Reviewing TS 10th Class Telugu Model Papers Set 1 (S/L) can help students identify areas where they need improvement.
TS SSC Telugu (S/L) Model Paper Set 1 with Solutions
‘సమయం: 3 గం.
మార్కులు : 80
విద్యార్థులకు సూచనలు :
- జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
- పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.
పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)
అ) కింది పేరా చదువండి. అయిదు ప్రశ్నలను తయారుచేయండి. (5 × 1 = 5 మా.)
కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని కొడుకు గౌతముడు, అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడ ఉన్నది. గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం, భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు,
ఒకనాడు వాళ్ళిద్దరు నదీ తీరానికిపోయారు. అక్కడ ఆకాశంలో హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశాడు. వాటిని వేటాడాలని బాణంతో కొట్టాడు. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిల కొట్టుకుంటూ గౌతముని ముందు పడ్డది.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
………………………………..
జవాబు:
కపిలవస్తు నగరాన్ని ఎవరు పరిపాలించేవారు ?
ప్రశ్న 2.
………………………………..
జవాబు:
గౌతముడు ఎవరి కుమారుడు ?
ప్రశ్న 3.
………………………………..
జవాబు:
గౌతముడికి గల సుగుణాలు ఏవి ?
ప్రశ్న 4.
………………………………..
జవాబు:
దేవదత్తుడు ఎవరు ?
ప్రశ్న 5.
………………………………..
జవాబు:
హంసను ఎవరు గాయపరిచారు ?
ఆ) కింది పద్యాలు తారుమారుగా ఉన్నాయి. వాటిలో ఒకదానిని వరుసక్రమంలో రాయండి. (1 × 5 = 5 మా.)
6. శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులున్ బువ్వులా
జలజాంత స్థ్విత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న రే
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్శకుల్ భూవరా
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షింపుచున్
జవాబు:
జలజాంత స్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న రే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షింపుచున్
శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులున్ బువ్వులా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్శకుల్ భూవరా
(లేదా)
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ !
నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడే చాలు మేటి చే
రాంచి నిజంబకాని పలుకాడని వాఁడు రణంబులోన మేన్
జాచని వాఁడు వేటొకడు జాచిన లేదనకిచ్చువాఁడు నో
జవాబు:
నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే
జాచని వాఁడు వేటొకడు జాచిన లేదనకిచ్చువాఁడు నో
రాఁచి నిజంబకాని పలుకాడని వాఁడు రణంబులోన మేన్
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ !
ఇ) కింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 2 = 10 మా.)
వరంగల్ నగరంలో పర్యాటకులను ఆకర్షించేది వరంగల్ కోట. దక్షిణ భారతదేశంలో శిల్పకళకు మచ్చుతునక ఈ కోట. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు క్రీ.శ. 1199 సం॥లో కోట నిర్మాణం మొదలు పెట్టాడు. అతని కుమార్తె రాణి రుద్రమదేవి 1261 సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ కోట నాలుగు పెద్ద ప్రవేశ ద్వారాలు కలిగి ఉన్నది. చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్నవారికి ఈ కోట సందర్శనీయమైనది. రాతిపై చెక్కబడిన సింహాల వంటి జంతువులు మరియు హంసల వంటి పక్షులు ఆనాటి కళాకారుల పనితనానికి నిదర్శనం.
ప్రశ్నలు :
ప్రశ్న 7.
దక్షిణ భారతదేశంలో శిల్పకళకు మచ్చుతునకగా నిలిచిన కోట ఏది ?
జవాబు:
దక్షిణ భారతదేశంలో శిల్పకళకు మచ్చుతునకగా నిలిచిన కోట వరంగల్ కోట.
ప్రశ్న 8.
పై పేరాలో ఉన్న తండ్రి కూతురు ఎవరు ?
జవాబు:
పై పేరాలో ఉన్న తండ్రి – కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు, గణపతిదేవ చక్రవర్తి కూతురు – రుద్రమదేవి.
ప్రశ్న 9.
వరంగల్ కోట నిర్మాణం మొదలు పెట్టినవాడు ఎవరు ?
జవాబు:
వరంగల్ కోట నిర్మాణం మొదలు పెట్టినవాడు కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు.
ప్రశ్న 10.
కళాకారుల పనితనానికి నిదర్శనమైనవి ఏవి ?
