TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 10 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1. పలుమఱు ………… నీరముగాక భాస్కరా !
జవాబు:
చ. పలుమఱు సజ్జనుండు ప్రియభాషలెపల్కు ఉగఠోర వాక్యముల్
పలుకఁడొకానొకప్పుడవి పల్కినఁ గీడునుగాదు నిక్కమే ..
చలువకు వచ్చి మేఘుఁ డొక జాడను దా వడగండ్ల రాల్సినన్
శిలలగునోటు వేగిరమె శీతల నీరముగాక భాస్కరా !

భావం : మేఘుడు నీటి బిందువులనే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరమే వడగండ్లను కురిపించినను, అవి వెంటనే చల్లని నీళ్ళగునుగాని రాళ్ళుగా ఉండవు. అదే విధంగా మంచివాడు మంచి మాటలనే పల్కును. ఒకానొక సమయమందున కఠోరవచనమును పలికినను మేలుగానే ఉంటుంది కీడుగా ఉండవు.

2. బిసబిస నెప్పుడు …….. సంశుమంతుఁడు పొడిచెన్.
జవాబు:
క. బిసబిస నెప్పుడు నుడుగక,
విసరెడ్డి వలిచేత వడఁకు విడువక మనముం
బస చెడి మార్గముఁ గానక,
మసలితి మంతటను నంశుమంతుఁడు పొడిచెన్.

భావం : బిసబిసమని తీవ్రంగా వీచే చలిగాలులకు మన శరీరాలు కనిపించాయి. మనం శక్తి కోల్పోయి దిక్కూ తెన్నూ తెలియన్ వనమంతా తిరిగాము. ఎట్టకేలకు సూర్యోదయమైంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘మహైక’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి ?
జవాబు:
‘మహైక’ అనుపాఠ్యభాగం “తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగ’ పేరుపొంది న కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. తెలంగాణలో నియంతృత్వ, భూస్వామ్య అధికారులు పీడనలకు వ్యతిరేకంగా కవిరాజుమూర్తి పోరాడాడు.

మహైక దీర్ఘకవిత సమాజంలో ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మకంగా నడచిన కవిత. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతతి పాత్రల పరస్పర సంభాషణలతో కూడి ఉన్నది. నేటి నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పుతో కవి చెప్పటం ఈ కవిత లోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిని ఓదారుస్తూ మనిషిపై మనిషికి విశ్వాసం తగ్గకుండా ప్రోత్సహించే విప్లవ రచన ఇది.

భవిష్యత్తుపై ఆశలను నిలుపుతూ మానవీయ లక్షణాలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు వేసిందీ కవిత. దీర్ఘకవితను చదివినపుడు ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది అంటారు.

ఈ కావ్యానికి ముందుమాట రాసిన బెల్లకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణులు. ‘మహైకా’ను చదువుతుంటే టి.ఎస్. ఇలియట్ వేస్టాండ్ జ్ఞాపకం వస్తుంది. చిలి దేశ మహాకవి ‘పోబ్లో నెరుడా’ ఎలాంటి కవో తెలుగులో మూర్తి అలాంటి వాడు.

తోటమాలి తనని తాను బలిదానంగా సమర్పించుకుంటేనే పువ్వులు పరిమళాలను వెదజల్లుతాయి. మనిషి మనిషి కలిస్తేనే దేశం వృద్ధి చెందుతుంది. యుగ యుగాల నైరాశ్యం మన బతుకులను నాశనం చేస్తున్నది. చేయి చేయి కలిపి సోమరితనాన్ని వదలిపెట్టి ఆనందంతో శ్రమ చేస్తే అందరికి సంతోషం భూగోళానికి నూతనత్వం వస్తాయి.

అన్నలూ, అక్కలూ మీకు తెలియనిదేమున్నది. సముద్రపు నీరంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండే మంటంతా నిప్పే ప్రక్కనున్న వాటిని కూడా దహిస్తుంది. ఆకలితో ఆహారాన్ని కోరటం తప్పుకాదు. నిస్సత్తువ ప్రాణానికే ప్రమాదకరం.

కుండలు వేరైనా ముట్టి ఒక్కటే, రంగులు వేరైనా మానవులంతా ఒక్కటే. కొమ్మలు రెమ్మలు వేరైనా అవి వృక్షంలో భాగాలే. ఎన్ని దేశాలున్నా మానవులంతా ఒక్కటే. మానవులలో భేదాల సృష్టి మానవ వినాశనానికి దారి తీస్తుంది. అందరం ఒకటిగా నడిస్తే ప్రమాదాలను దాటగలం అని ఐకమత్యాన్ని గూర్చి ‘మహైక’ కవిత వివరిస్తుంది.

ప్రశ్న 2.
‘నా పేరు ప్రజాకోటి’ కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలియచేయండి ?
జవాబు:
‘నాపేరు ప్రజా కోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించిబడిన “పున్నవం” అను కవితాఖండిక నుండి గ్రహించబడింది. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని తెలంగాణ వైభవాన్ని వివరించిన కవి దారశథి. ఆయన పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’గా అమర్చాడు.

కవి అయిన వానికి మానవత ఉండాలి. మంచి చెడులకు స్పందించే మనసుండాలి. అన్ని దృక్పధాలకు కేంద్ర బిందువు మానవుడే! తోటి మానవుని ప్రేమించ లేనివాడు దేనినీ ప్రేమించలేడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరిశీలించి భవిషత్తుకు బాటలు వేయాలన్నాడు. మన దేశం అనాది నుండి శాంతి అహింసలకు ఉపాసించిందన్నాడు. విశ్వశ్రేయస్సును కోరేవారు భారతీయులని అభివర్ణించాడు. తనతో అందరిని కలుపుకోవటం అందరిలో తాను ఒకడిగా కలిసిపోవటమే భారతీయత. చెడు నుండి మంచి వైపుకు ప్రయాణం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.

అహింసను అలవరచుకోవాలి. హింసద్వారా విజయాన్ని పొందినవారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అహింసే జీవిత పరమావధి కావాలని ఈ కవిత ద్వారా దాశరథి ప్రబోధించాడు.

గతమంతా బూది కుప్పకాదు. వర్తమానం అద్భుతమూ కాదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని నడిస్తేనే ప్రజా విజయ మౌతుందన్నాడు. ఎన్ని శక్తులను సాధించినా మానవత ముందు దిగదుడుపే. ఏ జెండా పట్టుకున్నా మైత్రీ బంధం కూర్చేనేరు అహింసకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడ మానవున్నాడ వాడు మానవుడే. రంగు రూపు భేదమున్నా స్నేహం చేయటం నేర్చుకోవాలన్నాడు. హింసాత్మక ధోరణులను వదలి హాయిగా జీవనం గడపమని దాశరథి ఈ కవిత ద్వారా ప్రబోధించాడు.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
బతుకమ్మ పండుగలోని సంగీత, సాహిత్య కళాంశాలను పేర్కొనండి ?
జవాబు:

బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జ్ఞానపద విజ్ఞానం పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలు వారి సాహిత్య సంగీత, నృత్య కళారూపాల త్రివేణి సంగమం సౌభాగ్యదాయిని అయిన గౌరీదేవిని అందమైన పూలతో అలంకరించి పాటలు పాడుతూ ఆడుతూ పూజించటం వారి కళాభిలాషకు ఉదాహరణం.

సుఖదుఃఖాలతో, ఉత్సాహ ఉల్లాసాలతో మనసు ఉద్వేగం చెందినపుడే కళారూపాలు ఆవిర్భవిస్తాయి. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూల మయంగా ఉంటుంది. పంటచేలు నిండు గర్భిణులుగా దర్శనమిస్తాయి. పప్పుధాన్యాలు ఇళ్ళకు చేరతాయి. అలాంటి సంతోష సమయంలో పల్లెపడుచులు తమ మనోభావాలను పాటల ద్వారా నాట్యం చేస్తూ తమ ఆనంద పారవశ్యాలను సంగీత రూపంలో ప్రకటించుకుంటారు.

అలంకరణ : బతుకమ్మను అలంకరించటమే ఒక కళ. ఉదయాన్నే ఇంటిముందు అలికి రంగు రంగుల ముగ్గులేయటం మరొక కళ. ఒక ఇత్తడి పళ్ళెంలో గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పేర్చటం, పొడవైన గుత్తులు గుత్తులుగా అమర్చటం, స్త్రీల కళాభిరుచికి ఒక ఉదాహరణం.

పూవులు ఎక్కువగా దొరికితే మనిషంత ఎత్తుగా బతుకమ్మను అలంకరిస్తారు. పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ, ప్రక్కల పిల్ల బతుకమ్మను అమర్చుతారు. ఉదయం బతుకమ్మను పేర్చిన ముత్తయిదువలు సాయంత్రం తమని తాము అలంకరించుకొని ఇంటిముందు’ ఆటపాటలతో కొంతసేపు కాలక్షేపంచేసి ఆ తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మను సాగనంపుతారు.

పాట-నాట్యం : జానపద స్త్రీలు వలయాకారంలో తిరుగుతూ నాట్యం చేస్తూ. పాటలు పాడుకుంటారు..
నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు

అని రాగయుక్తంగా పాడటం వారి కళాసక్తికి నిదర్శనం. జానపద. స్త్రీల బొడ్డెమ్మ బతుకమ్మ ఆటలకు మూలం. ఆటవికులు పండుగ సమయాలలో చేసే బృంద నృత్యాలే ! పార్వతీపరమేశ్వరులు సాయంత్రం వేళల్లోనే నృత్య పోటీని పెట్టుకునేవారని అందులో ఈశ్వరుడే విజయం సాధించేవాడని ఒక కథనం. తెలంగాణ ప్రాంతంలో ఉంది. అందుకే బతుకమ్మను సాయంత్ర సమయంలో ఆడతారు.

బతుకమ్మ పండుగ ఆటపాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడుదుడుకులు లేకుండా ఒకే స్వరంలో సాగిపోతాయి. వీరు పాడే పాటలకు సంగీత శాస్త్రనియమా “లుండవు. అవి చతరస్రగతిలో ‘కిటతక, కిటతకిట అను మాత్రలతో ఉంటాయి.

స్త్రీలు పౌరాణిక గీతాలు, నీతిబోధాత్మక గీతాలు కథాగేయాలను పడుతుంటారు. పాటలోని ప్రతి చరణాంతంలో ఉయ్యాలో, వలలో, చందమామ అని పునరావృత మౌతుంటుంది. ఆ పాటల్లో ప్రతి వనిత యొక్క మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో – గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో – వచ్చేది సతిగూడి ఉయ్యాలో”

వారు పనిచేసే పనిలోని శ్రమను మరచి పోవటం ఈ పాటలలోని అసలు రహస్యం. పనిపాటలు పరమాత్మ స్వరూపాలుగా భావించటం ప్రజల సంప్రదాయం. ఇలా బతుకమ్మ పండుగలో సంగీత సాహిత్యనాట్యాలు కళాంశాలుగా రూపుదిద్దుకుంటాయి.

ప్రశ్న 2.
పాఠ్యాంశంలోని జంతువులు పక్షుల ఆధారంగా రూపొందిన ఏవేని ఐదు జాతీయాలను వివరించండి.
జవాబు:
“తెలంగాణ జాతీయాలు” అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన ‘తెలంగాణ జాతీయాలు’ అన్న గ్రంథం నుండి గ్రహింపబడింది. ఇందులో జంతువుల పక్షుల ఆధారంగా కొన్ని జాతీయాలున్నాయి.

1. కోతికి పుండు పుట్టినట్లు ఒక కోతికి పుండయ్యింది. విచిత్రంగా కన్పించింది. మరొక కోతి వచ్చి ఆ పుండును గిల్లి చూసి వెళ్ళిపోయింది. అలాగే మరొక కోతి కూడా అలా చేసింది. ఆ కోతి కూడా పుండు బాధ పడలేక గోకున్నది. పుండు మరింత నెత్తురుకారి పెద్దదయింది. ఏ కోతికి పుండు పెద్దది కావాలని ఉండదు.

అయినా తెలియని తనం వలన ఈ కోతి పుండు మానదు “అత్తా! ఈ పోరగాని కాలుకు దెబ్బ తాకిందని పట్టేసి బడికితోలేస్తే మళ్ళీ దెబ్బతాకించుకున్నాడు. కోతికి పుండు పుట్టించుకున్నట్లున్నది” అన్న కోడలి మాటల్లో ఈ జాతీయం పలుకబడింది.

2. ఎద్దును చూసి మేతెయ్యాలి : ఏనుగుకు చీమకు ఒకే విధంగా మేత వేస్తే కదురుతుందా ? విచక్షణతో దేనికెంత వెయ్యాలో తెలుసుకోవాలి. ఎద్దుల్లో కొన్ని పెద్ద ఎద్దులుంటాయి. వాటికి తగ్గమేత వాటికి వేయాలి. కొన్ని బొండలుంటాయి. వాటి పుట్టుకే చిన్నది. కడుపు కూడా అంతకు తగ్గట్టుగానే ఉంటుంది.

వాటికి మేత ఎక్కువ వేస్తే తొక్కి పాడు చేస్తాయి. ‘దసరా మామూళ్ళని అందరికి పదిరూపాలే ఇస్తిరి. ఎద్దును చూసి మేతెయ్యాలి. మే ఎల్లకాలం పనికొచ్చేటోల్లం. మాది మా కుండాల” అని జాతీయం ప్రయోగించబడుతుంది.

3. ఊరు లేదు : ఊరిలో ఎక్కడో ఒకచోట దొరకుండా పోదు అనుట ఒక కుటుంబంలో వస్తువు దొరకకుండా పోవచ్చు. ఊరిలో దొరకకుండా పోదు. గొడ్డు పోవుట చే వంధత్వం, అలభ్యం. ఒక కుటుంబంలో దొరకకపోతే వేరే కుటుంబంలో దొరుకుతుందని భావం” “అయ్యో ! నీవు యియ్యకపోతే మాయె.

ఊరుగొడ్డుపోయిందా ? ఎక్కడో ఒకచోట ఎవరన్నా ఇస్తారు. అందరూ ఒకే తీరు ఉంటారా ? అని ఈ జాతీయం ప్రయోగించబడుతుంది.

4. కోడి మెదడు : అల్పత్వం మతిమాలిన తనం అని అర్థం. కోడి చిన్న ప్రాణి. దాని మెదడు కూడా చిన్నదే ! చెపితే అర్థం చేసుకోకుండా తనకు తెలిసిందే గొప్ప అనుకునే వాడిని కోడిమెడవాడు అంటారు. “వానిది కోడి మెదడు. వానికి తోచదు. ఒకరు చెప్తే వినడు” అంటారు.

5. బుడుబుంగ : నీటిలో తిరిగే పక్షి. బాతు జాతికి చెందింది. నల్లగా ఉంటుంది. ఒక చోట’ బుడుక్కున మునుగుతుంది. కూత పెట్టు దూరంలో తేలుతుంది. మళ్ళీ

మళ్ళీ ముగిగినా అలాగే తేలుతుంది. లోపల చేపలను వేటాడుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో, వెంటనే మరో ఇంట్లో ఇలా కాలాగకుండా తిరిగే వాడిని బుడుబుంగ అని అంటారు.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
పాతిమా గొప్ప మనసును వివరించండి.
జవాబు:
ఇన్సానియత్ కథ ‘డా. దిలావర్’ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్ని ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రించింది. వాటికి ”ఫాతిమా’ గొప్ప మనసు ఒక నిదర్శంగా నిలుస్తుంది.

ఫాతిమా సుబానీ తల్లి, సుబాని, రాంరెడ్డి, కాపోల్ల ఎంకన్నలు పేకాడుకుంటారు. సుబాని చేతిలో వారు ప్రతి ఆట ఓడిపోయారు. రాంరెడ్డి ఇజ్ఞత దెబ్బతింది. సుబానీని నానా మాటలూ అన్నాడు. ఆ దిగులుతో ఇంఇకి వచ్చిన సుబానీని తల్లి ఫాతిమా ఏం జరిగిందని అడిగింది. రాంరెండ్డి అన్నమాటలన్నీ సుబాని తల్లికి చెప్పాడు. రోజులు మారిపోయాయి అనుకుంది ఫాతిమా! పల్లెకు రజాకార్లోత్తే ఊరోల్ల పానానికి తన పానం అడ్డమేనుండు మీ బాపు. ఊరోల్ల మీ బాబును పానానికిపానంగా చూసుకునేటోల్లు.

ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య ఎడం పెరుగుతుంది. మనమే మనకు పరాయిల్లెక్క కండ్ల బడన్నమ్” గీ దుష్మనీ, కచ్చలు, నరుక్కోటం సంపుకోటం, మత పిచ్చిగాల్లు రామ్ – రహీమ్ల నడ్మ చిచ్చుపెట్టడం గియన్ని ఎన్నటి జమానలమేం ఎరగంబిడ్డా! ఒకలకు ఆపతొత్తే ఒకల్లు ఆదుకునే టోల్లు.

సుబానీకు యాక్సిడెంటైనా సమయాన తన కొడుకు ఎలానూ బ్రతకడు. రాంరెడ్డి. కొడుకన్నా బతికితే అంతేచాలు అని అనున్నది పాతిమా !

“మర్దీ సీమకు సుత అపకారం చెయ్యాలి. నా కొడుకుని చూసి ఓర్వలేక ఆ అల్లా తీస్కపోతన్నడు” అని తన బాధను రాంరెడ్డి వద్ద వెళ్ళపోసుకుంది.

అప్పుడు రాంరెడ్డి ఫాతిమా!” గిసుంటి ఆపతిల తల్లి మనసు ఎంత తండ్లాడ్తదో నాకెర్క లేదు కాదు. జర అటు ఇటు నేను సుత నీవోలెనె ఉన్న. ఎంకెట్రెడ్డి సావు బతుకుల్ల ఉన్నాడు. గాని పానాలు గిప్పుడు మీ చేతుల్లవున్నయ్” నా కొడుకు కిడ్నీలు పూరాగా పాడైపోయినయ్. పన్నెండు గంటల్లో ఏరే కిడ్నీలు దొరక్కుంటే నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడు. ఫాతిమా! నీకు చేతులెత్తి మొక్కుత! సుబాని కిడ్నీలు…. అని రాంరెడ్డి గొంతుక పూడిపోయి మాట రాలేదు.

ఫాతిమా ఒక్కసారి షాక్ అయింది. సుడిగాలికి ఎండు టాకులా వణికింది.

‘మర్షీ! కడుపుకోత ఎట్లు అగులు బుగులుగ ఉంటుందో అనుబగిత్తన్నా! నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుకు కావాలె? నా కొడుకును మట్టిలో గల్పుకుంటన్నగా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కోనికి మోక వుంటే ఎందుకడ్డబడాలె! నాకొడుకు పానం అసుమంటిదే నీ కొడుకు పానం. నా కొడుకు హయత్సుత బోస్కోని నీ కొడుకు నిండు నూరేండ్లు బత్కొలె! గందుకునన్నే జెయ్యమంటే గజేస్త…. అన్నది ఫాతిమా!

ఫాతిమా మనసు…. మనిషికి కావలసింది. ఇన్సానియత్ గాని కులాల మతాలు కావని” చెప్పకనే చెప్పింది. ఇంతటి గొప్ప మనసు ఫాతిమావంటి తల్లులకు ఎప్పుడూ
ఉంటుంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

ప్రశ్న 2.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి ?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించబడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది.

యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత. పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ ? చదువుకుంది. సంస్కారం ఉంది.

మరీ అంత అందంగా లేకపోయినా వికారం మాత్రం లేను. నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.

నా గురించి మీరు ఇల్లు అమ్ముకొని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిగతం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుఁడి వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను. నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది.

ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను. మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడేవాడు దొరికినప్పుడే ఫెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొనాలి. ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి. తనతోపాటు స్త్రీ జాతికంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

ప్రశ్న 3.
బిచ్చగాడు కుటుంబానికి ఎదురైన కష్టాలను వివరించండి
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీనే చే రచించబడింది. అంపశయ్య నవీన్ అసలు పేరు . దొంగరి మల్లయ్య ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది.

ప్రపంచంలో పలు రకాల దోపిడీలు మోసాలు జరుగుతుంటాయి. అందులో శ్రామికుల’ కార్మికుల జీవితాలలో జరిగే శ్రమదోపిడి అత్యంత భయంకరమైనది. రోజువారి కూలీ పనులు చేస్తూన్న వలస కార్మికులలో, సంచార జీవనం సాగించేవారిలో, రోజు అడుక్కుంటూ పొట్టపోసుకునే బతుకులలో ఈ శ్రమదోపిడి మానవతా విలువలకు తావులేకుండా చేస్తుంది.

వారి దోపిడీకి నగ్న సత్యంగా నిలచిన కథే ఈ ‘బిచ్చగాడి కథ. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీన మనస్తత్వానికి దోపిడీ స్వభావానికి ఇది ఒక ఉదాహరణం. ఈ కథ అమానవీయతను, నైతిక పతనాన్ని తెలియచేస్తుంది.

ఈ కథ ప్రయాణ సమయంలో విభిన్న మనస్తత్వాలు గల మానవ హృదయాలను ఆవిష్కరిస్తుంది. రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహ వేడుకలకు అటెండయి తిరిగి వరంగల్లుకు వెళ్తున్న సందర్భంలో జరిగింది. రైలు చాల రద్దీగా ఉంది. కూర్చోటానికి జాగా ఎక్కడా కన్పించలేదు. చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఓ సీటు మొత్తాన్ని ఒకామె బోల్డు లగేజీతో సీటు మొత్తాన్ని ఆక్రమించేసింది.

ఆమె ఓ బిచ్చగత్తె. ఆమె భర్త టికెట్ తీసుకురావటానికి వెళ్ళాడు. కౌంటర్ దగ్గర చాలా రద్దీగా ఉంది. బండి కదలటానికి సిద్ధమవటంతో అతడు పరిగెత్తుకొచ్చాడు. వాడికి టికెట్ అందనేలేదు. ఎవడికో డబ్బులిచ్చి వచ్చాడు. కొందరు టికెట్ లేకపోతే టి.సి వచ్చి నానాయాగీ చేస్తాడన్నాడు.

ట్రైన్ కదలింది. టికెట్ తెస్తానన్నవాడు ఆ డబ్బులతో అటే పోయాడు. టి.సి రానే వచ్చాడు. ఆ బిచ్చగాడి పేరు బ్రహ్మయ్య. ఒరేయ్ టికెట్ తీయరా! అన్నాడు టి.సి. “అయ్యా! టికెట్ కోసమే పోయినయ్యా! ఇయ్యాళ కొత్తగూడెం టేషన్లో అంతా మందే…… టికెట్ తీసుకోమని మా అన్న కొడుకుని పంపిన. ఆడు చెయ్యి బెడ్తుండగనే బండి కదిలింది. నేను వాణ్ణి వదిలేసి బండెక్కిన” “నోర్ముయిరా దొంగ వెధవ. ఎక్కడి వెళ్ళాలి” అన్నాడు. “నెక్కొండ” “బాంచెన్” అన్నాడువాడు. ఆ ఆడది నల్గురు పిల్లలు నీ వాళ్ళేనా” “అయ్యా మా వాళ్ళే’ అయితే 56 రూపాయలు తియ్” అతడు వెంటనే టి.సి రెండు కాళ్ళు పట్టుకున్నాడు.

“లే గాడిద కొడకా! నా కాళ్ళెందుకుకురా పట్టుకుంటావ్”. పైసలిస్తవా పోలీసోళ్ళకు . పట్టించనా అన్నాడు టి.సి “నన్ను కోసినా నా దగ్గర పైసల్లేవు బాంచనా” ఈ భాగోతం. అంతా బండిలో ఉన్న వారికి వినోదంగా మారింది” వరేయ్ బ్రహ్మయ్య! డబ్బు తియ్యరా” అన్నాడు టి.సి “అయ్యా! నన్ను కోసినా నా వద్ద పైసాలేదయ్యా! అంటూ బ్రహ్మయ్య

మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు. “నన్నుంటుకున్నావంటే చంపేస్తా… బద్మాష్ లుచ్ఛ నీ దగ్గర డబ్బులేదురా. ఆరుమాలు తీయ్” అన్నాడు టి.సి “ఈ రూమాల్నేముందు బాంచెన్….మీ అసుంటి ఓ దొర దగ్గర అడుక్కున్నా నన్ను నమ్మండ్రి బాంచెన్ అని మళ్ళీ కాళ్ళు పట్టుకోబాయాడు.

ఇద్దరి మధ్య పెనుగులాటలో రుమాలు చిరిగి పోయింది. దాన్లో నుండి 30 రూ॥ బయట పడ్డాయి. ఆ ముప్పై ఇదేనా అన్నాడు. టి.సి “ఛట్ దొంగ రాస్కెల్. ఇంకా మోసం చేద్దామని చూస్తావురా! తీయ్ మిగతా 26రూ॥ అన్నాడు. “మమ్ముల కొట్టుండి. సంపుండ్రి. ఈ బండ్ల నుంచి బయటకు ఇసిరి కొటుండ్రి మా వద్దిక పైసల్లేవ్ అంది బ్రహ్మయ్య. భార్య.

“నోర్మూయ్యలే దొంగముండ. పైసల్ లేవంటే ఫైనెవ్వడు కడ్డడు. నీ వడుంకున్న ఆ సంచితియ్ అన్నాడు టి.సి. దాంట్లో ముంది నిన్న మొన్న అడుక్కున్న డబ్బులు. నిండు చూలాలు. నలుగురు పిల్లలలో ఉన్న ఆమెను చూస్తే ఎవరికి జాలి కలుగలేదు “ఈ పూటకు నూక మందమన్నా ఉంచుండ్రయ్యా! నిన్న మొన్న ఏమిటి నేను ఏమిటినేను.

నా పోరగాండ్లను సూడుండ్రి ఆకలితో నకనక లాడిపోతండ్రు అని ఎంత కాళ్ళు పట్టుకున్నా ప్రతమ్నాయం లేకపోయింది. ఆ సంచిలోని డబ్బంతా క్రింద సి. 26 రూ॥ తీసుకుని ఒక రిసీట్ బుక్ తీసి ఏదో రాశాడు. నా దృష్టి ఆ కాగితం పై 22 రూ||లు డోర్నక్ టు నెక్కొండ” అని పడింది. ఇంతకూ ఎవరు పెద్ద బిచ్చగాడో మీరే చేసుకోండి. అని కవికథలు ముగించాడు.

ప్రశ్న 4.
గొల్ల రామవ్వ ఉద్యమకారుని ఏ విధంగా రక్షించింది ?
జవాబు:
‘గొల్లరామవ్వ’ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకట నరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభివాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన “గొల్లరామవ్వ – మరి కొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటకాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది.

నిజాం పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్ ‘వాలంటీరును, విప్లవ కారుడిని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతివృత్తం గొల్లరామవ్వకథ. తెలంగాణపోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్

తెలంగాణలో అదో పల్లె. ఆ పల్లెలోకి ఉద్యమకారులు ప్రవేశించి రజాకార్లను, పోలీసులకు, నవాబులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నారని నిజాం ప్రభుత్వవాదన. ఆ రోజు ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు సమాచారం. అర్ధరాత్రి ప్రశాంత వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తూ బాంబులమోత..

గొల్లరామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చొని ఉంది. ఆమె వడిలో భయంగా పదిహేనేండ్ల బాలిక తలదాచుకుని ఉంది.

“అవ్వా గిప్పుడిదేం చప్పుడే” అని ప్రశ్నించింది మనమరాలు. “నీకెందుకే మొద్దుముండ, గదేంది గిదేంది – ఎప్పటికి అడుగుడే” అని కసిరింది. ఇంతలో ఇంటికిటికీ చప్పుడు ఆ కిటికీ గుండా ఓ అగంతకుడి ప్రవేశం. అతడు అవ్వ దగ్గరకు వచ్చి “చప్పుడు చేయకు” నేను దొంగను కాను, రజాకార్నుకాను, పోలీసును కాను, మిమ్మల్ని ఏమీ అనను. లొల్లి చేయకండి” అన్నాడు.

నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీరును వారి నుండి మిమ్మల్ని రక్షించేవాడిని అన్నాడు. అతని శారీరక పరిస్థితిని తెలుసుకున్న అవ్వ మనఃస్థితిలో కాయకల్పమైంది. ‘భావ పరివర్తన కలిగింది. “ఇదేం గతిరానీకు? గిట్లెందుకైనవు కొడకా? అని ప్రశ్నించింది.

“రాజోలిగెఉన్నవు కొడకా! నీ కెందుకు కొచ్చెరా ఈ కట్టం. పండు పండు గొంగల్ల పండు, బీరిపోతవేందిరా! పండు” అని అతన్ని ఓదార్చి సపర్యలు చేసింది. “కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లలు పిసుక్కొచ్చిన గింత కడుపుల పడేసుకో” అంది. యువకుడు లేచాడు. అవ్వ ఇచ్చినది ప్రసాదంగా తీసుకున్నాడు.

పాలు పిండేవేళయింది. యువకుడు నిద్రపోతునే ఉన్నాడు. ఇంతలో “చస్తి సస్తి నీబాంచెన్… నాకెరుక లేదు, అయ్యో వావ్వో! వాయ్యో అన్న అరుపులు మిన్ను ముట్టే ఆక్రోశాలు” యువకుడు లేచాడు రివాల్వరు తోటాలతో నింపుకుని బయలుదేరాడు. వెనుక నుండి అతని భుజం మీద మరొక చేయబడ్డది”. యాడికి? అన్న ప్రశ్న.. ముసల్వ మరేం మాట్లాడలేను. అతన్ని చెయ్యపట్టి వెనక్కి లాంగింది.

యువకునికి మనవరాలి చేత దుప్పటి కండువాను ఇప్పించింది. అతడిచే “గొల్లేశమేయిచింది. ఎవడన్నా మాట్లాడితే గొల్లునోలె మాట్లాడాలె” అన్నది. ఈ లోపు పోలీసులు అవ్వ ఇంటికి రానేవస్తిరి. ఇంకేముంది గొల్ల వేసమంతా వ్యర్థమైనట్లే అనుకున్నాడు యువకుడు.

అవ్వ మనవరాలితో “మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడయ్యె! పిల్లగా ఆండ్ల పండుకో. ఊ పండుకో” అంది. “పొల్లా పోరని మంచానికి నాగడంచే అడ్డం పెట్టు” “మల్లీ మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊనడూ అంది”. “చెయ్యని పండుకో పోండా దానిమీద! చూసెటోని కనువాదం రావద్దు” అంది.

అంతలోనే ఇట్లకొచ్చిన పోలీసోళ్ళు ఆ యువకుని చూసి “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడా యేం” అని అవ్వను గద్దించాడు వాడెవ్వడా! ఎవ్వడు పడితేవాడు మా పక్కలల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నావా? నిన్నెవడన్నా గట్లనే అడుగుతే ఎట్లంటది అని బొంకింది. అవ్వ మంచంమీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరో వైపు మల్లి. అపూర్వ సమ్మేళనం. అవ్వా నీవు సామాన్యరాలువుకావు. సాక్షాత్తు భారతమాతవే” అన్నాడు.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
వట్టిచేతితో శత్రువుపై దుమికే శక్తి ఉంది
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “నాపేరు -ప్రజాకోటి” అని పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. “పునర్నవం” అన్న కవితాఖండికలోనిది.
సందర్భము :- కవి “అహింసా” శక్తిని గురించి వివరించే సందర్భములోనిది.
భావము : చిన్నపాటి అంకుశంతో గున్నఏనుగు బంధించే కొత్త శక్తిని కనుగొన్నాను. అలాగే వట్టి చేతులతో ‘అహింస’నే ఆయుధంగా చేసుకుని శత్రువుపై దూకే శక్తిని తెలుసుకున్నాని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

ప్రశ్న 2.
అంబరాన్ని చుంబించాలి మనం
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవితా సంపుటి గ్రంథం నుండి గ్రహిబచబడినది.
సందర్భము :- మానవుడు అభ్యుదయ భావనలతో భవిష్యుత్తుపై ఆశలతో బ్రతకాలని చెప్పిన సందర్భము లోనిది.
భావము :- మానవులంతా ఆశాపాశాలతో బ్రతకాలి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి అనంతమైన ఈ ప్రపంచాన్ని శాసించాలి. ప్రపంచ మానవులంతా సోదర భావంతో మెలగాలని ఇందలి భావం.

ప్రశ్న 3.
వెల్తికుండ తొఁదొలుకుచునుండు
జవాబు:
పరిచయం :- ఈ వాక్యం మారద వెంకయ్యచే రచింపబడిన భాస్కర శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము :- నీచుడికి, గుణవంతుడికి ఉన్న లక్షణాలను కవి తెలిపిన సందర్భం లోనిది.
భావము :- వెలితి కుండ తొణకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుఁడు న్యాయమునెంచక కఠినపు పలుకులను మాట్లాడును. సద్గుణములలో ప్రకాశించే గుణవంతుడు. అటువంటి కఠినపు మాటలను మాట్లాడడు.

ప్రశ్న 4.
సంభ్రమ విలోలుండై దిగెం దల్పమున్
జవాబు:
కవి పరిచయం : భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.
సందర్భము : తన భార్య కోరికపై కుచేలుడు శ్రీకృష్ణ సందర్శనార్థమై ద్వారకా నగరము చేరుకొని-అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోదములలో మునిగియున్న శ్రీకృష్ణుని గాంచెను. వచ్చిన తన బాల్యమిత్రుడైన కుచేలుని చూచి, శ్రీకృష్ణుడు హంసతూలికా తల్పము నుండి దిగి, ప్రేమతో ఎదురేగి స్వాగతము పల్కు సందర్భములోనిదీ పద్యపాదము.
వివరణ : ఎడతెగని దారిద్య్రముచేత పీడింపబడువాడును, చిక్కిపోయిన అవయవ ములు కలవాడును, చినిగిపోయిన వస్త్రములను ధరించినవాడును, హాస్యమునకు నిలయమైన వాడునగు ఆ పేద విప్రుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ తన పాన్పుపై నుంది క్రిందికి దిగెనని పోతన వర్ణించినాడు.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 1)

ప్రశ్న 1.
శ్రీకృష్ణుడిని దర్శించేందుకు కుచేలుడు భార్యకు చెప్పిన కారణమేమిటి ?
జవాబు:
శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుట మిక్కిలి శుభదాయకమే. కాని ఆయనకు తీసుకొని వెళ్లుటకై మన దగ్గర ఏదైన కానుక ఉన్నదా ?” అని కుచేలుడు భార్యనడిగెను.అప్పుడు కుచేలుని భార్య ‘సరే’ యని కొన్ని అటుకులను భర్త యొక్క చినిగిన వస్త్రము చివర ముడివేసి ప్రయాణమునకు సిద్ధము చేసినది – శ్రీకృష్ణ సందర్శనోత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరెను.

నేనెట్లు ద్వారకా నగరమును చేరగలను ? దివ్వ దీప్తితో ప్రకాశించు అంతఃపురము నేనెట్టు ప్రవేశింపగలను ? సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని ఎట్లు దర్శింపగలను ? నీవెవ్వడవు ? ఎక్కడినుండి, ఎందులకు వచ్చితివి ? అని ప్రశ్నించి ద్వారపాలకులు అడ్డు పెట్టినచో వారికేమైన బహుమానమిచ్చి వెళ్ళవచ్చునన్నచో, నేను డబ్బు లేనివాడును. అయినను ఆయన దయ”నా భాగ్యము.

ఆలోచింపగా మరేమి యున్నది ? ఐనను బాలమిత్రుడైన ఆ కృష్ణుడు నన్నేల అశ్రద్ధ చేయును ?” అని తలచుచు కుచేలుడు ద్వారకా నగరములో ప్రవేశించెను.

ప్రశ్న 2.
గురువు తత్వం వివరించండి ?.
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదనకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఈ లోకంలో గురువే బ్రహ్మం గురువే విష్ణువు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది.. మూలాధారం, స్వాధిష్టానం అనాహతం, మణిపూరకం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు, వీటిలో చివరిది సహస్రారం, అది విచ్చుకునే శక్తిని ప్రసాదించేవాడు గురువు. అపుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక ఆ రహస్యాన్ని తెలుసుకుని మంచి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మోక్షాన్ని పొందమని ఇద్దాసు వివరిస్తున్నాడు.

ప్రశ్న 3.
అధమ, మద్యమ, ఉత్తములను కొలిచేవారి స్థితి ఎలా ఉంటుందని కవి వర్ణించాడు?
జవాబు:
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే ‘తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

ప్రశ్న 4.
‘మహైక’ కావ్య విశిష్టతను వర్ణించండి ?
జవాబు:
‘మహైక’ కావ్యం ‘కవిరాజుమూర్తి’చే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవిత కావ్యం నుండి గ్రహించబడింది. వచన కవితా ప్రక్రియలో వచ్చిన దీర్ఘకావ్యం ‘మహైక’, ఇది సెప్టెంబరు 1953లో ప్రచురించబడింది. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతితల పాత్రల పరస్పర సంభాషణలతో సాగింది.

నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్నకష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పులతో నిర్వేదంగా నివేదించుట ఈ కావ్యంలోని ముఖ్య అంశం. భవిష్యత్తుపై ఆశలను ప్రేరేపిస్తూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారిని రక్షిస్తూ మానవ విలువలను తెలియచేస్తూ అసమానతలు లేని సోషలిజానికి ‘మహైక’ కావ్యం బాటలు వేసింది.

దీనికి ముందు మాటలు రాసిన బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణ మాటలలో “మహోజ్జ్వలమైన ఈ ‘మహైకా’ కావ్యం చదివినపుడు ఏదో నూతనలోకాన్ని చూసినట్టుంది” అన్న మాటలే ఈ కావ్యం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాయి. ఈ కావ్యాన్ని తెలంగాణ పోరాటయోధుడు ‘జమలాపురం కేశవరావుకు అంకితం ఇచ్చినపుడే కవి అభ్యుదయ, విప్లవాలు తెలుస్తున్నాయి. దీర్ఘ కవితలలో ‘మహైక’ అత్యంత విశిష్ట కావ్యంగా పేర్కొనవచ్చు.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ధనవంతులు తమ అధికార బలాన్ని దేనికి ఉపయోగించాలి ?
జవాబు:
రాజాబహద్దూర్ వెంటకరామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వేంకట రామారెడ్డి జీవిత చరిత్ర” నుండి గ్రహించబడింది.

భారతదేశంలోను, మన రాష్ట్రంలోను అధికారులు, గొప్ప గొప్ప ఉద్యోగులు ఎందరో ఉన్నారు. వారందరూ ధనమును బాగా సంపాదించినవారే ! గొప్ప గొప్ప బిరుదులను పొందినవారే ! కాని వారిని లోకం గుర్తించలేదు. దానికి కారణం వారిలో సామాజిక సంఘసేవా తత్పరత లేకపోవటమే! ఎంతటి గొప్పవారైనా ఎంతటి ధనికులైనా సంఘ సేవ చేయని ఎడల గుర్తింపు పొందరు. తాము సంపాదించిన ధనములో ఎంతోకొంత సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి.

దేశాభివృద్ధికి ప్రజలలో మంచిని ప్రబోధించటానికి తప్పక వినియోగించాలి. అలా చేయనిఎడల గుర్తింపును కోల్పోతారు. రామారెడ్డిగారు ఇతరుల వలే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా మంచిపలుకుబడిని ప్రజానురాగాన్ని పొందారు. దానికి కారణం ఆయన తన ధనాన్ని శక్తిని, పలుకుబడిని ప్రజాభ్యుదయానికి ఉపయోగించారు.

కాబట్టి ధనవంతులు అధికారులు తమ అధికారాన్ని ధనాన్ని ఇతరుల కోసం, సమాజాభివృద్ధికి ఉపయోగించాలి.

ప్రశ్న 2.
బతుకమ్మను పేర్చే విధానాన్ని వర్ణించండి.
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం’ రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.

తెలంగాణా జానపదస్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేది బతుకమ్మ పండుగ అదే పూలపండుగ. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి పూలమయంగా ఉంటుంది. బతుకమ్మను ఆ పూలతో అందంగా అలంకరిస్తారు. ముందుగా ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలనుపరుస్తారు. పొడవైన గునుగు పూలను చివర కత్తిరించి వాటికి పలురంగులు పూస్తారు.

ఆ తరువాత ముత్యాల పువ్వులను గుత్తులు గుత్తులుగా అమరుస్తారు. ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీర పూలను గూడా గుండ్రంగా శిఖరాలలో పేరుస్తారు. శిఖరంపై గుమ్మడి పూలను అలంకరిస్తారు.

పసుపుతో త్రికోణాకృతిలో బతుకమ్మను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమం పూర్తి అవుతుంది. బతుకమ్మ ప్రక్కనే పిల్ల బతుకమ్మలను ఉంచుతారు. బతుకమ్మలను కూరాటికుండ వద్దగాని, దేవుడి వద్దగాని పెట్టి నువ్వులు, సెనగపప్పు, పెసరపప్పు, పొడులతో చద్దుల పులిహోర దద్యోన్నంను నైవేద్యంగా అమర్చుతారు. పూలు ఎక్కువగా లభిస్తే మనిషంత ఎత్తు బతుకమ్మలను అమర్చుతారు. త్రికోణం స్త్రీకి సంకేతం. త్రికోణాకారంలో పసుపు ముద్దనుంచటం గౌరీదేవిని ప్రతిష్టించటంగా భావిస్తారు.

ప్రశ్న 3.
వరిగడ్డి మంట.
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

వరిగడ్డి ఎండినదైతే అగ్ని అంటించే తడవుగా మంటలంటుకొని కాలుతుంది. వాముగా ఉంటే మాత్రం కమ్ముకుని పొగలేచి కుమ్ముగా కాలుతుంది. వంట చెరకు అంటుకోవటానికి, పొయ్యి రాజుకోవటానికి, చలిమంటలకు బుగ్గున లేచి మంటల కోసం వరిగడ్డినే వాడతారు. ఏదైనా వరిగడ్డి బుగ్గున మండి బుగ్గయిపోతుంది. మంచివాళ్ళకు వచ్చే కోపం వరిగడ్డి మంటతో పోలుస్తారు. వారి కోపం వరిగడ్డి మంటలాంటిది. కొద్దిసేపటిలో మాయమైపోతుంది. అలాంటప్పుడు వరిగడ్డి మంటతో పోలుస్తారు.

ప్రశ్న 4.
తెలంగాణ తెలుగు మిగతా ప్రాంతాల తెలుగు కంటే భిన్నమైనది ఎందుకు ?
జవాబు:
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూమూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి, సంపాదకీయంలో వెలువడిన ‘వ్యాస గుళుచ్చం’, రెండవ భాగం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ప్రజలు మాట్లాడుకునే భాష తెలుగు, తెలుగు గ్రాంథిక రూపంలో ఈ నాలుగు ప్రాంతాలలో ఒకటిగానే ఉంటుంది. వ్యవహారికంలోకి వచ్చేటప్పటికి నాలుగు ప్రాంతాలలోనూ వేరు వేరుగా ఉంటుంది.

తెలంగాణా తెలుగు భాష మిగిలిన మూడు ప్రాంతాల భాష కంటే భిన్నంగా ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ ప్రాంతం తెలుగు భాషలో ఉర్దూ, హిందీ, మరాఠీ భాషా పదాలు అధికంగా ఉండటం వలన మిగిలిన ప్రాంతాల తెలుగు భాషకన్నా తెలంగాణ తెలుగు భిన్నంగా ఉంటుంది.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
దున్న ఇద్దాసు (పేరు ఈదయ్య) గురించి తెలపండి ?
జవాబు:
దున్న ఇద్దాసు గొప్ప తత్త్వకవి, ప్రముఖ వాగ్గేయకారుడు ఈయన నల్గొంజిల్లా చింతపల్లి గ్రామంలో క్రీశ 1811-1919 మధ్య కాలంలో జీవించారు. తల్లిదండ్రులు దున్న రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తత్వకారుడయ్యాక ఇద్దాసు అయ్యాడు. ప్రముఖ పరిశోధనకుడు డా. బిరుదు రాజు రామరాజు ఇద్దాసును “మాదిగ మహాయోగి” గా అభివర్ణించాడు.

ఇద్దాసు చింతపల్లి గ్రామంలో మోతుబరి ఇంటి పశువుల కాపరి. రోజూ బావి దగ్గర “మోటకొడుతూ” ఆనువుగా గీతాలను ఆలపించేవాడు. ఆ గీతాలను విన్న వరసిద్ధ జంగమదేవర “పూదోట బసవయ్య ఇద్దాసు పంచాక్షరీ మంత్రోపదేశం చేశారు. లింగధారణ చేయించి శైవునిగా మార్చాడు. అడవులలో సందరిస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంలో సాధన చేశాడు. దానితో ఆయన అష్టసిద్దులను పొందాడు. పూర్వతాత్విక కవులైన శివరామదీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరాంబల ప్రభావం ఇద్దాసుపై ఉంది. ఈయన ఈశ్వరాంబ సంప్రదాయాన్ని అనుసరించాడు. ఆమె సమాధి సందర్శనకు ఇద్దాసు కందిమల్లయ్యపల్లెను దర్శించాడు.

ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా వీరశైవ తత్త్వ జ్ఞానిగా కన్పిస్తాడు. పఠేల్, పట్వారీలు ఇద్దాసుకు శిష్యులయ్యారు. సంచార యోగిగా నల్గొండ నుండి మహబూబ్ నగర్ వరకు తిరుగుతూ అథ్యాత్మికతను ప్రచారంచేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లి, పోలేపల్లి, ఆవులోని బాయి మొదలగు చోట్ల ఈశ్వరమ్మ పీఠాలను స్థాపించాడు.

ఇద్దాసు 30కి పైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వచ్చిన “శ్రీ దున్న ఇద్దాసు తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ప్రశ్న 2.
కవిరాజుమూర్తి (సర్వదేవభట్ల నరసింహమూర్తి) గురించి తెలుపండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్యుల చేత “తిరుగుబాటు సాహిత్య ధ్రువతార” ప్రశంసలు అందుకున్న కవిరాజుమూర్తి అసలు పేరు ‘దేవభట్ల నరసింహమూర్తి’. వీరు అక్టోబరు 1926న ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం అంతా ఖమ్మంజిల్లా మామిళ్ళ గూడెంలో సాగింది.

ఉన్నత కుటుంబంలో పుట్టినా నాటి నియంతృత్వ భూస్వాముల అధికార పీడనకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర్య సమయంలోను పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఖమ్మం జిల్లాలో “ప్రజాసాహిత్య పరిషత్తును” స్థాపించారు.

తెలుగు వచన కవితారంగంలో దీర్ఘకవితలు రాసిన తొలి తరం కవులలో మూర్తి ముఖ్యుడు. వీరి ‘మహైకా’ మానవ సంగీతం, పణుతి దీర్ఘ కవితలు ప్రశంసలను అందుకున్నాయి. ‘మైగరీబ్ హు’ అన్న ఉర్దూ నవల మంచి గుర్తింపు పొందింది. దీనిని జవ హర్లాల్ నెహ్రూకు అంకితం చేశారు. దీనిని గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు.

ఉర్దూలో హీరాలాల్ మోరియా రాసిన కావ్యాన్ని ‘మహాపథం’ పేరుతో తెలుగులోకి మూర్తి అనువదించారు. గాంధీ దివ్య చరిత్రను ‘జముకుల’ కథా రూపంలో రచించాడు. ఉర్దూలో ‘లాహుకే, లఖీర్, అంగారే నవలలను తెలుగులో ‘చివరి రాత్రి’ ‘మొదటిరాత్రి’ జారుడుబండ నవలలను రాశాడు. తెలుగులో, నవయుగశ్రీ, పేరుతో గేయాలను, ఉర్దూ పారశీకవుల గజళ్ళను ముక్తకాలుగా రాశాడు.

ప్రశ్న 3.
రావి ప్రేమలత గురించి తెలుపండి.
జవాబు:
డా. రావి ప్రేమలత జూన్ 10, 1945 ఉమ్మడి నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లెలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మనోహరమ్మ. నాగిరెడ్డిలు, భువనగిరి కళాశాలలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, పి.హెచ్.డి. పూర్తి చేశారు. నాయని కృష్ణకుమారిగారి పర్యవేక్షణలో “తెలుగు జానపద సాహిత్యం – పురాణగాథలు” అన్న అంశంపై పరిశోధనచేసి పి.హెచ్.డి. సాధించారు.

రావి ప్రేమలత జానపద విజ్ఞానం సిద్ధాంతాల నేపథ్యంలో ‘జానపద విజ్ఞానంలో స్త్రీ’ అనే వ్యాస సంపుటిని ప్రచురించారు. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి “తెలుగు స్త్రీల చిత్రలిపి” అన్న వైవిధ్య గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం బిరుదురాజు రామరాజు జానపద విజ్ఞాన బహుమతి, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకుంది.

