Reviewing TS 10th Class Telugu Model Papers Set 5 (S/L) can help students identify areas where they need improvement.
TS SSC Telugu (S/L) Model Paper Set 5 with Solutions
పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)
సమయం : 2 గం. 30 ని.లు
మార్కులు: 60
విద్యార్థులకు సూచనలు :
- జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
- పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.
అ) కింది పేరా చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (20 మార్కులు) (5 × 1 = 5 మా.)
వివాహపు తంతు ముగిసేసరికి ఇరువైపులా ఎంత మిగులుతుందని చూసుకొంటే వధువు ఒంటిమీద కొద్దిగా నగలు, పట్టుచీరలు, వరుడికి సూటూ బూటూ గడియారం లాంటివి. కట్నాలు, కానుకలు పట్టుకురాలేక బంధువులకు అగచాట్లు !
బంధువులు రాకపోతే, భజంత్రీలు మోగకపోతే వధువు మెడలో పడే ఆ మూడు ముళ్ళు గట్టిగా పడవా ? ఆ సంబంధం గట్టిగా నిలవదా ? ఈ ఆచారాలు ఒకనాడు ఏదో ఒక ఉద్దేశంతో ప్రయోజనం కోసమే ఏర్పడి ఉండొచ్చు. ఈనాడు” మనది బీద దేశం. ప్రతి పైసా అమూల్యంగా వాడుకోవలసిన ఈ రోజుల్లో అర్థంలేని ఈ ఆచారాల వల్ల ఎంతో డబ్బు వ్యర్థమైపోతూంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అర్థంలేని, ప్రమాదకరమైన ఆచారం, నిజంగా నేను మీకు నచ్చితే, నా భావాలను మెచ్చితే కానీ కట్నం లేకుండా రెండు పూలదండలతో నన్ను పెళ్ళి చేసుకోండి.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
వధువు మెడలో ‘మూడు ముళ్ళు’ ఎప్పుడు పడతాయి ?
జవాబు:
పెళ్ళిలో
ప్రశ్న 2.
ఈనాడు మనది ఎటువంటి దేశం ?
జవాబు:
పేద దేశం
ప్రశ్న 3.
అర్థం లేని ఆచారాల వల్ల ఏది వ్యర్థమైపోతుంది ?
జవాబు:
డబ్బు
ప్రశ్న 4.
రెండు పూలదండలతో నన్ను పెళ్ళి చేసుకోండి అని అన్నదెవరు ?
జవాబు:
లీల, సుధాకర్తో అన్నది.
ప్రశ్న 5.
ప్రతి పైసా ఎలా వాడుకోవాలి ?
జవాబు:
అమూల్యంగా
ఆ) కింది పద్యాలలో ఒక పద్యానికి భావం రాయండి. (1 × 5 = 5 మా.)
6. ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నింద సేయబోకుము, కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువబోకు మయ్యకుమారా !
జవాబు:
కుమారా ! ఉపాధ్యాయుణ్ణి ఎదిరించకు. నీకు రక్షణగా ఉన్న వ్యక్తిని నిందిచకు. ఏదైనా పని చేస్తున్నప్పుడు నీ ఒక్కని ఆలోచనతో మాత్రమే చేయకు. మీ ఇంట్లో ఆచరించే ఆచారాన్ని ఎప్పుడూ విడువకుండా ఉండుము.
(లేదా)
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట, గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !
జవాబు:
ఓ చక్కని బుద్ధికలవాడా! దారిలో ఒంటరిగా నడువకు. నీ శత్రువు ఇంట్లో భోజనం చేయకు. స్నేహంగా ఉంటూ ఇతరుల ధనాన్ని మీ సొంతం చేసుకోకు. ఇతరుల మనసు నొప్పించే రకంగా మాట్లాడకు.
ఇ) కింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 2 = 10 మా.)
అన్ని వృత్తుల సమష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తులు సమాజ సేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులే ! కోయలు, గోండులు, చెంచులు మొదలైన గిరిజన జాతులకున్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. రోగాల బారిన పడినప్పుడు చెట్ల మందుల తోటే ఆరోగ్యాన్ని తిరిగి పొందారు. ఇట్లా వనమూలికలతో చేసే వైద్యమే ఆయుర్వేదం. కుమ్మరి మెత్తటి మట్టి, బూడిద లేదా రంపపు పొట్టు, సన్న ఇసుకను కలిపి బంకమట్టిని తయారుచేస్తాడు. ఇనుముతో నిత్యం సహవాసం చేసే కమ్మరులు తమ శ్రమను, నైపుణ్యాన్ని సమాజం కోసం త్యాగం చేస్తున్నారు.
