AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

These AP 8th Class Social Important Questions 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్ will help students prepare well for the exams.

AP Board 8th Class Social 7th Lesson Important Questions and Answers ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 1.
ప్రాథమిక పొదుపు ఖాతాను గూర్చి వివరించండి.
జవాబు:

  1. కనీస నిల్వ అసలు లేకుండా (‘జీరో’ బ్యాలెన్స్) లేదా అతి తక్కువ ఉండవచ్చు.
  2. వ్యక్తులకు, ఖాతా తెరవడానికి, వయస్సు, ఆదాయం , జమ చేయవలసిన కనీస మొత్తం వంటి షరతులు లేవు.
  3. నెలకి నాలుగుసార్లు (ATM నుండి తీసుకొన్న వాటితో కలిపి) నగదు తీసుకోవడం అనుమతించబడుతుంది.)
  4. నగదు తీసుకొను, డిపాజిట్ చేయుట; ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలు / చెక్ (cheque) ల ద్వారా వచ్చిన సొమ్ము జమ చేయుటవంటి సేవలు పొందవచ్చు.
  5. కేంద్ర ప్రభుత్వం వారు ప్రధానమంత్రి జనధన్ యోజన (PMJDY) స్కీం ఆగస్టు 2014లో ప్రారంభించబడింది.

దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా పేద ప్రజలందరికి జీరో బ్యాలెన్స్ తో బ్యాంక్ లో ఖాతాలు తెరిచేలా సదుపాయం కల్పించారు.

ప్రశ్న 2.
చిన్న ఖాతాలకు వర్తించే షరతులు ఏవి?
జవాబు:
ఒకవేళ, ప్రాథమిక పొదుపు ఖాతా, సులభం చేసిన “Know Your Customer (KYC)” షరతులతో గనుక తెరిచినట్లయితే, ఇది చిన్న ఖాతావలె కూడా పరిగణించబడుతుంది.

  1. ఈ ఖాతాల్లో మొత్తం జమ, ఒక సంవత్సరంలో లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు.
  2. ఏ సమయంలో కూడా, ఈ ఖాతాలో గరిష్ఠ నిల్వ ఏభైవేల రూపాయలు మించి ఉండరాదు.
  3. నగదు రూపంలో గాని, ఇతర బదిలీల రూపంలో గాని తీసుకొన్న మొత్తం, ఒక నెలలో పదివేల రూపాయలు మించి ఉండకూడదు.
  4. చిన్న ఖాతాలు మొదట 12 నెలల వరకు అమలులో ఉంటాయి. ఆ తరువాత, ఖాతాదారు అధికారికంగా సమ్మతించిన పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు రుజువు సమర్షిస్తే, దీన్ని మరో 12 నెలలు పొడిగించవచ్చు.

ప్రశ్న 3.
క్రింది. పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.

కాలక్రమంలో అరుదైన, ఆకర్షణీయమైన లోహాలను మార్పిడి మాధ్యమంగా ప్రజలు ఉపయోగించటం మొదలుపెట్టారు. రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి పాడవ్వకుండా చాలాకాలం ఉంటాయి. చిన్న భాగాలుగా చేయవచ్చు, తేలికగా రవాణా చేయవచ్చు. ఇది కొరత వస్తువు కాబట్టి అందరూ దీనిని ఆమోదిస్తారు. ప్రజలు తమ చేతిలో ఉన్న డబ్బు విలువైనదని, ఇతరులు కోరుకొనేది అనే నమ్మకంతో అమ్మడం, కొనడం చేసేవారు. ఈ డబ్బుకి విలువ ఉందని, ఇతరులు దానిని ఆమోదిస్తారని ప్రజలకు తెలుసు కాబట్టి తమ సరుకులను డబ్బుకి అమ్ముకునేవారు. ధాన్యం, పశువుల విలువ పడిపోయినట్టు డబ్బు విలువ పడిపోతుందని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. అయితే వస్తుమార్పిడిలోని అన్ని సమస్యలు ఈ రకమైన డబ్బు వల్ల పరిష్కారం కాలేదు, కొత్త సమస్యలు కూడా వచ్చాయి. లోహాలతో మార్పిడి చేసేటప్పుడు ప్రతిసారీ దానిని తూకం వేయాల్సి వచ్చేది. తరవాత లోహాల నాణ్యత పట్ల వ్యాపారస్థులకు అనుమానం కలిగేది. మార్పిడిలో స్వచ్ఛమైన వెండి, బంగారం లభించకపోవచ్చు. కొంతకాలం తరవాత మార్పిడికి ఉపయోగించిన లోహనాణ్యతలో నమ్మకం పెద్ద సమస్యగా మారింది.
1) చాలాకాలం పాడవకుండా ఉండే కొన్ని లోహాలను చెప్పండి.
జవాబు:
రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి పాడవ్వకుండా చాలాకాలం ఉంటాయి.

2) ప్రజలు ఏ విషయాలకు భయపడాల్సిన అవసరం లేదు?
జవాబు:
ధాన్యం, పశువుల విలువ పడిపోయినట్టు డబ్బు విలువ పడిపోతుందని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు.

3) డబ్బు వలన వస్తుమార్పిడిలోని సమస్యలు పరిష్కారమయ్యాయా?
జవాబు:
వస్తుమార్పిడిలోని అన్ని సమస్యలు ఈ రకమైన డబ్బు వల్ల పరిష్కారం కాలేదు, కొత్త సమస్యలు కూడా వచ్చాయి.

4) డబ్బు వల్ల కలిగిన సమస్యలు ఏవి?
జవాబు:
లోహాలతో మార్పిడి చేసేటప్పుడు ప్రతిసారీ దానిని తూకం వేయాల్సి వచ్చేది. తరవాత లోహాల నాణ్యత పట్ల వ్యాపారస్తులకు అనుమానం కలిగేది. – మార్పిడిలో స్వచ్చమైన వెండి, బంగారం లభించకపోవచ్చు. కొంతకాలం తరవాత మార్పిడికి ఉపయోగించిన లోహ నాణ్యతలో నమ్మకం పెద్ద సమస్యగా మారింది.

AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 4.
ఈ క్రింది పేరాను చదివి సమాధానములిమ్ము.

అనేక పట్టణాలు, నగరాల్లో అన్ని బ్యాంకుల, ప్రతినిధులు ప్రతిరోజూ సమావేశమై ఆ రోజు ప్రతి బ్యాంకుకీ ఇతర బ్యాంకుల నుంచి రావలసిన మొత్తాలను, అలాగే ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలను నిర్ధారించుకుంటారు. సరిచూసిన చెక్కులు ఒకరికొకరు మార్చుకుంటారు. ఒక బ్యాంకు క్లియరింగ్ బ్యాంకు’గా పని చేస్తుంది. ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికీ ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులను ఈ క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది.

కొత్త విధానంలో అన్ని బ్యాంకులు, వాటి అన్ని శాఖలూ కంప్యూటర్ల ద్వారా అనుసంధానమై ఉన్నాయి. అన్ని బ్యాంకు ఖాతాలను, వారి సంతకాలను ఎక్కడ ఉన్న శాఖలోనైనా సరిచూసుకోవచ్చు. కాబట్టి బ్యాంకు ప్రతినిధులు కలవాల్సిన పనిలేదు. అదే విధంగా వేరే ఊళ్లో ఉన్న శాఖలకు బ్యాంకులు చెక్కులు పంపించాల్సిన అవసరం లేదు. ఒక బ్యాంకు మరొక బ్యాంకు మధ్య లావాదేవీలను అనుసంధానం చేయబడిన కంప్యూటర్లతో నిర్వహిస్తారు. దీని వల్ల పనులు చాలా తేలికగానే కాకుండా చాలా తొందరగా కూడా పూర్తవుతాయి.
1) ఎవరెవరు సమావేశమవుతారు?
జవాబు:
అన్ని బ్యాంకుల ప్రతినిధులు సమావేశమవుతారు.

2) వారు ఏమి మార్చుకుంటారు?
జవాబు:
సరిచూసిన చెక్కులు ఒకరికొకరు మార్చుకుంటారు.

3) క్లియరింగ్ బ్యాంకు ఏమి పనిచేస్తుంది?
జవాబు:
ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికీ ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులను ఈ క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది.

4) కొత్త విధానంలో కొత్తదనం ఏమిటి?
జవాబు:
కొత్త విధానంలో అన్ని బ్యాంకులు, వాటి అన్ని శాఖలు కంప్యూటర్ల ద్వారా అనుసంధానమై ఉన్నాయి.

5) దీని వలన ఫలితం ఏమిటి?
జవాబు:
దీనివల్ల పనులు చాలా తేలికగానే కాకుండా చాలా తొందరగా కూడా పూర్తవుతాయి.

ప్రశ్న 5.
ఈ క్రింది పేరాను చదివి, రెండు ప్రశ్నలను వ్రాయుము.
కాగితపు నోట్లకు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అది మురికి అవుతుంది. చిరిగిపోతుంది. దాంతో నోట్లకు ప్లాసికను ఉపయోగించాలన్న భావన ఏర్పడింది. ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు పాడవ్వకుండా చాలాకాలం మన్నుతాయి. వీటిలో నకిలీ నోట్లను కూడా తేలికగా గుర్తించవచ్చు. ఇది నీటికి తడవదు, పర్యావరణానికి హాని చెయ్యదు.
జవాబు:

  1. కాగితపు నోట్లకు ఉన్న లోపాలేవి?
  2. పాలిమర్ నోట్లకున్న అర్హతలేవి?

ప్రశ్న 6.
మీ ప్రాంతంలో ఉన్న వాణిజ్య బ్యాంకును సందర్శించి ఈ పట్టికను నింపండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్ 4

ప్రశ్న 7.
బ్యాంకులు అప్పు ఇచ్చేటప్పుడు హామీ ఎందుకు తీసుకుంటాయి?
జవాబు:
బ్యాంకు సిబ్బందికి, బ్యాంకుకు వచ్చేవారికి ఎటువంటి సంబంధం ఉండదు – మేనేజ్ మెంట్, కస్టమర్ సంబంధం తప్పు. అలాంటి సందర్భంలో బ్యాంకువారు ఎవరికి పడితే వారికి ఋణాలిచ్చి, తిరిగి వసూలు చేయలేకపోతే దివాళా తీసే పరిస్థితి వస్తుంది. అలాంటివి ఎదుర్కోకుండా బ్యాంకు అప్పులు ఇచ్చేటపుడు హామీలను తీసుకుంటాయి.

ప్రశ్న 8.
చెక్కులు మరియు డి.డి.ల మధ్య భేదాలు ఏమిటి?
జవాబు:
చెక్కులు:

  1. చెక్కుని బ్యాంకు ఖాతాదారుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే వారి పేరు మీద వ్రాసి ఇస్తాడు.
  2. చెక్కు నుండి నగదును డ్రా చేయడానికి ఎలాంటి సేవా రుసుమును చెల్లించనక్కరలేదు.
  3. ఒక వేళ చెక్కు ఇచ్చిన వ్యక్తి account లో నగదు ఉన్నట్లయితే మనం వెంటనే ఆ చెక్కును నగదుగా మార్చుకోవచ్చు. ఎక్కువ సమయం వృథా కాదు.
  4. అయితే చెక్కు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడినంత నగదు లేకపోతే బ్యాంకులు మనకు డబ్బులు ఇవ్వవు చెక్కులను తిరస్కరిస్తాయి.

D.Dలు:

  1. D.D లను బ్యాంకులు ఇష్యూ చేస్తాయి.
  2. మనం ఏవైనా సంస్థలు అందించే సేవలు పొందాలంటే కొంతడబ్బును ముందుగా ఆ సంస్థలకు చెల్లించాలి. ఆ డబ్బును D.D ల రూపంలో చెల్లించాలి.
  3. D.D లను కట్టే సమయంలో మనం కొంత సేవా రుసుమును కట్టాలి.
  4. బ్యాంకు ఎవరి పేరు మీద D.D ని ఇస్తుందో వారు ఆ D.D ని పొందిన వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు.
  5. D.D ని డబ్బుగా మార్చడానికి 2 లేదా 3 రోజుల సమయం పడుతుంది.
  6. D.D లు ఆమోదయోగ్యమైనవి ఇది తిరస్కరింపబడవు.

AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 9.
చెక్కుల కంటె డి.డి.లు ఎలా ఆమోదయోగ్యమైనవి?
జవాబు:

  1. D.D లు ఎందుకు ఆమోదయోగ్యమైనవి అనగా బ్యాంకుకి ముందుగానే డబ్బులు కట్టి డి.డిలు తీసుకుంటాము. కాబట్టి అన్ని రకాల చెల్లింపులకు D.D లు ఆమోదయోగ్యమైనవే.
  2. కొన్ని సందర్భాలలో చెక్కులు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడినంత నగదు లేక పోయినట్లయితే చెక్కులు తిరస్కరించబడతాయి.

ప్రశ్న 10.
బ్యాంక్ వారు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ కంటే వారు ఇచ్చే అప్పులపైన వడ్డీ ఎందుకు ఎక్కువ? Page No. 84)
జవాబు:
1) బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ

2) ప్రజలు ఒక ఒప్పందం ప్రకారం అనగా బ్యాంకు వారు ఎంత అయితే వడ్డీని డిపాజిట్లకు చెల్లించుతామని చెప్పారో దానికి ఇష్టపడి ప్రజలు డిపాజిట్లు చేశారు. ఎందుకనగా వారికి అవసరం అయినప్పుడు అడిగినంత లభిస్తుందన్న నమ్మకం ప్రజలకుంది.

అయితే బ్యాంకు వారు ఇచ్చే అప్పులపై వడ్డీ ఎందుకు ఎక్కువ వసూలు చేస్తారంటే, ఆ వచ్చే వడ్డీతోనే బ్యాంకు జమచేసిన వారికి వడ్డీ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి. పరికరాలు కాని నిర్వహించాలి. అద్దెలు చెల్లించాలి, బ్యాంకు నడపడానికి అయ్యే ఇతర ఖర్చులు భరించాలి. అంతిమంగా లాభాలు సంపాదించాలి. అందువలన బ్యాంకులు ఇచ్చే అప్పుల పైనే వడ్డీ ఎక్కువగా తీసుకుంటారు.

ప్రశ్న 11.
ఖాతాదారులలో చాలామంది బ్యాంకులో డబ్బు ఉంచాలని అనుకోకపోతే అది బ్యాంకు పనితీరును ఏ రకంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
ఖాతాదారులలో చాలామంది బ్యాంకులో డబ్బు ఉంచాలని అనుకోకపోతే బ్యాంకులో సొమ్ములు నిల్వ ఉండవు. అపుడు బ్యాంకు ఇతరులకు అప్పు ఇవ్వలేదు. వారి నుండి వడ్డీలు సేకరించలేదు. దీని మూలంగా బ్యాంకు నిర్వహణ అసాధ్యమైపోతుంది.

ప్రశ్న 12.
గ్రామాలలో, పట్టణాలలో చాకలివారు, మంగలి వారు మరియు నీరటి వారు (చెరువు నీటిని కావలి కాసేవారు) మొదలగువారి, పనికి తగిన వేతనం చెల్లిస్తారా?
జవాబు:
ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు వారి పనికి డబ్బు రూపంలోనే వేతనాలు చెల్లిస్తున్నారు. కాని 15 సం||రాల క్రితం వరకు వారికి ధాన్యం రూపంలోనే డబ్బులు చెల్లించేవారట.

ప్రశ్న 13.
పొదుపు ఖాతా అంటే ఏమిటి?
జవాబు:
పొదుపు ఖాతా : ఉద్యోగస్టులు మొ||న వారు ఈ ఖాతాని కలిగి ఉంటారు. పొదుపు ఖాతాలోని సొమ్ముపై కొంత వడ్డీ వస్తుంది. డబ్బు క్షేమంగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. అడిగినప్పుడు డబ్బు చెల్లిస్తానన్న హామీ బ్యాంకు ఇస్తుంది.

ప్రశ్న 14.
కరెంటు ఖాతా అంటే ఏమిటి?
జవాబు:
కరెంటు ఖాతా : వ్యాపారస్థులు మొ||నవారు ఈ ఖాతాను కలిగి ఉంటారు. ఈ ఖాతా నుంచి ఎన్నిసార్లయినా డబ్బులు తీయవచ్చు. జమ చేయవచ్చు. ప్రత్యేకమైన పరిమితి ఏమీలేదు. అయితే దీనిలో ఉన్న సొమ్ముకు వడ్డీ రాదు. అదనంగా సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 15.
మీకు 2000/- రూ||ల అవసరం ఉందనుకోండి. ఒక చెక్కు రాసి మీ చెల్లెలికిచ్చి నగదు తీసుకురమ్మని పంపించండి. ఏమి జరుగుతుంది?
జవాబు:
బ్యాంకు వారు దీనిని త్రిప్పి పంపుతారు. చెక్కులకు నగదు ఎవరికీ చేతి కివ్వరు. బ్యాంకులో అకౌంటు వుంటేనే, ఆ చెక్కును తీసుకుని, చెల్లెలు అకౌంట్లో వేస్తారు.

ప్రశ్న 16.
చాలాకాలం పాడవకుండా ఉండే కొన్ని లోహాలను చెప్పండి.
జవాబు:
రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి పాడవ్వకుండా చాలాకాలం ఉంటాయి.

ప్రశ్న 17.
ప్రజలు తమ సరుకులను డబ్బుకి ఎందుకు అమ్ముకునేవారు?
జవాబు:
డబ్బుకి విలువ ఉందని, ఇతరులు దానిని ఆమోదిస్తారని ప్రజలకు తెలుసు కాబట్టి తమ సరుకులను. డబ్బుకి అమ్ముకునేవారు.

ప్రశ్న 18.
క్లియరింగ్ బ్యాంకు ఏమి పనిచేస్తుంది?
జవాబు:
క్లియరింగ్ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికీ ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులను ఈ . క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది.