ఈమె ‘వ్యాసలతిక’ సంపుటి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకుంది. ఈమె ‘వ్యాసలతిక’ సంపుటి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శ గ్రంథంగా పురస్కారం అందుకుంది. డా॥ కురుగంటి లక్ష్మీతో కలిసి ‘జ్ఞానపద విజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాస సంపుటిని వెలువరించారు. Folk Tales of South India Andhra Pradesh అనే సంకలనానికి సంపాదకత్వం వహించారు. రావి ప్రేమలత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకురాలు, తంగిరాల సాహిత్య పీఠం ఉత్తమ పరిశోధకురాలిగా పురస్కారం అందుకున్నారు.

ప్రశ్న 4.
ఆచార్య రవ్వా శ్రీహరి గురించి తెలుపండి.
జవాబు:
మహా మహోపాధ్యాయ రవ్వా శ్రీహరి దక్షిణ భారతంలో విశిష్ట సంస్కృత పండితునిగా పేరు పొందారు. వీరు మే 5 1943న నల్గొండ జిల్లా వలిగొండ మండలం వెల్దుర్తి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట నరసమ్మ, నరసయ్యలు. ఎం.ఏ. తెలుగు ఎం.ఏ సంస్కృతంలో బంగారు పతకాన్ని పొందారు. “భాస్కర రామాయణం-విమర్శ నాత్మక పరిశీలన” అన్న అంశంపై పరిశోధన చేశారు. ఉస్మానియా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆచార్యునిగా పని చేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సేవలందించారు.

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
‘మహైక ‘ కావ్యాన్ని ఎవరు అంకితంగా స్వీకరించారు ?
జవాబు:
తెలంగాణ యోధుడు ‘సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితమిచ్చాడు.

ప్రశ్న 2.
అశ్వత్థామ ఎవరి కుమారుడు ?
జవాబు:
ద్రోణుడు

ప్రశ్న 3.
భాస్కర శతకకర్త ఎవరు ?
జవాబు:
మారద వెంకయ్య

ప్రశ్న 4.
నృసింహ శతక కర్త ఎవరు ?
జవాబు:
శేషప్ప కవి

ప్రశ్న 5.
నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు.
జవాబు:
నారాయణభట్టు

ప్రశ్న 6.
తెలంగాణలో గొప్ప ‘అచల’ గురువు
జవాబు:
దున్న ఇద్దాసు.

ప్రశ్న 7.
కుచేలుడు ఇంటికి వెళ్ళగానే భార్య ఎలా కనిపించింది ?
జవాబు:
మానవ రూపం దాల్చిన లక్ష్మీదేవివలె కనిపించింది

ప్రశ్న 8.
అజ్ఞానాన్ని కవి దేనితో పోల్చాడు ?
జవాబు:
అజ్ఞానాన్ని కవి “అడుసు”తో పోల్చాడు.

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
చరక సంహితలో చరకాచార్యుడు ఏమని శాసించాడు ?
జవాబు:
మానవుడు నిత్యమూ సమస్త ప్రాణుల కళ్యానాన్ని కోరుకోవాలని శాసించాడు.

ప్రశ్న 2.
తెలుగు స్త్రీల ముగ్గులపై రావి ప్రేమలత రాసిన గ్రంథం పేరేమిటి ?
జవాబు:
“తెలుగు స్త్రీల చిత్రలిపి” రావి ప్రేమలత స్త్రీల ముగ్గులపై వ్రాసిన గ్రంథం

ప్రశ్న 3.
సోమన జన్మస్థలం ఏది ?
జవాబు:
ఓరుగల్లుకు 12మైళ్ళ దూరంలోని జనగామా తాలూకా పాలకుర్తి గ్రామం.

ప్రశ్న 4.
‘ఉర్దూ’ భాషకు ‘ఉర్దూ’ అను పేరు ఏ శతాబ్దంలో వచ్చింది
జవాబు:
18వ శతాబ్దంలో

ప్రశ్న 5.
సోమన తల్లిదండ్రులెవరు ?
జవాబు:
తల్లి శ్రియాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు

ప్రశ్న 6.
బొంబాయిలో మహిళా విద్యాపీఠాన్ని ఎవరు స్థాపించారు ?
జవాబు:
బొంబాయిలో మహిళా విద్యాపీఠాన్ని స్థాపించినవారు ‘కార్వే’ మహాశయుడు.

ప్రశ్న 7.
“చుక్క తెగిపడ్డట్టు” అనే జాతీయంతో ఒక వాక్యం నిర్మించండి.
జవాబు:
చుక్కమ్మ చుక్క తెగిపడినట్లు చెప్పాపెట్టకుండా మా ఇంటికి వచ్చింది.

ప్రశ్న 8.
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యమేది ?
జవాబు:
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం వాల్మీకి రచించిన ‘రామాయణం’.

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయండి.
జవాబు:
ఉద్యోగానికి లేఖ

నల్లగొండ,
26.07.2023.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ.
నమస్కారములు.

విషయము : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు
నిర్దేశము : నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.07.2023.
ఆర్యా,
ఈ నెల తేది 20.07.2023 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.

ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ భవదీయుడు
XXXX

దరఖాస్తుతో జత చేసిన పత్రాలు :

  1. ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
  2. జనన ధ్రువీకరణ పత్రం
  3. స్థానిక ధ్రువీకరణ పత్రం
  4. ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం

ప్రశ్న 2.
బదిలీ పత్రము (టి.సి.) కొరకు కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ రాయండి.
జవాబు:
కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ

కరీంనగర్,
15-06-2023.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్. నమస్కారాలు.

విషయము : టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.

నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ‘దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం. పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది.
కావున, నాకు బదిలీ పత్రము ఇప్పించగలరని విజ్ఞప్తి.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విద్యార్థి
XXXX

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12).

1) భ్రమలన్నీ
జవాబు:
భ్రమలన్నీ = భ్రమలు + అన్ని = ఉకార సంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

2) గతమంత
జవాబు:
గతమంత = గతము + అంత = గతమంత – ఉత్వసంధి/ ఉకారసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

3) పోతుందయా
జవాబు:
పోతుందయా – పోతుంది + అయ – ఇత్వసంధి
సూత్రము :- ఏమ్యాదుల యిత్తునకు సంధివైకల్పికముగానను ఏమ్యాదులు అనగా ఏమి, మది,కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి ఏది ఏవి మొదలగునవి.

4) దివ్యాంబర
జవాబు:
దివ్యాంబర : దివ్య + అంబర = సవర్ణదీర్ఘ సంధి:
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

5) లేదెన్నటికి
జవాబు:
లేదెన్నటికి – లేదు+ఎన్నటికి – లేదెన్నటికి – ఉకారసంధి/ఉత్వసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

6) అణ్వస్త్రము
జవాబు:
అణ్వస్త్రము : అణు+అస్త్రము = అణ్వస్త్రము – యణాదేశ సంధి
సూత్రము :- ఇ.డి. ఋ అనువానికి అసవర్ణములైన అచ్చులు పరమైనచో క్రమముగా య,వ,ర,ల అనునవి ఆదేశముగా వచ్చును.

7) వాలుఁగన్నులు
జవాబు:
వాలుఁగన్నులు : వాలున్ + కన్నులు = సరళాదేశ సంధి = ఉకరా సంధి
సూత్రం : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.

8) సూకరంబునకేల
జవాబు:
సూకరంబునకేల = సూకరంబునకు + ఏల = ఉకరా సంధి
సూత్రము :- అత్తునకు సంధి బహుళమగును.

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8).

1) నరజాతి
జవాబు:
నరజాతి – నరుల యొక్క జాతి – షష్ఠీతత్పురుష సమాసం

2) ఆలు పిల్లలు
జవాబు:
ఆలు పిల్లలు – ఆలియును పిల్లలును – ద్వంద్వసమాసం

3) చూతఫలము
జవాబు:
చూతఫలము – చూతము (మామిడి) అనెడి ఫలము – రూపక సమాసము

4) విపులతేజుడు
జవాబు:
విపులతేజుడు – విపులమైన తేజం కలవాడు – బహువ్రీహి సమాసం

5. చక్రపాణి
జవాబు:
చక్రపాణి – చక్రము పాణియందుకలవాడు – బహువ్రీహి కర్మధారయ సమాసము

6) ఇలాగోళము
జవాబు:
ఇలాగోళము : భూమి యొక్క గోళము – షష్ఠీతత్పురుష సమాసం

7) దివ్యబాణం
జవాబు:
దివ్యబాణం – దివ్యమైన బాణం – విశేషణపూర్వపద కర్మధారయం

8) శబ్దధాటి
జవాబు:
శబ్దధాటి : శబ్దము యొక్క ధాటి – విశేషణ పూర్వపద కర్మధారయము

XIV. ఈ క్రింది అంశాలలో ఒక దానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
యువత – జీవన నైపుణ్యాలు

ఒకదేశ అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు.

ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం.

ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి.

పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness) : ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని,. ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy) : పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill) : మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం

ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.

4. భావోద్వేగాల నియంత్రణ (Management of emotions) : యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill) : సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు.

మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making) : సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking) : ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు.. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking) : యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

2. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం
జవాబు:
యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం

శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషుల పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది. ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి. పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు.

ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్ లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు.. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది. 1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు.

అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా -మారిపోయింది.

ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది. సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం. ఇక్కడే.అసలు సమస్య మొదలైంది. అవసరమైన అనవసరమైన సమాచారం. ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది.

ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి. మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు. తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం, కోల్పోయారు. ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు. ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం.

మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం. అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు. సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం -వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు. అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు. అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు.

కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు.

ఇప్పుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు. తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం. అవుతున్నాయి.

ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది.

బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

3. జాతీయ విపత్తులు
జవాబు:
జాతీయ విపత్తులు

అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి,.ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి..

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే. సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు.

విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ

విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్ 19 వ్యాధి.

దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి.

1. The best way to predict the future is to create it.
జవాబు:
భవిష్యత్తును అంచనావేయటానికి ఉత్తమ మార్గం, దానిని సృష్టించటమే.

2. A picture is a poem without words.
జవాబు:
పదాలు లేని పద్యమే చిత్రం

TS Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

3. Maturity comes with experience not age.
జవాబు:
పరిణతి, వయసుతో కాదు, అనుభవంతో వస్తుంది.

4. A journey of thousand miles begins with a single step.
జవాబు:
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.

5. There is no substitute for hard work.
జవాబు:
కృషికి ప్రత్యామ్నాయం లేదు.

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

వచనకవిత్వ వికాసంలో భాగంగా వచనకవిత విభిన్న లఘురూపాలుగా వైవిధ్యాన్ని సంతరించుకుంది. ఈ క్రమంలో కవిత్వచరిత్రలో ప్రాచుర్యం పొందిన మినీకవిత, . హైకూ, నానీల. ప్రక్రియలను స్థూలంగా తెలుసుకుందాం. 1970వ దశకం నుండి మినీకవిత వెలుగులోకి వచ్చింది. పదిపంక్తులు మించకుండా సంక్షిప్తంగా సూటిగా కొసమెరుపుతో చెప్పగలగడం మినీకవిత ప్రధాన లక్షణం.

మినీకవితలో ధ్వని, వ్యంగ్యం ప్రాధాన్యం వహిస్తాయి. మినీకవితలపై 1977లో నండూరి రామమోహనరావు మొదలుపెట్టిన చర్చ మినీకవిత్వోద్యమంగా మారింది. అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీ లైఫ్’ శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన మినీకవితలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘మినీకవిత ఆయుష్షు మెరుపంత, కాని అది ప్రసరిస్తుంది కాలమంత’ అని డా|| సి. నారాయణ రెడ్డి మినీకవితా ప్రక్రియను నిర్వచనాత్మకంగా ప్రశంసించాడు.

జపాన్ కవి బషో సృష్టించిన కవితా ప్రక్రియ ‘హైకూ’. హైకూలో మూడుపాదాలు ఉంటాయి. మొదటిపాదంలో ఐదు, రెండోపాదంలో ఏడు, మూడోపాదంలో ఐదు అక్షరాల నియమంతో మొత్తం పదిహేడు అక్షరాలతో హైకూ కవిత రూపొందింది. హైకూ జైన, బౌద్ధ తాత్త్వికతను, ప్రకృతి సౌందర్యాన్ని, మార్మిక అంశాలను ధ్యాన ఛాయలతో ఆవిష్కరిస్తుంది.

తెలుగులో హైకూ ప్రక్రియను గాలి నాసరరెడ్డి రేఖామాత్రంగా పరిచయం చేసాడు. ఇస్మాయిల్ హైకూ ప్రక్రియను విస్తృత పరిచాడు. తెలుగులో పదిహేడు అక్షరాల నియమం పాటించకుండా మూడు పొడుగు పాదాలతో హైకూలు. రాసినవారే ఎక్కువ.

నానీల ప్రక్రియ రూపకర్త డా॥ ఎన్. గోపి. 1997లో వార్త దినపత్రిక ఎడిట్ పేజీలో నానీలు తొలిసారిగా సీరియల్గా వెలువడినాయి. నానీలు అంటే ‘చిన్నపిల్లలు’, ‘చిట్టి పద్యాలు అని అర్ధం. నావీ, నీవీ వెరసి మన భావాల సమాహారమే నానీలు, నాలుగు పాదాల్లో ఇరవై అక్షరాలకు తగ్గకుండా, ఇరవై ఐదు అక్షరాలకు మించకుండా . నానీ నడుస్తుంది. ఈ నాలుగు పాదాల నానీలో మొదటి, రెండు పాదాల్లో ఒక భావాంశం, చివరి రెండుపాదాల్లో మరొక భావాంశం ఉంటాయి. మొదటి దానికి రెండోది సమర్థకంగా ఉంటుంది.

కొన్ని వ్యాఖ్యానా త్మకం గాను, వ్యంగ్యాత్మకంగాను ఉంటాయి.. ఇప్పటివరకు నానీలను ప్రముఖ, వర్ధమాన కవులు రాయడం విశేషం. ఈ ఇరవైమూడు. సంవత్సరాల్లో నానీలు మూడువందల యాభై సంపుటాలు రాగా, వందలాది కవులు నానీలు రాయడం నానీ ప్రక్రియకున్న శక్తికి, ఆదరణకు నిదర్శనం. భారతీయ సాహిత్య చరిత్రలో లఘు ప్రక్రియను అనుసరిస్తూ ఇన్ని గ్రంథాలు వెలువడడం అద్భుతమైన విషయం.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
‘సిటీ లైఫ్’ పేరుతో మినీకవితల్ని రాసిన కవి. ఎవరు?
జవాబు:
అలిశెట్టి ప్రభాకర్

ప్రశ్న 2.
మినీ కవితను నిర్వచనాత్మకంగా ప్రశంసించిన కవి ఎవరు?
జవాబు:
డా॥ సి. నారాయణరెడ్డి

ప్రశ్న 3.
హైకూలోని పాదాలు, అక్షరాల నియమాలను తెలుపండి.
జవాబు:
హైకులో మూడు పాదాలుంటాయి. మొదటి పాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడవ పాదంలో ఐదు అక్షరాల నియమంతో మొత్తం 17 అక్షరాలతో హైకు కవిత రూపొందుతుంది.

ప్రశ్న 4.
నానీల్లోని పాదాలు, అక్షరాల నియమాలను వివరించండి.
జవాబు:
నానీలో నాలుగు పాదాలు ఉంటాయి. నాలుగు పాదాలలో ఇరవై అక్షరాలకు తగ్గకుండా; ఇరవై ఐదు అక్షరాలకు మించకుండా నానీ నడుస్తుంది.

ప్రశ్న 5.
నానీలు తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ ప్రచురితమైనాయి ?
జవాబు:
1997లో వార్తా దినపత్రిక ఎడిట్ పేజీలో సీరియస్ గా ప్రచురితమైనాయి.

TS Inter 1st Year Telugu Question Paper March 2023

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers and TS Inter 1st Year Telugu Question Paper March 2023 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Question Paper March 2023

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒక దానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1) వేడుటెంతయు కష్టము ………. ద్రావుచునుండగన్

2) నీరముతప్తలోహమున ……….. గొల్చువారికిన్

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) శ్రీకృష్ణుడు కుచేలుడిని ఎలా గౌరవించాడో వివరించండి.

2) ‘అచలం’ పాఠ్య సారాంశాన్ని వివరించండి.

TS Inter 1st Year Telugu Question Paper March 2023

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) సోమన రచనలు తెలిపి, వాటిని సంక్షిప్తంగా వివరించండి.

2) ‘తెలంగాణా జాతీయాలు’ పాఠ్యాంశంలోని ఏవేని ఐదు జాతీయాలను సోదాహరణంగా వివరించండి.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండు ప్రశ్నలకు 20 పంక్తులలో సమాధానాలు రాయండి. (2 × 4 = 8)

1) ‘గొల్ల రామవ్వ’ కథ ఇతివృత్తాన్ని పరిచయం చేయండి.

2) బిచ్చగాడు కుటుంబానికి ఎదురైన కష్టాలను వివరించండి.

3) స్నేహలతాదేవి ఎదుర్కొన్న సమస్యల్ని చర్చించండి.

4) ‘ఇన్సానియత్’ కథలోని సందేశాన్ని చర్చించండి.

V. ఈ క్రింది వానిలో రెండింటికీ సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1) ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు

2) కీలువదిలిన బొమ్మవలెను నేలబడిపోతున్నది

3) రంగులు. వేరైనా నరజాతి సరంగు మానవత్వమే

4) అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) ‘మనుషులు’ ఎందుకు భ్రమల్లో మునుగుతున్నారు ?

2) కవిరాజమూర్తి దృక్పథాన్ని తెలుపండి.

3) ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు ?

4) శ్రీకృష్ణుడు కుచేలుడిని ఏవిధంగా ఆదరించాడు ?

TS Inter 1st Year Telugu Question Paper March 2023

VII. .ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) “బట్ట కాల్చి మీద వేయుట” అంటే ఏమిటి ?

2) బొడ్డెమ్మ ఆట గురించి రాయండి.

3) రాజాబహద్దుర్ హరిజనులపట్ల దృష్టిని తెలుపండి.

4) ‘ఉర్దూవానా’ పదాన్ని వివరించండి.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)
(పాఠ్యాంశ కవులు/రచయితలు)

1) ఏనుగు లక్ష్మణకవిని గురించి తెలుపండి.

2) దాశరథి కవితాసంపుటాలను తెలియజేయండి ?

3) గడియారం రామకృష్ణశర్మ సాహిత్య సేవను తెలుపండి.

4) రావి ప్రేమలత రచనలను తెలుపండి.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (2 × 3 = 6)

1) ‘మిత్రధర్మం’ ఏ గ్రంథం నుండి తీసుకోబడింది ?

2) నన్నయ ఎవరి ఆస్థానకవి ?

3) దివ్యమైన ధనం ఏది ?

4) కనురెప్పపాటులో పోయేది ఏమిటి ?

5) పువ్వులు పరిమళాల్ని ఎప్పుడు వ్యాపింపజేస్తాయి ?

6) కాలాన్ని కవి దేనితో పోల్చాడు ?

7) భాస్కర శతకకర్త ఎవరు ?

8) కవి కంటికి రుచించేదేమిటి?

X. ఈ క్రింది ప్రశ్నలలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (గద్య భాగం నుండి) (5 × 1 = 5)

1) ‘పాల్కురికి సోమనాథుడు’ పాఠ్యభాగ రచయిత ఎవరు ?

2) ‘స్త్రీల క్లబ్’ భవన నిర్మాణానికి ఎవరు ఆర్థికసహాయం చేసారు ?

3) సురవరం ప్రతాపరెడ్డి రాసిన గ్రంథం కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కారం పొందింది ?

4) బతుకమ్మ పండుగలో ఏ పూలకు అగ్రస్థానం ఇస్తారు ?

5) బొంబాయిలో మహిళా విద్యాపీఠం ఎవరు స్థాపించారు ?

6) ‘కులాసా’ తెలుగుపదానికి ఉర్దూరూపం ?

7) సంస్కృత సాహిత్యంలో ఆది కావ్యమేది ?

8) సామల సదాశివ రాసిన శతకం ?

XI. ఈ క్రింది వానిలో ఒక దానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

1) బదిలీ పత్రము ఇప్పించుట గురించి కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ వ్రాయండి.

2) మీ కళాశాల నుండి వెళ్ళిన విహారయాత్ర గురించి తల్లిదండ్రులకు లేఖ వ్రాయండి.

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధిపేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1) కురియకుండునే

2) జీవితాశ

3) పదాబ్జాతంబు

4) ముద్దుసేయగ

5) నిష్ఠురో

6) అత్యుత్తమ

7) మహైక

8) మూలమెరిగిన

XIII. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1) ద్వారకానగరంబు

2) రాజీవనేత్రుడు

3) అజ్ఞానం

4) సప్తరంగులు

5) పుత్రలాభం

6) గురువచనం

7) శబ్దధాటి

8) ఎర్రజెండ

XIV. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి.

1) జాతీయ విపత్తులు

2) యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం

3) యువత – జీవన నైపుణ్యాలు

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి.

1) Maturity comes with experience not age.

2) There is plenty of water in that region.

3) Imagination rules the world.

4) Ours is a joint family.

5) What time is our meeting on Wednesday ?

TS Inter 1st Year Telugu Question Paper March 2023

XVI. .ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ఆధునిక వచన సాహిత్యంలో కథానిక ప్రక్రియ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ప్రాచీన సాహిత్యంలో వినిపించే కథలు నేటి కథానిక సాహిత్య పరిధిలోకి రావు. కథానిక ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక లక్షణాలతో విభిన్న ప్రయోగధోరణులతో వర్తమాన పరిణామానికి అనుగుణంగా నడుస్తుంది. ఆంగ్లంలో ‘short story’ అనే పదానికి సమానార్థకంగా తెలుగులో కథ, కథానిక అనే పర్యాయపదాలను వాడుతున్నాం.

ఈ కథానిక పదం ‘కథ్’ ధాతువునుంచి పుట్టింది. దీనికి మాట్లాడుట, చెప్పుట, సంభాషించుట అనే భేదాలున్నాయి. కథానిక ప్రస్తావన ‘అగ్నిపురాణం’లో కనిపిస్తుంది. కథానిక సుదీర్ఘంగాగాక క్లుప్తతతో బిగువైన కథనంతో ఉదాత్త అంశాలతో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కరుణ, అద్భుత రసపోషణతో ఆనందాన్ని అందించడం కథానిక లక్షణంగా చెప్పబడింది.

ఆధునిక కాలానికి చెందిన కథారచన యూరోపియన్ సామాజిక, రాజకీయ పరాణామాల ప్రభావంతో ఆవిర్భవించింది. తొలి కథా రచయితగా భావించబడుతున్న ‘ఎడ్గార్ ఎలాన్పో “ఒక సంఘటనను అది యథార్థమైనా, కల్పనాత్మకమైనా తక్కువ సమయంలో చదువగలిగే సాహిత్య ప్రక్రియ” కథానిక అని నిర్వచించాడు.

తెలుగు కథానికపై తొలి సిద్ధాంతగ్రంథం రచించిన డా॥ పోరంకి దక్షిణామూర్తి కథానికను నిర్వచిస్తూ “ఏకాంశవ్యగ్రమై, స్వయం సమగ్రమైన కథాత్మక వచన రచనా ప్రక్రియ” అని తన ‘తెలుగు కథానిక స్వరూప స్వభావం’లో వివరించాడు. కథానిక నిర్వచనాల న్నింటిని క్రోడీకరిస్తే సంక్షిప్త, ఏకాంశవస్తువు, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, ప్రతిపాదన ప్రవీణత, సంవాద చాతుర్యం, నిర్మాణ సౌష్ఠవాలు కథానికకు ప్రధాన లక్షణాలుగా స్థిరపడ్డాయి. సామాజిక వాస్తవికతను అందిస్తూ మనోవికాసాన్ని కలిగించడంలో కథానిక ప్రక్రియ శక్తివంతమైనదిగా విమర్శకులు పరిగణించారు.

ప్రశ్నలు :

1. ‘కథానిక’ పదం ఎలా పుట్టింది ?

2. ‘కథానిక’ ప్రస్తావన ఏ పురాణంలో ఉంది ?

3. తొలి కథారచయితగా ఎవరిని భావిస్తున్నాం ?

4. కథానిక ప్రక్రియ ఏ కాలానికి సంబంధించినది ?

5. తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించినదెవరు ?

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 9 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1. క్షమ కవచంబు, ………… లేటికిన్.
జవాబు:
చ. క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుందు,
మిత్రము దగుమందు, దుర్జనులు దారుణపన్నగముల్, సువిద్య
విత్త, ముచితలజ్జ భూషణముదాత్తకవిత్వము రాజ్యమీ క్షమా
ప్రముఖ పదార్థముల్ గలుగుపట్టునఁదత్కవచాదు లేటికిన్.

భావము : క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.

2. ఎన్న ……… నరుగుటయును.
జవాబు:
ఆ. ఎన్నఁ క్రొత్తులైన యిట్టి సంపదలు నా
కబ్బుటెల్ల హరిదయావలోక
నమునఁ జేసి కాదె ! నళినాక్షుసన్నిధి
కర్థి నగుచు నేను నరుగుటయును.

భావము : ఆలోచించి చూస్తే ఈ నూతన సమస్త సంపదలూ, శ్రీహరి కృపాకటాక్షం వలనే నాకు ప్రాప్తించాయి. సంపద కోరుతూ కృష్ణుని వద్దకు నేనే వెళ్ళుట.

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
ఏనుగు లక్ష్మణకవి తన పద్యాల ద్వారా అందించిన నీతిని వివరించండి ?
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. లక్ష్మణకవి సంస్కృతంలో భర్తృహరి రచించిన, సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నావళిగా అనువదించారు. సుభాషిత రత్నావళి నీతి, శృంగార, వైరాగ్య, శతకాలని మూడు భాగములు. రత్నావళిల పద్యాలు అవి మనోహరంగా, యథామూలంగా, సందర్భోచితంగా ఉంటాయని విమర్శకుల భావన.

లక్ష్మణకవి నీతి శతకంలో అనేక విషయాలు తెలియచేసాడు. కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముత్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.

విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగజేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయకాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదాల విందాలను శిరస్సున దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం- ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

ఇలా ఏనుగు లక్ష్మణకవి తెలుగులో అనువదించిన నీతి శతకాలలోని నీతి అన్ని కాలాలకూ వర్తిస్తుంది. విద్యార్థులకు పెద్దలకు అందరికీ వారి నిజ జీవితంలో ఉపయోగపడేలా, ఎలా మసలుకోవాలో అనేక ఉపమానాలు సుమధురంగా నీతిని ప్రబోధించారు.

ప్రశ్న 2.
అహింస ఆవస్యకతను పాఠ్యాంశం ఆధారంగా వివరించండి ?
జవాబు:
‘నాపేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ‘పునర్నవం’ అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. భారతదేశం అనాది నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వశ్రేయస్సును కోరుకుంది. తనలో అందరిని కలుపుకోవటం, అందరిలో తానై పర్యవసించటమే భారతీయత. హింసను ఆధారంగా చేసుకుని ప్రపంచంలో ఎవరూ విజయాన్ని సాధించ లేదు. అహింస జీవన పరమావధి కావాలని దాశరథి కోరుకున్నాడు.

“నిజం ఏమిటోగాని వట్టి చేతితో శత్రువు పైకి దుమికే శక్తి ఉంది”.

వట్టి చేతితో శత్రువుపైకి దూకేశక్తి అహింస సొంతం. మాటలనే ఈటెలుగా చేసుకుని ఎదిరించే బలం అహింసకున్నది. వీరశైనికుని కూడా చూసి భయపడని ఈ లోకం నన్ను చూసి భయపడుతుంది. నేను కోతల రాయుణ్ణిని భావించవద్దు. ఎర్రజెండా పట్టుకున్న వారిని పచ్చజెండా పట్టుకున్న వారిని కలిపే శక్తిఅహింసకున్నది. రాక్షసులతో కూడ స్నేహం చేయగల సత్తా అహింసా మార్గనికున్నది.

“హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభింపదు
ఉదయం వినా నాకంటికి ఏ వస్తువూ రుచించదు”.

హృదయం నా ఆయుధం. ఉషోదయం తప్ప నాకు ఏదీ నచ్చదు. అణ్వస్త్రా లను అఘాతంలో పడవేసిన శక్తినాది. ప్రజల సుఖశాంతులే నాకు పరమావధి. ఘర్షణలో ఏనాటికీ ఆనందం లభించదు. కనుక లోకాలకు అహింస పరమావధికావాలి. అదే ప్రపంచానికి అవస్యం కావలసిన నీతి.

III ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
బతుకమ్మ పండుగలోని సంగీత, సాహిత్య కళాంశాలను పేర్కొనండి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావిప్రేమలతచే రచించబడిన ‘జ్ఞానపద విజ్ఞానం పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలు వారి సాహిత్య సంగీత, నృత్య కళారూపాల త్రివేణి సంగమం. సౌభాగ్యదాయిని అయిన గౌరీదేవిని అందమైన పూలతో అలంకరించి పాటలు పాడుతూ ఆడుతూ పూజించటం వారి కళాభిలాషకు ఉదామరణం.

సుఖదాః ఖాలతో ఉత్సాహ ఉల్లాసాలతో మనసు ఉద్వేగం చెందినపుడే కళారూపాలు ఆవిర్భవిస్తాయి. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూలమయంగా ఉంటుంది. పంటచేలు నిండు గర్భిణులుగా దర్శనమిస్తాయి. పప్పుధాన్యాలు ఇళ్ళకు చేరతాయి. అలాంటి సంతోష సమయంలో పల్లెపడుచులు తమ మనోభావాలను పాటల ద్వారా నాట్యం చేస్తూ తమ ఆనందపాఠవశ్యాలను సంగీత రూపంలో ప్రకటించుకుంటారు.

అలంకరణ : బతుకమ్మను అలంకరించటమే ఒక కల. ఉదయాన్నే ఇంటిముందు అలికి రంగు రంగుల ముగ్గులేయటం మరొక కళ. ఒక ఇత్తడి పళ్ళెంలో గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పేర్చటం, పొడవైన గునుగుపూలు చివరలను కత్తిరించి వాటికి రంగులను పూసి ముత్యాలపూలను గుత్తులు గుత్తులుగా అమర్చటం, స్త్రీల కళాభిరుచికి ఒక ఉదాహరణం.

పూవులు ఎక్కువగా దొరికితే మనిషంత ఎత్తుగా బతుకమ్మను అలంకరిస్తారు. పెద్ద బతుకమ్మ లేదా లేదా తల్లి బతుక్మ ప్రక్కల పిల్ల బతుకమ్మను అమర్చుతారు. ఉదయం బతుకమ్మను పేర్చిన ముత్తయిదువలు సాయంత్రం తమని తాము అలంకరించుకొని ఇంటిముందు ఆటపాటలతో కొంతసేపు కాలక్షేపం చేసి ఆ తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా బతుక్మను సాగనంపుతారు.

పాట – నాట్యం : జానపద స్త్రీలు వలయాకారంలో తిరుగుతూ నాట్యం చేస్తూ పాటలు పాడుకుంటారు.

నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు

అని రాగయుక్తంగా పాడటం వారి కళాసక్తికి నిదర్శనం. జానపదస్త్రీల బొడ్డెమ్మ బతుకమ్మ `ఆటలకు మూలం. ఆటవికులు పండుగ సమయాలలో చేసే బృంద నృత్యాలే ! పార్వతీపరమేశ్వరులు సాయంత్రం వేళల్లోనే నృత్య పోటీని పెట్టుకునేవారని అదులో ఈశ్వరుడే విజయం సాధించేవాడని ఒక కథనం. తెలంగాణ ప్రాంతంలో ఉంది. అందుకే బతుకమ్మను సాయంత్ర సమయంలో ఆడతారు.

బతుకమ్మ పండుగ ఆటపాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడుదుడుకులు లేకుండా ఒకే స్వరంలో సాగిపోతాయి. వీరు పాడే పాటలకు సంగీత శాస్త్ర నియమాలుండవు. అవి చతరస్రగతిలో ‘కిటతక, కిటతకిట అను మాత్రలతో ఉంటాయి.

స్త్రీలు పౌరాణిక గీతాలు, నీతిబోధాత్మకగీతాలు కథాగేయాలను పడుతుంటారు. పాటలోని ప్రతి చరణాంతంలో ఉయ్యాలో, వలలో, చందమామ అని పునరావృతమౌతుంటుంది. ఆ పాటల్లో ప్రతి వనిత యొక్క మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో – గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో – వచ్చేరి సతిగూడి ఉయ్యాలో”

వారు పనిచేసే పనిలోని శ్రమను మరచిపోవటం ఈ పాటలలోని అసలు రహస్యం. ఫనిపాటలు పరమాత్మ స్వరూపాలుగా భావించటం ప్రజల సంప్రదాయం. ఇలా బతుకమ్మ పండుగలో సంగీత సాహిత్యనాట్యాలు కళాంశాలుగా రూపుదిద్దుకుంటాయి.

ప్రశ్న 2.
పాఠ్యాంశంలో ఏవేని ఐదు జాతీయాలను సోదాహరణంగా వివరించండి ?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళు రచించిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యభాగంలో తెలంగాణ జాతీయాలు వివరించబడ్డాయి.

1. వరిగడ్డి పంట : ఎండుగడ్డి అంటిందే తడవుగా కాలుతుంది. వాముగా ఉన్నప్పుడు కుమ్ముగా కాలుతుంది. “మంచివాళ్ళకు వచ్చే కోపాన్ని వరిగడ్డి మంటతో పోలుస్తారు. వారి కోపం వరిగడ్డి మంటలాంటిదంటారు. వరిగడ్డిమంటలాంటి కోపం ఆకాసేపు భరించలేనిదిగా ఉన్నా దానికి ప్రమాదం లేదు. అదే అర్థంలో “వరిగడ్డిమంట” అను జాతీయాన్ని వాడతారు.

2. కుక్కిన పేను : రాకాసిబల్లులు లాంటి మహామహా జంతుజాలం నాశనం అయింది. కాని పేను జాతి మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతూనే ఉంది. పేనును కుక్కితే చిటుక్కుమన్న శబ్ధం వస్తుంది. కొన్ని ఈడ్డులాంటి పేలు చిటుక్కుమనవు గోరువత్తిడికి తలకు అంటుకుపోతాయి. చచ్చినట్లుపడి ఉంటాయి. అలా కుక్కితే చచ్చిపోకుండా చచ్చినట్లు పడిఉండే పేలు కుక్కిన పేలు. “ఒక్క మాట అనకుండా వాడు పొద్దంతా అక్కడే కుక్కిన పేనువలె పడున్నాడు” అనటానికి ఈ జాతీయాన్ని
వాడతారు.

3. గద్ద తన్నుక పోయినట్లు : ఏ కాస్త సందు దొరికినా, తల్లి నుండి కొద్ది ఎడబాసినట్లున్నా, ఏ చింతచెట్టు చిటారు కొమ్మనుండి కనిపెడుతుందో గాని గద్ద కోడిపిల్లను ఎత్తుకుపోతుంది. అలాగే ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతాడు. ఇలా హఠాన్మరణం సంభవించినప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి గద్ద తన్నుకుపోవటంతో పోలుస్తారు. “గంట క్రితం బజార్లకు ఆడుకొనపోయిన పిల్లాడ్ని గద్ద తన్నుక పోయినట్లు బస్సుకిందపడి చచ్చిపోయే” అని జాతీయ ప్రయోగం.

4. చుక్కతెగి పడ్డట్లు : ఆకాశం నుండి అప్పుడప్పుడు అకస్తాత్తుగా ఉల్కలు ఆకాశం నుండి వాతావరణంలోకి రాలపడుతుంటాయి. ఇది దూరం నుండి చూసిన వారికి ఆకాశం నుండి చుక్కలు రాలిపడినట్లు భ్రాంతి కలుగుతుంది. దీనినే పల్లె భాషలో చుక్క తెగిపడినట్లు అని అంటుంటారు.

మనం ఊహించని అతిథిగాని, వ్యక్తిగాని అనుకోని సందర్భంలో అకస్మాత్తుగా వస్తే “చుక్కతెగిపడినట్లు వచ్చావేమిటిరా అని ప్రశ్నిస్తాం. చుక్క తెగిపడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. అర్థరాత్రి అదరాబాదరా వచ్చిన పాలేరుతో “ఈ సమయంలో వచ్చావు చుక్క తెగిపడినట్లు” అని ఇల్లాలు ప్రశ్నిస్తుంది.

5. రామచక్కని చక్కదనం అంటే అందం. రాముని చక్కగా అందగాడిగా తెలుగువారు భావిస్తారు. మంచి గుణానికి అందానికి నాణ్యతకు చాలా సందర్భాలలో రామచక్కని బంధం ఉపయోగపడుతుంది. “రామ చక్కని అద్దం పగుల గొడితివి గదరా” రంగయ్య రామచక్కని మనిషి”, “రామ చక్కని పిల్ల అది” అని ప్రయోగం మన సమాజంలో ఉన్నదే కదా !

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
ఫాతిమా గొప్ప మనసును వివరించండి ?
జవాబు:
ఇన్సానియత్ కథ ‘డా. దిలావర్’ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్ని ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రించింది. వాటికి ‘ఫాతిమా’ గొప్ప మనసు ఒక నిదర్శంగా నిలుస్తుంది.

ఫాతిమా సుబానీ తల్లి, సుబాని, రాంరెడ్డి, కాపోల్ల ఎంకన్నలు పేకాడుకుంటారు. సుబాని చేతిలో వారు ప్రతి ఆట ఓడిపోయారు. రాంరెడ్డి ఇజ్ఞత దెబ్బతింది. సుబానీని నానా మాటలూ అన్నాడు. ఆ దిగులుతో ఇంఇకి వచ్చిన సుబానీని తల్లి ఫాతిమా ఏం జరిగిందని అడిగింది.

రాంరెండ్డి అన్నమాటలన్నీ సుబాని తల్లికి చెప్పాడు. రోజులు మారిపోయాయి అనుకుంది ఫాతిమా! పల్లెకు రజాకార్లోత్తే ఊరోల్ల పానానికి తన పానం అడ్డమేసుండు మీ బాపు. ఊరోల్ల మీ బాబును పానానికి పానంగా చూసుకునేటోల్లు. ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య ఎడం పెరుగుతుంది.

మనమే మనకు పరాయిల్లెక్క కండ్ల బడన్నమ్” గీ దుష్మనీ, కచ్చలు, నరుక్కోటం సంపుకోటం, మత పిచ్చిగాల్లు రామ్ – రహీమ్ల నడ్మ చిచ్చుపెట్టడం గియన్ని ఎన్నటి జమానలమేం ఎరగంబిడ్డా ! ఒకలకు ఆపతొత్తే ఒకల్లు ఆదుకునే టోల్లు.

సుబానీకు యాక్సిడెంటైనా సమయాన తన కొడుకు ఎలానూ బ్రతకడు. రాంరెడ్డి కొడుకన్నా బతికితే అంతేచాలు అని అన్నది ఫాతిమా !
“మర్దీ సీమకు సుత అపకారం చెయ్యాలి. నా కొడుకుని చూసి ఓర్వలేక ఆ అల్లా తీస్కపోతన్నడు” అని తన బాధను రాంరెడ్డి వద్ద వెళ్ళపోసుకుంది.

అప్పుడు రాంరెడ్డి ఫాతిమా !” గిసుంటి ఆపతిల తల్లి మనసు ఎంత తండ్లాడ్తదో నాకెర్క లేదు కాదు. జర అటు ఇటు నేను సుత నీవోనె ఉన్న. ఎంకెట్రెడ్డి సావు బతుకుల్ల ఉన్నాడు. గాని పానాలు గిప్పుడు మీ చేతుల్లవున్నయ్” నా కొడుకు కిడ్నీలు పూరాగా పాడైపోయినయ్. పన్నెండు గంటల్లో ఏరే కిడ్నీలు దొరక్కుంటే నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడు. ఫాతిమా ! నీకు చేతులెత్తి మొక్కుత ! సుబాని కిడ్నీలు…. అని రాంరెడ్డి గొంతుక పూడిపోయి మాట రాలేదు.

ఫాతిమా ఒక్కసారి షాక్ అయింది. సుడిగాలికి ఎండు టాకులా వణికింది.

“మర్దీ ! కడుపుకోత ఎట్లు అగులు బుగులుగ ఉంటుందో అనుబగిత్తన్నా! నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుకు కావాలె ? నా కొడుకును మట్టిలో గల్పుకుంటన్నగా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కోనికి మోక వుంటే ఎందుకడ్డబడాలె ! నాకొడుకు పానం అసుమంటిదే నీ కొడుకు పానం. నా కొడుకు హయతుత బోస్కోని నీ కొడుకు నిండు నూరేండ్లు బత్కొలె! గందుకునన్నే జెయ్యమంటే గజేస్త…. అన్నది ఫాతిమా !

ఫాతిమా మనసు…. మనిషికి కావలసింది. ఇన్సానియత్ గాని కులాల మతాలు కావని” చెప్పకనే చెప్పింది. ఇంతటి గొప్ప మనసు ఫాతిమావంటి తల్లులకు ఎప్పుడూ ఉంటుంది.

ప్రశ్న 2.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించ బడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది.

తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది. యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని, చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తనతల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత.

పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ? చదువుకుంది. సంస్కారం ఉంది. మరీ అంత అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేను. నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి. నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.”

నా గురించి మీరు ఇల్లు అమ్ముకుని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిత్వం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను.

నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది. ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను. మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడే వాడు దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొవాలి. ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి తనతోపాటు స్త్రీ జాతి కంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

ప్రశ్న 3.
‘బిచ్చగాడు కుటుంబానికి ఎదురైన కష్టాలను వివరించండి?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీనే రచించబడింది. అంపశయ్య నవీన్ అసలు పేరు దొంగరి మల్లయ్య ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది.

ప్రపంచంలో పలు రకాల దోపిడీలు మోసాలు జరుగుతుంటాయి. అందులో శ్రామికుల కార్మికుల జీవితాలలో జరిగే శ్రమదోపిడి అత్యంత భయంకరమైనది. రోజువారి కూలీ పనులు చేస్తూన్న వలన కార్మికులలో, సంచార జీవనం సాగించేవారిలో, రోజు అడుక్కుంటూ పొట్టపోసుకునే బతుకులలో ఈ శ్రమదోపిడి మానవతా విలువలకు తావులేకుండా చేస్తుంది. వారి దోపిడీకి నగ్న సత్యంగా నిలచిన కథే ఈ బిచ్చగాడి కథ. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీన మనస్తత్వానికి దోపిడీ స్వభావానికి ఇది ఒక ఉదాహరణం.

ఈ కథ అమానవీయతను, నైతిక పతనాన్ని తెలియచేస్తుంది. ఈ కథ ప్రయాణ సమయంలో విభిన్న మనస్తత్వాలు గల మానవ హృదయాలను ఆవిష్కరిస్తుంది. రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహ వేడుకలకు అటెండయి తిరిగి వరంగల్లుకు వెళ్తున్న సందర్భంలో జరిగింది. రైలు చాల రద్దీగా ఉంది. కూర్చోటానికి జాగా ఎక్కడా కన్పించలేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఓ సీటు మొత్తాన్ని ఒకామె బోల్డు లగేజీతో సీటు మొత్తాన్ని ఆక్రమించేసింది. ఆమె ఓ బిచ్చగత్తె. ఆమె భర్త టికెట్ తీసుకురావటానికి వెళ్ళాడు. కౌంటర్ దగ్గర చాలా రద్దీగా ఉంది. బండి కదలటానికి సిద్ధమవటంతో అతడు పరిగెత్తుకొచ్చాడు. వాడికి టికెట్ అందనేలేదు. ఎవడికో డబ్బులిచ్చి వచ్చాడు. కొందరు టికెట్ లేకపోతే టి.సి వచ్చి నానాయాగీ చేస్తాడన్నాడు.

ట్రైన్ కదలింది. టికెట్ తెస్తానన్నవాడు ఆ డబ్బులతో అటే పోయాడు. టి.సి రానే వచ్చాడు. ఆ బిచ్చగాడి పేరు బ్రహ్మయ్య. ఒరేయ్ టికెట్ తీయరా! అన్నాడు టి.సి. “అయ్యా! టికెట్ కోసమే పోయినయ్యా! ఇయ్యాళ కొత్తగూడెం టేషన్లో అంతా మందే…… టికెట్ తీసుకోమని మా అన్న కొడుకుని పంపిన.

ఆడు చెయ్యి బెడ్తుండగనే బండి కదిలింది. నేను వాణ్ణి వదిలేసి బండెక్కిన” “నోర్ముయిరా దొంగ వెధవ. ఎక్కడివెళ్ళాలి” అన్నాడు. “నెక్కొండ” “బాంచెన్” అన్నాడువాడు. ఆ ఆడది నల్గురు పిల్లలు నీ వాళ్ళేనా” “అయ్యా మా వాళ్ళే’ అయితే 56 రూపాయలు తియ్” అతడు వెంటనే టి.సి రెండు కాళ్ళు పట్టుకున్నాడు.

“లే గాడిద కొడకా! నా కాళ్ళెందుకుకురా పట్టుకుంటావ్” పైసలిస్తవా పోలీసోళ్ళకు పట్టించనా అన్నాడు టి.సి “నన్ను కోసినా నా దగ్గర పైసల్లేవు బాంచనా” ఈ భాగోతం అంతా బండిలో ఉన్న వారికి వినోదంగా మారింది” వరేయ్ బ్రహ్మయ్య! డబ్బు తియ్యరా” అన్నాడు టి.సి “అయ్యా! నన్ను కోసినా నా వద్దపైసాలేదయ్యా! అంటూ బ్రహ్మయ్య మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు. “నన్నుంటుకున్నావంటే చంపేస్తా… బద్మాష్ లుచ్చ నీ దగ్గర డబ్బులేదురా. ఆరుమాలు తీయ్” అన్నాడు టి.సి “ఈ రూమాల్నేముందు బాంచెన్….మీ అసుంటి ఓ దొర దగ్గర అడుక్కున్నా నన్ను నమ్మండ్రి బాంచెన్ అని మళ్ళీ కాళ్ళు పట్టుకోబాయాడు.

ఇద్దరి మధ్య పెనుగులాటలో రుమాలు చిరిగి పోయింది. దాన్లో నుండి 30 రూ॥ బయట పడ్డాయి. ఆ ముప్పై ఇదేనా అన్నాడు టి.సి “ఛట్ దొంగ రాస్కెల్. ఇంకా మోసం చేద్దామని చూస్తావురా ! తీయ్ మిగతా 26రూ॥ అన్నాడు. “మమ్ముల కొట్టుండి. సంపుండ్రి. ఈ బండ్ల నుంచి బయటకు ఇసిరి కొటుండ్రి మా వద్దిక పైసల్లేవ్ అంది బ్రహ్మయ్య భార్య.

“నోర్మూయ్యలే దొంగముండ. పైసల్ లేవంటే ఫైనెవ్వడు కడ్డడు. నీ వడుంకున్న ఆ సంచితియ్ అన్నాడు టి.సి. దాంట్లో ముంది నిన్న మొన్న అడుక్కున్న డబ్బులు. నిండు చూలాలు. నలుగురు పిల్లలలో ఉన్న ఆమెను చూస్తే ఎవరికి జాలి కలుగలేదు”ఈ పూటకు నూక మందమన్నా ఉంచుండ్రయ్యా! నిన్న మొన్న ఏమిటి నేను ఏమిటినేను. నా పోరగాండ్లను సూడుండ్రి ఆకలితో నకనక లాడిపోతండ్రు అని ఎంత కాళ్ళు పట్టుకున్నా ప్రతమ్నాయం లేకపోయింది.

ఆ సంచిలోని డబ్బంతా క్రిందపోసి 26 రూ॥ తీసుకుని ఒక రిసీట్ బుక్ తీసి ఏడో రాశాడు. నా దృష్టి ఆ కాగితం పై 22 రూ||లు డోర్నక్అ టు నెక్కొండ” అని పడింది. ఇంతకూ ఎవరు పెద్ద బిచ్చగాడో మీరే అర్ధం చేసుకోండి. అని కవికథలు ముగించాడు.

ప్రశ్న 4.
‘గొల్లరామవ్య’ కథ ఇతివృత్తాన్ని పరిచయం చేయండి.
జవాబు:
‘గొల్లరామయ్య కథ’ దక్షిణ భారతదేశం నుండి తొలిసారి భారత ప్రధాని అయిన పాముల పర్తి వేంకటనరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన ‘గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు’ సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటంలో చిత్రించబడిన అద్భుతఘట్టం గొల్లరామవ్య కథ. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజాశ్రేయస్సు కోసం విజృంభించిన ఒక సాహస విప్లవ కారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వఘటం, ఇందులోని ఇతివృత్తం. తెలంగాణా పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె, గొల్ల రామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె వడిలో పదిహేనేండ్ల బాలిక. ఆ గ్రామంలో అప్పుడు అయిన పెద్ద శబ్దాలకు గ్రామంలోకి వారితోపాటు వీరిద్దరి మొహాల్లో భయం తాలూకా ప్రకంపనలు కన్పిస్తున్నాయి.

