Andhra Pradesh BIEAP AP Inter 1st Year Sanskrit Study Material गद्यभागः 4th Lesson दयावान् राक्षसः Questions and Answers Summary.
Inter 1st Year Sanskrit दयावान् राक्षसः Questions and Answers
निबन्ध प्रश्नौ
प्रश्न 1.
दयावान् राक्षसः इति पाठ्यांशस्य सारांशं संक्षेपेण लिखत ।
प्रश्न 2.
दयारामस्य दयागुणं परोपकारं च विवृणुत ।
जवाब:
కవి పరిచయము : ఈ పాఠ్యభాగం “बुक्षुक्षितः काकः” అను గ్రంథం నుండి స్వీకరించబడినది. దీని రచయిత हर्षदेवमाधवः ।
ప్రస్తావన : పూర్వము ఉజ్జయినీ పట్టణ సమీపమున విశాలమైన అరణ్యం కలదు. అందు చాలా కాలం నాటి వట వృక్షము ఉన్నది. అందు చాలా తొర్రలు ఉండెను. వృక్షము యొక్క శాకల యందు అనేక పక్షులు గూళ్ళను నిర్మించుకొని వాటి వాటి కుటుంబంతో సహా నివశించుచుండెను.
దయారాముని రాక : ఒకనాడు ఒక రాక్షసుడు అక్కడకు వచ్చెను. అతనిని చూచి పక్షులు భయముతో అరచుచూ మీరు ఎక్కడ నుండి వచ్చినారు ? ఇక్కడకు ఎందుకు వచ్చినారు ? మేమిక్కడ నివాసముంటున్నాము. “अस्मान् मा पीड्या त्वं गच्छ अन्यत्र” మమ్ము పీడించవద్దు వేరొక ప్రదేశమునకు వెళ్ళండి అని పలికినవి.
అంత రాక్షసుడు ఓ బంధువులారా ! భయపడవలదు ! నా పేరు దయారాముడు. నేను మిమ్ములను హింసించను. మీరు ఆహారము కొరకు వెళ్ళినపుడు మీ పిల్లలను కాపాడుతాను అని పలికెను. అంత ఆ పక్షులు ఏమిటి రాక్షసులకు దయ ఉండునా ? నీ పేరు దయా రాముడా ! నమ్మశక్యంగా లేదు అని పలికినవి.
దయారాముని పూర్వ చరిత్ర : దయారామ్ పక్షులతో ఈ విధంగా పలికెను.
నేను పూర్వకాలము నందు హింసకుడిగా ఉంటిని, కారణం లేకుండానే ప్రాణులను హింసించేవాడను. అందువలన అందరూ నన్ను కౄరుడని పిలిచేవారు. నేను రాక్షసుడను అయితిని. అయినన్ను ప్రాణులను వధించుటను మానలేదు. ఒకసారి సుమతి అను పేరు గల ఋషిని చంపుటకు ప్రయత్నించాను. ఆ ఋషి తన కలశము నుండి నీటిని తీసి నాపై చల్లెను.
నేను శిలగా మారి బాధను చెందాను. అతనికి నమస్కరించాను. ఆయన నన్ను దయతో క్షమించెను. కౄరుడా ! నీవు ఈ నాటి నుండి హింసను విడచి అందరికి హితము చేయుము. పరోపకారం చేయుచూ ఈ వనము నందే నివశించుము. ఇక నుండి నీవు దయారామ్ అని పిలువబడెదవు. నీతో సహా అందరూ రామనామమును పలికెదరు.
“सर्वेषां हितं कुरु । परोपकारं कृत्वा त्वं वने वस तव नाम दयाराम अस्ति’ ।
పక్షుల ఆదరణ : పక్షులు దయారామునికి నమస్కరించినవి. దయారామ్ ఒక తొర్రను తన నివాసంగా చేసుకొనెను. దయారాముని పరోపకారం : పక్షులు ఆహారం కోసం వెళ్ళినపుడు పక్షి పిల్లలను రక్షించుచుండెను. ఒక నాడు ఒక బోయవాడు పక్షులను చంపుటకు వచ్చెను. అది దయారాముడు చూచి బోయవాడిని చెట్టు నుండి క్రిందకు తోసి వేసెను.
అతని పాదము యొక్క ఎముక విరిగిపోవుటచే అతడు తన గ్రామమునకు పోయెను. ఆ పక్షులు దయారామునికి జయజయ ధ్వనులు చేసిరి. మరియొకనాడు ఒక వేటగాడు ఆ వృక్ష సమీపము నందున్న మృగములను వేటాడుటకు వచ్చెను. ఆ మృగములు దయారాముని రక్షించమని కోరినవి. అంత దయారాముడు ఆ వేటగానిని భుజముపై ఎక్కించుకొని మరల తిరిగి వచ్చుటకు కష్టమైన దూరంగా ఉన్న కొండ శిఖరముపై దింపెను. ఆ వేటగాడు ఎటోపోయెను.
దయారామ్ మేఘములను తెచ్చుట : ఒక సంవత్సరమున ఆషాఢమాసమున మేఘములు వర్షించలేదు. సరోవరములు నదులు కూడా ఎండిపోయెను. అక్కడ నివశించు మృగములు పక్షులు నీరు ఆహారము లేక దుఃఖించెను. దయారామ్ గగనమంతా తిరిగెను.
వేరొక దూరదేశమునందు నల్లని మేఘములను చూచెను. మేఘములతో ఓ జలధరా నాతో రావలెను. ఎందుకనగా నా ప్రదేశమున జలము కొంచెం కూడా లేదు. ప్రాణులన్నీ మరణించుచున్నవి. అని పలికెను. అంత మేఘములు ”भ्राता वयं दायां करिष्यामः किन्तु वयं पवनं विना कुत्र अपि गन्तुं न पर् भवाम” पवनः नः सर्वत्र नयति”
సోదరా ! మేము వాయువు లేకుండా ఎక్కడికైనా వెళ్ళుటకు సమర్థులం కాదు. వాయువే మమ్ములను తీసుకు వెళ్ళును. నీకు మమ్ము తీసుకు వెళ్ళుటకు శక్తి ఉన్నచో తీసుకుపొమ్ము అని పలికెను.
అంత దయారామ్ తన దేహముమును పెద్దదిగా చేసి మేఘుని భుజముపై ఎక్కించుకు వచ్చెను. మేఘుడు ఆ వనమున వర్షించెను. సరస్సులు నదులు నీటిచే నిండెను. ఆ వనం మరల జీవనం పొందెను. ఆ ప్రాణులన్ని దయారాముని పూజించిరి.
వృక్షములను రక్షించుట : కొన్ని రోజుల తరువాత వనమునకు మరల ఆపద వచ్చెను. ముగ్గురు వడ్రంగులు గొడ్డళ్ళను ధరించి వృద్ధ వృక్షమైన వట వృక్షమును నఱకుటకు వచ్చిరి. అంత వట వృక్షము దయారామ్తో ఈ విధంగా పలికెను. సోదరా నేను వృద్ధుడను. నాకు మరణమును గూర్చి భయం లేదు. కాని “वृक्षान् विना जलदाः जलवर्षणं न करिष्यन्ति” కాని వృక్షములు లేనిచో మేఘములు వర్షించవు. అంతేకాక ఈ ప్రాణులు నన్ను ఆశ్రయించినవి. అని పలికెను.
