TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 8 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికీ భావం రాయండి. (1 × 6 = 6)

1. మురసంహరుఁడు …………… చతురత మఱియున్.
జవాబు:
మురసంహరుఁడు కుచేలుని,
కరము గరంబునఁ దెమల్చి కడఁకన్ మన మా
నా గురుగృహమున వర్తించిన,
చరితములని కొన్ని నుడివి చతురత మఱియున్.

భావము : అంతఃపుర కాంతలు అలా అనుకున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తాము గురుకుల వనం చేసిన దినాలలో జరిగిన విశేషాలను కొన్నింటిని ప్రస్తావించి ఇలా అన్నాడు.

2. అన్నలూ …….. ప్రాణానికి ముప్పే
జవాబు:
అన్నలూ విన్నారా ?
అక్కలూ విన్నారా ?
ఉదధి నీరు అంతాటా ఉప్పే ?
మండే మంట అంతా నిప్పే ?
ఆకలికి అన్నం కోరడం ఒప్పే ?
దౌర్జన్యం ప్రతి దేశంలో తప్పే
నిర్వీర్యత ప్రాణానికి ముప్పే

భావము : అన్నలూ అక్కలూ విన్నారా! సముద్రపునీరు అంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండుతున్న మంట అంతా నిప్పుతో కూడి ఉంటుంది. అది తన దగ్గరకు వచ్చిన వాటిని కూడా మండిస్తుంది. ఆకలి వేసినపుడు అన్నాన్ని కోరటం తప్పేమీకాదు. దౌర్జన్యం ఈ లోకానికి అపరాధమే! పౌరుషం లేకపోతే మనల్నిం మనం కాపాడుకోలేం!

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
శ్రీకృష్ణుడు కుచేలుడిని ఎలా గౌరవించాడో వివరించండి.
జవాబు:
కుచేలుడును, శ్రీకృష్ణుడును బాల్య స్నేహితులు. నిరంతర దరిద్ర పీడితుడైన కుచేలుడు భార్య ఆప్తమైన ఉపదేశముచే శ్రీకృష్ణుని దర్శించుటకై ద్వారకానగరమునకు బయలుదేరెను. కక్ష్యాంతరములు దాటి మణిమయ సౌధములో – అంతఃపురములో హంసతూలికా తల్పముపై కూర్చుండి ప్రియురాలితో కలసి వినోద క్రీడలలో మునిగియున్న శ్రీకృష్ణుని గాంచి బ్రహ్మాయనందమును పొందెను.

శ్యామల కోమలాకారుడును, ఇంద్రాది దేవతలచే స్తుతింపబడు వాడును, కౌస్తుభముడిన అలంకారముగా ధరించినవాడును, సమస్తలోకములచే ఆరాధింపబడు వాడును, పాల సముద్రము నందు విహరించువాడును ఐన శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని చూచెను. అట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు నిరంతర దారిద్య్ర్యము చేత పీడింపబడువాడు, బక్క చిక్కిన శరీరముతో, చినిగిపోయిన వస్త్రములతో పరిహాసమునకు స్థానమైన ఆ పేద విప్రుని గాంచి గబగబ తన పాన్పు మీది నుండి క్రిందికి దిగి, ఆదరముతో ఎదురుగా వచ్చి బాల్యమిత్రుడైన ఆ కుచేలుని కౌగిలించుకొనెను. తీసుకొని వచ్చి, తన పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. ప్రేమతో బంగారు కలశము నందలి నీటితో వాని కాళ్ళు కడిగెను. కాళ్ళు కడిగిన ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొనెను.

తరువాత కుచేలుని శరీరమునకు మంచి గంధము నలదెను. ప్రయాణ ప్రయాస పోవుటకై వింజామరలతో వీచెను. సువాసనా భరితమైన ధూపముల నొసగెను.. మణిమయం దీపములతో ఆరతి పట్టెను. సిగలో పూలమాలలు అలంకరించెను. .కర్పూర తాంబూలము నొసంగెను. గోవును దానముగా సమర్పించెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు చేసిన సేవలను గాంచి, కుచేలుని శరీరము పులకించిపోయెను. గగుర్పాటుతో ఆయన వెంట్రుకలు నిక్కపొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములను స్రవించెను. అంతేకాదు శ్రీకృష్ణుని భార్యామణియగు రుక్మిణీ దేవి స్వయముగా చామరములు వీచుచుండెను. ఈ విధముగా రుక్మిణీ కృష్ణులు చేయు సపర్యలను అందుకొనుచున్న ఆ కుచేలుని భాగ్యమునకు ఆశ్చర్యపోయి అంతఃపుర కాంతలు ఇట్లు ప్రశంసించిరి.

ఈ బ్రాహ్మణుడు పూర్వ జన్మమునందు ఎటువంటి తపస్సు చేసెనో గదా ! యోగులచే ఉపాసింపబడు జగత్ప్రభువు, లక్ష్మీదేవి ప్రియుడైన శ్రీకృష్ణుని తల్పముపై కూర్చుండినాడు ఎటువంటి మునీశ్వరులైనను ఈ మహనీయమూర్తికి సాటియగునా ?

“తన భార్యమణియైన రుక్మిణీదేవి ఏమనుకొనునోయని కూడ భావింపక, యదువంశేఖరుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి, ఆలింగనము కావించుకొని, వివిధములైన సేవలచే ఆయనను సంతృప్తుని కావించినాడు. ఈ బ్రాహ్మణోత్తముడెంత అదృష్టశాలియో గదా !” ఆ అంతఃపురకాంతలు కుచేలుని భాగ్యమున కచ్చెరువందినారు.

ఇట్లు కుచేలుడు కృష్ణుని దర్శించి, ఆయన అనుగ్రహమునకు పాత్రుడై, సాక్షాత్తు భగవంతుని చేతనే సేవలు చేయించుకొనినాడు. మధురమైన స్నేహమునకు కుచేలోపాఖ్యానము ఉజ్జ్వలమైన ఉదాహరణము.

ప్రశ్న 2.
పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తితత్త్వాన్ని తెలపండి?
జవాబు:
శేషప్పకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతం వాడు. ధర్మపురిలోని నరసింహస్వామిపై రాసిన శతకం నరసింహ శతకం. ఇది సీస పద్యాలలో రచింపబడిన ద్విపాద మకుట శతకం. శతకం లేని పద్యాలలో నరసింహస్వామిని సంబోధించడంలో ప్రేమ, మృదుత్వం, కాఠిన్యం, కోపం ఇంకా అనేక విధాలుగా తన భక్తిని ప్రదర్శించాడు.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాములకు దూరమైనవాడా! ధర్మపురము నందు నివసించే ఓ నరసింహస్వామీ!

భూమిలో వేయేండ్లు దేహం. నిలవదు. ధనమెప్పటికీ స్థిరం కాదు. ఆలుబిడ్డలు తన వెంటరాలేరు. సేవకులు చావును తప్పింపలేరు. చుట్టముల గుంపు తనను బ్రతికించుకోలేదు. శక్తి శౌర్యమేమి పనికిరాదు. గొప్పగ సకల సంపదలున్నను గోచి పాతంతైన తీసుకొని పోలేడు. పిచ్చికుక్కలలాంటి ఆలోచనలను ఆలోచించక నిన్ను కొలిచే వారికి మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.

కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధము, పులికి చక్కెరపిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూలచెండు, గుడ్లగూబకు చెవుల పోగులు, దున్నపోతునకు పరిశుభ్రవస్త్రము, కొంగలకు పంజరము ఎలా అవసరంలేదో అలాగే చెడ్డ ఆలోచనలుచేసే దుర్మార్గులకు తియ్యనైన నీ నామం అనే మంత్రం (దైవభక్తి) అవసరం లేదు అని భావము.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించువారా! దుష్టులకు సంహరించువారా! పాములకు దూరమైనవారా! ధర్మపురమునందు నివసించే ఓ నరసింహస్వామీ!

