AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

SCERT AP 6th Class Science Study Material Pdf 6th Lesson అయస్కాంతంతో సరదాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 6th Lesson Questions and Answers అయస్కాంతంతో సరదాలు

6th Class Science 6th Lesson అయస్కాంతంతో సరదాలు Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. అయస్కాంతంచే ఆకర్షించబడే పదార్థాలను ……. అంటారు. (అయస్కాంత పదార్థాలు)
2. కాగితం ………….. పదార్థం కాదు. (అయస్కాంత పదార్ధం)
3. పూర్వకాలంలో నావికులు కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి ……….. ఉపయోగిస్తారు. (అయస్కాంత దిక్సూచి)
4. ఒక అయస్కాంతానికి ఎల్లప్పుడు …………… ధృవాలు ఉంటాయి. (రెండు)

II. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. అయస్కాంతం ద్వారా ఆకర్షించబడే వస్తువు
A) చెక్క ముక్క
B) సాధారణ సూది
C) రబ్బరు
D) కాగితం ముక్క
జవాబు:
B) సాధారణ సూది

2. స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఎల్లప్పుడు చూపే దిక్కులు
A) ఉత్తరం – తూర్పు
B) దక్షిణం – పశ్చిమ
C) తూర్పు – పడమర
D) ఉత్తరం – దక్షిణం
జవాబు:
D) ఉత్తరం – దక్షిణం

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

3. అయస్కాంతాలు తమ ధర్మాలను కోల్పోయే సందర్భంలో
A) ఉపయోగించినప్పుడు
B) నిల్వ చేసినపుడు
C) సుత్తితో కొట్టినపుడు
D) శుభ్రం చేసినపుడు
జవాబు:
C) సుత్తితో కొట్టినపుడు

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మీ తరగతి గదిలోని అయస్కాంత మరియు అనయస్కాంత పదార్థాల జాబితా తయారు చేయండి.
జవాబు:

అయస్కాంత పదార్థాలు అనయస్కాంత పదార్థాలు
1. ఇనుప మేకు గోడ
2. టేబుల్ ఫ్రేమ్ బల్ల
3. ఇనుప కుర్చీ నల్ల బల్ల
4. కిటికీ చువ్వలు చెక్క కిటికీ

ప్రశ్న 2.
ఒక అయస్కాంతానికీ, ఒక ఇనుపకడ్డీకి ఒకే పరిమాణం, ఆకారం, రంగు ఉన్నాయి. వాటిలో ఏది అయస్కాంతమో, ఏది ఇనుపకడ్డీయో ఎలా కనుక్కొంటారు? వివరించండి.
జవాబు:

  • ఒక అయస్కాంతము ఉపయోగించి ఇచ్చిన వాటిలో ఏది అయస్కాంతమో, ఏది ఇనుపకడ్డీనో కనుగొనవచ్చు.
  • అయస్కాంతం యొక్క రెండు ధృవాలచే ఆకర్షింపబడిన దానిని ఇనుప కడ్డీగా నిర్ధారించవచ్చు.
  • అయస్కాంతం యొక్క ఒక ధృవముచే ఆకర్షింపబడి మరొక ధృవముచే వికర్షించబడితే దానిని అయస్కాంతంగా నిర్ధారించవచ్చు.
  • అయస్కాంతం యొక్క విజాతి ధృవాలు వికర్షింపబడటమే దీనికి కారణం. ఇనుప ముక్కకు ధృవాలు ఉండవు కావున వికర్షణ సాధ్యము కాదు.

ప్రశ్న 3.
శ్రీవిద్యకు వాళ్ల ఉపాధ్యాయురాలు భూమి ఒక అయస్కాంతం అని చెప్పింది. కానీ శ్రీవిద్యకు చాలా సందేహాలు కలిగి టీచరు కొన్ని ప్రశ్నలడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలేమై ఉండవచ్చు?
జవాబు:

  • భూమి అయస్కాంతం అని ఎలా చెప్పగలము?
  • భూమి ఇనుప వస్తువులతో పాటు మిగిలిన వాటిని ఎలా ఆకర్షిస్తుంది?
  • భూమికి అయస్కాంత ధర్మము ఎలా వస్తుంది?
  • మొత్తం భూమి అయస్కాంతంగా పని చేస్తుందా?

