AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

These AP 9th Class Social Important Questions 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 19th Lesson Important Questions and Answers విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

9th Class Social 19th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
లిబియాలో ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో నడిచింది?
జవాబు:
సైన్యంలోని 12 మంది సభ్యులతో కూడిన ‘రివల్యుషనరీ కమాండ్ కౌన్సిల్’ (RCC) నేతృత్వంలో ఈ ఉద్యమం నడిచింది.

ప్రశ్న 2.
లిబియాలో కొత్త ప్రభుత్వం చేపట్టిన పనులేవి?
జవాబు:
కొత్త ప్రభుత్వం, చమురు వనరులను జాతీయం చేసింది, సంచార జీవనాన్ని అంతం చేయటానికి పేద ప్రజలకు నీటివసతి ఉన్న భూములను ఇచ్చింది, సాగు విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమం చేపట్టింది.. మహిళలతో సహా అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు, చమురు నుంచి వచ్చిన లాభాలలో కొంత ప్రజలందరికీ పంచటం, గృహవసతి వంటివి చేపట్టింది.

ప్రశ్న 3.
అరబ్బు వసంతంగా ప్రఖ్యాతి గాంచినది ఏది?
జవాబు:
2010 డిసెంబరులో మొదలైన అరబ్బు ప్రపంచంలోని నిరసనలు, ప్రదర్శనలు, యుద్ధాల విప్లవ తరంగం ‘అరబ్బు వసంతం’గా ప్రఖ్యాతి గాంచింది.

ప్రశ్న 4.
బర్మాను పాలించిన సైన్యాధిపతులు ఎదుర్కొన్న ఆరోపణలు ఏవి?
జవాబు:
బర్మాని పాలించిన సైన్యాధిపతులు మానవ హక్కులను ఉల్లంవించారని, పౌరులను బలవంతంగా స్థానచలనానికి గురిచేశారని, పిల్లలతో సహా ప్రజలతో బలవంతంగా వెట్టిచాకిరి చేయించుకున్నారని అనేక తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 5.
NLD ని విస్తరించండి.
జవాబు:
నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ NLD.

ప్రశ్న 6.
కమ్యూని నమ్మకం ఏమిటి?
జవాబు:
‘శ్రామిక వర్గ నియంతృత్వాన్ని’ ఏర్పాటు చేయటం ద్వారా మాత్రమే. కార్మికుల ప్రయోజనాలను కాపాడగలమని , వాళ్లు (కమ్యూనిస్టు) నమ్మారు.

ప్రశ్న 7.
కమ్యూనిస్టుల విశ్వాసం ఏమిటి?
జవాబు:
ఇంగ్లాండులో మాదిరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దేశాన్ని నియంత్రించటంలో ధనిక పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, పేద శ్రామిక ప్రజల నిజమైన ప్రయోజనాలకు అది ప్రాతినిధ్యం వహించ లేదని కమ్యూనిస్టు విశ్వసించారు.

ప్రశ్న 8.
అంతర్యుద్ధం అనగానేమి
జవాబు:
వివిధ వర్గాలు లేదా ప్రాంతాల మధ్య ఒక దేశంలో చెలరేగే యుద్ధం.

ప్రశ్న 9.
స్వయం ప్రతిపత్తి అనగానేమి?
జవాబు:
ఒక దేశం లేదా ప్రాంతం లేదా సంస్థ తనను తాను స్వతంత్రంగా నిర్వహించుకునే స్వేచ్ఛనే ‘స్వయం ప్రతిపత్తి’ అంటారు.

ప్రశ్న 10.
పట్టణీకరణ అనగానేమి?
జవాబు:
గ్రామీణ ప్రాంత ప్రజలు వివిధ వృత్తులరీత్యా పట్టణాలకు వచ్చి స్థిరపడటాన్ని, పట్టణ జనాభా పెరగడాన్ని ‘పట్టణీకరణ’ అంటారు.

ప్రశ్న 11.
కింది పటంలో 1900 మరియు 1950 మధ్య కాలం నాటి ప్రజాస్వామ్య దేశాలను నలుపుచే గుర్తించడమైనది.
ప్రశ్న : పటంలో చూపిన ఏవేని రెండు ప్రజాస్వామ్య దేశాల పేర్లు రాయండి.
జవాబు:
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, గ్రేట్ బ్రిటన్, చిలీ, పెరూ, అలస్కా మొదలైనవి.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 12.
క్రింది పటంలో “A” తో గుర్తించబడిన దేశం ఏది?
జవాబు:
రష్యా

9th Class Social 19th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
19వ శతాబ్దం నాటి ఇటలీ ఏకీకరణ ప్రక్రియను వివరించండి.
జవాబు:
19వ శతాబ్దం నాటి ఇటలీ ఏకీకరణ ప్రక్రియ :

  1. 19వ శతాబ్దం మధ్య కాలానికి ఇటలీ అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడింది.
  2. 1830 లలో మాజినీ ఇటలీ ఏకీకరణకు ఒక ప్రణాళికను రూపొందించాడు.
  3. తన భావాలను ప్రచారం చేయుటకు, ఇటలీ ఏకీకరణ దిశగా ప్రయాణానికి యంగ్ ఇటలీ అనే రహస్య సంస్థను స్థాపించాడు.
  4. తరువాత 1831, 1848లలో జరిగిన తిరుగుబాట్లు విఫలం కావడంతో యుద్ధాల ద్వారా అయినా ఇటలీ ఏకీకరణను సాధించవలసిన బాధ్యత రాజు విక్టర్ ఇమ్మాన్యుయెల్ – II మీద పడింది.
  5. అధికారంలో ఉన్న ఇతర రాజ కుటుంబీకులు కూడా ఏకీకరణ ద్వారానే ఇటలీ ఆర్థిక ప్రగతి సాధ్యం అని భావించారు.
  6. ఫ్రాన్స్ తో కవూర్ నడిపిన దౌత్యం ఫలితంగా సార్డీనియా – పీడ్మంబు ఆస్ట్రియా సేనలను ఓడించగలిగాయి.
  7. 1860 లో సైన్యంతో పాటు గారిబార్లీ నాయకత్వంలో సాయుధ సేనలు సిసిలీ లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న స్పెయిన్ పాలకులను తరిమివేశాయి. దానితో అన్ని దేశాలూ రాజు పాలన క్రిందకి వచ్చి ఇటలీ ఏకీకరణ ముగిసింది.
  8. 1871 లో, విక్టర్ ఇమ్మాన్యుయెల్ – II ఏకీకృత ఇటలీకి రాజుగా ప్రకటించబడ్డాడు.

ప్రశ్న 2.
“సమకాలీన ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి మరియు ప్రజలందరికి స్వేచ్ఛను మరియు హక్కులను గౌరవించేందుకు ప్రజాస్వామ్యమే ఉత్తమ పరిష్కారం”. – ఈ విషయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని సమర్థించుకొనండి.
(లేదా)
“అత్యంత పేద ప్రజలు, బలహీనవర్గాలు కూడా తమ గొంతుక వినిపించి, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగల, అందరికీ న్యాయం, శాంతిని అందించగల నూతన ప్రజాస్వామిక విధానాన్ని రూపొందించటానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది.”
“ప్రజాస్వామ్యమే అత్యుత్తమ పరిపాలన విధానం” వ్యాఖ్యానించండి.
జవాబు:
ప్రస్తుతం ప్రపంచ సమస్యలకు ఒక పరిస్కారం ప్రజాస్వామ్యం అనడాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం లేని దేశాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణ : తమ పాలకులను ఎన్నుకునే స్వేచ్ఛ లేకపోవడం, ప్రజలు సంఘాలను, సంస్థలను ఏర్పాటుచెయడానికి స్వేచ్ఛ లేకపోవడం, పాలకులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి అవకాశం లేకపోవడం, ఆయా దేశాలలో పౌర హక్కులకు, మానవ హక్కులకు రక్షణ లేకపోవడం వంటివి.

మరోవైపు ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధులను, తమ పాలకులను ఎన్నుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, ప్రభుత్వ నిర్ణయాల పట్ల నిరసనను తెలియచేసే అవకాశాన్ని, ప్రజలు పార్టీలను, సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు.

ప్రజాస్వామ్యం పౌరులందరి మానవ హక్కులను రక్షిస్తుంది. సమన్యాయ పాలనలో భాగంగా చట్టం ముందు అందరూ సమానులే. చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి.

ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం కలిగి ఉంటుంది.

ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం అనే సూత్రంపై ఆధారపడి ఉంది. ఇక్కడ పేదలు, నిరక్షరాస్యులు సైతం ధనికులు, అత్యంత విద్యావంతులతో సమానమైన హోదాను పొందుతారు. భిన్నత్వాలు గల సమాజంలో వివిధ వ్యక్తులు వివిధ ఆలోచనలు, ఆసక్తులు కలిగి ఉంటారు. అందరి అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువనివ్వడం ప్రజాస్వామ్య లక్షణం.

ప్రజాస్వామ్యాన్ని అత్యంత ఉత్తమమైన ప్రభుత్వ వ్యవస్థ అనడంలో సందేహం లేదు.

ప్రశ్న 1.
లిబియా ఏ దేశ వలస పాలనలో ఉండేది?
జవాబు:
ఇటలీ

ప్రశ్న 2.
లిబియాకు ఎప్పుడు స్వాతంత్ర్యం లభించింది?
జవాబు:
లిబియాకు 1951లో స్వాతంత్ర్యం లభించింది.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
లిబియా ప్రజల జీవనాధారం ఏమిటి?
జవాబు:
లిబియా ప్రజలు వ్యవసాయం, ఎడారులలో పశువుల పాలన పై ఆధారపడి జీవనం సాగించేవారు.

ప్రశ్న 4.
లిబియా అతి తక్కువ కాలంలో సంపన్నదేశమవ్వడానికి గల కారణం?
జవాబు:
1959 సంవత్సరంలో లిబియాలో విస్తారమైన ముడిచమురు నిధులను కనుగొన్నారు.. చమురు అమ్మకంతో దేశంలోకి సంపద ప్రవహింపసాగింది. సంపన్నదేశమైంది.

ప్రశ్న 5.
లిబియా అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు ఏయే కార్యక్రమాలు అమలుచేయాలని యువత కోరింది?
జవాబు:

  1. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ఆధునిక ప్రభుత్వాలు ఏర్పాటుచేయాలని యువత కోరింది.
  2. మహిళలపై అణచివేతను అంతం చేయాలని, వివిధ జాతుల మధ్య నిరంతర యుద్ధాలకు స్వస్తి పలకాలని, ఐక్యత, శాంతిని స్థాపించాలని యువత రాజు ఇద్రిస్ ని కోరింది.

ప్రశ్న 6.
మువమ్మర్ గఢాఫి లిబియా అధికారం ఎప్పుడు చేజిక్కించుకున్నాడు?
జవాబు:
మువమ్మర్ గఢాఫి 70 యువ సైనిక అధికారుల బృందం, తమను తాము స్వేచ్ఛ అధికారుల ఉద్యమంగా పేర్కొని 1969లో లిబియా అధికారాన్ని కైవసం చేసుకున్నాడు.

ప్రశ్న 7.
లిబియాలో అధిక ప్రజల మతమేది?
జవాబు:
లిబియాలో అధిక ప్రజల మతం ఇస్లాం.

ప్రశ్న 8.
లిబియా దేశం ఎదుర్కొను సమస్యలేవి?
జవాబు:
లిబియాలో అధికశాతం ప్రజలు పేదవారు. పశుపాలనలో సంచార జీవనం గడుపుతుండేవాళ్ళు. నిరక్షరాస్యత అధికం. మహిళలకు పరదా పద్ధతి అమలులో ఉండేది.

ప్రశ్న 9.
గఫి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏయే సంస్కరణలు అమలుచేసింది?
జవాబు:
కొత్త ప్రభుత్వం అనేక కొత్త సంస్కరణలు అమలుచేసి లిబియాను ప్రగతిపథంలో నిలిపింది.

  1. చమురు వనరులను జాతీయం చేసింది.
  2. సంచార జీవనం నాశనం చేయ తలంచింది.
  3. పేద ప్రజలకు నీటి వసతి ఉన్న భూములను ఉచితంగా అందజేసింది.
  4. సాగు విస్తీర్ణ పద్ధతులు అమలుచేసింది.
  5. అందరికీ విద్య, అందరికీ వైద్యం ఉచితంగా అందజేసింది.
  6. మహిళలకు, స్వేచ్ఛ, సమాన సదా.
  7. చమురు నుండి వచ్చే ఆదాయంలో కొంత ప్రజలకు పంచడం వంటి సంస్కరణలతో లిబియా సామాజిక సంక్షేమంలో అత్యున్నత స్థానం పొందింది.

ప్రశ్న 10.
ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అరబ్ ప్రపంచంలో 2010లో ఏయే దేశాలలో ఉద్యమాలు జరిగాయి?
జవాబు:
ట్యునీసియా, ఈజిప్టు, లిబియా, ఎమెన్, బబ్రాన్, సిరియా వంటి దేశాలలో ఉద్యమం మొదలైంది.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 11.
లిబియా తిరుగుబాటులో ఏయే వర్గాలు వారు ప్రాతినిధ్యం వహించారు?
జవాబు:
తిరుగుబాటు బృందాలలో సైన్యం నుంచి బయటకు వచ్చిన కొంతమంది సైనికులు. అధికశాతం మంది న్యాయవాదులు, కార్మికులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సామాన్య ప్రజలు.

ప్రశ్న 12.
లిబియా తిరుగుబాటుదారులకు ప్రపంచంలోని చాలా దేశాలు ఎందుకు మద్దతు ఇచ్చాయి?
జవాబు:
ప్రపంచంలోని అమెరికా వంటి దేశాల నుండి లిబియాలోని తిరుగుబాటుదారులకు మద్దతు లభించింది. ఎందుకంటే దీని వెనుక లిబియాలోని అపార చమురు నిల్వలను చేజిక్కించుకోవాలన్న కోరిక ఉంది. ఐక్యరాజ్యసమితి సైతం తిరుగుబాటుదారులకు మద్దతు పలికి లిబియాని విమానాలు ఎగరగూడని ప్రాంతంగా ప్రకటించింది.

ప్రశ్న 13.
బర్మా ప్రపంచదేశాలకు ఏయే వస్తువులకు, ఆహారపదార్థాలకు సరఫరాదారుగా ఉండేది?
జవాబు:
టేకు, కలప, బియ్యం వంటి ఆహారధాన్యాలు, తగరం వంటి ఖనిజాలు, కెంపులు, నీలాలు వంటి విలువైన రాళ్ళకు బర్మా ప్రధాన సరఫరాదారుగా ఉండేది.

ప్రశ్న 14.
వివిధ రాజకీయ పార్టీలు పోటీ చేసిన ఎన్నికలు బర్మాలో ఏయే సంవత్సరాలలో జరిగాయి?
జవాబు:
1951, 1956, 1960లలో ఎన్నికలు జరిగాయి.

ప్రశ్న 15.
1947లో బర్మాకి స్వాతంత్ర్యం సాధించి తెచ్చినవాడు?
జవాబు:
బర్మాకి స్వాతంత్ర్యం తెచ్చినవాడు టర్మన్ జాతి నాయకుడు ఆంగ్ సాన్ (ప్రస్తుత ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీకి తండ్రి).

