AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Ex 7.1

AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Ex 7.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 7th Lesson బీజ గణిత పరిచయం Exercise 7.1

ప్రశ్న 1.
కింది ఆకారాలను ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య కనుగొనడానికి సూత్రం రాయండి.
(ఎ) “T” అక్షరాల అమరిక (బి) ‘E’ అక్షరాల అమరిక (సి) ‘Z’ అక్షరాల అమరిక
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Ex 7.1 1

AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Ex 7.1

ప్రశ్న 2.
గదిలో ఉండే ఫ్యాన్ల సంఖ్యకు, ప్రతి ఫ్యాన్‌కు ఉండే బ్లేడ్ల సంఖ్యకు గల సంబంధానికి సూత్రం రాయండి.
సాధన.
గదిలో ఉండే ప్రతి ఫ్యాన్‌కు ఉండే బ్లేడ్ల సంఖ్య = 3
గదిలో గల ఫ్యాన్లు = n అనుకొందాం.
ఫ్యాన్స్ సంఖ్యకు, ప్రతి ఫ్యాన్‌కు ఉండే బ్లేడ్ల సంఖ్యకు గల సంబంధానికి సూత్రం = 3n

ప్రశ్న 3.
ఒక పెన్ను ధర ₹7 అయిన, ‘n’ పెన్నులు కొనడానికి సూత్రం రాయండి.
సాధన.
ఒక పెన్ను ధర = ₹7
‘n’ పెన్నులు కొనడానికి కావలసిన సొమ్ము = ₹7 × n = ₹7n

AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Ex 7.1

ప్రశ్న 4.
q పుస్తకాలు కొనడానికి ₹ 25q అవసరం. అయితే ఒక్కొక్క పుస్తకం ధర ఎంత?
సాధన.
q పుస్తకాలు కొనడానికి అవసరమగు సొమ్ము = ₹25q
ఒక్కొక్క పుస్తకం ధర = ₹ 25q ÷ q = ₹25

ప్రశ్న 5.
హర్షిణి వద్ద పద్మ దగ్గర కంటే ఐదు బిస్కెట్లు ఎక్కువ కలవు. ఈ సంబంధాన్ని చరరాశి ‘y’ ఉపయోగించి రాయండి.
సాధన.
పద్మ దగ్గర గల బిస్కెట్ల సంఖ్య = y అనుకొందాం.
∴ హరిణి వద్ద గల బిస్కెట్ల సంఖ్య = y + 5

Leave a Comment