Reviewing TS 10th Class Telugu Model Papers Set 6 (S/L) can help students identify areas where they need improvement.
TS SSC Telugu (S/L) Model Paper Set 6 with Solutions
పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)
సమయం : 2 గం. 30 ని.లు
మార్కులు: 60
విద్యార్థులకు సూచనలు :
- జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
- పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.
అ) కింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5 మా.)
పెద్దల వ్యవహారం చాలా నిర్మొహమాటంగా ఖచ్చితంగానే నడిచింది. వరుని రేటు పదివేలుగా తేలింది. ఇంకా ఆడపిల్లల లాంఛనాలు, అవీఇవీ… నారాయణరావు ముఖం కొంచెం పాలిపోయింది. ఆయన అయిదువేల నగదూ, ఉంగరం, గడియారం, లాంటి లాంఛనాలైతే తనవల్ల అవుతుందనుకున్నాడు. ఆ మాటే తేల్చి చెబితే ఈ సంబంధం ‘ఇప్పుడే బెడిసికొడుతుందేమోనన్న జంకుతో. “ఆదివారం నేనక్కడికి వస్తాను ! అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం” అన్నాడు. పెళ్ళిచూపుల కార్యక్రమం ముగిసిపోయింది.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
పెద్దల వ్యవహారం ఎలా నడిచింది ?
జవాబు:
పెద్దల వ్యవహారం చాలా నిర్మొహమాటంగా ఖచ్చితంగా నడిచింది.
ప్రశ్న 2.
నారాయణరావు ముఖం ఎందుకు పాలిపోయింది ?
జవాబు:
వరకట్నం, ఆడపిల్లల లాంఛనాలు అవీ తలచుకొని నారాయణరావు ముఖం పాలిపోయింది.
ప్రశ్న 3.
ఏ రోజున వస్తానని నారాయణరావు అన్నాడు ?
జవాబు:
నారాయణరావు ఆదివారం నాడు వస్తానన్నాడు.
ప్రశ్న 4.
నారాయణరావు ఎటువంటి లాంఛనాలైతే తన వల్ల అవుతుందనుకున్నాడు ?
జవాబు:
అయిదువేల నగదు, ఉంగరం, గడియారం లాంటి లాంఛనాలైతే తన వల్ల అవుతుందని నారాయణరావు అనుకొన్నాడు.
ప్రశ్న 5.
ఏ కార్యక్రమం ముగిసిపోయింది ?
జవాబు:
పెళ్ళిచూపుల కార్యక్రమం ముగిసిపోయింది.
ఆ) కింది పద్యాలలోని పంక్తులు తారుమారు అయ్యాయి. వాటిని సరియైన క్రమంలో రాయండి. (1 × 5 = 5 మా.)
6. దండన్ లేఁగలు నీరు ద్రావి యిరవందం బచ్చికల్ మేయుచుఁ.
రండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడీ
దండం బై విహరించుచుండఁగ నమంద ప్రీతి భక్షింతమే.
ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
జవాబు:
ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
రండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడీ
దండన్ లేఁగలు నీరు ద్రావి యిరవందం బచ్ఛికల్ మేయుచుం
దండం బై విహరించుచుండఁగ నమంద ప్రీతి భక్షింతమే.
(లేదా)
చిత్యం చేమఱఁడేని, దుర్జనుల గోష్ఠిం బొందఁడే భక్త సాం
గత్యం బాదటఁ బాయఁడేని మదనగ్రస్తుండు గాఁడేని నీ
సత్యం బెప్పుడు తప్పఁడేనియు, దురాచారుండు గాఁడేని, యౌ
భృత్యుండాతఁడు మూఁడు లోకములలోఁ బూజ్యుండు సర్వేశ్వరా !
జవాబు:
సత్యం బెప్పుడు తప్పుఁడేనియు, దురాచారుండు గాఁడేని, యౌ
చిత్యం చేమఱఁడేని, దుర్జనుల గోష్ఠిం బొందఁడే భక్త సాం
గత్యం బాగటఁ బాయఁడేని మదనగ్రస్తుండు గాఁడేని-నీ
భృత్యుండాతఁడు మూఁడు లోకములలోఁ బూజ్యుండు సర్వేశ్వరా !
