AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

These AP 9th Class Social Important Questions 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 will help students prepare well for the exams.

AP Board 9th Class Social 12th Lesson Important Questions and Answers యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

9th Class Social 12th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పునరుజ్జీవనం అనగానేమి?
జవాబు:
యూరపులో (మధ్యయుగం, 1300 సం|| తరువాత) ఈ కాలంలో జరిగిన సాంస్కృతిక మార్పులను వివరించటానికి చరిత్రకారులు 19వ శతాబ్దం నుండి ‘పునరుజ్జీవనం’ అంటున్నారు. ఈ
(లేదా)
యూరప్ లో వచ్చిన ఒక కొత్త సాంస్కృతిక ఉద్యమాన్ని పునరుజ్జీవనం లేదా పునర్జన్మ అంటారు.

ప్రశ్న 2.
దృగ్గోచరం అంటే ఏమిటి?
జవాబు:
చిత్రంలో లోతు కూడా తెలిసేటట్లు చిత్రించే విధానం ‘దృగ్గోచరం’ అంటారు.
(లేదా )
దృగ్గోచరం : చిత్రంలో లోతు కూడా తెలిసేటట్లు చిత్రించే విధానం. దగ్గరగా ఉన్న వాటిని పెద్దగానూ, దూరంగా ఉన్న వాటిని చిన్నగానూ చూపించడం.

ప్రశ్న 3.
యథార్థవాదం అంటే ఏమిటి?
జవాబు:
శరీర నిర్మాణ శాస్త్రం, రేఖాగణితం, భౌతికశాస్త్రాలతో పాటు అందానికి సంబంధించిన బలమైన భావన. ఇటలీ కళలకు ఒక ప్రత్యేకత సమకూర్చింది, దీనిని యథార్థవాదం అన్నారు.
(లేదా)
కళాకారులు తమ చుట్టు ప్రక్కల ప్రకృతిని, ప్రజలను, ప్రదేశాలను పరిశీలించి వాటిని యథాతథంగా చిత్రీకరించడాన్ని ‘యధార్ధవాదం’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 4.
జెస్క్యూట్లు అంటే ఎవరు?
జవాబు:
లయోలా అనుచరులను జెస్క్యూట్లు అంటారు.

ప్రశ్న 5.
ప్రజా రంగం, వ్యవస్థీకృత రంగం అంటే ఏమిటి?
జవాబు:
‘ప్రజారంగం’ అంటే ప్రభుత్వం, వ్యవస్థీకృత మతం అన్న అర్థాన్ని సంతరించుకుంది. వ్యక్తిగత రంగం అంటే కుటుంబం, వ్యక్తిగత మతంగా పరిగణింపబడసాగింది.

9th Class Social 12th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింద ఇవ్వబడిన యూరప్ పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800
ఎ) కొలంబస్ తన ప్రయాణాన్ని ఏ దేశం నుంచి ప్రారంభించారు.
బి) భారతదేశానికి మొట్టమొదట సముద్ర మార్గాన్ని కనుగొన్న వారెవరు?
జవాబు:
ఎ) కొలంబస్ మొదటిసారిగా తన ప్రయాణాన్ని స్పెయిన్ దేశం నుండి ప్రారంభించారు.
బి) భారతదేశానికి మొదటిసారిగా సముద్ర మార్గమును వాస్కోడగామా 1498 వ సం||లో కనిపెట్టారు.

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 2.
థామస్ మూర్, ఎరాస్మస్ వంటి క్రైస్తవ మానవతావాదులు చర్చిని, మత గురువులను ఎందుకని విమర్శించారు?
జవాబు:

  1. చర్చి దురాశతో కూడిన వ్యవస్థగా మారిందన్నారు.
  2. సాధారణ ప్రజల నుంచి చర్చి తమచిత్తం వచ్చినట్లు డబ్బులు వసూలు చేస్తోందని విమర్శించారు.
  3. మత గురువులు బాగా వాడుకున్న పద్ధతుల్లో పాప పరిహార పత్రాలు అమ్మటం ఒకటని విమర్శించారు.
  4. ఈ పత్రాలను కొనుక్కొన్న వాళ్ళు తాము చేసిన పాపభారం నుంచి విముక్తులౌతారని చెప్పడం నమ్మక ద్రోహమని విమర్శించారు.

