.

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 61

ప్రశ్న 1.
ఒక స్టీల్ గ్లాసును తీసుకొండి. అందులో ఒక అయస్కాంతం ఉంచండి. ఒక సూదిని తీసుకొని దారం ఎక్కించండి. పటంలో చూపిన విధంగా సూది చివరి భాగానికి దగ్గరగా ఉన్న దారాన్ని వేలితో నొక్కిపెట్టి గ్లాసును నెమ్మదిగా పైకి లేపండి.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 3
• ఏమి జరుగుతుంది?
జవాబు:
గ్లాసును తాకకుండా సూది నిలువుగా నిలబడుతుంది.

• గ్లాసుకు తగలకుండా సూది నిటారుగా పైకి లేచి నిలబడిందా? ఎందుకని అలా జరిగింది?
జవాబు:
అవును, గ్లాసులోని అయస్కాంతం సూదిని ఆకర్షించటం వలన సూది నిలబడింది.

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 62

ప్రశ్న 2.
ఒక దండాయస్కాంతం, ఇనుప మేకు, పేపర్ క్లిప్, ప్లాస్టిక్ స్కేలు, గాజు ముక్క కాగితం ముక్క ఇత్తడి తాళంచెవి, పెన్, పెన్సిల్, బ్లేడు, సీలు చెమ్చా, చాకు, సుద్దముక్క చెక్కముక్కలను తీసుకోండి. ఆ వస్తువులు ఏయే పదార్థాలతో తయారయ్యాయో గుర్తించండి. ఒక్కొక్క వస్తువును అయస్కాంతంతో తాకించండి. అన్ని వస్తువులనూ అయస్కాంతం ఆకర్షించిందా? మీ పరిశీలన వివరాలను, ఆ వస్తువు తయారీకి వాడిన పదార్ధాన్ని క్రింది పట్టికలో నమోదు చేయండి.

వస్తువు పేరు ఏ పదార్థంతో ఆ వస్తువు తయారయింది? ఇనుము/ప్లాస్టిక్ అల్యూమినియం/గాజు/చెక్క/ఇతరాలు వస్తువును అయస్కాంతం ఆకర్షించిందా ? అవును / కాదు
ఇనుప మేకు ఇనుము అవును
ప్లాస్టిక్ స్కేలు ప్లాస్టిక్ కాదు

జవాబు:

వస్తువు పేరు తయారైన పదార్థం ఆకర్షించిందా లేదా?
1. ఇనుప మేకు ఇనుము ఆకర్షించింది
2. ప్లాస్టిక్ స్కేలు ప్లాస్టిక్ ఆకర్షించలేదు
3. కాగితం ముక్క కాగితం ఆకర్షించలేదు
4. గాజు ముక్క గాజు ఆకర్షించలేదు
5. ఇత్తడి తాళం చెవి లోహం ఆకర్షించింది
6. పెన్ ప్లాస్టిక్ ఆకర్షించలేదు
7. పెన్సిల్ చెక్క ఆకర్షించలేదు
8. బ్లేడ్ ఇనుము ఆకర్షించింది
9. స్టీలు చెమ్చా స్టీల్ ఆకర్షించలేదు
10. చాకు ఇనుము ఆకర్షించింది
11. సుద్ద ముక్క సున్నం ఆకర్షించలేదు
12. చెక్క ముక్క చెక్క ఆకర్షించలేదు
13. పేపర్ క్లిప్ ఇనుము ఆకర్షించింది

• ఏయే పదార్థాలను అయస్కాంతం ఆకర్షించింది?
జవాబు:
ఇనుప మేకు, బ్లేడ్, చాకు, ఇత్తడి తాళం చెవి, పేపర్ క్లిప్.

• ఏయే పదార్థాలను ఆకర్షించలేదు?
జవాబు:
ప్లాస్టిక్ స్కేల్, గాజు ముక్క, కాగితం ముక్క పెన్, పెన్సిల్, స్టీల్ చెంచా, సుద్ద ముక్క, చెక్క ముక్క

• అయస్కాంత పదార్థాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఐరన్, కోబాల్ట్, నికెల్

• అనయస్కాంత పదార్థాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
బంగారం, వెండి, రాగి, కలప, కాగితం, ప్లాస్టిక్.

కృత్యం – 3

6th Class Science Textbook Page No. 63

ప్రశ్న 3.
ఒక తెల్ల కాగితం తీసుకుని దానిమీద ఇనుప రజను పలచగా, అంతటా ఏకరీతిగా ఉండే విధంగా చల్లండి. ఆ కాగితం కింద ఒక దండాయస్కాంతాన్ని ఉంచండి.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 4
• ఏం గమనించారు?
జవాబు:
దండాయస్కాంతం వద్దకు ఇనుప రజను చేరటం గమనించాను.

• ఇనుప రజనను ఆకర్షించే ధర్మం దండాయస్కాంతం యొక్క అన్ని భాగాలకు ఒకే విధంగా ఉంటుందా?
జవాబు:
లేదు. దండాయస్కాంతం చివరల వద్ద అయస్కాంతం మధ్య భాగం కంటే ఎక్కువ ఇనుప రజను చేరింది.

• మీరు చల్లిన ఇనుప రజను అమరికలో ఏమైనా తేడా గుర్తించారా?
జవాబు:
అవును. ఏకరీతిలో వ్యాపించిన ఇనుప రజను వాటి సరళిని మార్చి దండాయస్కాంతం యొక్క ధృవాల వద్ద ఎక్కువగా కేంద్రీకరించబడింది. ఈ రెండు ధృవాల మధ్య చెల్లాచెదురుగా ఉన్న ఇనుప రజను కొన్ని గీతల వలె అమరిపోయింది.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 64

ప్రశ్న 4.
ఒకే పరిమాణం కలిగిన రెండు దండాయస్కాంతాలను తీసుకుని పటంలో చూపినట్లు వాటిని వివిధ పద్ధతుల్లో అమరుస్తూ వాటి మధ్య ఆకర్షణ, వికర్షణలను పరిశీలించండి.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 5
• ఏం గమనించారు?
జవాబు:
అయస్కాంతాలు ఆకర్షించుకోవటమే కాకుండా వికర్షించుకోవటం నేను గమనించాను.

• ఎప్పుడు అయస్కాంతాలు ఒకదానితో ఒకటి ఆకర్షించుకున్నాయి?
జవాబు:
మొదటి రెండు పరిస్థితులలో అయస్కాంతాలు ఆకర్షించుకొన్నాయి. అంటే విభిన్న ధృవాలు దగ్గరగా వచ్చినప్పుడు అవి ఆకర్షిస్తాయి.

• ఎప్పుడు అయస్కాంతాలు ఒకదానితో ఒకటి వికర్షించుకున్నాయి?
జవాబు:
చివరి రెండు పరిస్థితులలో అయస్కాంతాలు వికర్షించుకొన్నాయి. అంటే ఒకే ధృవాలు దగ్గరగా వచ్చినప్పుడు అవి వికర్షించుకొంటాయి.

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 64

ప్రశ్న 5.
ఒక దండాయస్కాంతం మధ్యలో పురిలేని సన్నని దారం కట్టి పటంలో చూపినట్లుగా భూమికి సమాంతరంగా ఉండే విధంగా ఒక స్టాండుకు వేలాడదీయండి.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 6
• ఆ దండాయస్కాంతం నిశ్చలస్థితికి వచ్చిందా?
జవాబు:
కొంత సమయం తరువాత ఆ దండాయస్కాంతం నిశ్చలస్థితికి వచ్చింది.