ఇ) కింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలు తయారుచేయండి.. (5 × 2 = 10 మా.)
ఉప్పు సత్యాగ్రహంలో లక్ష్మీబాయమ్మ స్త్రీలకు నాయకురాలిగా ఉండి, ‘దేవరంపాడు’ శిబిరానికి ప్రాతినిధ్యం వహించేది. ఈ శిబిరం బాగా పనిచేసిందని ప్రశంసలు పొందింది. వివిధ గ్రామాల నుండి వందలమంది సత్యాగ్రహులు ఈ శిబిరానికి వచ్చేవారు. వారిని పోలీసులు అరెస్టు చేసేవారు. అయినా స్త్రీలు భయపడక ధైర్యంగా వారినెదుర్కొన్నారు. మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయినా లక్ష్మీబాయమ్మ నాయకత్వంలోని స్త్రీలు జంకలేదు. సత్యాగ్రహం మానలేదు.
శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులోను, దుర్గాబాయమ్మ చెన్నపురిలోను, రుక్మిణమ్మ వేదారణ్యంలోనూ మరికొందరు స్త్రీలు భిన్న ప్రాంతాలలోనూ చూపిన సాహసోత్సాహములు, ఆంధ్రల ప్రతిష్ఠను విస్తరింపజేశాయి అని ఆంధ్రపత్రిక 1932లో వీరిని ప్రశంసించింది.”
ప్రశ్నలు :
ప్రశ్న 7.
…………………………
జవాబు:
లక్ష్మీబాయమ్మ ఉప్పు సత్యాగ్రహంలో ఏ శిబిరానికి నాయకత్వం వహించింది ?
ప్రశ్న 8.
…………………………
జవాబు:
సత్యాగ్రహులు శిబిరానికి ఎక్కడ నుండి వచ్చేవారు ?
ప్రశ్న 9.
…………………………
జవాబు:
ఎన్నిసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు ?
ప్రశ్న 10.
…………………………
జవాబు:
గుంటూరు ఉప్పు సత్యాగ్రహానికి నాయకురాలు ఎవరు ?
ప్రశ్న 11.
…………………………
జవాబు:
ఆంధ్రపత్రిక స్త్రీల ఉప్పు సత్యాగ్రహంపై ఏమి రాసింది ?
II. వ్యక్తీకరణ సృజనాత్మకత (32 మార్కులు)
అ) కింది ప్రశ్నలకు నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి. (4 × 4 = 16 మా.)
ప్రశ్న 12.
“కలిసి తినడంలో ఆనందం ఉంటుంది” దీనిని సమర్థించండి.
జవాబు:
మనం సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలసి అప్పుడప్పుడు భోజనం చేస్తుంటాం. పెద్దలు, పిన్నలు అందరు కలసినపుడు కలిగే ఆనందాన్ని వర్ణించలేము. ఈ సభ్యుల్లో వరసైన బావమరదళ్ళు కూడా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఛలోక్తుల మధ్య సరదాగా కాలం గడుపుతూ ఆంధ్రాభోజనం చేస్తుంటే బహుపసందుగా ఉంటుంది. తియ్యగా మాట్లాడుతూ, రకరకాల రుచులతో ఊరిస్తూ పిల్లలు చేసే సందళ్ళు మనోహరంగా ఉంటుంది. అందుకే కలిసి తినడంలో ఆనందం ఉంటుంది.
ప్రశ్న 13.
‘నీ ఒక్కని ఆలోచనతోనే పని చేయకు’ అని ఎందుకు అంటారో వివరించండి.