ప్రశ్న 3.
ప్రొటెస్టెంట్ సంస్కరణ వాదం ఎవరు ప్రవేశపెట్టారు? ఆయన అభిప్రాయాలు ఏవి?
జవాబు:
1517లో మార్టిన్ లూథర్ (1483-1546) అనే యువ మత గురువు కాథలిక్కు చర్చికి వ్యతిరేకంగా ప్రచారోద్యమం మొదలు పెట్టాడు. దేవునితో సంబంధం ఏర్పరచుకోవడానికి మత గురువు అవసరం లేదని అతడు ప్రచారం చేయసాగాడు. తన అనుచరులను దేవునిలో పూర్తి విశ్వాసముంచమని, విశ్వాసం ఒక్కటే సరైన జీవనం, స్వర్గ ప్రవేశం కల్పించగలదని చెప్పాడు. ఈ ఉద్యమాన్ని ప్రొటెస్టెంట్ సంస్కరణ వాదంగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 4.
కోపర్నికస్ సిద్ధాంతమేమి? దానిని “చర్చి” అధిపతులు ఎందుకు తిరస్కరించారు?
జవాబు:
సూర్యుడు చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలలో భూమి కూడా ఒకటని కోపర్నికస్ చెప్పాడు. బైబిలు, చర్చి బోధనలకు విరుద్ధంగా ఉందని ఈ కొత్త సిద్ధాంతాన్ని చర్చి తిరస్కరించింది. మనిషి కోసం చేసిన విశ్వానికి అతడు కేంద్రంగా లేక పోవడంతో అతడి హోదా పోతుందని చర్చి భావించింది.

9th Class Social 12th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
14వ మరియు 17వ శతాబాల నాటి పునరుజ్జీవనం, మధ్యయుగ కాలానికి మరియు ఆధునిక కాలానికి మధ్య వారధిగా పరిగణింపబడుతుంది. ఇది ఇటలీ నందు మధ్యయుగ చివరి కాలంలో సాంస్కృతిక విప్లవంగా ప్రారంభమైంది. తరువాత మిగతా ఐరోపా అంతట వ్యాపించింది.
“పునరుజ్జీవనం ఒక సాంస్కృతిక విప్లవం అనడాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు?” వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. మధ్యయుగం తర్వాత ఇటలీ మరియు యూరప్లో పరిస్థితులు మారుతూ వచ్చాయి.
  2. ప్రజలు చర్చి నియంత్రణ నుండి బయటపడి స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించసాగారు.
  3. యూరప్ లో పునరుజ్జీవనం పేరుతో ఒక సాంస్కృతిక ఉద్యమం మొదలైంది.
  4. ప్రజలు మతాధికారులను వ్యతిరేకించి హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభించారు.
  5. కళలు, చిత్రకళ, శిల్పం మరియు సాహిత్యంలో కొత్త కొత్త ధోరణులు అభివృద్ధి చెందసాగాయి.
  6. మానవతా వాద పండితులు అరబ్ సాహిత్యాన్ని, గ్రీకు, లాటిన్ భాషలలోకి అనువదించి అధ్యయనం చేశారు.
  7. ముద్రణా యంత్రం కనుగొనడం వలన ఒక దేశం నుండి మరొక దేశానికి భావజాల వ్యాప్తి జరిగి సాంస్కృతిక విప్లవానికి దారితీసింది.
  8. యథార్థ వాదం, మానవ శరీర నిర్మాణాన్ని అధ్యయనం చేయడం, చర్చి నియంత్రణ తొలగిపోవడం, నూతన ఆవిష్కరణలు జరగడం ఇవన్నీ పునరుజ్జీవన కాలంలోనే జరిగాయి. కాబట్టి దీనిని సాంస్కృతిక పునరుజ్జీవనంగా పిలవవచ్చు.