దయారాముడు వడ్రంగుల గొడ్డళ్ళను తీసుకొని చెట్టు తొర్రలో దాచెను. మరుసటిరోజు మరల క్రొత్త గొడ్డళ్ళుతో వచ్చెను. దయారాముడు ఆ గొడ్డళ్ళను విరచి నదియందు పడవేసెను. వారు భయంతో పారిపోయిరి. ఒకసారి సింహము పులి అరణ్యమునకు వచ్చెను. పులి కారణం లేకుండగనే ప్రాణులను బాధించుచుండెను. దయారాముడు ఆ పులి కాళ్ళను పట్టుకొని గిరగిరా తిప్పి సముద్ర సమీపము నందున్న ఒక నౌకలో ఉంచి వదిలి వేసెను.
ఒకనాడు అకస్మాత్తుగా 17 కోరలు ఉన్న రాక్షసుడు వచ్చెను. ఇతః పూర్వం ఆ రాక్షసునికి 18 కోరలు ఉండెను. ఇప్పుడు 17 కోరలు తొమ్మిది ముఖములు ఉండెను. వాడు పరమ దుర్మార్గుడు. అక్కడ ఉన్న ప్రాణులను హింసించుటకు వచ్చెను. దయారాముడు రాక్షసుని అడ్డగించెను. వారి ఇరువురకు భయంకరమైన యుద్ధం జరిగెను. దయారామ్ ఆ రాక్షసుని చంపెను. కాని గాయములు అగుటచే దయారామ్ కూడా మరణించెను. అన్ని ప్రాణులు దయారామ్ దేహము చుట్టూ చేరి విలపించెను. అవి ఈశ్వరుని ప్రార్థించెను.
దయారామ్ దైవత్వమును పొందుట :
ఈ ప్రాణుల ఆర్తనాదం విన్న భగవంతుడు ప్రత్యక్షమయ్యెను. అతడు నాల్గు హస్తముల యందు శంఖము, చక్రము, గదా – పద్మములను ధరించి చిరునవ్వుతో మధురముగా “पुत्रक दयाराम उत्तिष्ठ त्वं अनेकानि शुभकार्याणि अकरोः ” పుత్ర దయారామ ! లెమ్ము నీవు అనేక శుభకార్యములు చేసినావు.
నీవిప్పుడు రాక్షసుడవు కావు! నేను నీకు దైవత్వమును ఇచ్చుచున్నాను. నీ రూపం దివ్యమగును. నాతో స్వర్గమునకు రమ్ము అని పలికెను. దయారాముడు దివ్యత్వమును పొంది లేచెను. స్వామిని “भगवान् तव कृपया अहुं पुनः जीवितः | देवः अपि अस्मि” దేవా నీ కృపచే దైవత్వమును పొందాను.
కాని నా బంధువులను విడచి వచ్చుటకు ఇష్టము లేదు. దయ చూడుము అని పలికెను.
ముగింపు : దయారాముని మాటలు విన్న భగవాన్ తథాస్తు ఆ విధంగానే కానిమ్ము. నీవు దేవుడవై ఇక్కడే నివాసముండుము. అని పలికి భగవంతుడు అంతర్థానమయ్యెను. అన్ని ప్రాణులు దయారాముని పూజించెను. ఆనాటి నుండి ఆ వనమునకు ఆపదలు కలుగ లేదు.
Poet’s Introduction: This passage is taken from the book “y: :” Its author is Harshdevmadhava.
Introduction: In the past, there was a vast forest near the city of Ujjain. There was a very old tree there. There were many birds. Many birds built nests in the branches of the tree and lived there with their families.
Dayaram’s arrival: One day a demon came there. Seeing him, the birds cried out in fear, saying, “Where have you come from? Why have you come here? We live here.”अस्मान् मा पीड्या त्वं गच्छ अन्यत्र” Do not torment us, go to another place.”
That demon, O relatives! Do not be afraid! My name is Dayaram. I will not torture you. I will protect your children when you go for food. What are those birds? Do demons have mercy? Your name is Dayaram, it is unbelievable. Dayaram’s past history: Dayaram spoke thus to the birds.
I was a torturer in the past, I used to torture living beings without any reason. That is why everyone called me a cruel person. I became a demon.
I did not stop killing living beings. Once I tried to kill a sage named Sumati. That sage took water from his kalash and sprinkled it on me. I turned into a stone and felt pain. I bowed to him. He mercifully forgave me. O cruel person! From this day forward, give up violence and do good to everyone. Live in this forest doing good deeds. From now on, you will be called Dayaram. Everyone, including you, will chant the name of Rama. “सर्वेषां हितं कुरु परोपकारं कृत्वा त्वं वने वस तव नाम दयाराम असती” ।
Birds’ welcome: The birds bowed down to Dayaram. Dayaram made a hole in the ground his home.
Dayaram’s charity: When the birds went out to find food, he used to protect the young birds. One day, a hunter came to kill the birds. Seeing this, Dayaram threw the hunter down from the tree. He broke his leg and went back to his village. The birds made joyful noises for Dayaram. Another day, a hunter came to hunt the animals near the tree.
The animals asked Dayaram to save him. Then Dayaram lifted the hunter on his shoulder and set him down on a distant hilltop where it was difficult to return. The hunter went away. Dayaram brings clouds: One year, in the month of Ashadha, the clouds did not rain.
The lakes and rivers also dried up. The animals, birds and animals living there were sad because of lack of water and food. Dayaram traveled all over the sky. He saw black clouds in another distant land. A water body should come with me with clouds. Because there is not even a little water in my land. All the living beings are dying. He said. Those clouds said,‘‘भ्राता वयं दयां करिष्यामः किन्तु वयं पवनं विना कुत्र अपि गन्तुं न पर्भवाम” पवनः नः सर्वत्र नयति ।
Brother! we are not able to go anywhere without the wind. The wind itself will carry us. If you have the power to carry us, then take us. Then Dayaram enlarged his body and carried the cloud on his shoulder. The cloud rained on the forest. The lakes and rivers were filled with water. The forest came back to life. All those living beings worshipped Dayaram.
Saving the trees: After a few days, danger again came to the forest. Three carpenters came with axes to cut down an old tree, the Vata tree. Dayaram said this to the old Vata tree. Brother, I am old. I am not afraid of death. But “वृक्षान् विना जलदाः जलवर्षणं न करिष्यन्ति ।” if there are no trees, the clouds will not rain. Moreover, these living beings have taken refuge in me.
Dayaram took the carpenters’ axes and hid them in a tree trunk. The next day he came back with new axes. Dayaram broke the axes and threw them into the river. They ran away in fear.
Once a lion and a tiger came to the forest. The tiger was hurting people without any reason. Dayaram caught the tiger by the legs and twisted it around and put it in a boat near the sea and left it.