ప్రశ్న 19.
మీకు తెలిసిన కొన్ని బ్యాంకుల పేర్లు చెప్పండి.
జవాబు:
బ్యాంకుల పేర్లు :

  1. ఆంధ్రాబ్యాంక్
  2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  3. ఇండియన్ బ్యాంక్

ప్రశ్న 20.
ఒక కాలానికి చేసిన ఫిక్స్ డిపాజిట్టుపై ప్రజలకు లభించే వడ్డీ కంటే అదే కాలానికి తీసుకున్న అప్పుపై ఎక్కువ వడ్డీ చెల్లించాలి. ఇలా ఎందుకు ఉండాలి?
జవాబు:
బ్యాంకుకి ‘ఫిక్స్ డిపాజిట్టు’ పై ఇచ్చే. వడ్డీ ఖర్చు క్రింద లెక్క అప్పుపై వచ్చే వడ్డీ ఆదాయం. ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువైతేనే లాభాలుంటాయి. లేకుంటే బ్యాంకులు నష్టపోతాయి.

AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 21.
పదివేల రూపాయలకు, వడ్డీ 8% అయితే, 5 సం||రాల తరువాత మనస్వినికి ఎంత డబ్బు వస్తుంది?
జవాబు:
వడ్డీ 8% అయితే 5 సం||రాల తరువాత మనస్వినికి దాదాపు రూ. 15,000 లు వస్తుంది.

ప్రశ్న 22.
డబ్బులు లేకుండా జరిగే మార్పిడులు ఏమైనా మీకు తెలుసా?
జవాబు:
“బార్టరు పద్ధతి” గురించి నాకు తెలుసు. వస్తువులను వస్తువులతోనే మార్చుకొనే విధానం.

ప్రశ్న 23.
ప్రస్తుతం బ్యాంకుల లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి?
జవాబు:
ప్రస్తుతం బ్యాంకులలో లావాదేవీలు కంప్యూటర్, ఇంటర్నెట్, NEFT ద్వారా జరుగుతున్నాయి.

ప్రశ్న 24.
గ్రామీణ పేదలకు సంబంధించిన ఏవైనా నాలుగు ఉపాధి పథకాలను పేర్కొనండి?
జవాబు:

  1. సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం
  2. జవహర్ గ్రామ సమృద్ధి యోజన
  3. పనికి ఆహార పథకం
  4. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
  5. సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన.

ప్రశ్న 25.
ఇటీవల ‘పెద్దనోట్ల రద్దు’ పర్యవసానంగా సామాన్య ప్రజలు ఎదుర్కొన్న పరిణామాలు వివరించండి.
జవాబు:

  1. కొంతమంది ప్రజలకు వారి అత్యవసరమైన వైద్య సేవలకు కూడా డబ్బు అందక ఇబ్బందిపడ్డారు.
  2. పండ్లతోటలు మరియు కూరగాయలు వారు కూడా వారు ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడ్డారు.
  3. కొన్ని కుటుంబాలలో వివాహములకు అవసరమయ్యే డబ్బు దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు.
  4. పెన్షదారులు వారి పెన్షన్ కోసం బ్యాంకుల దగ్గర రోజుల తరబడి నిలబడవలసి వచ్చింది.
  5. ప్రయివేటు హాస్పటల్ లో మందుల షాపుల వాళ్ళు, మందులు ఇవ్వడానికి పాతనోట్లను అంగీకరించక ప్రజలు తమ పాతనోట్లు మార్చుకోవడానికి బ్యాంకుల దగ్గర చాలా రోజులపాటు నిలబడవలసి వచ్చింది.
  6. రైతులు మరియు రోజువారీ వేతనం పొందే వ్యవసాయ కూలీలు డబ్బులు కోసం వారు పడిన ఇబ్బందులను వర్ణించడం చాలా కష్టం.

ప్రశ్న 26.
క్రింది సమాచారం పరిశీలించి, ఇవ్వబడిన ఆర్థిక లావాదేవీ గురించి మనం తెలుసుకోగల ఏవైనా నాలుగు అంశాలను రాయండి.
జవాబు:
ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే

  1. సురేష్, సుజాతకు డబ్బులు ఇవ్వాలి.
  2. అతను క్యాష్ రూపంలో ఇవ్వకుండా చెక్ రూపంలో ఇవ్వాలనుకున్నాడు.
  3. అతను ఏ బ్యాంకుకు అయితే చెక్ ఇస్తాడో ముందు అతని అకౌంట్ లో సరిపడ మొత్తం ఉందో లేదో చూసి తరువాత సుజాత పేరుమీద క్రాస్ చెక్ వ్రాసి ఇస్తాడు.
  4. ఎందుకు క్రాస్ చెక్ ఇస్తారు అంటే వారు ఎవరి పేరు మీద అయితే చెక్ ఇస్తారో వారి పేరుమీద బ్యాంకులో అకౌంట్ ఉంటేనే ఆ చెక్ డబ్బుగా మారుతుంది. లేకపోతే ఆ చెక్ దుర్వినియోగం చేయబడుతుంది.

AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 27.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ వలన కలిగే ఏవేని రెండు ప్రయోజనాలను రాయండి.
జవాబు:
ఇంటర్నెట్ బ్యాంకింగ్ వలన కలిగే ప్రయోజనాలు :

  1. ఖాతాదారులు తమ ఖాతాలోని నగదును బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇతర ఖాతాలలోకి జమ చేయవచ్చు.
  2. వినియోగదారులు బ్యాంకుకు వెళ్ళకుండానే తమ బిల్లులను చెల్లించవచ్చు. ఉదా : విద్యుత్ బిల్లులు
  3. ఖాతాదారులు ఇంటి వద్దనే ఉంటూ వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

AP 8th Class Social Important Questions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

AP 8th Class Social Important Questions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

These AP 8th Class Social Important Questions 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం will help students prepare well for the exams.

AP Board 8th Class Social 6th Lesson Important Questions and Answers ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 1.
ఈ క్రింది పేరాను చదివి, దిగువనిచ్చిన ఖాళీలను పూరించుము.

కొన్ని ముఖ్యమైన ఖనిజాలు, వాటి వినియోగాలు

ఇనుప ఖనిజం, ఇసుక, ముడిచమురు, సున్నపురాయి, బొగ్గు మొదలైన ఖనిజాల ఉపయోగాలు మీకు తెలిసే ఉంటుంది. ఆధునిక పరిశ్రమలలో అనేక రకాల ఖనిజాలను ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఈ ఖనిజాలు మన జీవితాల్లో చాలా ముఖ్యభాగం అయ్యాయి. కొన్ని ముఖ్యమైన ఖనిజాల ఉపయోగాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మీరు | గ్రంథాలయం, లేదా ఇంటర్నెట్ లో చూసి వీటి గురించి మరింత సమాచారం సేకరించవచ్చు.

ఇనుప ధాతువు (మడి ఇనుము) :
హెమటైట్ మరియు మాగ్నటైట్ ఇనుపధాతు నిల్వలు మన రాష్ట్రంలో లభిస్తున్నాయి. వీటిని ముఖ్యంగా ఉక్కు, ఫెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. దీనిని ముఖ్యంగా జపాను ఎగుమతి చేస్తున్నారు.

మైకా (అభ్రకం) :
ఇది మెరిసే ఖనిజం. విద్యుత్తు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. దీనికి ఉపయోగపడే అనేక గుణాలు ఉన్నాయి. ఇది సన్నటి పొరలలో లభ్యమవుతుంది. ఇది విద్యుత్ నిరోధకం.

సున్నపురాయి :
‘సిమెంట్, కార్బెడ్, ఇనుము ఉక్కు, సోడాయాష్ (బట్టల సోడ), రసాయనాలు, కాగితం, ఎరువులు గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

గ్రానైట్ :
దీనిని కోత (కటింగ్) మరియు పాలిష్ పరిశ్రమలలో అలంకరణకు, స్మారక కట్టడాలలో, నేలను నునుపు చేసే సామానులలో ఉపయోగిస్తారు.

మాంగనీస్ :
దీనిని పొటాషియం ఫర్మాంగనేట్, ఇనుము మిశ్రమ లోహాలలోనూ, ఇనుము – ఉక్కు, బాటరీలు, రసాయనాలు, పింగాణి (సిరామిక్), గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

బెరైటిస్ :
ఇది కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుంచి బేరియం అనే మూలకాన్ని వెలికితీస్తారు. పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం బేరియంని ఉపయోగిస్తారు. ముడి చమురు, సహజవాయువుల కోసం చాలా లోతుగా తవ్వటానికి కూడా బెరైటిస్ ని ఉపయోగిస్తారు.

ఫెల్డ్ స్పార్ :
గాజు, సెరామిక్ వస్తువులు (వాష్ బేసిన్ వంటి) తయారు చేయటానికి ఇది ముడి సరుకుగా ఉపయోగపడుతుంది.

ఖాళీలను పూరింపుము :

1. ముడి ఇనుమును ముఖ్యంగా జపాన్‌కు ఎగుమతి చేస్తున్నారు.
2. మైకా మెరిసే ఖనిజం.
3. బట్టలసోడా పరిశ్రమలో సున్నపురాయిను ఉపయోగిస్తారు.
4. పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం బేరియం ని ఉపయోగిస్తారు.
5. వాష్ బేసిన్లకు ఒక ముడి సరుకు ఫెల్ట్ స్పార్ .

ప్రశ్న 2.
ఈ క్రింది సమాచారమును చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.
2009 జూన్ 29న ప్రచురితమైన ఈ వార్తను చదవండి.

సింగరేణి ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనుల వల్ల తలెత్తిన సమస్యలు

మా ప్రతినిధి :
వరంగల్, జూన్ 28 : బొగ్గుకి ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ కాస్ట్ గని తవ్వకం చేపట్టాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల 200 గ్రామాలు ప్రభావితం కావచ్చు. 20,000 మంది నిరాశ్రయులు కావచ్చు. ఈ గనుల వల్ల 3000 హెక్టార్ల అడవులు కూడా ప్రభావితం అవుతాయని అంచనా.

“భూగర్భ గనుల ద్వారా రోజుకి 1500 టన్నుల బొగ్గు తవ్వగలిగితే, ఓపెన్ కాస్ట్ ద్వారా రోజుకి పదివేల టన్నుల బొగ్గు తియ్యవచ్చు. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది,” SCCLలో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇది ఇలా ఉండగా, ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకం వల్ల వేలాది కుటుంబాలు నిర్వాసితులవుతాయి, పదుల సంఖ్యలో గ్రామాలు దెబ్బతింటాయి, స్థానికుల జీవనోపాధులు దెబ్బతింటాయి. కంపెనీ అధికారి ప్రకారం అడవులు నరికివేసినంత విసీరంలో కొత్తగా అడవులను వృద్ధి చేస్తారు. దానికి అయ్యే ఖర్చును భరిస్తారు. ఒక హెక్టారుకు 4.38 నుంచి 10.43 లక్షల రూపాయలు ఇందుకు చెల్లిస్తారని ఆ అధికారి చెప్పాడు. ఈ గనుల వల్ల తవ్విన మట్టి, రాళ్లు గుట్టలుగా ఏర్పడి వాగులు, నదుల ప్రవాహానికి ఆటంకం కల్పిస్తున్నాయని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, తాగునీటికి కూడా కొరత ఏర్పడుతోందని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

ప్రశ్నలు – జవాబులు :
1. ఈ వార్త ఎప్పుడు ప్రచురితమైంది?
జవాబు:
2009 జూన్ 29న ప్రచురితమైనది.

2. ఎస్సిసిఎల్ అంటే ఏమిటి?
జవాబు:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.

3. ఈ నిర్ణయం వల్ల ఏమి జరుగవచ్చు?
జవాబు:
ఈ నిర్ణయం వల్ల 200 గ్రామాలు ప్రభావితం కావచ్చు, 20,000 మంది నిరాశ్రయులు కావచ్చు. ఈ గనుల వల్ల 3000 హెక్టార్ల అడవులు కూడా ప్రభావితం అవుతాయని అంచనా.

4. భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ – ఈ రెంటిలో ఏది కంపెనీకి లాభదాయకం?
జవాబు:
ఓపెన్కాస్ట్.

5. స్థానిక ప్రజలు ఏమని ఫిర్యాదు చేస్తున్నారు?
జవాబు:
ఈ గనుల వల్ల తవ్విన మట్టి, రాళ్లు గుట్టలుగా ఏర్పడి వాగులు, నదుల ప్రవాహానికి ఆటంకం కల్పిస్తున్నాయని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, తాగునీటికి కూడా కొరత ఏర్పడుతోందని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

AP 8th Class Social Important Questions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 3.
ఈ కింది పేరాను చదివి, దిగువ నిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో విస్తార బొగ్గు గనులు ఉన్నాయి. ఈ బొగ్గును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వెలికి తీస్తుంది. దీనిని మొదట 1886లో ఒక ప్రైవేటు బ్రిటిషు కంపెనీ నెలకొల్పింది. 1920లో దీనిని హైదరాబాదు నిజాం కొన్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసింది. ప్రస్తుతం ఎస్ సిసిఎల్ భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కంపెనీ. తెలంగాణాలో పైన పేర్కొన్న నాలుగు జిల్లాలలో ఈ కంపెనీ ప్రస్తుతం 15 ఓపెన్ కాస్ట్ గనులలో, 35 భూగర్భ గనులలో త్వకాలు చేపడుతోంది. ఈ కంపెనీలో 65,000 ఉద్యోగులు ఉన్నారు (2012).
ప్రశ్నలు – జవాబులు :
1) స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో గనులు ఎవరి అధీనంలో ఉండేవి?
జవాబు:
ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తుల చేతుల్లో

2) బొగ్గు గనులు ఏ ఏ జిల్లాలలో అధికం?
జవాబు:
ఖమ్మం , కరీంనగర్, అదిలాబాద్, వరంగల్

3) సింగరేణి కాలరీస్లో మొత్తం ఉద్యోగులు ఎందరు?
జవాబు:
65,000 మంది (2012 నాటికి)

ప్రశ్న 4.
గనుల తవ్వకంలో ప్రభుత్వ నియంత్రణలలో వేటితో మీరు ఏకీభవిస్తారు? ఎందుకు?
జవాబు:
గనులు కౌలుకిచ్చే విధానం కాకుండా ప్రభుత్వమే ఆధునిక, సంక్లిష్ట సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశ పెట్టి ఖనిజాలు వెలికి తీస్తే బాగుండేది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే భద్రతా చర్యలు ప్రైవేటు వారు తీసుకోకపోవచ్చు. వారి లాభాపేక్ష భావితరాలకు శూన్యాన్ని అందించవచ్చు. ప్రభుత్వానికి చేరవల్సిన రాయల్లీ పూర్తిగా చేరకపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా నిల్వలు అయిపోయిన గనులను పూర్తిగా మూసివేసే చర్యలు, ఖర్చులు ఎక్కువ అవుతుందని మూయకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వ నియంత్రణనే నేను సమర్థిస్తాను.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులను ప్రశంసించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ఖనిజ వనరులు :
మన రాష్ట్రంలో ఖనిజ వనరులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. భవన నిర్మాణంలో ఉపయోగించే అనేక రంగుల గ్రానైటురాయి, కడప రాయిని పెద్ద మొత్తంలో మన రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. సిమెంటు పరిశ్రమలో ఉపయోగించే సున్నపురాయి, డోలమైట్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ఉత్తర జిల్లాలలో (గోదావరి లోయలో కొత్త గూడెంలో) పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయి. కృష్ణా – గోదావరి బేసిన్లో ఖనిజనూనె, వాయువుల నిక్షేపం ఉంది. ఆంధ్రప్రదేశ్ చారిత్రకంగా వజ్రపు గనులకు ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాలు ఇక్కడే దొరికాయి. ఇవే కాకుండా ఆస్బెస్టాస్, బెరైటీస్, మైకా, ఫెల్డ్ స్పార్ వంటి ఖనిజాల విస్తార నిక్షేపాలు ఉన్నాయి.

AP 8th Class Social Important Questions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 6.
ఖనిజాల వెలికితీతలోని సున్నితమైన అంశాలు ఏవి?
జవాబు:
గనుల తవ్వకంలోని అనేక పద్ధతుల వల్ల ఉపరితల ప్రదేశం దెబ్బతింటుంది – అంటే అడవులను నరికి వేయటం కావచ్చు. నివాసప్రాంతాలు, వ్యవసాయ భూములుగా మార్చటం కావచ్చు లేదా పెద్ద గోతులు కావచ్చు. ఖనిజాలను కడగటానికి గనుల వద్ద పెద్ద మొత్తంలో నీళ్లు కావాలి. దీని కారణంగా దగ్గరలోని నదులు, నీటి వనరులు కలుషితం అవుతాయి. దీని వల్ల భూమిని మునుపటి ప్రయోజనాల కోసం వాడటం సాధ్యంకాదు, అక్కడ నివసించే గిరిజనులు, రైతులు ఆ భూమిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. గనుల తవ్వకం వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలు కూడా సమస్యలు ఎదుర్కొంటారు. అదే సమయంలో గనులు చాలా మందికి ఉద్యోగం కల్పిస్తాయి. వీళ్లకోసం చుట్టుపక్కల కొత్తగా కాలనీలు నిర్మిస్తారు. గనుల ద్వారా భారతదేశంలో సుమారు పది లక్షలమందికి, తెలంగాణలో లక్షకు పైగా మందికి ఉపాధి దొరుకుతోంది. గని కార్మికుల జీవితాలు చాలా ‘ప్రమాదకరంగా ఉంటాయి – వాళ్లు నిరంతరం ప్రమాదాల ముప్పును ఎదుర్కొంటారు, విషపూరిత వాయువులను పీల్చటం వల్ల దీర్ఘకాలంలో వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

ప్రశ్న 7.
ప్రజలందరూ ఖనిజ వనరుల అసలైన యజమానులు అయితే వాళ్ళందరి మేలు కోసం వీటిని ఉపయోగించుకోవడం ఎలా?
జవాబు:
వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని రవాణా సౌకర్యాల అభివృద్ధికి, ప్రజారోగ్య వసతులకు, విద్యకు, ఇతర సబ్సిడీలకు ఉపయోగించాలి. అపుడు ప్రజలందరి మేలు కోసం ఉపయోగించినట్లవుతుంది.

