AP Inter 1st Year Botany Notes Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

Students can go through AP Inter 1st Year Botany Notes 2nd Lesson జీవ ప్రపంచం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 2nd Lesson జీవ ప్రపంచం

→ ‘జీవశాస్త్ర వర్గీకరణ’ అనగా జీవులను వాటి యొక్క సారూప్యాలు మరియు భేదాలు ఆధారంగా సమూహాలుగా అమర్చడం మరియు ఆ సమూహాలను స్థాయిక్రమ వర్గాలలో చేర్చడం.

→ సమూహాలవర్గాలు: జాతులు, ప్రజాతులు, కుటుంబాలు, క్రమాలు, తరగతులు, విభాగం, రాజ్యం.

→ లిన్నేయస్ రెండు రాజ్యాల వ్యవస్థ: ప్లాంటే మరియు ఏనిమాలియా

→ విట్టేకర్ ఐదు రాజ్యాల వర్గీకరణ: మొనీరా, ప్రొటిస్ట్గా, శిలింధ్రాలు, ప్లాంటే మరియు ఏనిమేలియా.

→ ఐదు రాజ్యాల వర్గీకరణ యొక్క ముఖ్య ప్రాతిపదికలు: కణ నిర్మాణం, ధాలస్ సంవిధానము, పోషణావిధానం, ప్రత్యుత్పత్తి మరియు వర్గవికాస సంబంధాలు.

→ ‘కార్లవోస్’ ఆరు రాజ్యాల వర్గీకరణ: బాక్టీరియా, ఆర్కి బాక్టీరియా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు.

AP Inter 1st Year Botany Notes Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

→ వైరాయిడ్లు అనేవి మొక్కలకు మాత్రమే సంక్రామిక కారకాలు. కాని వైరస్లు అనేవి అన్ని జీవులకు సంక్రామిక కారకాలు.

→ లైకేన్లలోని శైవల భాగస్వామిని ‘ఫైకోబయాంట్’ అంటారు. [IPE]

→ లైకేన్లలోని శిలీంధ్ర భాగస్వామిని ‘మైకో బయాంట్’ అంటారు. [IPE]

→ ‘యూగ్లీనాయిడ్స్ ’ ‘ప్రొటిస్టా వృక్షరాజ్యానికి’ చెందినవి. ఇవి ఏకకణయుత కశాభాలను కలిగిన నిజకేంద్రక జీవులు. [IPE]

→ ‘డైనోఫ్లాజెల్లేట్స్’ ‘ప్రొటిస్టా వృక్షరాజ్యానికి’ చెందినవి. ఇవి కశాఖాయుత నిజకేంద్రక జీవులు. [IPE]

→ ‘క్రైసోఫైట్స్’ ‘ప్రొటిస్టా వృక్షరాజ్యానికి’ చెందినవి . ఇవి శైవలాల సమూహానికి చెందినవి. [IPE]

Leave a Comment