One day, suddenly a demon with 17 fangs came. Earlier, that demon had 18 fangs. Now it had 17 fangs and nine faces. He was extremely wicked. He came to torture the living beings there. Dayaram stopped the demon. A fierce battle took place between the two of them.
Dayaram killed the demon. But Dayaram also died due to his wounds. All the living beings gathered around Dayaram’s body and wept. They prayed to God. Dayaram attains divinity: Hearing the cries of these creatures, the Lord appeared. He held a conch, a disc, a mace and a lotus in his four hands and said sweetly with a smile,
“पुत्रक दयाराम उत्तिष्ठ त्वं अनेकानि शुभकार्याणि अकरो:“ “Putra Dayaram, get up, you have done many good deeds. You are no longer a demon! I am giving you divinity. Your form will become divine. Come with me to heaven,” he said. Dayaram attained divinity and got up.‘“भगवान् तव कृपया अहुं पुनः जीवितः ! देवः अपि अस्मि” “Please be alive again! I am not a demon.”
By the grace of the Lord, I have attained divinity. But I do not want to leave my relatives. Please have mercy on me.
Conclusion: Hearing Dayaram’s words, Bhagavan Tathastu agreed to do so. You become a god and reside here. Saying this, the Bhagavan understood. All the living beings worshipped Dayaram. From that day on, there was no danger to that forest.
लघुसमाधान प्रश्नाः
प्रश्न 1.
कस्य पादस्य अस्थिभङ्गः अभवत् ?
जवाब:
शाकुनिकस्य पादस्य अस्थिभङ्गः अभवत् ।
प्रश्न 2.
दयारामः नभसि कान् अपश्यत् ?
जवाब:
दयारामः नभसि मेघान् अपश्यत् ।
प्रश्न 3.
तक्षकाः कुठारैः वने प्रविश्य किं कर्तुम् ऐच्छन् ?
जवाब:
तक्षकाः कुठारैः वने प्रविश्य हरितान् वृक्षान् छेत्तुम् ऐच्छत् ।

एकपद समाधान प्रश्ना:
प्रश्न 1.
वृक्षस्य स्कन्धेषु कानि आसन् ?
जवाब:
वृक्षस्य स्कन्धेषु कोटराणि आसन् ।
प्रश्न 2.
राक्षसस्य नाम किम् ?
जवाब:
राक्षसस्य नाम दयारामः ।
प्रश्न 3.
कः मेघान् सर्वत्र नयति ?
जवाब:
वायुः मेधान् सर्वत्र नयति ।
सन्दर्भ वाक्यानि
प्रश्न 1.
अस्मान् मा पीडया त्वं गच्छ अन्यत्र |
जवाब:
कवि परिचयः – अयं वाक्यं दयावान् राक्षसः इति पाठे अस्ति ।
कविः – आचार्य हर्ष देव माधवः ।
ग्रन्थः – “बुभुक्षितः काकः” इति कथा सङ्कलनात् खीकृतः ।
संदर्भ:- वृक्षस्य कोटरे आसन् पक्षिणः राक्षसं प्रति अवदत् ।
भावः – भोः त्वं कस्मात् आगतः अन्यत्र गच्छ । अस्मान् मा पीडय इति पक्षिणः अवदत् ।
प्रश्न 2.
राक्षसेषु दया न भवति । त्वं सत्यं वद ।
जवाब:
कवि परिचयः अयं वाक्यं दयावान् राक्षसः इति पाठे अस्ति ।
कवि : आचार्य हर्ष देव माधवः ।
ग्रन्थः “बुभुक्षितः काकः” इति कथा सङ्कलनात् खीकृतः ।
संदर्भः वृक्षस्य कोटरे आसन् पक्षिणः राक्षसं प्रति अवदत् ।
भावः राक्षसं प्रति ! सर्वे विहगाः तव नाम दयाराम अस्तिकिं ? राक्षसेषु दया न भवति ! त्वं सत्यं वद किं तव नाम इति अवदन् ।
प्रश्न 3.
युष्माकं शाबकान् अहं रक्षयिष्यामि ।
जवाब:
कवि परिचयः अयं वाक्यं दयावान् राक्षसः इति पाठे अस्ति ।
कवि : आचार्य हर्ष देव माधवः ।
ग्रन्थः ” बुभुक्षितः काकः” इति कथा सङ्कलनात् खीकृतः ।
संदर्भः राक्षसः दयारामः विहंगान् प्रति अवदत् !
भावः अहं युष्माकं रक्षणं करिष्यामि यदा यूयं आट्टारार्थं गमिष्यथ तदा युष्माकं शाबकान् रक्षयिष्यामि इति दयारामः अवदत् ।
विशेषतो ज्ञेयाः
कठिनशब्दार्था
1. निबिडम् = Dense / Thick घनम् । अविरलम्
2. कुलायाः = The nest of a bird (plural)
3. विहगाः = पक्षिणः
4. शङ्का = सन्देहः
5. हिंसकः = क्रूरः
6. घातम् = हननम्
7. शाकुनिकः = निषादः / व्याधः
8. मृगयुः = किरातः
9. जलदाः = मेघाः
10. नभसि = आकाशे
11. विराजम् = उन्नतम्
12. रुधिरम् = रक्तम्
13. भीषणम = भयङ्करम्
14. सङ्कटम् = कष्टम्

धातुरूपाणि
1. अस्ति – स्तः – सन्ति
2. आसीत् – आस्ताम् – आसन्
3. गच्छ / गच्छतात् – गच्छतम् – गच्छत
4. अवदत् – अवदताम् – अवदन्
5. करोमि – कुर्वः – कुर्मः
6. खादामि – खादावः – खादामः
7. पिबामि – पिबाव: – पिबामः
8. हनिष्यसि – हनिष्यथः – हनिष्यथ
9. करिष्यामि – करिष्यावः – करिष्यामः
10. अभवम् – अभवाव – अभवाम
11. वदतु / वदतात् – वदताम् – वदन्तु
12. ऐच्छत् – ऐच्छताम् – ऐच्छन्
13. नयति – नयतः – नयन्ति
14. पीडयिष्यामि – पीडयिष्यावः – पीडयिष्यामः
व्याकरणांशाः
सन्धयः
1. पर + उपकारम् = परोपकारम् – गुणसन्धिः
2. धान्य + अर्थः = धान्यार्थः – सवर्णदीर्घसन्धिः
3. वृक्ष + उपरि = वृक्षोपरि – गुणसन्धिः
4. पुनः + अपि = पुनरपि – विसर्गसन्धिः
5. नि + अक्षिपत् = न्यक्षिपत् – यणादेशसन्धिः
6. प्र + आरभन्त = प्रारभन्त – सवर्णदीर्घसन्धिः
समासाः
1. सर्वशावकानाम् – सर्वेषां शावकाः सर्वशावकाः तेषाम् – षष्ठीतत्पुरुषसमासः
