TS 10th Class Telugu (S/L) Model Paper Set 4 with Solutions

Reviewing TS 10th Class Telugu Model Papers Set 4 (S/L) can help students identify areas where they need improvement.

TS SSC Telugu (S/L) Model Paper Set 4 with Solutions

పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)

సమయం : 2 గం. 30 ని.లు
మార్కులు: 60

విద్యార్థులకు సూచనలు :

  1. జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
  2. పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.

అ) కింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. (5 × 1 = 5 మా.)

కోపంతో ఊరు దాటిపోయాను. ఊరు దాటిన వెనుక, నా తెలివితక్కువతనం మీద, తొందరపాటు మీద నాకు కోపం వచ్చింది. ఎందుకంటే ఊరు పోయి అడవి వచ్చింది. అడవిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ? ఏమి చేయాలో నాకేమీ తోచలేదు. పిచ్చివాడి మోస్తరు అడవిలో పోతున్నాను. నా శరీరం నా వశం తప్పదొడగింది. నా కాళ్ళు తడబడదొడగాయి. మృత్యువు ముంచు కొస్తున్నట్టు కళ్ళు చీకట్లు కమ్మదొడగాయి. దాహముతో అడవి మధ్య చచ్చిపోతానేమో అని భయం వేయదొడగింది.

ఇంతలో హఠాత్తుగా ఓ చిన్న వాగు ఎదురైంది. నా విగతజీవాలు వాగు రూపంలో ప్రత్యక్షమైనట్లు పొంగిపోయాను. వాగులో బాటసారులు ఓ చెలమతోడి ఉంటారు. చెలమలోకి తలవంచి అమృతము త్రాగినట్లు ఆ నీరంతా త్రాగేసాను. దాహానికి నీరు దొరికినందుకు నాకు ఎంతో ఆనందమైంది. నీరు తాగుతూ, తాగుతూ నాకు ప్రాణదానం చేసిన ఆ మూగతల్లికి కోటి నమస్కారాలు చేశాను.

ప్రశ్న 1.
కథకుడు దేని గుండా ప్రయాణిస్తున్నాడు ?
A) ఎడారి
B) రాజధాని
C) అడవి
D) లోయ
జవాబు:
C) అడవి

ప్రశ్న 2.
కథకుడికి హఠాత్తుగా ఏమి ఎదురైంది ?”
A) చిన్న వాగు
B) పర్వతం
C) మృత్యువు
D) నది
జవాబు:
A) చిన్న వాగు

TS 10th Class Telugu (S/L) Model Paper Set 4 with Solutions

ప్రశ్న 3.
వాగులో ఎవరు చెలమ తోడి వుంటారని కథకుడు అనుకొన్నాడు ?
A) దొంగలు
B) బాటసారులు
C) వ్యాపారులు
D) భటులు
జవాబు:
B) బాటసారులు

ప్రశ్న 4.
ఏది వశం తప్పసాగింది ?
A) కథకుడి కాళ్లు
B) కథకుడి కళ్లు
C) కథకుడి ప్రాణం
D) కథకుడి శరీరం
జవాబు:
D) కథకుడి శరీరం

ప్రశ్న 5.
‘మూగతల్లి’ అంటే ఎవరు ?
A) విగతజీవి
B) నీటి చెలమ
C) దాహం
D) ఊరు
జవాబు:
B) నీటి చెలమ

ఆ) కింది పద్యాలలో ఒక పద్యానికి భావం రాయండి. (1 × 5 = 5 మా..)

6. విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వర్ణింపనగుజు మీదుర్జనుండు
చారుమాణిక్యభూషిత శస్తమస్త
కంబుగల పన్నగము భయంకరముగాదె !’
జవాబు:
గొప్పగా చదువుకొని ప్రకాశించే వాడైనా వాడు చెడ్డవాడైతే వానికి దూరంగా ఉండాలి. ఎలాగంటే కాటు వేసే పాము తలపై అందమైన రత్నం ఉందని ఆ రత్నాన్ని తీసుకోవటానికి పాము దగ్గరకు వెళ్ళలేము కదా ! అలాగే విద్యావంతుడైన దర్జనుడికి దూరంగా ఉండాలి.

