AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Ex 6.3

AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Ex 6.3 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 6th Lesson ప్రాథమిక అంకగణితం Exercise 6.3

ప్రశ్న 1.
3 ఆపిల్ పండ్ల ధర ₹60 అయిన 7 ఆపిల్ పండ్ల ధర ఎంత?
సాధన.
3 ఆపిల్ పండ్ల ధర = ₹60
1 ఆపిల్ పండు ధర = \(\frac {60}{3}\) = ₹ 20
∴ 7 ఆపిల్ పండ్ల ధర = 7 × ₹20 = ₹140

AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Ex 6.3

ప్రశ్న 2.
ఉమ 8 పుస్తకాలను ₹ 120 లకు కొన్నది. 5 పుస్తకాల ధరను కనుగొనండి.
సాధన.
ఉమ కొన్న 8 పుస్తకాల ధర = ₹120
ఒక పుస్తకం ధర = \(\frac {120}{8}\) = ₹ 15
∴ 5 పుస్తకాల ధర = 5 × 15 = ₹ 75

ప్రశ్న 3.
5 గాలిపంకాల (fans) ధర ₹ 11,000 అయిన ₹ 4,400 లకు ఎన్ని గాలిపంకాలు వచ్చును ?
సాధన.
5 గాలి పంకాల (fans) ధర = ₹11,000
1 గాలి పంకా ధర : \(\frac {11000}{5}\) = 11000 × \(\frac {1}{5}\) = ₹ 2200
₹ 4400 లకు వచ్చు గాలి పంకాలు = 4400 ÷ 2200 = 4000 × \(\frac {1}{2200}\) = 2

AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Ex 6.3

ప్రశ్న 4.
స్థిర వేగంతో ప్రయాణిస్తున్న కారు 3 గంటలలో 180 కి.మీ. ప్రయాణిస్తుంది. అదే కారు అంతే వేగంతో 420 కి.మీ. దూరాన్ని ప్రయాణించుటకు ఎంత సమయం పడుతుంది?
సాధన.
3 గంటలలో కారు ప్రయాణించు దూరం = 180 కి.మీ.
1 గంటలో కారు ప్రయాణించు దూరం = 180 కి.మీ. ÷ 3 = 180 × \(\frac {1}{3}\) = 60 కి.మీ.
420 కి.మీ. దూరాన్ని ప్రయాణించుటకు ఆ కారుకు పట్టే సమయం = 420 ÷ 60 = 420 × \(\frac {1}{60}\) = 7 గంటలు

ప్రశ్న 5.
ఒక ట్రక్కు 594 కి.మీ. దూరాన్ని ప్రయాణించుటకు 108 లీ. డీజిల్ అవసరం. అదే ట్రక్కు అదే వేగంతో 1650 కి.మీ. దూరాన్ని ప్రయాణించుటకు ఎన్ని లీటర్ల డీజిల్ అవసరం?
సాధన.
108 లీ. డీజిల్ తో ఒక ట్రక్కు ప్రయాణించే దూరం = 594 కి.మీ.
AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Ex 6.3 1

Leave a Comment