ప్రశ్నలు :
ప్రశ్న 7.
దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవేవి ?
జవాబు:
దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచేవి వృత్తులు.
ప్రశ్న 8.
ఎవరు ప్రకృతి జ్ఞానం కలవారు ?
జవాబు:
కోయలు, గోండులు, చెంచులు మొదలైన గిరిజన జాతుల ప్రజలు ప్రకృతి జ్ఞానం కలవారు.
ప్రశ్న 9.
వనమూలికలతో చేసే వైద్యం ?
జవాబు:
వనమూలికలతో చేసే వైద్యాన్ని ఆయుర్వేదం అంటారు.
ప్రశ్న 10.
బంకమన్ను తయారుచేసేదెవరు ?
జవాబు:
బంకమన్నును కుమ్మరి తయారు చేస్తాడు.
ప్రశ్న 11.
శ్రమను, నైపుణ్యాన్ని సమాజం కోసం త్యాగం చేస్తున్నవారెవరు ?
జవాబు:
ఇనుముతో నిత్యం సహవాసం చేసే కమ్మరులు తమ శ్రమను, నైపుణ్యాన్ని సమాజం కోసం త్యాంగం చేస్తున్నారు.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (32 మార్కులు)
అ) కింది ప్రశ్నలకు నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి. (4 × 4 = 16 మా.)
ప్రశ్న 12.
పాకాల యశోధా రెడ్డి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
పొడుపు కథలు అను పాఠ్యభాగ రచయిత పాకాల యశోదారెడ్డి. ఈమె పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రచయిత్రి. ఈమె స్వగ్రామం బిజినేపల్లి, ధర్మశాల, మావూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు. వంటి కథాసంపుటాలు వెలువరించింది. ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది. అధికార భాషా సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా పని చేసిన యశోదారెడ్డి “మహాలక్ష్మి ముచ్చట్లు” పేరుతో అప్పట్లో ధారావాహిక కార్యక్రమం నిర్వహించి బహుళ ప్రజాదరణ పొందింది.
ప్రశ్న 13.
“ఆమె నడిచివస్తుంటే వీధులన్నీ మురిసిపోతాయి” అని కనపర్తి అన్నారు కదా ! దీనిపై మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
“ఆమె నడిచివస్తుంటే వీధులన్నీ మురిసిపోతాయి అంటే మలినమైన వీధులన్నీ ఆమె శుభ్రం చేయడం వల్ల వీధులకే. కొత్త కాంతి వస్తుంది. అంతేగాక వీధుల్లో ఉన్నా ప్రజానీకానికి ఎటువంటి అంటురోగాలు రాకుండా ఆమె సంరక్షిస్తుంది.
ప్రశ్న 14.
“అంటరాని వర్గాలన్నీ భాగ్యరెడ్డి వర్మను తిరుగులేని నాయకునిగా ఎన్నుకున్నాయి” – ఎందువలన ?
జవాబు:
హిందూమతం, హిందువులు తమ చరిత్రను లిఖిత బద్ధం చేసిన భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంస్కర్తగా పేరొందినాడు. అణగారిన వర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు. తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు. ఏమీ ఆశించకుండా, తమకోసం ఎప్పటికీ పనిచేసే ఆయననను చూసి అంటరానివర్గాలన్నీ ఆయననున తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి. చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో పనిచేసే భాగ్యరెడ్డివర్మ అచిరకాలంలోనే వారి నమ్మకాన్ని చూరగొన్నాడు.
ప్రశ్న 15.
పెంబర్తి కళాకారులకు ఉగ్గుతో వచ్చిన విద్య ఏది ? ఇత్తడిని వారి కళకు ఎంచుకోవడానికి కారణం ఏమిటి ?
జవాబు:
దేవతా విగ్రహాలు, కవచాలు, ధ్వజ స్తంభాలు, వాహనాలు, పూజాసామాగ్రి, బంగారంతో, వెండితో, రాగితో, ఇత్తడితో పోతపోయడం కూడా పెంబర్తి శిల్పులకు ఉగ్గుతో వచ్చిన విద్య. పెంబర్తివారు అన్నం కోసం జీవించడం లేదు. కళ కోసం జీవిస్తున్నారు. వీరు తమ పనితనం చూపించడానికి బంగారం, వెండి లభించని సమయంలో ఇత్తడిని వారి కళకు ఎంచుకున్నారు.
ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 16.
‘ప్రపంచ పదులు’ పాఠం ద్వారా మీరే విషయాలు గ్రహించారు ?
జవాబు:
కొవ్వొత్తి కరిగితేనే కాంతినివ్వగలుగుతుంది. రాయిని చెక్కినప్పుడే శిల్పంగా మారుతుంది. తీవ్రమైన మార్పులకు సిద్ధమైనప్పుడే ఫలితం దక్కుతుంది. మానవ జీవితాలకు మేలు కలిగించినప్పుడే నేర్చుకున్న చదువుకు ప్రయోజనం కలుగుతుంది. బురదలో పుట్టినంత మాత్రాన పద్మానికి విలువ తగ్గదు. తరతరాలుగా తాటాకుల మీదనే ఉన్నప్పటికీ పద్యానికి విలువ తగ్గదు. అసలు సిసలు శక్తియున్నప్పుడే దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మట్టిని ఎంత దున్నినా బాధపడదు. పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే ఏటికి అనారోగ్యం ఉండదు. ఎంత ఎత్తుకు ఎగిరినప్పటికీ ఆకాశానికి అంతు ఉండదు. ప్రాణికోటి ఎంత పీల్చుకుంటున్నా గాలికి బరువు ఉండదు. కనుక మానవుడు కూడా ఇటువంటి చైతన్యంతో ఉన్నతమైన లక్ష్యం కోసం కృషి చేయాలి.
(లేదా)
“శతక పద్యాలు మానవునికి దిశానిర్దేశం చేస్తాయి కదా !” వివరించండి.
జవాబు:
సామాన్యంగా శతక కవులు తన కాలంనాటి సంఘంలోని మంచి చెడులను గూర్చి తమ పద్యాల్లో చెబుతారు. ఆ కవులు నాటి సంఘంలోని దురాచారాల్ని ఎత్తి చూపి విమర్శిస్తారు. నీతి మార్గాన్ని సంఘానికి బోధిస్తారు.
సుమతి శతకంలో నాటి సంఘంలోని మనుష్యులు, పరద్రవ్యాన్ని ఆశించి ఎలా బతుకుతున్నారో చెప్పాడు. వేమన శతకంలో ఆనాటి సమాజంలో పరద్రవ్యాన్ని ఆశించి, జోస్యాలు చెప్పడం, చాడీలు చెప్పడం, అబద్ధాలాడటం, వంకర మార్గంలో కీర్తిని సాధించే ప్రయత్నం చేయడం, హింసను ప్రేరేపించడం వంటి పనులు చేస్తున్నారని చెప్పాడు. ఇది వేమన కాలంనాటి సమాజ ప్రతిబింబం అనడంలో వివాదం అక్కరలేదు.
అలాగే భాస్కర శతక కర్త మారద వెంకయ్య కూడా ఇంట్లో అత్తాకోడళ్ళ పోరాటాలు, కర్మశాలలో అలజడులు, దళితుల పట్ల అగ్రవర్ణాల అరాచకాలు, మతహింస వంటి, నేటి సమాజంలోని లోపాలను ఎత్తి చూపి, వాటిని పరిహరించే మార్గాలను కూడా ఉపదేశించారు. ఈ పద్యం నేటి సమాజానికి చక్కని ప్రతిబింబం.
నేటి మనుష్యులలో అవినీతి, లంచగొండితనం, దురాచారాలు వంటి విషం పెరిగిపోయిందని, నరసింహ శతక కర్త ఈనాటి సంఘాన్ని గురించి దీనిలో విమర్శించారు.
ప్రశ్న 17.
అణగారిన వర్గాల్లో చైతన్యం తేవడానికి భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని వివరించండి.
జవాబు:
ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు భాగ్యరెడ్డివర్మ హాజరయ్యేవాడు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది. ఆంధ్రమహాసభ, ఆదిహిందూ మహాసభ, అఖిలభారత అంటరాని వర్గాల సభ, వంటి సంస్థలు జాతీయస్థాయిలో నిర్వహించిన అనేక సభల్లో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జననులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు. ఆయన జన జీవితంలో కాలు పెట్టిన దాదిగా మొత్తం 3,348 ఉపన్యాసాలిచ్చాడు. ఆయన అణగారిన వర్గాలలో చైతన్యం తేవడానికి తీవ్రమైన కృషి చేశాడు.