(లేదా)

జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న రే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షింపుచున్
శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులున్ బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా
జవాబు:
మధ్యలో దుద్దు ఉండి చుట్టూ రేకులు ఉండే తామరపూవు లాగా శ్రీకృష్ణుడు మధ్యలో కూర్చుండగా, అతని చుట్టూ గోపబాలురు కూర్చున్నారు. వారు శ్రీకృష్ణుని చూస్తున్నారు. తమ తమ సద్దులను తినడానికి అక్కడ ఉన్న బండలను, చిగురాకులను, గడ్డిపోచలను, తీగలను, చిక్కములను, పువ్వులను, ఆకులను కంచాలుగా చేసుకుని చద్దులు తిన్నారు.

ఇ) కింది పద్యాన్ని చదువండి. ప్రశ్నలు తయారు చేయండి.

పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ ! వినురవేమ !

ప్రశ్న 7.
……………………..
జవాబు:
పూజకంటే ముఖ్యమైనది ఏది ?

ప్రశ్న 8.
……………………..
జవాబు:
మాటకంటె దృఢమైనది ఏది ?

ప్రశ్న 9.
……………………..
జవాబు:
కులముకంటె ప్రధానమైనది ఏది ?

ప్రశ్న 10.
……………………..
జవాబు:
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.

ప్రశ్న 11.
……………………..
జవాబు:
ఇది ఏ శతకంలోని పద్యం ?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (32 మార్కులు)
(4 × 4 = 16 మా.)

అ) కింది ప్రశ్నలకు 4 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 12.
తినడానికి ముందు ఏమేమి సిద్ధం చేసుకోవాలి ?
జవాబు:
మనం భోజనం తినడానికి ముందు పదార్థాలు పెట్టుకుని తినడానికి కంచం సిద్ధం చేసుకోవాలి. తర్వాత మంచినీళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అమ్మ వండిన పదార్థాలను, అవసరమైతే ఊరగాయ పచ్చడిని కూడా సిద్ధం చేసుకుని, భోజనం చేయడానికి ఉపక్రమించాలి. దగ్గరలో ఏవీ లేకపోయినా భోజనం తినడానికి ఇబ్బంది కలుగుతుంది. ఊరగాయతో అన్నాన్ని మేళవించినపుడు వెన్నపూస కూడా ఉంటే భలే పసందుగా ఉంటుంది.

ప్రశ్న 13.
అసలు సిసలు శక్తిని ఎవరు అడ్డుకోలేరని చెప్పడానికి కవి చూపించిన ఆధారాలేమిటో రాయండి.
జవాబు:
బురదలో పుట్టినంత మాత్రాన పద్మానికి విలువ తగ్గదు. తరాలుగా తాటాకుల మీదనే ఉన్నప్పటికినీ పద్యానికి విలువ తగ్గదు. అసలు సిసలు శక్తి ఉన్నప్పుడు దాన్నెవరూ అడ్డుకోలేరు. రసికత తెలియనివారు ఆదరించకపోయినా గానం (పాట) విలువ తగ్గదు. మూర్ఖులు ఎన్ని విధాలుగా ప్రయత్నించి అడ్డగించినా జ్ఞానం విస్తరణను ఆపలేరు. నిజమైన ప్రతిభకు, కళకు ఎప్పుడైనా శాశ్వత విలువ, గుర్తింపు లభిస్తుంది.

