AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

అలంకారం :
చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.
అలంకారాలు రెండు రకాలు : –
అ) శబ్దాలంకారాలు
ఆ) అర్థాలంకారాలు

అ) “శబ్దాలంకారాలు” :
శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు.”
కింది గేయాన్ని గమనించండి.
“అది గదిగో మే
మేడకున్నది గో
గోడ పక్కని నీ
నీడలో కోడె దూ
దూడ వేసింది పే

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది) ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం, వినసొంపు ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

1) అంత్యానుప్రాసాలంకారం :
ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు, వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ఉదా :
1) భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ

గమనిక :
పై కవితలో ప్రతివాక్యం చివర ‘క్తి’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ ‘కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.
2) గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము

పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతి పాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

అంత్యానుప్రాసాలంకారం : (లక్షణం) :
పాదాంతంలో లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని “అంత్యానుప్రాసాలంకారం” అంటారు.

కింది గేయాలు గమనించండి :
1) వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట

గమనిక :
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర, ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ ఉంది. కాబట్టి “అంత్యానుప్రాసాలంకారం” దీనిలో ఉంది.
2) తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుర్రపు కళ్ళెం

పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.

2) వృత్త్యనుప్రాసాలంకారం :
అక్షరం అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదా :
నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా ? నీవు నన్నే మన్నా అన్నావా ?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాస” అనే శబ్దాలంకారం.

అభ్యాసం :

  1. కా కి కో కికా దు దా !
  2. లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది.

వృత్త్యనుప్రాసాలంకారం (లక్షణం) :
మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాసాలంకారం”.

ఈ కింది వాక్యాలు చూడండి.

  1. ఆమె కడవతో వడి వడి అడుగులతో గడపను దాటింది.
  2. చిట పట చినుకులు టపటపమని పడుతున్నవేళ

గమనిక :
మొదటివాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ఓ’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.

ఈ క్రింది ఉదాహరణలు కూడా చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్ష భక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యం లక్ష్యమా.

లక్షణం :
ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే, దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

3. ఛేకానుప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.
ఉదా :
“నీకు వంద వందనాలు”.

పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ – నూరుసంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’, వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.

ఛేకానుప్రాస (లక్షణం) :
హల్లుల జంట అర్థ భేదంతో వెంట వెంటనే వస్తే, దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.

ఛేకానుప్రాసకు మరికొన్ని ఉదాహరణలు :
1) పాప సంహరుడు హరుడు
2) మహా మహీభారము

4. ముక్తపదగ్రస్త అలంకారం : ఇది శబ్దాలంకారం.
లక్షణం :
ఒక పద్యపాదం గాని, వాక్యం కాని ఏ పదముతో పూర్తి అవుతుందో, అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవుతుంది. దీన్ని “ముక్తపదగ్రస్త అలంకారం” అంటారు.
ఉదా :
జనకుడుండెడి యనుష్ఠాన వేదిక జూచు
చూచి క్రమ్మర బోయి జూడవచ్చు

గమనిక :
మొదటి పాదం చివర ‘చూచు’ అనే పదం ఉంది. రెండవ పాదం ‘చూచి’ అని ‘చూచు’తో మొదలయ్యింది. కాబట్టి ఇది ‘ముక్తపదగ్రస్త అలంకారం.
అ) ఉదా :
అది గదిగో మేడ
మేడ పక్కన నీడ
నీడలో ఉన్నది దూడ
దూడ వేసింది పేడ

గమనిక :

  1. మొదటి పాదం చివర ఉన్నది ‘మేడ’ అనే పదం. రెండవ పాదం మొదట తిరిగి ‘మేడ’ అనే అదే పదం వచ్చింది.
  2. అలాగే రెండవ పాదం చివర ‘నీడ’ అనే పదం ఉంది. మూడవ పాదం మొదటలో తిరిగి ‘నీడ’ అనే పదం వచ్చింది.
  3. మూడవ పాదం చివర ‘దూడ’ అనే పదం వచ్చింది. నాల్గవ పాదం మొదట్లో తిరిగి ‘దూడ’ అనే పదమే వచ్చింది.

వివరణ :
పాదం చివర విడిచిన పదం తిరిగి తరువాత పాదం మొదట్లో రావడం జరిగింది. కాబట్టి. ఇది “ముక్తపదగ్రస్త అలంకారం.”

అభ్యాసం :
కింది ఉదాహరణలు ఏయే అలంకారాలకు చెందినవో గుర్తించండి. సమన్వయం రాయండి.

ఆ) సుదతీ నూతన మదనా
మదనా గతురంగ పూర్ణమణిమయ సదనా
సదనామయ గజరదనా!
రదనాగేంద్ర నిభకీర్తిరస నరసింహా!

సమన్వయం :
పై పద్యంలో “ముక్తపదగ్రస్తం” అనే అలంకారం ఉంది.

ముక్తపదగ్రస్తాలంకారం (లక్షణం) :
ఒక పద్యపాదం గాని, వాక్యంకాని ఏ పదంతో పూర్తి అవుతుందో అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవుతుంది. దీన్ని “ముక్తపదగ్రస్త అలంకారం” అంటారు.

గమనిక : పై పద్యంలో

  1. మొదటి పాదం చివర ‘మదనా’ అని ఉంది. రెండవ పాదం మొదట్లో తిరిగి ‘మదనా’ అని మొదలయ్యింది.
  2. రెండవ పాదం చివర ‘సదనా’ అని ఉంది. మూడవ పాదం మొదట్లో ‘సదనా’ అని మొదలయ్యింది.
  3. మూడవ పాదం చివర ‘రదనా’ అని ఉంది. నాల్గవ పాదం తిరిగి ‘రదనా’ తో మొదలయ్యింది. ఈ విధంగా పాదం చివర ఉన్న శబ్దంతోనే, తిరిగి తరువాతి పాదం మొదలవుతోంది. కాబట్టి ఇది “ముక్తపదగ్రస్త అలంకారం”.

5. యమకం : ఇది శబ్దాలంకారం.
లక్షణం : ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడాన్ని ‘యమకాలంకారం’ అంటారు.
ఉదా :
మన సైనిక కాయము కాయము మరచి పోరాడుతున్నది.

గమనిక :
పై ఉదాహరణలో ‘కాయము’ అనే పదం, రెండుసార్లు వచ్చింది. ‘కాయము’ అనే శబ్దం ఇక్కడ అర్థభేదంతో ప్రయోగింపబడింది.

మొదటి ‘కాయము’ అనేది ‘నికాయము’ = బృందము అనే పదంలోని భాగం. రెండవ ‘కాయము’ అనగా ‘శరీరం’ అని అర్థం.

సమన్వయం :
ఇక్కడ ‘కాయము’ అనే శబ్దం అర్థభేదంతో తిరిగి ప్రయోగింపబడింది. కాబట్టి ఇది “యమకం” అనే శబ్దాలంకారం.

అభ్యాసం :
ఈ కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించి సమన్వయించండి.

ఆ) ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది.
సమన్వయం :
‘తోరణం’ అనే శబ్దం, ఈ వాక్యంలో రెండు సార్లు వచ్చింది. మొదటి ‘తోరణం’ అనే శబ్దానికి ద్వారానికి కట్టే అలంకారం అని అర్థం. రెండవ తోరణ శబ్దంలోని ‘రణం’, అంటే యుద్ధం అని అర్థం. ఈ విధంగా తోరణ శబ్దం అర్థం భేదంతో రెండుసార్లు వచ్చింది. కాబట్టి ‘యమకం’ అనే శబ్దాలంకారం పై వాక్యంలో ఉంది.

యమకం (లక్షణం) :
ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడాన్ని “యమకాలంకారం” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

6. లాటానుప్రాస : ఇది శబ్దాలంకారం.
లక్షణం :
ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.
ఉదా :

  1. హరి భజియించు చేయు హస్తములు హస్తములు
  2. దీనమానవులకు సేవ సేవ

గమనిక :
పై వాక్యాలలో హస్తములు, హస్తములు, సేవ, సేవ అని ఒకే పదం. అర్థంలో తేడా లేకున్నా, భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు.

వివరణ :

  1. ‘హస్తములు’ అనగా చేతులు, రెండవ సారి వచ్చిన ‘హస్తములు’ అనగా సార్థకమైన ‘హస్తములు’ అని అర్థం.
  2. ‘సేవ’ అనగా సేవ చేయడం . రెండవసారి వచ్చిన ‘సేవ’ అనగా ‘నిజమైన సేవ’ అని భావం.

అభ్యాసం :
ఈ కింది వాక్యంలో అలంకారాన్ని పేర్కొని సమన్వయించండి.
1) కమలాక్షునర్చించు కరములు కరములు.

సమన్వయం :
పై వాక్యంలో ‘కరములు’ అనే పదం రెండుసార్లు వచ్చింది. అర్థంలో భేదం లేదు. తాత్పర్యం మాత్రమే భేదం. కాబట్టి ఈ వాక్యంలోని శబ్దాలంకారం “లాటానుప్రాసం”.

లాటానుప్రాస అలంకారం (లక్షణం) :
ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని “లాటానుప్రాస అలంకారం” అంటారు.

అర్థాలంకారాలు :
అర్థ చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవి “అర్థాలంకారాలు.”

1. ఉపమాలంకారం :

  1. ఆమె ముఖం అందంగా ఉంది.
  2. అమె ముఖం చంద్రబింబంలాగ అందంగా ఉన్నది.

గమనిక :
పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉంది, అనే వాక్యం మనలను ఆకట్టుకుంటుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికిగాను అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.
ఉదా :
సోముడు భీముడివలె బలవంతుడు.

గమనిక :
ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)
2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3) బలవంతుడు – సమానధర్మం – (పోల్చడానికి వీలయిన సమాన గుణం)
4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

ఉపమాలంకారం :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే “ఉపమాలంకారం.”

2. ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం, “ఉత్ప్రేక్షాలంకారం.”
ఉదా :
ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.
ఉదా :

  1. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయో అన్నట్లు ఉన్నవి.
  2. ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.

పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు
2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)
అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము. కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారం.”

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

3. రూపకాలంకారం :
ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడమే, ‘రూపకాలంకారం’ అంటారు.
ఉదా :
‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో
1) ‘మనస్సు’ – అనేది ఉపమేయం.
2) వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ, మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.

అభ్యాసం :
కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.

  1. మా అన్న చేసే వంట నలభీమపాకం
  2. కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం

గమనిక :
మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికి భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికి భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి.

ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.

  1. లతాలలనలు రాజు పై కుసుమాక్షతలు చల్లారు.
  2. రుద్రమ్మ చండీశ్వరీదేవి జలజలా పారించే శాత్రవుల రక్తమ్ము.
  3. ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.
  4. మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.
  5. మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.

గమనిక : పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.

4. స్వభావోక్తి అలంకారం :
ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని “స్వభావోక్తి” అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తరి చూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగుచెంగున గెంతుతున్నాయి.

స్వభావోక్తికి మరియొక ఉదాహరణం :
1) ఆ లేళ్లు బెదురుచూపులతో నిక్కపొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.

సమన్వయం :
ఇక్కడ లేళ్ల యొక్క సహజ గుణాన్ని ఉన్నది, ఉన్నట్లుగా, కళ్లకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది స్వభావోక్తి’ అలంకారం.

5. “అతిశయోక్తి” అలంకారం.
లక్షణం :
ఉన్న విషయాన్ని, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పటాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.
ఉదా :

  1. మా చెల్లెలు తాటి చెట్టంత పొడవుంది.
  2. దేవాలయ గోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి.
  3. ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

సమన్వయం :
పై వాక్యాలలో చెల్లెలు ఎత్తును, గోపురం ఎత్తును, ఉన్న ఎత్తుకంటె ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారంతో చెప్పడం అంటారు.

భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై మూడవ వాక్యంలో గమనిస్తున్నాము.

అభ్యాసం :
ఈ కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
1) కం|| “చుక్కలు తలపూవులుగా
అక్కజముగ మేను పెంచి యంబరవీధిన్
వెక్కసమై చూపట్టిన
అక్కోమలి ముదము నొందె ఆత్మస్థితికిన్”

సమన్వయం :
పై పద్యంలో ‘అతిశయోక్తి’ అనే అలంకారం ఉంది.

భావం :
నక్షత్రాలు తన తలపై ధరించే పువ్వులుగా ఉండేటట్లు ఆశ్చర్యంగా హనుమంతుడు శరీరాన్ని పెంచాడు.

ఎంత ఎత్తు పెరిగినా ఆకాశంలో నక్షత్రాలను తాకేటట్లు పెరగడం జరగదు. కాబట్టి ఇది ‘అతిశయోక్తి’ అలంకారం.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

2) మా పొలంలో బంగారం పండింది.
సమన్వయం :
పై వాక్యంలో ‘అతిశయోక్తి’ అలంకారం ఉంది.

భావం :
పొలంలో బాగా పంట పండింది అని చెప్పడానికి, ‘బంగారం’ పండిందని అతిశయోక్తిగా చెప్పబడింది. కాబట్టి పై వాక్యంలో “అతిశయోక్తి” అనే అర్థాలంకారం ఉంది.

6. శ్లేషాలంకారం :

అ) 1) మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !
2) మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !

ఆ) మానవ జీవనం సుకుమారం
అర్థం :
1)మానవ (ఆధునిక) జీవితం సుకుమారమైనది.
2) మానవ (మనిషి) జీవితం సుకుమారమైనది.

పై అర్థాలను గమనించారు కదా ! ఒకే శబ్దం, రెండు వేరు వేరు అర్థాలను ఇస్తుంది. అంటే విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇలా ఉంటే ‘శ్లేషాలంకారం’ అంటారు.

శ్లేషాలంకారం (లక్షణం) :
నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష..

అభ్యాసం :
కింది అలంకారాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి.
1) రాజు కువలయానందకరుడు
అర్థం :

  1. చంద్రుడు కలువలకు ఆనందాన్ని ఇస్తాడు.
  2. రాజు భూమండలానికి సంతోషాన్ని ఇస్తాడు.

ఇక్కడ నానార్థాలు వచ్చాయి కాబట్టి ఈ వాక్యంలో శ్లేషాలంకారముంది.

2) నీవేల వచ్చెదవు?
అర్థం :
1) నీవు ఎందుకు వస్తావు?
2) నీవు ఏలడానికి వస్తావు.
ఇక్కడ నానార్థాలు వచ్చాయి. కాబట్టి శ్లేషాలంకారం ఉంది.

అలంకారములపై ప్రశ్నలు

1) ‘కుముదినీ రాగ రసబద్ద గుళిక యనగ చంద్రుడు దయించె’ ఈ వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకము
D) స్వభావోక్తి
జవాబు:
B) ఉత్ప్రేక్ష

2) “అనుచున్ జేవురు మీఱు కన్నుగవతో, నాస్పందదోష్ణంబుతో, ఘనహుంకారముతో, నటద్ర్భుకుటితో గర్జిల్లు నా ఫోన్ సలేశుని” ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) స్వభావోక్తి
D) వృత్త్యనుప్రాస
జవాబు:
C) స్వభావోక్తి

3) ‘నగారా మోగిందా, నయాగరా దుమికిందా’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) అంత్యానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) ఛేకానుప్రాస
D) యమకము
జవాబు:
A) అంత్యానుప్రాస

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

4) ‘హరిభజియించు హస్తములు హస్తములు’ ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి.
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) లాటానుప్రాస
D) ముక్తపదగ్రస్తము
జవాబు:
C) లాటానుప్రాస

5) ‘ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది’ ఈ వాక్యంలో గల అలంకారం గుర్తించండి. (B)
A) శ్లేష
B) యమకము
C) ఛేకానుప్రాస
D) ఉపమ
జవాబు:
B) యమకము

6) ‘మా పొలంలో బంగారం పండింది’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) స్వభావోక్తి
B) ఉపమ.
C) అతిశయోక్తి
D) రూపకము
జవాబు:
C) అతిశయోక్తి

7) ‘హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదుకదా’ ఈ వాక్యాలలో అలంకారం గుర్తించండి.
A) అర్ధాంతరన్యాస
B) ఉపమ
C) స్వభావోక్తి
D) యమకము
జవాబు:
A) అర్ధాంతరన్యాస

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

8) ‘నీ కరుణాకటాక్షవీక్షణములకై నిరీక్షించుచున్నారము’ ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
ఈ వాక్యంలో ‘వృత్త్యనుప్రాస’ అలంకారం ఉంది.
లక్షణం : ఒకే అక్షరము పలుమార్లు ఆ వృత్తియగుట వృత్త్యనుప్రాస.

9) “లేమా! దనుజుల గెలువగ లేమా?” ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
యమకము : లక్షణం : ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించడం యమకము.

10) ‘దేవాలయ గోపురాలు ఆకాశాని కంటుతున్నాయి. ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అతిశయోక్తి : విషయాన్ని ఉన్నదానికంటె ఎక్కువ చేసి చెప్పడం.

11) ‘మానవా? నీ ప్రయత్నం మానవా?’ ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
యమకము : ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించడం యమకం.

12) ‘మిమ్ము మాధవుడు రక్షించుగాక!’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
శ్లేష : నానార్ధములను కలిగి ఉండే అలంకారం శ్లేష.

13) “శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు. వీరులకు సాధ్యము కానిది లోకమున లేదు కదా” ఈ వాక్యాలలో గల అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అర్ధాంతర న్యాసాలంకారము : సామాన్యమును విశేషముచే కాని, విశేషమును సామాన్యముచే కాని సమరించుట.

14) ‘వాడు తాటిచెట్టంత పొడవున్నాడు’ ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : అతిశయోక్తి అలంకారం.
లక్షణం : విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం.

15) అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు నీట నిట్టలముగ నిట్టవొడిచె – అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : రూపకాలంకారము.
లక్షణం : ఉపమానోపమేయములకు, భేదము లేదని చెప్పడం రూపకము.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

16) ‘అడిగెదనని కడువడి జను, నడిగినఁదను మగుడ నుడుగడని నడయుడుగున్’, ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణం : ఒకే అక్షరం, పలుమార్లు ఆవృత్తి అవడం.

17) ‘మకరందబిందు బృందరసస్యందన మందరమగు మాతృభాషయే’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణం : ఒకే అక్షరం, పలుమార్లు ఆవృత్తి అవడం.

18) ‘తండ్రి హరిజేరుమనియెడి తండ్రి తండ్రి’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : ఈ పద్యంలో లాటానుప్రాసాలంకారము ఉంది.
లక్షణం : ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడం.

19) 1. ‘రాజు కవలయానందకరుడు’
2. నీవేల వచ్చెదవు- ఈ వాక్యాలలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : శ్లేషాలంకారం
లక్షణం : నానార్థాలను కలిగి ఉండే అలంకారము శ్లేష.

20) ‘హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. మహాత్ములకు సాధ్యం కానిది లోకమున లేదుకదా’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : అర్థాంతరన్యాసాలంకారం.
లక్షణం : విశేష విషయాన్ని సామాన్యంతో కాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కాని సమర్థించడం.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 1.
ఒక ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏమి ప్రశ్నించుతున్నారో ఆ ప్రశ్నల జాబితా వ్రాయండి.
జవాబు:

  1. స్త్రీ వాదము యొక్క ప్రాముఖ్యం ఏమిటి?
  2. స్త్రీలకు నేడు నిజంగానే స్వాతంత్ర్యం లేదా?
  3. స్త్రీలు నేడు సంఘంలో ఎదుర్కొంటున్న సమస్యలేమిటి?
  4. స్త్రీలకు పార్లమెంటులో రిజర్వేషన్లు ఇవ్వవలసిన అవసరం ఉందా?
  5. ‘స్త్రీలను స్త్రీలే కించపరుస్తున్నారు’ అంటే మీరు అంగీకరిస్తారా?
  6. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం వస్తే స్త్రీల సమస్యలు పోతాయా?
  7. స్త్రీలపై అత్యాచారాలకు స్త్రీల వేషభాషలు కారణమా?
  8. పురుషులు వంటగరిట చేతబడితే సమస్య పరిష్కారం అవుతుందా?
  9. స్త్రీలకు ఎటువంటి స్వాతంత్ర్యం కావాలి?
  10. స్త్రీలను భారతీయులు అనాదికాలం నుండి గౌరవిస్తున్నారని మీరు అంగీకరిస్తారా?

ప్రశ్న 2.
అనేక వ్యాధులకు కారణమవుతున్న దోమలను నివారించాలని తెలియజేస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:

దోమలపై దండయాత్ర
యువతీ యువకులారా ! ఆలోచించండి !

ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. దోమలను నివారిద్దాం. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. మురుగునీరు దోమలకు నిలయం. మురుగునీరు నిలవ ఉండకుండా చూద్దాం. నీటిలో కుళ్లిన ఆకులు, చెత్తా చెదారం వలన దోమలు వృద్ధి అవుతాయి. రోగాలు వ్యాపిస్తాయి. క్యూలెక్స్ జాతికి చెందిన ఆడదోమ వలన ఫైలేరియా వస్తుంది. ఆడ ఎనాఫిలస్ దోమ వలన మలేరియా వ్యాపిస్తుంది. డెంగ్యూ కూడా దోమల వలన వస్తుంది. అందుచేత దోమల నివారణకు నడుం బిగిద్దాం – రండి – తరలిరండి.

ఇట్లు,
ఆరోగ్య శాఖ

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 3.
స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలను గూర్చి వివరిస్తూ “కరపత్రం” తయారు యండి.
జవాబు:

మహిళాభ్యుదయం – కర్తవ్యం

సోదరులారా ! ఒక్కమాట ! –
మన సమాజంలో అనాది నుండి మహిళలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలను దేవతలగా భావిస్తాం. కాని రోజులు మారాయి. మనుషుల మనసులు మారాయి. పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు తగిన గుర్తింపు దొరకడం లేదు. అన్ని విధాలుగా వారిని అణగదొక్కడానికి పురుషులు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచిది కాదు. మనం స్త్రీల అభ్యున్నతికి కృషి చేయాలి. వాని కోసం మనం కొన్ని చర్యలు తీసుకోవాలి అవి :

  • స్త్రీలను అక్షరాస్యులుగా చేయాలి.
  • ఉద్యోగాల్లోను, రాజకీయ పదవుల్లోను తగిన రిజర్వేషన్ కల్పించాలి.
  • వృత్తి విద్యల శిక్షణను అందించాలి. సాంకేతిక విద్య పట్ల ప్రోత్సాహం కల్పించాలి.
  • స్త్రీలను చులకనగా చూడటం మానుకోవాలి.

ఇట్లు,
మహిళా రక్షణ సమితి,
కర్నూలు.

ప్రశ్న 4.
మరుగుదొడ్లు నిర్మించి, వినియోగించాలని కోరుతూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:

మరుగుదొడ్లు నిర్మిద్దాం – రోగాలు నివారిద్దాం

సోదరీసోదరీమణులారా !
మన గ్రామంలో మరుగుదొడ్ల వసతి లేక ఎంతోమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. దానిపై ఈగలు, దోమలు, సూక్ష్మజీవులు వాలతాయి. ఆ ఈగలు, దోమలు మనం తినే ఆహారంపై వాలతాయి. ఆ ఆహారం తినడం వల్ల మన ” ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.

అందుకే బహిరంగ మలవిసర్జన వద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. అవి ప్రజలను బాగా చైతన్యపరుస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం కూడా మినహాయింపుతో కూడిన ఋణం మంజూరు చేస్తుంది. కాబట్టి అందరు తమ ఇండ్లలో మరుగుదొడ్లను నిర్మించుకొని, వాటిని వినియోగించాలని కోరుతున్నాం. ఆ విధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొన్నవారమవుతాం. ‘మరుగుదొడ్లు నిర్మించుకొందాం – మంచి ఆరోగ్యంగా బ్రతుకుదాం’.
తేది : x x x x x

ఇట్లు,
ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి,
పాములపాడు.

ప్రశ్న 5.
బాలికల విద్య ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:

బాలికల విద్య – సమాజానికి ప్రగతి

తల్లిదండ్రులారా !
బాలికలు విద్యావంతులైనచో సమాజం వివేకవంతమవుతుంది. బాలికలు విద్యావంతులైనచో ప్రయోజనం ‘ఇంత’ అని చెప్పటానికి వీలులేదు.

ఇటీవలి కాలంలో రాజకీయ దాస్యంతోను, భావ దాస్యంతోను సంఘం మునిగి ఉంది. అందువల్ల బాలికల విద్య , చాలావరకు వెనుకబడి ఉంది.

‘ మనదేశానికి స్వాతంత్ర్యం సంపాదించుటకు గాంధీ ‘మహాత్ముడు తన నిర్మాణ కార్యక్రమంలో మహిళాభ్యుదయం: ప్రధానంగా చేర్చారు. బాలికల విద్యకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఆధునిక కాలంలో వీరేశలింగం పంతులుగారు స్త్రీ విద్యక మొట్టమొదటిగా ఒక పాఠశాలను పెట్టి కృషి చేశారు.

సాంకేతిక విద్యలో నైపుణ్యం సంపాదించుటకై బాలికలకు ప్రత్యేకంగా ‘పాలిటెక్నిక్’ కళాశాలను ఏర్పరిచారు. కనుక స్త్రీలు గృహకృత్యాలను నిర్వహించుటలో విద్యావంతులైనచో బహుముఖ ప్రజ్ఞను వెల్లడించి దేశ సేవలోను, సంఘసేవలోను రాణించగలడు. తమ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పుటలో శ్రద్ధ వహించి వారిని సత్పురుషులుగా తీర్చిదిద్దుతారు. కనుక బాలికల విద్యను ఇతోధికంగా ప్రోత్సహించినచో దేశానికి, సమాజానికి శ్రేయస్సు కల్గుతుంది.

ఇట్లు,
బాలికల విద్యా ప్రోత్సాహక సంఘము
శ్రీకాకుళం.

ప్రశ్న 6.
వందేమాతరానికి వందేళ్ళు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

“వందేమాతరం” కరపత్రం

సోదర భారతీయులారా ! మనమందరం, పవిత్ర భారతమాత కన్నబిడ్డలం. మన దేశ స్వాతంత్ర్య పరిరక్షణకై మనమంతా మన ప్రాణాల్ని సైతం ధారపోయడానికి సిద్ధం కావాలి.

మన భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికై జరిగిన స్వాతంత్ర్య పోరాటానికి ‘వందేమాతరం’ గీతం శంఖారావం చేసింది. బంకించంద్ర ఛటర్జీ ఆ వందేమాతరం గీతం రాసి నేటికి నూరు సంవత్సరాలు అయ్యింది. ఆనాడు దేశమంతా ఆ గీతాన్ని అంది పుచ్చుకొని, “వందేమాతరం మందే రాజ్యం” అంటూ గొంతెత్తి నినాదం చేసింది. బ్రిటిష్ వారిని తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టింది.

ఆనాడు గాంధీజీ, నెహ్రూ, తిలక్, పటేలు వంటి నాయకులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్ర్యం భిక్ష పెట్టారు. ఈనాడు మనం హాయిగా వందేమాతరం గీతాన్ని జాతీయగీతంగా గొంతెత్తి పాడుకుంటున్నాము. ఆనాడు ‘వందేమాతరం’ అంటే నేరం.

మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టిన ‘వందేమాతరం గేయం యొక్క స్ఫూర్తిని కాపాడుకుందాం” మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా, పాకిస్తాన్ దేశాల పొగరును అణచివేద్దాం. మనమంతా ఒక్కొక్క సైనికునిలా ‘కదంతొక్కుదాం. దేశభక్తియే మనకు జీవం. మరువకండి. మనమంతా భరతమాత వీరపుత్రులం. వీర పుత్రికలం.

‘జైహింద్’.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 7.
ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మానవాళి నీటిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవలసిన అవసరం ఉంది. నీటిని దుర్వినియోగం చేయకుండా తీసికోవలసిన జాగ్రత్తలు, ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

నీటి పొదుపు – తీసుకోవలసిన జాగ్రత్తలు (కరపత్రం)

సోదర సోదరీమణులారా!
నేడు మన దేశంలో జనాభా పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం వల్ల, వర్షాల రాక తగ్గింది. ప్రతి నీటి బిందువును మనం సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

అడవులు తగ్గిపోతున్నాయి. వర్షాలు బాగా తగ్గాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నదీ జలాలు సముద్రాల పాలవుతున్నాయి. మనం నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి.

వ్యవసాయదారులు బిందు సేద్యాన్ని చేయాలి. ప్రతి ఇంటిలో ఇంకుడు కుంటలు ఏర్పాటు చేయాలి. వృథాగా కారిపోతున్న కుళాయిలను కట్టివేయాలి. నదులు, చెరువులు, కుంటలు లోని నీటిని కలుషితం చేయరాదు. వర్షపు నీటిని సైతం నేలలో ఇంకేటట్లు చేయాలి.

ఒక నీటి చుక్కను పొదుపు చేస్తే, అది మరో ప్రాణి ప్రాణాన్ని నిలుపుతుంది. అనవసరంగా నీటిని వదలి పెట్టరాదు. స్నానం చేసిన నీటిని, మొక్కలకు పోయాలి. ఆ నీటితో అంట్లు తోముకొని, శుభ్రం చేసుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. దుర్వినియోగం చేయవద్దు. మరువకండి.

ఇట్లు,
యువజన విద్యార్థి సంఘం.

ప్రశ్న 8.
మీ పాఠశాల వార్షికోత్సవానికి ప్రముఖులు వస్తున్నారు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి
(లేదా )
మీ పాఠశాలను సందర్శించిన కవి/ కవయిత్రిని ఇంటర్వ్యూ చేయడానికి తగిన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
‘ప్రశ్నావళి’ – ప్రముఖులతో ఇంటర్వ్యూ : –

  1. పూజ్యులయిన మీకు వందనాలు. సుస్వాగతము.
  2. నేటి పాఠశాల విద్యపై మీ అభిప్రాయం చెప్పండి.
  3. నేటి పాఠశాల విద్యలో మీరు గమనించిన లోపాలను చెప్పండి.
  4. నేటి బాలబాలికల విద్యాభివృద్ధికి మీరిచ్చే సూచనలు చెప్పండి.
  5. మా విద్యార్థులలో మంచి అలవాట్లు పెంపొందడానికి మీరిచ్చే సలహాలు ఏమిటి ?
  6. నిరుద్యోగ సమస్య పై మీ అభిప్రాయాలు చెప్పండి.
  7. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను సూచించండి.
  8. మీరు నేడు గొప్ప వారయ్యారు. మీ అభివృద్ధికి కారణమైన సంఘటనలు తెల్పండి.
  9. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందడానికి, మీరిచ్చే సూచనలు తెలపండి.
  10. విద్యార్థులను ఆశీర్వదిస్తూ రెండు మాటలు చెప్పండి.

ప్రశ్న 9.
పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వస్తున్నారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనల గురించి, తెలిసికోడానికి పిల్లలు ఇంటర్వూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ప్రశ్నావళి రూపొందించండి. ..
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి

  1. శతక కవులకు స్వాగతం. ‘శతకాలు’ ఎన్ని రకాలు?
  2. తెలుగులో మొదటి శతకకర్త ఎవరు?
  3. శతకాల్లో ఎన్ని రకాలున్నాయి?
  4. మకుటం లేని శతకాలు ఏమైనా ఉన్నాయా?
  5. నీతి శతకాల ప్రాముఖ్యత ఏమిటి?
  6. భక్తి శతకాలు మీరు ఏమైనా రాశారా?
  7. ‘కాళహస్తీశ్వర శతకం’లో భక్తి ఎక్కువగా ఉందా? రాజదూషణ ఉందా?
  8. ‘సుమతి శతకం’ ప్రత్యేకత ఎటువంటిది?
  9. వసురాయకవి గారి భక్త చింతామణి శతకం గూర్చి చెప్పండి.
  10. మీకు నచ్చిన శతకం ఏమిటి?
  11. మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?
  12. ఛందోబద్దం కాని శతకాలు ఏమైనా ఉన్నాయా?

ప్రశ్న 10.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంగా మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళామణులారా! ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం, పైపైకి’ అన్న శ్రీశ్రీ మాట మరచిపోకండి. ఈనాడు మనపట్ల సంఘం ఎంతో వివక్షత చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందని తెలిస్తే, తల్లిదండ్రులు విలవిల లాడుతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు.

తండ్రి ఆస్తిలో స్త్రీలకు మగవారితో సమాన వాటాలు ఇవ్వడం లేదు. పేపరు తిరగవేస్తే, స్త్రీల మానభంగాల వార్తలు, టి.వి. పెడితే స్త్రీలకు జరిగిన అన్యాయాలు, అత్తవారింట స్త్రీల కష్టాలు, వరకట్నాల చావులు కనబడతాయి. వినబడతాయి. — పసిపిల్లల నుండి పండు ముదుసళ్ళు వరకు అత్యాచారాలకు గురి అవుతున్నారు.

స్త్రీలంతా కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేసే మగవారి చెంపలు పగుల కొట్టాలి. నిర్భయంగా పోలీసు వారికి రిపోర్టు చెయ్యాలి. మీరు పొరపాటున అన్యాయానికి గురి అయితే, సిగ్గుతో చితికిపోవద్దు. ధైర్యంగా నిలవండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి. బాగా చదవండి. ఉద్యోగాలు చేయండి. మనం ఈ దురాచారాల్ని ఖండిద్దాం.

అన్యాయం జరిగిన తోటి స్త్రీలకు, మనం అండగా నిలవాలి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, ఆనందించే రోజు రావాలి. అందుకు మనమంతా చేయి చేయి కలిపి పోరాడుదాం. ఝాన్సీ లక్ష్మీబాయిలా, సరోజినీ దేవిలా దుర్గాబాయమ్మలా తలలెత్తి నిలుద్దాం. ధైర్యమే మనకు శ్రీరామరక్ష.

ఇట్లు,
వనితా సంఘం.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 11.
‘మహిళల రక్షణ మన కర్తవ్యం’ అనే అంశముపై కరపత్రం రాయండి..
జవాబు:

‘మహిళల రక్షణ – మన కర్తవ్యం’

సోదర సోదరీమణులారా ! చెప్పడానికి సిగ్గువేస్తోంది. దేశంలో ఎక్కడో అక్కడ రోజూ స్త్రీలపట్ల అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపాపలపై, యువతులపై, ముసలి స్త్రీలపై సైతం అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీలపై యాసిడ్ దాడులు, ఈవ్ టీజింగ్, మానభంగాలు, హింసాకృత్యాలు నిత్యం జరుగుతున్నాయి.

మన ఇంట్లో మన తల్లిని అక్కచెల్లెళ్ళను మనం కాపాడుకుంటున్నాం. అలాగే ప్రతి స్త్రీని మనం కాపాడాలి. మహిళలకులు అన్యాయం జరిగితే ఎవరూ సహించరు అనే విషయం దుండగులకు గట్టిగా తెలియపరచాలి.

మహిళలపట్ల అకృత్యం జరిగితే మీరు ఉగ్రనరసింహరూపం ధరించి దుండగులను చీల్చిచెండాడండి. పోలీసువారికి కబురు అందించండి. ప్రక్కవారి సాయం తీసుకోండి. మన సోదరీమణులను మనమే రక్షించుకుందాం.

స్త్రీలు భారతదేశ భాగ్య కల్పలతలు. ప్రతి ఒక్కడూ స్త్రీల రక్షణకు ఉద్యమిస్తే ఎవరూ వారిపట్ల దుర్మార్గానికి సిద్ధం కారు. లెండి ఉద్యమించండి. దుర్మార్గులను చీల్చి చెండాడండి. మన అక్క చెల్లెండ్రను మనమే కాపాడుకుందాం.

ఇట్లు,
యువజన సంఘం.

12. ఉపాధ్యాయులను గౌరవించాలని ప్రబోధిస్తూ ఒక కరపత్రాన్ని సిద్ధం చేయండి.
జవాబు:

“ఆచార్య దేవో భవ”

సంఘములో మానవుల అభివృద్ధికి తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రధానపాత్ర వహిస్తారు. అందుకే మన ఉపనిషత్తులు ‘ఆచార్య దేవోభవ’ అని గురువును దైవంగా సేవించమని చెప్పాయి.

గురువులు తమకు అప్పగించిన విద్యార్థులకు ఎంతో కష్టపడి విద్యను బోధించి, వారిని విజ్ఞానవంతులుగా తీర్చి దిద్దుతారు. అందువల్ల విద్యార్థులు, వారి తల్లితండ్రులూ గురువులను గౌరవించాలి. అందుకే సర్.యస్. రాధాకృష్ణన్ గారు తన పుట్టిన రోజును, అధ్యాపక దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. ఆనాడు ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానిస్తాయి.

ఉపాధ్యాయులను ఆ రోజు ప్రతి గ్రామంలో, నగరంలో పెద్దలు సన్మానించాలి. విద్యార్థులు సైతం కృతజ్ఞతా పూర్వకంగా గురువులను అభినందించి సత్కరించాలి. పూర్వకాలంలో సైతం మహారాజులు గురువులకు ఈనాములిచ్చి పెద్ద గౌరవమిచ్చి, వారిని పోషించేవారు. మనది ప్రజా ప్రభుత్వము. అందువల్ల ప్రజలే అధ్యాపకులను “గురుభ్యోనమః” అని వారిని సత్కరించాలి.

ప్రశ్న 13.
‘మొక్కల పెంపకం’ ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:

“వృక్షముల పెంపకం”

చెట్లు జీవన సౌభాగ్యానికి మెట్లు. నేడు నగరాలు, గ్రామాలు కూడా, పర్యావరణ కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రజలంతా రోగాలతో డాక్టర్ల వెంట తిరుగుతున్నారు. దీనికి కారణం దేశంలో పచ్చని చెట్లు తక్కువ కావడమే.

చెట్లు బొగ్గుపులుసు వాయువును పీల్చి, ప్రాణవాయువును మనకు అందిస్తాయి. పూలను, పండ్లను ఇస్తాయి. చల్లని నీడను, గాలిని ఇస్తాయి. పర్యావరణ కాలుష్యం నుండి మనలను కాపాడతాయి.

కాబట్టి ప్రతి వ్యక్తి ఒక్కొక్క చెట్టును పాతి పెంచాలి. ప్రభుత్వము మంచి మొక్కలను ప్రజలకు ఉచితంగా ఇచ్చి వాటిని పాతించాలి. మొక్కలను పెంచి, వాటికి రక్షణ కల్పించాలి. దేశంలో సహితం అడవుల విస్తీర్ణం నేడు తగ్గిపోయింది. అందుకే మనకు వర్షాలు లేవు.

ప్రతి పంచాయితీ వారు మునిసిపాలిటీ వారు, మొక్కలను ఖాళీ ప్రదేశాల్లో పెంచాలి. మొక్కలను పెంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గిరిజనులను ప్రోత్సహించి అడవులలో మొక్కలు పెంచాలి. మనమంతా మొక్కలను పెంచుదాం. మన దేశాన్ని సస్యశ్యామలం చేద్దాం.

ఇట్లు,
నగర రక్షణ సమితి.

ప్రశ్న 14.
అనాథ బాలబాలికలను ఆదుకోవాలని ప్రబోధిస్తూ ఒక కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:

“అనాథ రక్షణ”

మిత్రులారా ! దిక్కులేని వారిని మనం అనాథలు అంటున్నాము. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. ఈనాడు ఎన్నో కారణాల వల్ల కొంతమంది, అనాథలు అవుతున్నారు. తల్లిదండ్రులు ప్రమాదాల్లో మరణించడం జరుగుతుంది. భయంకర వ్యాధుల వల్ల తల్లిదండ్రులు మరణించవచ్చు.

మానవ సేవయే మాధవ సేవ. మనకు భగవంతుడే సంపదలు ఇస్తున్నాడు. మనకు ఉన్నదానిలో కొంత మొత్తం దీన జన సేవకు వినియోగిద్దాం. మన నగర ప్రజలంతా అనాథ రక్షణ సంఘంగా ఏర్పడదాం.

మనం అన్నం వండుకునే ముందు, రెండు గుప్పిళ్ళు బియ్యం వేరే పాత్రలో ఉంచుదాం. ఆ బియ్యాన్ని పోగుచేసి అనాథలకు భోజనాలు పెడదాం. వారికి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేద్దాం. డబ్బున్న వారి నుండి చందాలు వసూలు చేద్దాం. మన నగరం చైర్మెన్ గారి సాయం తీసుకుందాం. అనాథలకు చదువులు చెప్పిదాం. వారికి పుస్తకాలు, బట్టలు ఇద్దాం.

మనం అనాథలను ఆదుకుంటే, భగవంతుడు మనలను రక్షిస్తాడు. సిరిసంపదలిస్తాడు. అనాథలకు మనమంతా తల్లిదండ్రులు అవుదాం. కదలండి. ఒక మంచి పని చేద్దాం.
విజయవాడ,
x x x x x

ఇట్లు,
అనాథ పరిరక్షణ సమితి.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 15.
‘చెట్టు – నీరు’ పథకం గురించి, ప్రజలందరూ దానిలో పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:

‘చెట్టు – నీరు పథకం’

ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత. మనకు చాలాకాలంగా మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు.

ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయిపోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్రమవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్టు – నీరు పథకం మొదలు పెట్టింది. దీనిలో ప్రజలంతా పాల్గొవాలి. తమ ఊరిలో చెరువు వారు బాగు చేసుకోవాలి. ప్రజలందరికీ నీరు పుష్కలంగా లభించేలా చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

ప్రశ్న 16.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారిమీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళలారా! “పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి” అన్న శ్రీశ్రీ మాట మనం మరచి పోకూడదు. ఈనాడు స్త్రీల విషయంలో సంఘం ఎంతో వివక్ష చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందంటేనే తల్లిదండ్రులు అతలాకుతలం అయిపోతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు. ‘స్త్రీలను గౌరవిద్దాం’ అనే బోర్డులు మాత్రమే కాని, బస్సుల్లో సహితం ఆడవాళ్ళకు సీట్లు దొరకడం లేదు.

స్త్రీలకు ఉద్యోగాల్లోనూ, చదువుకోడానికి సీట్లు ఇవ్వడంలోనూ రిజర్వేషన్లు సక్రమంగా అమలుకావడం లేదు ‘అభయ’ చట్టం వచ్చినా పసిపిల్లలు సహితం అత్యాచారాలకు గురి అవుతున్నారు.

ఆడపిల్లలందరూ కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేస్తున్న మగవాడి చెంప పగులకొట్టండి. అవమానం జరిగితే నిర్భయంగా అధికారులకు రిపోర్టు ఇవ్వండి. పొరపాటున అన్యాయానికి గురయితే సిగ్గుతో చితికిపోకండి. ధైర్యంగా నిలబడండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి.

ఒక స్త్రీ అన్యాయానికి గురయితే, మిగిలిన ఆడవాళ్ళంతా ఆమెకు అండగా నిలవండి. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లు అని తల్లిదండ్రులు ఆనందించేలా చేయండి. ఉద్యోగం సంపాదించండి. తల్లిదండ్రులకు అండగా నిలవండి. సంఘబలం కూడగట్టి, దుర్మార్గులను శిక్షించండి. ప్రభుత్వం ఆదుకోకపోతే, వనితా సంఘాల, స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోండి. ఝాన్సీలక్ష్మీబాయిలా, రాణి రుద్రమలా, సరోజినీ దేవిలా, దుర్గాబాయమ్మలా తలలెత్తి నిలవండి.

దివి. x x x x x

ఇట్లు,
గుంటూరు వనితా సంఘం.

ప్రశ్న 17.
మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణిస్తూ కరపత్రం రాయండి.
జవాబు:

మా పాఠశాల

మా పాఠశాల ఐదు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. పాఠశాల భవనంలో 12 గదులున్నాయి. గదులన్నింటిలో పంఖాలు, ట్యూబ్ లైట్లు ఉన్నాయి. పిల్లలకు కావలసిన బెంచీలున్నాయి. ప్రతి తరగతి గదిలో గోడమీద నల్లబల్లలు ఉన్నాయి. మా అధ్యాపకులకు వేరుగా ఒక గది ఉంది. అక్కడ మంచినీటి ఫిల్టరు ఉంది. దాని ప్రక్క గదిలో మా ప్రధానోపాధ్యాయులు ఉంటారు. ప్రధానోపాధ్యాయుల గదిలో దేశనాయకుల, దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నాయి.

పాఠశాల ఆఫీసు వారికి వేరే గది ఉంది. అక్కడ గుమాస్తాలు కూర్చుంటారు. పిల్లలందరికీ మంచినీటి సదుపాయం, పాయిఖానా ఏర్పాట్లు ఉన్నాయి. తూర్పు వైపున మంచి పూలతోట ఉంది. ఆ తోటలో మల్లి, మొల్ల, కనకాంబరం, చేమంతి పూలచెట్లున్నాయి. ఈ మధ్యనే గులాబీ మొక్కలు కూడా నాటారు.

ఆటస్థలంలో అన్నిరకాల కోర్టులూ ఉన్నాయి. క్రికెట్ ఆడుకొనే సదుపాయాలు ఉన్నాయి. పాఠశాలకు వేరుగా గ్రంథాలయం ఉంది. అక్కడకు రోజూ 2, 3 పత్రికలు వస్తాయి. విశ్రాంతి సమయంలో మేము అక్కడ కూర్చుని వాటిని చదువుతాము.

మా గ్రామ ప్రజలు పాఠశాల అభివృద్ధికి బాగా సాయం చేస్తారు. మేము పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతాం. ఆ పాఠశాల మాకు రెండవ తల్లి వంటిది.

ప్రశ్న 18.
మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి/ జంతువు గురించి మీరు ఒక కథనాన్ని రాయండి.
జవాబు:

“ధోని” (కుక్కపిల్ల)

మా పక్క ‘ఇంటివాళ్ళకూ కుక్కపిల్లలంటే మహాప్రేమ. ‘తనను పెంచుకుంటున్న యజమానిపై విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జంతువు కనబడదు. మా పక్కింటి అబ్బాయి ఒక కుక్కను పెంచుకోవాలని ఆశపడుతున్నాడు.

వాళ్ళింట్లో ఒక కుక్క, గర్భవతిగా ఉంది. ఒక రోజున దానికి మూడు పిల్లలు పుట్టాయి. అందులో ఒక పిల్ల అందంగా. తెల్లగా పాలరంగులో ఉంది. దానికి మంచి బొచ్చు ఉంది. దాన్ని చూస్తే ముద్దుగా ఉంది. దానికి ధోనీ అని పేరు పెట్టాలని ఆ పిల్లవాడి ఆశ. ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్రికెట్ అంటే బాగా ఇష్టం. అందుకే ముద్దు వచ్చే ఆ కుక్క పిల్ల ధోనీగా మారింది.

ఆ ధోనీ అంటే దాని తల్లికి బాగా ఇష్టం. ధోనీకి, దాని తల్లి కుక్క, కడుపునిండా పాలిచ్చేది. ధోనీ తోకను ఊపుతూ కులాసాగా మా వీథిలో తిరుగుతూ ఉంటుంది. ‘ధోనీ’ అంటే మా వీధి వాళ్ళంతా ఇష్టపడతారు. దానికి మా పక్కింటబ్బాయి స్నానం చేయించి పాలు, బిస్కట్లు, కోడిగుడ్లు, మాంసం పెడతాడు. ధోనీ క్రమంగా టైగర్ లా పెరిగింది.

ఒక రోజున ‘ధోనీ’ వాళ్ళింట్లోకి అడుగుపెడుతూ ఉన్న దొంగపైకి దూకి వాడి పిక్క పట్టుకొంది. అది చూసిన మా పక్కింటి అబ్బాయి ‘ధోనీ’ అని ప్రేమగా పిలిచాడు. అంతే! దొంగను వదలి తోక ఊపుకుంటూ, ఆ అబ్బాయి దగ్గరకు అది పరుగుపెట్టింది. ‘ధోనీ’ని పోలీసు కుక్కగా చేయాలని మా పక్కింటి అబ్బాయి చూస్తున్నాడు.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 19.
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రం రాయండి. .
జవాబు:

ప్రపంచశాంతి

మిత్రులారా ! ఈ విషయాన్ని గూర్చి ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాలకోసం దెబ్బలాటలకు దిగి, తలలు బద్దలుకొట్టుకోకండి. న్యాయస్థానాలకు వెళ్ళి డబ్బు తగులబెట్టకండి. మనది గాంధీ, బుద్ధుడు, జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంతి బోధలు తలకు ఎక్కించుకోండి.

ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. ఇంకా ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాలవల్ల ఎంతో ధనవ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు, అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి.

కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులంతా సోదరుల వలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం మనకు మంచిదారిని చూపిస్తాయి. శాంతి మంత్రాన్ని అంతా జపిద్దాం. సరేనా?

ఇట్లు
ప్రపంచ బాలబాలికల సంఘం.

ప్రశ్న 20.
ధనము ఉన్నవాళ్ళు దానం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అనాథశరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకూ, వదాన్యులకూ ఒక కరపత్రం ద్వారా విజ్ఞప్తి చేయండి.
జవాబు:

విజ్ఞప్తి

సోదర సోదరీమణులారా ! మనం అందరం భగవంతుని బిడ్డలం. మనలో కొందరు బీదవారుగా, దిక్కులేనివారుగా ఉన్నారు. వారికి మనతోపాటు బతికే హక్కు ఉంది. మనలో డబ్బు ఉన్నవారు ఉన్నారు. మనం పుట్టినపుడు ఈ డబ్బును మన వెంట తేలేదు. రేపు చనిపోయినపుడు ఈ ధనాన్ని మనం వెంట తీసికొని పోలేము.

మనం ఎంత లక్షాధికారులమైనా బంగారాన్ని తినము. డబ్బున్నవారమని గర్వపడడమే కాని, కూడబెట్టిన దాన్ని అంతా మనం తినలేము – ఎవరికీ దానధర్మాలు చేయకుండా బ్యాంకుల్లో దాస్తే ఆదాయం పన్ను వాళ్ళు తీసుకుపోతారు.

కాబట్టి మనతోటి దరిద్రనారాయణులకూ, దిక్కులేని ముసలివారికీ తోడ్పడండి. మీ డబ్బును విరివిగా వృద్ధాశ్రమాలకు చందాలుగా ఇవ్వండి. లేదా మీరే అనాథశరణాలయాలు స్థాపించండి.

‘మానవసేవయే మాధవసేవ’ అని గుర్తించండి. తోటివారికి మనం డబ్బు ఇచ్చి తోడ్పడితే, దైవకృప మనకు తప్పక లభిస్తుంది. లోభిత్వం విడువండి. వదాన్యులై విరివిగా విరాళాలు ప్రకటించండి. భగవంతుడు నాకు మంచిబుద్ధిని ప్రసాదించాలి.

ఇట్లు,
మీ తోడి సోదరసోదరీమణులు.

ప్రశ్న 21.
వివాహాల్లో చేయవలసిన సంస్కరణల గూర్చి కరపత్రం తయారుచేయండి.
జవాబు:

వివాహాలలో చేయవలసిన సంస్కరణలు

మిత్రులారా ! ఈ రోజుల్లో పెండ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు. వేలమందికి విందులు చేస్తున్నారు. కల్యాణ మండపాల అలంకరణలకు, దీపాల అమరికకు, చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కట్నాలు, . బహుమతులు పెరిగిపోయాయి. వధూవరులను వెతకడం, జాతకాలు చూపించడం వంటి వాటికి, ఖర్చులు పెరిగిపోయాయి.

  1. పెండ్లిళ్ళు దేవుని మందిరాలలో అలంకరణల ఖర్చు లేకుండా చేయాలి.
  2. ఎవరింట వారు భోజనాలు చేసి ముహూర్తానికి గుడికి వచ్చి పెళ్ళి పూర్తి చేయాలి. విందులు ఏర్పాటు చేయరాదు.
  3. కట్నాలూ, బహుమతులూ పూర్తిగా మానివేయాలి. ఊరేగింపులు మానుకోవాలి.
  4. విలాసాలకు ఖర్చు చేయరాదు. పెళ్ళికి మంగళసూత్రం, వధూవరులు ముఖ్యం అని గుర్తించాలి.
  5. రిజిష్టర్డు వివాహాలు చేసుకుంటే మరింత కలిసి వస్తుంది. వధూవరులూ వారి తల్లిదండ్రులూ రిజిస్ట్రార్ వద్దకు చేరి, అవసరమైన ఏర్పాట్లతో పెండ్లి తంతు ముగించాలి. పెళ్ళి పేర దుర్వ్యయం చేయకండి.

ఇట్లు,
మిత్ర సమాజం.