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 16.
బర్మాలో సైన్యాధిపతుల పాలకులు ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు?
జవాబు:

  1. బర్మా సైన్యాధిపతుల పాలనలో పేద దేశంగానే ఉండిపోయింది.
  2. దేశ వనరులన్నీ సైన్యాధిపతుల అధీనంలోకి వెళ్ళాయి.
  3. రైతాంగం తమ పిల్లలను సైన్యానికి అమ్ముకోవలసి వచ్చింది.
  4. పేద ప్రజలు బానిసల మాదిరి గనులలో పనిచేయవలసి వచ్చేది.
  5. బర్మాని పాలించిన సైన్యాధిపతులు మానవహక్కులను ఉల్లంఘించారు.
  6. పిల్లలతో సహ ప్రజలతో బలవంతంగా వెట్టిచాకిరి చేయించుకున్నారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ప్రశ్న 17.
బర్మాలో ప్రజాస్వామ్యం నెలకొల్పటానికి జరుగుతున్న పోరాటాలు, నిరసనలకు ఆనాటి నుంచి నేటి వరకు కేంద్ర బిందువు ఎవరు?
జవాబు:
ఆంగ్ సాన్ సూకి.

ప్రశ్న 18.
ఆంగ్ సాన్ సూకి ఆధ్వర్యంలో గల కూటమి పేరేమి?
జవాబు:
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి) (NLD)

ప్రశ్న 19.
“ఆర్థిక దిగ్బంధం” అంటే ఏమిటి?
జవాబు:
ప్రపంచంలోని దేశాలు ఎగుమతులు, దిగుమతులు ఏవీ జరపకుండా, బర్మాని వాణిజ్యపరంగా ఏకాకిని చేయడం.

ప్రశ్న 20.
బర్మాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటానికి ప్రజల అభిప్రాయ సేకరణ (రిఫరెండం) ఎప్పుడు నిర్వహించారు?
జవాబు:
2008లో దేశం పేరుని ప్రజాస్వామిక గణతంత్రంగా మార్చారు.

ప్రశ్న 21.
ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు లభించింది?
జవాబు:
1991లో

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 22.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య భావనకు అనుకూలించే పరిస్థితులు ఏవి కల్పించాయి?
జవాబు:
పారిశ్రామికీకరణ, వలస వాదాలు.

AP 9th Class Social Important Questions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

AP 9th Class Social Important Questions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

These AP 9th Class Social Important Questions 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 18th Lesson Important Questions and Answers భారతదేశంపై వలసవాద ప్రభావం

9th Class Social 18th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
తిరుగుబాటు ఆదివాసీలు ఎవరు?
జవాబు:
1856లో జార్ఖండ్ సంతాల్ ఆదివాసీలు, 1880, 1992లో ఆంధ్రప్రదేశ్ లో కోయ ఆదివాసీలు, 1910లో బస్తర్ లోని ” మరియా, మురియా ఆదివాసీలు, 1940లలో గోండ్, కోలం ఆదివాసీలు తిరుగుబాటు చేశారు.

ప్రశ్న 2.
సీతారామరాజు దాడిచేసిన పోలీసు స్టేషన్లు ఏవి?
జవాబు:
బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది చింతపల్లి, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం వంటి ప్రాంతాల్లో పోలీసు స్టేషన్ల పై రాజు దాడులు చేశాడు.

ప్రశ్న 3.
నిజాం ప్రభుత్వం అడవిలో వసూలు చేసిన పన్నులేవి?
జవాబు:
అడవిలో పశువులను, మేపినందుకు, వంటకి కట్టెపుల్లలు సేకరించినందుకు నిజాం ప్రభుత్వం ‘బంబ్ రాం’, ‘దూప పెట్టి’ ” అన్న పేరుతో పన్ను వసూలు చేయసాగింది.

AP 9th Class Social Important Questions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 4.
బ్రిటిషు కాలంలో ఏర్పడిన పారిశ్రామిక వేత్తల సంఘాలలో ముఖ్యమైనది ఏది?
జవాబు:
భారత పరిశ్రమల ప్రయోజనాల కోసం బ్రిటిషు కాలంలోనే పారిశ్రామికవేత్తలతో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. వీటిల్లో ముఖ్యమైనది ‘వ్యాపార, పరిశ్రమల భారతీయ సమాఖ్య’ (FICCI – ఫిక్కీ).

ప్రశ్న 5.
కార్మిక సంఘాలు అని వేటిని అంటారు?
జవాబు:
సమ్మె సమయాల్లో కొంతమంది విద్యావంతుల సహాయంతో కార్మికులు తమ సొంత సంఘాలను ఏర్పరచుకున్నారు. వీటిని ‘కార్మిక సంఘాలు’ అంటారు.

ప్రశ్న 6.
కార్మిక సంఘాల పని ఏమి?
జవాబు:
ఈ కార్మిక సంఘాలు సమ్మేలు నిర్వహించేవి, మిల్లు యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకునేవి. క్రమంగా ఈ సంఘాలు సమ్మెకాలంలోనే కాకుండా కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం సంవత్సరం పొడవునా పని చేయసాగాయి.

ప్రశ్న 7.
గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన కార్మికసంఘం ఏది?
జవాబు:
అహ్మదాబాదులో గాంధీజీ ప్రభావంతో ‘మజూర్ మహాజన్’ అన్న శక్తివంతమైన కార్మిక సంఘం ఏర్పడింది.

ప్రశ్న 8.
రక్షిత మార్కెట్ అనగానేమి?
జవాబు:
ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలతో కూడిన వాణిజ్య పద్ధతిని ‘రక్షిత మార్కెట్’ అని అంటారు.

ప్రశ్న 9.
రిజర్వ్ అడవి అనగానేమి?
జవాబు:
ప్రభుత్వ అధీనంలో, అటవీశాఖ నియంత్రణలో ఉండే అడవిని ‘రిజర్వ్ అడవి’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 10.
ఆదివాసీలకు కొమరం భీం ఇచ్చిన పిలుపు ఏమిటి?
జవాబు:
కొమరం భీం ఆదివాసీలకు “జల్, జంగల్, జమీన్’ అనే పిలుపునిచ్చారు.

9th Class Social 18th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బ్రిటిష్ పరిపాలనా కాలంలో అడవుల నరికివేతకు దారి తీసిన కారణాలను రాయండి.
జవాబు:
ఈ క్రింది కారణాల వలన బ్రిటిష్ వారు అడవులను నరికివేశారు. ముంబై, కోల్‌కతా వంటి పట్టణాలు అభివృద్ధి చెందడం, ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్లలో రైలు మార్గాలను నిర్మించడం, పెద్దపెద్ద ఓడలను తయారుచేయడం, గనుల తవ్వకం, వాటిన్నింటికి కలప కొరకు అడవుల వినియోగం జరిగింది.

రైలు మార్గాల కోసం కావలసిన చెక్క స్లీపర్లను హిమాలయ ప్రాంతముల నుండి సేకరించారు.

ఆ రోజులలో వర్తకం ఎక్కువగా జల మార్గాల ద్వారానే సాగేది కనుక భారీ ఓడల నిర్మాణానికి కూడా అడవులను నరికివేయడం తప్పనిసరి అయినది.

9th Class Social 18th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
తొలి దశలో మిల్లులలో పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. తెల్లవారకముందే నిద్ర లేచి మిల్లులకు బారులు తీరిన కార్మికులు – వీళ్లల్లో పురుషులతో పాటు స్త్రీలు, పిల్లలు కూడా ఉండేవాళ్లు. యంత్రాల మీద పని చేయటం మొదలు పెట్టిన తరువాత ఇక ఆపటం అంటూ లేదు. భోజనాలకు కూడా ఖచ్చితమైన విరామం ఉండేది కాదు. తోటి కార్మికుడికి పని అప్పగించి 15-20 నిమిషాలలో కార్మికులు భోజనం ముగించేవాళ్లు. తినటానికి ప్రత్యేకంగా వేరే చోటు ఉండేది కాదు.

కర్మాగారపు వేడి, తేమ, మోత, ధూళితో. రోజంతా గడిచేది. మిల్లు వాతావరణంలో సరిగా ఊపిరాడేది కాదు. సూర్యుడు అస్తమించిన తరువాత చీకటిలో చూడటం అసాధ్యమైనప్పుడు మాత్రమే యంత్రాలతో ఆ రోజుకి పని ఆగేది. ఇలా నెలల తరబడి జరిగేది. వారానికి ఒకరోజు సెలవు కూడా నియమాల్లో లేదు. సంవత్సరంలో ముఖ్యమైన పండుగలకు మాత్రమే మిల్లు యజమాని సెలవు ఇచ్చేవాడు.
ప్రశ్న : పారిశ్రామికీకరణ తొలి దశలో, మిల్లులలోని కార్మికుల పని పరిస్థితులపై వ్యాఖ్యానించండి.
జవాబు:
తొలిదశలో మిల్లులలోని కార్మికుల పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది.

  1. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పనిచేస్తే వారికి ఇచ్చే వేతనాలు చాలా తక్కువ.
  2. ఉత్పత్తి చేసే సమయంలో ఏదైనా అనర్థం జరిగితే యాజమాన్యం ఎలాంటి బాధ్యతలను కూడా వహించేది కాదు.
  3. ఉత్పత్తి చేసే వస్తువు డామేజ్ అయినా దాని ఖర్చు కార్మికుడి జీతం నుండి తీసుకునేవారు.
  4. కార్మికులు మురికివాడలలో నివసిస్తూ సరైన సదుపాయాలు లేక, వైద్య సదుపాయం లేక రోగాల బారిన పడి ఎంతో మంది మరణించారు.
  5. సెలవులు లేకపోవడం, ఒక దుర్భర పరిస్థితి.
  6. విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన ఒళ్ళు నొప్పులతో కార్మికులు బాధపడుతూ దాని నుండి మరచిపోవడానికి మద్యానికి బానిసైపోయేవారు.

ఈ విధంగా వారి వేతనం కుటుంబ ఖర్చులకు చాలక దుర్భర దారిద్ర్య జీవితాన్ని అనుభవించారు.

తొలినాళ్లలో విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట కార్మికులను వదిలివేశారు గాని లేకపోతే వారిని రాత్రిపూట కూడా పనికోసం హింసించేవారు.

AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

These AP 9th Class Social Important Questions 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 17th Lesson Important Questions and Answers లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

9th Class Social 17th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
జెనోయిస్ అంటే ఏమిటి?
జవాబు:
1400 సంవత్సరంలో యూరపువాసులకు తెలిసిన ప్రపంచంను ‘జెనోయిస్’ అంటారు.

ప్రశ్న 2.
ప్రపంచమంతా వేటికి గిరాకీ ఉండేది?
జవాబు:
చైనా నుంచి పట్టు, పింగాణి పాత్రలకు; భారతదేశం నుంచి నూలు వస్త్రాలు, ఉక్కు, సుగంధ ద్రవ్యాలకు; అరేబియా నుంచి పళ్లు, అత్తర్లకు, యూరపు నుంచి మద్యానికి ప్రపంచమంతటా గిరాకీ ఉండేది.

ప్రశ్న 3.
లాటిన్ అమెరికా దేశాలు అని వేటిని వ్యవహరించసాగారు?
జవాబు:
స్పెయిన్, పోర్చుగీసు భాషలు లాటిన్ నుంచి పుట్టాయి. కాబట్టి ఈ దేశాలు ‘లాటిన్ అమెరికన్’ దేశాలుగా వ్యవహరించసాగారు.

ప్రశ్న 4.
హసియండా అని దేనిని అంటారు?
జవాబు:
పెద్ద భూస్వాముల కింద ఉండే విశాల భూభాగాన్ని హసియండా’ అనేవాళ్లు.

AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 5.
మన్రో సిద్ధాంత ముఖ్యాంశాలు ఏమి?
జవాబు:
అమెరికా అధ్యక్షుడు ‘జేమ్స్ మన్రో’ తయారుచేసిన ‘మన్రో సిద్ధాంతం’ ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు ఏవీ వలస ప్రాంతాలను ఏర్పరచుకోకూడదు. అందుకు ప్రతిగా ఇతర ఖండాలలో యూరపు వ్యవహారాల్లో కానీ, వలస ప్రాంతాల్లో కానీ అమెరికా జోక్యం చేసుకోదు.

ప్రశ్న 6.
అర్థవలస ప్రాంతంగా దేనిని పరిగణిస్తారు?
జవాబు:
చైనా ఏ ఒక్క దేశానికీ పూర్తిగా వలస ప్రాంతంగా లేదు. అందుకనే దీనిని ‘అర్ధవలస’ ప్రాంతంగా పరిగణిస్తారు.

ప్రశ్న 7.
చీకటి ఖండం అని దేనిని పిలిచేవారు?
జవాబు:
ఆఫ్రికా ఖండం గురించి దాని లోపలి ప్రాంతాల గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే తెలియటం వల్ల దానిని ‘చీకటి ఖండం’గా ఐరోపావాసులు పిలిచేవారు.

ప్రశ్న 8.
బెల్జియం తరపున భూభాగ పటాలను తయారుచేసి యూరప్ అన్వేషకులు ఎవరు?
జవాబు:
యూరపుకు చెందిన ముఖ్యమైన అన్వేషకులలో ‘డేవిడ్ లివింగ్స్టన్’, ‘హెచ్.ఎం. స్టాన్లీ’ ముఖ్యమైన వాళ్ళు. వీరు బెల్జియం తరఫున దక్షిణ, మధ్య ఆఫ్రికాలోని భూభాగాల పటాలను తయారుచేశారు.

ప్రశ్న 9.
కాంగో స్వేచ్ఛా రాజ్యంగా దీనిని వ్యవహరించారు?
జవాబు:
1882 నాటికి లియోపోల్-II అధికారం ఆఫ్రికా ప్రాంతంలో 23,00,000 కి.మీ. మేర విస్తరించింది. ఇది బెల్జియం కంటే 75 రెట్లు ఎక్కువ. దీనిని ‘కాంగో స్వేచ్ఛా రాజ్యం (Congo Free state)’ గా వ్యవహరించే వాళ్లు.

ప్రశ్న 10.
జాతి వివక్ష అంటే ఏమిటి?
జవాబు:
జాతి ఆధారంగా జనాభాలో అధిక శాతంపై చూపే వివక్షతను జాతి వివక్షత అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 11.
యూరోపియన్లు ఆఫ్రికాను ఒక “చీకటి ఖండం”గా ఎందుకు పేర్కొన్నారు?
జవాబు:
ఆఫ్రికా ఖండం గురించి, దాని లోపలి ప్రాంతాల . గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే తెలియటం వల్ల దానిని “చీకటి ఖండం”గా ఐరోపా వాసులు పిలిచేవాళ్ళు.

9th Class Social 17th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భారతదేశ పౌరులుగా వలస పాలనకు మద్దతు ఇస్తారా? వ్యతిరేకిస్తారా? ఎందుకు?
జవాబు:
భారతదేశ పౌరులుగా వలస పాలనను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే దాస్య బతుకులు, చీకటి పాలన వద్దని, పరదేశీయుల చేతుల్లో భారతమాత చిక్కరాదని, అపార సహజ వనరులు, ముడి పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు విలువైన వస్తువులు వేరొక ప్రాంతానికి తరలించడం ఇష్టంలేక, అవమానాలు, బానిస బతుకులు మాకొద్దని, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఎంతో ముద్దని, త్యాగధనుల స్ఫూర్తి ఆదర్శాలు వెల్లివిరియాలని వలస పాలనను వ్యతిరేకిస్తాను.