“అవ్వా! గిప్పుడిదేం చప్పుడే! అని ఆ బాలిక ప్రశ్నించింది” “నీకెందుకే మొద్దముండా… అన్నీ నీకే కావాలె” అని నోరు మూయిచింది గొల్లరామవ్వ. హఠాత్తుగా కిటికీని ఎవరో తట్టినట్లుంది రజాకార్లో, పోలీసులో అని భయపడింది గొల్లరామవ్వ. ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది.

అగంతకు డొకడు ఆ ఇంటి కిటికీ ద్వారా ఇంట్లోకి వచ్చాడు. సందేహం లేదు. రజాకార్లో, తురకోడో, పోలీసోడు అయి ఉండాడు. తనకు చావు తప్పదు. తను అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళి చేసిన తన మనవరాలికి మానభంగం తప్పదు అని తల్లడిల్లిపోయింది.

అంతలో, ఆగంతకుడు నేను దొంగను కాను, రజాకారును కాను పోలీసునూ కాను నేను మీలానే ఒక తెలుగోడిని. ఇది రివల్వార్ మిమ్మల్ని చంపేవాళ్ళను చంపేందుకది. ఈ రాత్రి ఇద్దరు పోలీసుల్ని చంపాను. మొన్న మీ గ్రామంలో నలుగురు అమాయకులను చంపిన పోలీసు లే, లే, ‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్’ను నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతుంది.

తెల్లవారుతుండగా పోలీసులు గ్రామంలోకి ప్రతి ఇల్లును సోదాచేస్తున్నారు. గొల్ల రామవ్వ ఇంటికి కూడా వచ్చారు. ఆమె భయపడిపోయింది. కాంగ్రెస్ వాలంటీర్ అయిన ఆ యువకుని ఎలాగైనా రక్షించాలనుకుంది. తన మనవరాలిని గొంగళితో ఆయువకుని కప్పి ఉంచమన్నది.

వారిద్దరిని ఒకే మంచంపై పడుకోమని ఆజ్ఞాపించింది. అతనికి గొల్లవేషం వేయించింది. ఇంటిలోపలికి ప్రవేశించిన పోలీసులతో ఆ పిల్లలిద్దరూ నా మనవరాలు ఆమె పెనిమిటి అని బొంకింది. పోలీసోడు గొల్లరామవ్వను వాడు ఎవడన్నావ్. కాంగ్రెసోడా ఏం అని ప్రశ్నించిన రామవ్వ కంగారు పడలేదు.

పోలీసులు వెళ్ళిపోయారు. రామవ్వ మంచం మీద కూర్చొంది. ఒక వైపు యువకుడు, మరోవైపు ఆమె మనవరాలు వారిది అపూర్వ సమ్మేళనం అన్పించింది ఆ యువకునికి “అవ్వా! నీవు సామాన్యురాలివి కావు. ‘సాక్షాత్ భరతమాతవే’ అన్నాడు. ఇలా ఒక విప్లవ కారుని సామాన్య వృద్ధురాలు రక్షించిన కథే గొల్ల రామవ్వ కథ.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘ
పరిచయం : ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, ‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అన్న కవితా ఖండికలోనిది.
సందర్భము : మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని అసలు విషయాన్ని తెలుసుకోమని చెప్పిన సందర్భంలోనిది.
భావము : కత్తిపట్టి గెలిచిన వీరుడెవ్వరూ లేడు. కాని మెత్తని హృదయంతో లొంగనివారు ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి అహింస మార్గాన్ని ఎంచుకోవాలి. హింస ద్వారా సంతోషం ఏనాటికి లభించదని ఇందలి భావం.

ప్రశ్న 2.
రంగులు వేరైనా నరజాతి నరంగు మానవత్వమే.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘ కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భము : కవి మానవతను గూర్చి వివరించిన సందర్భంలోనిది.
భావము : ఏడురంగుల సమ్మేళనం ఇంద్రధనస్సు. కాని దాని ఛాయ ఒకటే. ఏడు రంగుల సమ్మేళం అయినా చంద్రుని కాంతి తెలుపే. ఎన్ని వర్ణాలవారున్నా మానవులు నందరిని నడిపించే సరంగు మానవత్వమే అని ఇందలి భావము.

ప్రశ్న 3.
చరితములని కొన్ని నుడివి చతురత మఱియున్.
జవాబు:
కవి పరిచయం : భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.
సందర్భము : తనను దర్శించడానికి వచ్చిన కుచేలుని చూసి అతిధి సత్కారాలు చేసి కుచేలునితో చిన్ననాటి సంఘటనలు గుర్తుచేసుకున్న సందర్భంలోనిది.
వివరణ : కుచేలుని అదృష్టానికి అంతఃపుర కాంతలు ఆశ్చర్యపోతున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని ఇద్దరూ కలిసి గురుకులవాసం చేసిన రోజులలోని విశేషాలను కొన్నింటిని శ్రీకృష్ణుడు గుర్తుచేసుకున్నాడు అని భావం.

ప్రశ్న 4.
సజ్జనుల జేయులేడెంత చతురుడైన
జవాబు:
పరిచయం : శేషప్ప కవిచే రచింపబడిన నృసింహశతకం నుండి గ్రహించిన పద్యభాగం.
సందర్భము : క్రూరజీవులనైన అదుపు చేయవచ్చుగానీ, దుర్మార్గుల మనసును ఎంతటితెలివిగల వాడైనను, మార్చలేడని కవి చెబుతున్న సందర్భంలోనిది.
భావము : భుజముల శక్తిచే పెద్దపులులు చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

VI ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
కవిరాజుముర్తి దృక్పథాన్ని తెలపండి.
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగము ‘కవిరాజుమూర్తి’ చే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. మూర్తిగారు నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను వేదనలను నిరాశతో, నిట్టూర్పులతో నివేదించటం జరిగింది. సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓదార్చుతూ విశ్వాసం కోల్పోకుండా విప్లవాత్మక ధోరణిలో ఊతాన్నివ్వాలని చూశాడు. భవిష్యత్తుపై ఆశను ప్రేరేపిస్తూ మానవీయ విలువలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజాన్ని కోరుకున్నాడు.

ఈ ‘మహైక’ కావ్యాన్ని చూసిన్పుడు ‘ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది’ అన్న బెల్లంకొండరామదాసు, రెంటాల గోపాల కృష్ణ మాటలను బట్టి కవి నూతన దృష్టి ఎంతటిదో మనకు అర్థమౌతుంది. ఈ కావ్యాన్ని తెలంగాణ యోధుడు “సర్దార్జమలాపురం కేశవరావుకు అంకితం ఇవ్వడంలోనే కవి అభ్యుదయ విప్లవాత్మక దృక్పధాలు మనకు తెలుస్తున్నాయి.

ప్రశ్న 2.
బలిష్ఠునికే బంధుసహాయం అందుతుందని ఎలా చెప్పవచ్చు ?
జవాబు:
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.

ప్రశ్న 3.
శ్రీకృష్ణుడు, కుచేలుడిని ఏవిధంగా ఆదరించాడు ?
జవాబు:
శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరముతో ఎదురుగా వెళ్లి కుచేలుని ప్రేమతో కౌగిలించు కొనాడు. బంధుత్వము, మిత్రత్వము వెల్లడియగునట్లుగా తీసుకొని వచ్చి, ప్రేమాదరములతో తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు.

ప్రేమతో బంగారు చెంబులోని నీటితో ఆయన పాదములు కడిగినాడు. ఆ కాళ్లు కడిగిన నీటిని భక్తితో తన శిరస్సు మీద చల్లుకొనినాడు. కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గందమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను.

మంచి సువాసనలు గల పూలదండలు కుచేలుని జుట్టుముడిలో అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోదానమిచ్చెను. ఇట్లు కృష్ణుడు తనకు సాదరముగా స్వాగతము పలుకగా, కుచేలుని శరీరమున గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములు స్రవించెను.

ఆ సమయమున సాక్షాత్తు శ్రీకృష్ణుని సతీమణియైన రుక్మిణీదేవి చేతుల గాజులు ఘల్లుఘల్లు మనుచుండగా వింజామరలు విసరెను అప్పుడు పుట్టిన చల్లని గాలులు మార్గాయాసముచేత పుట్టిన కుచేలుని శరీరము నందలి చెమట బిందువులను పోగొట్టెను; ఈ ఘట్టమును చూచి, అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయి, తమలో తామిట్లను కొనసాగిరి.

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

ప్రశ్న 4.
మనుషులు ఎందుకు భ్రమల్లో మునుగుతున్నారు ?
జవాబు:
అచలం’ అనుపాఠ్యభాగముదున్న ‘ఇద్దాసు’ చేరచించబడింది. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ఈయన రాసిన తత్వాలు, ఆత్మపరంగా, తత్త్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు. ఈ దేహము మనదికాదు, మోహాన్ని విడచి ప్రయత్నం చేసి గురువును చేరుకోవాలన్నాడు. ఆలు, బిడ్డలు ధనము నాది అనుభ్రమల్లో మానవులు బతుకుతున్నారు. భార్యా బిడ్డలు ధన, ధాన్యాలు ఏవీ శాశ్వతంకావు. ఆ భ్రమల్లో బ్రతుకుతూ సత్యాన్ని తెలుసుకునే లోపే జీవితం పూర్తయిపోతున్నది. కీలు విడచిన బొమ్మలాగా నేలలో కలిసిపోతున్నారు. కావున ఆ భ్రమలు వీడి నిజాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి అని ఇద్దాసు వివరించాడు.

VII ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
బొడ్డెమ్మ ఆటను గురించి రాయండి ?
జవాబు:
‘బతుకమ్మపండుగ’ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి స్వీకరించబడింది.

బొడ్డెమ్మఆట బతుకమ్మ ఆటకు పూర్వరంగం బతుకమ్మతోపాటు ఎర్రమట్టిముద్దను త్రిభుజాకారంలో తయారుచేసి దానిపై వెంపలిచెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి పూజచేస్తారు. దీనిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది. బొడ్డెమ్మ ఆటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంలో మలచటం, పూజించటం భూమిని స్త్రీమూర్తిగా భావించి అర్చింటమే ! ఇది ఆటవికులు భూదేవిని పూజిస్తూ చేసే నాట్యాలలో వలే విందులుగా వినోదాలతో పాటలతో జరుపబడుతుంది. భూదేవికి ప్రతిరూపమైన బొడ్డెమ్మను పూజించటం, అడవిపూలైన తంగేడు, ముత్యాలపూలతో పూజించటం ఆటవికుల నమ్మకాల ప్రభావంగా భావించాలి.

ప్రశ్న 2.
ఇంటింటికి మంటి పొయ్య జాతాయంలోని సామాజిక న్యాయాన్ని వివరించండి ?
జవాబు:
తెలంకాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
కట్టెలతో వంటలు చేసేటప్పుడు ఏ ఇంటిలోనైనా మన్నుతో చేసిన పొయ్యి ఉండేది. నీకు ధనమున్నదికదా అని బంగారు పొయ్యి లాడరు కదా.! సామాజిక న్యాయం అందరికి ఒక్కటే సమస్యలు లేని ఇల్లుండదు “మాకోడలు కొడుకు మొన్న నలుగురిలో నానామాటలన్నందుకు నల్ల మొఖం అనిపించింది.

బజారుకే రాబుద్ధికావడం లేదు” అంది పొరుగింటావిడ. “ఇంటింటికి మట్టి పొయ్యే ఈ కష్టాలు అందరికీ వచ్చేవే. నీ ఒక్కదానికని ఏముంది. నీ కొడుకు కోడలు ఏదో అంటే నీకెందుకు నల్లమొఖం. ముందటమాకురావా” అని ఓదార్చింది. పొరుగింటి ఆవిడ. ఇలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగించబడుతుంది.

ప్రశ్న 3.
ఉర్దూ వానా పదాన్ని వివరించండి ?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడినది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువడిన ‘వ్యాసగుళుచ్ఛం’, రెండవ భాగం నుండి గ్రహించబడింది.

మన దేశంలోని భాషలన్నింటిపై సంస్కృత భాషా ప్రభావం ఎలా ఉందో అలాగే ఆంగ్లభాషా ప్రభావం ఉర్దూ భాషపై ఉంది. ఉర్దూ భాషా శాస్త్రవేత్తలు, ‘ఉర్దూవానా’ అనే పదాన్ని తరుచుగా వాడుతుంటారు. ఉర్దూ, పండితులు వలు ఆంగ్లపదాలను పద బంధాలను ఉర్దూలోకి అనువదించుకున్నారు. అవిగాక ఒక భాష అన్యభాషా పదాలను స్వీకరించే వర్ణాగమ, వర్ణలోప వర్ణవ్యత్యయ పద్ధతులలో ఎన్నో ఆంగ్లపదాలను ఉర్దూభాషలోకి మార్చుకున్నారు. ఆభాషా రూపమే ‘ఉర్దూవానా”.
ఉదా :: లార్డ్ అనే ఆంగ్లపదం లాట్ సాహెబ్డిను
కమాండ్ అనే ఆంగ్లపదం కమాన్ గాను
ఫిలాసఫీ అనే పదం ఫల్సపా గాను
ఇలా పలు ఆంగ్లపదాలు ఉర్దూలోకి వచ్చాయి. ఆ పదాల సమూహంతో వచ్చిన దానిని ‘ఉర్దూవానా’ అన్నారు.

ప్రశ్న 4.
‘రాజా బహద్దూర్’ హరిజనుల పట్ల దృష్టి తెలుపండి ?
జవాబు:
రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డి గారిచే రచించబడిన ‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి’ జీవిత చరిత్ర నుండి గ్రహింపబడింది. వీరు తన బలమును, ధనమును అధికారమును, ప్రజాభ్యుదయానికి వినియోగించారు. మంచి సంఘసంస్కరణాభిలాషి, అనాధలపై వీరికి ఎంతటి అనురాగమో హరిజనులపై కూడా అంతటి ప్రేమాదరణలను కలిగియున్నారు. హిందూ దురాచారాలలో అగ్రస్థానం వహించిన అస్పృస్యతా నివారణను పెద్ద దోషము గా రామారెడ్డిగారు భావించారు. వారిని కూడా హిందూ సోదరులుగా భావించి వారికి సమానత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.

హరిజనులలో ఒక దుష్ట సంప్రదాయం ఉండేది. హరిజనులు తమ ఆడపిల్లలను ‘మురళీలుగా’ ‘బసివిరాండ్రుగా’ తయారు చేసేవారు. బాల్యంలోనే ఇలా తయారుచేయబడిన హరిజన బాలికలు వారి జీవితాంతం వ్యభిచారులుగా బ్రతుకవలసి వచ్చేది. సమాజంలోని అగ్రవర్ణాలవారు వీరితో వ్యభిచారం చేసేవారు. ఈ దుష్ట సంప్రదాయాన్ని రూపుమాపటానికి రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి గారు తీవ్రమైన కృషి చేశారు. ఈయన సర్వజన ప్రియులై అఖండకీర్తి ప్రతిష్టలందుకున్నారు.

VIII ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
నన్నయ గురించి తెలుపండి.
జవాబు:
‘నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనాభి శోభితుడు, లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు అయిన నన్నయ సాగించిన భారతానువాదం అనన్య సామాన్యం. వేదవ్యాస విరచితమై పంచమ వేదంగా చెప్పుకొనే సంస్కృత మహాభారతాన్ని రాజరాజు కోరిక మేరకు తెలుగులోకి అను వాదం చేసాడు. నన్నయ ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’ అంటూ సంస్కృత శ్లోకంతో మహా భారతాన్ని మొదలుపెట్టి ఆనాటి ప్రాచీన విద్వాంసుల మెప్పు పొందాడు. బహుభాషా విజ్ఞుడు, ఉద్దండపండితుడు అయిన నన్నయ మహాభారతంలో ఆది, సభా, అరణ్యపర్వంలోని నాల్గవ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించాడు.

వాటితోపాటు ఆంధ్ర శబ్దచింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం అనే గ్రంథాలు రచించాడు. మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో నన్నయ భారతానువాదానికి ఉపక్రమించాడు. మహాభారతాన్ని చంపూ పద్ధతిలో అనువదించిన నన్నయ భారత రచన ఒక స్వతంత్ర రచనలాగా సాగింది. నన్నయ తదనంతర కవులెందరికో మార్గదర్శకుడై “ఆదికవి’ అనిపించుకున్నాడు.

ప్రశ్న 2.
పోతన గురించి తెలుపండి.
జవాబు:
‘భక్తకవిగా ప్రసిద్ధి చెందిన బమ్మెర పోతన 15వ శతాబ్దపు కవి. కేసన, లక్కమాంబ తల్లిదండ్రులు. వ్యాస భాగవతాన్ని రసరమ్యంగా తెలుగువారికి అందించాడు. పోతనకు సహజపండితుడు అనే బిరుదు ఉంది. పోతన వీరభద్ర విజయం, భోగినీ దండకం కూడా రచించాడు.

ప్రశ్న 3.
సామల సదాశివ రచనలను సంగ్రహంగా తెలుపండి ?
జవాబు:
సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలంలోని తెలుగు పల్లెలో మే 11, 1928న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. సదాశివ విభిన్న భాషా సంస్కృతుల కళావారధి, వీరు సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ తెలుగు భాషలలో పండితుడు. వీరి తొలి రచనలలో ప్రభాతము అనే లగు కావ్యం, సాంబశిం శతకం, నిరీక్షణము, అంబపాలి, సరవ్స్య దానము, విశ్వామిత్ర మొదలగునవి ఉన్నాయి.

హిందూస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై, ‘మలయమారుతాలు’ ప్రముఖుల జ్ఞాపకాలు, ఉర్దూ, భాషా కవిత్వ సౌందర్య ఉర్దూకవుల కవితా సామాగ్రి మొదలగునవి ప్రసిద్ధ గ్రంథాలు.

అన్జద్ రుబాయిలు తెలుగు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువార పురస్కారాన్ని ఇచ్చింది. వీరి ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవాదాయలయాలు వీరిని గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో పలు పరిశోధనలు జరిగాయి.

ప్రశ్న 4.
గడియారం రామకృష్ణశర్మ సాహిత్యసేవను తెలుపండి ?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ సుబ్బమ్మ. జ్వాలాపతి దంపతులకు మార్చి 6. 1919న అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఆయన జీవితమంతా మహబూబ్ నగర్ జిల్లా అలంపురంలోనే గడిచింది. ఈయన తిరుపతి వేంకటకవుల శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి వద్ద విద్యలనభ్యసించాడు. సంస్కృతం, తెలుగు, కన్నడ, ఆంగ్ల సాహిత్యాలలో పండితుడయ్యాడు. కవిగా, పండితునిగా, కావ్య పరిష్కర్తగా, శాసన పరిశోధకునిగా, చరిత్రకారునిగా, సంఘసంస్కర్తగా, ఉద్యమకర్తగా క్రియాశీలక పాత్రను పోషించాడు.

నిజాం రాష్ట్రంలో తెలుగు భాషను చిన్నచూపు చూడటం సహించలేక ఆంధ్రమహాసభల ఏర్పాటుకు కృషి చేశారు. తెలంగాణమంతా పర్యటించి ‘భాగ్యనగర్ రేడియో, ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. బాలవితంతువును వివాహమాడటంతోపాటు వితంతు వివాహాలు జరిపించాడు. ‘సుజాత’ పత్రికను ప్రారంభించారు.

మెకంజీ కైఫీయత్తులను వ్రాయించారు. ‘తెలంగాణ శాసనాలు’ రెండవ సంపుటిని తీసుకువచ్చారు. కన్నడ సాహిత్య చరిత్రను రాశారు. కన్నడకవి రన్నడు రాసిన ‘గదాయుద్ధాన్ని’ తెలుగునకు అనువదించినాడు. అలంపురం చరిత్ర, విద్యారణ్యుల చరిత్రలను రాశాడు. వీరి ఆత్మకథ ‘శతపత్రం’ 2006లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డునందుకుంది.

IX ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి.
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
మనిషి ఏవిధంగా బ్రతకాలి ?
జవాబు:
మనిషి మనిషిగా మానవత్వంతో బ్రతకాలి.

ప్రశ్న 2.
ద్రోణుడి మిత్రుడి పేరేమిటి ?
జవాబు:
ద్రుపదుడు

ప్రశ్న 3.
సజ్జనుడి పలుకులు ఎలాంటివి ?
జవాబు:
మంచి మాటలు

ప్రశ్న 4.
అశ్వత్థామ ఎవరి కుమారుడు ?
జవాబు:
ద్రోణుడు.

ప్రశ్న 5.
చతురుడైన వాడు కూడా చేయలేని పని ఏమిటి ?
జవాబు:
దుర్మార్గులకు దేవుని గురించి తెలిపి వారిని మంచివారుగా చేయలేరు.

ప్రశ్న 6.
ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు ?
జవాబు:
వరసిద్ధి జంగమ దేవర పూదోట బసవయ్య ప్రబోధించాడు..

ప్రశ్న 7.
‘మిత్ర ధర్మం’ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి తీసుకోబడింది ?
జవాబు:
శ్రీమధాంధ్ర మహాభాగవతం దశమ స్కంధం నుండి గ్రహించబడింది.

ప్రశ్న 8.
దాశరథి ప్రసిద్ధ నినాదమేది ?
జవాబు:
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్నది దాశరథి ప్రసిద్ధనినాదం.

X ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులెవరు ?
జవాబు:
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులు వెంకటనరసమ్మ, నరసయ్యలు.

ప్రశ్న 2.
బతుకమ్మ పాటల్లో ఏవి ఒదిగి ఉంటాయి ?
జవాబు:
బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు జీవన విధానాలు ఒదిగి ఉంటాయి.

ప్రశ్న 3.
సోమన గురువులెవరు ?
జవాబు:
సోమనకు నలుగురు గురువులు. ఒకరు దీక్షాగురువు గురులింగార్యుడు, శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు, సాహిత్యగురువు కరస్థలి విశ్వనాథయ్య.

ప్రశ్న 4.
‘జుర్మానా’ అనే ఉర్దూపదం తెలుగులో ఏ విధంగా మారింది ?
జవాబు:
జుర్మానా’ అనే ఉర్దూపదం తెలుగులో ‘జుల్మానా’ గా మారింది.

ప్రశ్న 5.
తెలుగులో తొలి విజ్ఞానసర్వస్వంగా ఏ గ్రంథాన్ని పరిగణించారు ?
జవాబు:
తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా పరిగణించిన గ్రంథం పండితారాధ్య చరిత్ర.

ప్రశ్న 6.
స్వార్థం లేకుండా పరోపకారిణీ బాలికల పాఠశాల నడిపిందెవరు ?
జవాబు:
కీ॥శే॥ సీతమ్మగారు

ప్రశ్న 7.
జాతీయాలలో ఏ చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది ?
జవాబు:
జాతీయాలలో తరతరాల తెలంగాణ సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది.

ప్రశ్న 8.
ఆచార్య రవ్వా శ్రీహరికి ‘మహా మహాపాధ్యాయ’ బిరుదును ప్రదానం చేసిన సంస్థ ఏది ?
జవాబు:
తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వీరికి ‘మహా మహోపాధ్యాయ బిరుదును ఇచ్చింది.

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

XI ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
ఇటీవల మీ కళాశాలలో ఎన్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరం గురించి వివరిస్తూ స్నేహితునికి లేఖ వ్రాయండి.
జవాబు:
స్నేహితులకు లేఖ

మెదక్
09-08-2023.

ప్రియమైన సౌమ్యకి,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగా చదువుతున్నాను. నీవు ఎలా చదువుతున్నావో ఉత్తరం ద్వారా తెలియజేయగలవు..

ఇటీవల మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (N.S.S) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం : నిర్వహించారు. ప్రమాదాలు జరిగినపుడు గాని, శస్త్రచికిత్సలు చేసినపుడు గాని మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొన్నిసార్లు రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సాటివారి ప్రాణాలు కాపాడాలని తెలియజేస్తారు. ఈ మాటలు విన్న వింటనే నేను రక్తదానం చేశాను. నీవు కూడా రక్తదానం చేస్తావని భావిస్తున్నాను.

మన స్నేహితులు సమత, సంధ్య, ప్రవళిక ఎలా ఉన్నారు? వారిని అడిగానని చెప్పు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. వచ్చే దసరా సెలవులలో మనం కలుసుకుందాం. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

ಇట్లు
నీ ప్రియమైన స్నేహితురాలు
XXXXX

చిరునామా
ఎ. సౌమ్య
ఇంటి నంబర్ 21-12/68,
సుచిత్ర, సికింద్రాబాద్,
పిన్. నం – 500067.

ప్రశ్న 2.
పోగొట్టుకున్న సైకిల్ కోసం పోలీస్స్టేషన్కు లేఖ వ్రాయండి.
జవాబు:
అధికారికి లేఖ

దిలావర్పర్,
10.08.2023.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు,
పోలీస్ స్టేషన్,
దిలావర్పూర్.

విషయము : నా’ సైకిల్ దొంగిలింపబడిన విషయం గురించి.

ఆర్యా!
నమస్కారములు.

నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్పూర నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను నిన్న కళాశాలకు అట్లాస్ కంపెనీకి చెందిన ఎరుపు రంగు సైకిల్ పై వెళ్ళి, కళాశాల ముందర తాళం వేసి పెట్టి, తరగతులకు హాజరు అయ్యాను. సాయంత్రం వచ్చి చూసేసరికి నా సైకిల్ కనిపించలేదు. దొంగిలించబడినదని నిర్ధారణ అయ్యింది.
దయచేసి నా సైకిల్ గురించి విచారణ చేసి తిరిగి నాకు అప్పగించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విశ్వసనీయుడు
పి. ఆదిత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దిలావర్పూర్

XII ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి.

1. ముత్యమట్లు
జవాబు:
ముత్యమట్లు – ముత్యము + అట్లు = ఉకారసంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళమగును.

2. చేతులెత్తి
జవాబు:
చేతులెత్తి – చేతులు + ఎత్తి = చేతెలెత్తి – ఉకారసంధి/ఉత్వసంథి
సూత్రము : ఉత్తన కచ్చు పరంబగునపుడు సంథియగు.

3. సొమ్మయా
జవాబు:
సొమ్మయా – సొమ్ము + అయా – ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

4. దారిద్ర్యాంధకార
జవాబు:
దారిద్ర్యాంధకార – దారిద్ర్య + అంధకార = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం – అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

5. క్షణమాగాలి
జవాబు:
క్షణమాగాలి – క్షణము + ఆగాలి – క్షణమాగాలి – ఉకార సంధి/ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగును.

6. రెండంచులు
జవాబు:
రెండంచులు రెండు+ అంచులు = రెండంచులు – ఉకారసంథి/ఉత్వసంథి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు.

7. పదాబ్జాతంబు
జవాబు:
పదాబ్జాతంబు : పద + అఙ్ఞాతంబు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

8. భాగ్యంబెంత
జవాబు:
భాగ్యంబెంత – భాగ్యంబు + ఎంత = ఉకారసంధి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

XIII ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 3 = 12)

1. మైత్రే బంధము
జవాబు:
మైత్రే బంధము – మైత్రి చేత బంధము – తృతీయా తత్పురుష సమాసం
మైత్రి వలన బంధము – పంచమీ తత్పురుష సమాసం

2. దారాసుతాదులు
జవాబు:
దారాసుతాదులు – భార్య మరియు పిల్లలు – ద్వంద్వ సమాసం

3. ప్రియభాషలు
జవాబు:
ప్రియభాషలు – ప్రియమైన భాషలు – విశేషణ పూర్వపద కరధాయ సమాసం

4. ఇష్టసఖుడు
జవాబు:
ఇష్టసఖుడు – ఇష్టమైన సఖుడు- విశేషణ పూర్వపద కర్మధాయసమాసం

5. శిథిలవస్త్రంబు
జవాబు:
శిథిలవస్త్రంబు – శిధిలమైన వస్త్రము – విశేష పూర్వపద కర్మధారయ సమాసము

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

6. భరతభూమి
జవాబు:
భరతభూమి – భర్తత అనుపేరుగు భూమి – సంభావనా పూర్వపద కర్మధారయము

7. గరుగృహం
జవాబు:
గరుగృహం – గురువుయొక్క గృహం – షష్ఠీతత్పురుష సమానము

8. ధనుర్విద్యాకౌశలం
జవాబు:
ధనుర్విద్యాకౌశలం – ధనుర్విద్యయందుకౌశలం-సప్తమీ తత్పురుష సమాసం

XIV.
ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
యువత – జీవన నైపుణ్యాలు

ఒకదేశ.అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం.

ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి .

తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ – ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness): ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య.. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy) : పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహామభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill): మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి గానికి, అవకాశాలను వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.

4 భావోద్వేగాల నియంత్రణ (Management of emotions); యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill): సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ `ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.

ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making): సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking): ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking): యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

2. జాతీయ విపత్తులు
జవాబు:
జాతీయ విపత్తులు

అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.
విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే – భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు, లేకుండానే సంభవించే అవకాశం కలదు.

అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు.

దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ. సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

3. తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
జవాబు:
తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు.

చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని. ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి.

తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల ‘పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం. తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి.

నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ. ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి. తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం.

వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్టు మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి.

శాతవాహన కాలపు మట్టికోటల ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహ నులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 – 1686) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724- – 1948) తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్’ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగ నగర్’ అనే పేరొచ్చింది. వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి.

పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు. వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి.

శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి. పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ధ సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, ‘దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.

రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారదకథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి.

బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.

తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే.’ చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, ‘శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు. తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం…

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. What time is our meeting on Wednesday?
జవాబు:
బుధవారం మన సమావేశం ఎన్ని గంటలకు ?

2. Don’t judge book by its cover.
జవాబు:
ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వెయ్యద్దు.

3. What you do is more important than what you say.
జవాబు:
నువ్వు చెప్పే మాటలకంటే నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి.

4. Don’t stop when you’re tired stop when you are done.
జవాబు:
అలసిపోయినప్పుడు కాదు, పనిపూర్తయినప్పుడే విశ్రమించాలి.

5. By failing to prepare you are preparing to fail.
జవాబు:
మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే, విఫలమవ్వటానికి సిద్ధపడుతున్నారని అర్థం.

XVI ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

కవిత్వం పద్య, గేయ రూపంలో గాకుండా వ్యవహారిక పదాలు, వాక్యాలతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. పాశ్చాత్య కవితాధోరణుల ప్రభావం దీనికి ప్రధాన కారణం. ఫ్రెంచి భాషలోని ‘verse libre’ అని, ఆంగ్లంలో ‘free verse’ అని పిలుచుకుంటున్న కవితా పద్ధతే తెలుగులో వచనకవితగా స్థిరపడింది.

వచనకవితకు ఆద్యుడుగా చెప్పుకునే శిష్ట్లా ఉమామహేశ్వరరావు తను రాసిన వచనకవితల్ని 1938లో ‘విష్ణుధనువు’, ‘నవమి చిలుక’ సంపుటాలుగా ప్రకటించాడు. వచనకవిత ప్రయోగదశ, తొలిదశలో వచ్చిన ఈ కవిత్వాన్ని శిష్ట్లా ‘ప్రాహ్లాద కవిత’గా పేర్కొన్నాడు.

అటుతర్వాత వచనగేయం, వచనపద్యం, ముక్తచ్ఛంద కవిత, స్వచ్ఛంద కవిత, ఫ్రీవర్, వరి లిబర్, వచనకవిత అనే పలు పేర్లు వ్యాప్తిలోకి వచ్చినా వచనకవిత అనే పేరు స్థిరపడిపోయింది. వ్యవహార భాషా ప్రయోగాలతో భావపరమైన చిన్న వాక్యాల పాద విభజనతో వచనకవిత నడుస్తుంది.

భావగణాలతో, అంతర్లయ గల వాక్యాలతో వచనకవిత స్వేచ్ఛానుగుణంగా కదులుతుంది. ప్రతి వచనకవికి తనదైన నిర్మాణ శిల్పం వుండటం వచనకవిత ప్రత్యేకత. వచనకవితలో పాఠకునికి భావోద్వేగం కలిగించేట్లుగా ఒక విరుపు, భావలయ, అంతర్లయలు నిగూఢంగా వుంటాయి.

ప్రశ్నలు :

వచనకవిత ఆవిర్భావదశలో 1939లో పఠాభి ఫిడేలు రాగాల డజన్’ కవితాసంపుటి, ‘నయాగరా’ కవితాసంకలనం ముఖ్యమైనవి. తెలుగులో తొలి వచనకవితా సంకలనమైన ‘నయాగరా’ను కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాస్, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలు ప్రచురించారు. కుందుర్తి వచనకవితకు ఉద్యమస్ఫూర్తిని అందించాడు. వచన కావ్యంగా ‘తెలంగాణ’ కావ్యాన్ని రచించి ‘వచనకవితాపితామహుడి’గా ప్రసిద్ధి చెందాడు.

ప్రశ్న 1.
వచన కవితకు ఆద్యుడుగా ఎవరిని భావిస్తున్నాం ?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు

ప్రశ్న 2.
శిష్టా తన కవిత్వానికి పెట్టుకున్న పేరు ఏమిటి ?
జవాబు:
ప్రహ్లాద కవిత

ప్రశ్న 3.
‘వచనకవితాపితామహుడు’ ఎవరు ?
జవాబు:
కందుర్తి

ప్రశ్న 4.
తెలుగులో తొలి వచనకవితా సంకలనం ఏది ?
జవాబు:
‘విష్ణుధనువు’, ‘నవమిచిలుక’

ప్రశ్న 5.
‘ఫిడేలు రాగాల డజన్’ కవితా సంపుటి కర్త?
జవాబు:
శిష్ట్లాఉమాహేశ్వరరావు

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 8 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికీ భావం రాయండి. (1 × 6 = 6)

1. మురసంహరుఁడు …………… చతురత మఱియున్.
జవాబు:
మురసంహరుఁడు కుచేలుని,
కరము గరంబునఁ దెమల్చి కడఁకన్ మన మా
నా గురుగృహమున వర్తించిన,
చరితములని కొన్ని నుడివి చతురత మఱియున్.

భావము : అంతఃపుర కాంతలు అలా అనుకున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తాము గురుకుల వనం చేసిన దినాలలో జరిగిన విశేషాలను కొన్నింటిని ప్రస్తావించి ఇలా అన్నాడు.

2. అన్నలూ …….. ప్రాణానికి ముప్పే
జవాబు:
అన్నలూ విన్నారా ?
అక్కలూ విన్నారా ?
ఉదధి నీరు అంతాటా ఉప్పే ?
మండే మంట అంతా నిప్పే ?
ఆకలికి అన్నం కోరడం ఒప్పే ?
దౌర్జన్యం ప్రతి దేశంలో తప్పే
నిర్వీర్యత ప్రాణానికి ముప్పే

భావము : అన్నలూ అక్కలూ విన్నారా! సముద్రపునీరు అంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండుతున్న మంట అంతా నిప్పుతో కూడి ఉంటుంది. అది తన దగ్గరకు వచ్చిన వాటిని కూడా మండిస్తుంది. ఆకలి వేసినపుడు అన్నాన్ని కోరటం తప్పేమీకాదు. దౌర్జన్యం ఈ లోకానికి అపరాధమే! పౌరుషం లేకపోతే మనల్నిం మనం కాపాడుకోలేం!

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
శ్రీకృష్ణుడు కుచేలుడిని ఎలా గౌరవించాడో వివరించండి.
జవాబు:
కుచేలుడును, శ్రీకృష్ణుడును బాల్య స్నేహితులు. నిరంతర దరిద్ర పీడితుడైన కుచేలుడు భార్య ఆప్తమైన ఉపదేశముచే శ్రీకృష్ణుని దర్శించుటకై ద్వారకానగరమునకు బయలుదేరెను. కక్ష్యాంతరములు దాటి మణిమయ సౌధములో – అంతఃపురములో హంసతూలికా తల్పముపై కూర్చుండి ప్రియురాలితో కలసి వినోద క్రీడలలో మునిగియున్న శ్రీకృష్ణుని గాంచి బ్రహ్మాయనందమును పొందెను.

శ్యామల కోమలాకారుడును, ఇంద్రాది దేవతలచే స్తుతింపబడు వాడును, కౌస్తుభముడిన అలంకారముగా ధరించినవాడును, సమస్తలోకములచే ఆరాధింపబడు వాడును, పాల సముద్రము నందు విహరించువాడును ఐన శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని చూచెను. అట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు నిరంతర దారిద్య్ర్యము చేత పీడింపబడువాడు, బక్క చిక్కిన శరీరముతో, చినిగిపోయిన వస్త్రములతో పరిహాసమునకు స్థానమైన ఆ పేద విప్రుని గాంచి గబగబ తన పాన్పు మీది నుండి క్రిందికి దిగి, ఆదరముతో ఎదురుగా వచ్చి బాల్యమిత్రుడైన ఆ కుచేలుని కౌగిలించుకొనెను. తీసుకొని వచ్చి, తన పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. ప్రేమతో బంగారు కలశము నందలి నీటితో వాని కాళ్ళు కడిగెను. కాళ్ళు కడిగిన ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొనెను.

తరువాత కుచేలుని శరీరమునకు మంచి గంధము నలదెను. ప్రయాణ ప్రయాస పోవుటకై వింజామరలతో వీచెను. సువాసనా భరితమైన ధూపముల నొసగెను.. మణిమయం దీపములతో ఆరతి పట్టెను. సిగలో పూలమాలలు అలంకరించెను. .కర్పూర తాంబూలము నొసంగెను. గోవును దానముగా సమర్పించెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు చేసిన సేవలను గాంచి, కుచేలుని శరీరము పులకించిపోయెను. గగుర్పాటుతో ఆయన వెంట్రుకలు నిక్కపొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములను స్రవించెను. అంతేకాదు శ్రీకృష్ణుని భార్యామణియగు రుక్మిణీ దేవి స్వయముగా చామరములు వీచుచుండెను. ఈ విధముగా రుక్మిణీ కృష్ణులు చేయు సపర్యలను అందుకొనుచున్న ఆ కుచేలుని భాగ్యమునకు ఆశ్చర్యపోయి అంతఃపుర కాంతలు ఇట్లు ప్రశంసించిరి.

ఈ బ్రాహ్మణుడు పూర్వ జన్మమునందు ఎటువంటి తపస్సు చేసెనో గదా ! యోగులచే ఉపాసింపబడు జగత్ప్రభువు, లక్ష్మీదేవి ప్రియుడైన శ్రీకృష్ణుని తల్పముపై కూర్చుండినాడు ఎటువంటి మునీశ్వరులైనను ఈ మహనీయమూర్తికి సాటియగునా ?

“తన భార్యమణియైన రుక్మిణీదేవి ఏమనుకొనునోయని కూడ భావింపక, యదువంశేఖరుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి, ఆలింగనము కావించుకొని, వివిధములైన సేవలచే ఆయనను సంతృప్తుని కావించినాడు. ఈ బ్రాహ్మణోత్తముడెంత అదృష్టశాలియో గదా !” ఆ అంతఃపురకాంతలు కుచేలుని భాగ్యమున కచ్చెరువందినారు.

ఇట్లు కుచేలుడు కృష్ణుని దర్శించి, ఆయన అనుగ్రహమునకు పాత్రుడై, సాక్షాత్తు భగవంతుని చేతనే సేవలు చేయించుకొనినాడు. మధురమైన స్నేహమునకు కుచేలోపాఖ్యానము ఉజ్జ్వలమైన ఉదాహరణము.

ప్రశ్న 2.
పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తితత్త్వాన్ని తెలపండి?
జవాబు:
శేషప్పకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతం వాడు. ధర్మపురిలోని నరసింహస్వామిపై రాసిన శతకం నరసింహ శతకం. ఇది సీస పద్యాలలో రచింపబడిన ద్విపాద మకుట శతకం. శతకం లేని పద్యాలలో నరసింహస్వామిని సంబోధించడంలో ప్రేమ, మృదుత్వం, కాఠిన్యం, కోపం ఇంకా అనేక విధాలుగా తన భక్తిని ప్రదర్శించాడు.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాములకు దూరమైనవాడా! ధర్మపురము నందు నివసించే ఓ నరసింహస్వామీ!

భూమిలో వేయేండ్లు దేహం. నిలవదు. ధనమెప్పటికీ స్థిరం కాదు. ఆలుబిడ్డలు తన వెంటరాలేరు. సేవకులు చావును తప్పింపలేరు. చుట్టముల గుంపు తనను బ్రతికించుకోలేదు. శక్తి శౌర్యమేమి పనికిరాదు. గొప్పగ సకల సంపదలున్నను గోచి పాతంతైన తీసుకొని పోలేడు. పిచ్చికుక్కలలాంటి ఆలోచనలను ఆలోచించక నిన్ను కొలిచే వారికి మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.

కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధము, పులికి చక్కెరపిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూలచెండు, గుడ్లగూబకు చెవుల పోగులు, దున్నపోతునకు పరిశుభ్రవస్త్రము, కొంగలకు పంజరము ఎలా అవసరంలేదో అలాగే చెడ్డ ఆలోచనలుచేసే దుర్మార్గులకు తియ్యనైన నీ నామం అనే మంత్రం (దైవభక్తి) అవసరం లేదు అని భావము.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించువారా! దుష్టులకు సంహరించువారా! పాములకు దూరమైనవారా! ధర్మపురమునందు నివసించే ఓ నరసింహస్వామీ!

నరసింహస్వామి! తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావము అందులు, అన్నాలు, మేనమామలు, ఇంకా పెద్ద చుట్టుములున్నాను. తాను వెడలగ వెంటరాదు. యమదూతలు ప్రాణము తీసుకుని పోవునపుడు వారు ప్రేమతో పోరాడి గెలవలేరు. చుట్టుములందరూ దుఃఖపడుదురే గాని ఆయువునివ్వలేదు. కావున చుట్టుముల మీద ప్రేమ చూరున చెక్కి ఎప్పుడూ నిన్ను నమ్ముకొనుటే ఉపయోగము.

భుజముల శక్తిచే పెద్దపులుల చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. .బ్రహ్మరాక్షసుల ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

ఈ విధంగా మృదు మధుర, సులభమైన ఉపమానాలలో శేషప్ప కవి నరసింహస్వామిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘బతుకమ్మ’ పండుగ వెనుక ఉన్న ఆచారసంప్రదాయాలను వివరించండి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. దీనిలో బతుకమ్మ పండుగ వెనుక దాగియున్న ఆచార సంప్రదాయాలు వివరించబడ్డాయి.

తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలలో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేత పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ జానపదుల సాహిత్య, సంగీత, నృత్య కళారూపాలకు ప్రతీక. స్త్రీలకు సౌభాగ్యాలనిచ్చే తల్లి గౌరమ్మ ఆమె బతుకమ్మ. భయాన్ని గొలిపే స్వరూపం గౌరమ్మది. నవరాత్రుల సమయంలో తెలంగాణ స్త్రీలు సుకుమారమైన అందమైన రూపంగా భావించి అమ్మవారిని కొలుస్తారు. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూలమయం అవుతుంది. స్త్రీల సౌందర్యారాధన, అలంకరణ నైపుణ్యం కళాత్మక దృష్టి పూల బతుకమ్మను పూలతో అలంకరించటంతోనే ఉంటుంది. మహాలయ అమావాస్యనాడు ఎంగిలి బతుకమ్మను పేర్చటంతో బతుకమ్మ పండుగ ప్రారంభమై మహర్నవమి వరకు సాగుతుంది.

ముత్తైదువుల తెల్లవారుజాముననే లేచి అభ్యంగనం స్నానంచేసి అలికి ముగ్గులేసి పూలతో అలంకరిస్తారు. ఉదయం బతుకమ్మను అలంకరించిన సాయంకాలం ఇంటిముందే ఆడతారు. ఆ తువాత మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొనివెళ్ళి ఊరి. మధ్యలోగాని, చెరువుగట్టుపైగాని ఉంచి స్త్రీలందరూ వలయాకారంలో నిలబడి ఒంగి ఒరుగుతూ చేతులను తడుతూ పాటలు పాడతారు. చీకటి పడే వరకు ఆడి బతుకమ్మను కాలువలోగాని, చెరువులోగాని, భావిలోగాని వదిలిపెడతారు. బతుకమ్మకు వీడ్కోలు.
చెపుతారు.

నిద్రపోగౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు

అని పాటలు పాడుతారు. ప్రకృతి నుండి సేకరించిన పూలను మళ్ళీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మను నీటిలో విడిచిపెట్టడానికి కావచ్చు.

ఎర్రమట్టిని త్రిభుజాకారంలోకి మలచి దానిపై వెంపలిచెట్టు కొమ్మనుంచి పసుపుకుంకుమలతో పూజిస్తారు. ఇలా చేయటం భూమిని స్త్రీ దేవతగా భావించి అర్చించటమే! బతుకమ్మను ఆడేటప్పుడు స్త్రీలు పౌరానిక, నీతిభోధాత్మక, కథా గేయాలను పాడుకుంటారు. బతుకమ్మపండుగలో పాడే పాటల్లో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో – గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో – వచ్చేరిసతిగూడి ఉయ్యాలో”

ఈ గేయంలో పనిలోనే పరమాత్మను దర్శించమనే బోధ స్త్రీలశ్రమైక జీవనానికి దర్పణం. పనిలోని అలసటను పాటల ద్వారా సులభతరం చేసుకొన్న పరమాత్మ స్వరూపులు స్త్రీలు. పసితనంలో పెళ్ళిళ్ళు చేసి బరువు దింపుకున్న తల్లిదండ్రులు అల్లారుముద్దుగా తమవద్ద పెరిగిన కూతురిని వియ్యాలవారికి అప్పగిస్తున్న పాటలో వారి ఆవేదన అర్థమౌతుంది.

“పెరుగు అన్నము పెట్టి ఉయ్యాలో – పెంచుకోండి సీతను ఉయ్యాలో
సద్ది అన్నము పెట్టి ఉయ్యాలో – సాదుకోండి సీతను ఉయ్యాలో”

ఈ విధంగా అద్దంలోని కొండ ప్రతిబింబంలాగా బతుకమ్మ పండుగలో తెలంగాణా జానపద స్త్రీల జీవన విధానం, మనస్తత్వం కళలు ప్రతిబింబిస్తాయి.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

ప్రశ్న 2.
ఉర్దూ నుంచి తెలుగులోకి చేరినప్పుడు పదాలలో జరిగిన మార్పును వివరించండి ?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివ చే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువడిన “వ్యాస గుళుచ్ఛం”, రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో తెలంగాణా తెలుగులో ఉర్దూ పదాల మూలాలను చక్కగా వివరించారు.

ఉర్దూ ఒక ప్రత్యేక భాషకాదు, పారసీ, అరబ్బీ, తర్కీ శబ్దాలు కలగాపులగం ఉర్దూ భాష. దీనిని ఇది మన దేశంలో 14వ శతాబ్దంలో రూపుదిద్దుకున్నది. దీనిని తొలుత హిందుయి జబానే హిందూస్థాన్ అన్న పేర్లతో పిలువబడింది. 18వ శతాబ్దానికి కాని అది ఉర్దూ అని పిలువబడలేదు.

తెలుగులో కొన్ని ఉర్దూ పదాలు యథాతదంగానే చేరాయి. కమలము, కలందాస్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము రోజు, కూలీ, బాకీ, బజారు, దుకానం మొదలగు పదాలు ఇందుకు ఉదాహరణము. హలంతమైన ఉర్దూ భాషలోని పదాలు అజంతమైన తెలుగు భాషలో చేరినప్పుడు ఆ పదాలు అజంతమవటం సహజం. ఉదాహరణకు కలమ్-కలము అయింది. జమీందార్-జమీందారు అయింది. బజార్- బజారు అయింది.

కొన్ని పదాలు ఉర్దూ నుండి తెలుగులోకి వచ్చేటప్పుడు తమ రూపాన్ని మార్చుకున్నాయి. ఉదాహరణకు బాఖీ అనే ఉర్దూ పదం తెలుగులో బాకీ అయింది. అలాగే ‘నఖద్’ నగదుగా మారింది.

ఉర్దూపదం ఉదార్ – తెలుగుపదం
ఉదార్ – ఉద్దర
సొహబత్ – సోబతి
మస్జిద్ – మసీదు
కుర్సీ – కుర్చీ
ఘిలాప్ – గలీబు/గలేబు
జుర్మానా – జుల్మానా
నఖ్ – నగిషీ
ఆబ్రూ – ఆబోరు
ఇలా ఉర్దూపదాలు తెలుగులో మార్పుచెందాయి.