• కొంత సమయం ఆగండి. నీవు ఏమి గమనించావు?
జవాబు:
అయస్కాంతం నిశ్చలస్థితిలోకి వచ్చాక అది ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తున్నట్లు మీరు గమనించవచ్చు. ఉత్తర దిక్కును సూచించే అయస్కాంతకొనకు ఏదైనా రంగుతో ఒక గుర్తు పెట్టండి. ఇప్పుడు ఆ అయస్కాంతాన్ని కొద్దిగా కదిలించి తిరిగి అది నిశ్చల స్థితికి వచ్చేవరకు ఆగండి.

• రంగు గుర్తు గల అయస్కాంతపు కొన ఇప్పుడు ఏ దిశను సూచిస్తుంది?
జవాబు:
రంగు గుర్తు గల అయస్కాంతపు కొన ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే సూచిస్తుంది.

• ఈ కృత్యాన్ని వేరొక స్థలంలో చేసి చూడండి. ఏం గమనించారు?
జవాబు:
స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఎల్లప్పుడు ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తుంది.

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 65

ప్రశ్న 6.
అయస్కాంతం తయారుచేసే విధానంను వివరింపుము.
జవాబు:
ఉద్దేశ్యం : అయస్కాంతం తయారు చేయడం.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 7

కావలసిన పరికరాలు :
ఇనుపమేకు, దండాయస్కాంతం, గుండుసూదులు, ఇనుప రజను.

తయారీ విధానం :

  • ఒక సన్నని ఇనుపమేకును తీసుకొని బల్లమీద ఉంచండి.
  • ఇప్పుడు దండాయస్కాంతాన్ని తీసుకుని పటంలో చూపినట్లు దండాయస్కాంతపు ఒక ధృవాన్ని ఇనుప మేకు ఒక కొనవద్ద ఆనించి రెండో కొన వరకు రుద్దండి. అయస్కాంతాన్ని పైకెత్తి తిరిగి అదే ధృవాన్ని మేకు యొక్క మొదటి కొనవద్ద ఆనించి రెండవ కొన వరకూ రుద్దండి.
  • ఇలా 30 నుండి 40 సార్లు చేయండి.
  • ఇప్పుడు మేకును గుండుసూదులు లేదా ఇనుప రజను దగ్గరకు తీసుకురండి.

పరిశీలన :
ఇనుప మేకు గుండుసూదులు లేదా ఇనుపరజనును ఆకర్షిస్తుంది.

ఫలితం :
ఇనుప మేకు ఒక అయస్కాంతం.

• ఇప్పుడు ఆ మేకును దారంతో కట్టి స్వేచ్ఛగా వేలాడదీస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ఇనుప మేకు అయస్కాంతం వలె ఉత్తర, దక్షిణ దిక్కులను చూపిస్తుంది.

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 65

ప్రశ్న 7.
అయస్కాంత దిక్సూచి (కంపాస్)ను తయారుచేసే విధానంను వివరింపుము.
జవాబు:
ఉద్దేశ్యం : అయస్కాంత దిక్సూచి (కంపాస్)ని తయారుచేయడం.

కావలసిన పరికరాలు :
అయస్కాంతీకరించిన గుండుసూది, టేప్, కార్క్ (బెండు), గ్లాసులో నీళ్ళు, డిటర్జెంటు.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 8

తయారీ విధానం :

  • అయస్కాంతీకరించిన ఒక గుండుసూదిని తీసుకొని కార్క్ (బెండు) ముక్కపై టేక్ అంటించండి.
  • పటంలో చూపినట్లు ఒక గ్లాసులోని నీటిలో తేలియాడేటట్లు ఆ క్కా నుంచండి.
  • కార్క్ సులభంగా తేలడానికి గ్లాసులో నీటికి కొంత డిటర్జెంటును కలపండి.

పరిశీలన :
అయస్కాంతీకరించిన ఆ సూది ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తుంది.

ఫలితం : ఈ కృత్యమే అయస్కాంత దిక్సూచి.

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

కృత్యం – 8

6th Class Science Textbook Page No. 66

ప్రశ్న 8.
అయస్కాంత ప్రేరణను ఎలా నిరూపిస్తారు?
జవాబు:
లక్ష్యం : అయస్కాంత ప్రేరణను గమనించడం లేదా అర్థం చేసుకోవడం.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 9

అవసరమైన పదార్థాలు :
పిన్నిసు, గుండు సూది, దండాయస్కాంతం

విధానం :
పిన్నిసు తీసుకొని దండాయస్కాంతం దగ్గరకు తీసుకురండి. అప్పుడు అది అయస్కాంతానికి అంటుకొంటుంది. ఈ పిన్నీసుకు ఒక గుండు సూదిని అంటించండి.

పరిశీలన :
గుండుసూదికి అయస్కాంతంతో నేరుగా సంబంధం లేనప్పటికి పిన్నీసు ఆకర్షించినది. దీనికి కారణం అయస్కాంతానికి అరిటి ఉన్న పిన్నీసు కూడా అయస్కాంతం వలె పని చేస్తుంది. దీనినే అయస్కాంత ప్రేరణ అంటారు.

ఫలితం :
దండాయస్కాంతం కారణంగా అయస్కాంతధర్మం పిన్నీసులో ప్రేరేపించబడుతుంది. అయస్కాంత పదార్థానికి దగ్గరగా ఒక అయస్కాంతం ఉండటం వల్ల అది అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. అయస్కాంత ఈ ధర్మాన్నే అయస్కాంత ప్రేరణ అంటారు.

• పిన్నీసు అయస్కాంతానికి అంటుకొని ఉండకపోతే (దూరంగా ఉంటే) అది గుండుసూదిని ఆకర్షిస్తుందా?
జవాబు:
పిన్నీసు అయస్కాంతానికి అంటుకొని ఉండకపోతే అది గుండుసూదిని ఆకర్షించలేదు.

• పిన్నీసు అయస్కాంతానికి అంటుకోకుండా అతి దగ్గరగా ఉన్నప్పుడు అది గుండుసూదిని ఆకర్షించగలుగుతుందా?
జవాబు:
పిన్నీసు అయస్కాంతానికి అంటుకోకుండా అతి దగ్గరగా ఉన్నప్పుడు అది గుండు సూదిని ఆకర్షిస్తుంది.

కృత్యం – 9

6th Class Science Textbook Page No. 66

ప్రశ్న 9.
ఒకే పరిమాణం, ఆకారం, రంగు కలిగిన మూడు వస్తువులను మీకిస్తే ఒక దండాయస్కాంతాన్ని ఉపయోగించి వాటిలో ఏ వస్తువు అయస్కాంతమో, ఏ వస్తువు అయస్కాంత పదార్థంతో చేసినదో, ఏ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారు చేసినదో ఎలా కనుక్కొంటారు?