9th Class Social 17th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింద ఇచ్చిన రెండు పటాలను పరిశీలించండి.
పటం – ఎ 1913 – 14 సం||లో యూరప్ దేశాల వలస ప్రాంతాలను తెలియజేస్తుంది మరియు పటం – బి ఆఫ్రికా నందలి ఆధునిక దేశాలను తెలియజేస్తుంది.
AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 2

రెండు పటాలలో సమాచారాన్ని పోల్చండి. కింది పట్టికను మీ జవాబు పత్రంలో గీచి ఆధునిక ఆఫ్రికా దేశానికి ఎదురుగా వలసగా చేసుకొని పాలించిన దేశం పేరు రాయండి.
జవాబు:

ఆధునిక దేశం 1913 నాటికి వలసగా చేసుకొని పాలించిన దేశం
దక్షిణ ఆఫ్రికా
ఈజిప్టు
నైజీరియా
ఘనా
లిబియా
అల్జీరియా
అంగోలా
కాంగో

జవాబు:

ఆధునిక దేశం 1913 నాటికి వలసగా చేసుకొని పాలించిన దేశం
దక్షిణ ఆఫ్రికా ఇంగ్లాండ్
ఈజిప్టు ఇంగ్లాండ్
నైజీరియా ఫ్రాన్స్
ఘనా ఇంగ్లాండ్
లిబియా ఇటలీ
అల్జీరియా ఫ్రాన్స్
అంగోలా పోర్చుగీసు
కాంగో బెల్జియం

ప్రశ్న 1.
జాతి వివక్షత అంటే ఏమిటి?
జవాబు:
పౌరహక్కులు, స్వేచ్చగా సంచరించే హక్కు, సంఘాలుగా ఏర్పడే హక్కు, తమ కష్టాలను తెలియజేసే హక్కు వంటివేవీ లేకుండా, జాతి ఆధారంగా నాభాలో అధిక శాతంపై చూపే ఈ వివక్షతను జాతి వివక్షత అంటారు.

ప్రశ్న 2.
యూరప్ దేశాల వలస ప్రాంతాలుగా ఏ ఏ ఖండాలు తమ అధీనంలోకి వచ్చాయి?
జవాబు:
1400 నుంచి మొదలై అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా అంతా – అంటే యూరపు మినహాయించి, మిగిలిన ఖండాలన్ని యూరప్ దేశాల వలస ప్రాంతాలుగా మారాయి. అయితే వాటన్నింటినీ ఒకే ఫలితాలతో, ఒకే రకంగా వలస ప్రాంతాలుగా మార్చలేదు. అమెరికాలోని అధికశాతం స్థానిక ప్రజలను చంపేశారు, దోచుకున్నారు. ఐరోపావాసులు అక్కడ పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. ఆఫ్రికా వంటి ఇతర ఖండాల నుంచి కోట్లాది బానిసలను తెచ్చి అక్కడ స్థిరపడేలా చేశారు.

AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 3.
భారతదేశ వలస ప్రాంతంగా ఏ విధానాన్ని అనుసరించారు?
జవాబు:
వలస ప్రాంతంగా భారతదేశాన్ని లోబరుచుకున్న ఐరోపా వాసులు, భారతదేశ ప్రజలను చంపకుండా, బానిసలుగా . మార్చకుండా, తమ పాలనను ఏర్పరచుకున్నారు. భారతదేశంలో వాళ్ళు పెద్ద సంఖ్యలో స్థిరపడటానికి కూడా ప్రయత్నించలేదు. వ్యవసాయంపై పన్ను, ముడి సరుకుల కొనుగోలు, ఇంగ్లాండ్ లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక సరుకుల అమ్మకం వంటి చర్యల ద్వారా భారతదేశ ప్రకృతి వనరులపై నియంత్రణ సాధించారు.

ప్రశ్న 4.
600 సం||ల క్రితం రోపా వాసులు ఏ విధంగా ప్రయాణాలు చేసేవారు?
జవాబు:
600 సం||ల క్రితం ప్రజలు చాలా తక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు. సాధారణంగా గుర్రాల మీద, ఒంటెల మీద ప్రయాణం చేసేవాళ్ళు. లేదా సముద్ర తీరం వెంట ఫడవులు, ఓడలలో ప్రయాణం చేసేవాళ్ళు.

ప్రశ్న 5.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఏ ఏ ఉత్పత్తులకు, వస్తువులకు గిరాకీ ఉండేది?
జవాబు:
విదేశీ వస్తువులను కొని, అధిక ధరలకు అమ్మే వ్యాపారస్తులు దూర దూరాలకు ప్రయాణించడంతో ప్రజల మధ్య, దేశాల మధ్య సంబంధాలు పెరగసాగాయి. చైనా నుంచి పట్టు, పింగాణీ పాత్రలకు, భారతదేశం నుంచి నూలు వస్త్రాలు, ఉక్కు, సుగంధ ద్రవ్యాలకు, అరేబియా నుంచి పళ్ళు, అత్తర్లకు, యూరపు నుంచి మద్యానికి ప్రపంచమంతటా గిరాకీ ఉండేది.

ప్రశ్న 6.
లాటిన్ అమెరికా దేశాలంటే ఏవి?
జవాబు:
1500 నుంచి 1800 వరకు మధ్య మూడు వందల సంవత్సరాల కాలంలో మధ్య, దక్షిణ అమెరికాలలో అధిక భాగం స్పెయిన్, పోర్చుగీసు అధీనంలోకి వచ్చింది. స్పెయిన్, పోర్చుగీసు భాషలు లాటిన్ నుంచి పుట్టాయి. కాబట్టి ఈ దేశాలను ‘లాటిన్ అమెరికన్’ దేశాలుగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 7.
హసియండా అంటే ఏమిటి?
జవాబు:
స్పెయిన్ నుంచి వచ్చి దక్షిణ అమెరికాలో స్థిరపడిన వాళ్ళ చేతుల్లో ఆ దేశాల గనులు, భూములు ఉండేవి. వాళ్ళల్లో కొంతమంది పెద్ద భూస్వాములుగా ఉండేవాళ్ళు. వాళ్ళ కింద ఉండే విశాల భూ భాగాన్ని ‘హసియండా’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 8.
పోర్చుగీసు వలస పాలిత ప్రాంతంగా ఉన్న బ్రెజిల్ ఎప్పుడు స్వాతంత్ర్యం పొందింది?
జవాబు:
1822 లో

ప్రశ్న 9.
మన్రో సిద్ధాంతం అనగానేమి?
జవాబు:
అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో తయారుచేసిన సిద్ధాంతం కాబట్టి దానికి మన్రో సిద్ధాంతమని పేరు. దీని ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు ఏవీ వలస ప్రాంతాలను ఏర్పరచుకోకూడదు. అందుకు ప్రతిగా ఇతర ఖండాలలో యూరపు వ్యవహారాల్లో కానీ, వలస ప్రాంతాల్లో కాని అమెరికా జోక్యం చేసుకోదు.

ప్రశ్న 10.
రెండవ ప్రపంచ యుద్ధ కాలం?
జవాబు:
1939 – 1945

ప్రశ్న 11.
నల్లమందు యుద్ధాలు ఎప్పుడు జరిగాయి? ఏ ఏ దేశాల మధ్య జరిగాయి?
జవాబు:
నల్లమందు యుద్ధాలు 1840 – 42 ల మధ్య జరిగాయి. ఇంగ్లాండ్, చైనాల మధ్య నల్లమందు యుద్ధాలు జరిగాయి.

ప్రశ్న 12.
యూరప్ సైన్యాన్ని ఓడించిన ఏకైక యూరపేతర సామ్రాజ్యం ఏది?
జవాబు:
ఇథియోపియా.

AP 9th Class Social Important Questions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

AP 9th Class Social Important Questions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

These AP 9th Class Social Important Questions 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 16th Lesson Important Questions and Answers సామాజిక నిరసనోద్యమాలు

9th Class Social 16th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కంచె వేయటం అనే ప్రక్రియ వలన ఏం జరిగింది?
జవాబు:
‘కంచె వేయటం’ అనే ప్రక్రియ ద్వారా 1770లో వందలాది చిన్న రైతులు భూములను శక్తిమంతులైన భూస్వాముల పెద్ద కమతాలతో కలిపివేశారు.

ప్రశ్న 2.
లుద్దిజం అంటే ఏమిటి?
జవాబు:
‘జనరల్ నె లుడ్జ్’ అన్న జనాకర్షక నాయకుడి నేతృత్వంలో మరొక రకమైన నిరసన వ్యక్తమైంది. ఈ ఉద్యమాన్ని ‘లుద్దిజం’ (1811 – 17) అంటారు.

ప్రశ్న 3.
సామ్యవాదం ఏం ఖండిస్తుంది?
జవాబు:
ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా ఉండి, ఏం ఉత్పత్తి చేయాలి, అందులో ఎవరికి వాటా ఉండాలి అనే విషయాలను మార్కెట్ నిర్ణయించే పెట్టుబడిదారీ విధానంలోని మౌలిక భావనలను సామ్యవాదం ఖండిస్తుంది.

AP 9th Class Social Important Questions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 4.
బాబెఫ్ వాదన ఏమిటి?
జవాబు:
‘విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని’ సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దుచేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలని బాబెఫ్ వాదించాడు.

ప్రశ్న 5.
సామ్యవాదం మద్దతుదారులు ఎవరు?
జవాబు:
ఎం.ఎన్. రాయ్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ వంటి అనేక మంది నాయకులు సామ్యవాదం మద్దతుదారులు అయ్యారు.

ప్రశ్న 6.
వర్జీనియా ఉల్ఫ్ ఏమి రాశాడు?
జవాబు:
మహిళలపై పురుషుల ఆధిపత్యం గురించి, ఆధిపత్యం చెలాయించే సాధనాలుగా మహిళలు కూడా మారే విధానం గురించి ‘వర్జీనియా ఉల్ఫ్’ వంటి రచయిత్రులు రాయసాగారు.

9th Class Social 16th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“సామ్యవాదం అనే భావన ఎందుకు అభినందనీయము?” మీ అభిప్రాయం వ్రాయండి.
జవాబు:
ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల అధీనంలో ఉండాలనే సిద్ధాంతమే సామ్యవాదం.

  1. సామ్యవాదంలో ఉత్పత్తి విషయంలో ప్రభుత్వ బాధ్యత ఉంటుంది.
  2. పరిశ్రమలను జాతీయం చేయడం వలన ఉత్పత్తి అయిన జాతీయ సంపద సర్వప్రజలకు సమానంగా చెందు అవకాశం కలదు.
  3. దీని వలన ఆర్థిక అసమానతలు తొలగి, ప్రజలందరి జీవితాలు మెరుగుపడటమే కాకుండా వాళ్ళకు ఎన్నో అవకాశాలను, శక్తులను ఇస్తుంది. దీనిలో చిన్నా, పెద్దా తేడాలు ఏమీ ఉండవు.

పై అన్ని అంశాల వలన సామ్యవాదం అభినందనీయం.

ప్రశ్న 2.
సామ్యవాద సిద్ధాంతానికి సంబంధించి రెండు అంశాలు రాయండి.
జవాబు:

  1. విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దుచేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలి.
  2. నిజమైన స్వేచ్ఛ, నిజమైన సమానత్వం ఉండాలంటే, వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి.

ప్రశ్న 3.
పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికులు, శ్రామికులు, మహిళలు ఎదుర్కొను సమస్యలేవి?
జవాబు:
పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు స్వతంత్ర జీవనాధారంలేని వేలాది మంది కార్మికులు, కూలీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసెను. కార్మికులు, యజమానులు ఇచ్చే స్వల్ప వేతనమునకే తప్పనిసరి పరిస్థితులలో పని చేయవలసి వచ్చెను. స్త్రీలకు, చిన్న పిల్లలకు తక్కువ కూలి ఇచ్చేవారు. యజమానులు వారి చేత నిర్దాక్షిణ్యంగా, కఠినంగా ప్రమాదకరమైన పనులు చేయించిరి. దినమునకు 15 నుండి 18 గంటల వరకు పని చేయవలసి వచ్చేది. కార్మికులు, శ్రామికులు నివసించే ప్రాంతాలు అనారోగ్యకరంగా ఉండి, అంటువ్యాధులకు నిలయమై ఉండేవి.

AP 9th Class Social Important Questions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 4.
సామ్యవాదం అంటే ఏమిటి? దాని లక్ష్యాలు ఏమి?
జవాబు:
ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల అధీనంలో ఉండాలనే సిద్ధాంతమే సామ్యవాదం.

  1. సామ్యవాద పద్ధతిలో వస్తూత్పత్తి సాధనాలు. ప్రభుత్వ అధీనంలో ఉంటాయి.
  2. ఉత్పత్తికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించును.
  3. పరిశ్రమలు జాతీయం చేయడం వల్ల ఉత్పత్తి అయిన జాతీయ సంపద సర్వ ప్రజలకు సమానంగా చెందు అవకాశం కలుగును.
  4. దీనివల్ల ఆర్థిక అసమానతలను తగ్గించును.

9th Class Social 16th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“పారిశ్రామికీకరణ వల్ల కళాకారులు, మేధావులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామీణ ప్రజాజీవనం, వ్యవసాయోత్పత్తి లేదా చేతివృత్తి పనులతో ముడిపడి ఉన్న మానవ విలువలు అంతరించిపోయాయి.”
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలు మానవ విలువలను ప్రభావితం చేస్తున్న అంశంపై వ్యాఖ్యానించుము.
జవాబు:
భావాలు ఉద్వేగాల కంటే హేతువు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం, పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ అచ్చెరువు గొలిపే ప్రభావంతో పాటు శ్రామిక ప్రజల దారిద్ర్యం, దుర్భర జీవనాలు, మేధావుల పైన గాఢ ముద్రను వేశాయి.

పారిశ్రామికీకరణ వలన కొత్త సామాజిక బృందాలు కూడా ఏర్పడ్డాయి. సమాజంలో ముఖ్యపాత్ర పోషించడానికి ఇవి. తహతహలాడసాగాయి. పారిశ్రామికీకరణ పారిశ్రామిక పెట్టుబడిదారులకు, బడా భూస్వాములకు, అధికారం, ప్రాబల్యంతో పాటు, సంఘటిత కార్మికవర్గ ఉద్యమాలకు దారితీసింది. తాము సమైక్యంగా ఉన్నప్పుడు మొత్తం ఆర్థిక జీవనాన్ని స్తంభింప చేయడం ద్వారా తమ శక్తిని శ్రామికులు గుర్తించారు. అదే విధంగా అప్పటివరకు ఇళ్ళకు పరిమితమైన మహిళలు బయటకు వచ్చి సమాజంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో సమాన భూమికను కోరసాగారు. తమ కోర్కెలు నెరవేర్చు కోవడానికి తరచుగా వారు సోషలిజం, ప్రజాస్వామిక జాతీయ వాదం వంటి సామాజిక ఉద్యమాలలో చేతులు కలిపారు.

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

These AP 9th Class Social Important Questions 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 15th Lesson Important Questions and Answers పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

9th Class Social 15th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
తొలి పారిశ్రామిక విప్లవం అని దేనిని అంటారు?
జవాబు:
1780-1850 ల మధ్య కాలంలో బ్రిటన్ పరిశ్రమలు, ఆర్థిక విధానంలో సంభవించిన మార్పులను “తొలి పారిశ్రామిక విప్లవం”గా పేర్కొంటారు.

ప్రశ్న 2.
పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని మొదటగా వాడినవారు ఎవరు?
జవాబు:
ఐరోపా మేధావులైన ఫ్రాన్స్ లోని జార్జెన్ మిథైలెట్, జర్మనీలోని ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ “పారిశ్రామిక విప్లవం” అన్న పదాన్ని వాడారు.

ప్రశ్న 3.
ఫిషర్ ప్రశంస ఏమిటి?
జవాబు:
“ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తరువాత ప్రపంచమంతా అనుకరించింది” అని ఫిషర్ ప్రశంసించాడు.

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
మొదటి, రెండవ రైలు మార్గాలు ఏఏ నగరాలను కలిపాయి?
జవాబు:
మొదటి రైలు మార్గం 1825 సం||రంలో ‘స్టాక్టన్’, ‘డార్లింగ్ టన్’ పట్టణాలను కలిపింది. రెండవ రైలు మార్గం 1830లో లివర్‌పూల్ ని, మాంచెస్టర్ ని కలిపింది.

ప్రశ్న 5.
కాలువల ద్వారా, రైళ్ల ద్వారా రవాణాలోని ప్రయోజనాలు ప్రశంసించండి.
జవాబు:
కాలువలు, రైళ్ళ ద్వారా త్వరితగతిన పారిశ్రామికీకరణ జరగడమే కాకుండా, వాణిజ్యం, భావ ప్రసారం, ఆర్థిక ప్రగతి వంటివి పెరిగాయి.