ప్రశ్న 4.
భూమి ఒక అయస్కాంతమా? నీవెలా చెప్పగలవు?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 1

  • అయస్కాంతాన్ని స్వేచ్ఛగా పురి లేని దారానికి వ్రేలాడతీయండి.
  • అది ఎల్లప్పుడు ఉత్తర, దక్షిణ ధృవాలను చూపుతుంది.
  • దీనికి కారణం భూమి ఒక అయస్కాంతంగా పనిచేయటమే.
  • భూ అయస్కాంత ధృవాలకు వ్యతిరేకంగా అయస్కాంత ధృవాలు ఆకర్షించటం వలన ఇలా జరుగును. దీనిని బట్టి భూమి ఒక అయస్కాంతం అని చెప్పవచ్చు.

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

ప్రశ్న 5.
కింద ఇచ్చిన పదార్థాలలో ఏవి అయస్కాంత పదార్థాలో, ఏవి అనయస్కాంత పదార్థాలో ఊహించండి. తర్వాత ఒక దండాయస్కాంతంతో పరీక్షించి మీరు ఊహించిన వాటిని సరిచూసుకోండి. అన్ని పదార్థాలనూ పరిశీలించాక మీరేమి చెప్పగలరు? ప్లాస్టిక్, ఇనుము, సీలు (ఉక్కు, కర్ర అల్యూమినియం, బంగారం, వెండి, రాగి, కాగితం, గుడ్డ.
జవాబు:

అయస్కాంత పదార్థాలు అనయస్కాంత పదార్థాలు
ఇనుము, స్టీలు ప్లాస్టిక్, కర్ర, కాగితం, గుడ్డ, బంగారం, వెండి, రాగి, అల్యూమినియం.

ప్రశ్న 6.
దండాయస్కాంతం బొమ్మ గీసి, ధృవాలను గుర్తించండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 2

ప్రశ్న 7.
భూమి ఒక పెద్ద అయస్కాంతం అని తెలుసుకుని సూర్య ఆశ్చర్యపోయాడు. ఆ విషయాన్ని కనుక్కొన్న శాస్త్రవేత్తల ఆలోచనను ప్రశంసించాడు. అయస్కాంతాలకు సంబంధించి మీరు ప్రశంసించదలచిన అంశాలేమైనా ఉన్నాయా? ఎలా ప్రశంసిస్తారు?
జవాబు:

  • నేను ఈ క్రింది విషయాలలో అయస్కాంతాలను అభినందిస్తున్నాను.
  • ప్రతి అయస్కాంతానికి రెండు ధృవాలు ఉంటాయి. మనం ఒక అయస్కాంతాన్ని రెండు ముక్కలుగా విడదీస్తే, ప్రతి ముక్క రెండు ధృవాలను అభివృద్ధి చేస్తుంది మరియు అవి రెండు స్వతంత్ర అయస్కాంతాలుగా పనిచేస్తాయి.
  • స్వేచ్ఛగా వ్రేలాడతీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర-దక్షిణ దిశలో ఉంటుంది. క్రొత్త ప్రదేశాలలో దిశలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది.
  • అయస్కాంత ప్రేరణ కారణంగా ఇనుపమేకు అయస్కాంతం వలె పనిచేయటం ఆసక్తికరంగా ఉంది.
  • అయస్కాంత లెవిటేషన్ ధర్మం విద్యుదయస్కాంత రైళ్లను నడపడానికి సహాయపడుతుంది.
  • అయస్కాంతాల ఆకర్షణ లక్షణం అయస్కాంత పదార్థాలను వాటి మిశ్రమాల నుండి వేరు చేయడానికి సహాయపడుతుంది.
  • ఈ ఆకర్షణ లక్షణాన్ని ఉపయోగించి భారీ బరువు ఉన్న అయస్కాంత పదార్థాలను ఎత్తడానికి ఎలక్ట్రికల్ క్రేన్లకు సాధ్యమౌతుంది.
  • మోటార్లు, స్పీకర్లు మొదలైన వివిధ పరికరాలలో అయస్కాంతాలు ఉపయోగపడతాయి.

