TS 10th Class Telugu (S/L) Question Paper April 2023

Reviewing TS 10th Class Telugu Model Papers and TS 10th Class Telugu (S/L) Question Paper April 2023 can help students identify areas where they need improvement.

TS 10th Class Telugu (S/L) Question Paper April 2023

‘సమయం: 2 గం. 30 ని.లు
మార్కులు : 60

విద్యార్థులకు సూచనలు :

  1. జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
  2. పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.

పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)

అ) కింది, పేరా చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు 1, 2 వాక్యాలలో రాయండి. (5 × 1 = 5 మా.)

వ్యాపారస్తుడు రంగడి రిక్షా ఎక్కుతూ, “చౌరస్తాకు తీసుకువెళ్ళు” అన్నాడు. అతను చౌరస్తాలో దిగి రంగడి చేతిలో నాలుగణాల బిళ్ళ పెట్టి వెళ్ళిపోయాడు. రంగడు ఇంటికి చేరుకుని రిక్షా మూలకు చేరుస్తుండగా రిక్షాలోంచి ఒక బరువు గల సంచి కిందపడింది. మిణుగు మిణుగుమంటున్న దీపాన్ని పెద్దది చేసి, సంచిని చేతిలో పట్టుకుని లోనికెళ్ళి తెరిచి చూశాడు. సంచి నిండా ముత్యాలున్నాయి. చౌరస్తాలో రిక్షా దిగి వెళ్ళిన వ్యక్తి ముత్యాల వర్తకుడనీ, అతడే సంచి మరిచిపోయి ఉంటాడనీ రంగడు నిశ్చయించుకున్నాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
రంగడి రిక్షా ఎవరు ఎక్కారు ?
జవాబు:
వ్యాపారస్తుడు

ప్రశ్న 2.
రిక్షాలోంచి ఏమి పడింది ?
జవాబు:
బరువు గల ఒక సంచి.

TS 10th Class Telugu (S/L) Question Paper April 2023

ప్రశ్న 3.
సంచిలో ఏమి ఉన్నాయి ?
జవాబు:
ముత్యాలు

ప్రశ్న 4.
రంగడు ఏమని నిశ్చయించుకున్నాడు ?
జవాబు:
చౌరస్తాలో రిక్షా దిగి వెళ్ళిన వ్యక్తి ముత్యాల వర్తకుడనీ, అతడే సంచి మరచిపోయి ఉంటాడనీ రంగడు నిశ్చయించుకున్నాడు.

ప్రశ్న 5.
వ్యాపారస్తుడు రంగడి చేతిలో ఏమి పెట్టాడు
జవాబు:
నాలుగణాల బిళ్ళ

ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి. (1 × 5 = 5 మా.)

ప్రశ్న 6.
సత్యం బెప్పుడు ……….. సర్వేశ్వరా !
జవాబు:
సత్యం బెప్పుడు తప్పఁడేనియు, దురాచారుండు గాఁడేని, యౌ
చిత్యం చేమఱఁడేని, దుర్జనుల గోష్ఠిం బొందఁడే భక్త సాం
గత్యం బాదటఁ బాయఁడేని మదనగ్రస్తుండు గాఁడేని నీ
భృత్యుం డాతఁడు మూఁడు లోకములలోఁ బూజ్యుండు సర్వేశ్వరా !

(లేదా)

సిరిగల వాని కెయ్యెడల ……….. ఫలంబు భాస్కరా !
జవాబు:
సిరిగల వాని కెయ్యెడల జేసిన మేలది నిష్ఫలంబగున్
నెఱిగురిగాదు పేదలకు నేర్పున జేసిన సత్ఫలంబగున్
వఱపున వచ్చి యేఘుడొక వర్షము వాడిన చేలమీదటన్
కురిసిన గాక యంబుధులు గుర్వగనేమి ఫలంబు భాస్కరా !

ఇ) కింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలను తయారు చేయండి. (5 × 2 = 10 మా.)