ప్రశ్న 6.
బ్రిటన్లో పారిశ్రామిక విప్లవానికి అనుకూలించే అంశాలు ఏవి?
(లేదా)
ఆధునిక పారిశ్రామిక విప్లవము. బ్రిటన్లోనే ఎందుకు ఆవిర్భవించింది?
జవాబు:
ఇంగ్లాండ్ లో ముడిసరుకుకు కొరతలేదు. బొగ్గు, ఇనుము సమృద్ధిగానే కాకుండా పక్కపక్కనే దొరికేవి. జలశక్తికి ఎటువంటి కొరతా లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలం. అధిక సంఖ్యలో కార్మికులు అందుబాటులో ఉండేవారు.

9th Class Social 15th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“20వ శతాబ్దపు ఆవిష్కరణలు సాంకేతికాభివృద్ధిని మరియు సహజ వనరులను అత్యంత ప్రభావితం చేస్తాయి. నూతన ఆవిష్కరణల ఫలితంగా అందుబాటులోకి వచ్చిన ప్రధాన వస్తువులు మరియు పరికరాలు ఈనాడు మన జీవన విధానాన్ని మార్చివేశాయి.”
రవాణా మరియు వైద్యరంగంలోని ఏవేని ఒక్కొక్క నూతన ఆవిష్కరణను పేర్కొని, అవి నేటి మన జీవనాన్ని ఏవిధంగా మార్చాయో క్లుప్తంగా తెలపండి.
జవాబు:
రవాణా :
విమానాలు, మోటార్ వాహనాల ఆవిష్కరణ, రైల్వేల ఆవిర్భావం మొదలైనవి.

వైద్యం :
యాంటీ బయాటిక్స్, వ్యాధి నిరోధక టీకాలు, మత్తు మందు మొదలైనవి.

విమానాలు విశాల ప్రపంచాన్ని దగ్గర చేశాయి. సుదూర ప్రాంతాలకు సహితం వేగంగా చేరుకోవడానికి వీలు కల్పించాయి.

వ్యాధి నిరోధక టీకాల వల్ల మానవుల సగటు ఆయుఃప్రమాణం పెంపొందటం, అనేక వ్యాధులను అరికట్ట గలగడం గొప్ప విజయం.

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 2.
పారిశ్రామిక విప్లవం వల్ల మానవజీవనంలో సంభవించిన దుష్పరిణామాలు ఏవి?
జవాబు:
పారిశ్రామిక విప్లవం వల్ల మానవ జీవనంలో సంభవించిన దుష్పరిణామాలు :

  1. విచ్ఛిన్నమైన కుటుంబాలు
  2. కొత్త చిరునామాలు, సమస్యలకు లోనైన పట్టణాలు
  3. గృహవసతి, తాగునీటికి కష్టాలు.
  4. కలరా, టైఫాయిడ్, క్షయ వంటి వ్యాధులు
  5. పాలకుల నిర్లక్ష్యం.

ప్రశ్న 3.
ఫ్రాన్స్ లో పారిశ్రామికీకరణ వృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏవి?
జవాబు:

  1. పెట్టుబడిని సమీకరించి, పారిశ్రామికవేత్తలకు అప్పులు ఇవ్వగల పెద్ద బ్యాంకు ఫ్రాన్స్ లో వృద్ధి చెందలేదు.
  2. ఫ్రెంచి ఉత్పత్తిదారులలో చాలామంది కుటుంబ వనరుల పైనే ఆధారపడటం.
  3. ఫలితంగా వాళ్ళు చిన్న కంపెనీలుగానే మిగిలిపోవడం.
  4. కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని, ఆలోచనలను వేగంగా ఆచరణలో పెట్టలేకపోవడం.
  5. బొగ్గు గనులు తక్కువ.
  6. ఫ్రెంచి పరిశ్రమలు వినియోగదారీ వస్తువులైన బట్టలు వంటి వాటి పైనే దృష్టి, పై కారణాల వలన ప్రగతి సాధించలేకపోయింది.

9th Class Social 15th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“పట్టణాల్లో ఇతర సామాజిక బృందాలతో పోలిస్తే కార్మికుల సగటు జీవితకాలం చాలా తక్కువగా వుందని 1842 లో చేసిన ఒక సర్వే వెల్లడి చేసింది.”
ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. వారు ఉన్న పల్లెలతో పోలిస్తే పట్టణాలలో వారి జీవన ప్రమాణం చాలా తక్కువగా ఉంది.
  2. పిల్లలలో సగం కంటే ఎక్కువ మంది 5 సం||ల కన్నా ఎక్కువ కాలం బ్రతికేవారు కాదు.
  3. జనాభా అధికంగా పెరగటం వల్ల సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి.
  4. నీటి కాలుష్యం వల్ల కలరా, టైఫాయిడ్ మరియు గాలి కాలుష్యం వలన క్షయ వంటి వ్యాధులు రావటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది.
  5. పురపాలక అధికారులు ప్రమాదాలను అరికట్టడానికి ఎటువంటి చర్యలను తీసుకోలేదు.
  6. వైద్యశాస్త్రం కూడా అంతగా అభివృద్ధి చెందలేదు.
  7. పారిశ్రామిక కార్మికుల జీవితాలకు ఎటువంటి గౌరవం, భద్రత లేవు.
  8. వారు సానుభూతి లేని యజమానులు మరియు పర్యవేక్షకుల నియంత్రణలో పనిచేసేవారు.

ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు చాలా ఇబ్బందులకు గురి అయినారు.

ప్రశ్న 2.
రోడ్లు నిర్మించిన జాన్ మెట్ కాఫ్ చూపులేని వ్యక్తి. అతడు స్వయంగా రోడ్ల ఉపరితలాలు సర్వేచేసి, వాటికి ప్రణాళికలు తయారుచేసేవాడు. కాలువలను నిర్మించిన జేమ్స్ బ్రాండ్లో దాదాపుగా నిరక్షరాస్యుడు. అతడికి పదాల అక్షరక్రమం (స్పెల్లింగ్) సరిగా వచ్చేది కాదు. నావిగేషన్ అన్న పదం కూడా పలికేవాడు కాదు. కాని అతడి జ్ఞాపకశక్తి, ఊహాశక్తి, ఏకాగ్రత అమోఘంగా ఉండేవి.
ప్రశ్న : పైన ఇచ్చిన పేరాను చదివి దానిపై వ్యాఖ్యానించండి.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరా ఏమి చెప్తుందంటే …………
ఏదైనా మనం క్రొత్తగా కనిపెట్టాలి అంటే మనం శాస్త్ర విజ్ఞానం అన్వయించడం ద్వారా కంటే కృతనిశ్చయం, ఆసక్తి, కుతూహలం, ముఖ్యంగా అదృష్టం కూడా అవసరమే అని చెప్తుంది. అంతేకాకుండా శాస్త్ర పరిజ్ఞానం ఏమీ లేకుండానే ఇంత సాధించామంటే, ప్రస్తుతం ఉన్న శాస్త్ర పరిజ్ఞానంతో మనం ఎంతో సాధించవచ్చు. కావున మనకు విజ్ఞానంతో పాటు జ్ఞాపకశక్తి, పట్టుదల కూడా ఎంతో అవసరం.

ప్రశ్న 3.
పారిశ్రామికీకరణవల్ల మహిళలు, పిల్లలు అనుభవించిన బాధలు ఏవి?
(లేదా)
పారిశ్రామిక విప్లవ కాలంలో మహిళలు, పిల్లలు ఎదుర్కొన్న సమస్యల గురించి రాయండి.
జవాబు:
పిల్లలు :

  1. ఇంగ్లాండ్ లో పిల్లల దుస్థితి దారుణంగా ఉండేది.
  2. అధిక పనిగంటలు
  3. నిద్రలేమితో యంత్రాలలో పడి మరణాలు
  4. యంత్రాల వల్ల పిల్లలకు గాయాలు
  5. యంత్రాల వల్ల పిల్లల జుట్టు ఇరుక్కుపోయేది.

మహిళలు :

  1. నూలు వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా పని
  2. పట్టు, లేసు, అల్లికలలో పని 3) తక్కువ కూలి
  3. చేసిన తప్పులకు కఠినమైన శిక్షలు 5) పని గంటల భారం
  4. తరచుగా సంభవించే జబ్బులు
  5. ప్రసవ సమయంలో మరణాలు

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
ప్రపంచంలోని వివిధ దేశాలలో రైళ్ళ రాకవల్ల ఏర్పడిన ప్రభావాలను పోల్చండి.
(లేదా)
చక్కటి రవాణా సౌకర్యాలు వేగవంతమైన పారిశ్రామికీకరణకు దారితీస్తాయి’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం వివరించండి.
జవాబు:
ప్రపంచంలో అనేక దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి, తమ ఉత్పత్తులు ముడి సరుకులతో ప్రపంచాన్ని ఆకర్షించడానికి, ప్రయాణికులను, సరుకులను, ఉత్పత్తులను వేగంగా, సులువుగా తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి రైళ్ళు ప్రధాన భూమిక పోషించాయి. కలప పట్టాలకు బదులు ఇనుప పట్టాలను కనిపెట్టటం, ఆవిరి యంత్రంతో పెట్టెలను లాగటం అన్న రెండు ఆవిష్కరణల వల్ల ఇది సాధ్యమయ్యింది.

రైల్వేల వల్ల పారిశ్రామికీకరణ రెండవ దశలోకి మారటమే కాకుండా, కాలువల వినియోగంలో అనేక సమస్యలను అధికమించే క్రమంలో రైళ్ళు ఒక ప్రత్యేక పాత్ర పోషించాయి. 1850 నాటికి జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్లతో పోలిస్తే రెట్టింపు నిధులు సమకూర్చి ఆ రెండు దేశాలను అధిగమించి రైల్వేలను అభివృద్ధి చేసింది. ఫ్రాన్స్ దేశంలో కూడా పారిశ్రామిక ప్రగతితో రైలు మార్గాలు విస్తరించి, రవాణా వ్యవస్థలో ప్రధానపాత్ర పోషించాయి. ప్రపంచంలోని చాలా దేశాల పరిశ్రమల వేగవంతానికి, ఆర్థిక పరిపుష్టి సాధనలో రైల్వేలు ముఖ్యపాత్ర పోషించాయి.

AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

These AP 9th Class Social Important Questions 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 14th Lesson Important Questions and Answers 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

9th Class Social 14th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
రాజ్యం అంటే ఏమిటి?
జవాబు:
‘రాజ్యం’ అన్నపదానికి ఫ్రెంచి విప్లవం ఒక కొత్త అర్థాన్నిచ్చింది. రాజ్యమంటే దానికి చెందిన ప్రజలు నివసించే ప్రాంతం కాదు, రాజ్యమంటే అందులోని ప్రజలే.

ప్రశ్న 2.
సెర్ఫ్‌లు అనగా ఎవరు?
జవాబు:
సెర్ఫ్‌లు :
ఒక భూస్వామి భూములకు కట్టుబడి ఉన్నవాళ్లు. అతడి అనుమతి లేకుండా వేరే చోటుకి వెళ్ళటానికి వీలులేనివారు.

ప్రశ్న 3.
సప్లీజ్ అనగానేమి?
జవాబు:
సఫ్రేజ్ అనగా సార్వజనీన ఓటు హక్కు.

ప్రశ్న 4.
జంకర్లు అనగా ఎవరు?
జవాబు:
ప్రష్యాలోని బడా భూస్వాములను ‘జంకర్లు’ అనేవారు.

AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 5.
ఇటలీ ఏకీకరణలో “కవూర్” పోషించిన పాత్రను మీరు ఏ విధంగా ప్రశంసిస్తారు?
జవాబు:
కవూర్ పాత్ర ఇటలీ ఏకీకరణలో ప్రశంసనీయమైనది. ఎందుకనగా అతను ఒక విప్లవవాదిలా కాకుండా, ప్రజాస్వామ్యవాదిలా తనకున్న ఫ్రెంచ్ భాషా నైపుణ్యంతో దౌత్యనీతిని ప్రదర్శించి ఇటలీ భాగాలను ఏకీకరణ చేయడానికి కృషి చేశాడు.

9th Class Social 14th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
19వ శతాబ్ద ఆరంభంలో ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలు ఏమిటి?
జవాబు:
ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు :

  • వ్యక్తిగత స్వేచ్ఛ, చట్ట సమానత్వం.
  • రాజకీయంగా ప్రజామోదంతో ప్రభుత్వం అన్న భావన.
  • వ్యక్తిగత ఆస్తి హక్కుకు ప్రాధాన్యత.
  • రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వం.
  • సరుకులు, ప్రజలు, పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలింపబడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం ఏర్పాటు.
  • సుంకాల సమాఖ్య లేదా జోల్వెరిన్ ఏర్పాటు.
  • రైలు మార్గాల అభివృద్ధితో ప్రగతి అధికం.
  • దేశ ఐక్యతకు తగ్గట్లు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల కల్పన.

ప్రశ్న 2.
సంవత్సరం సంఘటనలు
AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1
పై సమాచారాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబివ్వండి.
ఎ) ‘మధ్య తరగతి’ చేసిన డిమాండ్లు ఏవి?
బి) ఏ దేశంపై దాడితో నెపోలియానిక్ యుద్దాలు మొదలయ్యాయి?
జవాబు:
ఎ) రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం
ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం

బి) ఇటలీపై నెపోలియన్ దాడి వలన నెపోలియానిక్ యుద్ధాలు మొదలయ్యాయి.

AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2
పై పటాన్ని చదివి దిగువ ప్రశ్నలకు జవాబులివ్వండి.
ఎ) పై పటంలో చూపబడిన ఏవైనా రెండు దీవుల పేర్లు రాయండి.
బి) పై పటంలో చూపబడిన రాజ్యాలు ప్రస్తుతం ఏ దేశంలో భాగాలు?
జవాబు:
ఎ) సార్డీనియా, సిసిలీ, కోర్సికో.
బి) పటంలో చూపబడిన రాజ్యాలు ప్రస్తుతం ఇటలీ దేశానికి చెందినవి.

ప్రశ్న 4.
పోలెండ్ ను రష్యా ఏ విధంగా విలీనం చేసుకుంది?
జవాబు:
వియన్నా సమావేశం పోలెండ్ లో అధిక భాగాన్ని రష్యాకి ఇచ్చింది. ఇప్పుడు విప్లవం పోలెండ్ కి విస్తరించింది. అయితే రష్యా బలమైన శక్తి కావటంతో బెల్జియం లాగా కాకుండా పోలెండ్ స్థితి భిన్నంగా ఉంది. పోలిష్ ప్రజలకు తమ పక్క దేశాల నుంచి మద్దతు లభించలేదు. వాళ్ళు ఎంతగానో పోరాడారు. కాని చివరకు ఓడిపోయారు. ఫలితంగా జారు చక్రవర్తి పోలెండ్ ను రష్యాలో కలిపేసుకున్నాడు.

ప్రశ్న 5.
1848 విప్లవానికి కారణాలేవి?
జవాబు:
ఫ్రాన్స్ లో లూయీ ఫిలిప్ రాజ్యాంగబద్ధ రాచరికంలో భాగంగా పరిపాలించాలి. సింహాసనాన్ని అధిష్టిస్తున్నప్పుడు అతడిని పౌరరాజుగా పేర్కొన్నారు. అతడి పట్టాభిషేకం “దేవుని దయతోను”, “జాతి కోరిక ప్రకారం” జరిగిందని అన్నారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఫిలిప్ తిరోగామి పంథాను అనుసరించాడు. శత్రువులు పెరిగారు. అతడు నియమించిన మంత్రులు, పాలకులపై తిరుగుబాట్లు జరిగాయి. ఈ సందర్భంగా ఫిలిప్ జరిపిన కాల్పులలో 23 మంది చనిపోయారు. పారిలో వీధి పోరాటాలతో విప్లవానికి నాంది పలికింది.