ప్రశ్న 8.
నిత్య జీవితంలో అయస్కాంతాలను ఎక్కడెక్కడ వినియోగిస్తారో రాయండి.
జవాబు:

  • మన నిత్య జీవితంలో చాలా సందర్భాలలో అయస్కాంతాలు ఉపయోగిస్తాము.
  • రేడియో మరియు టి.వి. స్పీకర్లలో అయస్కాంతాలు వాడతారు.
  • ఎలక్ట్రిక్ మోటార్ లో అయస్కాంతాలు వాడతారు.
  • ఇంటి తలుపులు, షోకేలో అయస్కాంతాలు వాడతారు.
  • ఆఫీస్ బల్లపై గుండుసూదుల పెట్టెలో అయస్కాంతం ఉంటుంది.
  • గాలిలో ప్రయాణించే ఎలక్ట్రిక్ ట్రైన్లలో అయస్కాంతం వాడతారు.
  • సెల్ ఫోన్ కవర్, హాండ్ బాగ్ లో అయస్కాంతాలు ఉంటాయి.
  • కొన్ని ఆటబొమ్మలలో అయస్కాంతం ప్రధాన ఆకర్షణ.
  • సముద్ర నావికులు వాడే దిక్సూచిలో అయస్కాంతం ఉంటుంది.

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 61

ప్రశ్న 1.
ఒక స్టీల్ గ్లాసును తీసుకొండి. అందులో ఒక అయస్కాంతం ఉంచండి. ఒక సూదిని తీసుకొని దారం ఎక్కించండి. పటంలో చూపిన విధంగా సూది చివరి భాగానికి దగ్గరగా ఉన్న దారాన్ని వేలితో నొక్కిపెట్టి గ్లాసును నెమ్మదిగా పైకి లేపండి.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 3
• ఏమి జరుగుతుంది?
జవాబు:
గ్లాసును తాకకుండా సూది నిలువుగా నిలబడుతుంది.

• గ్లాసుకు తగలకుండా సూది నిటారుగా పైకి లేచి నిలబడిందా? ఎందుకని అలా జరిగింది?
జవాబు:
అవును, గ్లాసులోని అయస్కాంతం సూదిని ఆకర్షించటం వలన సూది నిలబడింది.

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 62

ప్రశ్న 2.
ఒక దండాయస్కాంతం, ఇనుప మేకు, పేపర్ క్లిప్, ప్లాస్టిక్ స్కేలు, గాజు ముక్క కాగితం ముక్క ఇత్తడి తాళంచెవి, పెన్, పెన్సిల్, బ్లేడు, సీలు చెమ్చా, చాకు, సుద్దముక్క చెక్కముక్కలను తీసుకోండి. ఆ వస్తువులు ఏయే పదార్థాలతో తయారయ్యాయో గుర్తించండి. ఒక్కొక్క వస్తువును అయస్కాంతంతో తాకించండి. అన్ని వస్తువులనూ అయస్కాంతం ఆకర్షించిందా? మీ పరిశీలన వివరాలను, ఆ వస్తువు తయారీకి వాడిన పదార్ధాన్ని క్రింది పట్టికలో నమోదు చేయండి.

వస్తువు పేరు ఏ పదార్థంతో ఆ వస్తువు తయారయింది? ఇనుము/ప్లాస్టిక్ అల్యూమినియం/గాజు/చెక్క/ఇతరాలు వస్తువును అయస్కాంతం ఆకర్షించిందా ? అవును / కాదు
ఇనుప మేకు ఇనుము అవును
ప్లాస్టిక్ స్కేలు ప్లాస్టిక్ కాదు

జవాబు:

వస్తువు పేరు తయారైన పదార్థం ఆకర్షించిందా లేదా?
1. ఇనుప మేకు ఇనుము ఆకర్షించింది
2. ప్లాస్టిక్ స్కేలు ప్లాస్టిక్ ఆకర్షించలేదు
3. కాగితం ముక్క కాగితం ఆకర్షించలేదు
4. గాజు ముక్క గాజు ఆకర్షించలేదు
5. ఇత్తడి తాళం చెవి లోహం ఆకర్షించింది
6. పెన్ ప్లాస్టిక్ ఆకర్షించలేదు
7. పెన్సిల్ చెక్క ఆకర్షించలేదు
8. బ్లేడ్ ఇనుము ఆకర్షించింది
9. స్టీలు చెమ్చా స్టీల్ ఆకర్షించలేదు
10. చాకు ఇనుము ఆకర్షించింది
11. సుద్ద ముక్క సున్నం ఆకర్షించలేదు
12. చెక్క ముక్క చెక్క ఆకర్షించలేదు
13. పేపర్ క్లిప్ ఇనుము ఆకర్షించింది

• ఏయే పదార్థాలను అయస్కాంతం ఆకర్షించింది?
జవాబు:
ఇనుప మేకు, బ్లేడ్, చాకు, ఇత్తడి తాళం చెవి, పేపర్ క్లిప్.