జవాబు:
రాతిపై చెక్కబడిన సింహాల వంటి జంతువులు మరియు హంసల వంటి పక్షులు ఆనాటి కళాకారుల పనితనానికి ‘ నిదర్శనం.
ప్రశ్న 11.
కోట నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తి అయినది ?
జవాబు:
కోట నిర్మాణం 1261 సంవత్సరంలో పూర్తయింది.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (40 మార్కులు)
స్వీయరచ (32 మార్కులు)
అ) కింది ప్రశ్నలకు 4 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి. (4 × 4 = 16 మా.)
ప్రశ్న 12.
శ్రమజీవి పాఠం రచయిత గురించి రాయండి.
జవాబు:
శ్రమజీవి పాఠం రచయిత కనపర్తి రామచంద్రాచార్యులు. వీరు 8.8.1947 సంవత్సరంలో సిద్ధిపేట జిల్లాలోని గట్లమల్యాల గ్రామంలో జన్మించారు. రామచంద్రాచార్యుల తండ్రి పేరు రంగయ్య, తల్లి పేరు మాలక్ష్మమ్మ. ఈయన తల్లి దగ్గరే భారత, రామాయణ, భాగవతాలు నేర్చుకున్నారు.
రామచంద్రాచార్యులు గారు మొదట పశుసంవర్థక శాఖలో, తర్వాత ఉపాధ్యాయునిగా పనిచేశారు. వీరు హృదయాంజలి, అక్షర శిల్పాలు, వెలుతురు పూలు, నైమిశారణ్యం, నగరంలో వెన్నెల మొదలగు రచనలు చేశారు. ఈయన రచనాశైలి సరళంగా ఉండుటచే పలువురు మన్ననలు పొందింది. రచయితకు “వచన కవితా ప్రవీణ” అను బిరుదు కలదు. రామచంద్రాచార్యులు వేముగంటి పురస్కారం, జాతీయసాహిత్య పురస్కారాలను అందుకోవడంతోబాటు స్వర్ణకంకణ సత్కారం కూడా పొందిన సుప్రసిద్ధులు.
ప్రశ్న 13.
తల్లిదండ్రులు ఎటువంటి గుణాలున్న కొడుకు కావాలని కోరుకుంటారు ?
జవాబు:
ఎవరి దగ్గర చేయి చాచనివాడు, పదిమందికి దానం చేసే స్థితిలో ఉన్నవాడు, ఎల్లప్పుడూ సత్యమే తప్ప అసత్యమెరుగనివాడు, యుద్ధంలో వెన్ను చూపనివాడు (పిరికితనంతో పారిపోకుండా ఉండుట) మొదలగు శ్రీరాముని వంటి సకలసంపన్న గుణాలు కలిగిన కుమారుడు ఒక్కడున్నా చాలునని తల్లిదండ్రులు కోరుకుంటారు.
ప్రశ్న 14.
పొడుపు కథల వలన ఉపయోగములేవి ?
జవాబు:
పొడుపు కథలు మహాభారతకాలం నుండి ఉన్నవి. ఆనాటి కాలం పొడుపుకథలను యక్షప్రశ్నలు అనేవారు. వీటిని పండితలోకం ప్రహేళిక అంటారు. సామాన్యులు పొడుపు కథలు అంటారు. పొడుపు కథలు వినోద విజ్ఞానదాయకాలు. పొడుపు కథలు పిల్లల్లో జిజ్ఞాసను, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. అంతేకాదు పిల్లల్లో ఆలోచనాశక్తిని, బుద్ధికుశలతను కలుగజేస్తాయి.
సమస్య ఎలా నిర్మాణం అవుతుందో పొదుపు కథలు తెలుపుతాయి. సమస్య ఎలా పరిష్కారం అవుతుందో విడుపు కథలు తెలుపుతాయి.
పొదుపు కథలు విద్యార్థులలో జ్ఞాపకశక్తిని, సంభాషణా చాతుర్యాన్ని పెంపొందించి అవధాన ప్రక్రియకు అంకుర మేర్పరుచును.
ప్రశ్న 15.
“సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం అనేది చదువుకోవడం వల్లనే సాధ్యం అవుతుంది”. మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
భాగ్యరెడ్డి వర్మ తెలియజేసినట్లుగా సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం అనేది చదువు వల్లనే సాధ్యమవుతుంది. మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్న విషయాన్ని అణగారిన వర్గాలవారు గ్రహించాలని వర్మ తెలియజేశారు. తమ దుస్థితికి కారణం అజ్ఞానం, ఉదాశీనతేనని తెలుసుకోవాలని తమ జాతి జనులకు ఉద్భోదించారు.