జవాబు:
ఒక్కనితో ఆలోచన చేయరాదు. ఎందుకంటే ఆలోచించేటప్పుడు ఒకే ఒక్క ఊహతోనే ఉంటాడు. దానివల్ల మంచి కన్నా చెడు జరిగే ప్రమాదం ఉంది. అందువల్ల నలుగురితో కలిసి ఆలోచించాలి. అలా ఆలోచిస్తే తప్పుడు ఆలోచన – వచ్చినా, ప్రక్కవాడు దాన్ని సరి చేస్తాడు. అపుడు పదిమందికి ఉపయోగపడే ఆలోచనలు కలుగుతాయి.
ప్రశ్న 14.
పరాంకుశం దామోదర స్వామి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
పరాంకుశం దామోదర స్వామి. 15.8.1941న హన్మకొండ జిల్లా శాయంపేట గ్రామంలో జన్మించారు. ఈయన ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలలో పనిచేశారు. ‘రాజధాని లేఖ’ను, శీర్షికను ఆంధ్రజ్యోతిలో నిర్వహించి వందలాది వ్యాసాలు రాశారు. ఈయన ఈ “నేల ఈ గాలి”. వ్యాస సంపుటిగా ప్రచురించారు. “జాతీయ సమైక్యత, సహోదరత్వానికి” దోహదం చేసే జర్నలిస్టుకు ఇచ్చే అవార్డును 1985లో యునైటెడ్ హిందూ ముస్లిం ఫ్రంట్ ఈయనకు ప్రదానం చేసి సత్కరించింది.
ప్రశ్న 15.
పెంబర్తి వారిది ‘కళా హృదయం’ అని చెప్పక చెబుతున్న అంశాలేవి ?
జవాబు:
రాళ్ళల్లో చైతన్యం కలిగించిన ఆ చేతులు, సున్నితమైన బంగారం, వెండిపై నగిషీలు చెక్కడం విడ్డూరమే అయినా, వారిది ‘కళాహృదయం’ అని చెప్పక చెబుతున్నది. పెంబర్తి గ్రామంలో ‘ఏకాంబరేశ్వరి’ ఆలయం వారి పూర్వీకులు చెక్కిన చివరి శిల్పం. ఈ కళానైపుణ్యం తరతరాలుగా, వంశపారంపర్యంగా సంక్రమించింది. వారి రక్తంలో కళాసంపద, భావనా శబలత, సాంకేతిక విజ్ఞత ఇమిడిపోయాయి. కళాఖండాలను, సృష్టించడం వారి నిత్య నైమిత్తికం.
ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి. (2 × 8 = 16 మా.)
ప్రశ్న 16.
పాఠంలోని శతక పద్యాల ఆధారంగా మనం అలవరచుకోవలసిన మంచి గుణాలను, అలవరచుకోకూడదని గుణాలను వివరిచండి.
జవాబు:
శతక పద్యాలు మనలో నైతిక విలువలు, జీవన విధానాలు, మంచి నడవడి మొదలగు అంశాలను పెంపొందిపచేస్తాయి. శతక పద్యాలను చదివి ఈ కింది మంచి గుణాలు అలవాటు చేసుకోవాలి. మనలోనున్న చెడు గుణాలను విడిచిపెట్టాలి. అలవాటు చేసుకోవలసిన గుణాలు :
- దైవ పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనేవి అవసరం.
- గురువుని గౌరవించాలి. స్నేహితునికి ద్రోహం చేయరాదు.
- అబద్ధాలు ఆడరాదు. సత్యమునే పలుకవలెను.
- భక్తుల సాంగత్యాన్ని వీడరాదు. కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి.
ఆ) విడిచిపెట్టవలసిన గుణాలు :
- కలలో కూడా అబద్ధం ఆడరాదు.
- మాయమాటలు చెప్పి పరుల ధనాన్ని అపహరించరాదు.
- లంచాలు తీసుకోరాదు. ఇవ్వరాదు.
- ఇతరుల మనసు నొప్పించే విధంగా మాట్లాడరాదు.