కొన్ని ఉర్దూపదాలు తెలుగులోకి వచ్చి అర్థాన్ని కూడా మార్చుకున్నాయి. ఉదాహరణకు “ముదామ్” అనే పారసీ పదానికి ఎల్లప్పుడూ అనే అర్థం ఉంది. ఇది తెలుగులో ‘ముద్దాముగా మారి ప్రత్యేకించి’ అనే అర్థంలో వాడబడుతుంది. ఇలా పలు మార్పులతో అనేక పదాలు ఉర్దూ నుండి తెలుగు భాషలోకి ప్రవేశించాయి.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
గొల్ల రామవ్వ సంభాషల్లోని ఔన్నత్యాన్ని విశ్లేషించండి?
జవాబు:
గొల్లరామవ్వ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకటనరసింహారావుచే రచించబడినది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదనకత్వంలో వెలువడిన, “గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాట కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్, ‘వాలంటీరును, విప్లవకారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతి వృత్తం. ‘గొల్ల రామవ్వకథ. తెలంగాణ పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె. అందులో గొల్ల రామవ్వ తన పదియేనేండ్ల, మనవరాలితో కలిసి ఉంటుంది. ఆమె ప్రతి సంభాషణ ఉన్నత విలువలను గలినదే! అర్థరాత్రి తనింటికి దొంగలా ప్రవేశించిన యువకుని రజోకారో పోలీసోడో అని భావించింది. “నేను పోలీసోన్ని కాను రజోకార్నుకాను” అన్నమాటలో నమ్మలేక “అబ్బా ఎంతకైనా తగుతారీ రాక్షసులు! ఔను ముందుగా తీయని మాటలు అవి సాగకపోతే అన్యోపాయాలు – అదే కదా. క్రమం అయింది. ఆ వ్యక్తి రెండు కాళ్ళు పట్టుకుని “బాంచెన్! చెప్పులు మోత్తా నా తలకాయైనా తీసుకో, పోర్ని మాత్రం ముట్టకు, అది నీకు చెల్లెలనుకో, నీ కాల్లు మొక్కుత! అంటుంది.

యువకుడు విప్లవకారుడని తెలుసుకుని ఉపచారాలు చేస్తుంది. ఆమె మనస్థితి కాయకల్పమైంది. “ఇదేం గతిరానీకు! గిట్లెందుకైనవు కొడకా! అంది. వెళ్ళిపోతానన్న యువకుని “ఆ మాపోతా! మా పోతా… ఒక్కటే పోకడ! చక్కంగ స్వర్గమే పోతా! హు పోతడండ యాడికో” అని నిలువరించింది.

రాజోలిగే ఉన్నవు కొడకా! నీవెందుకొచ్చెరా ఈకట్టం? పండుపండు గొంగల్లపండు” అని అతనిపై గాఢనిద్రలోని వెళ్ళేట్లు ఓదార్చింది. మనవరాలిని పిలిచి దీపం వెలిగించి ఆ యువకుని శరీరంపై గుచ్చుకున్న ముళ్ళను తీసేయమని చెప్పింది. “మా చేత్తవులే సంసారం! ఇక కూకోవాని పక్క ముండ్లు తీసెయి ఉల్లుల్లుగ అయ్యో సిగ్గయితాందా వాని ముట్టుకుంటె, ఏం మానవతివి గదవే! నీ సిగ్గు అగ్గిలబడ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గను కుంట! ఊ చెయ్యి చెప్పినపని. పాపం పీనుగోలె పడున్నడు గాదె! వాని జూత్తె జాలి పుడుతలేదె నీకు! ఆ! గట్ల! నొప్పించకు పాపం” అమ్మ సంభాషన తీరిది.

యువకుని లేసి “ఇగ లే కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లల పిసుక్కచ్చిన ………. గింత కడుపుల పడేసుకో! ఎన్నడన్న తాగినావు తాతా గట్క? వరి బువ్వ తినెటోనికి నీకే మెరుక? గొల్లరామి గల్కుంటే ఏమనుకున్నా? పోయేపానం మరుతది. చూడు మరి – కులం జెడిపోతవని భయపడుతున్నావా? నువ్వు యేకులమోడవైనా సరే – మొదలు పానం దక్కిచ్చుకో…. తాగి పారెయ్యి గటగట” అంటుంది..

రాత్రి ఇద్దరు పోలీసోల్లను మట్టుపెట్టిన అని యువకుడు అనగానే అవ్వ “ఇద్దరా! కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడకా! సగంపనే చేసినవు” అంటుంది. పోలీసులు ఇంట్లోకి వచ్చి యువకుని వైపు చూపిస్తూ “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడాయేం”అంటే “వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నవా? నిన్నెవడన్న గట్లనె అడుగితే ఎట్లుంటది! ఈ మాటల్తోటి మనం దీసుడెందుకు పానం తియ్యరా దుండి! నా బుద్దెరిగిన కాన్నుంచి నీనైతగింతచే ఇజ్జతి మాట యెవ్వల్ల నోట్నుంచి యినలే! అంటుంది. రామవ్వ సంభాషచతురత అద్భుతమైంది అని ఈ సంభాషణ వలన తెలుస్తుంది.

ప్రశ్న 2.
ఈ కథ ఆధారంగా హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాలను చర్చించండి?
జవాబు:
‘ఇన్సానియత్’ అను పాఠ్యభాగం డా. దిలావర్ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను తెలియ చేస్తుంది. కులాలు మతాలు అనే భేదం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు, పరస్పర సహకారాలు, సహజీవన సంస్కృతిని తెలియపరస్తుంది. కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతాలలోకి – వ్యాపించడం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్నతమైన మానవీయ అనుబంధాలను ఈ కథ వివరిస్తుంది. వర్తమాన- సమాజంలో లుప్తమవుతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానాలపై ఆత్మవిమర్శ చేసుకోమని తెలియచేస్తుంది.

పూర్వం గ్రామాలలోని ప్రజలంతా కుల మత భేదం లేకుండా అందరూ అందర్నీ అత్తా, అక్కడ, బావా, అత్తా,మద్దీ, మామ అని పిలుచుకునేవారు. వారి మధ్య ప్రేమాభిమానాలకు కుల మతాలు అడ్డు వచ్చేవికావు. ఎంతపెద్ద కులంలో పుట్టినా వారిలో కూడా మిగిలిన వారి పట్ల ఆత్మీయానురాగాలు ఉండేవి. ఒకరినొకరు చక్కగా గౌరవించుకునేవారు. దీనికి నిదర్శనం, ఈ కథలోని రాధమ్మత్త, సోందుబాబుల మధ్య జరిగిన సంభాషణలే!

ముస్లిం అయిన సోందుబాబు హిందువైన రాధమ్మను అత్తమ్మా అని పిలవడం ఇందుకు ఒక ఉదాహరణ.

“ఏం! రాధత్తమ్మా! అంత మంచేనా!” అని సోందుబాబు అంటే “బానే ఉన్న పోరగా! మీరంతా మంచేనా” అని రాధమ్మ అనటంలో వారి మధ్య ఉన్న ఆప్యాయత అను రాగాలు మనకు అర్థమౌతాయి.

అలాగే పాతిమా రాంరెడ్డిని “మర్దీ! సీమకు సుత అపకారం చెయ్యని నా కొడుకుని చూసి ఓర్వలేక అల్లా తీస్కపోతన్నడు” అనడం ముస్లిం హిందూ కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయతా, అనుబంధాలకు ఒక నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది”.

“మర్దీ! కడుపుకోత ఎట్ల అగులు బుగులుగ ఉంటదో అనుబగిత్తన్నా! నా కొడుకును మట్టిల గల్పుకుంటున్నా. నా కొడుకు పానం వంటిదే నీ కొడుకుపానం” నా కొడుకు హయత్ సుత బోస్కొని నీ కొడుకు నిండు నూరేళ్ళు బత్కాలే” అనటం “మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గాని కులము మతము కాదన్న మానవతను, ఆత్మీయ అనుబంధాలను తెలియచెప్తుంది.

ప్రశ్న 3.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించ బడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది. యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని, చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తనతల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత. పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ? చదువుకుంది. సంస్కారం ఉంది. మరీ అంత అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేను. నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి. నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.

నా గురించి మీరు ఇల్లు అమ్ముకుని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిత్వం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను. నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది. ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను.

మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడే వాడు దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొవాలి. ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి తనతోపాటు స్త్రీ జాతి కంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

ప్రశ్న 4.
‘బిచ్చగాడు’ కథలోని రచయిత అభిప్రాయాలను పరిశీలించండి?
జవాబు:
‘బిచ్చగాడు’ అను పాఠ్యభాగం ‘అంపశయ్య నవీన్’ చే రచించబడింది. నవీన్ రచించిన . ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది. నవీన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి పదవీరమణ పొందారు.

ప్రపంచంలో అనేక రకాల దోపిడీలు మోసాలు జరుగుతున్నాయి. అందులోను శ్రామికులు కార్మికుల జీవితాలలో జరిగే దోపిడీలు అత్యంత భయంకరమైనవి. మానవతా విలువలను దిగజార్చేచవని నవీన్ గారి అభిప్రాయం. రోజువారి కూలీపనులు చేస్తూ సంచార జీవన చేసేవారిలో దారిద్య్రం, దైన్యం కన్పిస్తుందని అటువంటి వారిని కూడా దోపిడీ చేసే మనస్తత్వం గలవారు మన సమాజంలో ఉన్నారని వారిలో మార్పురావాలన్నది నవీన్ భావన. రోజూ అడుక్కుంటూ పొట్టపోసుకునే వ్యక్తులు దోపిడీకి గురి అవటం శోచనీయం అంటారు నవీన్. ఇలాంటి వారు గౌరవనీయమైన వృత్తులలో ఉన్నవారి చేతుల్లోనే దోపిడీకి గురి అవుతున్నారు. అందుకు ఈ కథ ఒక ఉదాహరణం.

టికెట్ దొరకలేదని లబోదిబో మంటూ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి బిచ్చగాడిని చూసి ఒక పెద్దమనిషి ఇష్టమెచ్చినట్లు తిట్టడం రచయిత తప్పుపడతాడు. బిచ్చగాడు టికెట్ దొరకక తన వారినందరిని బండి దిగిపోండన్నప్పుడు ఆ పెద్ద మనిషి అన్న మాటలు ” అరె వోరి పిచ్చిగాడిద కొడకా, నీ బండెడు సామాను దించే వరకు బండి ఆగుతుందిరా! ఈ మాటలు మానవత్వానికి మచ్చ అని రచయిత అభిప్రాయం.

“పాపం వాళ్ళలా బిక్కచచ్చి యేడుస్తుంటే మీరు ఇలా నవ్వటం ఏమిటి? అని వాళ్ళందరిని రచయిత గద్దించాలనుకున్నాడు. నేనలా అంటే నన్ను పిచ్చివాడిలా భావిస్తారేమోనని రచయిత భయమేసి ఊరుకున్నాడు. టి.టి బిచ్చగాడిని గద్దించి డబ్బురాబట్టడానికి ప్రయత్నిస్తుంటే, రచయిత టీ. టీగారూ! అతడు చెప్తున్నది కొంచెం విన్పించుకోండి అని ఇంగ్లీషులో మాట్లాడేసరికి కొంచెం టి.టి. తగ్గాడు. ఇక్కడ సత్యానికి విలువలేదు. సభ్యతకు తావులేదు. డబ్బుకే విలువ అన్న అభిప్రాయాన్ని రచయిత తెలియచేస్తున్నారు.

నిండుచూలాలుగా ఉన్న ఆ నిర్భాగ్యురాలిని చూసి ఆ కంపార్ట్మెంట్లో ఉన్నవారికి జాలి కలుగక పోగా ద్వేషపూరిత భావం కలగడం రచయితను బాధించింది. ఇలాంటి దృశ్యాన్నే సినిమాలో చూస్తే అందరూ కళ్ళంట నీళ్ళు కారుస్తారు. మనుషులలో ఈ భిన్న భావావేశాలకు కారణం ఏమిటి? అని రచయిత ఆలోచించాడు. ఎలాగైతేనేం ఆ బిచ్చగాడు. బిచ్చగత్తె లిద్దరి వద్దా డబ్బురాబట్టుకున్నాటు టి.టి. వాళ్ళచేతిలో ఒక రిసీట్ పెట్టాడు.

రచయిత ప్రక్కనే ఉండటంతో ఆ రిసీట్ మీద 22 రూ॥ మాత్రమే రాసుంది అన్న విషయం తెలిసింది. 56 రూపాయలు దండుకున్న టి.టి మోసాన్ని అందరికీ చెప్తామనుకున్నాడు రచయిత. కాని ఇవన్నీ మామూలే అని పెదవి విప్పలేకపోయాడు రచయిత. దోపిడీ చేసేవారికి ఉచ్చనీచాలు లేవని రచయిత అభిప్రాయంగా మనకు అర్థమౌతుంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
మనలోమన చీలిక మృత్యుదేవకి నాలుక.
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక దీర్ఘ కావ్య సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భము :- కవి మానవులలో ఐకమత్యము యొక్క ఆవశ్యకతను వివరించిన సందర్భం లోనిది.
భావము :- మనమంతా మానవులం. రంగు రూపు వేరైనా మానవజాతి ఒక్కటే. అందుకే మానవజాతి అంతా ఐకమత్యంతో మెలగాలి. లేని ఎడల, మానవుల మధ్య చీలికలు వచ్చిన ఎడల అది జాతి పతనావస్థకు దారి తీస్తుంది. మఋత్యువుకు దగ్గర చేస్తుందని ఇందలి భావం.

ప్రశ్న 2.
రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన ‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను ఖండకావ్యం లోనిది.
సందర్భము :- మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని వివరించిన సందర్భము లోనిది.
భావము :- అందరం మానవులమే. ఒకరినొకరు ద్వేషించు కోవటం ఎందుకు. రాక్షస స్వభావం ఉన్న వారిని కూడా నేను ఆహ్వానిస్తాను అని ఇందలి భావం.

ప్రశ్న 3.
గర్వము మానుటొప్పగున్
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ఏనుగు లక్ష్మణకవిచే రచింపబడిన సుభాషిత రత్నావళి నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము :- విద్యను ఆర్జించిన పండితులతో. ఎలా ప్రవర్తించాలో రాజులకు, డబ్బున్నవారికి కవి తెలియచేస్తున్న సందర్భంలోనిది.
భావము :- విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగ జేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయ కాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

ప్రశ్న 4.
కీలువదలిన బొమ్మవలెను నేలబడి పోతున్నది.
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము దున్న ఇద్దాసుచే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు అను గ్రంథం నుండి గ్రహించబడినది.
భావము :- భార్యా, బిడ్డలు, ధనధాన్యాలు నావి నావారున భ్రమలో మానవులు ఉంటున్నారు. ఆ భ్రమ సత్యంకాదు. ఆ భ్రమలో ఉండగనే కీలువదలిన బొమ్మలాగా రాలిపోతున్నామని ఇందలి భావం.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పాఠ్యాంశంలోని కవి ప్రతిపాదించిన త్రికాల దృష్టిని వివరించండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. కవి అనేవాడు. మొదట మానవతా వాది కావాలి. కన్పించే మంచికి చెడుకు స్పందించే మనసుండాలి. గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును తెలుసుకోగలగాలి.
గతకాలాన్ని మంచి కాలంగా భావించి జీవితాలను గడిపే వ్యక్తులను వెక్కిరించే మనస్తత్వ దృష్టి ఉండకూడదంటాడు.

“గతమే జీవిత మనుకుని
వర్తమానమె వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కిలేదంటాడు”

అలాగే గతమంతా శూన్యం జ్ఞాన ప్రదమైన వర్తమానాన్ని మాత్రమే మంచిగా భావించాలను తలపొగరు గలవారిని నిందించే ఆలోచనా చేయకూడదు. గతము వర్తమానము కత్తికి రెండు వైపులా ఉండే పదును. రెండింటిని సమర్థిస్తానన్నాడు.

“గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనుబోను
‘భవిష్యత్తు వదులుకోను”

అని గతాన్ని, వర్తమాన్ని భవిష్యత్తును ఒకటిగా చూసే దృష్టి కలవాడు దాశరథి.

ప్రశ్న 2.
శ్రీకృష్ణుడిని దర్శించేందుకు కుచేలుడు భార్యకు చెప్పిన కారణమేమిటి ?
జవాబు:
శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుట మిక్కిలి శుభదాయకమే. కాని ఆయనకు తీసుకొని వెళ్లుటకై మన దగ్గర ఏదైన కానుక ఉన్నదా ?” అని కుచేలుడు భార్యనడిగెను.అప్పుడు కుచేలుని భార్య ‘సరే’ యని కొన్ని అటుకులను భర్త యొక్క చినిగిన వస్త్రము చివర ముడివేసి ప్రయాణమునకు సిద్ధము చేసినది – శ్రీకృష్ణ సందర్శనోత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరెను. నేనెట్లు ద్వారకా నగరమును చేరగలను ? దివ్వ దీప్తితో ప్రకాశించు అంతఃపురము నేనెట్టు ప్రవేశింపగలను ? సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని ఎట్లు దర్శింపగలను ? నీవెవ్వడవు ? ఎక్కడినుండి, ఎందులకు వచ్చితివి ? అని ప్రశ్నించి ద్వారపాలకులు అడ్డు పెట్టినచో వారికేమైన బహుమానమిచ్చి వెళ్ళవచ్చునన్నచో, నేను డబ్బు లేనివాడును. అయినను ఆయన దయ – నా భాగ్యము. ఆలోచింపగా మరేమి యున్నది ? ఐనను బాలమిత్రుడైన ఆ కృష్ణుడు నన్నేల అశ్రద్ధ చేయును ?” అని తలచుచు కుచేలుడు ద్వారకా నగరములో ప్రవేశించెను.

ప్రశ్న 3.
‘మహైక’లోని ఐకమత్య భావనలను వివరించండి.
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగము ‘కవిరాజు మూర్తి’చే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవిత నుండి గ్రహించబడింది.
“మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి”
మానవులు ఐకమత్యంతో మెలగాలని లేనిపక్షాన మానవజాతికి విముక్తి లేదన్నాడు. అన్నదమ్ములుగా జాతివర్ణ భేదం లేకుండా చేయి చేయి కలిపి ముందుకు నడవాలి. అందుకు అక్క చెల్లెళ్ళు ఆనందగీతికలను ఆలపిస్తూ చైతన్యంతో అందరిని ఏకతాటిపైకి తీసుకురావాలి. అదే భూమికి నూతనత్వం అన్నాడు.

“రంగులు జాతులు
కావు మనకు జ్ఞాతులు
మనమంతా మానవులం
కలయికలో ఉంది జయం”

రంగులు, జాతులు అని చూడకుండా మనమంతా మానవులం అనే భావనతో ఐకమత్యంగా ఉండాలని లేని యెడల.
“మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక”
అని ఐకమత్యాన్ని గురించి ‘మహైక’ కవితలో మూర్తిగారు వివరించారు.

ప్రశ్న 4.
సజ్జనుడి మాట తీరును తెలపండి?
జవాబు:
మేఘుడు నీటి బిందువులనే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరమే వడగండ్లను కురిపించినను, అవి వెంటనే చల్లని నీళ్ళగునుమారి రాళ్ళుగా ఉండవు. అదే విధంగా మంచివాడు మంచి మాటలనే పల్కును. ఒకానొక సమయమందున కఠోర వచన మును పలికినను మేలుగానే ఉంటుంది కీడుగా ఉండవు.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
‘తాత జాగీరు’ జాతీయంలోని చారిత్రక విశేషాలను తెలపండి ?
జవాబు:
కష్టార్జితం కాని సంపద, అనువంశికంగా సంక్రమించిన ఆస్తి, నైజం ప్రభువులు తమ రాజరికాన్ని కాపాడుకోవటానికి జీతం లేని కొలువులు ఎన్నో ఏర్పాటు చేశారు. పటీలు, మావిపటీలు, పట్వారీ, కొత్వాలి వంటివి అనువంశికంగా సంక్రమించేవి. ఈ పనికి జీతం లేకపోయినా ప్రజలకు వీళ్ళు ఎంత దోచుకున్నా తమ సొమ్ము ముట్టచెపితే చాలు. ఆ విధంగా జమీందారులు, జాగీరుదారులు, ముక్తాదారులు, దేశాయిలు, సర్దేశాయిలుండేవారు. జమీందారుకు కొన్ని గ్రామాల్లో వేలాది ఎకరాల భూములు ఉండేవి. ముక్తాదారులంటే ఆ గ్రామమంతా ఆయనదే! ప్రజల వద్ద ఎంత దోచుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు. కప్పం చెల్లిస్తే చాలు. తాత గారి జాగీరును మనుమడు అనుభవిస్తున్నట్లు “ఇదేమన్నా నీ తాతగారి జాగీరనుకున్నావా” అన్న జాతీయాలు ప్రయోగించడం జరుగుతుంది.

ప్రశ్న 2.
తెలంగాణా తెలుగులో యథాతదంగా చేరిన ఉర్దూ పదాలను తెలపండి ?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామన సదాశివచే రచించబడింది. డా.సి.నారాయణరెడ్డి సంపాదకీయంగా వెలువబడి. ‘వ్యాస గుళుచ్ఛం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.

ఒక భాషలోని పదాలు మరొక భాషలోకి చేరేటప్పుడు వారి రూపు రేఖలు మారటమో లేక అర్థం మారటమో జరుగుతుంది. అలా కాకుండా తెలంగాణ తెలుగు బాషలో ‘ఉర్దూ పదాలు యథాతదంగా చేరాయి. అలాంటి పదాలలో కలము, కలందాస్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము, రోజు, కూలీ, బాకీ, గురుజు, బజారు, దుకాణం, మాలు, జబరద్దస్తీ, జోరు, మొదలగు పదాలున్నాయి. ఇవన్నీ యథాతదంగా ఎలాంటి మార్పును పొందకుండా తెలుగులోకి వచ్చిన ఉద్దూపదాలు.

ప్రశ్న 3.
పురాణాలు ఎవరిపైన దయచూపాలని చెప్పాయి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా విలువలు అను పాఠ్యభౄగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. దీనిలో మానవతా వాదం ప్రాచీన సాహిత్యంలో ఎలా వివరించబడిందో రవ్వా వారు వివరించారు.

మన పురాణాలు పట్టి పురాణాలు కావు. వాటిలో మానవులందరూ సుఖంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ప్రగతిని సాధించాలి. ఏ ఒక్కరూ దుః ఖంతో జీవించరాదు అని వివరించాయి. కేవలం మానవులందే కాకుండా పశుపక్ష్యాదుల పైన కూడా దయ, జాలి కరుణలను చూపించాలని ప్రబోధించాయి. క్రిమికీటకాదుల పైన, పశుపక్ష్యాదులపైన, ఏ కులం వారిపై నైనా, పతితుతలపైన వర్ణసాంకర్యం గల వారిపైన దయాగుణాన్ని చూపాలని పురాణాలు వివరించాయి. చివరికి తృణ వృక్షాదులను కూడా జీవంగల వానిగా భావించి వారికి ఏ విధమైన హానిని కలిగించకుండా కాపాడుకోవాలని మన పురాణాలు వివరించాయి.

ప్రశ్న 4.
‘బసవపురాణం’ కావ్యం గురించి సంక్షిప్తత్తంగా రాయండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ రచించిన ‘చైతన్యలహరి’ అను వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది.

బసవపురాణం పాల్కురికి ద్విపద రచన. ఆయన ఒకనాడు శ్రీశైల క్షేత్రమును దర్శించి అక్కడ భక్తుల ద్వారా బసవేశ్వరుని దివ్య చరితమును విని బసవపురాణాన్ని రచించాడు. ఈ ద్విపద కావ్యంలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటుగా ఈ కావ్యంలో 75 మంది శివభక్తుల కథలున్నాయి. ఈ కావ్యమందు సోమనాథుని కథా కథననైపుణ్యం కన్పిస్తుంది. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవి కథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నకప్ప కథ, మడిమేలు మాచయ్య కథలు చక్కగా వర్ణించబడ్డాయి.

సోమనాథుని రచనా రీతిలో అంత్యానుప్రాసల ప్రభావం అధికం. ఇది పోతన లోని అంత్య ప్రాసరచనకు కారణమైందని చెప్పవచ్చు. ద్విపద రచనలలో సోమనాథునికి మంచిపేరు తెచ్చిన కావ్యం బసవపురాణం.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
దాశరథి కృష్ణమాచార్యులు గారి కవి పరిచయం
జవాబు:
“నా తెలంగాణ కోటిరతనాల వీణ” అని నినదించిన కవి దాశరథి. పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని “మైగ్”గా అమర్చిన కవి. జూలై 22, 1925న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చినగూడూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వేంకటమ్మ వేంకటాచార్యులు. తల్లిదండ్రులు ఇద్దరూ సాహిత్యాభి రుచి గలవారే! ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయం చేశారు. ఖమ్మంలో హైస్కూలు విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ ఆంగ్లం చదివారు.

అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం అమృతాభిషేకం, కవితాపుష్పం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం, వంటి పద్య వచన రచనలు చేశారు. “మహాబోధి” వీరి కథాకావ్యం నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా వంటి గేయాలు రచించారు. గాలీబు గీతాలను తెలుగులోనికి తీసుకువచ్చారు. నవమి నాటి కల సంపుటి, దాశరథి శతకం, వందలాది సినిమా పాటలు దాశరథి కలం నుండి జాలువారాయి.

దాశరథి తెలుగు సాహిత్యానికి చేసిన సేవను గుర్తించి ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ను ఇచ్చాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం, “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలను అందించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవిగా కొంతకాలం పనిచేశారు. నవంబరు 5, 1987న దాశరథికాలం చేశారు.

ప్రశ్న 2.
దున్న ఇద్దాసు గారి కవి పరిచయం
జవాబు:
దున్న ఇద్దాసు గొప్ప తత్త్వకవి, ప్రముఖ వాగ్గేయకారుడు ఈయన నల్గొంజిల్లా చింతపల్లి గ్రామంలో క్రీశ 1811-1919 మధ్య కాలంలో జీవించారు. తల్లిదండ్రులు దున్న రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తత్వకారుడయ్యాక ఇద్దాసు అయ్యాడు. ప్రముఖ పరిశోధనకుడు డా. బిరుదు రాజు రామరాజు ఇద్దాసును “మాదిగ మహాయోగి” గా అభివర్ణించాడు.

ఇద్దాసు చింతపల్లి గ్రామంలో మోతుబరి ఇంటి పశువుల కాపరి. రోజూ బావి దగ్గర “మోటకొడుతూ” ఆనువుగా గీతాలను ఆలపించేవాడు. ఆ గీతాలను విన్న వరసిద్ధ జంగమదేవర “పూదోట బసవయ్య” ఇద్దాసు పంచాక్షరీ మంత్రోపదేశం చేశారు. లింగధారణ చేయించి శైవునిగా మార్చాడు. అడవులలో సందరిస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంలో సాధన చేశాడు. దానితో ఆయన అష్టసిద్ధులను పొందాడు. పూర్వతాత్విక కవులైన శివరామదీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరాంబల ప్రభావం ఇద్దాసుపై ఉంది. ఈయన ఈశ్వరాంబ సంప్రదాయాన్ని అనుసరించాడు. ఆమె సమాధి సందర్శనకు ఇద్దాసు కందిమల్లయ్యపల్లెను దర్శించాడు.

ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా వీరశైవ తత్త్వ జ్ఞానిగా కన్పిస్తాడు. పఠేల్, పట్వారీలు ఇద్దాసుకు శిష్యులయ్యారు. సంచార యోగిగా నల్గొండ నుండి మహబూబ్ నగర్ వరకు తిరుగుతూ అధ్యాత్మికతను ప్రచారంచేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లి, పోలేపల్లి, ఆవులోని బాయి మొదలగు చోట్ల ఈశ్వరమ్మ పీఠాలను స్థాపించాడు.

ఇద్దాసు 30కి పైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వచ్చిన “శ్రీ దున్న ఇద్దాసు తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

ప్రశ్న 3.
వేముల పెరుమాళ్ళు గారి కవి పరిచయం
జవాబు:
వేముల పెరుమాళ్ళు కరీంనగర్ జిల్లా రాయికల్ గ్రామంలో ఆగష్టు 5, 1943న జన్మిచారు. ఈయన తల్లిదండ్రులు వేముల ఆండాళ్ళమ్మ-రాజయ్యలు, మాతా మహుడు కైరం భూమదాసు వరకవి గాయకుడు. వీరి విద్యాభ్యాసం రాయకల్ కోరుట్ల జగిత్యాలల్లో జరిగింది. గ్రామాభివృద్ధి అధికారిగా 18 సం॥లు పనిచేశారు. తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి రాయికల్ మండల అధ్యక్షునిగా పనిచేశాడు. సహకార రంగంలో గీత, పారిశ్రామిక కాంట్రాక్ట్ లేబర్, వినియోగ, గృహనిర్మాణ సంఘాలను స్థాపించాడు.

పెరుమాళ్ళు శ్రీరాజరాజేశ్వర, శ్రీధర్మపురి, నృకేసరి శతకాలను ప్రచురించారు. బాల సాహిత్యంలో వీరు బాలనీతి శతకం. ‘కిట్టూ’, పర్యావరణ శతకం ‘నిమ్ము’లు రాశారు. మహాత్ముని మహనీయ సూక్తులను “గాంధీమార్గం” త్రిశతిగా రచించాడు. రాజనీతి చతుశ్శతిగా వీరు “లోగుట్టు” రాశాడు. 1958 నుండి 1968 వరకు సమాజంలో జాతీయ పరిణామాలను పద్యాలుగా రాశాడు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ఈయన “మానవతా పరిమళాలు” ప్రసంగాలుగా వెలువడ్డాయి. జీర్ణదేవాలయ పునరుద్ధరణ చేశారు. వీరు సెప్టెంబరు 17, 2005న కాలం చేశారు.

ప్రస్తుత పాఠ్యభాగం “తెలంగాణ జాతీయాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

ప్రశ్న 4.
సురవరం ప్రతాపరెడ్డి గారి కవి పరిచయం
జవాబు:
తెలంగాణ, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఈయన మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానానికి కేంద్రమైన బోరవెల్లి గ్రామంలో జన్మించారు. వీరి స్వగ్రామం. ఇటిక్యాలపాటు. వీరి తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణరెడ్డిలు.

సంస్కృత వ్యాకరణంతోపాటు ఎఫ్.ఎ., బి.ఏ.బి.ఎల్ చదివారు. తొలుత న్యాయవాదిగా తరువాత పత్రికా సంపాదకుడిగా, సామాజిక కార్యకర్తగా సాహిత్య కారునిగా మారాడు. తెలుగుభాష, తెలంగాణ భారతీయ సంస్కృత జీవనంపై పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు.

1926లో తెలంగానలో పత్రికలకు ప్రాతినిద్యం లేని కాలంలో గోల్కొండ పత్రికను స్థాపించారు. ఆ పత్రికకు 20 సం॥ల కాలం సంపాదకునిగా పనిచేశారు. తన అమూల్యమైన సంపాదకీయాలతో సృజనాత్మక రచనలతో సామాజిక చైతన్యాన్ని పెంపొందించారు. ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అన్న విమర్శకు జవాబుగా 1935లో 354 మంది తెలంగాణ కవులను పరిచయం చేస్తూ “గోల్కొండ కవుల సంచికను వెలువరించాడు. 1931, 1953 వరకు జరిగిన సామాజిక పరిస్థితులు ప్రతిబింబించేలా మొగలాయి కథలను రచించారు. 1948లో సురవరం వారు రాసిన “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” పరిశోధన గ్రంథానికి 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి గ్రంథమిది.

ఆంధ్ర విద్యాలయం, ఆంధ్రసారస్వత పరిషత్ వంటి సంస్థల స్థాపనకు విశేషకృషి చేశారు. ఆంధ్రమహాసభకు తొలి అధ్యక్షుడు సురవరం, శాసనసభ్యునిగా పనిచేశారు. “ప్రజావాణి”. పత్రికను కూడా నడిపారు. గ్రంథాలయం ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రజల చైతన్యానికి దోహదపడ్డారు. భక్త తుకారం, డచ్చల విషాదము అన్న నాటకాలు. హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు మొదలైన 40 గ్రంథాలు రచించారు. తెలుగు సామాజిక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేసిన సురవరం ఆగష్టు 25, 1953న కన్నుమూశారు.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
మానవజాతికి ఎప్పుడు మేలు కలుగుతుంది?
జవాబు:
మానవత్వంతో మెలగినపుడు

ప్రశ్న 2.
ఇద్దాసు ఎవరి సమాధిని దర్శించాడు?
జవాబు:
కందిమల్లయ్యపల్లెలో ఉన్న ఈశ్వరాంబ సమాధిని దర్శించాడు.

ప్రశ్న 3.
దుర్జనులు ఎలాంటి ఆలోచనలను చేస్తారు ?
జవాబు:
చెడ్డ ఆలోచనలు

ప్రశ్న 4.
కాలాన్ని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
కంఠ మాలతో పోల్చాడు

ప్రశ్న 5.
నన్నయ ఎవరి ఆస్థానకవి?
జవాబు:
రాజరాజ నరేంద్రుడు

ప్రశ్న 6.
కుచేలుడు శ్రీకృష్ణుని ఇచ్చేందుకు ఏమి తీసుకొని వెళ్ళాడు ?
జవాబు:
అటుకులు.

ప్రశ్న 7.
దున్న ఇద్దాసు ఏఏ కోణాల్లో కన్పిస్తాడు?
జవాబు:
తత్త్వవేత్తగా, అచలునిగా, వీరశైవతత్త్వజ్ఞానిగా పలుకోణాల్లో కన్పిస్తాడు.

ప్రశ్న 8.
పువ్వులు పరిమళాన్ని ఎప్పుడు వ్యాపింపచేస్తాయి?
జవాబు:
తోటమాలి బలిదానం చేసినపుడు

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
‘లాట్ సాహెబ్’ పదానికి మూల పదం ఏది ?
జవాబు:
‘లాట్ సాహెబ్’ అనే పదానికి మూల పదం ‘లార్డ్’ అనే ఆంగ్లపదం.

ప్రశ్న 2.
బతుకమ్మ పాటలలోని పల్లవులు ఏవి ?
జవాబు:
ఉయ్యాలో, వలలో, చందమామ అనునవి బతుకమ్మ పాటలలో పల్లవులు.

ప్రశ్న 3.
మానవతా దృక్పధానికి మూలమేమి ?
జవాబు:
మానవతా దృప్పథానికి మూలం ‘ప్రేమ’

ప్రశ్న 4.
‘సంచ్’ ఎవరు.
జవాబు:
‘సంచ్’ ఆ కాలంలో ఉన్న పోలీసు శాఖామంత్రి.

ప్రశ్న 5.
బసవపురాణంలో ఎంతమంది భక్తుల కథలున్నాయి ?
జవాబు:
బసవపురాణంలో 75 మంది శివభక్తుల కథలున్నాయి.

ప్రశ్న 6.
జానపదుల నోటి నుండి వెలువడ్డ జాతీయం సామెత ఎలాంటిది ?
జవాబు:
గంగలో రాయివంటిది.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

ప్రశ్న 7.
‘సామల సదాశివ’ రాసిన శతకం ?
జవాబు:
‘సాంబశివ’ శతకం

ప్రశ్న 8.
రావి ప్రేమలత “వ్యాసలతిక”కు లభించిన పురస్కారం ఏది ?
జవాబు:
ఉత్తమ విమర్శన గ్రంథంగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది.

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
పోగొట్టుకున్న సైకిల్ కోసం పోలీస్ స్టేషన్కి లేఖ రాయండి.
జవాబు:

దిలావర్పూర్,
10.08.2023.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు,
పోలీస్ స్టేషన్,
దిలావర్పూర్.

విషయము : నా సైకిల్ దొంగిలింపబడిన విషయం గురించి.
ఆర్యా!
నమస్కారములు.

నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్పూర్ నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను నిన్న కళాశాలకు అట్లాస్ కంపెనీకి చెందిన ఎరుపు రంగు సైకిల్ పై వెళ్ళి, కళాశాల ముందర తాళం వేసి పెట్టి, తరగతులకు హాజరు అయ్యాను. సాయంత్రం వచ్చి చూసేసరికి నా సైకిల్ కనిపించలేదు. దొంగిలించబడినదని నిర్ధారణ అయ్యింది.

దయచేసి నా సైకిల్ గురించి విచారణ చేసి తిరిగి నాకు అప్పగించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విశ్వసనీయుడు
పి. ఆదిత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దిలావర్ ప్పూర్

ప్రశ్న 2.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయండి.
జవాబు:

నల్లగొండ,
26.07.2023.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ.
నమస్కారములు.

విషయము : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు
నిర్దేశము : నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.07.2023.

ఆర్యా,

ఈ నెల తేది 20.07.2020 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.

ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ భవదీయుడు
XXXX

దరఖాస్తుతో జత చేసిన పత్రాలు :

  1. ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
  2. జనన ధ్రువీకరణ పత్రం
  3. స్థానిక ధ్రువీకరణ పత్రం.
  4. ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1) సంగమమైనా
జవాబు:
సంగమమైనా : సంగమము + ఐన – సంగమమైనా – ఉకార సంథి/ఉత్వసంథి
సూత్రము :- ఉత్తనకచ్చు పరంబగునపుడు సంథియగు

2) అణువంత
జవాబు:
అణువంత : అణువు + అంత = అణువంత
ఉకార సంధి/ఉ. త్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

3) ఏడజూచిన
జవాబు:
ఏడజూచిన : ఏడన్ + చూచిన – ద్రుతసంధి/సరళాదేశ సంధి
సూత్రము :- ద్రుత ప్రకృతికముల మీది పరుషములకు సరళములగు.

4) అదెట్లు
జవాబు:
అదెట్లు: అది + ఎట్లు = ఇకారసంధి
సూత్రము :- ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పకముగాను.

5) దర్శనోత్సాహి
జవాబు:
దర్శనోత్సాహి : దర్శన + ఉత్సాహి = గుణ సంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ వర్ణములు పరమైనచో క్రమముగా ఏ, ఓ, అర్ – లు ఏకాదేశమగును.

6) పాలికిఁబోవ
జవాబు:
పాలికిఁబోవ = పాలికిన్ + పోవన్ = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుతము మీది పరుషములకు సరళములాదేశమును ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషం విభాషనగు

7) భానోదయము
జవాబు:
భానోదయము : భాను+ఉదయము = సవర్ణదీర్ఘసంధి
సూత్రము :- అ, ఇ, ఉ, ఋ వర్ణములకు సవర్ణములైన అచ్చులు పరమైనచో వానికి దీర్ఘములు ఏకాదేశమగును.

8) దివ్యాంబర
జవాబు:
దివ్యాంబర : దివ్య + అంబర = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1) ఆహ్లాదగీతిక
జవాబు:
ఆహ్లాదమైన గీతిక – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

2) ఆలు పిల్లలు
జవాబు:
ఆలియును పిల్లలును – ద్వంద్వసమాసం

3) దయార్ధ దృష్టి
జవాబు:
దయార్ద్రమైన దృష్టి – విశేష పూర్వపద కర్మధారయ సమాసము

4) ధనపతి
జవాబు:
ధనమునకు మతి – షష్ఠీతత్పురుష సమాసం

5) శీతల నీరము
జవాబు:
శీతలమైన నీరము – విశేషణ పూర్వపదకర్మధారయ – సమాసం

6) మనోజ్ఞభావి
జవాబు:
మనోజ్ఞమైన భావి – విశేషణ పూర్వపద కర్మధారయము

7) ద్వారకానగరంబు
జవాబు:
ద్వారక అను పేరుగల నగరము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము

8) మహాశక్తి
జవాబు:
మహాతైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయము

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

XIV. ఈ క్రింది అంశాలలో ఒక దానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
జవాబు:
ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు.

చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి. తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం.

తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి.

తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం. వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్ట మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి.

శాతవాహన కాలపు మట్టికోటల ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహ నులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు.. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 – 1686) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724 – 1948) తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత -ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్ ‘ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగ నగర్’ అనే పేరొచ్చింది.

వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి. పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ద సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.

రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారదకథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండి సాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.

తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం.

2. జాతీయ విపత్తులు.
జవాబు:
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని.

అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.
విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు.

విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి.

దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు – ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

3. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
ఒకదేశ అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం.

ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness) : ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy) : పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill) : మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత
సంపాదించుకోవాలి.

4. భావోద్వేగాల నియంత్రణ (Management of emotions) : యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill) : సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.

ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making) : సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking) : ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking) : యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీ యువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావన నిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. There is plenty of water in that region.
జవాబు:
ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది.

2. Learn as if you live forever.
జవాబు:
ఎప్పటికీ జీవిస్తావన్నట్లుగానే నేర్చుకోవాలి.

3. Reading is to the mind what exercise is to the body.
జవాబు:
శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది.

4. I completed reading the book yesterday.
జవాబు:
నేను పుస్తకం చదవటం నిన్న పూర్తి చేశాను.

5. Sometimes, later becomes never do it now.
జవాబు:
కొన్నిసార్లు, తరువాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చెయ్యాలి.

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

సాహిత్య ప్రక్రియల్లో నాటకం శక్తివంతమైన ప్రక్రియ. సంస్కృతంలో ‘కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం ‘ అని నాటక ప్రాశస్త్యాన్ని పండితులు ప్రశంసించారు. కాళిదాసు వంటి మహాకవులు నాటక ప్రక్రియను దృశ్యకావ్యంగా మలచి అద్భుతమైన నాటకాలను రచించారు. ప్రాచీన సాహిత్యంలోని నాటక ప్రక్రియకంటే భిన్నంగా పాశ్చాత్య నాటకాల ప్రభావంతో ఆధునిక తెలుగునాటకం రూపుదిద్దుకుంది. 1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన ‘మంజరీ మధుకరీయము’ మొదటి తెలుగునాటకం.

సంస్కృతనాటకాలు ఐదు నుండి పది అంకాల నిడివివుండేవి. తెలుగునాటకాలు మాత్రం మూడు, నాలుగు అంకాలుగానే ప్రదర్శితమయ్యేవి. కాలక్రమేణా నాటకం అంక విభజనను వదిలేసి కథానుగుణంగా రంగాలుగా విభజిస్తున్నారు. కాలపరిమితి గంట, రెండుగంటల మధ్య సంక్షిప్తంగా, సన్నివేశ గాఢత, సంభాషణా ప్రాధాన్యతతో నాటకాలు ప్రదర్శితమవు తుంటాయి. నాటికలు, ఏకాంకికలు నాటకశాఖకు చెందిన ఉపప్రక్రియలే.

‘ఆంధ్రనాటక పితామహుడి’గా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ‘విషాదసారంగధర’ నాటకం పాఠ్యాంశంగాను చదువుకోవడం విశేషం. ధర్మవరం తరువాత కోలాచలం శ్రీనివాసరావు చారిత్రక, ఇతిహాస నాటకాలు రచించి ‘ఆంధ్రచారిత్రక నాటక పితామహుడు’గా పేరుగాంచాడు. ‘ధార్వాడ’, పార్సీ నాటకసమాజాల వల్ల కూడా తెలుగు ప్రాంతంలో నాటక ప్రక్రియ ప్రాచుర్యం పొందింది.

కందుకూరి వీరేశలింగం ‘వ్యవహారధర్మబోధిని’ నాటకం 1880 ప్రాంతంలో తన చారిత్రక బాధ్యతను నిర్వర్తిస్తూ నాటక ప్రక్రియకు వ్యాప్తిని అందించింది. తెలుగునాట అనేక నాటక సమాజాలు ఏర్పడి ప్రజలలో నాటక అభిరుచిని, చైతన్యాన్ని కలిగించాయి. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ మొదటి వ్యవహారిక, సాంఘిక నాటకంగా సంచలనాన్ని సృష్టించింది. 1911లో చందాల కేశవదాసు రాసిన ‘కనకతార’ తెలంగాణ నుండి వచ్చిన తొలి నాటకంగా భావిస్తున్నారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
మొదటి తెలుగు నాటకం ఏది?
జవాబు:
మంజరీ మధుకరీయము

ప్రశ్న 2.
‘ఆంధ్రనాటక పితామహుడు’ ఎవరు?
జవాబు:
ధర్మవరం రామకృష్ణమాచార్యులు

ప్రశ్న 3.
కందుకూరి రాసిన నాటకం పేరు?
జవాబు:
వ్యవహారధర్మబోధిని

ప్రశ్న 4.
వ్యవహారిక భాషలో వెలువడిన తొలి నాటకం ఏది ?
జవాబు:
కన్యాశుల్కం

5. ‘కనకతార’ నాటకకర్త ఎవరు?
జవాబు:
చందాల కేశవదాసు

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 7 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి.

ప్రశ్న 1.
తే. బహువిధ …….. జనులు.
జవాబు:
తే. బహువిధ వ్యూహ భేదనోపాయములను
సంప్రయోగ రహస్యాతిశయము గాఁగఁ
గఱపె నర్జునుఁ దొంటి భార్గవుఁడు
వింట నిట్టిం డే!యని పొగడంగ నెల్ల జనులు.

భావము : అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకు, అతని గురుభక్తికి ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అన్నా! నీకంటే వేరెవ్వరూ అధికులు కానట్లుగా విలువిద్య నేర్పిస్తానన్నాడు. ద్వంద్వయుద్ధ, సంకులయుద్ధ పద్ధతులను, రథం మీద నేలమీద, గుర్రాల మీద, ఏనుగులమీద ఉండి దృఢం చిత్రం, సౌష్ఠవం అయిన స్థితులలో బాణాలు వేయటాన్ని, బహువిధాలైన వ్యూహాలను ఛేదించే ఉపాయాలను, బాణ ప్రయోగ రహస్యాలను ఇది వరకటి ఆ పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడుకాడని ప్రజలు అర్జునుని పొగిడేటట్లుగా అతనికి నేర్పాడు.

ప్రశ్న 2.
అన్నలూ ……… పృథ్వికి నవ్యత్వం
జవాబు:
అన్నలూ
చేతుల్లో చేతులు కలపండి
విశ్రాంతిని విసర్జించి నడవండి
అక్కలూ
ఆహ్లాదగీతిక లాలాపించండి
ఆనందంతో కందళిస్తూ కదలండి
మనందరి ఏకత్వం
పృథ్వికి నవ్యత్వం

భావము : అన్నా తమ్ములు చేతిలో చేయివేసి ముందుకు కదలండి. బద్దకాన్ని వదలివేసి ముందుకు నడవండి. అక్కా చెల్లెళ్ళు మీరు ఆనందకర గీతాలను పాడండి. ఆనందంతో అంకురంలా వికసిస్తూ కదలండి. మనమధ్య ఏకత్వం కావాలి. ఐకమత్యంగా ముందుకు నడవాలి. అపుడే ఈ భూమిపై నూతనత్వం వెల్లివిరుస్తుంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘మిత్రధర్మం’ పాఠ్యభాగ సారాంశం వివరించండి.
జవాబు:
కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులు – వారిరువురు సాందీపుని సన్నిధిలో విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాధిపతియైనాడు. కుచేలుడు దుర్భరమైన దారిద్య్ర బాధ అనుభవించాడు.

కుచేలుని భార్య మహాపతివ్రత, అభిమనవతి. ఆ ఇల్లాలు దారిద్ర్యబాధతో పిల్లలు మలమలమాడిపోబడం చూచి – భర్తను, శ్రీకృష్ణుని దర్శించి – ఆయన అనుగ్రహంతో తమను కాపాడుమని ప్రార్థించు సన్నివేశంతో కథ ప్రారంభమగుచున్నది.

భర్తకు కర్తవ్యోపదేశము చేసిన అర్ధాంగిగా కుచేలుని భార్య – ఎంతటి దుర్భరమైన దారిద్ర్యము అనుభవించినను నోరు తెరచి సహాయమును అర్థింపని అభిమనధనుడుగా కుచేలుడు – అవధులు ఆదరాభిమానాలతో బాల్య మిత్రునికి సర్వ సంపదలను అనుగ్రహించిన ఆర్తజన రక్షకుడిగా శ్రీకృష్ణుడు మనకు ఈ పాఠ్యభాగములో సాక్షాత్కరిస్తారు. కుచేల శ్రీకృష్ణుల మధురమైన స్నేహానికి, శ్రీకృష్ణుని భక్తజన వాత్సల్యమునకు కుచేలోపాఖ్యనం నిదర్శనంగా నిలుస్తుంది.

మహాపతివ్రతయు, అభిమనవతియునైన కుచేలుని భార్య దుర్భరమైన దరిద్రపీడచే క్రుంగికృశించి పోయినది. ఆకలిమంటచే అలమటించుచు, పిల్లలు ఆకులు, గిన్నెలు పట్టుకొని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నము పెట్టుమని యడిగిరి. వారి మాటలు వినినంతనే పట్టరాని దుఃఖముతో భర్త కడకరిగి “ప్రాణేశ్వరా ! ఇంటిలో దారిద్ర్యము తాండ వించుచున్నది. దానిని తొలగించుటకు మార్గమును ఆలోచింపరైతిరి.

