AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

SCERT AP 10th Class Social Study Material Pdf 10th Lesson ప్రపంచీకరణ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 10th Lesson ప్రపంచీకరణ

10th Class Social Studies 10th Lesson ప్రపంచీకరణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
విదేశీ పెట్టుబడి, వాణిజ్యాలపై భారత ప్రభుత్వం అవరోధాలు కల్పించటానికి గల కారణాలు ఏమిటి ? ఈ అవరోధాలను తొలగించాలని అది ఎందుకు అనుకుంది? (AS1)
జవాబు:
దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీ నుండి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించిన భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులపై అవరోధాలు కల్పించింది. అయితే 1991 నుండి భారత ఉత్పత్తిదారులు ప్రపంచవ్యాప్త ఉత్పత్తిదారులతో పోటీపడాల్సిన అవసరం ఉందని నిర్ణయించి ఈ అవరోధాలను తొలగించాలని నిర్ణయించింది.

ప్రశ్న 2.
కార్మిక చట్టాల సడలింపు కంపెనీలకు ఏ విధంగా సహాయపడుతుంది? (AS1)
జవాబు:
కార్మిక చట్టాల సడలింపు వలన కంపెనీకి కార్మీకుల పైన అయ్యే ఖర్చు తగ్గుతుంది. దీని మూలంగా కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాలవ్యవధికి నియమించుకొనే అవకాశం ఉంది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 3.
ఉత్పత్తిని చేపట్టటానికి, దానిని నియంత్రించటానికి, లేదా ఇతర దేశాలలో స్థిరపడటానికి బహుళజాతి సంస్థలు అవలంబించే విధానాలు ఏమిటి? (AS1)
జవాబు:
బహుళజాతి సంస్థలు ఉత్పత్తి ప్రక్రియను చిన్న భాగాలుగా చేసి ప్రపంచంలో పలుచోట్ల చేబడతాయి. వాటిని చౌకగా ఉత్పత్తి చేయగల ప్రాంతాన్ని దీనికై ఎన్నుకుంటాయి. మార్కెటింగ్ కు సమీపంలోని దేశాలను ఎంపిక చేసుకొని అచ్చట అసెంబ్లింగ్ యూనిట్లనేర్పాటు చేస్తారు. ఇంగ్లీషు మాట్లాడగలిగే జనాభా గల భారతదేశం లాంటి దేశాలలో కస్టమర్ కేర్ సేవలనేర్పాటు చేస్తాయి. వీరు ఆయా దేశాలలోని కొన్ని కంపెనీలతో కలసి తమ సంస్థలనేర్పాటు చేయడం ద్వారా ఆయా దేశాలలో నిలదొక్కుకుంటాయి.

ప్రశ్న 4.
అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్యం, పెట్టుబడులలో సరళీకృత విధానాలను అవలంబించాలని అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు కోరుకుంటున్నాయి? దీనికి ప్రతిగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏ షరతులను కోరాలి? (AS4)
జవాబు:
అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్యం, పెట్టుబడులలో సరళీకృత విధానాలను అవలంబించాలని అభివృద్ధి చెందిన దేశాలు కోరుకొంటాయి. ఎందుకంటే బహుళజాతి సంస్థలు అధికంగా అభివృద్ధి చెందిన దేశాలకు చెందినవి మరియు ముడి సరుకులు, మార్కెట్లు గల అభివృద్ధి చెందుతున్న దేశాలలోకి బహుళజాతి సంస్థలు ప్రవేశించాలంటే ఆ దేశాలు సరళీకృత విధానాలను అవలంబించాల్సి ఉంటుంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా న్యాయపూరిత విధానాలు అవలంబించాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు షరతులు విధించాలి.