2. अस्थिभङ्गः – अस्थेः भङ्गः – षष्ठीतत्पुरुषसमासः
3. फलरहिताः – फलैः रहिताः – तृतीयातत्पुरुषसमासः
4. पर्णविहीनाः – पर्णैः विहीनाः – तृतीयातत्पुरुषसमासः
5. वटवृक्षे – वटः इति वृक्षः वटवृक्षः, तस्मिन् – सम्भावनापूर्वपदकर्मधारयसमासः
6. वृक्षोपरि – वृक्षस्य उपरि – षष्ठीतत्पुरुषसमासः
7. जयनादम् – जय इति नादम् – सम्भावनापूर्वपद कर्मधारयसमासः
8. निराधाराः – नास्ति आधारः येषां ते – बहुव्रीहिसमासः
9. नवमस्तकानि – नव च तानि मस्तकानि च – द्विगुसमासः
मूर्खपण्डितकथा Summary in Telugu & English
आचार्य हर्षदेवमाधवः
परिचय:-
अयं महोदयः आधुनिक संस्कृतसाहित्ये सुप्रसिद्धः । संस्कृते कविः कथारचयिता च विराजते । अयं २०-१०-१९५४ दिनाङ्के, घूर्जरराज्ये भावनगरे जनिम् अलभत । अहम्मदाबादनगरे H-K महाविद्यालये संस्कृतविभागे आचार्यपदवीम् अलङ्कृतवान् । अस्य महोदयस्य लेखनीतः प्रसूता कवितावाहिनी सुहृदां, सहृदयानाञ्च आनन्दवर्धनी विलसति । महोदयस्य रचनासु अलकनन्दा, मृगया, निष्क्रान्ताः, सर्वे, पुरा यत्र स्रोतः, मृत्युशतकम्, तव स्पर्शे स्पर्शे” भाति ते भारतम् इत्यादीनि मुख्यानि । २००६ तमे वत्सरे केन्द्रसाहित्य अकादमी महोदयस्यास्य “तव स्पर्शे स्पर्शे” इत्याख्यस्य काव्यस्य कृते पुरस्कारं प्रादात् ।
प्रस्तुत पाठ्यांशः दयावान् राक्षसः इत्येषा कथा “बुभुक्षितः काकः” इति हर्षदेवमाधवमहोदयविरचित कथासङ्कलनात् स्वीकृता ।
పరిచయం : अयं महोदयः (आचार्य हर्षदेवमाधवः) ఈ మహోదయుడు ఆధునిక సాంస్కృతిక సాహిత్యమునందు ప్రసిద్ధుడు. ఈయన సంస్కృత కవి, కథా రచయితగా ప్రకాశించుచున్నారు. ఈయన 20-10-1954 సం||న గూర్జర రాజ్యము నందు (గుజరాత్) భావ నగరము నందు జన్మించిరి. అహమ్మదాబాద్ నగరము నందున్న H.K. మహావిద్యాలయము నందు సంస్కృత విభాగము నందు ఆచార్య పదవిని అలంకరించిరి. ఈ మహోదయునిచే రచించబడిన గ్రంథములు ప్రసూతా కవితా వాహినీ సుహృదాం – సహృదయనాఞ్చ ఆనన్దవర్ధనీ”.
ఈ మహోదయుని యొక్క అలకనందా – మృగయా – నిషాన్తాః పూర్వం ఎవ్వరిచే చెప్పబడలేదు. మృత్యుశతకము – తవ స్పర్శే స్పర్శే, “భాతి తే భారతము” మొదలగునవి ముఖ్యమైనవి. 2006 సం॥న కేంద్ర సాహిత్య అకాడమీ ఈ మహోదయునకు “తప స్పర్శే స్పర్సే” అను కావ్యమునకు పురస్కారమును ఇచ్చిరి. ప్రస్తుత పాఠ్యభాగము దయావాన్ రాక్షసః అనెడి ఈ కథ “బుభుక్షి తః కాకః” అను హర్షదేవ – మాధవ మహోదయునిచే రచించబడిన కథా సంకలనము నుండి స్వీకరించబడినది.
Introduction: Yam Mahadhya (Acharya Harsh Dev Mahadeva) is a famous Sanskrit poet and short story writer. He was born on 20-10-1954 in Bhavnagar, Gujarat. He served as a professor in the Sanskrit department of H.K. Mahavidyalaya, Ahmedabad. The books written by this great man are like “prasuta kavita vaahini suhridam- sahrudayananchcha anandavardhani” which brings joy to the hearts of the friends.
This great man’s Alakananda – Mrigaya – Nishkanaataha has never been told before. Mrityusatakamu – tava sparshe sparshe, “Bhaati ti Bharatam” etc., are important. In 2006, the Central Sahitya Akademi awarded this great man the prize for his poem “Tapa sparshe sparse anu pasparshe sparse anu kavyam”.
The present text is taken from the collection of stories “Bubhuksha Kakah” written by Harshadeva – Madhava great man.
पाठ्यांशः
उज्जयिनी नाम एका विशाला नगरी अस्ति | नगर्या समीपे विशालं वनम् आसीत् । प्राचीनकाले तत् वनं निबिडम् आसीत् । तस्मिन् वने विशालः वटवृक्षः आसीत् । वटवृक्षे बहवः कुलायाः आसन् । वृक्षस्य स्कन्धेषु कोटराणि आसन् । एकदा एकः राक्षसः तत्र आगच्छत् । सः राक्षसः तस्य वृक्षस्य कोटरे निवासं कर्तुं व्यचारयत् । किन्तु तं दृष्ट्वा सर्वे विहगाः सम्मिलिताः । ते सर्वे उच्चैः आक्रोशन्, ‘भोः भोः ! किं तव नाम ? त्वम् अत्र कस्मात् आगतः ? वयं सर्वे निर्दोषाः विहगाः अत्र निवासं कुर्मः । अस्मान् मा पीडय । त्वं गच्छ अन्यत्र’ ।
राक्षसः अवदत्, ‘हे मित्राणि ! हे बान्धवाः ! मा भयम् अनुभवत । अहं युष्मान् न पीडयिष्यामि । मम नाम दयारामः अस्ति ।’ सर्वे विहगाः अहसन् । ते अवदन्, ‘किं किं तव नाम दयारामः अस्ति ? राक्षसेषु दया न भवति । त्वम् सत्यं वद । किं तव नाम ?’
राक्षसः अवदत्, ‘सत्यम् एव अहं दयारामः । अहं दयावान् । अहं प्राणिनः न हन्मि । अहं जीवमात्रं न हन्मि | अहं सर्वदा परोपकारं करोमि । अहं द्विवारं फलानि खादामि । जलं च पिबामि ।’ सर्वे विहगाः अवदन्, ‘किं त्वं सत्यं हिंसां न करोषि ? त्वम् अस्मान् न हनिष्यसि ?’
दयारामः अवदत् ‘अहं सत्यम् एव युष्मान् न हनिष्यामि । अहं युष्माकं रक्षणं करिष्यामि । यूयं दिवसे यदा धान्यार्थं गमिष्यथ तदा युष्माकं शावकान् अहं रक्षयिष्यामि ।’ विहगाः अवदन् ‘भ्रातः ! अधुना अपि अस्माकं मनसि शङ्का वर्तते । त्वं कुतः आगतः ? त्वं कथं सुशीलः सज्जनः अभवः ?’