తాగుడువల్ల కుటుంబాలు ఏ విధంగా నాశనమవుతాయో తెలియజేసి నిమ్నవర్గాల వారిని ఏకతాటిపై నడుపగలిగాడు. అనేక బహిరంగ సభలు నిర్వహించి సాంఘిక దురాచారాలైన దేవదాసి, వేశ్య సంప్రదాయాలను అడ్డుకున్నాడు.
ఈ విధంగా నిరంతర శ్రద్ధ వలన అంటరాని వర్గాలు చదువుపై దృష్టిపెట్టడం జరిగిందని భాగ్యోదయం పాఠం ద్వారా గ్రహింపవచ్చును. కావున సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం అనేది చదువుకోవడం వల్లనే సాధ్యమవుతుందన్న భాగ్యరెడ్డివర్మ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.
సమాజంలోని జనులందరు సమానంగా భావింపబడాలన్నా, ఆది హిందువులు సొంతకాళ్ళమీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని భాగ్యరెడ్డి వర్మ తన బలమయిన విశ్వాసాన్ని తెలియజేశారు.
ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి. (2 × 8 = 16 మా.)
ప్రశ్న 16.
‘కష్టపడి పని చేస్తేనే మనం అనుకున్నది సాధించగలము’ దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
- “కృషితో నాస్తి దుర్భిక్షం” అని అన్నారు పెద్దలు.
- కృషి చేసే వాడికి పరాజయం అనేది ఎప్పుడూ ఉండదు.
- కష్టపడి పని చేసేవాడికి ఏ రంగంలోనైనా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- లక్ష్యం సాధించాలంటే నిరంతరం శ్రమించేతత్వం పెంచుకోవాలి. అప్పుడే లభించిన ఫలితానికి విలువ ఉంటుంది.
- ఆరుగాలం కష్టపడితేనే లక్ష్యం సిద్ధిస్తుంది.
- కృషి ఉంటేనే మనుషులు ఋషులయ్యారు. మహాపురుషులయ్యారు. కాబట్టి కర్మను వదలకుండా పట్టుదలతో చేయాలి.
- మండే కొవ్వొత్తి, ప్రమిదగా మారి కాంతిని పంచుతుంది. ఉలిదెబ్బలు భరించినపుడే రాయి శిల్పంగా మారుతుంది.
- బురదలో ఉన్న పద్యానికి ఎప్పుడూ విలువ తగ్గదు.
- చిన్నదీపాన్ని గాలి ఆర్పగలదు. పెద్దమంటను ఆర్పడం గాలికైనా సాధ్యం కాదు కదా !
- మన చుట్టూ ఉండే ప్రతి చిన్న అంశము నుండి ప్రేరణ పొందుతూ కష్టపడి, ఇష్టపడి పని చేస్తేనే అనుకున్నది సాధించగలము.
(లేదా)
నీతి పరిమళాలు పాఠం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో రాయండి.
జవాబు:
- దారిలో ఒంటరిగా నడువరాదు. ఇతరుల మనసును నొప్పించేలా మాట్లాడరాదు.
- శత్రువు ఇంట్లో భోజనం చేయరాదు. స్నేహంగా ఉంటూ ఇతరుల ధనాన్ని తమ సొంతం చేసుకోరాదు.
- తల్లిదండ్రులకు సకలసుగుణాలు గల శ్రీరాముని వంటి ఒక్క కుమారుడున్నా చాలు.
- సంపద ఉన్నవాడికి మేలు చేయడం కంటే పేదలకు చేసే మేలు ఉత్తమమైనది.
- గురువులను ఎదిరించకు, నీకు అండగా ఉన్న వ్యక్తిని నిందించకు.
- అల్పబుద్ధి వాని మాటలు కంచుమ్రోగినట్లు ఆడంబరంగా ఉంటాయి. సజ్జనుని మాటలు బంగారు శబ్దంగా ఏ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
- ఎప్పుడూ సత్యమే పలికేవాడు, మంచి ప్రవర్తన కలవాడు, ఔచిత్యాన్ని వీడనివాడు, భక్తుల సాంగత్యాన్ని ఎల్లవేళలా కలిగి ఉండేవాడు, కోరికలకు లోను కానివాడు ఎవడైతే ఉన్నాడో వాడే భగవంతునికి నిజమైన భక్తుడు.