నరసింహస్వామి! తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావము అందులు, అన్నాలు, మేనమామలు, ఇంకా పెద్ద చుట్టుములున్నాను. తాను వెడలగ వెంటరాదు. యమదూతలు ప్రాణము తీసుకుని పోవునపుడు వారు ప్రేమతో పోరాడి గెలవలేరు. చుట్టుములందరూ దుఃఖపడుదురే గాని ఆయువునివ్వలేదు. కావున చుట్టుముల మీద ప్రేమ చూరున చెక్కి ఎప్పుడూ నిన్ను నమ్ముకొనుటే ఉపయోగము.

భుజముల శక్తిచే పెద్దపులుల చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. .బ్రహ్మరాక్షసుల ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

ఈ విధంగా మృదు మధుర, సులభమైన ఉపమానాలలో శేషప్ప కవి నరసింహస్వామిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘బతుకమ్మ’ పండుగ వెనుక ఉన్న ఆచారసంప్రదాయాలను వివరించండి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. దీనిలో బతుకమ్మ పండుగ వెనుక దాగియున్న ఆచార సంప్రదాయాలు వివరించబడ్డాయి.

తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలలో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేత పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ జానపదుల సాహిత్య, సంగీత, నృత్య కళారూపాలకు ప్రతీక. స్త్రీలకు సౌభాగ్యాలనిచ్చే తల్లి గౌరమ్మ ఆమె బతుకమ్మ. భయాన్ని గొలిపే స్వరూపం గౌరమ్మది. నవరాత్రుల సమయంలో తెలంగాణ స్త్రీలు సుకుమారమైన అందమైన రూపంగా భావించి అమ్మవారిని కొలుస్తారు. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూలమయం అవుతుంది. స్త్రీల సౌందర్యారాధన, అలంకరణ నైపుణ్యం కళాత్మక దృష్టి పూల బతుకమ్మను పూలతో అలంకరించటంతోనే ఉంటుంది. మహాలయ అమావాస్యనాడు ఎంగిలి బతుకమ్మను పేర్చటంతో బతుకమ్మ పండుగ ప్రారంభమై మహర్నవమి వరకు సాగుతుంది.

ముత్తైదువుల తెల్లవారుజాముననే లేచి అభ్యంగనం స్నానంచేసి అలికి ముగ్గులేసి పూలతో అలంకరిస్తారు. ఉదయం బతుకమ్మను అలంకరించిన సాయంకాలం ఇంటిముందే ఆడతారు. ఆ తువాత మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొనివెళ్ళి ఊరి. మధ్యలోగాని, చెరువుగట్టుపైగాని ఉంచి స్త్రీలందరూ వలయాకారంలో నిలబడి ఒంగి ఒరుగుతూ చేతులను తడుతూ పాటలు పాడతారు. చీకటి పడే వరకు ఆడి బతుకమ్మను కాలువలోగాని, చెరువులోగాని, భావిలోగాని వదిలిపెడతారు. బతుకమ్మకు వీడ్కోలు.
చెపుతారు.

నిద్రపోగౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు

అని పాటలు పాడుతారు. ప్రకృతి నుండి సేకరించిన పూలను మళ్ళీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మను నీటిలో విడిచిపెట్టడానికి కావచ్చు.

ఎర్రమట్టిని త్రిభుజాకారంలోకి మలచి దానిపై వెంపలిచెట్టు కొమ్మనుంచి పసుపుకుంకుమలతో పూజిస్తారు. ఇలా చేయటం భూమిని స్త్రీ దేవతగా భావించి అర్చించటమే! బతుకమ్మను ఆడేటప్పుడు స్త్రీలు పౌరానిక, నీతిభోధాత్మక, కథా గేయాలను పాడుకుంటారు. బతుకమ్మపండుగలో పాడే పాటల్లో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో – గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో – వచ్చేరిసతిగూడి ఉయ్యాలో”

ఈ గేయంలో పనిలోనే పరమాత్మను దర్శించమనే బోధ స్త్రీలశ్రమైక జీవనానికి దర్పణం. పనిలోని అలసటను పాటల ద్వారా సులభతరం చేసుకొన్న పరమాత్మ స్వరూపులు స్త్రీలు. పసితనంలో పెళ్ళిళ్ళు చేసి బరువు దింపుకున్న తల్లిదండ్రులు అల్లారుముద్దుగా తమవద్ద పెరిగిన కూతురిని వియ్యాలవారికి అప్పగిస్తున్న పాటలో వారి ఆవేదన అర్థమౌతుంది.

“పెరుగు అన్నము పెట్టి ఉయ్యాలో – పెంచుకోండి సీతను ఉయ్యాలో
సద్ది అన్నము పెట్టి ఉయ్యాలో – సాదుకోండి సీతను ఉయ్యాలో”

ఈ విధంగా అద్దంలోని కొండ ప్రతిబింబంలాగా బతుకమ్మ పండుగలో తెలంగాణా జానపద స్త్రీల జీవన విధానం, మనస్తత్వం కళలు ప్రతిబింబిస్తాయి.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

ప్రశ్న 2.
ఉర్దూ నుంచి తెలుగులోకి చేరినప్పుడు పదాలలో జరిగిన మార్పును వివరించండి ?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివ చే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువడిన “వ్యాస గుళుచ్ఛం”, రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో తెలంగాణా తెలుగులో ఉర్దూ పదాల మూలాలను చక్కగా వివరించారు.

ఉర్దూ ఒక ప్రత్యేక భాషకాదు, పారసీ, అరబ్బీ, తర్కీ శబ్దాలు కలగాపులగం ఉర్దూ భాష. దీనిని ఇది మన దేశంలో 14వ శతాబ్దంలో రూపుదిద్దుకున్నది. దీనిని తొలుత హిందుయి జబానే హిందూస్థాన్ అన్న పేర్లతో పిలువబడింది. 18వ శతాబ్దానికి కాని అది ఉర్దూ అని పిలువబడలేదు.

తెలుగులో కొన్ని ఉర్దూ పదాలు యథాతదంగానే చేరాయి. కమలము, కలందాస్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము రోజు, కూలీ, బాకీ, బజారు, దుకానం మొదలగు పదాలు ఇందుకు ఉదాహరణము. హలంతమైన ఉర్దూ భాషలోని పదాలు అజంతమైన తెలుగు భాషలో చేరినప్పుడు ఆ పదాలు అజంతమవటం సహజం. ఉదాహరణకు కలమ్-కలము అయింది. జమీందార్-జమీందారు అయింది. బజార్- బజారు అయింది.

కొన్ని పదాలు ఉర్దూ నుండి తెలుగులోకి వచ్చేటప్పుడు తమ రూపాన్ని మార్చుకున్నాయి. ఉదాహరణకు బాఖీ అనే ఉర్దూ పదం తెలుగులో బాకీ అయింది. అలాగే ‘నఖద్’ నగదుగా మారింది.

ఉర్దూపదం ఉదార్ – తెలుగుపదం
ఉదార్ – ఉద్దర
సొహబత్ – సోబతి
మస్జిద్ – మసీదు
కుర్సీ – కుర్చీ
ఘిలాప్ – గలీబు/గలేబు
జుర్మానా – జుల్మానా
నఖ్ – నగిషీ
ఆబ్రూ – ఆబోరు
ఇలా ఉర్దూపదాలు తెలుగులో మార్పుచెందాయి.