दयारामः अवदत् ‘शृणुत ! अहं पूर्वकाले हिंसकः आसम् । अहं विना कारणं प्राणिनां घातम् अकरवम् । अतः सर्वे मां क्रूरं कथयन्ति स्म । अतः अहं राक्षसः अभवम् । राक्षम भूत्वा अपि अहं प्राणिनां वधम् अकरवम् । एकदा. सुमतिः नामकः एकः ऋषिः मार्गे गच्छति स्म । अहं तं खादितुम् अधावम् । तदा सुमतिः मां प्रति कलशात् जलम् अक्षिपत् । अहं पाषाण इव स्थिरः अभवम् । ततः अहं ऋ षिम् अनमम् । सः मह्यं क्षमाम् अददात् । सः क्षमाम् अवदत् ‘क्रूर ! अधुना त्वं हिंसां त्यज, सर्वेषां हितं कुरु । परोपकारं कृत्वा त्वं वने वस । तव नाम दयारामः अस्ति । सर्वे तव नाम्ना सह रामनाम वदन्तु । एवम् अहं दयारामः अस्मि ।’
सर्वे विहगाः दयारामम् अनमन् । दयारामः अवदत् ‘मा चिन्तां कुरुत । यदा यूयं धान्यार्थं गमिष्यथ तदा अहं युष्माकं शावकानां रक्षां करिष्यामि ।’ इत्थं दयारामः तस्य वृक्षस्य कोटरे निवासम् अकरोत् । सः सर्वशावकानां रक्षाम् अकरोत् । एकदा एकः शाकुनिकः वनं प्राविशत् । सः पक्षिणां शावकान् च हन्तुम् ऐच्छम् ऐच्छत् । सर्वे पक्षिणः आक्रन्दम् अकुर्वन् । ते सर्वे दयारामम् अवदन्, ‘हे महाभाग ! अस्माकं रक्षणं कुरु ।’ दयारामः अवदत्, ‘बन्धवाः! मा चिन्तां कुरुत । अहं सर्वेषां रक्षणं करिष्यामि ।’ शाकुनिकः वृक्षम् आरुह्य विहगान् ग्रहीतुम् ऐच्छत्। सः वृक्षोपरि आरोहणं प्रारभत । तदा दयारामः शाकुनिकम् अपातयत् । शाकुनिकस्य पादस्य अस्थिभङ्गः अभवत् । एवं दयारामः पक्षिणां रक्षणम् अकरोत् । सर्वे पक्षिणः दयारामस्य जयनादम् अकुर्वन् । दयारामः सर्वेषां प्रियः अभवत् ।
पुनः अपि एकदा मृगयुः तस्मिन् वने आगच्छत् । सः वटवृक्षस्य तले अस्वपत् तदा मृगाः शशकाः शूकरा:, अपि च अन्ये प्राणिनः दयारामस्य समीपम् आगच्छन् । दयारामः अवदत् न भेतव्यम् । अहं तं निवारयिष्यामि । अपरेद्युः दयारामः तं स्कन्धम् आरोप्य पर्वतस्य शिखरम् – अनयत् । पर्वतः दूरे आसीत् । अतः मृगयुः प्राणिनां घातं कर्तुं न प्राभवत् । सः पर्वतात् शनैः शनैः अवतरणम् अकरोत् । सः अतीव श्रान्तः अभवत् अतः सः स्वग्रामम् अगच्छत् । एकस्मिन् आषाढे जलदाः न अवर्षन् । सरोवराः शुष्काः अभवन् । नदीषु जलं न आसीत् । वृक्षाः फलरहिताः पर्णविहीनाः अभवन् । पक्षिणः जलं विना, अन्नं विना दुःखिताः अभवन् । दयारामः अपि दुःखितः अभवत् । सः गगने अडयत । दयारामः दूरं देशं नभसि अगच्छत् । सः तत्र श्यामान् मेघान् अपश्यत् । दयारामः अवदत्, ‘हे जलदाः मया सह आगच्छत । मम देशे जलं नास्ति । सर्वे प्राणिनः म्रियन्ते । दयां कुरुत ।’ जलदाः अवदन्- ‘भ्रातः वयं दयां करिष्यामः, किन्तु वयं पवनं विना कुत्र अपि गन्तुं न प्रभवामः ।
पवनः अस्मान् सर्वत्र नयति । यदि त्वं पवनं नेतुं शक्तिमान् असि तर्हि वयम् आगमिष्यामः ।’ राक्षसः विराजं स्वरूपम् अधारयत् । सः स्कन्धम् आरोप्य जलदान् स्ववनम् अनयत् । जलदाः वने वृष्टिम् अकुर्वन् । सरोवराः जलेन पूर्णाः अभवन् । नद्यः निर्झराः जलेन पूर्णाः अभवन् । सर्वे प्राणिनः सानन्दम् अनृत्यन् । सर्वे प्राणिनः दयारामम् अपूजयन् वनं पुनरपि हरितम् अभवत् । किन्तु पुनरपि वने नवा विपद् आगच्छत् । वने त्रयः तक्षकाः कुठारैः सह आगच्छन् । ते हरितान् वृक्षान् छेत्तुम् ऐच्छन् । सर्वे वृक्षाः दुःखिताः अभवन् । वटवृक्षः दयारामम् अवदत्, ‘भ्रातः ! एते सर्वे श्वः अस्माकं विनाशं करिष्यन्ति । अहं तु वृद्धः । अतः मम मनसि मरणस्य भयं नास्ति । किन्तु सर्वे पक्षिणः गृहविहीनाः भविष्यन्ति ।’ प्राणिनः अपि निराधाराः भविष्यन्ति । वृक्षान् विना जलदा अपि जलवर्षणं न करिष्यान्ति । अत्र विजनं भविष्यति । दयारामः अहस्त्, ‘हे वट-पितामह ! मा चिन्तां कुरु । अहं तान् निवारयिष्यामि । ते वृक्षाणां विनाशं न करिष्यन्ति ।’
अपरेद्युः यदा ते तक्षकाः कुठारैः वृक्षाणां विनाशं कर्तुं प्रारभन्त तदा दयारामः तेषां हस्तेभ्यः कुठारान् आच्छिद्य तरुकोटरे न्यक्षिपत् । कुठारान् विना ते वृक्षान् न विदारयितुं शक्ताः आसन् । ते सर्वे प्रतिनिवृत्ताः । ते पुनरपि नवैः कुठारैः सह वनम् आगच्छन् । तदा दयारामः तेषां कुठारान् आच्छिंद्य जले न्यक्षिपत् । अतः ते भयात् वनम् अत्यजन् । दयारामः हास्यप्रियः आसीत् । एकदा एकः हिंसकः व्याघ्रः वनम् आगच्छत् । सः व्याघ्रः कारणं विना प्राणिनः पीडयति स्म । प्राणिनां चीत्कारान् दयारामः अशृणोत् ।
