AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

These AP 9th Class Social Important Questions 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 15th Lesson Important Questions and Answers పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

9th Class Social 15th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
తొలి పారిశ్రామిక విప్లవం అని దేనిని అంటారు?
జవాబు:
1780-1850 ల మధ్య కాలంలో బ్రిటన్ పరిశ్రమలు, ఆర్థిక విధానంలో సంభవించిన మార్పులను “తొలి పారిశ్రామిక విప్లవం”గా పేర్కొంటారు.

ప్రశ్న 2.
పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని మొదటగా వాడినవారు ఎవరు?
జవాబు:
ఐరోపా మేధావులైన ఫ్రాన్స్ లోని జార్జెన్ మిథైలెట్, జర్మనీలోని ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ “పారిశ్రామిక విప్లవం” అన్న పదాన్ని వాడారు.

ప్రశ్న 3.
ఫిషర్ ప్రశంస ఏమిటి?
జవాబు:
“ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తరువాత ప్రపంచమంతా అనుకరించింది” అని ఫిషర్ ప్రశంసించాడు.

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
మొదటి, రెండవ రైలు మార్గాలు ఏఏ నగరాలను కలిపాయి?
జవాబు:
మొదటి రైలు మార్గం 1825 సం||రంలో ‘స్టాక్టన్’, ‘డార్లింగ్ టన్’ పట్టణాలను కలిపింది. రెండవ రైలు మార్గం 1830లో లివర్‌పూల్ ని, మాంచెస్టర్ ని కలిపింది.

ప్రశ్న 5.
కాలువల ద్వారా, రైళ్ల ద్వారా రవాణాలోని ప్రయోజనాలు ప్రశంసించండి.
జవాబు:
కాలువలు, రైళ్ళ ద్వారా త్వరితగతిన పారిశ్రామికీకరణ జరగడమే కాకుండా, వాణిజ్యం, భావ ప్రసారం, ఆర్థిక ప్రగతి వంటివి పెరిగాయి.

ప్రశ్న 6.
బ్రిటన్లో పారిశ్రామిక విప్లవానికి అనుకూలించే అంశాలు ఏవి?
(లేదా)
ఆధునిక పారిశ్రామిక విప్లవము. బ్రిటన్లోనే ఎందుకు ఆవిర్భవించింది?
జవాబు:
ఇంగ్లాండ్ లో ముడిసరుకుకు కొరతలేదు. బొగ్గు, ఇనుము సమృద్ధిగానే కాకుండా పక్కపక్కనే దొరికేవి. జలశక్తికి ఎటువంటి కొరతా లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలం. అధిక సంఖ్యలో కార్మికులు అందుబాటులో ఉండేవారు.

9th Class Social 15th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“20వ శతాబ్దపు ఆవిష్కరణలు సాంకేతికాభివృద్ధిని మరియు సహజ వనరులను అత్యంత ప్రభావితం చేస్తాయి. నూతన ఆవిష్కరణల ఫలితంగా అందుబాటులోకి వచ్చిన ప్రధాన వస్తువులు మరియు పరికరాలు ఈనాడు మన జీవన విధానాన్ని మార్చివేశాయి.”
రవాణా మరియు వైద్యరంగంలోని ఏవేని ఒక్కొక్క నూతన ఆవిష్కరణను పేర్కొని, అవి నేటి మన జీవనాన్ని ఏవిధంగా మార్చాయో క్లుప్తంగా తెలపండి.
జవాబు:
రవాణా :
విమానాలు, మోటార్ వాహనాల ఆవిష్కరణ, రైల్వేల ఆవిర్భావం మొదలైనవి.

వైద్యం :
యాంటీ బయాటిక్స్, వ్యాధి నిరోధక టీకాలు, మత్తు మందు మొదలైనవి.

విమానాలు విశాల ప్రపంచాన్ని దగ్గర చేశాయి. సుదూర ప్రాంతాలకు సహితం వేగంగా చేరుకోవడానికి వీలు కల్పించాయి.

వ్యాధి నిరోధక టీకాల వల్ల మానవుల సగటు ఆయుఃప్రమాణం పెంపొందటం, అనేక వ్యాధులను అరికట్ట గలగడం గొప్ప విజయం.