కొన్ని ఉర్దూపదాలు తెలుగులోకి వచ్చి అర్థాన్ని కూడా మార్చుకున్నాయి. ఉదాహరణకు “ముదామ్” అనే పారసీ పదానికి ఎల్లప్పుడూ అనే అర్థం ఉంది. ఇది తెలుగులో ‘ముద్దాముగా మారి ప్రత్యేకించి’ అనే అర్థంలో వాడబడుతుంది. ఇలా పలు మార్పులతో అనేక పదాలు ఉర్దూ నుండి తెలుగు భాషలోకి ప్రవేశించాయి.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

ప్రశ్న 1.
గొల్ల రామవ్వ సంభాషల్లోని ఔన్నత్యాన్ని విశ్లేషించండి?
జవాబు:
గొల్లరామవ్వ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకటనరసింహారావుచే రచించబడినది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదనకత్వంలో వెలువడిన, “గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాట కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్, ‘వాలంటీరును, విప్లవకారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతి వృత్తం. ‘గొల్ల రామవ్వకథ. తెలంగాణ పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె. అందులో గొల్ల రామవ్వ తన పదియేనేండ్ల, మనవరాలితో కలిసి ఉంటుంది. ఆమె ప్రతి సంభాషణ ఉన్నత విలువలను గలినదే! అర్థరాత్రి తనింటికి దొంగలా ప్రవేశించిన యువకుని రజోకారో పోలీసోడో అని భావించింది. “నేను పోలీసోన్ని కాను రజోకార్నుకాను” అన్నమాటలో నమ్మలేక “అబ్బా ఎంతకైనా తగుతారీ రాక్షసులు! ఔను ముందుగా తీయని మాటలు అవి సాగకపోతే అన్యోపాయాలు – అదే కదా. క్రమం అయింది. ఆ వ్యక్తి రెండు కాళ్ళు పట్టుకుని “బాంచెన్! చెప్పులు మోత్తా నా తలకాయైనా తీసుకో, పోర్ని మాత్రం ముట్టకు, అది నీకు చెల్లెలనుకో, నీ కాల్లు మొక్కుత! అంటుంది.

యువకుడు విప్లవకారుడని తెలుసుకుని ఉపచారాలు చేస్తుంది. ఆమె మనస్థితి కాయకల్పమైంది. “ఇదేం గతిరానీకు! గిట్లెందుకైనవు కొడకా! అంది. వెళ్ళిపోతానన్న యువకుని “ఆ మాపోతా! మా పోతా… ఒక్కటే పోకడ! చక్కంగ స్వర్గమే పోతా! హు పోతడండ యాడికో” అని నిలువరించింది.

రాజోలిగే ఉన్నవు కొడకా! నీవెందుకొచ్చెరా ఈకట్టం? పండుపండు గొంగల్లపండు” అని అతనిపై గాఢనిద్రలోని వెళ్ళేట్లు ఓదార్చింది. మనవరాలిని పిలిచి దీపం వెలిగించి ఆ యువకుని శరీరంపై గుచ్చుకున్న ముళ్ళను తీసేయమని చెప్పింది. “మా చేత్తవులే సంసారం! ఇక కూకోవాని పక్క ముండ్లు తీసెయి ఉల్లుల్లుగ అయ్యో సిగ్గయితాందా వాని ముట్టుకుంటె, ఏం మానవతివి గదవే! నీ సిగ్గు అగ్గిలబడ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గను కుంట! ఊ చెయ్యి చెప్పినపని. పాపం పీనుగోలె పడున్నడు గాదె! వాని జూత్తె జాలి పుడుతలేదె నీకు! ఆ! గట్ల! నొప్పించకు పాపం” అమ్మ సంభాషన తీరిది.

యువకుని లేసి “ఇగ లే కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లల పిసుక్కచ్చిన ………. గింత కడుపుల పడేసుకో! ఎన్నడన్న తాగినావు తాతా గట్క? వరి బువ్వ తినెటోనికి నీకే మెరుక? గొల్లరామి గల్కుంటే ఏమనుకున్నా? పోయేపానం మరుతది. చూడు మరి – కులం జెడిపోతవని భయపడుతున్నావా? నువ్వు యేకులమోడవైనా సరే – మొదలు పానం దక్కిచ్చుకో…. తాగి పారెయ్యి గటగట” అంటుంది..

రాత్రి ఇద్దరు పోలీసోల్లను మట్టుపెట్టిన అని యువకుడు అనగానే అవ్వ “ఇద్దరా! కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడకా! సగంపనే చేసినవు” అంటుంది. పోలీసులు ఇంట్లోకి వచ్చి యువకుని వైపు చూపిస్తూ “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడాయేం”అంటే “వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నవా? నిన్నెవడన్న గట్లనె అడుగితే ఎట్లుంటది! ఈ మాటల్తోటి మనం దీసుడెందుకు పానం తియ్యరా దుండి! నా బుద్దెరిగిన కాన్నుంచి నీనైతగింతచే ఇజ్జతి మాట యెవ్వల్ల నోట్నుంచి యినలే! అంటుంది. రామవ్వ సంభాషచతురత అద్భుతమైంది అని ఈ సంభాషణ వలన తెలుస్తుంది.

ప్రశ్న 2.
ఈ కథ ఆధారంగా హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాలను చర్చించండి?
జవాబు:
‘ఇన్సానియత్’ అను పాఠ్యభాగం డా. దిలావర్ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను తెలియ చేస్తుంది. కులాలు మతాలు అనే భేదం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు, పరస్పర సహకారాలు, సహజీవన సంస్కృతిని తెలియపరస్తుంది. కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతాలలోకి – వ్యాపించడం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్నతమైన మానవీయ అనుబంధాలను ఈ కథ వివరిస్తుంది. వర్తమాన- సమాజంలో లుప్తమవుతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానాలపై ఆత్మవిమర్శ చేసుకోమని తెలియచేస్తుంది.

పూర్వం గ్రామాలలోని ప్రజలంతా కుల మత భేదం లేకుండా అందరూ అందర్నీ అత్తా, అక్కడ, బావా, అత్తా,మద్దీ, మామ అని పిలుచుకునేవారు. వారి మధ్య ప్రేమాభిమానాలకు కుల మతాలు అడ్డు వచ్చేవికావు. ఎంతపెద్ద కులంలో పుట్టినా వారిలో కూడా మిగిలిన వారి పట్ల ఆత్మీయానురాగాలు ఉండేవి. ఒకరినొకరు చక్కగా గౌరవించుకునేవారు. దీనికి నిదర్శనం, ఈ కథలోని రాధమ్మత్త, సోందుబాబుల మధ్య జరిగిన సంభాషణలే!

ముస్లిం అయిన సోందుబాబు హిందువైన రాధమ్మను అత్తమ్మా అని పిలవడం ఇందుకు ఒక ఉదాహరణ.

“ఏం! రాధత్తమ్మా! అంత మంచేనా!” అని సోందుబాబు అంటే “బానే ఉన్న పోరగా! మీరంతా మంచేనా” అని రాధమ్మ అనటంలో వారి మధ్య ఉన్న ఆప్యాయత అను రాగాలు మనకు అర్థమౌతాయి.

అలాగే పాతిమా రాంరెడ్డిని “మర్దీ! సీమకు సుత అపకారం చెయ్యని నా కొడుకుని చూసి ఓర్వలేక అల్లా తీస్కపోతన్నడు” అనడం ముస్లిం హిందూ కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయతా, అనుబంధాలకు ఒక నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది”.