ప్రశ్న 5.
“ప్రపంచీకరణ ప్రభావం ఒకేరకంగా లేదు.” ఈ వాక్యాన్ని వివరించండి. (AS1)
జవాబు:
ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేదని తెలుస్తోంది. విద్య, నైపుణ్యం, సంపద ఉన్న వాళ్లు కొత్త అవకాశాల వల్ల బాగా లాభపడ్డారు. ఇంకొకవైపున ఎటువంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రపంచీకరణ ఇప్పుడు ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చెయ్యాలి అనేది మన ముందున్న ప్రశ్న. న్యాయమైన ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు సృష్టిస్తుంది. దాని ప్రయోజనాలు మరింత బాగా పంచుకోబడతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 6.
వాణిజ్య, పెట్టుబడి విధానాలను సరళీకరించటం వల్ల ప్రపంచీకరణ ప్రక్రియకు మేలు ఎలా జరిగింది? (AS1)
జవాబు:
వాణిజ్య, పెట్టుబడి విధానాలను సరళీకరించడం వలన సాంకేతిక పరిజ్ఞానం శరవేగంతో విస్తరించి ప్రపంచీకరణకు దోహదం చేసాయి. టెలికమ్యూనికేషన్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందడంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. వాయిస్ మెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్స్ తో నామమాత్రపు ఖర్చుతో సమాచారం ప్రపంచంలో ఎక్కడికైనా క్షణాల్లో చేరవేయవచ్చు.

ప్రశ్న 7.
దేశాల మధ్య మార్కెట్ల అనుసంధానానికి విదేశీ వాణిజ్యం ఎలా దోహదం చేస్తుంది? ఇక్కడ ఇచ్చినవి కాకుండా కొత్త ఉదాహరణలతో దీనిని వివరించండి. (AS1)
జవాబు:
దేశాల మధ్య అనుసంధానంగా చాలా కాలంగా వాణిజ్యం ఉంటుంది. భారతదేశం ప్రాచీన కాలం నుండి నూలు వస్త్రాలను అనేక దేశాలకు ఎగుమతి చేసింది. చైనా పట్టు వస్త్రాలను ఆసియా ఖండంలోని అనేక దేశాలకు ఎగుమతి చేసేది. భారతదేశం, ఇండోనేషియాలు సుగంధ ద్రవ్యాలతో వాణిజ్యం చేసినట్లు ఆధారాలున్నాయి.

ప్రశ్న 8.
ప్రపంచీకరణ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఇప్పటి నుంచి ఇరవై ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి. మీ ఊహలకు కారణాలను పేర్కొనండి. (AS4)
జవాబు:
ప్రపంచీకరణ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. 20 సంవత్సరాల తరువాత దేశీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలను తట్టుకోలేక మూతపడవచ్చు. ప్రజలు సేవలు, వస్తువులనే దృష్టిలో పెట్టుకొని స్వదేశీ వస్తువులపై మోజును పూర్తిగా కోల్పోతారు. వైద్యం, విద్యా రంగాలలో కూడా బహుళజాతి సంస్థలు ప్రాచుర్యం పొందుతాయి. భారతీయ రైల్వేలలో కూడా బహుళజాతి సంస్థలు ప్రవేశిస్తాయి. ప్రధానంగా భారతీయ సంస్కృతిపై కూడా వీటి ప్రభావం పడుతుంది. మానవ సంబంధాలు దెబ్బతింటాయి.