(లేదా)
వీధులను శుభ్రం చేసేవారి సేవలను గురించి మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
వీధుల్ని శుభ్రపరిచేవారిని పారిశుద్ధ్య కార్మికులంటారు. వీరు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. చీపురుతో వీధులన్నీ శుభ్రపరుస్తారు. చెత్తనంతా ఒక చోటకు పోగుచేసి బుట్టలతో ఎత్తి ఊరికి దూరంగా పోస్తారు. వారానికోసారి ఆ చెత్త గుట్టలన్నీ తగులబెడతారు. ప్రజలకు ఎటువంటి అంటు రోగాలు రాకుండా రాత్రిబవళ్ళూ శ్రమిస్తూ రోడ్లను తుడుస్తూ అద్దాల్లాగా ఉంచుతారు.
ఇంకా వీధులకు ఇరువైపులనున్న డ్రైనేజీ (మురుగు కాల్వలు)లో పేరుకున్న చెత్తనంతా తీసి శుభ్రపరుస్తారు. ఎటువంటి అంటురోగాలు రాకుండా రోడ్లకు ఇరువైపులా బ్లీచింగ్ వగైరాలు చల్లుతారు. దోమలను నివారించే క్రిమిసంహారక మందులు వాడతారు. ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా సంరక్షిస్తారు. ఒకరకంగా ఈ పారిశుద్ధ్య కార్మికులు గ్రామ సంరక్షకులని చెప్పవచ్చు.
ప్రశ్న 17.
స్త్రీ ఔన్నత్యం గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
నాడు, నేడు, ఏనాడూ కూడా సమాజానికి వెన్నెముక స్త్రీ. ప్రకృతి స్వరూపమే స్త్రీ. చిన్నప్పటి నుండి ఇంటికి అనురాగ దీపిక. అంధకారంలో వెలుగల జాబిలి. ఎప్పుడూ సమాజంలో స్త్రీ తల్లిగా, చెల్లిగా, ఇల్లాలుగా రకరకాలైన పాత్రలను ధరిస్తూ తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. కుటుంబానికి సేవకురాలియై సేవలు చేస్తూ తన అమృత హృదయంతో ప్రేమను పంచుతుంది.
మన స్త్రీలలో పరంపరాగతమైన నైతిక విలువలున్నాయి. కష్టాలు ఓరిమితో సహించిన సీతమ్మలున్నారు. యముడితో పోరాడి పతి ప్రాణాలను దక్కించుకున్న సావిత్రులున్నారు. ఘోరమైన తపస్సు చేసి పరమశివుడిలో అర్థభాగాన్ని పొందకల్గిన పార్వతులున్నారు. త్రిమూర్తులను పసిపాపలుగా చేసి తన శీలాన్ని కాపాడుకున్న అనసూయమ్మలున్నారు. సూర్యచంద్రాదుల గతులను అరికట్టిన సుమతులున్నారు. గృహమొక రాజ్యంగా పరిపాలిస్తున్న స్త్రీ మాతృమూర్తిగా ఒక సామ్రాజ్ఞిగా నిండు మనసుతో గంభీరంగా నిబ్బరంతో ఎన్ని కష్టాలు వచ్చి మీదపడినా తన ఆదర్శాలను విడనాడకుండా తన సంతతికి బోధిస్తుంది.
(లేదా)
మూఢ నమ్మకాలు, సాంఘిక దురాచారాలు ప్రగతికి అవరోధాలు. వీటిని పారద్రోలడానికి మీరు ఏమి చేయగలరో రాయండి.
జవాబు:
మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్లు చేస్తాను. సమాజంలో జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలను అజ్ఞానాన్ని తొలగిస్తాను. సంఘంలో ఉన్న దురాచారాలను పోగొట్టేందుకు ప్రయత్నిస్తాను. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి పనులను ఏకతాటిపై నడుపుతాను. దేవదాసి, వేశ్య సంప్రదాయాలను అడ్డుకుంటాను.