గోలకొండ కోటను గొర్రెల కాపరుల కొండ అని పిలిచేవారు. అదే గొల్లకొండ, గోల్కొండగా మారింది. ఇది తెలంగాణాలో హైదరాబాద్లో ఉన్నది. గోల్కొండ కోట నిర్మాణం జరిగి దాదాపు 500 సంవత్సరాలు గడిచాయి. ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు దండెత్తినా తట్టుకొని నిలబడింది. ఈ కోట 10 కిలోమీటర్ల పరిధిలో 87 చంద్రాకార బురుజులు ఉన్నాయి. 8 ప్రధాన ద్వారాలూ, నాలుగు వంతెనలు, అనేక రాజ మందిరాలూ, ఆలయాలూ, మసీదులతో నేటికీ ఎంతో వైభవంగా కనిపిస్తున్నది.

ప్రశ్న 7.
……………………………….
జవాబు:
గోలకొండను ఏమని పిలిచేవారు ?

ప్రశ్న 8.
………………………………
జవాబు:
గొల్లకొండ ఎలా మారింది ?

ప్రశ్న 9.
………………………………
జవాబు:
గోల్కొండ ఏ రాష్ట్రంలో ఉంది ?

ప్రశ్న 10.
………………………….
జవాబు:
గోల్కొండ కోట నిర్మాణ ప్రత్యేకత ఏమిటి ?

ప్రశ్న 11.
…………………………
జవాబు:
గోల్కొండ కోట పరిధిలో ఎన్ని బురుజులు ఉన్నాయి ?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
(32 మార్కులు)

అ) కింది ప్రశ్నలకు 4 నుండి 6 వాక్యాలలో జావాబులు రాయండి. (4 × 4 = 16 మా.)

ప్రశ్న 12.
డాక్టర్ సి. నారాయణరెడ్డి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
సి. నారాయణరెడ్డి 29.07.1931 సం॥రంలో, పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా, హనుమాజీపేట గ్రామంలో జన్మించారు. ఈయన ప్రముఖ కవి. సాహితీ పరిశోధకుడు. బహుభాషావేత్త. ప్రయోగశీలి. నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వంభర, మధ్యతరగతి మందహాసం, ప్రపంచ పదులు మున్నగు 70కి పైగా కావ్యాలు రాశాడు. భారత ప్రభుత్వంచే ‘పద్మభూషణ్’ పుస్కారంతో సత్కరించబడ్డాడు. ‘విశ్వంభర’ కావ్యానికి జాతీయస్థాయిలో అత్యున్నత స్థాయి సాహితీ పురస్కారమైన ‘జ్ఞానపీఠ్ అవార్డును’ అందుకున్నాడు.

TS 10th Class Telugu (S/L) Question Paper April 2023

ప్రశ్న 13.
“తేనెటీగ సంపాదించిన తేనె బాటసారి పాలైంది కదా !” మరి మీరు సంపాదించిన ధనాన్ని మీరు ఏమి చేస్తారు ?
జవాబు:
“తేనెటీగ సంపాదించిన తేనె బాటసారి పాలైంది కదా ! కాని నేను కష్టపడి ధనాన్ని సంపాదిస్తాను. కొంత పొదుపుచేసి భవిష్యత్తులో ఉపయోగపడటానికి దాచి ఉంచుతాను. తృప్తిగా తింటాను. మిగిలిన కొంత సొమ్మును సాటి పేద ప్రజలకు పంచి పెడతాను.

ప్రశ్న 14.
“సంస్కృతీ, నాగరికతలకు పునాదులు పల్లెపట్టులు” అని పొడుపు కథలు పాఠంలో ఉన్నది కదా ! ఎట్లాగో రాయండి.
జవాబు:
మన భారతీయ సంస్కృతి ఎంత ప్రాచీనమైందో అంత విచిత్రమైంది. దానికి ఔన్నత్యం ఎంత ఉందో అంత వైశాల్యమూ ఉంది. ఈ రెండింటిని మించిన లోతు కూడా ఉంది. మనది వ్యవసాయిక దేశం. ఈ దేశీయుల సంస్కృతీ నాగరికతలకు పునాదులు పల్లెపట్టులు. మన పూర్వులు ఆ పశుపాలనలో, ఆ పచ్చిక బయళ్ళలో, ఆ నీలాకాశంలోని మెరుపుల్లో, కుండపోతగా కురిసే వానల్లో ఏదో తమకు తెలియని రహస్యం దాగి ఉంది. ఈ భావనే అన్ని తత్వ రహస్యాలకూ, సమస్యలకూ, ముడులకూ, ముడి విప్పులకూ కారణమైంది.