- లక్షాధికారియైన లవణమన్నమె తింటాడు. కాని బంగారం మింగలేడు కదా ! తన వెంట ఏమీ తెచ్చుకోని నరుడు పోయేటప్పుడు వెంట ఏమీ తీసుకుపోడు కదా! తేనెతీగ తాము సంసాదించిన తేనెను తాగనట్లే లోభికూడా తాను సంపాదించిన దానిని ఇతరుల పాలు చేస్తాడు.
- విద్యావంతులైనప్పటికీ దుర్జనులకు దూరంగా ఉండాలి.
ప్రశ్న 17.
పెంబర్తి శిల్పుల కళానైపుణ్యమును తెలుసుకున్నారు కదా ! మీకు తెలిసిన ఏదైనా ఒక కళ, దాని ప్రత్యేకతను గురించి రాయండి.
జవాబు:
- బిద్రీ అనేది పర్షియాదేశపు కళ. దీని కేంద్రం హైదరాబాదులో ఉంది.
- నల్లని ఉపరితలంపై మెరిసే వెండి తీగెలు, రేకులతో చేసిన రేకులతో చేసిన అలంకరణలు ఆ వస్తువులకు మరింత అందాన్ని తీసుకొస్తాయి.
- రాగి తుత్తు నాగం కలిపి మిశ్రమ లోహం తయారుచేస్తారు.
- వెండి తీగతో బొమ్మలు, డిజైనులు చేస్తారు.
- ఎంతకాలమైనా తుప్పుపట్టకుండా ఉండటం బద్రీ కళాకృతుల ప్రత్యేకత.
- పెట్టెలు, లాంపులు, పూలకుండీలు, సిగరెట్ పెట్టెలు, నీటి కూజాలు మొదలగు కళారూపాలను తయారుచేస్తారు.
- ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలోను, హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియంలోను బిద్రీతో చేసిన కుర్చీలు ఉన్నాయి.
- బిద్రీకళను నిజాం నవాబులు ప్రోత్సహించారు.
- ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బీదర్ ఒకప్పుడు నిజాం పాలనలో ఉండేది. అక్కడి నుండి నైపుణ్యం కలిగిన కళాకారులను హైదరాబాదుకు రప్పించి ఇక్కడే కర్మాగారాలను ఏర్పాటు చేయించారు.
- ఇప్పటికినీ బీదర్, హైదరాబాదులోని గోల్కొండ ప్రాంతాల్లో ఈ కళ మనుగడలో ఉంది.
- బిద్రీ కళాకృతులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.
(లేదా)
‘ఆంధ్రుల నాగరికతకూ, సంస్కృతికీ పాటలు మూలాధారాలు’ ఎట్లాగో వివరించండి.
జవాబు:
“అమ్మ మాట తీపి అమ్మ పాట తీపి కమ్మనైన అమ్మ కరము తీపి” అని అన్నాడో కవి.
పూర్వకాలంలో ఎక్కువ చదువు నేర్వని స్త్రీలకు విద్యుక్త ధర్మాలనూ, ప్రపంచజ్ఞానాన్ని, పురాణ పరిచయాన్ని, చారిత్రాత్మక విశేషాలనూ, వేదాంత తత్త్వాలనూ, వైద్య విషయాలనూ, పరంపరా గతమైన ఆచార వ్యవహారాలనూ అన్నింటినీ పాటల ద్వారా బోధ చేశారు. ఈ పాటలలోని సాంఘిక జీవనము ప్రకృతి సిద్ధమైనది. ఇవి సంఘ జీవనానికి, కుటుంబ జీవితాలకీ అద్దం పడతాయి. ఆంధ్రుల నాగరికతకూ సంస్కృతికి ఈ పాటలు మూలాధారాలు.
వీటిలో గృహిణి ఆశలూ, ఆశయాలు, జీవితానందమూ, వాటికి సంబంధించిన వాతావరణమూ తప్ప మరొకటి లేదు. ఈ పాటలలోని స్త్రీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు అంతా సంసార పక్షమే. వివిధ సందర్భాలలో స్త్రీలు పొడుకొనే పాటలు మచ్చుకు కొన్ని.