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 2.
పారిశ్రామిక విప్లవం వల్ల మానవజీవనంలో సంభవించిన దుష్పరిణామాలు ఏవి?
జవాబు:
పారిశ్రామిక విప్లవం వల్ల మానవ జీవనంలో సంభవించిన దుష్పరిణామాలు :

 1. విచ్ఛిన్నమైన కుటుంబాలు
 2. కొత్త చిరునామాలు, సమస్యలకు లోనైన పట్టణాలు
 3. గృహవసతి, తాగునీటికి కష్టాలు.
 4. కలరా, టైఫాయిడ్, క్షయ వంటి వ్యాధులు
 5. పాలకుల నిర్లక్ష్యం.

ప్రశ్న 3.
ఫ్రాన్స్ లో పారిశ్రామికీకరణ వృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏవి?
జవాబు:

 1. పెట్టుబడిని సమీకరించి, పారిశ్రామికవేత్తలకు అప్పులు ఇవ్వగల పెద్ద బ్యాంకు ఫ్రాన్స్ లో వృద్ధి చెందలేదు.
 2. ఫ్రెంచి ఉత్పత్తిదారులలో చాలామంది కుటుంబ వనరుల పైనే ఆధారపడటం.
 3. ఫలితంగా వాళ్ళు చిన్న కంపెనీలుగానే మిగిలిపోవడం.
 4. కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని, ఆలోచనలను వేగంగా ఆచరణలో పెట్టలేకపోవడం.
 5. బొగ్గు గనులు తక్కువ.
 6. ఫ్రెంచి పరిశ్రమలు వినియోగదారీ వస్తువులైన బట్టలు వంటి వాటి పైనే దృష్టి, పై కారణాల వలన ప్రగతి సాధించలేకపోయింది.

9th Class Social 15th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“పట్టణాల్లో ఇతర సామాజిక బృందాలతో పోలిస్తే కార్మికుల సగటు జీవితకాలం చాలా తక్కువగా వుందని 1842 లో చేసిన ఒక సర్వే వెల్లడి చేసింది.”
ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను వ్యాఖ్యానించండి.
జవాబు:

 1. వారు ఉన్న పల్లెలతో పోలిస్తే పట్టణాలలో వారి జీవన ప్రమాణం చాలా తక్కువగా ఉంది.
 2. పిల్లలలో సగం కంటే ఎక్కువ మంది 5 సం||ల కన్నా ఎక్కువ కాలం బ్రతికేవారు కాదు.
 3. జనాభా అధికంగా పెరగటం వల్ల సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి.
 4. నీటి కాలుష్యం వల్ల కలరా, టైఫాయిడ్ మరియు గాలి కాలుష్యం వలన క్షయ వంటి వ్యాధులు రావటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది.
 5. పురపాలక అధికారులు ప్రమాదాలను అరికట్టడానికి ఎటువంటి చర్యలను తీసుకోలేదు.
 6. వైద్యశాస్త్రం కూడా అంతగా అభివృద్ధి చెందలేదు.
 7. పారిశ్రామిక కార్మికుల జీవితాలకు ఎటువంటి గౌరవం, భద్రత లేవు.
 8. వారు సానుభూతి లేని యజమానులు మరియు పర్యవేక్షకుల నియంత్రణలో పనిచేసేవారు.

ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు చాలా ఇబ్బందులకు గురి అయినారు.