ప్రశ్న 15.
చదువు మన జీవిత గమనాన్ని ఏ విదంగా మారుస్తుందో మీ మాటల్లో రాయండి.
జవాబు:
మనం చిన్నప్పుడు చదువుకున్న చదువు మన జీవిత గమనాన్ని మారుస్తుంది. ఆవేశాలను అణగారుస్తుంది. ఆలోచనలను రేకెత్తిస్తుంది. మానవులంగా సమానమే అన్న భావన కలిగిస్తుంది. అన్ని వర్గాల వాళ్ళకూ సామాజిక భాగస్వామ్యం మరియు చైతన్యం ఎంతో అవసరమని తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరిలోను చైతన్యం రావాలి అంటే చదువుకోవాలి. నిరక్షరాస్యతను నిర్మూలించాలి. చదువు అక్షరాస్యతను అభివృద్ధి చేయటానికి మార్గాలను అన్వేషించేటట్లు చేస్తుంది. ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వారికి చదువు ప్రాధాన్యతను వివరించి, వారిని ఉత్తేజపరచడానికి నడుం బిగించాలి.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి. (2 × 8 = 16 మా.)

ప్రశ్న 16.
“ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కోత ఉన్నదా.” అని కవి ఎందుకన్నాడో వివరించండి.
జవాబు:
“తరతరాలుగా మట్టిని దున్నుతున్నప్పటికినీ అది బాధపడదు. అలాగే ఎల్లప్పుడూ పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే ఏటికి కూడా అనారోగ్యం ఉండదు. కనుక ఈ కొద్ది ప్రయాణానికే అలసిపోయే మానవులారా ! ఆలోచించుకోండి. ఎంత ఎత్తుకు ఎగిరినప్పటికీ ఆకాశానికి అంతు ఉండదు. ప్రాణికోటి ఎంత పీల్చుకుంటున్నా గాలికి కరవు ఉండదు. మనిషి కూడా ఇటువంటి చైతన్యంతో ఉన్నతమైన లక్ష్యం కోసం కృషి చేయాలి.

(లేదా)

శతక పద్యాలు చదవడం వల్ల ఏయే లక్షణాలు పెంపొందుతాయి ?
జవాబు:
శతక పద్యాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇవి లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతుల్ని తెలియజేస్తాయి. ప్రతి ఒక్కరిలో నైతిక విలువలను పెంపొందిస్తాయి. బాలబాలికల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. సమాజానికి హితం చేస్తాయి. నీతి, ధర్మం, సత్యం, దేశభక్తి, మంచి నడవడి మొదలైనవి శతక పద్యాలు బోధిస్తాయి. ‘పైగా శతక పద్యాల్లో ఎన్నో నీతులు, విలువలు చోటు చేసుకున్నాయి. అందరిలో ఆ విలువల్ని పెంపొందింపచేయడమే శతక పద్యాల గొప్పదనం. కనుక వాటిని ఆచరించాలి.

ప్రశ్న 17.
భాగ్యరెడ్డి వర్మ మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు కదా ! మీకు కూడా మంచి పేరు రావాలంటే మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నారో రాయండి.
జవాబు:
అంటరాని వర్గాలు అనుభవిస్తున్న అవస్థల నుంచి వారిని గట్టెక్కించడానికి భాగ్యరెడ్డి వర్మ అంకిత భావంతో కృషి చేశాడు కదా ! నేను కూడా అణగారిన కులాల నాయకుల సహకారం, నైతిక మద్దతు కూడగట్టుతాను. అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలు మొదలుపెడతాను. మనుషులు సమానమని, ఎవరూ ఎక్కువ, తక్కువ కాదన సత్యాన్ని తెలుసుకునేటట్లు చేస్తాను. అంటరాని వర్గాలు, చదువుపై చూపు పెట్టేటట్లు చేస్తాను. అందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయమవుతాయి. అనేక బహిరంగ సభలు జరిపి, సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి, వారందరినీ ఏకతాటిపై నడిపిస్తాను. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకుంటాను. ప్రజలచే తాగుడు మాన్పిస్తాను, అణగారిన వార్గల్లో చేతన్యాన్ని తేవడానికి కృషి చేస్తాను.