“మర్దీ! కడుపుకోత ఎట్ల అగులు బుగులుగ ఉంటదో అనుబగిత్తన్నా! నా కొడుకును మట్టిల గల్పుకుంటున్నా. నా కొడుకు పానం వంటిదే నీ కొడుకుపానం” నా కొడుకు హయత్ సుత బోస్కొని నీ కొడుకు నిండు నూరేళ్ళు బత్కాలే” అనటం “మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గాని కులము మతము కాదన్న మానవతను, ఆత్మీయ అనుబంధాలను తెలియచెప్తుంది.

ప్రశ్న 3.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించ బడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది. యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని, చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తనతల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత. పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ? చదువుకుంది. సంస్కారం ఉంది. మరీ అంత అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేను. నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి. నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.

నా గురించి మీరు ఇల్లు అమ్ముకుని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిత్వం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను. నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది. ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను.

మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడే వాడు దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొవాలి. ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి తనతోపాటు స్త్రీ జాతి కంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

ప్రశ్న 4.
‘బిచ్చగాడు’ కథలోని రచయిత అభిప్రాయాలను పరిశీలించండి?
జవాబు:
‘బిచ్చగాడు’ అను పాఠ్యభాగం ‘అంపశయ్య నవీన్’ చే రచించబడింది. నవీన్ రచించిన . ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది. నవీన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి పదవీరమణ పొందారు.

ప్రపంచంలో అనేక రకాల దోపిడీలు మోసాలు జరుగుతున్నాయి. అందులోను శ్రామికులు కార్మికుల జీవితాలలో జరిగే దోపిడీలు అత్యంత భయంకరమైనవి. మానవతా విలువలను దిగజార్చేచవని నవీన్ గారి అభిప్రాయం. రోజువారి కూలీపనులు చేస్తూ సంచార జీవన చేసేవారిలో దారిద్య్రం, దైన్యం కన్పిస్తుందని అటువంటి వారిని కూడా దోపిడీ చేసే మనస్తత్వం గలవారు మన సమాజంలో ఉన్నారని వారిలో మార్పురావాలన్నది నవీన్ భావన. రోజూ అడుక్కుంటూ పొట్టపోసుకునే వ్యక్తులు దోపిడీకి గురి అవటం శోచనీయం అంటారు నవీన్. ఇలాంటి వారు గౌరవనీయమైన వృత్తులలో ఉన్నవారి చేతుల్లోనే దోపిడీకి గురి అవుతున్నారు. అందుకు ఈ కథ ఒక ఉదాహరణం.

టికెట్ దొరకలేదని లబోదిబో మంటూ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి బిచ్చగాడిని చూసి ఒక పెద్దమనిషి ఇష్టమెచ్చినట్లు తిట్టడం రచయిత తప్పుపడతాడు. బిచ్చగాడు టికెట్ దొరకక తన వారినందరిని బండి దిగిపోండన్నప్పుడు ఆ పెద్ద మనిషి అన్న మాటలు ” అరె వోరి పిచ్చిగాడిద కొడకా, నీ బండెడు సామాను దించే వరకు బండి ఆగుతుందిరా! ఈ మాటలు మానవత్వానికి మచ్చ అని రచయిత అభిప్రాయం.

“పాపం వాళ్ళలా బిక్కచచ్చి యేడుస్తుంటే మీరు ఇలా నవ్వటం ఏమిటి? అని వాళ్ళందరిని రచయిత గద్దించాలనుకున్నాడు. నేనలా అంటే నన్ను పిచ్చివాడిలా భావిస్తారేమోనని రచయిత భయమేసి ఊరుకున్నాడు. టి.టి బిచ్చగాడిని గద్దించి డబ్బురాబట్టడానికి ప్రయత్నిస్తుంటే, రచయిత టీ. టీగారూ! అతడు చెప్తున్నది కొంచెం విన్పించుకోండి అని ఇంగ్లీషులో మాట్లాడేసరికి కొంచెం టి.టి. తగ్గాడు. ఇక్కడ సత్యానికి విలువలేదు. సభ్యతకు తావులేదు. డబ్బుకే విలువ అన్న అభిప్రాయాన్ని రచయిత తెలియచేస్తున్నారు.

నిండుచూలాలుగా ఉన్న ఆ నిర్భాగ్యురాలిని చూసి ఆ కంపార్ట్మెంట్లో ఉన్నవారికి జాలి కలుగక పోగా ద్వేషపూరిత భావం కలగడం రచయితను బాధించింది. ఇలాంటి దృశ్యాన్నే సినిమాలో చూస్తే అందరూ కళ్ళంట నీళ్ళు కారుస్తారు. మనుషులలో ఈ భిన్న భావావేశాలకు కారణం ఏమిటి? అని రచయిత ఆలోచించాడు. ఎలాగైతేనేం ఆ బిచ్చగాడు. బిచ్చగత్తె లిద్దరి వద్దా డబ్బురాబట్టుకున్నాటు టి.టి. వాళ్ళచేతిలో ఒక రిసీట్ పెట్టాడు.

రచయిత ప్రక్కనే ఉండటంతో ఆ రిసీట్ మీద 22 రూ॥ మాత్రమే రాసుంది అన్న విషయం తెలిసింది. 56 రూపాయలు దండుకున్న టి.టి మోసాన్ని అందరికీ చెప్తామనుకున్నాడు రచయిత. కాని ఇవన్నీ మామూలే అని పెదవి విప్పలేకపోయాడు రచయిత. దోపిడీ చేసేవారికి ఉచ్చనీచాలు లేవని రచయిత అభిప్రాయంగా మనకు అర్థమౌతుంది.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
మనలోమన చీలిక మృత్యుదేవకి నాలుక.
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక దీర్ఘ కావ్య సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భము :- కవి మానవులలో ఐకమత్యము యొక్క ఆవశ్యకతను వివరించిన సందర్భం లోనిది.
భావము :- మనమంతా మానవులం. రంగు రూపు వేరైనా మానవజాతి ఒక్కటే. అందుకే మానవజాతి అంతా ఐకమత్యంతో మెలగాలి. లేని ఎడల, మానవుల మధ్య చీలికలు వచ్చిన ఎడల అది జాతి పతనావస్థకు దారి తీస్తుంది. మఋత్యువుకు దగ్గర చేస్తుందని ఇందలి భావం.

ప్రశ్న 2.
రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన ‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను ఖండకావ్యం లోనిది.
సందర్భము :- మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని వివరించిన సందర్భము లోనిది.
భావము :- అందరం మానవులమే. ఒకరినొకరు ద్వేషించు కోవటం ఎందుకు. రాక్షస స్వభావం ఉన్న వారిని కూడా నేను ఆహ్వానిస్తాను అని ఇందలి భావం.

ప్రశ్న 3.
గర్వము మానుటొప్పగున్
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ఏనుగు లక్ష్మణకవిచే రచింపబడిన సుభాషిత రత్నావళి నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము :- విద్యను ఆర్జించిన పండితులతో. ఎలా ప్రవర్తించాలో రాజులకు, డబ్బున్నవారికి కవి తెలియచేస్తున్న సందర్భంలోనిది.
భావము :- విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగ జేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయ కాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

ప్రశ్న 4.
కీలువదలిన బొమ్మవలెను నేలబడి పోతున్నది.
జవాబు:
పరిచయం :- ఈ వాక్యము దున్న ఇద్దాసుచే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు అను గ్రంథం నుండి గ్రహించబడినది.
భావము :- భార్యా, బిడ్డలు, ధనధాన్యాలు నావి నావారున భ్రమలో మానవులు ఉంటున్నారు. ఆ భ్రమ సత్యంకాదు. ఆ భ్రమలో ఉండగనే కీలువదలిన బొమ్మలాగా రాలిపోతున్నామని ఇందలి భావం.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పాఠ్యాంశంలోని కవి ప్రతిపాదించిన త్రికాల దృష్టిని వివరించండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. కవి అనేవాడు. మొదట మానవతా వాది కావాలి. కన్పించే మంచికి చెడుకు స్పందించే మనసుండాలి. గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును తెలుసుకోగలగాలి.
గతకాలాన్ని మంచి కాలంగా భావించి జీవితాలను గడిపే వ్యక్తులను వెక్కిరించే మనస్తత్వ దృష్టి ఉండకూడదంటాడు.