• ఏయే పదార్థాలను ఆకర్షించలేదు?
జవాబు:
ప్లాస్టిక్ స్కేల్, గాజు ముక్క, కాగితం ముక్క పెన్, పెన్సిల్, స్టీల్ చెంచా, సుద్ద ముక్క, చెక్క ముక్క

• అయస్కాంత పదార్థాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఐరన్, కోబాల్ట్, నికెల్

• అనయస్కాంత పదార్థాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
బంగారం, వెండి, రాగి, కలప, కాగితం, ప్లాస్టిక్.

కృత్యం – 3

6th Class Science Textbook Page No. 63

ప్రశ్న 3.
ఒక తెల్ల కాగితం తీసుకుని దానిమీద ఇనుప రజను పలచగా, అంతటా ఏకరీతిగా ఉండే విధంగా చల్లండి. ఆ కాగితం కింద ఒక దండాయస్కాంతాన్ని ఉంచండి.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 4
• ఏం గమనించారు?
జవాబు:
దండాయస్కాంతం వద్దకు ఇనుప రజను చేరటం గమనించాను.

• ఇనుప రజనను ఆకర్షించే ధర్మం దండాయస్కాంతం యొక్క అన్ని భాగాలకు ఒకే విధంగా ఉంటుందా?
జవాబు:
లేదు. దండాయస్కాంతం చివరల వద్ద అయస్కాంతం మధ్య భాగం కంటే ఎక్కువ ఇనుప రజను చేరింది.

• మీరు చల్లిన ఇనుప రజను అమరికలో ఏమైనా తేడా గుర్తించారా?
జవాబు:
అవును. ఏకరీతిలో వ్యాపించిన ఇనుప రజను వాటి సరళిని మార్చి దండాయస్కాంతం యొక్క ధృవాల వద్ద ఎక్కువగా కేంద్రీకరించబడింది. ఈ రెండు ధృవాల మధ్య చెల్లాచెదురుగా ఉన్న ఇనుప రజను కొన్ని గీతల వలె అమరిపోయింది.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 64

ప్రశ్న 4.
ఒకే పరిమాణం కలిగిన రెండు దండాయస్కాంతాలను తీసుకుని పటంలో చూపినట్లు వాటిని వివిధ పద్ధతుల్లో అమరుస్తూ వాటి మధ్య ఆకర్షణ, వికర్షణలను పరిశీలించండి.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 5
• ఏం గమనించారు?
జవాబు:
అయస్కాంతాలు ఆకర్షించుకోవటమే కాకుండా వికర్షించుకోవటం నేను గమనించాను.

• ఎప్పుడు అయస్కాంతాలు ఒకదానితో ఒకటి ఆకర్షించుకున్నాయి?
జవాబు:
మొదటి రెండు పరిస్థితులలో అయస్కాంతాలు ఆకర్షించుకొన్నాయి. అంటే విభిన్న ధృవాలు దగ్గరగా వచ్చినప్పుడు అవి ఆకర్షిస్తాయి.

• ఎప్పుడు అయస్కాంతాలు ఒకదానితో ఒకటి వికర్షించుకున్నాయి?
జవాబు:
చివరి రెండు పరిస్థితులలో అయస్కాంతాలు వికర్షించుకొన్నాయి. అంటే ఒకే ధృవాలు దగ్గరగా వచ్చినప్పుడు అవి వికర్షించుకొంటాయి.

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 64

ప్రశ్న 5.
ఒక దండాయస్కాంతం మధ్యలో పురిలేని సన్నని దారం కట్టి పటంలో చూపినట్లుగా భూమికి సమాంతరంగా ఉండే విధంగా ఒక స్టాండుకు వేలాడదీయండి.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 6
• ఆ దండాయస్కాంతం నిశ్చలస్థితికి వచ్చిందా?
జవాబు:
కొంత సమయం తరువాత ఆ దండాయస్కాంతం నిశ్చలస్థితికి వచ్చింది.

• కొంత సమయం ఆగండి. నీవు ఏమి గమనించావు?
జవాబు:
అయస్కాంతం నిశ్చలస్థితిలోకి వచ్చాక అది ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తున్నట్లు మీరు గమనించవచ్చు. ఉత్తర దిక్కును సూచించే అయస్కాంతకొనకు ఏదైనా రంగుతో ఒక గుర్తు పెట్టండి. ఇప్పుడు ఆ అయస్కాంతాన్ని కొద్దిగా కదిలించి తిరిగి అది నిశ్చల స్థితికి వచ్చేవరకు ఆగండి.