TS 10th Class Telugu (S/L) Model Paper Set 4 with Solutions

ప్రశ్న 14.
తేలు గురించి వచ్చే పోయేవారికి వొడ్డించే బొమ్మ అని ఎందుకన్నారు ?
జవాబు:
ప్రాచీన విజ్ఞానంతో సంబంధం తగ్గుతూ, మారుతున్న జీవన రీతిలో పాతబడ్డ ఆచార, వస్తు విశేషాల పరిచయం పిల్లలకు ఏర్పడుతుంది. కాబోయే రేపటి పౌరులు మన తెలుగుతనాన్ని మరిచిపోకుండా చురుకుదనంతో ఉంటారని ఆశించే గోడ మీద బొమ్మ పొడుపు కథామాల అని రచయిత చెప్పింది.

ప్రశ్న 15.
కృష్ణస్వామి ముదిరాజ్ గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
కృష్ణస్వామి ముదిరాజ్ స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత, విద్యావేత్త, విలేఖరి. పేదరైతు కుటుంబంలో జన్మించిన ఈయన హైదరాబాదులో విద్యాభ్యాసం చేసి హైదరాబాదు నగరానికి మేయర్గా పనిచేసి అభివృద్ధికి పాటుపడ్డాడు. ‘దక్కన్ఆర్’ అనే ఆంగ్ల వార పత్రికను స్థాపించి సంపాదకునిగా ఉండి విలువైన సంపాదకీయాలు, వ్యాసాలు రాశాడు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణికాలు. ‘పిక్టోరియల్ హైదరాబాద్’ అనే అద్భుతమైన గ్రంథాన్ని దృశ్యరూపంగా మనకు అందించాడు. తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేశాడు.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి. (2 × 8 = 16 మా.)

ప్రశ్న 16.
కలిసి భోజనం చేయడానికి మీరు మీ స్నేహితులను ఎలా ఆహ్వానిస్తారు ? మీకు ఇష్టమైన ఆహారపదార్థాల గురించి రాయండి.
జవాబు:
స్నేహితులతో కలిసి భోజనం చేయడం నాకెంతో ఇష్టం. నేను వారిని ఆప్యాయంగాను, ప్రేమగాను ఆహ్వానిస్తాను. నా స్నేహితుల అభిరుచికి తగినట్టుగా వారికి భోజనం ఏర్పాటు చేస్తాను. నాకు తెలుగువారి భోజనం తప్ప ఏ ప్రాంతాల్లో చేసిన భోజనం నచ్చదు. మన తెలుగువారు చేసే మామిడికాయతో మేళవించిన పప్పు, అందులో నెయ్యి, ఊరబెట్టిన మిరపకాయలను నంజుకుతింటుంటే ఆ రుచి గొప్పగా ఉంటుంది.

తర్వాత ‘ఆంధ్రమాత’గా పేరొందిన గోంగూర పచ్చడి. దీనిలో సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయతో నంజుకు తినడం, సుద్దపప్పులో నెయ్యి చేతి నిండా వేసుకుని, కలుపుకు తింటూ మధ్యలో కొత్త ఆవకాయను మేళవించి తింటుంటే అబ్బా ! ఎంత పసందుగా ఉంటుందో వర్ణించుటకు వీలులేదు.

(లేదా)

వీధులు శుభ్రం చేసేవారి సేవలను / ఘనతను గూర్చి సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
వీధుల్ని శుభ్రపరిచేవార్ని పారిశుద్ధ్య కార్మికులంటారు. వీరు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. చీపురుతో వీధులన్నీ శుభ్రపరుస్తారు. చెత్తనంతా ఒక చోటకు పోగుచేసి బుట్టలతో ఎత్తి ఊరికి దూరంగా పోస్తారు. వారానికోసారి ఆ చెత్తగుట్టలన్నీ తగులబెడతారు. ప్రజలకు ఎటువంటి అంటురోగాలు రాకుండా రాత్రింబవళ్ళూ శ్రమిస్తూ రోడ్లను తుడుస్తూ అద్దాల్లాగా ఉంచుతారు.

