AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

SCERT AP 6th Class Science Study Material Pdf 8th Lesson దుస్తులు ఎలా తయారవుతాయి Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 8th Lesson Questions and Answers దుస్తులు ఎలా తయారవుతాయి

6th Class Science 8th Lesson దుస్తులు ఎలా తయారవుతాయి Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. కృత్రిమ దారాలను మండించినపుడు …………. వాసన వస్తుంది. (ఘాటు)
2. పీచు → …………. → వస్త్రం. (దారం)
3. దూది నుంచి గింజలను వేరుచేయడాన్ని …………… అంటారు. (జిన్నింగ్)
4. …………… పీచు (దారం)ను బంగారు దారం అంటారు. (జనపనార)
5. సహజ దారాలకు (పోగులకు) ఉదాహరణ ………….. (నూలు, ఉన్ని)

II. సరియైన సమాధానాన్ని గుర్తించండి.

1. కృత్రిమ దారపు పోగును గుర్తించండి.
A) నూలు
B) ఉన్ని
C) అక్రిలిక్
D) జనపనార
జవాబు:
C) అక్రిలిక్

2. నూలు వడకడానికి ఉపయోగించే సాధనం
A) సూది
B) కత్తి
C) చరఖా
D) కత్తెర
జవాబు:
C) చరఖా

3. దారం నుంచి వస్త్రం తయారు చేసే ప్రక్రియ.
A) వడకడం
B) జిన్నింగ్
C) నేయడం
D) కత్తిరించడం
జవాబు:
C) నేయడం

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

4. జనపనార లభించే మొక్క భాగం
A) వేరు
B) పత్రం
C) పుష్పం
D) కాండం
జవాబు:
D) కాండం

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
వివిధ దారాలతో తయారయిన మీ ఇంటిలో మీరు ఉపయోగించే వస్తువులను పేర్కొనండి.
జవాబు:
చొక్కా – కాటన్
చీర – సిల్క్
స్వెట్టర్ – ఉన్ని
వాకిలి పట్టాలు – కొబ్బరి పీచు
లగేజి కవర్ – పాలిథీన్
గొడుగు – PVC
రైన్ కోట్ – PVC
గన్నీ బ్యాగ్ – జనపనార

ప్రశ్న 2.
దారపు పోగు కంటే దారం దృఢమైనది. ఎందుకు?
జవాబు:
దారంలోని సన్నని పోగుల వంటి నిర్మాణాలను దారపు పోగులు అంటారు. అనేక దారపు పోగుల కలయిక వలన దారం ఏర్పడుతుంది. దారపు పోగుల సంఖ్య పెరిగే కొలది దారం మందం మరియు గట్టితనం పెరుగుతుంది. అందువలన దారపు పోగు కంటే దారం బలంగా ఉంటుంది.

ప్రశ్న 3.
సహజ దారాలకు, కృత్రిమ దారాలకు మధ్య గల భేదాలను తెలపండి.
జవాబు:

సహజ దారాలు కృత్రిమ దారాలు
1) ఇవి మొక్కలు మరియు జంతువుల నుండి ఉత్పన్నమవుతాయి. 1) ఇవి రసాయనాల నుండి ఉత్పన్నమవుతాయి.
2) నీటి శోషణ సామర్థ్యం ఎక్కువ. 2) నీటి శోషణ సామర్థ్యము తక్కువ.
3) కాల్చినప్పుడు తీవ్రమైన వాసనలతో కూడిన బూడిదను ఏర్పరుస్తాయి. 3) కాల్చినపుడు ముడుచుకుపోయి ప్లాస్టిక్ వాసనను ఇస్తాయి.
4) ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. 4) ఆరటానికి తక్కువ సమయం పడుతుంది.
5) బట్టలు ముతకగా ఉంటాయి. 5) బట్టలు మృదువుగా ఉంటాయి.