ప్రశ్న 6.
యూరపులో రాచరిక స్థానంలో జాతీయ రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి?
జవాబు:
యూరపు సామ్రాజ్యాలుగా, చిన్న రాజ్యాలుగా విభజింపబడి ఉంది. ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆర్థిక జీవనం పంచుకుంటున్నా మన్న భావం కలిగిన పౌరుల క్రియాశీల భాగస్వామ్యంపై ఆధారపడిన బలమైన దేశాలను ఏర్పాటు చేయటానికి ప్రజాస్వామిక, జాతీయవాద ఉద్యమాలు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాల ఫలితంగా పలు దేశాలతో కూడిన వంశపారంపర్య రాచరిక స్థానంలో యూరపులో జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి.

9th Class Social 14th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
AP 9th Class Social Important Questions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1
పై సమాచారాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) వియన్నా సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది?
బి) 1848 విప్లవ కాలంలో ఫ్రాన్స్ ని ఎవరు పరిపాలిస్తున్నారు?
సి) ఇటలీ ఏకీకరణను పూర్తిచేసిన వారెవరు?
డి) గ్రీకుల స్వాతంత్ర్య పోరాటం ఎప్పుడు ఆరంభమైంది?
జవాబు:
ఎ) వియన్నా సమావేశం 1815 వ సం||లో జరిగింది.
బి) 1848 విప్లవ కాలంలో ఫ్రాన్సును లూయి ఫిలిప్పీ పరిపాలిస్తున్నారు.
సి) ఇటలీ ఏకీకరణను పూర్తిచేసిన వారు విక్టర్ ఇమ్మాన్యుయెల్-II.
డి) గ్రీకు స్వాతంత్ర్య పోరాటం 1821 వ సం||లో ఆరంభమైనది.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

These AP 9th Class Social Important Questions 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 13th Lesson Important Questions and Answers 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

9th Class Social 13th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పౌరయుద్ధం అంటే ఏమిటి?
జవాబు:
ఒక దేశంలో జరిగే అంతర్యుద్ధాన్ని పౌర యుద్ధం అంటారు.

ప్రశ్న 2.
సుదీర్ఘ పార్లమెంట్ అని దేనిని అంటారు?
జవాబు:
1640 నుంచి 1660 వరకు కొనసాగిన పార్లమెంటును సుదీర్ఘ పార్లమెంట్ అంటారు.

ప్రశ్న 3.
రక్తరహిత విప్లవం అనగానేమి?
(లేదా)
ఇంగ్లండ్ విప్లవం ఎందువలన రక్తరహిత విప్లవంగా పిలవబడింది?
జవాబు:
ఇంగ్లండ్ విప్లవం ఎందువలన రక్తరహిత విప్లవంగా పిలువబడింది. అత్యున్నత అధికారాన్ని పార్లమెంటుకి బదిలీ చేశారు, ఈ మార్పులన్నీ ఒక్క తుపాకీ గుండు పేలకుండా, ఒక్క రక్తం బొట్టు చిందకుండా జరగడం వలన దానిని ‘మహోన్నత లేక రక్తరహిత విప్లవం’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 4.
ఎస్టేటులో ఎవరెవరు ఉండేవారు?
జవాబు:
మొదటి ఎస్టేటులో ‘మతాధిపతులు’, రెండవ ఎస్టేటులో ‘కులీన వర్గం’, మూడవ ఎస్టేటులో వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, రైతులు, చేతివృత్తి కళాకారులు, చిన్న రైతులు, భూమిలేని కూలీలు, సేవకులు ఉన్నారు.

ప్రశ్న 5.
‘టైద్’ అంటే ఏమిటి?
జవాబు:
‘టైద్’ అనగా చర్చి విధించిన పన్ను, దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చెల్లించాలి.

ప్రశ్న 6.
జూన్ 20న టెన్నిస్ కోర్టు మైదానంలో ఏం జరిగింది?
జవాబు:
టెన్నిస్ కోర్టు మైదానంలో జూన్ 20న మూడవ ఎస్టేట్ సభ్యులు సమావేశమయ్యారు. వాళ్లు తమను తాము జాతీయ శాసనసభగా ప్రకటించుకుని రాజు అధికారాలను పరిమితం చేసే రాజ్యాంగాన్ని తయారు చేసే దాకా విడిపోమని ప్రతినబూనారు.

ప్రశ్న 7.
కన్వెన్షన్ అని దేన్ని పిలవసాగారు?
జవాబు:
కొత్తగా ఎన్నికైన శాసనసభను ‘కన్వెన్షన్’ అని పిలవసాగారు.

ప్రశ్న 8.
డైరెక్టరీ అంటే ఏమిటి?
జవాబు:
అయిదుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గాన్ని (శాసనసభ) ఎన్నుకునే పాలన (జాకోబిన్ ప్రభుత్వం పడిపోవటంతో) ఫ్రాన్స్ లో ప్రారంభమయ్యింది. దీనినే ‘డైరెక్టరీ’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 9.
మహోన్నత విప్లవ ఫలితం ఏమిటి?
జవాబు:
రాజు నుండి అత్యున్నత అధికారం పార్లమెంటుకు బదిలీ చేయబడినది.

ప్రశ్న 10.
1793 నుండి 1794 వరకు ఫ్రాన్స్ లో భీతావహ పాలనగా పిలవబడింది. కారణం రాయండి.
జవాబు:

  1. ఫ్రెంచి పరిపాలనా కాలంలో విప్లవం అనంతరం ఫ్రాన్స్ లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘట్టం భీతావహ పాలన.
  2. ఇది 1793-1794 మధ్యలో జరిగింది. ఈ కాలంలో రాబిస్పియర్ తీవ్ర నియంత్రణ, శిక్షల విధానాన్ని ఈయన అనుసరించాడు.
  3. రిపబ్లిక్ కి శత్రువులుగా గుర్తించబడిన మత గురువులు, కులీనులు, రాజకీయ పార్టీ సభ్యులను అరెస్టు చేసి జైలుకు పంపించి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించి, నేరం రుజువైనచో “గిల్లెటిన్” ద్వారా చంపేసేవాళ్లు.
  4. ఖరీదైన తెల్ల పిండి (మైదా) వాడటాన్ని నిషేధించారు.

పట్టికను పరిశీలించి 11, 12 ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

లివర్లు ఫ్రాన్స్ లో ద్రవ్య కొలమానం (కరెన్సీ) 1794 నుంచి నిలిపివేయబడినది.
మతాధిపతులు చర్చిలో ప్రత్యేక విధులతో సంబంధం ఉన్న వ్యక్తుల బృందం.
టైద్ చర్చి విధించిన పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో పదవ వంతు చర్చికి చెల్లించాలి.
టెయిలే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను.
కులీనులు ధనిక భూస్వాములు, రాజకుటుంబీకులు, పాలకవర్గం.

ప్రశ్న 11.
చర్చిచే విధించబడిన పన్ను ఎంత శాతంగా ఉండేది?
జవాబు:
చర్చిచే విధించబడిన పన్ను టైడ్. దీని ప్రకారం ఉత్పత్తిలో పదవ వంతు చర్చికి చెల్లించాలి.

ప్రశ్న 12.
పై పట్టికలో ‘పన్ను’కి సంబంధించిన పదాలేవి?
జవాబు:
పన్నుకి సంబంధించిన పదాలు

  1. టైద్,
  2. టెయిలే.

ప్రశ్న 13.
అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ నినాదం ఏది?
జవాబు:
అమెరికా స్వాతంత్ర్య పోరాటంలోని ప్రముఖ నినాదమేమనగా “ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు”.

ప్రశ్న 14.
రక్తరహిత విప్లవము యొక్క విశిష్టత ఏమిటి?
జవాబు:
రక్తరహిత విప్లవం యొక్క విశిష్టత ఏమిటంటే అత్యున్నత అధికారాన్ని రాజు నుండి పార్లమెంటుకి బదిలీ చేయడం. ఈ పని ఒక్క తుపాకీ గుండు పేలకుండానే, ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా జరగడమే.

9th Class Social 13th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“మహోన్నత”, లేక “రక్తరహిత విప్లవం” అంటే ఏమిటి?
(లేదా)
“మహోన్నత లేదా రక్త రహిత విప్లవం” గురించి మీకేమి తెలియును ?
జవాబు:
చార్లెస్ – I మరణం తర్వాత 1688లో ఆరెంజ్ కి చెందిన విలియంని అతని భార్య మేరీని (చార్లెస్ – I మనవరాలు) ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్టించాల్సిందిగా పార్లమెంట్ కోరింది. అనంతరం ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. దీని ప్రకారం మంత్రులు పార్లమెంట్ కి జవాబుదారీగా ఉంటారు. రాజు అధికారాలను పరిమితం చేశారు. పార్లమెంటుకు సర్వోన్నత అధికారాన్ని ఇచ్చి ప్రజాస్వామ్యానికి దారివేశారు. రాజు అధికారం దైవదత్తం అయింది. కాక పార్లమెంట్ ఇచ్చినదిగా ఉంటుంది. అత్యున్నత అధికారం పార్లమెంట్ కి బదిలీ చేసారు. ఈ మార్పులన్నీ ఒక్క తుపాకీ గుండు పేలకుండా, ఒక్క రక్తం బొట్టు చిందించకుండా జరిగాయి. అందుకే ఈ మార్పుని మహోన్నత లేదా రక్తరహిత విప్లవం అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 2.
జాకోబిన్స్ క్లబ్ నాయకుడెవరు? ఇందులో సభ్యులెవరు?
(లేదా)
జాకోబిన్ క్లబ్బులు అనగా నేమి?
జవాబు:
ప్రభుత్వ విధానాలను చర్చించటానికి, తమ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోటానికి ప్రజలకు రాజకీయ చైతన్యంకై ఏర్పడ్డదే జాకోబిన్ క్లబ్. దీని నాయకుడు మాక్సిమిలియన్ రాబిస్పియర్.

ఇందులో ప్రధానంగా సమాజంలోని పేద ప్రజల నుంచి ఉండే వాళ్ళు. చిన్న దుకాణదారులు, చేతివృత్తులవాళ్ళు, చెప్పులు తయారుచేసే వాళ్ళు, వంటలు వండే వాళ్ళు, రోజువారీ కూలీవాళ్ళు సభ్యులు.

ప్రశ్న 3.
మూడవ ఎస్టేట్ లోని మహిళల జీవన చిత్రం ఏ విధంగా ఉండేది?
జవాబు:
మూడవ ఎస్టేట్ లోని మహిళలు జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది. బట్టలు కుట్టడం, ఉతకడం వంటి పనులు చేసేవాళ్ళు. బజారులో పూలు, పళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు లేదా ధనికుల ఇళ్లల్లో పనులు చేసేవాళ్ళు. అధికశాతం మహిళలకు చదువురాదు. పిల్లల సంరక్షణ, వంట, నీళ్ళు తేవడం, రొట్టె కోసం బారులలో నిలబడటం వంటి పనులు చేసేవాళ్ళు.

పురుషుల కంటే స్త్రీల వేతనాలు తక్కువగా ఉండేవి.

ప్రశ్న 4.
పౌరులకు 1791 రాజ్యాంగం ఇచ్చిన రాజకీయ హక్కులను (చూడండి – పేజీ 160 లోని బాక్స్) హక్కుల ప్రకటనలోని 1 నుంచి 6 అధికరణాలను పోల్చండి. రెండు పత్రాలలో సారూప్యత ఉందా? రెండూ ఒకే భావనను తెలియజేస్తున్నాయా?
జవాబు:
జాతీయ శాసనసభ 1791 లో రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారుచేసింది. దీని ప్రధాన ఉద్దేశం రాచరిక అధికారాలను పరిమితం చేయటం. ఈ అన్ని అధికారాలు ఒకే వ్యక్తి దగ్గర ఉండటానికి బదులు శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య విభజించారు. చట్టాలను చేసే అధికారాన్ని జాతీయ శాసనసభకు ఇచ్చింది. పౌరులందరికీ ఓటు హక్కు లేదు. 25 సం||లు పైబడి కనీసం 3 రోజులు కూలీ అంతకన్నా పన్ను, చెల్లిస్తున్న వారికే ఓటు అధికారం.

పౌరహక్కుల ప్రకటనలో పౌరులందరికీ సమాన హక్కులు అందరికీ ఉన్నాయి. చట్టం ప్రజల అభీష్టాన్ని వ్యక్తపరుస్తుంది. అందరూ సమానమే.

ఈ రెండింటి మధ్య కొన్ని విషయాలలో సారూప్యత మరి కొన్నింటిలో వైరుధ్యం కన్పిస్తుంది.

9th Class Social 13th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది చిత్రం 1791 నాటి ఫ్రెంచి రాజ్యాంగం అందించిన రాజ్యాంగ పరిపాలన వ్యవస్థను తెలియజేస్తుంది. పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1
ఎ) న్యాయవ్యవస్థను ఎన్నుకొనుటకు ఎవరు అధికారం కలిగి వున్నారు?
బి) పై రాజకీయ వ్యవస్థలో ఎవరు రాజు మరియు మంత్రులపై నియంత్రణాధికారం కలిగి ఉన్నారు?
సి) జాతీయ శాసనసభ చేసిన చట్టాలను “వీటో” చేసే అధికారం ఎవరికి కలదు?
డి) ఏ ప్రభుత్వ విభాగం చట్టాలు అమలు చేసే బాధ్యత కలిగి వుంది?
జవాబు:
ఎ) క్రియాశీలక పౌరులు – ఓటు హక్కు కలిగినవాళ్ళు.
బి) జాతీయ శాసనసభ రాజు మరియు మంత్రులపై నియంత్రణను కలిగి ఉంది.
సి) జాతీయ శాసనసభ చేసిన చట్టాలను ‘వీటో’ చేసే అధికారం రాజుకు కలదు.
డి) చట్టాలు అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక విభాగానికి కలదు.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 2.
పై (ప్రశ్న 1లోని) పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) “వీటో” అధికారం ఎవరికి ఉంటుంది?
బి) న్యాయమూర్తి ఎన్నికలలో ఓటు హక్కును ఎవరు కలిగి వుంటారు?
జవాబు:
ఎ) జాతీయ శాసనసభ చేసిన చట్టాలను ‘వీటో’ చేసే అధికారం రాజుకు కలదు.
బి) క్రియాశీలక పౌరులు – ఓటు హక్కు కలిగినవాళ్ళు.

ప్రశ్న 3.
ఫ్రెంచి మహిళలు ఏ హక్కుల కొరకు పోరాడారు ? భారతదేశం నేపథ్యంలో మహిళలకు ఆ హక్కులన్నీ ఇవ్వబడినవా? విశ్లేషించండి.
జవాబు:
1) ఫ్రెంచి మహిళలు ఓటు హక్కు కావాలని

2) శాసనసభకు పోటీ చేసే హక్కు కావాలని

3) రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని పోరాడారు.

అయితే భారతదేశ నేపథ్యంలో మహిళలకు ఆ పై పేర్కొన్న హక్కులన్నీ పొందారు. అయితే ఆ హక్కులు పొందే విషయంలో కొంత నిర్లక్ష్యం ఉంది అని చెప్పవచ్చు.

భారతీయ మహిళలు అందరికీ ఓటు హక్కును ఇవ్వడం జరిగింది.
4) శాసన సభలలో పోటీ చేసే హక్కు పొందినప్పటికీ ఇంకా భారతదేశ శాసనసభలలో మహిళల ప్రాధాన్యం చాలా తక్కువ ఉన్నది అని చెప్పవచ్చు.

5) ఇప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందలేదు.

6) రాజకీయ పదవులను చేపట్టే హక్కును మహిళలకు ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా రాజకీయ పదవులు చేపట్టే విషయంలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందని గమనించవచ్చు.