ఇంకా వీధులకు ఇరువైపులనున్న డ్రైనేజీ (మురుగు కాల్వలు) లో పేరుకున్న చెత్తనంతా తీసి శుభ్రపరుస్తారు. ఎటువంటి అంటురోగాలు రాకుండా రోడ్లకు ఇరువైపులా బ్లీచింగ్ వగైరాలు చల్లుతారు. దోమలను నివారించే క్రిమిసంహారక మందులు వాడతారు. ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా సంరక్షిస్తారు. ఒకరకంగా ఈ పారిశుద్ధ్య కార్మికులు గ్రామ సంరక్షకులని చెప్పవచ్చు.

ప్రశ్న 17.
ప్రజలలో అసమానతలు తొలగి సమానత్వ భావన కలగాలంటే ఏం జరగాలి ?
జవాబు:
ప్రజలలో అసమానతలు తొలగి సమానత్వ భావన కలగాలంటే ముందు అనగారిన కులాల నాయకులతో పరిచయం పెంచుకోవాలి. క్రమక్రమంగా వారి నుంచి సహకారం, నైతిక మద్దతు కూడగట్టుకోవాలి. గొప్ప మనుషులలో, సంస్కర్తలలో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకొని, అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలు మొదలు పెట్టాలి.

చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో పనిచేసి, అచిరకాలంలోనే వారి నమ్మకాన్ని చూరగొనాలి. తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనతేనన్న ఎరుకను తన అనుచరులలో కలిగేటట్టు చేయగలగాలి. మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్లు చేయాలి. ఈ విధంగా కృషి చేస్తే ప్రజలలో అసమానతలు తొలగి సమానత్వ భావన కలుగుతుంది.

(లేదా)

‘తెలుగు మహిళ’ పాఠం చదివారు కదా ! కుటుంబ జీవనంలో స్త్రీ యొక్క గొప్పతనాన్ని వివరించండి.
జవాబు:
కుటుంబ జీవనంలో స్త్రీ పాత్ర ఎంతో గొప్పది. సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో వారు ముఖ్యపాత్ర వహిస్తున్నారు. ‘ నాడు, నేడు, ఏనాడూ కూడా సమాజానికి వెన్నెముక స్త్రీ. ప్రకృతి స్వరూపమే స్త్రీ. చిన్నప్పటి నుండి ఇంటికి అనురాగ దీపిక. అంధకారంలో వెలుగుల జాబితా. ఎప్పుడూ సమాజంలో స్త్రీ తల్లిగా, చెల్లిగా, ఇల్లాలుగా రకరకాలైన పాత్రలను ధరిస్తూ తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. కుటుంబానికి సేవకురాలియై సేవలు చేస్తూ తన అమృత హృదయంతో ప్రేమను పంచుతుంది.

మన స్త్రీలలో పరంపరాగతమైన నైతిక విలువలున్నాయి. కష్టాలు ఓరిమితో సహించిన సీతమ్మ లున్నారు. యముడితో పోరాడి పతి ప్రాణాలను దక్కించుకున్న సావిత్రులున్నారు. ఘోరమైన తపస్సు చేసి పరమశివుడిలో అర్ధభాగాన్ని పొందకల్గిన పార్వతులున్నారు.

త్రిమూర్తులను పసిపాపలుగా చేసి తన శీలాన్ని కాపాడుకున్న అనసూయమ్మలున్నారు. సూర్యచంద్రాదులు గతులను అరికట్టిన సుమతులున్నారు. గృహమొక రాజ్యంగా పరిపాలిస్తున్న స్త్రీ మాతృమూర్తిగా ఒక సామ్రాజ్ఞిగా నిండు మనసుతో గంభీరంగా నిబ్బరంతో ఎన్ని కష్టాలు వచ్చి మీదపడినా తన ఆదర్శాలను విడనాడకుండా తన సంతతికి బోధిస్తుంది.

ఇ) సృజనాత్మకత (32 మార్కులు)

కింది ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి. (2 × 8 = 16 మా.)

ప్రశ్న 18.
బాలికల విద్య ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం రాయండి..
జవాబు:
బాలికల విద్య – సమాజానికి ప్రగతి

తల్లిదండ్రులారా !

బాలికలు విద్యావంతులైనచో సమాజం వివేకవంతమవుతుంది. బాలికలు విద్యావంతులైనచో ప్రయోజనం ‘ఇంత’ అని చెప్పటానికి వీలులేదు.

ఇటీవల కాలంలో రాజకీయ దాస్యంతోను, భావ దాస్యంతోను సంఘం మునిగి ఉంది. అందువల్ల బాలికల విద్య చాలావరకు వెనుకబడి ఉంది.

మనదేశానికి స్వాతంత్ర్యం సంపాదించుటకు గాంధీ మహాత్ముడు తన నిర్మాణ కార్యక్రమంలో మహిళాభ్యుదయం ప్రధానంగా చేర్చారు. బాలికల విద్యకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఆధునిక కాలంలో వీరేశలింగం పంతులుగారు స్త్రీ విద్యకై మొట్టమొదటిగా ఒక పాఠశాలను పెట్టి కృషి చేశారు.

సాంకేతిక విద్యలో నైపుణ్యం సంపాదించుటకై బాలికలకు ప్రత్యేకంగా ‘పాలిటెక్నిక్’ కళాశాలను ఏర్పరిచారు. కనుక స్త్రీలు గృహకృత్యాలను నిర్వహించుటలో విద్యావంతులైనచో బహుముఖ ప్రజ్ఞను వెల్లడించి దేశసేవలోను, సంఘసేవలోను రాణించగలరు. తమ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పుటలో శ్రద్ధ వహించి వారిని సత్పురుషులుగా తీర్చిదిద్దుతారు. కనుక బాలికల విద్యను ఇతోధికంగా ప్రోత్సహించినచో దేశానికి, సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది.

ఇట్లు,
బాలికల విద్యా ప్రోత్సాహక సంఘము
సూర్యాపేట.

ప్రశ్న 19.
మీకు నచ్చిన పండుగను గురించి వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

ఖమ్మం,
X X X X X

ప్రియమైన మిత్రునకు నమస్కారములు.
మిత్రమా !

నేను క్షేమము. నీవు క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. ఈ మధ్య జరిగిన అర్ధ సంవత్సర పరీక్షలో అన్ని సబ్జెక్టులలోను నూటికి 98, 99 అలా మార్కులు వచ్చాయి. నీవు బాగా చదువుతున్నావని తలుస్తాను.

మా ఇంట్లో నాకు నచ్చిన దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నాను. ఉదయాన్నే అభ్యంగన స్నానం చేశాను. తర్వాత కొత్తబట్టలు కట్టుకొని, మా తాతగారు చేసే నిత్యపూజలో పాల్గొన్నాను. ఆ తర్వాత నేను మా కుటుంబ సభ్యులతో పగటిపూట కాల్చే టపాకాయలు కాలుస్తూ ఎంతో ఆనందంగా గడిపాను. సాయంకాలం దీపాలను వెలిగించింది అమ్మ. ఆ తర్వాత నేను కాటన్ వస్త్రాలను ధరించి టపాకాయలు కాల్చను. తీపి మిఠాయిలు మా అమ్మ పెట్టింది. మానసిక ఉల్లాసం కలిగించిందీ పండుగ.

నీవు కూడా ఎలా జరుపుకున్నావో తెలియజేయగలవు.

ఇట్లు,
నీ మిత్రుడు,
జి. వికాస్

చిరునామా :
కె. శంకర్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
కోదాడ,
ఖమ్మం జిల్లా.
తెలంగాణ.

TS 10th Class Telugu (S/L) Model Paper Set 4 with Solutions

ప్రశ్న 20.
మీ పాఠశాలలో జరిగే పాటల పోటీల గురించి ఆహ్వానపత్రం తయారుచేయండి.
జవాబు:
* ఆహ్వానం *

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
వరంగల్

పాటల పోటీలు

ఆసక్తి గల బాల బాలికలందరూ ఈ పోటీలలో పాల్గొనవచ్చు.

జూనియర్స్ విభాగం 6, 7 తరగతులు
సీనియర్స్ విభాగం – 8, 9, 10 తరగతులు
పోటీలు నిర్వహించే వేదిక – పాఠశాల ఆడిటోరియం
సమయం – ఉ. 10.00 నుండి పోటీలు అయ్యే వరకు
ప్రతి విభాగంలోను విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయబడును.

ఇట్లు,
తెలుగు సాంస్కృతిక విభాగం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
వరంగల్.

పార్ట్ – B

సమయం : 30 ని.లు

సూచనలు :

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు నిర్దేశించిన స్థలంలో రాయాలి.
  2. పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ సమాధాన పత్రంతో జతపరచండి.

I. భాషాంశాలు మార్కులు : (మార్కులు : 20 )

అ) పదజాలం :  (10 మార్కులు)

కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. (2 × 1 = 2 మా.)

1. అంకిత భావం : …………………….
జవాబు:
అంకితభావం : ఏ పనైనను అంకితభావంతో చేయాలి.

2. మూఢనమ్మకాలు : ………………………………
జవాబు:
మూఢనమ్మకాలు : ఈ ఆధునిక యుగంలోను మూఢనమ్మకాలు పాటించేవారు ఉండటం విడ్డూరం.

కింది ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి ( A / B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (8 × 1 = 8 మా.)

ప్రశ్న 3.
రణము మంచిది కాదు. (గీత గీసిన పదానికి అర్థం)
A) యుద్ధము
B) స్నేహము
C) ద్రోహము
D) మోహము
జవాబు:
A) యుద్ధము

ప్రశ్న 4.
శత్రువు – అనే పదానికి పర్యాయపదాలు
A) మిత్రుడు, స్నేహితుడు
B) శాత్రవుడు, అరి
C) జనని, విజయిని
D) దేశము, ప్రదేశము
జవాబు:
B) శాత్రవుడు, అరి

ప్రశ్న 5.
కనకము అంటే స్త్రీలకు ఎంతో ఇష్టం. ప్రతి స్త్రీ బంగారంతో ఆభరణాలు చేయించుకుంటారు. (ఈ వాక్యాలలో పర్యాయ పదాలు) [ ]
A) కారాగారము, కర్మాగారము
B) ఆలయము, సంగీతాలయము
C) కనకము, బంగారము
D) స్త్రీలు, ఆభరణాలు
జవాబు:
C) కనకము, బంగారము

ప్రశ్న 6.
భావము – అనే పదానికి నానార్థాలు
A) మనోవికారము, అభిప్రాయము
B) ఆకారము, సాకారము
C) దేశము, కోశము
D) అంశము, వింశతి
జవాబు:
A) మనోవికారము, అభిప్రాయము

ప్రశ్న 7.
అర్థము – ఈ పదానికి నానార్థాలు
A) ధనము, ఘనము
B) కార్యము, వీర్యము
C) శౌర్యము, క్రౌర్యము
D) ధనము, శబ్దార్థము
జవాబు:
D) ధనము, శబ్దార్థము

ప్రశ్న 8.
నాన లేకపోతే ఎందుకూ కొరగాడు. కనుక జ్ఞానము సంపాదించాలి. ఈ వాక్యాలలో ప్రకృతి వికృతులు [ ]
A) ఎందుకు – కొరగాడు
B) జ్ఞానము – నాన
C) కనుక – జ్ఞానము
D) ఏదీ కాదు
జవాబు:
B) జ్ఞానము – నాన

ప్రశ్న 9.
“వన్నె” అనే పదానికి ప్రకృతి
A) వర్ణము
B) కన్నె
C) అర్జము
D) కర్ణము
జవాబు:
A) వర్ణము

TS 10th Class Telugu (S/L) Model Paper Set 4 with Solutions

ప్రశ్న 10.
“భక్ష్యము” – ఈ పదానికి వ్యత్పత్తి
A) భరించేది
B) తరించేది
C) భక్షింపతగినది
D) పారిపోయేది
జవాబు:
C) భక్షింపతగినది

ఆ) వ్యాకరణాంశాలు : (10 మార్కులు)

కింది ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి ( A / B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి.