ప్రశ్న 2.
రోడ్లు నిర్మించిన జాన్ మెట్ కాఫ్ చూపులేని వ్యక్తి. అతడు స్వయంగా రోడ్ల ఉపరితలాలు సర్వేచేసి, వాటికి ప్రణాళికలు తయారుచేసేవాడు. కాలువలను నిర్మించిన జేమ్స్ బ్రాండ్లో దాదాపుగా నిరక్షరాస్యుడు. అతడికి పదాల అక్షరక్రమం (స్పెల్లింగ్) సరిగా వచ్చేది కాదు. నావిగేషన్ అన్న పదం కూడా పలికేవాడు కాదు. కాని అతడి జ్ఞాపకశక్తి, ఊహాశక్తి, ఏకాగ్రత అమోఘంగా ఉండేవి.
ప్రశ్న : పైన ఇచ్చిన పేరాను చదివి దానిపై వ్యాఖ్యానించండి.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరా ఏమి చెప్తుందంటే …………
ఏదైనా మనం క్రొత్తగా కనిపెట్టాలి అంటే మనం శాస్త్ర విజ్ఞానం అన్వయించడం ద్వారా కంటే కృతనిశ్చయం, ఆసక్తి, కుతూహలం, ముఖ్యంగా అదృష్టం కూడా అవసరమే అని చెప్తుంది. అంతేకాకుండా శాస్త్ర పరిజ్ఞానం ఏమీ లేకుండానే ఇంత సాధించామంటే, ప్రస్తుతం ఉన్న శాస్త్ర పరిజ్ఞానంతో మనం ఎంతో సాధించవచ్చు. కావున మనకు విజ్ఞానంతో పాటు జ్ఞాపకశక్తి, పట్టుదల కూడా ఎంతో అవసరం.

ప్రశ్న 3.
పారిశ్రామికీకరణవల్ల మహిళలు, పిల్లలు అనుభవించిన బాధలు ఏవి?
(లేదా)
పారిశ్రామిక విప్లవ కాలంలో మహిళలు, పిల్లలు ఎదుర్కొన్న సమస్యల గురించి రాయండి.
జవాబు:
పిల్లలు :

 1. ఇంగ్లాండ్ లో పిల్లల దుస్థితి దారుణంగా ఉండేది.
 2. అధిక పనిగంటలు
 3. నిద్రలేమితో యంత్రాలలో పడి మరణాలు
 4. యంత్రాల వల్ల పిల్లలకు గాయాలు
 5. యంత్రాల వల్ల పిల్లల జుట్టు ఇరుక్కుపోయేది.

మహిళలు :

 1. నూలు వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా పని
 2. పట్టు, లేసు, అల్లికలలో పని 3) తక్కువ కూలి
 3. చేసిన తప్పులకు కఠినమైన శిక్షలు 5) పని గంటల భారం
 4. తరచుగా సంభవించే జబ్బులు
 5. ప్రసవ సమయంలో మరణాలు

AP 9th Class Social Important Questions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
ప్రపంచంలోని వివిధ దేశాలలో రైళ్ళ రాకవల్ల ఏర్పడిన ప్రభావాలను పోల్చండి.
(లేదా)
చక్కటి రవాణా సౌకర్యాలు వేగవంతమైన పారిశ్రామికీకరణకు దారితీస్తాయి’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం వివరించండి.
జవాబు:
ప్రపంచంలో అనేక దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి, తమ ఉత్పత్తులు ముడి సరుకులతో ప్రపంచాన్ని ఆకర్షించడానికి, ప్రయాణికులను, సరుకులను, ఉత్పత్తులను వేగంగా, సులువుగా తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి రైళ్ళు ప్రధాన భూమిక పోషించాయి. కలప పట్టాలకు బదులు ఇనుప పట్టాలను కనిపెట్టటం, ఆవిరి యంత్రంతో పెట్టెలను లాగటం అన్న రెండు ఆవిష్కరణల వల్ల ఇది సాధ్యమయ్యింది.

రైల్వేల వల్ల పారిశ్రామికీకరణ రెండవ దశలోకి మారటమే కాకుండా, కాలువల వినియోగంలో అనేక సమస్యలను అధికమించే క్రమంలో రైళ్ళు ఒక ప్రత్యేక పాత్ర పోషించాయి. 1850 నాటికి జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్లతో పోలిస్తే రెట్టింపు నిధులు సమకూర్చి ఆ రెండు దేశాలను అధిగమించి రైల్వేలను అభివృద్ధి చేసింది. ఫ్రాన్స్ దేశంలో కూడా పారిశ్రామిక ప్రగతితో రైలు మార్గాలు విస్తరించి, రవాణా వ్యవస్థలో ప్రధానపాత్ర పోషించాయి. ప్రపంచంలోని చాలా దేశాల పరిశ్రమల వేగవంతానికి, ఆర్థిక పరిపుష్టి సాధనలో రైల్వేలు ముఖ్యపాత్ర పోషించాయి.

Leave a Comment