మీ బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి, దారిద్య్రమనెడి అంధకారము నుండి మమ్ము కాపాడుము. ఆర్తజన శరణ్యుడు, దయా సాగరుడైన శ్రీకృష్ణుడు మిమ్ములను చూచినంతనే, అపారమైన సంపదలను అనుగ్రహించును. కలలోనైన తనను తలవని నీచుని పైతము, కష్ట సమయములో ఆదుకొను జగత్ప్రభువు, ఎల్లవేళల ఆయనను భక్తితో సేవించు మీకు విశేష సంపదల ననుగ్రహింపడా ?” అని పలికెను.

భార్య మాటలను విని, ఆమె ధర్మయుతమైన వాక్యములకు సంతసించి, శ్రీకృష్ణుని దర్శనము ఇహపరసాధనముగా భావించెను. “నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుటశుభకరమే – ఆ చక్రపాణికిచ్చుటకేమైన కానుకగలదా?” యని అడుగగా ఆ ఇల్లాలు కుచేలుని ఉత్తరీయపు కొంగునకు కొన్ని అటుకులు ముడి వేసెను. గోవింద సందర్శనమునకై వెడలుచున్న ఆనందముతో కుచేలుడు ద్వారకా పట్టణమునకై బయలుదేరెను.

“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమాన మిచ్చుటకు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ – నా భాగ్యము -” అనుకొనుచు కుచేలుడు. ద్వారకా నగరమును ప్రవేశించి, కక్ష్యాంతములు దాటి, అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోద క్రీడలలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుని గాంచి – బ్రహ్మానందమును అనుభవించెను.

అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను.

మంచి గంధమును శరీరమునకు అలదెను. వింజామరలతో గాలి విసరి మార్గాయాసమును పోగెట్టెను. కర్పూర తాంబూలము నొసంగెను. ఆదరముతో గోవును దానము చేసెను. మణిమయ దీపములతో ఆరతి పట్టెను, సాక్షాత్తు రుక్మిణీదేవి కుచేలునికి వింజామరలు వీచెను. ఇట్లు శ్రీకృష్ణునిచే సేవులు చేయించుకొనుచున్న కుచేలుని గాంచి – అంతఃపుర కాంతలు ఆశ్చర్యపడుచు, కుచేలుని అదృష్టమును అనేక విధములుగా ప్రశంసించిరి.

శ్రీమహావిష్ణువు అవతారమగు శ్రీకృష్ణుని చేతను, లక్ష్మీదేవి స్వరూపిణియగు రుక్మిణి చేతను సేవలు పొందిన మహనీయ మూర్తిగా కుచేలుడు ఈ పాఠ్యభాగమందు గోచరించును శ్రీకృష్ణ, కుచేలుల నిర్మలమైన స్నేహమును ఈ పాఠ్యభాగము నిరూపించును.

కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని తాము గురుకులంలో చదివిన రోజులలోని సంఘటనలు గుర్తుచేసాడు. కుచేలుని భార్యా పిల్లల కుశలమడిగాడు. ధర్మనిష్ఠతో, కర్తవ్య నిష్ఠతో జీవించే ఉత్తములను భక్తితో గురువును సేవించే వారిని ప్రేమిస్తాను. మనం గురు నివాసంలో ఉంటు ఒక రోజు కట్టెల కోసం అడవికి వెళ్ళాం గుర్తుంది కదా ! దారి తెన్నూ కనపడకుండా పడిన ఆ కష్ట సమయంలో ఒకరికొకరు ఆసరాగా ఆ అడవిలో చలికి వణుకుతూ గడిపాము. ఇంతలో తెల్లవారడంతోనే మనకోసం గురువుగారు వెతుకుతూ వచ్చి మనలను దీవించారు.

కృష్ణుని మాటలకు పొంగిపోయిన కుచేలుడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని శ్లాఘించాడు. నా కోసం ఏమి తెచ్చావు అని అడుగగా సిగ్గుతో తలదించుకుని కూర్చున్న కుచేలుని ఉత్తరీయం ముడిలో ఉన్న అటుకులను ప్రేమతో తిని అతనికి సకల సంపదలను అనుగ్రహించాడు. తిరిగి ఇంటికి వెళ్ళిన సుధామునికి (కుచేలుడు) ఇదంతా కృష్ణలీల అని గ్రహించి ఆనందించాడు. స్నేహంలో ఆస్తుల తారతమ్యం, ధనిక బీద తేడాలుండకూడదని శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా లోకానికి చాటి చెప్పాడు.

ప్రశ్న 2.
ఏనుగు లక్ష్మణకవి తన పద్యాల ద్వారా అందించిన నీతిని వివరించండి?
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. లక్ష్మణకవి సంస్కృతంలో భర్తృహరి రచించిన, సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నావళిగా అనువదించారు. సుభాషిత రత్నావళి నీతి, శృంగార, వైరాగ్య, శతకాలని మూడు భాగములు. రత్నావళిల పద్యాలు అవి మనోహరంగా, యథామూలంగా, సందర్భోచితంగా ఉంటాయని విమర్శకుల భావన.

లక్ష్మణకవి నీతి శతకంలో అనేక విషయాలు తెలియచేసాడు. కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముత్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.

విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగజేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయకాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదాల విందాలను శిరస్సున దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం- ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

ఇలా ఏనుగు లక్ష్మణకవి తెలుగులో అనువదించిన నీతి శతకాలలోని నీతి అన్ని కాలాలకూ వర్తిస్తుంది. విద్యార్థులకు పెద్దలకు అందరికీ వారి నిజ జీవితంలో ఉపయోగపడేలా, ఎలా మసలుకోవాలో అనేక ఉపమానాలు సుమధురంగా నీతిని ప్రబోధించారు.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
భాషల మధ్య జరిగే ఆదానప్రదానాలను చర్చించండి ?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి.నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడిన “వ్యాసగుళుచ్ఛం” రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజంగానే జరుగుతాయని సదాశివ వివరించారు.

ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం కొత్తేమీకాదు. పలు భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసి మెలసి ఉన్నప్పుడు భాషలలో ఆదాన ప్రదానాలు సహజంగా జరగుతుంటాయి. ఒక భాషా పదాన్ని వేరొక భాష స్వీకరించేటప్పుడు ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని చేర్చి ఆ భాషా పదాన్ని వేరొక భాష స్వీకరిస్తుంది. ఒక్కొక్కసారి యథాతదంగాను లేదా ఒక అక్షరాన్ని చేర్చి, ఒక అక్షరాన్ని తీసేసి, లేదా ఒక అక్షరాన్ని మార్చి స్వీకరించటం జరుగుతుంది. స్వీకరించిన భాష తాను స్వీకరించిన మూల భాషా పద అర్థాన్నే స్వీకరిస్తుంది.

కొన్ని సందర్భాలలో వేరే భాషా పదాన్ని స్వీకరించిన భాష మల భాష యొక్క అర్థాన్ని కాక కొత్త అర్థంలో కూడా స్వీకరించడం జరుగుతుంది. ఇలా భారతీయ భాషలన్నింటిలోనూ సంస్కృత భాషా ప్రభావం అధికంగా ఉంది. అలాగే ఆంగ్ల భాషా ప్రభావం కూడా! అన్య భాషా పదాలను స్వీకరించడంలో వర్ణాగమ, వర్ణాలోప, వర్ణవృత్యయాల ద్వారా ఆదాన ప్రదానాలు జరుగుతుంటాయి.

ఉదాహరణకు : లార్డ్ అనే ఆంగ్లపదం ఉర్దూలోకి ‘లాట్సాహెబ్’గా మారటం. ఫిలాసఫీ అనే ఆంగ్లపదం ఫల్సఫాగా ఉర్దూలోకి రావటం సొహబత్ అనే ఉర్దూపదం తెలుగులో ‘సోబతి’ అవటం. ఉర్దూలో ఆబ్రూ అనే పదం తెలుగులో ఆబోరుగా మారటం వర్ణలోప వర్ణాగమ. వర్ణవృత్యయాలకు ఉదాహరణులుగా చెప్పవచ్చు.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

ప్రశ్న 2.
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదాన్ని వివరించండి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన సాహితీ నీరాజనం అన్న వ్యాస సంకలనం లోనిది. ఇందులో ఆయన మానవతావాదాన్ని గురించి చక్కగా వివరించారు.

మానవతావాదం అంటే మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని, లక్ష్యంగా పెట్టుకుని ఒక మానవుడు తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనా రీతి దీనిని మానవతా వాదం అనే కన్నా మానవతా దృక్పధం అనటం సబబని రవ్వాహరి అభిప్రాయం. ఈ మానవతా దృక్పధానికి మూలం ప్రేమ. మానవుడు తోటి మానవుని వల్ల ప్రేమ భావాన్ని స్నేహభావాన్ని చూషించగలిగితే సమాజం ఆనందమయం అవుతుంది.

ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి, మానవతా వాదానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంస్కృతంలో వేద వాఙ్మయం అతి ప్రాచీనమైంది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. దానిలోని ‘పదవ మండలంలో అన్నదాన మహత్యాన్ని చెప్పే శ్లోకం ఒకటి ఉంది. ప్రాచీన సాహిత్యంలో కన్పించే అన్నదాన ఘట్టాలన్నీ మానవతా వాద ప్రతిపాదకాలే! ఆకలితో బాధపడేవానికి అన్నం పెట్టనివాడు చనిపోయిన వానితో సమానుడట.

వాల్మీకి రామాయణం ఆరంభమే మానవతావాదంతో ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్ఠాం అన్న అది కావ్యా రామాయణ వాక్యాలు పరమ కారుణ్య భావానికి ప్రతీకలు. ప్రేమ భావాన్ని దయాభావాన్ని మానవులపైనే కాక సకల జీవరాశిపై చూపించాలన్నది నిజమైన మానవతావాదం. బోయవాడు క్రౌంచ పక్షులలో మగపక్షిని బాణంతో కొట్టాడు. ఆడపక్షి దుఃఖం వాల్మీకిని కదిలించిందట. ఇది అసలైన కారుణ్యభావం కదా!

ఇక దానాలన్నింటిలో అన్నదానం గొప్పదంటారు. ఎందుకంటే అది క్షుద్భాధను తీరుస్తుంది కాబట్టి. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తుంటే ఉదాసీనంగా పట్టనట్లుగా ఉంటే అది మానవత్వం అన్పించుకోదు. ప్రాచీన సాహిత్యమంతటిలో ఏ దానమైన నిత్యం చేస్తే అది మానవత్వం అనిపించుకుంటుందని చెప్పబడింది.

భాగవతంలోని సప్తమ అధ్యాయంలో గృహస్థ ధర్మాలను వ్యాసులవారు వివరించారు. ఏ మానవునికైనా తన కడుపునింపుకునే ధనం మీద మాత్రమే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే అది పాపమే అవుతుంది అన్నాడు. చరకుడు తన చరకసంహితలో సమస్త ప్రాణుల సంతోషాన్ని కోరుకున్నాడు. అష్టాంగ హృదయంలో “బాల వృద్ధేభ్యః అన్నమదత్వాన భుజంతీ” అని చెప్పబడింది. అంటే బాలలకు వృద్ధులకు అన్నం పెట్టిన తరువాతే మనం భుజించాలని అర్థం.

మానవులందరూ సుఖంగా ఉండాలి. సర్వజీవులు ఆనందంగా జీవించాలని అన్నది మన ప్రాచీనుల ఆదర్శమని రవ్వాశ్రీహరి పేర్కొన్నారు.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘గొల్లరామవ్య’ కథ ఇతివృత్తాన్ని పరిచయం చేయండి.
జవాబు:
‘గొల్లరామయ్య కథ’ దక్షిణ భారతదేశం నుండి తొలిసారి భారత ప్రధాని అయిన పాముల పర్తి వేంకటనరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన ‘గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు’ సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటంలో చిత్రించబడిన అద్భుతఘట్టం గొల్లరామవ్య కథ. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజాశ్రేయస్సు కోసం విజృంభించిన ఒక సాహస విప్లవ కారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వఘటం, ఇందులోని ఇతివృత్తం. తెలంగాణా పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె, గొల్ల రామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె వడిలో పదిహేనేండ్ల బాలిక. ఆ గ్రామంలో అప్పుడు అయిన పెద్ద శబ్దాలకు గ్రామంలోకి వారితోపాటు వీరిద్దరి మొహాల్లో భయం తాలూకా ప్రకంపనలు కన్పిస్తున్నాయి.

“అవ్వా! గిప్పుడిదేం చప్పుడే! అని ఆ బాలిక ప్రశ్నించింది” “నీకెందుకే మొద్దముండా… అన్నీ నీకే కావాలె” అని నోరు మూయిచింది గొల్లరామవ్వ. హఠాత్తుగా కిటికీని ఎవరో తట్టినట్లుంది రజకార్లో, పోలీసులో అని భయపడింది గొల్లరామవ్వ. ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. అగంతకు డొకడు ఆ ఇంటి కిటికీ ద్వారా ఇంట్లోకి వచ్చాడు. సందేహం లేదు. రజాకార్లో, తురకోడో, పోలీసోడు అయి ఉండాడు. తనకు చావు తప్పదు. తను అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళి చేసిన తన మనవరాలికి మానభంగం తప్పదు అని తల్లడిల్లిపోయింది.

అంతలో ఆగంతకుడు నేను దొంగను కాను, రజాకారును కాను పోలీసునూ కాను నేను మీలానే ఒక తెలుగోడిని. ఇది రివల్వార్ మిమ్మల్ని చంపేవాళ్ళను చంపేందుకది. ఈ రాత్రి ఇద్దరు పోలీసుల్ని చంపాను. మొన్న మీ గ్రామంలో నలుగురు అమాయకులను చంపిన పోలీసు లే, లే, ‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్’ను నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతుంది.

తెల్లవారుతుండగా పోలీసులు గ్రామంలోకి ప్రతి ఇల్లును సోదాచేస్తున్నారు. గొల్ల రామవ్వ ఇంటికి కూడా వచ్చారు. ఆమె భయపడిపోయింది. కాంగ్రెస్ వాలంటీర్ అయిన ఆ యువకుని ఎలాగైనా రక్షించాలనుకుంది. తన మనవరాలిని గొంగళితో ఆయువకుని కప్పి ఉంచమన్నది.

వారిద్దరిని ఒకే మంచంపై పడుకోమని ఆజ్ఞాపించింది. అతనికి గొల్లవేషం వేయించింది. ఇంటిలోపలికి ప్రవేశించిన పోలీసులతో ఆ పిల్లలిద్దరూ నా మనవరాలు ఆమె పెనిమిటి అని బొంకింది. పోలీసోడు గొల్లరామవ్వను వాడు ఎవడన్నావ్. కాంగ్రెసోడా ఏం అని ప్రశ్నించిన రామవ్వ కంగారు పడలేదు.

పోలీసులు వెళ్ళిపోయారు. రామవ్వ మంచం మీద కూర్చొంది. ఒక వైపు యువకుడు, మరోవైపు ఆమె మనవరాలు వారిది అపూర్వ సమ్మేళనం అన్పించింది ఆ యువకునికి “అవ్వా! నీవు సామాన్యురాలివి కావు. ‘సాక్షాత్ భరతమాతవే’ అన్నాడు. ఇలా ఒక విప్లవ కారుని సామాన్య వృద్ధురాలు రక్షించిన కథే గొల్ల రామవ్వ కథ.

ప్రశ్న 2.
స్నేహలతాదేవి ఎదుర్కున్న సమస్యలను చర్చించండి?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగము డా. ముదిగంటి సుజాతారెడ్డిచే రచించబడిన. “విసుర్రాయి” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి ఆర్థిక స్వాలంబనకు చాలా ప్రాధాన్యత ఉందనే వాస్తవాన్ని వివరిస్తుంది.

యువత చిన్న విషయానికే కుంగిపోయి, అసంతృప్తికి, నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అలాంటి ప్రతికూల ధోరణులను ఆ కథ నిరసిమైంది. ఆత్మ విశ్వాసంలో దేన్నైనా సాధించవచ్చు అన్న నమ్మకాన్ని ఇస్తుంది. అమ్మా నాన్నలకు స్నేహలత రాసినలేఖ పై విషయాలను రుజువుచేస్తుంది.

స్నేహలత తన పెళ్ళి విషయముపై తన తల్లిదండ్రులు దిగులు పెట్టుకున్నారని తెలుసుకుంది. వారిని ఓదార్చుతూ వర్తమానకాలంలోని యువతులకు ధైర్యాన్నిస్తూ వ్రాసిన లేఖ స్నేహలతాదేవి లేఖ. అమ్మ నాకు పెళ్ళికాలేదని మీరు చింతపెట్టుకున్నారు. మిమ్మల్నిచూసి నాకు మొదట్లో చింతగానే.. ఉంది. ఏకాంతంగా ఎన్నో సార్లు ఏడ్చాను కూడా? పెళ్ళిచూపులకు వచ్చిన ప్రతి మగాడు నన్ను కాదనటం వల్ల నాకు న్యూనతా భావం కలిగింది. నాలో నాకే ఎన్నో లోపాలు కన్పించడం మొదలుపెట్టాయి. పెళ్ళిచూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. పెళ్ళి చూపులనే తతంగం ఆడదానికి జరిగే ఎన్నో అవమానాలలో ఒకటిగా స్నేహలత భావించింది.

నిజంగా పెళ్ళి చూపులకు వచ్చిన వారిలో చాలా మంది నాకు నచ్చలేదు. కాని ఆ మాటలను చెప్పే హక్కునాకు లేదని మీరు, సమాజం నాకు నేర్పారు. అందుకే నోరు మూసుకున్నాను. నేను పెళ్ళి చూపులకు వచ్చిన వారికి వచ్చాకపోవటానికి నా అందం కాదు ప్రమాణం అని నాకు తెలిసింది. వారికి నచ్చంది మీరిచ్చే కట్నకానుకలు నేను చదువకున్నాను. వచ్చేవాడు ఏమంటాడోనని నన్ను ఉద్యోగ ప్రయత్నం మీరు చేయనీయలేదు.

నేను మరీ అంత అందగత్తెను కాకున్నా వికారంగా మాత్రం లేను కదా! ఎంతోమంది పెళ్ళిచూపులకు వచ్చారు కదా? ఒక్కరన్నా నా చదువు సంస్కారం గురించి అడిగారా! కట్న కానుకలను గురించి బేరాలాడటమే సరిపెట్టారు. ఈ సమాజంలో ఆచారాలు కట్టుబాట్లు ఆడదాన్ని బేరమాడే అంగట్లో వస్తువుగా చేశాయి. అమ్ముడు పోయేది వరుడు అవమానాల పాలయ్యేది వధువు ఇదేమి విడ్డూరం. ఇదేమి సంస్కారం.

వరకట్న వ్యతిరేకంగా పొసెషన్లు, నినాదాలు చేసి రోడ్లమీద తిరిగితే ప్రయోజనం ఉండదు. మానవ మనస్తత్వాలు మారాలి. స్త్రీలలో ఈ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం రావాలి. స్త్రీలు తమ జీవితాలను తమకు ఇష్టమైన రీతిలో మలచు కోవటానికి ప్రయత్నించాలి. ఒత్తిడితో ధైర్యాన్ని కోల్పోయి ప్రాణత్యాగం చేయవద్దని కోరింది. తనకు ఎదురైన సమస్యలు నేటి సమాజంలోని ప్రతి స్త్రీ ఎదుర్కోంటుందని వారిందరికి ధైర్యం నూరిపోసింది స్నేహలతాదేవి.

ప్రశ్న 3.
బిచ్చగాడు కథలోని ప్రయాణీకుల మనస్తత్వాన్ని విశ్లేషించండి?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్ చే రచించబడింది. ఈయన అసలుపేరు దొంగరి మల్లయ్య. ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీనమనసత్వాలను చక్కగా వివరించాడు. సమాజంలోని మనుషుల స్పందనా రాహిత్యాన్ని అమానవీయతను నైతిక పతనాన్ని ఈ కథ వివరిస్తుంది.

రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహానికి వెళ్ళి తిరిగి వరంగల్కు ప్రయాణం చేసే సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కథ ఇది. ఆ రోజు స్టేషన్ చాల రద్దీగా ఉంది. టికెట్ దొరికే అవకాశం ఏ మాత్రం కన్పించలేదు. అంతలో ఒకప్పటి తన విద్యార్థి భాస్కర్ సి. ఐగా పని చేస్తాడు. అతని పుణ్యమా అని టికెట్ సంపాదించి ట్రైన్లోకి ప్రవేశించాడు. కూర్చోటానికి సీటు ఎక్కడా ఖాళీ లేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఒక సీటు మొత్తాన్ని ఒక స్త్రీ తన సామానులతో ఆక్రమించింది. ఆ సామానంతా అటూ ఇటూ జరిపితే ఐదుగురు కూర్చోవచ్చు. ఆ స్త్రీ చాలపేదరాలుగా ఉంది. బిచ్చగత్తెలా ఉంది. నలుగురు సంతానంతో చినిగిపోయిన గుడ్డపీలికలు కట్టుకునుండి. మురికిగా అసహ్యంగా ఉన్నారు. ఎలాగోలా అక్కడ కూర్చోవాలని “ఇదిగో ఇటుచూడు…. ఆ సామానంతా క్రిందపెట్టేస్తే ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చుగా అన్నాడు. ఆ స్త్రీ “గదంతేం లేదు మేము సామాను తియ్యం. ఇంకో డబ్బాలోకి పోయికూకో”చాలా మొరటుగా సమాధానం చెప్పింది.

ఇంతలో అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. “అధునా బిచ్చముండవు. నీ పొగరుండీ మాకెంతుండాల్నే? ఆ సారెంత మర్యాదగా అడిగిండు- ఈ రైలు మీ తాతదనుకున్నావా” అని గద్దించాడు. చివరికి అక్కడ కూర్చున్నారు కవిగారు.

ఇంతలో గార్డువిజిల్ విన్పించింది. ఆ బిచ్చగత్తె గొంతులో ఆందోళన. “మీ అయ్యేడిరా! ఎక్కడ సచ్చిండు? రైలు పోతాంది” అంది ఇంతలో టికెట్ కోసం వెళ్ళిన వాడు వచ్చాడు. “టికెట్ దొరకనేలేదు బండిపోతాంది. సామానునంతా కిందకి దించి మీరు దిగుండే” అన్నాడు.

“ఓరిపిచ్చిగాడిద కొడకా సామానునంతా దించే వరకు బండి ఆగుతుందా ఏమిటి? టి.సి. గారితోని చెప్పి బండిలో కూర్చో అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పటికే ఆ బిచ్చగాడు బండిదిగి టికెట్ తీయమని డబ్బులిచ్చిన వాడి దగ్గరకు పరిగెత్తాడు. ఆడురాక పోతే. టి. సీకి కట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అన్నారొకరు. “ఒక్కపైసాలేదు. లేదు బాంచెను “అందామె ఏడుస్తూ “నువ్వట్లనే అంటావు. ఇయ్యాళేపు బిచ్చగాళ్ళ దగ్గరున్నన్ని డబ్బులు మా అసంట్లోళ్ళ దగ్గర కూడా లేవు. మీకేందే పెట్టుబడి లేని వ్యాపారం” అన్నాడు ఎగతాళిగా. అక్కడ ఉన్నవారందరూ చులకనగా నవ్వారు.

మీ పనే బాగుందిరా. ఎక్కడా బిచ్చమే… కానీ ఖర్చులేని బతక్కు అన్నాడకొడు. ఊళ్ళన్నీ వాళ్ళవే! దేశాలన్నీ వాళ్ళవే దొరికింది తింటారు. లేకుంటే పస్తులుంటారు. ఏ బాదరాబందీ లేదు. మనకంటే వాళ్ళేనయం అన్నాడో ప్రయాణీకుడు. టి.సి రావడం ఆ బిచ్చగాణ్ణి బెదిరించడం జరిగాయి. ఆ బిచ్చగాడి రుమాలులో డబ్బులు కిందపడ్డాయి. అక్కడి ప్రయాణీకులలో బిచ్చగాడిపట్ల అప్పటి వరకు ఉన్న సానుభూతి ఎరిగిపోయింది.

“దొంగముండా కొడుకులు. వీళ్ళను చచ్చినా నమ్మోద్దు. టి.టి గారికి వీళ్ళ సంగతి బాగా తెలుసు. మంచిపని చేసుండు” అన్నాడు ఆ ఖద్దరు బట్టల నాయకుడు. నిండుచూలాలు వీళ్ళకు ఇలా జరుగుతుంటే వారిపై ప్రయాణీకులెవరికి జాలికలుగలేదు. అదే విషయం సినిమాలో చూస్తే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తారు.

మేమంతా, టికెట్లు కొన్నాం. వీళ్ళు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. మనకు లేని ప్రివిలేజ్ వీళ్ళకెందుకు పొందాలి అన్న ఈర్ష్య వారిలో కన్పించింది. టీ.సి ఆ గర్భిణి నుండి ‘ సంచిని లాక్కొని డబ్బంతా కింద బోర్లించాడు. ఫైనుతో టికెట్కు సరిపడా డబ్బులు తీసుకుని మిగిలినవి ఆమెకివ్వబోయాడు. “వాటిని కూడా వార్నేతీసుకోమనురి” అంది ఆమె.

“చెప్పుతీసుకుని తంతాను దొంగముండా” అని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఒక కాగితం ముక్క ఆ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఆ చీటిలో 22 రూపాయలే రాసి ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు బిచ్చగాడో కవిగారికి అర్థం కాలేదు. భిన్నమనస్తత్వాలు గల వ్యక్తులు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని కవి బాధపడ్డాడు.

ప్రశ్న 4.
పాతిమా గొప్ప మనసును వివరించండి ?
జవాబు:
ఇన్సానియత్ కథ ‘డా. దిలావర్’ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్ని ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రించింది. వాటికి ‘ఫాతిమా’ గొప్ప మనసు ఒక నిదర్శంగా నిలుస్తుంది.

ఫాతిమా సుబానీ తల్లి, సుబాని, రాంరెడ్డి, కాపోల్ల ఎంకన్నలు పేకాడుకుంటారు. -సుబాని చేతిలో వారు ప్రతి ఆట ఓడిపోయారు. రాంరెడ్డి ఇజ్ఞత దెబ్బతింది. సుబానీని నానా మాటలూ అన్నాడు. ఆ దిగులుతో ఇంఇకి వచ్చిన సుబానీని తల్లి ఫాతిమా ఏం జరిగిందని అడిగింది. రాంరెండ్డి అన్నమాటలన్నీ సుబాని తల్లికి చెప్పాడు.

రోజులు మారిపోయాయి అనుకుంది ఫాతిమా! పల్లెకు రజాకార్లోత్తే ఊరోల్ల పానానికి తన పానం అడ్డమేసుండు మీ బాపు. ఊరోల్ల మీ బాబును పానానికిపానంగా చూసుకునేటోల్లు, ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య ఎడం పెరుగుతుంది. మనమే మనకు పరాయిల్లెక్క కండ్ల బడన్నమ్” గీ దుష్మనీ, కచ్చలు, నరుక్కోటం సంపుకోటం, ‘మత పిచ్చిగాల్లు రామ్ – రహీమ్ల నడ్మ చిచ్చు పెట్టడం గియన్ని ఎన్నటి జమానలమేం ఎరగంబిడ్డా! ఒకలకు ఆపతౌత్తే ఒకల్లు ఆదుకునే టోల్లు.

సుబానీకు యాక్సిడెంటైనా సమయాన తన కొడుకు ఎలానూ బ్రతకడు. రాంరెడ్డి కొడుకన్నా బతికితే అంతేచాలు అని అనున్నది పాతిమా!

“మర్దీ సీమకు సుత అపకారం చెయ్యాలి. నా కొడుకుని చూసి ఓర్వలేక ఆ అల్లా. తీస్కపోతన్నడు” అని తన బాధను రాంరెడ్డి వద్ద వెళ్ళపోసుకుంది.

అప్పుడు రాంరెడ్డి ఫాతిమా!” గిసుంటి ఆపతిల తల్లి మనసు ఎంత తండ్లాడ్తదో నాకెర్క లేదు కాదు. జర అటు ఇటు నేను సుత నీవోల్గెనె ఉన్న. ఎంకెట్రెడ్డి సావు బతుకుల్ల ఉన్నాడు. గాని పానాలు గిప్పుడు మీ చేతుల్లవున్నయ్” నా కొడుకు కిడ్నీలు పూరాగా పాడైపోయినయ్. పన్నెండు గంటల్లో ఏరే కిడ్నీలు దొరక్కుంటే నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడు. ఫాతిమా! నీకు చేతులెత్తి మొక్కుత! సుబాని కిడ్నీలు…. అని రాంరెడ్డి గొంతుక పూడిపోయి మాట రాలేదు.

ఫాతిమా ఒక్కసారి షాక్ అయింది. సుడిగాలికి ఎండు టాకులా వణికింది.

“మర్దీ! కడుపుకోత ఎట్లు అగులు బుగులుగ ఉంటుందో అనుబగిత్తన్నా! నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుకు కావాలె? నా కొడుకును మట్టిలో గల్పుకుంటన్నగా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కోనికి మోక వుంటే ఎందుకడ్డబడాలె! నాకొడుకు పానం అసుమంటిదే నీ కొడుకు పానం. నా కొడుకు హయత్సుత బోస్కోని నీ కొడుకు నిండు నూరేండ్లు బత్కొలె! గందుకునన్నే జెయ్యమంటే గజేస్త…. అన్నది ఫాతిమా!

ఫాతిమా మనసు…. మనిషికి కావలసింది. ఇన్సానియత్ గాని కులాల మతాలు కావని” చెప్పకనే చెప్పింది. ఇంతటి గొప్ప మనసు ఫాతిమావంటి తల్లులకు ఎప్పుడూ
ఉంటుంది.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు.
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, ‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అన్న కవితా ఖండికలోనిది.
సందర్భము :- మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని అసలు విషయాన్ని తెలుసుకోమని చెప్పిన సందర్భంలోనిది.
భావము :- కత్తిపట్టి గెలిచిన వీరుడెవ్వరూ లేడు. కాని మెత్తని హృదయంతో లొంగనివారు ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి అహింస మార్గాన్ని ఎంచుకోవాలి. హింస ద్వారా సంతోషం ఏనాటికి లభించదని ఇందలి భావం.

ప్రశ్న 2.
అంబరాన్ని చుంబించాలి మనం
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవితా సంపుటి గ్రంథం నుండి గ్రహిబచబడినది.
సందర్భము :- మానవుడు అభ్యుదయ భావనలతో భవిష్యుత్తుపై ఆశలతో బ్రతకాలని చెప్పిన సందర్భము లోనిది.
భావము :- మానవులంతా ఆశాపాశాలతో బ్రతకాలి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి అనంతమైన ఈ ప్రపంచాన్ని శాసించాలి. ప్రపంచ మానవులంతా సోదర భావంతో మెలగాలని ఇందలి భావం.

ప్రశ్న 3.
మూల మెరిగిన గురునిచేత ముక్తి దొరకును మనకయా!
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. దున్న విశ్వనాథం “సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసు తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
సందర్భము :- మానవులు మంచి గురువును ఆశ్రయిస్తే ముక్తి దొరకుతుందని వివరించిన సందర్భంలోనిది.
భావము :- ఎక్కడ వెదికినా ఏమీ కన్పించదు శూన్యం తప్ప. జ్ఞాననేత్రాన్ని తెరచి, దాని మూలాన్ని గ్రహించిన గురువును ఆశ్రయించిన మానవులకు మోక్షం లభిస్తుందని ఇద్దాసు చెప్పాడని ఇందలి భావం.

ప్రశ్న 4.
వెల్తికుండ తొఁదొలుకుచునుండు
జవాబు:
పరిచయం :- ఈ వాక్యం మారద వెంకయ్యచే రచింపబడిన భాస్కర శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము :- నీచుడికి, గుణవంతుడికి ఉన్న లక్షణాలను కవి తెలిపిన సందర్భం లోనిది.
భావము :- వెలితి కుండ తొణకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుఁడు న్యాయమునెంచక కఠినపు పలుకులను మాట్లాడును. సద్గుణములలో ప్రకాశించే గుణవంతుడు. అటువంటి కఠినపు మాటలను మాట్లాడడు.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
కల్పిత పక్షిని ఛేదించే సమయంలో కురుకుమారుల ప్రతిభను తెలుండి?
జవాబు:
ఆ కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ఒకనాడు ద్రోణుడు భాసమనే పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు, మీమీ ధనువులు ఎక్కుపెట్టి, ఆ పక్షితలను తెగకొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని, ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సర్ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు.

ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా అని అడుగగా, చక్కగా చూచానని అతడు చెప్పగా, మరల ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా? అని ద్రోణుడు అడుగగానే పుణ్యాత్మ! చెట్టు మీదనున్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు.

అనగా విని ద్రోణుడు ధర్మరాజును మందలించి నీ దృష్టి చెదిరింది, నీవుదానిని కొట్టలేవు. పక్కకు తప్పుకొమ్ము అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమునకుల, సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారలను వరుసగా అడుగగా వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు.

ద్రోణుడు అందరినీ మందలించి తరువాత అర్జునుని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అతడిట్లా అన్నాడు. పక్షితలను చక్కగా చూచాను. ఇంకేదీ నాకు కనిపించడం లేదు అని అర్జునుని అనగా ద్రోణుడు గురిచూసి కొట్టుము అని సూక్ష్మదృష్టిగల అర్జునుని ఆజ్ఞాపించాడు.

గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్క్షణమే తెగి చెట్టుకొమ్మ నుండి నేలమీద పడింది.

‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

ప్రశ్న 2.
యుద్ధానికి సంబంధించి దాశరథి అభిప్రాయాలను తెలపండి?
జవాబు:
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన దాశరథి తాడిత పీడితుల కోసం తన కవితను ‘మైక్’గా అమర్చాడు. ఒకరినొకరు ద్వేషించటం తగదని రాక్షస స్వభావం గల వారితో కూడా మైత్రిని చేయాలని అంటారు దాశరథి. ఆయన దృష్టిలో యుద్ధం రాక్షసక్రీడ. నవ సమాజానికి పనికిరానిది.

“అందరికంటే ముందే
అణ్వస్త్రము గొనిపోయి
అఖాతాన పడవేసితి
సుఖపడగా ప్రజాకోటి”
అని అణ్వస్త్ర ప్రయోగాన్ని నిరసించాడు.
కత్తి పట్టి గెలిచినట్టి
ఘనుడగు వీరుండెవ్వడు
మెత్తని హృదయం దాటికి
తుత్తునియలు కానిదెవరు?
ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింపబోదు”

అని నవసమాజానికి యుద్ధం పనికిరాదని మెత్తని హృదయంతో అహింసా యుతంగా విజయాలను పొందాలని దాశరథి భావన.

ప్రశ్న 3.
అధమ, మద్యమ, ఉత్తములను కొలిచేవారి స్థితి ఎలా ఉంటుందని కవి వర్ణించాడు?
జవాబు:
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

ప్రశ్న 4.
ఆగం కాకుండా జీవించాలంటే ఏమీ చేయాలి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగము ‘దున్న ఇద్దాసు’ చేరచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

‘ఓనామః శ్రీవాయుః’ అన్న అక్షరాలు రాస్తున్నాం. నేర్చుకుంటున్నాం, మన జీవిత ఆనవాళ్ళను మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మన జీవితం యొక్క ఆనవాళ్ళను తెలుసుకోలేకపోవటం వలననే అల్లరిపాలు అవుతున్నాం. మంచి చెడులను, పూర్వాపరాలను, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేక పోవటం వలననే మనం ఆగమవుతున్నామని ఇద్దాసు ‘అచలం’ అను తత్వాల ద్వారా మనకు తెలియచేశాడు.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
సోమన లఘుకృతులను గురించి క్లుప్తంగా రాయండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణశర్మచే రచించబడిన ‘చైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో సోమనాథుని రచనలలోని భాష ఛందస్సులలో నూతనత్వాన్ని ఎలా తీసుకువచ్చాడో వివరించబడింది. సోమనాథుని రచనలను, వర్ణనానైపుణ్యాన్ని ఇందులో వివరించాడు. పాల్కురికి రాసిన 21 రచనలను పేర్కొంటూ వాటిలో లఘు కృతులను తెలియజేశాడు.

సోమనాథుడు శివభక్తి తత్పరుడైన బసవేశ్వరుని పై భక్తి తన్మయత్వంతో కొన్ని లఘుకృతులను రచించాడు. అవి 1. రగడ 4 గద్యలు, 2 ఉదాహరణలు 11 పంచకములు 2 అష్టకములు, 1 స్తవము ఉన్నాయి. ఇవన్నీ వైరశైవమత సంబంధ రచనలే.

ప్రశ్న 2.
తెలంగాణ తెలుగు మిగతా ప్రాంతాల తెలుగు కంటే భిన్నమైనది. ఎందుకు ?
జవాబు:
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూమూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి.నారాయణరెడ్డి, సంపాదకీయంలో వెలువబడిన ‘వ్యాస గుళుచ్ఛం’, రెండవ భాగం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ప్రజలు మాట్లాడుకునే భాష తెలుగు, తెలుగు గ్రాంథిక రూపంలో ఈ నాలుగు ప్రాంతాలలో ఒకటిగానే ఉంటుంది. వ్యవహారికంలోకి వచ్చేటప్పటికి నాలుగు ప్రాంతాలలోనూ వేరు వేరుగా ఉంటుంది. తెలంగానా తెలుగు భాష మిగిలిన మూడు ప్రాంతాల భాష కంటే భిన్నంగా ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ ప్రాంతం తెలుగు భాషలో ఉర్దూ, హిందీ మరాఠీ భాషా పదాలు అధికంగా ఉండటం వలన మిగిలిన ప్రాంతాల తెలుగు భాషకన్నా తెలంగాణ తెలుగు భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 3.
బట్టకాల్చి మీదవేయడం అంటే ఏమిటి ?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

బట్టకాల్చి మీద వేయటమంటే నిందులు మోపటం అని అర్థం. ఒకరిని అన్యాయంగా వ్యాజ్యంలో ఇరికించడం. పరులను దోషులుగా చిత్రించడం “వాడు దొంగతనం చేశాడు. నేను నా సొంత బంగారమని వాడు చెప్పినందున ఆ సొమ్ము దాచాను. బట్టకాల్చి మీదేసినట్లు ఆ నింద వాడు నా మీద వేసి నన్ను కూడా వానితోపాటు కేసులో ఇరికించాడు అనటంతో ఆ జాతీయం ప్రస్తావించబడుతుంది.

ప్రశ్న 4.
‘రాజా బహద్దూర్’ హరిజనుల పట్ల దృష్టి తెలుపండి ?
జవాబు:
రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డి గారిచే రచించబడిన ‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి’ జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. మీరు తన బలమును, ధనమును, అధికారమును, ప్రజాభ్యుదయానికి వినియోగించారు. మంచి సంఘసంస్కరణాభిలాషి, అనాథలపై వీరికి ఎంతటి అనురాగమో హరిజనులపై కూడా అంతటి ప్రేమాదరణలను కలిగియున్నారు.

హిందూ దురాచారాలలో అగ్రస్థానం వహించిన అస్పృస్యతా నివారణను పెద్దదోషముగా రామారెడ్డిగారు భావించారు. వారిని కూడా హిందూ సోదరులుగా భావించి వారికి సమానత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. హరిజనులలో ఒక దుష్ట సంప్రదాయం ఉండేది. హరిజనులు తమ ఆడపిల్లలను ‘మురళీలుగా’ ‘బసివిరాండ్రుగా’ తయారుచేసేవారు.

బాల్యంలోనే ఇలా తయారుచేయబడిన హరిజన బాలికలు వారి జీవితాంతం వ్యభిచారులుగా బ్రతుకవలసి వచ్చేది. సమాజంలోని అగ్రవర్ణాలవారు వీరితో వ్యభిచారం చేసేవారు. ఈ దుష్ట సంప్రదాయాన్ని రూపుమాపటానికి రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి గారు తీవ్రమైన కృషిచేశారు. ఈయన సర్వజన ప్రియులై అఖండకీర్తి ప్రతిష్టలనందుకున్నారు.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
దాశరథి కృష్ణమాచార్యులు గారి కవిపరిచయం రాయండి.
జవాబు:
“నా తెలంగాణ కోటిరతనాల వీణ” అని నినదించిన కవి దాశరథి. పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని “మైగ్”గా అమర్చిన కవి. జూలై 22, 1925న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చినగూడూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వేంకటమ్మ వేంకటాచార్యులు. తల్లిదండ్రులు ఇద్దరూ సాహిత్యాభి రుచి గలవారే! ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయం చేశారు. ఖమ్మంలో హైస్కూలు విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ ఆంగ్లం చదివారు.

అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం అమృతాభిషేకం, కవితాపుష్పం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం, వంటి పద్య వచన రచనలు చేశారు. “మహాబోధి” వీరి కథాకావ్యం నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా వంటి గేయాలు రచించారు. గాలీబు గీతాలను తెలుగులోనికి తీసుకువచ్చారు. నవమి నాటి కల సంపుటి, దాశరథి శతకం, వందలాది సినిమా పాటలు దాశరథి కలం నుండి జాలువారాయి.

దాశరథి తెలుగు సాహిత్యానికి చేసిన సేవను గుర్తించి ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ను ఇచ్చాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం, “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలను అందించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవిగా కొంతకాలం పనిచేశారు. నవంబరు 5, 1987న దాశరథికాలం చేశారు.

ప్రశ్న 2.
కవిరాజుమూర్తి గారి కవిపరిచయం రాయండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్యుల చేత “తిరుగుబాటు సాహిత్య ధ్రువతార” ప్రశంసలు అందుకున్న కవిరాజుమూర్తి అసలు పేరు ‘దేవభట్ల నరసింహమూర్తి’. వీరు అక్టోబరు 1926న ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం అంతా ఖమ్మంజిల్లా మామిళ్ళ గూడెంలో సాగింది. ఉన్నత కుటుంబంలో పుట్టినా నాటి నియంతృత్వ భూస్వాముల అధికార పీడనకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర్య సమయంలోను పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఖమ్మం జిల్లాలో “ప్రజాసాహిత్య పరిషత్తును” స్థాపించారు.

తెలుగు వచన కవితారంగంలో దీర్ఘకవితలు రాసిన తొలి తరం కవులలో మూర్తి ముఖ్యుడు. వీరి ‘మహైకా’ మానవ సంగీతం, పణుతి దీర్ఘ కవితలు ప్రశంసలను అందుకున్నాయి. ‘మైగరీబ్ హు’ అన్న ఉర్దూ నవల మంచి గుర్తింపు పొందింది. దీనిని జవ హర్లాల్ నెహ్రూకు అంకితం చేశారు. దీనిని గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు.

ఉర్దూలో హీరాలాల్ మోరియా రాసిన కావ్యాన్ని ‘మహాపథం’ పేరుతో తెలుగులోకి మూర్తి అనువదించారు. గాంధీ దివ్య చరిత్రను ‘జముకుల’ కథా రూపంలో రచించాడు. ఉర్దూలో ‘లాహుకే, లఖీర్, అంగారే నవలలను తెలుగులో ‘చివరి రాత్రి’ ‘మొదటిరాత్రి’ జారుడుబండ నవలలను రాశాడు. తెలుగులో, నవయుగశ్రీ, పేరుతో. గేయాలను, ఉర్దూ పారశీకవుల గజళ్ళను ముక్తకాలుగా రాశాడు.

ప్రశ్న 3.
వేముల పెరుమాళ్ళు గారి కవి పరిచయం రాయండి.
జవాబు:
వేముల పెరుమాళ్ళు కరీంనగర్ జిల్లా రయికల్ గ్రామంలో ఆగష్టు 5, 1949న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వేముల ఆండాళ్ళమ్మ-రాజయ్యలు. మాతా మహుడు కైరం భూమదాసు వరకవి గాయకుడు. వీరి విద్యాభ్యాసం రాయకల్ కోరుట్ల జగిత్యాలల్లో జరిగింది. గ్రామాభివృద్ధి అధికారిగా 18 సం॥లు పనిచేశారు. తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి రాయికల్ మండల అధ్యక్షునిగా పనిచేశాడు. సహకార రంగంలో గీత, పారిశ్రామిక కాంట్రాక్ట్ లేబర్, వినియోగ, గృహనిర్మాణ సంఘాలను స్థాపించాడు.

పెరుమాళ్ళు శ్రీరాజరాజేశ్వర, శ్రీధర్మపురి, నృకేసరి శతకాలను ప్రచురించారు. బాల సాహిత్యంలో వీరు బాలనీతి శతకం. ‘కిట్టూ’, పర్యావరణ శతకం ‘నిమ్ము’లు రాశారు. మహాత్ముని మహానీయ సూక్తులను “గాంధీమార్గం” త్రిశతిగా రచించాడు.

రాజనీతి చతుశ్శతిగా వీరు ‘లోగుట్టు’ రాశాడు. 1958 నుండి 1968 వరకు సమాజంలో జాతీయ పరిణామాలను పద్యాలుగా రాశాడు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ఈయన “మానవతా పరిమళాలు” ప్రసంగాలుగా వెలువడ్డాయి. జీర్ణదేవాలయ పునరుద్ధరణ చేశారు. వీరు సెప్టెంబరు 17, 2005న కాలం చేశారు.

ప్రస్తుత పాఠ్యభాగం “తెలంగాణ జాతీయాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

ప్రశ్న 4.
డా॥ సామల సదాశివ గారి కవి పరిచయం రాయండి.
జవాబు:
డా॥ సామల సదాశివ భిన్న భాషా సంస్కృతులకు వారధి ఈయన మే 11, 1928న ఆదిలాబాద్: జిల్లా దహగాం మండలం తెలుగు పల్లె గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. అధ్యాపక వృత్తిని చేపట్టి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ, తెలుగు భాషలలో పాండిత్యాన్ని సంపాదించారు. ప్రభాతము అనే లఘు కావ్యాన్ని సాంబశివ శతకం, నిరీక్షణ, అంబపాలి, సర్వస్వదానం, విశ్వామిత్రము వీరి తొలి రచనలు.

హిందూస్థానీ సంగీత కళాకారులపై మయల మారుతాలు ప్రముఖులు జ్ఞాపకాలు, అనుభవాలు గల ‘యాది’ సంగీత శిఖరాలు, వీరి రచనలే. అమాన్ రుబాయిలు’ అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2022లో లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సన్మానించాయి. ఈయన రచనలపై పరిశోధనలు జరిగాయి. ఆగస్టు 7, 2012న పరమపదించారు.

ప్రస్తుత పాఠ్యభాగం డా|| సి. నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘వ్యాసగుళచ్చం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి.
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
మానవజాతికి ఎప్పుడు మేలు కలుగుతుంది?
జవాబు:
మానవత్వంతో మెలగినపుడు

ప్రశ్న 2.
దున్న ఇద్దాసు తల్లిదండ్రుల పేర్లు తెలపండి?
జవాబు:
దున్న రామయ్య – ఎల్లమ్మలు

ప్రశ్న 3.
దివ్యమైన ధనం ఏది?
జవాబు:
విద్య

ప్రశ్న 4.
దాశరథి అణ్వస్త్రాలను ఎక్కడ పారేయాలని ఆకాంక్షించాడు?.
జవాబు:
“అఖాదం”లో పడవేయాలని ఆకాంక్షించాడు.

ప్రశ్న 5.
‘పక్షికన్ను’ లక్ష్యంగా ఎవరు బాణం వేశారు.
జవాబు:
అర్జునుడు

ప్రశ్న 6.
కుచేలుడికి మరోపేరు ఏమిటి ?
జవాబు:
సుధాముడు

ప్రశ్న 7.
కనురెప్పపాటులో పోయేది ఏమిటి?
జవాబు:
ప్రాణం, శరీరతత్త్వం.

ప్రశ్న 8.
‘మై గరీబు’ నవలను ఎవరికి అంకితమిచ్చాడు?
జవాబు:
భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి అంకితమిచ్చాడు.

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి.
(గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
‘కులాసా’ తెలుగు పదానికి ఉర్దూరూపం ?
జవాబు:
కులాసా తెలుగు పదానికి ఉర్దూరూపం ‘ఖులాసా’

ప్రశ్న 2.
బతుకమ్మ పాటల్లో ఏవి ఒదిగి ఉంటాయి ?
జవాబు:
బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు జీవన విధానాలు ఒదిగి ఉంటాయి.

ప్రశ్న 3.
అనాథ బాల బాలికల సంరక్షణ కోసం ఎలాంటి శాసనం వచ్చింది ?
జవాబు:
అనాథ బాలబాలికల కోసం “శిశువుల సంరక్షక శాసనము వచ్చింది.”

ప్రశ్న 4.
ధర్మసింధువు ఏమని ప్రబోధిస్తుంది ?
జవాబు:
బాలురకు వృద్ధులకు అన్నం పెట్టందే భుజింపరాదని ప్రబోధిస్తుంది.

ప్రశ్న 5.
“చుక్క తెగిపడ్డట్టు” అనే జాతీయంతో ఒక వాక్యం నిర్మించండి.
జవాబు:
చుక్కమ్మ చుక్క తెగిపడినట్లు చెప్పాపెట్టకుండా మా ఇంటికి వచ్చింది.