सः व्याघ्रस्य पादान् च हस्ताभ्यां गृहीत्वा तम् अधोमुखम् अकरोत् । वराकः व्याघ्रः भयभीतः अभवत् । दयारामः तं समुद्रतटम् अनयत् । तत्र एकस्यां नौकायां तं निक्षिप्य दयारामः नौकां तटात् नीत्वा समुद्रमध्ये प्रावाहयत् । व्याघ्रः तु समुद्रे नौकायां दीनः अभवत् । सः नौकायां चीत्कारान् अकरोत् । किन्तु समुद्रे न कः अपि अशृणोत् । एवं दयारामः व्याघ्राय दण्डम् अददात् । किन्तु वने अकस्मात् एव पुनरपि नवं सङ्कटम् आगतम् । सहसा एकः सप्तदशशृङ्गराक्षसः अन्यैः राक्षसैः सह वनं प्राविशत् ।
वस्तुतः तस्य अष्टादश शृङ्गाणि आसन् किन्तु एकं शृङ्गं केन अपि राक्षसेन सह युद्धे खण्डितम् अभवत् । अतः अयं राक्षसः नवमस्तकानि अधारयत् । सः वनं प्रविश्य दयारामम् अवदत्, ‘यदि त्वं त्वां त्रातुम् इच्छसि तर्हि दूरं गच्छ । अधुना इदं वनम् अस्माकं वनं वर्तते । अत्र बहवः प्राणिनः, बहवः पक्षिणः सन्ति । वयं तेषां रुधिरं पास्यामः । अपि च तेषां मांसं खादिष्यामः । मम शक्तिं त्वं न जानासि । अतः शीघ्रम् एव पलायनं कुरु । अस्मिन् वने अस्माकं साम्राज्यं भविष्यति । एतत् श्रुत्वा दयारामः क्रुद्धः अभवत् । सः अवदत् ‘हे दुष्ट ! अस्य वनस्य रक्षणम् अहं करोमि । एते प्राणिनः, एते पक्षिणः मम बान्धवाः सन्ति । अहं तेषां रक्षणं करिष्यामि । त्वम् अपि हन्तुं न प्रभवसि । सर्वप्रथमं मया सह युद्धं कुरु ।
ततः पश्चात् दयारामस्य सप्तदशशृङ्गयुक्तेन राक्षसेन सह भीषणं युद्धम् अभवत् । तौ परस्परं प्रहारम् अकुरुताम् । दयारामः तस्य राक्षसस्य सप्तदशशृङ्गाणि उदपाटयत् । तदा सः राक्षसः सिंहनादं कृत्वा भूमौ अपतत् । किन्तु सः पतनाद् पूर्वं दयारामस्य वक्षसि प्राहरत् । सप्तदशशृङ्गः राक्षसः अम्रियत । तेन प्रहारेण दयारामः अपि भूमौ अपतत् । सः अपि निश्चेष्टः अभवत् ।
सर्वे प्राणिनः पक्षिणः च दयारामस्य देहं परितः अतिष्ठन् । ते सर्वे रोदनम् अकुर्वन् । ते सर्वे ईश्वरं प्रार्थयन् । तेषाम् आर्तनादं श्रुत्वा भगवान् आगतः । तस्य चत्वारः हस्ताः आसन् । तेषु हस्तेषु शङ्खम्, गदा, चक्रम् च कमलपुष्पम् – एतत् सर्वम् आसीत् । ईश्वरस्य दिव्यः प्रकाशः आसीत् । सः स्मितम् अकरोत् । सः मधुरस्वरेण अवदत् ‘पुत्रक दयाराम ! उत्तिष्ठ । त्वम् अनेकानि शुभकार्याणि अकरोः । अतः अधुना त्वं राक्षसः न असि । अहं तुभ्यं देवत्वं ददामि । तव रूपं दिव्यं भविष्यति ।’
तदानीं दयारामः सहसा निद्रां त्यक्त्वा जागरित इव उत्थितः । अधुना सः राक्षसः न आसीत् । तस्य रूपं देवेन तुल्यम् अभवत् । भगवान् अवदत्, दयाराम, त्वं देवः असि । अधुना त्वं मया सह स्वर्गम् आगच्छ ।’ दयारामः ईश्वरम् अनमत् । सः अवदत्, ‘हे भगवन् तव कृपया अहं पुनः जीवितः । अधुना अहं देवः । किन्तु अहं तु अत्र वने एव निवासम् इच्छामि । एते प्राणिनः, एते पक्षिणः, एते वृक्षाः मम बान्धवाः सन्ति । अहं तान् त्यक्तुं न इच्छामि । कृपां कुरु ।
भगवान् अवदत्, ‘तथास्तु । त्वम् अत्र एव देवः भूत्वा निवासं कुरु ।’ भगवान् वरदानं दत्त्वा अगच्छत् सर्वे प्राणिनः पक्षिणः दयारामम् अपूजयन् । दयारामः अपि तेषां रक्षणम् अकरोत् । सर्वे दयारामस्य पूजां नित्यम् अकुर्वन् । दयारामः वने अवसत् । अतः तत्र किञ्चित् अपि सङ्कटं न आगच्छत् ।

పాఠ్యాంశం : ఉజ్జయినీ అను పేరుగల ఒక విశాల నగరము ఉన్నది. నగరము యొక్క సమీపము నందు విశాలమైన అరణ్యం కలదు. ప్రాచీన కాలము నందు ఆ వనము విశాలంగా ఉండెను. ఆ వనము నందు విశాలమైన వట వృక్షం ఉండెను. వట వృక్షము నందు చాల గూళ్ళు ఉండెను. వృక్షము యొక్క శాకల యందు తొర్రలు అనేకం ఉండెను. ఒక నాడు ఒక రాక్షసుడు అక్కడకు వచ్చెను. ఆ రాక్షసుడు ఆ వృక్షము యొక్క కోటరము నందు నివశించుటకు ఆలోచించుచుండెను. కాని అతనిని చూచిన అన్ని పక్షులు కలసినవి ! అవి అన్నీ బిగ్గరగా భయముతో అరచుచు ఎవరు మీరు ? మీ పేరు ఏమి ? మీరు ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చినారు ? పక్షులమైన మేమందరము ఇక్కడ నివాసము ఉంటున్నాము. మమ్ములను పీడించ వద్దు మీరెక్కడికైన వెళ్ళండి.
రాక్షసుడు ఈ విధంగా పలికెను. ఓ మిత్రులారా ! ఓ బంధువులారా ! భయము చెందకండి. నేను మిమ్ములను పీడించను. నా పేరు దయా రామ ! అన్ని పక్షులు మీ మాటలు నమ్మశక్యంగా లేవు ఏమిటి మీ పేరు దయారామ ? రాక్షసుల యందు దయ ఉండదు. మీరు సత్యం చెప్పండి మీ పేరు ఏమి ?
రాక్షసుడు – సత్యమ్ నా పేరు దయారామ్ ! నేను దయ గలవాడను ! నేను ప్రాణులను చంపను. నా జీవనం కొరకు కూడా చంపను. నేను ఎల్లప్పుడు పరోపకారం చేయుచుందును. నేను రెండు పూటలా ఫలములనే తిందును. జలం త్రాగెదను. అంత పక్షులు ఈ విధంగా పలికెను. “నీవు నిజంగా హింసను చేయుట లేదా ? నీవు మమ్ములను చంపవా ?