• రంగు గుర్తు గల అయస్కాంతపు కొన ఇప్పుడు ఏ దిశను సూచిస్తుంది?
జవాబు:
రంగు గుర్తు గల అయస్కాంతపు కొన ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే సూచిస్తుంది.

• ఈ కృత్యాన్ని వేరొక స్థలంలో చేసి చూడండి. ఏం గమనించారు?
జవాబు:
స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఎల్లప్పుడు ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తుంది.

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 65

ప్రశ్న 6.
అయస్కాంతం తయారుచేసే విధానంను వివరింపుము.
జవాబు:
ఉద్దేశ్యం : అయస్కాంతం తయారు చేయడం.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 7

కావలసిన పరికరాలు :
ఇనుపమేకు, దండాయస్కాంతం, గుండుసూదులు, ఇనుప రజను.

తయారీ విధానం :

  • ఒక సన్నని ఇనుపమేకును తీసుకొని బల్లమీద ఉంచండి.
  • ఇప్పుడు దండాయస్కాంతాన్ని తీసుకుని పటంలో చూపినట్లు దండాయస్కాంతపు ఒక ధృవాన్ని ఇనుప మేకు ఒక కొనవద్ద ఆనించి రెండో కొన వరకు రుద్దండి. అయస్కాంతాన్ని పైకెత్తి తిరిగి అదే ధృవాన్ని మేకు యొక్క మొదటి కొనవద్ద ఆనించి రెండవ కొన వరకూ రుద్దండి.
  • ఇలా 30 నుండి 40 సార్లు చేయండి.
  • ఇప్పుడు మేకును గుండుసూదులు లేదా ఇనుప రజను దగ్గరకు తీసుకురండి.

పరిశీలన :
ఇనుప మేకు గుండుసూదులు లేదా ఇనుపరజనును ఆకర్షిస్తుంది.

ఫలితం :
ఇనుప మేకు ఒక అయస్కాంతం.

• ఇప్పుడు ఆ మేకును దారంతో కట్టి స్వేచ్ఛగా వేలాడదీస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ఇనుప మేకు అయస్కాంతం వలె ఉత్తర, దక్షిణ దిక్కులను చూపిస్తుంది.

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 65

ప్రశ్న 7.
అయస్కాంత దిక్సూచి (కంపాస్)ను తయారుచేసే విధానంను వివరింపుము.
జవాబు:
ఉద్దేశ్యం : అయస్కాంత దిక్సూచి (కంపాస్)ని తయారుచేయడం.

కావలసిన పరికరాలు :
అయస్కాంతీకరించిన గుండుసూది, టేప్, కార్క్ (బెండు), గ్లాసులో నీళ్ళు, డిటర్జెంటు.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 8

తయారీ విధానం :

  • అయస్కాంతీకరించిన ఒక గుండుసూదిని తీసుకొని కార్క్ (బెండు) ముక్కపై టేక్ అంటించండి.
  • పటంలో చూపినట్లు ఒక గ్లాసులోని నీటిలో తేలియాడేటట్లు ఆ క్కా నుంచండి.
  • కార్క్ సులభంగా తేలడానికి గ్లాసులో నీటికి కొంత డిటర్జెంటును కలపండి.

పరిశీలన :
అయస్కాంతీకరించిన ఆ సూది ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తుంది.

ఫలితం : ఈ కృత్యమే అయస్కాంత దిక్సూచి.

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

కృత్యం – 8

6th Class Science Textbook Page No. 66

ప్రశ్న 8.
అయస్కాంత ప్రేరణను ఎలా నిరూపిస్తారు?
జవాబు:
లక్ష్యం : అయస్కాంత ప్రేరణను గమనించడం లేదా అర్థం చేసుకోవడం.
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 9

అవసరమైన పదార్థాలు :
పిన్నిసు, గుండు సూది, దండాయస్కాంతం

విధానం :
పిన్నిసు తీసుకొని దండాయస్కాంతం దగ్గరకు తీసుకురండి. అప్పుడు అది అయస్కాంతానికి అంటుకొంటుంది. ఈ పిన్నీసుకు ఒక గుండు సూదిని అంటించండి.