ప్రశ్న 6.
బసవపురాణంలో ఎంతమంది భక్తుల కథలున్నాయి ?.
జవాబు:
బసవపురాణంలో 75 మంది శివభక్తుల కథలున్నాయి.’

ప్రశ్న 7.
బతుకమ్మ పండుగలో ఏ పూలకు అగ్రస్థానం ఇస్తారు ?
జవాబు:
‘తంగేడు’ పూలకు బతుకమ్మ పండుగలలో అగ్రస్థానం ఇస్తారు.

ప్రశ్న 8.
‘సామల సదాశివ’ రాసిన శతకం ?
జవాబు:
‘సాంబశివ’ శతకం

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
బదిలీ పత్రము (టి.సి.) కొరకు కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ రాయండి.
జవాబు:
కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ

కరీంనగర్,
15-06-2023.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్. నమస్కారాలు.

విషయము : టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.

నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ‘దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో. ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది.
కావున, నాకు బదిలీ పత్రము ఇప్పించగలరని విజ్ఞప్తి.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విద్యార్థి
XXXX

ప్రశ్న 2.
ఇటీవల మీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరం గురించి వివరిస్తూ స్నేహితునికి లేఖ రాయండి.
జవాబు:
స్నేహితురాలికి లేఖ

మెదక్
09-08-2023.

ప్రియమైన సౌమ్యకి,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగా చదువుతున్నాను. నీవు ఎలా చదువుతున్నావో ఉత్తరం ద్వారా తెలియజేయగలవు.

ఇటీవల మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (N.S.S) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినపుడు గాని, శస్త్రచికిత్సలు చేసినపుడు గాని మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొన్నిసార్లు రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సాటివారి ప్రాణాలు కాపాడాలని తెలియజేసారు. ఈ మాటలు విన్న వింటనే నేను రక్తదానం చేశాను. నీవు కూడా రక్తదానం చేస్తావని భావిస్తున్నాను.

మన స్నేహితులు సమత, సంధ్య, ప్రవళిక ఎలా ఉన్నారు ? వారిని అడిగానని చెప్పు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. వచ్చే దసరా సెలవులలో మనం కలుసుకుందాం. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

ఇట్లు
నీ ప్రియమైన స్నేహితురాలు
XXXXX

చిరునామా
ఎ. సౌమ్య,
ఇంటి నంబర్ 21-12/68,
సుచిత్ర, సికింద్రాబాద్,
పిన్ నం. – 500067.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1) కానిదెవడు
జవాబు:
కానిది + ఎవడు = కానిదెవడు – ఇత్వసంథి/ఇకారసంథి
సూత్రము : ఏ మ్యాదులయిత్తనకు సంధి వైకల్పికముగానగు. ఏమ్యాదులనగా ఏమి, మరి,కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి ఇత్తు అంటే హ్రస్వమైన

2) క్షణమాగాలి
జవాబు:
క్షణము + ఆగాలి – క్షణమాగాలి – ఉకార సంధి/ఉత్వసంధి సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగును.

3) ముద్దుసేయగ
జవాబు:
ముద్దు+చేయగ = గసడదవాదేశ
సూత్రము : కళలైన క్రియా పదములపై పరుషములకు గసడడవలు వైకల్పికముగానగు.

4) నా దని
జవాబు:
నాది + అని – ఇత్వసంధి.
సూత్రము : ఏమ్యాదుల యిత్తునకు సంధిపై కల్పికముగానను. ‘
ఏమ్యాదులు అనగా ఏమి, మరి, కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలగునవి.

5) నాటనేసి
జవాబు:
నాటన్ + ఏసి = ద్రుతప్రకృతిక సంధి
సూత్రం : ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతికంబులకు సంధిలేదు

6) దివ్యాంబర
జవాబు:
దివ్య + అంబర = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

7) పేదరికమిట్లు
జవాబు:
పేదరికము + ఇట్లు = ఉకార సంధి
సూత్రం : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

8) సంగమమైనా
జవాబు:
సంగమము+ఐన – సంగమమైనా – ఉకారసంథి/ఉత్వసంథి
సూత్రము : ఉత్తనకచ్చు పరంబగునపుడు సంథియగు

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1) ఆహ్లాదగీతిక
జవాబు:
ఆహ్లాదమైన గీతిక – విశేషణపూర్వపద కర్మధారయ సమాసం

2) బసవగురుడు
జవాబు:
బసవ అను పేరుగల గురుడు – సంభావనాపూర్వపద కర్మధారయము

3) కరకంకణ రవంబు
జవాబు:
కరకంకణముల యొక్క రవంబులు – షష్ఠీతత్పురుష సమాసము

4) గురువచనం
జవాబు:
గురువు యొక్క వచనం – షష్ఠీ తత్పురుష సమాసం

5) లోకరక్షణ
జవాబు:
లోకమునకు రక్షణ – షష్ఠీ తత్పురుష సమాసము

6) భరతభూమి
జవాబు:
భరత అనుపేరుగు భూమి – సంభావనా పూర్వపద కర్మధారయము

7) చక్రపాణి
జవాబు:
చక్రము పాణియందుకలవాడు – బహువ్రీహి కర్మధారయ సమాసము

8) ఇలాగోళము
జవాబు:
భూమి యొక్క గోళము – షష్ఠీతత్పురుష సమాసం

XIV. ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
యువత – జీవన నైపుణ్యాలు

ఒకదేశ అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం.

ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురు మండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని

జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness) : ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy) : పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill) : మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత
సంపాదించుకోవాలి.

4. భావోద్వేగాల నియంత్రణ (Management of emotions) : యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill) : సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.

ఎక్కడో మరొకదారి మన కోసం. తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making) : సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking) : ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking) : యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

2. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం
జవాబు:
యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం

శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషుల పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది. ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి. పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు.

ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్ లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది. 1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు.

అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది.

సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అవసరమైన అనవసరమైన సమాచారం ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది.

ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి. మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు. తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం కోల్పోయారు. ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు.

ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం. మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం. అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు. సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు.

అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు. అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు.

కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు.

ఇపుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు. తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. `అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి.

ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది.

బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

3. జాతీయ విపత్తులు
జవాబు:
జాతీయ విపత్తులు

అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది. విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే – భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు.

అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు.

విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి.

దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి.

1. A journey of thousand miles begins with a single step.
జవాబు:
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.

2. There is plenty of water in that region.
జవాబు:
ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది.

3. The best way to predict the future is to create it.
జవాబు:
భవిష్యత్తును అంచనావేయటానికి ఉత్తమ మార్గం, దానిని సృష్టించటమే.

4. Sometimes, later becomes never do it now.
జవాబు:
కొన్నిసార్లు, తరువాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చెయ్యాలి.

5. What you do is more important than what you say.
జవాబు:
నువ్వు చెప్పే మాటలకంటే నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి.

TS Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

కవిత్వం పద్య, గేయ రూపంలో గాకుండా వ్యవహారిక పదాలు; వాక్యాలతో కొత్త · రూపాన్ని సంతరించుకుంది. పాశ్చాత్య కవితాధోరణుల ప్రభావం దీనికి ప్రధాన కారణం. ఫ్రెంచి భాషలోని ‘verse libre’ అని, ఆంగ్లంలో ‘free verse’ అని పిలుచుకుంటున్న కవితా పద్ధతే తెలుగులో వచనకవితగా స్థిరపడింది. వచనకవితకు ఆద్యుడుగా చెప్పుకునే శిష్ట్లా ఉమామహేశ్వరరావు తను రాసిన వచనకవితల్ని 1938లో ‘విష్ణుధనువు’, ‘నవమి చిలుక’ సంపుటాలుగా ప్రకటించాడు.

వచనకవిత ప్రయోగదశ, తొలిదశలో వచ్చిన ఈ కవిత్వాన్ని శిష్ట్లా ‘ప్రాహ్లాద కవిత’గా పేర్కొన్నాడు. అటుతర్వాత వచనగేయం, వచనపద్యం, ముక్తచ్ఛంద కవిత, స్వచ్ఛంద కవిత, ఫ్రీవర్, వర్క్స్బర్, వచనకవిత అనే పలు పేర్లు వ్యాప్తిలోకి వచ్చినా వచనకవిత అనే పేరు స్థిరపడిపోయింది. వ్యవహార భాషా ప్రయోగాలతో భావపరమైన చిన్న వాక్యాల పాద విభజనతో వచనకవిత నడుస్తుంది. భావగణాలతో, అంతర్లయ గల వాక్యాలతో వచనకవిత స్వేచ్ఛానుగుణంగా కదులుతుంది. ప్రతి వచనకవికి తనదైన నిర్మాణ శిల్పం వుండటం వచనకవిత ప్రత్యేకత. వచనకవితలో పాఠకునికి భావోద్వేగం కలిగించేట్లుగా ఒక విరుపు, భావలయ, అంతరయలు నిగూఢంగా వుంటాయి.

వచనకవిత ఆవిర్భావధశలో 1939లో పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్’ కవితాసంపుటి, ‘నయాగరా’ కవితాసంకలనం ముఖ్యమైనవి. తెలుగులో తొలి వచనకవితా సంకలనమైన ‘నయాగరా’ను కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాన్, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలు ప్రచురించారు. కుందుర్తి వచనకవితకు ఉద్యమస్ఫూర్తిని అందించాడు. వచన కావ్యంగా ‘తెలంగాణ’ కావ్యాన్ని రచించి ‘వచనకవితాపితామహుడి’గా ప్రసిద్ధి చెందాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
వచన కవితకు ఆద్యుడుగా ఎవరిని భావిస్తున్నాం?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు

ప్రశ్న 2.
శిష్ట్లా తన కవిత్వానికి పెట్టుకున్న పేరు ఏమిటి?
జవాబు:
ప్రాహ్లాద కవిత

ప్రశ్న 3.
‘వచనకవితాపితామహుడు’ ఎవరు?
జవాబు:
కందుర్తి

ప్రశ్న 4.
తెలుగులో తొలి వచనకవితా సంకలనం ఏది?
జవాబు:
‘విష్ణుధనువు’, ‘నవమి చిలుక’

ప్రశ్న 5.
‘ఫిడేలు రాగాల డజన్’ కవితా సంపుటి కర్త?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 6 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి.

ప్రశ్న 1.
పల్లవి : దేహమైతే మనదిగాదు ……… తన సొమ్ముయా॥
జవాబు:
పల్లవి : దేహమైతే మనదిగాదు
మోహములు విడువండయా
సాహ సం బున గురుని జేరితే
సోహమే తన సొమ్ముయా॥

భావం : ఈ దేహము శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహాన్ని విడచిపెట్టాలి. మంచి శివ గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందాలి. అపుడేమోక్షం లభిస్తుంది. ఆత్మపరమాత్మలో లీనమౌతుంది అని ఇద్దాసు బోధించాడు.

ప్రశ్న 2.
గతాన్ని కాదనలేను ………. నా ఊరు ప్రజావాటి
జవాబు:
గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనబోను
భవిష్యత్తు వదులుకోను
కాలం నా కంఠమాల
నా పేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి

భావం : గతించిన కాలాన్ని కాదనలేను. వర్తమానాన్ని వద్దనను కాలం నా కంఠమాల నాపేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘మహైక’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి ?
జవాబు:
‘మహైక’ అనుపాఠ్యభాగం “తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగ’ పేరుపొంది న కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. తెలంగాణలో నియంతృత్వ, భూస్వామ్య అధికారులు వీడనలకు వ్యతిరేకంగా కవిరాజుమూర్తి పోరాడాడు.

మహైక దీర్ఘకవిత సమాజంలో ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మకంగా నడచిన కవిత. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతతి పాత్రల పరస్పర సంభాషణలతో కూడి ఉన్నది. నేటి నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పుతో కవి చెప్పటం ఈ కవిత లోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిని ఓదారుస్తూ మనిషిపై మనిషికి విశ్వాసం తగ్గకుండా ప్రోత్సహించే విప్లవ రచన ఇది.

భవిష్యత్తుపై ఆశలను నిలుపుతూ మానవీయ లక్షణాలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు వేసిందీ కవిత. దీర్ఘకవితను చదివినపుడు ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది అంటారు. ఈ కావ్యానికి ముందుమాట రాసిన బెల్లకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణులు. ‘మహైకా’ను చదువుతుంటే టి.ఎస్. ‘ఇలియట్ వేస్టాండ్ జ్ఞాపకం వస్తుంది. చిలి దేశ మహాకవి ‘పోబ్లో నెరుడా’ ఎలాంటి కవో తెలుగులో మూర్తి అలాంటివాడు.

తోటమాలి తనని తాను బలిదానంగా సమర్పించుకుంటేనే పువ్వులు పరిమళాలను వెదజల్లుతాయి. మనిషి మనిషి కలిస్తేనే దేశం వృద్ధి చెందుతుంది. యుగ యుగాల నైరాశ్యం మన బతుకులను నాశనం చేస్తున్నది. చేయి చేయి కలిపి సోమరితనాన్ని వదలిపెట్టి ఆనందంతో శ్రమ చేస్తే అందరికి సంతోషం భూగోళానికి నూతనత్వం వస్తాయి.

అన్నలూ, అక్కలూ మీకు తెలియనిదేమున్నది. సముద్రపు నీరంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండే మంటంతా నిప్పే ప్రక్కనున్న వాటిని కూడా దహిస్తుంది. ఆకలితో ఆహారాన్ని కోరటం తప్పుకాదు. నిస్సత్తువ ప్రాణానికే ప్రమాదకరం.

కుండలు వేరైనా మట్టి ఒక్కటే, రంగులు వేరైనా మానవులంతా ఒక్కటే. కొమ్మలు రెమ్మలు వేరైనా అవి వృక్షంలో భాగాలే. ఎన్ని దేశాలున్నా మానవులంతా ఒక్కటే.. మానవులలో భేదాల సృష్టి మానవ వినాశనానికి దారి తీస్తుంది. అందరం ఒకటిగా నడిస్తే ప్రమాదాలను దాటగలం అని ఐకమత్యాన్ని గూర్చి ‘మహైక’ కవిత వివరిస్తుంది.

ప్రశ్న 2.
‘మిత్రధర్మం’ పాఠ్యభాగ సారాంశం వివరించండి.
జవాబు:
కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులు – వారిరువురు సాందీపుని సన్నిధిలో విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాధిపతియైనాడు. కుచేలుడు దుర్భరమైన దారిద్ర్య బాధ అనుభవించాడు. కుచేలుని భార్య మహాపతివ్రత, అభిమనవతి. ఆ ఇల్లాలు దారిద్ర్యబాధతో పిల్లలు మలమలమాడిపోబడం చూచి – భర్తను, శ్రీకృష్ణుని దర్శించి – ఆయన అనుగ్రహంతో తమను కాపాడుమని ప్రార్థించు సన్నివేశంతో కథ ప్రారంభమగుచున్నది.

భర్తకు కర్తవ్యోపదేశము చేసిన అర్ధాంగిగా కుచేలుని భార్య – ఎంతటి దుర్భరమైన దారిద్ర్యము అనుభవించినను నోరు తెరచి సహాయమును అర్థింపని అభిమనధనుడుగా కుచేలుడు – అవధులు ఆదరాభిమానాలతో బాల్య మిత్రునికి సర్వ సంపదలను అనుగ్రహించిన ఆర్తజన రక్షకుడిగా శ్రీకృష్ణుడు మనకు ఈ పాఠ్యభాగములో సాక్షాత్కరిస్తారు. కుచేల శ్రీకృష్ణుల మధురమైన స్నేహానికి, శ్రీకృష్ణుని భక్తజన వాత్సల్యమునకు కుచేలోపాఖ్యానం నిదర్శనంగా నిలుస్తుంది.

మహాపతివ్రతయు, అభిమనవతియునైన కుచేలుని భార్య దుర్భరమైన దరిద్రపీడచే క్రుంగికృశించి పోయినది. ఆకలిమంటచే అలమటించుచు, పిల్లలు ఆకులు, గిన్నెలు పట్టుకొని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నము పెట్టుమని యడిగిరి. వారి మాటలు వినినంతనే పట్టరాని దుఃఖముతో భర్త కడకరిగి “ప్రాణేశ్వరా ! ఇంటిలో దారిద్య్రము తాండ వించుచున్నది. దానిని తొలగించుటకు మార్గమును ఆలోచింపరైతిరి.

మీ బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి, దారిద్య్రమనెడి అంధకారము నుండి మమ్ము కాపాడుము. ఆర్తజన శరణ్యుడు, దయా సాగరుడైన శ్రీకృష్ణుడు మిమ్ములను చూచినంతనే, అపారమైన సంపదలను అనుగ్రహించును. కలలోనైన తనను తలవని నీచుని పైతము, కష్ట సమయములో ఆదుకొను జగత్ప్రభువు, ఎల్లవేళల ఆయనను భక్తితో సేవించు మీకు విశేష సంపదల ననుగ్రహింపడా ?” అని పలికెను.

భార్య మాటలను విని, ఆమె ధర్మయుతమైన వాక్యములకు సంతసించి, శ్రీకృష్ణుని దర్శనము ఇహపరసాధనముగా భావించెను. “నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుటశుభకరమే- ఆ చక్రపాణికిచ్చుటకేమైన కానుకగలదా? యని అడుగగా ఆ ఇల్లాలు కుచేలుని ఉత్తరీయపు కొంగునకు కొన్ని అటుకులు ముడి వేసెను. గోవింద సందర్శనమునకై వెడలుచున్న ఆనందముతో కుచేలుడు ద్వారకా పట్టణమునకై బయలుదేరెను.

“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమాన మిచ్చుటకు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ నా భాగ్యము -” అనుకొనుచు కుచేలుడు ద్వారకా నగరమును ప్రవేశించి, కక్ష్యాంతములు దాటి, అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోద క్రీడలలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుని గాంచి – బ్రహ్మానందమును అనుభవించెను.

అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను. . మంచి గంధమును శరీరమునకు అలదెను.

వింజామరలతో గాలి విసరి మార్గా యాసమును పోగెట్టెను. కర్పూర తాంబూలము నొసంగెను. ఆదరముతో గోవును దానము చేసెను. మణిమయ దీపములతో ఆరతి పట్టెను, సాక్షాత్తు రుక్మిణీదేవి కుచేలునికి వింజామరలు వీచెను. ఇట్లు శ్రీకృష్ణునిచే సేవులు చేయించుకొనుచున్న కుచేలుని గాంచి – అంతఃపుర కాంతలు ఆశ్చర్యపడుచు, కుచేలుని అదృష్టమును అనేక విధములుగా ప్రశంసించిరి.

శ్రీమహావిష్ణువు అవతారమగు శ్రీకృష్ణుని చేతను, లక్ష్మీదేవి స్వరూపిణియగు రుక్మిణి చేతను సేవలు పొందిన మహనీయ మూర్తిగా కుచేలుడు ఈ పాఠ్యభాగమందు గోచరించును శ్రీకృష్ణ, కుచేలుల నిర్మలమైన స్నేహమును ఈ పాఠ్యభాగము నిరూపించును.

కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని తాము గురుకులంలో చదివిన రోజులలోని సంఘటనలు గుర్తుచేసాడు. కుచేలుని భార్యా పిల్లల కుశల మడిగాడు. ధర్మనిష్ఠతో, కర్తవ్య నిష్టతో జీవించే ఉత్తములను భక్తితో గురువును సేవించే వారిని ప్రేమిస్తాను.. మనం గురు నివాసంలో ఉంటు ఒక రోజు కట్టెల కోసం అడవికి వెళ్ళాం గుర్తుంది కదా ! దారి తెన్నూ కనపడకుండా పడిన ఆ కష్ట సమయంలో ఒకరికొకరు ఆసరాగా ఆ అడవిలో చలికి వణుకుతూ గడిపాము.

ఇంతలో తెల్లవారడంతోనే మనకోసం గురువుగారు వెతుకుతూ వచ్చి మనలను దీవించారు. కృష్ణుని మాటలకు పొంగిపోయిన కుచేలుడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని శ్లాఘించాడు. నా కోసం ఏమి తెచ్చావు అని అడుగగా సిగ్గుతో తలదించుకుని కూర్చున్న కుచేలుని ఉత్తరీయం ముడిలో ఉన్న అటుకులను ప్రేమతో తిని అతనికి సకల సంపదలను అనుగ్రహించాడు.

తిరిగి ఇంటికి వెళ్ళిన సుధామునికి (కుచేలుడు) ఇదంతా కృష్ణలీల అని గ్రహించి ఆనందించాడు. స్నేహంలో ఆస్తుల తారతమ్యం, ధనిక బీద తేడాలుండ కూడదని శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా లోకానికి చాటి చెప్పాడు.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
పాల్కురికి సోమన జీవిత విశేషాలు, కవితా గుణాలను పేర్కొనండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ కవిచే రచించబడిన “చైతన్య లహరి” సంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి సోమనాథుని జీవిత విశేషాలు, కవితా గుణాలు వివరించబడ్డాయి.

పాల్కురికి సోమన కాకతీయ చక్రవర్తులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంవాడు. 13వ శతాబ్ధమునకు చెందినకవి. సోమన ఓరుగంటికి సమీపంలోని జనగామ తాలూకా పాలకుర్తి గ్రామానికి చెందినవాడు. ఈ గ్రామానికి దగ్గరలో సోమేశ్వరాలయం ఉంది. ఈ దేవునిపేరే తమ కుమారునికి పెట్టుకున్నారు.

సోమన తల్లిదండ్రులు శ్రియాదేవి విష్ణురామిదేవుడు. సోమనకు గురువులు నలుగురు. వీరమాహేశ్వర దీక్షనిచ్చిన గురువు. గురులింగార్యుడు. శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవివేమనారాధ్యుని మనుమడు. సాహితీగురువు కరస్థలి విశ్వనాధయ్య.

సోమన వ్యక్తిత్వము, విశిష్టమైనది. వీరశైవలోకానికి మూలపురుషుడు, వీరశైవ వాఙ్మయమంతా ఇతనిరచనలపైనే ఆధారపడిఉన్నది. వీరశైవ మషాన్ని బసవేశ్వరుడు స్థాపించగా, పండితారాధ్యుడు ప్రచారం చేయగా, పాల్కురికి సోమనాధుడు వీరశైవ సాహిత్యాన్ని సృష్టించాడు.

ఇతని తరువాతి వారు సోమనాధుని భృంగీశ్వరుని అవతారంగా భావించారు. సంస్కృత భాషను కాదని ఆంధ్రభాషను అందలం ఎక్కించాడు. తెలుగు భాష భావరూపాలలో నూతనత్వాన్ని తీసుకువచ్చాడు. బ్రాహ్మణమతానికి ధీటుగా వీరశైవమతాన్ని నిలబెట్టాలని భావించి శైవంలో శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్య స్తుష్యాదులన ప్రవేశపెట్టాడు.

అనుభవసారం, రుద్రభాష్యం, బసవపురాణం, పండిషారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, బసవరగడ, బసవోదాహరణలను రచించాడు. ఆయన రచనలు దేశీ ఛందస్సుకు పట్టం కట్టాయి. తెలుగుభాషలో ద్విపద ఛందస్సుకు ఆధ్యుడు పాల్కురికే! సోమనాధుడు శైవమత ప్రచారానికే సాహిష్యాన్ని సృష్టించాడు. భాష చందస్సులను గురించి సోమన

భాష:
“ఉరుతర గద్య పద్యోక్తుల కంటె
సరసమై బరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వసామాన్యమగుట
గూర్చెద ద్విపదలు గోర్కిడైవార”

అని అన్నాడు. జానుతెనుగు అంటే లోక వ్యవహారములోని సుబోధకమైన తెనుగు అని అర్థం. ఈయన రచనలన్నీ నిత్య వ్యవహార భాషలోనే సాగాయి.

ఛందస్సు : సోమన అనుసరించిన ఛందస్సు కూడా నూతనమైంది. వృత్తపద్యాలు కొన్ని రాసినా జాతులు ఉపజాతులనే ఎంచుకున్నారు. ద్విపద ఛందస్సుకు ప్రాధాన్య మిచ్చాడు. ద్విపద ఛందస్సులోనే బసవపురాణం, పండిషారాధ్య చరిత్ర అను వీరశైవమత గ్రంథాలను రచించాడు.

వర్ణన : సోమనాధుని ప్రకృతి వర్ణనలు స్వభావోక్తికి దగ్గరగా ఉంటాయి. తెల్లవారుజామున కోడికూత వర్ణనం దీనికో ఉదాహరణ. పండిషారాధ్య చరిత్రలో

“తొలికోడి కనువిచ్చి నిలచి మైపెంచి
జలజల రెక్కలు సడలించి నీల్గి
గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు
నిక్కించి మెడసాచి నిక్కిమిన్సూచి
కొక్కొరో కు అని కూయక మున్న…..”

ఈ ద్విపద వాక్యాలలో కోడి కూతను అతి సహజ సిద్ధంగా సోమనాథుడు వర్ణించాడు. ఇలా సోమనాథుడు వీరశైవ సంప్రదాయ ప్రవర్తకునిగా, దేశీకవితా కవిగా కీర్తి నార్జించాడు.

ప్రశ్న 2.
ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావాలను తెలపండి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదము అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన సాహితీ నీరాజనం” అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావం చక్కగా వివరించబడింది.

జీవ కారుణ్యం అంటే సృష్టిలోని సకల జీవులపట్ల కరుణ, జాలి కలిగి ఉండటం. ఋగ్వేదంలో అన్నదానం గురించి వివరిస్తూ ఆకలితో బాధపడేవారికి అన్నం పెట్టనివాడు మృత ప్రాయుడని చెప్పబడింది.

రామాయణరచన జీవకారుణ్యాన్ని చెప్పడంతోనే ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్టాం”… అన్న శ్లోకం జీవకారుణ్యాన్ని చూపమనిచెప్పింది. కఠిన మనస్సుగల బోయవాడు సుఖంగా కలిసి ఉన్న క్రౌంచ పక్షులలో మగపక్షిని కొట్టాడు. ఆడపక్షి కరుణ స్వరాన్ని విన్న వాల్మీకి మనసులో కారుణ్యం చోటు చేసుకుంది.

ప్రేమ భావాన్ని కరుణ భావాన్ని మానవులపైనే గాక పశుపక్ష్యాదులపైన కూడా చూపించడం భారతీయ సంస్కృతిలో కన్పించే ముఖ్యలక్షణం. దీనినే ప్రాచీన కావ్యాలు కూడా ప్రబోదించాయి. “ఆత్మవత్ సతతం పశ్యేదపికీటపిపీలికామ్” అంటే చీమ మొదలైన కీటకాలను కూడా తమలానే భావించాలి అని అష్టాంగ హృదయం చెప్తుంది.

మహాభారతంలోని దధీచి, శిబి, రంతి దేవుడు మొదలుగు కథలలో జీవకారుణ్యం గురించి వివరించబడింది. రంతిదేవుని కథలో “నత్వహంకామయే రాజ్యం ….” అన్న శ్లోకంలో వ్యాసుడు రంతిదేవుని మనసులో ఉన్న జీవకారుణ్యాన్ని వివరించాడు. “నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలు వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగటమే నాకు కావాలి” అంటాడు. దీనికి మించిన జీవకారుణ్యం ఏముంటుంది. ఇలా ప్రాచీనమైన ప్రతి కావ్యంలో కూడా జీవ కారుణ్యాన్ని కవులు తెలియచేశారు.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
గొల్ల రామవ్వ సంభాషల్లోని ఔన్నత్యాన్ని విశ్లేషించండి ?
జవాబు:
గొల్లరామవ్వ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకటనరసింహారావుచే రచించబడినది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదనకత్వంలో వెలువడిన. “గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాట కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది.

పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్, ‘వాలంటీరును, విప్లవకారుని ఒక. సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతి వృత్తం. ‘గొల్ల రామవ్వకథ. తెలంగాణ పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె. అందులో గొల్ల రామవ్వ తన పదియేనేండ్ల, మనవరాలితో కలిసి ఉంటుంది. ఆమె ప్రతి సంభాషణ ఉన్నత విలువలను గలినదే ! అర్థరాత్రి తనింటికి దొంగలా ప్రవేశించిన యువకుని రజోకారో పోలీసోడో అని భావించింది. “నేను పోలీసోన్ని కాను రజోకార్ను కాను” అన్నమాటలో నమ్మలేక “అబ్బా ఎంతకైనా తగుతారీ రాక్షసులు ! ఔను ముందుగా తీయని మాటలు అవి సాగకపోతే అన్యోపాయాలు – అదే కదా క్రమం అయింది. ఆ వ్యక్తి రెండు కాళ్ళు పట్టుకుని “బాంచెన్ ! చెప్పులు మోత్తా నా తలకాయైనా తీసుకో, పోర్ని మాత్రం ముట్టకు, అది నీకు చెల్లెలనుకో, నీ కాల్లు మొక్కుత ! అంటుంది.

యువకుడు విప్లవకారుడని తెలుసుకుని ఉపచారాలు చేస్తుంది. ఆమె మనస్థితి కాయకల్పమైంది. “ఇదేం గతిరానీకు ! గిట్లెందుకైనవు కొడకా! అంది. వెళ్ళిపోతానన్న యువకుని “ఆ మాపోతా ! మా పోతా… ఒక్కటే పోకడ ! చక్కంగ స్వర్గమే పోతా ! హు పోతడండ యాడికో” అని నిలువరించింది.

రాజోలిగే ఉన్నవు కొడకా ! నీవెందుకొచ్చెగా ఈకట్టం? పండుపండు గొంగల్లపండు” అని అతనిపై గాఢనిద్రలోని వెళ్ళేట్లు ఓదార్చింది. మనవరాలిని పిలిచి దీపం వెలిగించి ఆ యువకుని శరీరంపై గుచ్చుకున్న ముళ్ళను తీసేయమని చెప్పింది. “మా చేత్తవులే సంసారం ! ఇక కూకోవాని పక్క ముండ్లు తీసెయి ఉల్లుల్లుగ అయ్యో సిగ్గయితాందా వాని ముట్టుకుంటె, ఏం మానవతివి గదవే ! నీ సిగ్గు అగ్గిలబడ ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గను కుంట ! ఊ చెయ్యి చెప్పినపని. పాపం పీనుగోలె పడున్నడు గాదే! వాని జూత్తె జాలి పుడుతలేదె నీకు ! ఆ! గట్ల ! నొప్పించకు పాపం” అమ్మ సంభాషన తీరిది.

యువకుని లేసి “ఇగ లే కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లల పిసుక్కచ్చిన గింత కడుపుల పడేసుకో ! ఎన్నడన్న తాగినావు తాతా గట్క ? వరి బువ్వ తినెటోనికి నీకే మెరుక ? గొల్లరామి గల్కుంటే ఏమనుకున్నా ? పోయేపానం మర్లుతది. చూడు మరి – కులం జెడిపోతవని భయపడుతున్నావా ? నువ్వు యేకులమోడవైనా సరే- మొదలు పానం దక్కిచ్చుకో…. తాగి పారెయ్యి గటగట” అంటుంది.

రాత్రి ఇద్దరు పోలీసోల్లను మట్టుపెట్టిన అని యువకుడు అనగానే అవ్వ “ఇద్దరా! కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడకా! సగంపనే చేసినవు” అంటుంది. పోలీసులు ఇంట్లోకి ” వచ్చి యువకుని వైపు చూపిస్తూ “వాడు యెవడన్నావ్ చెప్పు ! కాంగ్రెసోడాయేం”అంటే “వాడెవ్వడా ? ఎవ్వడు పడితే వాడు మా పక్కల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నవా ? నిన్నెవడన్న గట్లనె అడుగితే ఎట్లుంటది! ఈ మాటల్తోటి మనం దీసుడెందుకు పానం తియ్యరా దుండి! నా బుద్దెరిగిన కాన్నుంచి నీనైతగింతచే ఇజ్జతి మాట యెవ్వల్ల నోట్నుంచి యినలే ! అంటుంది. రామవ్వ సంభాషచతురత అద్భుతమైంది అని ఈ సంభాషణ వలన తెలుస్తుంది.

ప్రశ్న 2.
బిచ్చగాడు కథలోని ప్రయాణీకుల మనస్తత్వాన్ని విశ్లేషించండి ?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్ చే రచించబడింది. ఈయన అసలుపేరు దొంగరి మల్లయ్య. ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీనమనసత్వాలను చక్కగా వివరించాడు. సమాజంలోని మనుషుల స్పందనా రాహిత్యాన్ని అమానవీయతను నైతిక పతనాన్ని ఈ కథ వివరిస్తుంది.

రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహానికి వెళ్ళి తిరిగి వరంగల్కు ప్రయాణం చేసే సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కథ ఇది. ఆ రోజు స్టేషన్ చాల రద్దీగా ఉంది. టికెట్ దొరికే అవకాశం ఏ మాత్రం కన్పించలేదు. అంతలో ఒకప్పటి తన విద్యార్థి భాస్కర్ సి.ఐగా పని చేస్తాడు. అతని పుణ్యమా అని టికెట్ సంపాదించి ట్రైన్లోకి ప్రవేశించాడు. కూర్చోటానికి సీటు ఎక్కడా ఖాళీ లేదు. చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఒక సీటు మొత్తాన్ని ఒక స్త్రీ తన సామానులతో ఆక్రమించింది.

ఆ సామానంతా అటూ ఇటూ జరిపితే ఐదుగురు కూర్చోవచ్చు. ఆ స్త్రీ చాలపేదరాలుగా ఉంది. బిచ్చగత్తెలా ఉంది. నలుగురు సంతానంతో చినిగిపోయిన గుడ్డపీలికలు కట్టుకునుండి. మురికిగా అసహ్యంగా ఉన్నారు. ఎలాగోలా అక్కడ కూర్చోవాలని “ఇదిగో ఇటుచూడు…. ఆ సామానంతా క్రింద పెట్టేస్తే ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చుగా అన్నాడు. ఆ స్త్రీ “గదంతేం లేదు మేము సామాను తియ్యం. ఇంకో డబ్బాలోకి పోయికూకో” చాలా మొరటుగా సమాధానం చెప్పింది.

ఇంతలో అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. “అధునా భిచ్చముండవు. – నీ కింత పొగరుండీ మాకెంతుండాల్నే ? ఆ సారెంత మర్యాదగా అడిగిండు- ఈ రైలు మీ తాతదనుకన్నావా” అని గద్దించాడు. చివరికి అక్కడ కూర్చున్నారు కవిగారు.

ఇంతలో గార్డువిజిల్ విన్పించింది. ఆ బిచ్చగత్తె గొంతులో ఆందోళన. “మీ అయ్యేడిరా ! ఎక్కడ సచ్చిండు ? రైలు పోతాంది” అంది ఇంతలో టికెట్ కోసం వెళ్ళిన వాడు వచ్చాడు. “టికెట్ దొరకనేలేదు బండిపోతాంది. సామానునంతా కిందకి దించి మీరు దిగుండే” అన్నాడు..

“ఓరిపిచ్చిగాడిద కొడకా సామానునంతా దించే వరకు బండి ఆగుతుందా ఏమిటి? టి.సి. గారితోని చెప్పి బండిలో కూర్చో అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పటికే ఆ బిచ్చగాడు బండిదిగి టికెట్ తీయమని డబ్బులిచ్చిన వాడి దగ్గరకు పరిగెత్తాడు. ఆడురాక పోతే టి.సీకి కట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అన్నారొకరు. “ఒక్కపైసాలేదు. లేదు బాంచెను “అందామె ఏడుస్తూ “నువ్వట్లనే అంటావు. ఇయ్యాళేపు బిచ్చగాళ్ళ దగ్గరున్నన్ని. డబ్బులు మా అసంట్లోళ్ళ దగ్గర కూడా లేవు. మీకేందే పెట్టుబడి లేని వ్యాపారం” అన్నాడు ఎగతాళిగా. అక్కడ ఉన్నవారందరూ చులకనగా నవ్వారు.

మీ పనే బాగుందిరా. ఎక్కడా బిచ్చమే… కానీ ఖర్చులేని బతక్కు అన్నాడకొడు. ఊళ్ళన్నీ వాళ్ళవే ! దేశాలన్నీ వాళ్ళవే దొరికింది తింటారు. లేకుంటే పస్తులుంటారు. ఏ బాదరాబందీ లేదు. మనకంటే వాళ్ళేనయం అన్నాడో ప్రయాణీకుడు. టి.సి రావడం ఆ బిచ్చగాణ్ణి బెదిరించడం జరిగాయి. ఆ బిచ్చగాడి రుమాలులో డబ్బులు కిందపడ్డాయి. అక్కడి ప్రయాణీకులలో బిచ్చగాడిపట్ల అప్పటి వరకు ఉన్న సానుభూతి ఎరిగిపోయింది.

“దొంగముండా కొడుకులు. వీళ్ళను చచ్చినా నమ్మోద్దు. టి.టి గారికి వీళ్ళ సంగతి బాగా తెలుసు. మంచిపని చేసుండు” అన్నాడు ఆ ఖద్దరు బట్టల నాయకుడు. నిండుచూలాలు వీళ్ళకు ఇలా జరుగుతుంటే వారిపై ప్రయాణీకులెవరికి జాలికలుగలేదు. అదే విషయం సినిమాలో చూస్తే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తారు.
మేమంతా, టికెట్లు కొన్నాం. వీళ్ళు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు.

మనకు లేని ప్రివిలేజ్ వీళ్ళకెందుకు పొందాలి అన్న ఈర్ష్య వారిలో కన్పించింది. టీ.సి ఆ గర్భిణి నుండి ‘సంచిని లాక్కొని డబ్బంతా కింద బోర్లించాడు. ఫైనుతో టికెట్కు సరిపడా డబ్బులు తీసుకుని మిగిలినవి ఆమెకివ్వబోయాడు. “వాటిని కూడా వార్నే తీసుకోమనురి” అంది ఆమె.

“చెప్పుతీసుకుని తంతాను దొంగముండా” అని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఒక కాగితం ముక్క ఆ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఆ చీటిలో 22 రూపాయలే రాసి ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు బిచ్చగాడో …. రికి కాలేదు. భిన్నమనస్తత్వాలు గల వ్యక్తులు వాస్తవాన్ని గ్రహిం- కపోతున్నారని కవి బాధపడ్డాడు.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 3.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి ?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించ బడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది. యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని, చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తనతల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత. పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ ? చదువుకుంది. సంస్కారం ఉంది. మరీ అంత అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేను.

నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి. నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో. స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.

నా గురించి మీరు ఇల్లు అమ్ముకుని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిత్వం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను.

నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది. ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను. మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడే వాడు దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొవాలి.

ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి తనతోపాటు స్త్రీ జాతి కంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

ప్రశ్న 4.
ఇన్సానియత్ కథలోని సందేశాన్ని చర్చించండి?
జవాబు:
‘ఇన్సానియత్’ కథ డా. దిలావర్ చే రచించిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రిస్తుంది. కులమత బేధం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు పరస్పర సహకారాలు సహజీవన సంస్కృతిని తెలియచేస్తుంది. కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతంలోకి వ్యాపించటం ప్రారంభమౌ తుంది.

ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్న ఉన్నత మానవీయ సంబంధాలను ఈ కథ తెలియచేస్తుంది. వర్తమాన సమాజంలో లుప్త మౌతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ కథ సూచిస్తుంది.

రాంరెడ్డి సుబానీలు పేకాడుతున్నారు. సుబాని చేతిలో రాంరెడ్డి ఓడిపోతున్నాడు. అతడు పేకాటలో ఓడిపోతున్నట్టు లేదు. తన దర్జా దర్పం ఒక్కొక్క మెట్టు దిగ జారిపోతున్నట్టుగా ఉంది. అంతవరకు పేకాటలో రాంరెడ్డిని ఓడించినవాడు లేడని ప్రతీతి పొందాడు. సుబాని ఈనాడు రాంరెడ్డిని బట్టలూడదీసి నడిబజార్లో నిలబెట్టి నట్టుంది. తట్టుకోలేక ఎన్నెన్నో అన్నాడు దానికి ఎంకన్న వంతు పాడాడు.

“ఒక్కపేకాటేకాదు మల్ల ఇంకే ఆటైనా గంతే. కిర్కెట్లో పాకిస్తాన్ అగరబాగెలిస్తే పండగచేస్కుంటారు”.

“నువ్వెన్ని జెప్పు… వీళ్ళంతా గంతే…. తినేది ఇండియాసొమ్ము… పాడేది పాకిస్తాన్పట” కసిగా అన్నాడు రాంరెడ్డి. సుబానీకి “కండ్లపొంటి నీల్లు గిర్రున తిర్గుతాంటి.
సుబాని దిగులుగా ఇంటికి చేరిండు. తల్లి అతని దిగులు గమనించి ఏమయిందని అడిగింది. రాంరెడ్డి అన్న మాటలన్నీ చెప్పిండు సుబాని. ఆ తరువాత సంఘటనలో సుబానీకి యాక్సిడెంట్ అయింది. రాంరెడ్డి కొడుక్కి కిడ్నీఫెయిలయింది. రాంరెడ్డి అడగలేక అడగలేక సుబానీ తల్లిని తన కుమారునికి ప్రాణభిక్ష పెట్టమని కోరాడు.

సుబానీ తల్లి రాంరెడ్డిని “మర్దీ కడుపుకోత ఎట్ల అగులు గుబులుగా ఉంటుందో అనుభవిస్తున్న. నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుక్కోవాలె. నా కొడుకును మట్టెల గల్పుకుంటున్న, గా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కానికి మోక ఉంటే ఎందుకడ్డంబడాలె” అన్నది..

అపుడు రాంరెడ్డి ! “సుబానీ ! నీ తోని నేనొక్క పేకాటల్నే వోడిపోయిన అనుకున్న. గనినీ సావుసుత నన్ను ఓడిచ్చింది. మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గని కులాలు, మతాలూ కావని సుత సాటి చెప్పినవ్” అన్నాడు. మానవత ముందు ఏదైనా తలవంచాల్సిందేని ఇన్సానియత్ కథ చెప్తుంది.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ఆనవాలు అంతు తెలియక ఆగమై పోతారయా!
జవాబు:
పరిచయము : ఈ వాక్యం ‘దున్న ఇద్దాసు’చే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
సందర్భము : మానవులు జీవం యొక్క మూల తత్త్వాన్ని తెలుసుకోలేక పోతున్నారని తెలియచేసిన సందర్భంలోనిది.
భావము : ఓ నమః శివాయః అని రాస్తున్నాము గాని మన జీవిత అసలు ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాము. అలా తెలిసికోలేక పోవటం వలన ఆగమైపోతున్నామని ఇందలి భావం.

ప్రశ్న 2.
వెనక్కు నడిచేవారిని వెక్కిరించే కోర్కిలేదు.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, నా పేరు ప్రజాకోటి అను పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను కవితా ఖండికలోనిది. సందర్భము : ప్రతికాలాలను గురించి కవి తెలియచేయు సందర్భంలోనిది
భావము : గతించిన కాలమే జీవితం అనుకుని వర్తమానాన్ని నిందిస్తూన్న వారిని పరిహాసం చేసే కోరిక తనకు లేదని ఇందలి భావం.

ప్రశ్న 3.
సఖ్యము దానొడఁ గూడ నేర్చునే !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం నన్నయభట్టుచే రచింపబడిన శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.
సందర్భం : స్నేహపూర్వకంగా తనతో మాట్లాడిన ద్రోణుడిని అవమానిస్తూ ద్రుపదుడు పలికి సందర్భంలోనిది.
భావం : ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు..

ప్రశ్న 4.
నిన్ను భాజన చేసెడి వారికి పరమ సుఖము.
జవాబు:
పరిచయము : శేషప్పకవిచే రచింపబడిన నృసింహ శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము : శరీరం, సంతానం, బంధుగణం, బలపరాక్రమాలు, సంపదలు శాశ్వతం కాదని నరసింహస్వామి భజన చేయటే శాంతకరణమని చెప్పిన సందర్భంలోనిది.
భావము : చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదార విందాలకు శిరస్సు దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
గురువు తత్వం వివరించండి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదనకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఈ లోకంలో గురువే బ్రహ్మం గురువే విష్ణువు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానం అనాహతం, మణిపూరకం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు, వీటిలో చివరిది సహస్రారం, అది విచ్చుకునే శక్తిని ప్రసాదించేవాడు గురువు. అపుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక ఆ రహస్యాన్ని తెలుసుకుని మంచి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మోక్షాన్ని పొందమని ఇద్దాసు వివరిస్తున్నాడు.

ప్రశ్న 2.
పాఠ్యాంశం ఆధారంగా కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” కవితాసంపుటి నుండి గ్రహించబడింది. ఆధునిక ఆంధ్రసాహిత్యంలో దాశరథి కృష్ణమాచార్యులు ఒక విశిష్ట స్థానాన్ని పొంది ఉన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని నినదించి పీడిత తాడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు.

కృష్ణమార్యుల గారి దృష్టిలో కవి అయినవాడు మానవతా వాది కావాలన్నాడు కనిపించే మంచికిచెడుకి స్పందించాలన్నాడు. అన్ని దృక్పథాలకు కేంద్ర బిందువు మానవుడే. మనిషిని ప్రేమించలేనివాడు దేనినీ ప్రేమించలేడన్నాడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరీక్షించి భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలన్నాడు. శాంతి అహింసలు తోడుగా విశ్వశ్రేయస్సును కోరుకున్నాడు. అహింసనే జీవిత పరమావధిగా అందరూ తలచాలని అందుకు కవులు తమ రచనల ద్వారా దోహదకారులవ్వాలని భావించాడు.

ప్రశ్న 3.
ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు?
జవాబు:
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు. సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)

ప్రశ్న 4.
శ్రీకృష్ణుడు, కుచేలుడిని ఏవిధంగా ఆదరించాడు ?
జవాబు:
శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరముతో ఎదురుగా వెళ్లి కుచేలుని ప్రేమతో కౌగిలించు కొనాడు. బంధుత్వము, మిత్రత్వము వెల్లడియగునట్లుగా తీసుకొని వచ్చి, ప్రేమాదరములతో తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. ప్రేమతో బంగారు చెంబులోని నీటితో ఆయన పాదములు కడిగినాడు. ఆ కాళ్లు కడిగిన నీటిని భక్తితో తన శిరస్సు మీద చల్లుకొనినాడు.

కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గందమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను మంచి సువాసనలు గల పూలదండలు కుచేలుని జుట్టుముడిలో అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను.

గోదానమిచ్చెను. ఇట్లు కృష్ణుడు తనకు సాదరముగా స్వాగతము పలుకగా, కుచేలుని శరీరమున గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొడుచు కొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములు స్రవించెను. ఆ సమయమున సాక్షాత్తు శ్రీకృష్ణుని సతీమణియైన రుక్మిణీదేవి చేతుల గాజులు ఘల్లుఘల్లు మనుచుండగా వింజామరలు విసరెను – అప్పుడు పుట్టిన చల్లని గాలులు మార్గాయాసముచేత పుట్టిన కుచేలుని శరీరము నందలి చెమట బిందువులను పోగొట్టెను. ఈ ఘట్టమును చూచి, అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయి, తమలో తామిట్లను కొనసాగిరి.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
అష్టాంగ హృదయం ఏమని ప్రబోధిస్తుంది ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనే పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.

దుంఖితులపట్ల మానవులు ఎలా ప్రవర్తించాలో అష్టాంగ హృదయకర్త చక్కగా వివరించాడు. ఏ జీవనాధారము లేనివాణ్ణి, వ్యాధితో బాధపడుతున్నవాణ్ణి, దుఃఖంలో ఉన్నవాణ్ణి వారి వారి శక్తిని బట్టి ఆదుకోవాలని అష్టాంగ హృదయం చెప్తుంది. మానవుని సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకుని ఏ జీవనాధారం లేనివారికి వ్యాధిగ్రస్తులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అదే మానవత్వం అనిపించు కుంటుందని అష్టాంగ హృదయం బోధించింది.

ప్రశ్న 2.
బతుకమ్మను పేర్చే విధానాన్ని వర్ణించండి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.

తెలంగాణా జానపదస్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేది బతుకమ్మ పండుగ అదే పూలపండుగ. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి పూలమయంగా ఉంటుంది. బతుకమ్మను ఆ పూలతో అందంగా అలంకరిస్తారు. ముందుగా ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పరుస్తారు. పొడవైన గునుగు పూలను చివర కత్తిరించి వాటికి పలురంగులు పూస్తారు. ఆ తరువాత ముత్యాల పువ్వులను గుత్తులు గుత్తులుగా అమరుస్తారు. ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీర పూలను గూడా గుండ్రంగా శిఖరాలలో పేరుస్తారు. శిఖంపై గుమ్మడి పూలను అలంకరిస్తారు.