ప్రశ్న 8.
బెరైటీస్ నాణ్యత గురించి రాయండి.
జవాబు:
పై పొరలలో దొరికే బెరైటీస్ నాణ్యత తక్కువగానూ, లోపలి పొరల్లో దొరికే దాని నాణ్యత ఎక్కువగాను ఉంటుంది. బెరైటీస్ రాయి పరిమాణాన్ని బట్టి దాని నాణ్యతను నిర్ణయిస్తారు.

ప్రశ్న 9.
వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
పర్యావరణవేత్తలు వనరులను రెండు రకాలుగా విభజిస్తారు. పునరుద్ధరింపబడేవి, పునరుద్ధరించడానికి వీలులేక అంతరించిపోయేవి.

పునరుద్ధరింపబడేవి :
మళ్ళీ మళ్ళీ పొందగలిగినది.
ఉదా : కలప, సూర్యరశ్మి.

అంతరించిపోయేవి లేదా పునరుద్ధరించడానికి వీలులేనివి :
తిరిగి తయారు చేయలేని వనరులు.
ఉదా : బొగ్గు, బంగారం.

ప్రశ్న 10.
S.C.C.L ఓపెన్‌కాస్ట్ మైనులపట్ల ఎందుకు ఆసక్తి చూపుతోంది?
జవాబు:
భూగర్భగనులు తవ్వడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే ఓపెన్ కాస్టు తక్కువ ఖర్చు అవుతుంది. బొగ్గును కూడా యంత్రాల ద్వారా ఎక్కువ వెలికి తీయవచ్చు. ఇందువలన S.C.C.L ఓపెన్‌కాస్ట్ మైనుల పట్ల ఆసక్తి చూపుతోంది.

AP 8th Class Social Important Questions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 11.
గనుల తవ్వకం మొదలుపెట్టిన చోట ఉన్న ప్రజలకు పునరావాసం ఎందుకు కల్పించాలి?
జవాబు:
ఆ ప్రజలు మొదటి నుండి ఆ ప్రాంతానికి చెందినవారు. ఆ భూములు వారికి చెంది ఉంటాయి. వారి నుంచి ఆ భూమిని సేకరిస్తున్నపుడు వారికి వేరే చోట భూమిని ఇచ్చి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న 12.
అణు ఇంధనాలకు సంబంధించిన గనుల త్రవ్వకం మొత్తం ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఎందుకు?
జవాబు:
అణు ఇంధనాలు చాలా విలువైనవి, అతి తక్కువ నిల్వలున్నవి. అంతేకాక వాటి ఉపయోగాల దృష్ట్యా అవి చాలా కీలకమైనవి.

ప్రశ్న 13.
1. కింది పటాన్ని చదివి, దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 3
ఎ) ఖనిజ వనరులు లేని రెండు జిల్లాలను పేర్కొనండి.
జవాబు:
ఖనిజ వనరులు లేని రెండు జిల్లాలు,

  1. విశాఖపట్టణం
  2. తూర్పు గోదావరి

బి) ఖనిజ వనరులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పై మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
మన రాష్ట్రంలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి.

ప్రశ్న 14.
దేశంలోని ఖనిజాల తవ్వకం ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం మంచిదా? కాదా? మీ వైఖరిని వివరించండి.
జవాబు:
లాభాలు :
గనుల తవ్వకం మీద ప్రభుత్వానికి నియంత్రణాధికారం ఉంటూనే, కొంత ఆదాయం సమకూరుతోంది. అదే సమయంలో పెట్టుబడులు పెట్టి కొత్త సాంకేతిక విజ్ఞానం తీసుకుని రావడానికి ప్రైవేటు కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ విధానం ఫలితంగా గత 20 సం||రాలలో గనుల తవ్వకం ఊపందుకుంది. గనుల సంఖ్య, తవ్వి తీసే ఖనిజాలు, ఉపాధి ఈ రంగంలో పెరిగాయి.

నష్టాలు :
ప్రభుత్వ అనుమతిని లెక్క చేయకుండా ప్రయివేటు కంపెనీలు అడ్డూ అదుపు లేకుండా గనులను తవ్వేస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో గనుల తవ్వకం వల్ల దీర్ఘకాల సుస్థిరతకు భంగం వాటిల్లుతుంది. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ప్రైవేటు కంపెనీలు ఖనిజాలను తరలించి వేస్తున్నాయి. నిజంగా అవి చెందాల్సిన ‘ప్రజలకు చెందటం లేదు’.

AP 8th Class Social Important Questions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 15.
పర్యావరణం భద్రతా అంశాలను పట్టించుకోకుండా, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకంటే ఎంతో ఎక్కువ మొత్తంలో ప్రైవేటు కంపెనీలు అడ్డూ, అదుపు లేకుండా గనులను తవ్వేస్తున్నాయి. ఇది పర్యావరణానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా హానిచేస్తుందో వ్యాఖ్యానించండి.
జవాబు:
గనుల త్రవ్వకంవలన జరిగే అనర్థాలు

  1. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. తాగునీటి కొరత ఏర్పడింది.
  2. గనుల వలన త్రవ్విన మట్టి, రాళ్ళు గుట్టలుగా ఏర్పడి, వాగులు, నదులు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి.
  3. పదుల సంఖ్యలో గ్రామాలు దెబ్బ తింటాయి. ప్రజల జీవనోపాదులు దెబ్బ తింటాయి.
  4. భూసారం మొత్తం కొట్టుకుపోతుంది. అటవీ విస్తీర్ణం తగ్గి వర్షాలు కూడా పడవు.

AP 8th Class Social Important Questions Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

AP 8th Class Social Important Questions Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

These AP 8th Class Social Important Questions 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ will help students prepare well for the exams.

AP Board 8th Class Social 5th Lesson Important Questions and Answers అడవులు – వినియోగం, సంరక్షణ

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో అటవీ చట్టాల అమలు తీరు ఎలా ఉంది? ఇలా చట్టాలు ఉన్నా కూడా అడవులు అంతరించిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
మా ప్రాంతంలో అటవీ చట్టాల అమలు తీరు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఆక్రమణదారులు, గనుల యాజమానులు, గ్రామీణ వర్గాలవారు అడవులను దురుపయోగం చేస్తున్నారు. అడవుల పరిరక్షణ పట్ల సరియైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం. రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేకపోవడం దీనికి మరొక కారణంగా చెప్పవచ్చును. . యివేకాక అడవులు అంతరించిపోవడానికి ఇంకా అనేక కారణాలను చెప్పుకోవచ్చును.

ప్రశ్న 2.
నీకు తెలుసున్న వన మూలికా సంరక్షణ కేంద్రాల పేర్లను తెలుపుము.
జవాబు:

  1. వాలి, సుగ్రీవ ఔషధ మొక్క సంరక్షణ కేంద్రము
  2. కోరింగ వనమూలికల సంరక్షణ ప్రదేశము
  3. కార్తీకవనము. ఈ మూడు తూర్పుగోదావరి జిల్లాలో కలవు.

ప్రశ్న 3.
అడవి అంటే ఏమిటి?
జవాబు:
చెట్లతో ఉన్న విశాలమైన భూ భాగాన్ని అడవి అని అంటారు.

నిర్వచనం :

  1. ఒక స్థలం యొక్క పరిసరాలు అన్ని వైపులా చెట్లతో ఆవరించబడి ఉంటే దానిని అడవి అంటారు.
  2. పర్యావరణాన్ని అనేక రకాల చెట్లతో ప్రభావితం చేసే ప్రాంతాన్ని అడవి అంటారు.

AP 8th Class Social Important Questions Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

ప్రశ్న 4.
అడవులను ప్రజలు ఉపయోగించుకుంటూ వాటిని సంరక్షించడం సాధ్యమేనా?
జవాబు:
సాధ్యమే. మన ప్రస్తుత సమాజంలో తోటలున్న వారు వాటి కాయలను, పళ్ళను అమ్ముకుని సంరక్షించుకున్నట్లే వీటిని రక్షించవచ్చు.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ చిత్తు పటాన్ని గీసి అందులో మీ జిల్లా కేంద్రాన్ని గుర్తించండి.
జవాబు:
AP 8th Class Social Important Questions Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ 1
గమనిక : విద్యార్థులు వారి జిల్లాను గుర్తించగలరు.

ప్రశ్న 6.
“స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో గిరిజన ప్రజలను అడవులలో తమ సంప్రదాయ జీవితాలు కొనసాగించడానికి వదిలేయాలా లేదా స్థిర వ్యవసాయం, ఆధునిక విద్య, పారిశ్రామిక పని అవలంబించేలా చేయాలా అని జాతీయనాయకులు చర్చించారు”. – ఆ నాయకులలో మీరు కూడా ఒకడై ఉంటే ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తీకరించి ఉండేవారు? వివరించండి.
జవాబు:
నా అభిప్రాయం ఏమిటంటే గిరిజనులను అక్కడే జీవనం కొనసాగించమని చెబుతూ, అవకాశం ఉన్నంతవరకు వారికి అక్కడ నివాసానికి, వ్యవసాయానికి విద్యకు, వైద్యానికి, పనులు చేసుకోవడానికి కావలసిన సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. వారు అక్కడ తయారుచేసిన . ఉత్పత్తులను మార్కెట్లకు తరలించి వాటికి గిరాకీ ఉండేలా అవకాశం కల్పించాలి. అలాగేవారు మిగతా పట్టణ ప్రాంత మరియు గ్రామీణ ప్రాంతాల వారితో సంబంధాలను ఏర్పాటు చేసుకునేలాగా అవకాశాలను కల్పించడం.

ప్రశ్న 7.
వివిధ రకాల అడవులను గురించి వివరించండి.
జవాబు:
1. సతత హరిత అడవులు:
చాలా ఎ్కువ వర్షపాతంలో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖా ప్రాంతాలు, కేరళ, అండమాన్లలో సతత హరిత (ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్ల) అడవులు ఉంటాయి. చెట్లు ఆకులు రాల్చటానికీ, తిరిగి చిగుళ్లు తొడగటానికీ మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. కాబట్టి అవి ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. కదంబం, వెదురు, నేరేడు వంటి చెట్లు ఈ అడవులలో ఉంటాయి. ఇటువంటి అడవులు మన రాష్ట్రంలో లేవు.

2. ఆకురాల్చే అడవులు :
కొన్ని నెలలపాటే వర్షాలు పడి, సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. బాగా వేడిగా ఉండే నెలల్లో ఈ చెట్లు ఆకులను రాలుస్తాయి. మన రాష్ట్రంలో ఆకులు రాల్చే అడవులు రెండు రకాలు ఉన్నాయి. ఒక రకంలో ఎక్కువ మరొక రకంలో తక్కువ వర్షం పడుతుంది. వానలుపడే ప్రాంత ఆకులు రాల్చే అడవులలో వేగి, ఏగిస, మద్ది (అర్జున) బండారు, జిట్టెగి వంటి చెట్లు ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో మద్ది, టేకు, వెలగ, ఏగిస, ఏపి, చిగురు, బిల్లు, వేప, దిరిశన, బూరుగ, మోదుగ వంటి చెట్లు ఉంటాయి.

3. ముళ్ల అడవులు :
చాలా తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. తుమ్మ బులుసు, రేగు, చందనం, వేప వంటి చెట్లు ఇక్కడ పెరుగుతాయి. ఇటువంటి అడవులు వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఉన్నాయి.

4. సముద్ర తీరపు చిత్తడి అడవులు :
ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాల్లో చిత్తడి నేలల్లోనూ. సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి. ఉప్పునీటికీ, సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి.

AP 8th Class Social Important Questions Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

ప్రశ్న 8.
సుదీర్ఘ చర్చల తరువాత 2006 లో పార్లమెంటు “అటవీ హక్కుల చట్టాన్ని” చేసింది. గిరిజనులకు చెందిన అడవులలో వాళ్లకు సాంప్రదాయంగా వస్తున్న హక్కులను తిరస్కరించి గత రెండు వందల సంవత్సరాలుగా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశామని మొదటిసారి అంగీకరించారు. గిరిజనుల హక్కులు పునరుద్దరించకుండా అడవులను సంరక్షించడం అసాధ్యమని కూడా గుర్తించారు.
గిరిజనులకు జరిగిన అన్యాయం ఏమిటి? గిరిజనులకు అటవీ హక్కుల చట్టం – 2006 ఎంతవరకు సహాయ పడుతుందో వివరించండి.
జవాబు:
గిరిజనులకు జరిగిన అన్యాయం ఏమిటి?

  1. బ్రిటీష్ ప్రభుత్వ పాలనలో గిరిజనులు అడవులపై తమ హక్కును, నియంత్రణను క్రమక్రమంగా కోల్పోయారు.
  2. రైల్వే, రోడ్ల నిర్మాణం కోసం అడవులను నరికి వేయడం.
  3. కాగిత పరిశ్రమకు అవసరమైన చెట్లను నరకడం
  4. గిరిజనులను సహజ నివాసం అయిన అడవుల నుండి బలవంతంగా ఖాళీ చేయించడం.

2006 చట్టం

ఈ కొత్త చట్టం చేయటానికి మూడు ప్రధాన కారణాలను అది పేర్కొంది. అవి :
i) మొదటిది, అడవులను సంరక్షించటమే కాకుండా అదే సమయంలో అటవీ వాసులకు జీవనోపాధినీ, ఆహార భద్రతను కల్పించాల్సి ఉండడం.
ii) రెండవది, అడవుల సుస్థిరత, మనుగడలలో అంతర్భాగమైన అటవీ వాసులు తరతరాలుగా సాగుచేస్తున్న భూములపై, నివాస ప్రాంతాలపై హక్కులను వలసపాలనలో, స్వతంత్రం వచ్చిన తరవాత కూడా గుర్తించకపోవటం వల్ల జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేయాల్సి ఉండడం.
iii) మూడవది, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల (ఆనకట్టలు, పులుల అభయారణ్యాలు వంటివి) నిర్వాసితులైన వారితో సహా అటవీ వాసుల భూమీ హక్కులు, అడవిలోకి వెళ్ళే హక్కుల విషయంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభద్రతను పరిష్కరించాల్సి ఉండటం.
7) ఈ చట్టం వల్ల అటవీ వాసులకు, సంప్రదాయంగా అటవీ వస్తువులపై ఆధారపడిన వాళ్లకు అడవుల పై తమ హక్కులు తిరిగి లభించాయి, సాగుచేస్తున్న భూములకు పట్టాలు వచ్చాయి.
8) ఈ చట్టాన్ని సరిగా అమలు చేస్తే తరతరాలుగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కొంతమేరకు సరిదిద్దవచ్చు.

AP 8th Class Social Important Questions Chapter 4 ధృవ ప్రాంతాలు

AP 8th Class Social Important Questions Chapter 4 ధృవ ప్రాంతాలు

These AP 8th Class Social Important Questions 4th Lesson ధృవ ప్రాంతాలు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 4th Lesson Important Questions and Answers ధృవ ప్రాంతాలు

ప్రశ్న 1.
ఈ పటాన్ని పరిశీలించి వ్యాఖ్యానించండి.
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 4
జవాబు:
ఈ పటం ఉత్తర ధృవమండలాన్ని చూపిస్తోంది. దీనిపైన వృత్తాలు అక్షాంశాలను, గీతలు రేఖాంశాలను సూచిస్తున్నాయి. ఈ రేఖాంశాలు కలిసిన స్థానమే ఉత్తర ధృవం. భూమి భూమధ్యరేఖ వద్ద ఉబ్బెత్తుగానూ, ధృవాల వద్ద నొక్కబడి ఉందని తెలుస్తుంది. దీనిపై గ్రీన్లాండ్ దక్షిణ భాగాన్ని, దానికి కొంచెం పై నున్న భూభాగాన్ని పటాన్ని దాటించి చూపించారు. దీనిని నేను తప్పుగా భావిస్తున్నాను.

ప్రశ్న 2.
ఇచ్చిన చిత్రంలో మీకు ఏమైనా చెట్లు కనపడ్డాయా?
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 5
జవాబు:
లేదు. గడ్డి, చిన్న చిన్న పొదలు లాంటివి కనపడుతున్నాయి తప్ప చెట్లు కనపడటం లేదు.

ప్రశ్న 3.
ధృవ ప్రాంతంలో పూచే పూవుల చిత్రాలను, జంతువుల చిత్రాలను సేకరించి ఆల్బమ్ తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 6

ప్రశ్న 4.
ఒక ‘ఎస్కిమోను’ ఇంటర్వ్యూ చేసి వాటి వివరాలను రాయండి.
జవాబు:
నేను : మీ పేరు

ఎ : క్రిస్టోఫర్

నేను : మీరు ఏ ప్రాంతానికి చెందినవారు?

ఎ : కెనడా ఉత్తర ప్రాంతానికి చెందినవాణ్ణి.

నేను: మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారు?

ఎ : మా కుటుంబంలో రక్తసంబంధీకులం 7,8 మంది ఉన్నా, మేము దాదాపు 70మంది ఒక సమూహంగా జీవిస్తాము. అన్నీ, అందరికీ అనేది మా సమూహ నియమం.

నేను: మీకు ఈ వాతావరణం నచ్చుతుందా?

ఎ : మేము పుట్టి పెరిగింది. ఈ వాతావరణంలోనే మాకు వేరే వాతావరణం తెలియదు. ఈ మంచు, తెల్లదనం, యిక్కడి కాంతులు, జంతువులు, మా ఇళ్ళు, మా బృందాలు యివన్నీ నాకు చాలా యిష్టం.

నేను: మీరు మా ప్రాంతానికి వచ్చే అవకాశం వస్తే ఏం చేస్తారు?

ఎ : కచ్చితంగా తిరస్కరిస్తాను. ఎందుకంటే మేము ప్రకృతి ఒడిలో, ప్రకృతిని అనుసరిస్తూ జీవిస్తాము. ఎప్పుడైనా దీనిని కాదన్నవారు మాలో చాలా మంది అనేక యిబ్బందులు పడ్డారు. ఈ సమాజంలో మేము జీవించలేము అన్నది నిజం. కాబట్టి నేను తిరస్కరిస్తాను.