ఆ మూడు వస్తువులను వరుసగా దండాయస్కాంతపు ఒక ధృవం వద్దకు తీసుకురండి. ఆ వస్తువులను అయస్కాంతం ఆకర్షించిందా? వికర్షించిందా? లేదా ఆ వస్తువులు ఆకర్షణకు గానీ వికర్షణకు గానీ లోనుకాకుండా ఉన్నాయా? చూడండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి. తిరిగి ఆ వస్తువులను దండాయస్కాంతం రెండోధృవం వద్దకు తీసుకొనిరండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 10

  • ఒక వస్తువు దండ అయస్కాంతం యొక్క ఒక ధ్రువం ద్వారా ఆకర్షించబడి, దాని ఇతర ధృవంతో వికర్షించబడితే అప్పుడు అది ఒక అయస్కాంతం. కాబట్టి వస్తువు-1 అయస్కాంతం.
  • ఒక వస్తువు దండాయస్కాంతం యొక్క రెండు ధ్రువాలచే ఆకర్షించబడి, ఏ ధృవంతో వికర్షించకపోతే, అది అయస్కాంతం పదార్థం. కాబట్టి వస్తువు-2 అయస్కాంత పదార్థంతో రూపొందించబడింది.
  • ఒక వస్తువు అయస్కాంతం ద్వారా ఆకర్షించబడకపోతే లేదా దాని ద్వారా వికర్షించబడకపోతే, అది అనయస్కాంత పదార్థం. కాబట్టి వస్తువు – 3 అనయస్కాంత పదార్థంతో రూపొందించబడింది.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 70

ప్రశ్న 1.
మీ ఇంటికి ముఖద్వారం ఏ దిశలో ఉంది? ఆలోచించి చెప్పండి. తర్వాత దిక్సూచి ఉపయోగించి కచ్చితంగా అది ఏ దిశలో ఉందో కనుక్కొని మీ సమాధానంతో పోల్చి చూడండి. అదేవిధంగా కింది విషయాలను కూడా . ఊహించండి, పరీక్షించండి.
ఎ) నువ్వు ఏ దిశలో తల ఉంచి పడుకుంటావు?
బి) నువ్వు ఏ దిశవైపు తిరిగి చదువుకుంటావు?
సి) భోజనం చేసేటప్పుడు ఏ దిశవైపు మరలి కూర్చుంటావు?
జవాబు:
మా ఇల్లు తూర్పు దిక్కులో ఉందని భావించాను. కానీ దిక్సూచితో చూసినపుడు తూర్పుదిశకు కొంచెము పక్కకు ఉన్నట్టు గుర్తించాను.

ఎ) నేను నిద్రిస్తున్నప్పుడు నా తల తూర్పు వైపు ఉంచుతాను అని ఊహించాను, కాని అది కొంచెం ఈశాన్యం వైపు ఉంది.
బి) నేను చదివేటప్పుడు తూర్పు వైపు ఉంటానని ఊహించాను. కానీ నేను పైన చెప్పినట్లుగానే ఈశాన్యం వైపు ఉన్నాను.
సి) తినేటప్పుడు తూర్పు వైపు కూర్చుంటానని ఊహించాను. కానీ నేను పైన చెప్పినట్లుగానే ఈశాన్యం వైపు ఉన్నాను.

ప్రశ్న 2.
అయస్కాంతాలను వాడి ఏదైనా ఆటవస్తువులను తయారుచేయండి. తయారీ విధానాన్ని తెలపండి.
జవాబు:
అయస్కాంతాలను ఉపయోగించి ఆట వస్తువులు తయారు చేయుట :

  • ముందుగా ఒక అట్టముక్కను తీసుకొని బాతు ఆకారంలో రెండు బొమ్మలు తయారు చేశాను. ఆ బొమ్మలకు వెనుక దండాయస్కాంతం అంటించాను.
  • దండాయస్కాంతం యొక్క సజాతి ధృవాలు ఒకవైపు ఉండటంవల్ల వెనుక ఉన్న బాతు బొమ్మను జరపటం వలన ముందు ఉన్న బొమ్మ ముందుకు ప్రయాణం చేయడం జరిగింది.
  • దీని ద్వారా అయస్కాంతం వికర్షణ ఉపయోగించి ఆట వస్తువును కదిలించవచ్చు.

ప్రశ్న 3.
వలయాకారపు అయస్కాంతానికి ధృవాలు ఎక్కడ ఉంటాయో ఊహించండి. తర్వాత దండయస్కాంతం ఉపయోగించి దాని ధృవాలు కనుగొనండి. మీ ఊహ సరైనదా? లేదా? పోల్చుకోండి.
జవాబు:
ఊహ :
వలయాకారపు అయస్కాంతం యొక్క ఎగువ మరియు దిగువ ఉపరితలాలపై అయస్కాంత స్తంభాలు ఉన్నాయి.

పరీక్ష :

  1. నేను వలయ అయస్కాంతం యొక్క ఎగువ ఉపరితలం దగ్గర దండ అయస్కాంతం యొక్క దక్షిణ ధృవాన్ని తీసుకువచ్చినప్పుడు అవి ఒకదానికొకటి తిప్పికొట్టాయి, ఇవి వలయ అయస్కాంతం యొక్క పై ఉపరితలం దాని దక్షిణ ధ్రువం అని సూచిస్తుంది.
  2. నేను వలయ అయస్కాంతం యొక్క దిగువ ఉపరితలం దగ్గర దండ అయస్కాంతం యొక్క దక్షిణ ధృవమును తీసుకు వచ్చినప్పుడు అవి ఒకదానికొకటి ఆకర్షించుకొన్నాయి, వలయ అయస్కాంతం యొక్క దిగువ ఉపరితలం దాని ఉత్తర ధృవం అని సూచిస్తుంది.
  3. కానీ ధృవాల స్థానం వాటి తయారీ విధానం ఆధారంగా మూడు అవకాశాలు ఉన్నాయని మా టీచర్ నుండి తెలుసుకున్నాను.
    AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 11

ప్రశ్న 4.
దండాయస్కాంతాన్ని ఉపయోగించి ఒక సూదిని అయస్కాంతంగా మార్చండి. దానితో కృత్యం – 7లో తెలిపిన పద్దతిలో దిక్సూచిని తయారుచేయండి.
జవాబు:
I. లక్ష్యం : అయస్కాంతం తయారుచేయుట.

కావలసినవి (అవసరమైన పదార్థాలు) :
ఇనుప మేకు, దండ అయస్కాంతం, పిన్ /ఇనుప రజను.

తయారీ విధానం :

  • ఒక మేకు తీసుకొని ఒక టేబుల్ మీద ఉంచండి.
  • ఇప్పుడు ఒక దండ అయస్కాంతం తీసుకొని దాని ధృవాలలో ఒకదాన్ని మేకు యొక్క ఒక అంచు దగ్గర ఉంచి, అయస్కాంతం ధృవం యొక్క దిశను మార్చకుండా ఒక చివర నుండి మరొక చివర వరకు రుద్దండి.
  • ప్రక్రియను 30 నుండి 40 సార్లు చేయండి.
  • మేకు దగ్గరకు పిన్ లేదా కొంత ఇనుప రజనును తీసుకురండి. అది అయస్కాంతంగా మారిందో, లేదో తనిఖీ చేయండి.

పరిశీలన :
మేకు, ఇనుప రజనును ఆకర్షిస్తుంది.

ఫలితం :
ఇనుపమేకు అయస్కాంతంగా మారుతుంది.

II. లక్ష్యం:
అయస్కాంత దిక్సూచిని తయారు చేయడం

అవసరమైన పదార్థాలు :
అయస్కాంతీకరించిన సూది, టేప్, లైట్ కార్క్, గ్లాసు వాటర్, డిటర్జెంట్.

తయారీ విధానం :

  • అయస్కాంతీకరించిన సూది తీసుకోండి.
  • తేలికపాటి కా కు టేక్ సూదిని అంటించండి.
  • కార్క్ ని ఒక గ్లాసు నీటిలో వదలండి.
  • కార్క్ స్వేచ్ఛగా తేలుతూ ఉండటానికి నీటిలో కొద్దిగా డిటర్జెంట్ జోడించండి.

పరిశీలన : అయస్కాంతీకరించిన సూది ఉత్తర-దక్షిణ దిశలను చూపిస్తుంది.

ఫలితం : అయస్కాంతీకరించిన సూది అయస్కాంత దిక్సూచిగా పనిచేస్తుంది.