ప్రశ్న 22.
మీ పాఠశాలలో ప్రపంచ శాంతి అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ, నిర్వహణకు, విద్యార్థులను ఆహ్వానిస్తూ – కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ప్రపంచశాంతి మిత్రులారా !

“తన సొంతమె తనకు రక్ష’ అని సుమతీశతకకారుడు చెప్పాడు. ఇది వ్యక్తులకే కాదు దేశాలకు అంటే దేశ ప్రజలకు కూడా వర్తిస్తుంది.

మనది గాంధీ, బుద్ధుడు, జవహర్ లాల్ నెహ్రూ వంటి శాంతమూర్తులు పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంత బోధలు తలకు ఎక్కించుకోండి.

ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇంకా దేశాల మధ్య ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాలవల్ల ఎంతో ధనవ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి.

కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులందరం సోదరులవలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం కలిగి ప్రజలందరం శాంతియుత జీవనం సాగిద్దాం. అందరం ప్రపంచ శాంతికై పాటుపడదాం.

ఇట్లు,
ప్రపంచ శాంతి మండలి.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 23.
ఆదర్శ రైతు రామయ్యను అభినందిస్తూ అభినందన పత్రాన్ని తయారుచేయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా !
మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 బస్తాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము.

రైతురత్న రామయ్య గారూ!
నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరపున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.
అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,
ఏలూరు,
ప|గో|| జిల్లా,

ప్రశ్న 24.
ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తూ కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
తల్లిదండ్రులారా !
మీరు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో మీరు ఏ విధమైన ఫీజు కట్టనవసరం లేదు. పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తారు. అక్కడ పాఠం చెప్పే ఉపాధ్యాయులు, మెరిట్ ప్రాతిపదికపై ఎన్నిక చేయబడినవారు. చక్కని అర్హతలు కలవారు. మధ్యాహ్నం మీ పిల్లలకు భోజన సదుపాయం ఉంటుంది. హాస్టలు సదుపాయం ఉంటుంది. హాస్టలులో మీ పిల్లలకు కావలసిన సదుపాయాలు ఉచితంగా సమకూరుస్తారు.

ప్రభుత్వ పాఠశాలలకు మంచి భవనాలు ఉంటాయి. ఆటలు ఆడుకొనే ఆటస్థలము, పరికరాలు ఉంటాయి. ఆటలు ఆడించే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలు మంచి అనుభవజ్ఞులయిన ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నడుస్తాయి. ప్రభుత్వము అక్కడి ఉపాధ్యాయులకు చక్కని జీతాలు ఇస్తోంది. అందువల్ల ప్రభుత్వం కల్పించే సదుపాయాలను చక్కగా వినియోగించుకొని మీ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. అక్రమంగా ఫీజులు పిండే ప్రయివేటు కాన్వెంటులలో చేర్చకండి. ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనాలను మీరు పొందండి. ప్రెయివేటు పాఠశాలల్లో పై సదుపాయాలు ఏమీ ఉండవు. దయతో మేల్కోండి.. జాగ్రత్త పడండి.
దివి. x x x x x

ఇట్లు,
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ సంఘం.

ప్రశ్న 25.
స్వచ్ఛభారత్ లో అందరూ పాల్గొనాలని ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

‘స్వచ్ఛభారత్’

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని మన పెద్దలు ఏనాడో మనకు ఉపదేశించారు. భారతదేశ స్వచ్చతయే, దేశ సౌభాగ్యానికి మొదటిమెట్టు. స్వచ్ఛమైన ప్రదేశంలోనే లక్ష్మీదేవి నిలుస్తుంది. నీ ఇల్లు శుభ్రంగా ఉంటే నీ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. దేశమంతా స్వచ్ఛంగా ఉంటే, దేశంలో మహాలక్ష్మి వెల్లివిరుస్తుంది. అందుకే మన దేశాన్నీ నదులనూ, పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో సుఖ సంపదలతో మనం వర్ధిల్లుదాం.

మన ప్రధాని నరేంద్రమోడీ గారు భారతదేశాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. నీ ఇంటితో పాటు, నీ పరిసరాలను, నీ గ్రామాన్ని, నగరాన్ని, దేశాన్ని నిర్మలంగా తీర్చిదిద్దుకోండని మనదేశ ప్రజలకు ఆయన పిలుపును ఇచ్చారు.

కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు దేశాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కేవలము ప్రభుత్వం వల్ల కాదు. దేశంలోని 130 కోట్ల ప్రజానీకం ఇందుకు నడుం కట్టుకోవాలి. దీని కోసం . ప్రభుత్వం, ఎంతో ధన సహాయం చేస్తోంది. ఉపయోగించుకుందాం.

ముఖ్యంగా ప్రతి విద్యార్థి, విద్యార్థిని, యువకుడు, యువతి, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని, ఎక్కడా దేశంలో చెత్త లేకుండా అందంగా ఆరోగ్యవంతంగా మనదేశాన్ని తీర్చిదిద్దుకొందాం. కదలిరండి. నడుం బిగించండి. లేవండి. మనదేశం “స్వచ్ఛభారత్” అయ్యేదాకా, పట్టు విడువకండి. మరువకండి.
దివి. x x x x x

ఇట్లు,
పట్టణ విద్యార్థినీ, విద్యార్థుల సంఘం,
కర్నూలు.

ప్రశ్న 26.
‘ప్రసార మాధ్యమాలు (టి.వి., సినిమాలు) నేటి సమాజాన్ని పెడదారి పట్టిస్తున్నాయి’ అనే విషయం గూర్చి ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
రవి : ఏరా ! ఈ రోజు సెలవు కదా ! ఏం చేద్దాం?
కృష్ణ : చక్కగా చదువుకుందాం ! ప్రాజెక్టువర్కులు పూర్తి చేద్దాం.
హరి : కాదురా ! ఈ రోజు సెలవు కదా ! మంచి సినిమాకు వెళ్లాం.
కృష్ణ : వద్దురా ! ఈనాటి సినిమాలు సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నాయి.
ప్రసాద్ : కనీసం టీ.వీ. నైనా చూద్దాం.
కృష్ణ : ఈనాడు టీ.వీలో వచ్చే కార్యక్రమాలు బాగుండటంలేదు.
రవి : ఎందుకలా చెప్తున్నావు? సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయి?
కృష్ణ : ఈనాడు టీ.వీ.లు గాని, సినిమాలు గాని జనానికి ఉపయోగకరంగా లేవు. టీవీల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉపదేశాత్మకంగా లేవు.
ప్రసాద్ : మరి సినిమాల సంగతేమిటి?
కృష్ణ : ఈనాడు సినిమాలు కూడా హింసను, అకృత్యాలను చూపిస్తున్నాయి.
రవి : నీవు చెప్పింది నిజమేరా ! నీవు చెప్పినట్లుగానే చక్కగా చదువుకుందాం.
ప్రసాద్ : మనం సమాజానికి ఆదర్శంగా ఉండాలి కదా ! సరే మనకు సినిమాలు వద్దు, టీ.వీ.లు వద్దు. చదువే ముద్దు.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 27.
మీ చుట్టూ ఉండే పరిసరాలను వర్ణిస్తూ పది పంక్తులు మించకుండా ఒక కవిత రాయండి.
జవాబు:
మా చుట్టూ ఉండే పరిసరాలు
మా పల్లెవాసులకు ఆనంద నిలయాలు
ఎటు చూసినా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు
చెట్లపై పక్షుల కిలకిలారావాలు
కొండ కోనల్లో
నవ్వుతూ, తుళ్ళుతూ
పరుగెడుతున్న సెలయేటి గలగలలు
చెఱువులలో విరబూసిన అరవిందాలు
తలలాడిస్తూ ఆహ్వానించే పచ్చని పైరులు
జోరుజోరుగా వినిపించే
పశుకాపర్ల జానపద గీతాలు
ప్రకృతి శోభతో కళకళలాడుతుంది మా పరిసరం.

AP SSC 10th Class Telugu లేఖలు

AP SSC 10th Class Telugu లేఖలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 1.
మీ పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునికి లేఖ

విశాఖపట్టణం,
x x x x x.

మిత్రుడు ప్రసాద్ కు,

మిత్రమా ! నీవు మన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠం ‘సముద్రలంఘనం’ చదివావని అనుకుంటున్నాను. మాకు ఈ మధ్యనే మా తెలుగు పండితులు ఈ పాఠం చెప్పారు. ఈ పాఠం ‘అయ్యలరాజు రామభద్రుడు’ అనే మహాకవి రచించిన “రామాభ్యుదయము” అనే గ్రంథంలోనిది. రామాభ్యుదయంలోని కథ, సీతారామ కథయే. మన పాఠంలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టమును కవి “అద్భుతంగా” వర్ణించాడు.

రామభద్రుడు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామాయణము ఒక తియ్యని కావ్యము. ఈ రామాభ్యుదయంలో కవి హనుమంతుని శక్తిని, పరాక్రమాన్ని గొప్పగా వర్ణించాడు. ఈ కవి ‘సకల కథాసార సంగ్రహం’ అనే మరో గ్రంథం కూడా రచించాడట. నేను ఈ రోజే “రామాభ్యుదయం” కావ్యం కొన్నాను. నీవు కూడా రామభద్రుని రచనలు తప్పక చదువు. ఆ కవిని గూర్చి, నీ అభిప్రాయం నాకు రాయి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. రఘునాథ్ బాబు,
మునిసిపల్ ఉన్నత పాఠశాల.

చిరునామా :
టి. ప్రసాద్,
S/o టి. రామయ్యగారు,
ఇంటి నెం. 4-1-3/A, గాంధీపురం,
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా,

ప్రశ్న 2.
మీ పాఠశాలను గురించి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

తెనాలి,
x x x x x.

పి. రామచంద్ర,
10వ తరగతి, శారదా కాన్వెంట్,
రాజావీధి, తెనాలి,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

మిత్రుడు రవికాంత్ కు,

నేను కొత్తగా చేరిన శారదా కాన్వెంట్ అందాల బృందావనంలా ఉంది. మా కాన్వెంట్ 5 ఎకరాల స్థలంలో ఉంది. ఎత్తైన భవనాలు ఉన్నాయి. ప్రతి తరగతి గదిలోనూ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఉన్నాయి. ముఖ్యంగా మా సైన్సు ప్రయోగశాలలు చక్కగా అన్ని పరికరాలతో అందంగా తీర్చిదిద్దినట్లుంటాయి.

నిత్యం అసెంబ్లీ జరిగేచోట సరస్వతీ దేవి విగ్రహం రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ఉంటుంది. మా కాన్వెంటు అందం అంతా క్రీడా మైదానంలో ఉంది. అన్ని ఆటలకూ కోర్సులు ఉన్నాయి. మైదానం అంతా శుభ్రంగా ఉంటుంది.

కాన్వెంటులో పూలతోట ఉంది. అక్కడ అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. కుళాయి నీరు 24 గంటలు వస్తుంది. బాలబాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు ఉన్నాయి.

మా ప్రధానోపాధ్యాయుల గది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కాన్వెంట్ లో చేరినందులకు సంతోషంగా ఉంది. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.రామచంద్ర.

చిరునామా:
యస్. రవికాంత్,
C/O. యస్. వెంకట్రావుగారు,
తాశీల్దార్, అమలాపురం,
తూ. గో. జిల్లా, ఆంధ్రప్రదేశ్.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 3.
‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

అమలాపురం
ది. x x x x x.

 

ప్రియమైన మిత్రుడు అనంత్ కు,

నీకు శుభాక్షాంక్షలు – నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుచున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది. మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే భావనతో మన ప్రధాని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలు బాగుంటేనే మనదేశం ఆదర్శంగాను, ఆరోగ్యవంతంగాను ఉంటుంది. దాని కోసం మనమంతా పచ్చని చెట్లను నాటాలి. ఇంటిని, గ్రామాలను, నగరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారానే మనం దేశాన్ని ముందుకు నడిపించగలుగుతాం. మన పాఠశాలల్లో ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపడదాం. మనం దీని కోసం సంకల్పం తీసుకుందాం ! పెద్దలకు నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
x x x x x.

చిరునామా:
వి. అనంత్, 10వ తరగతి,
వివేకానంద బాలుర ఉన్నత పాఠశాల,
వినుకొండ, గుంటూరు జిల్లా.

ప్రశ్న 4.
పల్లెటూరులోని ప్రకృతి అందాలను, మానవ సంబంధాలను వివరిస్తూ మీ మిత్రుడు / మిత్రురాలికి ఒక లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x.

మిత్రుడు రంగారావుకు / మిత్రురాలు కవితకు,

నీ లేఖ అందింది. ఈ మధ్య నేను మా అన్న పెళ్ళికి ‘కొమరగిరి పట్టణం’ అనే తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలోని ఒక పల్లెటూరికి వెళ్ళాను. ఆ పల్లెటూరిలో సుమారు 16 వేల మంది జనాభా ఉన్నారట. సుమారు 20 వేల ఎకరాలలో వరిపంట, ఐదు-ఆరు వేల ఎకరాలలో కొబ్బరి తోటలు ఆ ఊరిలో ఉన్నాయట.

ఊళ్ళో అన్ని కులాల వారూ, అన్ని వృత్తుల వారూ ఉన్నారు. ఆ పెళ్ళి చేయించే పురోహితుణ్ణి, ఆ ఊరి కాపుగారు “బాబయ్యగారూ” అని ప్రేమగా పిలిచేవాడు. ప్రజలు ఎక్కువగా పేర్లు పెట్టికాక, పెద్దమ్మ, పిన్నమ్మ, అక్క బావ, మొదలయిన వరుసలు పెట్టి ప్రేమగా పిలుచుకున్నారు. ఆ గ్రామస్తుల ఐక్యత చూస్తే ఆనందం వేసింది. రామేశ్వరం, లక్ష్మణేశ్వరంలలో అందమైన శివాలయాలు ఉన్నాయి.

ఆ పల్లెటూరిలో ప్రకృతి శోభ, మహాద్భుతం. ఊళ్ళో పంటకాలువలూ, చెరువులూ ఉన్నాయి. ఫంటచేలు గాలికి తలలాడిస్తూ, మనల్ని పిలుస్తున్నట్లుంటాయి. కొబ్బరి తోటల్లో చెట్లు, నిండుగా గెలలతో కలకలలాడుతుంటాయి. కొబ్బరిచెట్టు, కల్పవృక్షం లాంటిది. పెళ్ళిలో అతిథులందరికీ చల్లని కొబ్బరి బొండాలు ఇచ్చారు.

అదీగాక ఈ ఊరి ప్రక్కనే కౌశికీ నది, దాని పక్కగా బంగాళాఖాతం ఉంది. ఆ సముద్ర కెరటాల శోభ వర్ణించడం అసాధ్యం. సముద్రతీరాన సరుగుడు తోటలు, ఏవో పాటలు పాడుతూ తలలు ఊపుతూ మనలను రమ్మని పిలుస్తూ ఉంటాయి.

పల్లెలు, దేశ సౌభాగ్యానికి పుట్టిళ్ళు. ప్రశాంత జీవితానికి నట్టిళ్ళు. ఉంటాను. లేఖ రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
గోపాలరావు. / రాధ.

చిరునామా :
పి. రంగారావు, / పి. కవిత,
S/o/ D/o పి. వరప్రసాద్,
గాంధీరోడ్డు, వరంగల్లు (ఆంధ్రప్రదేశ్).
పామర్రు, కృష్ణా జిల్లా.

ప్రశ్న 5.
మీ పాఠశాలలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x x.

ప్రియమిత్రుడు పుష్పరాజ్ కు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవం దినంగా ప్రకటించింది కదా ! ఆ రోజు ఉదయం 8 గంటలకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణతో ఉత్సవాన్ని ప్రారంభించాం. మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు,
నీ మిత్రుడు,
జయరాజ్.

చిరునామా :
ఎస్. పుష్పరాజ్, 10వ తరగతి,
నవోదయ హైస్కూలు,
నాయుడుపేట,
నెల్లూరు.

ప్రశ్న 6.
మీ పాఠశాలలో గ్రంథాలయ వసతి కల్పించమని కోరుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు:

ఏలూరు,
x x x x x

చింతా రవిశంకర్,
పదవ తరగతి, ‘ఏ’ సెక్షన్,
మునిసిపల్ హైస్కూలు,
పవర్ పేట, ఏలూరు.

ఆర్యా ,
విషయము : గ్రంథాలయ వసతి కల్పించమని వినతి.

నమస్కారములు. మా పాఠశాలలో సుమారు 2 వేలమంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. మా పాఠశాలలో మంచి గ్రంథాలయము లేదు. ఈ సంవత్సరము పాఠ్యప్రణాళికలు బాగా మారిపోయాయి. గ్రంథాలయంలోని పుస్తకాలు – చదివితే కానీ, పరీక్షలలో సరయిన జవాబులు వ్రాయలేము. నిత్యమూ వచ్చే రోజువారీ పత్రికలు చదివితే, మాకు దేశకాల పరిస్థితులు అర్థం అవుతాయి.

కాబట్టి మీరు తప్పక మా మునిసిపల్ కమిషనర్ గారికి చెప్పి, మీరు కూడా మంచి గ్రాంటు ఇచ్చి, మా పాఠశాలలో మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయించవలసిందిగా మా విద్యార్థుల తరుపున ప్రార్థిస్తున్నాను.

నమస్కారాలతో,

ఇట్లు,
తమ విధేయుడు,
చింతా రవిశంకర్,
పదవ తరగతి, ఎ. సెక్షన్ నెంబర్ : 26.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి గార్కి,
పశ్చిమగోదావరి జిల్లా,
ఏలూరు.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 7.
‘ఎదుటి వారిలో తప్పులు వెతకటం కన్నా, వారి నుండి మంచిని స్వీకరించడం మేలు’ అని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

చిత్తూరు,
x x x x x

స్నేహితుడు రంగనాకు,
స్నేహితురాలు శారదకు,

నీ లేఖ చేరింది. మీ నగరంలోని “సాయీ సేవామండలి” వారు మీ పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్సు పుస్తకాలు, వగైరా ఉచితంగా పంచి పెట్టారని రాశావు. ఆ సంస్థవారు నగరంలో చందాలు బాగా వసూలు చేస్తున్నారనీ, వాటికి రశీదులు మాత్రం ఇవ్వడం లేదని రాశావు. నీవు సేవామండలి వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ప్రశంసించాలి. వారి తప్పులు వెదకరాదు.

ఆ సేవామండలి వారు దేవాలయాల వద్ద నిలబడి భక్తులను క్యూ లైన్లలో పంపడం, వారి చెప్పులను కాపాడి, తిరిగి వారికి అప్పగించడం, మజ్జిగ, మంచినీరు అందించడం వగైరాలు చేస్తున్నారు. దొంగతనాలు జరుగకుండా కాపాడుతున్నారు.

వారు బీదపిల్లలకు విద్యా సదుపాయాలు కల్పిస్తున్నారు. పండుగరోజుల్లో బీదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తున్నారు. రోగులకు పాలు పండ్లు ఇస్తున్నారు.

నీవు ఆ సేవామండలి వారు చేస్తున్న పరోపకారం, మానవసేవ, ధర్మకార్యాలు మెచ్చుకోవాలి. వారిని అభినందించాలి. అంతేకాని వారు వసూలు చేసే చందాలకు రశీదులు ఇవ్వడం లేదని వారిని తప్పు పట్టరాదు. రశీదు పొరపాటున ఇచ్చి ఉండకపోవచ్చు గదా !

మనం ఎదుటివారి తప్పులను వెతికి చూపిస్తాము. దానికంటే వారు చేసే మంచిని గ్రహించి, వారిని అభినందించడం మంచిది. వారు చేసే పనిలోని లోపాలను వారి దృష్టికి తేవాలి.

మంచిపని చేసేవారిని ప్రశంసించడం, మన ధర్మం. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
నీ స్నేహితురాలు,
కె. జయ / కె. జయరాజు.

చిరునామా :
కె. రంగనాధ్, / యస్. శారద,
గాంధీ మునిసిపల్ హైస్కూలు,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 8.
నాటితో పోలిస్తే నేటి వివాహ వేడుకల్లో వచ్చిన మార్పులను గురించి విమర్శనాత్మకంగా మిత్రులకు లేఖ రాయండి.
జవాబు:

తిరుపతి,
x x x x x

మిత్రుడు ప్రసాద్ కు,

శుభాభినందనలు. మీ అక్క పెళ్ళి శుభలేఖను నీవు నాకు పంపించావు. సంతోషం. ఈ మధ్య మా అన్నయ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను. పూర్వపు పెళ్ళిళ్ళకూ, ఇప్పటి పెళ్ళిళ్ళకూ ఎన్నో తేడాలున్నాయి.

కోపం వల్ల చాలా అనర్దాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1. 104,
మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 9.
నీ సైకిలు పోయిందని తెలుపుతూ,వెతికించమని కోరుతూ పోలీసు అధికారికి లేఖ రాయండి.
జవాబు:

కర్నూలు,
x x x x x x

కె. జవహర్ రెడ్డి,
పదవ తరగతి, సెక్షన్ ‘ఎ’
మునిసిపల్ హైస్కూల్,
గాంధీనగర్, కర్నూలు.
గాంధీనగర్ పోలీసు ఇన్ స్పెక్టర్ గారికి, కర్నూలు,

అయ్యా ,

విషయము : సైకిలు దొంగతనం – చర్య తీసుకోవలసిందిగా విజ్ఞప్తి.

నమస్కారములు,
నిన్న అనగా 9 – 4 – 2016 నాడు, నేను మిత్రులతో కలసి గవర్నమెంటు హాస్పిటల్ కు, నా మిత్రుని పలకరించుటకు వెళ్ళాను. మా మిత్రులము అందరమూ, మా సైకిళ్ళను గేటు వద్ద చెట్టు క్రింద తాళం వేసి ఉంచి లోపలకు వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పటికి నా సైకిలు కనబడలేదు. మిగిలిన వారి సైకిళ్ళు మాత్రం ఉన్నాయి. నా సైకిలు వివరాలు క్రింద ఇస్తున్నాను.

హీరో కొత్త సైకిలు, 24, నెంబరు హెచ్ 26723. దయచేసి నా సైకిలు వెతికించవలసినదిగా మిమ్మల్ని కోరుతున్నాను.
నమస్కారాలతో,

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
కె. జవహర్ రెడ్డి,
10వ తరగతి, సెక్షన్ – ‘ఎ’.

ప్రశ్న 10.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x

ప్రియమైన అభిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ మధ్య నేను చిన్న సాహసం చేశాను. మా పాఠశాలలో నాతో చదివే జలజను ఒక దుర్మార్గుడు నిత్యం తన్ను ప్రేమించమని ఏడిపిస్తూ ఉండేవాడు. నేను వాడితో తగువు పెట్టుకొని వాడిని తన్నాను. పోలీసులకు వాణ్ణి అప్పగించాను.

మనం మనతోటి స్త్రీలను మన అక్కా చెల్లెళ్ళలా, మన తల్లుల్లా భావించి వారికి రక్షణగా నిలబడాలి. నిజానికి స్త్రీలు ఈ భూమిమీద తిరిగే పుణ్యదేవతలు. స్త్రీలపట్ల అపచారం చేస్తే వారు నాశనం అవుతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు.

స్త్రీలకు ఎటువంటి అవమానం జరుగకుండా, మనం చూడాలి. తోటి స్త్రీలను కన్నతల్లుల్లా, మన సోదరీమణుల్లా చూడాలి. నేను చేసిన సాహసాన్ని నీవు తప్పక అభినందిస్తావని నమ్ముతున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి , జె.పి. హైస్కూల్,
కుప్పం, చిత్తూరు జిల్లా,

ప్రశ్న 11.
మీ ఊరికి బస్సు సదుపాయం కల్పించమని కోరుతూ సంబంధిత రోడ్డు రవాణా సంస్థ అధికారికి లేఖ రాయండి.
జవాబు:

చామర్రు,
x x x x x

ఆర్.టి.సి. జనరల్ మేనేజర్ గారికి,
చామర్రు నివాసియైన అగ్గరాజు శ్రీరామమూర్తి వ్రాయు విన్నపము.

అయ్యా ,

మాది అచ్చంపేట మండలంలోని చామర్రు అనే గ్రామం. మా గ్రామ జనాభా ఎనిమిదివందలు. ఇచ్చటి ప్రజలు నిత్యావసర సరకులు అచ్చెంపేట వెళ్ళి తెచ్చుకోవాలి. అలాగే విద్యార్థులు హైస్కూలు చదువుకు అచ్చెంపేట, కాలేజి చదువుకు సత్తెనపల్లి వెళ్ళి రావలసియున్నది. పిల్లలు, పెద్దలు, విద్యార్థులు అందరూ కూడా మండల కేంద్రానికి వెళ్ళటానికి నానా బాధలు పడుతున్నారు. కారణం మా ఊరికి ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడమే. ‘ప్రజా సేవయే కర్తవ్యం’గా భావించే మీరు మా గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కలిగించి మా కష్టాలను గట్టెక్కించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఎ.ఎస్.ఆర్. మూర్తి.

చిరునామా :
జనరల్ మేనేజర్,
ఆర్.టి.సి. ఆఫీసు,
గుంటూరు రేంజి, గుంటూరు.

ప్రశ్న 12.
ఉపకార వేతనాన్ని మంజూరు చేయమని కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ రాయండి.
జవాబు:

ఉపకార వేతనం కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ.

పటమట,
x x x x x

కృష్ణాజిల్లా సంక్షేమశాఖాధికారి గారి దివ్య సముఖమునకు,

ఆర్యా !
నేను పటమట జిల్లా పరిషత్ హైస్కూలులో పదవ తరగతి చదువుచున్నాను. నేను ఆర్థికముగా వెనుకబడిన కుటుంబమునకు చెందినవాడను. 9వ తరగతి పరీక్షలలో నాకు 600 మార్కులకు 530 మార్కులు వచ్చినవి. పై చదువులు చదువుటకు ఆర్థికశక్తి లేకపోవుటచే మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చుచున్నది. కనుక తమరు నా యందు దయయుంచి ఉపకార వేతనమును మంజూరు చేయవలసినదిగా ప్రార్థించుచున్నాను.

జతపరచినవి :

  1. ఆదాయ ధృవీకరణ పత్రం,
  2. మార్కుల ధృవీకరణ పత్రం,
  3. కుల ధృవీకరణ పత్రం.

ఇట్లు,
తమ విధేయుడు,
అగ్గిరాజు శ్రీహర్ష,
10వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
పటమట, కృష్ణాజిల్లా.

చిరునామా :
జిల్లా సంక్షేమశాఖాధికారి గారికి,
జిల్లా సంక్షేమశాఖాధికారి కార్యాలయం,
మచిలీపట్నం, కృష్ణాజిల్లా.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 13.
మీ పాఠశాలలో జరిగిన ఒక ఉత్సవాన్ని గూర్చి మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

శ్రీకాకుళం,
x x x x x

ప్రియ స్నేహితురాలు,
మధుప్రియకు శుభాకాంక్షలు,

గడచిన జనవరి 26న మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు ఉదయం గం. 8 – 00 లకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణ కావించబడింది. రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గురించి ముఖ్య అతిథిగారు చక్కని సందేశమిచ్చారు. కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఆ రోజు గొప్పతనాన్ని గురించి ఉపన్యాసమిచ్చారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంచిపెట్టబడ్డాయి. తరువాత విద్యార్థులకు స్వీట్సు పంచిపెట్టబడ్డాయి. ‘జనగణమన’ జాతీయ గీతంతో నాటి కార్యక్రమం ముగిసింది.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
టి. హరిప్రియ.

చిరునామా :
కె. మధుప్రియ,
10వ తరగతి,
మున్సిపల్ గరల్స్ హైస్కూలు,
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా.

ప్రశ్న 14.
అమరావతిలో అద్భుత శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు శిల్పులను అభినందిస్తూ లేఖ

విజయవాడ,
x x x x x

మిత్రుడు శ్రీకాంత్ కు, / మిత్రురాలు రాధకు,

మిత్రమా ! శుభాకాంక్షలు. ఈ మధ్య నేను మన నవ్యాంధ్ర రాజధాని నగరం, అమరావతికి వెళ్ళి అక్కడి శిల్ప సంపదను చూసి, ఆ శిల్పాలను చెక్కిన కళా తపస్వులయిన శిల్పులకు జోహార్లు సమర్పించాను. అక్కడ బుద్ధ విగ్రహాలు, జైన మందిరము, అమరేశ్వరాలయము, స్తూపాలు అన్నీ చూశాను. ఆ శిల్పాలు చెక్కిన శిల్పులకు అభినందనలు అందించాను. ఆ శిల్పాలు ప్రపంచ శిల్ప సంపదలోనే అగ్రశ్రేణివని డా|| ఫెర్గూసన్ పొగిడాడు.

జాషువా మహాకవి చెప్పినట్లు శిల్పి చేతి సుత్తె నుండి ఎన్నో దేవాలయాలు వెలిశాయి. అర్థం లేని బండరాయికి శిల్పి జీవం పోస్తాడు. రాళ్ళను దేవుళ్ళుగా మార్చి, వాటికి మనచే పూజలు చేయిస్తాడు. శిల్పి శాశ్వతుడు. రాళ్ళలో నిద్రపోయే బొమ్మల్ని ఉలి తగిలించి అతడు లేపుతాడు. శిల్పి చిరంజీవి. పుణ్యాత్ముడు. ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన మహాశిల్పులకు మనం అభినందనలు అందించాలి. నీవు కూడా అమరావతి వచ్చి, మత తెలుగు శిల్పుల కళానైపుణ్యానికి జోహార్లు అందిస్తావని విశ్వసిస్తున్నాను.

‘అమరావతీ నగర అపురూప శిల్పాలు’ అని మనం నిత్యం తెలుగుతల్లి పాటలో పాడుతున్నాము. ఆ శిల్పులకు జోహార్లు అందించడం మన విధి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
శ్రీహర్ష. / రజని.

చిరునామా :
పి.శ్రీకాంత్, / పి.రాధ,
S/o/ D/o పి.వరప్రసాద్,
విశాఖపట్టణం,
అక్కయ్యపాలెం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 15.
పేదలకు దానం చేయుట వలన మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రుడికి లేఖ

తిరుపతి,
x x x x x

మిత్రుడు శశిభూషణకు, / మిత్రురాలు కమలకు,

ఉభయ కుశలోపరి. నీవు రాసిన లేఖ చేరింది. మనం నైతిక విలువలను పాటించాలని రాశావు. సంతోషము. మన ఇరుగు పొరుగువారిలో ఎందరో పేదలు ఉంటారు. భగవంతుడు మానవులు అందరిలోనూ ఉంటాడు. కాబట్టి మనుషులు అంతా దైవంతో సమానం.

ముఖ్యంగా పేదవారికి, మనకు ఉన్నంతలో దానం చేయాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు, నోట్సులు దానం చెయ్యాలి. పరీక్ష ఫీజులు కట్టడానికి వారికి డబ్బు సాయం చెయ్యాలి. వైద్య సహాయం కోసం డబ్బులు అడిగే వారికి తప్పక ఇవ్వాలి.

పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింతగా ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే, మన జీవితాలు సుఖసంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను.

నీవు కూడా చెయ్యి.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు, / మిత్రురాలు,
సాయికుమార్. / శశికళ.

చిరునామా:
కె. శశిభూషణ్, / కె. కమల,
S/o వెంకటేష్, | D/o వెంకటేష్,
ఆర్యాపురం, రాజమహేంద్రవరం,
తూర్పుగోదావరి జిల్లా.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 16.
విద్వాన్ విశ్వం కవితను ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు లేఖ

గుంటూరు,
x x x x x

మిత్రుడు రామారావునకు,

శుభాభినందనలు. నీ లేఖ అందింది. నేను ఈ మధ్య విద్వాన్ విశ్వంగారి ‘మాణిక్యవీణ’ వచన కవిత చదివాను. విశ్వంగారు గొప్ప కవి పండితుడు. ఆయన ‘విశ్వరూపి నా హృదయం’ అని ప్రకటించుకున్నాడు. ఈ కవితలో చక్కని అభ్యుదయ భావాలు వెలిబుచ్చాడు.

మానవులు కేన్సరుతో బాధపడుతూ ఉంటే, దానికి మందులు కనుక్కోకుండా, రోదసిలోకి ఉపగ్రహాలు పంపడం వల్ల ప్రయోజనం ఏముంటుందని శాస్త్రజ్ఞులను ప్రశ్నించాడు.

తంత్రాలతో సమాజ సమస్యలు దారికి రావని హెచ్చరించాడు. శాస్త్రజ్ఞులు నిప్పునూ, చక్రాన్ని కనిపెట్టినరోజు నిజంగా, మానవ చరిత్రలో పండుగరోజు అని గుర్తు చేశాడు.

మానవ జీవితాన్ని కళలూ, కవిత్వం, విజ్ఞానం నడిపిస్తాయన్న యథార్థాన్ని విశ్వంగారు చెప్పాడు.

వచన కవితా రచనలో ఆయన చిన్న చిన్న పదాలతో లోతైన భావాలను తేలికగా అందించాడు.

విశ్వంగారు మాణిక్యవీణను మీటి, మానవీయ రాగాల్ని పలికించాడు. చక్కని లలిత పదాలతో, అనుప్రాసలతో కవిత మనోహరంగా చెప్పాడు.

తప్పక నీవు ఈ కవిత చదువు. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
యన్. శ్రీకాంత్.

చిరునామా :
యస్. రామారావు,
S/o యస్: కృష్ణారావుగారు,
రామారావు పేట,
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా.

ప్రశ్న 17.
వ్యక్తిత్వ బదిలీ ధృవీకరణ పత్రాలను ఇప్పించవలసినదిగా ప్రధానోపాధ్యాయులకు లేఖ రాయండి.
జవాబు:

ప్రధానోపాధ్యాయులకు లేఖ

విజయవాడ,
x x x x x

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులవారికి,
మహాత్మాగాంధీ మునిసిపల్ ఉన్నత పాఠశాల,
గాంధీనగరం, విజయవాడ.

ఆర్యా !
విషయం : వ్యక్తిత్వ విద్యా, దిలీ ధృవీకరణ పత్రాలకై విజ్ఞప్తి.

నేను మీ పాఠశాలలో 10వ తరగతి చదివి, మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణుడను అయ్యాను. దయచేసి నేను ఇంటర్‌లో చేరేందుకు వీలుగా నా వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రములు ఇప్పించవలసినదిగా ప్రార్ధన.
నమస్కారాలతో,

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
x x x
10వ తరగతి – 24వ నెంబరు.

ప్రశ్న 18.
కోపం తగ్గించుకోవడం మంచిదని తెలుపుతూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణం,
x x x x x

మిత్రుడు రఘునందన్ కు,

నీ లేఖ అందింది. నేనూ, మా తల్లిదండ్రులూ క్షేమంగా ఉన్నాము. నీ లేఖలో, నీకు ప్రియ మిత్రుడైన సీతారామ్ తో నీకు తగవు వచ్చిందనీ, మీరిద్దరూ దెబ్బలాడుకున్నారని రాశావు. మీ ఇద్దరికీ దెబ్బలు తగిలాయని కూడా రాశావు.

నీ ఉత్తరం చూసి నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలే వరకూ మీరు తగవు లాడడం బాగోలేదు. ‘తన కోపమె, తన శత్రువు’ అని సుమతీ శతకకర్త రాశాడు. క్రోధం మనకు శత్రువని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు.

కోపం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది.. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1.104,
మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

AP SSC 10th Class Telugu వ్యాసాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 1.
‘ఆరుబయట మలవిసర్జన’ ఎంతటి ప్రమాదకరమో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
అత్యంత ప్రమాదం

మలవిసర్జన అంటే మన శరీరంలోని మలినాలను బయటకు వదలడం.

మలవిసర్జన వలన వచ్చే మలినాలు చాలా దుర్వాసనతో కూడుకొని ఉంటాయి. అంతేకాకుండా వాటిపై అత్యంత ప్రమాదకరమయిన సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు వ్యాపించినట్లయితే కలరా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఇవి వృద్ధులకు, బలహీనులకు, చిన్న పిల్లలకు, అనారోగ్యవంతులకు, గర్భిణీలకు, బాలింతలు మొదలైన వారికి తొందరగా వ్యాపిస్తాయి.

బహిరంగ మలవిసర్జన చేసినపుడు దానిపై ఈగలు, దోమలు వాలతాయి. వాటిపైకి అక్కడి సూక్ష్మజీవులు చేరతాయి. ఆ ఈగలు, దోమలు మనం తినే ఆహారంపై వాలతాయి. ఈ సూక్ష్మజీవులు ఆహారంతోబాటు మనలోపలికి ప్రవేశిస్తాయి. ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

అందుకే బహిరంగ మలవిసర్జన వద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకొందుకు ప్రభుత్వం కూడా మినహాయింపుతో కూడిన ఋణం మంజూరు చేస్తోంది.
బహిరంగ మలవిసర్జన మానేద్దాం – నాగరికతను చాటుదాం.
మరుగుదొడ్డి వాడదాం – రోగాలు నివారిద్దాం.
పరిశుభ్రత పాటిద్దాం – పదికాలాలు చల్లగా ఉందాం.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 2.
‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికిపేటలు, గంగ, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శనా వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 3.
అధిక జనాభా వల్ల మన పర్యావరణం దెబ్బ తింటోంది. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్త, చెదారమేకాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజి వ్యవస్థ అరొకరగా వుంది. దీనివల్ల కలరా, మలేరియా, ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా వుండాలి. కాని ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాలవల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది.

1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్యనివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

ప్రశ్న 4.
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ “వ్యాసం” రాయండి.
జవాబు:
పవిత్ర భారతదేశంలో స్త్రీలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలు భూమిపై కదిలే దేవతామూర్తులుగా భావిస్తాము. స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు ఆనందిస్తారని మనం భావిస్తాము. కాని వర్తమాన సమాజంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. స్త్రీల ప్రగతి నానాటికి దిగజారుతున్నది. స్త్రీలు ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు.

స్త్రీలు ఇప్పటికీ స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు. కొందరు స్త్రీలను పైకి రానీయకుండా అడ్డుపడుతున్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. చట్టసభల్లో మహిళా సభ్యులను చులకనగా చూస్తున్నారు.

ప్రేమ పేరుతో స్త్రీలపై దాడులు జరుగుతున్నాయి. అకృత్యాలు జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్న మహిళలపై వివక్షను చూపిస్తున్నారు. పరువు కోసం తండ్రులు కన్న కూతుర్లనే చంపడం మనం చూస్తున్నాం. దీన్ని నాగరిక సమాజం హర్షించదు. దీన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి.

గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు అక్షరాస్యతకు దూరంగా ఉంటున్నారు. కొందరు కట్నాల పేరుతో మహిళలను వేధిస్తున్నారు. ఆరోగ్యపరంగా స్త్రీలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలింతలకు తగిన పౌష్టికాహారం దొరకడం లేదు. ఈ రకంగా స్త్రీలు సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని మన ప్రభుత్వాలు పరిష్కరించాలి. స్త్రీల జీవితాల్లో వెలుగులను నింపాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 5.
మీకు నచ్చిన సన్నివేశాన్ని లేదా ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
సూర్యోదయం
తూర్పువైపు ఆకాశంలోకి ఉదయమే చూస్తే ఎర్రగా కనిపిస్తుంది. అప్పటి వరకూ కోళ్ళు కూస్తూ ఉంటాయి. నక్షత్రాలు ఆకాశంలో వెలవెలపోతాయి. అప్పుడు పక్షులు తమ గూళ్ళ నుండి బయలుదేరి ఆహారం కోసం బారులు కట్టి ప్రయాణం చేస్తూ ఉంటాయి. పక్షులు రెక్కలు ఆడిస్తూ నేరుగా దూసుకుపోతూ ఉంటే, ఆ దృశ్యం చూడ్డానికి కళ్ళకు పండుగలా కనిపిస్తుంది.

అదే సమయానికి సూర్యకిరణాలు నేరుగా వచ్చి నేలకు తాకుతాయి. మా ఇంటి పక్క గుళ్ళో గంటలు మోగుతూ ఉంటాయి. గుడి పక్క చెరువులో సూర్యకిరణాలు పడి, తామర పూలు విచ్చుకుంటాయి. తుమ్మెదలు ఆ పద్మాలపై ఏదో రొద చేస్తూ తిరుగుతూ ఉంటాయి.. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. సూర్యోదయం కాగానే ప్రకృతి అంతా మేలుకొని తమ తమ పనుల్లో మునిగిపోతుంది.

ప్రశ్న 6.
‘నవ సమాజంలో విద్యార్థుల పాత్ర అనే అంశం మీద వ్యాసము వ్రాయండి.
జవాబు:
విద్యార్థులు అంటే విద్యను కోరి వచ్చినవారు. విద్యార్థుల ముఖ్య కర్తవ్యం, శ్రద్ధగా చదివి, మంచి మార్కులు సాధించడం. ఈనాడు మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి దేశ నాయకులతో పాటు, ప్రజలు కూడా బాబాధ్యత వహించాలి. విద్యార్థులు చదువుకుంటున్న దేశ పౌరులు. కాబట్టే భావి భారత పౌరులయిన విద్యార్థులు కూడా, నవ సమాజంలో పెరిగిపోతున్న అవినీతి, అపరిశుభ్రత, దురాగతాలు, రాజకీయ నాయకుల వాగ్దాన భంగాలు వంటి వాటిపై తప్పక తిరుగబడాలి.

విద్యార్థులు ‘స్వచ్ఛభారత్’ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. అంటువ్యాధుల నిర్మూలనకు దీక్ష చేపట్టాలి. అవినీతి ఎక్కడ కనబడినా, సామూహికంగా. ఎదిరించాలి. విద్యార్థులు నీతినియమాలు పాటించాలి. వృద్ధులను గౌరవించాలి. తోడి వారికి సాయం చేయాలి.

విద్యార్థినీ విద్యార్థులు, క్రమశిక్షణను పాటించాలి. దేశభక్తిని కలిగియుండాలి. మంచి అలవాట్లను అలవరచుకోవాలి. గురువులనూ, తల్లిదండ్రులనూ గౌరవించాలి. బాగా ఆటలు ఆడి, వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రచారం చేయాలి.

విద్యార్థులు రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనరాదు. కాని దేశం కోసం తమ శక్తియుక్తులనన్నింటినీ ధారపొయ్యాలి.

ప్రశ్న 7.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
జవాబు:
కవి అలిశెట్టి ప్రభాకర్ “నగరం అర్థంకాని రసాయనశాల” అన్నమాట యదార్థము. నేడు పల్లెలను వీడి ప్రజలంతా పట్టణాలకు వలస పోతున్నారు. నగరాలు అన్నీ మురికివాడలుగా మారి పోయాయి.

నగరాల్లో జనాభా పెరిగిపోతోంది. ప్లాస్టిక్ సంచుల వాడకం పెరిగింది. ప్రజలు పారవేసే చెత్త, వాడి పారవేసిన ఇంజక్షను సూదులు, ఫ్యాక్టరీలవారు విడిచిపెట్టే రసాయనిక వ్యర్థాలు , పందులు, కుక్కలు వంటి జంతువుల మాలిన్యాలు, నగరంలో పోగుపడుతున్నాయి.

నగరాలలో ప్రజలకు త్రాగడానికి సరిపడ మంచినీరు దొరకడం లేదు. నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్న దీక్ష, ప్రజలకు ఉండడం లేదు. నగరంలో తిరిగే వాహనాలు ఎంతో కాలుష్యాన్ని గాలిలోకి విడిచిపెడుతున్నాయి. నదులలో కాలువలలో, చెరువులలో మురికినీరు వదలుతున్నారు. జలాశయాల్లో బట్టలు ఉతుకుతున్నారు. చెత్త దూరంగా పారవేసేందుకు నగరాల్లో చోటు దొరకడం లేదు. అందువల్ల నగరాలు కాలుష్య నిలయాలుగా, రోగాలకు పుట్టుక స్థలాలుగా మారుతున్నాయి.

నివారణ :
ప్రతి నగర పౌరుడు తమ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. మొక్కలు నాటాలి. జలాశయాల్లోకి మురికినీరు విడువరాదు. పరిశుభ్రతకూ, మంచి నీటికి మంచి వాతావరణానికి నగరాధికారులతో పాటు అందరూ కృషి చేయాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 8.
నగర జీవనంలోని అనుకూల అంశాలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నగర జీవనం – అనుకూల అంశాలు :
‘నగరం’ అంటే పట్టణము. పల్లెలలో కన్న నగరాలలో ప్రజలకు అవసరమయ్యే సదుపాయాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. అందువల్ల ప్రజలు గ్రామాల నుండి నగరాలకు వలసపోతున్నారు.

నగరాలలో ప్రజలకు విద్యా, వైద్య, ప్రయాణ సౌకర్యాలు హెచ్చుగా దొరుకుతాయి. ప్రజలకు మంచి విద్య నగరాల్లో లభిస్తుంది. కార్పొరేట్ కళాశాలలు, వైద్యశాలలు నగరాల్లో ఉంటాయి. నగరాల్లో పరిశ్రమలు ఉంటాయి. అందువల్ల ప్రజలకు ఉద్యోగ వసతి లభిస్తుంది. నగరాల్లో ప్రయాణాలకు సిటీ బస్సులు, రైళ్ళు, ఆటోలు, టాక్సీలు దొరుకుతాయి.

చేతి వృత్తుల వారికి సైతము, నగరాల్లో వారికి తగ్గ పని లభిస్తుంది. ప్రజలు ఏదోరకంగా నగరాల్లో బ్రతుకగలరు. వారికి కావలసిన పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు నగరాల్లో దొరుకుతాయి. కుళాయిల ద్వారా మంచి నీరు దొరుకుతుంది. రైతు బజార్లలో చౌకగా కావలసిన వస్తువులు దొరుకుతాయి. రోగం వస్తే, చిన్న పెద్ద వైద్యశాలలు నగరంలో ఉంటాయి. నగరాల్లో 24 గంటలు విద్యుచ్ఛక్తి సరఫరా అవుతుంది.

ఈ విధమైన అనుకూలములు ఉన్నందు వల్లే ప్రజలు పల్లెలను వదలి నగరాలకు వలసపోతున్నారు.

ప్రశ్న 9.
మాతృభాషా ప్రాముఖ్యాన్ని గూర్చి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
మాతృభాష అంటే తల్లి భాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికే చాలా ప్రయాస పడాల్సివస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాషరాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థం కాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.

ప్రశ్న 10.
‘వాతావరణ కాలుష్యం’ లేదా ‘పర్యావరణ పరిరక్షణ’ అన్న విషయంపై వ్యాసం రాయండి.
జవాబు:
ఆరోగ్యమే మహాభాగ్యం. వాతావరణం పరిశుభ్రంగా ఉంటే, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అతడి జీవితం, ఆనందంగా సాగుతుంది. మానవుల ఆరోగ్యానికి హానిని కల్గించే హానికారక పదార్థాలు వాతావరణంలో కలిసిపోతే, దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

మన చుట్టూ ఉండే గాలి, నీరు, భూమి వంటి వాటిని పర్యావరణం అంటారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికి నీరు, మొ||నవి. వాతావరణ కాలుష్యాన్ని కల్గిస్తున్నాయి. కర్మాగారాలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల, నదుల జలాలు కలుషితం అవుతున్నాయి. దానితో జలకాలుష్యం ఏర్పడుతోంది. మోటారు వాహనాల ధ్వనులతో ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది.

వాతావరణ కాలుష్యం వల్ల, మానవుని మనుగడకు ప్రమాదం ఏర్పడుతోంది. దీనివల్ల ఉదరకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్ రోగాలు, గుండె జబ్బులు వస్తున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకూ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి అమలు పరచాలి. కర్మాగారములు పరిశుభ్రము చేసిన తరువాతే వ్యర్థాలను విడిచి పెట్టాలి. ఫ్యాక్టరీల వారు మొక్కలు బాగా పెంచాలి. అవకాశం ఉన్న చోట ప్రజలు మొక్కలను బాగా పెంచాలి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు, పరిశోధనలు చేసి, వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు అందించాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 11.
నీకు నచ్చిన మహిళ గుణగణాలు (శ్రీమతి ఇందిరాగాంధీ) గురించి వ్యాసం రాయండి.
జవాబు:
నాకు నచ్చిన మహిళ (శ్రీమతి ఇందిరా గాంధీ) :
భరత మాత ముద్దుబిడ్డలలో, ఇందిరాగాంధీ ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహిళామణులలో, ఇందిర సుప్రసిద్ధురాలు. ఈమె 1917వ సంవత్సరము నవంబరు 19వ తేదీన ఆమె అలహాబాదులో జవహర్ లాల్ నెహ్రూ – కమలా నెహ్రూ దంపతులకు జన్మించింది.

ఇందిర శాంతినికేతన్లో రవీంద్రుని వద్ద చదివింది. ఈమె గొప్ప దేశ భక్తురాలు.. ఈమె భర్త ఫిరోజ్ గాంధీ, మహమ్మదీయుడు. ఆ వివాహం ఈమెకు మత సహనాన్ని నేర్పింది. ఈమె తండ్రితో పాటు దేశ విదేశాలు పర్యటించి, రాజనీతి చతురజ్ఞ అయ్యింది.

ఈమె భారతదేశ ప్రధానమంత్రిగా 15 సంవత్సరాలు పనిచేసింది. ఆ కాలంలో ఈమె బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది. భూ సంస్కరణలను చేపట్టింది. ‘గరీబీ హఠావో’ అని ఈమె ఇచ్చిన నినాదం భారతదేశం అంతటా మారుమ్రోగింది.

ఈమె బడుగువర్గాల ఆశాజ్యోతిగా, దళిత వర్గాల కన్నతల్లిగా పేరు తెచ్చుకొంది. ఈమె గొప్ప సాహసురాలు. గొప్ప రాజనీతిజ్ఞురాలు.

ప్రశ్న 12.
నీకు నచ్చిన జాతీయ నాయకుని గూర్చి వ్యాసం రాయండి.
జవాబు:
మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. కానీ భారత ప్రజలు ఆత్మీయంగా ‘బాపూజీ’ అని పిలిచేవారు. ‘మహాత్మా’ అని గౌరవించేవారు. భారత జాతి మహాత్మాగాంధీని ‘జాతిపిత’ గా గౌరవించి కృతజ్ఞత ప్రకటించుకుంది.

గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడున్న భారతీయుల దాస్య వృత్తిని చూసి చలించిపోయాడు. ఆంగ్లేయుల ప్రవర్తన సహించలేక ఎదురుతిరిగాడు. ఎన్నో కష్టాలకు లోనయ్యాడు.

స్వదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ భారతీయుల బానిస బ్రతుకుల్ని చూసి సహించలేకపోయాడు. భారతమాత పరాయి పాలకుల సంకెళ్ళలో బందీగా ఉన్నందుకు గాంధీ తల్లడిల్లాడు. ఆంగ్లేయులపై స్వాతంత్ర్య సమరం ప్రకటించాడు. శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సమరం చేపట్టాడు. స్వరాజ్య ఉద్యమానికి కాంగ్రెసు సంఘం స్థాపించాడు.

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, ఖద్దరు ఉద్యమాలను చేపట్టి ఆంగ్లేయులను గుక్క తిప్పుకోనీకుండా గడగడలాడించాడు. సత్యాగ్రహం, నిరాహారదీక్షల ద్వారా భారత జాతిని జాగృతం చేసి ఆంగ్లేయుల గుండెలు దద్దరిల్లజేశాడు.

అనేక జాతులు, కులాలు, మతాలు, భాషలు గల దేశ ప్రజల్ని ఒకే త్రాటి మీద నడిపించి, సమైక్యంగా పోరాటం సాగించాడు. గాంధీ నడిపించిన ఉద్యమం వల్ల 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. దుడ్డు కర్ర, అంగవస్త్రం, కిర్రు చెప్పులు గల గాంధీ ప్రపంచ దేశాల చేత జేజేలు అందుకున్నాడు.

ప్రశ్న 13.
ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పదనాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
గ్రామాలు దేశ సౌభాగ్యానికి మూలకందములు. పల్లెలలో జీవితం ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. చక్కని ఎండ, గాలి, ప్రతి ఒక్కరికీ పల్లెలలో లభిస్తుంది. పల్లెలు ప్రకృతి రమణీయతకు నిలయాలు. పల్లెలలో పచ్చని చెట్లు, పొలాలు, ఆ చెట్టుపై పక్షుల కలకూజితాలు మనోహరంగా ఉంటాయి. చెట్లు చల్లని గాలిని ఇస్తూ, గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పల్లెలలో పాడిపంటలు ఉంటాయి. తాజా కూరగాయలు, పళ్ళు, పూలు వారికి దొరుకుతాయి. గ్రామాలలో ప్రజలందరూ ఒకరితో నొకరు అన్నదమ్ముల్లాగా మెలగుతారు. వారు “అక్కా! బావా” అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటారు. కష్టసుఖాల్లో అందరూ కలిసి పాలుపంచుకుంటారు. గ్రామాలలో తీర్థాలు, సంబరాలు మహావేడుకగా జరుగుతాయి.