పరిశీలన :
గుండుసూదికి అయస్కాంతంతో నేరుగా సంబంధం లేనప్పటికి పిన్నీసు ఆకర్షించినది. దీనికి కారణం అయస్కాంతానికి అరిటి ఉన్న పిన్నీసు కూడా అయస్కాంతం వలె పని చేస్తుంది. దీనినే అయస్కాంత ప్రేరణ అంటారు.

ఫలితం :
దండాయస్కాంతం కారణంగా అయస్కాంతధర్మం పిన్నీసులో ప్రేరేపించబడుతుంది. అయస్కాంత పదార్థానికి దగ్గరగా ఒక అయస్కాంతం ఉండటం వల్ల అది అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. అయస్కాంత ఈ ధర్మాన్నే అయస్కాంత ప్రేరణ అంటారు.

• పిన్నీసు అయస్కాంతానికి అంటుకొని ఉండకపోతే (దూరంగా ఉంటే) అది గుండుసూదిని ఆకర్షిస్తుందా?
జవాబు:
పిన్నీసు అయస్కాంతానికి అంటుకొని ఉండకపోతే అది గుండుసూదిని ఆకర్షించలేదు.

• పిన్నీసు అయస్కాంతానికి అంటుకోకుండా అతి దగ్గరగా ఉన్నప్పుడు అది గుండుసూదిని ఆకర్షించగలుగుతుందా?
జవాబు:
పిన్నీసు అయస్కాంతానికి అంటుకోకుండా అతి దగ్గరగా ఉన్నప్పుడు అది గుండు సూదిని ఆకర్షిస్తుంది.

కృత్యం – 9

6th Class Science Textbook Page No. 66

ప్రశ్న 9.
ఒకే పరిమాణం, ఆకారం, రంగు కలిగిన మూడు వస్తువులను మీకిస్తే ఒక దండాయస్కాంతాన్ని ఉపయోగించి వాటిలో ఏ వస్తువు అయస్కాంతమో, ఏ వస్తువు అయస్కాంత పదార్థంతో చేసినదో, ఏ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారు చేసినదో ఎలా కనుక్కొంటారు?

ఆ మూడు వస్తువులను వరుసగా దండాయస్కాంతపు ఒక ధృవం వద్దకు తీసుకురండి. ఆ వస్తువులను అయస్కాంతం ఆకర్షించిందా? వికర్షించిందా? లేదా ఆ వస్తువులు ఆకర్షణకు గానీ వికర్షణకు గానీ లోనుకాకుండా ఉన్నాయా? చూడండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి. తిరిగి ఆ వస్తువులను దండాయస్కాంతం రెండోధృవం వద్దకు తీసుకొనిరండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 10

  • ఒక వస్తువు దండ అయస్కాంతం యొక్క ఒక ధ్రువం ద్వారా ఆకర్షించబడి, దాని ఇతర ధృవంతో వికర్షించబడితే అప్పుడు అది ఒక అయస్కాంతం. కాబట్టి వస్తువు-1 అయస్కాంతం.
  • ఒక వస్తువు దండాయస్కాంతం యొక్క రెండు ధ్రువాలచే ఆకర్షించబడి, ఏ ధృవంతో వికర్షించకపోతే, అది అయస్కాంతం పదార్థం. కాబట్టి వస్తువు-2 అయస్కాంత పదార్థంతో రూపొందించబడింది.
  • ఒక వస్తువు అయస్కాంతం ద్వారా ఆకర్షించబడకపోతే లేదా దాని ద్వారా వికర్షించబడకపోతే, అది అనయస్కాంత పదార్థం. కాబట్టి వస్తువు – 3 అనయస్కాంత పదార్థంతో రూపొందించబడింది.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 70

ప్రశ్న 1.
మీ ఇంటికి ముఖద్వారం ఏ దిశలో ఉంది? ఆలోచించి చెప్పండి. తర్వాత దిక్సూచి ఉపయోగించి కచ్చితంగా అది ఏ దిశలో ఉందో కనుక్కొని మీ సమాధానంతో పోల్చి చూడండి. అదేవిధంగా కింది విషయాలను కూడా . ఊహించండి, పరీక్షించండి.
ఎ) నువ్వు ఏ దిశలో తల ఉంచి పడుకుంటావు?
బి) నువ్వు ఏ దిశవైపు తిరిగి చదువుకుంటావు?
సి) భోజనం చేసేటప్పుడు ఏ దిశవైపు మరలి కూర్చుంటావు?
జవాబు:
మా ఇల్లు తూర్పు దిక్కులో ఉందని భావించాను. కానీ దిక్సూచితో చూసినపుడు తూర్పుదిశకు కొంచెము పక్కకు ఉన్నట్టు గుర్తించాను.