ప్రశ్న 9.
ఇద్దరు వ్యక్తులు వాదించుకోవటం మీరు వింటున్నారు : ఒకరు ప్రపంచీకరణ మన దేశ అభివృద్ధిని కుంటుపరిచిందని అంటున్నారు. మరొకరు భారతదేశం అభివృద్ధి చెందటానికి ప్రపంచీకరణ సహాయపడుతోందని అంటున్నారు. ఈ వాదనలకు మీరు ఎలా స్పందిస్తారు? (AS2)
జవాబు:
ఇరువురి వాదనలలో కూడా ఎంతో కొంత నిజం ఉంది. ఎందుకంటే ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ కాలేదు. సంపన్న వినియోగదారులకు, నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు అది ప్రయోజనకరంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి. ఇంకొకవైపున వేలాదిమంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ల ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతోంది. రెండు పార్శ్వాలున్న ఈ ప్రపంచీకరణను అర్థం చేసుకోవటం ముఖ్యం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 10.
ఖాళీలను పూరించండి : (AS1)
భారతీయ కొనుగోలుదారులకు రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సరుకుల ఎంపికకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. …………………. ప్రక్రియ వల్ల ఇది సాధ్యమయ్యింది. అనేక ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులను భారతదేశ మార్కెట్లలో అమ్ముతున్నారు. దీని అర్థం ఇతర దేశాలతో …………………… పెరుగుతోంది. అంతేకాకుండా మనం మార్కెట్లో చూస్తున్న అనేక బ్రాండ్లను బహుళజాతి సంస్థలు భారతదేశంలోనే ఉత్పత్తి చేసి ఉండవచ్చు. బహుళజాతి సంస్థలు ……………………………., ……………………… కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల ఎంపికకు అవకాశాలు పెరిగాయి కానీ………………., వల్ల ఉత్పత్తిదారుల మధ్య ………………………. తీవ్రతరం అయ్యింది.
జవాబు:
భారతీయ కొనుగోలుదారులకు రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సరుకుల ఎంపికకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచీకరణ ప్రక్రియ వల్ల ఇది సాధ్యమయ్యింది. అనేక ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులను భారతదేశ మార్కెట్లలో అమ్ముతున్నారు. దీని అర్థం ఇతర దేశాలతో విదేశీ వాణిజ్యం పెరుగుతోంది. అంతేకాకుండా మనం మార్కెట్లో చూస్తున్న అనేక బ్రాండ్లను బహుళజాతి సంస్థలు భారతదేశంలోనే ఉత్పత్తి చేసి ఉండవచ్చు. బహుళజాతి సంస్థలు సరళీకృత ఆర్థిక విధానాలు, సెట్ల ఏర్పాటు కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల ఎంపికకు అవకాశాలు పెరిగాయి కానీ కొత్త సాంకేతిక విజ్ఞానం, ఉత్పత్తి పద్ధతులు వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీ తీవ్రతరం అయ్యింది.

ప్రశ్న 11.
క్రింది వాటిని జతపరచండి.

i) బహుళజాతి సంస్థలు తక్కువ ధరకు చిన్న ఉత్పత్తిదారుల నుంచి కొంటాయి. (అ) వాహనాలు
ii) వస్తువుల వాణిజ్యాన్ని నియంత్రించటానికి కోటాలు, పన్నులు ఉపయోగిస్తారు. (ఆ) దుస్తులు, పాదరక్షలు, క్రీడాపరికరాలు
iii) విదేశాలలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు. (ఇ) కాల్ సెంటర్లు
iv) సేవల ఉత్పత్తి విస్తరించటానికి సమాచార సాంకేతిక రంగం (IT) దోహదపడింది. (ఈ) టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, రానా బాక్సీ
v) భారతదేశంలో ఉత్పత్తి చెయ్యటానికి అనేక బహుళజాతి సంస్థలు కర్మాగారాల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాయి. (ఉ) వాణిజ్య అవరోధాలు

జవాబు:

i) బహుళజాతి సంస్థలు తక్కువ ధరకు చిన్న ఉత్పత్తిదారుల నుంచి కొంటాయి. (ఆ) దుస్తులు, పాదరక్షలు, క్రీడాపరికరాలు
ii) వస్తువుల వాణిజ్యాన్ని నియంత్రించటానికి కోటాలు, పన్నులు ఉపయోగిస్తారు. (ఉ) వాణిజ్య అవరోధాలు
iii) విదేశాలలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు. (ఈ) టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, రానా బాక్సీ
iv) సేవల ఉత్పత్తి విస్తరించటానికి సమాచార సాంకేతిక రంగం (IT) దోహదపడింది. (ఇ) కాల్ సెంటర్లు
v) భారతదేశంలో ఉత్పత్తి చెయ్యటానికి అనేక బహుళజాతి సంస్థలు కర్మాగారాల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాయి. (అ) వాహనాలు