పల్లెలలో ఒకరింట్లో పెండ్లి అంటే, గ్రామంలో అందరికీ వేడుకే. పల్లెలలో సంక్రాంతికి ముగ్గులు, పూలతోరణాలు, గొబ్బిళ్ళు, భోగిమంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా ఉంటాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటి వేషధారులు, వారి చక్కని పాటలు ఆనందంగా ఉంటాయి. గ్రామాల్లో పంటలు పండి ఇంటికి వస్తే, ఇళ్ళు కలకలలాడుతాయి. అందమైన పాడి పశువులు, దుక్కిటెడ్లు, ఎడ్ల బళ్ళు మహావైభవంగా ఉంటాయి.

అందుకే పల్లెలు ప్రకృతి రమణీయతకు నట్టిళ్ళు. ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అని చెప్పగలము.

ప్రశ్న 14.
అవినీతి నిర్మూలనమునకు మీరిచ్చే సలహాలేమిటి?
జవాబు:
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అనేక రంగాలలో దేశం ముందంజ వేసింది. దురదృష్టవశాత్తూ మనదేశంలో అవినీతి కూడ పెచ్చుపెరిగింది. అక్రమ సంపాదన ప్రజల లక్ష్యమయిపోయింది. ఏదోరకంగా తప్పుచేసి అయినా డబ్బు సంపాదించడం, తన పని పూర్తిచేసుకోవడం, ఆశ్రితులకు మేలు చేయడం, నీతికి సమాధి కట్టడం జరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజకీయ నాయకులలో ఈ అవినీతి జాడ్యము విస్తరించిపోతోంది. చిన్న పంచాయతీ మెంబరు నుండి దేశ ప్రధాని వరకు అందరూ అవినీతి ఆరోపణలకు గురియగుచున్నారు. ఇది దేశానికి పట్టిన దౌర్భాగ్యం. దీనిని అరికట్టడంలో భావిభారత పౌరులైన యువతీయువకులు ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ముందడుగు వేయాలి.

ముందుగా దేశంలో జరిగే అవినీతి కార్యాలను గూర్చి చూద్దాము. వర్తకులు సరకులలో కలీ చేయడం, ప్రభుత్వము పంపిణీ చేసిన నిత్యావసర వస్తువులను దాచి, బ్లాక్ మార్కెట్లో అమ్మడం, ధరలు పెంచివేయడం, ప్రభుత్వానికి పన్నులు ఎగవేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వము ప్రజలకు ఇచ్చే సదుపాయాలు ప్రజలకు లభించేలా చూడ్డానికి భారీగా లంచాలు మింగుతున్నారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి, ఇళ్ళ స్థలాలు మొదలైనవి పంచడానికి లంచాలు తీసికొంటూ అర్హులయిన వారికి అన్యాయం చేసి వారికి ఇష్టమైన వారికి ఇస్తున్నారు. చౌకధరల దుకాణంలో సరుకులను దాచివేసి అక్రమ లాభాలు ఆర్జిస్తున్నారు. బ్యాంకుల అప్పులకు లంచాలు తీసికొంటున్నారు. విద్యాలయాలలో సీట్లకు లంచాలు, పాస్ చేయించడానికి లంచాలు ముట్టచెప్పవలసివస్తోంది. ఇట్లా దేశంలో అవినీతి అన్ని రంగాలలో తాండవిస్తోంది.

ఈ అవినీతిని అరికట్టడానికి యువతీయువకులు ముందుకు రావాలి. పత్రికలకు లేఖలు వ్రాసి లంచగొండుల గూర్చి అవినీతి శాఖ వారికి తెలియజేయాలి. అవినీతి శాఖ ఉద్యోగులు కూడా మరింత చురుకుగా పనిచేసి లంచగొండులను నిర్బంధించాలి.

రోజుకొక లంచగొండిని, కలీ వ్యాపారిని, దుష్ట రాజకీయవేత్తను ప్రభుత్వానికి యువత అప్పగిస్తే, కొద్దిరోజులలో దేశములో అవినీతి దానంతట అదే అంతరిస్తుంది. అవినీతిపరులకు ప్రభుత్వం కూడ గట్టి శిక్షలు విధించాలి. వారి ఉద్యోగాలు తీసివేయాలి. కలీ వ్యాపారులకు జరిమానాలు, జైలు శిక్షలు వేయాలి.

అవినీతి నిర్మూలన ప్రజలందరి లక్ష్యం కావాలి. లేనిచో ఈ అవినీతి చెదపురుగు దేశాన్నే కొరికి తినివేస్తుంది.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 15.
‘స్వచ్ఛభారత్’ గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికి పేటలు, గంగా, గోదావరి వంటి నదులజలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 16.
నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాల కార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాల కార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేట్లు చూడాలి. .

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాల కార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

బాల కార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Samasalu సమాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు కల రెండు పదాలు కలసి, ఏకపదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు.

గమనిక :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, కొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు.
ఉదా :
‘రామ బాణము’ అనే సమాసంలో, ‘రామ’ అనేది పూర్వ పదం. ‘బాణము’ అనేది ఉత్తర పదం.

1. ద్వంద్వ సమాసం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని, “ద్వంద్వ సమాసం” అంటారు.

ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.

1) ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు,
జవాబు:
అన్నదమ్ములు

2) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు

3) ప్రమాదంలో నా కాలుసేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలుసేతులు

అభ్యాసం:

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

I. ఈ కింది ద్వంద్వ సమాసాలకు విగ్రహవాక్యాలు రాయండి.

సమాసపదం విగ్రహవాక్యం
1) ఎండవానలు ఎండయు, వానయు ద్వంద్వ సమాసాలు
2) తల్లిదండ్రులు తల్లియు, తండ్రియు
3) గంగాయమునలు గంగయు, యమునయు

II. ఈ కింది విగ్రహవాక్యాలను సమాసపదాలుగా మార్చండి.

సమాసపదం విగ్రహవాక్యం
1) కుజనుడూ, సజ్జనుడూ కుజనసజ్జనులు
2) మంచి, చెడూ మంచిచెడులు
3) కష్టమూ, సుఖమూ కష్టసుఖములు

2. ద్విగు సమాసం :
సమాసంలో మొదటి (పూర్వ) పదంలో సంఖ్య గల సమాసాన్ని ద్విగు సమాసం అంటారు.

అభ్యాసం :
కింది సమాస పదాలను ఉదాహరణలో చూపిన విధంగా వివరించండి.
ఉదా : నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
1) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల జడలు
2) దశావతారాలు – దశ (10) సంఖ్య గల అవతారాలు
3) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్య గల రోజులు
4) నాలుగువేదాలు – నాలుగు (4) సంఖ్య గల వేదాలు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు ద్విగు సమాసాలు.

3. తత్పురుష సమాసం :
విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు “తత్పురుష సమాసాలు.” అభ్యాసము : కింది పదాలను చదివి, విగ్రహవాక్యాలు రాయండి.

సమాసపదం విగ్రహవాక్యం
1) రాజభటుడు రాజు యొక్క భటుడు
2) తిండి గింజలు తిండి కొఱకు గింజలు
3) పాపభీతి పాపము వల్ల భీతి

గమనిక :
‘రాజభటుడు’ అనే సమాసంలో ‘రాజు’ పూర్వ పదం. ‘భటుడు’ అనే పదం ఉత్తర పదం. ‘రాజభటుడు’ కు విగ్రహవాక్యం రాస్తే ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో యొక్క అనేది షష్ఠీ విభక్తి ప్రత్యయం. భటుడు రాజుకు చెందినవాడు అని చెప్పడానికి షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని వాడారు. ఈ విధంగా ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

గమనిక :
పూర్వ పదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి.

తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ, విగ్రహవాక్యం
1) ప్రథమా తత్పురుష సమాసం డు, ము, వు, లు మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య
2) ద్వితీయా తత్పురుష సమాసం ని, ను, ల, కూర్చి, గురించి జలధరం – జలమును ధరించినది
3) తృతీయా తత్పురుష సమాసం చేత, చే, తోడ, తో బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
4) చతుర్డీ తత్పురుష సమాసం కొఱకు, కై వంట కట్టెలు – వంట కోఱకు కట్టెలు
5) పంచమీ తత్పురుష సమాసం వలన (వల్ల), కంటె, పట్టి దొంగ భయం – దొంగ వల్ల భయం
6) షష్ఠీ తత్పురుష సమాసం కి, కు, యొక్క, లో, లోపల రామబాణం – రాముని యొక్క బాణం
7) సప్తమీ తత్పురుష సమాసం అందు, న దేశభక్తి – దేశము నందు భక్తి

 

8) నఞ్ తత్పురుష సమాసం నఞ్ అంటే వ్యతిరేకము అసత్యం – సత్యం కానిది

అభ్యాసం :
కింది సమాసాలు చదివి, విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో తెలపండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) రాజ పూజితుడు రాజుచే పూజితుడు తృతీయా తత్పురుషం
2) ధనాశ ధనము నందు ఆశ సప్తమీ తత్పురుషం
3) పురజనులు పురమందు జనులు సప్తమీ తత్పురుషం
4) జటాధారి జడలను ధరించినవాడు ద్వితీయా తత్పురుషం
5) భుజబలం భుజముల యొక్క బలం షష్ఠీ తత్పురుషం
6) అగ్నిభయం అగ్ని వల్ల భయం పంచమీ తత్పురుషం
7) అన్యాయం న్యాయం కానిది తత్పురుష సమాసం

తత్పురుష సమాసాలు :
విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను గూర్చి తెలిసికొన్నారు. కింది వాటిని కూడా పరిశీలించండి.
1) మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యము (మధ్య భాగం)
2) పూర్వకాలము – కాలము యొక్క పూర్వము (పూర్వ భాగం)

గమనిక :
పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల
‘మధ్యము’, ‘పూర్వము’గా మారతాయి. ఇలా పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాము. కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం = అసత్యం – సత్యం కానిది
2) నఞ్ + భయం = అభయం – భయం కానిది
3) నఞ్ + అంతము = అనంతము – అంతము కానిది
4) నఞ్ + ఉచితం = అనుచితం – ఉచితము కానిది

గమనిక :
సంస్కృతంలో ‘నఞ్’ అనే అవ్యయం, వ్యతిరేకార్థక బోధకం. దీనికి బదులు తెలుగులో అ, అన్, అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నం’ అనే అవ్యయాన్ని బట్టి, దీన్ని “నః తత్పురుష సమాసం” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

అభ్యాసము :
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామము పేర్కొనండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) అర్థరాత్రి రాత్రి యొక్క అర్ధము ప్రథమా తత్పురుషం
2) అనూహ్యము ఊహ్యము కానిది నఞ్ తత్పురుషం
3) అక్రమం క్రమము కానిది నఞ్ తత్పురుషం
4) అవినయం వీనయం కానిది నఞ్ తత్పురుషం

4. కర్మధారయ సమాసం :
‘నల్లకలువ’ అనే సమాస పదంలో ‘నల్ల’, ‘కలువ’ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది, విశేషణం. రెండో పదం ‘కలువ’ అనేది నామవాచకం. ఇలా విశేషణానికీ, సామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే, దాన్ని కర్మధారయ సమాసం అంటారు.

4. అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే, ఆ సమాసాన్ని “విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1) తెల్ల గుర్రం – తెల్లదైన గుర్రం.
తెలుపు (విశేషణం) (పూర్వపదం) – (మొదటి పదం) గుర్రం – (నామవాచకం) (ఉత్తరపదం)- (రెండవ పదం)

ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం :
మామిడి గున్న’ అనే సమాసంలో మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ సోమవాచకం, రెండో పదం (ఉత్తరపదం) గున్న అనేది విశేషణం. ఇందులో విశేషణమైన ‘గున్న’ అనే పదం ఉత్తరపదంగా – అంటే రెండో పదంగా ఉండడం వల్ల, దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు. అభ్యాసము : కింది పదాలను చదివి, విగ్రహవాక్యాలు రాసి, ఏ సమాసమో రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) పుణ్యభూమి పుణ్యమైన భూమి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు మంచి వాడైన రాజు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొతపుస్తకం కొత్తదైన పుస్తకం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) పురుషోత్తముడు ఉత్తముడైన పురుషుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
‘తమ్మివిరులు’ అనే సమాసంలో, మొదటి పదమైన ‘తమ్మి’, ఏ రకం విరులో తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం, నదులు, వృక్షాలు, ప్రాంతాలు మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా : మట్టి చెట్టు – మట్టి అనే పేరు గల చెట్టు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
గంగానది – గంగ యనే పేరు గల నది – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భారతదేశం – ‘భారతం’ అనే పేరు గల దేశం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం :
‘కలువ కనులు’ అనే సమాసంలో కలువ, కనులు అనే రెండు పదాలున్నాయి. దీనికి ‘కలువల వంటి కన్నులు’ అని అర్థం. అంటే కన్నులను కలువలతో పోల్చడం జరిగింది. సమాసంలోని మొదటి పదం (పూర్వపదం) ఇక్కడ ‘ఉపమానం’ కాబట్టి దీన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.

ఉ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
‘పదాబ్దము’ అనే సమాసంలో పద (పాదం) మరియు, అబ్జము (పద్మం) అనే రెండు పదాలున్నాయి. వీటి అర్థం పద్మము వంటి పాదము అని. ఇక్కడ పాదాన్ని పద్మం (తామరపూవు)తో పోల్చడం జరిగింది. కాబట్టి పాదం ఉపమేయం. పద్మం ఉపమానం. ఉపమానమైన అబ్జము అనే పదం, ఉత్తరపదంగా (రెండవపదం) ఉండడం వల్ల దీన్ని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు.

అభ్యాసం :
కింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామాలు పేర్కొనండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) తేనెమాట తేనె వంటి మాట
తేనె – ఉపమానం, మాట – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
2) తనూలత లత వంటి తనువు
తనువు – ఉపమేయం, లత – ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయం
3) చిగురుకేలు చిగురు వంటి కేలు
చిగురు – ఉపమానం, కేలు – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
4) కరకమలములు కమలముల వంటి కరములు
కరములు – ఉపమేయం
కమలములు – ఉపమానం
ఉపమాన పూర్వపద కర్మధారయం

5. రూపక సమాసం :
‘విద్యాధనం’ – అనే సమాసంలో విద్య, ధనం అనే రెండు పదాలున్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం కనుక, ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనంత గొప్పగా చెప్పబడింది. ఈ విధంగా ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు చెబితే అది ‘రూపక సమాసం’.

సమాస పదం విగ్రహవాక్యం
ఉదా : 1) హృదయ సారసం హృదయం అనెడి సారసం
2) సంసార సాగరం సంసారం అనెడి సాగరం
3) జ్ఞాన జ్యోతి జ్ఞానము అనెడి జ్యోతి
4) అజ్ఞాన తిమిరం అజ్ఞానము అనెడి తిమిరం
5) సాహితీ జగత్తు సాహిత్యమనెడి జగతు – రూపక సమాసం

6. బహుప్రీహి సమాసం :
అన్య పదార్థ ప్రాధాన్యం కలది. కింది ఉదాహరణను గమనించండి. ”
చక్రపాణి – చక్రం పాణియందు (చేతిలో) కలవాడు. ‘విష్ణువు’ అని దీని అర్థం. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు అనగా “చక్రానికి” కాని “పాణికి” కాని ప్రాధాన్యం లేకుండా, ఆ రెండూ మరో అర్థం ద్వారా “విష్ణువును” సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా, అన్యపదముల అర్థాన్ని స్ఫురింపజేసే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్య పదార్థ ప్రాధాన్యం కలది. ‘బహుబ్లి హి సమాసం’. అభ్యాసం : కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) నీలవేణి నల్లని వేణి కలది బహుబీహి సమాసం
2) నీలాంబరి నల్లని అంబరము కలది బహుబీహి సమాసం
3) ముక్కంటి మూడు కన్నులు గలవాడు బహుథీహి సమాసం
4) గరుడవాహనుడు గరుత్మంతుడు వాహనంగా కలవాడు బహుబీహి సమాసం
5) దయాంతరంగుడు దయతో కూడిన అంతరంగము కలవాడు బహుప్రీహి సమాసం
6) చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు బహుప్రీహి సమాసం

7. అవ్యయీభావ సమాసం :
అవ్యయం పూర్వపదముగా ఉన్న సమాసాలను, “అవ్యయీభావ సమాసాలు” అంటారు.

అవ్యయం :
అవ్యయాలు అనగా లింగ, వచన, విభక్తి లేని పదాలు. ఈ విధమైన భావంతో ఉన్న సమాసాలను అవ్యయీభావ సమాసాలు అంటారు. ఈ క్రింది సమాస పదాలను, వాటికి రాయబడిన విగ్రహవాక్యాలను పరిశీలించండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) ప్రతిదినము దినము దినము అవ్యయీభావ సమాసం
ఆ) యథాశక్తి శక్తి ఎంతో అంత (శక్తిననుసరించి) అవ్యయీభావ సమాసం
ఇ) ఆబాలగోపాలం బాలుడి నుండి గోపాలుడి వరకు అవ్యయీభావ సమాసం
ఈ) మధ్యాహ్నం అహ్నం మధ్యభాగం అవ్యయీభావ సమాసం
ఉ) అనువర్షం వర్షముననుసరించి అవ్యయీభావ సమాసం

గమనిక : ‘మధ్యాహ్నము” అనే సమాస పదానికి, విగ్రహం ‘మధ్యము – అహ్నము’ అని చెప్పాలి. ఇది ‘ప్రథమా తత్పురుష సమాసం’ అవుతుంది. అవ్యయీభావ సమాసం కాదు.

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

పాఠ్యపుస్తకంలోని ముఖ్య సమాసాలు – విగ్రహవాక్యాలు :

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1)  నలుదెసలు నాలుగైన దెసలు ద్విగు సమాసం
2) సూర్యచంద్రులు సూర్యుడును,చంద్రుడును ద్వంద్వ సమాసం
3) చంపకవతి పట్టణం ‘చంపకవతి’ అనే పేరు గల పట్టణం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
4) మహాభాగ్యం గొప్పదైన భాగ్యం విశేషణ పూర్వపద కర్మధారయం సమాసం
5) సేవావృత్తి సేవ అనెడి వృత్తి రూపక సమాసం
6) పదాబ్దములు పద్మముల వంటి పదములు ఉపమాన ఉత్తరపద కర్మధారయం
7) కలువ కన్నులు కలువల వంటి కన్నులు ఉపమాన పూర్వపద కర్మధారయం
8) మామిడి గున్న గున్నయైన మామిడి విశేషణ ఉత్తరపద కర్మధారయం
9) మృదుమధురము మృదువును, మధురమును విశేషణ ఉభయపద కర్మధారయం
10) సత్యదూరము సత్యమునకు దూరము షష్ఠీ తత్పురుష సమాసం
11) అమెరికా రాయబారి అమెరికా యొక్క రాయబారి షష్ఠీ తత్పురుష సమాసం
12) వాదనాపటిమ వాదన యందు పటిమ సప్తమీ తత్పురుష సమాసం
13) అసాధ్యం సాధ్యము కానిది నఞ్ తత్పురుష సమాసం
14) నెలతాల్పు నెలను తాల్చువాడు ద్వితీయా తత్పురుష సమాసం
15) గురుదక్షిణ గురువు కొఱకు దక్షిణ చతుర్డీ తత్పురుష సమాసం
16) వయోవృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు తృతీయా తత్పురుష
17) దొంగభయము దొంగ వలన భయము పంచమీ తత్పురుష సమాసం
18) ధూపదీపములు ధూపమును, దీపమును ద్వంద్వ సమాసం
19) శివభక్తి శివుని యందు భక్తి సప్తమీ తత్పురుష సమాసం
20) రుద్రాక్షభూషలు ‘రుద్రాక్షలు’ అనే పేరు గల భూషలు సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
21) వితంతు వివాహం వితంతువు యొక్క వివాహం షష్ఠీ తత్పురుష సమాసం
22) విద్యాధికులు విద్యచేత అధికులు తృతీయా తత్పురుష సమాసం
23) భారతదేశం భారతం అనే పేరు గల దేశం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
24) ముప్పయి సంవత్సరాలు ముప్ఫై సంఖ్య గల సంవత్సరాలు ద్విగు సమాసం
25) స్త్రీ పురుషులు స్త్రీయును, పురుషుడును ద్వంద్వ సమాసం
26) ప్రముఖదినం ప్రముఖమైన దినం విశేషణ పూర్వపద కర్మధారయం
27) నాలుగు గీతలు నాలుగు సంఖ్య గల గీతలు ద్విగు సమాసం
28) అసాధారణం సాధారణం కానిది నఞ్ తత్పురుష సమాసం
29) మానవచరిత మానవుల యొక్క చరిత షష్ఠీ తత్పురుష సమాసం

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Lesson గోరంత దీపాలు Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 10th Lesson గోరంత దీపాలు

10th Class Telugu 10th Lesson గోరంత దీపాలు Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

జడ్డ ఆకలి అమ్మకి తెలుస్తుంది. ఈ తల్లులకు తమ ఆకలేకాదు, అనాథల క్షుద్బాధా తెలుసు. ఇంత తెలిసిన వీరంతా గొప్ప స్థితిమంతులేం కాదు. అలాంటప్పుడు లేనివారికి గుప్పెడు మెతుకులు పంచేదెలా? ఆలోచించగా ఆలోచించగా వారికొక దారి దొరికింది. రోజూ పిడికెడు గింజలు దాచాలన్న ఊహ కలిగింది. పిడికిలి జగిస్తే ఉద్యమం అవుతుంది. ఆ ఊళ్లో జనం పిడికిలి తెరిచారు. తమ దగ్గరున్న గింజల నుంచి ప్రతిరోజూ పిడికెడు పంచడం నేర్పారు. ఇవ్వడం సాయం, పంచడం మానవత్వం. సాటి మనుషుల ఆకలి తీర్చడం దైవత్వం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరా ద్వారా మీరేం తెలుసుకున్నారు?
జవాబు:
సాటి మనుషుల ఆకలి తీర్చాలి అని తెలుసుకొన్నాం.

ప్రశ్న 2.
మానవత్వంతో చేసే పనులు ఏవి?
జవాబు:
మన దగ్గరున్న సంపదను ఇతరులకు పంచడం మానవత్వం. అనాథలను, అభాగ్యులను, పేదలను ఆదుకోవడం
మానవత్వంతో చేసేపని.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
సహాయపడే గుణం, మానవత్వం కలిగిన వారి వల్ల సమాజానికి కలిగే మేలు ఏమిటి?
జవాబు:
సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా సహాయపడతారు. వారి వలన బలహీనులు రక్షించబడతారు. అందరికీ మేలు
జరుగుతుంది. సమాజంలో శాంతి నెలకొంటుంది. ఎంతోమంది జీవితాలలో వారు వెలుగులు నింపుతారు.

ప్రశ్న 4.
మీరు ఇతరులకు ఎప్పుడైనా సాయం చేశారా? ఎప్పుడు? ఎందుకు?
జవాబు:
నేను, ఇతరులకు చాలాసార్లు సాయం చేశాను. ఒకసారి మా స్నేహితుడు టిఫిను చేయకుండా పాఠశాలకు వచ్చాడు. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పాడు. వెంటనే మాష్టారికి చెప్పాను. వెంటనే మాష్టారు బిస్కెట్లు, టీ తెప్పించి ఇచ్చారు. నీరసం తగ్గింది.
(గమనిక : తరగతిలోని ప్రతి విద్యార్థి తన అనుభవాన్ని చెప్పాలి.)

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
“గోరంత దీపాలు” అనే శీర్షిక ఈ పాఠానికి తగిన విధంగా ఉందా? ఎందుకు? సకారణంగా చర్చించండి.
జవాబు:
(గమనిక : విద్యార్థి తనకు శీర్షిక నచ్చితే నచ్చిందని సకారణంగా నిరూపించవచ్చును. నచ్చకపోతే ‘శీర్షిక తగదు’ అని సకారణంగా నిరూపించవచ్చును. రెండు అభిప్రాయాలను ఇస్తున్నాం. ఒక దానిని మాత్రమే గ్రహించండి.)

1) శీర్షిక తగినదే :
గోరంత దీపాలు పాఠంలో అనాథ శిశువులను వృద్దుడు చేరదీసి వారి జీవితాలను ఆనందమయం చేస్తున్నాడు. చాలామంది బాలబాలికలు ఆయన వద్ద ఆశ్రయం పొందుతున్నారు. వారందరు ఆయన ప్రేమాప్యాయతలతో పాటు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఆ పిల్లలంతా అనాథలే ? రైలు పెట్టెలు శుభ్రం చేసేవారు కొందరు, యాచన, చిన్న చిన్న దొంగతనాలు చేసిన వారు కూడా ఆ పిల్లల్లో ఉంటారు. వాళ్ళు ఈ విశాల ప్రపంచంలో దిక్కుమొక్కు లేక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంటే చేరదీసి అక్కున చేర్చుకున్నాడా వృద్ధుడు. ఆ పసి పిల్లలందరు చిఱుగాలికి రెపరెపలాడే గోరంత దీపాల్లాంటివారు. ఆ గోరంత దీపాలకు కొండంత అండగా నిలబడ్డాడు వృద్ధుడు. వారికి ఆశ్రయం కల్పించి తీర్చిదిద్దుతున్నాడు వృద్ధుడు. ఈ కథలోని వృద్ధుడు చదువుతున్న వారపత్రికలోని కథ కూడా అనాథబాలుని కథే. అందుచేత ఈ పాఠానికి గోరంత దీపాలనే శీర్షిక తగిన విధంగా ఉంది.

2) శీర్షిక తగినది కాదు :
గోరంత దీపాలు పాఠంలో అనాథబాలలు కంటే వృద్ధుని ఔదార్యం ప్రధానమైనది. ఆ వృద్ధుని ఔదార్యాన్ని పదిమంది ఆదర్శంగా స్వీకరించాలి. ఈ శీర్షికలలో వృద్ధుని ఔదార్యం ఎక్కడా ధ్వనించదు. శీర్షిక ఎప్పుడు అంశంలోని ప్రధాన విషయాన్ని ధ్వనించేదిగా ఉండాలి. గోరంత దీపాలు అనేది అనాథ బాలల దీనస్థితిని తెలియజేస్తోంది తప్ప ఇక దేనిని తెలియచేయటం లేదు. అంతేకాక ఆ గోరంతదీపాలకే కొండంత అండగా నిలబడి తీర్చిదిద్దిన త్యాగమూర్తిని పట్టించుకోలేదు. పెరిగి పెద్దయ్యాక ఆ గోరంత దీపాలే ఆ వృద్ధుని పాదాలకు కృతజ్ఞతతో కన్నీటి అభిషేకాలు చేసారు. ఇంతటి మహోన్నతమైన త్యాగనిరతిని బాధ్యతను, మానవత్వాన్ని, శీర్షిక విస్మరించడం విజ్ఞులను ఆశ్చర్యపరుస్తుంది. శీర్షికను చూచిన మరుక్షణం ఉత్తేజం కలగాలి. కథలోని ఆశయం తెలియాలి. దీనికి మానవత్వపు పరిమళం అనే శీర్షిక పెట్టి ఉంటే సార్థకత చేకూరి ఉండేది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 2.
పాఠం చదవండి. “వేపచెట్టు” గురించి వివరించిన, వర్ణించిన వాక్యాలు ఏమేమి ఉన్నాయి? వాటిని గుర్తించి చదవండి.
జవాబు:
పాఠ్యాంశం మొదటి ఐదు వాక్యాలు వేపచెట్టుని వర్ణించాయి. వేపచెట్టును తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే చెట్టుగా వర్ణించారు. ఆ చెట్ల కొమ్మలను దరిద్రుడి గుండెల్లో నుండి పుట్టిన అంతులేని ఆశల్లా అభివర్ణించారు. నాలుగు కొమ్మలు నాలుగు దిక్కుల్లా బాగా విస్తరించాయని చెప్పారు. కలిగిన వాడికి బాగా కండపట్టినట్లు ఆ కొమ్మలు పూతా పిందెలతో నిండుగా ఉన్నాయని వర్ణించారు.

మధ్యలో ఎక్కడా వేపచెట్టు వర్ణన లేదు. చివరి నుండి రెండవ పేరాలో వేపచెట్టు వర్ణన ఉంది. అది ఆ వృద్ధుడు వచ్చిన మనిషితో వేపచెట్టు గురించి చెప్పాడు. వేపచెట్టు అనగానే చేదు అనే భావన మనసులో మొదలవుతుంది. కానీ వేపచెట్టుని ఆశ్రయిస్తే చల్లని నీడ నిస్తుంది.

కనీసం ప్రతీరోజు ఒక వేపకాయని నమిలిన అనేక దీర్ఘరోగాలు తగ్గుతాయి. వేపపుల్లతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు, నోటి జబ్బులు రావు. (పిప్పిపళ్ళు) (పుచ్చుపళ్ళు) ఉండవు.

ప్రశ్న 3.
పాఠంలోని కింది పేరాలు చదవండి. ఆ పేరాలలో వేటి గురించి వివరించారో తెల్పండి. ఆ పేరాల్లోని వివరణ/వర్ణనకు సంబంధించిన కీలక పదాలను రాయండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు 1

ప్రశ్న 4.
క్రింది వాక్యాలు చదవండి. ఎవరు, ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు?

అ) అవును బాబూ ! నిజంగా అతడు అదృష్టవంతుడే!
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని ఎప్పుడు వచ్చావని వృద్ధుడు అడిగితే అదృష్టవంతుడికి (వృద్ధుడికి) కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు అని అతను చెప్పిన సందర్భంలో తన పాదాలను కన్నీటితో అభిషేకం చేసిన వ్యక్తి నిజంగా అదృష్టవంతుడని చెప్తున్న సందర్భంలోని వాక్యమిది.

భావం:
వృద్ధుని ఆశ్రయంలో చక్కగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడిన అనాథ చాలా అదృష్టవంతుడు అని వృద్ధుని భావం.

ఆ). “పెట్టమన్న చోటల్లా కండ్లు మూసుకొని సంతకాలు పెడుతున్నాను. అనాథలయిన పిల్లలు, వాళ్ళ అధోగతికి దారితీస్తే పుట్టగతులుండవు” ఇది మాత్రం మనసులో పెట్టుకోండి !”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
తన గుమాస్తా తెచ్చిన చిట్టా పుస్తకంలో వృద్ధుడు సంతకాలు పెడుతూ, అతనితో మాట్లాడిన మాటలివి.

భావం:
అనాథ బాలల ఆశ్రమ చిట్టా పుస్తకాలలో వృద్ధుడు పరిశీలించకుండా సంతకాలు పెడుతున్నాడు. ఆ అనాథ పిల్లలకు సంబంధించిన ఖర్చులు దానిలో ఉంటాయి. ఆ లెక్కలలో తేడాపాడాలుంటే మహాపాపం. అందుచేత పాపభీతితో పనిచేయాలి అని వృద్ధుని మాటల సారాంశం.

ఇ) “అదృష్టవంతుడికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు!”
జవాబు:
పరిచయం:
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
కథా రచయితను వృద్ధుడు ఎప్పుడు వచ్చావు బాబు, అని అడిగినపుడు రచయిత చెప్పిన సమాధానమిది.

భావం:
అనాథను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించి అతని జీవితంలో కొండంత వెలుగును నింపి అతని కృతజ్ఞతకు పాత్రుడైన వృద్ధునికి అతడు కన్నీటితో నమస్కరించాడు అని భావం.

ఈ) “మీరెక్కడున్నా, నేనెక్కడున్నా తమ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని మహా అదృష్టంగా భావిస్తాను”.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
వృద్ధుని ఆశ్రయంలో చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొన్న వ్యక్తి బదిలీపై వేరే ఊరికి వెళుతూ 3 . వృద్ధుని పాదాలకు నమస్కరించి కృతజ్ఞతతో పలికిన వాక్యమిది.

భావం:
వృద్ధుడంటే ఆ వ్యక్తికి దైవంతో సమానం అని భావం.

ఉ) “అవి గోరంత దీపాలే కావచ్చు. ఏనాటికో ఒక నాటికి, అవి కొండంత వెలుగునిస్తాయి”.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
కథకుని ప్రశ్నకు సమాధానంగా వృద్ధుడు పలికిన వాక్యమిది. అనాథలను, వీథి బాలలను, కొడిగట్టిన దీపాలతో, వేపచెట్టుతో పోల్చి చెప్పుచున్న సందర్భములోని వాక్యమిది.

భావం:
అనాథలైన బాలలు గోరంత దీపాల వంటివారు. వారిని ఆదరించి కాపాడితే ఉన్నతులై కొండంత వెలుగును ఇస్తారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 5.
పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

బతకడానికి ఉద్యోగం వెతుక్కుంటారు కొందరు. జీవితానికి అర్థం వెతుక్కుంటారు మరికొందరు ….. లక్ష్మీకాంతం రెండో కోవకు చెందుతారు. ఒక బిడ్డ కన్నీరు తుడవడమే భాగ్యం. ఒక బిడ్డకు తల్లి కావడం ఇంకా భాగ్యం. అలాంటిది లక్ష్మీకాంతం అరవై ఎనిమిది మంది అనాథలకు అమ్మలా మారారు. వాళ్ళకు కంటిపాప అయ్యారు. పైపైన చేస్తే ఉద్యోగం అవుతుంది. హృదయంలో నుంచి చేస్తే మానవత్వం అవుతుంది. లక్ష్మీకాంతం మానవీయ మూర్తి. వీధి బాలలుగా ముద్రపడిన అనాథలకు విశాఖ వాకిట నేడొక అమృతహస్తం దొరికింది. కన్నతల్లి ఒడి దక్కినట్టయింది. వీళ్ళ జీవితాలకు అండగా నేనుంటానంటూ పోడూరి లక్ష్మీకాంతం ముందుకు వచ్చింది. మాటలు కాదు – గత పదేళ్ళుగా ఆప్యాయతానురాగాలను చేతల్లో చూపుతోంది. అరవై ఎనిమిది మంది వీధి బాలల (స్ట్రీట్ చిల్డ్రన్) కు అమ్మగా
అవతరించింది. కన్నబిడ్డల కంటే వీధి బాలలనే ఎక్కువగా చూసుకుంది.
ప్రశ్నలు:
అ) పై పేరా దేని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
పోడూరి లక్ష్మీకాంతం గారి ఔదార్యం గురించి తెలియజేస్తోంది. అనాథ బాలలను ఆమె ఆదుకొంటున్న విధానం గూర్చి తెలియజేస్తోంది.

ఆ) పై పేరాలోని కీలకపదాలను ఏరి రాయండి.
జవాబు:
(గమనిక : కీలకపదాలు అంటే ముఖ్యమైన పదాలు. పేరాలోని విషయం సూటిగా తెలియజేసే పదాలు అని గ్రహించండి.)
ఉద్యోగం వెతుక్కోవడం, అర్థం వెతుక్కోవడం, రెండో కోవ, కన్నీరు తుడవడం, తల్లి కావడం, అనాథ, కంటి పాప, మానవత్వం, మానవీయమూర్తి, వీధి బాలలు, ముద్రపడడం, అమృతహస్తం, తల్లి ఒడి, అండ, ఆప్యాయతానురాగాలు, అవతరించడం, కన్నబిడ్డలు.

ఇ) ‘అమృతహస్తం’ అనే పదానికి అర్థమేమిటి?
జవాబు:
‘అమృతం’ బాధలను రూపుమాపుతుంది. అలాగే అమృతం లాంటి చెయ్యిగల వారు అంటే పదిమందికి సహాయం చేసేవారు అని అర్థం. ఇతరుల కష్టాలను నివారించి, ఆదుకొనే వారని అర్థం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 6.
పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) వృద్ధుడి వద్దకు వచ్చిన కుర్రాడు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది? రచయిత అతని ప్రవర్తనను ఏఏ వాక్యాలతో వివరించాడు.
జవాబు:
వృద్ధుని వద్దకు వచ్చిన కుర్రవాడు నిలబడి ఉన్నాడు. అతను నిలబడటంలో వినయం ఉట్టిపడుతోంది. అతని వేషంలో సంస్కారం ఉంది. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.

ఆ కుర్రవాడు వినయానికి మారుపేరుగా ఉన్నాడు. సంస్కారవంతంగా ప్రవర్తించాడు. వృద్ధుడు ఆశీర్వదిస్తుంటే కృతజ్ఞతా భావంతో ఉన్నాడు. అతనికి ఆనంద భాష్పాలు వచ్చాయి. వృద్ధుని పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. పైకి లేచి మళ్ళీ నమస్కరించాడు. అలా నమస్కరిస్తూనే నాలుగు అడుగులు వెనక్కు వేసి, శిరసువంచి నమస్కరించి హుందాగా వెళ్ళి పోయాడు. ఈ ప్రవర్తనను బట్టి ఆ కుర్రవాడు కృతజ్ఞత కలవాడని తెలుస్తోంది. ఆదర్శవంతమైన ప్రవర్తన కలవాడు. ఉపకారం పొందినవారెవరయినా, ఉపకారం చేసిన వారి పట్ల ఎలా ప్రవర్తించాలో ఆ కుర్రవాని ప్రవర్తన బట్టి తెలుసుకోవచ్చును.

రచయిత అతని ప్రవర్తనను చక్కటి పదాలతో భావస్పూరకంగా వర్ణించాడు. ఆ కుర్రవాడు నిలబడి ఉండడంలో వినయం ఉట్టిపడుతూ ఉంది. వేషంలో సంస్కారం ఉంది. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంది అని వర్ణించాడు. అతని కనుకొలుకుల్లో నిలచిన నీళ్ళు సంజెవెలుగులో ముత్యాలలా మెరుస్తున్నాయి. అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావం అతని ముఖంలో దోబూచులాడుతూ ఉంది. ఆనందానుభూతిలో తడుస్తూ మూగబోయాడు. తనివితీరనట్లు మళ్ళీ ఒకసారి ఆ కుర్రవాడు అతని పాదాలను ఒడిసిపట్టుకున్నాడు. పాదాల మీద తలను ఆనించాడు. కన్నీటితోనే అతని పాదాలను కడుగుతున్నాడేమో అనే వాక్యాలతో అతని ప్రవర్తనను వివరించాడు.

కన్నీటితో నిండిన కండ్లను జేబురుమాలుతో వత్తుకున్నాడు. మళ్ళీ ఒకసారి రెండు చేతులు జోడించాడు. జోడించిన చేతులు జోడించుకున్నట్లే ఉంచుకుని అలాగే నాలుగు అడుగులు వెనక్కు వేశాడు. అక్కడ నిలబడి మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి నమస్కరించాడు. గిరుక్కున వెనక్కు తిరిగి హుందాగా ముందుకు సాగిపోతున్నాడనే వాక్యాలతో అతని ప్రవర్తనను వర్ణించాడు.

ఆ) విద్యానగరం ఒక విద్యాలయం కదా! దాని ఆవరణ, వాతావరణం ఎలా ఉంది?
జవాబు:
విద్యానగరం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అది దాదాపు రెండు, మూడు చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉంది. అక్కడ ఒక వేపచెట్టు, అంత కంటే పెద్దవైన రావి చెట్లున్నాయి. మట్టిమానులున్నాయి. జువ్వి చెట్లున్నాయి. రకరకాల పూల మొక్కలున్నాయి. కూరల తోటలున్నాయి. పాలపిట్టలు పరవశంగా పాడుకొంటుంటాయి.

ఆ ఆవరణలో బాలబాలికలకు వసతి గృహాలున్నాయి. అతిథులకు ప్రత్యేక సదుపాయాలతో గదులున్నాయి. వయోవృద్ధులకు వసతులు ఉన్నాయి. గ్రంథాలయం ఉంది. సాయంసమయాలలో పూజకు ప్రార్థనాలయం ఉంది. వేలాది మంది అనాథలు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని వందలమంది ఉపాధ్యాయులు ఆ అనాథలకు విద్య నేర్పుతున్నారు.

ఇ) వృద్దుడు చేస్తున్న సేవాకార్యక్రమం గురించి లోకం ఏమనుకునేది ? దానికి వృద్ధుడి ప్రతిస్పందన ఎలా ఉంది?
జవాబు:
పరులకు సేవ చేస్తున్నాననే పేరుతో స్వార్థం పెంచుకొన్న మనిషిగా వృద్ధుడిని లోకం నిందించింది, నోరు లేని పిల్లలకు అర్థాకలిగా అన్నం పెడుతున్నాడు. వాళ్ళ నోళ్ళు కొడుతున్నాడని కూడా ఆడిపోసుకొంది.

అయినా వృద్దుడు పట్టించుకోలేదు. పుండు మీద మాత్రమే కారం చల్లినా, ఉప్పు చల్లినా మంట పుడుతుంది. పుండ్లులేని దేహానికి మండదు కదా ! అలాగే తప్పు చేస్తుంటే లోకం అనే మాటలకు బాధపడాలి. తన తప్పేమీలేనపుడు ఆ మాటలు గాలిలో కలిసి పోతాయి. కాబట్టి లోకానికి భయపడి, మంచి లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. అలా విడిచి పెడితే అది చేతగానితనమే అవుతుంది.

ఈ) వారపత్రికలో చదివిన కథ ఏమిటి?
జవాబు:
వృద్ధుడు చదివిన కథలో దొరైరాజ్ పదేండ్ల కుర్రవాడు. అతడు రైలు పెట్టెలు తుడుస్తాడు. ప్రయాణీకులు దయతలచి ఇచ్చిన డబ్బులతో జీవితం గడుపుతాడు. ఇచ్చిన వారికి నమస్కారం చేస్తాడు. ఇవ్వకపోతే పట్టించుకోడు. అలాగే ఒక వ్యక్తి ముందు చేయి ఊపుతాడు. ఆ వ్యక్తి, దొరైరాజ్ ను ఆప్యాయంగా దగ్గరికి పిలుస్తాడు. పేరు అడుగుతాడు. నిర్లక్ష్యంగా తన పేరు చెబుతాడు దొరైరాజ్, చేతిలో చిల్లర పైసల్ని ఎగరేసుకొంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న దొరైరాజ్ న్ను చూసి, ఆలోచనలో పడతాడు ఆ వ్యక్తి. ఇది ఆ కథ, అంటే జీవితం గడవక పోయినా, గడిచినా ఎవరి ధోరణి వారిది. ఎవ్వరూ తమ ధోరణిని మార్చుకోరు. ఆప్యాయతలు, అనురాగాలతో పనిలేదు. తమ నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టరు. అలాగ అనాథలైన పిల్లలను చేరదీయాలి. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని ఉన్నా ఆ అనాథలు రావాలి కదా! మారాలి కదా ! అవకాశాలు వినియోగించుకోవాలి కదా !

ఉ) రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడి గురించి వృద్ధుడు ఏం చేశాడు?
జవాబు:
రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడిని పరీక్షించాలనుకొన్నాడు. నిద్రపోతున్నట్లు నటించాడు. ఆ పిల్లవానిని గమనించాడు. పనిలో శ్రద్ధను పరిశీలించాడు. ఆనందించాడు. ఐదు రూపాయిల కాగితం జారవిడిచాడు. దానిని ఆ కుర్రవాడు ఆ కాగితాన్ని తీసి, వృద్ధుని లేపి ఇచ్చేశాడు. అతని నిజాయితీ వృదుని ఆనంద సంభ్రమాలలో ముంచింది. ఒక పావలా ఇచ్చాడు. ఆ కుర్రవాడు అది అందుకొని, నమస్కరించాడు. తర్వాత తన పనిలో లీనమయ్యాడు. తర్వాత ఆ పిల్లవానిని పిలిచి, కుశలప్రశ్నలు వేశాడు. తనతో రమ్మన్నాడు. ఆలనాపాలనా చూశాడు. చదువు చెప్పించాడు. పెళ్ళి చేశాడు. ఉద్యోగం వచ్చింది. వాడు జీవితంలో స్థిరపడ్డాడు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “గోరంత దీపం” కథానిక ద్వారా మీరు గ్రహించిన ముఖ్యమైన ఐదు విషయాలు రాయండి.
జవాబు:
గోరంత దీపం కథానికలో వృద్ధుని ద్వారా అనాథలను అక్కున చేర్చుకొని, ఆదుకోవాలి అని తెలుసుకొన్నాము. ఆదుకొంటే ఆ గోరంత దీపాలే సమాజానికి కొండంత వెలుగునిస్తాయి అని తెలుసుకొన్నాము. కుర్రవాని పాత్ర ద్వారా, నిజాయితీతో, నిబద్ధతతో పనిచేయాలి అని తెలుసుకొన్నాం. మనకు ఉపకారం చేసిన వారిపట్ల కృతజ్ఞతతో ఉండాలి అని తెలుసుకొన్నాం. పెద్దలతో స్నేహంగా ఉండాలి. వారి అనుభవాలను వినాలి, వారు చెప్పే విషయాలు విని, ఆచరిస్తే జీవితంలో ఉన్నతులుగా గుర్తించబడతామని తెలుసుకొన్నాం, వేపచెట్టులోని ఔషధ గుణాలు కూడా తెలిసాయి.

ఆ) “ఆ కుర్రవాడి బతుకుమీద కూడా ఓ ప్రయత్నం చేయాలని సంకల్పించాను.” అన్న వృద్ధుడు ఏం ప్రయత్నం చేశాడు? దాని ఫలితం ఎలా ఉంది?
జవాబు:
వృద్ధుడు రైలు పెట్టెలోని అనాథబాలుని గమనించాడు. అతనికి పనిపై ఉన్న శ్రద్ధను గమనించాడు. తను చదివిన కథ దీనికి బలం చేకూర్చింది, ఆ పిల్లవాడి నిజాయితీ పరీక్షించాలనుకొన్నాడు. ఐదు రూపాయిలనోటు జారవిడిచి, నిద్రపోతున్నట్లు నటించాడు. ఆ కుర్రవాడు ఆ నోటును తీసి, వృద్ధుని నిద్రలేపి ఇచ్చేశాడు. కుర్రవాడికి ఒక పావలా ఇచ్చాడు. నమస్కరించి, తనపనిలో లీనమయ్యాడు కుర్రవాడు.
అతనికి ఉన్న పనిపట్ల శ్రద్ధ, కష్టపడే స్వభావం, నిజాయితీ వృద్ధునికి నచ్చాయి, చేరదీసి చదివించాడు. కష్టపడి చదువుకొన్నాడు. మంచి ఉద్యోగి అయ్యాడు. ఆ బాలుడి జీవితం స్థిరపడింది. వృద్ధుని ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది.

ఇ) “బాబూ! ఈ వయస్సులో చదువుకొంటే, ఆ వయస్సులో సంపాదించుకోవచ్చు”ఈ వాక్యం గురించి మీ అభిప్రాయాల్ని రాయండి.
జవాబు:
ఎవరైనా చిన్నతనంలో చదువుకోవాలి. బాల్యం జీవితానికి పునాది వంటిది. బాల్యంలోని ప్రవర్తనను బట్టి ఆ మనిషి
జీవితం ఉంటుంది. బాల్యంలో బాగా చదువుకొంటే, మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు. డబ్బు సంపాదించుకొని జీవిత మంతా సుఖపడవచ్చును. 100 సంవత్సరాల జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకొంటే మిగిలిన 80 సంవత్సరాలూ సుఖపడవచ్చు. మొదటి ఇరవై సంవత్సరాలు చదువుకోకుండా, డబ్బులు సంపాదించుకొంటూ సుఖపడితే, మిగిలిన 80 సంవత్సరాలూ కష్టపడాలి. అందుకే ‘పిల్లలు బడికి – పెద్దలు పనికి’, ‘పనికెందుకు తొందర ? చదువుకో
ముందర’ అని ప్రభుత్వం నినాదిస్తోంది.

ఈ) ‘ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలే మన నేస్తాలు’ అనే వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:
ఒంటరిగా ఉన్నప్పుడు తప్పని సరిగా పుస్తకాలే మన నేస్తాలు అనే వాక్యంతో ఎవరైనా ఏకీభవించాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. వాటిలో చెడు ఆలోచనలు కూడా రావచ్చును. ఏదైనా పుస్తకం చదువుకొంటే అటువంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉండదు. సమయం కూడా తెలియదు. జ్ఞానం పెంపొందుతుంది. పుస్తకాలలో కూడా మంచి ఉన్నత విలువలతో కూడిన వాటిని మాత్రమే చదవాలి. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఒంటరితనం మరచిపోతాం. “ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం” అని ఆర్యోక్తి. అందుచేత పుస్తకాలే మన నేస్తాలుగా చేసుకొంటే, ప్రపంచమంతా మన కుటుంబమవుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) “గోరంతదీపాలు” కథానికలోని వృద్ధుని పాత్ర స్వభావాన్ని, గొప్పదనాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
గమనిక :
ఏ పాత్ర స్వభావం రాయాలన్నా కథలోని ఆ పాత్ర ప్రవర్తన, మాటల తీరును గమనించాలి. ఆ విషయాన్నే సొంతమాటలలో రాయాలి.

వృద్ధుడు :
నేస్తాలు లేనపుడు పుస్తకాలే మన నేస్తాలని భావించే స్వభావం కలవాడు. కేవలం పుస్తకాలలో చదవడమే కాకుండా వాటిని నిజ జీవితంలో ఆచరణలో పెట్టే స్వభావం కలవాడు. పరోపకారి. ముఖ్యంగా అనాథలను, వృద్ధులను ఆదరిస్తాడు, అతిథులను గౌరవిస్తాడు. వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తాడు. దైవభక్తి కలవాడు, నీతి నిజాయితీలు కలవారిని, నిబద్ధతతో, శ్రద్ధతో పనిచేసే వారిని ఇష్టపడతాడు. పచ్చటి ప్రకృతిలో జీవించడమంటే ఇష్టపడతాడు.

గొప్పతనం :
ఒక అనాథను పరీక్షించాడు. అతని నీతి నిజాయితీలను తెలుసుకొన్నాడు, పనిపట్ల శ్రద్ధను గమనించాడు, చదివించాడు. పెళ్ళి చేశాడు. ఉద్యోగం వచ్చింది. అతను స్థిరపడ్డాడు. అనాథలోని మంచి గుణాలను గుర్తించి, తీర్చిదిద్దిన మహోన్నతుడు, ఒక్కడినే కాదు వేలాది మంది బాలబాలికలను తీర్చిదిద్దాడు. వందల మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించిన మహానుభావుడు వృద్ధుడు.

ఆ) వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుని మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? వారి మధ్య ఉన్న సంబంధాన్ని, అనురాగాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
(లేదా)
‘గోరంతదీపం’ కథానిక ద్వారా వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుని మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో విశ్లేషిస్తూ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
వృద్ధునికి, యువకునికి మధ్య ఉన్న సంబంధం తల్లీ పిల్లల అనుబంధం కంటె గొప్పది. తండ్రీ తనయుల సంబంధం కంటే మిన్న, భగవంతునికి భక్తునికీ మధ్య ఉన్న సంబంధం వంటిది అని చెప్పవచ్చును. ఇద్దరు సత్పురుషుల మధ్య సంబంధం ఏర్పడితే అలాగే ఉంటుంది.

ప్రయోజకుడైన యువకుడు వృద్ధుని వద్ద నిలబడిన తీరు, అతని వేషం గమనిస్తే ఇది బోధపడుతుంది. భగవంతుడు ప్రత్యక్షమైతే, భక్తుడు ఎంత పరవశిస్తాడో అంతగా పరవశించాడు వృద్ధుని చూసిన యువకుడు. ఆ వృద్ధుని పాదాలకు కన్నీటితో అభిషేకం చేసిన తీరును గమనిస్తే అతనికి గల గౌరవభావన తెలుస్తుంది. అతనిని ఆశీర్వదిస్తున్న వృద్ధుని కళ్ళలోని ఆనందభాష్పాలు చూస్తే అతని పట్ల గల వాత్సల్యం తెలుస్తుంది. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వృద్ధుడికి తనకంటే కూడా ఆ కుర్రవాడంటేనే ఇష్టం. అలాగే ఆ కుర్రవానికీ, వారిద్దరి అనురాగాన్ని గమనిస్తే ఒకే ప్రాణం రెండు శరీరాలలో ఉందేమో అనిపిస్తుంది.