నేను : కృతజ్ఞతలు.

ఎ : కృతజ్ఞతలు.

AP 8th Class Social Important Questions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 5.
క్రింద నీయబడిన పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.

గ్లోబుమీద ఉత్తర ధృవం, దక్షిణ ధృవాలను చూశారు. ధృవాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ‘ధృవ ప్రాంతం’ అంటారు. ఈ అధ్యాయంలో మీరు ఉత్తర ధృవ ప్రాంతం గురించి తెలుసుకుంటారు. ఇది ఉత్తర ధృవం, దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని చూపిస్తుంది. ధృవప్రాంతం వేరే రంగులో చూపబడి ఉంది. ఈ ప్రాంత సరిహద్దును గమనించండి. దీనిని ‘ఆ టిక్ వృత్తం’ అంటారు.. ధృవ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అంటారు. టం అంటే చాలా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం. టండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి. వీటిని ‘టండ్రా వృక్షజాలం’ అంటారు.

1. ధృవ ప్రాంతం అని దేనిని అంటారు?
జవాబు:
ధృవాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ‘ధృవ ప్రాంతం’ అంటారు.

2. ఈ ప్రాంత సరిహద్దును ఏమంటారు?
జవాబు:
ఈ ప్రాంత సరిహద్దును ‘ఆర్కిటిక్ వృత్తం’ అంటారు.

3. టండ్రా ప్రాంతం అని దేనిని అంటారు?
జవాబు:
ధృవ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అంటారు.

4. టండ్రా అంటే అర్థం ఏమిటి?
జవాబు:
టండ్రా అంటే చాలా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం.

5. టండ్రా వృక్షజాలం అని దేనిని అంటారు?
జవాబు:
టండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి. వీటిని ‘టండ్రా వృక్షజాలం’ అంటారు.

ప్రశ్న 6.
క్రింది పేరాను చదివి దిగువ నీయబడిన ప్రశ్నలకు సమాధానమునిమ్ము.
జవాబు:
మతపరమైన నమ్మకాలు :

జీవితం, ఆరోగ్యం , రోగాలు, ఆకలి, మరణాల పట్ల ఎస్కిమోల మతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది. వీటన్నింటినీ ఆత్మలు నియంత్రిస్తాయని ఎస్కిమోలు నమ్ముతారు. అన్ని ఎస్కిమో బృందాలు శిల అనే అతీత శక్తిని, ఆత్మలను (జీవనం, ఆరోగ్యం , ఆహార దేవత అయిన సెడ్నా వంటి దేవతలు) నమ్ముతాయి. మనుషులు, జంతువుల ఆత్మలు చనిపోయిన తరవాత కూడా జీవించి ఉంటాయని వాళ్లు నమ్ముతారు. అయితే ప్రతి బృందానికి తమదైన నమ్మకాలు, సంప్రదాయాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి, కుటుంబం లేదా బృందానికి ఒక ‘నిషిధమైనది’ (టాబూ) ఉంటుంది. దీని ప్రకారం వాళ్లు ఫలానా ఆహారం తినకూడదు వంటి ఆచారాలు ఉంటాయి. జననం, మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు, లేదా అస్సలు దొరకనప్పుడు ప్రతిబ్బందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాయి. ఈ ఆచారాలను నిర్వహించే వారిని షమాన్లు అంటారు. ఆత్మల ప్రపంచంతో అనుసంధానానికి ఈ షమాన్లు సహాయం చేస్తారని నమ్ముతారు. తమ ఆచారాలలో మాయాజాలాన్ని, నాటకీయతను, అచేతనను షమాన్లు ఉపయోగిస్తారు.

1. ఎస్కిమోల మతం వేటిపట్ల ఆసక్తి చూపుతుంది?
జవాబు:
జీవితం, ఆరోగ్యం , రోగాలు, ఆకలి, మరణాల పట్ల ఎస్కిమోల మతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది.

2. అందరు ఎస్కిమోలు వేటిని నమ్ముతారు?
జవాబు:
అన్ని ఎస్కిమో బృందాలు శిల అనే అతీత శక్తిని, ఆత్మలను (జీవనం, ఆరోగ్యం , ఆహార దేవత అయిన సెడ్నా వంటి దేవతలు) నమ్ముతాయి. మనుషులు, జంతువుల ఆత్మలు చనిపోయిన తరవాత కూడా జీవించి ఉంటాయని వాళ్లు నమ్ముతారు.

3. ‘టాబూ’ అంటే ఏమిటి?
జవాబు:
‘టాబూ’ అంటే నిషిద్ధమైనది అని అర్థం.

4. వీరు సంబరాలు ఎప్పుడు చేసుకుంటారు?
జవాబు:
జననం, మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు, లేదా అస్సలు దొరకనప్పుడు ప్రతి బృందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాయి.

5. షమాన్లు ఏమి చేస్తారు?
జవాబు:
తమ ఆచారాలలో మాయాజాలాన్ని, నాటకీయతను, అచేతనను షమాన్లు ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
ఎస్కిమోల సామూహిక జీవనాన్ని ప్రశంసించండి.
జవాబు:
ఎస్కిమోలు బృందాలుగా జీవిస్తారు. వీరు సామూహికంగా సంచారం చేస్తూ జీవనం గడుపుతారు. వేట, వంట, ఆవాసం, నివాసం, కష్టం, సుఖం, దుఃఖం అన్నీ కలిసే పంచుకుంటారు. నేటి నాగరిక సమాజాలలో లేని ఐకమత్యం వీరిలో నేటికీ జీవించి ఉండటం నిజంగా ప్రశంసించదగిన అంశం.

ప్రశ్న 8.
ధృవ ప్రాంత సరిహద్దును ఏమంటారు?
జవాబు:
ధృవ ప్రాంత సరిహద్దును ‘ఆర్కిటిక్ వృత్తం’ అంటారు.

ప్రశ్న 9.
దిగ్మండలం అంటే ఏమిటి?
జవాబు:
భూమి, ఆకాశం కలసినట్టు అనిపించే ప్రదేశాన్ని క్షితిజం లేదా దిగ్మండలం అంటారు.

ప్రశ్న 10.
‘ఐర్స్’ అంటే ఏమిటి?
జవాబు:
పెద్ద పెద్ద మంచుగడ్డలు విడిపోయి నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవేశిస్తాయి.. వీటిని ‘ఐస్ బెర్స్’ అంటారు.

ప్రశ్న 11.
ఎస్కిమోల ప్రధాన భాషలు ఏవి?
జవాబు:
ఎస్కిమోల ప్రధాన భాషలు 3. అవి : అల్యుయిట్, యుపిక్, ఇన్యుపిక్.

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 12.
పర్కాలు అంటే ఏమిటి?
జవాబు:
ఎస్కిమోలు ముకులనే బూట్లు, ప్యాంట్లు, తలను కట్టే టోపీ ఉండే కోట్లు మొ||న వాటిని ప్కలు అంటారు.

ప్రశ్న 13.
ఎస్కిమోలు మొట్టమొదటి సారిగా చూసినదెవరు?
జవాబు:
ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటివాళ్ళు ఐలాండ్ నుండి వచ్చి గ్రీన్లాండ్ లో నివాసం ఏర్పరుచుకున్న వైకింగ్లు.

ప్రశ్న 14.
ధృవప్రాంతాలు ఇతర ప్రాంతాలకంటే చాలా భిన్నమైనవి. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే ధృవప్రాంతాలకు సంబంధించిన వివిధ అంశాలను వివరించండి.
జవాబు:
మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు

  1. ఈ ప్రాంతం ఆర్కిటిక్ వలయానికి, ఉత్తర ధృవానికి మధ్యలో ఉంది.
  2. ఇక్కడ పగటి సమయం 6 నెలలు, రాత్రి సమయం 6 నెలలకు ఒకసారి వస్తాయి.
  3. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం మాత్రమే ఉంటాయి.
  4. వీరు వేటాడిన మాంసాన్ని, చేపలను తింటారు.
  5. ఆహారధాన్యాలు, కూరగాయలు చాలా తక్కువగా లభిస్తాయి.
  6. వీరు మంచుతో కట్టిన ఇళ్ళలో నివశిస్తారు.
  7. వీరు జంతువుల చర్మాన్ని దుస్తులుగా ధరిస్తారు.
  8. ఇక్కడ గడ్డి పొదలు మాత్రమే పెరుగుతాయి.
  9. ఇక్కడ ప్రజలు సంచార మరియు సామాహిక జీవితాన్ని గడుపుతారు.

ప్రశ్న 15.
క్రింద ఇవ్వబడిన సమాచారం చదివి, దిగువ ప్రశ్నలకు జవాబులివ్వండి.

ఎస్కిమోల ఆహారంలో ప్రధానంగా మాంసం, చేపలు, కొవ్వు పదార్థం ఉంటాయి. కూరగాయలు చాలా అరుదు. వాళ్లు ఆహారాన్ని ఏ మాత్రం వృధా చేయరు. వేటాడటం, చేపలు పట్టడం మీద ఎస్కిమోలు ఆధారపడి ఉన్నారు కాబట్టి చేపలు, జంతువులు తగినంతగా దొరకనప్పుడు ఆకలితో ఉండటం వాళ్ళకు పరిపాటి. నేలను శాశ్వతంగా గడ్డకట్టినంత వరకు మంచును తవ్వి వేసవిలో పట్టుకున్న చేపలు, జంతువులను పాతిపెట్టడం ద్వారా నిల్వ ఉంచుతారు. వాటిపైన రాళ్లు పెట్టడం ద్వారా ఇతర జంతువులు తినకుండా కాపాడుకుంటారు.
i) ఎస్కిమోల ఆహారంలో కూరగాయలు అరుదు. ఎందుకు?
ii) ఎస్కిమోలు తమ ఆహారాన్ని ఎలా సంపాదిస్తారు?
iii) ఎస్కిమోలు తమ ఆహారాన్ని ఎలా నిల్వ చేసుకుంటారు?
iv) ఆహార వినియోగం విషయంలో ఎస్కిమోల నుండి గ్రహించదగిన ఒక మంచి అంశాన్ని తెలపండి.
జవాబు:
i) ధృవ ప్రాంతాలలో మొక్కలు పెరిగే వాతావరణం లేదు. అందువలన కూరగాయలు అరుదు.
ii) ఎస్కిమోలు, వేటాడటం, చేపలు పట్టడం ద్వారా ఆహారాన్ని సంపాదిస్తారు.
iii) ఎస్కిమోలు నేలను శాశ్వతంగా గడ్డకట్టినంత వరకు మంచును తవ్వి వేసవిలో పట్టుకున్న చేపలు, జంతువులను పాతి పెట్టడం ద్వారా నిల్వ ఉంచుతారు.
iv) ఎస్కిమోలు ఆహారాన్ని ఏ మాత్రం వృథా చేయరు.

AP 8th Class Social Important Questions Chapter 3 భూ చలనాలు – రుతువులు

AP 8th Class Social Important Questions Chapter 3 భూ చలనాలు – రుతువులు

These AP 8th Class Social Important Questions 3rd Lesson భూ చలనాలు – రుతువులు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 3rd Lesson Important Questions and Answers భూ చలనాలు – రుతువులు

ప్రశ్న 1.
భూమి యొక్క అక్షంను మనం ఎక్కడ నుండి చూడవచ్చు?
జవాబు:
భూమి యొక్క అక్షం ఒక ఊహా జనితరేఖ. దీనిని మనం కంటితో చూడలేము.

ప్రశ్న 2.
భూమి యొక్క అక్షంను మనం ఎక్కడ నుండి చూడవచ్చు?
జవాబు:
చూడలేము. ఎందుకంటే భూమి యొక్క అక్షం ఒక ఊహాజనిత రేఖ. దీనిని మనం కంటితో చూడలేము.

ప్రశ్న 3.
భూమి రోజూ ఎంతో వేగంతో తిరుగుతున్నది. కానీ ఆ విషయం భూమిపై నున్న మనకు ఎందుకు తెలియటం లేదు?
జవాబు:
భూమి, భూమిపై నున్న మనుషులు, ఇళ్ళు, చెట్లు, జంతువులు, భూమిని ఆవరించియున్న వాతావరణము, అన్నిటితో సహా తిరుగుచున్నది. అందువలన ఈ విషయం మనకు తెలియటం లేదు.

ప్రశ్న 4.
ఏ కాలంలో భూమి సూర్యుని వైపుకి వాలి ఉంటుంది?
జవాబు:
వేసవి కాలంలో భూమి సూర్యుని వైపుకి వాలి ఉంటుంది.

AP 8th Class Social Important Questions Chapter 3 భూ చలనాలు – రుతువులు

ప్రశ్న 5.
కాలాలను ప్రభావితం చేసే అంశాలు ఏవి?
జవాబు:
కాలాలను ప్రభావితం చేసే అంశాలు : వీటిని అర్థం చేసుకోవటానికి అనేక అంశాల మధ్య ఉండే సంక్లిష్ట సంబంధాలను అర్థం చేసుకోవాలి. ఇవి :

  1. భూమి బంతిలాగా గోళాకారంలో ఉండటం, దాని ఉపరితలం ఒంపు తిరిగి ఉండటం.
  2. భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగటం (భూభ్రమణం).
  3. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం ఒంపు కలిగి ఉండటం.
  4. సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరగటం (పరిభ్రమణం).

ప్రశ్న 6.
భూమి భ్రమణాన్ని, పరిభ్రమణాన్ని ప్రశంసించండి.
జవాబు:
భూమి పుట్టినది మొదలు ఈనాటి వరకూ అలుపెరగక భ్రమణ, పరిభ్రమణాలను జరుపుతోంది. అది ఒక్క క్షణం అలుపు తీర్చుకున్నా భూమి మీద ప్రాణికోటి మిగలదు. కాబట్టి భూమికి కృతజ్ఞతాపూర్వక వందనములు.

ప్రశ్న 6.
భూమిపైన ఉన్న కాలాలన్నింటిలోకి ఏది ముఖ్యమని నీవు భావిస్తున్నావు?
జవాబు:
భూమిపై ఉన్న కాలాలన్నీ ముఖ్యమైనవే అని నా భావన. ఎండాకాలంలో ఎండిన నేలకి వాన స్వాంతన. ఈ రెండింటి తర్వాత చలి ఎంతో హాయినిస్తుంది. చలికాలం తరువాత ఎండ కూడా హాయిగానే ఉంటుంది. అయితే వాస్తవంగా ఏ కాలం లేకపోయినా భూమి మీద మానవ మనుగడ అసాధ్యం అని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 8.
ముఖ్యమైన కాలాలు చెప్పండి.
జవాబు:
ముఖ్యమైన కాలాలు ఎండాకాలం, వానాకాలం మరియు చలికాలం.

ప్రశ్న 9.
భూ భ్రమణం, భూ పరిభ్రమణం ప్రశంసించండి.
జవాబు:
భూ భ్రమణం, భూ పరిభ్రమణం సమస్త జీవరాసులకు ప్రాణాధారం.

ప్రశ్న 10.
భూమిపైన ఉన్న కాలాలన్నింటిలో ఏది ముఖ్యమైనది?
జవాబు:
భూమిపై ఉన్న కాలాలన్నీ ముఖ్యమైనవే. ఏ కాలం లేకపోయినా మానవాళి మనుగడ శూన్యమౌతుంది.

ప్రశ్న 11.
1. క్రింది పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయంది.
AP 8th Class Social Important Questions Chapter 3 భూ చలనాలు – రుతువులు 1
ఎ) కర్కటరేఖ పై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు?
బి) సూర్యుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దక్షిణార్ధగోళంలో ఉంటాడు ?
జవాబు:
ఎ) కర్కటరేఖ పై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు జూన్ – 21
బి) సెప్టెంబర్ 23 నుండి డిసెంబర్ 22 వరకు దక్షిణార్ధ గోళంలో ఉంటాడు.

ప్రశ్న 12.
శీతోష్ణస్థితి ఆధారంగా భారతదేశంలోని కాలాలను ఎన్ని ఋతువులుగా విభజించారు? అవి ఏవి?
జవాబు:
శీతోష్ణస్థితిని బట్టి భారతదేశంలోని కాలాలను 6 ఋతువులుగా విభజించారు. అవి :

  1. వసంత ఋతువు
  2. గ్రీష్మ ఋతువు
  3. వర్ష ఋతువు
  4. శరదృతువు
  5. హేమంత ఋతువు
  6. శిశిర ఋతువు

AP 8th Class Social Important Questions Chapter 3 భూ చలనాలు – రుతువులు

ప్రశ్న 13.
విషువత్తులు అనగానేమి? అవి ఏ రోజులలో సంభవిస్తాయి?
జవాబు:
విషువతులు అనగా పగటి కాల సమయం మరియు రాత్రికాల సమయం రెండూ సమానంగా ఉండటం.

సాధారణంగా మార్చి 21, సెప్టెంబర్ – 23 ఈ రెండు తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. కావున ఈ రెండు రోజులను విషువత్తులు అంటారు.

AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

These AP 8th Class Social Important Questions 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 2nd Lesson Important Questions and Answers సూర్యుడు – శక్తి వనరు

ప్రశ్న 1.
కింద ఉన్న పట్టికలో భారతదేశంలోని కొన్ని పట్టణాలలో జనవరి 10న సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పట్టిక కింద ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

ప్రదేశం సూర్యోదయం సూర్యాస్తమయం
హైదరాబాదు, తెలంగాణ 6 : 49 5:58
ఆగ్రా, ఉత్తరప్రదేశ్ 7: 09 5: 42
మధురై, తమిళనాడు 6: 37 6: 12
నాగపూర్, మహారాష్ట్ర 6:53 5: 48
విశాఖపట్టణం , ఆం.ప్ర. 6: 29 5:38
కోహిమా, నాగాలాండ్ 6: 02 4 : 40

1. పైన ఉన్న ఆరు పట్టణాలలో ముందుగా సూర్యోదయం ఎక్కడ అవుతుంది?
జవాబు:
కోహిమా, నాగాలాండ్

2. ఏ పట్టణంలో అన్నిటికంటే చివర సూర్యాస్తమయం అవుతుంది?
జవాబు:
మధురై, తమిళనాడు

3. ఈ ఆరు పట్టణాలలో పగటికాలం ఎంత? (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్య ఉన్న కాలం పగటి కాలం అవుతుంది.)
జవాబు:
హైదరాబాదు : 11.09 ని॥లు
ఆగ్రా : 10.33 ని॥లు
మధురై : 11.35 ని॥లు
నాగపూర్ : 10.55 ని॥లు
విశాఖపట్టణం : 11.09 ని॥లు
కోహిమా : 10.38 ని॥లు

ప్రశ్న 2.
ఉష్ణోగ్రత, వర్షపాతం జీవితాలను ప్రభావితం చేస్తాయని ఎట్లు చెప్పగలవు?
జవాబు:
ఉష్ణోగ్రత, వర్షపాతం జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. సూర్యరశ్మి, నీటిపై ఆధారపడి చెట్లు, జంతువులు బతుకుతాయి. చాలా కొద్ది రకాల చెట్లు మాత్రమే వేడిగా ఉండే ప్రాంతాలలో పెరుగుతాయి. చలి ప్రాంతాలలో మరికొన్ని పెరుగుతాయి. బాగా చలి ప్రాంతాలలో ఏవీ పెరగవు. ఈ విధంగా వృక్ష, జంతుజాలాలలో వైవిధ్యత ఉంది.

ప్రశ్న 3.
ఉష్ణోగ్రతకు, వర్షపాతానికి మధ్య గల సంబంధమేమి?
జవాబు:
రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులు, వానలను ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు వర్షాలు కూడా బాగా కురుస్తాయి.

ప్రశ్న 4.
సౌరశక్తి ఏయే రూపాలలో ఉంటుంది?
జవాబు:
సౌరశక్తి కాంతి, వేడి, అల్ట్రావయొలెట్ తరంగాలు, రేడియో తరంగాలు మరియు X – కిరణాల రూపంలో ఉంటుంది.

ప్రశ్న 5.
భూగోళం వేడెక్కటం అంటే ఏమిటి?
జవాబు:
భూమి మీద వాతావరణంలో (CO) కార్బన్-డై-ఆక్సెడ్ అధికమవడం మూలంగా, వేడి వికిరణం తగ్గుతుంది. భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే భూగోళం వేడెక్కటం అంటారు.

AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

ప్రశ్న 6.
వేడిమి సమతుల్యం అంటే ఏమిటి?
జవాబు:
సూర్యుని నుండి భూమి పొందే వేడి వివిధ పద్ధతులలో తిరిగి వికిరణం చెందుతుంది. కొంతమాత్రమే భూమి గ్రహిస్తుంది. దీనివలన భూమి మీద భరించగలిగే స్థాయిలో మాత్రమే వేడి ఉంటుంది. దీనినే వేడిమి సమతుల్యం అంటారు.

ప్రశ్న 7.
భూమి మీద ఉష్ణోగ్రతలలో మార్పులకు గల కారణాలు ఏవి?
జవాబు:
భూమి మీద ఉష్ణోగ్రతలలో మార్పులకు అనేక కారణాలున్నాయి. అవి :

  1. అక్షాంశము
  2. ఎత్తు
  3. సముద్రం నుండి దూరము
  4. సముద్ర తరంగాలు
  5. పర్వతాలు
  6. గాలులు మొ||నవి.

ప్రశ్న 8.
సూర్యకిరణాలు, సౌరశక్తి అనగా నేమి?
జవాబు:
భూగోళంపై శక్తికి సూర్యుడు మూలవనరు. సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రం. కాంతి, వేడిమి రూపంలో అది శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే ఈ శక్తిని సౌర వికిరణం అంటారు. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించటాన్ని వికిరణం అంటారు. సూర్యుడి నుంచి మనకు శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది.

ప్రశ్న 9.
ఏఏ ప్రాంతాల ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి?
జవాబు:
సముద్రానికి దగ్గరగా, దూరంగా ఉన్న ప్రాంతాల మధ్య సాధారణంగా ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. కొండపైన కొండ కింద ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

ప్రశ్న 10.
హరిత గృహాలు గూర్చి వ్రాయుము.
జవాబు:
మొక్కలకు అనువైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించటం ద్వారా అన్ని చోట్ల పంటలు పండించటానికి మానవులు ప్రయత్నించటం ఆశక్తికరంగా ఉంటుంది. బాగా చలిగా ఉండే ప్రదేశాలలో హరిత గృహాలు నిర్మించి కూరగాయలు, పళ్ళు పండిస్తున్నారు. హరిత గృహాల గోడలు పారదర్శకంగా ఉండి ఎండను లోపలికి రానిస్తాయి. కానీ బయటకు వెళ్ళనివ్వవు. వారికి అనువుగా మడులు కట్టి సాగునీరు ఇచ్చి నీటిని నిల్వ కడతారు.

AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

ప్రశ్న 11.
సూర్యుడు ప్రాణకోటికి ప్రాథమిక శక్తి వనరు. సూర్యరశ్మిని చెట్లు ఆహారంగా మార్చేసే ఫ్యాక్టరీలు, అటువంటి చెట్లను, అడవులను మనం పెంచుతున్నామా? తగ్గిస్తున్నామా? చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలు చెట్లను పెంచే మన బాధ్యతను గురించి వివరించండి.
జవాబు:
మనం పెంచే చెట్లకన్నా అధికశాతం చెట్లను నరికివేస్తున్నాము.

చెట్లు వలన ఉపయోగాలు :

  1. చెట్లు వాతావరణంలోని గాలి వేడిని తగ్గిస్తాయి.
  2. చెట్లు సహజ ఎయిర్ కండిషనర్లుగా పనిచేస్తాయి.
  3. చెట్లు ధ్వని కాలుష్యాన్ని తగ్గిస్తాయి.
  4. చెట్ల నుంచి రాలిన ఆకులు నేలలోని ఉష్టాన్ని తగ్గిస్తాయి.
  5. చెట్లు పక్షులకు, కొన్ని జంతువులకు ఆవాసాన్నీ, ఆహారాన్ని అందిస్తాయి.
  6. చెట్లు CO2 ను తీసుకుని O2 ను వదిలి మనకు ఊపిరినిస్తాయి.
  7. చెట్లు నీటిని సముద్రంలోనికి పోకుండా పట్టి ఉంచుతాయి. నేలలో సారం కొట్టుకుపోకుండా ఉంచుతాయి. నీటిని నేలలోనికి ఇంకిపోయేలా చేస్తాయి. దీనిమూలంగా కలుషితమైన ఎక్కువ చోటు పారకుండా నేలలోనికి యింకిపోతాయి.

ప్రశ్న 12.
హరిత గృహాలను ప్రశంసించండి.
జవాబు:
హరిత గృహాలనే గాజు గృహాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొక్కలను పెంచడానికి నిర్మిస్తారు. ఇవి నియంత్రించబడిన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇవి మంచి వేడిని, నీటిని మొక్కలకి అందిస్తాయి. వీటి సృష్టి చాలా అద్భుతం.

ప్రశ్న 13.
‘భూగోళం వేడెక్కడం’ మూలంగా ఏం జరుగుతుంది?
జవాబు:
‘భూగోళం వేడెక్కడం’ మూలంగా ధృవాలలో ఉన్న మంచు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతాయి. భూమి మీద ఖండాలన్నీ నీట మునుగుతాయి.

ప్రశ్న 14.
హరిత గృహాలను ప్రశంసించండి.
జవాబు:
హరిత గృహాలనే గాజు గృహాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొక్కలను పెంచడానికి నిర్మిస్తారు. ఇవి నియంత్రించబడిన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇవి మంచి వేడిని, నీటిని మొక్కలకి అందిస్తాయి. వీటి సృష్టి చాలా అద్భుతం.

AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

ప్రశ్న 15.
భూగోళం వేడెక్కడం,మూలంగా ఏం జరుగుతుంది?
జవాబు:
భూగోళం వేడెక్కడం మూలంగా ధృవాలలో ఉన్న మంచు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతాయి. భూమి మీద ఖండాలన్నీ నీట మునిగిపోతాయి.

ప్రశ్న 16.
ఈ క్రింది ఉన్న పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రదేశం సూర్యోదయం సూర్యాస్తమయం
హైదరాబాదు, తెలంగాణ 6 : 49 5 : 58
ఆగ్రా, ఉత్తరప్రదేశ్ 7 : 09 5 : 42
మధురై, తమిళనాడు 6 : 37 5 : 12
నాగపూర్, మహారాష్ట్ర 6 : 53 5 : 48
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్ 6 : 29 5 : 38
కోహిమా, నాగాలాండ్ 6 : 02 4 : 40

ఎ) ముందుగా సూర్యోదయం అయ్యే పట్టణం ఏది?
బి) ఏ పట్టణంలో అన్నిటికంటే చివరిగా సూర్యాస్తమయం అవుతుంది?
సి) విశాఖపట్టణం పగటి కాలం ఎంత?
డి) ఏ కాలంలో (సీజన్స్) పగటి వ్యవధి తక్కువ?
జవాబు:
ఎ) ముందుగా సూర్యోదయం అయ్యే పట్టణం నాగాలాండ్ రాష్ట్రములోని కోహిమా.
బి) చివరిగా సూర్యాస్తమయం అయ్యే పట్టణం తమిళనాడులోని, మధురై.
సి) విశాఖపట్టణం పగటికాలం సమయం 11 గంటల 9 నిముషాలు.
డి) పగలు వ్యవధి తక్కువగా ఉండే కాలం శీతాకాలం

ప్రశ్న 17.
సముద్ర ప్రభావిత, ఖండాంతర్గత శీతోష్ణస్థితుల మధ్యగల భేదమును వివరించండి.
జవాబు:
సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి :
సముద్ర తీరాన ఉండే ప్రదేశాలలో సాధారణంగా సంవత్సరమంతా శీతోష్ణస్థితులు ఒకేరకంగా ఉంటాయి. దీనిని సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి అంటారు.

ఖండాతర్గత శీతోష్ణస్థితి :
సముద్రతీరానికి దూరంగా ఉండే ప్రాంతాలలో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడాలు ఉంటాయి. ఇలా ఉండటాన్ని ఖండాతర్గత శీతోష్ణస్థితి అంటారు.

ప్రశ్న 18.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భూగోళం వేడెక్కటం (Global warming) దీనియొక్క రెండు దుష్పరిణామాలు రాయండి.
జవాబు:
భూగోళం వేడెక్కడం మూలంగా ధృవాలలో ఉన్న మంచు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతాయి. భూమి మీద ఖండాలన్నీ నీట మునిగిపోతాయి.

ప్రశ్న 19.
క్రింది పట్టికు పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు 1
ఎ) పై పట్టిక ప్రకారం ఎక్కువ శక్తిని గ్రహించునది?
బి) అన్ని అంశాల ద్వారా మొత్తం ఎంత శాతం శక్తి పరావర్తనం చేయబడుతుంది?
జవాబు:
ఎ) భూమి ఎక్కువ శక్తిని గ్రహిస్తుంది – 54%
బి) పరావర్తనం చెందే శక్తి శాతం – 30%

ప్రశ్న 20.
“కార్బన్ డై ఆక్సైడ్” లాంటి వాయువులు వాతావరణంలో పెరగటం భూగోళం వేడెక్కడానికి ఎలా దారి తీస్తున్నది?
జవాబు:
భూ వికిరణం ద్వారా వెలువడే వేడి వాతావరణం నుంచి బయటకు పోకుండా కార్బన్ డై ఆక్సెడ్ లాంటి వాయువులు అడ్డుకుంటున్నాయి. ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమవుతున్నది. తద్వారా భూగోళం వేడెక్కడానికి దారి తీస్తున్నది.

ప్రశ్న 21.
క్రింది గ్రాఫ్ ను చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు 2
ఎ) ప్రాంతం A యొక్క సంవత్సరంలోని ఉష్ణోగ్రత క్రమం ఏమిటి?
బి) రెండు ప్రాంతాలలో ఏది పర్వత ప్రాంతం అయి వుంటుంది?
జవాబు:
ఎ) ప్రాంతం A యొక్క సంవత్సరంలోని ఉష్ణోగ్రత క్రమంలో ఏ మార్పులు పెద్దగా లేవు.
బి) ప్రాంతం A పర్వత ప్రాంతం అయ్యే అవకాశాలు ఎక్కువ.

ప్రశ్న 22.
పునరుద్ధరింపబడే వనరులు మరియు అంతరించిపోయే వనరుల మధ్య తేడా ఏమిటి? ఒక్కొక్క దానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. పునరుద్దరించేబడే వనరులు అనగా ఒకసారి ఉపయోగించిన తరువాత కూడా తిరిగి ఉపయోగించడానికి లేదా తిరిగి ఉత్పత్తి చేయడానికి అవకాశం గల వనరులు
    ఉదా : సౌరశక్తి.
  2. అంతరించిపోయే వనరులు అనగా ఒకసారి ఉపయోగించిన తరువాత తిరిగి ఉపయోగించడానికి లేదా ఉత్పత్తి చేయడానికి వీలు కానివి.
    ఉదా : బొగ్గు, పెట్రోలియం.

AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

ప్రశ్న 23.
“కార్బన్ డై ఆక్సైడ్” లాంటి వాయువులు వాతావరణంలో పెరగటం భూగోళం వేడెక్కడానికి ఎలా దారి తీస్తున్నది?
జవాబు:
భూ వికిరణం ద్వారా వెలువడే వేడి వాతావరణం నుంచి బయటకు పోకుండా కార్బన్ డై ఆక్సెడ్ లాంటి వాయువులు అడ్డుకుంటున్నాయి. ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమవుతున్నది.. తద్వారా భూగోళం వేడెక్కడానికి దారి తీస్తున్నది.

AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

These AP 8th Class Social Important Questions 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ will help students prepare well for the exams.

AP Board 8th Class Social 1st Lesson Important Questions and Answers పటాల అధ్యయనం – విశ్లేషణ

ప్రశ్న 1.
పూర్వకాలంలో వారు పటాలను ఎలా తయారుచేసేవారు?
జవాబు:
నాటి భౌగోళిక శాస్త్రవేత్తలు విరివిగా ప్రయాణాలు చేసి వాటికి సంబంధించిన వివరాలను పుస్తకాల రూపంలో నమోదు చేసేవారు. పటాలను తయారు చేసేవారు. వీటిని ఆధారంగా చేసుకుని పటాలను తయారు చేసేవారు. ఇవి వాస్తవ దూరంగా ఉండి పెద్దగా వాడుకలోనికి రాలేదు. కానీ, చరిత్రకారులు వీటిని ఉపయోగించి పటాలను తిరిగి తయారు చేసేవారు.

ప్రశ్న 2.
ఎవరెస్టు శిఖరానికి ఆ పేరు ఎట్లు వచ్చింది?
జవాబు:
1802లో విలియం లాంటన్ ఒక ప్రముఖ సర్వేను చెన్నై నుండి ప్రారంభించారు. ఇది హిమాలయాల వరకు రేఖాంశాలను, ఇతర ఎత్తులను తెలుసుకోవడానికి ఉద్దేశించబడినది. ఈ సర్వే జార్జి ఎవరెస్ట్ చే పూర్తి చేయబడింది. ఈ సర్వేలోనే ‘ఎవరెస్ట్’ అన్ని శిఖరాలలోకి ఎత్తైనది అని ప్రపంచానికి వెల్లడైంది. కాబట్టి ఆ శిఖరానికి ఆయన పేరు పెట్టడం జరిగింది.

ప్రశ్న 3.
పటాలకు, చిత్రాలకు మధ్య గల భేదమేమి?
జవాబు:
పటం :
ముఖ్యమని భావించే అంశాలను చూపించడానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు.

చిత్రం :
చిత్రం పటం వలే ఆ ప్రాంతంలోని నిజమైన అంశాలను కాక కేవలం కంటికి కనిపించే వాటిని మాత్రమే చూపిస్తుంది.

ప్రశ్న 4.
నిర్దేశిత పటాలను ఎట్లు చదవాలి?
జవాబు:

  1. ఒకే అంశంపై కేంద్రీకరించబడే పటాలను నిర్దేశిత పటాలు అంటారు.
  2. వీటిని చదవడానికి మనకు పటాలలో ఉపయోగించే గుర్తులు, రంగులు, వివిధ ఆచ్ఛాదనలు తెలిసి ఉండాలి.
    ఉదా : ముదురు ఊదా : కొండలు, నలుపు : సరిహద్దులు
    అప్పుడు మాత్రమే నిర్దేశిత పటాలను మనం చదవగలగుతాం.

ప్రశ్న 5.
ఐసోలైన్స్ అంటే ఏమిటి?
జవాబు:
సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని ఐసోలైన్స్ అంటారు.

ప్రశ్న 6.
కాంటూరు రేఖల వలన ఉపయోగమేమి?
జవాబు:
కాంటూరు రేఖల వలన ఒక ప్రాంతపు ఎత్తును, పల్లాన్ని సులభంగా తెలుసుకోవచ్చును.

ప్రశ్న 7.
పూర్వకాలం నాటి పటం తయారీదారుల పేర్లను తెలపండి.
జవాబు:
గ్రీకులు, అరబ్బులు, చైనీయులు, సుమేరియన్లు, బాబిలోనియన్లు మరియు యూరోపియన్లు మొదలైనవారు పూర్వకాలం ఆనాటి పటం తయారీదారులు.

AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

ప్రశ్న 8.
సాంప్రదాయ సంకేతాలు అంటే ఏమిటి?
జవాబు:
పూర్వకాలం నాటి నుండి పటాల తయారీదారులు తమ సౌలభ్యం కోసం కొన్ని గుర్తులను ఉపయోగించేవారు. వాటినే సాంప్రదాయ సంకేతాలు అంటారు.