ఎ) నేను నిద్రిస్తున్నప్పుడు నా తల తూర్పు వైపు ఉంచుతాను అని ఊహించాను, కాని అది కొంచెం ఈశాన్యం వైపు ఉంది.
బి) నేను చదివేటప్పుడు తూర్పు వైపు ఉంటానని ఊహించాను. కానీ నేను పైన చెప్పినట్లుగానే ఈశాన్యం వైపు ఉన్నాను.
సి) తినేటప్పుడు తూర్పు వైపు కూర్చుంటానని ఊహించాను. కానీ నేను పైన చెప్పినట్లుగానే ఈశాన్యం వైపు ఉన్నాను.

ప్రశ్న 2.
అయస్కాంతాలను వాడి ఏదైనా ఆటవస్తువులను తయారుచేయండి. తయారీ విధానాన్ని తెలపండి.
జవాబు:
అయస్కాంతాలను ఉపయోగించి ఆట వస్తువులు తయారు చేయుట :

  • ముందుగా ఒక అట్టముక్కను తీసుకొని బాతు ఆకారంలో రెండు బొమ్మలు తయారు చేశాను. ఆ బొమ్మలకు వెనుక దండాయస్కాంతం అంటించాను.
  • దండాయస్కాంతం యొక్క సజాతి ధృవాలు ఒకవైపు ఉండటంవల్ల వెనుక ఉన్న బాతు బొమ్మను జరపటం వలన ముందు ఉన్న బొమ్మ ముందుకు ప్రయాణం చేయడం జరిగింది.
  • దీని ద్వారా అయస్కాంతం వికర్షణ ఉపయోగించి ఆట వస్తువును కదిలించవచ్చు.

ప్రశ్న 3.
వలయాకారపు అయస్కాంతానికి ధృవాలు ఎక్కడ ఉంటాయో ఊహించండి. తర్వాత దండయస్కాంతం ఉపయోగించి దాని ధృవాలు కనుగొనండి. మీ ఊహ సరైనదా? లేదా? పోల్చుకోండి.
జవాబు:
ఊహ :
వలయాకారపు అయస్కాంతం యొక్క ఎగువ మరియు దిగువ ఉపరితలాలపై అయస్కాంత స్తంభాలు ఉన్నాయి.

పరీక్ష :

  1. నేను వలయ అయస్కాంతం యొక్క ఎగువ ఉపరితలం దగ్గర దండ అయస్కాంతం యొక్క దక్షిణ ధృవాన్ని తీసుకువచ్చినప్పుడు అవి ఒకదానికొకటి తిప్పికొట్టాయి, ఇవి వలయ అయస్కాంతం యొక్క పై ఉపరితలం దాని దక్షిణ ధ్రువం అని సూచిస్తుంది.
  2. నేను వలయ అయస్కాంతం యొక్క దిగువ ఉపరితలం దగ్గర దండ అయస్కాంతం యొక్క దక్షిణ ధృవమును తీసుకు వచ్చినప్పుడు అవి ఒకదానికొకటి ఆకర్షించుకొన్నాయి, వలయ అయస్కాంతం యొక్క దిగువ ఉపరితలం దాని ఉత్తర ధృవం అని సూచిస్తుంది.
  3. కానీ ధృవాల స్థానం వాటి తయారీ విధానం ఆధారంగా మూడు అవకాశాలు ఉన్నాయని మా టీచర్ నుండి తెలుసుకున్నాను.
    AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 11

ప్రశ్న 4.
దండాయస్కాంతాన్ని ఉపయోగించి ఒక సూదిని అయస్కాంతంగా మార్చండి. దానితో కృత్యం – 7లో తెలిపిన పద్దతిలో దిక్సూచిని తయారుచేయండి.
జవాబు:
I. లక్ష్యం : అయస్కాంతం తయారుచేయుట.

కావలసినవి (అవసరమైన పదార్థాలు) :
ఇనుప మేకు, దండ అయస్కాంతం, పిన్ /ఇనుప రజను.