ఇద్దరూ అదృష్టవంతులే. అనాథ కుర్రవాడు అదృష్టవంతుడు కనుకనే వృద్ధుడు రైలు పెట్టెలో కనిపించాడు. చేరదీశాడు, ఆలనాపాలనా చూశాడు, చదువు చెప్పించాడు, పెండ్లి చేశాడు. ఉద్యోగం సంపాదించుకొందుకు దారి చూపాడు. ఎటో పోవలసిన జీవితం గౌరవంగా స్థిరపడింది.

వృద్ధుడు కూడా అదృష్టవంతుడే తన అంచనా తప్పు కాలేదు. తను పడిన శ్రమ ఫలించింది. అతని జీవితం బాగుపడింది. ప్రయోజకుడయ్యాక కూడా తనపట్ల కృతజ్ఞతతో ఉన్నాడు. జీవితాంతం ఉంటాడు. అటువంటి భక్తిప్రపత్తులు కలవాడు దొరకడం వృద్ధుని అదృష్టం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ‘విద్యాలయం’ ఆవరణ ఎలా ఉందో పాఠంలో వర్ణించిన విధానం చదివారు కదా! దీని ఆధారంగా, మీరు మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణించి రాయండి.
జవాబు:
పాఠశాల : మా పాఠశాల చాలా బాగుంటుంది. మా పాఠశాల సరస్వతీ మాత నిలయం. మా పాఠశాల ఆవరణచుట్టూ పచ్చటి చెట్లతో నిండి ఉంటుంది. పూల మొక్కలు వరుసలలో ఉంటాయి. క్రోటన్సు మొక్కలు పూల మొక్కలకు రక్షక భటులుగా ఉంటాయి. రకరకాల పళ్ళనిచ్చే చెట్లు కూడా ఉన్నాయి. దానిమ్మ, జామ, కమలా, బత్తాయి చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు కూడా ఉన్నాయి.

మా పాఠశాలలో 20 తరగతి గదులున్నాయి. అన్ని గదులూ అందంగా అలకరించి ఉంటాయి. మచ్చుకైనా ఎక్కడా చెత్త కనబడదు. తరగతి గదులలోని గోడలకు పిల్లలు వేసిన బొమ్మల చార్టులు, కవితలు, కథల చార్టులు ఉంటాయి. మా పాఠశాల గోడ పత్రికలలో రోజూ ఏవేవో కథలూ, కవితలూ, కార్టూన్లూ, సూక్తులూ వచ్చి చేరుతుంటాయి. మా ఉపాధ్యాయులు జ్ఞాన జ్యోతులు. చిరునవ్వుతో పాఠాలు చెబుతారు. కథలు కూడా చెబుతారు. ఎన్నో మంచి విషయాలు చెబుతారు. మమ్మల్ని చెప్పమంటారు. ఆలోచించమంటారు.

మా పాఠశాల ఆటస్థలం 500 చదరపు గజాలు ఉంటుంది. అన్ని రకాల ఆటలు ఆడతాము. అనేకమైన ఆట వస్తువులు ఉన్నాయి. పెద్ద గ్రంథాలయం కూడా ఉంది. 6 బీరువాల పుస్తకాలు ఉన్నాయి. నాకు మా పాఠశాల అంటే చాలా ఇష్టం.

పర్యాటక క్షేత్రం :
తిరుపతి మంచి పర్యాటక క్షేత్రం. ఎంతో మంది భక్తులు రోజూ తిరుమలకు వస్తారు. తిరుమల కొండ నడిచి ఎక్కేటపుడు చాలా బాగుంటుంది. ఎంత దూరం నడిచినా తరగదు. కొండదారి, చుట్టూ అడవి. జింకలు కనబడతాయి. అవి భలే గంతులువేస్తూ పరుగెడతాయి. మోకాటి పర్వతం మెట్లు నిట్టనిలువుగా ఉంటాయి. ఆకాశంలో చందమామలాగా ఎక్కడో పైన గోవిందనామాలు కనిపిస్తుంటాయి. చుట్టూ అడవులలో దట్టమైన పొదలు, పెద్ద పెద్ద చెట్లు, తీగలు కనిపిస్తాయి. మా సైన్సు టీచర్లనడిగి వాటి పేర్లు, లక్షణాలు తెలుసుకొన్నాం. గుడిలోకి వెడితే శ్రమంతా మరచిపోతాం. అంత ప్రశాంతత. నాకైతే తిరుమల అంటే చాలా ఇష్టం. సువర్ణ ముఖీ నదిలో స్నానం చాలా బాగుంటుంది.
(గమనిక : విద్యార్థులు ఏ క్షేత్రాన్నినా వర్ణించవచ్చు. )

అ) పాఠంలో “దాదాపు రెండు, మూడు ……… పరవశంతో పాడుతున్నారు” పేరా చదవండి. దీనికి సంబంధించిన చిత్రం ీయండి. రంగులు వేయండి. కవిత రాయండి.
జవాబు:
(గమనిక : డ్రాయింగు మాష్టారు వద్ద చిత్రం నేర్చుకొని గీయాలి. రంగులు వేయాలి.)
కవిత :
విస్తీర్ణం చూడండి రెండు, మూడు చదరపు మైళ్ళూ
వేపచెట్టు, రావిచెట్లు, జవ్విచెట్లు, మర్రిచెట్లి పిట్టల లోగిళ్ళూ
పూల బాల పాదులలో కిలకిల లాడాలి
కూరల సుకుమారం తోటలలో కలకలలాడాలి.
సంజవెలుగు కెంజాయకు బంగారం తళతళలూ
అనుభూతుల హృదయాలకు అనురాగపు స్నానాలూ
నక్కినక్కి చక్కనైన చిలకమ్మా, కోకిలమ్మా
పాలపిట్ట, పరవశించి పాటలందుకొన్నాయి.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా కథల పుస్తకం నుంచి గాని లేదా ఏదైనా పత్రిక నుంచి గాని సామాజిక సేవ, మానవ సంబంధాలు, గురుశిష్య సంబంధం మొదలైన విషయాలకు సంబంధించిన మంచి కథను చదివి ఎంపిక చేయండి. దాన్ని రాసి ప్రదర్శించండి. అది మీకు ఎందుకు నచ్చిందో, దాంట్లోని గొప్పతనమేమిటో నివేదిక రాయండి.
జవాబు:
(గమనిక : కనీసం 10 వాక్యాలలో రాస్తే చాలును)

III. భాషాంశాలు

పదజాలం

1) ఈ కింద ఇచ్చిన రెండేసి పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.

అ) వినయం – విధేయత
జవాబు:
సొంతవాక్యం : వినయం – విధేయత నేర్పని చదువుల వలన ప్రయోజనం లేదు.

ఆ) రాజు – మకుటం
జవాబు:
సొంతవాక్యం : ధరణికి వెలుగు రాజు – మకుటం కాంతిని బట్టి ఉంటుంది.

ఇ) ప్రదేశం – ప్రశాంతత
జవాబు:
సొంతవాక్యం : నివాస ప్రదేశం – ప్రశాంతత కలిగినదైతే అన్ని సౌఖ్యాలూ ఉన్నట్లే.

ఈ) గుడిసె – దీపం
జవాబు:
సొంతవాక్యం : కనీసం గుడిసె – దీపం లేని బతుకులెన్నో దేశంలో ఉన్నాయి.

ఉ) ప్రయాణం – సౌకర్యం
జవాబు:
సొంతవాక్యం : ఈ రోజులలో ప్రయాణం – సౌకర్యంలేని ఊరులేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : సంజవెలుగులో తటాకంలోని నీరు కొత్త అందం సంతరించుకుంది.
సంజవెలుగు = సంధ్యా సమయంలో వెలువడే కాంతి.

అ) నా పుట్టిన రోజున మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకున్నాను.
జవాబు:
ఆశీర్వాదం : దీవెన

ఆ) రాజు ప్రకృతి అందాల్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు.
జవాబు:
తదేకంగా = అది ఒకటే (పని) అన్నట్లుగా

ఇ) శివ పుస్తకాలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు.
జవాబు:
కాలక్షేపం – సమయం గడపడం

ఈ) రాణి ముఖం నిండా పసుపు పులుముకుంది.
జవాబు:
పులుము = పూసు

ఉ) లత పాఠాన్ని చక్కగా ఆకళింపు చేసుకొంది.
జవాబు:
ఆకళింపు. – అవగాహన

3. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) రాజు – ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు
ఆ) సమయం – బుద్ధి, సంకేతము, ప్రతిజ్ఞ
ఇ) కృషి – స్త్రీ, సేద్యము, కరిసనము
ఈ) కన్ను ‘ – ఏరు, వలిపము, తీరు
ఉ) కొమ్మ – శాఖ, ఆడుది, కోటకొమ్మ
ఊ) ఆశ – దిక్కు కోరిక

4. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) పక్షి – నీడజము, ద్విజము, పతగము
ఆ) నేత్రం – అక్షి, చక్షువు, నయనం
ఇ) శిరస్సు – తలకాయ, నెత్తి, మస్తకము
ఈ) సూర్యుడు – అహిమకరుడు, భానుడు, భాస్కరుడు
ఉ) చెట్టు – తరువు, భూరుట్టు, వృక్షము
ఊ) కొండ – అచలము, శైల్యము, ఆహార్యము

5. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
అ) అతిథి – తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి భోజనమునకు వచ్చువాడు.
ఆ) అక్షరం – నాశనము పొందనిది (వర్ణము)
ఇ) పక్షి – పక్షములు కలది (విహంగము)
ఈ) మౌని – మౌనము దాల్చియుండువాడు (ఋషి)

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

6. అనాథలను చేరదీసే సంస్థలను అనాథ శరణాలయాలు అంటారు కదా ! ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. కింద ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని రాయండి.

అ) పక్షులను రక్షించే సంస్థ :
జవాబు:
పక్షి సంరక్షణ కేంద్రం

ఆ) జంతువులను రక్షించే సంస్థ :
జవాబు:
జంతు ప్రదర్శనశాల

ఇ) వృద్ధులను చేరదీసే సంస్థ :
జవాబు:
వృద్ధాశ్రమం

ఈ) మనోవైకల్యం గలవాళ్ళకు చేయూతనిచ్చే సంస్థ :
జవాబు:
మనోపునర్వ్యవస్థీకరణ సంస్థ

ఉ) కుష్ఠురోగుల పునరావాస కేంద్రం :
జవాబు:
కుష్టువ్యాధి నిరోధక మరియు ఆరోగ్య సంస్థ

వ్యాకరణాంశాలు

1) కింది పదాల్లోని పుంప్వాదేశ సంధి, టుగాగమ సంధి, అత్వ సంధి, ద్విరుక్తటకార సంధుల పదాలను గుర్తించి, విడదీసి సూత్రాలను రాయండి.
సరసంపుమాట, కట్టెదుట, చింతాకు, తూగుటుయ్యేల, నట్టడవి, ముద్దుటుంగరము, మధురంపుకావ్యం, పల్లెటూరు, రామయ్య

పుంప్వాదేశ సంధి : 2
1) సరసము + మాట = సరసంపుమాట
2) మధురము + కావ్యం – మధురంపు కావ్యం
సూత్రం :
కర్మధారయము నందు “ము” వర్ణకములకు పుంపులగు.

టుగాగమ సంధి :
1) తూగు + ఉయ్యేల = తూగుటుయ్యేల
2) పల్లె + ఊరు = పల్లెటూరు
3) ముద్దు + ఉంగరము = ముద్దుటుంగరము
సూత్రం :
కర్మధారయములందు ఉత్తున కచ్చు పరమగునపుడు టుగాగమంబగు.

అత్వసంధి :
1) రామ + అయ్య = రామయ్య
2) చింత + ఆకు = చింతాకు
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.

ద్విరుక్తటకారాదేశ సంధి :
1) కడు + ఎదుట = కట్టెదుట
2) నడు + అడవి = నట్టడవి
సూత్రం :
కులు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఐ, డ లకు అచ్చు పరమగునపుడు ద్విరుక్తటకారంబగు.

సకార త వర్గం శకార చ వర్గం
ఝు

శ్చుత్వ సంధి :
క్రింది ఉదాహరణలు పరిశీలించండి.
నిస్ + చింత = నిశ్చింత
సత్ + ఛాత్రుడు = సచ్చాత్రుడు
శరత్ + చంద్రికలు = శరచ్చంద్రికలు
జగత్ + జనని = జగజ్జనని
శార్జ్గిన్ + జయః – శార్జ్గియః

పై ఉదాహరణలలో మొదటి పదాల (నిస్, సత్, శరత్, జగత్, శార్జిన్) లో దాంతాలుగా ‘స’ కారం కాని, ‘త’ వర్గ కాని ఉంది. వాటికి ‘శ’ కారం కాని, ‘చ’ వర్గ (చ, ఛ, జ, ఝు, ఞ) కాని పరమైంది. శాంతి, ఛాత్రుడు, చంద్రిక, జనని, జయః లలో మొదటి అక్షరాలైన శ,చ,ఛ,జ పరమయ్యా యి. అప్పుడు వరుసగా “శ, ఛ, చ, జ, ఞ” లు ఆదేశమయ్యా యి కదా ! దీనిని సూత్రీకరిస్తే : ‘స’ కార ‘త’ వర్గ అక్షరాలకు ‘శ’ వర్ణ ‘చ’వర్గాలతో సంధి కలిస్తే ‘శ వర్ణ ‘చ’ వర్గాలే ఆదేశంగా వస్తాయి.

అభ్యాసం:
సత్ + జనుడు = సజ్జనుడు
సత్ + చరిత్రము = సచ్చరిత్రము

సూత్రం :
‘స’ కార ‘త’ వర్గ అక్షరాల (త, థ, ద, ధ, న) కు ‘శ’ వర్ణ, ‘చ’ వర్గాక్షరాలతో సంధి కలిస్తే ‘శ’ వర్ణ ‘చ’ వర్గాలే ఆదేశంగా వస్తాయి.

అదనపు సమాచారము

సంధులు

1) గ్రంథాలయం గ్రంథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
2) ప్రార్థనాలయం = ప్రార్థన + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
3) ఆనందానుభూతి = ఆనంద + అనుభూతి – సవర్ణదీర్ఘ సంధి
4) జీవితానుభవం = జీవిత + అనుభవం – సవర్ణదీర్ఘ సంధి
5) పరహితార్థం = పరహిత + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
6) స్వార్థం = స్వ + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
7) వయోవృద్ధులు = వయః + వృద్ధులు – విసర్గ సంధి
8) అహరహం = అహః + అహం – విసర్గ సంధి (విసర్గ రేఫగా మారడం)
9) ఏమంటావు = ఏమి + అంటావు – ఇత్వ సంధి
10) ఏమనుకున్నావు = ఏమి + అనుకున్నావు – ఇత్వ సంధి
11) చేయెత్తి = చేయి + ఎత్తి – ఇత్వ సంధి
12) – కొండంత = కొండ + అంత – అత్వ సంధి
13) గొంతెత్తి = గొంతు + ఎత్తి – ఉత్వ సంధి –
14) పాదాలు = పాదము = లు – లులన సంధి
15) ముత్యాలు = ముత్యము + లు – లులన సంధి
16) అడ్డం పెట్టు = అడ్డము + పెట్టు – పడ్వాది సంధి
17) ఆశ్చర్యపడు = ఆశ్చర్యము + పడు – పడ్వాది సంధి
18) తదేకంగా = తత్ + ఏకంగా – జత్త్వ సంధి
19) భవిష్యజ్జీవితం = భవిష్యత్ + జీవితం – శ్చుత్వ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) వేపచెట్టు ‘వేము’ అనే పేరు గల చెట్టు సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
2) రావి చెట్టు ‘రావి’ అనే పేరు గల చెట్టు సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
3) నాలుగుదిక్కులు నాలుగైన దిక్కులు ద్విగు సమాసం
4) నాలుగు బారలు నాలుగైన బారలు ద్విగు సమాసం
5) రెండు చేతులు రెండైన చేతులు ద్విగు సమాసం
6) నాలుగడుగులు నాలుగయిన అడుగులు ద్విగు సమాసం
7) ఏడు గంటలు ఏడు సంఖ్య గల గంటలు ద్విగు సమాసం
8) రెండు రోజులు రెండు సంఖ్య గల రోజులు ద్విగు సమాసం
9) నికృష్ట జీవితం నికృష్టమైన జీవితం విశేషణ పూర్వపద కర్మధారయం
10) మహాయోగి గొప్పవాడయిన యోగి విశేషణ పూర్వపద కర్మధారయం
11) మహా మెరుపు గొప్పదయిన మెరుపు విశేషణ పూర్వపద కర్మధారయం
12) అరమోడ్పు కనులు అరమోడ్పయిన కనులు విశేషణ పూర్వపద కర్మధారయం
13) చిరునవ్వు చిన్నదయిన నవ్వు విశేషణ పూర్వపద కర్మధారయం
14) ముగ్గమనోహరం ముగ్ధము, మనోహరము విశేషణ ఉభయపద కర్మధారయం
15) సంజ వెలుగు సంజ యొక్క వెలుగు షష్ఠీ తత్పురుష సమాసం
16) గ్రంథాలయం గ్రంథములకు ఆలయం షష్ఠీ తత్పురుష సమాసం
17) కనుల పండువు కనులకు పండువు షష్ఠీ తత్పురుష సమాసం
18) మబ్బు తునకలు మబ్బు యొక్క తునకలు షష్ఠీ తత్పురుష సమాసం
19) చేతి చలువ చేతి యొక్క చలువ షష్ఠీ తత్పురుష సమాసం
20) జీవితానుభవం జీవితమందలి అనుభవం సప్తమీ తత్పురుష సమాసం
21) వయోవృద్ధులు వయస్సు చేత వృద్ధులు తృతీయా తత్పురుష సమాసం
22) ప్రార్థనాలయం ప్రార్థన కొఱకు ఆలయం చతుర్డీ తత్పురుషం
23) అనిర్వచనీయం నిర్వచనీయం కానిది నఞ్ తత్పురుషం
24) బాలబాలికలు బాలురును, బాలికలును ద్వంద్వ సమాసం
25) నిమీలిత నేత్రుడు నిమీలితములయిన నేత్రములు గలవాడు బహువ్రీహి సమాసం

ప్రకృతి – వికృతి

వేషము – వేసము
ఆశ – ఆస
ముఖం – మొగం
సంధ్య – సంజ
పుష్పము – పూవు, పువ్వు
దీపము – దివ్వె
సంధి – సంది
కథ – కత
మౌక్తికము – ముత్యము, ముత్తియము
భృంగారము – బంగారము
నిమిషము – నిముసము
పీఠము – పీట
శక్తి – సత్తి
భారము – బరువు
భంగము – బన్నము
స్నేహము – నెయ్యము
పేటిక – పెట్టె

పర్యాయపదాలు

1) చెట్టు : 1) వృక్షము 2) తరువు 3) మహీరుహము
2) ముత్యము : 1) మౌక్తికము 2) ముక్తాఫలము 3) ఆణి
3) కన్నీరు : 1) అశ్రువు 2) బాష్పము 3) అస్రము
4) కన్ను : 1) నేత్రము 2) నయనము 3) చక్షువు
5) ఓర్పు : 1) తాల్మి 2) సహనము 3) ఓరిమి

నానార్థాలు

1. ఆశ : కోరిక, దిక్కు
2. మాను : విడుచు, చెట్టు
3. పాదము : అడుగు, కాలు, పద్యపాదము, పాతిక
4. చిత్రము : చిత్తరువు, చమత్కారం, ఆట, ఆశ్చర్యము
5. సమయము : కాలము, శపథము, ఆజ్ఞ
6. కథ : కత, చెప్పడం, గౌరి
7. కద : దిక్కు, మరణము, ప్రక్క
8. అక్షరము : పరబ్రహ్మము, అక్కరము, నీరు, తపస్సు

రచయిత పరిచయం

కృష్ణారెడ్డి జననం :
పులికంటి కృష్ణారెడ్డి క్రీ.శ. 1931లో జన్మించారు. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలంలోని జక్కదన్న గ్రామం వీరి స్వగ్రామం. పులికంటి పాపమ్మ, గోవిందరెడ్డి వీరి తల్లిదండ్రులు. వీరిది వ్యవసాయ కుటుంబం. మధ్యతరగతి కుటుంబం.

పులికంటి నటజీవితం:
పులికంటి కృష్ణారెడ్డి మంచి నటుడు, బెల్లంకొండ రామదాసు రచించిన ‘పునర్జన్మ’ నాటకంలో వృద్ధుని పాత్ర ధరించడంతో ఆయన నటజీవితం ప్రారంభమైనది. నటునిగా చాలామందిచేత ప్రశంస లందుకొన్నాడు. మంచినటుడే కాక మంచి రచయిత కూడా.

రచనా వ్యాసంగం :
పులికంటి కృష్ణారెడ్డి పేరు వినగానే గుర్తు వచ్చేది కథా సాహిత్యం . 1960లో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడిన “గూడుకోసం గువ్వలు” ఆయన రచించిన మొదటి కథ. ‘నాలుగ్గాళ్ళ మండపం’ ఆయన మరో రచన. సుమారు 150 కథలు రచించారు.

అవీ – ఇవీ :
పులికంటి కృష్ణారెడ్డి మంచి బుర్రకథా కళాకారుడు. కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు మొదలైన అంశాల మీద సుమారు 100 బుర్రకథలను రచించాడు. వాటిని ప్రదర్శించి, అందరి మెప్పును పొందాడు. జనజీవనాన్ని ‘కళ్ళకు కట్టినట్టు రచనలు చేసిన దిట్ట. అంతేకాక, ఆయన జానపద కళాకారుడు, కవి. ప్రతిభాశాలియైన పులికంటి కృష్ణారెడ్డి గారు క్రీ.శ. 2007లో స్వర్గస్తులైనారు.

కఠిన పదాలకు అర్థాలు

బోదె = ప్రకాండము
కండ = మాంసము
కృతజ్ఞత = చేసిన మేలు మరచిపోకపోవడం
కనుకొలుకులు = కనుల చివరలు
యోగి = యోగాభ్యాసం చేయువాడు
మైలపరచడం = అశుచి చేయడం
బార = రెండుచేతులు పొడవుగా చాచిన మధ్యదూరం
తటస్థస్థితి = ఎటూకాని స్థితి
ఒడిసి = నేర్పుతో
మేరువు = బంగారు పర్వతం, దీనిపై దేవతలు విహరిస్తారు
విస్తీర్ణం = వ్యాపించిన ప్రాంతం
సంజ = సంధ్య
పరవశం = పరాధీనం
జోడించడం = జతచేయడం
చేతులు జోడించడం = నమస్కరించడం
హుందా = దర్జా
అతిథి = తిథితో నిమిత్తం లేకుండా వచ్చేవాడు
సదుపాయం = సౌకర్యం నివాసం
వసతి = ఉండే చోటు
మకుటం = కిరీటం
మారుపేరు = మరొక పేరు
లీనము = కలసిపోవడం, తన్మయం కావడం
గోరంత = చిన్నది
నిర్వర్తించడం = చేయడం
కొండంత = చాలా ఎక్కువ
అనుభూతి = అనుభవం
తేలిపోవడం = లీనమవడం
చెవిని పడడం = వినబడడం
బిలబిలా = అతి త్వరితముగా
గుమి = సమూహం
తెగిన గాలిపటం = తాడు విడిచిన
బొంగరం = ఎవరూ పట్టించుకోని అనాథ
మనిషి = విద్వాంసుడు
అక్షరసత్యం = కచ్చితమైన నిజం
స్మృతి = జ్ఞాపకం
వడదెబ్బ = వేడి తాకిడి
గుడ్డివెలుగు = తక్కువ వెలుగు
బుడ్డి దీపం = చిన్న దీపం
ఓనమాలు = అక్షరమాల
ధ్యేయం = లక్ష్యం
అహరహం = ప్రతిరోజు, నిరంతరం
పరహితం = ఇతరులకు మంచి
స్వార్థం = తన గురించి
గాలిలో కలిసిపోవడం = నాశనమైపోవడం, మిగలక పోవడం
కాచి వడబోయడం = బాగా అవగాహన చేసుకోవడం
పరమసత్యం = కచ్చితమైన నిజం
గాలివాటం = గాలి వీలు
నిదర్శనం = ఉదాహరణ
పరామర్శ = చక్కగా విచారించుట
ఏకాగ్రత = ఒకే విషయంపై దృష్టి నిలపడం

అలోచించండి- చెప్పండి

ప్రశ్న 1.
తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? వివరించండి.
జవాబు:
తల్లి ప్రేమ నిర్మలంగా ఉంటుంది. తల్లి, తన బిడ్డలకు తనకు ఉన్నదంతా పెట్టాలని కోరుకుంటుంది. బిడ్డలకు తన పాలను ఇచ్చి పెంచుతుంది. తన కడుపు కూడా కట్టుకొని, బిడ్డలకు పెడుతుంది. తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు.

ప్రశ్న 2.
వినయంతో నిలబడడం, వేషంలో సంస్కారం అంటే మీకేమర్థమైంది?
జవాబు:
వినయంతో నిలబడడంలో, ఎదుటి వ్యక్తి యందు, ఆ వ్యక్తికి గల గౌరవం, ప్రేమ, ఆదరం వెల్లడవుతాయి. వేషంలో సంస్కారం అంటే నిండుగా బట్టలు వేసుకోడం, చక్కగా నుదుట బొట్టు పెట్టుకొని మర్యాదస్తులు ధరించే దుస్తులు ధరించడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావాన్ని ఎవరి పట్ల, ఎందుకు ప్రదర్శిస్తారు?
జవాబు:
మన జీవితాన్ని మంచి దారిలో పెట్టినవారిపై కృతజ్ఞత ప్రదర్శిస్తాము. ఎదుటి వ్యక్తి తమకు చేసిన గొప్ప మేలునకు ప్రతిగా, ఆ వ్యక్తి యందు వ్యక్తులు కృతజ్ఞతను ప్రదర్శిస్తారు. మనకు ఉపకారం చేసిన వారికి కృతజ్ఞత చెప్పడం, వారి యందు పూజ్యభావం కలిగి యుండడం అన్నవి, మానవుని సంస్కారానికి గుర్తులు.

ప్రశ్న 4.
మీ బడి, మీ ఇల్లు ప్రశాంతతకు మారుపేరుగా ఉండా లంటే ఏం చేయాలి ? ఏం చేయకూడదు?
జవాబు:
బడిలో పిల్లలు అల్లరి చేయరాదు. క్రమశిక్షణతో మెలగాలి. పిల్లలు గురువుల యందు గౌరవం కలిగి ఉండాలి. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల యందు గౌరవాదరాలు కలిగి ఉండాలి. అల్లరి పనులు, కొంటె పనులు చేయకూడదు. ఇంట్లో టి.వి ధ్వనిని బాగా పెంచరాదు. కోపంతో పరుష వాక్యాలు మాట్లాడరాదు. అప్పుడు ఇల్లు, బడి కూడా ప్రశాంతంగా ఉంటాయి.

ప్రశ్న 5.
విద్యాలయావరణం కనులపండువుగా ఉంది కదా? మీ కంటికి కనులపండువుగా ఏమేమి గోచరిస్తాయి?
జవాబు:
1) పద్మాలతో నిండిన చెరువును చూసినపుడు.
2) మా చెల్లి మంచి అందమైన గౌను వేసుకొని నగలు పెట్టుకున్నప్పుడు.
3) ఆగస్టు 15వ తేదీకి పాఠశాలను రంగు రంగు కాగితాలతో అలంకరించినపుడు.
4) సినిమాలలో అందమైన పార్కులలో, నటీనటులు నాట్యాలు చేస్తున్నప్పుడు, నాకు కనులపండువుగా ఉంటుంది.
(గమనిక : గ్రామం, బడి, ఇల్లు మొ|| వాటి గురించి విద్యార్థులంతా సొంతంగా మాట్లాడాలి.)

ప్రశ్న 6.
పెద్దల మాటలు, జీవితానుభవాలు అక్షరసత్యాలు ఎందుకో వివరించండి.
జవాబు:
పెద్దలు ఏది మాట్లాడినా తమ అనుభవాల నుండో, తాము చదివిన గ్రంథాల నుండో ఉదాహరిస్తారు. అవి వారి జీవితాన్ని ప్రభావితం చేసినవై ఉంటాయి. అవి పిల్లలకు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ‘పెద్దలమాట – చద్దిమూట’ అన్నారు పెద్దలు. పెద్దల మాటలు విని, ఆచరిస్తే కష్టాలు దరిదాపులకు రావు. వారి జీవితానుభవాలు కూడా పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. అవి పిల్లల జీవితాలకు దిక్సూచిల వంటివి. పెద్దలు తమ జీవితానుభవాలను పిల్లలకు చెప్పాలి. అందువల్ల పిల్లల జీవితాలు బాగుపడతాయి.

పరాకాష్ఠ = అత్యున్నత స్థితి
కుతూహలం = ఆత్రుత
వాయిదా = గడువు
గతాన్ని నెమరువేయడం = జరిగిన దానిని తలచుకోవడం
సందర్శనం = చూడడం
పుంగవము = ఎద్దు
పుంగవుడు = శ్రేష్ఠమైనవాడు
తలపు = ఆలోచన
ముగ్ధమనోహరం = అమాయకపు అందం
శ్రుతి = వినికిడి
నేస్తాలు = స్నేహితులు
అదిరిపడడం = భయపడడం
నివ్వెరపడు = ఆశ్చర్యపడడం
నిర్దాక్షిణ్యం = దయలేకపోవడం
పరధ్యానం = ఇతర ఆలోచన
నడివయస్సు = మధ్యవయస్సు (40-50 సం||లు)
పొదివి = జాగ్రత్తగా, అపురూపంగా
అథోగతి = హీనమైన స్థితి
పుట్టగతులుండవు = సర్వనాశనం
పొంతన = పోలిక
వేళకాని వేళ = అనువుకాని సమయం
మునుపు = పూర్వం
కుతూహలం = ఆత్రుత
నికృష్టం = అధమము
బుడతడు = చిన్నవాడు
నిర్లక్ష్యం = లక్ష్యం లేకపోవడం
ఉడాయించడం = పారిపోవడం
ధోరణి = విధానం
క్లుప్తం = సంక్షిప్తం, తగ్గించడం
ఏమరుపాటు = అకస్మాత్తుగా

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
సమయం, సందర్భం కలిసి రావడమంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
సమయం, సందర్భం కలిసి రావడమంటే, కాలమూ దానికి తగిన సంఘటన కలిసిరావడం. ఉదాహరణకు చదువుకొందుకు సరియైన సమయం ఉదయకాలం. ఉదయం 4 గంటల నుండి చదువుకొందుకు సరియైన సమయం. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏరకమైన అలజడులూ ఉండవు. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అటువంటి సమయంలో చదువు కొంటే చదువు బాగా వస్తుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి.

ఆ సమయంలో చదవాలంటే మెలుకువ రాదు. మెలుకువగా ఉండాలంటే కొంచెం కష్టం. కనుక ఉదయం 4 గంటలకు ఎవరైనా ప్రయాణమై వెడుతుంటే, ఎలాగూ నిద్రలేస్తాం. ఆ ప్రయాణ సందర్భంగా నిద్రలేస్తాం. కనుక మంచి సమయం, సందర్భం కలిసివచ్చాయి. అప్పుడు చదువుకోవడం మంచిది.

అలాగే, కంచి దైవదర్శనానికి వెడతాం. అది మంచి సమయం కనుక అక్కడ ఉన్న చూడదగిన ప్రదేశాలన్నీ చూస్తాం. దేవాలయాలు కూడా చూస్తాం. కంచిలో పట్టుబట్టలు నాణ్యమైనవి. చౌకగా దొరుకుతాయి. అంతదూరం వెళ్ళాం. పట్టుబట్టల దుకాణాలు చూశాం. ఆ సందర్భంలో నచ్చిన బట్టలు కూడా కొనుక్కొంటే సమయం, సందర్భం కలిసి వస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 2.
“తెలుగు వారికి తెలుగంటే బోలెడంత అభిమానం” దీన్ని గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
ఎవరి భాషపైన వారికి అభిమానం ఉంటుంది. ఈ విషయంలో తమిళనాడు వారే ఆదర్శవంతులు. వారు తమిళానికి ఇచ్చినంత గౌరవం ఏ భాషకూ ఇవ్వరు. వారు సాధ్యమైనంత వరకు తమిళంలోనే మాట్లాడతారు.

తెలుగు వారికీ తెలుగంటే అభిమానమే కాని, అంతేకాదు, మన వారికి పరభాషా వ్యా మోహం ఎక్కువ. తెలుగులో మాట్లాడడం నామోషీగా భావిస్తారు. పరభాషలలో మాట్లాడడం గొప్పతనంగా భావిస్తారు. తెలుగులో కూడా పరభాషా పదాలను ఎక్కువగా చేర్చి, మాట్లాడతారు. అది కొంతమంది తెలుగువారి పద్దతి.

తెలుగంటే ఎడతెగని అభిమానం కలవారు కూడా చాలామంది ఉన్నారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, కళాకారులు మొదలైనవారు. వారు తెలుగులోనే ఎంతో చమత్కారం కల పదాలు ప్రయోగిస్తూ చక్కగా మాట్లాడతారు. ఎంతసేపైనా వినాలి అనిపిస్తుంది. తెలుగులోని తియ్యదనం చవిచూస్తే జన్మ ధన్యమౌతుంది. తెలుగు పలుకుల వెలదికి తేనెచినుకుల చిలకరింపులకు మనసు పులకరిస్తుంది.

ప్రశ్న 3.
పిల్లలు ఎందుకోసం వచ్చి ఉంటారు? ఆయన వారితో ఏం మాట్లాడి ఉంటారు? ఊహించండి.
జవాబు:
పిల్లలు తమకు కావలసిన అవసరాలను ఆ వృద్ధునికి చెప్పాలని ఆయన దగ్గరికి వారు వచ్చి ఉంటారు. వారు తమకు పుస్తకాలు కావాలనో, వారు బడిలో ఫీజు కట్టాలనో, వారికి దుస్తులు కావాలనో ఆయనను అడిగి ఉంటారు.

ప్రశ్న 4.
కథల పుస్తకాలు లేదా ఇతర పుస్తకాల్లో బొమ్మలు ఎందుకు వేస్తారు?
జవాబు:
పుస్తకంలోని విషయం దేని గురించి ఉందో అట్లపై బొమ్మ చెబుతుంది. కథలోని విషయం కళ్ళకు కట్టినట్లు తెలియజెప్పడానికే బొమ్మలు వేస్తారు. బొమ్మను చూపి కథ ఊహించుకోవచ్చు. కాని, కథ పూర్తిగా అవగాహనకు రాదు. అదేమిటో తెలుసుకోవాలనే తపన బయలు దేరుతుంది. ఆ తపన తీరాలంటే ఆ కథ తెలియాలి. ఆ కథ తెలియాలంటే చదవాలి. అందుచేత బొమ్మ చూస్తే, అది ఆ కథను చదివిస్తుంది.

క్రింది తరగతులలోని పాఠ్యపుస్తకాలలోని బొమ్మలు కూడా మమ్మల్ని ఇదే విధంగా ప్రేరేపించాయి. పాఠ్యపుస్తకం చేతికి రాగానే బొమ్మలు చూసేవాళ్ళం. ఆ బొమ్మలను బట్టి కథ ఊహించుకొని, ఆ పాఠం చదివేసేవాళ్ళం. పద్యాలైతే అర్థంగావు, కాని పాఠాలంటే భలే ఇష్టం. బొమ్మలు లేని పుస్తకం అలంకారాలు లేని మనిషిలా ఉంటుంది. సరిగ్గా సర్దుకోని ఇల్లులా ఉంటుంది. ఒక లక్ష్యం లేని జీవితంలా ఉంటుంది. బొమ్మలు పుస్తకాలకి ప్రాణం.

ప్రశ్న 5.
వృద్ధుడిని ఆకట్టుకొన్న బొమ్మ ఏమిటి? ఆ బొమ్మను చూసి ఎలాంటి అనుభూతిని పొందాడు?
జవాబు:
వృద్ధుడిని ఆకట్టుకొన్నది. రైలు పెట్టెలో యాచిస్తున్న కుర్రవాడి బొమ్మ, ఆ బొమ్మలోని కుర్రవాడిని చూడగానే రైలు పెట్టె తుడుస్తున్న కుర్రవాడిని తీసుకొనివచ్చి, చదివించి, ప్రయోజకుడిని చేయాలి అనిపించింది. అప్పుడు తన ఎదుట ఆ బొమ్మలోని కుర్రవాని వలె అనాథగా నిలుచున్నవాడే ఈ రోజు సంఘంలో గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకొంటూ బ్రతుకుతున్నాడు.

చాలామంది కథలలోను, నవలలలోనూ ఆదర్శ వంతమైన ఊహలు రాస్తారు. ఉపన్యాసాలలో కూడా ఆదర్శవంతమైన మాటలు చెబుతారు. కాని, ఆచరణలో శూన్యం. కొందరు మాత్రం ఆ కథలు విని, ఉపన్యాసాలు విని అలా చేస్తారు. కాని, ఈ వృద్దుడు చేసిన ఆదర్శ వంతమైన పనికి మూలం కథ. అందుచేత వృద్ధుడు తాను చేసిన పనికి చాలా ఆనందానుభూతిని పొందాడు. మాటలలో వర్ణించలేనంత సంతృప్తిని పొందాడు.

ప్రశ్న 6.
వారపత్రికలో వృద్ధుడు చదివిన కథ ఏమై ఉంటుంది?
జవాబు:
వారపత్రికలో వృద్ధుడు చదివిన కథ బహుశః “రైలు పెట్టెల్లో చిక్కుకొన్న అనాథ బ్రతుకు” అనే కథ అయి ఉండవచ్చు.

స్వభావం = తనయొక్క భావం
తటాలున = అకస్మాత్తుగా
ఇంటివాడవ్వడం = పెళ్ళి చేసుకోవడం
గాద్గదికం = బొంగురు
పూడుకపోవడం = మూసుకొనిపోవడం
దీర్ఘవ్యాధి = చాలాకాలం ఉండే వ్యాధి

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ణ జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైందేనా? ఎందుకు?
జవాబు:
సరైనది :
రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైనదే. ఎందుకంటే గృహహింస తట్టుకోలేక చాలామంది బాలలు ఇళ్ళలో నుండి పారిపోతారు. పిల్లల అభిప్రాయాలను పెద్దలు పట్టించుకోకపోయినా, వారికి ఇష్టంలేని పనులు చేయమని బలవంత పెట్టినా, కోప్పడినా పిల్లలు పారిపోతారు. తర్వాత వారు ఏ ముఠాలకో దొరుకుతారు. వారు, రైలు పెట్టెలు తుడిచే పనులు, భిక్షాటన, దొంగతనాలు మొదలైన వాటిలో ప్రవేశపెడతారు. ఇక ఆ పిల్లల జీవితాలు నికృష్టంగా తయారౌతాయి. తల్లి తండ్రులెవరో తెలియని అనాథ పిల్లల జీవితాలు కూడా ఇంతే, కొంతమంది పిల్లలను దొంగలు ఎత్తుకొనిపోయి కూడా ఇలాంటి పనులు చేయిస్తారు. అందుచేత వృద్ధుడి భావన సరైనది. సరైనది కాదు : రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైనది కాదు. ఎందుకంటే తను సుదీర్ఘమైన జీవితాన్ని చూసినవాడు, అనుభవం గడించిన వాడు. ఆ పిల్లలు అలాగ తయారు కావటానికి కారణం పెద్దలే. తమ పిల్లలను అపు రూపంగా చూసుకొంటే ఇలాంటి పరిస్థితులు రావు. దుర్వ్యసనాల పాలైన పెద్దలు పెట్టే బాధలను పిల్లలు భరించలేరు. కనీసం సమాజంలోని వాళ్ళు ఆ పిల్లలను పట్టించుకొని ఇళ్ళకు చేరిస్తే ఈ బాధలుండవు. కౌన్సిలింగ్ ద్వారా పిల్లల పెంపకంపై అవగాహన కలిగించాలి. లేదా చట్టప్రకారం చర్యలు తీసుకొనేలా చేయాలి. అన్నిటిపైనా అవగాహన గల ఆ వృద్ధుడు చేతగానివాడిలా బాధపడడం సమర్థనీయం కాదు. (సూచన : పై వానిలో ఒక అభిప్రాయమే గ్రహించాలి.
రెండూ గ్రహించకూడదు.)

ప్రశ్న 2.
“ప్రయత్నం చేసి ఫలితాలు సాధిస్తే ఆనందం కలుగు తుంది” దీంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
ఏ ప్రయత్నమూ లేకుండా కలిగే ఫలితం ఆనందం కలిగించదు. కష్టపడి పనిచేసి ఫలితాన్ని పొందితే చాలా ఆనందం కలుగుతుంది. ఎవరో చేసిన ప్రయత్నానికి ఫలితాన్ని మనం అనుభవించడమే దోపిడి అంటే అది మోసం, దగా, నయవంచన. మన ప్రయత్నం మనం చేసుకోవాలి. దానిలో కష్టాలు ఎదురుకావచ్చును. నష్టాలు రావచ్చును. బాధలు కలగవచ్చును. శ్రమ కలగవచ్చు. కొన్ని మాటలు కూడా పడవలసిరావచ్చును. కాని, ఫలితం అందుకోగానే అవన్నీ మరచిపోతాం. చాలా ఆనందం పొందుతాం. చాలా సంతృప్తి కలుగుతుంది. చాలా గర్వంగా ఉంటుంది. ఉప్పొంగి పోతాం. పడిన శ్రమంతా మరచిపోతాం. గంతులు వేస్తాం, ఇంత హడావుడికి కారణం? మన ప్రయత్నంతో సాధించుకోవడం. అందుకే దేనినైనా సాధించుకోవాలి తప్ప దక్కించుకోకూడదు. యాచించకూడదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
అందరు పిల్లలూ తప్పనిసరిగా బడికి వెళ్ళి చదువుకోవాలి కదా ! మరి అలా ఎందుకు జరగడం లేదు?
జవాబు:
మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. బీదల సంఖ్య ఎక్కువ. చిన్న చిన్న వృత్తులతో పొట్టపోసుకొనేవారు చాలామంది ఉన్నారు. కుటుంబంలోని వారంతా కష్టపడి డబ్బు సంపాదించకపోతే రోజు గడవదు. అందుచేత పిల్లలను కూడా డబ్బు కోసం పనులకు పంపుతారు. సంపాదనలో పెడతారు. సంచార జాతులవారు తమ పిల్లలను తమ కూడా తిప్పుకొంటారు. అందుచేత వారి పిల్లలు కూడా బడులకు రాలేరు.

కొంతమంది పిల్లలు మొండితనం, అల్లరి, అతిగారాబం వలన బడులకు వెళ్ళరు. వెళ్ళినా అక్కడ అందరితోటి కలవలేక బడి మానివేస్తారు. చిన్నతనం నుండీ పెద్దలు సరిగా పట్టించుకోక దురలవాట్లకు బానిసలౌతారు.

కొన్ని కుటుంబాలలోని ఆడపిల్లలకు చిన్నతనంలోనే వివాహాలు చేసేస్తారు. అది కూడా బాలల విద్యాభ్యాసానికి ఆటంకంగా ఉంది. నిరక్షరాస్యత, నిరక్షరాస్యులకు అక్షరాల విలువ తెలియదు. తమకు చదువు లేకపోయినా చక్కగా గడుస్తోంది కదా ! దేనికీ లోటులేదు. అలాగే తమ పిల్లలకూ గడుస్తుంది అనే ఆలోచన. ఎంత చదువు చదివినా ఉద్యోగాలు రావు. అంతకంటే పని నేర్చుకొంటే నయం అనే భావన కూడా కారణం. బాలలు తప్పనిసరిగా బడికి రావాలంటే వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించాలి.

ప్రశ్న 4.
“గుండెల్లోని ఆనందం కరిగి ముత్యాల్లా కన్నీటి రూపంలో రావడం” అంటే, మీకేమి అర్థమైంది ? ఇది ఏ ఏ సందర్భాల్లో జరుగుతుంది ? మీ అనుభవాలు తెల్పండి.
జవాబు:
కన్నుల వెంట నీరు రెండు సందర్భాల్లో వస్తుంది. దుఃఖం కలిగితే వస్తుంది. అలాకాక ఆనందం ఎక్కువగా వస్తే కన్నుల వెంట నీటి బిందువులు ముత్యాల్లా రాలుతాయి. వాటినే ఆనందబాష్పాలు అంటారు.
మనం ఊహించని మంచి మేలు జరిగితే, మనకు ఆనందబాష్పాలు వస్తాయి. అలాగే మనం విజయం సాధిస్తే ఆనందబాష్పాలు వస్తాయి.

నా అనుభవాలు :

  1. నాకు 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు వచ్చింది. అప్పుడు నాకు ఆనందబాష్పాలు వచ్చా యి.
  2. నాకు పాటల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఆ బహుమతి ఇచ్చే సందర్భంలో ఆనాడు పాఠశాలకు వచ్చిన ముఖ్యమంత్రి గారి ఎదుట నాచే ఆపాట పాడించారు. ఆ బహుమతిని నాకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చారు. ఆ సందర్భంలో నాకు ఆనందబాష్పాలు వచ్చాయి.

ప్రశ్న 5.
“ఒక వ్యక్తి బాధ్యతల్ని స్వీకరించే స్థితికి సమాజం ఎప్పుడు చేరుతుందో ?” అనే ఆవేదన సరైందేనా? ఎందుకు?
జవాబు:
సరైనది :
వ్యక్తి బాధ్యతను సమాజం స్వీకరించాలి. ఒక వ్యక్తిని రక్షించి, తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది. వారు తమ బాధ్యతను విస్మరిస్తే, ఆ బాధ్యతను సమాజం స్వీకరించాలి. వారికి రక్షణ కల్పించాలి. వారికి విద్యాబుద్ధులు నేర్పాలి. అప్పుడు వారు ప్రయోజకు లౌతారు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతారు. ఆ విధంగా ఆదుకొందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ధనవంతులు కొన్ని ‘ఆశ్రయ భవనాలను’ నిర్మించాలి. కొంతమంది ఉద్యోగులను కూడా నియమించాలి. అప్పుడే ఈ సమాజంలో అనాథలు, నిర్భాగ్యులు, నికృష్టజీవనులు ఉండరు. ముఖ్యంగా భావిభారత పౌరుల జీవితాలు ఆనందమయం అవుతాయి.

సరైనదికాదు :
పదిమంది వ్యక్తులు కలిస్తేనే సమాజం. అనేకమంది ఊహలకు రూపకల్పన సమాజం. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. రకరకాల అవసరాలు ఉన్నవారు ఉంటారు, అనేక రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎవరి బాధలు వారివి. ఎవరి ఆనందాలు వారివి. ఒకరికి బాధకలిగితే, సమాజం ఓదార్చాలి. ధైర్యం చెప్పాలి. సహాయం చేయాలి. వెన్నుదన్నుగా నిలబడాలి. కాని, బాధ్యతలను స్వీకరించకూడదు. అది బద్ధకాన్ని నేర్పుతుంది. ఎవరి పిల్లలను వారు పెంచుకోవాలి. తీర్చిదిద్దుకోవాలి. ఆర్థికంగా కాని, సామాజికంగా కాని సహాయం కావాలంటే సమాజం ఇవ్వాలి అంతేకాని, పిల్లలను పెంచే బాధ్యత కూడా సమాజమే స్వీకరిస్తే, వారు సోమరులుగా తయారౌతారు. పిల్లలను పట్టించుకోని పెద్దలను శిక్షించాలి. పిల్లల సంరక్షణకు చట్టాలు చేయాలి. కఠినంగా అమలుపరచాలి. అప్పుడే భావి భారతం ఆనందమయం అవుతుంది. పెద్దలకు బాధ్యత తెలుస్తుంది.
( గమనిక : పై వాటిలో ఏ అభిప్రాయమైనా చెప్ప వచ్చును. రెండూ చెప్పకూడదు.)

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 9th Lesson మాణిక్యవీణ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 9th Lesson మాణిక్యవీణ

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

“సౌందర్యం ఆరాధించేవాడా!
కవితలో, శిల్పంలో
పురుగులో, పుష్పంలో
మెరుపులో, మేఘంలో
సౌందర్యం ఆరాధించేవాడా!
జీవించేవాడా!
సుఖించేవాడా ! దుఃఖించేవాడా!
విహ్వలుడా ! వీరుడా!
ప్రేమించేవాడా!
వియోగీ! యోగీ! భోగీ! త్యాగీ!
ఆలోచనలు పోయేవాడా!
అనునిత్యం అన్వేషించేవాడా!
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా
ఆకసంలో సముద్రంలో
అన్వేషించేవాడా!”

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది?
జవాబు:
ఈ కవిత మానవుని గురించి తెలుపుతుంది.

ప్రశ్న 2.
కవితలో పేర్కొన్న మానవుని ప్రత్యేక లక్షణాలేవి?
జవాబు:
కవితలో పేర్కొన్న మానవుడు – సౌందర్య ఆరాధకుడు, జీవించేవాడు, సుఖించేవాడు, దుఃఖించేవాడు, విహ్వలుడు, వీరుడు, ప్రేమికుడు, వియోగి, యోగి, భోగి, త్యాగి, ఆలోచనాపరుడు, అన్వేషకుడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
మానవుణ్ణి ఎన్ని కోణాల్లో ఈ కవితలో దర్శించవచ్చు?
జవాబు:
మానవుణ్ణి 13 కోణాలలో ఈ కవితలో దర్శించవచ్చును.

ప్రశ్న 4.
మానవునికి వివిధ లక్షణాలు ఎలా సంక్రమించి ఉండవచ్చు?
జవాబు:
తన జీవన క్రమంలో, నిత్యం అన్వేషణలో, అభివృద్ధిలో మానవునికి అనేక లక్షణాలు సంక్రమించి ఉండవచ్చును.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
‘మాణిక్య వీణ’ శీర్షికన ఉన్న కవిత విన్న తర్వాత మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో చెప్పండి.
జవాబు:
మాణిక్య వీణ కవితను విన్నపుడు చాలా ఆనందం కలిగింది. మంత్రాలు-చింతకాయలు, చింతలు, యంత్రాలు, జబ్బులు, తంత్రాలు-రుగ్మతలు, అనవచ్చు – అనిపించనూవచ్చు, పొట్ట-పుట్ట, కట్టెదుట-నిట్టనిలువు, కట్టుకొని, అందచందాలు, రంగులను-రవళినీ, గుట్టాలు-జింకలు, మొక్కలు-నిక్కి, చక్కని నొక్కులు – చిక్కని పదాలు, చక్రం – చరిత్ర, చరచరా – విరచించిన, తప్పటడుగులు – తాండవం, కిలకిలలు – కలభాషలు, అలతి మాటలు – పదాలు, కలమ – కళలు, తళతళలు, జ్ఞానం – విజ్ఞానం – ప్రజ్ఞానం మొదలైన పదాలు చాలా బాగున్నాయి. ఆ పదాలను సందర్భానుసారంగా ఉపయోగించడం చాలా బాగుంది.

ఆదిమానవుని స్థాయి నుండి అంతరిక్ష పరిశోధకుని వరకు పురోగమించిన మానవజాతి మహాప్రస్థానంలోని ముఖ్యమైన రోజులను వర్ణించడం చాలా ఆనందపరచింది. మానవజాతి చరిత్రలోని ప్రతిరోజును విశ్లేషించి, మనం ఇప్పుడున్న స్థితి కోసం మన పూర్వులు పడిన కష్టాన్ని గుర్తుచేశారు. దీని వలన మన పూర్వుల పైన మన గౌరవం పెరుగుతుంది. మానవజాతిని మా నవజాతి అని కీర్తించి, నిరూపించిన మానవతావాది, మానవతావాది అయిన కవి గారిని అభినందించడం
మానవధర్మం.

ప్రశ్న 2.
‘మాణిక్య వీణ’ వచన కవితను భావయుక్తంగా చదవండి. దీని భావాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
వచన కవితను భావయుక్తంగా పాడడం, మీ గురువు గారి దగ్గర నేర్చుకొని పాడండి.

మాణిక్యవీణ (భావం సొంతమాటల్లో) (కవితా సారాంశం) :
మంత్రాలతో చింతకాయలు ఎలా రాలవో, అలాగే స్తుతి పద్యాల ధాటితో చింతలు తొలగిపోవు. యంత్రాలతో రోగాలు నయం కానట్లే, తంత్రాలతో సమాజ సమస్యలు దారికిరావు.

కడుపులో కేన్సరుతో సంఘం బాధపడుతూ ఉంటే, అంతరిక్షంలోకి రాకేట్లు పంపితే మాత్రం ఏం ప్రయోజనం ? మనిషి పుట్టగానే ప్రకృతిని చూసి ఆనందించాడు. దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అతడు ప్రయత్నించాడు. ప్రకృతిలోని రంగులనూ, ధ్వనులనూ అనుకరించాడు.

