Students can go through AP Inter 1st Year Botany Notes 4th Lesson వృక్షరాజ్యం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 4th Lesson వృక్షరాజ్యం
→ ‘వృక్షరాజ్యం’ లో నిజకేంద్రక బహుకణయుత, పత్ర హరితాలైన అన్ని రకాల మొక్కలు ఉంటాయి.
→ వృక్షరాజ్యంలోని మొక్కలు: శైవలాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజాలు, ఆవృత బీజ మొక్కలు
→ వృక్షరాజ్య విభజన: (i) క్రిప్టోగామ్స్ (పుష్పించని మొక్కలు) (ii) ఫెనిరోగామ్స్ (పుష్పించే మొక్కలు)
→ క్రిప్టోగామ్స్ (పుష్పించని మొక్కలు): శైవలాలు, బ్రయోఫైటా మరియు టెరిడోఫైటా
→ ఫెనిరోగామ్స్ (పుష్పించే మొక్కలు): వివృత బీజాలు మరియు ఆవృత బీజాలు.
→ శైవలాలు పత్రహరితం కలిగిన, జలచర, స్వయం పోషిత థాలోఫైటా మొక్కలు.
→ వర్ణద్రవ్యకాల మరియు నిల్వ ఆహారం ఆధారంగా శైవలాలు 3 రకాలు: [IPE]
(i) క్లోరోఫైసీయే (ఆకుపచ్చశైవలాలు)
(ii) రోడోఫైసీయే (ఎరుపుశైవలాలు)
(iii) ఫియోఫైసీయే (గోధుమ వర్ణశైవలాలు)
→ భూమిపై ‘కార్బన్ స్ధాపన’ అనేది ముఖ్యంగా ‘శైవలాల’ ద్వారానే జరుగుతుంది. [IPE]
→ బ్రయోఫైటా మొక్కలను వృక్షరాజ్యం యొక్క ‘ఉభయచరాలు’ అంటారు. ఇవి తేమ ప్రాంతాలలో నివశిస్తాయి కాని ప్రత్యుత్పత్తి కొరకు వీటికి నీరు అవసరం.
→ బ్రయోఫైటా మొక్కలను మూడు తరగతులుగా విభజించారు.
(i) హిపాటికోప్సిడా (లివర్ వర్ట్స్) (ii) ఆంధోసెరాటోప్సిడా (హర్వర్ట్స్) (iii) బ్రయోప్సిడా (మాస్లు)
→ మాస్లు శాఖాహారులైన క్షీరదాలు మరియు పక్షులకు ఆహారాన్ని అందిస్తాయి. [IPE]
→ లివర్ వర్ట్స్ మరియు హర్వర్ట్స్ మొక్కల దేహం ధాలస్. మాస్లు నిటారుగా మధ్యస్థ అక్షంపై సర్పిలాకరంలో అమర్చబడిన పత్రాలను కలిగి ఉంటాయి. [IPE]