ప్రశ్న 4.
నూలు దారాలతో రెయిన్ కోటును తయారు చేస్తే ఏమవుతుంది?
జవాబు:
వర్షం నుండి రక్షణ పొందటానికి రెయిన్ కోటులు వాడతారు. ఇవి నీటిని పీల్చుకోని స్వభావము కల్గి ఉంటాయి. కానీ నూలు దారాలు నీటిని బాగా పీల్చుకుంటాయి. నూలు దారాలతో రెయిన్ కోటు తయారుచేస్తే అవి నీటిని పీల్చుకొని తడిపేస్తాయి. కావున నూలు దారాలు రెయిన్ కోటు తయారీకి పనికిరావు.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 5.
జనపనార దారంను పొందే విధానం రాయండి.
జవాబు:
జనపనార మొక్క యొక్క కాండం నుండి జనపనార లభిస్తుంది. జనుము కోసిన తరువాత కొన్ని రోజులు నీటిలో నానబెడతారు. కాండం నీటిలో నానబెట్టినప్పుడు అది కుళ్ళిపోయి పై తొక్క సులభంగా ఊడిపోతుంది. ఈ కాండం బెరడు నుండి జనపనార వస్తుంది. ఈ దారంను నేయడం ద్వారా మనం గోనె సంచులను తయారుచేసుకోవచ్చు.

ప్రశ్న 6.
పత్తి మొక్క నుంచి నూలు వస్త్రాన్ని పొందడంలో గల దశలను తెలియజేసే ఫ్లోచార్టును రాయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 1a

ప్రశ్న 7.
సిరి తన పుట్టినరోజు సందర్భంగా బట్టతో చేసిన సంచులను తన తోటి విద్యార్థులకు బహుమతిగా ఇచ్చింది. మీరు ఆమెను ఎలా ప్రశంసిస్తారు?
జవాబు:
సిరి తన పుట్టినరోజున గుడ్డ సంచులను బహుమతిగా ఇచ్చింది. ఇది నిజంగా అభినందించాల్సిన అంశం. ఎందుకంటే: పాలిథీన్ కవర్లు నేలలో కుళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాక పరిసరాలను కలుషితం చేస్తాయి. ఇవి వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా నేల పెర్కొలేషన్ సామర్థ్యాన్ని నివారిస్తాయి. కానీ గుడ్డ సంచులు తేలికగా కుళ్ళి మట్టిలో కలిసిపోతాయి మరియు పర్యావరణానికి హాని కలిగించవు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి సిరి మంచి ప్రయత్నం చేసింది కావున అభినందించాలి.

ప్రశ్న 8.
పాలిథీన్ సంచులకు బదులుగా సహజ దారాలతో చేసిన సంచుల వాడకాన్ని ప్రోత్సహించే కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  • ప్లాస్టిక్ వద్దు – పర్యావరణమే ముద్దు
  • ప్లాస్టిక్ ఒక భూతం – గుడ్డ సంచులే హితం
  • ప్లాస్టిక్ కు నో చెప్పండి – చేతి సంచులకు యస్ చెప్పండి
  • ప్లాస్టిక్ ను వదిలేద్దాం – భూమిని బ్రతికిద్దాం
  • పరిష్కారంలో ఒక భాగంగా ఉండండి – కాలుష్యంలో కాదు
  • అరగని అన్నం మనకు కష్టం – కలవని ప్లాస్టిక్ నేలకు నష్టం

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 87

ప్రశ్న 1.
మీ ఇంటిలో వివిధ రకాల గుడ్డలను ఉపయోగించి తయారుచేసిన వస్తువులు ఏమేమి ఉన్నాయో వాటి జాబితా రాయండి. వాటిని నూలు, పట్టు, ఉన్ని, పాలిస్టర్, టెర్లిన్, నైలాన్ మొదలైన వాటిలో ఏవి దేనితో తయారయ్యా యో వర్గీకరించండి. మీ పట్టికలో మరికొన్ని చేర్చేందుకు ప్రయత్నించండి. మీ ఇంటిలో ఉండే పెద్దలు, ఉపాధ్యాయులు సహకారం తీసుకుని ఏ గుడ్డ ఏదో గుర్తించండి.