మానవుడు గుహలలో జీవించే ఆదిమకాలంలోనే, గోడలపై జంతువుల బొమ్మలు గీశాడు. ఎండిన చెట్లు చిగిర్చేలా పాడాడు. గజ్జెకట్టి నాట్యం చేశాడు. చక్కని తీరుగా పదాలు పాడుకున్నాడు.

‘చక్రం’ కనుక్కొన్న రోజు, ‘లిపి’ తో రాసిన రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, చక్కగా నాట్యం చేసిన రోజు, మానవచరిత్రలో మంచిరోజులు. మానవుడు అర్థవంతమైన భాషలు నేర్చుకొన్న రోజు, చిన్నమాటలతో జానపద గీతాలు అల్లుకున్న రోజు, ధాన్యం పండించిన రోజు, కళలను పండించిన రోజు గొప్పరోజులు. మానవచరిత్రలో అవి అన్నీ పండుగరోజులు.

కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలసి, మానవుడిని మహోన్నతంగా నడిపిస్తాయి. ఈ విధంగా నేల నుండి ఎదిగి మానవుడు ఆకాశాన్ని అందుకున్న చిన్నవాడు. మానవుడు చిరంజీవి. అతి ప్రాచీనుడు.

అనాదిగా నడుస్తున్న ఈ మానవుడి జీవనయాత్రలో కళాకవితలూ, జ్ఞాన విజ్ఞానాలూ, మానవుడి వెంటనే ఉండి, అతనితో నడుస్తూ, అవే అతణ్ణి నడిపిస్తున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
పొట్లపల్లి రామారావు రాసిన కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులివ్వండి.
“ఎన్ని దినములు నీవు – ఇల గడిపినను ఏమి?
ఎన్ని జన్మాలింక – ఎదిరి చూచిన ఏమి?
ఎన్నాళ్లకైన నీ – ఔన్నత్యమును నీవే
సాధించవలెనోయి – శోధించవలెనోయి !
నీలోన వెలుగొందు – నీస్వశక్తిని మరచి –
పరుల పంచల జూడ – ఫలమేమి కలదోయి !”

అ) పై కవితకు పేరు పెట్టండి.
జవాబు:
1) స్వశక్తి
2) సాధన – శోధన
3) మానవా – మా ! నవా !
గమనిక :
కవితలోని సారాంశాన్ని బట్టి, విద్యార్థులు తమకు నచ్చిన, సరిపోయే పేరును దేనినైనా పెట్టవచ్చును.

ఆ) ఔన్నత్యం పొందడానికి కవి ఏం చేయాలని చెప్తున్నాడు?
జవాబు:
సాధించాలి. శోధించాలి. అప్పుడే ఔన్నత్యం పొందగలం అని కవి చెప్తున్నాడు.

ఇ) స్వశక్తికి, ఇతరులపై ఆధారపడడానికి గల తేడా ఏమిటి?
జవాబు:
ఎవరి సహాయసహకారాలను ఆశించకుండా, తను సొంతంగా చేయడం స్వశక్తి. దాని వలన ఆత్మవిశ్వాసం, గౌరవం, పనిచేసే తత్వం, పట్టుదల, ఓర్పు, నేర్పు మొ||వి పెరుగుతాయి. ఇతరులపై ఆధారపడితే పైన చెప్పినవేమీ ఉండవు.

ఈ) ‘పరులపంచ’ అనే పదంతో సొంతవాక్యాన్ని రాయండి.
జవాబు:
పరుల పంచ : దుర్యోధనుని కుటిలనీతి, దుర్మార్గం, మోసం వలన జూదంలో పాండవులు ఓడిపోయి, పరుల పంచల పాలయ్యారు.

ప్రశ్న 4.
ఈ పాఠంలోని “అంత్యప్రాసలున్న” పదాలు వకండి. అలాంటివే మరికొన్ని పదాలను రాయండి.
జవాబు:
పాఠంలోని అంత్యప్రాస పదాలు :
చింతకాయలు – చింతలు, జబ్బులు – రుగ్మతలు, అనవచ్చు – అనిపించనూవచ్చు, అననూవచ్చు – అనిపించనూ వచ్చు, ఆయత్తమయినాడు – గీసుకొన్నాడు, ఆరంభించినాడు – కట్టినాడు, పిక్కటిల్లేలా – చూచేలా, దినమో – శుభదినమో, రోజు – రోజు, మానవుడు – మానవుడు, విజ్ఞానం – ప్రజ్ఞానం.

మరికొన్ని అంత్యప్రాసలు :
సన్నిధి – పెన్నిధి, చూస్తా – వస్తా, చూసి – చేసి, కాలం – గాలం, ధీరత – శూరత, మమకారము – సహకారము, నీరు – మీరు, క్షీరము – నారము, వనజ – జలజ, కలతలు – మెలతలు, గిలిగింత – చికిలింత, జాతి – నీతి, పలక – గిలక, రానీ – పోనీ, నాది – నీది, వనధి – జలధి.

(గమనిక : పదంలోని చివరి అక్షరం గాని, చివరి రెండు లేక మూడు అక్షరాలు గాని ఒకే అక్షరాలుగా వచ్చేలా ఎన్ని పదాలైనా రాయవచ్చును.)

5. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.

అ) “మంత్రాలతో చింతకాయలు………………..” అని కవి వేటితో పోల్చాడు?
జవాబు:
“మంత్రాలతో చింతకాయలు రాలవు” అనే విషయంలోని మంత్రాలతో చింతకాయలు రాలనట్లే పద్యభయంతో చింతలు పారిపోవు అన్నాడు. యంత్రాలతో జబ్బులు తగ్గవు అన్నాడు. తంత్రాలతో సమాజ రుగ్మతలు పోవు అన్నాడు. పొట్టలోని పుట్టకురుపుతో సంఘం కలతపడుతుంటే అంతరిక్ష ప్రయోగాల వలన ఉపయోగం ఏమిటని ప్రశ్నించాడు.

పైవానిలో పద్యాలు, యంత్రాలు, తంత్రాలు, పొట్టలోని పుట్టకురుపుతో ఉన్న సంఘపు కలతను మంత్రాలతో పోల్చాడు. చింతలు పారిపోకపోవడం, జబ్బులు తగ్గకపోవడం, సమాజరుగ్మతలు పోకపోవడం, అంతరిక్ష ప్రయోగాల వలన ఉపయోగం లేకపోవడం అనే వాటిని చింతకాయలు రాలకపోవడంతో పోల్చాడు.

ఆ) కవి వేటిని శుభదినాలని వర్ణించాడు?
జవాబు:
చక్రం అభివృద్ధికి కారణం. అంతవరకు చాలా ప్రయాసతో చేసిన పనులను చక్రం కనుగొన్నాక సులువుగా చేశాడు మానవుడు. ఇంత అభివృద్ధి కారకమైన చక్రం కనుగొన్న రోజు నిజంగా అద్భుతమైన గొప్ప రోజు. అది మానవ చరిత్రలో శుభదినం.

నిప్పును కనుగొన్నాక మానవుని జీవన విధానం మారింది. అంతవరకు పచ్చిమాంసం, పచ్చి కూరలు, పచ్చి దుంపలు తిన్న మానవుడు వాటిని కాల్చుకొని తినడం ప్రారంభించాడు.

ఎప్పుడైతే నాలుకకు రుచి తగిలిందో అప్పుడే కళల వైపు దృష్టి మళ్ళింది. ఇక తప్పటడుగులు మానివేసి, తాండవం చేయడం మొదలు పెట్టాడు. ఇది పరిపక్వతకు, సమర్థతకు గుర్తు.

మానవుడు భాష నేర్చుకొన్నది నిజంగా శుభదినమే. పదాలు తనకు తాను అల్లుకొంటూ పదజాలాన్ని సృష్టించిన మానవుడు సాధించిన ప్రగతి సామాన్యమైనదికాదు. పదజాలం నుండే సమస్త సాహిత్యం ఏర్పడింది. అది మానవజాతి చరిత్రలో మంచిరోజు.

పంటలు పండించడానికి వ్యవసాయం చేసిన రోజు ఈనాటి ఆధునిక మానవుని ప్రతినిధులుగా మానవులను రూపొందించిన మంచిరోజు. ఇక మానవజాతి పూర్తిగా అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఏర్పడిన శుభదినం.

ఈ విధంగా మానవుడు సాధించిన అభివృద్ధికి ఆస్కారమైన రోజులన్నీ శుభదినాలే.

ఇ) మానవుణ్ణి శాశ్వతంగా నిల్పేవి ఏవి?
జవాబు:
మానవుడిని చరిత్రలో శాశ్వతంగా నిలిపే అతను సాధించిన అభివృద్ధి, పొందిన చైతన్యం మాత్రమే.

మానవుడు వేసిన కుడ్య చిత్రాలు అతడిని శాశ్వతుడిని చేశాయి. అతను పాడిన పాటలు, చేసిన నృత్యాలు అతని చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. ఘీంకరించడమేకాక చక్కని పదాలు పాడిన గొంతు మానవుణ్ణి శాశ్వతం చేసింది. అతను కనుగొన్న చక్రం, చిత్రలేఖనం అతను కనుగొన్న నిప్పు మానవుడికి శాశ్వత కీర్తిని తెచ్చాయి. అతను చేసిన తాండవం చరిత్ర పుటలలో శాశ్వతంగా స్థానం సంపాదించింది. కూతలు మాని మధురమైన భాష పలికిన రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తేలికైన మాటలతో పాటలను అల్లుకొన్నరోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచింది. కళలను పండించిన రోజు, కవిత్వం చెప్పిన రోజు, అతని జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం మానవుణ్ణి శాశ్వతంగా నిలిపాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ఈ) విద్వాన్ విశ్వం గురించి, ఆయన కవితాశైలిని గురించి ఐదు వాక్యాలు రాయండి.
జవాబు:
వ్యక్తిగతం :
విద్వాన్ విశ్వం అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో లక్ష్మమ్మ, రామయ్య దంపతులకు క్రీ.శ. 1915లో జన్మించారు. ఆయన అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. ఆయన సంస్కృతాంధ్రాంగ్ల భాషలలో పండితుడు. ఆయన మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో అనేక హోదాలలో పనిచేశారు. భాష, సాహిత్యం , సమాజ నైతిక విలువలు మొదలైన అంశాలపై ‘అవి – ఇవి’, ‘తెలుపు – నలుపు’, ‘మాణిక్య వీణ’ వంటి శీర్షికలతో సంపాదకీయాలు రాశారు. ఆయన సాహితీవేత్త. రాజకీయ నాయకుడు, పత్రికా సంపాదకుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ‘ప్రేమించాను’ అనే నవల, ‘ఒకనాడు’, ‘పెన్నేటిపాట’ అనే కావ్యాలు రచించారు. కళాప్రపూర్ణ, డి.లిట్. పట్టాలు అందుకొన్నారు.

శైలి :
విశ్వం శైలి మధురమైనది. సామాన్య పాఠకునకు అర్థం అయ్యే పదాలు ప్రయోగిస్తాడు. తేలికైన సంస్కృత పదాలు ప్రయోగిస్తాడు. అంత్యప్రాసలకు ప్రాధాన్యం ఇస్తాడు.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) చరిత్రలో మైలురాళ్ళుగా నిల్చిన అంశాలేవి? ఇవి దేనికి ప్రతీకగా భావిస్తున్నావు?
జవాబు:
గుహలలో నివసించిన రోజులలో మానవుడు గీసిన కుడ్యచిత్రాలు చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. అది మానవునిలోని పరిశీలనాశక్తికి, కళాదృష్టికి ప్రతీకగా భావించవచ్చును.

అడవులలో సంచరించిన రోజులలోనే పాటలు పాడడం మానవుడు ప్రారంభించాడు. అది చరిత్రలో మైలురాయి. ఇది మానవునిలోని కళాదృష్టికి, పాటలు పాడాలి అనే అతని తపనకు ప్రతీక.

గులకరాళ్ళమీద కాలికి గజ్జెకట్టిన దృశ్యం చరిత్రలో మైలురాయి. అతనిలో నాట్య ప్రవృత్తికి, శాస్త్రీయ నృత్యాభిలాషకు ఇది ప్రతీక.

దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకరించిన రోజు మానవచరిత్రలో మైలురాయి. ఇది అతని ధైర్యానికి, విజయానికి ప్రతీక. చక్కని నొక్కులతో చిక్కని పదాలు పాడిన రోజు కూడా చరిత్రలో మైలురాయి. అది మానవునిలోని రచనాశక్తికి ప్రతీక.

చక్రం కనుగొన్న రోజు, చిత్రలేఖనం చేసిన రోజు, నిప్పును కనుగొన్నరోజు, తప్పటడుగులు మాని తాండవమాడిన రోజు, కూతలు మాని మధురమైన భాష నేర్చిన రోజు, పాటలు రచించిన రోజు అన్నీ చరిత్రలో మైలురాళ్ళే. అవి అన్నీ మానవునిలోని అభివృద్ధి చెందాలనే కాంక్షకు, సాధించాలనే తపనకు, సుఖపడాలి అనే కోరికకు, భవిష్యత్తు గురించిన ఆలోచనలకు ప్రతీకలు.

ఆ) “మిన్నులు పడ్డ చోటి నుంచి……….. తిన్నగా ఎదిగి మిన్నందుకుంటున్న చిన్నవాడు మానవుడు” అని కవి వర్ణించాడు. ఈ వాక్యాల మీద నీ అభిప్రాయమేమిటి?
జవాబు:
మానవులకు చిన్నతనంలో ఒక కోరిక ఉంటుంది. దూరంగా చూస్తే, ఆకాశం భూమి కలసినట్లు కనిపిస్తుంది. అక్కడకు వెళ్ళి, ఆకాశం ముట్టుకోవాలని ఉంటుంది. కానీ, అది తీరదు.

ఆది మానవుడు జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించాడు. ఎంతో అభివృద్ధిని సాధించాడు. కానీ మొదట్లో ఆదిమానవుడు ప్రకృతిని, ఆకాశాన్ని చూసి భయపడేవాడు. క్రమేణా భయం తగ్గింది. అంటే ప్రకృతిలో చాలా చిన్నవాడు మానవుడు. అటువంటివాడు అంతరిక్ష పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగాడు. అంటే చాలా అభివృద్ధిని సాధించాడు. ఇంకా సాధించవలసింది చాలా ఉంది.

అందుచేత “మిన్నందుకొంటున్న చిన్నవాడు” అన్నాడు కవి. మిన్నందుకోవడం బాగా ఉన్నత స్థితికి వెళ్ళడం. అంటే మానవుడు ఇంకా చాలా అభివృద్ధిని సాధించాలి అని కవి భావన. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న “చిన్నవాడు” అనడంలో మానవజాతి ఆవిర్భావం జరిగి తక్కువ కాలమే అయ్యిందని కవి భావన. ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు మానవజాతి పురోగమిస్తుంది అని కూడా కవి భావన. దినదినాభివృద్ధి చెందుతుందని, చెందాలని కవిగారి విశ్వాసం. ఆకాంక్ష.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ఇ) మానవ చరిత్రలో అన్నీ అసాధారణ పర్వదినాలే అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జవాబు:
మానవచరిత్రలోని తొలి రోజులలో ఆదిమానవుడు జంతువులతో సమానంగా జీవించాడు. జంతువులకు, ప్రకృతిలోని వర్షాలకు, గాలులకు, ఉరుములకు, మెరుపులకు భయపడి బిక్కుబిక్కుమంటూ కొండగుహలలో బ్రతికాడు. అటువంటి మానవుడు భయం విడిచి పెట్టాడు. ధైర్యం పుంజుకున్నాడు. అసాధారణ పర్వదినాలను సృష్టించాడు. గోడలపై జంతువుల బొమ్మలు చిత్రించి ఒక పర్వదినం సృష్టించాడు. పాటలు పాడాడు. అతనిలోని కళాతృష్ణను వ్యక్తీకరించిన ఆ రోజు కూడా పర్వదినమే. కాలికి గజ్జె కట్టిన రోజు – మానవుని ఉత్సాహాన్ని గమనించిన ఆ రోజునూ కవి పర్వదినమన్నాడు. చక్కని పదాలతో పాటలను అల్లిన మానవునిలోని కవితాశక్తిని గమనించి, ఆ రోజును పండుగ దినంగా కవి భావించాడు. చక్రం కనుగొన్న రోజు నిజంగా మానవజాతికి పర్వదినమే. అక్కడనుండే మానవజాతి అసలైన అభివృద్ధి ప్రారంభమైంది. . కనుకనే దాన్ని పర్వదినమన్నాడు కవి. నిప్పును కనుక్కొని పండుగ రోజుకు కమ్మని వంటకాలు సిద్ధచేయడం మరి పండుగే కదా ! మానవజాతికి, అదే పేర్కొన్నాడు కవి.

తప్పటడుగులు మాని, తాండవం చేసిన రోజును మనిషిలో ఉప్పొంగిన ఉత్సాహానికి పరవశించిన పర్వదినంగా పేర్కొన్నాడు కవి. మధురభాష నేర్చుకొన్న రోజును మానవుల భావ వ్యక్తీకరణకు అవకాశం దొరికింది కనుక ఆ రోజును పర్వదినంగా కవి పేర్కొన్నాడు. తేలికైన మాటలతో పాటలల్లిన రోజున మానవునిలోని కవిత్వ రచనాశక్తి బయటపడింది కనుక దానిని కూడా పండుగరోజుగా కవి పేర్కొన్నాడు.

వరిధాన్యం పండించిన రోజు నాగరిక మానవుడు ఆవిర్భవించాడు కనుక, అది పర్వదినమన్నాడు కవి. కళలు, కవిత్వం, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం వికసించిన రోజులన్నీ మానవుల అభివృద్ధినీ, పురోగతినీ ప్రకటించిన రోజులే. కనుక అవి అన్నీ పర్వదినాలే అన్నాడు కవి.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు గదా ! దీనినెలా సమర్థిస్తావు?
జవాబు:
కళ :
ప్రకృతిలోని అందాలకు మానవుడు పరవశించాడు. దానిని అనుకరించడానికి ప్రయత్నించాడు. గుహలలో నివసించిననాడే గోడలపై జంతువుల బొమ్మలు చిత్రించాడు. అడవులలో నివసించే రోజులోనే మోడులు కూడా చిగురించేలా పాడాడు. గులకరాళ్ళ ములుకుల మీద గజ్జెకట్టి నాట్యం చేశాడు. ఇవి అన్నీ మానవునిలోని కళాశక్తికి నిదర్శనాలు. అందుచేత ‘కళ’ మానవ పురోగతిలో తోడుగా నిలిచి అతని మనసుకు ఉత్సాహాన్ని నింపింది.

కవిత :
ఘీంకరించడమే కాదు. చక్కని నొక్కులు గల చిక్కని పదాలతో పాటలు రచించి పాడుకొన్నాడు. నాలుగు గీతలతో ఒక చిత్రాన్ని రచించాడు. తప్పటడుగులు మాని శాస్త్రీయ నృత్యం చేశాడు. కూతలు మాని భాష నేర్చుకొన్నాడు. అలతి పదాలతో పాటలు అల్లుకొన్నాడు. ఇవి అన్నీ మానవునిలోని కవితాసక్తిని నిరూపిస్తున్నాయి. అందుచేత ‘కవిత్వం’ మానవ పురోగతిలో అడుగడుగునా తోడై కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఆహ్లాదాన్ని పెంచింది.

విజ్ఞానం :
మానవుని పురోగతిలో ‘విజ్ఞానం’ ప్రధానపాత్ర పోషించింది. కళ, కవిత్వాలు అతనిలోని విజ్ఞానాన్ని తట్టిలేపాయి. శోధించాడు, సాధించాడు. చక్రం కనుగొన్నాడు. కష్టంగా బరువులెత్తినవాడు సులువుగా బరువులను తరలించాడు. జీవితాన్ని తన విజ్ఞానంతో సుఖమయం చేసుకొన్నాడు. నిప్పును కనుగొన్నాడు. మానవజీవితంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కమ్మని భోజనం దొరికింది. ధాన్యం పండించాడు. సౌఖ్యమంతమైన రోజులు సృష్టించాడు. అద్భుతాలెన్నో సృష్టించాడు. అంతరిక్ష పరిశోధనల దాకా అతని విజ్ఞానం పురోగమించింది. పురోగమిస్తుంది.

పై వాటిని పరిశీలిస్తే మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడై అతనిని ఆకాశమంత ఎత్తుకు పెంచాయి అనడం సమర్థనీయమే.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ఆ) మాణిక్య వీణ కవితా సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
‘మాణిక్య వీణ’ పాఠం ఆధారంగా మానవ పరిణామ క్రమాన్ని సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
మంత్రాలకు చింతకాయలు రాలవు. అట్లే పద్యం ధాటికి చింతలు పారిపోవు. కేవలం రోగాలను పరీక్షించే యంత్రాల వలన రోగాలు తగ్గవు. అట్లే ఏవేవో ఉపాయాల వలన సమాజంలోని రుగ్మతలు పోవు.

సృష్టిలో మానవుడు పుట్టిన లక్షల సంవత్సరాల క్రితమే ప్రకృతిని ప్రేమించాడు. ప్రకృతి అందాలకు పరవశించాడు. ఆనాడే ప్రకృతిని జయించాలనుకొన్నాడు. గుహలలో నివసించిన నాడే గోడల పై జంతువుల బొమ్మలను చిత్రించాడు.

అడవులలో ఆదిమానవుడు సంచరించిన నాడే పాటలు పాడాడు. నృత్యం చేశాడు. దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడమే కాదు చిక్కనైన పదాలతో చక్కని పాటలు పాడాడు.

చక్రం కనుగొన్నాడు. చరిత్రలో ఆ రోజు ప్రముఖమైనది. నాలుగు గీతలతో చక్కని బొమ్మను చిత్రించిన రోజు కూడా ప్రముఖమైనదే. నిప్పును కనుగొన్నాడు. అది మానవ జీవితంలో మార్పును తెచ్చిన శుభదినం. తప్పటడుగులు మాని, తాండవం చేసిన రోజు కూడా శుభదినం.

కూతలు మాని మధురమైన భాష నేర్చుకొన్న రోజు కూడా నిజంగా మంచిరోజు. తేలిక పదాలతో పాటలు అల్లుకొన్న రోజు చరిత్రలో పర్వదినం. వరి ధాన్యం పండించిన రోజు కూడా పర్వదినం. అన్నీ పర్వదినాలే.

అలాగ అన్నీ కలిసి, పెనవేసుకొన్నాయి. కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం మెరుపులై మానవుని నడిపించాయి. మిన్నులు పడ్డచోటు నుండి నిటారుగా ఎదిగాడు. ఆకాశమంత ఎత్తు ఎదిగాడు. అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాడు మానవుడు. అయినా ఇంకా చాలా అభివృద్ధి చెందవలసిన చిన్నవాడు మానవుడు.

ఏనాటి నుండో నడుస్తున్న ఈ సుదీర్ఘమైన మానవ జీవనయాత్రలో మానవుని వదలనివి కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం. మానవునితో నడిచేవీ, నడిపించేవీ అవే.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) నీ చుట్టూ ఉన్న పరిసరాల్లో, మానవ జీవితంలో కలిగిన మార్పులను, అభివృద్ధిని వర్ణిస్తూ పది పంక్తులకు తక్కువ కాకుండా ఒక కవితను రాయండి.
జవాబు:
రోడ్లన్నీ నాడు బురదతో జర్రు జర్రు
నేడు హారన్లతో బర్రు బర్రు
నాడు ధర మీదే మా చదువులు
నేడు ధరల మీదే మా చదువులు
నాడు మాస్టార్లంటే భయం భయం
నేడు విద్యాహక్కు చట్టమంటే ప్రియం ప్రియం
అప్పుడందరూ రైతులే, అన్నీ పొలాలే
ఇప్పుడందరూ నేతలే, అన్నీ బిల్డింగులే
అప్పుడు సినిమాలే ఎరగం
ఇప్పుడు సినిమాలే జగం
నాడు చదువంటే చాలా కష్టం
నేడు చదువంటే చాలా ఇష్టం
నాడు అదే స్వర్గం
నేడు ఇదో స్వర్గం.

ఆ) విద్వాన్ విశ్వం కవిత్వాన్ని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మహబూబ్ నగర్,
x x x x x

ప్రియమైన రాజేష్ కు,
నీ మిత్రుడు సురేష్ వ్రాయు లేఖ.
ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

విద్వాన్ విశ్వం రచించిన ‘మాణిక్య వీణ’ పాఠం చాలా బాగుంది. అది వచన కవిత. దానిలో ఉపయోగించిన ప్రాస పదాలు చాలా బాగున్నాయి. మానవజాతి పురోగతిని చాలా చక్కగా వర్ణించారు. సందర్భానికి తగిన పదాలు ప్రయోగించారు. కవితా వస్తువు కూడా ఎక్కడా కుంటుపడకుండా చాలా చక్కగా సాగింది.

‘మంత్రాలకు చింతకాయలు రాలతాయా !’ అనే నానుడితో కవిత ప్రారంభమౌతుంది. ఈ వాక్యంలోనే కవి చెప్పబోయే విషయాన్ని సూచించాడు. మానవ ప్రయత్నం లేకపోతే ఏ పనీ జరగదు అని చెప్పాడు. అదే ఆయన కవితాశిల్పం.

గోడలపై మానవుడు గీసిన బొమ్మల గురించి చెబుతూ, గుర్రాలు, జింకల బొమ్మలు చిత్రించాడన్నాడు. రెండూ వేగానికి సంకేతాలే. అంటే మానవుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాడని బొమ్మల ద్వారా చెప్పాడు. పదాల ద్వారా చెప్పకుండా, సంకేతాల ద్వారా చెప్పడం ఉత్తమ కవితా లక్షణం. దానిని నిరూపించాడు విశ్వం.

“మొక్కలు నిక్కి చూచేలా – చక్కని నొక్కులతో చిక్కని పదాలు పాడుకొన్నాడు” అనేది కూడా అద్భుతమైన వర్ణన. వృత్త్యనుప్రాసాలంకారం ప్రయోగించాడు. ఇలాగే జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం మూడూ సమానార్థకాలుగా కనిపిస్తాయి. ఒకదాని కంటే ఒకటి ఉన్నతమైనవి.

తప్పక నీవు ఈ కవిత చదువు. ఉంటా.

ఇట్లు
నీ స్నేహితుడు,
కె.సురేష్,

చిరునామా :
పేరు : జి. రాజేష్,
10వ తరగతి, సి. సెక్షన్, నెం. 4,
పాఠశాల : xxxxxx. గ్రామం : xxxxxx.
మండలం : xxxxxx. జిల్లా : xxxxxx.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

దిన, వార పత్రికల ఆధారంగా, మీకు నచ్చిన రెండు వచన కవితల్ని సేకరించి, అంశాల ఆధారంగా కింది పట్టికను పూరించండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 5

(గమనిక : ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రభూమి వంటి దినపత్రికలు వారానికి ఒకసారి కవితలు ప్రచురిస్తాయి. స్వాతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి మొదలైన వారపత్రికలలో ప్రతివారం ప్రచురిస్తారు. గమనించి, సేకరించి, పట్టిక నింపాలి.)

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాలు చదివి గీతగీసిన పదాలకు అర్థం రాయండి. పదాలతో సొంతకార్యాలు రాయండి.

అ) రోదసి లోకి దూసుకెళ్ళిన మరో ఉపగ్రహం
జవాబు:
రోదసి = అంతరిక్షం
సొంతవాక్యం : రోదసిలో పరిశోధిస్తే ఎన్నో అద్భుతాలు తెలుస్తాయి.

ఆ) విద్యార్థులంతా పరీక్షలకు ఆయత్తమవుతున్నారు.
జవాబు:
ఆయత్తమవు = సిద్ధపడు
సొంతవాక్యం : మేము తిరుపతికి వెళ్ళడానికి ఆయత్తమవుతున్నాము.

ఇ) రుగ్మత ఉన్న ఈ సమాజానికి మానవీయ విలువలతో చికిత్స అవసరం.
జవాబు:
రుగ్మత = రోగం
సొంతవాక్యం : రుగ్మత తగ్గాలంటే వైద్యం తప్పదు.

ఈ) కళవళపడటమెందుకు? నెమ్మదిగా జవాబు చెప్పు,
జవాబు:
కళవళపడటము = కలవరపడటము
సొంతవాక్యం : జీవితంలో కష్టాలకు కళవళపడటం మంచిదికాదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

2. పాఠం ఆధారంగా కింది వాక్యాలకు సమానమైన పదాల్ని వెతికి రాయండి.

ఒకరిని చూసి మరొకరు చేయడం
పనిచేయడానికి సిద్ధమవడం
అద్భుతంగా నాట్యమాడటం
పనిని మొదలుపెట్టడం

జవాబు:

ఒకరిని చూసి మరొకరు చేయడం అనుకరించడం
పనిచేయడానికి సిద్ధమవడం ఆయత్తమవడం
అద్భుతంగా నాట్యమాడటం తాండవమాడడం
పనిని మొదలుపెట్టడం తిన్నగా ఎదగడం

3. క్రింది జాతీయాలను ఏయే సందర్భాల్లో ప్రయోగిస్తారో తెలిపి సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
అ) మంత్రాలకు చింతకాయలు రాలడం :
జవాబు:
పనులు చేయకుండా కేవలం కబుర్లు మాత్రమే చెబితే ప్రయోజనం లేదని చెప్పే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం :
మంత్రాలకు చింతకాయలు రాలవు గానీ, పని మొదలుపెట్టండయ్యా.

ఆ) మిన్నందుకోడం :
జవాబు:
చాలా అభివృద్ధి చెందడం అనే అర్థంలో దీనిని ఉపయోగిస్తారు. ఆకాశం అందదు. కానీ, దానిని కూడా అందుకున్నాడంటే అతనికి అసాధ్యం లేదు కదా !
సొంతవాక్యం :
తెలివితేటలు పెంచుకుంటే మిన్నందుకోడం సాధ్యమే.

ఇ) గజ్జెకట్టడం :
జవాబు:
నాట్యం ప్రారంభించేవారు ముందుగా గజ్జె కట్టుకుంటారు. గజ్జె కట్టడం జరిగితే తప్పనిసరిగా నాట్యం చేస్తారని అర్థం. పనిలో చురుకుగా పాల్గొని అన్నీ తానై చేసేవారిని గూర్చి ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం :
రుద్రమదేవి కదనరంగంలో గజ్జెకట్టి కాళికలా నర్తించింది.

4. కింది పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలు రాయండి.
అ) మిన్ను :
1) ఆకాశం
2) నింగి

అ) తాండవం :
1) నాట్యం
2) నృత్యం

ఇ) రుగ్మత :
1) రోగం
2) జబ్బు

ఈ) జ్ఞానం :
1) తెలివి
2) మేధ

5. కింది రాశ్యాల్లోని వికృతి పదాలను గుర్తించి పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు చేర్చి తిరిగి వాక్యాలు రాయండి.

అ) అమ్మ బాసలోనే నేను మాట్లాడతాను.
జవాబు:
వికృతి = బాస,
ప్రకృతి = భాష
వాక్యం : అమ్మ భాషలోనే నేను మాట్లాడతాను.

ఆ) మన కవులు రాసిన కైతలు భారతి మెడలో అలంకరించిన హారాలు.
జవాబు:
వికృతి = కైతలు, ప్రకృతి = కవితలు
వాక్యం : మన కవులు రాసిన కవితలు భారతి మెడలో అలంకరించిన హారాలు.

ఇ) విన్నాణము పెంచుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది.
జవాబు:
వికృతి = విన్నాణము, ప్రకృతి = విజ్ఞానము
వాక్యం : విజ్ఞానము పెంచుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది.

ఈ) సింహాలు గొబల్లో నిద్రిస్తున్నాయి.
జవాబు:
వికృతి = గొబ, ప్రకృతి = గుహ
వాక్యం : సింహాలు గుహల్లో నిద్రిస్తున్నాయి.

వ్యాకరణాంశాలు

1) కింది పదాల్లో నుగాగమ సంధి పదాలను గుర్తించి, విడదీసి సూత్రం రాయండి.
నిట్టనిలువు, తెల్లందనము, పోయేదేమి, తళుకుంగజ్జెలు, మహోపకారం, సరసపుఁదనము

నుగాగమ సంధి పదాలు :
1) తెల్లందనము
2) తళుకుంగజ్జెలు
3) సరసపుఁదనము
తెల్ల + తనము
సరసపు + తనము
తళుకు + గజ్జెలు

సూత్రము :
సమాసంబుల నుదంతంబులగు స్త్రీ సమంబులకు, పుం, పులకు పరుష సరళములు పరములగునపుడు నుగాగమంబగు.
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 1
( గమనిక : విద్యార్థుల సౌకర్యం కొఱకు మిగిలినవి కూడా క్రింద ఇవ్వబడ్డాయి.)

1) నిట్టనిలువు = నిలువు + నిలువు – ద్విరుక్తటకారదేశ సంధి
సూత్రం : ఆమ్రేడితము పరమగునపుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబుల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.

2) పోయేదేమి = పోయేది + ఏమి – ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

3) మహోపకారము = మహా + ఉపకారము – గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైతే వానికి క్రమంగా, ఏ, ఓ, అర్లు ఆదేశమగును.

2) కింది వాటిని జతపరచండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 2
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 3

3) కింది వాక్యాలను పరిశీలించండి.
అ) మిమ్ము మాధవుడు రక్షించుగాక !
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 4
వివరణ :
పై వాక్యాలలో ఒకే శబ్దం వేర్వేరు అర్థాలను అందిస్తుంది. ఇలాగ విభిన్న అర్థాలు గల పదాలతో ఉండే దానిని ‘శ్లేషాలంకారం’ అంటారు. అంటే నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేషాలంకారం.

కింది లక్ష్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి, సమన్వయం చేయండి.
1. రాజు కువలయానందకరుడు.
అర్థం :
1. రాజు (దేశాన్ని పాలించే ప్రభువు) కువలయమునకు (భూమండలానికి) ఆనందకరుడు.
2. రాజు (చంద్రుడు) కువలయములకు (కలువలకు) ఆనందకరుడు.
వివరణ :
పై వాక్యంలో రాజు (పరిపాలకుడు, చంద్రుడు), కువలయం (భూమి, కలువ) అనేవి వేర్వేరు అర్థాలలో ప్రయోగించారు. కనుక అది శ్లేషాలంకారం.

2. నీవేల వచ్చెదవు.
అర్థం :
1. నీవు ఏల (ఎందుకు) వచ్చెదవు.
2. నీవు ఏల (పరిపాలించడానికి) వచ్చెదవు.
వివరణ :
పై వాక్యంలో ‘ఏల’ అనే పదాన్ని ఎందుకు’, ‘పరిపాలించడానికి’ అనే విభిన్న అర్థాలలో ప్రయోగించారు. కనుక, అది శ్లేషాలంకారం.

అదనపు సమాచారము

సంధులు

1) కట్టెదుట = కడు + ఎదుట – ద్విరుక్తటకారాదేశ సంధి
2) నిట్టనిలువు = నిలువు + నిలువు – ఆమ్రేడిత సంధి
3) గుర్రాలు = గుర్రము + లు – లులనల సంధి
4) పదాలు = పదము + లు – లులనల సంధి
5) మిన్నందుకొన్న = మిన్ను + అందుకొన్న – ఉత్వ సంధి
6) ఆయత్తమయినాడు = ఆయత్తము + అయినాడు – ఉత్వ సంధి
7) ఏమిటని = ఏమిటి + అని – ఇత్వ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) మానవ చరిత్ర మానవుల యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం
2) సమాజ రుగ్మతలు సమాజంలోని రుగ్మతలు షష్ఠీ తత్పురుష సమాసం
3) చక్కని నొక్కులు చక్కనైన నొక్కులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) చిక్కని పదాలు చిక్కనైన పదాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5) శుభదినం శుభమైన దినం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6) తప్పటడుగులు తప్పు అయిన అడుగులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
7) అలతి మాటలు అలతియైన మాటలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
8) అనాది ఆదికానిది నఇ్ తత్పురుష సమాసం
9) అందచందాలు అందమును, చందమును ద్వంద్వ సమాసం

ప్రకృతి- వికృతి

కుడ్యము – గోడ
విజ్ఞానము – విన్నాణము
భాషలు – బాసలు
పద్యము – పద్దెము
కవిత – కైత
మూలిక – మొక్క
పర్వము – పబ్బము
గుహ – గొబ
యంత్రము – జంత్రము

పర్యాయపదాలు

1) మాట : 1) పలుకు 2) వచనము 3) ఉక్తి
2) అడుగు : 1) పాదం 2) చరణం 3) పదం
3) గుర్రాలు : 1) అశ్వములు 2) హయములు 3) తురంగములు
4) పొట్ట : 1) కడుపు 2) కుక్షి 3) ఉదరం
5) చింత : 1) చింతచెట్టు 2) ఆలోచన 3) దుఃఖము
6) మనిషి : 1) మానవుడు 2) నరుడు 3) మర్త్యుడు 4) మనుజుడు
7) దిక్కు : 1) దిశ 2) ఆశ 3 ) దెస 4) కడ
8) కాయ : 1) వీణకు అమర్చే సొరకాయ 2) చెట్టుకాయ 3) బిడ్డ 4) జూదపు సారె

కవి పరిచయం

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 6
విద్వాన్ విశ్వం జననం జననీ జనకులు : అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. వీరిది అనంతపురం జిల్లాలోని తరిమెల గ్రామం. జననీ జనకులు లక్ష్మమ్మ, రామయ్య దంపతులు.

రచనలు : “ఇంత మంచి పెన్నతల్లి ఎందుకిట్లు మారెనో?
ఇంత మంది కన్నతల్లి ఎందుకెండి పోయెనో ?”
అని ఆవేదనతో ‘పెన్నేటిపాట’ను సృష్టించాడు. ‘ప్రేమించాను’ అనే నవల, ‘ఒకనాడు’, ‘పెన్నేటిపాట’ అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారిన రచనలు.

పాండిత్యం – పత్రికలు : సంస్కృతాంధ్రాంగ్ల భాషా పండితులు విద్వాన్ విశ్వం. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. పత్రికా సంపాదకునిగా “అవి – ఇవి’, ‘తెలుపు – నలుపు’, ‘మాణిక్య వీణ’ మొదలైన శీర్షికలను భాష, సాహిత్యం , సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు రాశారు. పత్రికల్లో వివిధ హోదాలలో పనిచేస్తూనే సంస్కృత భాషలోని అనేక గ్రంథాలు తెలుగులోకి అనువదించారు.

విశ్వం – విశ్వరూపం : సాహితీవేత్తగా, రాజకీయనాయకునిగా, పత్రికా సంపాదకునిగా బహుముఖీన దర్శనమిచ్చిన ప్రతిభాశాలి విద్వాన్ విశ్వం. ఆయన సాహిత్య సేవకు కళాప్రపూర్ణ, డి.లిట్. పట్టాలనందు కున్నాడు.

గేయాలు అర్థాలు భావాలు

1. అవగాహన – ప్రతిస్పందన

గేయం -1

మంత్రాలతో చింతకాయలు
రాలనప్పుడు పద్యం
సంత్రాసంతో చింతలు
పారిపోతాయా?
అర్థాలు :
సంత్రాసం = మిక్కిలి భయం
చింతలు = బాధలు

భావం:
మంత్రాలతో చింతకాయలు రాలవు. అలాగే పద్యం నిర్మాణంలోని యతులు, ప్రాసలు, గణాలు మొదలైన వాటికి భయపడితే ఆ భయంతో మనలోని వేదనలు, బాధలు తగ్గవు. అంటే మన బాధలు, భయాలను వచన కవితలోనైనా, వ్యక్తీకరించాలి. అలా వ్యక్తీకరిస్తేనే మనశ్శాంతి కలుగుతుంది.

గేయం -2

యంత్రాలతో జబ్బులు
వయం కానప్పుడు
తంత్రాలతో సమాజరుగ్మతలు
దారికి వస్తాయా?
ఆంటే అనవచ్చు,
ఔనని కొందలుతో
అనిపించనూ వచ్చు.
అర్థాలు:
తంత్రము = హేతువు
రుగ్మత = రోగం, జబ్బు

భావం :
రోగిని పరీక్షించే యంత్రాల వలన రోగాలు తగ్గవు. ఉపాయాలు, హేతువులు అన్వేషిస్తూ, కాలక్షేపం చేస్తే సమాజం లోని చెడు లక్షణాలు, దురాచారాలు నిర్మూలనం కావు. ఈ విషయాలను కొంతమంది ఆమోదిస్తారు. కొంతమంది ఇష్టం లేకపోయినా కాదనలేక ఔనంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

గేయం -3

పొట్టలోని పుట్టకురుపుతో సంఘం
కట్టెదుట కళవళపడి పోతుంటే
నిట్టనిలువున రోదసిలోనికి
కట్టలు కట్టుకొని దూసుకొనిపోయి
కట్టుకొని పోయేదేమిటని
అంటే అవమావచ్చు,
బావని కొందలతో
అనిపించమావచ్చు.
అర్థాలు:
పుట్టకురుపు = వ్రణము
కళవళపడు = కలతపడు
రోదసి = అంతరిక్షము
భావం :
మనిషిలోని చెడు లక్షణాలు, దురాచారాలు, మూఢ నమ్మకాలు అనే పుట్ట కురుపుతో కలతపడుతుంటే రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతూ చేసే పరిశోధనల వలన ప్రయోజన మేముంది ? అదంతా వృథా అని కొంతమంది అనవచ్చును. కొంతమందిచేత అనిపించవచ్చును.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఈ కవితలో ప్రాస పదాలు ఏమున్నాయి?
జవాబు:
ఈ కవితలో చింతకాయలు- చింతలు, అనవచ్చు అనిపించనూవచ్చు, పొట్ట-పుట్ట, కట్టెదుట- నిట్టనిలువు, కట్టలు – కట్టుకొని, కాడు – మోడు, చక్కని – చిక్కని, మొక్కలు – నిక్కి కిలకిలలు – కలభాషలు, కలమ – కళలు, విజ్ఞానం – ప్రజ్ఞానం, చిరంజీవి – చిరంతనుడు, జ్ఞానం – విజ్ఞానం అనే ప్రాసపదాలు ఉన్నాయి.

ప్రశ్న 2.
“అంటే అనవచ్చు, ఔనని కొందఱతో అనిపించనూ వచ్చు” అనే వాక్యాల ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
ఒకదానికి ఇంకోదానికి ముడివేసి, కొంతమంది సమాజపు అభ్యున్నతినీ, శాస్త్ర పరిశోధనలనూ ప్రశ్నిస్తే ప్రశ్నించవచ్చును. వారి వాదానికి మద్దతుగా ఇంకా కొంతమందితో ఔననిపించవచ్చును. ఎంతమంది ప్రశ్నించినా, అడ్డు తగిలినా, వాద ప్రతివాదనలు చేసినా మానవజాతి పురోగమిస్తూనే ఉంటుంది. అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.

ప్రశ్న 3.
సమాజ రుగ్మతలు’ అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జవాబు:
సమాజ రుగ్మతలు’ అంటే సమాజానికి అనగా సంఘానికి పట్టిన జబ్బులు.

  1. అంటరానితనాన్ని పాటించడం
  2. కులమతభేదాలు పాటించడం
  3. మూఢనమ్మకాలు కలిగియుండడం
  4. అవినీతి దురాచారం
  5. కులసంఘాలు, మత సంఘాలు మొ||నవి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 4.
“పొట్టలోని పుట్టకురుపుతో సంఘం కట్టెదుట కళవళ పడిపోవడం” అంటే ఏమిటి?
జవాబు:
పొట్ట అంటే సంఘంలోని కీలకమైన స్థానాలు. పుట్టకురుపు అంటే ఎప్పటికీ తగ్గకుండా, వ్యాపించే గుణం కలిగిన పెద్ద ప్రణం. అంటే సమాజం అభివృద్ధికి కారకులు కావలసిన వారే అవినీతి, బంధుప్రీతితో సంఘాన్ని పాడుచేస్తున్నారు. అవినీతిని అంత మొందించాలని సామాన్యులు భావించినా, ఏమీ చేయలేని స్థితి. అందుచేత అవినీతి అనే పుట్టకురుపు సంఘమంతా వ్యాపిస్తోంది. మొత్తం సంఘాన్ని కలుషితం చేస్తోంది. దీనికితోడు, కుల, మత, ప్రాంత విభేదాలు, దురాచారాలు మొదలైనవి కూడా అవినీతిని ఆసరా చేసుకొని విజృంభిస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా మన సంఘం మన ఎదురుగానే మనలేక, ఎవరినీ ఏమనలేక కలవరపడుతోంది.

గేయం – 4

మనిషి కనువిచ్చినప్పుడే
నాని అందచందాలు చవిగొన్నాడు.
ఆనాడే ప్రకృతిని
ఆధీనం చేసుకోవడానికి
అందలి రంగులమా రవళిని
అనుకరించడానికి కూడా ఆయత్తమయివాడు.
గుహలలో వివసించేవాడే
గోడలపై గుర్రాలు, జింకలూ గీసుకున్నాడు
అర్థాలు :
కనువిచ్చుట – జ్ఞానం కలగడం) జన్మించడం
రవళి = ధ్వని
ఆయత్తము = సిద్ధము

భావం:
మానవ జన్మ ప్రారంభమైన తొలి రోజులలోనే ఆది మానవుడు ప్రకృతి అందచందాలను గమనించాడు. ఆనాడే ప్రకృతిని జయించడానికి ప్రయత్నించాడు. ప్రకృతిలోని రంగులనూ, అందాలనూ చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని పక్షులు, జంతువుల అరుపుల ధ్వనులను అనుకరించాడు. కొద్దిగా అభివృద్ధి చెంది గుహలలో నివసించి నప్పుడు ఆ గోడలపై గుజ్జాలూ, జింకలూ మొదలైన వేగంగా కదిలే జంతువుల బొమ్మలను చిత్రించాడు. ఆ బొమ్మల ద్వారా వేగవంతమైన తన అభివృద్ధిని అన్యాపదేశంగా చెప్పాడు.

గేయం – 5

కాడు వీడనప్పుడే
మోడులు చివురించేలా
పాడడం ఆరంభించినాడు
గులకతాల ములుకుమీదే
గొబ్బున కాలికి గల కట్టివాడు.
దిక్కులు పిక్కటిల్లేలా
ఘీంకరించుటే కాదు
మొక్కలు విక్కి చూచేలా
చక్కని నొక్కులలో
చిక్కని పదాలు పాడుకొన్నాడు.
అర్థాలు:
కాడు = అడవి
మోడు = ఎండిన చెట్టు
ములుకు = వాడియైన మొన
గొబ్బున = శీఘ్రంగా
నిక్కి = నిలబడి
నొక్కులు = వంపుసొంపులు
చిక్కని = గంభీరమైన, దట్టమైన
పదాలు = పాటలు

భావం:
కొంచెం అభివృద్ధి చెందిన ఆదిమానవుడు అడవిలో సంచరించినప్పుడే ఎండిన చెట్లు కూడా చిగురించేలా గొంతెత్తి పాడడం మొదలు పెట్టాడు. ఆ అడవిలో వాడియైన మొనదేలిన గులకరాళ్ల మీదనే శీఘ్రంగా కాలికి గజ్జెకట్టి ఆనందంతో నృత్యం చేశాడు. దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాడు. క్రూరమృగాలను కూడా తన అరుపులతో భయపెట్టాడు. అంతేకాదు మొక్కలు కూడా తలయెత్తి చూచేలా చక్కని లయతో గంభీరమైన పదాలతో పాటలు పాడుకొన్నాడు.

గేయం -6

“చక్రం కనుక్కున్న రోజెంత
చరిత్రలో ప్రముఖ దివమో
చరచరా నాలుగు గీతలతో ఓ ఆకారం
విరచించిన రోజు అంతే ప్రముఖం
నిప్పును కనుక్కున్న నాడెంత శుభదినమో
తప్పటడుగులు మావి
తాండవం చేసిన వాడు అంతే శుభదినం.
అర్థాలు :
ప్రముఖము = ముఖ్యము
విరచించుట = ఉత్తమంగా రచించడం
శుభదినం = మంచి రోజు
తప్పటడుగులు = తడబడే అడుగులు
చరచరా = తొందరగా

భావం:
మానవ చరిత్రలో ఇంకా అభివృద్ధి చెందిన మానవుడు ‘చక్రం’ కనుగొన్న రోజు తన అభివృద్ధికి తొలిమెట్టు. చకచకా నాలుగు గీతలతో ఒక ఆకారాన్ని లిఖించిన రోజు కూడా అభివృద్ధికి సంకేత దినమే. ప్రముఖమైన రోజే, నిప్పును కనుగొన్న రోజు మానవజాతి పరిణామంలో గొప్ప శుభదినం. తడబడే అడుగులు మాని, శాస్త్ర బద్ధంగా ఉద్ధతమైన నృత్యం చేసిన రోజు కూడా అంతే శుభదినం.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ప్రకృతికీ, మనిషికీ ఉండే సంబంధం ఏమిటి?
జవాబు:
మనిషి కళ్ళు తెరవగానే తనచుట్టూ ఉన్న ప్రకృతి యొక్క అందచందాలకు పరవశుడయ్యాడు. ప్రకృతిని అతడు తన అధీనంలో ఉంచుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని రంగుల్నీ, ధ్వనుల్ని అనుకరించ డానికి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా ప్రకృతితో మనిషి తాదాత్మ్యం చెందాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 2.
ఈ కవితలో పద సౌందర్యంతో వినసొంపుగా ఉన్న పదాలు ఏవి?
జవాబు:
ఈ కవితలో ప్రాస పదాలన్నీ పద సౌందర్యంతో వినసొంపుగా ఉన్నాయి. అంతేకాక ఎక్కువ పదాలు సౌందర్యవంతంగా ఉన్నాయి.
మంత్రాలు – సంత్రాలు, చింతలు – చింతకాయలు, సమాజ – రుగ్మతలు, యంత్రాలు – తంత్రాలు, అనవచ్చు – అనిపించనూవచ్చు, పొట్ట – పుట్ట, కట్టెదుట – కట్టలు కట్టుకొని, అననూవచ్చు – అనిపించనూవచ్చు. అందచందాలు, రంగులను – రవళినీ, కాడు – వీడు,
మోడు, గొబ్బున – గజ్జె కట్టడం, మొక్కలు • నిక్కి చక్కని నొక్కులు, చిక్కని పదాలు, చరచరా, విరచించిన,

తప్పటడుగులు, కిలకిలలు – కల భాషలు, అలతి – కలమ, కళలు, విజ్ఞానం – ప్రజ్ఞానం, తళతళలు, చిన్నవాడు, చిరంజీవి – చిరంతనుడు, మహాప్రస్థానం
మొదలైన’ పదాలు ఈ కవితలో పద సౌందర్యంతో వినసొంపుగా ఉన్నాయి.

ప్రశ్న 3.
చక్రం కనుగొనడం, నిప్పును కనుగొనడం చరిత్రలో అతి ముఖ్యమైనవని ఎందుకంటారు?
జవాబు:
1) చక్రం కనుగొనడం :
చక్రాన్ని కనుగొన్న తరువాతే బళ్ళు, రిక్షాలు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, రైళ్ళు, యంత్రాలు వగైరా వాడుకలోకి వచ్చాయి. నేటి పారిశ్రామిక అభివృద్ధి అంతా, ‘చక్రం’ తిరగడం మీదే ఆధారపడింది.

2) నిప్పును కనుగొనడం :
చెకుముకి రాయితో దూదిని వెలిగించి నిప్పును తయారుచేశారు. నిప్పు గురించి తెలియని ఆదిమానవుడు మొదట పచ్చి పదార్థాలు తిన్నాడు. పచ్చిమాంసం తిన్నాడు. నిప్పు కనిపెట్టాక పదార్థాలను ఉడకబెట్టి, రుచికరంగా తిన్నాడు. కాబట్టి, నిప్పును కనుగొనడం, చక్రంను కనుగొనడం అనేవి, ఆధునిక నాగరికతకు, మానవ ప్రగతికి సంకేతాలు.

ప్రశ్న 4.
‘తప్పటడుగులు మాని తాండవం చేసిననాడు శుభదినం’ అంటే ఏమిటి?
జవాబు:
చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తారు. నడకలు నేర్చాక తాండవ నృత్యం చేస్తారు. మనిషి రాతియుగంనాటి చీకటిని చీల్చుకొని, నవీన విజ్ఞానపు వెలుతురులోకి ప్రవేశించడాన్నే, తాండవ నృత్యంగా కవి సంకేతించాడు.