“గతమే జీవిత మనుకుని
వర్తమానమె వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కిలేదంటాడు”

అలాగే గతమంతా శూన్యం జ్ఞాన ప్రదమైన వర్తమానాన్ని మాత్రమే మంచిగా భావించాలను తలపొగరు గలవారిని నిందించే ఆలోచనా చేయకూడదు. గతము వర్తమానము కత్తికి రెండు వైపులా ఉండే పదును. రెండింటిని సమర్థిస్తానన్నాడు.

“గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనుబోను
‘భవిష్యత్తు వదులుకోను”

అని గతాన్ని, వర్తమాన్ని భవిష్యత్తును ఒకటిగా చూసే దృష్టి కలవాడు దాశరథి.

ప్రశ్న 2.
శ్రీకృష్ణుడిని దర్శించేందుకు కుచేలుడు భార్యకు చెప్పిన కారణమేమిటి ?
జవాబు:
శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుట మిక్కిలి శుభదాయకమే. కాని ఆయనకు తీసుకొని వెళ్లుటకై మన దగ్గర ఏదైన కానుక ఉన్నదా ?” అని కుచేలుడు భార్యనడిగెను.అప్పుడు కుచేలుని భార్య ‘సరే’ యని కొన్ని అటుకులను భర్త యొక్క చినిగిన వస్త్రము చివర ముడివేసి ప్రయాణమునకు సిద్ధము చేసినది – శ్రీకృష్ణ సందర్శనోత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరెను. నేనెట్లు ద్వారకా నగరమును చేరగలను ? దివ్వ దీప్తితో ప్రకాశించు అంతఃపురము నేనెట్టు ప్రవేశింపగలను ? సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని ఎట్లు దర్శింపగలను ? నీవెవ్వడవు ? ఎక్కడినుండి, ఎందులకు వచ్చితివి ? అని ప్రశ్నించి ద్వారపాలకులు అడ్డు పెట్టినచో వారికేమైన బహుమానమిచ్చి వెళ్ళవచ్చునన్నచో, నేను డబ్బు లేనివాడును. అయినను ఆయన దయ – నా భాగ్యము. ఆలోచింపగా మరేమి యున్నది ? ఐనను బాలమిత్రుడైన ఆ కృష్ణుడు నన్నేల అశ్రద్ధ చేయును ?” అని తలచుచు కుచేలుడు ద్వారకా నగరములో ప్రవేశించెను.

ప్రశ్న 3.
‘మహైక’లోని ఐకమత్య భావనలను వివరించండి.
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగము ‘కవిరాజు మూర్తి’చే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవిత నుండి గ్రహించబడింది.
“మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి”
మానవులు ఐకమత్యంతో మెలగాలని లేనిపక్షాన మానవజాతికి విముక్తి లేదన్నాడు. అన్నదమ్ములుగా జాతివర్ణ భేదం లేకుండా చేయి చేయి కలిపి ముందుకు నడవాలి. అందుకు అక్క చెల్లెళ్ళు ఆనందగీతికలను ఆలపిస్తూ చైతన్యంతో అందరిని ఏకతాటిపైకి తీసుకురావాలి. అదే భూమికి నూతనత్వం అన్నాడు.

“రంగులు జాతులు
కావు మనకు జ్ఞాతులు
మనమంతా మానవులం
కలయికలో ఉంది జయం”

రంగులు, జాతులు అని చూడకుండా మనమంతా మానవులం అనే భావనతో ఐకమత్యంగా ఉండాలని లేని యెడల.
“మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక”
అని ఐకమత్యాన్ని గురించి ‘మహైక’ కవితలో మూర్తిగారు వివరించారు.

ప్రశ్న 4.
సజ్జనుడి మాట తీరును తెలపండి?
జవాబు:
మేఘుడు నీటి బిందువులనే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరమే వడగండ్లను కురిపించినను, అవి వెంటనే చల్లని నీళ్ళగునుమారి రాళ్ళుగా ఉండవు. అదే విధంగా మంచివాడు మంచి మాటలనే పల్కును. ఒకానొక సమయమందున కఠోర వచన మును పలికినను మేలుగానే ఉంటుంది కీడుగా ఉండవు.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
‘తాత జాగీరు’ జాతీయంలోని చారిత్రక విశేషాలను తెలపండి ?
జవాబు:
కష్టార్జితం కాని సంపద, అనువంశికంగా సంక్రమించిన ఆస్తి, నైజం ప్రభువులు తమ రాజరికాన్ని కాపాడుకోవటానికి జీతం లేని కొలువులు ఎన్నో ఏర్పాటు చేశారు. పటీలు, మావిపటీలు, పట్వారీ, కొత్వాలి వంటివి అనువంశికంగా సంక్రమించేవి. ఈ పనికి జీతం లేకపోయినా ప్రజలకు వీళ్ళు ఎంత దోచుకున్నా తమ సొమ్ము ముట్టచెపితే చాలు. ఆ విధంగా జమీందారులు, జాగీరుదారులు, ముక్తాదారులు, దేశాయిలు, సర్దేశాయిలుండేవారు. జమీందారుకు కొన్ని గ్రామాల్లో వేలాది ఎకరాల భూములు ఉండేవి. ముక్తాదారులంటే ఆ గ్రామమంతా ఆయనదే! ప్రజల వద్ద ఎంత దోచుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు. కప్పం చెల్లిస్తే చాలు. తాత గారి జాగీరును మనుమడు అనుభవిస్తున్నట్లు “ఇదేమన్నా నీ తాతగారి జాగీరనుకున్నావా” అన్న జాతీయాలు ప్రయోగించడం జరుగుతుంది.

ప్రశ్న 2.
తెలంగాణా తెలుగులో యథాతదంగా చేరిన ఉర్దూ పదాలను తెలపండి ?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామన సదాశివచే రచించబడింది. డా.సి.నారాయణరెడ్డి సంపాదకీయంగా వెలువబడి. ‘వ్యాస గుళుచ్ఛం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.

ఒక భాషలోని పదాలు మరొక భాషలోకి చేరేటప్పుడు వారి రూపు రేఖలు మారటమో లేక అర్థం మారటమో జరుగుతుంది. అలా కాకుండా తెలంగాణ తెలుగు బాషలో ‘ఉర్దూ పదాలు యథాతదంగా చేరాయి. అలాంటి పదాలలో కలము, కలందాస్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము, రోజు, కూలీ, బాకీ, గురుజు, బజారు, దుకాణం, మాలు, జబరద్దస్తీ, జోరు, మొదలగు పదాలున్నాయి. ఇవన్నీ యథాతదంగా ఎలాంటి మార్పును పొందకుండా తెలుగులోకి వచ్చిన ఉద్దూపదాలు.

ప్రశ్న 3.
పురాణాలు ఎవరిపైన దయచూపాలని చెప్పాయి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా విలువలు అను పాఠ్యభౄగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. దీనిలో మానవతా వాదం ప్రాచీన సాహిత్యంలో ఎలా వివరించబడిందో రవ్వా వారు వివరించారు.