(లేదా)

“తెలుగు మహిళ” పాఠం చదివారు కదా ! తల్లి తమ సంతానానికి ఏ విధమైన ఆదర్శాలు బోధిస్తుందో వివరించండి.
జవాబు:
మన జాతి సంస్కృతినీ, నాగరికతనూ అనేక విపత్కరమైన పరిస్థితులలో మన స్త్రీలు కాపాడినారు. వారు పరంపరాగతమైన సదాచారాలనూ, అనుశ్రుతంగా వస్తున్న అలవాట్లనూ పట్టుదలతో, దీక్షతో ఆచరిస్తున్నందువల్లనే మన జాతి సంస్కృతీ, నాగరికత సంరక్షించబడ్డాయి. స్త్రీలు తమ ఆదర్శాలను సాధించడానికి పట్టుదలతో, భక్తిశ్రద్ధలతో, దీక్షతో నోములో, వ్రతాలలో ఆచరించి ఒక విశిష్టమైన శారీరక మానసిక క్రమశిక్షణను అలవరచుకున్నారు. ఈ నోములు వ్రతాల ద్వారా స్త్రీలు కోరుకునేది తమ కుటుంబ సౌఖ్యం. వినాయక చవితికి పిల్లలతో విఘ్నేశ్వర పూజ చేయించి పండుగల విశిష్టతను తెలియజేస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలను నేర్పుతుంది. పురాణగాథలను చెప్తుంది. మంచి బుద్ధులను, ఆదర్శాలను తెలియజేస్తుంది.

పెద్దల పట్ల వినయ విధేయతలు, భక్తి గౌరవాలు, పేదల పట్ల దయాదాక్షిణ్యాలు, బంధుప్రీతి, అతిథి అభ్యాగతుల సత్కారము మొదలైన సుగుణాలను తల్లి తన సంతానానికి నేర్పుతుంది.

ఇ) సృజనాత్మకత (8 మార్కులు)

అ) కింది ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి. (1 × 8 = 8 మా.)

ప్రశ్న 18.
“సమాజంలో సాంఘిక దురాచారాలను తొలగించాలి” అనే విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ తయారు చేయండి..
జవాబు:
సాంఘిక దురాచారాలను తొలగించండి

మహాజనులారా !

మన సమాజంలో ఎంతో కాలంగా ఎన్నో సాంఘిక దురాచారాలు పాతుకుపోయాయి. వాటిని మనం గుడ్డిగా నమ్మి పాటిస్తూ వస్తున్నాము. రాజా రామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు గారు వంటి సంఘ సంస్కర్తలు, సతీ సహగమనము, భర్త పోయిన స్త్రీలకు అలంకారాలు తొలగించడం వంటి దురాచారాల నిర్మూలనకు కృషి చేసి, విజయం సాధించారు. మన ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు విధవలకు తిరిగి వివాహాలు జరిపించారు. ఎన్నో మూఢాచారాలను వారు నిర్మూలించారు. దయ్యాలు లేవని, భూత వైద్యం అంతా దగా అని వారు నిరూపించారు. శకునాలు, తిథులు మంచివి కావని వాటిని నమ్మేవారికి జాగృతులు కలిగించండి. వరకట్న పిశాచిని తరిమికొట్టండి. అంటరానితనాన్ని నిర్మూలించి, మానవులంతా ఒక్కటేనని ఎలుగెత్తి చాటండి. మానవ సేవయే మాధవ సేవయని తలచి సాటివారికి సహకరించండి.

ఇట్లు,
సాంఘిక దురాచారాల నిర్మూలన సంఘం,
హైదరాబాదు.

ప్రశ్న 19.
సమాజంలో మీకు సేవలందించే వారి గురించి తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

కరీంనగర్,
XXXXXX

ప్రియమైన మిత్రునకు,
నమస్కారము.