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

ప్రశ్న 5.
“మంచి ఆహారాన్ని మాత్రమే తినాలి – చెడు ఆహారాన్ని తినకూడదు” అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి అయస్కాంతాలను ఉపయోగించి కిరణ్ ఒక ఆట బొమ్మను తయారుచేయాలనుకున్నాడు. ఆ బొమ్మ తయారుచేయడంలో మీరు అతనికి సహాయం చేయగలరా? ఎలా చేస్తారు?
జవాబు:

  • ఆటవస్తువును ఈ క్రింది విధంగా తయారుచేయవచ్చును.
  • ఒక పళ్లెము తీసుకుని దానికి ఒక వైపు మంచి ఆహారం, దానికి ఎదురు వైపు చెడు ఆహారం ఉంచి ఆ విషయాన్ని కాగితంపై రాసి అచట అంటించాలి.
  • ఈ పళ్లెం అడుగున ఒక అయస్కాంతాన్ని అతికించాలి. ఈ అయస్కాంతం ఉత్తరధ్రువం మంచి ఆహారం వైపు దక్షిణ ధ్రువం చెడు ఆహారం వైపు ఉండునట్లు ఈ అయస్కాంతాన్ని ఉంచాలి.
  • ఒక బాతు బొమ్మ క్రింది భాగంలో వేరొక అయస్కాంతాన్ని ఉంచాలి. ఈ అయస్కాంతం దక్షిణ ధ్రువం బాతు ముక్కువైపు, ఉత్తరధ్రువం బాతు తోకవైపు ఉండునట్లు అమర్చాలి.
  • బాతు బొమ్మను ఒక తొట్టె నీటిలో ఉంచాలి.
  • మంచి ఆహారం గల పళ్లెం భాగం బాతు దగ్గరకు తీసుకువస్తే నీటితొట్టెలోని బాతు పళ్లెం వైపుకు కదులుతూ నీటిలో వస్తుంది. ఎందుకంటే విజాతి అయస్కాంత ధ్రువాలు ఆకర్షించుకుంటాయి.
  • చెడు ఆహారం ఉన్న పళ్లెం భాగం బాతుకు సమీపంలోకి తీసుకురావడంతో, బాతు నీటిలో దూరంగా వెళ్లిపోతుంది. సజాతి అయస్కాంత వ్రాలు వికర్షించుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. చెడు ఆహారాన్ని తినకూడదని ఈ చర్య తెలియజేస్తుంది.

AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

SCERT AP 6th Class Science Study Material Pdf 5th Lesson పదార్థాలు – వేరుచేసే పద్ధతులు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 5th Lesson Questions and Answers పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

6th Class Science 5th Lesson పదార్థాలు – వేరుచేసే పద్ధతులు Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి ………… ను ఏర్పరుస్తాయి. (మిశ్రమం)
2. బియ్యం నుంచి రాళ్లను వేరు చేసే పద్ధతి ………. (చేతితో ఏరి వేయటం)
3. ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయురూపం నుండి ఘనరూపంలోకి మారే ప్రక్రియ ……….. (ఉత్పతనం)

II. సరియైన సమాధానాన్ని గుర్తించండి.

1. కిందివానిలో తన ఆకారాన్ని మార్చుకోలేనిది
A) ఘన పదార్థం
B) ద్రవ పదార్థం
C) వాయు పదార్థం
D) పైవేవికావు
జవాబు:
A) ఘన పదార్థం

2. ద్రవంలో కరిగిన పదార్థాలను వేరుచేయుటకు ఉపయోగించే పద్ధతి ……….
A) తేర్చడం
B) క్రొమటోగ్రఫీ
C) స్పటికీకరణం
D) వడపోత
జవాబు:
C) స్పటికీకరణం

AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

3. ‘క్రొమటోగ్రఫి’ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి
A) నీటి నుంచి మట్టిని
B) రంగులను
C) నీటి నుంచి మలినాలను
D) ధాన్యం నుంచి ఊకను
జవాబు:
B) రంగులను

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కింది పదార్థాలతో తయారయిన వస్తువులు ఒక్కోదానికి 5 చొప్పున రాయండి.
ఎ) గాజు బి) లోహం సి) ప్లాస్టిక్ డి) చెక్క
జవాబు:
ఎ) గాజు : గాజు గ్లాసు, చేపల తొట్టి, గాజు పాత్ర, అద్దము, టేబుల్ గ్లాస్
బి) లోహం : కుర్చీ, బకెట్, సైకిల్, కారు, గడ్డపార
సి) ప్లాస్టిక్ : . ప్లాస్టిక్ కుర్చీ, డ్బ న్, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ స్పూన్, గిన్నెలు
డి) చెక్క : కిటికీ, తలుపు, చెక్క బల్ల , డైనింగ్ టేబుల్, మంచం

ప్రశ్న 2.
తూర్పారపట్టిన తర్వాత చేతితో వేరుచేయవలసిన అవసరం ఉంటుందా? ఎందుకు?
జవాబు:
తూర్పారపట్టిన తర్వాత రైతులు తిరిగి చేతితో ఏరుతూ ఉంటారు. తూర్పారపట్టడం వల్ల కేవలం తేలికగా ఉండే తాలు, చెత్త వంటి పదార్థాలు మాత్రమే తొలగించబడతాయి. రాళ్లు, మట్టిపెళ్లలు బరువుగా ఉండి ధాన్యంతో పాటు క్రింద పడిపోతాయి కావున వీటిని చేతితో ఏరవలసి ఉంటుంది.

ప్రశ్న 3.
కింది సందర్భాలలో మిశ్రమం నుండి ఒక అంశాన్ని వేరుచేయాలంటే ఏ పద్ధతి ఉపయోగించాలి?
అ) మరొక దాని కంటే బరువుగా ఉన్న వాటిని
ఆ) మరొక దాని కంటే పెద్దవిగా ఉన్న వాటిని
ఇ) రంగు, ఆకారంలో వేరుగా ఉన్న వాటిని
ఈ) ఒకటి నీటిలో కరిగేది, మరొకటి నీటిలో కరగనిది ఉన్నప్పుడు
ఉ) ఒకటి నీటిలో తేలేది, మరొకటి నీటిలో తేలనిది ఉన్నప్పుడు.
జవాబు:
అ) తూర్పారపట్టటం, ముంచటం, చేర్చటం
ఆ) చేతితో ఏరివేయడం, వడపోయడం
ఇ) జల్లించడం, వడపోయడం
ఈ) కరిగించడం, స్వేదనం
ఉ) వడపోత, ముంచటం, తేర్చటం

AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

ప్రశ్న 4.
సముద్రంలో నీటిపై ప్రయాణిస్తున్న ఒక ఓడను సిరి చూసింది. ఒక ఇనుపమేకు నీటిలో మునుగుతుందన్న విషయం ఆమెకు తెలుసు. దీనిపై సిరికి అనేక సందేహాలు ఏర్పడ్డాయి. ఆ సందేహాలు ఏమై ఉండచ్చో ఊహించి రాయండి.
జవాబు:

  1. ఓడ నీటిపై ఎలా తేలుతుంది?
  2. ఓడ దేనితో తయారవుతుంది?
  3. ఓడ బరువు ఎంత ఉంటుంది?
  4. బరువైన వస్తువులు నీటిపై ఎలా తేలతాయి?
  5. ఓడ బరువుకు, దాని వైశాల్యానికి సంబంధం ఉంటుందా?
  6. ఒక వస్తువు నీటిపై తేలాలి అంటే ఏమి చేయాలి?