మన పురాణాలు పట్టి పురాణాలు కావు. వాటిలో మానవులందరూ సుఖంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ప్రగతిని సాధించాలి. ఏ ఒక్కరూ దుః ఖంతో జీవించరాదు అని వివరించాయి. కేవలం మానవులందే కాకుండా పశుపక్ష్యాదుల పైన కూడా దయ, జాలి కరుణలను చూపించాలని ప్రబోధించాయి. క్రిమికీటకాదుల పైన, పశుపక్ష్యాదులపైన, ఏ కులం వారిపై నైనా, పతితుతలపైన వర్ణసాంకర్యం గల వారిపైన దయాగుణాన్ని చూపాలని పురాణాలు వివరించాయి. చివరికి తృణ వృక్షాదులను కూడా జీవంగల వానిగా భావించి వారికి ఏ విధమైన హానిని కలిగించకుండా కాపాడుకోవాలని మన పురాణాలు వివరించాయి.

ప్రశ్న 4.
‘బసవపురాణం’ కావ్యం గురించి సంక్షిప్తత్తంగా రాయండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ రచించిన ‘చైతన్యలహరి’ అను వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది.

బసవపురాణం పాల్కురికి ద్విపద రచన. ఆయన ఒకనాడు శ్రీశైల క్షేత్రమును దర్శించి అక్కడ భక్తుల ద్వారా బసవేశ్వరుని దివ్య చరితమును విని బసవపురాణాన్ని రచించాడు. ఈ ద్విపద కావ్యంలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటుగా ఈ కావ్యంలో 75 మంది శివభక్తుల కథలున్నాయి. ఈ కావ్యమందు సోమనాథుని కథా కథననైపుణ్యం కన్పిస్తుంది. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవి కథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నకప్ప కథ, మడిమేలు మాచయ్య కథలు చక్కగా వర్ణించబడ్డాయి.

సోమనాథుని రచనా రీతిలో అంత్యానుప్రాసల ప్రభావం అధికం. ఇది పోతన లోని అంత్య ప్రాసరచనకు కారణమైందని చెప్పవచ్చు. ద్విపద రచనలలో సోమనాథునికి మంచిపేరు తెచ్చిన కావ్యం బసవపురాణం.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
దాశరథి కృష్ణమాచార్యులు గారి కవి పరిచయం
జవాబు:
“నా తెలంగాణ కోటిరతనాల వీణ” అని నినదించిన కవి దాశరథి. పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని “మైగ్”గా అమర్చిన కవి. జూలై 22, 1925న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చినగూడూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వేంకటమ్మ వేంకటాచార్యులు. తల్లిదండ్రులు ఇద్దరూ సాహిత్యాభి రుచి గలవారే! ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయం చేశారు. ఖమ్మంలో హైస్కూలు విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ ఆంగ్లం చదివారు.

అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం అమృతాభిషేకం, కవితాపుష్పం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం, వంటి పద్య వచన రచనలు చేశారు. “మహాబోధి” వీరి కథాకావ్యం నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా వంటి గేయాలు రచించారు. గాలీబు గీతాలను తెలుగులోనికి తీసుకువచ్చారు. నవమి నాటి కల సంపుటి, దాశరథి శతకం, వందలాది సినిమా పాటలు దాశరథి కలం నుండి జాలువారాయి.

దాశరథి తెలుగు సాహిత్యానికి చేసిన సేవను గుర్తించి ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ను ఇచ్చాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం, “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలను అందించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవిగా కొంతకాలం పనిచేశారు. నవంబరు 5, 1987న దాశరథికాలం చేశారు.

ప్రశ్న 2.
దున్న ఇద్దాసు గారి కవి పరిచయం
జవాబు:
దున్న ఇద్దాసు గొప్ప తత్త్వకవి, ప్రముఖ వాగ్గేయకారుడు ఈయన నల్గొంజిల్లా చింతపల్లి గ్రామంలో క్రీశ 1811-1919 మధ్య కాలంలో జీవించారు. తల్లిదండ్రులు దున్న రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తత్వకారుడయ్యాక ఇద్దాసు అయ్యాడు. ప్రముఖ పరిశోధనకుడు డా. బిరుదు రాజు రామరాజు ఇద్దాసును “మాదిగ మహాయోగి” గా అభివర్ణించాడు.

ఇద్దాసు చింతపల్లి గ్రామంలో మోతుబరి ఇంటి పశువుల కాపరి. రోజూ బావి దగ్గర “మోటకొడుతూ” ఆనువుగా గీతాలను ఆలపించేవాడు. ఆ గీతాలను విన్న వరసిద్ధ జంగమదేవర “పూదోట బసవయ్య” ఇద్దాసు పంచాక్షరీ మంత్రోపదేశం చేశారు. లింగధారణ చేయించి శైవునిగా మార్చాడు. అడవులలో సందరిస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంలో సాధన చేశాడు. దానితో ఆయన అష్టసిద్ధులను పొందాడు. పూర్వతాత్విక కవులైన శివరామదీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరాంబల ప్రభావం ఇద్దాసుపై ఉంది. ఈయన ఈశ్వరాంబ సంప్రదాయాన్ని అనుసరించాడు. ఆమె సమాధి సందర్శనకు ఇద్దాసు కందిమల్లయ్యపల్లెను దర్శించాడు.

ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా వీరశైవ తత్త్వ జ్ఞానిగా కన్పిస్తాడు. పఠేల్, పట్వారీలు ఇద్దాసుకు శిష్యులయ్యారు. సంచార యోగిగా నల్గొండ నుండి మహబూబ్ నగర్ వరకు తిరుగుతూ అధ్యాత్మికతను ప్రచారంచేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లి, పోలేపల్లి, ఆవులోని బాయి మొదలగు చోట్ల ఈశ్వరమ్మ పీఠాలను స్థాపించాడు.

ఇద్దాసు 30కి పైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వచ్చిన “శ్రీ దున్న ఇద్దాసు తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

ప్రశ్న 3.
వేముల పెరుమాళ్ళు గారి కవి పరిచయం
జవాబు:
వేముల పెరుమాళ్ళు కరీంనగర్ జిల్లా రాయికల్ గ్రామంలో ఆగష్టు 5, 1943న జన్మిచారు. ఈయన తల్లిదండ్రులు వేముల ఆండాళ్ళమ్మ-రాజయ్యలు, మాతా మహుడు కైరం భూమదాసు వరకవి గాయకుడు. వీరి విద్యాభ్యాసం రాయకల్ కోరుట్ల జగిత్యాలల్లో జరిగింది. గ్రామాభివృద్ధి అధికారిగా 18 సం॥లు పనిచేశారు. తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి రాయికల్ మండల అధ్యక్షునిగా పనిచేశాడు. సహకార రంగంలో గీత, పారిశ్రామిక కాంట్రాక్ట్ లేబర్, వినియోగ, గృహనిర్మాణ సంఘాలను స్థాపించాడు.

పెరుమాళ్ళు శ్రీరాజరాజేశ్వర, శ్రీధర్మపురి, నృకేసరి శతకాలను ప్రచురించారు. బాల సాహిత్యంలో వీరు బాలనీతి శతకం. ‘కిట్టూ’, పర్యావరణ శతకం ‘నిమ్ము’లు రాశారు. మహాత్ముని మహనీయ సూక్తులను “గాంధీమార్గం” త్రిశతిగా రచించాడు. రాజనీతి చతుశ్శతిగా వీరు “లోగుట్టు” రాశాడు. 1958 నుండి 1968 వరకు సమాజంలో జాతీయ పరిణామాలను పద్యాలుగా రాశాడు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ఈయన “మానవతా పరిమళాలు” ప్రసంగాలుగా వెలువడ్డాయి. జీర్ణదేవాలయ పునరుద్ధరణ చేశారు. వీరు సెప్టెంబరు 17, 2005న కాలం చేశారు.