నేను క్షేమము. నీవు క్షేమమని తలుస్తాను. మా గ్రామ సమాజంలో ఒక సంఘసేవకుడు ఉన్నారు. నిరంతరం ఆయన ప్రజలకు ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటారు. ఆయన పేరు ధర్మారావు. పేరుకు తగినట్టే ఆయన సహాయ సహకారాలందిస్తుంటారు. ముఖ్యంగా మా గ్రామానికి మంచినీటి సౌకర్యాన్ని కల్గించారు. రోడ్లు వేయించారు. పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించి ఉచితంగా ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇంకా ఖాళీ ప్రదేశాల్లో చెట్లను నాటించి, సంరక్షణ భారాన్ని ఆయనే తీసుకున్నారు. నీకు తెలిసిన సేవలందించే వారుంటే వారిని గురించి వెంటనే తెలియజేస్తూ ఉత్తరం రాయి.
ఉంటా!

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. విజయ్

చిరునామా :
పి. శివరామ్
10వ తరగతి, ఇం.నెం. 5-3/14.
ఖమ్మం.

TS 10th Class Telugu (S/L) Question Paper April 2023

ప్రశ్న 20.
మీ పాఠశాలలో మీరు గీసిన చిత్ర ప్రదర్శన కార్యక్రమానికి ఒక చిత్రకారున్ని ఆహ్వానిస్తూ, ఆహ్వాన పత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

శారదా విజ్ఞాన మందిరం
ఆదిలాబాద్
* ఆహ్వానం *

సుప్రసిద్ధ చిత్రకారులగు శ్రీమాన్ రవి గార్కి,
నమస్కారము !
అయ్యా! ‘

ఇటీవల మా పాఠశాలలో మా బాల బాలికలచే చిత్రాలు గీయించి, చిత్రప్రదర్శన ఏర్పాటు చేశాము. దయచేసి మీరు మా పాఠశాలకు వచ్చి, చిత్ర ప్రదర్శనను తిలకించవలసిందిగా ప్రార్థన, అంతేగాక ఆ చిత్ర ప్రదర్శనలో విజేతలైన వారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మీ అమూల్యమైన సందేశాన్ని ఈయవలసిందిగాను కోరుచున్నాము.
తేది: X X X X X

ఇట్లు,
కార్యదర్శి,
చిత్ర ప్రదర్శన పరిషత్.

పార్ట్ – B

సమయం : 30ని.లు
(మార్కులు : 20)

సూచనలు :

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు నిర్దేశించిన స్థలంలోనే రాయాలి.
  2. పూర్తి చేసిన పార్టు – బి పత్రాన్ని పార్టు – ఎ సమాధాన పత్రంతో జతపరచండి.

I. భాషాంశాలు

అ) పదజాలం : (10 మార్కులు)

కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. (2 × 1 = 2 మా.)

ప్రశ్న 1.
ఉల్లాసం : ……………………..
జవాబు:
ఉల్లాసం : ఎవ్వరైనా ఎప్పుడూ ఉల్లాసంగా జీవించాలి.

ప్రశ్న 2.
సఖుడు : ………………..
జవాబు:
సఖుడు : అర్జునుడు శ్రీకృష్ణుని సఖుడు.

కింది ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి (A/B/C/D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (8 × 1 = 8 మా.)

ప్రశ్న 3.
జంతువులపై కరుణ చూపాలి. (గీత గీసిన పదానికి అర్థం)
A) దానం
B) దయ
C) దశ
D) దర్శనం’
జవాబు:
B) దయ

ప్రశ్న 4.
ప్రతి వ్యక్తి ఓ లక్ష్యముతో పని చేయాలి. (గీత గీసిన పదానికి అర్థం)
A) యుద్ధం
B) శబ్దం
C) గురి
D) ఎల్లప్పుడు
జవాబు:
C) గురి

ప్రశ్న 5.
‘అంబుధి’ లో నీరు ఉప్పగా ఉంటుంది. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు)
A) ఆకాశం, గగనం
B) గృహం, నిలయం
C) మాట, పలుకు
D) సముద్రం, సంద్రం
జవాబు:
D) సముద్రం, సంద్రం

ప్రశ్న 6.
ఎండాకాలం పయస్సును ఎక్కువగా వాడుతాము. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు)
A) పాలు, క్షీరము
B) నీరు, ఉదకము
C) పరమాన్నం, పాయసం
D) చారు, రసం
జవాబు:
A) పాలు, క్షీరము

ప్రశ్న 7.
“కుడుచు’ పదానికి నానార్థాలు గుర్తించండి.
A) తిను, తాగు
B) గుహ, అడవి
C) తామర, శంఖం
D) మేఘం, చీకటి
జవాబు:
A) తిను, తాగు