తాగుడు వల్ల కుటుంబాలు ఎలా గుల్లగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి, వారిని మాన్పించేందుకు ప్రయత్నిస్తాను. మనిషి సంఘజీవి కనుక సమాజంలోని తోటివారి పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండేట్టు చేస్తాను. సామూహిక జీవనంలో నిరాశానిస్పృహలకు లోనుకాకుండా చూస్తాను. ఈ సమాజంలో నెలకొని యున్న సాఘిక దురాచారాలను, మూఢ నమ్మకాలను పారద్రోలడానికి ప్రయత్నం చేస్తాను.
ఇ. సృజనాత్మకత (8 మార్కులు)
అ) కింది ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి. (1 × 8 = 8 మా.)
ప్రశ్న 18.
వరకట్న దురాచారాన్ని తెలియజేసే ఒక కథను రాయండి.
జవాబు:
అదొక పల్లెటూరు. ఆ ఊళ్ళో పుల్లయ్య అనే పేదవాడు ఉన్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయికి పెళ్ళి సంబంధం చూశాడు. అమ్మాయికి అందం, చదువు రెండూ ఉన్నాయి. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. అయినా వరుని పక్షంవారు కట్నకానుకలు ఇవ్వనిదే పెళ్ళి కుదరదన్నారు. పుల్లయ్యకు ఏం చేయాలో తోచలేదు.
ఆ ఊళ్ళో ఒక సంఘసంస్కర్త ఉన్నాడు. వరకట్నమనేది దురాచారమనీ, దానిని ప్రోత్సహించరాదనీ అబ్బాయి తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో బోధించాడు. అమ్మాయి చదువుకున్నది. అందం ఉన్నది. మంచి కుటుంబం. ఇంతకంటే ఏం కావాలన్నాడు ? ఆయన మాటలకు వాళ్ళు స్పందించి పైసా కట్నం తీసుకోకుండా పెళ్ళి జరిపించడానికి ఇష్టపడ్డారు. అందరూ సంతోషించి సంఘసంస్కర్తను మెచ్చుకున్నారు. వివాహానికి కావలసిన ఏర్పాట్లు చేసుకున్నారు.
ప్రశ్న 19.
కోపం తగ్గించుకోవడం మంచిది అనే అంశాన్ని బోధిస్తూ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:
హైదరాబాదు,
XXXXXX.
ప్రియమైన మిత్రునకు,
నేను క్షేమం. నీవు క్షేమమని తలుస్తాను. ఈమధ్య నీవు, స్నేహితునితో గొడవపడి కొట్టుకున్నావనియు, మీ ఇరువురికి దెబ్బలు తగిలాయని చెప్తూ నీవు వ్రాసిన ఉత్తరం ద్వారా తెలిసింది. నేను చాలా బాధపడ్డాను.
మిత్రమా ! వికాస్ ! నీది సహజంగా శాంత స్వభావం కదా ! అంతగా కోపం ఎందుకు వచ్చింది. ఆ విధంగా మీరిరువురు కొట్టుకోవడం మంచిది కాదు కదా !
‘తన కోపమె తన శత్రువు’ అని, సుమతీ శతకంలోని పద్యం చదివావు. పైగా భర్తృహరి కూడా క్రోధం మనిషికి శత్రువని చెప్పాడు. అన్ని విషయాలూ నీకు తెలుసు. కోపం వల్ల చాలా అనర్థాలు కలుగుతాయి. కోపం వస్తే మనకు మంచిచెడ్డలు తెలియవు. నీకూ శివకు వచ్చిన తగవు విషయం, పెద్దవారితో చెప్పు. వారు మీ తగవు తీరుస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నా. నీవూ, శివ తిరిగి స్నేహితులు కావాలని కోరుకుంటున్నారు.
ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
డి. సందీప్, 10వ తరగతి,
చిరునామా :
ఎ. వికాస్, 10 తరగతి,
S/o కె. సుబ్బారావు గారు,
భాష్యం హైస్కూలు, అమీర్పేట,
ఇంటి నెం. 4 – 1 – 14,
వరంగల్లు, తెలంగాణ.
ప్రశ్న 20.