గేయం -7

కిలకిలలు మావి కలభాషలు నేర్చుకున్న రోజు
అలతి మాటలతో పదాలల్లుకున్న రోజు
కలను ధావ్యం పండించుకున్న రోజు
కళలను పండించుకున్న రోజు
అన్నీ గొప్ప రోజులే
మానవ చరిత్రలో
అన్నీ అసాధారణ పర్వదినాలే
అర్థాలు:
కలభాష = అవ్యక్త మధురమైన భాష
అలతి = తేలిక
కలమము = వరి పైరు
కళలు = విద్యలు
పర్వదినం = పండుగ

భావం :
మానవుడు, జంతువులు – పక్షులు లాగా అర్థంలేని కిలకిలలను మాని అవ్యక్త మధురమైన భాష నేర్చుకొన్న రోజు శుభదినం. తేలిక మాటలతో పదాలను అల్లుకున్న రోజు నిజంగా పండుగరోజు. 64 రకాల కళలను నేర్చుకొన్న రోజు మంచి రోజు. అవి అన్నీ గొప్ప రోజులే. మానవ చరిత్రలో అన్నీ అసాధారణమైన పర్వదినాలే.

గేయం – 8

అలా అలా కలగలిపి
పెనవేసుకొని
కళలూ కవితలూ
విజ్ఞానం ప్రజ్ఞానం
తళతళలతో తన్ను నడిపింపగా
మిన్నులు పడ్డ చోటునుండి
తిన్నగా ఎదిగి మిన్నందుకుంటున్న
చిన్నవాడు మానవుడు
చిరంజీవి మానవుడు
చిరంతనుడు మానవుడు
ఆవాదిగా నడుస్తున్న ఈ
మహాప్రస్థానంలో
అతగానివి వదలని
జతలు కళా కవితా
జ్ఞావం విజ్ఞానం
వానితో నడిచేవి
వానిని నడిపించేవీ అవే –
అవే కళా కవితా
జ్ఞావం విజ్ఞానం
ప్రజ్ఞానం
అర్థాలు:
విజ్ఞానం = విశేషమైన తెలివి
ప్రజ్ఞానం = మేధ
మిన్నులు పడ్డచోటు = సుదూరప్రాంతం (ఆకాశం భూమి కలిసినట్లు కనిపించే సుదూరప్రాంతం)
మిన్ను = ఆకాశం
చిరంజీవి = మరణం లేనివాడు
చిరంతనుడు = చాలాకాలపు వాడు (ప్రాతవాడు)
అనాది = బాగా పూర్వం
మహాప్రస్థానం = పెద్దదైన ప్రయాణం

భావం :
అలా అన్నీ కలగలిపి, ఒకదానితో ఒకటి పెనవేసు కొన్నాయి. కళలూ, కవితలూ, విశేషమైన తెలివి, మేధ అన్నీ మానవుని నడిపించాయి. దూరంగా దిక్కుల వైపు చూస్తే ఆకాశం, భూమి కలిసినట్లు కనిపిస్తుంది. అలాగ దానినే ఆదర్శంగా చేసుకొని, అభివృద్ధి చెంది ఆధునిక మానవుడు రోదసీలోకి ప్రయాణించాడు. అయినా మానవుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న చిన్నవాడు. శాశ్వతమైనవాడు. చాలా పాతవాడు. చాలా పూర్వం నుండీ నడుస్తున్న ఈ సుదీర్ఘ ప్రయాణంలో మానవుని వదలనివి కళలు – కవితలు, జ్ఞానం – విజ్ఞానం, అవి మానవునితో అభివృద్ధి చెందుతున్నాయి. మానవునికి కర్తవ్యాన్ని బోధిస్తూ పురోగమింపచేస్తున్నాయి. అవే అవే కళాత్మకమైన కవిత్వం, జ్ఞానం, విజ్ఞానం కలగలిసిన ప్రజ్ఞానం.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కవి వేటిని గొప్ప రోజులన్నాడు? ఎందుకు?
జవాబు:
మానవుడు
1) కిలకిలలు మాని కలభాషలు నేర్చుకొన్నరోజు
2) చిన్న చిన్న మాటలతో జానపదాలు అల్లుకొన్నరోజు
3) వరిధాన్యం పండించుకున్నరోజు
4) కళలను పెంపొందించుకున్న రోజు గొప్ప రోజులని కవి చెప్పాడు. ఎందుకంటే మానవుడు కళలను కవితలను ఆధారం చేసుకొని, విజ్ఞాన మార్గంలో ప్రయాణించాడు.

ప్రశ్న 2.
మీ దృష్టిలో ఏవి గొప్ప రోజులు? ఎందుకు?
జవాబు:
మాకు మంచి జరిగిన రోజులన్నీ మా దృష్టిలో గొప్ప రోజులే. ఎందుకంటే అవి మాకు ఆనందాన్ని, అభివృద్ధిని కలిగిస్తాయి. కనుక, మేము తొలిసారి నడక నేర్చుకొన్న రోజు గొప్పరోజు. ఎందుకంటే ఎవరి సహాయం లేకుండా నాకు నేనుగా ఈ రోజు నడవగలుగుతున్నాను. పరుగు పందేలలో పాల్గొంటున్నాను. బహుమతులు గెలుచుకొంటున్నాను. నాట్యం చేస్తున్నాను. చాలా పాటలకు నాట్యం చేయగలం.

మేము తొలిసారి మాటలు నేర్చుకొన్న రోజులు కూడా మా దృష్టిలో గొప్ప రోజులే. ఎందుకంటే మాటలు నేర్చుకోవడం వలననే నేడు మాట్లాడగలుగుతున్నాం.

తొలిసారి సైకిల్ తొక్కడం నేర్చుకొన్న రోజులు మరచిపోలేము. వేగంగా ప్రయాణించడానికి, గమ్యం చేరడానికి సైకిల్ బాగా ఉపయోగపడుతోంది.

మేము తొలిసారి ‘ఓనమాలు’ దిద్దిన రోజులు మరచిపోలేము. అలా నేర్చుకొన్న అక్షరాలే మాకీ వేళ జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడుతున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
‘కళలూ, కవితలూ-పెనవేసుకోవడం’ అనే వాక్యాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
కళ అంటే అందం, విద్య అని అర్ధాలు. కవిత్వం అంటే భావాన్ని రసాత్మకంగా, ఆకర్షణీయంగా చెప్పడం. అంటే చక్కని పదాలతో, మంచి మంచి అలంకారాలతో ఒక భావాన్ని చెబితే అదే కళాత్మకమైన కవిత్వం అవుతుంది. చక్కని పదాలు, అలంకారాలు లేనిది కవిత్వం కాదు. అందుచేత కళ లేకపోతే కవిత్వానికి విలువ ఉండదు అని చెప్పవచ్చు.

కళలు 64 మానవుడు కష్టపడి సాధించినవి. మానవ జాతి అభివృద్ధిని సూచించేవి కళలు. మానవజాతి నిరంతరం కృషిచేసి కళలను సాధించింది. కళల వలన అభివృద్ధి, సంఘపరమైన గౌరవం మనిషికి లభిస్తుంది. అటువంటి కళలు నేర్చుకోవడంలో మానవుడు సాటిలేని ఆనందం పొందాడు. అటువంటి కళలను కవిత్వంలో చెప్పుకొని ఆనందించాడు. అంటే మానవ జీవితంలో కళలు, కవిత్వం పెనవేసుకొని పోయాయి. పాటకు సంగీతం అంటే స్వరం, లయ, గాన సరళి లేకపోతే బాగుండదు. అలాగే సాహిత్యం లేకపోతే అసలు బాగుండదు. కనుక పాటలో సంగీతం, సాహిత్యం ఎలా పెనవేసుకొని ఉంటాయో అలాగే మానవజీవితంలో కూడా కళలు, కవిత్వం విడదీయలేనంతగా కలసి పోయాయి.

ప్రశ్న 4.
“మిన్నందుకుంటున్న చిన్నవాడు” అని ఎందుకన్నాడు కవి?
జవాబు:
మానవుడు ఆదిమకాలంలో అనగా రాతియుగం రోజుల్లో నాగరికత లేకుండా జీవించేవాడు. అంటే బట్ట కట్టుకోవాలని కూడా తెలియని చిన్నపిల్లవాడిలా, చిన్నవాడుగా ఉండేవాడు.

ఇప్పుడు వైజ్ఞానిక యుగంలో కళలతో, కవిత్వంతో మిన్ను అందుకున్నాడు. అంటే ఆకాశం ఎత్తుకు పెరిగాడు. అంటే వైజ్ఞానికంగా అభ్యున్నతిని సాధించాడని భావం.

ప్రశ్న 5.
“కళా, కవితాజ్ఞానం, విజ్ఞానం ” అంటే ఏమిటి?
జవాబు:
‘కళ అంటే – తాను వెలుగుతూ ఇతరులను వెలిగించేది. ఈ కళలు 64. అందులో సుందరమైన సంగీతం, సాహిత్యం , చిత్రలేఖనం, నృత్యం వంటివి లలిత కళలు.

కవితాజ్ఞానం అంటే కవిత్వం రాయగలగడం. కవితను అర్థం చేసికోగలగడం. విజ్ఞానం అంటే, విశేషమైన తెలివి. ఇది శాస్త్ర సంబంధమైనది.

ఇవీ తెలుసుకోండి

చతుషష్టి కళలు (64కళలు):
1) ఇతిహాసము 2) ఆగమము
3) కావ్యము 4) అలంకారము
5) నాటకము 6) గాయకము
7) కవిత్వము 8) కామశాస్త్రము
9) దురోదరము 10) దేశభాష లిపి జ్ఞానము
11) లిపి కర్మము 12) వాచకము
13) అవధానము 14) సర్వశాస్త్రము
15) శకునము 16) సాముద్రికము
17) రత్యశాస్త్రము 18) రధాశ్వగజ కౌశలము
19) మల్లశాస్త్రము 20) శూదకర్మము
21) వోహము 22) గంధనాదము
23) ధాతువాదము 24) ఖనివాదము
25) రసవాదము 26) జలపాదము
27) అగ్నిస్తంభనము 28) ఖడ్గస్తంభనము
29) వాక్ స్తంభనము 30) వాయుస్తంభనము
31) వశ్యము 32) ఆకర్షణము
33) మోహనము 34) విద్వేషణము
35) ఉచ్ఛాటనము 36) మారణము
37) కాలవంచము 38) పరకాయ ప్రవేశం
39) పాదుకాసిద్ధి 40) వాక్సుద్ధి
41) ఇంద్రజాలము 42) అంజనము
43) దృష్టివంచనము 44) సర్వవంచనము
45) మణిసిద్ధి 46) చోరకర్మము
47) చిత్రక్రియ 48) లోహక్రియ
49) అశ్వక్రియ 50) మృత్రియ
51) దారుక్రియ 52) వేణుక్రియ
53) చర్మక్రియ 54) అంబరక్రియ
55) అదృశ్యకరణము 56) దుతికరణము
57) వాణిజ్యము 58) పాశుపల్యము
59) కృషి 60) అశ్వకరణము
61) ప్రాణిదుత్య కౌశలము 62) జలస్తంభనము
63) మంత్రసిద్ధి 64) ఔషధ సిద్ధి

చిరంజీవులు:
1) హనుమంతుడు
2) వ్యాసుడు
3) అశ్వత్థామ
4) విభీషణుడు
5) బలిచక్రవర్తి
6) కృపాచార్యుడు
7) పరశురాముడు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 8th Lesson సముద్రలంఘనం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 8th Lesson సముద్రలంఘనం

10th Class Telugu 8th Lesson సముద్రలంఘనం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ప్రశ్నలు – జవాబులు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం 1
ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరున్నారు?
జవాబు:
పై చిత్రంలో రామలక్ష్మణులు, వారి యెదుట సుగ్రీవుడు, హనుమంతుడు, మరో ఇద్దరు వానర శ్రేష్ఠులు ఉన్నారు.

ప్రశ్న 2.
ఎవరెవరి మధ్య సంభాషణ ఎందుకు జరుగుతున్నదో చెప్పండి.
జవాబు:
రామలక్ష్మణులకూ, సుగ్రీవునికీ మధ్య వారు ఒకరితో ఒకరు స్నేహం చేసుకోడానికి సంభాషణ జరుగుతోంది. సీతమ్మ జాడను తెలిసికొనివస్తానని సుగ్రీవుడు రామునికి చెప్పాడు. సుగ్రీవుని అన్న వాలిని చంపి, కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవునికి పట్టం కడతానని, రాముడు సుగ్రీవునికి మాట ఇచ్చాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ప్రశ్న 3.
‘సీత’ జాడ తెలుసుకున్నది ఎవరు? ఆయన ఏ మార్గంలో లంకకు చేరాడు?
జవాబు:
సీతమ్మ జాడను హనుమంతుడు తెలిసికొన్నాడు. హనుమంతుడు సముద్రంపై నుండి ఆకాశమార్గంలో ఎగిరి, లంకకు చేరాడు.

ఇవి చేయండి.

1. అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా చదవండి.
జవాబు:
మీ ఉపాధ్యాయుల సహాయంతో పాఠంలోని పద్యాలను, రాగముతో, భావం తెలిసేలా చక్కగా చదవడం నేర్చుకోండి.

ప్రశ్న 2.
‘కటకట……….. పోయన దగెగా’ – పద్యభావాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
కవులు సామాన్యంగా సముద్రాన్ని భూమి అనే స్త్రీ ధరించిన వస్త్రంలా ఉందని ఉత్ప్రేక్షిస్తారు. ఇక్కడ లంక చుట్టూ సముద్రం ఆవరించి ఉండడం వల్ల కవి, ఆ సముద్రాన్ని, లంకా నగరం కోటగోడ చుట్టూ, శత్రువులు రాకుండా తవ్విన లోతైన కందకమేమో అన్నట్లు ఉందని ఉత్ప్రేక్షించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ప్రశ్న 3.
పాఠానికి ‘సముద్రలంఘనం’ శీర్షిక సరిపోయిందా? ఏ విధంగానో తెలపండి.
జవాబు:
ఈ పాఠంలో మహేంద్రగిరి నుండి త్రికూట పర్వతం మీదికి హనుమంతుడు ఎగిరి వెళ్ళిన ఘట్టాన్ని కవి వర్ణించాడు. హనుమంతుడు ఎగిరినప్పుడు ఏమయ్యిందో ఈ పాఠంలో చెప్పాడు.

హనుమంతుడు ఎగిరే ముందు ఏమి చేశాడో, ఈ పాఠంలో ఉంది. సముద్రం మీద వెడుతున్న హనుమంతుడు బాణంలా దూసుకుపోయాడని చెప్పాడు. ఎగిరి వెళ్ళేటప్పుడు అతని పిక్కల గాలి వేగానికి సముద్రం చీలిపోయి అది చూసేవారికి ఎలా కనిపించిందో కవి చెప్పాడు.

హనుమంతుడు మహేంద్రగిరి నుండి త్రికూటగిరికి దాటి వెళ్ళడం గురించి, ఈ పాఠంలో ఉంది. కాబట్టి ఈ పాఠానికి “సముద్రలంఘనం” అన్న పేరు చక్కగా సరిపోయింది.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. కింది భావం వచ్చే పద్యపాదాలు గుర్తించి, సందర్భం వివరించండి.
అ) ప్రవాహ తరంగాలు ఆకాశాని కెగిశాయి.
జవాబు:
“ఝరీతరంగఘట లెల్లెడల నుప్పరంబు లెగసి పడి” – అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుడు మహేంద్ర పర్వతంపై అడుగువేసి, ఎగరడంతో ఆ పర్వతం కంపించడంతో ఆ పర్వత శిఖరంపై గల సెలయేళ్ళ కెరటాలు అన్నీ, ఆకాశమునకు ఎగిరాయి అని కవి చెప్పిన సందర్భంలోనిది.

ఆ) ఒకచోట నిలబడి దక్షిణం వైపు చూశాడు.
జవాబు:
“ఒక్కచో నిల్చి దక్షిణ దిక్కుఁజూచి” – అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుడు సముద్రం మీదికి ఎగిరేటప్పుడు అతని వేగానికి పర్వత శిఖరాలు చలించాయి అనీ, హనుమంతుడు పర్వతాన్ని ఎక్కి అంతటా తిరిగాడనీ, ఒకచోట నిలబడి దక్షిణ దిశవైపు చూచాడనీ, కవి వర్ణించిన సందర్భంలోనిది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఇ) ఒక గొప్పధ్వని పుట్టింది.
జవాబు:
“ఒక మహారవం బుదయింపన్”- అనే పద్యపాదం, పై అర్థాన్ని ఇస్తుంది. కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణం, గొప్ప ధ్వని వచ్చేలా, రాక్షసుల పట్టణం వైపు వేగంగా వెళ్ళిందని కవి చెప్పిన సందర్భంలోనిది.

ఈ) బలిచక్రవర్తి ఇంటి వాకిలా అన్నట్లున్నది.
జవాబు:
“బలిమందిరంబు వాకిలియొ యనఁగ” అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుని పిక్కల నుండి పుట్టిన గాలికి, సముద్ర జలం లోతుగా చీలింది. ఆ దృశ్యం ఆదిశేషుడు హనుమంతుని చూడ్డానికి వచ్చి తలుపులు తెరిచిన బలి చక్రవర్తి ఇంటివాకిలా? అన్నట్లు ఉందని కవి చెప్పిన సందర్భంలోనిది.

2. పాఠంలోని పద్యాలలో హనుమంతుని సముద్రలంఘనానికి సంబంధించిన వర్ణనలు ఉన్నాయి కదా! కవి కింది అంశాలను వేటితో పోల్చాడు? ఆ పద్యపాదాల కింద గీత గీయండి. చదవండి.

అ) హనుమంతుని అడుగులు
జవాబు:
అడుగులొత్తిన పట్లఁ బిడుగు మొత్తినయట్ల.

ఆ) హనుమంతుని చూపు
జవాబు:
భావిసేతు వచ్చుపడ లంకకడకును సూత్రపట్టుమాడ్కిఁ జూడ్కి వెలుఁగ

ఇ) హనుమంతుడు ఆకాశంలో ప్రయాణించడం ,
జవాబు:
విపరీతగతిన్ దోల దొరకొనెనొ, రవియిటు దేలం బెనుగాడితోడి తేరు

3. కింది పద్యం చదివి ప్రశ్నలకు సరైన సమాధానాన్ని కుండలీకరణాలలో ( ) రాయండి.
తే॥ గీ॥ పవన తనయ నీ వర్గము, స్వర్ణసమము
వాయుపుత్ర నీ వేగము, వాయుసమము
అసుర వనమును కాల్చు నీ వగ్నిసమము
రామదూత నీ చరితము, రమ్యమయము.

అ) ఆంజనేయుని దేహకాంతి స్వర్ణసమం కదా ! స్వర్ణమంటే
i) వెండి
ii) ఇత్తడి
iii) బంగారం
iv) రాగి
జవాబు:
iii) బంగారం

ఆ) హనుమంతుని వేగం దీనితో సమానమైంది.
i) విమానంతో
ii) పక్షితో
iii) గరుడునితో
iv) వాయువుతో
జవాబు:
iv) వాయువుతో

ఇ) అసురులు ఎవరంటే
i) దేవతలు
ii) పాములు
iii) రాక్షసులు
iv) గంధర్వులు
జవాబు:
iii) రాక్షసులు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఈ) రమ్యచరితుడైన హనుమంతుడు ఈ విధంగా ప్రసిద్ధుడు.
i) శివదూతగా
ii) ఇంద్రదూతగా
iii) బ్రహ్మదూతగా
iv) రామదూతగా
జవాబు:
iv) రామదూతగా

ఉ) అసురవనాన్ని కాల్చే సమయంలో హనుమ ఎలాంటివాడు?
i) అగ్ని
ii) వాయువు
iii) ఇంద్రుడు
iv) రాముడు
జవాబు:
i) అగ్ని

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అ) హనుమంతుడికి లంక ఎలా కనిపించింది?
జవాబు:
సహజంగా సముద్రం, భూదేవి నడుమునకు కట్టిన వస్త్రంలా శోభిస్తుంది. అటువంటి సముద్రం, లంక వైపుకు వచ్చి, దుష్టరాక్షసులున్న లంకా నగరం కోటకు, చుట్టూ త్రవ్విన కందకంలా ఇప్పుడు హనుమంతుడికి కనిపించింది.

ఆ) హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు ఎలా సిద్ధమై లంఘించాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి సిద్ధమై, గట్టిగా కొండపై ఒత్తి అడుగులు వేశాడు. తన తోకను అటు ఇటూ తిప్పాడు. తన చేతితో కొండను బలంగా చరిచాడు. గట్టిగా సింహనాదం చేశాడు. వాయుదేవునిలా పర్వత శిఖరాలు కదిలేలా తన శరీరాన్ని పెంచాడు. కొండపైకి ఎక్కి అటూఇటూ తిరిగాడు. తరువాత ఒకచోట నిలబడి, దక్షిణ దిక్కు వైపు చూశాడు.

ఇ) హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు సమీపంలోని వారికి ఏమనిపించింది?
జవాబు:
హనుమంతుడు కొండను అణగదొక్కి ఆకాశంపైకి ఎగిరి, ప్రయాణిస్తూ ఉంటే, సమీపంలోని వారికి, హనుమంతుడు ఎగిరినట్లు కాకుండా, ఒక పర్వతము ఎగిరినట్లు అనిపించింది.

ఈ) హనుమంతుడు లంకవైపు ఎలా ఎగిరాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి తన చేతులను నడుమునకు ఆనించి, తోకను ఆకాశ వీధిలోకి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గట్టిగా గాలి పీల్చి, తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి ఎగిరి లంఘించాడు. హనుమంతుడు అప్పుడు కొండ అనే విల్లు నుండి వెలువడిన బాణంలా లంక వైపుకు దూసుకుపోయాడు.

ఉ) మహావేగంతో వెడుతున్న హనుమంతుని చూసి దేవతలు ఏమనుకున్నారు?
జవాబు:
వాయుపుత్రుడైన హనుమంతుడు తన తోకతో పాటు ఎగరడం చూసి, దేవతలు “సూర్యుడు విపరీతమైన వేగంతో పెద్ద
కోడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ అటు వచ్చాడేమో” అనుకున్నారు.

5. కింది ప్రశ్నలకు ఐదేసి వాఠ్యాల్లో సమాధానాలు రాయండి.

అ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమై అడుగులు వేసినపుడు పెద్దపెద్ద కొండలు బద్దలై, చెట్లు పెకిలింపబడి, ఏనుగులూ, సింహాలూ పరుగులు పెట్టాయి. కొండ గుహలు ప్రతిధ్వనించాయి. దీన్ని బట్టి హనుమంతుని బలం ఎంతటిదో ఊహించి రాయండి.
జవాబు:
హనుమంతుని బలం వర్ణనా తీతం. అతడు కొండలను’ పిండి చేసేటంత బరువూ, శక్తి, బలం కలవాడు. అందుకే అతడు అడుగులు వేస్తే, పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. అతడు వాయుదేవుని అంత వేగం గలవాడు. అందుకే అతడు తోకను తిప్పితే, అక్కడి చెట్లు అన్నీ కూలిపోయి బయళ్ళు ఏర్పడ్డాయి. అతడు చేతితో గట్టిగా చరిస్తే ఏదో కర్రతో కొట్టినట్లు, క్రూర జంతువులు అన్నీ బెదరి పారిపోయాయి. అతడు సింహనాదం చేస్తే అక్కడి కొండ గుహలు ప్రతిధ్వనించాయి. దీన్ని బట్టి హనుమంతుని కంఠధ్వని, మహా గంభీరమైనదని తెలుస్తోంది.

హనుమంతుడు మహా బలవంతుడు, శక్తిమంతుడు అయినందువల్లనే తాను ఒక్కడూ, నూరు యోజనాల సముద్రం దాటి వెళ్ళి లంకిణిని చంపి, అశోక వనాన్ని భగ్నం చేసి, లక్షల కొద్దీ రాక్షసులను చంపి, లంకను అగ్నితో కాల్చి, రావణునికి బుద్ధి చెప్పి, సీత జాడను తెలిసికొని రాముని వద్దకు తిరిగివచ్చాడు.

ఆ) వానర సైన్యంలో ఎంతోమంది వీరులుండగా సముద్రలంఘనానికి హనుమంతున్లే ఎన్నుకోడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
మిగిలిన వానరులలో కొందరు తాము నూరు యోజనాల దూరం ఎగిరి వెళ్ళలేమన్నారు. మరికొందరు ఎగిరి వెళ్ళినా, తిరిగి రాలేమన్నారు.

హనుమంతుడికి బ్రహ్మ శాపం వల్ల తన బలం తనకు తెలియదు. అతడు వాయుదేవుని పుత్రుడు. అతడు వాయుదేవునితో సమాన బలం గలవాడు. 10 వేల యోజనాల దూరం దాటగలవాడు. అదీగాక శ్రీరాముడు హనుమంతుని బలాన్ని ముందే గుర్తించి, హనుమంతుని చేతికే, సీతమ్మకు ఇమ్మని, తన ఉంగరాన్ని కూడా ఇచ్చాడు.

హనుమంతునివల్లే ఆ కార్యం నెరవేరుతుందని జాంబవంతుడు సలహా చెప్పాడు. జాంబవంతుడు హనుమంతుని వెళ్ళి రమ్మని ప్రోత్సహించాడు. ఈ కారణంగా హనుమంతుణే, సముద్రలంఘనానికి వానరులు ఎన్నుకున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఇ) హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు చేసిన చేష్టల ఆంతర్యం ఏమై ఉంటుంది?
జవాబు:
సముద్రలంఘనానికి ముందు హనుమంతుడు గట్టిగా ఒత్తి అడుగులు వేసి, రాళ్ళను పగులకొట్టి, చెట్లను కూలగొట్టి, క్రూర జంతువులను సైతం పారిపోయేలా చేసి, గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆతని పాదాల ఒత్తిడికి పర్వత శిఖరాలు కంపించి పోయాయి.

హనుమంతుడు తన శక్తిని మిగిలిన వానరులకు, ఈ విధంగా చూపించాడు. తాను సీత జాడను తెలిసికొని రాగలనని తనవారికి ఆ విధంగా ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తిమంతుడననీ, కొండల్ని పిండి చేయగలననీ నిరూపించాడు. తాను వాయుదేవుని అనుగ్రహం కలవాడినని, మిగిలిన వానరులకు తెలియపరచి, వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు తప్పక సీత జాడను తెలిసికొని రాగలడని, ముందుగానే తన తోటి వానరులకు ఈ విధంగా భరోసా ఇచ్చాడు. అందుకే హనుమంతుడు ఆ చేష్టలు చేశాడు.

ఈ) హనుమంతుడు ఆకాశంలోకి ఎగరగా సమీపంలోని వారికి ఒక పెద్ద కొండ ఎగిరిందా! అని అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో రాయండి.
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ముందు తన శరీరాన్ని బాగా పెంచాడు. పర్వదినాలలో ఉప్పొంగే సముద్రుడిలా శరీరాన్ని పెంచాడు. అతడు పర్వతమంత శరీరాన్ని ధరించాడు. హనుమంతుడు సముద్రం మీద ఎగిరేటప్పుడు అతని నీడ, పదియోజనాల పొడవు, ముప్ఫైయోజనాల వెడల్పు ఉందని రామాయణంలో చెప్పబడి ఉంది. అంత గొప్ప శరీరం కల హనుమంతుడు చూసేవారికి తెక్కలున్న పర్వతం వలె కనిపించాడు.

అందుకే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఒక పెద్ద కొండ ఎగిరిందా అని ప్రక్కనున్న వాళ్ళకి అనిపించింది.

6. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. అతడు సముద్రాన్ని దాటేముందు శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు. అప్పుడు పిడుగులు పడ్డట్లు అక్కడి రాళ్ళు పగిలిపోయాయి. హనుమంతుడు తోకను త్రిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి అక్కడి చెట్లు కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి. అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. కొండలపై సెలయేళ్ళ కెరటాలు ఎగసిపడి ఆకాశాన్ని తాకాయి. హనుమంతుడు పెరిగి మహేంద్ర గిరిపై నిలిచాడు.

హనుమంతుడు సముద్రాన్ని చూసి, చెవులు రిక్కించి, చేతులు నడుముకు ఆనించి, తన తోకను ఆకాశం వైపుకు పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, తాను నిలబడ్డ కొండను క్రిందకు అణగదొక్కి పైకి ఎగిరాడు. అప్పుడు చూచేవాళ్ళకు పర్వతం ఎగురుతున్నట్లు అనిపించింది. బాణంలా ధ్వని చేసుకుంటూ అతడు వేగంగా సముద్రం మీంచి ఎగిరాడు.

హనుమంతుని పిక్కల గాలి వేగానికి సముద్రం చీలి, రాముని కోప ప్రవాహం, లంకకు చేరడానికి తవ్విన కాలువలా కనిపించింది. ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలిలా కనిపించింది. సేతు నిర్మాణానికి త్రవ్విన పునాదిలా కనిపించింది.

ఆ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానాన్ని కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, కిందికి వంగి, తన చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, తన పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను కిందకు అణగదొక్కి పైకి ఎగిరాడు.

హనుమంతుడు ఎగురుతూ ఉంటే, పర్వతము ఎగురుతున్నట్లు అనిపించింది. హనుమంతుడు విల్లు నుండి విడిచి పెట్టబడిన బాణంలా పెద్ద ధ్వనితో లంకవైపు దూసుకుపోయాడు.

హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు, సూర్యుడు కాడి ఉన్న తన రథాన్ని వేగంగా తోలుకు వస్తున్నాడేమో అనుకొన్నారు. హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రం లోతుగా చీలింది. ఆ గాలి, పాతాళంలో ఉన్న పాములకు ఆహారం వచ్చిందేమో అనిపించింది.

హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా అది, రాముని క్రోధ రసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, రాబోయే కాలంలో కట్టే సేతువు పునాదిలా, ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం వాకిలిలా కనిపించింది. ఆ విధంగా హనుమ త్రికూట పర్వత శిఖరం చేరాడు.

7. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.

1. హనుమంతుడి సముద్రలంఘనానికి ముందు వానరులందరూ మహేంద్రగిరికి చేరుకున్నారు. ఎవరు సముద్రాన్ని దాటగలరు? అనే చర్చ బయలుదేరింది. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు ఇతర వానరులు ఉన్నారు. వాళ్లు ఏమేమి మాట్లాడుకొని ఉంటారు? సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
మహేంద్రగిరి వద్ద హనుమంతుడు – జాంబవంతుడు – అంగదుడు
ఇతర వానరుల మధ్య సంభాషణ

అంగదుడు : వానరులారా ! మనలో ఎవరు సముద్రాన్ని దాటి, మా పినతండ్రి సుగ్రీవుని ప్రతిజ్ఞను నిలబెట్టగలరు? మీరు ఎంతెంత దూరం సముద్రం దాటగలరో చెప్పండి.

శరభుడు : యువరాజా ! నేను ముప్పై యోజనాల దూరం దాటగలను.

మైందుడు : యువరాజా ! నేను డెబ్బె యోజనాల దూరం వరకూ దాటగలను.

జాంబవంతుడు : మనము తప్పక రామకార్యం సాధించాలి. ఒకప్పుడు నాకు ఎగిరేందుకు మంచి బలం ఉండేది. నేనిప్పుడు ముసలివాణ్ణి అయ్యాను. నేను ఇప్పటికీ 100 యోజనాలు దూరం దాటగలను. కాని తిరిగి రాలేనేమో ? అంగదా ! నీవు నూరు యోజనాల దూరం దాటి తిరిగి వెళ్ళి రాగలవు. కాని యువరాజువైన నిన్ను మేము పంపగూడదు. నేను సరయిన వాణ్ణి మీకు చూపిస్తా.

అంగదుడు : తాతా ! జాంబవంతా ! మనలో సముద్రం దాటి తిరిగి రాగల వీరుణ్ణి మాకు చూపించు”.

జాంబవంతుడు : ఆంజనేయా ! నీవు రామ, సుగ్రీవులంతటి బలం కలవాడవు. నీవు చిన్నప్పుడే 300 యోజనాల దూరం ఎగిరి సూర్యుడిని చేరిన వాడవు. మన వానరులంతా దిగులుగా ఉన్నారు. నీవు సముద్రం దాటి తప్పక తిరిగి రాగలవు. వెళ్ళిరా ! నాయనా !

హనుమంతుడు : తాతా ! నీవు చెప్పినది నిజము. నేను గరుడునికి అనేక వేల పర్యాయాలు ప్రదక్షిణం చేయగలను. నేను సీతమ్మను చూడగలను. నేను వాయువుతో సమానుడిని. 10 వేల యోజనాలు దూరం వెళ్ళి రాగలను.

అంగదుడు : భేష్ ! ఆంజనేయా! నీవే మా విచారాన్ని తీర్చగలవు. నీవు సముద్రం దాటి వెళ్ళి సీతమ్మ జాడ తెలిసికొనిరా.

హనుమంతుడు : వానరులారా ! నన్ను దీవించండి.

జాంబవంతుడు : మంచిది నాయనా ! నీవు తప్పక కార్యం సాధిస్తావు. నీకు నా దీవెనలు. నాయనా వెంటనే బయలు దేరు.

హనుమంతుడు : మీరు ధైర్యంగా ఉండండి. నేను తప్పక కార్యం సాధించి వస్తా. మిత్రులారా ! సెలవు.
(లేదా)
మీ పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ, మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:

లేఖ

విశాఖపట్టణం,
x x x x x

 

మిత్రుడు ప్రసాదు,

మిత్రమా ! నీవు మన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠం ‘సముద్రలంఘనం’ చదివావని అనుకుంటున్నాను. ఈ పాఠం ‘అయ్యలరాజు రామభద్రుడు’ అనే మహాకవి రచించిన “రామాభ్యుదయము” అనే గ్రంథంలోనిది. రామాభ్యుదయంలోని కథ, సీతారామ కథయే. మన పాఠంలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టమును కవి “అద్భుతంగా వర్ణించాడు.

రామభద్రుడు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామాయణము ఒక తియ్యని కావ్యము. ఈ రామాభ్యుదయంలో కవి హనుమంతుని శక్తిని, పరాక్రమాన్ని గొప్పగా వర్ణించాడు. ఈ కవి ‘సకల కథాసార సంగ్రహం’ అనే మరో గ్రంథం కూడా రచించాడట. నేను. ఈ రోజే “రామాభ్యుదయం” కావ్యం కొన్నాను. నీవు కూడా రామభద్రుని రచనలు తప్పక చదువు. ఆ కవిని గూర్చి, నీ అభిప్రాయం నాకు రాయి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. రఘునాథ్ బాబు,
మునిసిపల్ ఉన్నత పాఠశాల.

చిరునామా :
యస్. ప్రసాదు,
S/O. యస్. రమణారావుగారు,
ఇంటి నెం. 2-6-15, గాంధీపురం, కాకినాడ,
తూ||గో॥జిల్లా, ఆం.ప్ర.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

మీ పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశంలో లేదా మరే ఇతర కార్యక్రమంలోనో హనుమంతుని ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించాలి. ఇందుకోసం కావలసిన సామాగ్రిని తయారుచేయండి.
ఉదా : కిరీటం, గద, తోక మొదలగునవి. కావాల్సిన వాక్యాలను రాయండి, అభ్యాసం చేయండి, ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థికృత్యం

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానారక పదాలను ఖాళీలలో రాయండి.

అ) హనుమంతుడు కొండకొమ్మున నిలబడ్డాడు, ఆ …….. న అతడు సూర్యగోళంలా ఉన్నాడు. (కూటాగ్రము)
ఆ) వివరములో సర్పముంది. ఆ ……………….. లో చేయిపెట్టకు. (రంధ్రము)
ఇ) హనుమంతుడెగిరితే ధూళి నభమునకు ఎగిసింది. అది ……………. అంతటా వ్యాపించింది. తర్వాత …………….. లోని సూర్యుని కూడా కమ్మేసింది. (ఉప్పరము, ఆకాశము)

2. కింది ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాసి సొంత వాక్యాలలో ప్రయోగించండి.

అ) సముద్రాన్ని వార్ధి అని కూడా అంటారు.
జవాబు:
సముద్రము (ప్ర) – సంద్రము (వి)
సొంతవాక్యాలు:
ఓడలు సంద్రంలో తిరుగుతుంటాయి.

ఆ) దక్షిణ దిశ యముని స్థానం.
జవాబు:
దిశ (ప్ర) – దెస (వి)
సొంతవాక్యాలు:
రాజుగారి కీర్తి దెసలందు వ్యాపించింది.

ఇ) మంచి గొనములు అలవరచుకోండి.
జవాబు:
గుణములు (ప్ర) – గొనములు (వి)
సొంతవాక్యాలు:
మంచి గుణములు కలవారిని అందరు గౌరవిస్తారు.

ఈ) నిముసమైనా వృథా చేయకు.
జవాబు:
నిమిషము(ప్ర) – నిముసము (వి)
సొంతవాక్యాలు:
విద్యార్థులు నిమిషం వృథా కాకుండా చదువుకోవాలి.

ఉ) అగ్గిలో చేయిపెడితే కాలుతుంది.
జవాబు:
అగ్ని (ప్ర) – అగ్గి (వి)
సొంతవాక్యాలు:
అగ్నిలో ఏ వస్తువు వేసినా తగలబడిపోతుంది.

3. కింద ఇచ్చిన పదాలకు వ్యుత్పత్త్యర్థాలను జతచేయండి.

పదం వ్యుత్పత్త్యర్థం
అ) కార్ముకం 1. అపారమైన తీరం గలది.
ఆ) అమరుడు 2. దనువు అనే స్త్రీ యందు పుట్టినవాళ్ళు
ఇ) ఉదధి 3. జూలు కలిగినది.
ఈ) ప్రభంజనం 4. కర్మకారునిచే చేయబడినది.
ఉ) దానవులు 5. ఉదకము దీని యందు ధరించబడును.
ఊ) కేసరి 6. వృక్షశాఖాదులను విరగొట్టేది.
ఋ) ధరాధరం 7. మరణము లేనివారు.
ఋ) పారావారం 8. ధరను ధరించునది.

జవాబు:

పదం వ్యుత్పత్త్యర్థం
అ) కార్ముకం 4. కర్మకారునిచే చేయబడినది.
ఆ) అమరుడు 7. మరణము లేనివారు.
ఇ) ఉదధి 5. ఉదకము దీని యందు ధరించబడును.
ఈ) ప్రభంజనం 6. వృక్షశాఖాదులను విరగొట్టేది.
ఉ) దానవులు 2. దనువు అనే స్త్రీ యందు పుట్టినవాళ్ళు
ఊ) కేసరి 3. జూలు కలిగినది.
ఋ) ధరాధరం 8. ధరను ధరించునది.
ఋ) పారావారం 1. అపారమైన తీరం గలది.

వ్యాకరణాంశాలు

సంధులు, సమాసాలు

1. కింది పదాలు విడదీసి సంధి పేరు రాయండి.
అ) హరియపుడు
జవాబు:
హరి + అపుడు . – – (హరి + య్ + అపుడు) – యడాగమం.

ఆ) కూటాగ్రవీధి
జవాబు:
కూట + అగ్రవీధి = (అ + అ = ఆ) – – సవర్ణదీర్ఘ సంధి

ఇ) పురాభిముఖుడు
జవాబు:
పుర + అభిముఖుడు = (అ + అ = ఆ) ‘ – సవర్ణదీర్ఘ సంధి

ఈ) అణగదొక్కి
జవాబు:
అణగన్ + తొక్కి = (‘త’ – ‘ద’ గా మారింది) – సరళాదేశ సంధి

ఉ) వాడుగొట్టె జ. వాడు + కొట్టి = (‘క’ – ‘K’ గా మారింది) – గసడదవాదేశ సంధి

ఊ) నీవుడక్కరివి
జవాబు:
నీవు + టక్కరివి : ‘ట’ – ‘డ’ గా మారింది) – గసడదవాదేశ సంధి

ఋ) వారు వోరు
జవాబు:
వారు + పోరు = (‘ప’ – ‘వ’ గా మారింది) – గసడదవాదేశ సంధి

బ) రారుగదా
జవాబు:
రారు + కదా = (‘క’ – ‘X’ గా మారింది) – గసడదవాదేశ సంధి

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

2) పాఠ్యాంశం నుండి షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణలు రాయండి. వాటికి విగ్రహవాక్యాలు రాయండి.
ఉదా : కూటాగ్రము : కూటము యొక్క అగ్రము – షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:

సమాసములు విగ్రహవాక్యము సమాసనామము
1) తరంగ ఘటలు తరంగముల యొక్క ఘటలు షష్ఠీ తత్పురుష సమాసం
2) తమ తండ్రి తమ యొక్క తండ్రి షష్ఠీ తత్పురుష సమాసం
3) కూటకోటులు కూటము యొక్క కోటులు షష్ఠీ తత్పురుష సమాసం
4) గాడ్పు కొడుకు గాడ్పు యొక్క కొడుకు షష్ఠీ తత్పురుష సమాసం
5) ధరణీ కటి తటము ధరణి యొక్క కటి తటము షష్ఠీ తత్పురుష సమాసం
6) వప్ర పరిఘ వప్రమునకు పరిఘ షష్ఠీ తత్పురుష సమాసం
7) గాడ్పువేల్పుపట్టి గాడ్పువేల్పునకు పట్టి షష్ఠీ తత్పురుష సమాసం
8) ఏటిజోటి మగడు ఏటి జోటి యొక్క మగడు షష్ఠీ తత్పురుష సమాసం
9) శ్రవణ ద్వంద్వంబు శ్రవణముల యొక్క ద్వంద్వము షష్ఠీ తత్పురుష సమాసం
10) కటిసీమ కటి యొక్క సీమ షష్ఠీ తత్పురుష సమాసం
11) నభీవీథి నభస్సు యొక్క వీథి షష్ఠీ తత్పురుష సమాసం
12) పురాభిముఖంబు పురమునకు అభిముఖము షష్ఠీ తత్పురుష సమాసం
13) సురగరుడ దురవలోకము సురగరుడులకు దురవలోకము షష్ఠీ తత్పురుష సమాసం
14) కరువలి వేలుపు కొడుకు కరువలి వేలుపునకు కొడుకు షష్ఠీ తత్పురుష సమాసం
15) పవనజ జంఘ పవనజ జంఘ షష్ఠీ తత్పురుష సమాసం
16) పవనాశనకోటి పవనాశనుల యొక్క కోటి షష్ఠీ తత్పురుష సమాసం
17) రఘువరేణ్యుడు రఘువంశజులలో వరేణ్యుడు షష్ఠీ తత్పురుష సమాసం
18) రఘువరేణ్య క్రోధరసము రఘువరేణ్యుని యొక్క క్రోధరసము షష్ఠీ తత్పురుష సమాసం
19) సేతుబంధము సేతువు యొక్క బంధము షష్ఠీ తత్పురుష సమాసం
20) బలిమందిరము బలి యొక్క మందిరము షష్ఠీ తత్పురుష సమాసం

అలంకారాలు :

శబ్దాలంకారాల్లో వృత్త్యనుప్రాస, అంత్యానుప్రాస లాంటివే మరికొన్ని ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.
1. ముక్తపదగ్రసం:
కింది పద్యాన్ని పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
కం. మన వేటికి నూతనమా !
తన మానినిఁ బ్రేమఁ దనకుఁ దక్కితి ననుమా
నను మానక దయ దనరం
దనరంతులు మాని నరసధవు రమ్మనవే.

పై పద్యంలోని ప్రత్యేకతను గమనించారు కదా!

1) పద్యంలో మొదటి పాదం చివర ఉన్న తనమా అనే అక్షరాలు, రెండవపాదం మొదట తిరిగి ప్రయోగింపబడ్డాయి.
2) రెండవ పాదము చివర ఉన్న ననుమా అనే మూడు అక్షరాలు, మూడవ పాదం మొదట తిరిగి ప్రయోగింపబడ్డాయి.
3) మూడవ పాదము చివరన ఉన్న దనరం అనే మూడక్షరాలు, తిరిగి నాల్గవ పాదం మొదట ప్రయోగింపబడ్డాయి.
4) ఈ విధంగా ముందు పాదం చివర విడిచిపెట్టబడ్డ పదాలే, తరువాతి పాదాల మొదట తిరిగివచ్చాయి.

ముక్తపదగ్రస్త అలంకారం:

1) ఒక పద్యపాదంగాని, వాక్యంగాని ఏ పదంతో పూర్తి అవుతుందో, అదే పదంతో తర్వాత పాదం
(లేక)
వాక్యం మొదలవుతుంది. దీన్నే ‘ముక్తపదగ్రస్త అలంకారం’ అంటారు.

2. యమకము :
కింది వాక్యాలు పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.

అ) లేమా ! దనుజుల గెలువఁగలేమా
(లేమ’ అంటే స్త్రీ ; ‘గెలువగలేమా’ అంటే గెలవడానికి మేము ఇక్కడ లేమా (అంటే ఉన్నాం ‘ కదా!) అని భావము.

ఆ) ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది.
(‘తోరణం’ అంటే ద్వారానికి కట్టే అలంకారం ; ‘రణం’ అంటే యుద్ధము.

గమనిక :
పై రెండు ఉదాహరణములలోనూ, ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించబడింది. దీనినే ‘యమకాలంకారం’ అంటారు.

యమకము :
(వివరణ) రెండు లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదములు, తిరిగి తిరిగి అర్థభేదంతో వస్తే అది ‘యమకాలంకారము’.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

3. లాటానుప్రాస: కింది కవితా భాగాలను/ వాక్యాలను చదవండి. ప్రత్యేకతను గమనించండి.

అ) హరి భజియించు హస్తములు హస్తములు.
గమనిక :
పై వాక్యంలో హస్తములు అనే పదము ఒకే ఆద్దంతో వరుసగా రెండుసార్లు వచ్చాయి.

ఇక్కడ హస్తములు అన్న పదం యొక్క అర్థము ఒకటే అయినా, వాటి తాత్పర్యము భేదముంది. అందులో ‘హస్తములు’ అనే మొదటి పదానికి ‘చేతులే’ అని భావము. ‘హస్తములు’ అనే రెండవసారి వచ్చిన దానిని, నిజమైన చేతులు అని భావము.

ఆ) చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ
గమనిక :
ఇక్కడ ఈ వాక్యంలో ‘సేవ’ అనే పదము రెండుసార్లు వచ్చింది. వాటి అర్థాలు సమానమే. కాని తాత్పర్యం వేరుగా ఉంటుంది.

అందులో మొదటి ‘సేవ’ అనే పదానికి, సేవించుట అని భావము. రెండవ ‘సేవ’ అనే పదానికి, ‘నిజమైన సేవ’ అని తాత్పర్యము.

పై రెండు సందర్భాల్లోనూ ఒకే పదం అర్థంలో తేడా లేకున్నా భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు. ఈ విధంగా ఒకే పదాన్ని, అర్థం ఒకటే అయినా తాత్పర్యభేదంతో ప్రయోగించడాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.

4 నుగాగమ సంధి:
కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.

అ) చేయునతడు
జవాబు:
చేయు + అతడు

ఆ) వచ్చునప్పుడు
జవాబు:
వచ్చు + అప్పుడు
గమనిక :
చేయు, వచ్చు అనే క్రియలకు చివర ‘ఉత్తు’ ఉంటుంది. అనగా హ్రస్వమైన ‘ఉ’ కారము ఉంది. వీటికి అచ్చు కలిసింది. అతడు, అప్పుడు అనే పదాల మొదట, ‘అ’ అనే అచ్చు ఉంది. ఆ విధంగా క్రియాపదాల చివరన ఉన్న ఉత్తుకు, అచ్చు పరమైతే, అప్పుడు ఆ రెండు పదాలలోనూ లేని ‘స్’ అనే హల్లు, కొత్తగా వస్తుంది. ఆ విధంగా కొత్తగా వచ్చిన ‘స్’ అనే హల్లును, ‘నుగాగమము’ అంటారు. ‘న్’ ఆగమంగా వచ్చింది. అంటే దేనినీ కొట్టివేయకుండా కొత్తగా వచ్చి చేరింది. దీనినే ‘నుగాగమ సంధి’ అంటారు.

నుగాగమ సంధి సూత్రం:
ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి, అచ్చు పరమైతే నుగాగమం వస్తుంది. కింది. ఉదాహరణలు విడదీసి, లక్షణాలు సరిచూడండి –

1. పోవునట్లు
జవాబు:
పోవు + అట్లు : ఇక్కడ ‘పోవు’ అనే క్రియ యొక్క చివర ‘ఉత్తు’ ఉంది. దానికి ‘అట్లు’ అన్న దానిలోని ‘అ’ అనే అచ్చు కలిసింది. నుగాగమ సంధి సూత్ర ప్రకారము, ‘పోవు’ అనే ఉదంత తద్ధర్మార్థక విశేషణానికి, అచ్చు పరమై నుగాగమం వచ్చింది.
ఉదా : పోవు + న్ + అట్లు = పోవునట్లు = నుగాగమ సంధి.

2. కలుగునప్పుడు
జవాబు:
కలుగు + అప్పుడు అని విడదీయండి.

ఇక్కడ ‘కలుగు’ అనేది, ఉత్తు చివర కల తద్ధర్మార్థక క్రియా విశేషణము, ఆ ఉదంత తద్ధర్మార్థక విశేషణానికి, “అప్పుడు” అనే శబ్దములోని ‘అ’ అనే అచ్చు పరమయ్యింది. నుగాగమము వచ్చింది.
ఉదా : కలుగు + న్ + అప్పుడు = కలుగునప్పుడు = (నుగాగమ సంధి)

పైన చెప్పిన సందర్భంలోనే గాక, మణికొన్ని స్థలాల్లో సైతమూ ‘సుగాగమం’ వస్తుంది. కింది పదాలను పరిశీలించండి.

అ) తళుకు + గజ్జెలు
1) నుగాగమ సంధి సూత్రము (2) : సమాసాలలో ఉదంతములైన స్త్రీ సమాలకు, పు, ంపులకు, పరుష సరళములు పరములైనప్పుడు నుగాగమం వస్తుంది.
ఉదా : తళుకు + న్ + గజ్జెలు (‘తళుకు’ అనే ఉదంత స్త్రీ సమ శబ్దానికి, సరళము పరమై నుగాగమం)

2) ద్రుతమునకు సరళ స్థిరములు పరములైనప్పుడు, లోప సంశ్లేషలు విభాషనగు.
ఉదా : 1) తళుకు గజ్జెలు (ద్రుత లోపము)
2) తళుకున్దజ్జెలు (సంశ్లేషము)

3) సూత్రము : వర్గయుక్సరళములు పరములైనప్పుడు ఒకానొకచో ద్రుతమునకు పూర్ణబిందువును కనబడుతుంది.
ఉదా : తళుకుంగజ్జెలు (పూర్ణబిందువు)

పుంప్వాదేశ, నుగాగమ సంధులు:
ఆ) ఉన్నతము + గొడుగు
1) పుంప్వాదేశ సంధి సూత్రము : కర్మధారయములలో మువర్ణకమునకు పు, ంపులగు.
ఉదా : ఉన్నతంపు గొడుగు

2) నుగాగమ సంధి సూత్రము (3) : సమాసాలలో ఉదంతాలైన స్త్రీసమాలకు పు, ంపులకు, పరుష సరళాలు పరములైతే నుగాగమం వస్తుంది.
ఉదా : ఉన్నతపు + న్ + గొడుగు

అ) ద్రుతమునకు సరళ స్థిరములు పరములయినప్పుడు, లోప సంశ్లేషలు విభాషనగు. .
ఉదా : ఉన్నతంపు గొడుగు (ద్రుతలోపము)

ఆ) వర్గయుక్సరళములు పరములైనపుడు ఒకానొకచో ద్రుతమునకు పూర్ణబిందువు కనబడుతుంది.
ఉదా : ఉన్నతంపుం గొడుగు (ద్రుతమునకు పూర్ణ బిందువు)

అభ్యాసము : కింది ఉదాహరణలు పరిశీలించి, లక్షణాలు సరిచూడండి

1) సరసపున్దనము = (సరసము + తనము)
సూత్రము : 1) కర్మధారయములందు మువర్ణమునకు పుంపులగు
సరసపు + తనము = పుంప్వాదేశము

నుగాగమ సంధి సూత్రము (4) : ఉదంత స్త్రీ సమములకు, పుంపులకు, అదంత గుణవాచకములకు తనంబు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా : సరసపు + న్ + తనము (పుంపులకు, తనము పరమై, నుగాగమం వచ్చింది)

అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
సరసపు + న్ + దనము (సరళాదేశము) .