ప్రశ్న 8.
“సంతోషం, స్నేహం” నానార్థాలుగా గల పదం
A) కోతి
B) మూతి
C) ప్రీతి
D) నూతి
జవాబు:
C) ప్రీతి

ప్రశ్న 9.
‘పుస్తకం’ పదానికి వికృతి పదం
A) బాస
B) పానం
C) బత్తి
D) పొత్తం
జవాబు:
D) పొత్తం

ప్రశ్న 10.
“కస్తి” పదానికి ప్రకృతి పదం
A) కష్టం
B) కథ
C) ఆధారం
D) గుణం.
జవాబు:
A) కష్టం

ఆ) వ్యాకరణాంశాలు: (10 మార్కులు)
కింది ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి (A/B/C/D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)

ప్రశ్న 11.
వైష్ణవి చక్కగా చదువుకుంటుంది. (గీత గీసిన పదం ఏ భాషాభాగం)
A) సర్వనామము
B) నామవాచకం
C) క్రియ
D) విశేషణము
జవాబు:
B) నామవాచకం

TS 10th Class Telugu (S/L) Question Paper April 2023

ప్రశ్న 12.
అమీనా టీచర్ పాఠం చెబుతున్నది. (క్రియా పదాన్ని గుర్తించండి)
A) అమీనా
B) చెబుతున్నది
C) పాఠం
D) టీచర్
జవాబు:
B) చెబుతున్నది

ప్రశ్న 13.
రాజు, రాము …………. బహుమతి కొన్నాడు. (విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.)
A) చే
B) కంటె
C) కొరకు
D) లో
జవాబు:
C) కొరకు

ప్రశ్న 14.
శివాని ………….. విహార యాత్రలు చేయాలంటే చాలా ఇష్టం. (విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి)
A) కి
B) వలన
C) ను
D) కంటె
జవాబు:
A) కి

ప్రశ్న 15.
చార్మినార్ను కులీ కుతుబ్ షా చాలా పటిష్టంగా నిర్మించాడు. (‘కర్త’ పదాన్ని గుర్తించండి)
A) చార్మినార్
B) నిర్మించాడు
C) కులీ కుతుబ్ షా
D) పటిష్టంగా
జవాబు:
C) కులీ కుతుబ్ షా

ప్రశ్న 16.
పద్మజ పుస్తకం తీసింది. పద్మజ కవితలు రాసింది. (సంక్లిష్ట వాక్యంగా మార్చండి)
A) పద్మజ పుస్తకం’ తీసినందుకు కవితలు రాసింది.
B) పద్మజ పుస్తకం తీసినందువల్ల కవితలు రాసింది.
C) పద్మజ పుస్తకం తీసి కవితలు రాసింది.
D) పద్మజ పుస్తకంలో కవితలు రాసింది.
జవాబు:
C) పద్మజ పుస్తకం తీసి కవితలు రాసింది.

ప్రశ్న 17.
రథానికి నాలుగు చక్రాలు ఉన్నాయి. (గీత గీసిన పదం ఏ సమాసం)
A) ద్వంద్వ
B) తత్పురుష
C) బహువ్రీహి
D) ద్విగు
జవాబు:
D) ద్విగు

ప్రశ్న 18.
మా నాన్న సంతలో కూరగాయలు తెచ్చాడు. (ద్వంద్వ సమాస పదాన్ని గుర్తించండి)
A) వెళ్ళి
B) కూరగాయలు
C) నాన్న
D) తెచ్చాడు
జవాబు:
B) కూరగాయలు

ప్రశ్న 19.
“ఎప్పుడెప్పుడు” పదాన్ని విడదీయండి.
A) ఎప్పుడు + ఎప్పుడు
B) ఎప్పు + డెప్పుడు
C) ఎప్పు + ఎప్పుడు
D) ఎప్పుడెప్పు + డు
జవాబు:
A) ఎప్పుడు + ఎప్పుడు

ప్రశ్న 20.
దొంగలకు + ఇత్తురో పదాన్ని కపపండి.
A) దొంగల ఇత్తురో
B) దొంగ లొత్తురో
C) దొంగలకిత్తురో
D) దొంగలకుఇత్తురో
జవాబు:
C) దొంగలకిత్తురో

Leave a Comment