గుడ్డ రకం తయారుచేసిన వస్తువులు
1. నూలు
2. పట్టు కుర్తా, చీర
3. ఉన్ని మేజోళ్ళు ………
4. పాలిస్టర్
5. టెర్లిన్ చీర, ………..

జవాబు:

గుడ్డ రకం తయారుచేసిన వస్తువులు
1. నూలు నూలు చొక్కా సంచి, చీర, ధోవతి, గుమ్మం తెరలు, డ్రస్‌లు
2. పట్టు కుర్తా, చీర, తాళ్లు
3. ఉన్ని మేజోళ్లు, స్వెట్టర్లు
4. పాలిస్టర్ చొక్కాలు, చీరలు, ప్యాంటులు, ధోవతులు
5. టెర్లిన్ చీర, ఓణీలు, చొక్కాలు

1. మీ ఇంటిలో ఏ రకం బట్టలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?
జవాబు:
మా ఇంట్లో ఎక్కువగా కాటన్ మరియు పట్టు బట్టలు ఉపయోగిస్తున్నారు.

2. ఏ బట్ట ఎలాంటిదో ఎలా గుర్తించగలవు?
జవాబు:
తాకటం మరియు చూడటం ద్వారా దుస్తులు రకాన్ని గుర్తిస్తాము.

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 87

ప్రశ్న 2.
ఏదైనా ఒక గుడ్డముక్కను తీసుకోండి. భూతద్దంలో దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఒక్కొక్కదారాన్ని నెమ్మదిగా లాగండి. దానిని పరిశీలించండి. మీరు ఏమి గమనించారు?
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 2
1. మీరు ఏమి గమనించారు?
జవాబు:
దారము పోగుల వంటి చిన్న నిర్మాణాలను కలిగి ఉంది. ఒక దారాన్ని తీసుకోండి. దాని చివరలు వేళ్ళతో నలపండి. భూతద్దం ద్వారా గమనించండి.

2. దారం చివరన మరింత సన్నని దారాలు కనిపించాయా?
జవాబు:
అవును దారంలో సన్నని నిర్మాణాలు ఉన్నాయి.

3. ఒక సూది తీసుకోండి. ఈ దారాన్ని సూదిలో గుచ్చండి. సూది కన్నంలోకి దారం దూర్చగలిగారా? కష్టంగా ఉంది కదూ! సూదిలో దారం దూర్చడానికి మీ ఇంటిలో పెద్ద వాళ్లు ఏమి చేస్తారో ఎప్పుడైనా గమనించారా?
జవాబు:
సాధారణంగా మనం సూది రంధ్రములోకి దారము ఎక్కించలేకపోయినప్పుడు, మనం దారము చివరను మెలి తిప్పుతాము లేదా లాలాజలంతో చివరి భాగాన్ని గట్టిగా చేస్తాము.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

కృత్యం – 3

6th Class Science Textbook Page No. 88

ప్రశ్న 3.
కొన్ని సహజ, కృత్రిమ గుడ్డ ముక్కలను సేకరించండి. కింది పట్టికలో సూచించిన లక్షణాలను పరిశీలించండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.

లక్షణం సహజ వస్త్రం కృత్రిమ వస్త్రం
1. నీటిని పీల్చుకొనే సామర్థ్యము
2. ఆరటానికి పట్టే సమయం
3. కాలిస్తే వచ్చే వాసన
4. మండించిన తరువాత మిగిలినది
5. సాగే గుణం
6. నునుపుదనం

జవాబు:

లక్షణం సహజ వస్త్రం కృత్రిమ వస్త్రం
1. నీటిని పీల్చుకొనే సామర్థ్యము ఎక్కువ తక్కువ
2. ఆరటానికి పట్టే సమయం ఎక్కువ తక్కువ
3. కాలిస్తే వచ్చే వాసన మసి వాసన ప్లాస్టిక్ వాసన
4. మండించిన తరువాత మిగిలినది బూడిద ముడుచుకుపోతుంది
5. సాగే గుణం తక్కువ ఎక్కువ
6. నునుపుదనం తక్కువ ఎక్కువ

1. ఏ రకమైన వస్త్రాలు నునుపుగా ఉన్నాయి?
జవాబు:
ప్రకృతిలో కృత్రిమ వస్త్రాలు నునుపుగా ఉన్నాయి.