(లేదా)
యక్ష ప్రశ్న అంటే ఏమిటి ? జన బాహుళ్యంలో పొడుపు కథా రూపంలో ఎలా స్థిరపడింది ?
జవాబు:
యక్ష ప్రశ్న అనగా విడదీయరాని చిక్కును గూర్చి చెప్పవలసి వచ్చినపుడు ఇది ‘యక్షప్రశ్నరా’ అని అంటారు. దీనినే గడ్డు సమస్య అని కూడా అంటారు. మహాభారతంలో వనపర్వంలో యక్ష ధర్మజుల సంవాదంలో ప్రకటితమైన విజ్ఞానమే యక్ష ప్రశ్నలు అనే పేర సాహిత్యంలో ప్రసిద్ధమై వెలసింది. ఎఱ్ఱాప్రెగ్గడ మహాభారతాంధ్రీకరణ సందర్భంలో యక్షప్రశ్నలను తెనిగిస్తూ, ధర్మదేవుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు చెప్పినట్లు వ్రాశాడు. నిజానికి యక్షుడు అడిగిన ప్రశ్నలు పొడుపు కథల వలెనే ఉన్నాయి. ఈ విధంగా ఎంతో పురాతనమై ఈ ప్రశ్నోత్తర విధానం ఆయాకాలాల్లో, ఆయా కవుల చేతుల్లో మెలిగి జన బాహుళ్యంలో ప్రాచుర్యాన్ని పొంది, విద్వ ల్లోకంలో ప్రహేళికా రూపంలో, జనసామాన్యంలో పొడుపు కథా రూపంలో స్థిరపడింది.
ఇ. సృజనాత్మకత
అ) కింది ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి.
ప్రశ్న 18.
మీ పాఠశాల నుండి వెళ్ళిన వనభోజన కార్యక్రమం ఎలా జరిగిందో తెలుపుతూ ఊరిలోని స్నేహితునికి లేఖ రాయండి.
జవాబు:
కరీంనగర్
తేది. XXXXX
ప్రియమైన స్నేహితునకు,
నేను కుశలము. నీవు కుశలమని భావిస్తాను. గడచిన కార్తీకమాసంలో మా పాఠశాల ఉపాధ్యాయులతో మా 10వ తరగతి విద్యార్థులు కూడా కలిసి వెళ్ళాము. ఆర రోజంతా అందరం చాలా సరదాగా గడిపాము. మా తెలుగు మాష్టారు కార్తీకమాసం గొప్పతనాన్ని చెప్పారు. ఉసిరిక చెట్ల క్రింద కూర్చుని పూజ చేశాము. శివకేశవులిద్దరూ ఉ మాసంగా పేరు పొందిందని తెలుసుకున్నాము. కులమతాలకు అతీతంగా, స్నేహపూర్వకంగా అందరం కలసి భోజనాలు చేశాము. అందరూ సరదాగా ఛలోక్తులాడుతూ, హాస్యంగా మాట్లాడుతూ కాలం గడిపాం. మధ్యహ్నం నుండి మాచేత విజ్ఞానపు ఆటలాడించారు. ఒకరిపై ఒకరికి సోదర సోదరీ భావాలు కలిగాయి. అనురాగ ఆప్యాయతలు కలిగాయి. మాకు ఉపాధ్యాయులపై-గౌరవభావాలు కలిగాయి. మామీద పెద్దల అభిమాన వర్షం కురిసింది. నీవు కూడా వనభోజనాల్లో పాల్గొంటే వివరాలు తెలుపుతూ ఉత్తరం రాయి.
ఉంటా.
నీ ప్రియ స్నేహితుడు,
T.P. అభిజిత్ కృష్ణ.
చిరునామా :
V. సామీర రాము,
10వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు, ‘
జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ.
ప్రశ్న 19.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంగా మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
“ధైర్యే సాహసే లక్ష్మీ”
మహిళామణులారా ! ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం, పైపైకి’ అన్న శ్రీశ్రీ మాట మరచిపోకండి. ఈనాడు మనపట్ల సంఘం ఎంతో వివక్షత చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందని తెలిస్తే, తల్లిదండ్రులు విలవిల లాడుతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు.