ప్రశ్న 9.
ఈ ప్రక్క నీయబడిన చిత్రాన్ని గమనించి మీ అభిప్రాయాన్ని రాయండి.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 1
జవాబు:

  1. ఈ పటం బైబిలును అనుసరించి ప్రపంచ నమూనా.
  2. ఇది చుట్టూ సముద్రంచే ఆవరించబడి, మూడు ఖండాలుగా విభజించబడినది.
  3. అవి ఆసియా, ఐరోపా మరియు ఆఫ్రికా.
  4. వీటిలో ఆసియా జెరూసలెంను కలిగి ఉన్న కారణంగా ప్రాముఖ్యతను సంతరించుకుని ఆ పటంలో సగభాగాన్ని ఆక్రమించింది.
  5. జెరూసలెం క్రీస్తు జన్మస్థలం. కావున అది పై భాగంలో చూపబడినది.

ప్రశ్న 10.
ప్రక్కనీయబడిన చిత్రాన్ని పరిశీలించి, ‘మెర్కేటర్ ప్రక్షేపణ’ పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 2
జవాబు:

  1. గెరార్డస్ మెర్కేటర్ ప్రఖ్యాతి గాంచిన భౌగోళిక శాస్త్రవేత్త మరియు కార్టో గ్రాఫర్.
  2. ఈయన ప్రక్షేపణ ప్రకారం భూమధ్యరేఖ నుండి ధృవాల వైపుకు వెళ్ళేకొలదీ ప్రదేశాల ఆకారాలు పెద్దవిగా కనబడతాయి.
    ఉదా : 1. గ్రీన్‌లాండ్ వాస్తవానికి చిన్నదైనా, ప్రపంచ పటంలో ఆఫ్రికా ఖండం అంత కనబడుతుంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్‌లాండ్, కన్నా 14 రెట్లు పెద్దది. గ్రీన్ లాండ్ అర్జెంటీనా దేశమంత మాత్రమే ఉంటుంది.
    2. అలాస్కా – బ్రెజిల్
    3. ఫిలాండ్ – ఇండియా

ప్రశ్న 11.
అల్ ఇద్రిసి జీవితాన్ని గురించి సమాచారాన్ని సేకరించి ఒక చిన్న వ్యాసం వ్రాయండి.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 3
జవాబు:
అప్రఫ్ అల్ ఇద్రిసి 1099లో జన్మించారు. ఆయన ముస్లిం భౌగోళిక శాస్త్రవేత్త. కార్టోగ్రాఫర్ మరియు యాత్రికుడు. రోజర్ – II అనే రాజు కొలువులో, సిసిలీలో నివసించేవారు. ఆయన చిన్నతనంలో చాలా జీవితం ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్స్ లో ప్రయాణం చేశారు. ఆఫ్రికా, హిందూ మహాసముద్రం, దూర ప్రాచ్యానికి సంబంధించి ఇస్లాం వర్తకులు, అన్వేషకులు సేకరించి ఇచ్చిన సమారాన్ని క్రోడీకరించి ఇస్లాం పటాలను తయారుచేశారు. ఆయన దీనికి సంబంధించి ఒక గ్రంథాన్ని కూడా రచించారు. (ది టాబులా రోజియానా). ఈ పుస్తకాన్ని నార్మన్ రాజు అయినటువంటి రోజర్-II కోసం రచించారు. ఈయన సిసిలీలో 1165/1166లో మరణించారు.

ప్రశ్న 12.
ఈ క్రింది సమాచారాన్ని చదివి, ఈయబడిన ప్రశ్నలకు సమాధానమునిమ్ము.

పటాలలో ఎత్తు, పల్లాలను చూపడం : భూమిపై ఎత్తులు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరీవాహక ప్రాంతాలు, రాళ్లు, ఇసుకతో కూడిన ప్రదేశాలు ఉంటాయి. పటాలు బల్లపరుపుగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఎత్తు, పల్లాలను చూపించలేం. అందుకని వీటిని చూపించటానికి కాంటూరు రేఖలు అనే ప్రత్యేక సంకేతాలను ఉపయోగిస్తాం. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నిటినీ కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు. ఇంకోరకంగా చెప్పాలంటే ఒక కాంటూరు రేఖ మీద ఉన్న ప్రదేశాలన్నీ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూరు రేఖలను ఐసోలైన్స్ అని కూడా అంటారు.
1. భూమిపై ఎత్తు, పల్లాలు అంటే ఏమిటి?
జవాబు:
భూమిపై ఎత్తు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరీభాహక ప్రాంతాలు, రాళ్లు, ఇసుకతో కూడిన ప్రదేశాలు మొదలగునవి.

2. పటాలలో ఎత్తు, పల్లాలను ఎందుకు చూపించలేము?
జవాబు:
పటాలు బల్ల పరుపుగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఎత్తు, పల్లాలను చూపించలేము.

3. ప్రత్యేక సంకేతాలు అంటే ………………………
జవాబు:
కాంటూరు రేఖలు

4. …………. నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు.
జవాబు:
సముద్ర మట్టం

5. కాంటూరు రేఖలను …………………. అని కూడా అంటారు.
జవాబు:
ఐసోలైన్స్)

ప్రశ్న 13.
ఇచ్చిన వివరాలను పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులిమ్ము.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 4
1. పోర్చుగీసు అన్వేషకులు ఎవరు?
జవాబు:
ఫెర్డినాండ్ మాజిలాన్, వాస్కోడిగామా, బార్త్ లోవ్ మ్యూడియాస్.

2. మార్కోపోలో గురించి నీకేమి తెలుసును?
జవాబు:
మార్కోపోలో ఇటలీ దేశస్థుడు. 1254లో జన్మించాడు. ఆసియా ఖండాన్ని, చైనా దేశాన్ని అన్వేషించాడు. 1324లో మరణించాడు.

3. అమెరికాను కనుగొన్నదెవరు?
జవాబు:
క్రిస్టోఫర్ కొలంబస్

4. మాజిలాన్ జీవితకాలం ఏది?
జవాబు:
1480 నుండి 1521 వరకు

5. మొదటగా ప్రపంచాన్ని చుట్టి వచ్చినదెవరు?
జవాబు:
ఫెర్డినాండ్ మాజిలాన్

AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

ప్రశ్న 14.
మీ పాఠశాలకు సంబంధించి జనాభా పటాన్ని తయారుచేయుము.
జవాబు:
నేను గాంధీజీ మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ పాఠశాలలో చదువుతున్నాను. మా పాఠశాలలో 5 తరగతి గదులు, ఒక ప్రధానోపాధ్యాయుని గది, స్టాఫ్ రూమ్, వంట గది, టాయ్ లెట్లు ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 176.

తరగతివారీగా విద్యార్థులు
1వ తరగతి 44
2వ తరగతి 40
3వ తరగతి 42
4వ తరగతి 28
5వ తరగతి 22

AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ 5

ప్రశ్న 15.
ఇద్రిసి తయారుచేసిన పటంలో ‘దక్షిణం’ పై వైపు ఉండగా, గ్రీకులు తయారుచేసిన పటాలలో పై వైపు ఉత్తర దిశ ఎందుకు ఉంది?
జవాబు:
ఇస్లాం సాంప్రదాయాలు చాలా వరకు ప్రపంచంలోని ఇతర సాంప్రదాయాల కన్నా భిన్నంగా ఉంటాయి.
ఉదా : వారు వ్రాసే విధానం. అదేవిధంగా ఇద్రిసి పటంలో దక్షిణం పై వైపు ఉండి ఉండవచ్చు.
(లేదా)
సూర్యుని వైపు తిరిగి దానిని తూర్పుగా భావించి వారు కుడి చేతి వైపుకి ప్రాముఖ్యత యిచ్చి (అంటే దక్షిణానికి) దానిని పటంలో పైకి చూపించి ఉండవచ్చును.

ప్రశ్న 16.
ఈ క్రింది వివరణను చదివి దానికి సంబంధించి ఒక ప్రశ్నను వ్రాయుము.
“పటం తయారుచేసేవాళ్ళు ముఖ్యమనుకునే వాటిని చూపించే నమూనాగా పటాన్ని తయారుచేస్తారు. వీరు దేని – కోసం అన్న దాన్ని బట్టి వివిధ రకాల పటాలను తయారుచేస్తారు.”
జవాబు:
వివిధ రకాల పటాలను ఎందుకు తయారుచేస్తారు?

ప్రశ్న 17.
గ్రీకులు, రోమన్లు పటాల తయారీలో ఎందుకు ఆసక్తిని కలిగి ఉండేవారు?
జవాబు:
నాటి గ్రీకులకు, రోమన్లకు ప్రపంచ విజేతలు కావాలనే కోరిక ఎక్కువగా ఉండేది. అందుకే వారు పటాల తయారీలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండేవారు.

ప్రశ్న 18.
బాబిలోనియన్ల మట్టి పలకపై ఉన్న ప్రపంచ పటాన్ని ప్రశంసించండి.
జవాబు:
బాబిలోనియన్ల మట్టి పలకపై ప్రపంచపటం పర్షియన్ల కాలం నాటిది. అది సమతలంగాను, గుండ్రంగాను ఉన్నది. లోపలి ‘0’ లో వారికి తెలిసిన అన్ని ప్రాంతాలను చర్చించారు. బాబిలోనియాను పలక మధ్యలో చిత్రించారు. బయటి భాగంలో ఉప్పు సముద్రాన్ని చిత్రించారు. దానిలో 7 త్రికోణాకారపు దీవులను చూపించారు.
AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ 15
వారి ఆలోచనా శక్తి, ఊహాశక్తి, దానిని తయారుచేసిన కళానైపుణ్యం చాలా ప్రశంసించతగినది.

ప్రశ్న 19.
అక్షాంశ, రేఖాంశాలను, గ్రిడ్ ను ఎవరు కనిపెట్టారు?
జవాబు:
హిప్పొర్కస్ గ్రీకు ఖగోళవేత్త (190-120 BC). ఈయన అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఒక ప్రాంతాన్ని తెలుసుకోవచ్చని భావించాడు. టాలమీ గ్రీకు ఖగోళవేత్త మరియు గణిత విద్యా పారంగతుడు. ఈయన ఈజిప్టులో జీవించాడు. ఈయన – కూడా ఈ అక్షాంశ, రేఖాంశ విధానాన్ని అవలంబించాడు. ఇది తరువాత తరం నాటి పటాల తయారీదార్లను అనుసరించేలా చేసింది. కావున టాలమీ ఈ పటాల రచనకు శాస్త్రీయత అనే పునాది వేశాడని భావించవచ్చు.

ప్రశ్న 20.
గ్రామ పటాల తయారీలో ఈ క్రింది రంగుల ద్వారా ఏయే అంశాలను సూచిస్తారో తెలపండి.
i) ముదురు ఆకుపచ్చ
ii) ముదురు నీలిరంగు
iii) తెలుపు
iv) నలుపు
జవాబు:
గ్రామ పటాల తయారీలో

  1. ముదురు ఆకుపచ్చ రంగును అడువులను సూచించటానికి వాడతారు.
  2. ముదురు నీలిరంగును మహా సముద్రాలు మరియు సముద్రాలను సూచించడానికి వాడతారు.
  3. తెలుపు రంగును ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలను సూచించడానికి వాడతారు.
  4. నలుపు రంగును సరిహద్దులను సూచించడానికి వాడతారు.

AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

ప్రశ్న 21.
అట్లాస్ అనగానేమి? మీ వంటి విద్యార్థులకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
వివిధ రకాల మ్యాన్లు లేదా పటాలతో కూడిన పుస్తకాన్ని అట్లాస్ అని పిలుస్తాము. దానిలో ప్రపంచ పటాలు, వివిధ ఖండాల పటాలు మరియు దేశాల పటాలు కూడా ఉంటాయి.

ఈ అట్లాసు విద్యార్థులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. వారు దానిని అధ్యయనం చేసి ఖండాలు, ‘ సముద్రాలు, దేశాల భౌగోళిక, రాజకీయ పరిస్థితులను గురించి తెలుసుకోగలుగుతారు.

AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

These AP 9th Class Social Important Questions 24th Lesson రోడ్డు భద్రతా విద్య will help students prepare well for the exams.

AP Board 9th Class Social 24th Lesson Important Questions and Answers రోడ్డు భద్రతా విద్య

9th Class Social 24th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వాహనాల రద్దీ ఎలా పెరిగింది?
జవాబు:
జనాభా, పారిశ్రామికీకరణ, నగరీకరణ, ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) వలన వాహనాల రద్దీ కూడా పెరిగింది.

ప్రశ్న 2.
క్రమబద్ధీకరణ అంటే ఏమిటి?
జవాబు:
రవాణా సులభతరం కావడానికి ఒక క్రమబద్ధీకరణ అవసరం. క్రమబద్దీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించటమే.

ప్రశ్న 3.
ట్రాఫిక్, రోడ్డు ట్రాఫిక్ అంటే ఏమిటి?
జవాబు:
ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే వాటిని ట్రాఫిక్ అంటాం. అలాగే వాహనాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు రోడ్డుమీద వెళ్లటాన్నే రోడ్డు ట్రాఫిక్ అంటాం.

ప్రశ్న 4.
ట్రాఫిక్ విద్య అంటే ఏమిటి?
జవాబు:
ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా, స్పష్టంగా వివరించి తెలియజేయడాన్ని ట్రాఫిక్ విద్య అంటాం.

AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 5.
రోడ్డును ఉపయోగించే వారి సంఖ్య ఎలా పెరిగింది?
జవాబు:
జనాభా పెరగడం, వాహనాల వినియోగం కూడా పెరగడం మూలంగా రోడ్డును ఉపయోగించుకునే వారి సంఖ్య పెరిగింది.

ప్రశ్న 6.
డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
డ్రైవింగ్ లైసెన్స్ రెండు రకాలు :

  1. లెర్నర్ లైసెన్స్, ఇది తాత్కాలికమైనది. డ్రైవింగ్ నేర్చుకొనుటకు ఆరు నెలల కాలపరిమితితో దీనిని జారీ చేస్తారు.
  2. శాశ్వత లైసెన్స్ తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఒక నెల తరువాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది.

ప్రశ్న 7.
ట్రాఫిక్ గుర్తులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
ట్రాఫిక్ గుర్తులు మూడు రకాలు.

  1. తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు (ఎర్ర వృత్తాలు ఏమి చేయగూడదో తెలుపుతాయి)
  2. సమాచార గుర్తులు (నీలంరంగు దీర్ఘచతురస్రంలోని గుర్తులు)
  3. జాగ్రత్తపరచే గుర్తులు (ముక్కోణంలో ఉన్న గుర్తులు జాగ్రత్త పడేలా చేస్తాయి)

ప్రశ్న 8.
జీబ్రా క్రాసింగ్ అంటే ఏమిటి?
జవాబు:
జీబ్రా క్రాసింగ్ – పాదచారులు రోడ్డును ఒక వైపు నుంచి మరొకవైపుకు దాటడానికి ఉద్దేశించినది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వీటిని సూచిస్తారు.

ప్రశ్న 9.
ట్రాఫిక్ గుర్తులు అనగానేమి?
జవాబు:
వాహనాలను ప్రమాదరహితంగా నడపటానికి వీలుగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రోడ్లు కలిసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుర్తులను సూచించే పరికరాన్ని ట్రాఫిక్ గుర్తులు అంటారు.

ప్రశ్న 10.
రోడ్డు భద్రతకు అడ్డంకులు ఏవి?
జవాబు:
పౌరుల నిర్లక్ష్యం, రోడ్డుల స్థితి మంచిగా లేకపోవడం, రోడ్డు భద్రతా ప్రమాదాలు అమలు జరగకపోవడం, అత్యవసర సేవలు తక్కువగా ఉండటం, చట్టాల అమలు సక్రమంగా లేకపోవటడం రోడ్డు భద్రతకు అడ్డంకులు.

AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 11.
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన ఏవేని రెండు కారణాలను రాయండి.
జవాబు:

  1. ట్రాఫిక్ విద్యపట్ల అవగాహన లేకపోవడం
  2. అపరిమితమైన వేగం
  3. త్రాగి వాహనాలు నడపడం
  4. ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణించడం
  5. సీట్ బెల్ట్, హెల్మెట్ లను ఉపయోగించకపోవడం మొ||వి.

9th Class Social 24th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింది ‘పై’ చార్టు 2006 సం||లో రోడ్డు ప్రమాదాలు, బాధితుల వయస్సు, వారి వివరాలు వున్నాయి. చార్టును పరిశీలించి ప్రశ్నకు సమాధానం రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 1
‘పై’ చార్టులోని వివరాల ఆధారంతో విర్ధారణకు రాదగిన ప్రధానమైన విషయం ఏమిటి?
జవాబు:
పై చార్టులోని వివరాల ఆధారంతో నిర్ధారణకు రాదగిన ప్రధానమైన విషయం ఏమిటంటే.

  1. రోడ్డు ప్రమాదబాధితులలో అన్ని వయస్సుల వారూ ఉన్నారు.
  2. రోడ్డు ప్రమాద బాధితుల సంఖ్య 25-35 సంవత్సరాల మధ్య వయస్సు కలవారిలో ఎక్కువగా ఉంటోంది.
  3. యుక్త వయస్సు పిల్లలు స్వతంత్రతను ఎక్కువగా కోరుకోవడంతో ఎక్కువ ప్రమాదాల బారిన పడుతు.
  4. కౌమార దశలోని పిల్లలే రోడ్డును ఉపయోగించే వారిలో ఎక్కువ.
  5. వీటన్నింటికీ కారణం ప్రజలకు ట్రాఫిక్ విద్య పట్ల అవగాహన లేకపోవడం.
  6. ప్రమాదాల నివారణకి ప్రజలకు ట్రాఫిక్ విద్య, రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగించడం తప్పనిసరి.