2. ఏ రకమైన వస్త్రాలు తొందరగా ఆరాయి?
జవాబు:
కృత్రిమ వస్త్రాలు తక్కువ సమయంలో ఆరాయి.

3. వస్త్రాల నునుపుదనం, అవి ఆరడానికి పట్టే సమయం మధ్య ఏదైనా సంబంధాన్ని గుర్తించావా?
జవాబు:
అవును, నునుపైన బట్టలు ఆరబెట్టడానికి తక్కువ సమయం పడుతుంది.

4. కాల్చినప్పుడు బూడిదగా మారిన వస్త్రాలు ఏమిటి?
జవాబు:
సహజ దారాలు కాల్చినపుడు బూడిదను ఇచ్చాయి.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 89

ప్రశ్న 4.
మీ చుట్టుపక్కల లేదా పొలాలలో నుండి పత్తి కాయలను సేకరించండి. కాయల్లో తెల్లటి దూది ఉంటుంది. దూదిలో నుంచి గింజలను వేరుచేయండి. కొంచెం దూదిని తీసుకోండి. దాన్ని భూతద్దంలో గానీ మైక్రోస్కోపు కింద ఉంచి గానీ పరిశీలించండి.
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 3
1. మీరు ఏమి గమనిస్తారు?
జవాబు:
నేను చిన్న వెంట్రుకల నిర్మాణాలను గమనిస్తాను. ఇవి పత్తి యొక్క దారపు పోగులు.

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 89

ప్రశ్న 5.
పత్తికాయల నుంచి దూదిని తీసి గింజలను ఏరివేయండి. కొంత దూదిని ఒక చేతితో తీసుకోండి. మరొక చేతి చూపుడువేలు, బొటనవేళ్లతో కొద్దిగా దూదిని పట్టుకుని మెల్లగా లాగండి. దానిని పురిపెడుతూ లాగండి.
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 4
1. దూది దారంగా రావడాన్ని గమనిస్తారు. ఇది గట్టిగా ఉంటుందా? ఉండదా?
జవాబు:
పత్తి లేదా ఉన్ని నుండి మనం తయారుచేసే దారం నేయడానికి ఉపయోగపడేంత బలంగా లేదు. పత్తి నుండి బలమైన దారం పొందడానికి రాట్నం మరియు తకిలి అనే పరికరాలు వాడతారు.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 91

ప్రశ్న 6.
ఒక గోనె సంచిని సేకరించండి. దానిలో నుండి ఒక దారాన్ని లాగండి. భూతద్దం కింద దారాన్ని పెట్టి పరిశీలించండి. జనపనార దారం సన్నని దారాలతో తయారయినట్టుగా గమనిస్తారు. దారాలు ఎలా కనిపిస్తున్నాయో పరిశీలించండి. వాటిని నూలు దారాలతో పోల్చండి.
జవాబు:
పత్తి మాదిరిగా, జనపనార దారం కూడా దుస్తుల తయారీకి ఉపయోగపడుతుంది. దీనిని “గోల్డెన్ దారపు పోగు” అని కూడా అంటారు. జనపనార బట్ట కాటన్ దుస్తులు వలె ఉండదు. ఇది గట్టి, బలమైనది మరియు మరింత కఠినమైనది.

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 92

ప్రశ్న 7.
కొబ్బరి ఆకులతో చాప ఎలా అల్లుతారు?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 5
కొబ్బరి ఆకులను లేదా రెండు వేరు వేరు రంగుల కాగితపు చీలికలను తీసుకోండి. కొబ్బరి ఆకుకు ఉన్న ఈ నెను తీసివేసి ఆకును రెండుగా చేయండి. ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా ఆకులను అమర్చండి. ఇంకొక ఆకును తీసుకుని పేర్చిన ఆకులు ఒకసారి పైకి ఒకసారి కిందికి వచ్చేలా అడ్డంగా దూర్చండి. (నవారు మంచం అల్లినట్లు) ఇలా ఆకులన్నీ దూర్చండి. చివరికి మీకు చదునుగా ఉండే చాప తయారవుతుంది. ఇదే విధంగా రంగుల కాగితాలు ఉపయోగించి అల్లండి.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 94