‘మొక్కల పెంపకం ఆవశ్యకత’ను వివరిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
“వృక్షముల పెంపకం”
చెట్లు జీవన సౌభాగ్యానికి మెట్లు. నేడు నగరాలు, గ్రామాలు కూడా, పర్యావరణ కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రజలంతా రోగాలతో డాక్టర్ల వెంట తిరుగుతున్నారు. దీనికి కారణం దేశంలో పచ్చని చెట్లు తక్కువ కావడమే.
చెట్లు బొగ్గుపులుసు వాయువును పీల్చి, ప్రాణవాయువును మనకు అందిస్తాయి. పూలను, పండ్లను ఇస్తాయి. చల్లని నీడను, గాలిని ఇస్తాయి. పర్యావరణ కాలుష్యం నుండి మనలను కాపాడతాయి.
కాబట్టి ప్రతి వ్యక్తి ఒక్కొక్క చెట్టును పాతిపెంచాలి. ప్రభుత్వము మంచి మొక్కలను ప్రజలకు ఉచితంగా ఇచ్చి వాటిని పాతించాలి. మొక్కలను పెంచి, వాటికి రక్షణ కల్పించాలి. దేశంలో సహితం అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. అందుకే మనకు వర్షాలు లేవు.
ప్రతి పంచాయితీ వారు మునిసిపాలిటీ వారు, మొక్కలను ఖాళీ ప్రదేశాల్లో పెంచాలి. మొక్కలను పెంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గిరిజనులను ప్రోత్సహించి అడవులలో మొక్కలు పెంచాలి. మనమంతా మొక్కలను పెంచుదాం. మన దేశాన్ని సస్యశ్యామలం చేద్దాం.
ఇట్లు,
నగర రక్షణ సమితి.
పార్ట్ – B
సమయం : 30 ని.లు
మార్కులు : 20
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానాలు నిర్దేశించిన స్థలంలోనే రాయాలి.
- పూర్తి చేసిన పార్టు – బి పత్రాన్ని పార్టు – ఎ సమాధాన పత్రంతో జతపరచండి.
I. భాషాంశాలు (20 మార్కులు)
అ) పదజాలం :
కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి. (2 × 1 = 2 మా.)
ప్రశ్న 1.
రక్తికట్టుట : ……………………..
జవాబు:
రక్తికట్టుట : చింతామణి నాటకం బాగా రక్తి కట్టింది.
ప్రశ్న 2.
అడుగుజాడలు: ……………
జవాబు:
అడుగుజాడలు : గాంధీ అడుగుజాడల్లో భారతదేశ ప్రజలు నడిచారు.
కింది వానికి సరైన జవాబును గుర్తించి ( A / B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (8 × 1 = 8 మా.)
ప్రశ్న 3.
నింగిలో నక్షత్రాలు విలమిలా మెరుస్తున్నాయి. (గీత గీసిన పదానికి అర్థం)
A) ఆకాశం
B) భూమి
C) దిక్కు
D) సాగరం
జవాబు:
A) ఆకాశం
ప్రశ్న 4.
మనం చదివిన దానిలో పస ఉండాలి. (గీత గీసిన పదానికి అర్థం)
A) కారము.
B) భారము
C) సారము
D) బేరము
జవాబు:
C) సారము
ప్రశ్న 5.
వర్షం కురిస్తే ఇల్లంతా బురద అవుతుంది. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు)
A) దురద, వరద
B) అడుసు, పంకము
C) బింకము, బంక
D) అంకము, వంక
జవాబు:
B) అడుసు, పంకము
ప్రశ్న 6.
“ఆకాశము, గగనము” పర్యాయపదాలుగా గల పదం
A) తేజస్సు
B) నింగి
C) అంగి
D) భృంగి
జవాబు:
B) నింగి
ప్రశ్న 7.
పద్మాలకు సూర్యుడు మిత్రుడు. (గీత గీసిన పదానికి నానార్థాలు)
A) ఇంద్రుడు, చంద్రుడు
B) అందము, చందము
C) పందెము, బిందె
D) స్నేహితుడు, సూర్యుడు
జవాబు:
D) స్నేహితుడు, సూర్యుడు
ప్రశ్న 8.