తండ్రి ఆస్తిలో స్త్రీలకు మగవారితో సమాన వాటాలు ఇవ్వడం లేదు. పేపరు తిరగవేస్తే, స్త్రీల మానభంగాల వార్తలు, టి.వి. పెడితే స్త్రీలకు జరిగిన అన్యాయాలు, అత్తవారింట స్త్రీల కష్టాలు, వరకట్నాల చావులు కనబడతాయి. వినబడతాయి. పసిపిల్లల నుండి పండు ముదుసళ్ళు వరకు అత్యాచారాలకు గురి అవుతున్నారు.
స్త్రీలంతా కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేసే మగవారి చెంపలు పగుల కొట్టాలి. నిర్భయంగా పోలీసు వారికి రిపోర్టు చెయ్యాలి. మీరు పొరపాటున అన్యాయానికి గురి అయితే, సిగ్గుతో చితికిపోవద్దు. ధైర్యంగా నిలవండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి. బాగా చదవండి. ఉద్యోగాలు చేయండి. మనం ఈ దురాచారాల్ని ఖండిద్దాం.
అన్యాయం జరిగిన తోటి స్త్రీలకు, మనం అండగా నిలవాలి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, ఆనందించే రోజు రావాలి. అందుకు మనమంతా చేయి చేయి కలిపి పోరాడుదాం, ఝాన్సీ లక్ష్మీబాయిలా, సరోజినీ దేవిలా, దుర్గాబాయమ్మలా తలలెత్తి నిలుద్దాం. ధైర్యమే మనకు శ్రీరామరక్ష.
ఇట్లు,
వనితా సంఘం.
ప్రశ్న 20.
మీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ దినోత్సవం గురించి ఆహ్వానపత్రం రాయండి.
జవాబు:
ఉపాధ్యాయ దినోత్సవం
ఆహ్వానపత్రం
ఒకప్పటి భారత రాష్ట్రపతి ‘భారతరత్న’ డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా `జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. మేము కూడా మా పాఠశాలలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపదలచాం. అందరికీ ఇదే మా సాదర ఆహ్వానం.
ముఖ్య అతిథి : శ్రీ ………….. గారు, జిల్లా విద్యాశాఖాధికారి, కరీంనగర్.
వేదిక : ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీంనగర్.
తేదీ, సమయం : ది. 5-9-20×× ఉదయం గం. 10.00 లకు.
ఇట్లు,
విద్యార్థి బృందం,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీంనగర్.
పార్ట్ – B
సమయం : 30 ని.లు
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానాలు నిర్దేశించిన స్థలంలోనే రాయాలి.
- పూర్తి చేసిన పార్టు – బి పత్రాన్ని పార్టు – ఎ సమాధాన పత్రంతో జతపరచండి.
I. భాషాంశాలు
అ) పదజాలం : (20 మార్కులు)
కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.. (2 × 1 = 2 మా.)
ప్రశ్న 1.
చిత్తశుద్ధి : ………………………
జవాబు:
చిత్తశుద్ధి : చిత్తశుద్ధి లేనిదే శివపూజ చేయలేరు.
ప్రశ్న 2.
అచిరకాలం : ………………………
జవాబు:
అచిరకాలం : చదువు పూర్తి అయిన తర్వాత అచిరకాలంలోనే ఉద్యోగం వచ్చింది.
కింది వానికి సరైన జవాబును గుర్తించి (A / B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (8 × 1 = 8 మా.)
ప్రశ్న 3.
‘సేకరణ’ అంతే అర్థం
A) దాచుకొనుట
B) పాడుచేయుట
C) పోగు చేయుట
D) దోచుకొనుట
జవాబు:
C) పోగు చేయుట
ప్రశ్న 4.
ఎరుక అంటే అర్థం
A) కలిమి
B) చెలిమి
C) కొలిమి
D) తెలివి
జవాబు:
D) తెలివి
ప్రశ్న 5.
‘కృషి’ అనే పదానికి పర్యాయపదాలు
A) గాయము, తోయము
B) సాయము, కాయము
C) హాయి, హూయి
D) సేద్యము, వ్యవసాయము
జవాబు:
D) సేద్యము, వ్యవసాయము
ప్రశ్న 6.
థర్మము అనే పదానికి నానార్థాలు
A) ధర్మము, కర్మము
B) అన్యము, విన్యము
C) మర్మము, ఘర్మము
D) పుణ్యము, స్వభావము
జవాబు:
D) పుణ్యము, స్వభావము
ప్రశ్న 7.