1. ‘జో అచ్చుతానంద – జో జో ముకుందా
రార పరమానంద – రామ గోవింద జో ………. (జోల పాట)
2. “కస్తూరి రంగరంగా ! నాయన్న కావేటి రంగరంగా !
శ్రీరంగ రంగరంగా ! నినుబాసి యెట్లు నేమరచుందురా ! (పౌరాణికం)
3. “బంగారు తీగమీద కొంగయున్నది
కొంగ ముక్కులోని శివలోకమున్నది
సెట్టు చేనులేనిచోట కాకి యున్నది
కాకి కడుపులోని జగలోకమున్నది
సింతలోపు దోవలోన కోతియున్నది
కోతి కడుపులోనే పరంజ్యోతియున్నది” (తత్త్వం)
4. సెలవిచ్చి మాయమ్మ సెలవిచ్చినాము
సెలగి మీయత్తింట్ల బుద్ధిగలిగుండు
ఎవ్వరేమాడినా ఎదురాడకమ్మ
పరమాత్మతో గూడి వెలుగు మాయమ్మ ! (అంపకాలు)
5. సువ్వీ కస్తూరి రంగా సువ్వీ కావేటి రంగా
సువ్వీ బంగారు రంగా సువ్వీలాలో
ఆ హుం ఆ……. హూం (పెళ్ళి పాట)
6. ఎ) బంగారు బొమ్మకు ఓనీలు వేయరే
ఒళ్ళంత పసుపును రాసి కూర్చుండ బెట్టరే కుడుకలను వేయరే
బి) పదునాలుగు లోకాలు పదిలంగా పాలించే పద్మాక్షి వరముతో జన్మించినావు.
చిరకాలము నీవు సిరి సంపదలతోటి శ్రీమహాలక్ష్మిగా వర్ధిల్లవమ్మా
శ్రీదేవి భూదేవి అలివేణి రాణి అమ్మలలితామాత పాలించు తల్లి
అన్ని విద్యలకెల్ల ఆది విద్యల తల్లి శ్రీవాణిగా నీవు వెలుగొందనమ్మ (పుష్పవతి సందర్భంగా పాడుకొనే పాట)
7. రామ లక్ష్మణ పెళ్ళి లగ్నామెల్లుండి రారమ్మ జనులారా రతనాలు దంచ ………….. లగ్నామెల్లుండి ..
8. జానకిదేవి శ్రీమంతమును జరుగుట నిజమౌను
రతనాలు దంచ (దంపుడు పాటలు)
ఔను జరుగుట నిజమౌను (శ్రీమంతము సందర్భంగా పాడుకొనే పాట)
ఎ) గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో
మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో
మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొబ్బియల్లో
నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొబ్బియల్లో
బి) వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ
సిరులెన్నో తెచ్చింది మా ఇళ్ళు నిండుగ
ఇంతులార రండి ఓ బంతులార రండి
సంక్రాంతి సంబరాలు చేతము రారండి
వచ్చింది ………………………
(సంక్రాంతి సందర్భంగా పాడుకొనే పాట)
స్త్రీ యొక్క శారీరక, మానసిక ఉద్వేగాలలో నుండి పుట్టిన ఈ పాటలే ఆంధ్రుల నాగరికతకూ, సంస్కృతికీ మూలాధారాలు.
ఇ) సృజనాత్మకత (8 మార్కులు)
కింది వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి. (1 × 8 = 8 మా)
ప్రశ్న 18.
మీ పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శన (సైన్సు ఎగ్జిబిషన్) ఎలా జరిగిందో తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
20.5.2023,
హైదరాబాదు.
ప్రియమైన మిత్రునికి,
ఉభయకుశలోపరి గత నెలలో మా పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శన నిర్వహించబడినది. వివిధ రకాల నమూనాలను ఇందులో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన మూడురోజులపాటు జరిగింది.
విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి ప్రదర్శనలు చాలా ఉపయోగము. ఉపాధ్యాయ, తల్లిదండ్రులు తిలకించి మెచ్చుకున్నారు. విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. నాకు ప్రథమ బహుమతి లభించింది. మీ పాఠశాలలో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ విశేషాలు తెలుపగలవు.
ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
X X X X X X X
కె. అనిల్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రము.
ప్రశ్న 19.
ఒక సంగీత కళాకారుని ఇంటర్వ్యూ చేయడానికి ‘ప్రశ్నావళి’ని తయారుచేయండి.