ఆ) ద్రుతంబునకు సరళ స్థిరంబులు పరంబులగునపుడు లోప సంశ్లేషలు విభాషణగు
ఉదా : సరసపున్దనము (సంశ్లేషరూపము)

2) తెల్లన్దనము = తెల్ల + తనము
సూత్రము : ఉదంత స్త్రీ సమంబులకు, పుంపులకు, అదంత గుణవాచకంబులకు తనంబు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా : తెల్ల + న్ + తనము (అదంత గుణవాచకమైన ‘తెల్ల’ శబ్దానికి తనము పరమైనందున, నుగాగమం)

అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు
ఉదా : తెల్ల + న్ + దనము (సరళాదేశము)

ఆ) ద్రుతమునకు సరళ స్థిరములు పరములగునపుడు లోప సంశ్లేషలు విభాషనగు
ఉదా : తెల్లన్దనము (సంశ్లేష రూపము) షష్ఠీ తత్పురుష సమాసాల్లో నుగాగమ సంధి.
నుగాగమ సంధి (5)

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

6. కింది పదాలను విడదీసి, పరిశీలించండి.
అ) విధాతృనానతి – (విధాత యొక్క ఆనతి) = విధాతృ + ఆనతి
ఆ) రాజునాజ్ఞ – (రాజు యొక్క ఆజ్ఞ) = రాజు + ఆజ్ఞ
గమనిక :
1) పై సమాస పదాలకు విగ్రహవాక్యాలను పరిశీలిస్తే, అవి షష్ఠీ తత్పురుష సమాసానికి చెందినవని తెలుస్తుంది.
2) పై రెండు ఉదాహరణలలోనూ సమాసాలలోని పూర్వపదాల చివర “ఋకారం”, “ఉత్తు” ఉన్నాయి.
3) షష్టీ సమాసపదాల్లో, ఉకార, ఋకారములకు అచ్చు పరమైతే నుగాగమము వస్తుంది.

నుగాగమ సంధి సూత్రము : షష్ఠీ సమాసము నందు, ఉకార ఋకారములకు అచ్చు పరమైనపుడు నుగాగమంబగు.
అ) విధాతృ + న్ + ఆనతి = విధాతృనానతి
ఆ) రాజు + న్ + ఆజ్ఞ = రాజునాష్ట్ర

పూర్వస్వరం స్థానంలో ‘ఋ’కారం, ఉత్తు ఉన్నాయి. వీటికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వచ్చింది. అంటే – షష్టీ తత్పురుషాల్లో ఉకారానికి, ఋకారానికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వస్తుంది.

అదనపు సమాచారము

సంధులు

1. ఎల్లెడలన్ = ఎల్ల + ఎడలన్ – అకారసంధి
2. ఎగసినట్లు = ఎగసిన + అట్ల – అకారసంధి
3. విప్పినయట్ల = విప్పిన + అట్ల – యడాగమ సంధి
4. కొట్టినయట్ల = కొట్టిన + అట్ల – యడాగమ సంధి
5. ఎగసినయట్ల = ఎగసిన + అట్ల – యడాగమ సంధి
6. మొత్తినయట్ల = మొత్తిన + అట్ల – యడాగమ సంధి
7. బిట్టూది = బిట్టు + ఊది – ఉత్వసంధి
8. గట్టెక్కి = గట్టు + ఎక్కి – ఉత్వసంధి
9. కెళ్లవుల కెల్లన్ = కెళవులకున్ + ఎల్లన్ – ఉకార వికల్ప సంధి
10. పాయవడు = పాయ + పడు – గసడదవాదేశ సంధి
11. అక్కొండ = ఆ + కొండ – త్రికసంధి
12. అచ్చెల్వ = ఆ + చెల్వ – త్రికసంధి
13. అయ్యుదధి = ఆ + ఉదధి – యడాగమ, త్రిక సంధులు
14. సూత్రపట్టు = సూత్రము + పట్టు – పడ్వాది మువర్ణలోప సంధి
15. దవాగ్ని = దవ + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
16. పురాభిముఖంబు = పుర + అభిముఖంబు – సవర్ణదీర్ఘ సంధి
17. పవనాశన కోటి = పవన + ఆశన కోటి – సవర్ణదీర్ఘ సంధి
18. బంధాను రూపంబు = బంధ + అనురూపంబు – సవర్ణదీర్ఘ సంధి
19. కూటాగ్రవీథి = కూట + అగ్రవీథి – సవర్ణదీర్ఘ సంధి
20. మహోపలములు = మహా + ఉపలములు – గుణసంధి
21. నభీవీథి = నభః + వీథి – విసర్గ సంధి
22. యశోవసనంబు = యశః + వసనంబు – విసర్గ సంధి
23. దిక్కుఁజూచి = దిక్కున్ + చూచి – సరళాదేశ సంధి
24. అరుగఁజూచి = అరుగన్ + చూచి – సరళాదేశ సంధి
25. అడంగఁ దొక్కి = అడంగన్ + త్రొక్కి – సరళాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. మహోపలములు గొప్పవైన ఉపలములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. బలుగానలు బలము గల కాననములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. దవాగ్ని దవము అనే అగ్ని తన సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
4. మహావివరము గొప్పదైన వివరము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. క్రోధరసము క్రోధము అనే పేరు గల రసము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
6. నల్లని వల్వ నల్లనైన వలువ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రకృతి – వికృతి

భిదురకము – పిడుగు
జంఘ – జంగ
నిమిషము – నిముసము
గుహ – గొబ
ఉపరి – ఉప్పరము
కార్యము – కర్జము
అగ్ని – అగ్గి
పుత్రుడు – బొట్టె
ఘట్టము – గట్టు
వీథి – వీది
యశము – అసము
రూపము – రూపు
బంధము – బందము
ఆశ – ఆస
త్వర – తొర
శరము – సరుడు
కుల్య – కాలువ
సముద్రము – సంద్రము
దిశ – దెస
గుణములు – గొనములు

పర్యాయపదాలు

1. తోక : పుచ్చము, లాంగూలము, వాలము
2. అంభోధి : సముద్రము, ఉదధి, పారావారము, ఏటిజోటి మగడు, అంబుధి, కడలి
3. కార్ముకం : విల్లు, ధనుస్సు, శరాసనం, సింగిణి
4. నింగి : ఆకాశం, మిన్ను, గగనము, నభము, ఉప్పరము
5. రవి : సూర్యుడు, దివాకరుడు, దినకరుడు, ప్రభాకరుడు
6. వల్వ : వస్త్రము, వలువ, పటము, వసనము
7. వివరం : రంధ్రము, బిలము, కలుగు
8. మందిరము : భవనము, గృహము, ఇల్లు, సదనము, ఆలయము
9. తేరు : రథము, అరదము, స్యందనము, శతాంగము
10. అమరులు : దేవతలు, సురలు, నిర్దరులు, గీర్వాణులు, త్రిదశులు, వేల్పులు
11. పవనజుడు : హనుమంతుడు, ఆంజనేయుడు, గాడ్పుపట్టి, కరువలి వేలుపు కొడుకు, గాడు వేల్పు పట్టి, హనుమ
12. హరి : వానరము, కోతి, మల్లు, కపి, మర్కటము
13. పవనము – : వాయువు, గాడ్పు, గాలి, అనిలము, ప్రభంజనము, సమీరము, కరువలి
14. శ్రవణము : చెవి, కర్ణము, శ్రుతి, శ్రోత్రము
15. తండ్రి : జనకుడు, అయ్య, నాయన, నాన్న
16. కొండ : పర్వతము, గిరి, నగము, గట్టు, అద్రి
17. నభము . : ఆకాశము, మిన్ను, గగనము.

వ్యుత్వత్వరాలు

1. ధరాధరము : భూమిని ధరించునది – పర్వతము
2. తరంగము : దరిచేరినది – అల
3. కపి : చలించేది – కోతి
4. గాడ్పుకొడుకు : వాయువు యొక్క కొడుకు – హనుమంతుడు
5. పారావారము : అపారమైన తీరము గలది – సముద్రము
6. దానవులు : దనువు అనెడి స్త్రీ వల్ల పుట్టినవారు – రాక్షసులు
7. గాడ్పు వేల్పు పట్టి : వాయుదేవుని కొడుకు – హనుమంతుడు
8. ఏటిజోటి మగడు : నదీ కాంతకు భర్త – సముద్రుడు
9. అంబుధి : ఉదకములను ధరించునది – సముద్రము
10. హరి : 1. చీకటిని హరించేవాడు – సూర్యుడు
2. భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు – విష్ణుమూర్తి
3. గజాదులను హరించునది – సింహము
11. కార్ముకము : యుద్ధ కర్మ కొఱకు సమర్థమైనది – విల్లు
12. కరువలి వేల్పు కొడుకు : గాలిదేవుని పుత్రుడు – హనుమంతుడు
13. పవనజుడు : వాయువునకు పుట్టినవాడు – హనుమంతుడు
14. పవనాశనులు : గాలి ఆహారముగా కలవి – సర్పములు
15. ఉదధి : ఉదకములను ధరించునది – సముద్రము
16. ప్రభంజనుడు : వృక్షశాఖాదులను విరుగగొట్టేవాడు – వాయువు
17. కరి : కరము (తొండము) కలది – ఏనుగు
18. ఝరి : కాలక్రమమున స్వల్పమైపోవునది – ప్రవాహము

నానార్థాలు

1. వీధి : త్రోవ, వాడ, పంక్తి
2. హరి : విష్ణువు, సింహము, కిరణము, కోతి, పాము, గుఱ్ఱము
3. నిమిషము : టెప్పపాటు, తెప్ప వేసేటంత కాలము, పూవులు ముడుచుకొనడం
4. శరము : బాణము, నీరు, రెల్లు –
5. పురము : పట్టణము, ఇల్లు, శరీరము, మరణము
6. రవి : సూర్యుడు, జీవుడు, కొండ, జిల్లేడు చెట్టు
7. రసము : పాదరసము, శృంగారాది రసములు, విషము, బంగారు
8. బలి : గంధకము, ఒక చక్రవర్తి, కప్పము

కవి పరిచయం

పాఠ్యభాగం : ‘సముద్రలంఘనం’

దేనినుండి గ్రహింపబడింది : “రామాభ్యుదయము” ఆరవ ఆశ్వాసం నుండి.

కవి : అయ్యలరాజు రామభద్రుడు.

కాలం : రామభద్రుడు 16వ శతాబ్దివాడు.

ఏ ప్రాంతము వాడు : కడపజిల్లా ఒంటిమిట్ట ప్రాంతంవాడు.

ఎవరికి అంకితం : అయ్యలరాజు రామభద్రకవి, తన ‘రామాభ్యుదయ కావ్యాన్ని అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితం ఇచ్చాడు.

అష్టదిగ్గజకవి : రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్దానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు.

ఇతర రచన : ఈ కవి మరొక రచన, “సకల కథాసార సంగ్రహం”

రామాభ్యుదయ కావ్య విశిష్టత : రామాభ్యుదయ కావ్యం, ప్రబంధరీతిలో ఎనిమిది ఆశ్వాసాల కావ్యం. ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ కావ్యంలో శ్రీరాముడి చరిత్ర ఉంది. రామాయణంలో ‘ఉత్తర కాండ’ను మాత్రం ఈ కవి వ్రాయలేదు.

బిరుదులు : ఈ కవికి ‘చతురసాహిత్య లక్షణ చక్రవర్తి’, “ప్రతివాది మదగజపంచానన” అనే బిరుదులు ఉన్నాయి.

ఆ కవితా సామర్థ్యం : రామభద్రుని కవితా సామర్థ్యం అంతా చమత్కారంతో కూడినదని, ఆయన వర్ణనల ద్వారా వెల్లడి అవుతుంది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

అవగాహన – ప్రతిస్పందన

పద్యం – 1

సీ|| అదుగు లొత్తినపట్లఁ బిదుగు మొత్తినయట్ల
బహుమహెపలములు పగిలి పడగం
దోఁక త్రిప్పినపట్ల మూఁక విప్పినయట్ల
బలుగాన లిలఁ గూలి బయలు గాఁగఁ
గేలం దట్టినపట్లఁ గోల గొట్టినయట్ల
గరికేసరాదులు గలంగి పఱవ
రంతు చూపినపట్ల వంతు మోపినయట్ల
గుహలు ప్రతిధ్వనుల్ గ్రుమ్మరింపఁ

తే.|| గంపితధరాధరాధిత్యకారరీత
రంగఘట లెల్లెడల నుప్పరంబు లెగసి
పడి తడిపి కార్యదాహవిభ్రాంతకపుల
యుల్లములతో దవాగ్నులంజల్లజేయ,
ప్రతిపదార్థం :
అడుగులు + ఒత్తినపట్లన్ = (హనుమంతుడు సముద్ర లంఘనం చేయడానికి) అడుగులు, నొక్కి పెట్టి వేసిన చోట
పిడుగు మొత్తినయట్ల = పిడుగు మీద పడిన విధంగా
బహుమహోపలములు; బహు = అనేకములైన
మహా + ఉపలములు = పెద్ద పెద్ద రాళ్ళు
పగిలి పడగన్ = ముక్కలై పడుచుండగా
తోక త్రిప్పినపట్లన్ = తన తోకను (హనుమంతుడు)
మూక విప్పినయట్లన్ = చెదరగొట్టినట్లుగా
బలుకానలు – పెద్ద పెద్ద అడవులు
ఇలఁగూలి (ఇలన్ + కూలి) = నేలపై కూలి
బయలుగాగన్ (బయలు + కాగన్) = ఆ ప్రదేశములు చెట్లు చేమలు లేని శూన్య ప్రదేశములు కాగా
కేలన్ = తన చేతితో
తట్టినపట్లన్ = తాకిన స్థలములలో
కోలన్ = కఱ్ఱతో
కొట్టినయట్లన్ – కొట్టిన విధంగా
కరి కేసరాదులు = ఏనుగులు, సింహాలు మొదలయిన
క్రూర జంతువులు

గమనిక :
‘కరి, కాసరారులు’ అని ఇక్కడ ఉండాలి. (శబ్ద రత్నాకరంలో ఇలానే ఉంది. (కాసర + అరులు) అనగా ఎనుబోతులకు శత్రువులయిన సింహాలు అని భావము. ‘కేసర’ + ఆదులు అన్న చోట, కేసర అంటే సింహము కాదు కేసరి అంటేనే సింహము)

కలగి, పఱవన్ = కలతపడి, పరుగెత్తి పోగా
రంతు చూపిన పట్లన్ = (హనుమ) సింహనాదము చేసిన చోట

గమనిక :
‘రంతు చూపుట’ అంటే సింహనాదము చేయడం అని సూర్యరామాంధ్ర నిఘంటువు).

వంతుమోపినయట్లన్ = పోటీ పడినట్లుగా
గుహలు = కొండ గుహలు
ప్రతిధ్వ నుల్ = ప్రతిధ్వనులను
క్రుమ్మరింపన్ = పోతపోయగా
కంపిత ధరాధరాధిత్యకాఝరీ తరంగ ఘటలు; కంపిత = కదల్పబడిన (హనుమంతుని పాదాల విన్యాసానికి కంపించిన)
ధరాధర = పర్వతము యొక్క
అధిత్యకా = ఎత్తైన నేలమీది
ఝరీ = సెలయేళ్ళ
యందలి = కెరటముల యొక్క
ఘటలు = సమూహములు;
ఎల్లెడలన్ (ఎల్ల + ఎడలన్) = అన్ని చోటులందును
ఉప్పరంబులు = ఆకాశమంత ఎత్తుకు
ఎగసిపడి = లేచిపడి
తడిపి = (ఆ ప్రదేశాలను) తడిపి
కార్యదాహ విభ్రాంత కపుల; కార్య దాహ = సీతాన్వేషణ కార్యము అనే అగ్నితో
విభ్రాంత = క్షోభపడిన
కపుల = వానరుల యొక్క
ఉల్లములతోన్ = మనస్సులతో పాటు
దవాగ్నులన్ = అక్కడనున్న దావాగ్నులను సైతము
చల్లఁజేయన్ (చల్లన్ + చేయన్) = చల్లపరచగా (చల్లార్చాయి)

భావం :
సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన హనుమంతుడు, అడుగులు నొక్కిపెట్టి వేస్తున్నప్పుడు, పిడుగులు పడ్డట్లుగా పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. వేగంగా తన తోకను తిప్పినప్పుడు వచ్చిన గాలికి, పెద్ద పెద్ద అడవులు సైతం చెదరగొట్టబడిన విధంగా చెట్లు లేని శూన్యప్రదేశములుగా ఏర్పడ్డాయి. చేతితో చరిస్తే కల్టుతో కొట్టినట్లు, ఏనుగులు, సింహాలు మొదలయిన క్రూర జంతువులు కలత చెంది, పరుగులు పెట్టాయి. హనుమంతుడు సింహనాదం చేసినప్పుడు, పోటీపడుతూ గుహలు ప్రతిధ్వనించాయి. అక్కడ కొండల కంపనాల వల్ల, కొండ నేలలపై ఉన్న సెలయేళ్ళ కెరటాలు, ఆకాశానికి అంటేటట్లు ఎగసిపడ్డాయి. అవి దావాగ్నులతోపాటు, రామకార్యము పూర్తి చేయాలని తపించిపోతున్న వానరుల మనస్సులలోని మంటలను సైతమూ చల్లార్చాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 2

తే॥గీ॥ | ఒడలు వడసిన తమతండ్రి వడువు దోప
రయమునకుఁ గూటకోటులన్నియుఁ జలింపఁ
బెరింగి గిరి గాడ్పుకొడు కెక్కి తిరిగి తిరిగి
యొక్క చో నిల్చి దక్షిణదిక్కుల జూచి.
ప్రతిపదార్థం :
ఒడలు వడసిన (ఒడలు + పడసిన) = శరీరమును ధరించిన
తన తండ్రి = తన తండ్రియైన వాయుదేవుని
యొక్క
వడువు = విధము
తోపన్ = కన్పడేటట్లుగా
రయమునకున్ = వేగానికి
కూటకోటులు = పర్వత శిఖరాలు
అన్నియున్ – అన్నియునూ
చలింపన్ = కదలగా
పెరిగి = పెద్ద రూపంతో పెరిగి
గిరిన్ = పర్వతమును
గాడ్పుకొడుకు = వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
ఎక్కి = ఎక్కి
తిరిగి తిరిగి = అటూ ఇటూ దానిపై తిరిగి
ఒక్కచోస్ = ఒకచోట
నిల్చి = నిలబడి
దక్షిణ దిక్కున్ = దక్షిణ దిశను
చూచి = చూసి (చూశాడు)

భావం :
హనుమంతుడు శరీరాన్ని ధరించిన వాయుదేవుడా అనేటట్లు పర్వత శిఖరాలు అన్నీ కదలిపోయేటట్లు పెరిగి పర్వతము పైకెక్కి తిరిగి తిరిగి, ఒకచోట నిలబడి దక్షిణ దిక్కు వైపుకు చూశాడు.
అలంకారం : ఉత్ప్రేక్షాలంకారం

పద్యం -3

క॥ కటకట! ధరణీకటితట
పట మనిపించుకొనఁ గన్న పారావారం
బిటు వచ్చి కుటిలదానవ
పుటభేదనవప్రపరిఖపో యనఁ దగెఁగా
ప్రతిపదార్థం :
కటకట = అయ్యయ్యో !
ధరణీకటితట పటము; ధరణీ = భూదేవి యొక్క
కటితట = నడుమున (కట్టిన)
పటము = వస్త్రము
అనిపించుకొనన్ = అని చెప్పుకొనేటట్లు
కన్న = కనిపించేటటువంటి
పారావారంబు = సముద్రము
ఇటువచ్చి = ఇక్కడకు వచ్చి (ఈ లంకకు వచ్చి)
కుటిల = మోసగాడైన
దానవ = రాక్షస రాజైన రావణుని యొక్క
పుటభేదనవ = పట్టణమైన లంకకు
వప్ర పరిఖ పో = కోటగోడ చుట్టునూ ఉన్న, అగడ్త ఏమో
అనన్ = అనేటట్లుగా
తగెఁగా = తగినట్లు ఉన్నది కదా !

భావం:
అయ్యోయ్యో ! భూదేవి నడుమునకు కట్టిన వస్త్రమువలె శోభిల్లే సముద్రము, ఈ దిక్కునకు వచ్చి, ఈ దుష్ట రాక్షసుల పట్టణమైన లంకకు కందకము (అగడ్త) అనేటట్లు అమరి ఉన్నది కదా !

పద్యం -4

ఆ॥ గాడ్పు వేల్పుపట్టి గట్టెక్కి యుక్కునఁ
జూచె సూటి నేటి జోటిమగని
భావిసేతు వచ్చుపడ లంకకడకును
సూత్రపట్టుమాడ్కి జూద్కు వెలుఁగు
ప్రతిపదార్ధం :
గాడ్పు, వేల్పు పట్టి = వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
గట్టెక్కి (గట్టు + ఎక్కి) = పర్వతమును ఎక్కి (మహేంద్రగిరిని ఎక్కి)
ఏటిజోటి మగనిస్; ఏటిజోటి = నదీ కాంతలకు (నదులు అనే స్త్రీలకు)
మగనిన్ = భర్తయైన సముద్రుని
భావి సేతువు = రాబోయే కాలంలో శ్రీరామునిచే కట్టబడే వారధి
అచ్చుపడన్ = ఏర్పడడానికి
లంకకడకును = లంకా నగరము వఱకూ
సూత్రపట్టుమాడ్కిన్ = తాడు (దారము) పట్టుకొన్న విధంగా
చూడ్కి = తన కంటి చూపు
వెలుగన్ = ప్రకాశింపగా
సూటిన్ = నిటారుగా (నిదానముగా)
ఉక్కునన్ = స్థిరముగా
చూచెన్ = చూచాడు

భావం :
వాయుదేవుని ముద్దుల కుమారుడైన హనుమంతుడు, కొండను ఎక్కి రాబోయే కాలంలో శ్రీరాముడు కట్టబోయే సేతువును ఏర్పాటు చేయడానికి కొలత తీసుకోడానికి పట్టుకొన్న దారమా అన్నట్లుగా, సూటిగా సముద్రుని చూచాడు.
అలంకారము : ఉత్ప్రేక్షాలంకారము

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 5 : కంఠస్థ పద్యం

మ|| | తన చూ పంబుధిమీఁదఁ జాచి శ్రవణద్వంద్వంబు రిక్కించి వం
చిన చంచద్భుజముల్ సముత్కటకటినీ మంబులన్ బూన్చి తోఁ
క నబోవీథికిఁ బెంచి యంపు లిజీయంగాఁ బెట్టి చిట్టూది గ్ర
క్కున నర్కొంద యడంగండ్రొక్కి పయికిం గుప్పించి లంఘించుచోవ్
ప్రతిపదార్థం :
తన చూపు = తన కంటి చూపును
అంబుధిమీదన్ = సముద్రంపై
చాచి = బాగా ప్రసరింపజేసి
శ్రవణ ద్వంద్వంబున్ = చెవుల జంటను (తన చెవులు రెండింటినీ)
రిక్కించి = నిక్కించి (నిక్కపొడిచేటట్లు చేసి)
వంచిన = కొంచెము వంచిన
చంచద్భుజముల్ (చంచత్ + భుజముల్) = కదలుతున్న చేతులను
సముత్కటకటిసీమంబులన్; సముత్కటి = మిక్కిలి విశాలమైన
కటీ సీమంబులన్ = మొలపై భాగములందు
పూన్చి = గట్టిగా ఉంచి
తోకన్ = తన తోకను
నభోవీథికిన్ = ఆకాశములోనికి
పెంచి = ఎత్తుగా పెంచి
అంఘ్రులు = పాదములు
ఇటీయంగాఁ బెట్టి (ఇటీయంగాన్ + పెట్టి) = బిగించి పెట్టి
బిట్టూది (బిట్టు + ఊది) = గట్టిగా గాలి పీల్చి
గ్రక్కునన్ = వెంటనే
ఆ క్కొండ (ఆ + కొండ) = ఆ మహేంద్ర పర్వతము
అడంగన్ = అణగి పోయేటట్లు
త్రొక్కి = కాళ్ళతో తొక్కిపెట్టి
పయికిన్ = ఆకాశములోనికి
కుప్పించి = ఎగిరి
లంఘించుచోన్ = దూకేటప్పుడు

భావం:
హనుమంతుడు తన కంటి చూపును సముద్రము వైపు ప్రసరింపజేశాడు. రెండు చెవులు రిక్కించి, వంగి కదలుతున్న చేతులను తన విశాలమైన నడుముపై ఆనించాడు, తోకను ఆకాశవీధికి పెంచి, తన రెండు పాదాలు దగ్గరగా పెట్టి, గట్టిగా గాలి పీల్చాడు. తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి ఎగిరి దూకాడు.

పద్యం -6

కం॥ గిరి గ్రుంగంద్రొక్కి చెంగున
హరి నింగికి దాంటుగొనిన హరిహరి యవుడా
హరి యెగసినట్లు దోంచం
గిరి యెగానయట్లు తోఁచెం గౌళవుల కెల్లన్.
ప్రతిపదార్థం :
గిరిన్ = పర్వతమును (మహేంద్ర పర్వతాన్ని)
క్రుంగన్ = భూమిలోకి దిగిపోయేటట్లు
త్రొక్కి = త్రొక్కి
చెంగునన్ = ‘చెంగ్’ మనే ధ్వనితో
హరి = వానరుడయిన హనుమంతుడు
నింగికిన్ = ఆకాశములోకి
దాటుగొనినన్ = దూకగా
హరిహరి = ఆశ్చర్యము, ఆశ్చర్యము
అపుడు = ఆవేళ (ఆ సమయములో)
ఆ హరి = ఆ వానరుడైన ఆంజనేయుడు
ఎగసినయట్లు (ఎగసిన + అట్లు) = పైకి ఎగిరినట్లు
తోచక = అనిపించక
కెళవులకున్ + ఎల్లన్ = దూరం నుండి చూసేవారు అందఱికీ
గిరి = పర్వతము
ఎగసినయట్లు (ఎగసిన + అట్లు) = ఎగిరినట్లుగా
తోఁచెన్ = అనిపించింది (హనుమంతుడు పర్వతము అంత పరిమాణంలో ఉన్నాడని భావము)

భావం :
ఆంజనేయుడు ఆ విధంగా కొండను అణగదొక్కి, ఆకాశం పైకి ఎగిరినపుడు, హనుమంతుడు ఎగిరినట్లు కాకుండా, ఒక పర్వతము ఎగిరినట్లుగా, దూరం నుండి చూసిన వారికి అనిపించింది.

పద్యం -7

కం॥ గిరికారు కనిర్గమై
హరిశర మపు దసురవరపురాభిముఖంబై
సురగరుదదురవలోక
త్వరతో అనె నొకమహారవం బుదయింపన్
ప్రతిపదార్థం :
గిరికార్ముక నిర్గతమై; గిరీకార్ముక = పర్వతము అనే ధనుస్సు నుండి
నిర్గతము + ఐ = వెలువడినదై
హరిశరము = వానరుడు అనే బాణం
అపుడు = అప్పుడు
అసురవరపురాభిముఖంబై; అసుర వర = రాక్షసరాజయిన రావణాసురుని
పుర = లంకా పట్టణానికి
అభిముఖంబు + ఐ = ఎదురై
సురగరుడదురవలోక త్వరతోన్; సుర = దేవతలకును
గరుడ = గరుడ పక్షులకును
దురవలోక = చూడశక్యముకాని
త్వరతోన్ = వేగముతో
ఒక మహారవంబు = ఒక గొప్ప ధ్వని
ఉదయింపన్ = పుట్టే విధంగా
చనెన్ = వెళ్ళింది

భావం :
కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణము, గొప్ప ధ్వనితో రాక్షస రాజైన రావణుని పట్టణమైన లంకానగరం వైపు వెళ్ళింది. అది దేవతలకు కాని, గరుడులకు కాని చూపునకు అందనంత వేగంతో దూసుకుపోయింది.

గమనిక :
పై పద్యంలో శ్లేషాలంకారము ఉంది. దీనికి మరో అర్థం, ఇలా చెప్పవచ్చు. గమనించండి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 8

కం|| వాలంబుఁ దానుఁ గరువలి
వేలుపుల గొడు కరుగం జూచి విపరీతగతిన్
దోల దొరఁకొనెనొ రవి యిటు
దేలం టెనుగాడితోదితే రని రమరుల్
ప్రతిపదార్థం :
కరువలివేలుపుఁ గొడుకు= వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
వాలంబున్ = తోకయునూ
తానున్ = తానునూ
అరుగఁజూచి; (అరుగన్ + చూచి) = వెడుతుండగా చూసి
అమరుల్ = దేవతలు
విపరీతగతిన్ = గొప్ప వేగముతో
రవి = సూర్యుడు
ఇటు = ఈ వైపు
తేలన్ = గాలిలో తేలేటట్లు
పెనుగాడితోడి; (పెను + కాడి తోడి) = పెద్దకాడితో ఉన్న (పెద్ద నాగలితో ఉన్న)
తేరు = రథమును
తోలన్ = తోలడానికి
దొరకొనెన్ = పూనుకున్నాడేమో
అనిరి = అన్నారు

భావం :
వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు, తోకతో ఎగరడం చూసిన దేవతలు, “సూర్యుడు చాలా వేగంతో పెద్దకాడి ఉన్న రథాన్ని నడిపిస్తూ, అలా వచ్చాడేమో” అనుకున్నారు.

పద్యం – 9

కం|| పవనణజంఘాసంభవ
పవనము వడింగదలిఁ బాయవడ నదంచి మహా
వివరమునకుం జారంబడి
పవనాశనకోటి నాశపణచి గమించెన్
ప్రతిపదార్థం :
పవనజ జంఘాసంభవ పవనము; పవనజ = వాయుపుత్రుడైన హనుమంతుని యొక్క
జంఘా = కాలి పిక్కల నుండి
సంభవ = పుట్టిన
పవనము = గాలి
వడిన్ = వేగంగా
కడలిన్ = సముద్రమును
పాయవడన్ (పాయ + పడన్) = చీలిపోయేటట్లు
అడచి = అణచి
మహా వివరమునకున్ = గొప్ప రంధ్రములోకి (గొప్ప కన్నములోకి)
చొరంబడి = ప్రవేశించి
పవనాశన కోటిన్ (పవన + అశన + కోటిన్) = గాలిని ఆహారంగా భుజించే పాముల గుంపును
ఆశపఱచి = అశపెట్టి (తమకు కావలసిన ఆహారము తమ దగ్గరకు వస్తోంది అన్న ఆశను కల్పించి)
గమించెన్ = వెళ్ళిపోయింది

భావం :
వాయుసుతుడైన హనుమంతుని కాలి పిక్కల నుండి పుట్టిన గాలి, వేగంగా సముద్రాన్ని చీలుస్తూ, లోతుకు ప్రవేశించింది. ఆ గాలి సముద్రపు అడుగున ఉన్న పాతాళంలో నివసిస్తూ గాలియే ఆహారం గల పాములకు, ఆహారం వచ్చిందేమో అనే ఆశను కలిగించి వెళ్ళింది. (హనుమంతుడు ఎగిరే ప్రదేశమంతా క్రింద సముద్రములో చీలి పాతాళలోకము కనబడుతోందని భావము.)

పద్యం – 10

సీ| | రఘువరేణ్యక్రోధరసము లంకకు ముట్టం
గ్రోవ్వారు కాలువ ద్రవ్వె ననంగ
నాగామి సేతుబంధానురూపంబుగాఁ
జేయు గుణావర్తమో యనంగ
నవయతో వసనంబు లవని కర్పించి య
చ్చెల్వ నల్లనివల్వ చించె ననఁగఁ
దనుఁ జూద శేషుందు తలుపులు దెఱచిన
బలిమందిరంబు వాకిలియొ యనంగ

తే॥॥ నొక నిమిష మాత్ర మప్పుదయ్యుదధి నడుమ
నుకువది తోంచె నదరంటం చి పఱచు
నలఘుణంఘా ప్రభంజనంబులఁ దనర్చి
యతండు వ్రాలెఁ ద్రికూటకూటాగ్రవీథి.
ప్రతిపదార్థం :
రఘువరేణ్యక్రోధరసము; రఘువరేణ్య = రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క
క్రోధరసము = కోపము అనే నీరు
లంకకున్ = లంకా పట్టణానికి
ముట్టన్ = చేరడానికై
క్రొవ్వారు = అందమైన
కాలువన్ = కాలువను
త్రవ్వెననగన్ (త్రవ్వెన్ + అనగన్) = త్రవ్వినారా అనేటట్లు
ఆగామి సేతుబంధాను రూపంబుగాన్; ఆగామి = రాబోయే కాలంలో కట్టబోయే
సేతుబంధ = వారధి నిర్మాణానికి
అనురూపంబుగాన్ = తగిన విధంగా
చేయు = చేసే
గుణావర్తమోయనంగన్ (గుణావర్తమో + అనంగన్) = పునాది గొయ్యియా అన్నట్లుగానూ
నవయశోవసనంబులన్; నవయశః = క్రొత్త కీర్తులు అనే
వసనంబులన్ = వస్త్రములను
అవనికిన్ = భూదేవికి
అర్పించి = ఇచ్చి
అచ్చెల్వ (ఆ + చెల్వ) = ఆ భూదేవి యొక్క
నల్లని వల్ప = నల్లని వస్త్రాలను (చీరను)
చించెననగన్ | = చింపివేసినాడా అనేటట్లునూ
తనున్ = తనను
చూడన్ = చూడ్డానికి
శేషుండు = ఆదిశేషుడు
తలుపులు దెఱచిన; (తలుపులు + తెఱచిన) = తలుపులు తెరచిన
బలిమందిరంబు = బలిచక్రవర్తి ఇంటి
వాకిలియొ యనంగన్ (వాకిలి + 1 + అనంగన్) = వాకిలియా అనే విధంగా
ఒక్క నిమిషము = ఒక క్షణ కాలము
అప్పుడు = అప్పుడు
అయ్యుదధినడుమన్ (ఆ + ఉదధి, నడుమన్) = ఆ సముద్రము యొక్క మధ్యలో
నఱకువడి = నఱకుడు పడినట్లు (తెగిన విధంగా, చీలినట్లు)
తోచెన్ = కనబడింది
అదరంటన్ = గాఢముగా
చలచిపఱచు = కొట్టి వెడుతున్న
జంఘా ప్రభంజనములన్; జంఘా = కాలి పిక్కల బల వేగముతో
ప్రభంజనములన్ = వేగంగా లేచిన పెను గాలులతో
తనర్చి = అతిశయించి
అతడు = ఆ హనుమంతుడు
త్రికూటకూటాగ్రవీధిన్; త్రికూట = త్రికూట పర్వతము యొక్క
కూట + అగ్రవీధిన్ = శిఖరము యొక్క పైభాగముపై
వ్రాలెన్ = వ్రాలాడు.

భావం :
శ్రీరాముని క్రోధరసము, లంకకు చేరేటట్లుగా కాలువ త్రవ్వినారా అనేటట్లును, రాబోయే కాలంలో నిర్మించే సేతు బంధనానికి అనుగుణంగా త్రవ్విన పునాది గొయ్యి, అనేటట్లును, క్రొత్తదైన కీర్తి వస్త్రాలను భూదేవికి అర్పించి, అంతకు ముందు ఆమె ధరించిన నల్లని వస్త్రాలను చింపివేశాడా అన్నట్లును, హనుమంతుని చూడడానికై ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలియా అన్నట్లును, ఒక నిమిషము సముద్రము మధ్య చీలినట్లు కనబడింది. ఇలా గాఢంగా కొట్టివెడుతున్న పిక్కల బలవేగంతో లేచిన గాలులతో, అతిశయించి హనుమంతుడు, త్రికూట పర్వత శిఖరముపై వ్రాలాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 4th Lesson వెన్నెల Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 4th Lesson వెన్నెల

10th Class Telugu 4th Lesson వెన్నెల Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ఈ కవిత చదవండి.
కొండకోనల్లో
నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెడుతున్న
సెలయేరు
కాలుజారి లోయలో పడిపోయింది.
అది చూసి
ఆకులు చాటుచేసుకొని,
మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి.
ఇదంతా చూస్తున్న సూరీడు
పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ
పడమటి కొండల వెనక్కి
పడిపోయాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది?
జవాబు:
సూర్యాస్తమయాన్ని వర్ణిస్తున్నది. సూర్యాస్తమయంతో బాటు సెలయేరును, పూలమొగ్గలను కూడా వర్ణిస్తున్నది.

ప్రశ్న 2.
సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే ఏమిటి?
జవాబు:
సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే సూర్యాస్తమయం జరిగిందని సూచన.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
సెలయేరు కొండకోనల మీద నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెత్తడం అంటే మీకేమని అర్థమయ్యింది?
జవాబు:
ప్రాణులకు జవసత్వాలను, ప్రకృతికి అందాలను, ఉత్సాహాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. సూర్యకాంతి సమస్త జీవులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహారాన్ని అందిస్తుంది. ఆహారంతో కడుపు నిండితే ఆనందం కలుగుతుంది. ఆనందం వలన తుళ్ళుతూ, నవ్వుతూ ఉంటాం. దీనికి సంకేతంగానే సెలయేరు కొండకోనల మీద నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెత్తడం వర్ణించబడింది. అందుకే సూర్యాస్తమయ వర్ణనలో సెలయేరు కాలుజారి లోయలో పడిపోయిందని వర్ణించారు.

ప్రశ్న 4.
వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలేవి?
జవాబు:
వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వలన మనోవికాసం కలుగుతుంది. ఒక విషయానికి అనేక విషయాలతో కల అనుబంధం తెలుస్తుంది. ఈ కవితలో సూర్యాస్తమయ వర్ణనలో భాగంగా సెలయేరును, మొగ్గలను చాలా చక్కగా వర్ణించారు.

సూచన :
ఇదే విధంగా ఉపాధ్యాయుడు అనేక ప్రశ్నలు వేస్తూ, వారిచేత ఎక్కువగా మాట్లాడిస్తూ సమాధానాలు రాబట్టాలి.

అవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలో వెన్నెలను వర్ణించడం గమనించారు కదా ! ప్రకృతిలోని వివిధ సందర్భాలను వర్ణించడం వల్ల మీకు కలిగే అనుభూతులను తరగతిలో చరించండి.
జవాబు:
తెలతెలవారుతుంటే రకరకాల పక్షుల కిలకిలారావాలు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. చల్లటి పైరగాలి శరీరానికి తగులుతుంటే ఆ హాయి గిలిగింతలు గొలుపుతుంది. చేలు, తోటలతో పచ్చగా ఉన్న పరిసరాలు చూస్తుంటే పరవశం కలుగుతుంది. పిల్ల కాలువలు, సెలయేళ్లు, నదులు, సముద్ర తీరాలలో ప్రొద్దుటే తిరగాలి. ఆ అందం వర్ణించలేము. హిమాలయ పర్వతాలను ఎంతోమంది మహాకవుల నుండి సామాన్యుల వరకు తనివితీరా దర్శించారు. వర్ణించారు.

సూర్యుడు పడమటికి వాలుతుంటే, అది ఒక అద్భుతమైన సుందర దృశ్యం. సూర్యాస్తమయాన్ని సముద్రతీరంలో చూస్తే చాలా బాగుంటుంది. ఎంతోమంది చిత్రకారుల కుంచెలకు పని కల్పిస్తున్న అద్భుత సన్నివేశాలెన్నో ప్రకృతిలో ఉన్నాయి.

ప్రశ్న 2.
మీకు నచ్చిన ఒక సందర్భాన్ని వర్ణించండి.
జవాబు:
మాది కోనసీమలోని ఒక చిన్న గ్రామం. ఎటుచూసినా కొబ్బరి తోటలే. ఆ పచ్చని కొబ్బరాకులను చూస్తే భూమాత తన సౌభాగ్యానికి గర్వించి, స్వర్గానికి సవాలుగా ఎగరేసిన జెండాలలా కనిపిస్తాయి. సరిహద్దుల రక్షణకు, భారతదేశ బలపరాక్రమాలకు ప్రతీకలుగా నిలబడిన మన భారత సైన్యంలా కనిపిస్తాయి కొబ్బరిచెట్ల వరుసలు. ఉట్టిమీద దాచిన పాలు, పెరుగు, మిఠాయిలలా కనిపిస్తాయి కొబ్బరికాయలు.
( సూచన : ఇదే విధంగా ప్రతి విద్యార్థి తన సొంతమాటలలో నచ్చింది వర్ణించాలి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
ఎఱ్ఱన రాసిన కింది పద్యం చదవండి.

సీ|| కలఁడు మేదిని యందుఁ గలఁ డుదకంబులఁ
గలఁడు వాయువునందుఁ గలఁడు వహ్నిఁ
గలఁడు భానుని యందుఁ గలఁడు సోముని యందుఁ
గలఁ డంబరంబునఁ గలఁడు దిశలఁ
గలఁడు చరంబులఁ గలఁ డచరంబులఁ
గలఁడు బాహ్యంబున గలఁడు లోన
గలఁడు సారంబులఁ గలఁడు కాలంబులఁ
గలఁడు ధర్మంబులఁ గలడు క్రియలఁ

తే॥నీ॥ గలఁడు కలవాని యందును, గలఁడు లేని
వాని యందును, గలఁడెల్లవాని యందు
నింక వేయును నేల సర్వేశ్వరుండు .
కలఁడు నీయందు నాయందుఁ గలఁడు కలఁడు
(నృసింహపురాణం-పంచమాశ్వాసం-78)

అ) పై పద్యంలో చాలా సార్లు పునరుక్తమైన పదమేది?
జవాబు:
పై పద్యంలో ‘కలడు’ అనే పదం 22 సార్లు కలదు.

ఆ) పునరుక్తమైన పదం పలుకుతున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు కల్గిన అనుభూతిని చెప్పండి.
జవాబు:
‘కలడు’ అనే పద్యాన్ని ప్రతి పాదంలోను సుమారుగా 4 సార్లు ప్రయోగించారు. ఈ పద్యం ‘కలడు’ తో ప్రారంభమై’ ‘కలడు’ తోనే ముగిసింది. ‘కలడు’ అని అనేకసార్లు చెప్పారు అంటే తప్పనిసరిగా అది దైవం గురించే. దేవుడు ‘కలడు’ అని చెప్పాలంటే ప్రతి వస్తువును పరిశీలించి దైవతత్వాన్ని తెలుసుకొన్నవారికి మాత్రమే సాధ్యం. సృష్టిలోని ప్రతి వస్తువులోను పరమాత్మను సరిదర్శించాలి అని ఈ పద్యం చెబుతోంది. నాకైతే ఈ పద్యం వింటున్నప్పుడు దైవాన్ని సందర్శించినంత ఆనందం (బ్రహ్మానందం) కలిగింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ఇ) గీత గీసిన మాటల అర్థాలు తెలుసుకోండి.
జవాబు:
మేదిని = భూమి
ఉదకంబు = నీరు
వాయువు = గాలి
వహ్ని = అగ్ని
భానుడు = సూర్యుడు
సోముడు = చంద్రుడు
అంబరము = ఆకాశం
దిశలు = దిక్కులు
చరంబులు = కదిలేవి (జంతువులు, పక్షులు మొ||నవి.)
అచరంబులు = కదలనివి (పర్వతాలు, చెట్లు మొ||నవి.)
బాహ్యంబు = పై భాగము (కంటికి కనబడే భౌతిక వస్తువులు)
లోన = కంటికి కనబడనివి (ఆత్మ, మనస్సు, ప్రాణం మొ||నవి)
సారంబులు = సారవంతమైనవి
కాలంబులు = భూతభవిష్యద్వర్తమానాది సమయములు
ధర్మంబులు = నిర్దేశించబడిన స్వభావాలు
క్రియలు = పనులు
కలవాడు = ధనవంతుడు
లేనివాడు = పేదవాడు
నీయందు = ఎదుటి వానియందు
నాయందు = కర్తయందు
ఇప్పుడు పోతన రాసిన కింది పద్యం చదవండి.

మ|| | కలఁడంబోధిఁ గలండు గాలిఁ గలఁ డాకాశంబునన్ కుంభినిన్
గలఁ డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలఁ డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటన్
గలఁ డీశుండు గలండు తండ్రి ! వెదకంగా నేల నీయాయెడన్.

(శ్రీమదాంధ్ర మహాభాగవతం-సప్తమస్కంధం-78)

అ. ఎఱ్ఱన పద్యంలో మీరు గుర్తించిన పదాలకు ఈ పద్యంలో ఉన్న సమానార్థకాలేవి?
జవాబు:
ఎఱ్ఱన – పోతన
మేదిని – కుంభిని
ఉదకంబు – అంభోధి
వాయువు – గాలి
వహ్ని = అగ్ని
భానుడు – ఖద్యోతుడు
సోముడు – చంద్రుడు
అంబరము – ఆకాశం
దిశలు – దిశలు
బాహ్యంబు – త్రిమూర్తులు, త్రిలింగ వ్యక్తులు
ఎల్లవానియందు – అంతటన్
సర్వేశ్వరుడు – ఈశుండు
కాలంబులు – పగళ్ళు, నిశలు
వేయునునేల – ఈయాయెడన్

ఆ) రెండు పద్యాలను పోల్చి చూడండి.
జవాబు:
ఎఱ్ఱన ‘సీస పద్యం’లో రచించిన భావాన్ని పోతన ‘శార్దూలం’లో రచించాడు. ఎఱ్ఱన ప్రస్తావించిన వాటిని చాలా వరకు (13 పదాలు) పోతన ప్రస్తావించాడు. ఇద్దరు కవులూ ‘కలడు’ అనే పదంతోటే పద్యం ప్రారంభించారు. ‘కలడు’ అనేది ఎఱ్ఱన 22 సార్లు ప్రయోగించాడు. పోతన 9 సార్లే ప్రయోగించాడు. ఎఱ్ఱన చెప్పిన ధర్మాలు, క్రియలు, చరాచరాలు, ధనిక – పేద వంటివి పోతన వదిలేసి, అన్నిటికీ సరిపడు ఒకే పదం ‘ఓంకారం’ ప్రయోగించాడు. దైవం ఉండేది ఓంకారంలోనే. అందుకే దానిని ప్రస్తావించి పోతన తన భక్తిని చాటుకొన్నాడు.

4. పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదవండి. .
జవాబు:

చ|| సురుచిరతారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ
న్గరువపు సూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్
సరసముగా నటింపఁగ నిశాసతి కిత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెర యన నొప్పి సాంధ్యనవదీధితి పశ్చిమదికటంబునన్.

 

చ| దెసలను కొమ్మ లొయ్య నతిబీర్ఘములైన తరంబులన్ బ్రియం
బెసఁగఁగ నూఁది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ బేర్చు నా
కస మను వీరి భూరుహము కాంతనిరంతర కారణా లస
త్కుసుమ చయంబు గోయుట యనఁ బ్రాణి సముత్సుకాకృతిన్.

 

చ|| వడిగొని చేతులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁ బు
ప్సోడి దలమెక్కి తేనియలు పొంగి తరంగలుఁగాఁ జలంగి పైఁ
బడు నెలడింటిదాఁటులకుఁ బండువులై నమసారభంబు లు
గడువుగ నుల్లసిల్లె ఘనకైరవషండము నిండు వెన్నెలన్.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

5. రెండో పద్యానికి ప్రతిపదార్థం ఈ కింద ఉన్నది. ఇదే విధంగా 5, 7 సంఖ్యగల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.
2వ పద్యం (సురుచిరతార …… పశ్చిమదిక్తటంబునన్.)
జవాబు:
ప్రతిపదార్ధం :
సురుచిర = చాలా అందమైన
తారకా = చుక్కల
కుసుమ = పూల (చే)
శోభి = మనోజ్ఞమైనదైన
నభః = ఆకాశమనే
అంగణభూమిన్ = రంగస్థలం (వేదిక) పై
కాలము + అన్ = కాలం అనే
గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు)
జతనంబున = ప్రయత్నపూర్వకంగా
దిక్పతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగా = చక్కగా (యుక్తంగా)
నటింపగ = నాట్యం చేయడానికి సిద్ధపడిన
నిశాసతికిన్ = రాత్రి అనే స్త్రీకి
ఎత్తిన = నిలిపిన (పట్టిన)
క్రొత్త = కొత్తదైన
తోఁపున్ = ఎర్రని
పెన్ + తెర = పెద్ద తెర
అనన్ = అన్నట్లుగా
పశ్చిమ దిక్ + తటంబునన్ = పడమటి తీరంలోని (పడమటి దిక్కున)
సాంధ్య = సంధ్య సంబంధించిన (సంధ్యాకాలపు)
నవ దీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది

5వ పద్యం (దెసలను ………… సముత్సుకాకృతిన్.)
జవాబు:
ప్రతిపదార్థం :
ఆకసమను = ఆకాశమనెడు
పేరి = పేరుగల
భూరుహము = చెట్టున
దెసలను = దిక్కులనెడు
కొమ్మలు = కొమ్మలలో గల
తారకా = నక్షత్రాలనెడు
లసత్ = ప్రకాశించు
కుసుమచయంబున్ = పూల సమూహమును
కోయుటకు = త్రుంచుటకు
ఒకోయనన్ = కదా ! అనునట్లు
ఒయ్యన్ = వెంటనే
రజని + ఈశ్వరుడు = రాత్రికి ప్రభువైన చంద్రుడు
ప్రియంబు = ఇష్టము
ఎసగన్ = ఎక్కువ కాగా
ఊది = నిశ్శ్వాసించి(గాలిని ఊది)
నిక్కి = నిలబడి
నిరంతర = ఎల్లపుడు
కాంత = కాంతులతో
అతిదీర్ఘములైన = మిక్కిలి పొడవైన
కరంబులన్ = చేతులతో (కిరణములతో)
సముత్సుకాకృతిన్ = మిక్కిలి ఉత్సాహమే రూపు దాల్చినట్లు
ప్రాకెన్ = ప్రాకెను

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

7వ పద్యం (వడిగొని తేకు ………… వెన్నెలన్.)
జవాబు:
ప్రతిపదార్థం :
నిండు వెన్నెలన్ = పండు వెన్నెలలో
ఘన = గొప్పవైన
కైరవ షండము = కలువల సమూహం
వడిన్ = వేగంతో
కొని = పూని
ఱేకులు = పూల ఱేకులు
ఉప్పతిల = అతిశయించగా
వాలిన = కిందికి దిగిన (వాడిపోయిన)
కేసరముల్ = దిద్దులు
తలిర్పన్ = అతిశయించునట్లుగా
పుప్పొడి = పుప్పొడి యొక్క
తలము = పై భాగమును
ఎక్కి = అధిరోహించి
తేనియలు = మధువులు
పొంగి = ఉప్పొంగి
తరంగలుగాన్ = ప్రవాహాలుగా
చెలంగి = విజృంభించి
పైన్ = పైన
పడు = పడుచున్న
నెల = చంద్రుడు అనెడు
తేటి =తుమ్మెద
దాటులకున్ = కలయికలకు
పండువులై = (కనుల) పండువలవుతూ
ఉగ్గడువుగ = ఎక్కువగా
నవ సౌరభంబులు = క్రొత్త సువాసనలు
ఉల్లసిల్లె = ప్రకాశించెను.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “కాటుక గ్రుక్కినట్టి కరవటంబన జగదండఖండ మమరె” ఈ మాటలు కవి ఏ సందర్భంలో పేర్కొన్నాడో వివరించండి.
జవాబు:
ఈ మాటలు ఎఱ్ఱన రచించిన నృసింహపురాణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన ‘వెన్నెల’ అను పాఠంలోనిది. దిక్కులు, ఆకాశం, భూమిని చీకటి ఆక్రమించిన విధానాన్ని వివరిస్తున్న సందర్భంలో కవి ప్రయోగించిన మాటలివి. ఈ లోకమనెడు బ్రహ్మాండ భాగము కాటుక భరిణెలాగా ఉందని భావం.

ఆ) ఈ పాఠంలో కవి వెన్నెలను వర్ణించడానికి ఏయే అంశాల నెన్నుకున్నాడో తెల్పండి.
జవాబు:
సూర్యాస్తమయాన్ని, పద్మాలు ముడుచుకొనడాన్ని కవి వర్ణించాడు. సాయంసంధ్యలో పడమటి వెలుగును వర్ణించాడు. చంద్రోదయాన్ని కూడా రమణీయంగా వర్ణించాడు. 3 పద్యాలలో, వెన్నెల వర్ణించడానికి ముందు అంశాలను వర్ణించాడు. తర్వాతి పద్యంలో చంద్రకాంతి వ్యాప్తిని వర్ణించాడు. ‘వెన్నెల’ దృశ్యం వర్ణించడానికి బలమైన పూర్వరంగం కళ్లకు కట్టినట్లు వర్ణించి వర్ణనకు మంచి పునాది వేశాడు. ప్రబంధములకు కావలసిన వర్ణనా నైపుణ్యమిదే. అందుకే ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనెడి బిరుదు కలిగింది. తర్వాతి కవులందరూ ఎఱ్ఱనలోని ఈ వర్ణనా క్రమ నైపుణ్యాన్ని అనుకరించారు.