పసుపుతో త్రికోణాకృతిలో బతుకమ్మను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమం పూర్తి అవుతుంది. బతుకమ్మ ప్రక్కనే పిల్ల బతుకమ్మలను ఉంచుతారు. బతుకమ్మలను కూరాటికుండ వద్దగాని, దేవుడి వద్దగాని పెట్టి నువ్వులు, సెనగపప్పు, పెసరపప్పు, పొడులతో చద్దుల పులహూర దద్యోన్నంను నైవేద్యంగా అమర్చుతారు. పూలు ఎక్కువగా లభిస్తే మనిషంత ఎత్తు బతుకమ్మలను అమర్చుతారు. త్రికోనం, స్త్రీకి సంకేతం. త్రికోణాకారంలో పసుపు ముద్దనుంచటం గౌరీదేవిని ప్రతిష్ఠించటంగా భావిస్తారు.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 3.
ఇంటింటికి మంటి పొయ్యి జాతీయంలోని సామాజిక న్యాయాన్ని వివరించండి ?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

కట్టెలతో వంటలు చేసేటప్పుడు ఏ ఇంటిలోనైనా మన్నుతో చేసిన పొయ్యి ఉండేది. నాకు ధనమున్నది కదా అని బంగారు పొయ్యి లాడరు కదా! సామాజిక న్యాయం అందరికి ఒక్కటే సమస్యలు లేని ఇల్లుండదు “మా కోడలు కొడుకు మొన్న నలుగురిలో నానామాటలన్నందుకు నల్ల మొఖం అనిపించింది. బజారుకే రాబుద్ధికావడం లేదు” అంది పొరుగింటావిడ. “ఇంటింటికి మట్టి పొయ్యే ఈ కష్టాలు అందరికీ వచ్చేవే. నీ ఒక్కదానికని ఏముంది. నీ కొడుకు కోడలు ఏదో అంటే నీకెందుకు నల్లమొఖం. ముందట మాకురావా” అని ఓదార్చింది పొరుగింటి ఆవిడ. ఇలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగించబడుతుంది.

ప్రశ్న 4.
‘గోల్కొండ’ పత్రిక అభివృద్ధికి రాజాబహద్దూర్ ఎలా తోడ్పడ్డారు ?
జవాబు:
రాజా బహద్దూర్ `కటరామారెడ్డి సేవతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన హద్దూర్ వేంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. రెడ్డిగారు 1926లో తెలంగానలో గోల్కొండ పత్రికను స్థాపించారు. అప్పటి వరకు తెలంగాణలో పత్రికలకు ప్రాతినిధ్యం లేదు. ఆయనే 20 సం||ల పాటు -దానికి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. పత్రికారంగంలో ఒక నూతన ఒరవడిని గోల్కొండ పత్రిక సృష్టించింది. సురవరం వారిలో రాజా బహద్దూర్ రామారెడ్డి గారికి అనుబంధం ఏర్పడింది. అది గోల్కొండ పత్రికతో వారిద్దరికి ఉన్న అనుబంధం

గోల్కొండ పత్రిక తొలుత హైదరాబాద్ నుండి వెలువడుటకు కావలసిన ముద్రణాలయము స్థాపించటానికి యంత్రాలకు కావలసిన ధన సహాయం. రూ.7,300 రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి గారే సమకూర్చారు. గోల్కొండ పత్రిక ఒకటి. తెలంగాణా నుండి రావటానికి ప్రధాన కారకుడిగా రాజాబహద్దూర్ గారు నిలిచారు.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
దాశరథి కవితా సంపుటాలను తెలియచేయండి?
జవాబు:
‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించ బడింది.

ఆధునికాంధ్ర సాహిత్యంలో దాశరథిది విశిష్ట స్థానం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు. ఉర్దూ, తెలుగు సంస్కృం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయనం చేశాడు.

వీరి కవితా సంపుటాలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం ఆలోచనా లోచనలు, తిమిరంతో సమరం. మహాబోధి కథాకావ్య రచన చేశాడు. నవ మంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా అన్న గేయ రచనలు చేసాడు. వీటితో పాటుగా ‘నవిమి’ నాటికల సంపుటిని వెలువరించాడు. దాశరథి శతకంతోపాటు గాలిబుగీతాలను తెలుగునకు అనువదించారు.

ప్రశ్న 2.
కవిరాజు మూర్తి రచనలను పేర్కొనండి?
జవాబు:
‘మహైక’ అను పాఠ్య భాగము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ ‘దీర్ఘ కవిత’ నుండి గ్రహించబడింది. మూర్తిగారు ఉన్నత కుటుంబంలో పుట్టినా ఆనాటి నియంతృత్వ, భూస్వామ్య అధికారుల పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. రైతుల పక్షాన, అణగారిన పీడిత ప్రజల పక్షాన మధ్యతరగతి జీవుల కోసం రచనలు చేశాడు.

మూర్తిగారు దీర్ఘకవితలు రాసిన తొలితరం కవులలో అగ్రగణ్యులు. మహైక, ప్రణుతి, మానవ సంగీతం దీర్ఘకవితా సంపుటాలను వ్రాసారు. “మైఁగరీబుఁ” ఉర్దూనవలలను రాసి జవహర్లాల్ నెహ్రూకు అంకితం చేశాడు. గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు. హీరాలాల్ మోరియా ఉర్దూలో రాసిన కావ్యాన్ని మహాపథంగా తెలుగులోకి అనువదించారు. గాంధీజీ దివ్య చరితను జముకుల కథగా రాసాడు.

ఉర్దూలో ‘లాహుకే లఖీర్’ అంగారే. తెలుగులో చివరి రాత్రి, మొదటి రాత్రి జారుడు బండ నవలలను రచించాడు. నవయుగ శ్రీ పేరుతో గేయాలు, ఉర్దూ పారశీకవుల గజళ్ళు “మధుధారలు” పేరుతో ముక్త కాలుగా రాశాడు” తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతార”గా దాశరథి చేత ప్రశంసించబడ్డాడు.

ప్రశ్న 3.
సామల సదాశివ రచనలను సంగ్రహంగా తెలుపండి ?
జవాబు:
సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలంలోని తెలుగు పల్లెలో మే 11, 1928న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. సదాశివ విభిన్న భాషా సంస్కృతుల కళారధి, వీరు సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ తెలుగు భాషలలో పండితుడు. వీరి తొలి రచనలలో ప్రభావము అనే లఘు కావ్యం, సాంబశివ శతకం, నిరీక్షణము, అంబపాలి, సర్వస్య దానము, విశ్వామిత్ర మొదలుగునవి ఉన్నాయి.

హిందూస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై, ‘మలయమారుతాలు’ ప్రముఖుల జ్ఞాపకాలు, ఉర్దూ, భాషా కవిత్వ సౌందర్య ఉర్దూకవుల కవిషా సామాగ్రి మొదలగునవి ప్రసిద్ధ గ్రంథాలు.

అన్జద్ రుబాయిలు తెలుగు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారాన్ని ఇచ్చింది. వీరి ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో పలు పరిశోధనలు జరిగాయి.

ప్రశ్న 4.
రచయిత రావి ప్రేమలత గురించి వ్రాయండి.
జవాబు:
డా. రావి ప్రేమలత జూన్ 10, 1945 ఉమ్మడి నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లెలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మనోహరమ్మ, నాగిరెడ్డిలు. భువనగిరి కళాశాలలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, పిహెచ్.డి పూర్తి చేశారు. నాయని కృష్ణకుమారిగారి పర్యవేక్షణలో తెలుగు జానపద సాహిత్యం – పురాణగాథలు అన్న అంశంపై పరిశోధనచేసి పిహెచ్.డి సాధించారు.

రావి ప్రేమలతా జానపద విజ్ఞానం సిద్ధాంతాల నేపధ్యంలో ‘జానపద విజ్ఞానంలో స్త్రీ’ అనే వ్యాససంపుటిని ప్రచురించారు. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి “తెలుగు స్త్రీల చిత్రలిపి” అన్న వైవిధ్య గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం బిరుదురాజు రామ రాజు జానపదవిజ్ఞాన బహుమతి, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమగ్రంథ పురస్కారాన్ని అందుకుంది.

ఈమె ‘వ్యాసలతిక’ సంపుటి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమవిమర్శ గ్రంథంగా పురస్కారం అందుకుంది. డా॥ కురుగంటి లక్ష్మీతో కలిసి ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాససంపుటిని వెలువరించారు. Folk Tales of South India-Andhra Pradesh అనే సంకలనానికి సంపాదకత్వం వహించారు. రావి ప్రేమలత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకురాలు, తంగిరాల సాహిత్యపీఠం ఉత్తమ పరిశోధకురాలిగా పురస్కారం అందుకున్నారు.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
కవి కంటికి రుచించేదేమిటి ?
జవాబు:
హృదయం, ఉదయాలు కవి కంటికి రుచించేవి

ప్రశ్న 2.
కుచేలుడు ఇంటికి వెళ్ళగానే భార్య ఎలా కనిపించింది ?
జవాబు:
మానవ రూపం దాల్చిన లక్ష్మీదేవి వలె కనిపించింది.

ప్రశ్న 3.
ఎవరి భజన చేసేవారు పరమసుఖాన్ని పొందుతారు ?
జవాబు:
ధర్మపురి నరసింహస్వామి భజన చేసేవారు.

ప్రశ్న 4.
ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు ?
జవాబు:
వరసిద్ధి జంగమ దేవర పూదోట బసవయ్య ప్రబోధించాడు.

ప్రశ్న 5.
కవిరాజుమూర్తిని ఏ మహాకవితతో పోల్చవచ్చు ?
జవాబు:
చిలీ దేశ మహాకవి! బ్లో నెరుడాపాతో పోల్చవచ్చు.

ప్రశ్న 6.
కాలాన్ని కవి దేనితో పోల్చాడు ?
జవాబు:
కంఠ మాలతో పోల్చాడు.

ప్రశ్న 7.
ద్రోణుడిని ధనుర్విగ్వాచార్యుడిగా ఎవరు నియమించారు ?
జవాబు:
భీష్ముడు

ప్రశ్న 8.
‘మిత్ర ధర్మం’ ఏ గ్రంథం నుండి తీసుకోబడింది ?
జవాబు:
శ్రీమదాంధ్ర మహాభాగవతం దశమ స్కంధం నుండి గ్రహించబడింది.

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (2 × 3 = 6)
(గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
సోమన మొదటి కృతి ఏది ?
జవాబు:
సోమన మొదటి కృతి ‘అనుభవసారము’

ప్రశ్న 2.
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులెవరు ?
జవాబు:
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులు వెంకటనరసమ్మ, నరసయ్యలు.

ప్రశ్న 3.
వేముల పెరుమాళ్ళు విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ?
జవాబు:
రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో జరిగింది.

ప్రశ్న 4.
అనాధ బాలబాలికల కోసం ఎలాంటి శాసనము వచ్చింది ?
జవాబు:
అనాధ బాలబాలికల కోసం “శిశువుల సంరక్షక” శాసనము వచ్చింది.

ప్రశ్న 5.
గుమ్మడి కాయ, గుమ్మడి పూలు దేనికి సంకేతం ?
జవాబు:
గుమ్మడికాయ, గుమ్మడిపూలు ‘సఫలతాశక్తికి’ సంకేతం.

ప్రశ్న 6.
‘ఉర్దూ భాషకు ‘ఉర్దూ’ అనుపేరు ఏ శతాబ్దంలో వచ్చింది ?
జవాబు:
18వ శతాబ్దంలో

ప్రశ్న 7.
వేముల పెరుమాళ్ళు రాసిన త్రిశతి పేరేమిటి ?
జవాబు:
వేముల పెరుమాళ్ళు వ్రాసిన త్రిశతి పేరు ‘గాంధీమార్గం’

ప్రశ్న 8.
సురవరం ప్రతాపరెడ్డి ఎపుడు జన్మించారు ?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896న జన్మించారు.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

1. పోగొట్టుకున్న సైకిల్ కోసం పోలీస్ స్టేషన్కి లేఖ రాయండి.
జవాబు:

దిలావర్పూర్.
10.08.2023.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు,
పోలీస్ స్టేషన్,
దిలావర్పూర్.

విషయము : నా సైకిల్ దొంగిలింపబడిన విషయం గురించి.
ఆర్యా!
నమస్కారములు.

నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్పర్ నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను నిన్న కళాశాలకు అట్లాస్ కంపెనీకి చెందిన ఎరుపు రంగు సైకిల్ పై వెళ్ళి, కళాశాల ముందర తాళం వేసి పెట్టి, తరగతులకు హాజరు అయ్యాను. సాయంత్రం వచ్చి చూసేసరికి నా సైకిల్ కనిపించలేదు. దొంగిలించబడినదని. నిర్ధారణ అయ్యింది.

దయచేసి నా సైకిల్ గురించి విచారణ చేసి తిరిగి నాకు అప్పగించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విశ్వసనీయుడు
పి. ఆదిత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దిలావర్పూర్

2. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయండి.
జవాబు:

నల్లగొండ,
26.07.2023.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ.
నమస్కారములు.

విషయము : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు
నిర్దేశము : నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.07.2023.

ఈ నెల తేది 20.07.2023 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.

ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు,
మీ భవదీయుడు
XXXX

దరఖాస్తుతో జత చేసిన పత్రాలు :

  1. ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
  2. జనన ధ్రువీకరణ పత్రం
  3. స్థానిక ధ్రువీకరణ పత్రం
  4. ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి.

1) జీవితాశ
జవాబు:
జీవితాశ = జీవిత + ఆశ = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

2) తెగనేసిన
జవాబు:
తెగనేసిన = తెగన్ + ఏసిన = ద్రుఁత ప్రకృతిక సంధి.
సూత్రం : ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతిందికంబులకు సంధిలేదు

3) నేలబ్రడి
జవాబు:
నేలబ్రడి = నేలన్ + పడి – ద్రత సంధి (సరళాదేశ సంధి)
సూత్రము : ద్రుత ప్రవృతికము మీద పరుషములకు సరళములగు.

4) సూకరంబునకేల
జవాబు:
సూకరంబునకేల = సూకరంబునకు + ఏల = ఉకరా సంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళమగును.

5) గతమంత
జవాబు:
గతమంత = గతము + అంత = గతమంత – ఉత్వసంధి/ ఉకారసంథి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

6) వేరైనా
జవాబు:
వేరైనా = వేరు + ఐన – వేరైన – ఉత్వసంధి /ఉ. కార సంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

7) ఎల్లి యెల్లక
జవాబు:
ఎల్లి యెల్లక =. ఎల్లి + ఎల్లక – యడాగమసంధి
సూత్రము : సంధిలేని చోట స్వరంబుకంటెన్ పరంబైన స్వరంబునకుయట్, ఆగమముగానగు.

8) ముత్యమట్లు
జవాబు:
ముత్యమట్లు = ముత్యము + అట్లు = ఉకారసంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళమగును.

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1) గురునిపాదము
జవాబు:
గురునిపాదము – గురునియొక్క పాదము – షష్ఠితత్పురుషసమాసం

2) భానుకాంతి
జవాబు:
భానుకాంతి – భానుని యొక్క కాంతి – షష్ఠీ తత్పురుష సమాసం

3) భుజబలము
జవాబు:
భుజబలము – భుజముల యొక్క బలము – షష్ఠీ తత్పురుష సమాసము

4) మైత్రే బంధము
జవాబు:
మైత్రే బంధము – మైత్రీ చేత బంధము – తృతీయా తత్పురుష సమాసం మైత్రి వలన బంధము – పంచమీ తత్పురుష సమాసం

5) దయాపయోనిధి
జవాబు:
దయాపయోనిధి – దయా పయోధి – షష్ఠీ తత్పురుష సమాసము

6) ప్రియభాషలు
జవాబు:
ప్రియభాషలు – ప్రియమైన భాషలు – విశేషణపూర్వపద కరధాయ సమాసం

7) గరగృహం
జవాబు:
గరుగృహం – గురువుయొక్క గృహం – షష్ఠీతత్పురుష సమాసము

8) దివ్యబాణం
జవాబు:
దివ్యబాణం – దివ్యమైన బాణం – విశేషణపూర్వపదకర్మధారయం

XIV. ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
జవాబు:
ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం. ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు. ‘ చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి. తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం.

తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి. తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం.

వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం’ చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్టు మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. శాతవాహన కాలపు మట్టికోటల ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహనులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 – 1686) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724- 1948 తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్’ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగ్ నగర్’ అనే పేరొచ్చింది. వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి.

పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికీ, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ద సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.

రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారదకథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో. కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.

తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుద్దాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం…

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 2.
యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం
జవాబు:
శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో. ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషుల పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది. ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి.

పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు. ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది. 1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు.

అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చాయి.

ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది. సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి .చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు.

ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అవసరమైన అనవసరమైన సమాచారం ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది. ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి. మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు.

తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం కోల్పోయారు. ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు. ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం. మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం.

అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు. సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు. అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు. అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు.

కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు.

ఇపుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు. తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి.

ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది.

బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

ప్రశ్న 3.
జాతీయ విపత్తులు-
జవాబు:
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు.

విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం.

సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్ 19 వ్యాధి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల. పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి.

1. Language is the dress of the thought.
జవాబు:
ఆలోచనకి తొడిగిన ఆహార్యమే భాష.

2. Ours is a joint family.
జవాబు:
మాది ఉమ్మడి కుటుంబం.

3. Education is the most powerful weapon which can change the world.
జవాబు:
ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే.

4. A poor workman blames his tools.
జవాబు:
పని చేతకానివాడు పనిముట్లని నిందిస్తాడు.

5. There is no substitute for hard work.
జవాబు:
కృషికి ప్రత్యామ్నాయం లేదు.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ఆధునిక వచన సాహిత్యంలో కథానిక ప్రక్రియ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ప్రాచీన సాహిత్యంలో వినిపించే కథలు నేటి కథానిక సాహిత్య పరిధిలోకి రావు. కథానిక ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక లక్షణాలతో విభిన్న ప్రయోగధోరణులతో వర్తమాన పరిణామాలకు అనుగుణంగా నడుస్తుంది.

ఆంగ్లంలో ‘short story’ అనే పదానికి సమానార్థకంగా తెలుగులో కథ, కథానిక అనే పర్యాయపదాలను వాడుతున్నాం. ఈ కథానిక పదం ‘కథ’ ధాతువునుంచి పుట్టింది. దీనికి మాట్లాడుట, చెప్పుట, సంభాషించుట అనే భేదాలున్నాయి. కథానిక ప్రస్తావన ‘అగ్నిపురాణం’లో కనిపిస్తుంది. క్లుప్తతతో బిగువైన కథనంతో ఉదాత్త అంశాలతో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కరుణ, అద్భుత రసపోషణతో ఆనందాన్ని అందించడమే కథానిక లక్షణంగా చెప్పబడింది.

ఆధునిక కాలానికి చెందిన కథారచన యూరోపియన్ సామాజిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో ఆవిర్భవించింది. తొలి కథా రచయితగా భావించబడుతున్న ‘ఎడ్గార్ ఎలన్ పో “ఒకే సంఘటనను అది యథార్థమైనా, కల్పనాత్మకమైనా తక్కువ సమయంలో చదువగలిగే సాహిత్య ప్రక్రియ” కథానిక అని నిర్వచించాడు.

తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించిన డా॥ పోరంకి దక్షిణామూర్తి కథానికను నిర్వచిస్తూ “ఏకాంశవ్యగ్రమై, స్వయం సమగ్రమైన కథాత్మక వచన రచనా ప్రక్రియ” అని తన ‘తెలుగు కథానిక స్వరూప స్వభావం’లో వివరించాడు. కథానిక నిర్వచనాలన్నింటిని క్రోడీకరిస్తే సంక్షిప్తత, ఏకాంశవస్తువు, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, ప్రతిపాద్య ప్రవీణత, సంవాద చాతుర్యం, నిర్మాణ సౌష్ఠవాలు కథానికకు ప్రధాన లక్షణాలుగా స్థిరపడ్డాయి. సామాజిక వాస్తవికతను అందిస్తూ మనోవికాసాన్ని కలిగించడంలో కథానిక ప్రక్రియ శక్తివంతమైనదిగా విమర్శకులు పరిగణించారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
‘కథానిక’ పదం ఎలా పుట్టింది?
జవాబు:
‘కథ్’ ధాతువు నుంచి పుట్టింది.

ప్రశ్న 2.
‘కథానిక’ ప్రస్తావన ఏ పురాణంలో ఉంది?
జవాబు:
అగ్నిపురాణంలో

ప్రశ్న 3.
తొలి కథారచయితగా ఎవరిని భావిస్తున్నాం ?
జవాబు:
విఙ్గర్ విలనోప్పో

ప్రశ్న 4.
కథానిక ప్రక్రియ ఏ కాలానికి సంబంధించినది?
జవాబు:
ఆధునిక కాలానికి

ప్రశ్న 5.
తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించినదెవరు?
జవాబు:
పోరంకి దక్షిణామూర్తి

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 5 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1. అని చెప్పిన న మ్మానిని ……….. దలంచి తన సతితోడన్.
జవాబు:
అని చెప్పిన న మ్మానిని
సునయోక్తుల కలరి భూమిసురుఁ డా కృష్ణుం
గున నేఁగుట యిహపర సా
ధన మగు నని మదిఁ దలంచి తన సతితోడన్.

భావం : భార్య మాటలకు కుచేలుడు సంతోషించాడు. శ్రీకృష్ణుని చూచుట ఇహలోక, పరలోక సుఖములకు సాధనమగునని భావించి, తన భార్యతో ఇట్లు పలికినాడని (తరువాతి పద్యముతో అన్వయము)

2. ఉరుకరుణాయుతుండు సమయోచిత ………… లెఱుంగ భాస్కరా
జవాబు:
ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా
క్పరుషతఁ జూఫినన్ ఫలముగల్గుట తథ్యముగాదె యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!

భావం : మేఘుడు ప్రాణానికి భయం కలిగేటట్లు ఉరిమినను వెంటనే జనులను రక్షించు పట్టుదలతో అందరికీ ఆనందం కల్గునట్లు వర్షించును. అటులనే గొప్పదయ కలవాడు. సమయానుకూలముగా కఠినవాక్యము మాట్లాడినను తరువాత తప్పక మేలు కలిగిస్తాడు.

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. ‘అచలం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి ?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఈ పాఠ్యభాగం దున్న విశ్వనాథం. సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసుగారి తత్వాలు” నుండి గ్రహించబడింది. తెలంగాణ పద సంకీర్తన కవులలో ‘ఇద్దాసు’ కలికితురాయి.

ఇద్దాసు తత్వాలు ఆత్మపరంగ, తత్వపరంగ తెలంగాణ నుండి పుట్టిన మాణిక్యాలు, వేదాంత శాస్త్రజ్ఞాన సారాంశాన్ని సామాన్య ప్రజలకు ఈయన అందించాడు. వేదాంత తత్వాక అంశాలను పరిచయం చేయటం ఈ తత్వాల ఉద్దేశ్యం.

ఈ దేహం శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహం విడచిపెట్టాలి. మంచి గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అపుడే మోక్షాన్ని పొందగలుగుతాము. భార్యాబిడ్డలు, ధనధాన్యాల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలా ఈ దేహం రాలిపోక తప్పదు.

ఓ నామః అని అక్షరాలు రాస్తున్నాం నేర్చుకుంటున్నాం కాని, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాం. దాని అంతు తెలియక అల్లరిపాలు అవతున్నాం. మంచి చెడులను తెలుసుకొని మసలు కోవాలని ఇద్దాసు పలుకుతున్నారు.

ఈ లోకంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, దీనిని మనం గమనించాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరసుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగి శక్తిని పొందితే, ఆ రహస్యం అంతుచిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అజ్ఞాచక్రంమును పొందండి, తరించండి.

ఈ లోకం అంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. మనం గమనించాలి. మన దేహంలో షటం చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగే శక్తిని పొందితే, ఆ రహస్యం అంత చిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంమును పొందండి తరించండి.

ఈ దాసు చెప్పిన మాటలు సత్యములు. అందరూ అనుసరింపదగినవి. వీరశైవ మత గుర్తువైన బసవని యొక్క భావాలను అర్థం చేసుకుని ప్రవర్తించండి. అపుడే జీవన సాఫల్యం జరుగుతుంది.

2. ‘విద్యాలక్ష్యం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి ?
జవాబు:
ద్రోణుడు అగ్నివేశుడనే మహాముని వద్ద ధనుర్విద్యా పాఠంగతుడయ్యాడు. అనేక దివ్యాస్త్రాలు పొందాడు. తండ్రి ఆజ్ఞతో కృపాచార్యుని చెల్లెలైన కృపిని వివాహమాడాడు. అశ్వత్థామ అనే కుమారుడిని పొందాడు. ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళి వినయంతో తన్న తాను పరిచయం చేసుకుని ధనాన్ని ఆశించి మీ వద్దకు వచ్చాను అని అనగా పరశురాముడు తన వద్దనున్న ధనాన్నంతటినీ వేదజ్ఞానంగల బ్రాహ్మణులకు ఇచ్చివేసానని, తన దగ్గర శరీరం, శస్త్రాస్త్రాలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. అప్పుడు ద్రోణుడు ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి శస్త్రాస్త్రములు కాబట్టి వాటిని ప్రసాదించ మనగా పరశురాముడు అనేక దివ్యాస్త్రాలను బోధించాడు.

ఆ విధంగా పరశురాముని వద్ద నుండి యుద్ధవిద్యలు అభ్యసించి ధనాన్ని కోరి తన చిన్ననాటి మిత్రుడయిన ద్రుపదుని వద్దకు వెళ్ళగా ద్రుపదుడు ధన, అధికార గర్వంతో పేదవాడైన ద్రోణుని తీవ్రంగా అవమానపరచాడు. అవమాన భారంతో, కలత చెందిన మనసు కలవాడై, తన భార్య, కుమారుడు, అగ్రిహోత్రం, శిష్యసమేతంగా హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ పట్టణం బయట కౌరవ, పాండవులు చెండాట ఆడుతుండగా వాళ్ళాడుతున్న బంగారు బంతి బావిలో పడింది.

ఆకాశంలోని నక్షత్రంలా మెరుస్తున్న ఆ బంతిని బయటకు తీయలేక రాకురులం అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో అటువచ్చిన ద్రోణుడు ఆ బంతిని తన బాణము లతో తాడులాగా చేసి బంతిని బయటకు లాగి ఇచ్చాడు. అది చూసిన రాజకుమారు లందరూ ఆశ్చర్యపడి ద్రోణుడిని తీసుకుని వెళ్ళి భీష్మునికి జరిగినదంతా చెప్పారు. భీష్ముడు ద్రోణుడి వివరములడుగగా ద్రోణుడు తన వివరాలన్నీ తెలిపి ద్రుపదుని వలన కలిగిన అవమానం, కుమారుని ఆకలి బాధలు అన్నీ తెలిపాడు.

అది విన్న భీష్ముడు వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి ద్రోణుని గౌరవించి, ధనదానాలిచ్చి సంతోషపరచాడు. అంతేకాక తన మనమళ్ళ నందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి వీరులుగా తీర్చిదిద్దుమని కోరాడు ద్రోణుడు వారందరినీ శిష్యులుగా స్వీకరించాడు.

అర్జునుడు శస్త్రాస్త్ర విద్యలలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరచాడు. అస్త్రవిద్యలో అర్జునునికి’ గల పట్టుదలకి సంతోషించి అతనికంటే విలువిద్యలే అధికులు లేరు అన్నట్లుగా విద్య నేర్పిస్తానని వాగ్దానం చేసాడు. ద్రోణుడు కూడా అర్జునునికి అన్ని రకాల యుద్ధవ్యూహాలు, అస్త్ర, శస్త్రాలు సర్వము బోధించాడు. ఒకనాటి పరశురాముడు కూడా ఇంటివాడు కాదు అన్నట్లుగా అర్జునునికి విద్య నేర్పించాడు.

ద్రోణుని వలన శస్త్రాస్త్ర విద్యాబోధనను పొందటంలో రాజకుమారులు అంతా సమానమే అయినా అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు. రాజకుమారుల నైపుణ్యం తెలుసుకోవటం కోసం చెట్టు చివరన పక్షిబొమ్మను ఉంచి విద్యార్ధుల ఏకాగ్రతను ద్రోణుడు పరీక్షించగా అందరూ విఫలమవ్వగా అర్జునుడు తన ఏకాగ్రతతో లక్ష్యాన్ని భేదించాడు.

తరువాత మరొకసారి ద్రోణుడు సరస్సులో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ద్రోణుని కాలును పట్టుకోగా తాను సమర్థుడై ఉండి కూడా శిష్యుల నైపుణ్యం పరీక్షించదలచి రాకుమారులను కాపాడమని కోరాడు. వారంతా విడిపించలేక దిక్కుతోచని స్థితిలో ఉండగా మహాపరాక్రమంతో ఐదు బాణాలతో మొసలిని సంహరించి గురువును కాపాడుకున్నాడు అర్జునుడు. సంతోషించిన ద్రోణుడు అర్జునునికి అనేక దివ్యాస్త్రాలు ప్రసాదించాడు అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
సోమన రచనలను తెలిపి, వాటిని సంక్షిప్తంగా వివరించండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మచే రచించబడిన “చైతన్యలహరీ” అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి జీవితం, రచనలు, కవితాగుణాలు వివరించబడ్డాయి.

పాల్కురికి సోమనాథుడు దాదాపు 21 రచనలు చేశాడు.

1. బసవపురాణం.
2. పండితారాధ్య చరిత్ర
3. అనుభవసారం
4. చతుర్వేద సారము
5. సోమనాథభాష్యం
6. రుద్రభాష్యం
7. బసవరగడ
8. గంగోత్పత్తి రగడ
9. శ్రీ బసవారాధ్య రగడ
10. సద్గురు రగడ
11. చెన్నముల్లు సీసములు
12. నమస్కార గద్య
13. వృషాధిప శతకము
14. అక్షరాంక గద్య అష్టకం
15. పంచప్రకార గద్య
16. పంచకము
17. ఉదాహరణ యుగములు మొదలగునవి వాటిలో ముఖ్యమైనవి.

1. అనుభవసారం : సోమనాథుని మొదటి రచన ఇది. దీనిలో 245 పద్యాలున్నాయి. ఈ కావ్యంలో భక్తి స్వరూపం, లక్షణాలు, పూజా విధానం, జంగమ సేవ మొదలగు వీరశైవ ధర్మములు చెప్పబడ్డాయి.

2. బసవపురాణం : సోమన శ్రీశైల క్షేత్రమును దర్శించి భక్తి పారవశ్యముతో వ్రాసిన గ్రంథము ఇది. దీనిలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు, బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటు దీనిలో 75 గురు భక్తుల కథలున్నాయి. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవికథ, గొడగూడి కథ, ఉడుమూరి కన్నకప్ప కథ, మడిమేలు మాచయ్య కథలున్నాయి.

3. లఘుకృతులు : సోమనాథుడు శివ స్తుతిపరమైన కొన్ని లఘుకృతులను రచించాడు. వాటిలో 4 గద్యాలు, 1. రగడ, 2. ఉదాహరణములు 11 పంచకములు 2 అష్టకములు 1 స్తవము ఉన్నాయి.

4. వృషాధిప శతకం : బసవేశ్వరుని శివస్వరూపునిగా భావించి ఆయనపై 108 చంపక ఉత్పలమాలలతో రచించిన శతకమిది. సోమనాథుని అష్టభాషా ప్రావీణ్యమునకు ఇది ఒక ఉదాహరణ.

5. చతుర్వేదసారం : దీనిలో ‘బసవలింగ’ మకుటము గల 357 సీసపద్యాలున్నాయి. శైవమునకు సంబంధించిన భక్తి విషయాలు ఇందులో ఉన్నాయి.

6. చెన్నమల్లు సీసములు : ఇది 32 సీసపద్యాలు గల చిన్న కృతి.

7. రుద్రభాష్యం : ఇది లభ్యం కాలేదు.

8. సోమనాథ భాష్యం : ఇది ఒక సంస్కృత గ్రంథం. 25 ప్రకరణములున్నాయి. దీనినే బసవరాజీయం అంటారు. వీరశైవమతం తాంత్రికం కాదని శుద్ధవైదికమని.. నిరూపించటానికి ఈ గ్రంథాన్ని రచించాడు.

9. పండితారాధ్య చరిత్రము : ఇది సోమనాథుని చివరికృతి, ద్విపద రచించబడిన ప్రౌఢ పురాణ కావ్యం. దీనిలో మల్లిఖార్జున పండితారాధ్యుని పుణ్యచరిత్రతోపాటుగా పలువురి శివ భక్తులు చరిత్రలు వ్రాయబడ్డాయి. ఇది 12 వేల ద్విపదలతో రాయబడిన కావ్యం. సోమన కావ్యకళా విశిష్టతను, బహుభాషా పాండిత్యమును, సంగీత, నాట్య రసవాద, వైద్యశాస్త్రాల పరిజ్ఞానమును లోకానుభవంతో వ్రాయబడ్డాయి.

భాషలో ద్విపద రచనలో పాల్కురికి తరువాత తరాల వారికి మార్గదర్శకుడయ్యాడు. పోత భక్తి పారవశ్యానికి శ్రీనాథుని నుడికారమునకు, కృష్ణదేవరాయల వర్ణనాపటిమకు ఇతరుల విశిష్ట రచనలకు సోమనాథుని ద్విపదలైన బసవపురాణం పండితారాధ్య చరిత్రలే మార్గదర్శకాలని పండితుల అభిప్రాయం.

ప్రశ్న 2.
రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన విద్యావ్యవస్థలను వివరించండి.
జవాబు:
‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవా తత్పరత’ అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది.
వెంకట రామారెడ్డి అందరి మన్ననలను పొందిన వ్యక్తి. బహుభాషావేత్త. తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి. ఆయనకు విద్యపట్ల శ్రద్ధగలవారు. పలు విద్యాసంస్థలను స్థాపించి ప్రజాసేవ చేశారు.

1. బాలికల ఉన్నత పాఠశాల : మొత్తం హైదరాబాదు రాష్ట్రంలో మన బాలికలకు మాతృభాషా బోధనకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేకపోవటం దురదృష్టకరమని రెడ్డిగారు భావించారు. ఉన్నత పాఠశాలల్లో కూడా ఉర్దూ, ఆంగ్ల మాధ్యమ బోధన జరుగుతుంది.

కావున హైదరాబాదులో ఒక మాతృభాషా పాఠశాలను బాలికల కోసం నిర్మించాలని తలచి స్త్రీ విద్యా ప్రోత్సాహకులు మాడపాటి హనుమంతరావు గారిని కలిసి బాలికల పాఠశాలను నిర్మించారు. ఇది బొంబాయిలో ‘కార్వే’ మహాశయులు స్థాపించిన మహిళా విద్యాపీఠంతో జత చేశారు. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి ఉన్నారు.

2. పరోపకారిణీ బాలికా పాఠశాల: హైదరాబాద్లో రామారెడ్డిగారు స్థాపించిన మరొక పాఠశాల పరోపకారిణీ బాలికా పాఠశాల. ఇది ప్రైమరీ తరగతి వరకు ఉన్నది. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి ఉన్నారు.

3. ఎక్సెల్ సియర్ మిడిల్ పాఠశాల : ఈ పాఠశాలను 1945లో స్థాపించారు. దీని పాలక వర్గ’ అధ్యక్షులు రామారెడ్డిగారే ! దీనిలో తెలుగు బాలురకే ప్రవేశముంది. ఇంగ్ల, ఉర్దూ మాధ్యమాలు లేకపోవటంతో అంతగా విద్యార్థులు ఆసక్తి చూపలేదు.

4. బాలికా పాఠశాల (గొల్లభిడ్కి): హైదరాబాదు గొల్లఖిడ్కిలో ఒక ఆంధ్రబాలికా పాఠశాలను ప్రజాసేవకులు కొందరు స్థాపించారు. దీని బాధ్యతను కూడా రెడ్డిగారే స్వీకరించారు.

5. పరోపకారిణీ బాలికా పాఠశాల : సికింద్రాబాదు నగరంలో కీ॥శే॥ సీతమ్మగారు కాలంలో ఉండేవారు. ఆమె తన జీవితాన్ని ధారపోసి ఒక మాధ్యమిక పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాల అభివృద్ధికి రెడ్డిగారు సహాయ పడ్డారు.

6. ఆంధ్రవిద్యాలయం : హైదరాబాదు నగరంలో తెలుగు పిల్లలకు మాతృభాష ద్వారా చదువు చెప్పుటకు ఒక్క మాధ్యమిక పాఠశాల కూడా లేదు. 1931లో దేవరకొండ సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి గారు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఎలాగైనా ఒక పాఠశాలను నిర్మించాలని తీర్మానం చేశారు. అది చివరకు సెప్టెంబరు 1, 1944కు కానీ సానుకూలం కాలేదు. ఆ తరువాత ఇది 1947 నాటికి రెడ్డిగారి చలవతో ఉన్నత పాఠశాలగా ఎదిగింది.

ఇలా రాజాబహద్దూర్ రామారెడ్డిగారు విద్యపట్ల మిక్కిలి ఆసక్తిని కనపరచి, తెలుగు మాధ్యమంలో బాలికలు చదువుకోవటానికి పాఠశాలలను స్థాపించటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులయ్యారు.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
గొల్ల రామవ్వ ఉద్యమకారుని ఏ విధంగా రక్షించింది ?
జవాబు:
‘గొల్లరామవ్వ’ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకట నరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభివాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన “గొల్లరామవ్వ – మరి కొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తిపోరాట కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది.

నిజాం పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్ ‘వాలంటీరును, విప్లవ కారుడిని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతివృత్తం గొల్లరామవ్వకథ. తెలంగాణపోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్ తెలంగాణలో అదో పల్లె. ఆ పల్లెలోకి ఉద్యమకారులు ప్రవేశించి రజాకార్లను, పోలీసులకు, నవాబులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నారని నిజాం ప్రభుత్వవాదన. ఆ రోజు ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు సమాచారం. అర్ధరాత్రి ప్రశాంత వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తూ బాంబులమోత.

గొల్లరామవ్వ తన’ గుడిసెలో చీకటిలోనే కూర్చొని ఉంది. ఆమె వడిలో భయం భయంగా పదిహేనేండ్ల బాలిక తలదాచుకుని ఉంది.

“అవ్వా గిప్పుడిదేం చప్పుడే” అని ప్రశ్నించింది మనమరాలు. “నీకెందుకే మొద్దుముండ, గదేంది గిదేంది – ఎప్పటికి అడుగుడే” అని కసిరింది. ఇంతలో ఇంటికిటికీ చప్పుడు ఆ కిటికీ గుండా ఓ అగంతకుడి ప్రవేశం. అతడు అవ్వ దగ్గరకు వచ్చి “చప్పుడు చేయకు” నేను దొంగను కాను, రజాకార్నుకాను, పోలీసును కాను, మిమ్మల్ని ఏమీ అనను. లొల్లి చేయకండి” అన్నాడు.

నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీరును వారి నుండి మిమ్మల్ని రక్షించేవాడిని అన్నాడు. అతని శారీరక పరిస్థితిని తెలుసుకున్న అవ్వ మనఃస్థితిలో కాయకల్పమైంది. భావ పరివర్తన కలిగింది. “ఇదేం గతిరానీకు? గిట్లెందుకైనవు కొడకా? అని ప్రశ్నించింది.

“రాజోలిగెఉన్నవు కొడకా! నీ కెందుకు కొచ్చెరా ఈ కట్టం. పండు పండు గొంగల్ల పండు, బీరిపోతవేందిరా! పండు” అని అతన్ని ఓదార్చి సపర్యలు చేసింది. “కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లలు పిసుక్కొచ్చిన గింత కడుపుల పడేసుకో” అంది. యువకుడు లేచాడు. అవ్వ ఇచ్చినది ప్రసాదంగా తీసుకున్నాడు.

పాలు పిండేవేళయింది. యువకుడు నిద్రపోతునే ఉన్నాడు. ఇంతలో “చస్తి సస్తి నీబాంచెన్… నాకెరుక లేదు, అయ్యో వావ్వో! వాయ్యో అన్న అరుపులు మిన్ను ముట్టే ఆక్రోశాలు” యువకుడు లేచాడు రివాల్వరు తోటాలతో నింపుకుని బయలుదేరాడు. వెనుక నుండి అతని భుజం మీద మరొక చేయబడ్డది”. యాడికి? అన్న ప్రశ్న. ముసల్వ మరేం మాట్లాడలేను. అతన్ని చెయ్యపట్టి వెనక్కి లాంగింది.

యువకునికి మనవరాలి చేత దుప్పటి కండువాను ఇప్పించింది. అతడిచే “గొల్లేశమేయిచింది. ఎవడన్నా మాట్లాడిత్తే గొల్లునోలె మాట్లాడాలె” అన్నది. ఈ లోపు పోలీసులు అవ్వ ఇంటికి రానేవస్తిరి. ఇంకేముంది గొల్ల వేసమంతా వ్యర్థమైనట్లే అనుకున్నాడు యువకుడు. అవ్వ మనవరాలితో “మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడయ్యె! పిల్లగా ఆండ్ల పండుకో. ఊ పండుకో” అంది. “పొల్లా పోరని మంచానికి నాగడంచే అడ్డం పెట్టు” “మల్లీ మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊనడూ అంది”. “చెయ్యసి పండుకో పోండా దానిమీద! చూసెటోని కనువాదం రావద్దు” అంది.

అంతలోనే ఇట్లకొచ్చిన పోలీసోళ్ళు ఆ యువకుని చూసి “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడా యేం” అని అవ్వను గద్దించాడు వాడెవ్వడా! ఎవ్వడు పడితేవాడు మా పక్కలల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నావా? నిన్నెవడన్నా గట్లనే అడుగుతే ఎట్లంటది అని బొంకింది. అవ్వ మంచంమీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరో వైపు మల్లి. అపూర్వ సమ్మేళనం. అవ్వా నీవు సామాన్యరాలువుకావు. సాక్షాత్తు భారతమాతవే” అన్నాడు.

ప్రశ్న 2.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి ?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించ బడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది.

తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది. యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని, చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తనతల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత. పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ? చదువుకుంది. సంస్కారం ఉంది.

మరీ అంత అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేను. నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి. నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.

నా గురించి మీరు ఇల్లు అమ్ముకుని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, ‘వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిత్వం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకో గలను. నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది.

ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను. మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడే వాడు దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొవాలి. ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి తనతోపాటు స్త్రీ జాతి కంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

ప్రశ్న 3.
ఈ కథ ఆధారంగా హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాలను చర్చించండి ?
జవాబు:
‘ఇన్సానియత్’ అను పాఠ్యభాగం డా. దిలావర్ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను తెలియ చేస్తుంది. కులాలు మతాలు అనే భేదం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు, పరస్పర సహకారాలు, సహజీవన సంస్కృతిని తెలియపరస్తుంది.

కాలక్రమేణ నగరాల్లోని. స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతాలలోకి వ్యాపించడం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్నతమైన మానవీయ అనుబంధాలను ఈ కథ వివరిస్తుంది. వర్తమాన సమాజంలో లుప్తమవుతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానాలపై ఆత్మవిమర్శ చేసుకోమని తెలియచేస్తుంది.

పూర్వం గ్రామాలలోని ప్రజలంతా కుల మత భేదం లేకుండా అందరూ అందర్నీ అత్తా, అక్కడ, బావా, అత్తా,మద్దీ, మామ అని పిలుచుకునేవారు. వారి మధ్య ప్రేమాభిమానాలకు కుల మతాలు అడ్డు వచ్చేవికావు. ఎంతపెద్ద కులంలో పుట్టినా వారిలో కూడా మిగిలిన వారి పట్ల ఆత్మీయానురాగాలు ఉండేవి. ఒకరినొకరు చక్కగా గౌరవించుకునేవారు. దీనికి నిదర్శనం, ఈ కథలోని రాధమ్మత్త, సోందుబాబుల మధ్య జరిగిన సంభాషణలే !

ముస్లిం అయిన సోందుబాబు హిందువైన రాధమ్మను అత్తమ్మా అని పిలవడం ఇందుకు ఒక ఉదాహరణ.

“ఏం! రాధత్తమ్మా! అంత మంచేనా!” అని సోందుబాబు అంటే “బానే ఉన్న పోరగా! మీరంతా మంచేనా” అని రాధమ్మ అనటంలో వారి మధ్య ఉన్న ఆప్యాయత అను రాగాలు మనకు అర్థమౌతాయి.

అలాగే పాతిమా రాంరెడ్డిని “మర్దీ! సీమకు సుత అపకారం చెయ్యని నా కొడుకుని చూసి ఓర్వలేక అల్లా తీస్కపోతన్నడు” అనడం ముస్లిం హిందూ కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయతా, అనుబంధాలకు ఒక నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది”.

“మర్దీ! కడుపుకోత ఎట్ల అగులు బుగులుగ ఉంటదో అనుబగిత్తన్నా! నా కొడుకును మట్టిల గల్పుకుంటున్నా. నా కొడుకు పానం వంటిదే నీ కొడుకుపానం” నా కొడుకు హయత్ సుత బోస్కొని నీ కొడుకు నిండు నూరేళ్ళు బత్కాలే” అనటం “మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గాని కులము మతము కాదన్న మానవతను, ఆత్మీయ అనుబంధాలను తెలియచెప్తుంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

ప్రశ్న 4.
బిచ్చగాడు కథలోని ప్రయాణీకుల మనస్తత్వాన్ని విశ్లేషించండి ?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్ చే రచించబడింది. ఈయన అసలుపేరు దొంగరి మల్లయ్య. ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీనమనసత్వాలను చక్కగా వివరించాడు. సమాజంలోని మనుషుల స్పందనా రాహిత్యాన్ని అమానవీయతను నైతిక పతనాన్ని ఈ కథ వివరిస్తుంది.

రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహానికి వెళ్ళి తిరిగి వరంగల్కు ప్రయాణం చేసే సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కథ ఇది. ఆ రోజు స్టేషన్ చాల రద్దీగా ఉంది. టికెట్ దొరికే అవకాశం ఏ మాత్రం కన్పించలేదు. అంతలో ఒకప్పటి తన విద్యార్థి భాస్కర్ సి. ఐగా పని చేస్తాడు. అతని పుణ్యమా అని టికెట్ సంపాదించి ట్రైన్లోకి ప్రవేశించాడు. కూర్చోటానికి సీటు ఎక్కడా ఖాళీ లేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఒక సీటు మొత్తాన్ని ఒక స్త్రీ తన సామానులతో ఆక్రమించింది. ఆ సామానంతా అటూ ఇటూ జరిపితే ఐదుగురు కూర్చోవచ్చు. ఆ స్త్రీ చాలపేదరాలుగా ఉంది. బిచ్చగత్తెలా ఉంది. నలుగురు సంతానంతో చినిగిపోయిన గుడ్డపీలికలు కట్టుకునుండి. మురికిగా అసహ్యంగా ఉన్నారు. ఎలాగోలా అక్కడ కూర్చోవాలని “ఇదిగో ఇటుచూడు…. ఆ సామానంతా క్రిందపెట్టేస్తే ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చుగా అన్నాడు. ఆ స్త్రీ “గదంతేం లేదు మేము సామాను తియ్యం. ఇంకో డబ్బాలోకి పోయికూకో”చాలా మొరటుగా సమాధానం చెప్పింది.

ఇంతలో అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. “అధునా భిచ్చముండవు. – నీ కింత పొగరుండీ మాకెంతుండాల్నే? ఆ సారెంత మర్యాదగా అడిగిండు- ఈ రైలు మీ తాతదనుకన్నావా” అని గద్దించాడు. చివరికి అక్కడ కూర్చున్నారు కవిగారు.

ఇంతలో గార్డువిజిల్ విన్పించింది. ఆ బిచ్చగత్తె గొంతులో ఆందోళన. “మీ అయ్యేడిరా! ఎక్కడ సచ్చిండు? రైలు పోతాంది” అంది ఇంతలో టికెట్ కోసం వెళ్ళిన వాడు వచ్చాడు. “టికెట్ దొరకనేలేదు బండిపోతాంది. సామానునంతా కిందకి దించి మీరు దిగుండే” అన్నాడు.

“ఓరిపిచ్చిగాడిద కొడకా సామానునంతా దించే వరకు బండి ఆగుతుందా ఏమిటి? టి.సి. గారితోని చెప్పి బండిలో కూర్చో అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పటికే ఆ బిచ్చగాడు బండిదిగి టికెట్ తీయమని డబ్బులిచ్చిన వాడి దగ్గరకు పరిగెత్తాడు. ఆడురాక పోతే

టి.సీకి కట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అన్నారొకరు. “ఒక్కపైసాలేదు. లేదు బాంచెను “అందామె ఏడుస్తూ “నువ్వట్లనే అంటావు. ఇయ్యాళేపు బిచ్చగాళ్ళ దగ్గరున్నన్ని డబ్బులు మా అసంట్లోళ్ళ దగ్గర కూడా లేవు. మీకేందే పెట్టుబడి లేని వ్యాపారం” అన్నాడు ఎగతాళిగా. అక్కడ ఉన్నవారందరూ చులకనగా నవ్వారు.