జవాబు:
నమస్కారమండి దేవిశ్రీ గారూ !
- మీరు సంగీత కళాకారునిగా మారడానికి ప్రేరణ ఎవరు ?
- మీరు పాటలు పాడతారని కూడా విన్నాం. ఎన్ని సినిమాలకు పాటలు పాడారు ?
- నాటి, నేటి సంగీతంలోను, సాహిత్యంలోనూ ఉన్న వ్యత్యాసాలేమిటి ?
- మీకు ఇష్టమైన రాగం ఏది ?
- కళాకారులకు ప్రభుత్వ సహకారం లభిస్తుందా ?
- మీరు ఎన్ని సంవత్సరాలు సంగీత సాధన చేశారు ?
- మీ పాటలకు ప్రజాదరణ ఏ విధంగా ఉంది ?
- మీకు లభించిన పురస్కారాలను గురించి చెప్పండి ?
- సంగీతానికి ప్రాణం పోసే శక్తి ఉందని అంటారు ? అటువంటి అనుభవనం మీకెప్పుడైనా ఎదురైందా ?
- భావి కళాకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
ప్రశ్న 20.
నీటి సంరక్షణను తెలుపుతూ ‘పోస్టరు’ తయారుచేయండి.
జవాబు:
నీరే ప్రాణాధారం
“నీటి వృథాను అరికట్టకపోతే …..
భావితరాల మనుగడ అసాధ్యం”
జలాలను రక్షించుకోకపోతే
“జలథిని మధించవలసిన ఆవశ్యకత తథ్యం”
సమయం : 30 ని.లు
మార్కులు: 20
Part – B
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానాలు నిర్దేశించిన స్థలంలోనే రాయాలి. ‘
- పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ ప్రశ్నా పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ సమాధాన పత్రంలో జత చేయండి.
I. భాషాంశాలు (20 మార్కులు)
పదజాలం : (10 మార్కులు)
అ) కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి. (2 × 1 = 2 మా.)
ప్రశ్న 1.
అవసానదశ = చివరిదశ
అవసానదశ : …………………………………….
జవాబు:
అవసానదశ : ప్రతి కొడుకు అవసానదశలో ఉన్న తమ తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
ప్రశ్న 2.
ఆదరణ = మన్నన
ఆదరణ : …………………….
జవాబు:
ఆదరణ : ఆదరణకు నోచుకోని అనాథలు ఈ లోకంలో ఎందరో ఉన్నారు.
కింది ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి (A / B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లో రాయండి. (8 × 1 = 8 మా.)
ప్రశ్న 3.
సంవత్సరానికి పన్నెండు మాసములు ఉంటాయి. (గీత గీసిన పదానికి అర్థం)
A) నెలలు
B) వారములు
C) రోజులు
D) పక్షములు
జవాబు:
A) నెలలు
ప్రశ్న 4.
కూరిమితో ఉన్నప్పుడు తప్పులు కనిపించవు. (గీత గీసిన పదానికి అర్థం)
A) బాధ
B) స్నేహం
C) శత్రుత్వం
D) కష్టం
జవాబు:
B) స్నేహం
ప్రశ్న 5.
రాజు, ప్రభువు పదములకు పర్యాయపదముగా ఉన్న పదం ఏది?
A) రైతు
B) భూవరుడు
C) మనిషి
D) జంతువు
జవాబు:
B) భూవరుడు
ప్రశ్న 6.
ఆకాశంలో మబ్బులు కదులుతున్నవి. (గీత గీసిన పదానికి పర్యాయపదములు)
A) మేఘం, అభ్రము
B) మేఘం, గాలి
C) గాలి, అభ్రము
D) అగ్ని, జలదము
జవాబు:
A) మేఘం, అభ్రము
ప్రశ్న 7.
‘అడుగు’ పదానికి నానార్థము రాయండి.
A) యాచించు, తిను
B) పాదం, పదం
C) పాదం, పద్యపాదం
D) పాతాళం, పలుగు
జవాబు:
C) పాదం, పద్యపాదం
ప్రశ్న 8.
‘మరణం లేనివారు’ అను పదానికి వ్యుత్పత్యర్ధము
A) అసురులు
B) అరుగులు
C) అతిథులు
D) అమరులు
జవాబు:
D) అమరులు
ప్రశ్న 9.