2. క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) పద్య భావాలను ఆధారంగా చేసుకొని పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
(లేదా)
తుమేదల బృందానికి పండుగ చేసిన వెన్నెల ఎలా విజృంభించిందో రాయండి.
మనోహరంగా, ధీరగంభీరంగా వెన్నెల ఎలా విస్తరించిందో రాయండి.
ఆబాల గోపాలానికి ఆత్మీయ బంధువైన చందమామ వెలుగైన వెన్నెల ఎలా విజృంభించిందో పాఠ్యభాగం ఆధారంగా వర్ణించండి.
జవాబు:
సూర్యాస్తమయమయ్యింది, పద్మం ముడుచుకొంది. పడమట సంధ్యారాగ కాంతి కనబడింది. చీకటి బాగా పెరిగి దిక్కులూ, భూమ్యాకాశాలూ కలిసిపోయి కాటుక నింపిన బరిణెలా విశ్వం కనిపించింది.

చంద్రోదయం :
చంద్రుడు ఉదయించాడు. వెన్నెల ప్రవాహం పాలసముద్రంలా పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది. చంద్రబింబం ఆ పాలసముద్రంలో గుండ్రంగా చుట్టుకొన్న ఆదిశేషుడి శయ్యలా, చంద్రుడిలోని మచ్చ ఆ శయ్య మధ్యన ఉన్న విష్ణువులా కనబడింది.

ఆ వెన్నెలలో కలువల రేకులు విచ్చుకున్నాయి. కలువ పూలలో తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. తుమ్మెదలకు విందు చేస్తూ పూల పరిమళాలు బయలుదేరాయి.

చంద్రకాంత శిలల వానలతో, చకోరాల రెక్కల స్పర్శలతో, స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించి, దిక్కులన్నింటినీ ముంచెత్తి వెన్నెల’ సముద్రంలా వ్యాపించింది. ఆ వెన్నెల అనే సముద్రపు నీటి నుండి చంద్రుడు ఆవిర్భవించాడు.

ఆ విధంగా అందంగా, గంభీరంగా, నిండుగా చంద్రుని వెన్నెల వ్యాపించింది.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఈ పాఠంలోని వర్ణనల్లాగే మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని గాని, సన్నివేశాన్ని గాని, సమయాన్ని గాని వర్ణిస్తూ రాయండి.
ఉదా : సూర్యోదయం/ సూర్యాస్తమయం.
జవాబు:
సూర్యోదయం :
చీకటి అనే అజ్ఞానంలో తడబడుతూ అనేక అవలక్షణాలకు ఆలవాలమైన వానికి జ్ఞానం ప్రసాదించే సద్గురువులా సూర్యుడు తూర్పుతలుపు తీస్తున్నాడా అన్నట్లు వెలుగు రేఖలు వస్తున్నాయి. ఆ లేత వెలుగు సోకగానే లోకమంతా ఉత్సాహం ఉరకలేసింది. పక్షుల కిలకిలలు, లేగదూడల గెంతులు, అంబారవాలు, పిల్లల మేలుకొలుపులు, సంధ్యావందనాదులు, ఒకటేమిటి అప్పటి వరకు బద్దకంగా, నిస్తేజంగా నిద్రించిన యావత్ప్రపంచం దైనందిన క్రియలకు బయల్దేరింది. కొలనులలో తామరపూలు పరవశంతో తమ ఆప్తుని చూడటానికి రేకులనే కళ్లతో ఆత్రంగా నింగిని పరికిస్తున్నాయి. ఆ పూల అందాలను చూసి పరవశించిన తుమ్మెదలు ఝంకారం చేస్తూ తేనెల వేటకు ఉపక్రమించాయి.

రైతులు బద్దకం వదిలి నాగలి భుజాన వేసుకొని పొలాలకు బయల్దేరారు. మహిళలు కళ్ళాపి జల్లి వాకిట రంగ వల్లికలు తీరుస్తున్నారు. పిల్లలు పుస్తకాలు ముందేసుకొని ఆవులిస్తూ చదవడం మొదలుపెట్టారు.

లేత సూర్యకిరణ ప్రసారంతో చైతన్యం పెరిగిన జీవరాశి జీవనయాత్రకు నడుం బిగించింది.

సూర్యాస్తమయం :
నవ్వుతూ, తుళ్ళుతూ జీవితమంతా గడిపిన వ్యక్తిని వార్ధక్యం ఆవహించినట్లుగా, తుపాసులో సర్వం కోల్పోయిన వ్యక్తి జీవితంలాగా, వైభవం కోల్పోయిన చక్రవర్తిలాగా సూర్యుడు తన వేడిని, వాడిని ఉపసంహరించు కొంటున్నాడు. పక్షులు గబగబా గూళ్లకు చేరుకొంటున్నాయి. మేతకు వెళ్ళిన పశువులమందలు, ఇళ్లకు చేరుతున్నాయి. ఎక్కడి పనులక్కడ ఆపి, కర్షకులు తల పైన పచ్చగడ్డి మోపులతో ఇళ్లకు ప్రయాణమయ్యారు. నిషేధాజ్ఞలు జారీ అయినట్లు సూర్యుడు బెరుకుబెరుకుగా పడమటి కొండలలోకి పారిపోయాడు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబంలా ప్రపంచం కళా విహీనమయ్యింది. దరిద్రుడిని కష్టాలు ఆక్రమించినట్లుగా లోకాన్ని చీకటి ఆక్రమిస్తోంది. క్రూరత్వానికి, దుర్మార్గానికి, అన్ని పాపాలకు చిరునామా అయిన చీకటి దర్జాగా నవ్వుకొంటోంది. దండించే నాథుడు లేని లోకంలో అరాచకం ప్రబలినట్లుగా సూర్యుడు లేకపోవడంతో చీకటి విజృంభిస్తోంది, మూర్ఖుల ప్రేలాపనలతో సజ్జనులు మౌనం వహించినట్లుగా మెల్లగా పడమటి తలుపులు మూసుకొని సూర్యుడు చీకటిని చూడలేక నిష్క్రమించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ఆ) పాఠం ఆధారంగా ఎఱ్ఱన రచనా శైలి గురించి 10 వాక్యాలు రాయండి.
జవాబు:
ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదు గల ఎఱ్ఱన వర్ణనలు అద్భుతంగా చేస్తాడు. వర్ణనాంశానికి తగిన పదాలను, పద్యవృత్తాలను ఎన్నుకొంటాడు.

‘ఇను ససమాన తేజు’ అనే పద్యంలో సూర్యుని చూచినట్లు ‘భృంగ తారకాల’ను చూడలేని పద్మిని కళ్లుమూసుకొన్నట్లు పర్ణించాడు. దీనిని ‘చంపకమాల’ వృత్తంలో వర్ణించాడు. ‘చంపకము’ అంటే సంపెంగపువ్వు అని అర్థం. పద్యంలో ‘భృంగము’ అని పదం ప్రయోగించాడు. భృంగము అంటే తుమ్మెద అనే అర్థం. తుమ్మెద అన్ని పూలపైనా వాలుతుంది. తానీ సంపెంగపై వాలదు. సంపెంగ వాసనకు తుమ్మెదకు తలపోటు వచ్చి మరణిస్తుంది. ఆ విషయం అన్యాపదేశంగా చెప్పడానికే చంపకమాల వృత్తంలో చెప్పాడు, అంటే తుమ్మెదకు ప్రవేశం లేదని చెప్పే పద్యం కదా!

అలాగే పద్మిని అనేది కూడా ఒక జాతి స్త్రీ, పద్మినీజాతి స్త్రీ తన భర్తను తప్ప పరపురుషుల గూర్చి విసదు, చూడదు, ఇక్కడ తామర పువ్వు సూర్యుని తప్ప ఇతరులను (తుమ్మెదలను) చూడడానికి అంగీకరించక కళ్లు మూసుకొంది. అందుకే తామరకు ‘పద్మిని’ అని ప్రయోగించాడు.

(ఇదే విధంగా ప్రతి పద్యంలోనూ విశేషాలు ఉన్నాయి.)

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

‘నరసింహస్వామి కథ’ నేపథ్యంతో వచ్చిన గ్రంథాలు, వివరాలను ఈ కింది పట్టికలో రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 1

III. భాషాంశాలు

పదజాలం

1) కింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి, వాటిని అర్థవంతంగా సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
అ. భరతమాత స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది.
జవాబు:
స్మితకాంతి = నవ్వుల వెలుగు
సొంతవాక్యం :
ముద్దులొలికే పసిపాప నవ్వుల వెలుగులో ఇల్లు కళకళలాడుతుంది.

ఆ. మేఘం దివి నుండి భువికి రాల్చిన చినుకుపూలే ఈ వర్షం.
జవాబు:
దివి = ఆకాశం
సొంతవాక్యం :
ఆకాశం నక్షత్రాలతో పెళ్ళి పందిరిలా శోభిల్లుతోంది.

ఇ. కష్టాలు మిక్కుటమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
జవాబు:
మిక్కుటము = ఎక్కువ
సొంతవాక్యం :
కోపం ఎక్కువైతే ఆరోగ్యం పొడవుతుంది.

ఈ. రజనీకరబింబం రాత్రిని పగలుగా మారుస్తున్నది.
జవాబు:
రజనీకరబింబం = చంద్రబింబం
సొంతవాక్యం :
పున్నమినాడు నిండైన చంద్రబింబం చూసి సముద్రం ఉప్పొంగుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

2) నిఘంటువు సాయంతో కింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి.’
అ. వెల్లి = ప్రవాహము, పరంపర
ఆ. కుండలి = పాము, నెమలి, వరుణుడు
ఇ. నిట్టవొడుచు = ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంభించు

3) కింది మాటలకు పర్యాయపదాలు రాయండి.
అ. చాడ్పు = పగిది, విధము , వలె
ఆ. వెల్లి = ప్రోతస్సు, వెల్లువ, ప్రవాహము
ఇ. కైరవం = తెల్లకలువ, కుముదము, గార్దభము, చంద్రకాంతము, సృకము, సోమబంధువు
ఈ. కౌముది . . వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక
ఉ. చంద్రుడు = శశి, నెలవంక, అబారి
ఊ. తమస్సు/తమం = చీకటి, ధ్వాంతము, తిమిరము

4) కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి.
అ. సంధ్య – సంజ
ఆ. దిశ – దెస
ఇ. ధర్మము – దమ్మము
ఈ. రాత్రి – రాతిరి, రేయి
ఉ. నిశ – నిసి

5) కింది వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. అ, సంధ్య
అ. గరువము – గర్వము
ఆ. జతనము – యత్నము
ఇ. దెస – దిశ
ఈ. ‘చందురుడు – చంద్రుడు

వ్యాకరణాంశాలు

1. కింది సంధులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి, వాటిని విడదీసి సూత్రాలు రాయండి.

అ) సవర్ణదీర్ఘ సంధి
సూత్రము :
అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరములయినచో వానికి దీర్ఘములు వచ్చును. పాఠంలో గుర్తించినవి.

రజని + ఈశ్వరుడు = రజనీశ్వరుడు – (ఇ + ఈ = ఈ)
కులిశ + ఆయుధుని = కులిశాయుధుని – (అ + ఆ = ఆ)
ఉత్సుక + ఆకృతిన్ = ఉత్సుతాకృతిన్ (అ + ఆ = ఆ)
చంద్రిక + అంభోధి = చంద్రికాంభోధి – (అ + అ = అ)

ఆ) గుణసంధి
సూత్రము :
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును. పాఠంలో గుర్తించినవి.
దివస + ఇంద్రు = దివసేంద్రు – (అ + ఇ = ఏ)
చంద్రకాంత + ఉపలంబుల = చంద్రకాంతో పలంబుల – (అ + ఉ = ఓ)
నుత + ఇందు = నుతేందు – (అ + ఇ = ఏ)

ఇ) ఉత్వసంధి
సూత్రము :
ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు పాఠంలో గుర్తించినవి.
పొమ్ము + అనన్ = పొమ్మనన్ – (ఉ + అ = అ)
మీలనము + ఒంద = మీలనమొంద – (ఉ + ఒ = ఒ)
తిలకము + అనగ = తిలకమనగ – (ఉ + అ = అ)
కుంభము + అనగ = కుంభమనగ – (ఉ + అ = అ)
దీపము + అనగ = దీపమనగ – (ఉ + అ = అ)
కబళము + అనగ = కబళమనగ – (ఉ + అ = అ)
చంద్రుడు + ఉదయించె = చంద్రుడుదయించె – (ఉ + ఉ = ఉ)
నిస్తంద్రుడు + అగుచు = నిస్తంద్రుడగుచు – (ఉ + అ = అ)
ఇట్లు – ఉదయించి = ఇట్లుదయించి – (ఉ + ఉ = ఉ)
దీర్ఘములు + ఐన = దీర్ఘములైన – (ఉ + ఐ = ఐ)
ప్రియంబు + ఎసగగ = ప్రియంబెనగగ – (ఉ + ఎ – ఎ)
ఈశ్వరుడు + ఉన్నతలీల = ఈశ్వరుడున్నతలీల – (ఉ + ఉ = ఉ)
ఆకసము + అను = ఆకసమను – (ఉ + అ = అ)
కోయుటకు = ఒకో = కోయుటకొకో – (ఉ + ఒ – ఒ)
కలంకము + అత్తటిన్ = కలంకమత్తణిన్ – (ఉ + అ = అ)
ఱేకులు + ఉప్పతిల = ఱేకులుప్పతిల – (ఉ + ఉ = ఉ)
తలము + ఎక్కి = తలమెక్కి (ఉ + ఎ = ఎ)
పండువులు + ఐ = పండువులె – (ఉ + ఐ = ఐ)
సౌరభంబులు + ఉగ్గడువుగ = సౌరభంబులుగడువుగ – (ఉ + ఉ = ఉ)
ఇట్లు + అతి = ఇట్లతి – (ఉ + అ = అ)

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

2. కింది పదాలు విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలు రాయండి.

అ) అత్యంత = అతి + అంత – యణాదేశ సంధి.
సూత్రం :
ఇ, ఉ, ఋలకు అసవర్ణాచ్చులు పరమైన వానికి య,వ,రలు ఆదేశంగా వస్తాయి.

ఆ) వంటాముదము = వంట + ఆముదము – అత్వసంధి
సూత్రం :
అత్తునకు సంధి బహుళంబుగానగు.

ఇ) ఏమనిరి = ఏమి + అనిరి – ఇత్వసంధి
సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

ఈ) అవ్విధంబున = ఆ + విధంబున – త్రికసంధి
సూత్రం :

  1. ఆ, ఈ, ఏలు త్రికమనబడును.
  2. త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
    ఆ + వ్విధంబున
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు’ డాచ్చికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు.
    అవ్విధంబున

3. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి.

అ) నలుదెసలు – నాలుగైన దెసలు – ద్విగుసమాసం
లక్షణం : సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ద్విగు సమాసం. నలు (నాల్గు) అనేది సంఖ్యావాచకమైన పూర్వపదం కనుక ఇది ద్విగు సమాసం.

ఆ) సూర్యచంద్రులు – సూర్యుడును, చంద్రుడును – ద్వంద్వ సమాసం లక్షణం : సమాసంలోని రెండు పదాలకూ ప్రాధాన్యం ఉంటే అది ద్వంద్వ సమాసం.
సూర్యుడు, చంద్రుడు అనే రెండు పదాలకూ ప్రాధాన్యం ఉంది కనుక ఇది ద్వంద్వ సమాసం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

4. కింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి, సమన్వయం చేయండి.

అ) అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొడిచె.
జవాబు:
ఈ పద్యపాదములందు రూపకాలంకారం ఉన్నది.

సమన్వయం :
ఇక్కడ వెన్నెల అనే సముద్రము నుండి చంద్రుడు నిండుగా ఆవిర్భవించాడు అని చెప్పబడింది. పై పద్యపాదాల్లో ఉపమేయమైన వెన్నెలకు ఉపమానమైన సముద్రానికి అభేదం చెప్పబడింది. అందువల్ల ఇక్కడ రూపకాలంకారం ఉంది.

లక్షణం :
ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పినట్లయితే దానిని రూపకాలంకారం అంటారు.

5. పాఠంలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేసి చూడండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 2
లక్షణాలు:

  1. 4 పాదాలుంటాయి.
  2. ప్రతి పాదంలోను ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
  3. యతి – 4వ గణం యొక్క మొదటి అక్షరం.
  4. ప్రాస నియమం కలదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 3

బొదలి పొదలి … అనే పద్యంలోని ‌రెండు పాదాలు పరిశీలించి లక్షణ సమన్వయం చేయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 4

పై పద్యపాదాల్లో ప్రతి పాదానికి ఐదు గణాలుంటాయి. కాని,
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 5

(‘హ’ గణాన్నే ‘గలం’ అనడం వాడుకలో ఉన్నది. ‘వ’ గణాన్ని ‘లగం’ అన్నట్లు.)
యతి ప్రాస, నియమాలు, తేటగీతికి సంబంధించినవే దీనికీ వర్తిస్తాయి.
లక్షణాలు :

  1. ఇది ఉపజాతి పద్యం. దీనికి 4 పాదాలుంటాయి.
  2. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
  3. 2, 4 పాదాల్లో ఐదూ సూర్యగణాలే ఉంటాయి.
  4. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి. యతిలేని చోట ప్రాసయతి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం పాటించనవసరం లేదు. న

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 6

మొదటి పాదం వలెనే 3వ పాదం ఉంది.
దీనిలో కూడా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు వరుసగా ఉన్నాయి.
రెండవ పాదం వలెనే 4వ పాదం ఉంది.
దీనిలో కూడా 5 సూర్యగణాలు వరుసగా ఉన్నాయి.
4 పాదాలలోనూ యతి 4వ గణం మొదటి అక్షరం.
1వ పాదం – పొ, పొం 2వ పాదం – మించి – ముంచి (ప్రాసయతి)
3వ పాదం – అ – అం 4వ పాదం – నీ – ని (ట్ట)

అదనపు సమాచారము

సంధులు

1) జగదండఖండము = జగత్ + అండఖండము – జశ్వసంధి
2) తదంతరము = తత్ + అంతరము జత్త్వసంధి
3) కాటుకగ్రుక్కిన = కాటుక + క్రుక్కిన – గసడదవాదేశ సంధి
4) నిట్టవొడిచే = నిట్ట + పొడిచే – గసడదవాదేశ సంధి
5) గ్రుక్కినట్టి = గ్రుక్కిన + అట్టి – అత్వసంధి
6) అత్తఱిన్ = ఆ = తఱిన్ – త్రికసంధి
7) గర్వంపుదాటులు = గర్వము + దాటులు – పుంప్వాదేశ సంధి
8) గరువపుసూత్రధారి = గరువము + సూత్రధారి – పుంప్వాదేశ సంధి
9) వేడ్క యొనర్చె = వేడ్క + ఒనర్చె – యడాగమ సంధి
10) లీలనమొందఁజేసె = లీలనమొందన్ + చేసె – సరళాదేశ సంధి
11) పెందెర = పెను + తెర – సరళాదేశ సంధి
12) నభోంగణము = నభః + అంగణము – విసర్గ సంధి
13) అంతరంగము = అంతః + అంగము , – విసర్గ సంధి
14) రంజనౌషధము = రంజన + ఔషధము వృద్ధి సంధి

సమాసాలు
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 7

ప్రకృతి – వికృతులు

1) సత్త్వము – సత్తువ
2) రాత్రి – రాతిరి, రేయి
3) యత్నము – జతనము
4) దిశ – దెస
5) ఆకాశము ఆకసము
6) స్రవణము – సోన
7) మాణిక్యము – మానికము
8) శంక – జంకు
9) విష్ణుడు – వెన్నుడు

పర్యాయపదాలు

1) కుసుమము : 1) సుమం 2) పుష్పం 3) పువ్వు
2) లలన : 1) సతి 2) స్త్రీ 3) ఇంతి
3) లోచనము : 1) నేత్రం 2) నయనం 3) కన్ను
4) చంద్రుడు : 1) రజనీశ్వరుడు 2) సుధాంశుడు 3) సోముడు
5) తోయధి : 1) అంభోధి 2) పయోనిధి 3) సముద్రం

నానార్థాలు

1) కరము : 1) చేయి 2) తొండం 3) కిరణం
2) తరంగము : 1) కెరటం 2) వస్త్రం 3) గుఱ్ఱపు దాటు
3) ఇనుడు : 1) సూర్యుడు 2) ప్రభువు

వ్యుత్పత్త్యర్థాలు

1) వనజాతము : నీటి నుండి పుట్టునది (పద్మం)
2) రజనీశ్వరుడు : రాత్రులకు ప్రభువు (చంద్రుడు)
3) రజనీకరుడు : రాత్రిని కలుగచేసేవాడు (చంద్రుడు)
4) పన్నగము : పాదములచే పోవనిది (పాము)
5) సుధాకరుడు : అమృతమయములైన కిరణాలు కలవాడు (చంద్రుడు)
6) భూరుహము : భూమి నుండి మొలచునది (చెట్టు)

కవి పరిచయం

కవిత్రయం :
సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించిన 18 పర్వాల మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అనే ముగ్గురు మహాకవులు తెలుగులోకి అనువదించారు. దీనిలో నన్నయ రెండున్నర పర్వాలు, తిక్కన 15 పర్వాలు, ఎఱ్ఱన అరణ్యపర్వశేషం (నన్నయ వదిలిన భాగం) రచించారు.

ఎఱ్ఱన :
పోతమాంబిక, సూరనార్యుల పుత్రుడు. 14వ శతాబ్దంలో ప్రథమార్ధంలో అంటే క్రీ.శ 1300-1360 సం||లలో ఎఱ్ఱన జీవించాడు. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి.

ఎఱ్ఱన రచనలు :
అరణ్యపర్వశేషం, నృసింహపురాణం, రామాయణం, హరివంశం మొదలగు గ్రంథాలను రచించాడు. వీటిలో రామాయణం ప్రస్తుతం లభించడం లేదు. ‘రామాయణం’, ‘హరివంశం’లను ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. అరణ్యపర్వశేషాన్ని నన్నయ అంకితమిచ్చిన రాజరాజనరేంద్రునిపై గౌరవంతో ఆయనకే అంకితమిచ్చాడు. నృసింహపురాణాన్ని అహోోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు.

ఎఱ్ఱన వర్ణనలు :
ఎఱ్ఱన రచనలో వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలో వర్ణనాత్మకమైన కావ్యాలు రావడానికి ఎఱ్ఱన వర్ణనలే ప్రేరణ. ప్రబంధాలలోని అష్టాదశ (18) వర్ణనల్లోని చాలా వర్ణనలు నృసింహపురాణంలో కనిపిస్తాయి. ఎఱ్ఱన నృసింహపురాణ ప్రభావం పోతన మీద విశేషంగా ఉంది. పోతన భాగవతంలోని సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలో ఈ ప్రభావం కనిపిస్తుంది.

బిరుదులు :
ప్రబంధ వర్ణనలకు మొదటివాడు కనుక ‘ప్రబంధ పరమేశ్వరుడు’ అను బిరుదు కలదు. శివభక్తుడగుటచేత ‘శంభుదాసుడు’ అను బిరుదు పొందాడు.

గురువు :
ఎఱ్ఱన గురువు గారి పేరు శంకరస్వామి,

అవగాహన – ప్రతి స్పందన

పద్యం -1
చ|| | ఇను ససమానతేజు దివసేంద్రుఁ గనుంగొనుమాడ్కిఁ జూడఁగాఁ
జన దొరు సల్పతేజు నను చాద్పునఁ జంచలభృంగతారకా
ఘన వనజాతలోచనము గ్రక్కున మీలన మొందఁజేసెఁబ
ద్మిని పతిభక్తి సత్త్వమున మేలిమికిం గుణి దానపొమ్మనన్.
ప్రతిపదార్థం :
అసమాన తేజున్ = సాటిలేని కాంతి గలవానిని
దివస + ఇంద్రున్ = పగటికి రాజును (అయిన)
ఇనున్ = సూర్యుని
కనున్ + కొనుమాడ్కిన్ = చూచునట్లుగా
పద్మిని = పద్మము (కమలము)
అల్పతేజుని = అల్పమైన తేజస్సు కలవానిని
ఒరున్ = ఇతరుని
చూడగాన్ = చూచుటకు
చనదు = ఒప్పదు
అను = అనెడు
చాడ్పునన్ = విధముగా
చంచల = చలించుచున్న
భృంగ = తుమ్మెదలనెడు
తారకా = తారకల యొక్క
ఘన = గొప్పదనమును (చూడక)
పతిభక్తి = భర్తపై ఇష్టం (సూర్యునిపై అభిమానము)
సత్త్వమున = బలమున
మేలిమికిన్ = గొప్పదనమునకు
గుటి = లక్ష్యము (ఉదాహరణ)
తాన = తానే (కమలమే)
పొమ్ము + అనన్ = పో అనగా (తాను మాత్రమే అనునట్లు)
గ్రక్కున = వెంటనే
వనజాత = కమలము
లోచనము = కన్నును
మీలన మొందన్ = మూసుకొనునట్లు
చేసెన్ = చేసెను

భావం :
పద్మము పతిభక్తిలో సాటిలేనిదా అనినట్లుండెను. అసమాన తేజస్సు కలవాడు, దినరాజు అయిన సూర్యుని చూచితిని. ఆ విధంగా అల్ప తేజస్సు గల ఇతరులను చూడను. చలించుచున్న తుమ్మెదలనెడు తారకలను చూడను అనునట్లుగా గొప్పవైన తన కన్నులను పద్మము వెంటనే మూసుకొన్నది.

పద్యం – 2: కంఠస్థ పద్యం

*చం. సురుచిరతారకాకుసుమశోభి సభాంగణభూమిఁ గాలను
పరువపు మాత్రధారి జతనంబున దికృతికోటి ముందటన్
సరసముగా నటింపగ విశానతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెరయన నొప్పి సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్.
ప్రతిపదార్థం :
సురుచిర తారకాకుసుమ శోభి నభోంగణ భూమిన్; సురుచిర = చాలా అందమైన
తారకా = నక్షత్రాలనే (చుక్కలనే)
కుసుమ = పూలచే
శోభి = అలంకరింపబడిన
నభః = ఆకాశమనే
అంగణభూమిన్ = రంగస్థలంపై (వేదికపై)
కాలమన్ (కాలము + అన్) = కాలం అనే
గరువపు సూత్రధారి; గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు) (నాటకం ఆడించేవాడు)
జతనంబునన్ = ప్రయత్నపూర్వకంగా
దిక్పతికోటి ముందటన్; దికృతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగాన్ = చక్కగా (తగువిధంగా)
నటింపగన్ = నటించడానికి (నాట్యం చేయడానికి సిద్ధపడిన)
నిశాసతికిన్ = రాత్రి అనే స్త్రీకి (అడ్డంగా)
ఎత్తిన = నిలిపిన (పట్టిన)
క్రొత్తతోఁపుపెందెర; క్రొత్త = క్రొత్తదైన
తోఁపు= ఎర్రని రంగు గల (తోపు రంగు గల)
పెందెర (పెను + తెర) : పెద్ద తెర యేమో
అనన్ = అన్నట్లుగా
పశ్చిమ దిక్తటంబునన్; పశ్చిమదిక్ = పడమటి దిక్కు యొక్క
తటంబునన్ = తీరంలోని
సాంధ్య నవదీధితి; సాంధ్య = సంధ్యకు సంబంధించిన (సంధ్యాకాలపు)
నవదీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది

భావం :
ప్రకాశించే చుక్కలనే పూవులతో అలంకరింపబడిన ఆకాశం అనే రంగస్థలం మీద, కాలం అనే గొప్ప సూత్రధారి (దర్శకుడు) ప్రయత్నం వల్ల, దిక్పాలకుల సమూహం ముందు, రాత్రి అనే స్త్రీ రసవంతముగా నాట్యం చేయడానికి రాగా, ఆమె ముందు పట్టుకొన్న లేత ఎరుపు రంగు (తోపు రంగు) తెర ఏమో అనేటట్లుగా, సంధ్యాకాలపు కొత్త కాంతి, పడమట దిక్కున ప్రకాశించింది.

విశేషం :
సంధ్యాకాలమయ్యింది. పడమటి దిక్కున ఆకాశం ఎఱుపురంగులో కనబడుతోంది. ఆకాశంలో నక్షత్రాలు వచ్చాయి. రాత్రి వస్తోంది. అది తన చీకటిని సర్వత్రా వ్యాపింపచేస్తుంది.

కవి సంధ్యాకాలం వెళ్ళిన తర్వాత జరిగిన మార్పుల్ని కాలము అనే సూత్రధారి ఆడించిన నాటక ప్రదర్శనగా ఊహించాడు.

  1. ఇక్కడ కాలము అనేది సూత్రధారుడు వలె ఉంది.
  2. సంధ్యాకాలంలో పడమటి దిక్కున కన్పించిన ఎజ్యని కాంతి, నాటకంలో కట్టిన ఎఱ్ఱని తోపురంగు తెరలా ఉంది.
  3. చుక్కలతో కూడిన ఆకాశం, పువ్వులతో అలంకరించిన నాట్య రంగస్థలంలా ఉంది.
  4. రాత్రి అనే స్త్రీ, ‘నర్తకి’ వలె ఉంది.

రాత్రి అనే స్త్రీ చేయబోయే నాట్యానికి రంగస్థలం మీద కట్టిన ఎల్లరంగుతోపు తెరవలె పడమటి దిక్కున ఆకాశంలో సంధ్యాకాంతి కనబడింది.

కవి సంధ్యాకాలాన్ని పూర్వపు నాటక సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అద్భుతంగా వర్ణించాడు.

పద్యం – 3
తే॥ | పొదలి యొందొండ దివియును భువియు దిశలుఁ
బొదివి కొనియుందు చీకటిప్రోవు వలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి
(కరవటంబన జగదందఖండ మమరి.
ప్రతిపదార్థం :
పొదలి = వృద్ధి చెంది
దివియును = ఆకాశమును
భువియు = భూమియును
దిశలున్ = దిక్కులును
ఒండు + ఒండు + అ = ఒకదానితో ఒకటి
పొదివికొని + ఉండు = దగ్గరకు చేర్చుకొని ఉన్నటువంటి
చీకటిప్రోవు = చీకటి యొక్క కుప్ప
వలన = వలన
మిక్కుటంబుగన్ = ఎక్కువగా
కాటుకన్ = (నల్లని) అంజనమును
క్రుక్కినట్టి = నిండా కూరినటువంటి
కరవటంబు + అన : భరిణె అనునట్లు (కాటుక భరిణ వలె)
జగత్ = లోకమనెడు
అండఖండము – బ్రహ్మాండములోని భాగము
అమరె = ఏర్పడినది (ఉన్నది)

భావం :
ఆకాశం, భూమి, దిక్కులు, చీకటి ఒకదానిలో ఒకటి కలిసిపోయాయి. చీకటి ఈ లోకము అనెడు బ్రహ్మాండ భాగం కాటుక భరిణలాగ ఉంది.

వచనం -4
అంత,
అంత = అంతట

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
రెండో పద్యంలో కవి దేనిని దేనితో పోల్చాడు? ఎందుకు?
జవాబు:
చుక్కలను పూలతో, ఆకాశమును వేదికతో, కాలమును సూత్రధారితో, దిక్పాలకులను రసజ్ఞులైన ప్రేక్షకులతో, రాత్రిని నాట్యకత్తెతో, పడమటి సంధ్య వెలుగును పరదాతో కవి పోల్చాడు.

ఎందుకంటే నక్షత్రాలకు పూలకు రాలే గుణం, అందగించే గుణం, ప్రకాశించే గుణం, ఆకర్షించే గుణం, అందీ అందనట్లు మురిపించే గుణం ఉంటుంది.

ఆకాశము-వేదిక విశాలమైనవి. అలంకరింప బడినవి. నటులకు తప్ప ఎవరికీ స్థానం లేనివి.

కాలానికి సూత్రధారికి పరిమితి లేదు. ఎవరైనా లోబడవలసిందే. ‘దిక్పాలకులు-ప్రేక్షకులు’, సాక్షులు. వేదిక చుట్టూ ఉండి చూస్తారు.

‘రాత్రి – నాట్యకత్తె’ తనవంతు పూర్తవగానే వెళ్ళిపోవాలి. వేదికంతా వీరి అధీనంలోనే ఉంటుంది.

“సంధ్య – పరదా’ పరిస్థితిని బట్టి వెలుగు-చీకటుల గతులు మార్చుకొంటాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 2.
ఆకాశాన్ని కవి ఏమని వర్ణించాడు? రాత్రివేళ చుక్కలతో కూడిన ఆకాశాన్ని చూస్తే మీకెలా అన్పిస్తుంది?
జవాబు:
ఆకాశాన్ని కవి చక్కగా అలంకరింపబడిన వేదికతో పోల్చాడు. చుక్కలతో ఉన్న ఆకాశం-చుక్కల చీరలో, సంక్రాంతికి ముగ్గులు పెట్టడానికి గాను చుక్కలు పెట్టిన వాకిలిలా, పిండి వడియాలు పెట్టిన వస్త్రంలా, రేఖా గణితపు నల్లబల్లలాగా, వినాయకచవితికి కట్టే పాలవెల్లిలా, అనేక జంతువుల (మేషం, వృషభాది రాశులు) వలె, ఇంకా అనేక విధాల కనిపిస్తుంది.

పద్యం – 5 : కంఠస్థ పద్యం

*చ దెసలను కొమ్మ లొయ్య వతిదీర్ఘములైన కరంబులన్ బ్రియం
వినఁగఁగ మాది విక్కి రణవీశ్వరుఁ డుప్పతలీలఁ బేర్చు నా
కన మమ పేరి భూరుహము శాంతనిరంతర తారకాలస
త్కుసుమ చయంబు గోయుటకొకో యవఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్.
ప్రతిపదార్ధం :
రజనీశ్వరుడు (రజనీ + ఈశ్వరుడు) = రాత్రికి ప్రభువైన చంద్రుడు
దెసలను (దెసలు + అను) = దిక్కులు అనే
కొమ్మలు = కొమ్మలను
ఒయ్యన్ = మెల్లగా
అతిదీర్ఘములైన = మిక్కిలి పొడవైన
(అతిదీర్ఘములు + ఐన) కరంబులన్ = కిరణాలు అనే (తన) చేతులతో
ప్రియంబు + ఎసగగన్ = మిక్కిలి ప్రేమతో
ఊది = పట్టుకొని
నిక్కి = పైకి లేచి
ఉన్నత లీలన్ = ఎత్తయిన విధంగా
పేర్చు = అతిశయించిన (విస్తరించిన)
ఆకసము = ఆకాశం
అను పేరి = అనే పేరు గల
భూరుహము = చెట్టు యొక్క
కాంతనిరంతర తారకా లసత్కుసుమచయంబు; కాంత = ఇంపైన (మనోహరమైన)
నిరంతర = మిక్కిలి దగ్గరగా ఉన్న
తారకా = నక్షత్రాలు అనే
లసత్ = ప్రకాశిస్తున్న
కుసుమచయంబు = పుష్ప సమూహాన్ని
కోయుటకున్ + ఒకో + అనన్ = కోయడం కోసమా అన్నట్లుగా సముత్సుకాకృతిన్ (సముత్సుక + ఆకృతిన్)
సముత్సుక = మిక్కిలి ఆసక్తి గల
ఆకృతిన్ = ఆకారంతో
ప్రాకెన్ = (ఆకాశంలోకి) వ్యాపించాడు.

భావం:
చంద్రుడు, దిక్కులనే కొమ్మలను మెల్లగా తన పొడవైన కిరణాలనే చేతులతో ఇష్టంగా పట్టుకొని, పైకి లేచి ఆకాశం అనే పేరుతో ఉన్న చెట్టు యొక్క మనోహరమైన నక్షత్రాలు అనే పువ్వులను కోయడం కోసమా అన్నట్లుగా, మిక్కిలి ఆసక్తిగా ఆకాశంలోకి పాకాడు. (చంద్రుని కాంతి ఆకాశమంతా వ్యాపించిందని భావం)
అలంకారం :రూపకం, ఉత్ప్రేక్ష.

పద్యం – 6

ఉ॥ వెన్నెలవెళ్లి పాల్కడలి వేఁకదనంబునఁ బేర్చి దిక్కులున్
మిన్నును ముంప నందు రజనీకరబింబము కుందరీ భవ
త్పన్నగతల్పకల్పనము భంగిఁ దనర్చిం దదంతరంబునన్
వెన్ను నిభంగిఁ జూద్కులకు వేర్మయొనర్చెఁ గలంత మత్తజిన్.
ప్రతిపదార్థం :
వెన్నెల వెల్లి = వెన్నెల ప్రవాహమనెడు
పాల్కడలి = పాల సముద్రము
ప్రేకదనంబున = భారముతో
పేర్చి = ఏర్పరచి (ప్రసరింపచేసి)
దిక్కులున్ = దిశలును
మిన్నును = ఆకాశమును
ముంప నందు = ముంచగా
రజనీకర బింబము = చంద్రబింబం
కుండలీభవత్ = చుట్టలు చుట్టుకొనియున్న
పన్నగతల్ప = శేషపాన్పు
కల్పనము భంగి = కల్పింపబడిన విధముగా
తనర్చెన్ = ప్రకాశించెను
ఆ + తటిన్ = ఆ సమయంలో
తత్ = దాని (శేష పాన్పువంటి చంద్రుని)
అంతరంబునన్ = లోపల గల
కలంకము = మచ్చ
చూడ్కులకు = చూపులకు
వెన్నుని భంగి = విష్ణువు వలె
వేడ్క = వేడుకను
ఒనర్చెన్ = కలిగించెను

భావం :
వెన్నెల ప్రవాహం పాల సముద్రం లాగ ఉంది. అది అన్ని దిక్కులను, ఆకాశాన్ని ముంచెత్తుతోంది. ఆ సమయంలో చంద్రుడు చుట్టలు చుట్టుకొన్న ఆదిశేషువులాగ ఉన్నాడు. చంద్రునిలోని మచ్చ నల్లని విష్ణువు వలె ఉంది.

ఇది తెలుసుకోండి :
విష్ణువు నల్లగా ఉంటాడు. ఆయన పవ్వళించే శేషుడు తెల్లగా ఉంటాడు. శివుడు తెల్లగా ఉంటాడు. ఆయన మెడలో ధరించే వాసుకి నల్లగా ఉంటుంది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
“చంద్రోదయాన్ని” చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
జవాబు:
అమ్మ జోలపాటను గుర్తుకు తెస్తుంది. అమ్మ తినిపించిన గోరుముద్దలు గుర్తుకు వస్తాయి. పాలమీగడ, పెరుగుబిళ్ళ గుర్తుకు వస్తుంది. ఎలాగైనా చంద్రమండలం పైకి వెళ్ళి, అక్కడ ఏముందో చూడాలనిపిస్తుంది.

ప్రశ్న 2.
నిండు పున్నమినాడు చంద్రబింబాన్ని చూస్తే ఏమేమి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాము?
జవాబు:
ఆ వెన్నెలలో తనివితీరా ఆదుకోవాలనిపిస్తుంది. చంద్రుణ్ణి చూస్తూ పరుగెడితే మనకూడా చంద్రుడు వస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఆకాశంలో పెద్ద మెర్క్యురీ లైటు ఉన్నట్లుగా అనిపిస్తుంది. చంద్రుడు చల్లని సూర్యుడిలా కనిపిస్తాడు. ఆ వెన్నెలలో చదువుకోగలనో లేదో చూడాలనిపిస్తుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
పౌర్ణమి నాటి కలువలను చూస్తుంటే కలిగే ఆనందం ఎలా ఉంటుంది?
జవాబు:
పిండారబోసినట్లుగా తెల్లని వెన్నెలలో కలువలు ఉన్న కొలనును చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. సున్నితమైన రేకులతో ఉన్న కలువలను చేతితో తాకాలనిపిస్తుంది. వాటితో బుగ్గలపై రాసుకోవాలని పిస్తుంది. వాటిని కెమెరాతో ఫోటోలు తీసి దాచుకోవాలని పిస్తుంది. వీడియో తీసుకోవాలనిపిస్తుంది. వెన్నెలలో కలువలను చూస్తుంటే, చదువు-మార్కులు, ఆటలుపాటలు, అల్లరి-గిల్లికజ్జాలు, తిండి-నిద్ర ఏమీ గుర్తురానంత ఆనందం కలుగుతుంది.

ప్రశ్న 4.
‘రజనీకర బింబం’ అని కవి దేన్ని గురించి అన్నాడు?
జవాబు:
రజనీకర బింబం అని కవి చంద్రుని గురించి అన్నాడు. వెన్నెల పాలసముద్రంలా, చంద్రుడు పాలసముద్రంలోని ఆదిశేషునిలాగా, చంద్రునిలోని మచ్చ విష్ణువులాగా కనిపించిందని కవి అన్నాడు.

పద్యం – 7 : కంఠస్థ పద్యం

*చ వడిగొని చేకులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁబు
పాడి దలమెకి, తేనియలు పొంగి తరంగలుగా జెలంగి పైఁ
ఐదు నెలదేఁటిదాఁటులకు బండువులై నవసారభంబు లు
గ్గడుపున మల్ల సిల్లె ఘనకైరవషండము నిండువెన్నెలన్.
ప్రతిపదార్థం :
ఘనకైరవషండము: ఘన ఘన = గొప్పవైన
కైరవ = కలువ పూల యొక్క
షండము = సముదాయం
నిండు వెన్నెలన్ = ఆ నిండైన వెన్నెలలో
వడిగొని = వేగం కలిగి (వేగంగా)
ఱేకులు = (తమ) పూలరేకులు
ఉప్పతిలన్ = విచ్చుకొనగా
వాలిన = కిందికి వాలిన
కేసరముల్ = కింజల్కములు (తామరపువ్వు బొడ్డు చుట్టూ ఉండే అకరువులు)
తలిర్సన్ = తలఎత్తి కన్పడగా
పుప్పొడిన్ = పుప్పొడితో
దలమెక్కి = దళసరియయి (రేకులు దళసరి అయి)
తేనియలు = మకరందాలు
పొంగి = పొంగి
తరంగలుగాన్ = కెరటాలుగా
చెలంగి = విజృంభించి
పైఁబడు = తమపైన వాలేటటువంటి
ఎలతేటి = లేత తుమ్మెదల
దాఁటులకున్ = గుంపులకు
పండువులై = విందు చేసేవయి
నవసౌరభంబులు – క్రొత్త పరిమళాలు
ఉగ్గడువుగన్ = మిక్కిలి అధికంగా
ఉల్లసిల్లెన్ = బయలుదేరాయి

భావం :
ఆ నిండు వెన్నెలలో కలువల రేకులు బాగా విచ్చు కున్నాయి. వాలిన కేసరాలు తలలెత్తాయి. పుప్పొడితో రేకులు దళసరియై, తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. కలువలపై వాలే తుమ్మెదల గుంపులకు విందు చేస్తూ, కొత్త సువాసనలు అధికంగా బయలుదేరాయి.

అలంకారం : స్వభావోక్తి

పద్యం – 8

సీ॥ | కరఁగెడు నవచంద్రకాంతోపలంబుల
తఱచు సోనలఁ గడు దలముకొనుచుఁ
జటుల చకోరసంచయముల యెఱకల
గర్వంపుదాఁటులఁ గడలుకొనుచు
విరియు కైరవముల విపుల రంధ్రములపైఁ
దీవంబుగాఁ గ్రమ్మి త్రిప్పుకొనుచుఁ
గామినీజనముల కమనీయవిభ్రమ
స్మితకాంతిలహరుల మెందుకొనుచుఁ

ఆ॥వె॥ బొదలిపొదలి చదలఁ బొంగారి పొంగారి
మించి మించి దిశలు ముంచిముంచి
యభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొదిచె.
ప్రతిపదార్థం :
అభినుత = మిక్కిలి పొగడబడిన
ఇందు = చంద్రుని
చంద్రిక = వెన్నెల అనెడు
అంభోధి = సముద్రము
కరగెడు = కరుగుతున్న
నవ = క్రొత్తదైన
చంద్రకాంత = చంద్రకాంతములనెడు
ఉపలంబుల = ఱాళ్ళను
తఱచు = ఎక్కువగా
సోనలన్ = తుంపరలతో (అల్ప వర్షంతో)
కడు = ఎక్కువగా
తలముకొనుచున్ = తడుపుతూ
చటుల = చలించు
చకోరపక్షుల = చక్రవాక పక్షుల
సంచయముల = సమూహముల యొక్క
ఎఱకల = ఱెక్కల
గర్వంపుదాటులన్ = గర్వము గల కదలికలను
కడలుకొనుచు = అతిశయిస్తూ
విరియ = విరబూసిన
కైరవముల = కలువల
విపుల = ఎక్కువైన (అధికమైన)
రంధ్రముల పైన్ = రంధ్రాల మీద
తీవ్రంబుగాన్ = ఎక్కువగా
క్రమ్మి = ఆవరించి
త్రిప్పుకొనుచున్ = (తనవైపు) ఆకర్షిస్తూ
కామినీజనముల = స్త్రీల యొక్క
కమనీయ = అందమైన
విభ్రమ = అలంకారాదుల కాంతి
స్మిత = చిరునవ్వుల
కాంతిలహరుల = వెలుగు కెరటాలను
మెండుకొనుచున్ = ఎక్కువ చేస్తూ
పొదలి పొదలి = పెరిగి పెరిగి
చదలన్ = ఆకాశంలో
పొంగారి పొంగారి = పొంగిపొంగి (ఉప్పొంగి)
మించిమించి = బాగా అతిశయించి
దిశలు = దిక్కులు
ముంచిముంచి = బాగా మునుగునట్లు చేసి
నీటు + అ = మురిపముతో
నిట్టలముగ = అధికంగా
నిట్టవొడిచే = ఉప్పొంగెను.

భావం :
బాగా పొగడబడిన చంద్రకాంతి అనే సముద్రం ప్రపంచాన్ని ముంచింది. అది చాలా వ్యాపించింది. ఆకాశంలో ఉప్పొంగింది. దిక్కులు ముంచింది. చంద్రకాంత శిలలను తన ప్రవాహపు తుంపరలతో తడిపింది. చక్రవాక పక్షుల రెక్కల గర్వపు కదలికలను పెంచింది. విరబూస్తున్న కలువల రంధ్రాలపై వ్యాపించి తనవైపు ఆకర్షిస్తోంది. స్త్రీల అందమైన ఆభరణాల కాంతులను, వారి చిరునవ్వుల కాంతులను పెంచుతోంది.

వచనం -9

వ॥ ఇట్లతిమనోహర గంభీరధీరంబైన సుధాకర కాంతి
పూరంబు రాత్రి యను తలంపు దోఁవనీక తమంబను
నామంబును విననీక యవ్యక్తయను శంక నంకురింపనీక
లోచనంబులకు నమృత సేచనంబును, శరీరంబునకుఁ
జందనా సారంబును, నంతరంగంబునకు నానంద
తరంగంబును నగుచు విజృంభించిన సమయంబున
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధంగా (పైన పేర్కొన్న విధంగా)
అతి మనోహర = చాలా అందమైన
గంభీర = గంభీరమైన (నిండైన)
ధీరంబు + ఐన = ధైర్యము కలిగిన (అన్నిచోట్ల వ్యాపించిన)
సుధాకర = చంద్రుని (అమృత కిరణుని)
కాంతి పూరంబు = కాంతి సమూహము
రాత్రి + అను = రేయి అనెడు
తలంపున్ = ఆలోచనను
తోపనీక = తోచనివ్వక
తమంబను = చీకటి అనెడు
నామంబును = పేరును
వినన్ + ఈక = విననివ్వక
అవ్యక్త + అను = పరమాత్మ అను
శంకన్ = అనుమానమును
అంకురింపనీక = పుట్టనివ్వక
లోచనంబులకు = కళ్లకు
అమృతసేచనంబును = అమృతాభిషేకమును
శరీరంబునకున్ = శరీరానికి
చందన + ఆసారంబును = గంధపు వర్షమును
అంతరంగంబునకును = ఆత్మకును (మనస్సునకు)
ఆనంద = ఆనందమనెడు
తరంగంబును = కెరటమును
అగుచు = అవుతూ
విజృంభించిన = అతిశయించిన
సమయంబున = సమయంలో

భావం :
ఈ విధంగా వెన్నెల చాలా అందంగా ఉంది. గంభీరంగా ఉంది. ధైర్యంగా ఉంది. ఆ వెన్నెల రాత్రి అనే ఆలోచన కూడా రానివ్వడం లేదు. చీకటి అనే పేరు కూడా విననివ్వడం లేదు. పరమాత్మ అనే ఆలోచన కూడా పుట్టనివ్వడం లేదు. కళ్లకు ఆ వెన్నెల అమృతాభిషేకం చేస్తోంది. శరీరానికి మంచి గంధంలాగ ఉంది. అంతరాత్మకు బ్రహ్మానంద ప్రవాహం లాగ ఉంది.

ఇది తెలుసుకోండి:
వెన్నెల మన కళ్లకు అందంగా కనిపిస్తూ, రాత్రి అనే ఆలోచన రానివ్వక అమృతాభిషేకం చేసింది. శరీరానికి గంభీరంగా కనిపిస్తూ, భయం కలిగించే చీకటి అనే పేరును విననివ్వక గంధపు వర్షమైంది. ఆత్మకు కావలసినంత ధైర్యంగా కనిపిస్తూ, దైవాన్ని స్మరించే స్థితిని దాటించి, బ్రహ్మానందాన్ని కల్గించింది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
వెన్నెలను చూసిన కలువలు ఎలా ప్రతిస్పందించాయి?
జవాబు:
పండు వెన్నెలలో కలువలు తమ రేకులు అతిశయించగా వాడిపోయిన కేసరాలు ప్రకాశించాయి. పుప్పొడి పైన తేనె పొంగి ప్రవహించింది, పైన పడుతున్న చంద్రుని కలయికలతో పరవశించే కలువలు కనులపండువగా ఆనందంతో, క్రొత్త సౌరభాలతో ప్రకాశించాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 2.
చంద్రుడు తన వెన్నెలతో ప్రపంచానికి ఆహ్లాదాన్ని ఎలా కలిగించాడు?
జవాబు:
ఆకాశమనే వృక్షానికి దిక్కులనే కొమ్మలలో గల నక్షత్రాలనే పూలను కోయుటకు చంద్రుడు నిలబడి పొడవైన తన కిరణాల (చేతుల) తో ఉత్సాహంగా కనిపిస్తూ ప్రపంచానికి ఆనందం కలిగించాడు.

వెన్నెల అనే పాలసముద్రంలో చంద్రుడు ఆదిశేషుని లాగా కనిపించాడు. చంద్రునిలోని మచ్చ శ్రీమహా విష్ణువులాగా కన్పించి భక్తులకు కూడా ఆనందాన్ని కలిగించాడు.

వెన్నెల చంద్రకాంత శిలలకు, చక్రవాక పక్షులకు, కలువలకు, అందమైన స్త్రీలకు, సమస్త చరాచర జగత్తుకీ ఆనందం కలిగిస్తోంది.

ప్రపంచానికి రాత్రి అనే ఆలోచన రానివ్వక, చీకటి అనే పేరు కూడా వినపడనివ్వకుండా, పరమాత్మను కూడా స్మరింపనీయక అమితమైన బ్రహ్మానందాన్ని వెన్నెల కలిగిస్తోంది.

ప్రశ్న 3.
‘పొదలి పొదలి చదలఁ బొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి’ అనే పాదంలోని పద సౌందర్యం గురించి చెప్పండి.
జవాబు:
పొదలి, పొంగారి, మించి, ముంచి అనే పదాలు వ్యవధానం లేకుండా ప్రయోగించడం వలన పద్య పాదానికి చాలా అందం వచ్చింది. ఈ శబ్దాలు ఈ పద్యపాదానికి అలంకారాలు. ఇది ఛేకానుప్రాసా
లంకారంతో శోభిస్తోంది.

ప్రశ్న 4.
‘మనోహర గంభీర ధీరంబైన సుధాకర కాంతి పూరంబు’ దీని భావం ఏమిటి?
జవాబు:
మనస్సును ఆకర్షించగల అందమైన, గంభీరమైన, ధైర్యము గలిగిన అమృత కిరణుడైన చంద్రుని కాంతి ప్రవాహము.