AP Inter 1st Year Botany Notes Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

Students can go through AP Inter 1st Year Botany Notes 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

1. మొక్కల శాస్త్రాన్ని ‘వృక్షశాస్త్రం’ అంటారు.

2. ‘అరిస్టాటిల్’ అనే శాస్త్రవేత్త వృక్షశాస్త్రంను ఒక శాస్త్రంగా అభివృద్ధి పరిచాడు.

3. క్రీ.పూ 1300 లో ‘పరాశరుడు’ వివిధ ఔషధ మొక్కలను గురించి ‘వృక్షాయుర్వేదం’ లో వివరించాడు.

4. ‘వృక్షశాస్త్ర పితామహుడు ‘ధియోఫ్రాస్టస్’ ‘ది హిస్టోరియా ప్లాంటారమ్’ అనే పుస్తకం రచించాడు.

5. 16 వ ,17వ శతాబ్దాల కాలమును ‘హెర్బలిస్టుల యుగం’ గా పేర్కొంటారు.

6. ‘రాబర్ట్ హుక్’ కణాన్ని కనుగొన్నాడు. అతడు ‘మైక్రోగ్రాఫియా’ అనే పుస్తకాన్ని ప్రచురించాడు.

AP Inter 1st Year Botany Notes Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

7. వృక్షశాస్త్రంలో గణనీయమైన అభివృద్ధి అనునది జన్యుశాస్త్ర పితామహుడైన ‘గ్రెగర్ జోహెన్’ మెండల్ బఠాణి మొక్కలపై జరిపిన రెండు సంకరణ ప్రయోగాల తరువాత జరిగింది.

8. 20వ శతాబ్దంలో వేగవంతమైన అభివృద్ధి ‘హ్యుగోడీవ్రీస్’ అనే శాస్త్రవేత్తచే మొక్కలలో ఉత్పతరివర్తనాలు మరియు వాట్సన్ మరియు క్రిక్లు DNA ద్విసర్పిల నిర్మాణం వంటివి కనుగొనడం జరిగింది. [IPE]

9. భారతీయ శాస్త్రవేత్త V.S. రామదాస్ C4 మొక్కల కిరణజన్య సంయోగక్రియ గురించిన పరిశోధనలు జరిపాడు. 10. P.K.K.నాయర్ మరియు C.G.K.రామానుజన్ గార్లు ‘పరాగరేణు శాస్త్రాన్ని’ అభివృద్ధి పరిచారు. [IPE]

11. పరాశరుడు రచించిన పుస్తకాలు: ‘కృషిపరాశరం’ మరియు ‘వృక్షాయుర్వేదం’. [IPE]

12. ‘కృషిపరాశరం’ వ్యవసాయం మరియు కలుపు మొక్కలను గురించి తెలియజేస్తుంది. [IPE]

13. ‘వృక్షాయుర్వేదం’ అడవులు మరియు ఔషధ మొక్కలను గురించి తెలియజేస్తుంది. [IPE]

14. ‘పురావృక్షశాస్త్రం’ మొక్కల శిలాజాలను గురించి అధ్యయనం చేస్తుంది. [IPE]

15. ఈ శాస్త్రం మొక్కలలో పరిణామ క్రమాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. [IPE]

16. ‘శైవలశాస్త్రం’ పత్రహారితం కలిగిన స్వయం పోషితాలైన ధాలోఫైటా మొక్కలను గురించి అధ్యయనం చేస్తుంది. [IPE]

AP Inter 1st Year Botany Notes Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

17. ‘శిలీంధ్రశాస్త్రం’ పత్రహరితం రహితాలై పరపోషితాలైన ధాలోఫైటా మొక్కలను గురించి అధ్యయనం చేస్తుంది. [IPE]

18. ‘టెరిడోఫైటా’ మొక్కలను ‘నాళికా కణజాల యుత’ మొక్కలు అంటారు. [IPE]

19. ‘టెరిడాలజీ’ టెరిడోఫైటా మొక్కలను గురించే అధ్యయనం చేసే శాఖ. [IPE]

20. ‘బ్రయోఫైటా జీవులను’ వృక్షరాజ్యం యొక్క ‘ఉభయచర జీవులు’ అంటారు. 21. బ్రయోలజి ‘బ్రయోఫైటా మొక్కలను’ గురించి అధ్యయనం చేస్తుంది.

Leave a Comment