ప్రశ్న 4.
ఇవ్వబడిన సమాచారం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2
ఎ) మొదటి ఎస్టేట్ లో ఎవరు ఉంటారు?
బి) పై చార్టులో ఏ దేశ సమాచారం చూపబడింది?
సి) మూడవ ఎస్టేట్ లోని సంపన్న వర్గాలేవి?
డి) పై వారిలో పన్ను చెల్లించే వర్గమేది?
జవాబు:
ఎ) మొదటి ఎస్టేట్లో మతాధిపతులు ఉంటారు.

బి) పై చార్టులో ఫ్రాన్సు దేశపు సమాచారం చూపబడింది.

సి) మూడవ ఎస్టేటులో ఉన్న సంపన్నవర్గాల వారు :

  1. పెద్ద వ్యాపారస్తులు
  2. వాణిజ్యవేత్తలు
  3. న్యాయస్థాన అధికారులు
  4. న్యాయవాదులు

డి) పై వారిలో 3వ ఎస్టేటులోని ప్రజలు అందరూ ప్రభుత్వానికి పన్ను చెల్లించే వర్గం.

ప్రశ్న 5.
పై (ప్రశ్న 4లోని) పట్టికను చదివి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) ఫ్రెంచి సమాజం ఎన్ని ఎస్టేట్లుగా వర్గీకరించబడింది?
ii) ఫ్రెంచి సమాజంలోని అత్యున్నత వర్గమేది?
iii) మూడవ ఎస్టేట్ లోని సంపన్న వర్గాల వారెవరు?
iv) ఫ్రెంచి సమాజంలో ఏ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు?
జవాబు:
i) ఫ్రెంచి సమాజం మూడు ఎస్టేట్లుగా వర్గీకరించబడింది.
ii) ఫ్రెంచి సమాజంలోని అత్యున్నత వర్గం మతాధిపతులు.
iii) మూడవ ఎస్టేటులోని పెద్ద వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు సంపన్న వర్గాల వారు.
iv) ఫ్రెంచి సమాజంలో మూడవ ఎస్టేటు ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు.

ప్రశ్న 6.
పై (ప్రశ్న 4లోని) పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు యివ్వండి.
ఎ) ఫ్రెంచి సమాజము ఎన్ని వర్గాలుగా వర్గీకరించబడింది?
బి) మూడవ ఎస్టేటు అనగా ఎవరు ? అందులో ఎవరెవరు వుంటారు?
సి) 3వ ఎస్టేట్ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలేమిటి?
డి) ఫ్రెంచి సమాజంలో ఉన్నత వర్గం ఏది?
జవాబు:
ఎ) ఫ్రెంచి. సమాజం మూడు ఎస్టేట్లుగా వర్గీకరించబడింది.

బి) కొంతమంది ధనికులు, ఎక్కువ మంది పేదవారితో కూడినదే మూడవ ఎస్టేటు. మూడవ ఎస్టేటులో పెద్ద వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, స్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, రైతులు, చేతివృత్తులవారు, చిన్న రైతులు, భూమిలేని కూలీలు, సేవకులు ఉన్నారు.

సి) మూడవ ఎస్టేటు ప్రజల సమస్యలు :

  1. ప్రభుత్వం మరియు చర్చిచే విధించబడే పన్నుల భారం అధికం.
  2. ఎక్కువ రైతాంగానికి భూమి లేదు.
  3. ఆహారపు కొరత
  4. సమానత్వం లేకపోవడం మొదలైనవి.

డి) ఫ్రెంచి సమాజంలోని ఉన్నత వర్గం మతాధిపతులు.

AP 9th Class Social Important Questions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 7.
“1791లో ఫ్రెంచి విప్లవకారులు” మానవహక్కుల ప్రకటన తయారు చేస్తున్నప్పుడు ఫ్రెంచి మహిళలు చాలా మంది దానిని నిరసించి “మహిళల హక్కుల ప్రకటన”ను వేరేగా తయారు చేశారు. “మహిళలు స్వేచ్ఛా జీవులుగా జన్మించారు, హక్కులలో పురుషులతో సమానులుగా వుంటారు.”
పై పేరాగ్రాఫ్ ను ఆధారంగా చేసుకుని “మహిళలు ఓటు వేసే హక్కు” అనే అంశంపై మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యానించండి.
జవాబు:
మహిళలకు పురుషులతో పాటు సమానంగా ఓటు హక్కు కల్పించినట్లయితే వారు తమ ప్రతినిధిని ఎన్నుకోవడంలో తమ వంతు పాత్ర పోషించడమేకాక ఎవరైతే తమకు సరియైన నాయకుడో గమనించగలరు.

మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం వలన సమాజం అభివృద్ధి చెందుతుంది. కొన్ని సందర్భాలలో పురుషుల కన్నా మహిళల ఆలోచనా శక్తి చాలా పదునుగా అనిపిస్తుంది. వారికి సమాన హోదా కల్పించడం వల్ల సమాజంలోని అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని సమాజాభివృద్ధికి తోడ్పడతారు.

మహిళలకు ఓటు హక్కు కాకుండా శాసనసభలకు పోటీచేసే హక్కు మరియు అధికారాలను, పదవులను పొందే హక్కును కల్పించినట్లయితే పురుషులతో పాటు సమానంగా దేశాన్ని ముందుకు మరియు అభివృద్ధిలోనికి తీసుకు రావడానికి దోహదపడుతుంది.

మహిళల గొప్పతనం ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా బాగా లోతుగా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని విశ్లేషణ చేసి సరియైన నిర్ణయం తీసుకోగలరు.

నా అభిప్రాయంలో మహిళలకు ఓటు హక్కు కల్పించడం అనేది సరైన నిర్ణయం

ప్రశ్న 8.
క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

అంశం వివరణ
1. జాకోబిన్ రాజ్యాంగం ప్రజలందరికీ ఓటు వేసే హక్కు, తిరుగుబాటు చేసే హక్కులుంటాయి. ప్రజలకు పని లేదా జీవనోపాధిని కల్పించాలని పేర్కొంది.
2. కులీనవర్గం ఐరోపా ఖండంలో సామాజికంగా, రాజకీయంగా భూమి కలిగిన వర్గం. ఈ.వర్గ ప్రజలు ఒకే రకమైన జీవన విధానం కలిగి ఉండి, ఒకటిగా ఉండేవారు.
3. ఉదారవాదం జాతీయ సమైక్యతా భావనలకు ఉదారవాద సిద్ధాంతంతో దగ్గర సంబంధం ఉండేది. వ్యక్తిగత స్వేచ్ఛ, జాతీయతావాద చట్టం ముందు అందరూ సమానులుగా వుండడం అన్న వాటికి ఉదారవాదం ప్రతీకగా నిలిచింది.

ఎ) జాకోబిన్ రాజ్యాంగం ఏ దేశానికి చెందినది?
బి) జాతీయసమైక్యతా భావనలకు సామీప్యత కల్గిన సిద్ధాంతం ఏది?
సి) వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానమే అన్నవాటికి ఏది ప్రతీకగా నిలిచింది?
డి) ఒకే రకమైన జీవన విధానం కలిగిన వారెవరు?
జవాబు:
ఎ) జాకోబిన్ రాజ్యాంగం ఫ్రాన్సు దేశానికి చెందినది.
బి) జాతీయ సమైక్యతా భావనలకు ఉదారవాద సిద్ధాంతంతో దగ్గర సంబంధం ఉంది.
సి) వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానమే అన్న వాటికి ఉదారవాదం ప్రతీకగా నిలిచింది.
డి) కులీనవర్గం వారు’ ఒకే రకమైన జీవనవిధానం కలిగి యుండేవారు.

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

These AP 9th Class Social Important Questions 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 will help students prepare well for the exams.

AP Board 9th Class Social 12th Lesson Important Questions and Answers యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

9th Class Social 12th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పునరుజ్జీవనం అనగానేమి?
జవాబు:
యూరపులో (మధ్యయుగం, 1300 సం|| తరువాత) ఈ కాలంలో జరిగిన సాంస్కృతిక మార్పులను వివరించటానికి చరిత్రకారులు 19వ శతాబ్దం నుండి ‘పునరుజ్జీవనం’ అంటున్నారు. ఈ
(లేదా)
యూరప్ లో వచ్చిన ఒక కొత్త సాంస్కృతిక ఉద్యమాన్ని పునరుజ్జీవనం లేదా పునర్జన్మ అంటారు.

ప్రశ్న 2.
దృగ్గోచరం అంటే ఏమిటి?
జవాబు:
చిత్రంలో లోతు కూడా తెలిసేటట్లు చిత్రించే విధానం ‘దృగ్గోచరం’ అంటారు.
(లేదా )
దృగ్గోచరం : చిత్రంలో లోతు కూడా తెలిసేటట్లు చిత్రించే విధానం. దగ్గరగా ఉన్న వాటిని పెద్దగానూ, దూరంగా ఉన్న వాటిని చిన్నగానూ చూపించడం.

ప్రశ్న 3.
యథార్థవాదం అంటే ఏమిటి?
జవాబు:
శరీర నిర్మాణ శాస్త్రం, రేఖాగణితం, భౌతికశాస్త్రాలతో పాటు అందానికి సంబంధించిన బలమైన భావన. ఇటలీ కళలకు ఒక ప్రత్యేకత సమకూర్చింది, దీనిని యథార్థవాదం అన్నారు.
(లేదా)
కళాకారులు తమ చుట్టు ప్రక్కల ప్రకృతిని, ప్రజలను, ప్రదేశాలను పరిశీలించి వాటిని యథాతథంగా చిత్రీకరించడాన్ని ‘యధార్ధవాదం’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 4.
జెస్క్యూట్లు అంటే ఎవరు?
జవాబు:
లయోలా అనుచరులను జెస్క్యూట్లు అంటారు.

ప్రశ్న 5.
ప్రజా రంగం, వ్యవస్థీకృత రంగం అంటే ఏమిటి?
జవాబు:
‘ప్రజారంగం’ అంటే ప్రభుత్వం, వ్యవస్థీకృత మతం అన్న అర్థాన్ని సంతరించుకుంది. వ్యక్తిగత రంగం అంటే కుటుంబం, వ్యక్తిగత మతంగా పరిగణింపబడసాగింది.

9th Class Social 12th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింద ఇవ్వబడిన యూరప్ పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800
ఎ) కొలంబస్ తన ప్రయాణాన్ని ఏ దేశం నుంచి ప్రారంభించారు.
బి) భారతదేశానికి మొట్టమొదట సముద్ర మార్గాన్ని కనుగొన్న వారెవరు?
జవాబు:
ఎ) కొలంబస్ మొదటిసారిగా తన ప్రయాణాన్ని స్పెయిన్ దేశం నుండి ప్రారంభించారు.
బి) భారతదేశానికి మొదటిసారిగా సముద్ర మార్గమును వాస్కోడగామా 1498 వ సం||లో కనిపెట్టారు.

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 2.
థామస్ మూర్, ఎరాస్మస్ వంటి క్రైస్తవ మానవతావాదులు చర్చిని, మత గురువులను ఎందుకని విమర్శించారు?
జవాబు:

  1. చర్చి దురాశతో కూడిన వ్యవస్థగా మారిందన్నారు.
  2. సాధారణ ప్రజల నుంచి చర్చి తమచిత్తం వచ్చినట్లు డబ్బులు వసూలు చేస్తోందని విమర్శించారు.
  3. మత గురువులు బాగా వాడుకున్న పద్ధతుల్లో పాప పరిహార పత్రాలు అమ్మటం ఒకటని విమర్శించారు.
  4. ఈ పత్రాలను కొనుక్కొన్న వాళ్ళు తాము చేసిన పాపభారం నుంచి విముక్తులౌతారని చెప్పడం నమ్మక ద్రోహమని విమర్శించారు.

ప్రశ్న 3.
ప్రొటెస్టెంట్ సంస్కరణ వాదం ఎవరు ప్రవేశపెట్టారు? ఆయన అభిప్రాయాలు ఏవి?
జవాబు:
1517లో మార్టిన్ లూథర్ (1483-1546) అనే యువ మత గురువు కాథలిక్కు చర్చికి వ్యతిరేకంగా ప్రచారోద్యమం మొదలు పెట్టాడు. దేవునితో సంబంధం ఏర్పరచుకోవడానికి మత గురువు అవసరం లేదని అతడు ప్రచారం చేయసాగాడు. తన అనుచరులను దేవునిలో పూర్తి విశ్వాసముంచమని, విశ్వాసం ఒక్కటే సరైన జీవనం, స్వర్గ ప్రవేశం కల్పించగలదని చెప్పాడు. ఈ ఉద్యమాన్ని ప్రొటెస్టెంట్ సంస్కరణ వాదంగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 4.
కోపర్నికస్ సిద్ధాంతమేమి? దానిని “చర్చి” అధిపతులు ఎందుకు తిరస్కరించారు?
జవాబు:
సూర్యుడు చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలలో భూమి కూడా ఒకటని కోపర్నికస్ చెప్పాడు. బైబిలు, చర్చి బోధనలకు విరుద్ధంగా ఉందని ఈ కొత్త సిద్ధాంతాన్ని చర్చి తిరస్కరించింది. మనిషి కోసం చేసిన విశ్వానికి అతడు కేంద్రంగా లేక పోవడంతో అతడి హోదా పోతుందని చర్చి భావించింది.

9th Class Social 12th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
14వ మరియు 17వ శతాబాల నాటి పునరుజ్జీవనం, మధ్యయుగ కాలానికి మరియు ఆధునిక కాలానికి మధ్య వారధిగా పరిగణింపబడుతుంది. ఇది ఇటలీ నందు మధ్యయుగ చివరి కాలంలో సాంస్కృతిక విప్లవంగా ప్రారంభమైంది. తరువాత మిగతా ఐరోపా అంతట వ్యాపించింది.
“పునరుజ్జీవనం ఒక సాంస్కృతిక విప్లవం అనడాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు?” వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. మధ్యయుగం తర్వాత ఇటలీ మరియు యూరప్లో పరిస్థితులు మారుతూ వచ్చాయి.
  2. ప్రజలు చర్చి నియంత్రణ నుండి బయటపడి స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించసాగారు.
  3. యూరప్ లో పునరుజ్జీవనం పేరుతో ఒక సాంస్కృతిక ఉద్యమం మొదలైంది.
  4. ప్రజలు మతాధికారులను వ్యతిరేకించి హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభించారు.
  5. కళలు, చిత్రకళ, శిల్పం మరియు సాహిత్యంలో కొత్త కొత్త ధోరణులు అభివృద్ధి చెందసాగాయి.
  6. మానవతా వాద పండితులు అరబ్ సాహిత్యాన్ని, గ్రీకు, లాటిన్ భాషలలోకి అనువదించి అధ్యయనం చేశారు.
  7. ముద్రణా యంత్రం కనుగొనడం వలన ఒక దేశం నుండి మరొక దేశానికి భావజాల వ్యాప్తి జరిగి సాంస్కృతిక విప్లవానికి దారితీసింది.
  8. యథార్థ వాదం, మానవ శరీర నిర్మాణాన్ని అధ్యయనం చేయడం, చర్చి నియంత్రణ తొలగిపోవడం, నూతన ఆవిష్కరణలు జరగడం ఇవన్నీ పునరుజ్జీవన కాలంలోనే జరిగాయి. కాబట్టి దీనిని సాంస్కృతిక పునరుజ్జీవనంగా పిలవవచ్చు.