లలితకు కవితలు అంటే ప్రియం. (గీత గీసిన పదానికి నానార్థాలు)
A) పుణ్యం, న్యాయం
B) స్నేహం, ఇష్టం
C) ప్రార్థన, ఉపాయం
D) అప్రియము, అయిష్టం
జవాబు:
B) స్నేహం, ఇష్టం
ప్రశ్న 9.
దశరథుని కుమారుడు – వ్యుత్పత్తిగా గల పదం
A) రాజు
B) భూపాలుడు
C) ఇంద్రుడు
D) దాశరథి
జవాబు:
D) దాశరథి
ప్రశ్న 10.
‘గారవము’-ప్రకృతి పదాన్ని రాయండి.
A) అరవము
B) గౌరవము
C) రవము
D) రావము
జవాబు:
B) గౌరవము
ఆ) వ్యాకరణాంశాలు: (10 మార్కులు)
కింది వానికి సరైన జవాబును గుర్తించి (A / B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)
ప్రశ్న 11.
ఇందిర సింహాన్ని చూసింది. (ఈ వాక్యంలో కర్త)
A) ఇందిర
B) సింహాన్ని
C) చూసింది
D) ఏదీకాదు
జవాబు:
A) ఇందిర
ప్రశ్న 12.
మాధవి శ్రీనివాస్కు బహుమతి ఇచ్చింది. (ఈ వాక్యంలో క్రియ)
A) మాధవి
B) ఇచ్చింది
C) శ్రీనివాస్కు
D) బహుమతి
జవాబు:
B) ఇచ్చింది
ప్రశ్న 13.
మధు మాట్లాడడు. మధు చేసి చూపిస్తాడు. (ఇవి ఏ వాక్యాలు ?)
A) సంక్లిష్ట వాక్యాలు
B) సంయుక్త వాక్యాలు
C) సామాన్య వాక్యాలు.
D) కర్మణి వాక్యాలు
జవాబు:
C) సామాన్య వాక్యాలు.
ప్రశ్న 14.
రవి ఊరికి వెళ్ళి, మామిడిపండ్లు తెచ్చాడు. ఇది ఏ వాక్యం ?
A) సంక్లిష్ట వాక్యం
B) సంయుక్త వాక్యాలు
C) సామాన్య వాక్యం
D) కర్తరి వాక్యం
జవాబు:
A) సంక్లిష్ట వాక్యం
ప్రశ్న 15.
దేవాలయము – సంధి పేరు ?
A) గుణసంధి
B) వృద్ధి సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) యడాగమసంధి
జవాబు:
C) సవర్ణదీర్ఘ సంధి
ప్రశ్న 16.
గంట + ఆకారం – ఉత్తర పదంలలో తొలి అచ్చు
A) ఇ
B) ఊ
C) ఈ
D) ఆ
జవాబు:
D) ఆ
ప్రశ్న 17.
దశావతారాలు – సమాసం పేరు
A) విశేషణ పూర్వపద కర్మధారయం
B) ద్విగు సమాసం
C) ద్వంద్వ సమాసం
D) బహువ్రీహి సమాసం
జవాబు:
B) ద్విగు సమాసం
ప్రశ్న 18.
పూజా సామగ్రి – విగ్రహవాక్యం
A) పూజలో సామగ్రి
B) పూజను సామగ్రి.
C) పూజ కొరకు సామాగ్రి
D) పూజయైన సామగ్రి భాషాభాగం
జవాబు:
C) పూజ కొరకు సామాగ్రి
ప్రశ్న 19.
శిరీష చక్కగా చదువుకుంటుంది. (గీత గీసిన పదం ఏ
A) సర్వనామం
B) నామవాచకం
C) క్రియ
D) విశేషణం
జవాబు:
B) నామవాచకం
ప్రశ్న 20.
సుహాసిని ………… విహారయాత్రలంటే చాలా ఇష్టం.
A) ను
B) వలస
C) కి
D) కంటే.
జవాబు:
C) కి