దయారామ ఈ విధంగా పలికెను. నేను ప్రమాణము చేయుచున్నాను. మిమ్ములను చంపను. నేను మీకు రక్షణగా ఉంటాను. మీరు పగలు ఆహారం కొరకు వెళతారో అప్పుడు మీ యొక్క పిల్లలను రక్షించెదను. పక్షులు పలికెను. “భ్రాత ! ఇప్పటికి కూడా మా మనస్సు నందు అనుమానం ఉన్నది. నీవెక్కడ నుండి వచ్చావు, నీవు ఏ విధంగా మంచి ప్రవర్తన కలవాడిగా సజ్జనుడిగా అయినావు ?
దయా రామ ఈ విధంగా పలికెను. వినండి నేను పూర్వ కాలము నందు హింసకుడిగా ఉంటిని. నేను కారణం లేకుండానే ప్రాణులను చంపుచుండెడి వాడను. అందువలన అందరూ నన్ను కౄరుడు అని చెప్పుకొనేవారు. అందువలన నేను రాక్షసుడను అయితిని. రాక్షసుడను అయినప్పటికి నేను ప్రాణుల వధను చేసితిని. ఒకసారి సుమతి అను పేరుగల ఒక ఋషి మార్గము నందు వెళ్ళెను.
నేను అతనిని తినుటకు వెంట పరిగెత్తాను. అప్పుడు సుమతి తన కలశము నుండి జలమును తీసి నాపై చల్లెను. నేను రాయివలే స్థిరముగా అయితిని అటు పిమ్మట నేను ఋషికి నమస్కరించితిని. అతడు నన్ను దయతో క్షమించెను. నాతో ఈ విధంగా పలికెను. కౄరుడా ! నీవు ఈ నాటి నుండి హింసను విడచి అందరికి హితము చేయుము. పరోపకారము చేయుచు వనము నందు నివశించుము. నీ పేరు దయారామ అని పిలువ బడెదవు. నీతో సహా అందరు రామ నామమును పలికెదరు. ఈ విధంగా నేను దయారామ అని రాక్షసుడు పలికెను.
“పక్షులన్ని దయారామమును గూర్చి నమస్కరించినవి. దయారాముడు పలికెను. మీరు చింతించవద్దు ఎప్పుడైతే మీరు ఆహారార్థం వెళతారో అప్పుడు నేను మీ సంతానమును రక్షించెదను.” దయారామ ఈ విధంగా పలికి ఆ వృక్షము యొక్క తొర్రను నివాసంగా చేసుకొనెను. మాట ఇచ్చిన ప్రకారం పక్షి పిల్లలను రక్షించుచుండెను.
ఒకసారి ఒక బోయవాడు వనము నందు ప్రవేశించెను. అతడు పక్షి పిల్లలను చంపకోరెను. పక్షులన్నీ ఆక్రందన చేసెను. అవి దయారామంతో ఈ విధంగా పలికెను. హే ! మహాభాగ ! మమ్ము రక్షించుము”. అని దయారామ పలికెను. ఓ బంధువులారా చింతించవలదు. నేను మిమ్మలందరిని రక్షించెదను. బోయవాడు చెట్టును ఎక్కి పక్షులను పట్టుకొనబోయెను. అతడు చెట్టును ఎక్కుచుండగా దయారామ అతనిని చెట్టు నుండి పడవేసెను. అతని పాదము యొక్క ఎముక విరిగిపోయెను. ఈ విధంగా పక్షులను రక్షించెను. ఆ పక్షులన్నీ దయారామునకు జయజయ ధ్వనులను చేసెను. దయారామ అందరికి ప్రియమైన వాడు అయ్యెను.
మరల ఒక నాడు వేటగాడు ఒకడు ఆ వనమునకు వచ్చెను. ఆ వటవృక్షము వద్ద నివశించుచున్న మృగములు – కుందేళ్ళు – పందులు మిగిలిన ప్రాణులు దయా రాముని సమీపమునకు వచ్చినవి. దయారామ భయపడవలదు అని పలికెను. నేను వేట గాడిని నివారించెదను.
అని పలికి ఆ వేటగాడిని భుజముపై ఎక్కించుకొని పర్వత శిఖరమునకు తీసుకు వెళ్ళెను. ఆ పర్వతము వనమునకు చాలా దూరంగా ఉండెను. అందువలన వేటగాడు ప్రాణులను చంపుటకు సాధ్యం కాదు. వేటగాడు మెల్లమెల్లగా పర్వతమును దాటెను. అతడు చాలా అలసిపోయెను. అందువలన అతడు స్వగ్రామమునకు వెళ్ళెను.
ఒక సంవత్సరమున ఆషాఢ మాసమున మేఘములు వర్షించలేదు. సరోవరములు ఎండిపోయెను. నదుల యందు జలము కొంచెం కూడా లేదు. వృక్షములు ఆకులు పండ్లు లేనివి అయ్యెను. పక్షులు జలము ఆహారము లేక దుఃఖించెను. దయారాముడు కూడా దుంఖితుడైనాడు. దయారామ గగనము నందు తిరిగెను. వేరొక దూర దేశము నందు ఆకసమును చూచెను. అతడు అక్కడ నల్లని మేఘములను చూచెను.
దయారాముడు మేఘముతో ఓ జలధరా ! నాతో రావలెను. నా దేశము నందు జలము లేదు. ప్రాణులన్ని మరణించుచున్నవి. దయను చూపుము. మేఘుడు మేము దయను కలిగి ఉందుము. కాని వాయువు లేకుండా కదులుటకు శక్తి లేదు. వాయువు మమ్ములను అన్నిచోట్లకు తీసుకు వెళ్ళును. నీవు వాయువువలే మమ్ములను తీసుకు వెళ్ళుటకు శక్తి కలిగి ఉందువేని మేము రాగలము అని పలికెను. రాక్షసుడు పెద్ద స్వరూపమును ధరించెను.
అతని భుజములపై మేఘములను ఎక్కించుకొని అతడు నివసించు వనమునకు తీసుకు వెళ్ళెను. మేఘములు ఆ వనము నందు వర్షించెను. సరోవరములు జలముచే నిండెను. నదులు స్వచ్ఛమైన నీటిచే నిండినవి. అన్ని ప్రాణులు ఆనందంతో నృత్యము చేసెను. ప్రాణులన్ని దయారాముని పూజించెను. వనమంతా తిరిగి పచ్చగా అయ్యెను. కాని, మరల వనము నందు కొత్త ఆపద వచ్చెను. ముగ్గురు వడ్రంగులు గొడ్డళ్ళతో సహా వనమునకు వచ్చిరి. వారు పచ్చని వృక్షములను నఱుక నిశ్చయించిరి. వృక్షములన్నీ దుఃఖించెను. వట వృక్షము దయారాముని గూర్చి ఈ విధంగా పలికెను.