తయారీ విధానం :

  • ఒక మేకు తీసుకొని ఒక టేబుల్ మీద ఉంచండి.
  • ఇప్పుడు ఒక దండ అయస్కాంతం తీసుకొని దాని ధృవాలలో ఒకదాన్ని మేకు యొక్క ఒక అంచు దగ్గర ఉంచి, అయస్కాంతం ధృవం యొక్క దిశను మార్చకుండా ఒక చివర నుండి మరొక చివర వరకు రుద్దండి.
  • ప్రక్రియను 30 నుండి 40 సార్లు చేయండి.
  • మేకు దగ్గరకు పిన్ లేదా కొంత ఇనుప రజనును తీసుకురండి. అది అయస్కాంతంగా మారిందో, లేదో తనిఖీ చేయండి.

పరిశీలన :
మేకు, ఇనుప రజనును ఆకర్షిస్తుంది.

ఫలితం :
ఇనుపమేకు అయస్కాంతంగా మారుతుంది.

II. లక్ష్యం:
అయస్కాంత దిక్సూచిని తయారు చేయడం

అవసరమైన పదార్థాలు :
అయస్కాంతీకరించిన సూది, టేప్, లైట్ కార్క్, గ్లాసు వాటర్, డిటర్జెంట్.

తయారీ విధానం :

  • అయస్కాంతీకరించిన సూది తీసుకోండి.
  • తేలికపాటి కా కు టేక్ సూదిని అంటించండి.
  • కార్క్ ని ఒక గ్లాసు నీటిలో వదలండి.
  • కార్క్ స్వేచ్ఛగా తేలుతూ ఉండటానికి నీటిలో కొద్దిగా డిటర్జెంట్ జోడించండి.

పరిశీలన : అయస్కాంతీకరించిన సూది ఉత్తర-దక్షిణ దిశలను చూపిస్తుంది.

ఫలితం : అయస్కాంతీకరించిన సూది అయస్కాంత దిక్సూచిగా పనిచేస్తుంది.

AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

ప్రశ్న 5.
“మంచి ఆహారాన్ని మాత్రమే తినాలి – చెడు ఆహారాన్ని తినకూడదు” అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి అయస్కాంతాలను ఉపయోగించి కిరణ్ ఒక ఆట బొమ్మను తయారుచేయాలనుకున్నాడు. ఆ బొమ్మ తయారుచేయడంలో మీరు అతనికి సహాయం చేయగలరా? ఎలా చేస్తారు?
జవాబు:

  • ఆటవస్తువును ఈ క్రింది విధంగా తయారుచేయవచ్చును.
  • ఒక పళ్లెము తీసుకుని దానికి ఒక వైపు మంచి ఆహారం, దానికి ఎదురు వైపు చెడు ఆహారం ఉంచి ఆ విషయాన్ని కాగితంపై రాసి అచట అంటించాలి.
  • ఈ పళ్లెం అడుగున ఒక అయస్కాంతాన్ని అతికించాలి. ఈ అయస్కాంతం ఉత్తరధ్రువం మంచి ఆహారం వైపు దక్షిణ ధ్రువం చెడు ఆహారం వైపు ఉండునట్లు ఈ అయస్కాంతాన్ని ఉంచాలి.
  • ఒక బాతు బొమ్మ క్రింది భాగంలో వేరొక అయస్కాంతాన్ని ఉంచాలి. ఈ అయస్కాంతం దక్షిణ ధ్రువం బాతు ముక్కువైపు, ఉత్తరధ్రువం బాతు తోకవైపు ఉండునట్లు అమర్చాలి.
  • బాతు బొమ్మను ఒక తొట్టె నీటిలో ఉంచాలి.
  • మంచి ఆహారం గల పళ్లెం భాగం బాతు దగ్గరకు తీసుకువస్తే నీటితొట్టెలోని బాతు పళ్లెం వైపుకు కదులుతూ నీటిలో వస్తుంది. ఎందుకంటే విజాతి అయస్కాంత ధ్రువాలు ఆకర్షించుకుంటాయి.
  • చెడు ఆహారం ఉన్న పళ్లెం భాగం బాతుకు సమీపంలోకి తీసుకురావడంతో, బాతు నీటిలో దూరంగా వెళ్లిపోతుంది. సజాతి అయస్కాంత వ్రాలు వికర్షించుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. చెడు ఆహారాన్ని తినకూడదని ఈ చర్య తెలియజేస్తుంది.

Leave a Comment