ప్రశ్న 5.
మనం చెక్కతో తయారైన అనేక వస్తువులను నిత్యం వాడుతూ ఉంటాం కదా ! ఇలా చెక్కను వాడడం సరియైనదేనా? కారణం ఏమిటి? దీనికేమైనా ప్రత్యామ్నాయాలున్నాయా?
జవాబు:
మన రోజువారీ జీవితంలో తలుపులు, కిటికీలు వంటి అనేక వస్తువులు చెక్కతో తయారుచేస్తూ ఉంటాము. ఇలా చెక్కతో తయారైన వస్తువులు వాడటం అంత మంచిది కాదు, ఎందుకంటే చెక్క కలప మొక్క నుండి లభిస్తుంది. కలప కోసం మొక్కలు నరకటం వల్ల అడవుల సంఖ్య తగ్గి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. కావున కలప వాడకం తగ్గించి దాని స్థానంలో ఇతర పదార్థాలతో తయారైన వస్తువులు వాడుకోవాలి. కలపకు బదులుగా సిమెంట్, ప్లే వుడ్, కంప్రెసర్, కార్డ్ బోర్డ్ పదార్థాలను వాడుకోవచ్చు.

ప్రశ్న 6.
స్వేదన జలాన్ని పొందే ప్రయోగ విధానాన్ని తెలియజేయండి.
జవాబు:
ఉద్దేశం :
సాధారణ నీరు నుంచి స్వేదన జలంను తయారు చేయుట.

కావలసినవి :
నీరు, శాంకవ కుప్పెలు-2, ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాలు-2, రబ్బరు గొట్టం, బుస్సెన్ బర్నర్, స్టాండు.
AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 1

విధానం :
ఒక శాంకవ కుప్పెను నీటితో నింపి ఒంటి ఒంటిరంధ్రపు రంధ్రపు బిరడాతో మూసివేయండి. ఒంటి రంధ్రపు రబ్బరు రబ్బరుబిరడా బిరడాతో మూసి ఉంచిన ఇంకొక శాంకవ కుప్పెను శాంకవ తీసుకోండి. రెండింటినీ రబ్బరు గొట్టంతో కలపండి. నీరు ఉన్న కుప్పెను వేడి చేయండి.

పరిశీలన :
కొంత సేపు అయిన తర్వాత రబ్బరు గొట్టం ద్వారా నీటి ఆవిరి ఖాళీ శాంకవ కుప్పెలోనికి వెళుతుంది. ఆ నీటి ఆవిరి నెమ్మదిగా నీరుగా మారుతుంది. ఈ నీటిని బర్నర్ స్వేదన జలం అంటాం. ఇది మలిన రహితమైన నీరు.

ఫలితం :
స్వేదనం ద్వారా మలినాలను నీటి నుండి తొలగించవచ్చు.

ప్రశ్న 7.
‘ఉత్పతనం’ పద్ధతిని తెలియజేసే ప్రయోగ అమరిక పటం గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 2

ప్రశ్న 8.
అనేక టన్నుల ఇనుముతో తయారు చేసినదైనప్పటికీ ఓడ నీటిపై తేలుతుంది కదా ! దీన్ని తయారుచేయుటకు కావలసిన శాస్త్రీయ జ్ఞానాన్ని అందించిన శాస్త్రజ్ఞుల గూర్చి నీవేమి అనుకుంటున్నావు?
జవాబు:
మన నిత్య జీవితంలో సౌలభ్యం కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వారు నిరంతరం ప్రకృతిని పరిశీలిస్తూ ప్రకృతి ధర్మాలు అర్థం చేసుకుంటూ మనకు విలువైన ఆవిష్కరణ అందిస్తున్నారు. అనేక టన్నుల ఇనుము కలిగి ఉన్నప్పటికీ వాటిని నీటిపై తేలే విధంగా నిర్మించి సముద్రం మీద మన ప్రయాణం సాధ్యం చేశారు. దీనికోసం వారు మేధస్సును ఉపయోగిస్తూ మన అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కావున మనం శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉండి శాస్త్రవేత్తల కృషిని అభినందించాలి.

కృత్యాలు

కృత్యం – 1
– వస్తువులు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థాలు

6th Class Science Textbook Page No. 46

ప్రశ్న 1.
మీ ఇంటిలో ఉపయోగించే వస్తువుల జాబితా క్రింది పట్టికలో ఇవ్వబడినది. ఏ వస్తువు ఏ పదార్థంతో తయారై ఉంటుందో రాయండి.
(ఏ వస్తువు ఏ పదార్థంతో తయారవుతుందో తెలియకపోతే స్నేహితులతో చర్చించి రాయండి.)

వస్తువు పదార్థం / పదార్థాలు
1. తలుపు చెక్క, లోహం, రబ్బరు, పెయింటు, ….
2. తువ్వాలు
3. రబ్బరు
4. కత్తి
5. అద్దం
6. బూట్లు
7. నీళ్ల సీసా
8. కుండ

జవాబు:

వస్తువు పదార్థం / పదార్థాలు
1. తలుపు చెక్క, లోహం, రబ్బరు, పెయింటు, ….
2. తువ్వాలు నూలు, దారాలు
3. రబ్బరు రబ్బరు
4. కత్తి ఇనుము, చెక్క
5. అద్దం గాజు, ఇనుము
6. బూట్లు చర్మం, రబ్బరు, దారము
7. నీళ్ల సీసా ప్లాస్టిక్
8. కుండ మట్టి

• ఒకే పదార్థంతో తయారైన వస్తువులను గుర్తించి, రాయండి.
జవాబు:
కుండ, నీళ్ల సీసా, రబ్బరు.

• ఒకటికన్నా ఎక్కువ పదార్థాలతో తయారైన వస్తువులను గుర్తించి, రాయండి.
జవాబు:
కత్తి, తలుపు, బూట్లు, తువ్వాలు, అద్దము.

AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 3
• కుర్చీ తయారీలో ఎన్ని రకాల పదార్థాలను వాడవచ్చు?
జవాబు:
కుర్చీని చెక్క లేదా ఇనుము లేదా ప్లాస్టిక్ వంటి ఒకే రకమైన పదార్థంతో తయారు చేయవచ్చు. లేదా ఇనుము, ప్లాస్టిక్ వైరు ఉపయోగించి తయారు చేసుకోవచ్చు.

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 47

వివిధ పదార్థాల నుంచి తయారైన వస్తువులను గుర్తించడం

ప్రశ్న 2.
క్రింది పట్టికలోని పదార్థాలలో ఒక్కొక్క పదార్థంతో ఎన్ని వస్తువులు తయారుచేయవచ్చో వీలైనన్ని రాయండి.

పదార్థం వస్తువులు
1. లోహం పాత్రలు , ………………………
2. ప్లాస్టిక్ సంచులు, ………………………
3. గాజు అద్దం , ………………………
4. చెక్క బల్ల, ………………………
5. పత్తి బట్టలు , ………………………
6. తోలు బూట్లు, ………………………
7. పింగాణీ కప్పులు, ………………………
8. రాళ్ళు విగ్రహాలు, ………………………

జవాబు:

పదార్థం వస్తువులు
1. లోహం పాత్రలు, గొడ్డలి, కత్తి, వాహనాలు, యంత్రాలు
2. ప్లాస్టిక్ సంచులు, బకెట్, డస్ట్బన్, కుర్చీ, డబ్బాలు, దువ్వెన
3. గాజు అద్దం, గ్లాస్, కూజా, టేబుల్ గ్లాస్, వాహన అద్దాలు
4. చెక్క బల్ల, తలుపు, కిటికీ, కుర్చీ, టీపాయ్, బ్యాట్
5. పత్తి బట్టలు, తువాలు, కర్టెన్స్, పరుపు, దిళ్ళు
6. తోలు బూట్లు, చెప్పులు, బ్యాగ్, బెల్ట్, టోపీ
7. పింగాణీ కప్పులు, జాడీ, గిన్నెలు, పాత్రలు, ప్లేట్లు
8. రాళ్ళు విగ్రహాలు, రోలు, స్తంభాలు

AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

కృత్యం -3 కొవ్వొత్తిని వెలిగిద్దాం

6th Class Science Textbook Page No. 48

ప్రశ్న 3.
అగ్గిపుల్ల సహాయంతో కొవ్వొత్తిని మీరు చాలాసార్లు వెలిగించి ఉంటారు కదా. వెలుగుతున్న అగ్గిపుల్లను కొవ్వొత్తి యొక్క వత్తిని తాకించినప్పుడు అది వెలుగుతుంది. వెలిగే అగ్గిపుల్ల సహాయంతో, కొవ్వొత్తిని దాని వత్తిని తాకకుండా వెలిగించగలమా? ప్రయత్నిద్దాం.
AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 4

ఒక సురక్షిత ప్రదేశంలో కొవ్వొత్తిని వెలిగే అగ్గిపుల్లతో వెలిగించండి. మొదటిసారి, అగ్గిపుల్ల కొవ్వొత్తికి తాకించి వెలిగించండి. సుమారు 2 నిమిషాల పాటూ వెలగనివ్వండి. తరువాత కొవ్వొత్తిని ఆర్పివేయండి. ఏమి గమనించారు? తెల్లని పొగ కొవ్వొత్తి వత్తి నుండి పైకి రావడాన్ని గమనించారా?

ఇప్పుడు వెలుగుతున్న అగ్గిపుల్లను కొవ్వొత్తి వత్తికి దగ్గరగా తీసుకురండి. కాని వత్తిని తాకకుండా చూడండి. ఏమి జరుగుతుందో గమనించండి.

• ఆరిన కొవ్వొత్తి దూరం నుంచి మంటను అందుకోగలిగిందా?
జవాబు:
కొవ్వొత్తి దూరం నుండి మంటను అంటుకోగలిగింది. కొవ్వొత్తి కాలినపుడు అది ఆవిరిగా మారి పొగ రూపంలో ఉంది. కావున కొవ్వొత్తి ఆవిరి మండుకొని కొవ్వొత్తి వెలిగింది.

• కొవ్వొత్తిని ఆర్పినప్పుడు వచ్చిన పొగ కొవ్వొత్తి యొక్క వాయు రూపమేనా?
జవాబు:
అవును. కొవ్వొత్తిని ఆర్పినప్పుడు వచ్చిన పొగ కొవ్వొత్తి యొక్క వాయు రూపమే.

కృత్యం – 4. పదార్థాల వర్గీకరణ

6th Class Science Textbook Page No. 49

ప్రశ్న 4.
మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులలో ఘన, ద్రవ, వాయు పదార్థాలను గుర్తించి, క్రింద ఇవ్వబడిన పట్టికలో నమోదు చేయండి.
జవాబు:

ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు వాయు పదార్థాలు
రాయి పాలు పొగ
బల్ల నూనె నీటి ఆవిరి
గోడ నెయ్యి హైడ్రోజన్
కుర్చీ మజ్జిగ ఆక్సిజన్
సీసా పెట్రోల్ గాలి
పుస్తకం డీజిల్ క్లోరిన్
కలం నీరు బోరాన్

కృత్యం – 5 నీటిలో మునిగేవి – తేలేవి

6th Class Science Textbook Page No. 49

ప్రశ్న 5.
ఒక బీకరులో నీటిని తీసుకోండి. దానిలో ఒక టమాట, వంకాయ, ఆలుగడ్డ (బంగాళదుంప), ఇనుప మేకు, స్పాంజి ముక్క చెక్క ముక్క రాయి, ఆకు, సుద్ద ముక్క కాగితం వంటివి ఒకదాని తర్వాత మరొకటి వేసి పరిశీలించండి.
వీటిలో ఏవి మునుగుతాయి? ఏవి తేలుతాయో పరిశీలించండి. మీ పరిశీలనలను క్రింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు:

పరిశీలన వస్తువులు
మునిగేవి రాయి, ఇనుప మేకు, మట్టి, విత్తనాలు, సబ్బు, గింజలు
తేలేవి చెక్క, కాగితం, ప్లాస్టిక్ బాటిల్, ఆకు, కర్ర, చెత్త

• కొన్ని వస్తువులు నీటిలో మునుగుతాయని, కొన్ని వస్తువులు నీటిలో తేలుతాయని మనం గమనిస్తాం. ఇప్పుడు బీకరులోని నీటికి కొంచెం ఎక్కువ మోతాదులో ఉప్పు కలపండి. ఈ ఉప్పు నీటితో పై కృత్యాన్ని మరొకసారి చేయండి.
జవాబు:2

వస్తువు పరిశీలన ఫలితం
రాయి మునుగుతుంది మునిగింది
ఇనుపమేకు తేలుతుంది మునిగింది
సుద్దముక్క మునుగుతుంది మునిగింది
టమాటా తేలుతుంది తేలింది
వంకాయ తేలుతుంది తేలింది
బంగాళదుంప మునుగుతుంది మునిగింది
స్పాంజి ముక్క తేలుతుంది తేలింది
చెక్క తేలుతుంది తేలింది
ఆకు తేలుతుంది తేలింది
కాగితం తేలుతుంది తేలింది

AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 5
• ఏమి గమనించారు?
జవాబు:
ఇంతకుమునుపు చేసిన కృత్యంలో మునిగిన వస్తువులు తేలటం ప్రారంభించాయి.

• రెండు కృత్యాలలోను ఒకే విధమైన ఫలితాలు కనబడ్డాయా? చర్చించండి.
జవాబు:
లేదు. మొదటి కృత్యంలో మునిగిన కొన్ని వస్తువులు రెండవ కృత్యంలో తేలాయి. ఉప్పునీటి సాంద్రత మంచినీటి సాంద్రత కన్నా ఎక్కువగా ఉండటం వల్ల ఆ వస్తువులు పైకి తేలాయి.

AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 50

ప్రశ్న 6.
వెడల్పాటి మూతిగల ఒక బీకరులో నీటిని తీసుకొని దానిలో ఒక ఇనుప మేకును వేయండి. ఏమి గమనించారు?
జవాబు:
ఇనుప మేకు నీటిలో మునుగుతుంది.

• ఆ మేకును తీసివేసి ఒక ఖాళీ ఇనుప డబ్బాను నీటిలో వేయండి. ఏమి గమనించారు?
జవాబు:
ఇనుప డబ్బా నీటిలో తేలుతుంది.

• ఇదే విధంగా ఒక చెక్కముక్క నీటిలో తేలుతుంది. మరి ఒక చెక్క డబ్బా నీటిలో తేలుతుందా?
జవాబు:
మునుగుతుంది.

పై కృత్యం ఆధారంగా కొన్ని వస్తువులు ఒక ఆకారంలో ఉన్నప్పుడు నీటిలో తేలుతాయి. కాని వాటి ఆకారం మారినప్పుడు నీటిలో మునుగుతాయని గమనించాం. నీటిలో మునిగే స్వభావమున్న వస్తువులను తేలేటట్లు చేయవచ్చు. కాని నీటిలో తేలే వస్తువులన్నింటిని మునిగేటట్లు చేయలేం.

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 50

ప్రశ్న 7.
5 బీకర్లలో నీటిని తీసుకోండి. పంచదార, ఉప్పు, సుద్దపొడి, ఇసుక, రంపపు పొట్టు వంటి వాటిని తీసుకొని ఒక్కొక్క బీకరులో ఒక్కొక్క దానిని కొద్దిగా కలపండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.