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 2.
“ముద్రణ, సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించడం 16వ శతాబ్దపు మహావిప్లవం” అచ్చు యంత్రం కనుగొనుట , మానవజీవితాలని ఎలా ప్రభావితం చేసింది?
జవాబు:
15 వ శతాబ్దం తరువాత చేతితో రాసిన పురాతన పుస్తకాలన్నింటిని ముద్రించారు. అచ్చు అయిన పుస్తకాలను కొనుక్కోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. అంతకు ముందెన్నడూ లేనంతగా భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తారంగా వ్యాపించడంతో కొత్త భావాలను ప్రచారం చేసే ముద్రిత పుస్తకాలు వెంటనే లక్షలాది పాఠకులను చేరుకున్నాయి. నిదానంగా ప్రజలలో చదివే అలవాటు పెరిగింది. ఇటలీ మానవతా సంస్కృతిపై ఆసక్తి కనపరిచిన లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలకు ముద్రిత పుస్తకాలపై ఆసక్తి పెరగడంతో 18 వ శతాబ్దం నాటికి కోట్ల కొలది పుస్తకాలు ప్రచురితమయ్యా యి.

అతితక్కువ సమయంలో శాస్త్రసాంకేతిక విజ్ఞానం, శిల్పం, సాహిత్యం, మానవతావాదం, అభివృద్ధి చెందిన భూగోళం, తత్వం, వైద్యశాస్త్ర మూలాలను చదవడం వల్ల అవి మానవ జీవనంలో ప్రముఖపాత్ర పోషించాయి. విశ్వరహస్యాలు, ఆవిష్కరణలు, నూతన సిద్ధాంతాలు, ప్రకృతి సమాజం, మూఢనమ్మకాలపై సమరం మొదలగు విషయాలు ముద్రిత పుస్తకాల ద్వారా వెలుగుచూపించి, మానవ అభ్యున్నతికి తోడ్పాటునందించాయి.

ప్రశ్న 3.
“మానవతా వాద సంస్కృతి అనగా చర్చి అధీనం నుండి బయటపడిన ఆధునిక మానవుని ఆలోచనలు” – మానవతావాద ఆలోచనలోని ముఖ్య అంశములేవి?
జవాబు:

  1. మానవతా వాద సంస్కృతిలోని ఒక అంశం మానవ జీవితాలపై మతం నియంత్రణ బలహీనమవ్వటం.
  2. భౌతిక సంపద, అధికారం, కీర్తి పట్ల ఇటలీ ప్రజలు బలంగా ఆకర్షింపబడ్డారు. అంతమాత్రం చేత వాళ్ళు మతాన్ని వ్యతిరేకించారని కాదు.
  3. అధికారం, సంపద, భౌతిక సుఖాలు వంటివి కోరుకోదగినవే కాని త్యజించవలసిన అవసరం లేదని వాళ్ళు భావించసాగారు.
  4. ఈ సమయంలో సత్ప్రవర్తనపై ఎక్కువ శ్రద్ధ కనపరచసాగారు.
  5. మర్యాదగా ఎలా మాట్లాడాలి, సరైన వస్త్రధారణ ఎలా ఉండాలి, సంస్కారవంతుడైన వ్యక్తి ఏ నైపుణ్యాలు అలవరచుకోవాలి వంటి వాటికి ప్రాధాన్యతనిచ్చారు.
  6. మానవతావాదం వల్ల డబ్బు, అధికారం, సంపాదించడం ద్వారా మాత్రమే కాకుండా ఇతరత్రా తమ జీవితాలను మలచుకునే సామర్థ్యం మనుషులకుందని నమ్మసాగారు.

ప్రశ్న 4.
మధ్య యుగాలు, ఆధునిక యుగం ఆరంభంలో ప్రపంచమంతటా మహిళలపై పురుషుల ఆధిపత్యం ఉండేది. ప్రస్తుత సమాజంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందా? వివరించంది.
జవాబు:
మధ్యయుగానికి, ఆధునిక యుగ ఆరంభానికి ప్రస్తుతానికి మహిళల పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి.

ఒకప్పుడు మహిళలపై పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. క్రమక్రమంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరియు మహిళల పోరాటాల కారణంగా మహిళల పరిస్థితులలో చాలా మార్పు వచ్చాయి.

ప్రస్తుతం మహిళలు స్వయం శక్తిగా ఎదుగుతున్నారు. విద్య, వైద్యం, అంతరిక్షం, వ్యవసాయం అన్ని రంగాలలో పురుషులతో సమానంగా అవకాశాలను పొందుతున్నారు. అంతేకాకుండా రాజకీయాలలో కొన్ని సందర్భాలలో అత్యున్నత పదవులను కూడా అలంకరించారు. కొన్ని సందర్భాలలో మహిళలు తీసుకున్న నిర్ణయాలే దేశాభివృద్ధికి ఉపయోగపడ్డాయి అని చెప్పవచ్చు. కొన్ని రంగాలలో పురుషుల కంటే మహిళలు ముందంజలో ఉన్నారు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అన్ని రంగాలలో మహిళలు పురుషులకంటే ఆధిక్యంలో ఉన్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలు పురుషుల వల్ల ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇంకా మన సమాజం పురుషాధిక్య సమాజమని కొన్ని సంఘటనలు మనకు గుర్తు చేస్తున్నాయి.

ప్రశ్న 5.

వాదము ముఖ్యాంశాలు
1. మానవతా వాదము – మధ్యయుగాల పండితుల మాదిరి మరణానంతర జీవితం గురించి కాక మానవతా వాదులు ప్రస్తుతం ప్రపంచం గురించి ఆసక్తి చూపేవారు.
– మనిషిని జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి సమస్తాన్ని, విజ్ఞానశాస్త్రం, కళలు వంటి వాటిని వీరు ముఖ్యమైనవిగా భావించేవారు.
2. యథార్థవాదము – మానవతావాద భావాలు చిత్రకళ, శిల్పకళలకు కూడా విస్తరించాయి.
– కళాకారులు తమ చుట్టు ప్రక్కల ప్రకృతిని, ప్రజలను, ప్రదేశాలను పరిశీలించి వాటిని యథాతథంగా చిత్రించడానికి ప్రయత్నించారు.
3. కాల్పనిక వాదము – సాంస్కృతిక ఉద్యమమైన కాల్పనిక వాదము ఒక ప్రత్యేక రకమైన జాతీయతా భావాన్ని పెంపొందించటానికి ప్రయత్నించింది.
– కాల్పనికవాద కవులు మరియు కళాకారులు, విజ్ఞానశాస్త్రము, హేతువులకు పెద్దపీట వేయడాన్ని విమర్శించారు.

పై సమాచారం ఆధారంగా దిగువ ప్రశ్నలకు జవాబులివ్వంది.
ఎ) ప్రస్తుత జీవితం కంటే మరణానంతర జీవితానికి ప్రాధాన్యతనిచ్చిన వారెవరు?
బి) మానవ జీవితాలపై మత నియంత్రణ బలహీన మవ్వటం ఏవాదంలో గమనించవచ్చు?
సి) “జీసస్ శరీరాన్ని ఒడిలో పెట్టుకొన్న మేరీ” యొక్క ప్రసిద్ధ శిల్పము ఏ వాదాన్ని ప్రతిబింబిస్తుంది?
ది) విజ్ఞానశాస్త్రానికి హెచ్చు ప్రాముఖ్యత నివ్వడాన్ని వ్యతిరేకించే వాదమేది?
జవాబు:
ఎ) మధ్యయుగాలలోని పండితులు
బి) మానవతా వాదం
సి) యథార్థవాదం
డి) కాల్పనిక వాదం

AP 9th Class Social Important Questions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

AP 9th Class Social Important Questions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

These AP 9th Class Social Important Questions 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 11th Lesson Important Questions and Answers ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

9th Class Social 11th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
MNREGA అంటే ఏమిటి?
జవాబు:
MNREGA – మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం.

ప్రశ్న 2.
సబ్సిడీ అంటే ఏమిటి?
జవాబు:
ఎరువులు, ఆహార ధాన్యాలు, డీజిల్ వంటి ప్రధాన వస్తువులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ధరలను తగ్గిస్తుంది. ఇందుకోసం ఆయా వస్తువులకయ్యే వ్యయంలో కొంత డబ్బును ప్రభుత్వం చెల్లిస్తుంది. దానిని సబ్సిడీ (రాయితీ) అంటారు.

ప్రశ్న 3.
ప్రభుత్వం వసూలు చేసే పన్నులు ఏవి?
జవాబు:
విలువ ఆధారిత పన్ను, సేవా పన్ను, ఎక్సెజ్ సుంకం, ఆదాయపు పన్ను, సంపద పన్ను, దిగుమతి సుంకం మొ||నవి. పన్నులను ప్రభుత్వం వసూలు చేస్తుంది.

AP 9th Class Social Important Questions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 4.
పన్నులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
పన్నులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు.

  1. ప్రత్యక్ష పన్నులు
  2. పరోక్ష పన్నులు

ప్రశ్న 5.
సేవా పన్ను అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సేవలపై విధించే పన్నును సేవాపన్ను అంటారు.
సేవా పన్నుకు ఉదాహరణలు : స్పీడ్ పోస్ట్, టెలిఫోన్, మొబైల్, హోటళ్లు, ఏ.సి., ప్రథమ శ్రేణి – రైల్వే ప్రయాణం

ప్రశ్న 6.
ప్రత్యక్ష పన్నులు అనగానేమి? వాటిలో ముఖ్యమైనవి ఏవి?
జవాబు:
వ్యక్తుల ఆదాయాలపై లేక కంపెనీలు, వ్యాపారాల్లో ఆర్జించే లాభాలపై నేరుగా విధించబడే పన్నులు ప్రత్యక్ష పన్నులు.

ప్రశ్న 7.
నల్లధనం అంటే ఏమిటి?
జవాబు:
ఆదాయాన్ని పైకి కనపడకుండా దాచి పెట్టిన (పన్ను కట్టకుండా) ధనాన్ని ‘నల్లధనం’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 8.
ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులకు ఉదాహరణలిమ్ము.
జవాబు:
ప్రత్యక్ష పన్నులకు
ఉదా : 1. ఆదాయం పన్ను
2. కార్పొరేట్ పన్ను

పరోక్ష పన్నులకు
ఉదా : 1. అమ్మకం పన్ను
2. దిగుమతి “పన్ను
3. సేవా పన్ను మొ||వి.

9th Class Social 11th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
రాఘవ నెలకు రూ|| 20,000 సంపాదిస్తాడు. కింది పట్టికలో అతని నెల వారి కుటుంబ ఖర్చు వివరాలు ఇవ్వడం జరిగింది. పట్టికను పరిశీలించి ప్రశ్నకు జవాబు రాయండి.

అంశం ఖర్చు (రూ||లలో) నెలకు
అద్దె 5,500
ఆహారం 5000
ఇద్దరు పిల్లల ఖర్చు 2500
రవాణా 4500 (75 రూ|| లీ. మరియు రోజుకు 2 లీ. చొప్పున)
ఆరోగ్యం 1000
ఇతరం 1500

ప్రభుత్వం పెట్రోలు ధర లీటరుకు రూ|| 3 పెంచాలని నిర్ణయించింది. ఈ పెరుగుదల రాఘవ కుటుంబ బడ్జెట్ పై మరియు కుటుంబ సభ్యులపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది?
జవాబు:

  1. పెట్రోల్ ధర పెరుగుదల ప్రతీ కుటుంబ బడ్జెట్ నీ ప్రభావితం చేస్తుంది.
  2. రాఘవ కుటుంబ బడ్జెట్ లోని రవాణా వ్యయం పెట్రోల్ ధర పెరగడం వలన 4680/- రూ చేరుకుంది.
  3. పెట్రోల్ ధర పెరగడం వలన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి.
  4. దానితో ఇతర అవసరాలపై చేసే వ్యయాన్ని బాగా తగ్గించుకోవాల్సి వస్తుంది. అది రాఘవ కుటుంబంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుంది.

9th Class Social 11th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
చిత్రము నందలి ఉదాహరణను వివరించుము. “వినియోగదారుడు – పరోక్ష పన్నుల” మధ్య గల పరస్పర సంబంధమును వివరించండి.
AP 9th Class Social Important Questions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు 1
జవాబు:
వస్తువుల ధరలకు అన్ని రకాల పన్నులు కలుస్తూ ఉంటాయి. కాని, కొన్ని ప్రత్యేక వస్తువులపై పన్నులు విధించడం వల్ల పెద్ద మొత్తం వస్తువుల ధరలు పెరుగుతాయి.
ఉదా :
సైకిళ్ళ తయారీకి ఉక్కు పైపులు కావాలి. ఉక్కు తయారీకి ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుము మరియు బొగ్గు కావాలి. ఒకవేళ ఇనుముపై ఎక్సైజ్ సుంకం పెరిగితే దాని ప్రభావం సైకిళ్ళ ధరపై ఉంటుంది. ఇనుముతో తయారయ్యే వస్తువులన్నింటి ధరలు పెరుగుతాయి. అంతేకాక ఉక్కును తయారు చేయడానికి ఇనుమునే ఉపయోగిస్తారు. కావున ఉక్కుతో తయారయ్యే వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతాయి. ఈ విధంగా ఇనుముపై పెంచిన పన్ను – పరోక్షంగా వినియోగదారుడిపై ప్రభావం చూపుతుంది.

AP 9th Class Social Important Questions Chapter 10 ధరలు – జీవనవ్యయం

AP 9th Class Social Important Questions Chapter 10 ధరలు – జీవనవ్యయం

These AP 9th Class Social Important Questions 10th Lesson ధరలు – జీవనవ్యయం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 10th Lesson Important Questions and Answers ధరలు – జీవనవ్యయం

9th Class Social 10th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బడ్జెట్ అనగానేమి?
జవాబు:
వచ్చే ఆదాయాన్ని, చేయబోయే వ్యయాన్ని వివరించే నివేదికను ‘బడ్జెట్’ అంటారు.

ప్రశ్న 2.
జీవన వ్యయం అనగానేమి?
జవాబు:
తమ నిత్యావసరాల కొరకు ప్రజలు చేసే ఖర్చును జీవన వ్యయం అంటారు.

ప్రశ్న 3.
ద్రవ్యోల్బణం అనగానేమి?
జవాబు:
నిరంతర ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు.

ప్రశ్న 4.
అధార సంవత్సరం అనగానేమి?
జవాబు:
ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరలను ఆధార సంవత్సరం అంటారు. దానిని 100 సంఖ్యతో సూచిస్తారు.

AP 9th Class Social Important Questions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 5.
ఆహార ద్రవ్యోల్బణం అనగానేమి?
జవాబు:
ఆహార పదార్థాల ధరలలో పెరుగుదలను ఆహార ద్రవ్యోల్బణం అంటారు.

ప్రశ్న 6.
PDS పని ఏమిటి?
జవాబు:
PDS (Public Distribution System) ద్వారా ప్రభుత్వం నిత్యావసర వస్తువులైన గోధుమ, వరి, పంచదార, వంటనూనెలు, కిరోసిన్లను పంపిణీ బాధ్యతను చేపట్టింది.

9th Class Social 10th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలే మిగతా అన్ని ధరలు పెంచే విధంగా చేసింది. ఉదా : పండ్లు, కూరగాయలు, పప్పులు, ఇతర ఆహార వస్తువులు కొరకు ఎక్కువ ఖర్చు అవుతుంది.”
పై అంశంపై వ్యాఖ్యానించండి.
జవాబు:
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వలన మన నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి అనేది పైన వివరించబడింది. దానితో నేను ఏకీభవిస్తున్నాను.

పెట్రోల్ మరియు డీజిల్ లను మనం ఇతర దేశాల నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. సాధారణంగా వీటి ధరలు పెరగడంతో రవాణా ఖర్చు పెరుగుతుంది. ఎందుకనగా మనం మన నిత్యావసరాలను వివిధ ప్రాంతాల నుండి తెచ్చుకోవడం జరుగుతుంది. దాని వలన మన వస్తువుల ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి.

నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన ప్రతిసారీ భారతదేశంలో పేదరిక స్థాయి పెరుగుతుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మన జీతాలు, ఆదాయలు పెరగక కొన్ని సందర్భాలలో ప్రజలు నిత్యావసరాలు కూడా కొనలేని స్థితిలో ఉంటున్నారు.