భ్రాతా ఈ ముగ్గురు రేపు నన్ను నాశనము చేసెదరు. నేను వృద్ధుడను అందువలన నాకు మరణ భయం లేదు. కాని పక్షులన్ని గృహములు లేనివిగా అగును. ఈ ప్రాణులు ఆధారం లేనివి కాగలవు. వృక్షములు లేని చోట మేఘములు వర్షించవు. ఇక్కడ కఱువు ఏర్పడగలదు. దయారాముడు నవ్వెను. ఓ వటవృక్ష పితామహ (తాత) చింతించవలదు. నేను వారిని నివారించెదను. వారు వృక్షము యొక్క నాశనమును చేయలేరు.
మరుసటి రోజు ఎప్పుడైతే ఆ వడ్రంగులు గొడ్డళ్ళుతో వృక్షము యొక్క నాశనము చేయుట ప్రారంభించారో అప్పుడు దయారాముడు వారి హస్తముల నుండి గొడ్డళ్ళను మాయం చేసి – వృక్షము యొక్క తొర్రలో దాచెను. గొడ్డళ్ళు లేకపోవుటచే వారు వృక్షములను నరకుటకు శక్తిలేనివారు అయినారు.
వారు తిరిగి వెళ్ళిపోయినారు. వారు మరల క్రొత్తగొడ్డళ్ళతో అడవికి వచ్చారు. అప్పుడు దయారాము ఆ గొడ్డళ్ళను పగలగొట్టి నదిలో పడవేసెను. అందువలన వారు భయముతో అరణ్యమును విడిచిరి. దయారామ్ హాస్యప్రియుడు. ఒకసారి సింహము పులి అరణ్యమునకు వచ్చెను.
ఆ పులి కారణం లేకుండానే ప్రాణులను పీడించెను. ప్రాణుల దుఃఖమును దయారామ్ వినెను. అతడు పులి యొక్క పాదములను చేతితో పట్టుకొని దానిని అధో ముఖముగా వ్యాఘ్రము భయము చెందినది. దానిని సముద్ర తటమునకు తీసుకు వెళ్ళెను. అక్కడ ఒక నౌక యందు దానిని ఉంచి ఆ నౌకను సముద్ర మధ్య ప్రవాహము నందు విడచెను. పులి సముద్ర నౌక యందు దీనముగా అయ్యెను.
అతడు నౌక యందు దుఃఖించునట్లు చేసెను. కాని సముద్రము నందు ఎవరు కూడా, వినలేరు. ఈ విధంగా దయారాముడు పులిని దండించెను. కాని వనము నందు అనుకోకుండా మరియొక కొత్త సంకటము (కష్టం) వచ్చెను. ఒకసారి సప్త దశ శృంగ రాక్షసుడు ఇతర రాక్షసులతో కలసి వనమునకు వచ్చెను.
ఆ రాక్షసునకు సహజంగా పదునెనిమిది కొమ్ములు కలవు. కాని ఒక కొమ్ము వేరొక రాక్షసునితో యుద్ధము చేయునపుడు ఖండించబడినది. అందువలన ఈ రాక్షసుడు తొమ్మిది తలలను ధరించెను. అతడు వనము నందు ప్రవేశించి దయారామునితో పలికెను. నాచే నీవు రక్షింపదలచినచో (నాచే రక్షణ పొందదలచిన) దూరముగా పొమ్ము. ఇప్పుడు ఈ వనము మాదే.
ఇక్కడ చాలా ప్రాణులు పక్షులు కలవు. మేము వాటి యొక్క రక్తమును త్రాగెదము. ఈ మాటలు విన్న దయారామ్ క్రోధుదయ్యెను. రాక్షసునితో ఈ విధంగా పలికెను. ఓ దుష్టుడా ! నేను ఈ వనమును రక్షించుచున్నాను. ఈ ప్రాణులు, పక్షులు నా బంధువులు నేను వీరి రక్షణను చేయవలెను. నీవు మరణించుటకు సిద్ధముగా నుండుము. మొదట నాతో యుద్ధము చేయుము.
తరువాత దయారామునకు 17 కొమ్ములు కలిగిన రాక్షసునకు భయంకరమైన యుద్ధము జరిగెను. వారిద్దరు పరస్పరము గాయములను పొందిరి. దయారామ్ 17 కొమ్ముల రాక్షసుని కొమ్ములను పెరికెను. అప్పుడు ఆ రాక్షసుడు గర్జించుచు నేలపై పడెను. అతడు పడక ముందే దయారామ్ హృదయంపై గాయం చేసెను. 17 కొమ్ముల రాక్షసుడు మరణించెను. గాయము తగిలిన దయారామ్ కూడా భూమి యందు పడెను. అతడు నిశ్చేష్టుడు అయ్యెను. (మరణించెను).
ప్రాణులు పక్షులు అన్ని దయారామ్ దేహమును చుట్టి వేసెను. అవి అన్ని రోదించుచుండెను. అవి అన్ని ఈశ్వరుని ప్రార్ధించెను. వాటి ఆర్తనాదం విన్న భగవంతుడు అక్కడకు వచ్చెను. అతనికి నాలుగు చేతులు కలవు. ఆ హస్తముల యందు శంఖము, గదా, చక్రము, కమలపుష్పం (పద్మము) ను ధరించెను.
ఈశ్వరుని యొక్క దివ్యమైన ప్రకాశం కలిగి ఉండెను. అతడే చిరునవ్వు నవ్యెను ! అతడు మధుర స్వరముతో ఈ విధంగా పలికెను. “పుత్రక దయారామ లెమ్ము ! నీవు అనేక శుభ, కార్యములు చేసినావు. అందువలన నీవు రాక్షసుడవు కావు. నేను నీ కొరకు దైవత్వమును ఇచ్చుచున్నాను. నీ రూపం దివ్యమైనది కాగలదు. దయారాముడు అప్పుడే నిద్రను విడచి మేల్కొన్న వారి వలే లేచెను.
ఇప్పుడు అతడు రాక్షసుడు కాదు అతని రూపము దేవునితో సమానమయ్యెను. భగవంతుడు పలికెను. దయారామ నీవు దేవుడవైతివి. నీవు ఇప్పుడు నాతో స్వర్గమునకు రమ్ము.
దయారాముడు ఈశ్వరునికి నమస్కరించెను. దయారామ్ పలికెను. ఓ భగవాన్ ! నీ కృప చేత నేను మరల జీవించితిని. ఇప్పుడు నేను దేవుడను. కాని నేను మాత్రము ఈ వనము నందే నివసించవలెనని కోరుచున్నాను. ఈ ప్రాణులు (పక్షులు) ఈ వృక్షములు నాకు బంధువులై వున్నారు. నేను వీరిని విడిచి పెట్టుటకు ఇష్టపడుటలేదు. కృపను చూపుము.
భగవంతుడు ఈ విధంగా పలికెను. తథాస్తు (ఆ విధంగానే అగుగాక !) నీవు దైవ రూపమును పొంది ఇక్కడే నివాసముండుము. అని భగవంతుడు వరమును ఇచ్చి వెళ్ళెను. ప్రాణులు పక్షులు దయా రామును పూజించిరి. అందువలన ఇక్కడ కొంచెం కూడా సంకటము కలుగలేదు.