నీటికి కలిపిన పదార్థం కరుగుతుందా(అవును/ కాదు)
1. పంచదార
2. ఉప్పు
3. ఇసుక
4. రంపపు పొట్టు
5. సుద్ద పొడి కాదు

జవాబు:

నీటికి కలిపిన పదార్థం కరుగుతుందా(అవును/ కాదు)
1. పంచదార అవును
2. ఉప్పు అవును
3. ఇసుక కాదు
4. రంపపు పొట్టు కాదు
5. సుద్ద పొడి కాదు కాదు

వేర్వేరు మిశ్రమాల పేర్లు క్రింది పట్టికలో ఉన్నాయి. వాటిని తయారుచేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలియజేయండి.

మిశ్రమం పదార్థాలు
టీ పాలు
లడ్డు
నిమ్మరసం
కాంక్రీట్
మట్టి

జవాబు:

మిశ్రమం పదార్థాలు
టీ పాలు, నీరు, తేయాకు, పంచదార, యాలకులు
లడ్డు శనగపిండి, బెల్లం, నూనె, జీడిపప్పు, కిస్మిస్
నిమ్మరసం నిమ్మకాయ, ఉప్పు, సోడా, నీరు
కాంక్రీట్ సిమెంట్, కంకర, ఇసుక, నీరు
మట్టి రాళ్ళు, లవణాలు, సేంద్రీయ పదార్థం

మీకు తెలిసిన కొన్ని మిశ్రమాలను, వాటికి కావలసిన పదార్ధాలను క్రింది పట్టికలో పేర్కొనండి. అవి సహజమైనవో లేదా మనం తయారుచేసినవో కూడా తెలపండి.

మిశ్రమం కావలసిన పదార్థాలు సహజమైనది / మనం తయారు చేసినది
షర్బత్ నిమ్మరసం, పంచదార, నీరు మనం తయారు చేసినది

జవాబు:

మిశ్రమం కావలసిన పదార్థాలు సహజమైనది / మనం తయారు చేసినది
షర్బత్ నిమ్మరసం, పంచదార, నీరు మనం తయారు చేసినది
టీ తేయాకు, నీరు, పంచదార మనం తయారు చేసినది
గాలి ఆక్సిజన్, నత్రజని, ఇతర వాయువులు సహజమైనది
మట్టి రాళ్ళు, లవణాలు, సేంద్రీయ పదార్థం సహజమైనది
లడ్డు శనగపిండి, బెల్లం, నూనె, జీడిపప్పు, కిస్మిస్ మనం తయారు చేసినది

AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

కృత్యం – 8

6th Class Science Textbook Page No. 52

తేర్చడం – తేరినదాన్ని వంపడం

ప్రశ్న 8.
మట్టి నీటి నుండి మట్టిని మరియు ఇసుకను ఎలా వేరు చేస్తారు? ‘తేర్చడం’ మరియు ‘తేరినదాన్ని వంపడం’ అంటే ఏమిటి?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 6

  1. ఒక గాజు గ్లాసులో సగం వరకు నీళ్ళు తీసుకోండి. దానిలో కొంచెం మట్టి వేయాలి. మట్టి నీళ్ళలో కలిసిపోయేలా బాగా కలపాలి.
  2. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు కదిలించకుండా అలాగే ఉంచాలి.
  3. గ్లాసు అడుగుభాగాన్ని పరిశీలించాలి.
  4. గాజు గ్లాసు అడుగుభాగంలో ఇసుక మట్టికణాలు నిలిచి ఉండడం గమనిస్తాము.
  5. వీటినే అడుగున చేరిన కరగని పదార్థం అంటాం. ఈ విధంగా మట్టి నుంచి నీటిని వేరుచేసే పద్ధతినే ‘తేర్చడం’ అంటారు.
  6. తేర్చిన తరువాత, గ్లాసును నెమ్మదిగా పైకెత్తి అడుగున కరగకుండా మిగిలిన పదార్థాన్ని కదపకుండా నెమ్మదిగా మరొక గ్లాసులో పోయాలి.
  7. నీరు మట్టి నుంచి వేరవుతుంది. ఈ పద్ధతినే ‘తేర్చిపోత’ అంటారు.

కృత్యం – 9

6th Class Science Textbook Page No. 54

ప్రశ్న 9.
ఒక బీకరులో నీటిని తీసుకోండి. కొంత ఉప్పును దానిలో కరిగించండి. దీన్ని వడపోత కాగితం ఉపయోగించి ఈ మిశ్రమాన్ని వడపోయండి. నీవు ఉప్పును ఉప్పు నీటి నుంచి వేరు చేయగలిగావా?
• ఉప్పును ఉప్పునీటి నుంచి ఎందువల్ల వడపోయలేకపోయావు?
జవాబు:
వేరు చేయలేకపోయాను. ఎందువలననగా వడపోత కాగితంలోని సూక్ష్మరంధ్రాలు మామూలు కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వడపోసినప్పుడు ఆ రంధ్రాలనుంచి కూడా కిందికి జారిపోయిన ఉప్పు నీటిలో కరిగిన ఉప్పు కణాలు ఇంకా చాలా చిన్నవిగా ఉంటాయి.

కృత్యం – 10

6th Class Science Textbook Page No. 54

ప్రశ్న 10.
‘స్ఫటికీకరణం’ ప్రక్రియను వివరించుము.
జవాబు:
ఉద్దేశం : ఉప్పు నీరు నుండి ఉప్పును వేరు చేయుట.
AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 7

కావలసినవి :
ఉప్పు నీరు, పాత్ర, గాజు కడ్డీ, ట్రైపాడ్ స్టాండ్ (త్రిపాది), బున్సెన్ బర్నర్, వైర్ గేజ్.

ఎలా చేయాలి :
ఒక పాత్రలో కొంచెం ఉప్పునీటిని తీసుకొని త్రిపాదిపై పెట్టి వేడి చేయండి. పాత్రలోని నీరు అంతా ఆవిరైపోయే వరకు గాజు కడ్డీతో (ద్రావణాన్ని) కలియతిప్పండి.

ఏమి గమనిస్తావు :
ఉప్పు స్ఫటికాలు పాత్ర అడుగున మిగిలి ఉంటాయి. ఏమి నేర్చుకుంటావు : ఉప్పు నీటి నుండి ఉప్పును వేడిచేయడం ద్వారా వేరు చేయవచ్చు. (స్ఫటికీకరణం)

కృత్యం – 11

6th Class Science Textbook Page No. 55

ప్రశ్న 11.
‘స్వేదనం’ ప్రక్రియను వివరింపుము.
జవాబు:
ఉద్దేశం : సాధారణ నీరు నుంచి స్వేదన జలంను తయారు చేయుట.
AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 1

కావలసినవి :
నీరు, శాంకవ కుప్పెలు – 2, ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాలు-2, రబ్బరు గొట్టం, బుస్సెన్ బర్నర్, స్టాండు.

ఎలా చేయాలి :
ఒక శాంకవ కుప్పెను నీటితో నింపి ఒంటి రంధ్రపు బిరడాతో మూసి వేయండి. ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాతో మూసి ఉంచిన ఇంకొక శాంకవ కుప్పెను తీసుకోండి. రెండింటినీ రబ్బరు గొట్టంతో కలపండి. నీరు ఉన్న కుప్పెను వేడి చేయండి.

ఏమి గమనిస్తావు :
కొంత సేపు అయిన తర్వాత రబ్బరు గొట్టం ద్వారా నీటి ఆవిరి ఖాళీ శాంకవ కుప్పెలోనికి వెళు తుంది. ఆ నీటి ఆవిరి నెమ్మదిగా మారుతుంది. ఈ నీటిని స్వేదన జలం అంటాం. ఇది మలిన రహితమైన నీరు.

ఏమి నేర్చుకుంటావు :
స్వేదనం ద్వారా మలినాలను నీటి నుండి తొలగించవచ్చు.

కృత్యం – 12

6th Class Science Textbook Page No. 55

ప్రశ్న 12.
కర్పూరం ఉత్పతనం చెందే ప్రక్రియను వివరింపుము.
జవాబు:
ఉద్దేశం : ఉత్పతనం ప్రక్రియను అర్థం చేసుకోవడం.
AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 2

కావలసినవి :
కర్పూరం, ఉప్పు మిశ్రమం, పింగాణి పాత్ర, దూది, స్టాండ్.

ఎలా చేయాలి :
ఒక పింగాణి పాత్రలో కర్పూరం, ఉప్పు మిశ్రమాన్ని తీసుకోండి. దాన్ని ఒక గరాటుతో మూయండి. గరాటు కాడను దూదితో మూయండి. పింగాణి పాత్రను స్టాండ్ పైన ఉంచి వేడి చేయండి.

ఏమి గమనిస్తావు :
కర్పూరం వేడి చేసినప్పుడు ద్రవరూపంలోకి మారకుండా వాయురూపంలోకి మారి పాత్రలో ఉప్పు నుండి వేరవుతుంది. గరాటుకాడలో ఉన్న దూది వలన చల్లబడి మళ్ళీ నేరుగా ఘనరూపంలో మారుతుంది.

ఏమి నేర్చుకుంటావు :
ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుండి వాయు రూపంలోకి లేదా వాయురూపం నుండి ఘనరూపంలోకి మారే ప్రక్రియను || ‘ఉత్పతనం’ అంటారు.

కృత్యం – 13

6th Class Science Textbook Page No. 56

ప్రశ్న 13.
క్రొమటోగ్రఫి ప్రక్రియను వివరింపుము.
జవాబు:
ఉద్దేశం : రంగుల మిశ్రమం నుండి రంగులను వేరు చేయుట (ఇంకు).
AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 8

కావలసినవి :
తెల్లని పొడవైన సుద్దముక్క, నలుపురంగు సిరా, పళ్ళెం, నీరు.

ఎలా చేయాలి :
ఒక తెల్లని పొడవైన సుద్దముక్కను తీసుకోండి. దాని చుట్టూ నీలం లేదా నలుపురంగు సిరాతో గుర్తు పెట్టండి. ఒక పళ్ళెం తీసుకొని దానిలో కొద్దిగా నీరు పోయండి. మధ్యలో సుద్దముక్కను నిలబెట్టండి. పళ్ళెంలోని నీరు సుద్దముక్కలోని సిరా రంగు గుర్తును తాకకుండా జాగ్రత్త వహించండి. కొంత సేపటి తర్వాత సుద్దముక్కపై ఏర్పడే రంగుల వలయాలను పరిశీలించండి. నీరు సుద్దముక్క పైభాగానికి ఎగబాకేలోపుగానే సుద్దముక్కను పళ్ళెం నుండి తీసివేయండి.

ఏమి గమనిస్తావు :
దిగువ నుండి పైకి సుద్దముక్క చుట్టూ వివిధ రంగులు ఏర్పడతాయి.

ఏమి నేర్చుకుంటావు :
వాస్తవానికి సిరా ఒక్క రంగులోనే కన్పించినప్పటికీ, అది అనేక రంగులను తనలో ఇముడ్చుకుంటుంది. ఇలా రంగులను వేరు చేసే పద్ధతినే ‘క్రొమటోగ్రఫి’ అంటారు.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 59

ప్రశ్న 1.
ఒక బీకరులోని నీటిలో కోడిగుడ్డును వేయండి. మరొక బీకరులోని నీటికి కొంచెం ఎక్కువ మోతాదులో ఉప్పును కలిపి, ఇప్పుడు ఆ గుడ్డును ఈ నీటిలో వేయండి. మీ పరిశీలనలను నమోదు చేయండి.
జవాబు:
ఒక బీకరు తీసుకొని దానిలో నీరు పోసి కోడిగుడ్డుని వేశాను. కోడిగుడ్డు నీటిలో మునిగిపోయింది. మరొక బీకరు తీసుకొని దానిలో ఉప్పు నీటిని తీసుకొని కోడిగుడ్డు వేశాను. ఆశ్చర్యంగా అది నీటిలో తేలడం గమనించాను. గుడ్డు రెండు బీకర్లలో ఒకే బరువు కలిగి ఉన్నప్పటికీ ఒక దాంట్లో మునిగి, రెండో దాంట్లో తేలటం ఆశ్చర్యంగా ఉంది. గుడ్డు నీటిలో తేలడానికి, నీటిలో కలిపిన ఉప్పు కారణమని భావిస్తున్నాను.

ప్రశ్న 2.
కింది కృత్యాలను చేసి మీ పరిశీలనలను నమోదు చేయండి.
ఎ) సుద్దపొడిని నీటిలో కలపండి.
బ) ఒక చిన్న మైనపు ముక్కను నీటిలో వేయండి.
సి) బీకరులోని నీటిలో కొన్ని నూనె చుక్కలు వేయండి.
జవాబు:
ఎ) సుద్దపొడిని నీటిలో కలిపి, కాసేపు ఆగి పరిశీలించినట్లయితే సుద్దపొడి నీటి అడుగున చేరింది అంతేకానీ అది నీటిలో కరగలేదు, దీనిని బట్టి సుద్దపొడి నీటిలో కరగని పదార్థం అని నిర్ధారించబడినది.
బి) చిన్న మైనపు ముక్కను నీటిలో వేసాను, అది నీటిపై తేలటం గమనించాను. దీనిని బట్టి మైనపు ముక్క నీటి కంటే తేలిగ్గా ఉందని, కాబట్టి నీటిపై తేలినది అని నిర్ధారించవచ్చు.
సి) ఒక బీకరులోని నీటిలో కొన్ని నూనె చుక్కలు వేయగా అవి నీటిపై తేలాయి. అంతేగాక అవి నీటిలో ఏమాత్రం కరగకుండా పలుచని పొరలాగా విస్తరించాయి.

ప్రశ్న 3.
మీ వంటగదిలో ఉన్న పాత్రలు, ఆహారపు దినుసులు వంటి కొన్ని వస్తువుల జాబితాను రాసి, వాటిని కింది విధంగా వర్గీకరించండి.
ఎ) నీటిలో మునుగుతుందా? తేలుతుందా?
బి) నీటిలో కరుగుతుందా / కరుగదా?
జవాబు:
ఎ) నీటిలో మునిగేవి : గ్లాసులు, వంటపాత్రలు, పప్పు దినుసులు, బియ్యము
బి) నీటిలో మునగనివి : ఆకుకూరలు, కరివేపాకు, టమోటాలు
సి) నీటిలో కరిగేవి : బెల్లం, పంచదార, ఉప్పు
డి) నీటిలో కరగనివి : బియ్యం, కందిపప్పు, కూరగాయలు

AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

ప్రశ్న 4.
గోధుమపిండిలో చక్కెర కలిసిపోయింది. దానిలో నుంచి చక్కెరను వేరుచేయడానికి వీలు కలుగుతుందా? నీవైతే ఎలా వేరుచేస్తావు? ఒకవేళ చక్కెర, గోధుమపిండి కలిసిపోతే ఎలా వేరు చేస్తావు?
జవాబు:
గోధుమపిండి, చక్కెర కలిసిపోతే వాటిని వేరు చేయడానికి వీలవుతుంది చక్కెరతో పోల్చుకున్నప్పుడు గోధుమపిండి పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది కావున జల్లెడ ఉపయోగించి జల్లించడం ద్వారా గోధుమపిండి క్రిందకు వస్తుంది. జల్లెడలో పంచదార మిగిలిపోతుంది.