కావున ప్రభుత్వం నిత్యావసరాల ధరలు ఎక్కువగా పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే వాటికి కూడా సబ్సిడీని అందించాలి.

AP 9th Class Social Important Questions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 2.
500, 1000 రూపాయల నోట్లను ఇటీవల రద్దుపరిచారు. ఈ చర్య భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత వరకూ ఉపయోగ పడుతుందని నీవు భావిస్తున్నావు?
జవాబు:

  1. నల్లధనాన్ని వెలికితీసి దానిని సద్వినియోగపరచాలి అనేది నోట్ల రద్దు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
  2. భారతదేశంలో జరుగుతున్న అవినీతి, అక్రమమైన, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టడం కోసం నోట్ల రద్దు చేయడం జరిగింది.
  3. ప్రజలు సక్రమంగా పన్నులు చెల్లించాలి అనేది ముఖ్య ఉద్దేశం.

పైన అనుకున్న కార్యక్రమాలు కొంతవరకు మాత్రమే జరిగాయి.

నోట్ల రద్దు వలన చాలా మంది సామాన్య ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఒక 20% మాత్రమే ఈ నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడింది. 80% ఈ చర్య విఫలమై ప్రజలు ముఖ్యంగా మధ్య తరగతి, సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురికావడం జరిగింది.

AP 9th Class Social Important Questions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

AP 9th Class Social Important Questions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

These AP 9th Class Social Important Questions 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 9th Lesson Important Questions and Answers ద్రవ్య వ్యవస్థ – ఋణం

9th Class Social 9th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
డబ్బు యొక్క ఆధునిక రూపాలు ఏవి?
జవాబు:
బ్యాంకు జమలు, కరెన్సీ నోట్లు, నాణాలు డబ్బు యొక్క ఆధునిక రూపాలు.

ప్రశ్న 2.
డిమాండ్ డిపాజిట్లు అని వేటిని అంటారు?
జవాబు:
డిమాండు చేసినపుడు బ్యాంకు ఖాతాల నుండి డబ్బును వాపసు తీసుకొనే సౌలభ్యం ఉండటం వలన ఈ డిపాజిట్ ను (డబ్బు జమ) ‘డిమాండ్ డిపాజిట్లు’ అంటారు.

ప్రశ్న 3.
రుణ విషయంలో జరిగే ఒప్పందం ఏది?
జవాబు:
రుణదాత నుండి రుణాన్ని డబ్బుగాగానీ, వస్తువులు లేదా సేవల రూపంలో కానీ రుణగ్రహీత పొందుతూ, తీసుకున్న రుణాన్ని భవిష్యత్ లో తిరిగి చెల్లిస్తానని హామీని ఇవ్వడం వారిద్దరి మధ్య రుణ విషయంలో జరిగే ఒప్పందం.

AP 9th Class Social Important Questions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 4.
అప్పుల్లో చిక్కుకోవడం అంటే ఏమిటి?
జవాబు:
ఒక్కోసారి పంట పండక పోవడంతో అప్పును తిరిగి చెల్లించడం కోసం తమకున్న భూమిలో సగం భూమిని అమ్మివేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని “అప్పుల్లో చిక్కుకోవడం” అంటారు.

ప్రశ్న 5.
నియత రుణాలు అంటే ఏమిటి?
జవాబు:
బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలను నియత రుణాలు అంటారు.

ప్రశ్న 6.
అనియత రుణాలు అంటే ఏమిటి?
జవాబు:
వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, యజమానులు, బంధువులు, స్నేహితులు మొదలగు వారిచ్చే రుణాలను అనియత రుణాలు అంటారు.

ప్రశ్న 7.
‘నోఫిల్స్ ఎకౌంట్స్’ అనగానేమి?
జవాబు:
బ్యాంకులలో ఖాతాలను నిర్వహించుకొనేందుకు కనీస బ్యాలెన్స్ (నిల్వలు) ఉంచవలసిన నిబంధనను తొలగించి మనం ఇష్టానుసారం బ్యాలెన్స్ ఉంచుకొనేందుకు అనుమతినిస్తున్నారు. ఈ ఖాతాలను “నోఫిల్స్ ఎకౌంట్స్” అంటారు.

ప్రశ్న 8.
NABARD ను విస్తరించండి.
జవాబు:
NABARD : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్.

ప్రశ్న 9.
స్వయం సహాయక బృందాలు మహిళలకు ఎలా తోడ్పడతాయి?
జవాబు:
మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా సామాజిక సమస్యల (గృహహింస, ఆరోగ్యం, పోషణపరిష్కార దిశగా కూడా ఈ బృందాలు తోడ్పడతాయి.

AP 9th Class Social Important Questions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 10.
S.L.B.C. ని విస్తరించండి.
జవాబు:
స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (S.L.B.C.)

9th Class Social 9th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పేద మహిళల ఆర్థిక అవసరాలు తీర్చడంలో, స్వయం సహాయక బృందాలు పోషిస్తున్న పాత్రను మీరు ఏ విధంగా ప్రశంసిస్తారు?
జవాబు:
పేద మహిళల ఆర్థిక అవసరాలు తీర్చడంలో స్వయం సహాయక బృందాలు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ఎందుకనగా, మహిళల కుటుంబ అవసరాలను తీర్చడం నిమిత్తం వారికి పశువులను కొనివ్వడం, కుట్టుమిషన్లను లోనులో ఇవ్వడం వంటివి చేస్తున్నాయి. వారిచే నూతన చిరు వ్యాపారాలను ప్రారంభించడానికి వారికి ఋణాలను ఇస్తారు. అంతేకాక మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమేకాక వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస మొదలయిన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే విధంగా కూడా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.

ప్రశ్న 2.
ఆర్థిక అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ ఆర్థిక అవసరాలపై జ్ఞానాన్ని కల్గించి, ఆర్థికపర నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుంది. ఆర్థిక అక్షరాస్యతపై ఆసక్తి, ఆర్థిక పరమైన ప్రణాళికలకు, ఉన్నతమైన ఆర్థిక లక్ష్యాలకు, రుణాలు, పొరపాట్ల నుండి రక్షణకు దోహదం చేస్తుంది. పొదుపు చేసే అలవాటును పెంపొందించడం, డబ్బును సమర్థంగా వినియోగించడం దీని ఉద్దేశ్యం. ఆర్థిక సేవల పట్ల అవగాహనను కల్పిస్తుంది.
“ఆర్థిక అక్షరాస్యత వినియోగదారులకు రక్షణ, ఆర్థిక స్థిరత్వానికి అత్యంత అవసరం” – వ్యాఖ్యానించండి.
జవాబు:
ఆర్థిక అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ ఆర్థిక అవసరాలపై జ్ఞానాన్ని కల్గించి, ఆర్థిక పర నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుంది.

ఆర్థిక అక్షరాస్యతపై ఆసక్తి ఉంటే అది ఆర్థికపరమైన ప్రణాళికలకు, ఉన్నతమైన ఆర్థిక లక్ష్యాలకు, రుణాలు, పొరపాట్ల నుండి రక్షణకు దోహదం చేస్తుంది.

  1. ఆర్థిక అక్షరాస్యత వలన నియత ఆర్థిక సంస్థల సేవలు, ప్రయోజనాలు, వాటి ఉత్పత్తులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  2. అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలకు, నియత సంస్థల రుణాలు పొందనివారికి. ఆర్థిక అక్షరాస్యత సహాయపడుతుంది.
  3. ఆర్థిక మార్కెట్ల పోకడలు అర్థంకాని ఈ రోజుల్లో సామాన్య మానవుడు కూడా తన స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక అక్షరాస్యత సహాయం చేస్తుంది.
  4. ప్రజలు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన మార్గదర్శకాలను అందిస్తుంది.

AP 9th Class Social Important Questions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 3.
ప్రజల నుండి సేకరించిన డిపాజిట్లతో బ్యాంకులు ఏమి చేస్తాయి?
జవాబు:
ప్రజలు డిపాజిట్ల ద్వారా జమ చేసిన నగదులో కొద్ది భాగాన్ని మాత్రమే బ్యాంకులు తమ దగ్గర ఉంచుకుంటాయి. అంటే 15% మాత్రమే తమ దగ్గర ఉంచుకుంటాయి. అవి కూడా ఖాతాదారులు అడిగితే చెల్లించడం కోసం.

జమ అయిన నగదులో అధిక భాగాన్ని రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వినియోగిస్తాయి.

9th Class Social 9th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బ్యాంకులు తమ వినియోగదారులకు అందిస్తున్న వివిధ రకాల సేవలు ఏమిటి?
జవాబు:

  1. బ్యాంకులు వినియోగదారులకు పొదుపు చేసిన సొమ్ముని డిపాజిట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తాయి.
  2. వ్యవసాయ రుణాలు, విద్యా రుణాల వంటి అనేక రకాల రుణాలను కల్పిస్తాయి.
  3. పొదుపు సొమ్మును దాచుకునేందుకు వీలుగా సేవింగ్స్ అకౌంట్లను నడుపుతాయి.
  4. వారి విలువైన వస్తువులను దాచుకునేందుకు వీలుగా సేఫ్టీ లాకర్ సౌకర్యం కలిగిస్తాయి.
  5. తక్కువ వడ్డీకి గృహ రుణాలను అందిస్తాయి.
  6. దూర ప్రాంతాలలో ఉండే సంస్థలకు చెల్లింపులు చేసేందుకు వీలుగా డిడిలూ, చెట్లను జారీ చేస్తాయి.
  7. బ్యాంకుకి రాకుండానే ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకునే విధంగా డెబిట్, క్రెడిట్ కార్డులనూ, ఏటిఎం కార్డులనూ జారీ చేస్తాయి.
  8. ప్రస్తుత కాలంలో బ్యాంకులు ఆన్ లైన్ ద్వారా అన్ని రకాల బిల్లుల చెల్లింపు, షాపింగ్ వంటి అనేక సౌకర్యాలు కలిగిస్తున్నాయి.

AP 9th Class Social Important Questions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

AP 9th Class Social Important Questions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

These AP 9th Class Social Important Questions 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 8th Lesson Important Questions and Answers భారతదేశంలో సేవా కార్యకలాపాలు

9th Class Social 8th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సేవారంగానికి చెందిన కార్యకలాపాలేవి?
జవాబు:
సేవా కార్యకలాపం’ అనగా సేవలు చేయడం. రవాణా, కమ్యూనికేషన్, విద్య, వైద్య, ద్రవ్యం, బీమా, బ్యాంకింగ్, ప్రభుత్వ పాలన, కంప్యూటర్స్ సేవలు, వర్తకవాణిజ్యాలు, రక్షణ మొ||3వన్నీ సేవారంగానికి చెందిన కార్యకలాపాలే.

ప్రశ్న 2.
సేవా రంగాల అవసరమేమిటి?
జవాబు:
సేవా కార్యకలాపాలు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైనటువంటివి. ఆయా రంగాలలో ఉత్పత్తి జరగాలంటే సేవా కార్యకలాపాలనేవి అవసరము.

ప్రశ్న 3.
సేవారంగం నియాతుకం ఎలా ఉంటుంది?
జవాబు:
సేవారంగంలో ఉన్న ఉత్పత్తిదారులు అధిక మొత్తంలో యంత్రాలను, ఉపకరణాలను, చాలా తక్కువ సంఖ్యలో అత్యంత నిపుణులైన వ్యక్తులను నియమించుకుంటారు.

AP 9th Class Social Important Questions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 4.
ఇటీవల కాలంలో నగరాలలో ఉద్యోగావకాశాలు కల్పించేవి ఏవి?
జవాబు:
ఇటీవల కాలంలో పొరుగు సేవలు, సమాచార సాంకేతిక రంగం, వార్తా ప్రసారాల సంస్థలు, వినోద పరిశ్రమ, పట్టణాలు, నగరాలలో ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి.

ప్రశ్న 5.
చాలా పరిశ్రమలు తమ కార్యకలాపాలలో అధిక భాగాన్ని సేవారంగం వైపు ఎందుకు మళ్ళించాయి?
జవాబు:
సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, పారిశ్రామిక రంగంలో ఉన్న గట్టి పోటీ వల్ల చాలా పరిశ్రమలు తమ కార్యకలాపాలలో అధిక భాగాన్ని సేవా రంగం వైపు మళ్ళించాయి.

ప్రశ్న 6.
ఇతరాలను పొరుగు సేవలనుండి పొందే సంస్థలు ఏవి?
జవాబు:
అనేక వస్తు తయారీ సంస్థలు పరిశోధనా, అభివృద్ధి, ఖాతాల నిర్వహణ, న్యాయపరమైన, సేవలు, వినియోగదారుల సేవలు, ప్రజా సంబంధాలకు సంబంధించిన సేవలు, భద్రతా సిబ్బంది, ఇతరాలను ‘పొరుగు సేవ’ల నుండి పొందుతున్నాయి.

ప్రశ్న 7.
పారామెడి లని ఎవరిని అంటారు?
జవాబు:
అనుబంధ వైద్య వృత్తి నిపుణులను ‘పారామెడిక్’లంటున్నారు.

ప్రశ్న 8.
ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి?
జవాబు:
ఆర్థిక పేరుగుదలతోపాటు సంస్థాగత మార్పులలో కూడా పెరుగుదల సాధించితే దానిని ఆర్థికాభివృద్ధి అంటారు.

ప్రశ్న 9.
చిల్లర వర్తకం అంటే ఏమిటి?
జవాబు:
వినియోగదారులకు నేరుగా వస్తువులను విక్రయించే వర్తకాన్ని ‘చిల్లర వర్తకం’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 10.
బహుళజాతి కంపెనీలు అనగానేమి?
జవాబు:
వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలను బహుళజాతి కంపెనీలు (MNC) అంటారు.

ప్రశ్న 11.
‘పొరుగు సేవలు’ అంటే ఏవి?
జవాబు:
ఒక సంస్థకు అవసరమైన సేవలను తక్కువ ఖర్చుతో బయటి నుండి పొందటాన్ని పొరుగు సేవలు (out sourcing) అంటారు.

9th Class Social 8th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
1991 నుండి 2010 వరకు ప్రభుత్వ వ్యవస్థలో వివిధ సేవా కార్యక్రమాలలో పని చేసేవారి సంఖ్య (లక్షలలో) ఈ క్రింది పట్టిక చూపుతుంది. ఈ పట్టికను జాగ్రత్తగా పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సేవారంగ కార్యకలాపాలు ప్రభుత్వ ఉద్యోగాలు
1991 2010
టోకు వర్తకం, చిల్లర వర్తకం 1.5 1.7
రవాణా గిడ్డంగులు, సమాచార రంగం 30.3 25.3
విత్త, బీమాసంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొ|| 11.9 14.1
సామాజిక, సాంఘిక వ్యక్తిగత సేవలు 92.3 90.5

అ) ఏ సేవారంగ కార్యకలాపం అతి తక్కువ ఉపాధిని కల్పించినది?
ఆ) సామాజిక, సాంఘిక మరియు వ్యక్తిగత సేవలకు సంబంధించిన ఏవేని రెండు ఉద్యోగాలను రాయండి.
ఇ) 2010 నాటికి ఏ రకమైన సేవారంగ కార్యకలాపంలో అత్యధిక తగ్గుదల కనిపిస్తున్నది?
ఈ) 2010 సం||లో ఏ ప్రభుత్వ సేవారంగ కార్యకలాపాల ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కల్పించబడ్డాయి?
జవాబు:
అ) టోకు వర్తకం, చిల్లర వర్తకం
ఆ) బ్యూటీ పార్లర్ నడిపేవారు, టైలరింగ్ పనివారు, బట్టలు ఉతికేవారు, ఫోటో స్టూడియో నడిపేవారు, క్షురకులు, ఇతర పనులు చేసేవారు.
ఇ) రవాణా, గిడ్డంగులు, సమాచార రంగం.
ఈ) సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు.