TS 10th Class Telugu (S/L) Model Paper Set 2 with Solutions

Reviewing TS 10th Class Telugu Model Papers Set 2 (S/L) can help students identify areas where they need improvement.

TS SSC Telugu (S/L) Model Paper Set 2 with Solutions

పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)

సమయం : 2 గం. 30 ని.లు
మార్కులు: 60

విద్యార్థులకు సూచనలు :

  1. జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
  2. పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.

అ) కింది పేరా చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు 1, 2 వాక్యాలలో రాయండి. (5 × 1 = 5 మా.)

తన ఆస్థానంలో ఉండే బీర్బల్ అంటే అక్బర్కు చాలా అభిమానం. ఇది ఆస్థానంలోని మిగిలినవారికి నచ్చేది కాదు. తాము బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని వాళ్ళ ఉద్దేశం. ఈ విషయాన్ని అక్బర్ గమనించాడు. అక్బర్ ఒకనాడు సభలోని వాళ్ళందరినీ ఉద్దేశించి ఇట్లా అన్నాడు. ‘మీకు నేనొక పరీక్ష పెడుతున్నాను.

అదేమంటే మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నవో లెక్కబెట్టి చెప్పండి. సరైన జవాబు చెప్పిన వారిని అందరి కన్నా తెలివైన వారుగా ఒప్పుకుని మంత్రి పదివి ఇస్తాను.’ అందరూ ఇదే అవకాశమనుకొని, తాము బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని నిరూపించుకోవచ్చని కాకులను లెక్కబెట్టేందుకు పోయారు.

రాజుగారి ఆస్థానంలోని ఉద్యోగులందరూ ఊరిమీద పడి కాకులను లెక్కబెడుతుంటే ప్రజలంతా ముక్కు మీద వేలు వేసుకొన్నారు. అందరూ ఊరంతా తిరుగుతూ ఇండ్లమీద, చెట్లమీద, నది ఒడ్డున, వీధుల్లో, వాడల్లో, చెత్తా చెదారాలలో వెతుకుతూ కాకులను లెక్కపెడుతూనే ఉన్నారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఎవరంటే అక్బరుకు అభిమానం ?
జవాబు:
బీర్బల్ అంటే అభిమానం.

ప్రశ్న 2.
సభలోని వారికి అక్బరు పెట్టిన పరీక్ష ఏమిటి ?
జవాబు:
ఆగ్రా పట్టణంలో కాకులు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టడం.

TS 10th Class Telugu (S/L) Model Paper Set 2 with Solutions

ప్రశ్న 3.
సభలోని వారందరూ ఎక్కడకు వెళ్ళారు ?
జవాబు:
సభలోని వారంతా ఆగ్రా పట్టణంలో కాకులు లెక్కపెట్టడానికి వెళ్ళారు.

ప్రశ్న 4.
కాకులను సరిగ్గా లెక్కపెట్టినవాడికి అక్బరు ఇస్తానన్న కానుక ఏమిటి ?
జవాబు:
మంత్రి పదవి

ప్రశ్న 5.
ప్రజలంతా ఎందుకు ముక్కు మీద వేలు వేసుకొన్నారు ?
జవాబు:
రాజుగారి ఆస్థానంలోని ఉద్యోగులందరూ ఊరి మీద పడి కాకులను లెక్కబెడుతుంటే ప్రజలంతా ముక్కు మీద వేలు వేసుకొన్నారు.

ఆ) కింది పద్యాలలోని పాదాలు తరుమారుగా ఇవ్వబడినవి. వాటిని సరియైన వరుస క్రమంలో రాయండి. (1 × 5 = 5 మా.)

6. శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులున్ బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా
జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న
రే కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షింపుచున్
జవాబు:
జాలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న రే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షింపుచున్
శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులున్ బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా

(లేదా)

గుడువకుమీ శత్రునింట, గూరిమితోడన్
నడువకుమీ తెరువొక్కట
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !
ముడువకు మీ పరధనములు.
జవాబు:
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట, గూరిమితోడన్
ముడువకు మీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !

ఇ) కింది గద్యాన్ని చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 2 = 10 మా.)

తెలంగాణలో 2000 సంవత్సరాల పూర్వం నుంచే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన హాలుని “గాథా సప్తశతి”లో మన తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు కన్నిస్తున్నాయి. కరీంనగరు జిల్లా కురిక్యాల వద్ద బొమ్మలమ్మ గుట్టపై ఉన్న జినవల్లభుని శాసనం కంద పద్యాల్లో ఉండటం విశేషం.

అచ్చ తెలుగు పలుకుబడికి పట్టం కట్టిన పాల్కురికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసి. ఈయన అనేక ప్రక్రియలకు ఆదికవిగా నిలిచాడు. తెలుగులో తొలి స్వతంత్ర రచన ‘బసవ పురాణం’ తొలి శతకం, వృషాధిప శతకం”, తొలి ఉదాహరణ కావ్యం బసవోదారణం పాల్కురికి సోమన వెలువరించిన అనర్ఘ కావ్య రత్నాలు. తేట తెలుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోనబుద్ధారెడ్డి వెలువరించిన ‘రంగనాథ రామాయణం’ తెలుగులో తొలి ద్విపద కావ్యం. మెదక్ జిల్లా పటాన్ చెరువు నివాసి పొన్నెగంటి తెలగన రచించిన ‘యయాతి చరిత్ర’ – తొలి అచ్చ తెలుగు కావ్యం.

ప్రశ్న 7.
హాలుడు రచించిన గ్రంథమేది ?’
జవాబు:
గాథాసప్తశతి

ప్రశ్న 8.
జినవల్లభుని శాసనం ఏ ఛందస్సులో ఉంది ?
జవాబు:
కందపద్యం

ప్రశ్న 9.
అనేక ప్రక్రియలకు ఆద్యుడెవరు ?
జవాబు:
పాల్కురికి సోమన

ప్రశ్న 10.
పాల్కురికి సోమన వెలువరించిన కావ్యాలేవి ?
జవాబు:
బసవపురాణం, వృషాధిప శతకం, బసవోదారణం.

ప్రశ్న 11.
గోనబుద్ధారెడ్డి వెలువరించిన కావ్యమేది ? అది ఏ కావ్యం ?
జవాబు:
రంగనాథ రామాయణం. ఇది ద్విపద కావ్యం.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (32 మార్కులు)

అ) కింది ప్రశ్నలకు 4 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి. (4 × 4 = 16 మా.)

ప్రశ్న 12.
భాస్కర శతక కర్త గురించి మీకు తెలిసిన విషయాలు వ్రాయండి.
జవాబు:
భాస్కర శతకాన్ని మారద వెంకయ్య రచించారు. ఆయనను మారన అని కూడా పిలుస్తారు. ఆయన 17వ శతాబ్దానికి చెందిన కవి. ఇది తెలుగులో ‘తొలి దృష్టాంత’ శతకంగా ప్రసిద్ధిని పొందింది. ప్రతి పద్యంలో దృష్టాంతం చెప్పటం భాస్కర శతకానికి ఉన్న ప్రత్యేకత.

TS 10th Class Telugu (S/L) Model Paper Set 2 with Solutions

ప్రశ్న 13.
కవి కంచు, బంగారం అనే వాటి ప్రసక్తిని ఎందుకు ప్రస్తావించాడో తెలుపండి.
జవాబు:
అల్పబుద్ధి కలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్తుంటాడు. ఎలాగంటే కంచు విలువ తక్కువ. కాని శబ్దం ఇబ్బంది పట్టేలా మోగుతుంది. సజ్జనుండు చల్లగా మాట్లాడతాడు. ఎలాగంటే ఎంతో విలువైన బంగారం శబ్దం చేయదు. అందుచేత కవి అల్పుణ్ని కంచుతోను, సజ్జనుణ్ని బంగారంతోను పోల్చాడు.

ప్రశ్న 14.
“మానవులంగా సమానమే” అనే భావన కలగడానికి ఏమి చేయాలి ?
జవాబు:
మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని గ్రహించాలి. అయితే లోలోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని తొలగించాలి. అంటరాని వర్గాలకు చదువుపై నమ్మకం కలిగించి అక్షరాస్యుల్ని చెయ్యాలి. సంఘంలో నెలకొన్న దురాచారాలు పోగొట్టి, మానవులంతా సమానమే అనే భావనను అందరిలో కలిగించాలి.

ప్రశ్న 15.
“గృహ మొక రాజ్యంగా పరిపాలిస్తున్న స్త్రీమూర్తిగా ఒక సామ్రాజ్ఞి” అని రచయిత ఎందుకన్నది ?
జవాబు:
ప్రాచీనులు అధిక విద్యావంతులు కాని స్త్రీలకు విధ్యుక్త ధర్మాలను, లౌకిక జ్ఞానాన్ని, పురాణ పరిచయాన్ని, చారిత్రాత్మక విశేషాలను, వేదాంత తత్త్వాలనూ, వైద్య విషయాలనూ, పరంపరాగతమైన ఆచార వ్యవహారాలను, ఒకటేమిటి సకల శాస్త్రాలనూ పాటల ద్వారా బోధ చేశారు. ఈ పాటలే వారికి విద్యా పీఠాలు. అతి సహజమైన సాంఘిక జీవితానికి, కుటుంబ జీవితానికి ప్రతిబింబాలు.

ఆంధ్రుల నాగరికతకూ, సంస్కృతికీ మూలాధారాలైన పాటల వల్ల గృహిణి ఆశలూ, ఆశయాలూ, జీవితానందమూ, వాటికి సంబంధించిన వాతావరణము తప్ప మరొకటి లేదు. స్త్రీలు గృహ కృత్యాలు నెరవేర్చుకుంటూ పాటల ద్వారా తమ విధ్యుక్త ధర్మాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ పరమార్థిక చింతననూ కూడా సాధించారు.

పెద్దలపట్ల వినయ విధేయతలూ, భక్తి గౌరవాలూ, పిన్నల పట్ల వాత్సల్యమూ, పేదల పట్ల దయాదాక్షిణ్యాలూ, బంధుప్రీతి, అతిథి అభ్యాగతుల సత్కారము ఇటువంటివన్నీ గృహ వాతావరణంలో అబ్బిన సుగుణాలే. గృహమొక రాజ్యముగా పరిపాలిస్తున్న స్త్రీ మాతృమూర్తిగా ఒక సామ్రాజ్ఞిగా, నిండు మనసుతో గంభీరంగా నిబ్బరంతో ఎన్ని కష్టాలు వచ్చి మీద పడినా తన ఆదర్శాలను విడనాడకుండా తన సతతికి బోధిస్తుంది.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి. (2 × 8 = 16 మా.)

ప్రశ్న 16.
“ఏ లక్ష్యానికీ కట్టుబడక బతుకీడ్చుకుపోతే ఏం లాభం ?” అని కవి అన్న దానిని బట్టి నీకేమి అర్థమైంది ?
జవాబు:
“పక్షివంటి అల్పప్రాణులకు నీడనిచ్చినప్పుడే మబ్బులకు ఒక ప్రయోజనం కల్గుతుంది. అలాగే ఏవిధమైన లక్ష్యాన్ని పెట్టుకోకుండా సాదాసీదాగా బ్రతుకుతుంటే ఏం లాభం ? తోటి మానవులకు ఉపకారం చేసినప్పుడే నేర్చుకున్న చదువుకు ప్రయోజనం. వెట్టిచాకిరిపోయి, కష్టజీవుల బ్రతుకులకు ప్రయోజనం కలగాలి. ఇవన్నీ సాధించాలంటే స్వార్థాన్ని వదిలి పెట్టాలి. అప్పుడే ఆ మనిషి జీవితం సార్థకమవుతుంది.

మనం ఏర్పరచుకున్న లక్ష్యానికి ఆటంకాలు వస్తే మధ్యలో వదలివేయకుండా చివరి వరకు లక్ష్య సాధనకై కృషిచేయాలి. ఏ లక్ష్యానికి కట్టుబడని జీవితం తెగిన గాలిపటం వంటిది. నిరాశా నిస్పృహలకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. స్థిరమైన లక్ష్యంతో జీవనం గడిపేవారు సుఖశాంతులతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.

(లేదా)

“శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి – విమర్శిస్తాయి” – వివరించండి.
జవాబు:
సామాన్యంగా శతక కవులు తన కాలంనాటి సంఘంలోని మంచి చెడులను గూర్చి తమ పద్యాల్లో చెబుతారు. ఆ కవులు ” నాటి సంఘంలోని దురాచారాల్ని ఎత్తి చూపి విమర్శిస్తారు. నీటి మార్గాన్ని సంఘానికి బోధిస్తారు.

సుమతి శతకంలో నాటి సంఘంలోని మనుష్యులు, పరద్రవ్యాన్ని ఆశించి ఎలా బతుకుతున్నారో చెప్పాడు. వేమన శతకంలో ఆనాటి సమాజంలో పరద్రవ్యాన్ని ఆశించి, జోస్యాలు చెప్పడం, చాడీలు చెప్పడం, అబద్ధాలాడటం, వంకర మార్గంలో కీర్తిని సాధించే ప్రయత్నం చేయడం, హింసను ప్రేరేపించడం, వంటి పనులు చేస్తున్నారని చెప్పాడు. ఇది వేమన కాలంనాటి సమాజ ప్రతిబింబం అనడంలో వివాదం అక్కరలేదు.

అలాగే భాస్కర శతక కర్త మారద వెంకయ్య కూడా ఇంట్లో అత్తాకోడళ్ళ పోరాటాలు, కర్మశాలలో అలజడులు దళితుల పట్ల అగ్రవర్ణాల అరాచకాలు, మతహింస వంటి, నేటి సమాజంలోని లోపాలను ఎత్తి చూపి, వాటిని పరిహరించే మార్గాలను కూడా ఉపదేశించారు. ఈ పద్యం నేటి సమాజానికి చక్కని ప్రతిబింబం.

నేటి మనుష్యులలో అవినీతి, లంచగొండితనం, దురాచారాలు వంటి విషం పెరిగిపోయిందని, నరసింహ శతక కర్త ఈనాటి సంఘాన్ని గురించి దీనిలో విమర్శించారు.
కాబట్టి శతక పద్యాలు, సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయనీ, విమర్శిస్తాయనీ చెప్పడం యథార్థం.

ప్రశ్న 17.
సంఘ సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని పేర్కొనండి.
జవాబు:
అంటరాని వర్గాలు అనుభవిస్తున్న అవస్థల నుంచి వారిని గట్టెక్కించడానికి భాగ్యరెడ్డివర్మ అంకిత భావంతో కృషి చేశాడు. అణగారిన కులాల నాయకుల సహకారం, నైతిక మద్దతు కూడగట్టాడు. అంటరాని వర్గాల ఉన్నతి కోసం, సంస్కరణ మొదలుపెట్టాడు. మనుషులంతా సమానమని, ఎవరూ ఎక్కువ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్లు చేశాడు.

ఈయన శ్రద్ధవల్ల అంటరానివర్గాలు, చదువుపై చూపుపెట్టాయి. అందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయమయ్యాయి. అనేక బహిరంగ సభలు జరిపి, సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులకు ఏకదాటిపై నడిపించాడు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకున్నాడు. ప్రజలచే తాగుడు మాన్పించాడు. అనేక సభల్లో పాల్గొని 3348 ఉపన్యాసాలు ఇచ్చాడు. అణగారిన వర్గాల్లో చైతన్నాన్ని తేవడానికి కృషి చేశాడు. ఈయన కృషి వల్ల ఆది హిందువులకు, ప్రభుత్వం ఎన్నో పాఠశాలలు స్థాపించింది.

(లేదా)

పెంబర్తి కళాకారుల నైపుణ్య మెట్టిదో వివరించండి.
జవాబు:
పెంబర్తి కళాకారుల లోహాలలో హస్తకళా నైపుణ్యం చూపి, అపురూపమైన, అపూర్వమైన కళాఖండాలను సృష్టించారు. వారు ఇత్తడి రేకులపై నగిషీ, పురాణ, చారిత్రక గాథల చిత్రాలు, నృత్యభంగిమలు, సుందరంగా పూలు, లతలు చెక్కి ఇత్తడికి బంగారం లాంటి విలువ కలిగించే కళానిపుణులు.

ఈ కళా నైపుణ్యం తరతరాలుగా వంశపాంపర్యంగా సంక్రమించింది. కళాఖండాలను సృష్టించడం వారి నిత్య నైమిత్తికం. రాళ్ళపై ఉబ్బెత్తుగా మానవ, జంతు స్వరూపాలు, పూవులు, కాయలు, తీగలు చెక్కినట్లే, ఇత్తడి రేకుపై చెక్కుతారు. వారి కళారీతిలో కాకతీయ, లేపాక్షి శిల్ప శైలి తెలుస్తుంది. తెలంగాణా ప్రాంతంలోని పలు దేవాలయాలలోను, కోస్తాజిల్లాలో కొన్ని దేవాలయాలలో వీరి కళాసంపద ప్రస్ఫుటమౌతోంది. మహారాష్ట్రలోని తూల్జాభవాని దేవాలయం వీరి కళానైపుణ్యానికి కాణాచి.

ఇ) సృజనాత్మకత (8 మార్కులు)

అ) కింది ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి. (1 × 8 = 8 మా.)

ప్రశ్న 18.
పెంబర్తి కళాకారులు తయారుచేసిన కళాఖండాలను దర్శించిన తరువాత ఇద్దరు మిత్రులు పొందిన అనుభూతిని “సంభాషణ’ రూపంలో రాయండి.
జవాబు:
అనిల్ : ఏరా ! సునిల్ ! చూశావా ! పెంబర్తి గ్రామంలో హస్తకళా నైపుణ్యం.
సునిల్ : అవున్రా ! నిజంగా వీరు అపర బ్రహ్మలు కదా !
అనిల్ : అపురూపమైన, అపూర్వమైన కళాఖండాలను చూస్తుంటే మతిపోతుందిరా !’
సునిల్ : ఇటు చూడరా ! ఇత్తడి రేకులపై నగిషీ, పురాణ, చారిత్రక గాథల చిత్రాలు, నృత్య భంగిమలు, సుందరంగా పూలు, లతలు చెక్కిన దృశ్యాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.
అనిల్ : అవును. ఇదే మన భారతదేశ సంస్కృతికి దర్పణాలు.
సునిల్ : అవునవును. మనవారి హస్తకళల నైపుణ్యం ప్రపంచంలో ఎక్కడ లేదు.
అనిల్ : ఈ శిల్పులంతా విశ్వబ్రాహ్మణులు. గతంలో వీరి కుటుంబాలు 500 మేరకు ఉండేవట. కాని ఇప్పుడు 25 మాత్రమే ఉన్నాయట.
సునిల్ : అయినా తరతరాలుగా ఈ కళానైపుణ్యం వంశపారంపర్యంగా సంక్రమించిందిట.
అనిల్ : మొదట్లో బంగారం, వెండి రేకులపై చిత్రించారుట. కాని ఇప్పుడు ఇత్తడి రేకులపై వారి వారి నైపుణ్యాన్ని చూపిస్తున్నారు.
సునీల్ : అవును. ఇత్తడి రేకులపై చెక్కిన కళాఖండాలు బంగారంలా మెరిసిపోతున్నాయి.
అనిల్ : వీరు శిలలను శిల్పాలుగా మారుస్తున్నారు.
సునిల్ : వారి రక్తంలో కళాసంపద భావనా పటిమ సాంకేతిక విజ్ఞత ఇమిడిపోయాయి.
అనిల్ : అంతేకాదురా కళాఖండాలను సృష్టించడం వారి నిత్య నైమిత్తికం
సునిల్ : అటు చూడరా ! అక్కడ ఎన్నో కళాఖండాలున్నాయి. చూద్దాం పద !

ప్రశ్న 19.
స్త్రీల గొప్పతనాన్ని తెలిపే కథ తెలుసుకుని రాయండి.
జవాబు:
పూర్వం దశార్ణవ దేశంలో అవంతి నగరం కలదు. ఆ నగరంలో ఆగర్భ శ్రీమంతులెందరో ఉన్నారు. ఆ కుటుంబాల్లో అలకనందా దేవి అను ఒక పుణ్యవతి. తండ్రి వద్ద అనేక శాస్త్రాలు చదివింది. ఆమెకు క్షేమేంద్రనాథుని వద్దనున్న ఆస్థాన పండితులు ఎన్నెన్నో విద్యలు నేర్పారు. అలకనందాదేవి క్షేమేంద్రనాథుని ముద్దుల పట్టి. ఒకరోజున క్షేమేంద్రనాథుడు యుక్త వయస్సు వచ్చిన అలకనందాదేవికి వివాహం నిశ్చయించాడు. తగిన వరుని కోసం దేశాలన్నీ గాలించారు.

చివరకు ధరణీకోటలో నున్న విక్రమదేవ వర్మను గుర్తించి, ఆతని శౌర్య పరాక్రమాలకు మెచ్చి, అతనిని ఆహ్వానించి, దశార్ణవ దేశాధిపతియైన క్షేమేంద్రనాథుడు తన కూతురైన అలకనందాదేవి నిచ్చి వివాహం చేశాడు. కొలది కాలంలోనే క్షేమేంద్రుడు మరణించాడు. అలకనందాదేవి దశార్ణవ దేశానికి మహారాణి అయ్యింది. కన్నతల్లి వలే ప్రజలను బిడ్డలుగా చూస్తోంది. రాజ్యంలో ఎటువంటి అల్లకల్లోలు లేకుండా అపరాజితదేవిలా రక్షిస్తోంది. తన అనురాగడోలికల్లో భర్తకు సేవలు చేస్తుంది. తన తోడ పుట్టిన సోదరులకు ముద్దుల చెల్లిగా ప్రేమలను పంచుతోంది. దేశంలో ప్రజలందరూ అలకనందాదేవిని వేనోళ్ళ కొనియాడారు. ఒక స్త్రీ మూర్తిగా అన్ని విధాల తన బాధ్యతలను నిర్వహించింది.

ప్రశ్న 20.
మీకు నచ్చిన పండుగను గురించి వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

హైదరాబాదు,
X X X X X.

ప్రియమైన మిత్రునకు నమస్కారములు.
మిత్రమా !

నేను క్షేమము. నీవు క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. ఈ మధ్య జరిగిన అర్ధ సంవత్సర పరీక్షలో అన్ని సబ్జెక్టులలోను నూటికి 98, 99 అలా మార్కులు వచ్చాయి. నీవు బాగా చదువుతున్నావని తలుస్తాను.

మా ఇంట్లో నాకు నచ్చిన దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నాను. ఉదయాన్నే అభ్యంగన స్నానం చేశాను. తర్వాత కొత్తబట్టలు కట్టుకొని, మా తాతగారు చేసే నిత్యపూజలో పాల్గొన్నాను. ఆ తర్వాత నేను మా కుటుంబ సభ్యులతో పగటిపూట కాల్చే టపాకాయలు కాలుస్తూ ఎంతో ఆనందంగా గడిపాను. సాయంకాలం దీపాలను వెలిగించింది అమ్మ. ఆ తర్వాత నేను కాటన్ వస్త్రాలను ధరించి టపాకాయలు కాల్చాను. తీపి మిఠాయిలు మా అమ్మ పెట్టింది. మానసిక ఉల్లాసం కలిగించిందీ పండగు.

నీవు కూడా ఎలా జరుపుకున్నావో తెలియజేయగలవు.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. జగదీష్

చిరునామా :
S. ప్రదీప్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,’ సదాశివనగర్,
నిజామాబాద్ జిల్లా, తెలంగాణ.

పార్ట్ – B

సమయం : 30ని.లు
మార్కులు : 20

సూచనలు :

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు నిర్దేశించిన స్థలంలోనే రాయాలి.
  2. పూర్తి చేసిన పార్టు – బి పత్రాన్ని పార్టు – ఎ సమాధాన పత్రంతో జతపరచండి.

I. భాషాంశాలు (మార్కులు : 20)

అ) పదజాలం : (10 మార్కులు)

కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. (2 × 1 = 2 మా.)

ప్రశ్న 1.
విస్మరించు : ……………………
జవాబు:
విస్మరించు : ఎవ్వరూ కూడా తల్లిదండ్రులను విస్మరించరాదు.

ప్రశ్న 2.
మేటి : ………………….
జవాబు:
మేటి : విద్యార్థుల్లో రాముడు మేటిగా చదువుతాడు.

కింది ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి (A/B/C/D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (8 × 1 = 8 మా.)

ప్రశ్న 3.
వినాయకుని పెళ్ళికి అన్నీ విఘ్నాలే కదా. (గీత గీసిన పదానికి అర్థం)
A) ఆటంకాలు
B) ఆనందం
C) అమృతం
D) ఆతృత
జవాబు:
A) ఆటంకాలు

TS 10th Class Telugu (S/L) Model Paper Set 2 with Solutions

ప్రశ్న 4.
కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగనేరవు. (గీత గీసిన పదానికి అర్థం)
A) కూరలు
B) దోమలు
C) ప్రేమలు
D) భామలు
జవాబు:
C) ప్రేమలు

ప్రశ్న 5.
మేఘుడు ఆకాశంలో ఉంటాడు. మెయిలు నిండా నీరు ఉంటుంది. ఈ వాక్యాలలో పర్యాయపదాలు
A) అఘము, అమోఘము
B) ధర్మము, మర్మము
C) లలిత, కలిత
D) మబ్బు, మెయిలు
జవాబు:
D) మబ్బు, మెయిలు

ప్రశ్న 6.
అతని యింట సిరి కలదు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు).
A) గిరి, కరి
B) శ్రీ, లక్ష్మి
C) గుణి, మఱి
D) కోరుట, కారుట
జవాబు:
B) శ్రీ, లక్ష్మి

ప్రశ్న 7.
ప్రతి ఒక్కరూ ధర్మంగా నడవాలి. (గీత గీసిన పదానికి నానార్థాలు)
A) రతనము, కతనము
B) భవ్యము, దివ్యము
C) యత్నము, ప్రయత్నము
D) పుణ్యము, స్వభావము
జవాబు:
D) పుణ్యము, స్వభావము

ప్రశ్న 8.
తనూభవుడు – అనే పదానికి వ్యుత్పత్తి
A) తన శరీరము నుండి పుట్టినవాడు
B) తన శరీరానికి కారణమైనవాడు
C) తన శరీరమే మూలమైనవాడు
D) తేజోవంతమైన శరీరము కలవాడు
జవాబు:
A) తన శరీరము నుండి పుట్టినవాడు

ప్రశ్న 9.
అతనికి మతి సరిగ్గా పనిచేయదు. అతని మది నిండా దుర్మార్గ ఊహలే ఉన్నాయి. (ఈ వాక్యాలలో ప్రకృతి వికృతులు)
A) మదము – మది
B) మతి – మది
C) మతి – స్మృతి
D) భృతి – యతి
జవాబు:
B) మతి – మది

ప్రశ్న 10.
నిక్కము – దీనికి వికృతి
A) రాజము
B) భూజము
C) నిజము
D) సాజము
జవాబు:
C) నిజము

ఆ) వ్యాకరణాంశాలు : (10 మార్కులు)

కింది ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి (A/B/C/D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి. (10 × 1 =.10 మా.)

ప్రశ్న 11.
లవణము + అన్నము – ఇందులో పూర్వాచ్చు
A) ఉ
B) అ
C) ఇ
D) ఆ
జవాబు:
A) ఉ

ప్రశ్న 12.
సంఖ్యా పూర్వపదంగా సూచించే సమాసం.
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) సప్తమీ తత్పురుషము
C) ద్విగువు
D) ద్వంద్వము
జవాబు:
C) ద్విగువు

ప్రశ్న 13.
సమాసంలోని పూర్వపదము యొక్క అర్థం ప్రధానమైనదాన్ని ఏ సమాసం అంటారు ?
A) అవ్యయీభావము
B) కర్మధారయము
C) రూపకము
D) బహువ్రీహి
జవాబు:
A) అవ్యయీభావము

ప్రశ్న 14.
విశ్వదాభిరాము – ఈ పదం విడదీస్తే పర అచ్చు
A) ఉ
B) అ
C) ము
D) ఆ
జవాబు:
B) అ

TS 10th Class Telugu (S/L) Model Paper Set 2 with Solutions

ప్రశ్న 15.
వాడు బడికి వెళ్ళాడు. ఇందులో సర్వనామము
A) బడికి
B) వెళ్ళాడు.
C) వాడు
D) ఏదీకాదు
జవాబు:
C) వాడు

ప్రశ్న 16.
రాముడు సీతను వివాహమాడెడు – ఇది ఏ వాక్యం ?
A) కర్మణి
B) అసమాపక క్రియ
C) ప్రత్యక్షం
D) కర్తరి
జవాబు:
D) కర్తరి

ప్రశ్న 17.
రాముడు అన్నం తిన్నాడు. రాముడు బడికి వెళ్ళాడు. వీటిని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే .
A) రాముడు అన్నము తిని బడికి వెళ్ళాడు.
B) రాముడు అన్నము తినకుండా బడికి వెళ్ళాడు.
C) రాముడు అన్నం తిన్నాడు. కాని బడికి వెళ్ళలేదు.
D) రాముడు అన్నము తినలేదు. బడికి వెళ్ళలేదు.
జవాబు:
A) రాముడు అన్నము తిని బడికి వెళ్ళాడు.

ప్రశ్న 18.
రవి చెట్టు నాటి, నీరు పోశాడు. సామాన్య వాక్యాలుగా మార్చితే
A) రవి నాటాడు. చెట్టు నాటాడు. రవి నీరు పోశాడు.
B) రవి చెట్టు నాటాడు. రవి నీరు పోశాడు.
C) రవి చెట్టును నాటును. రవి చెట్టుకు నీరుపోయును.
D) రవి చెట్టు మరియు నీరు నాటాడు, పోశాడు.
జవాబు:
B) రవి చెట్టు నాటాడు. రవి నీరు పోశాడు.

ప్రశ్న 19.
ఆవులు గడ్డిని మేస్తున్నాయి. ఈ వాక్యంలో కర్మ
A) ఆవులు
B) గడ్డిని
C) మేస్తున్నాయి
D) ఏదీకాదు
జవాబు:
B) గడ్డిని

ప్రశ్న 20.
రహీం రాము ……….. పుస్తకం ఇచ్చాడు. విభక్తి ప్రత్యయంతో ఖాళీని పూరించుము.
A) కి
B) ను
C) అందు
D) న
జవాబు:
A) కి

Leave a Comment