9th Class Social 24th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 2

ప్రశ్న : పై సమాచారాన్ని విశ్లేషించి దాని ఆధారంగా ట్రాఫిక్ విద్య యొక్క అవసరాన్ని, ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:

  1. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది.
  2. ప్రమాదాలు ఒక్కొక్కసారి తీవ్ర గాయాలు, అంగవైకల్యానికి దారితీయవచ్చు.
  3. ఘోర ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోవటానికి అవకాశం ఉంటుంది.
  4. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన మనకు మాత్రమేగాక ఎదుటివారికి కూడా హాని జరగవచ్చు.
  5. విలువైన వాహనాలు దెబ్బతింటాయి.
  6. అందువల్ల ట్రాఫిక్ గుర్తులను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ, ఎదుటివారి ప్రాణాలకు కూడా రక్షిణ కల్పిస్తే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

ప్రశ్న 1.
శ్వాస పరీక్ష పరికరం ఎలా పనిచేస్తుంది?
జవాబు:

  1. ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే అది రక్తంలో కలిసిపోయి, వారి శరీరం మొత్తానికి రక్తం ద్వారా వ్యాపిస్తుంగ్.
  2. ఊపిరితిత్తులలోకి చేరడం ద్వారా ఆ వ్యక్తి విడిచిపెట్టే గాలిలో ఆల్కహాల్ కు సంబంధించిన ఆనవాలును ఒక ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా గుర్తించగలం.
  3. ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి విడిచి పెట్టే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ తో పాటుగా ఆల్కహాల్ ఆనవాలు కూడా ఉంటుంది.
  4. ఇది తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ ఈ పరికరం గుర్తించగలదు.
  5. ఒకవేళ ఈ పరికరం ద్వారా పరీక్షించిన అనంతరం సంబంధిత అధికారులు నిందితులకు మేలు చేయాలని ప్రయత్నించినా ఆ పరికరంలో నమోదైన విషయాలను తొలగించే అవకాశం లేదు.

ప్రశ్న 2.
డ్రైవింగ్ లైసెన్స్ ను ఎలాంటి పరిస్థితులలో రద్దు చేయవచ్చును?
జవాబు:
ఈ కింది సందర్భాల్లో ప్రాంతీయ ట్రాన్స్పోర్టు అధికారి లైసెన్సులను రద్దు చేయు అధికారం కలిగి ఉన్నారు.
ఒక వ్యక్తి :

  1. నిత్య తాగుబోతు అయినా
  2. ప్రమాదభరిత మత్తు పదార్థాలకు అలవాటుపడినా
  3. తన వాహనాన్ని నేరపూరిత విషయాలకు ఉపయోగించినా
  4. ప్రమాదభరితంగా వాహనాన్ని నడిపినా
  5. రిజిస్ట్రేషన్ చేయించకుండా వాహనాలను ఉపయోగించినా
  6. పోలీసు అధికారులు అడిగిన సమాచారాన్ని అందించకున్నా
  7. ప్రమాదం జరిగిన సందర్భంలో బాధితులను దగ్గరలోని హాస్పిటల్ కు చేర్చకపోయినా
  8. పోలీసులు అడిగినపుడు కింద ఇవ్వబడిన ధ్రువపత్రాలను చూపకపోయినా
    – ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్
    – రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
    – డ్రైవింగ్ లైసెన్స్
    – కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్

AP 9th Class Social Important Questions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 3.
ప్రమాదాలను నివారించడానికి డ్రైవరకు ఎలాంటి సలహాలు ఇవ్వవలెను?
జవాబు:
డ్రైవరుకు సలహాలు :

  1. రోడ్డుకు ఎడమవైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదలాలి.
  2. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.
  3. రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
  4. తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలనే ఉపయోగించాలి.
  5. అనవసరంగా హారన్ మోగించరాదు.
  6. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగించాలి.
  7. ట్రాఫిక్ సిగ్నల్స్ ను అతిక్రమించరాదు.
  8. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.

ప్రశ్న 4.
రోడ్డు భద్రతకు అడ్డంకులు ఏవి?
జవాబు:
రోడ్డు భద్రతకు అడ్డంకులు :

  1. పౌరుల నిర్లక్ష్యం
  2. రోడ్ల నాణ్యత మంచిగా లేకపోవడం
  3. వాహనాల నిర్మాణం రక్షణపరంగా లేకపోవడం
  4. రోడ్డు భద్రతా ప్రమాణాలు అమలు జరగకపోవడం
  5. చట్టాల అమలు సక్రమంగా లేకపోవడం
  6. అత్యవసర సేవలు తక్కువగా ఉండటం

ప్రశ్న 5.
పాదచారులు పాటించవలసిన నిబంధనలు ఏవి?
జవాబు:
పాదచారులకు నిబంధనలు :

  1. పాదచారులు తమకు’ నిర్దేశించిన మార్గంలోనే నడవాలి. ఒకవేళ అలాంటి ప్రత్యేక మార్గం లేకుంటే, రోడ్డు ఇరుకుగా ఉంటే రోడ్డుకు కుడివైపున ఎదురుగా వస్తున్న వాహనాలను పరిశీలిస్తూ నడవాలి.
  2. రాత్రివేళ బయట రోడ్డుపై నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతిబింబించే దుస్తులను ధరించాలి.
  3. రాత్రివేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చిలైట్ దగ్గర ఉంచుకోవాలి.
  4. రోడ్డును దాటునపుడు ఎడమవైపు, కుడివైపు చూసి వాహనాలు రాకుండా ఉన్నప్పుడు దాటాలి.
  5. ఒకవేళ వాహనాలు రెండువైపులా, వస్తూ ఉంటే అవి వెళ్లే వరకు వేచి ఉండాలి.
  6. వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా నడుచుకుంటూ రోడ్డును దాటాలి. రెండువైపులా వాహనాలు వస్తున్నాయో లేదో గమనించాలి.
  7. రోడ్డును దాటుటకు జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగించుకోవాలి.
  8. రోడ్డుపై నడుస్తున్నపుడు, రోడ్డును దాటుతున్నపుడు మొబైల్ ఫోన్ ను ఉపయోగించరాదు.
  9. ట్రాఫిక్ పోలీస్ సహాయంతో రోడ్డును దాటాలి.

ప్రశ్న 6.
ద్విచక్ర వాహనదారులు పాటించవలసిన నిబంధనలు ఏవి?
జవాబు:
ద్విచక్ర వాహనదారులకు నిబంధనలు :

  1. గడువు తీరని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  2. బీమా చేయించుకుని మాత్రమే వాహనాన్ని రోడ్డుపై నడపాలి.
  3. వాహనదారులు హెల్మెట్ ధరించాలి.
  4. వాహనం వెనుక సీటుపై ఒక్కరినే కూర్చోబెట్టుకోవాలి. అతడు కూడా సక్రమంగా కూర్చోవాలి.

AP 9th Class Social Important Questions Chapter 23 విపత్తుల నిర్వహణ

AP 9th Class Social Important Questions Chapter 23 విపత్తుల నిర్వహణ

These AP 9th Class Social Important Questions 23rd Lesson విపత్తుల నిర్వహణ will help students prepare well for the exams.

AP Board 9th Class Social 23rd Lesson Important Questions and Answers విపత్తుల నిర్వహణ

9th Class Social 23rd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వైపరీత్యా లేవి?
జవాబు:
మానవుల నిర్లక్ష్యం వల్ల లేదా కావాలని ఒక వ్యక్తి లేదా బృందం చేసే పనుల వల్ల ఏర్పడే వైపరీత్యాలను మానవ కారణంగా ఏర్పడే వైపరీత్యాలని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
అధికశాతం రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి?
జవాబు:
అధికశాతం ప్రమాదాలు నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం, తాగి వాహనం నడపటం, వాహనాలు సరైన స్థితిలో ఉండకపోవటం, వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవటం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయి.

ప్రశ్న 3.
రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి?
జవాబు:
రైలు మార్గాల నిర్వహణ సరిగా లేకపోవటం, మానవ పొరపాటు, విద్రోహ చర్యలు వంటి వాటి కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి.

ప్రశ్న 4.
విమాన ప్రమాదాలకు కారణాలేవి?
జవాబు:
విమానాల పెరుగుదల, సాంకేతిక సమస్యలు, అగ్ని, పైకి ఎగిరేటప్పుడు ఉండే. పరిస్థితులు, విమానం వెళ్ళే దారి, హైజాకింగ్, బాంబు దాడుల వంటి సమయాల్లో విమానాశ్రయాల్లో ఉండే భద్రత వంటి అనేక అంశాలు విమాన ప్రమాదాలకు కారణాలవుతున్నాయి.

AP 9th Class Social Important Questions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 5.
నిప్పును ఎలా ఆపవచ్చు?
జవాబు:
వేడిమి, ఇంధనం, ప్రాణవాయువు – ఈ మూడు కలిసినప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి అందకుండా చేయటం ద్వారా నిప్పును ఆపవచ్చు.

ప్రశ్న 6.
ప్రకృతి వైపరీత్యాలు అని వేటిని చెప్పవచ్చు?
జవాబు:
ప్రకృతి సిద్ధంగా మానవ ప్రమేయం లేకుండా సంభవించే తుపాన్లు, సునామీలు, వరదలు, భూకంపాలు, అగ్ని పర్వతాలు పేలడం, కొండచరియలు విరిగిపడటం మొ||నవి ప్రకృతి వైపరీత్యాలని చెప్పవచ్చు.

ప్రశ్న 7.
మానవుల కారణంగా ఏర్పడే విపత్తులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

  1. రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు.
  2. అగ్నిమాపక ప్రమాదాలు.
  3. ఉగ్రవాద చర్యలు మొదలైనవి.

9th Class Social 23rd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వాహనాలను ఏ వ్యక్తులు నడపరాదు?
జవాబు:

  1. మద్యం సేవించి ఉన్నవారు.
  2. జబ్బు పడినవారు, గాయాల పాలైనవారు.
  3. కోపంగా లేదా ఆందోళనగా ఉన్నవారు.
  4. అలసిపోయి ఉన్నవారు.
  5. ఏకాగ్రత లేనివారు.

ప్రశ్న 2.
ఘోర ఘటనల తరవాత తల్లిదండ్రులకు గల సూచనలు ఏవి?
జవాబు:

  1. ఘోర ఘటనల తరవాత పెద్దవాళ్ళు మొట్టమొదట తమ పిల్లలపై దృష్టి పెట్టాలి.
  2. వాస్తవాలను, పుకార్లను వేరు చేయటంలో పిల్లలకు ‘సహాయపడాలి.
  3. తెలిసిన వాస్తవాలను పిల్లలతో చర్చించి ఊహగానాలకు, అతిశయోక్తులకు తెరదించాలి.

AP 9th Class Social Important Questions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 3.
అగ్ని ప్రమాద సమయంలో చేయవలసిన పనులు మూడు రాయండి.
జవాబు:
అగ్ని ప్రమాద సమయంలో

  1. నిప్పు లేదా పొగ చూసినప్పుడు అలారం మ్రోగించాలి లేదా హెచ్చరిక జారీ చేయాలి.
  2. ఫోన్ ఎక్కడుందో తెలుసుకొని 101 కి ఫోన్ చేయండి. నిదానంగా, స్థిమితంగా మీ చిరునామా చెప్పి అగ్నిమాపక దళాన్ని పంపమని చెప్పండి.
  3. విద్యుత్ స్విచ్చులన్నీ తీసేసి ఉంచాలి. మెయిన్ స్విచ్ ను కట్టేయటం ఉత్తమం.

ప్రశ్న 4.
మన దేశంలో విమాన ప్రమాదాలకు గల కారణాలు ఏవి?
జవాబు:
విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

  • విమానాల పెరుగుదల
  • విమానాలలో తలెత్తే సాంకేతిక సమస్యలు .
  • విమానాలు దిగేటప్పుడు, పైకి ఎగిరేటప్పుడు ఉండే పరిస్థితులు
  • విమానం వెళ్ళే దారిలో పర్వతాలు ఉండడం లేదా తరచు తుపానులు సంభవించటం ఊ హైజాకింగ్
  • బాంబు దాడులు మొదలగునవి.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

These AP 9th Class Social Important Questions 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 22nd Lesson Important Questions and Answers మహిళా రక్షణ చట్టాలు

9th Class Social 22nd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
అక్రమ రవాణా రూపాలు ఏవి?
జవాబు:
లైంగిక దాడి, చట్ట వ్యతిరేక కార్యగ-2 వెస్ట్ – 30, ఇళ్లలో పని, వ్యవసాయకూలీ, నిర్మాణకూలీల చేత ఎక్కువ పని చేయించుకొని వారి శ్రమను దోచుకోవడం, పైశాచిక ఆనందం మొ||నవి అక్రమ రవాణా రూపాలు.

ప్రశ్న 2.
సెక్స్ వర్కర్స్ అనగా నారు?
జవాబు:
బలవంతంగా వ్యభిచారం చేయించడం నేరం. ఈ విధంగా వ్యభిచారం చేసే వారిని సెక్స్ వర్కర్స్ అంటారు. వీరి రక్షణకు సంబంధించిన ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయి.
(లేదా)
బలషంతంగా వ్యభిచారం చేయించి, ఆ తదుపరి తప్పనిసరి పరిస్థితులలో వ్యభిచారం చేసే వారిని సెక్స్ వర్కర్స్ అంటారు.

ప్రశ్న 3.
అక్రమ రవాణాకు శిక్ష ఎలాంటిది?
జవాబు:
అక్రమ రవాణా ఒక పెద్ద నేరం. ఈ నేరానికి 7 సం||రాల కఠిన కారాగార శిక్ష నుండి జీవిత ఖైదు వరకు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 4.
గృహ హింస రూపాలు ఏవి?
జవాబు:
గృహ హింస రూపాలు :
లైంగిక అత్యాచారం, భౌతిక అత్యాచారం, మానసిక క్షోభకు గురిచేయటం, మానసిక అత్యాచారం, ఆర్థిక అత్యాచారం.

ప్రశ్న 5.
న్యాయ సహాయం పొందటానికి అర్హులు ఎవరు?
జవాబు:
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేని వారు, అవిటివారు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు, హిరసాకాండ, కులవైషమ్యాల బాధితులు, రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు న్యాయసహాయం పొందటానికి అర్హులు.

ప్రశ్న 6.
ఉచిత న్యాయసహాయం కోరేవారు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?
జవాబు:
ఉచిత న్యాయ సహాయం కోరువారు తమ తమ జిల్లాలకు చెందిన జిల్లా కోర్టులందు, రాష్ట్ర హైకోర్టునందు గల జిల్లా ఆ న్యాయసేవా అధికార సంస్థలకు గాని తమ కేసు వివరాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకోవచ్చును.

ప్రశ్న 7.
న్యాయ సహాయ విధానాలు ఏవి?
జవాబు:
న్యాయ సహాయ విధానాలు – న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట, కోర్టులో కేసులు చేపట్టడం, కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం, కేసులలో తీర్పుల నకళ్లు ఉచితంగా ఇవ్వడం మొదలైన సహాయాలు అందించబడతాయి.

ప్రశ్న 8.
మహిళల మరియు బాలికల సంరక్షణకు భారత ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది. భారత ప్రభుత్వం అమలు చేసిన .. అలాంటి ఏవైనా రెండు చట్టాలను పేర్కొనండి.
జవాబు:

  1. బాల్య వివాహాల నిషేధ చట్టం – 2006
  2. అక్రమ రవాణా నిరోధక చట్టం – 1956
  3. వరకట్న నిషేధ చట్టం – 1961
  4. అత్యాచారం, లైంగిక వేధింపుల చట్టం (నిర్భయ చట్టం) – 2013

9th Class Social 22nd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బాల్య వివాహ నిషేధ చట్టం అమలులో ఉన్నా అక్కడక్కడా బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ దురాచారాన్ని ఆపడానికి కొన్ని చర్యలను సూచించండి. ,
జవాబు:

  1. మొదటగా తల్లిదండ్రులకు బాలికలకు విద్యను ఇవ్వడం వల్ల కలిగే లాభాలను వివరించడం.
  2. బాల్య వివాహం వలన కలిగే అనర్థాలను వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చి బాల్య వివాహాలను ఆపివేయించాలి.
  3. కొంతమంది తల్లిదండ్రులు మూర్బంగా వ్యవహరిస్తే అప్పుడు అధికారులకు సమాచారం అందించి వివాహాలను ఆపివేయించాలి.
  4. బాల్యవివాహాల వలన కలిగే అనర్థాలను టి.వి., షార్ట్ ఫిలిమ్ ల ద్వారా వారికి ప్రత్యక్ష సంఘటనలను మరియు పరోక్ష సంఘటనలను గురించి వివరించాలి.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 1.
అక్రమ రవాణా అంటే ఏమిటి?
జవాబు:
అక్రమ రవాణా అంటే వ్యక్తులను వారి ఇష్టానికి విరుద్దంగా తరలించడం, అధికారికంగా లొంగదీసుకోవటం, భయపెట్టి పని చేయించుట, జీవనోపాధి లేదా వివాహం లాంటి ఆశ చూపి తెలియని ప్రాంతాలకు తరలించి వెట్టిచాకిరి చేయించడం, లైంగిక దోపిడీ లాంటి కృత్యాలకు పాల్పడటం లేదా అమ్మకానికి పెట్టడం.

ప్రశ్న 2.
బాల్య వివాహం చేసుకుంటే పురుషుడికి విధించే శిక్ష?
జవాబు:
18 సం||లు నిండని బాలికను పురుషుడు వివాహం చేసుకుంటే 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా.

ప్రశ్న 3.
బాలల హక్కులు ఏవైనా నాలుగు వ్రాయుము.
జవాబు:
బాలల హక్కులు :

  1. జీవితం – జీవించే హక్కు
  2. సాధ్యమైనంతవరకూ బాలలు తల్లిదండ్రులతో కలసి ఉండడం.
  3. బాలల విద్యకు, ఆరోగ్యానికి హాని కలిగించే పని చేయకుండా ఉండడం.
  4. బాలలు సంపూర్ణ ఆరోగ్యం, వైద్య సౌకర్యం పొందే హక్కు,

ప్రశ్న 4.
బాల్య వివాహం అంటే ఏమిటి?
జవాబు:
పురుషునికి 21 సం||లు, స్త్రీకి 18 సం||లు నిండకుండా జరిపించే పెండ్లి.