ప్రశ్న 11.
కార్యాచరణ – ఏ సంధి ?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 12.
ప్రతి + అభిప్రాయము – ఈ సంధిలో పరపదంలో ఉన్న తొలి అచ్చు ఏది ?
A) ఉ
B) ఈ
C) ఏ
D) అ
జవాబు:
D) అ

ప్రశ్న 13.
శిల్పమెలా – విడదీయుము
A) శిల్ప + మెలా
B) శి + ల్పమెలా
C) శిల్పము + ఎలా
D) శిల్పమ్ + లా
జవాబు:
C) శిల్పము + ఎలా

ప్రశ్న 14.
అచిరకాలము – సమాసం పేరు
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
B) ద్వంద్వ సమాసం
C) రూపక సమాసం
D) నఞ తత్పురుష సమాసం
జవాబు:
D) నఞ తత్పురుష సమాసం

ప్రశ్న 15.
నేల పచ్చదనం ……….. నిండింది. ఖాళీలో ఉండవలసిన విభక్తిని గుర్తించండి.
A) తో
B) డు
C) ము
D) యొక్క
జవాబు:
A) తో

ప్రశ్న 16.
నీవు తప్పక మా యింటికి రావాలి అని శేషు పిలిచాడు. దీన్ని పరోక్ష వాక్యంగా రాస్తే
A) నీవు తప్పక మా యింటికి రావాలని శేషు పిలిచాడు.
B) వాడు తప్పక మా యింటికి రావాలని శేషు పిలిచాడు.
C) నేను తప్పక వారి యింటికి రావాలని శేషు పిలిచాడు.
D) “నీవు తప్పక మా యింటికి రా” శేషు పిలిచాడు.
జవాబు:
C) నేను తప్పక వారి యింటికి రావాలని శేషు పిలిచాడు.

ప్రశ్న 17.
తాను రానని తనకు పని ఉందని శేషమ్మ చెప్పింది – దీన్ని ప్రత్యక్ష వాక్యంగా రాస్తే
A) “అతడు రాడు, అతనికి పని ఉంది” శేషమ్మ చెప్పింది.
B) “నీవు రావు, నీకు పని ఉంది” శేషమ్మ చెప్పింది.
C) “నేను రాను, నాకు పని ఉంది” అని శేషమ్మ చెప్పింది.
D) “ఆమె రాదు, ఆమెకు పని ఉంది” శేషమ్మ చెప్పింది.
జవాబు:
C) “నేను రాను, నాకు పని ఉంది” అని శేషమ్మ చెప్పింది.

ప్రశ్న 18.
‘బాలుచే ఇసుకతో ఇల్లు కట్టబడింది – దీన్ని కర్తరి వాక్యంగా మారిస్తే
A) బాలు ఇంటిని ఇసుకతో కడుతున్నాడు.
B) బాలు చేత ఇసుకతో ఇల్లును కట్టాడు.
C) బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు.
D) బాలు ఇసుకతో ఇల్లు కట్టగలడు.
జవాబు:
C) బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు.

ప్రశ్న 19.
తల్లిదండ్రులు – విగ్రహవాక్యాన్ని రాయండి.
A) తల్లి, తండ్రి
B) తల్లియును, తండ్రియును
C) తల్లి యొక్క తండ్రి
D) తల్లి అయిన తండ్రి
జవాబు:
B) తల్లియును, తండ్రియును

ప్రశ్న 20.
గృహిణి అడుగుజాడల్లో పురుషుడు నడుస్తున్నాడు. గీత గీసిన పదం ఏ కాలం ?
A) భూత కాలం
B) ప్రాచీన కాలం
C) వర్తమాన కాలం
D) భవిష్యత్ కాలం
జవాబు:
C) వర్తమాన కాలం

Leave a Comment