మీ పనే బాగుందిరా. ఎక్కడా బిచ్చమే… కానీ ఖర్చులేని బతక్కు అన్నాడకొడు. ఊళ్ళన్నీ వాళ్ళవే ! దేశాలన్నీ వాళ్ళవే దొరికింది తింటారు. లేకుంటే పస్తులుంటారు. ఏ బాదరాబందీ లేదు. మనకంటే వాళ్ళేనయం అన్నాడో ప్రయాణీకుడు. టి.సి రావడం ఆ బిచ్చగాణ్ణి బెదిరించడం జరిగాయి. ఆ బిచ్చగాడి రుమాలులో డబ్బులు కిందపడ్డాయి. అక్కడి ప్రయాణీకులలో బిచ్చగాడిపట్ల అప్పటి వరకు ఉన్న సానుభూతి ఎరిగిపోయింది.

“దొంగముండా కొడుకులు. వీళ్ళను చచ్చినా నమ్మోద్దు. టి.టి గారికి వీళ్ళ సంగతి బాగా తెలుసు. మంచిపని చేసుండు” అన్నాడు ఆ ఖద్దరు బట్టల నాయకుడు. నిండుచూలాలు వీళ్ళకు ఇలా జరుగుతుంటే వారిపై ప్రయాణీకులెవరికి జాలికలుగలేదు. అదే విషయం సినిమాలో చూస్తే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తారు.

మేమంతా, టికెట్లు కొన్నాం. వీళ్ళు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. మనకు లేని ప్రివిలేజ్ వీళ్ళకెందుకు పొందాలి అన్న ఈర్ష్య వారిలో కన్పించింది. టీ.సి ఆ గర్భిణి నుండి ‘సంచిని లాక్కొని డబ్బంతా కింద బోర్లించాడు. ఫైనుతో టికెట్కు సరిపడా డబ్బులు తీసుకుని మిగిలినవి ఆమెకివ్వబోయాడు. “వాటిని కూడా వార్నేతీసుకోమనురి” అంది ఆమె.

“చెప్పుతీసుకుని తంతాను దొంగముండా” అని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఒక కాగితం ముక్క ఆ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఆ చీటిలో 22 రూపాయలే రాసి ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు బిచ్చగాడో కవిగారికి అర్థం కాలేదు. భిన్నమనస్తత్వాలు గల వ్యక్తులు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని కవి బాధపడ్డాడు.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
సజ్జనుల జేయులేడెంత చతురుడైన
జవాబు:
పరిచయం : శేషప్ప కవిచే రచింపబడిన నృసింహశతకం నుండి గ్రహించిన పద్యభాగం.
సందర్భము : క్రూరజీవులనైన అదుపు చేయవచ్చుగానీ, దుర్మార్గుల మనసును ఎంతటితెలివిగల వాడైనను, మార్చలేడని కవి చెబుతున్న సందర్భంలోనిది.
భావము : భుజముల శక్తిచే పెద్దపులులు చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించ వచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

ప్రశ్న 2.
దారిద్ర్యంబున కంటెఁగష్టంబొండెద్దియులేదు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం నన్నయభట్టుచే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.
సందర్భం : తనకుమారుని ఆకలి బాధను ద్రోణుడు భీష్మునికి చెప్పిన సందర్భంలోనిది.
భావం : ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు తాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో నాకు కూడా పాలు పోయడని ఏడ్చాడు. దానిని చూచి. దారిద్య్రం కంటే కష్టం మరొకటి లేదని భావించి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని దగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళాడు.

ప్రశ్న 3.
రంగులు వేరైనా నరజాతి నరంగు మానవత్వమే.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘ కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భము : కవి మానవతను గూర్చి వివరించిన సందర్భంలోనిది.
భావము : ఏడురంగుల సమ్మేళనం ఇంద్రధనస్సు. కాని దాని ఛాయ ఒకటే. ఏడు రంగుల సమ్మేళం అయినా చంద్రుని కాంతి తెలుపే. ఎన్ని వర్ణాలవారున్నా మానవులు నందరిని నడిపించే సరంగు మానవత్వమే అని ఇందలి భావము.

ప్రశ్న 4.
ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, ‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అన్న కవితా. ఖండికలోనిది.
సందర్భము : మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని అసలు విషయాన్ని తెలుసుకోమని చెప్పిన సందర్భంలోనిది.
భావము : కత్తిపట్టి గెలిచిన వీరుడెవ్వరూ లేడు. కాని మెత్తని హృదయంతో లొంగనివారు ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి అహింస మార్గాన్ని ఎంచుకోవాలి. హింస ద్వారా సంతోషం ఏనాటికి లభించదని ఇందలి భావం.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
కుచేలుడి దారిద్ర్యాన్ని వర్ణించండి.
జవాబు:
కుచేలుడు అతని భార్యాపిల్లలు ఆకలి బాధతో కృశించిపోయారు. కుచేలుడు పేదరికంలో చిక్కి శల్యమైన శరీర అవయవములు కలిగి ఉన్నాడు. చినిగిన బట్టలు ధరించాడు. మనసులో శ్రీకృష్ణుడు సహాయం చేస్తాడనే గొప్ప ఆశతో ఉండి, చూడగానే నవ్వు పుట్టించే వాడుగా ఉన్నాడు. చినిగిన వస్త్రాన్ని ధరించి తన మిత్రుడైన శ్రీకృష్ణుని చూసి తొట్రుపాటుతో దూరంగా నిలబడ్డాడు అని కుచేలుని దారిద్ర్య స్థితిని వర్ణించాడు.

ప్రశ్న 2.
దేహ తత్త్వాన్ని గురించి ఇద్దాసు ఏమి చెప్తున్నాడు ?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ఏడ చూసినా ఏమీ లేదు. అంతామిథ్య. ఎక్కడ వెదకినా ఏమీ కన్పించదు. అంతా శూన్యం. అజ్ఞానంలో ఉన్నంత కాలం చీకటే కన్పిస్తుంది. అజ్ఞానాన్ని వదలి గురుని నమ్మి ఆయనను అనుసరిస్తే ఫలితం ఉంటుంది. మానవులు జీడికంటి వంటి నేత్రాలను తెరచుకోవాలి. ఆ జ్ఞాన నేత్రాలు, ఆ అగ్నినేత్రాలు మన దేహం తత్వాన్ని తెలియచేస్తాయి. అపుడు గురుని ద్వారా ముక్తి మూలాలను తెలుసుకోగలమని దున్న ఇద్దాసు వివరించాడు.

ప్రశ్న 3.
బలిష్టునికే బంధుసహాయం అందుతుందని ఎలా చెప్పవచ్చు ?
జవాబు:
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.

ప్రశ్న 4.
ద్రుపదుని చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు ?
జవాబు:
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో – సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ఇలా అన్నాడు. ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధనవంతులు తమ అధికార బలాన్ని దేనికి ఉపయోగించాలి ?
జవాబు:
రాజాబహద్దూర్ వెంటకరామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వేంకట రామారెడ్డి జీవిత చరిత్ర” నుండి గ్రహించబడింది.

భారతదేశంలోను, మన రాష్ట్రంలోను అధికారులు, గొప్ప గొప్ప ఉద్యోగులు ఎందరో …. ఉన్నారు. వారందరూ ధనమును బాగా సంపాదించినవారే ! గొప్ప గొప్ప బిరుదులను పొందినవారే ! కాని వారిని లోకం గుర్తించలేదు. దానికి కారణం వారిలో సామాజిక సంఘసేవా తత్పరత లేకపోవటమే! ఎంతటి గొప్పవారైనా ఎంతటి ధనికులైనా సంఘ సేవ చేయని ఎడల గుర్తింపు పొందరు.

తాము సంపాదించిన ధనములో ఎంతోకొంత సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి. దేశాభివృద్ధికి ప్రజలలో మంచిని ప్రబోధించటానికి తప్పక వినియోగించాలి. అలా చేయనిఎడల గుర్తింపును కోల్పోతారు. రామారెడ్డిగారు ఇతరుల వలే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా మంచిపలుకుబడిని ప్రజానురాగాన్ని పొందారు. దానికి కారణం ఆయన తన ధనాన్ని శక్తిని, పలుకుబడిని ప్రజాభ్యుదయానికి ఉపయోగించారు.

కాబట్టి ధనవంతులు అధికారులు తమ అధికారాన్ని ధనాన్ని ఇతరుల కోసం, సమాజాభివృద్ధికి ఉపయోగించాలి.

ప్రశ్న 2.
సోమన లఘుకృతులను గురించి క్లుప్తంగా రాయండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణశర్మచే రచించనబడిన ‘చైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో సోమనాథుని రచనలలోని భాష ఛందస్సులలో నూతనత్వాన్ని ఎలా తీసుకువచ్చాడో వివరించబడింది. సోమనాథుని రచనలను, వర్ణనానైపుణ్యాన్ని ఇందులో వివరించాడు. పాల్కురికి రాసిన 21 రచనలను పేర్కొంటూ వాటిలో లఘు కృతులను తెలియజేశాడు.

సోమనాథుడు శివభక్తి తత్పరుడైన బసవేశ్వరుని పై భక్తి తన్మయత్వంతో కొన్ని లఘుకృతులను రచించాడు. అవి 1. రగడ 4 గద్యలు, 2 ఉదాహరణలు 11 పంచకములు 2 అష్టకములు, 1 స్తవము ఉన్నాయి. ఇవన్నీ వైరశైవయుత సంబంధ రచనలే.

ప్రశ్న 3.
రంతిదేవుని ద్వారా వ్యాసుడు పలికించిన ధర్మం ఏమిటి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అన్న ‘పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అను వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.

మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే అంశాలు కోకొల్లలు. వేదముల నుండి పురాణాల వరకు అన్నింటిలోనూ ఈ ప్రస్తావన ఉంది. మహాభారతంలో దధీచి, శిబి, రంతిదేవుని పాత్రల ద్వారా ఈ విషయాన్ని వ్యాసుల వారు వివరించారు. మానవతావాది, త్యాగశీలి, దయాశీలి రంతిదేవుని మాటల్లో “నత్వహం కామయే రాజ్యం”…..

అన్న శ్లోకం ద్వారా “నాకు రాజ్యము వద్దు, నాకు స్వర్గమూ వద్దు, నాకు మోక్షము వద్దు దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగి పోవటమేకావాలి” అని చెప్పబడింది. భాగవతంలో కూడా “న కామయే హం గతి మీశ్వరాత్. .” అన్న శ్లోకంలో కూడా దుఃఖపీడితుల హృదయాల్లో తానుడంటూ బాధలను తాను అనుభవించైనా వారి దుఃఖాలను పోగొట్టాలి అని రంతిదేవుడు చెప్పిన మాటలు నిజంగా మానవతకు సంబంధించినది.

ప్రశ్న 4.
బతుకమ్మ పాటలోని విశేషాలు ఏమిటి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి గ్రహించబడింది. బతుకమ్మ పండుగ ఆట పాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడిదుడుకులు లేక క్రమగతిలో ఒకే స్వరంలో సాగిపోతాయి. కంఠస్వరంనాళాలకు, గర్భాశయానికి హానికలుగని మధ్యమస్థాయిలో స్త్రీలు పాటలు పాడుతుంటారు. సహజ సంగీతంతో సాగిపోయే బతుకమ్మ పాటలను సంగీత శాస్త్ర నియమాలు, లక్షణాలతో పనిలేదు.

వీరి పాట నాట్యాన్ని అనుసరించి ఉంటుంది. బతుకమ్మ ఆటకు అనుగుణంగా ఉంటాయి. వీరి పాటలు పౌరాణిక గీతాలుగా, నీతి బోధకాలుగా, కథాగేయాలుగా ఉంటాయి. వారి పాటలలో ఉయ్యాలో, వలలో, చందమామ అన్న పల్లవులు ఆవృతాలవుతుంటాయి. సూర్యాస్త సమయంలో బతుకమ్మ పాటలు పాడతారు కాబట్టి చందమామ” అని, గౌరమ్మను నీటిలో ఓలలాడిస్తారు కావున వలలో” అని ‘ఊయలవలె’ ఊగుతూ పాడతారు కావున ఊయాలో” అన్న పదాలుంటాయి.

బతుకమ్మకు వీడ్కోలు చెప్తున్న ఈ పాటలో
“నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు…..”

ఈ పాటలో జగజ్జననికి జనని జానపదయువతి. స్త్రీది మాతృ హృదయం. చిన్నారి పాపను జో కొడుతూ పాడే పాటలను బతుకమ్మ పాటగా పాడుతుంది. బతుకమ్మ పాటలలో స్త్రీల మనోభాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.
ఉదాహరణకు.
“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో – గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో – వచ్చేరిసతిగూడి ఉయ్యాలో”
పనులలో అలుపు సొలుపు తెలియకుండా పాడే ఈ పాటలు పరమాత్మ స్వరూపాలు.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
నన్నయ గురించి తెలపండి.
జవాబు:
నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనాభి శోభితుడు, లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు అయిన నన్నయ సాగించిన భారతానువాదం అనన్య సామాన్యం. వేదవ్యాస విరచితమై పంచమ వేదంగా చెప్పుకొనే సంస్కృత మహాభారతాన్ని రాజరాజు కోరిక మేరకు తెలుగులోకి అను వాదం చేసాడు. నన్నయ ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’ అంటూ సంస్కృత శ్లోకంతో మహా భారతాన్ని మొదలుపెట్టి ఆనాటి ప్రాచీన విద్వాంసుల మెప్పు పొందాడు.

బహుభాషా విజ్ఞుడు, ఉద్దండపండితుడు అయిన నన్నయ మహాభారతంలో ఆది, సభా, అరణ్యపర్వంలోని నాల్గవ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించాడు. వాటితోపాటు ఆంధ్ర శబ్దచింతామణి, చాముండికా విలాసం, ఇంద్రవిజయం, లక్షణసారం అనే గ్రంథాలు రచించాడు. మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో నన్నయ భారతాను వాదానికి ఉపక్రమించాడు. మహాభారతాన్ని చంపూ పద్ధతిలో అనువదించిన నన్నయ భారత రచన ఒక స్వతంత్ర రచనలాగా సాగింది. నన్నయ తదనంతర కవులెందరికో మార్గదర్శకుడై “ఆదికవి” అనిపించుకున్నాడు.

ప్రశ్న 2.
ఏనుగు లక్ష్మణకవిని గురించి తెలపండి.
జవాబు:
భర్తృహరి సుభాషిత త్రిశలు అనే పేరుతో సంస్కృతం వంటి మూడు శతకాలు రచించాడు. అవి నీతి, వైరాగ్య శృంగార శతకాలు. ఈ సుభాషిత త్రిశతిని తెలుగులో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మనలు తెలుగులోకి అనువదించారు. వీటిలో ఏనుగు లక్ష్మణకవి రచన ప్రాచుర్యం పొందింది.

ప్రశ్న 3.
గడియారం రామకృష్ణ శర్మ రచయిత గురించి తెలపండి.
జవాబు:
గడియారం రామకృష్ణశర్మ మార్చి 6. 1919న అనంతపురం జిల్లాలో సుబ్బమ్మ జ్వాలాపతి దంపతులకు జన్మించాడు. ఆయన పుట్టింది అనంతపురం జిల్లాలో అయినా స్థిరపడింది ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా అలంపురం లోనే! ఆయన తన జీవిషాన్నంతటిని తెలంగాణ సంస్కృతి వారసత్వ పరిరక్షణకు ధారపోశారు. ఈయన గురువు తిరుపతి వేంకటకవుల శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి. ఈయన సంస్కృతం, తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషలలో పండితుడు.

తెలుగు భాషపట్ల ‘నిజాం ప్రభువు చిన్నచూపు చూడటం సహించలేక ఆంధ్ర మహాసభల ఏర్పాటుకు కృషి చేసి కార్యదర్శిగా పనిచేశారు. ‘ఆంధ్ర సారస్వత్ పరిషత్’ స్థాపనలో కీలక పాత్ర వహించారు. నిజాం ప్రభుత్వ రేడియోకి వ్యతిరేకంగా ‘భాగ్యనగర్ రేడియో’ను అజ్ఞాతంగా నడిపారు.

గడియారం వారు మంచి సంఘసంస్కర్త. సంస్కరణను తనతోనే ప్రారంభించి వితంతు వివాహం చేసుకున్నారు. పలు వితంతు వివాహాలను గూడా జరిపించారు. 1972 ఆగిపోయిన సుజాత పత్రికను పునరుద్ధరించారు.

మెకంజీ కైఫీయత్తులను పరిశీలించి వాయించారు. ‘తెలంగాణ శాసనాలు’ గ్రంథం రెండవ సంపుటిని ప్రచురించారు. కన్నడ సాహిత్య చరిత్రను పరిశోధనాత్మకంగా వ్రాశాడు. కన్నడకవి ‘రన్నడు’ వ్రాసిన గదాయుద్ధాన్ని’ తెలుగునకు అనువదించాడు. అలంపురం చరిత్ర, విద్యారణ్యస్వామి చరిత్రలను ప్రామాణిక ‘శతపత్రం’, 2006లో ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 2006 జులైలో గడియారం వారు తుదిశ్వాస విడిచారు.

ప్రశ్న 4.
డా॥ సామల సదాశివ కవిని గురించి తెలపండి.
జవాబు:
డా॥ సామల సదాశివ భిన్న భాషా సంస్కృతులకు వారధి ఈయన మే 11, 1928 న ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెలుగు పల్లె గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు, అధ్యాపక వృత్తిని చేపట్టి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ, తెలుగు భాషలలో పాండిత్యాన్ని సంపాదించారు. ప్రభాతము అనే లఘు క్యాన్ని సాంబశివ శతకం, నిరీక్షణ, అంబపాలి, సర్వస్వదానం, విశ్వామిత్రము వీరి తొలి రచనలు.

హిందూస్థానీ సంగీత కళాకారులపై మలయ మారుషాలు ప్రముఖులు జ్ఞాపకాలు, అనుభవాలు గల ‘యాది’ సంగీత శిఖరాలు, వీరి రచనలే. అమాన్ రుబాయిలు’ అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2011లో లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సన్మానించాయి. ఈయన రచనలపై పరిశోధనలు జరిగాయి. ఆగస్టు 7, 2012న పరమపదించారు.
ప్రస్తుత పాఠ్యభాగ్యం డా|| సి. నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘వ్యాసగు ళచ్ఛం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(పద్యభాగం నుండి).

ప్రశ్న 1.
మనిషికి శత్రువు ఎవరు ?
జవాబు:
కోపము

ప్రశ్న 2.
‘మహైక’ కావ్యాన్ని ఎవరు అంకితంగా స్వీకరించారు ?
జవాబు:
తెలంగాణ యోధుడు ‘సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితమిచ్చాడు.

ప్రశ్న 3.
ద్రోణుడి మిత్రుడి పేరేమిటి ?
జవాబు:
ద్రుపదుడు

ప్రశ్న 4.
అజ్ఞానాన్ని కవి దేనితో పోల్చాడు.
జవాబు:
అజ్ఞానాన్ని “అడుసు”తో పోల్చాడు.

ప్రశ్న 5.
తెలంగాణలో గొప్ప ‘అచల’ గురువు
జవాబు:
దున్న ఇద్దాసు

ప్రశ్న 6.
శ్రీకృష్ణుడు కుచేలుడికి ఏమి ప్రసాదించాడు ?
జవాబు:
ఇంద్రాది దేవతలకు సాధ్యంకాని అనేక సంపదలిచ్చాడు.

ప్రశ్న 7.
నన్నయ ఎవరి ఆస్థానకవి ?
జవాబు:
రాజరాజ నరేంద్రుడు

ప్రశ్న 8.
భాస్కర శతకకర్త ఎవరు ?
జవాబు:
మారద వెంకయ్య.

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
ఆచార్య రవ్వా శ్రీహరి రచనలు తెలియచేయండి ?
జవాబు:
తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలంగాణ మాండలికాలు కావ్యప్రయోగాలు, అన్నమయ్య భాషా వైభవం వంటి 40 గ్రంథాలను రచించారు.

ప్రశ్న 2.
‘పాల్కురికి సోమనాథుడు’ పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ

ప్రశ్న 3.
రావి ప్రేమలత “వ్యాసలతిక”కు లభించిన పురస్కారం ఏది ?
జవాబు:
ఉత్తమ విమర్శన గ్రంథంగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది.

ప్రశ్న 4.
సోమన తల్లిదండ్రులెవరు ?
జవాబు:
తల్లి శ్రియాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు

ప్రశ్న 5.
‘సంచ్’ ఎవరు ?
జవాబు:
‘సర్ంచ్’ ఆ కాలంలో ఉన్న పోలీసు శాఖామంత్రి.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

ప్రశ్న 6.
“లొల్లిలో లొల్లి” జాతీయం ఆధారంగా ఒక వాక్యం రాయండి.
జవాబు:
రాజకీయ పార్టీలు అవినీతిని గురించి ఇప్పుడు లొల్లిలో లొల్లి చేస్తున్నాయి.

ప్రశ్న 7.
‘ముహుబాణీ’ అనే ఉర్దూపదానికి అర్థం ?
జవాబు:
‘ముహ్ జుబాణీ అనే ఉర్దూపదానికి’ ‘నోటితో’ అని అర్థం.

ప్రశ్న 8.
మానవతా దృక్పధానికి మూలమేమి ?
జవాబు:
మానవతా దృక్పధానికి మూలం ‘ప్రేమ’.

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
బదిలీ పత్రము (టి.సి) కొరకు కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ వ్రాయండి.
జవాబు:

కరీంనగర్,
15-06-2023.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్, నమస్కారాలు.

విషయము : టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.

నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ‘దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ `సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది.
కావున, నాకు బదిలీ పత్రము ఇప్పించగలరని విజ్ఞప్తి.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విద్యార్థి
XXXX

ప్రశ్న 2.
ఇటీవల మీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరం గురించి వివరిస్తూ మీ స్నేహితునికి లేఖ రాయండి.
జవాబు:

మెదక్
09-08-2023.

ప్రియమైన సౌమ్యకి,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగా చదువుతున్నాను. నీవు ఎలా చదువుతున్నావో ఉత్తరం ద్వారా తెలియజేయగలవు.

ఇటీవల మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (N.S.S) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినపుడు గాని, శస్త్రచికిత్సలు చేసినపుడు గాని మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొన్నిసార్లు రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సాటివారి ప్రాణాలు కాపాడాలని తెలియజేసారు. ఈ మాటలు విన్న వింటనే నేను రక్తదానం చేశాను. నీవు కూడా రక్తదానం చేస్తావని భావిస్తున్నాను.

మన స్నేహితులు సమత, సంధ్య, ప్రవళిక ఎలా ఉన్నారు ? వారిని అడిగానని చెప్పు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. వచ్చే దసరా సెలవులలో మనం కలుసుకుందాం. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

ఇట్లు
నీ ప్రియమైన స్నేహితురాలు
XXXXX

చిరునామా:
ఎ. సౌమ్య
ఇంటి నంబర్ 21-12/68,
సుచిత్ర, సికింద్రాబాద్,
పిన్. నం. – 500067.

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి.

1) పాలికిఁబోవ
జవాబు:
పాలికిఁబోవ = పాలికిన్ + పోవన్ = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుతము మీది పరుషములకు సరళములాదేశమును ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషం విభాషనగు.

2) కురియకుండునే
జవాబు:
కురియకుండునే = కురియక + ఉండునే = ఉకారసంధి’
సూత్రము : అత్తునకు సంధి బహుళమగును.

3) పేదరికమిట్లు
జవాబు:
పేదరికమిట్లు = పేదరికము + ఇట్లు = ఉకార సంధి
సూత్రం : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

4) పోతుందయా
జవాబు:
పోతుందయా = పోతుంది + అయ = ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదుల యిత్తునకు సంధివైకల్పికముగానను ఏమ్యాదులు అనగా ఏమి, మది,కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి ఏది ఏవి మొదలగునవి.

5) అణువంత
జవాబు:
అణువంత = అణువు + అంత = అణువంత = ఉకారసంధి/ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

6) లేదెన్నటికి
జవాబు:
లేదెన్నటికి = లేదు + ఎన్నటికి – లేదెన్నటికి = ఉకార సంధి/ఉత్వసంధి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

7) భ్రమలన్నీ
జవాబు:
భ్రమలన్నీ = భ్రమలు + అన్ని = ఉకార సంధి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

8) అప్పద్మనేత్రం
జవాబు:
అప్పద్మనేత్రం = ఆ + పద్మనేత్రు = త్రిక సంధి

సూత్రము:

  1. ఆ, ఈ, ఏ – అను సర్వనామములు త్రికమనబడును.
  2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
  3. ద్విరుక్తంబగు హల్లు స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమగును.

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

1) కనురెప్ప
జవాబు:
కనురెప్ప – కనుయొక్కరెప్ప – షష్ఠీతత్పురుష సమాసం

2) ఉదధి నీరు
జవాబు:
ఉదధి నీరు – ఉదధి యందలి నీరు – సప్తమీ తత్పురుష సమాసం

3) ఇష్టసఖుడు
జవాబు:
ఇష్టసఖుడు – ఇష్టమైన సఖుడు – విశేషణ పూర్వపద కర్మధాయసమాసం

4) ఎర్రజెండా
జవాబు:
ఎర్రజెండా – ఎర్రనైన జెండా – విశేషణపూర్వపద కర్మధారయము.

5) వేయేండ్లు
జవాబు:
వేయేండ్లు – వేయి సంఖ్యల గల సంవత్సరాలు – ద్విగు సమాసం

6) మురసంహరుడు
జవాబు:
మురసంహరుడు – ముర అనే రాక్షసుని సంహరించినవాడు – బహువ్రీహి సమాసము

7) ధనపతీ
జవాబు:
ధనపతి – ధనమునకు మతి – షష్ఠీతత్పురుష సమాసం

8) అజ్ఞానం
జవాబు:
అజ్ఞానం – జ్ఞానము కానిది – నైత్పురుష సమాసము

XIV. ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. జాతీయ విపత్తులు
జవాబు:
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.
విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణా యుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు.

అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్ 19 వ్యాధి.

దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

2. తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
జవాబు:
ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు.

చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి. తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం.

తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి. తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం.

వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్ట మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. శాతవాహన కాలపు మట్టికోటల ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహనులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 1686) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724- 1948) తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో. ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్’ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగ నగర్’ అనే పేరొచ్చింది.

వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి. పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ధ సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప ‘శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.

రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారద కథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగు తున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం.

3. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
ఒకదేశ అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం.

ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి.

పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness) : ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ము లెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy) : పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill) : మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయ స్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలు చేస్తుంది.

విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.

4. భావోద్వేగాల నియంత్రణ (Management of emotions) : యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రించుకోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill) : సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.

ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచే వుంటుందన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making) : సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking) : ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయాను భవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదించాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking) : యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీ యువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావన నిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి.

1. Imagination rules the world.
జవాబు:
ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది.

2. There is no substitute for hard work.
జవాబు:
కృషికి ప్రత్యామ్నాయం లేదు.

3. Don’t judge book by its cover.
జవాబు:
ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వెయ్యద్దు.

4. Don’t stop when you’re tired stop when you are done.
జవాబు:
అలసిపోయినప్పుడు కాదు, పనిపూర్తయినప్పుడే విశ్రమించాలి.

5. Reading is to the mind what exercise is to the body.
జవాబు:
శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది.

TS Inter 1st Year Telugu Model Paper Set 5 with Solutions

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

వచనకవిత్వ వికాసంలో భాగంగా వచనకవిత విభిన్న లఘురూపాలుగా వైవిధ్యాన్ని సంతరించుకుంది. ఈ క్రమంలో కవిత్వచరిత్రలో ప్రాచుర్యం పొందిన మినీకవిత, హైకూ, నానీల ప్రక్రియలను స్థూలంగా తెలుసుకుందాం. 1970వ దశకం నుండి మినీకవిత వెలుగులోకి వచ్చింది.

పదీపంక్తులు మించకుండా సంక్షిప్తంగా సూటిగా కొసమెరుపుతో చెప్పగలగడం మినీకవిత ప్రధాన లక్షణం. మినీకవితలో ధ్వని, వ్యంగ్యం ప్రాధాన్యం వహిస్తాయి. మినీకవితలపై 1977లో నండూరి రామమోహనరావు మొదలుపెట్టిన చర్చ మినీకవిత్వోద్యమంగా మారింది. అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీలైఫ్’ శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన మినీకవితలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

‘మినీకవిత ఆయుష్షు మెరుపంత, కాని అది ప్రసరిస్తుంది కాలమంత’ అని డా॥ సి. నారాయణ రెడ్డి మినీకవితా ప్రక్రియను నిర్వచనాత్మకంగా ప్రశంసించాడు. జపాన్ కవి బషో సృష్టించిన కవితా ప్రక్రియ ‘హైకూ’. హైకూలో మూడుపాదాలు ఉంటాయి. మొదటిపాదంలో ఐదు, రెండోపాదంలో ఏడు, మూడోపాదంలో ఐదు అక్షరాల నియమంతో మొత్తం పదిహేడు అక్షరాలతో హైకూ కవిత రూపొందింది.

హైకూ జైన, బౌద్ధ తాత్త్వికతను, ప్రకృతి సౌందర్యాన్ని, మార్మిక అంశాలను ధ్యాన ఛాయలతో ఆవిష్కరిస్తుంది. తెలుగులో హైకూ ప్రక్రియను గాలి నాసరరెడ్డి రేఖామాత్రంగా పరిచయం చేసాడు. ఇస్మాయిల్ హైకూ ప్రక్రియను విస్తృత పరిచాడు. తెలుగులో పదిహేడు అక్షరాల నియమం పాటించకుండా మూడు పొడుగు పాదాలతో హైకూలు రాసినవారే ఎక్కువ.

నానీల ప్రక్రియ రూపకర్త డా॥ ఎన్. గోపి. 1997లో వార్త దినపత్రిక ఎడిట్ పేజీలో నానీలు తొలిసారిగా సీరియల్గా వెలువడినాయి. నానీలు అంటే ‘చిన్నపిల్లలు’, ‘చిట్టి పద్యాలు అని అర్థం. నావీ, నీవీ వెరసి మన భావాల సమాహారమే నానీలు, నాలుగు పాదాల్లో ఇరవై అక్షరాలకు తగ్గకుండా, ఇరవై ఐదు అక్షరాలకు మించకుండా నానీ నడుస్తుంది. ఈ నాలుగు పాదాల నానీలో మొదటి, రెండు పాదాల్లో ఒక భావాంశం,

చివరి రెండుపాదాల్లో మరొక భావాంశం ఉంటాయి. మొదటి దానికి రెండోది సమర్థకంగా ఉంటుంది. కొన్ని వ్యాఖ్యానా త్మకం గాను, వ్యంగ్యాత్మకంగాను ఉంటాయి. ఇప్పటివరకు నానీలను ప్రముఖ, వర్ధమాన కవులు రాయడం విశేషం. ఈ ఇరవైమూడు సంవత్సరాల్లో నానీలు మూడువందల యాభై సంపుటాలు రాగా, వందలాది కవులు నానీలు రాయడం నానీ ప్రక్రియకున్న శక్తికి, ఆదరణకు నిదర్శనం. భారతీయ సాహిత్య చరిత్రలో లఘు ప్రక్రియను అనుసరిస్తూ ఇన్ని గ్రంథాలు వెలువడడం అద్భుతమైన విషయం .

ప్రశ్నలు :

ప్రశ్న 1.
‘సిటీ లైఫ్’ పేరుతో మినీకవితల్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
అలిశెట్టి ప్రభాకర్

ప్రశ్న 2.
మినీ కవితను నిర్వచనాత్మకంగా ప్రశంసించిన కవి ఎవరు ?
జవాబు:
డా॥ సి. నారాయణ రెడ్డి

ప్రశ్న 3.
హైకూలోని పాదాలు, అక్షరాల నియమాలను తెలుపండి.
జవాబు:
హైకూలో మూడు పాదాలు ఉంటాయి. మొదటిపాదంలో ఐదు, రెండోపాదంలో ఏడు, మూడో పాదంలో ఐదు అక్షరాల నియమంతో మొత్తం పదిహేడు అక్షరాలతో హైకూ కవిత రూపొందింది.

ప్రశ్న 4.
నానీల్లోని పాదాలు, అక్షరాల నియమాలను వివరించండి.
జవాబు:
నానీలో నాలుగు పాదాలు ఉంటాయి. నాలుగు పాదాల్లో ఇరవై అక్షరాలకు తగ్గకుండా, ఇరవై ఐదు అక్షరాలకు మించకుండా నానీ నడుస్తుంది.

ప్రశ్న 5.
నానీలు తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ ప్రచురితమైనాయి ?
జవాబు:
1977లో వార్తా దినపత్రిక ఎడిట్ పేజీలో, సీరియల్గా ప్రచురితమైనాయి.

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 4 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1. తోటమాలి ………. కన్పించని దేవుణ్ణి
జవాబు:
తే. తోటమాలి బలిదానం చేస్తేనే
పువ్వులు పరిమళాల నీవగలవు.
మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కన్పించని దేవుణ్ణి

భావము : తోటమాలి తన జీవితాన్ని బలిదానంగా చేస్తేనే పువ్వులు సువాసనలను వెదజల్లుతాయి. మానవులు ఒకరితో ఒకరు కలిసి పోవాలి. మనం చేయాల్సింది చేయకుండా దేవుని తిడితే ప్రయోజనం ఏమిటి ?

2. అని నిశ్చయించి ద్రుపదునొద్దకుంబోయి ……… దనవృత్తాంతంబంతయుఁ జెప్పిన.
జవాబు:
వ. అని నిశ్చయించి ద్రుపదునొద్దకుంబోయి నన్నెఱింగించిన, నాతండు ధన రాజ్యమదంబున
నన్నును దన్నును నెఱుంగక ‘యేను రాజను నీవు పేద పాఱుండవు; నాకును నీకును
నెక్కడి సఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండనయి వచ్చితి’ నని ద్రోణుండు
దనవృత్తాంతంబంతయుఁ జెప్పిన.

భావము : అని నిర్ణయించుకొని ద్రుపదుని దగ్గరకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసికొనగా, అతడు రాజ్యమదం చేత నన్ను తననూ ఎరుగకుండా నేను రాజును, నీవు బీద బ్రాహ్మణుడివి, నాకూ నీకూ స్నేహం ఎక్కడిది ? అని పలికాడు. ఆ విధంగా అతని చేత అవమానం పొంది వచ్చానని ద్రోణుడు తన వృత్తాంతం అంతా తెలిపాడు.

TS Inter 1st Year Telugu Model Paper Set 4 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తితత్త్వాన్ని తెలపండి ?
జవాబు:
శేషప్పకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతం వాడు. ధర్మపురిలోని నరసింహస్వామిపై రాసిన శతకం నరసింహ శతకం. ఇది సీస పద్యాలలో రచింపబడిన ద్విపాద మకుట శతకం. శతకం లేని పద్యాలలో నరసింహస్వామిని సంబోధించడంలో ప్రేమ, మృదుత్వం, కాఠిన్యం, కోపం ఇంకా అనేక విధాలుగా తన భక్తిని ప్రదర్శించాడు.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాములకు దూరమైనవాడా! ధర్మపురము నందు నివసించే ఓ నరసింహస్వామీ!
భూమిలో వేయేండ్లు దేహం నిలవదు. ధనమెప్పటికీ స్థిరం కాదు. ఆలుబిడ్డలు తన వెంటరాలేరు. సేవకులు చావును తప్పింపలేరు. చుట్టముల గుంపు తనను బ్రతికించుకోలేదు. శక్తి శౌర్యమేమి పనికిరాదు. గొప్పగ సకల సంపదలున్నను గోచి పాతంతైన తీసుకొని పోలేడు. పిచ్చికుక్కలలాంటి ఆలోచనలను ఆలోచించక నిన్ను కొలిచే వారికి మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.

కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధము, పులికి చక్కెరపిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూలచెండు, గుడ్లగూబకు చెవుల పోగులు, దున్నపోతునకు పరిశుభ్రవస్త్రము, కొంగలకు పంజరము ఎలా అవసరంలేదో అలాగే చెడ్డ ఆలోచనలుచేసే దుర్మార్గులకు తియ్యనైన నీ నామం అనే మంత్రం (దైవభక్తి) అవసరం లేదు అని భావము.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించువారా! దుష్టులకు సంహరించువారా! పాములకు దూరమైనవారా! ధర్మపురమునందు నివసించే ఓ నరసింహస్వామీ!

నరసింహస్వామి ! తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావము అందులు, అన్నాలు, మేనమామలు, ఇంకా పెద్ద చుట్టుములున్నాను. తాను వెడలగ వెంటరాదు. యమదూతలు ప్రాణము తీసుకుని పోవునపుడు వారు ప్రేమతో పోరాడి గెలవలేరు. చుట్టుములందరూ దుఃఖపడుదురే గాని ఆయువునివ్వలేదు. కావున చుట్టుముల మీద ప్రేమ చూరున చెక్కి, ఎప్పుడూ నిన్ను నమ్ముకొనుటే ఉపయోగము.

భుజముల శక్తిచే పెద్దపులుల చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసుల ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

ఈ విధంగా మృదు మధుర, సులభమైన ఉపమానాలలో శేషప్ప కవి నరసింహస్వామిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.

ప్రశ్న 2.
ద్రోణార్జునుల గురుశిష్య సంబంధాన్ని చర్చించండి ?
జవాబు:
భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్ర విద్యా నిపుణుడు. కౌరవులకు, పాండవులకు విలువద్య నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని రాజగురువు గా నియమించాడు. దివ్యాస్త్రాలతో సహా అన్నిరకాల అస్త్ర, శస్త్ర యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు ద్రోణుడు. అర్జునుడు అతని ప్రియ విద్యార్ధి. ద్రోణుడికి అర్జునుని కన్నా ప్రియమైనవారు ఎవరన్నా ఉంటే అది అతని కుమారుడు అశ్వత్థామ మాత్రమే.

మహాభారత ఇతిహాసంలో ఉత్తమ గురువుగా ద్రోణాచార్యుడు, మరియు ఉత్తమ విద్యార్ధిగా అర్జునుడు గురుశిష్య బంధానికి తార్కాణంగా నిలిచి పోయారు. రాజకుమారులందరికీ గురువుగా ఉన్న ద్రోణుడు అర్జునుడు ఒక అసాధారణ విద్యార్ధి అని గమనించాడు.

విద్యార్ధులందరికీ పెట్టిన తొలి పరీక్షలోనే అర్జునుడిలోని అపారమైన సంకల్పం మరియు ఏకాగ్రతను గమనించాడు ద్రోణుడు. ఒక రోజు గొప్ప యోధుడవుతాడని గ్రహించాడు. ద్రోణాచార్యుడు పెట్టిన అన్ని పరీక్షలలోను అర్జునుడు అందరినీ మించిపోయాడు. అర్జునుడు అపారమైన గురుభక్తితో ద్రోణుడిని సేవించాడు.

భీష్మునిచే ఆచార్యునిగా నియమింపబడగానే రాకుమారులందరినీ చూసి నా దగ్గర అస్త్ర విద్యలు నేర్చి నా కోరికమీలో ఎవ్వడు తీర్చగలడు? అన అడుగగా కౌరవులందరూ పెడమొగం పెట్టగా, అర్జునుడు నేను తీరుస్తానని ముందుకు వచ్చాడు. అలా ముందుకు వచ్చిన అర్జునుని అపారప్రేమతో కౌగలించుకున్నాడు. అలాగే ద్రోణుని సరస్సులో మొసలి పట్టుకున్న సమయంలో అర్జునుడే ద్రోణుని మొసలి నుంచి విడిపించి తన ప్రతిభను చాటుకున్నాడు.

చీకటిలో బాణాలు వేయడం అభ్యసిస్తున్నా అర్జునుని చూసి, అస్త్రవిద్యలోని అతని పట్టుదలకి శ్రద్ధకు సంతోషించి నీకంటే విలువిద్యలో అధికులు లేనట్లుగా నేర్పిస్తానన్నాడు ద్రోణుడు అన్నట్లుగానే సకల విద్యాయుద్ధకౌశలాన్ని, అస్త్ర, శస్త్రాలను, దివ్యాస్త్రాలను యుద్ధవ్యూహాలను సంపూర్ణంగా బోధించి ఒకనాటి పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడు కాడు అనేట్లుగా అర్జునుని తీర్చిదిద్దాడు.

అర్జునునికన్నా విద్యపట్ల శ్రద్ధ, ఆసక్తి, గురుభక్తి, వినయ కారణంగా ద్రోణుడి – ప్రియ శిష్యుడయ్యాడు. బ్రహ్మాస్త్రాన్ని అర్జునునికి ఇచ్చి సాధారణ యోధులకి వ్యతిరేకంగా వాడవద్దని చెప్పాడు.

విలువిద్య కళను నేర్చుకోవటంతో ఉన్న అంకిత భావం అచంచల ఏకాగ్రత కారణంగా గురువు హృదయంలో స్థానం సంపాదించాడు. ద్రోణుడు కూడా తనకున్న విద్యాజ్ఞానాన్నంతటినీ శిష్యులకు ధారపోసాడు. గురుద్రోణాచార్య, శిష్యుడు అర్జునుడు పంచుకున్న బంధం భారత ఇతిహాసంలో ప్రత్యేకంగా నిలిచి పోయింది.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదాన్ని వివరించండి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే “రచించబడిన సాహితీ నీరాజనం అన్న వ్యాస సంకలనం లోనిది. ఇందులో ఆయన మానవతావాదాన్ని గురించి చక్కగా వివరించారు.

మానవతావాదం అంటే మానవ సంక్షేమాన్ని మానవ ప్రగతిని, లక్ష్యంగా పెట్టుకుని ఒక మానవుడు తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనా రీతి. దీనిని మానవతావాదం అనే కన్నా మానవతా దృక్పధం అనటం సబబని రవ్వాహరి అభిప్రాయం. ఈ మానవతా దృక్పధానికి మూలం ప్రేమ. మానవుడు తోటి మానవుని పట్ల ప్రేమ భావాన్ని స్నేహభావాన్ని చూపించగలిగితే సమాజం ఆనందమయం అవుతుంది.

ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి, మానవతా వాదానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంస్కృతంలో వేద వాఙ్మయం అతి ప్రాచీనమైంది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. దానిలోని ‘పదవ మండలంలో అన్నదాన మహాత్మ్యాన్ని చెప్పే శ్లోకం ఒకటి ఉంది. ప్రాచీన సాహిత్యంలో కన్పించే అన్నదాన ఘట్టాలన్నీ మానవతా వాద ప్రతిపాదకాలే ! ఆకలితో బాధపడేవానికి అన్నం పెట్టనివాడు చనిపోయిన వానితో సమానుడుట.

వాల్మీకి రామాయణం ఆరంభమే మానవతావాదంతో ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్ఠాం….” అన్న ఆది కావ్యా రామాయణ వాక్యాలు సరమ కారుణ్య భావానికి ప్రతీకలు. ప్రేమ భావాన్ని దయాభావాన్ని మానవులపైనే కాక సకల జీవరాశిపై చూపించాలన్నది నిజమైన మానవతావాదం. బోయవాడు క్రౌంచ పక్షులలో మగపక్షిని బాణంతో కొట్టాడు. ఆడపక్షి దుఃఖం వాల్మికిని కదిలించిందట. ఇది అసలైన కారుణ్యభావం కదా !

ఇక ‘మహాభారతంలో ఉన్నదే మరొక చోట కూడా ఉంటుంది. మహాభారతంలో లేనిది మరెక్కడా ఉండదు. ధర్మప్రతిపాదన మహాభారత లక్షణం. దధీచి, శిబి, రంతి దేవుని కథలు మానవతా వాదానికి మచ్చుతునకలు. రంతిదేవుడు నోట వ్యాసుడు “న త్వహం కామయే రాజ్యం….” అన్న శ్లోకం ద్వారా నాకు రాజ్యము వద్దు, స్వర్గము . వద్దు, మోక్షం అసలే వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తిని తొలగించటమే కావాలంటాడు. దీనికి మించిన మానవతా వాదం ఇంకా ఎక్కడున్నది.

ఇక దానాలన్నింటిలో అన్నదానం గొప్పదంటారు. ఎందుకంటే అది క్షుద్బాధను తీరుస్తుంది. కాబట్టి. తాను కడుపునిండా తింటే కొందరు ఆకలితో అలమటిస్తుంటే ఉదాసీనంగా పట్టనట్లుగా ఉంటే అది మానవత్వం అన్నించుకోదు. ప్రాచీన సాహిత్యమంతటిలో ఏ దానమైన నిత్యం చేస్తే అది మానవత్వం అనిపించుకుంటుందని చెప్పబడింది.

భాగవతంలోని సప్తమ అధ్యాయంలో గృహస్థ ధర్మాలను వ్యాసులవారు వివరించారు. ఏ మనవునికైనా తన కడుపునింపుకునే ధనం మీద మాత్రమే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే అది పాపమే అవుతుంది అన్నాడు. చరకుడు తన చరకసంహితలో సమస్త ప్రాణుల సంతోషాన్ని కోరుకున్నాడు.

అష్టాంగ హృదయంలో ‘బాల వృద్ధేభ్యః అన్నమదత్వాన భుజంతీ” అని చెప్పబడింది. అంటే బాలలకు వృద్ధులకు అన్నంపెట్టిన తరువాతే మనం భుజించాలని అర్థం.

మానవులందరూ సుఖంగా ఉండాలి. సర్వజీవులు ఆనందంగా జీవించాలని అన్నది మన ప్రాచీనుల ఆదర్శమని రవ్వా శ్రీహరి పేర్కొన్నారు.

ప్రశ్న 2.
భాషల మధ్య జరిగే ఆదానప్రదానాలను చర్చించండి ?
జవాబు:
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలెవడిన “వ్యాసగుళుచ్ఛం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో భాఫల మధ్య ఆదాన ప్రదానాలు. సహజంగానే జరుగుతాయని సదాశివ వివరించారు.

ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం కొత్తేమీకాదు. పలు భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసి మెలసి ఉన్నప్పుడు భాషలలో ఆదాన ప్రదానాలు సహజంగా జరుగుతుంటాయి. ఒక భాషా పదాన్ని వేరొక భాష స్వీకరించేటప్పుడు ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని చేర్చి ఆ భాషా పదాన్ని మరొక భాషాపదం స్వీకరిస్తుంది. ఒక్కొక్కసారి యథాతదంగాను లేదా ఒక అక్షరాన్ని చేర్చి, ఒక అక్షరాన్ని తీసేసి, లేదా ఒక అక్షరాన్ని మార్చి స్వీకరించటం జరుగుతుంది.

స్వీకరించిన భాష తాను స్వీకరించిన మూల భాషా పద అర్థాన్నే స్వీకరిస్తుంది. కొన్ని సందర్భాలలో వేరే భాషా పదాన్ని స్వీకరించిన భాష మూల యొక్క అర్థాన్ని కాక కొత్త అర్థంలో కూడ స్వీకరించడం జరుగుతుంది. ఇలా భారతీయ భాషలన్నింటిలోనూ సంస్కృత భాషా ప్రభావం అధికంగా ఉంది.

అలాగే ఆంగ్లభాషా ప్రభావం కూడా ! అన్య భాషా పదాలను స్వీకరించడంలో వర్ణాగమ, వర్ణాలోప, వర్ణవ్యత్యయాల ద్వారా ఆదాన ప్రదానాలు జరుగుతుంటాయి.
ఉదాహరణకు : లార్డ్ అనే ఆంగ్లపదం ఉర్దూలోనికి ‘లాట్సాహెబ్’ గా మారటం. ఫిలాసఫీ అనే ఆంగ్లపదం ఫల్సఫాగా ఉర్దూలోకి రావటం సొహబత్ అనే ఉర్దూపదం తెలుగులో ‘సోబతి’ అవటం. ఉర్దూలో ఆబ్రూ అనే పదం తెలుగులో ఆబోరుగా మారటం వర్ణలోప వర్ణాగమ వర్ణవ్యత్యయాలకు ఉదాహరణులుగా చెప్పవచ్చు.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
స్నేహలతాదేవి ఎదుర్కున్న సమస్యలను చర్చించండి ?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగము డా. ముదిగంటి సుజాతారెడ్డిచే రచించబడిన. “విసుర్రాయి” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి ఆర్థిక స్వాలంబనకు చాలా ప్రాధాన్యత ఉందనే వాస్తవాన్ని వివరిస్తుంది. యువత చిన్న విషయానికే కుంగిపోయి, అసంతృప్తికి, నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అలాంటి ప్రతికూల ధోరణులను ఆ కథ నిరసిమైంది. ఆత్మ విశ్వాసంలో దేన్నైనా సాధ