ప్రశ్న 1.
బట్టతో సంచి తయారుచేయండి. దాని మీద రంగురంగుల గుడ్డ ముక్కలతో డిజైన్లు కుట్టండి. పాఠశాలలో ప్రదర్శించండి.
జవాబు:

ప్రశ్న 2.
వివిధ రకాల దుస్తుల చిత్రాలు సేకరించండి. వాటి పేర్లు రాయండి. స్క్రాప్ బుక్ తయారుచేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం :

  1. ఈ స్క్రుకను విద్యార్థులు ఎవరికి వారే తయారు చేసుకోవాలి.
  2. బట్టలషాపు యజమానుల సహకారం తీసుకుని సేకరించిన దుస్తుల పేర్లు తెలుసుకుని రాయవచ్చు.

ప్రశ్న 3.
మీ ఉపాధ్యాయులతో లేదా మీ తల్లిదండ్రులతో చర్చించి మన రాష్ట్రంలో గల నూలు మిల్లులను చూపించే చార్టు తయారు చేయండి.
జవాబు:

ప్రశ్న 4.
చేనేత కార్మికులు, పత్తి రైతుల గురించిన సమాచారాన్ని వార్తాపత్రికల నుండి సేకరించండి. ఏదైనా ఒక దానిపైన మీ విశ్లేషణ రాయండి.
జవాబు:
విద్యార్థులు వారి నైపుణ్యం బట్టి ఎవరికి తోచిన రీతిలో వారు ఈ ప్రశ్నకు జవాబు వ్రాసి, విశ్లేషణ చేయాలి. ఉపాధ్యాయుని సలహా తీసుకోండి.

ప్రశ్న 5.
కృత్రిమ దారాలు కాల్చినపుడు ఘాటైన వాసన వస్తుందని చెప్పడానికి నీవు ఏమి ప్రయోగం చేశావు? ఆ ప్రయోగ విధానాన్ని రాయండి.
జవాబు:
వివిధ కృత్రిమ వస్త్రం ముక్కలను తీసుకొని ఒకదాని తరువాత ఒకటి కాల్చుతూ పరిశీలనలు నమోదు చేయండి. ఉన్ని త్వరగా కాలిపోదు. నైలాన్, పాలిస్టర్, టెరీలిన్, రేయాన్ వంటి దారాలు వాటిని కాల్చినప్పుడు అవి తీవ్రమైన వాసనను ఇస్తాయి. మరియు కుచించుకుపోతాయి.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 6.
ఈ లోగోలను పరిశీలించండి. వీనికి సంబంధించిన సమాచారం సేకరించండి.
జవాబు:

  • ‘ఆప్కో’ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత నేత కార్మికుల సహకార సంఘం యొక్క సంక్షిప్తీకరణ.
  • ఆప్కో 1976లో స్థాపించబడింది.
  • కో-ఆప్టెక్స్ అంటే తమిళనాడు చేనేత సహకార సమాజం యొక్క సంక్షిప్తీకరణ.
  • కో-ఆప్టెక్స్ చేనేత వస్త్రాల యొక్క మార్గదర్శక మార్కెటింగ్ సంస్థ.
  • దాని నెట్ వర్క్ ద్వారా భారతదేశం అంతటా విస్తరించి ఉన్న 203 షోరూమ్ ల ద్వారా వ్యాపారం సాగిస్తుంది.
  • 1935లో స్థాపించబడిన ఈ సంస్థ వార్షిక టర్నోవర్ రూ. 1000 కోట్లు.
  • వస్త్ర రంగుల సీతాకోకచిలుక లోగో అనేది కో-ఆప్టెక్స్ యొక్క నాణ్యత, మన్నిక మరియు సరసమైన వాణిజ్యానికి పర్యాయపదంగా మారింది.

Leave a Comment