ప్రస్తుత పాఠ్యభాగం “తెలంగాణ జాతీయాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

ప్రశ్న 4.
సురవరం ప్రతాపరెడ్డి గారి కవి పరిచయం
జవాబు:
తెలంగాణ, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఈయన మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానానికి కేంద్రమైన బోరవెల్లి గ్రామంలో జన్మించారు. వీరి స్వగ్రామం. ఇటిక్యాలపాటు. వీరి తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణరెడ్డిలు.

సంస్కృత వ్యాకరణంతోపాటు ఎఫ్.ఎ., బి.ఏ.బి.ఎల్ చదివారు. తొలుత న్యాయవాదిగా తరువాత పత్రికా సంపాదకుడిగా, సామాజిక కార్యకర్తగా సాహిత్య కారునిగా మారాడు. తెలుగుభాష, తెలంగాణ భారతీయ సంస్కృత జీవనంపై పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు.

1926లో తెలంగానలో పత్రికలకు ప్రాతినిద్యం లేని కాలంలో గోల్కొండ పత్రికను స్థాపించారు. ఆ పత్రికకు 20 సం॥ల కాలం సంపాదకునిగా పనిచేశారు. తన అమూల్యమైన సంపాదకీయాలతో సృజనాత్మక రచనలతో సామాజిక చైతన్యాన్ని పెంపొందించారు. ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అన్న విమర్శకు జవాబుగా 1935లో 354 మంది తెలంగాణ కవులను పరిచయం చేస్తూ “గోల్కొండ కవుల సంచికను వెలువరించాడు. 1931, 1953 వరకు జరిగిన సామాజిక పరిస్థితులు ప్రతిబింబించేలా మొగలాయి కథలను రచించారు. 1948లో సురవరం వారు రాసిన “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” పరిశోధన గ్రంథానికి 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి గ్రంథమిది.

ఆంధ్ర విద్యాలయం, ఆంధ్రసారస్వత పరిషత్ వంటి సంస్థల స్థాపనకు విశేషకృషి చేశారు. ఆంధ్రమహాసభకు తొలి అధ్యక్షుడు సురవరం, శాసనసభ్యునిగా పనిచేశారు. “ప్రజావాణి”. పత్రికను కూడా నడిపారు. గ్రంథాలయం ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రజల చైతన్యానికి దోహదపడ్డారు. భక్త తుకారం, డచ్చల విషాదము అన్న నాటకాలు. హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు మొదలైన 40 గ్రంథాలు రచించారు. తెలుగు సామాజిక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేసిన సురవరం ఆగష్టు 25, 1953న కన్నుమూశారు.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
మానవజాతికి ఎప్పుడు మేలు కలుగుతుంది?
జవాబు:
మానవత్వంతో మెలగినపుడు

ప్రశ్న 2.
ఇద్దాసు ఎవరి సమాధిని దర్శించాడు?
జవాబు:
కందిమల్లయ్యపల్లెలో ఉన్న ఈశ్వరాంబ సమాధిని దర్శించాడు.

ప్రశ్న 3.
దుర్జనులు ఎలాంటి ఆలోచనలను చేస్తారు ?
జవాబు:
చెడ్డ ఆలోచనలు

ప్రశ్న 4.
కాలాన్ని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
కంఠ మాలతో పోల్చాడు

ప్రశ్న 5.
నన్నయ ఎవరి ఆస్థానకవి?
జవాబు:
రాజరాజ నరేంద్రుడు

ప్రశ్న 6.
కుచేలుడు శ్రీకృష్ణుని ఇచ్చేందుకు ఏమి తీసుకొని వెళ్ళాడు ?
జవాబు:
అటుకులు.

ప్రశ్న 7.
దున్న ఇద్దాసు ఏఏ కోణాల్లో కన్పిస్తాడు?
జవాబు:
తత్త్వవేత్తగా, అచలునిగా, వీరశైవతత్త్వజ్ఞానిగా పలుకోణాల్లో కన్పిస్తాడు.

ప్రశ్న 8.
పువ్వులు పరిమళాన్ని ఎప్పుడు వ్యాపింపచేస్తాయి?
జవాబు:
తోటమాలి బలిదానం చేసినపుడు

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
‘లాట్ సాహెబ్’ పదానికి మూల పదం ఏది ?
జవాబు:
‘లాట్ సాహెబ్’ అనే పదానికి మూల పదం ‘లార్డ్’ అనే ఆంగ్లపదం.

ప్రశ్న 2.
బతుకమ్మ పాటలలోని పల్లవులు ఏవి ?
జవాబు:
ఉయ్యాలో, వలలో, చందమామ అనునవి బతుకమ్మ పాటలలో పల్లవులు.

ప్రశ్న 3.
మానవతా దృక్పధానికి మూలమేమి ?
జవాబు:
మానవతా దృప్పథానికి మూలం ‘ప్రేమ’

ప్రశ్న 4.
‘సంచ్’ ఎవరు.
జవాబు:
‘సంచ్’ ఆ కాలంలో ఉన్న పోలీసు శాఖామంత్రి.

ప్రశ్న 5.
బసవపురాణంలో ఎంతమంది భక్తుల కథలున్నాయి ?
జవాబు:
బసవపురాణంలో 75 మంది శివభక్తుల కథలున్నాయి.

ప్రశ్న 6.
జానపదుల నోటి నుండి వెలువడ్డ జాతీయం సామెత ఎలాంటిది ?
జవాబు:
గంగలో రాయివంటిది.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

ప్రశ్న 7.
‘సామల సదాశివ’ రాసిన శతకం ?
జవాబు:
‘సాంబశివ’ శతకం

ప్రశ్న 8.
రావి ప్రేమలత “వ్యాసలతిక”కు లభించిన పురస్కారం ఏది ?
జవాబు:
ఉత్తమ విమర్శన గ్రంథంగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది.

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
పోగొట్టుకున్న సైకిల్ కోసం పోలీస్ స్టేషన్కి లేఖ రాయండి.
జవాబు:

దిలావర్పూర్,
10.08.2023.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు,
పోలీస్ స్టేషన్,
దిలావర్పూర్.

విషయము : నా సైకిల్ దొంగిలింపబడిన విషయం గురించి.
ఆర్యా!
నమస్కారములు.

నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్పూర్ నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను నిన్న కళాశాలకు అట్లాస్ కంపెనీకి చెందిన ఎరుపు రంగు సైకిల్ పై వెళ్ళి, కళాశాల ముందర తాళం వేసి పెట్టి, తరగతులకు హాజరు అయ్యాను. సాయంత్రం వచ్చి చూసేసరికి నా సైకిల్ కనిపించలేదు. దొంగిలించబడినదని నిర్ధారణ అయ్యింది.

దయచేసి నా సైకిల్ గురించి విచారణ చేసి తిరిగి నాకు అప్పగించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విశ్వసనీయుడు
పి. ఆదిత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దిలావర్ ప్పూర్

ప్రశ్న 2.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయండి.
జవాబు:

నల్లగొండ,
26.07.2023.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ.
నమస్కారములు.

విషయము : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు
నిర్దేశము : నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.07.2023.

ఆర్యా,

ఈ నెల తేది 20.07.2020 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.

ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ భవదీయుడు
XXXX

దరఖాస్తుతో జత చేసిన పత్రాలు :

  1. ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
  2. జనన ధ్రువీకరణ పత్రం
  3. స్థానిక ధ్రువీకరణ పత్రం.
  4. ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1) సంగమమైనా
జవాబు:
సంగమమైనా : సంగమము + ఐన – సంగమమైనా – ఉకార సంథి/ఉత్వసంథి
సూత్రము :- ఉత్తనకచ్చు పరంబగునపుడు సంథియగు

2) అణువంత
జవాబు:
అణువంత : అణువు + అంత = అణువంత
ఉకార సంధి/ఉ. త్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

3) ఏడజూచిన
జవాబు:
ఏడజూచిన : ఏడన్ + చూచిన – ద్రుతసంధి/సరళాదేశ సంధి
సూత్రము :- ద్రుత ప్రకృతికముల మీది పరుషములకు సరళములగు.