AP 9th Class Social Important Questions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 2.
“ముద్రణ, సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించడం 16వ శతాబ్దపు మహావిప్లవం” అచ్చు యంత్రం కనుగొనుట , మానవజీవితాలని ఎలా ప్రభావితం చేసింది?
జవాబు:
15 వ శతాబ్దం తరువాత చేతితో రాసిన పురాతన పుస్తకాలన్నింటిని ముద్రించారు. అచ్చు అయిన పుస్తకాలను కొనుక్కోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. అంతకు ముందెన్నడూ లేనంతగా భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తారంగా వ్యాపించడంతో కొత్త భావాలను ప్రచారం చేసే ముద్రిత పుస్తకాలు వెంటనే లక్షలాది పాఠకులను చేరుకున్నాయి. నిదానంగా ప్రజలలో చదివే అలవాటు పెరిగింది. ఇటలీ మానవతా సంస్కృతిపై ఆసక్తి కనపరిచిన లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలకు ముద్రిత పుస్తకాలపై ఆసక్తి పెరగడంతో 18 వ శతాబ్దం నాటికి కోట్ల కొలది పుస్తకాలు ప్రచురితమయ్యా యి.

అతితక్కువ సమయంలో శాస్త్రసాంకేతిక విజ్ఞానం, శిల్పం, సాహిత్యం, మానవతావాదం, అభివృద్ధి చెందిన భూగోళం, తత్వం, వైద్యశాస్త్ర మూలాలను చదవడం వల్ల అవి మానవ జీవనంలో ప్రముఖపాత్ర పోషించాయి. విశ్వరహస్యాలు, ఆవిష్కరణలు, నూతన సిద్ధాంతాలు, ప్రకృతి సమాజం, మూఢనమ్మకాలపై సమరం మొదలగు విషయాలు ముద్రిత పుస్తకాల ద్వారా వెలుగుచూపించి, మానవ అభ్యున్నతికి తోడ్పాటునందించాయి.

ప్రశ్న 3.
“మానవతా వాద సంస్కృతి అనగా చర్చి అధీనం నుండి బయటపడిన ఆధునిక మానవుని ఆలోచనలు” – మానవతావాద ఆలోచనలోని ముఖ్య అంశములేవి?
జవాబు:

  1. మానవతా వాద సంస్కృతిలోని ఒక అంశం మానవ జీవితాలపై మతం నియంత్రణ బలహీనమవ్వటం.
  2. భౌతిక సంపద, అధికారం, కీర్తి పట్ల ఇటలీ ప్రజలు బలంగా ఆకర్షింపబడ్డారు. అంతమాత్రం చేత వాళ్ళు మతాన్ని వ్యతిరేకించారని కాదు.
  3. అధికారం, సంపద, భౌతిక సుఖాలు వంటివి కోరుకోదగినవే కాని త్యజించవలసిన అవసరం లేదని వాళ్ళు భావించసాగారు.
  4. ఈ సమయంలో సత్ప్రవర్తనపై ఎక్కువ శ్రద్ధ కనపరచసాగారు.
  5. మర్యాదగా ఎలా మాట్లాడాలి, సరైన వస్త్రధారణ ఎలా ఉండాలి, సంస్కారవంతుడైన వ్యక్తి ఏ నైపుణ్యాలు అలవరచుకోవాలి వంటి వాటికి ప్రాధాన్యతనిచ్చారు.
  6. మానవతావాదం వల్ల డబ్బు, అధికారం, సంపాదించడం ద్వారా మాత్రమే కాకుండా ఇతరత్రా తమ జీవితాలను మలచుకునే సామర్థ్యం మనుషులకుందని నమ్మసాగారు.

ప్రశ్న 4.
మధ్య యుగాలు, ఆధునిక యుగం ఆరంభంలో ప్రపంచమంతటా మహిళలపై పురుషుల ఆధిపత్యం ఉండేది. ప్రస్తుత సమాజంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందా? వివరించంది.
జవాబు:
మధ్యయుగానికి, ఆధునిక యుగ ఆరంభానికి ప్రస్తుతానికి మహిళల పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి.

ఒకప్పుడు మహిళలపై పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. క్రమక్రమంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరియు మహిళల పోరాటాల కారణంగా మహిళల పరిస్థితులలో చాలా మార్పు వచ్చాయి.

ప్రస్తుతం మహిళలు స్వయం శక్తిగా ఎదుగుతున్నారు. విద్య, వైద్యం, అంతరిక్షం, వ్యవసాయం అన్ని రంగాలలో పురుషులతో సమానంగా అవకాశాలను పొందుతున్నారు. అంతేకాకుండా రాజకీయాలలో కొన్ని సందర్భాలలో అత్యున్నత పదవులను కూడా అలంకరించారు. కొన్ని సందర్భాలలో మహిళలు తీసుకున్న నిర్ణయాలే దేశాభివృద్ధికి ఉపయోగపడ్డాయి అని చెప్పవచ్చు. కొన్ని రంగాలలో పురుషుల కంటే మహిళలు ముందంజలో ఉన్నారు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అన్ని రంగాలలో మహిళలు పురుషులకంటే ఆధిక్యంలో ఉన్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలు పురుషుల వల్ల ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇంకా మన సమాజం పురుషాధిక్య సమాజమని కొన్ని సంఘటనలు మనకు గుర్తు చేస్తున్నాయి.

ప్రశ్న 5.

వాదము ముఖ్యాంశాలు
1. మానవతా వాదము – మధ్యయుగాల పండితుల మాదిరి మరణానంతర జీవితం గురించి కాక మానవతా వాదులు ప్రస్తుతం ప్రపంచం గురించి ఆసక్తి చూపేవారు.
– మనిషిని జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి సమస్తాన్ని, విజ్ఞానశాస్త్రం, కళలు వంటి వాటిని వీరు ముఖ్యమైనవిగా భావించేవారు.
2. యథార్థవాదము – మానవతావాద భావాలు చిత్రకళ, శిల్పకళలకు కూడా విస్తరించాయి.
– కళాకారులు తమ చుట్టు ప్రక్కల ప్రకృతిని, ప్రజలను, ప్రదేశాలను పరిశీలించి వాటిని యథాతథంగా చిత్రించడానికి ప్రయత్నించారు.
3. కాల్పనిక వాదము – సాంస్కృతిక ఉద్యమమైన కాల్పనిక వాదము ఒక ప్రత్యేక రకమైన జాతీయతా భావాన్ని పెంపొందించటానికి ప్రయత్నించింది.
– కాల్పనికవాద కవులు మరియు కళాకారులు, విజ్ఞానశాస్త్రము, హేతువులకు పెద్దపీట వేయడాన్ని విమర్శించారు.

పై సమాచారం ఆధారంగా దిగువ ప్రశ్నలకు జవాబులివ్వంది.
ఎ) ప్రస్తుత జీవితం కంటే మరణానంతర జీవితానికి ప్రాధాన్యతనిచ్చిన వారెవరు?
బి) మానవ జీవితాలపై మత నియంత్రణ బలహీన మవ్వటం ఏవాదంలో గమనించవచ్చు?
సి) “జీసస్ శరీరాన్ని ఒడిలో పెట్టుకొన్న మేరీ” యొక్క ప్రసిద్ధ శిల్పము ఏ వాదాన్ని ప్రతిబింబిస్తుంది?
ది) విజ్ఞానశాస్త్రానికి హెచ్చు ప్రాముఖ్యత నివ్వడాన్ని వ్యతిరేకించే వాదమేది?
జవాబు:
ఎ) మధ్యయుగాలలోని పండితులు
బి) మానవతా వాదం
సి) యథార్థవాదం
డి) కాల్పనిక వాదం

Leave a Comment