ప్రశ్న 5.
పాఠ్య పుస్తకంలోని ఆప ‘బడి” న బాల్య వివాహం – ఒక విజయగాథ ఏ జిల్లాలో జరిగింది? ఆ బాలిక పేరేమి?
జవాబు:
మహబూబ్ నగర్ జిల్లా, అచ్చంపేట మండలం, బొమ్మనపల్లి గ్రామం. ఆ బాలిక పేరు ఎర్రమోని సరిత.

ప్రశ్న 6.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవి?
జవాబు:

  1. అక్రమ రవాణాకు గురైన వారిచే భిక్షాటన
  2. మానవ అవయవాల అమ్మకం
  3. మత్తు మందుల అక్రమ వ్యాపారం

ప్రశ్న 7.
కార్మికులు అంటే ఎవరు?
జవాబు:
వెట్టిచాకిరి చేసేవారు, ఇళ్ళలో పనిచేసేవారు, వ్యవసాయ కూలీ, నిర్మాణ కూలీలు మొ||వారు.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 8.
వరకట్న నిషేధ చట్టం పరిధిలోకి వచ్చే అంశాలు ఏవి?
జవాబు:
వివాహం అనంతరం అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, ఒక్కోసారి చంపివేయటం, కొన్నిసార్లు బాధలు భరించలేక స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలైనవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

ప్రశ్న 9.
లైంగిక దాడి అంటే ఏమిటి?
జవాబు:
లైంగిక దాడి అంటే బలవంతపు వ్యభిచారం, సాంఘిక, మతపరమైన వ్యభిచారం (జోగిని, మాతాంగి, దేవదాసి మొ||నవి) పర్యాటక రంగంలో లైంగిక దోపిడి, అసభ్యత అశ్లీల రచనలు – చిత్రాలు ‘మొ||నవి.

ప్రశ్న 10.
వరకట్న నిషేధ చట్టం ఉల్లంఘించిన వారికి విధించే శిక్ష ఏమిటి?
జవాబు:
5 సం||ల వరకు జైలు శిక్ష, 15 వేలు వరకు జరిమానా లేదా కట్నం విలువ మొత్తంలలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం జరిమానా విధించబడును.

ప్రశ్న 11.
గృహహింస అంటే ఏమిటి?
జవాబు:
కుటుంబ సంబంధాల్లో ఉన్న స్త్రీకి లేదా ఆమె సంతానానికి అదే కుటుంబంలోని వ్యక్తుల వల్ల హింసాపూరిత చర్యలు, ఇబ్బందులు కలిగినట్లయితే దానిని గృహహింసగా చెప్పవచ్చును.

ప్రశ్న 12.
సమాజంలో మహిళలు ఎదుర్కొను సమస్యలు ఏవి?
జవాబు:
మన సమాజంలో మహిళలు అనేక సమస్యలు, ఇంటా బయటా ఎదుర్కొంటున్నారు. ఆడ పిల్లలు బడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలను మాటలతో వేధించడం, బాధించడం, తక్కువ చేసి మాట్లాడటం, ఎగతాళి చేయడం, శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసించడం.

ప్రశ్న 13.
అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక ఎప్పుడు జరిగింది? ఎన్ని దేశాలు సంతకం చేశాయి?
జవాబు:
అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక, 1989లో జరిగింది. 191 దేశాలు సంతకం చేశాయి.

AP 9th Class Social Important Questions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 14.
ఉచిత న్యాయ సహాయం ఎవరికి అందించబడుతుంది?
జవాబు:
న్యాయ సహాయం పొందుటకు అర్హులు :

  1. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతి స్థిమితం లేనివారు, అవిటివారు.
  3. ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు.
  4. రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు.

ప్రశ్న 15.
లోక్ అదాలత్ అంటే ఏమిటి?
జవాబు:
ఆర్థిక పరిస్థితులు, ఇతర బలహీనతలు కారణంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండటం కోసం ఉద్దేశించినదే ఉచిత న్యాయస్థానం. దీనినే లోక్ అదాలత్ అంటాం.

ప్రశ్న 16.
న్యాయ సహాయ విధానాలు తెలుపుము.
జవాబు:
న్యాయ సహాయ విధానాలు :

  1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట.
  2. కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరపున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టడం.
  3. న్యాయ సహాయం పొందినవారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం.
  4. న్యాయ సహాయం పొందినవారికి కేసులలో తీర్పుల నకళ్ళు ఉచితంగా ఇవ్వడం మొ||లగు సహాయాలు అందించబడతాయి.

AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

These AP 9th Class Social Important Questions 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 21st Lesson Important Questions and Answers మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

9th Class Social 21st Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు అనగానేమి?
జవాబు:
వ్యక్తికి మౌలికమైన కొన్ని హక్కులు ఉన్నాయి, వీటికి రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఈ హక్కులను ప్రాథమిక హక్కులంటారు.

ప్రశ్న 2.
రిట్ అనగానేమి?
జవాబు:
రాజ్యాంగ హక్కులను కాపాడటానికి, అమలు అయ్యేలా చూడటానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీచేసే అధికారాన్ని ‘రిట్’ అంటారు. ఇది న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు.

ప్రశ్న 3.
సమన్యాయపాలన అనగానేమి?
జవాబు:
ప్రభుత్వం ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టాల రక్షణలో సమానత్వాన్ని తిరస్కరించగూడదు అని రాజ్యాంగం పేర్కొంటోంది. దీనిని ‘సమన్యాయపాలన’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 4.
వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రయోజనాలు ఏవి?
జవాబు:
వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ : దీనివల్ల వ్యక్తులకు ప్రజా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి వివిధ రూపాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.

ప్రశ్న 5.
“బాల కార్మికుల నిర్మూలన” పై రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  1. విద్య బాలల భవిష్యత్తు – వారిని చదువుకోనివ్వండి.
  2. బాలకార్మిక విధానం ప్రకృతి విరుద్ధం.

9th Class Social 21st Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింది సందర్భాలను పరిశీలించండి. ప్రతి సందర్భంలో ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది మరియు ఏవిధంగా భంగం కలిగిందో వివరించండి.
అ) ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ డాక్యుమెంటరీ చిత్రాలు తీస్తున్న ఒక దర్శకున్ని అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది.
ఆ) ఒక 10 సం||రాల బాలున్ని బడికి వెళ్ళనివ్వడం లేదు మరియు బలవంతంగా టపాసుల తయారీ పరిశ్రమలో పని చేయడానికి పంపిస్తున్నారు.
జవాబు:
అ) మొదటి కేసులో ప్రాథమిక హక్కైన ‘వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ’ ఉల్లంఘించబడింది. ఎందువలన అనగా ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. పౌరులు సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం, వంటి వివిధ రూపాలలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. అందువలన ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ డాక్యుమెంటరీ తీయడం తప్పు కాదు. కానీ ఈ స్వేచ్చపై పరిమితి ఉంటుంది. పరిమితికి మించి వ్యక్తిగత విమర్శలకు దిగితే ప్రభుత్వం చట్ట ప్రకారం శిక్ష విధిస్తుంది.)

ఆ) రెండవ కేసులో ప్రాథమిక హక్కు అయిన ‘పీడనాన్ని నిరోధించే హక్కు’ (కర్మాగారాలలో బాలలను పనిలో పెట్టుకోవడం నిషేధం) ఉల్లంఘించబడింది. “14 సంవత్సరాల లోపు బాలలను కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోవడం నిషేధం” అని రాజ్యాంగం పేర్కొంటోంది. అందువలన ఆ .10 సంవత్సరాల బాలుడు కర్మాగారానికి కాక స్కూల్ కి పంపబడాలి.

ప్రశ్న 2.
ఇచ్చిన అంశాలను సంబంధిత ప్రాథమిక హక్కుల కింది పట్టికలో పొందుపరచండి.
• కర్మాగారాలలో బాలలను పనిలో పెట్టుకోవటం నిషేధం.
• అల్పసంఖ్యాక వర్గాలు తాము ఎంచుకున్న విద్యా సంబంధ సంస్థలు స్థాపించి, నిర్వహించుకునే హక్కు
• బిరుదులు రద్దు
• జీవించే హక్కు
AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు 1
జవాబు:
AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు 2

9th Class Social 21st Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు ఏవి? మెరుగైన జీవనం కొరకు ఇవి మనకు ఏ విధంగా సాయపడుతున్నాయి?
జవాబు:
1) ప్రాథమిక హక్కులు ఆరు :

  1. సమానత్వపు హక్కు,
  2. స్వాతంత్ర్యపు హక్కు,
  3. మత స్వాతంత్ర్యపు హక్కు,
  4. పీడనాన్ని నిరోధించే హక్కు,
  5. సాంస్కృతిక విద్యా విషయపు హక్కు,
  6. రాజ్యాంగ పరిహారపు హక్కు,

2) ఈ పైన తెలుపబడిన హక్కులలో మొదటిది అయిన సమానత్వపు హక్కు ప్రజలందరూ సమానులే అని తెలియజేయడంతో పాటు మన అభివృద్ధికి దోహదపడుతుంది.

3) రెండవ హక్కు ప్రజలందరూ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో తమకు నచ్చిన విధంగా జీవనాన్ని గడపటానికి అవకాశం ఇచ్చింది.

4) మూడవ హక్కు ప్రజలు వారికి నచ్చిన మతాన్ని అనుసరించే విధంగా అవకాశం కల్పించింది.

5) నాల్గవ హక్కు ఎవరూ ఇంకొకరి చేత బలవంతంగా పనిచేయించటం గాని, పని పేరిట హింసించరాదని తెలియచేస్తుంది.

6) ఐదవ హక్కు అల్పసంఖ్యాక వర్గాల వారు కూడా వారి భాష, మతం ఆధారంగా విద్యా సంస్థలను ఏర్పాటుచేసుకుని అభివృద్ధి చెందటానికి అవకాశం కల్పించింది.

7) చివరి హక్కు పై హక్కులలో ఏది ఉల్లంఘనకు గురి అయినా ప్రజలకు కోర్టుల నుండి రక్షణ కల్పించి మరల వారు
హక్కులను పొందేలాగా చేస్తుంది.

AP 9th Class Social Important Questions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 2.
ప్రాథమిక విధులేవి?
జవాబు:
హక్కులు ఉన్నట్లే మనకు కొన్ని విధులు, బాధ్యతలు ఉన్నాయి.

ప్రతి ఒక్క భారత పౌరుని విధులు :

  1. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. జాతీయ గీతాన్ని కాని, జాతీయ జెండాను కాని అవమానించకూడదు.
  2. స్వాతంత్ర్యానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ ఉద్యమ ఉన్నత ఆదర్శాలను గౌరవించి, అనుసరించాలి.
  3. భారతదేశ సార్వభౌముకత, సమగ్రతలను కాపాడాలి.
  4. దేశ రక్షణకు బాధ్యత వహించాలి.
  5. వివిధ భాషలు, మతాల ప్రజల మధ్య శాంతి, సామరస్యాలను నెలకొల్పాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించరాదు.
  6. దేశ పర్యావరణ క్షీణతను నివారించి, మెరుగుపరచాలి.
  7. మనదేశ ఉమ్మడి సంస్కృతి, మహోన్నత, వారసత్వ సంపదను గౌరవించి, కాపాడాలి.
  8. శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, అన్వేషణ, సంస్కరణల దృక్పథాన్ని అలవర్చుకోవాలి.
  9. ప్రజా ఆస్తులను కాపాడాలి.
  10. అన్ని రంగాలలో అత్యున్నత శ్రేణిని అందుకోటానికి కృషి చేయాలి.
  11. పిల్లలను విద్యావంతులుగా చేయాలి.

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

These AP 9th Class Social Important Questions 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన will help students prepare well for the exams.

AP Board 9th Class Social 20th Lesson Important Questions and Answers ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

9th Class Social 20th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యం ఏ సూత్రంపై ఆధారపడి ఉంది?
జవాబు:
రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవటం అన్న మౌలిక సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది.

ప్రశ్న 2.
1980 నుండి జింబాబ్వే స్థితి ఏమిటి?
జవాబు:
అల్పసంఖ్యాక శ్వేత జాతీయుల పాలన నుంచి జింబాబ్వే 1980లో స్వాతంత్ర్యం పొందింది. అప్పటినుంచి దేశ స్వాతంత్ర్య .. ఉద్యమానికి నేతృత్వం వహించిన జాను-పీఎఫ్ అన్న పార్టీయే దేశాన్ని పాలిస్తోంది. ఈ పార్టీ నాయకుడు రాబర్ట్ ముగాబే స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి అధ్యక్షుడిగా ఉన్నాడు.

ప్రశ్న 3.
ఎన్నికలు ఎలా జరగాలి?
జవాబు:
ఒకదేశ ప్రజలు ప్రభుత్వంలో తమకు నిజంగా ప్రాతినిధ్యం వహించే సరైన వ్యక్తులను, లేదా పార్టీలను ఎంచుకోవాలంటే ఎన్నికలు స్వేచ్ఛగా, ఎటువంటి భయంలేని వాతావరణంలో నిర్వహించబడటం ఎంతో ముఖ్యం.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎలా ఉండాలి?
జవాబు:
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చట్టాలను గౌరవించాలి. చట్టాలలో పేర్కొన్న న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయటాన్ని అనుమతించాలి.

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 5.
బెల్జియంలో ప్రజలు ఏ భాషలు మాట్లాడతారు?
జవాబు:
యూరప్ ఖండంలో ఒక చిన్న దేశం ‘బెల్జియం’. ఆ దేశ జనాభాలో 59% మంది ఫ్లెమిస్ ప్రాంతానికి చెందిన ‘డచ్’ భాష మాట్లాడే ప్రజలు. మిగిలిన 40% మంది వలోనియా ప్రాంతానికి చెందిన ‘ఫ్రెంచ్’ మాట్లాడే ప్రజలు. మిగిలిన ఒక్కశాతం ‘జర్మన్’ భాష మాట్లాడే ప్రజలు.

ప్రశ్న 6.
బెల్జియం అనుసరించిన విధానాలు ఏవి?
జవాబు:
బెల్జియం అనుసరించిన విధానాలు – ఏ ఒక్క సమూహమూ (భాష) ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవు, బ్రస్సెల్స్ కి ప్రత్యేక ప్రభుత్వం (ఇందులో రెండు సమూహాలకు సమాన ప్రాతినిధ్యం) మొదలైనవి.

ప్రశ్న 7.
బెల్జియం నాయకులు ఏమి గుర్తించారు?
జవాబు:
వివిధ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, భావనలను మన్నించినపుడే దేశం ఐక్యంగా ఉంటుందని ‘బెల్జియం’ నాయకులు గుర్తించారు.

9th Class Social 20th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యంలో ‘ఓటు వేయడం’ మరియు “ప్రతినిధులను ఎన్నుకోవడం” ఎందుకు అత్యంత ముఖ్యమైనవి?
జవాబు:
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఓటింగ్ ప్రక్రియపై పూర్తిగా ఆధారపడి ఉంది.

  1. ఓటు హక్కు పౌరులు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి అవకాశం కల్పిస్తుంది.
  2. తమ ప్రాంత వివిధ ప్రజల ఆకాంక్షలను, సమస్యలను వ్యక్తం చేసే తమ ప్రతినిధిని ఎన్నుకోవటానికి ఓటు, వీలు కల్పిస్తుంది.
  3. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఒక మార్గం ఓటు.
  4. ప్రజాస్వామ్య విజయం ఆ దేశ ఓటర్లు క్రియాశీలకంగా పాల్గొనడం, చైతన్యవంతులుగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యం అంటే?
జవాబు:
ప్రజాస్వామ్యం అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడి, ప్రజలకు జవాబుదారిగా ఉండే ప్రభుత్వం.

ప్రశ్న 2.
లిబియాలో అంతిమ అధికారం ఎవరికి ఉంది?
జవాబు:
లిబియాలో అంతిమ అధికారం రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ (ఆర్.సి.సి) కి ఉంది.

ప్రశ్న 3.
సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం ఏది?
జవాబు:
సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం సంయుక్త సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (రష్యా).

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యం దేని మీద ఆధారపడి ఉంది?
జవాబు:
ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవడం అన్న మౌలిక సూత్రంపై ఆధారపడి ఉంది.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనెలా బహిరంగ చర్చలు జరిపిన తరువాత చట్టాలు, విధానాలు రూపొందించినపుడు ఇది సాధ్యమవుతుంది.

ప్రశ్న 6.
ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత ఎన్నికలు ఎంత ముఖ్యం?
జవాబు:
ఒక దేశ ప్రజలు ప్రభుత్వంలో తమకు నిజంగా ప్రాతినిధ్యం వహించే సరైన వ్యక్తులను లేదా పార్టీలను ఎంచుకోవాలంటే ఎన్నికలు స్వేచ్చగా, ఎటువంటి భయంలేని వాతావరణంలో నిర్వహించడం ఎంతో ముఖ్యం. ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి ప్రత్యేక అవకాశాలు ఉండవు. ఏ పార్టీయైన ఏ వ్యక్తులైన అందులో పాల్గొనగలుగుతారు.

ప్రశ్న 7.
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటే దేనిని పరిశీలించుట ముఖ్యం?
జవాబు:
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటే ఎన్నికలను పరిశీలించుట ముఖ్యం.

ప్రశ్న 8.
ప్రజాస్వామ్యం దేనిని రక్షణగా ఉండాలి?
జవాబు:
ప్రజలలో అధిక శాతానికి భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులను ప్రజాస్వామ్యం రక్షణగా ఉండాలి.

ప్రశ్న 9.
ప్రజాస్వామ్యం దేనికి లోబడి పని చేయాలి?
జవాబు:
ప్రజాస్వామ్యం రాజ్యాంగ చట్టం, పౌరుల హక్కుల పరిమితులకు లోబడి పని చేయాలి.

AP 9th Class Social Important Questions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 10.
ప్రజాస్వామ్యంలో పౌరుల గౌరవం, స్వేచ్ఛ గూర్చి వ్రాయుము.
జవాబు:
వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం మెరుగైనది. గౌరవం, స్వేచ్ఛలపట్ల నిబద్ధతే ప్రజాస్వామ్యానికి పునాది.