4) అదెట్లు
జవాబు:
అదెట్లు: అది + ఎట్లు = ఇకారసంధి
సూత్రము :- ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పకముగాను.

5) దర్శనోత్సాహి
జవాబు:
దర్శనోత్సాహి : దర్శన + ఉత్సాహి = గుణ సంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ వర్ణములు పరమైనచో క్రమముగా ఏ, ఓ, అర్ – లు ఏకాదేశమగును.

6) పాలికిఁబోవ
జవాబు:
పాలికిఁబోవ = పాలికిన్ + పోవన్ = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుతము మీది పరుషములకు సరళములాదేశమును ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషం విభాషనగు

7) భానోదయము
జవాబు:
భానోదయము : భాను+ఉదయము = సవర్ణదీర్ఘసంధి
సూత్రము :- అ, ఇ, ఉ, ఋ వర్ణములకు సవర్ణములైన అచ్చులు పరమైనచో వానికి దీర్ఘములు ఏకాదేశమగును.

8) దివ్యాంబర
జవాబు:
దివ్యాంబర : దివ్య + అంబర = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1) ఆహ్లాదగీతిక
జవాబు:
ఆహ్లాదమైన గీతిక – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

2) ఆలు పిల్లలు
జవాబు:
ఆలియును పిల్లలును – ద్వంద్వసమాసం

3) దయార్ధ దృష్టి
జవాబు:
దయార్ద్రమైన దృష్టి – విశేష పూర్వపద కర్మధారయ సమాసము

4) ధనపతి
జవాబు:
ధనమునకు మతి – షష్ఠీతత్పురుష సమాసం

5) శీతల నీరము
జవాబు:
శీతలమైన నీరము – విశేషణ పూర్వపదకర్మధారయ – సమాసం

6) మనోజ్ఞభావి
జవాబు:
మనోజ్ఞమైన భావి – విశేషణ పూర్వపద కర్మధారయము

7) ద్వారకానగరంబు
జవాబు:
ద్వారక అను పేరుగల నగరము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము

8) మహాశక్తి
జవాబు:
మహాతైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయము

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

XIV. ఈ క్రింది అంశాలలో ఒక దానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
జవాబు:
ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు.

చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి. తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం.

తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి.

తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం. వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్ట మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి.

శాతవాహన కాలపు మట్టికోటల ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహ నులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు.. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 – 1686) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724 – 1948) తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత -ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్ ‘ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగ నగర్’ అనే పేరొచ్చింది.

వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి. పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ద సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.

రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారదకథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండి సాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.

తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం.

2. జాతీయ విపత్తులు.
జవాబు:
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని.

అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.
విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు.

విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి.

దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు – ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

3. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
ఒకదేశ అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం.

ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness) : ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy) : పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill) : మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత
సంపాదించుకోవాలి.

4. భావోద్వేగాల నియంత్రణ (Management of emotions) : యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill) : సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.

ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making) : సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking) : ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking) : యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీ యువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావన నిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

TS Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. There is plenty of water in that region.
జవాబు:
ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది.

2. Learn as if you live forever.
జవాబు:
ఎప్పటికీ జీవిస్తావన్నట్లుగానే నేర్చుకోవాలి.

3. Reading is to the mind what exercise is to the body.
జవాబు:
శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది.

4. I completed reading the book yesterday.
జవాబు:
నేను పుస్తకం చదవటం నిన్న పూర్తి చేశాను.

5. Sometimes, later becomes never do it now.
జవాబు:
కొన్నిసార్లు, తరువాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చెయ్యాలి.

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

సాహిత్య ప్రక్రియల్లో నాటకం శక్తివంతమైన ప్రక్రియ. సంస్కృతంలో ‘కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం ‘ అని నాటక ప్రాశస్త్యాన్ని పండితులు ప్రశంసించారు. కాళిదాసు వంటి మహాకవులు నాటక ప్రక్రియను దృశ్యకావ్యంగా మలచి అద్భుతమైన నాటకాలను రచించారు. ప్రాచీన సాహిత్యంలోని నాటక ప్రక్రియకంటే భిన్నంగా పాశ్చాత్య నాటకాల ప్రభావంతో ఆధునిక తెలుగునాటకం రూపుదిద్దుకుంది. 1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన ‘మంజరీ మధుకరీయము’ మొదటి తెలుగునాటకం.

సంస్కృతనాటకాలు ఐదు నుండి పది అంకాల నిడివివుండేవి. తెలుగునాటకాలు మాత్రం మూడు, నాలుగు అంకాలుగానే ప్రదర్శితమయ్యేవి. కాలక్రమేణా నాటకం అంక విభజనను వదిలేసి కథానుగుణంగా రంగాలుగా విభజిస్తున్నారు. కాలపరిమితి గంట, రెండుగంటల మధ్య సంక్షిప్తంగా, సన్నివేశ గాఢత, సంభాషణా ప్రాధాన్యతతో నాటకాలు ప్రదర్శితమవు తుంటాయి. నాటికలు, ఏకాంకికలు నాటకశాఖకు చెందిన ఉపప్రక్రియలే.

‘ఆంధ్రనాటక పితామహుడి’గా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ‘విషాదసారంగధర’ నాటకం పాఠ్యాంశంగాను చదువుకోవడం విశేషం. ధర్మవరం తరువాత కోలాచలం శ్రీనివాసరావు చారిత్రక, ఇతిహాస నాటకాలు రచించి ‘ఆంధ్రచారిత్రక నాటక పితామహుడు’గా పేరుగాంచాడు. ‘ధార్వాడ’, పార్సీ నాటకసమాజాల వల్ల కూడా తెలుగు ప్రాంతంలో నాటక ప్రక్రియ ప్రాచుర్యం పొందింది.

కందుకూరి వీరేశలింగం ‘వ్యవహారధర్మబోధిని’ నాటకం 1880 ప్రాంతంలో తన చారిత్రక బాధ్యతను నిర్వర్తిస్తూ నాటక ప్రక్రియకు వ్యాప్తిని అందించింది. తెలుగునాట అనేక నాటక సమాజాలు ఏర్పడి ప్రజలలో నాటక అభిరుచిని, చైతన్యాన్ని కలిగించాయి. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ మొదటి వ్యవహారిక, సాంఘిక నాటకంగా సంచలనాన్ని సృష్టించింది. 1911లో చందాల కేశవదాసు రాసిన ‘కనకతార’ తెలంగాణ నుండి వచ్చిన తొలి నాటకంగా భావిస్తున్నారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
మొదటి తెలుగు నాటకం ఏది?
జవాబు:
మంజరీ మధుకరీయము

ప్రశ్న 2.
‘ఆంధ్రనాటక పితామహుడు’ ఎవరు?
జవాబు:
ధర్మవరం రామకృష్ణమాచార్యులు

ప్రశ్న 3.
కందుకూరి రాసిన నాటకం పేరు?
జవాబు:
వ్యవహారధర్మబోధిని

ప్రశ్న 4.
వ్యవహారిక భాషలో వెలువడిన తొలి నాటకం ఏది ?
జవాబు:
కన్యాశుల్కం

5. ‘కనకతార’ నాటకకర్త ఎవరు?
జవాబు:
చందాల కేశవదాసు

Leave a Comment