విజ్ఞాన శాస్త్రం లో ఎన్నో వింతలు ఉన్నాయి. (గీత గీసిన పదానికి వికృతి)
A) శాకము
B) చట్టం
C) శాతము
D) శతకము
జవాబు:
B) చట్టం
ప్రశ్న 10.
‘పద్దెం’ ప్రకృతి పదం [ ]
A) పద్యం
B) పందెం
C) పంతం
D) పంకం
జవాబు:
A) పద్యం
II. వ్యాకరణాంశాలు (10 మార్కులు)
కింది ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి ( A / B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)
ప్రశ్న 11.
రమణ వేగంగా పరిగెత్తుతాడు. (గీత గీసిన పదం ఏ భాషాభాగము ?)
A) నామవాచకము
B) సర్వనామము
C) విశేషణము మాట్లాడింది.
D) క్రియ
జవాబు:
C) విశేషణము మాట్లాడింది.
ప్రశ్న 12.
అనిత కవిత ………… మాట్లాడింది.
(విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.)
A) తో
B) ని
C) అందు
D) యొక్క
జవాబు:
A) తో
ప్రశ్న 13.
పిల్లలు చక్కగా పాట పాడుతున్నారు. (సమాపక క్రియను గుర్తించండి.)
A) పిల్లలు
B) చక్కగా
C) పాట
D) పాడుతున్నారు
జవాబు:
D) పాడుతున్నారు
ప్రశ్న 14.
‘అమ్మమ్మ లడ్డు చేసి, మనవడికి తినిపించింది. (అసమాపక క్రియను గుర్తించదండి.)
A) అమ్మమ్మ
B) లడ్డు
C) చేసి
D) తినిపించింది
జవాబు:
C) చేసి
ప్రశ్న 15.
రైతు పొలానికి వెళ్లాడు. రైతు కూరగాయలు తెచ్చాడు. (సంక్లిష్ట వాక్యంగా మార్చండి)
A) రైతు పొలానికి వెళ్ళి, కూరగాయలు తెచ్చాడు.
B) రైతు పొలానికి వెళ్ళాడు, కూరగాయలు తెచ్చాడు.
C) రైతు పొలానికి వెళ్ళకుండా కూరగాయలు తెచ్చాడు.
D) రైతు పొలానికి వెళ్ళాడు, కాని కూరగాయలు తేలేదు.
జవాబు:
A) రైతు పొలానికి వెళ్ళి, కూరగాయలు తెచ్చాడు.
ప్రశ్న 16.
శైలజ వంట చేసి, ఆఫీసుకు వెళ్లింది. (సామాన్య వాక్యంగా రాయండి.)
A) శైలజ వంట చేసి, ఆఫీసుకు వెళ్ళలేదు.
B) శైలజ వంట చేసింది, శైలజ ఆఫీసుకు వెళ్ళింది.
C) శైలజ వంట చేసింది, ఆఫీసుకు వెళ్ళింది.
D) శైలజ వంట చేసింది, కాని ఆఫీసుకు వెళ్ళింది
జవాబు:
B) శైలజ వంట చేసింది, శైలజ ఆఫీసుకు వెళ్ళింది.
ప్రశ్న 17.
కింది వాటిలో ద్విగు సమాసం కానిది.
A) ఆరు రుచులు
B) మూడు కాలాలు
C) ఏడు రోజులు
D) సూర్య చంద్రులు
జవాబు:
D) సూర్య చంద్రులు
ప్రశ్న 18.
మనిషి జీవితంలో సుఖదుఃఖాలు తప్పనిసరి. (ద్వంద్వ సమాస పదాన్ని గుర్తించండి.)
A) మనిషి
B) జీవితంలో
C) సుఖదుఃఖాలు
D) తప్పనిసరి
జవాబు:
C) సుఖదుఃఖాలు
ప్రశ్న 19.
‘మనుషులంతా’ పదాన్ని విడదీయండి.
A) మనుషులు + అంతా
B) మనుషులు + లంతా
C) మనుషు + లంతా.
D) మనుషులు + లుంతా
జవాబు:
A) మనుషులు + అంతా
ప్రశ్న 20.
ప్రజ + అభిప్రాయం కలిపి రాయండి.
A) ప్రజభిప్రాయం
B) ప్రజాభిప్రాయం
C) ప్రజఅభిప్రాయం
D) ప్రజాప్రాయం
జవాబు:
B) ప్రజాభిప్రాయం