AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా – క.సా.గు Ex 3.3

SCERT AP 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా – క.సా.గు Ex 3.3 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 3rd Lesson గ.సా.కా – క.సా.గు Exercise 3.3

ప్రశ్న 1.
కింది ఇవ్వబడిన సంఖ్యలకు అన్ని కారణాంకాలు రాయండి.
అ) 24
ఆ) 56
ఇ) 80
ఈ) 98
సాధన.
అ) 24
24 = 1 × 24
24 = 2 × 12
24 = 3 × 8
24 = 4 × 6
4 కారణాంకాలు
1, 2, 3, 4, 6, 8, 12, 24.

ఆ) 56
56 = 1 × 56
56 = 2 × 28
56 = 4 × 14
56 = 7 × 8
56 కారణాంకాలు
1, 2, 4, 7, 8, 14, 28, 56.

ఇ) 80
80 = 1 × 80
80 = 2 × 40
80 = 4 × 20
80 = 5 × 16
80 = 8 × 10
80 కారణాంకాలు
1, 2, 4, 5, 8, 10, 16, 20, 40, 80.

ఈ) 98
98 = 1 × 98
98 = 2 × 49
98 = 7 × 14
98 కారణాంకాలు
1, 2, 7, 14, 49, 98.

ప్రశ్న 2.
50 మరియు 100 మధ్యన గల అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏది?
సాధన.
50 మరియు 100 మధ్యగల అతి పెద్ద ప్రధానసంఖ్య = 97.

AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా - క.సా.గు Ex 3.3

ప్రశ్న 3.
13 మరియు 31 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు. రెండు సంఖ్యలు 1 మరియు 3 అంకెలు కలిగివున్నవి. ఇలాంటి 100 లోపున్న రెండు జతల ప్రధాన సంఖ్యలను కనుగొనండి.
సాధన.
(17, 71), (37, 73) (79, 97)

ప్రశ్న 4.
కింద ఇవ్వబడిన సంఖ్యలను రెండు బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా తెలుపుము.
అ) 18
ఆ) 24
ఇ) 36
ఈ) 44
సాధన.
అ) 18 = 5 + 13
18 = 7 + 11

ఆ) 24 = 5 + 19
24 = 7 + 17
24 = 11 + 13

ఇ) 36 = 5 + 31
36 = 7 + 29
36 = 13 + 23
36 = 17 + 19

ఈ) 44 = 3 + 41
44 = 7 + 37
44 = 13 + 31

ప్రశ్న 5.
100 లోపున్న 7 వరుస సంయుక్త సంఖ్యలను రాయండి.
సాధన.
100 లోపు ఉన్న 7 వరుస సంయుక్త సంఖ్యలు : 90, 91, 92, 93, 94, 95, 96

ప్రశ్న 6.
10 భేదంగా కలిగిన రెండు ప్రధాన సంఖ్యలను రాయండి.
సాధన.
10 భేదంగా గల రెండు ప్రధాన సంఖ్యలు
(3, 13) లేదా (7, 17) లేదా (13, 23) లేదా (19, 29) లేదా (31, 41) లేదా (37, 47) లేదా (43, 53) లేదా (61, 71) లేదా (73, 83) మొదలగునవి.

AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా - క.సా.గు Ex 3.3

ప్రశ్న 7.
20 లోపు ఉండి వాటి మొత్తం 5 చే భాగింపబడే మూడు జతల ప్రధాన సంఖ్యలను రాయండి.
సాధన.

ప్రధాన సంఖ్యల జత వాటి మొత్తం 5 చే భాగించబడుతుందా ? / లేదా ?
2, 3 2 + 3 = 5 అవును
3, 7 3 + 7 = 10 అవును
7, 13 7 + 13 = 20 అవును

Leave a Comment