‘సత్యము’ – అనే పదానికి వికృతి
A) సత్తెము
B) విత్తము
C) బెత్తము
D) బొత్తము
జవాబు:
A) సత్తెము
ప్రశ్న 8.
‘కొలము’ – అనే పదానికి ప్రకృతి
A) చలము
B) గలము
C) కులము
D) గెల
జవాబు:
C) కులము
ప్రశ్న 9.
‘’గాలి’ అనే పదానికి నానార్థాలు
A) దేహము, మోహము
B) ద్రోహము, దాహము
C) వాయువు, పిశాచము
D) వేషము, రోషము
జవాబు:
C) వాయువు, పిశాచము
ప్రశ్న 10.
‘మూర్ధ’ అనే పదానికి వికృతి
A) వెంకు
B) పెంకు
C) కొంకు
D) మంకు
జవాబు:
D) మంకు
ఆ) వ్యాకరణాంశాలు : (10 మార్కులు)
కింది వానికి సరైన జవాబును గుర్తించి (A / B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)
ప్రశ్న 11.
‘ఎప్పుడైనా’ – వీడదీయుము.
A) ఎప్పుడు + ఐనా
B) ఎప్పుడై + నా
C) ఎప్పు + డైనా
D) ఎప్పుడును + ఐనా
జవాబు:
A) ఎప్పుడు + ఐనా
ప్రశ్న 12.
ఉసూరు + అంటు – దీనిని కలుపగా
A) ఉసూరేంటు
B) ఉసూరంటు
C) ఉసూరాంటు
D) ఉసూరుంటు
జవాబు:
B) ఉసూరంటు
ప్రశ్న 13.
కొవ్వొత్తి – విగ్రహవాక్యం
A) కొవ్వు యొక్క వత్తి
B) కొవ్వుతో వత్తి
C) కొవ్వును వత్తి
D) కొవ్వు యైన వత్తి
జవాబు:
A) కొవ్వు యొక్క వత్తి
ప్రశ్న 14.
తీవ్ర పరిణామము – ఏ సమాసం ?
A) ద్విగువు
B) ద్వంద్వము
C) తత్పురుషము
D) విశేషణ పూర్వపద కర్మధారయము
జవాబు:
D) విశేషణ పూర్వపద కర్మధారయము
ప్రశ్న 15.
రాయమ్య ఊరు దాటాడు. రామయ్య అడవిలో ప్రవేశించాడు. (సంక్లిష్ట వాక్యంగా మార్చండి)
A) రామయ్య ఊరు దాటి, అడవిలో ప్రవేశించాడు.
B) రామయ్య అడవిలో ప్రవేశించి, ఊరు దాటాడు.
C) రామయ్య ఊరు దాటుతూ అడవిలో ప్రవేశించాడు.
D) రామయ్య ఊరు దాటడానికి అడవిలో ప్రవేశించాడు.
జవాబు:
A) రామయ్య ఊరు దాటి, అడవిలో ప్రవేశించాడు.
ప్రశ్న 16.
చార్మినారు కులీ కుతుబ్షా నిర్మించాడు.. (గీత గీసిన పదం ఏ కాలం?)
A) వర్తమాన కాలం
B) భూతకాలం
C) భవిష్యత్ కాలం
D) తద్ధర్మ కాలం
జవాబు:
B) భూతకాలం
ప్రశ్న 17.
పాప పాలు త్రాగి నిద్రపోయింది. (గీత గీసిన పదం ఏ క్రియ ?)
A) సత్రియ
B) సమాపక క్రియ
C) అసమాపక క్రియ
D) క్రియా విశేషణం
జవాబు:
C) అసమాపక క్రియ
ప్రశ్న 18.
దారి …………… ఒంటరిగా నడువకు. (విభక్తి ప్రత్యయంతో ఖాళీని పూరించండి.)
A) లో
B) యొక్క
C) ను
D అదు
జవాబు:
A) లో
ప్రశ్న 19.
పుష్కర స్నానము వలన పుణ్యము కల్గును.
A) ప్రథమ
B) ద్వితీయ
C) షష్ఠి
D) పంచమీ
జవాబు:
D) పంచమీ
ప్రశ్న 20.
సీత అన్నమును తిన్నది. గీత గీసిన పదం ఏ భాషాభాగం ?
A) నామవాచకం
B) సర్వనామము
C) విశేషణం
D) క్రియ
జవాబు:
A) నామవాచకం