10th Class Social Studies 10th Lesson ప్రపంచీకరణ InText Questions and Answers

10th Class Social Textbook Page No.133

ప్రశ్న 1.
ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీయా? ఎందుకు?
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీ. ఫోర్డ్ మోటర్స్ అనేక దేశాలకు కార్లను ఎగుమతి చేస్తుంది. అందుచే ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీ.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 2.
విదేశీ పెట్టుబడి అంటే ఏమిటి ? ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో ఎంత పెట్టుబడి పెట్టింది?
జవాబు:
ఒక దేశంలో ఇతర దేశాలు పెట్టుబడి పెట్టి కంపెనీలు నిర్వహించడాన్ని విదేశీ పెట్టుబడి అంటాం. ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో 1700 కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టింది.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 3.
భారతదేశంలో ఫోర్డ్ మోటర్స్ కార్ల ఉత్పత్తిని చేపట్టటం వల్ల ఉత్పత్తి కార్యకలాపాలలో ఎటువంటి అనుసంధానం జరుగుతోంది?
జవాబు:
భారతదేశంలో ఫోర్డ్ మోటర్స్ కార్ల ఉత్పత్తిని చేపట్టడం వలన ఉత్పత్తి కార్యక్రమాలలో స్థానిక కంపెనీలతో అనుసంధానం చేసుకోవటం, ఇతర దేశాలలో మార్కెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

10th Class Social Textbook Page No.136

ప్రశ్న 4.
ప్రపంచీకరణ ప్రక్రియలో బహుళజాతి సంస్థల పాత్ర ఏమిటి?
జవాబు:
బహుళ జాతి కంపెనీల పెట్టుబడి ప్రజలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రవాహం వలన సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడి ప్రపంచీకరణకు దారితీసింది.

ప్రశ్న 5.
దేశాలను అనుసంధానపరిచే వివిధ మార్గాలేవి?
జవాబు:
అధిక దేశీయ పెట్టుబడులు, విదేశీ వాణిజ్యం వలన వివిధ దేశాల ఉత్పత్తి, మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగి ఈ దేశాల మధ్య అనుసంధానం ఏర్పడింది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 6.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల
అ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని తగ్గిస్తుంది.
ఆ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది.
ఇ) ఉత్పత్తిదారుల మధ్య పోటీలో తేడా ఉండదు.
జవాబు:
ఆ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది.

10th Class Social Textbook Page No.137

ప్రశ్న 7.
ప్రపంచీకరణకు, సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి మధ్యగల సంబంధం ఏమిటి? సమాచార సాంకేతిక పరిజ్ఞానం (IT) విస్తరించకుండా ప్రపంచీకరణ సాధ్యమై ఉండేదా?
జవాబు:
సమాచార పరిజ్ఞానం విస్తరించడంవలననే ప్రపంచీకరణ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించకుండా ప్రపంచీకరణ సాధ్యమయ్యేది కాదు.

10th Class Social Textbook Page No.138

ప్రశ్న 8.
విదేశీ వాణిజ్య సరళీకరణ అంటే ఏమి అర్థం చేసుకున్నారు?
జవాబు:
విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు గల అవరోధాలను తొలగించటం, విదేశీ కంపెనీలు మనదేశంలో కార్యాలయాలు,కంపెనీలు స్థాపించుటకు అనుమతించడం వంటి చర్యలను విదేశీ వాణిజ్య సరళీకరణ అంటాం.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 9.
దేశాల మధ్య వాణిజ్యం మరింత న్యాయపూరితంగా ఉండటానికి ఏం చేయవచ్చు?
జవాబు:
అన్ని దేశాలు అవరోధాలు తొలగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు దీనికి మినహాయింపు కారాదు.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 10.
పెరుగుతున్న పోటీవల్ల రవి చిన్న ఉత్పత్తి కేంద్రం ఏ విధంగా ప్రభావితం అయ్యింది?
జవాబు:
పెరుగుతున్న పోటీవల రవి చిన్న ఉత్పత్తి కేంద్రంలో నేడు ఉత్పత్తి సగం పడిపోయింది. 35 శాతం మంది కార్మికులకు మాత్రమే నేడు పని కల్పించగలుగుతున్నాడు.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 11.
ఈ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడటంలో ప్రభుత్వ పాత్ర ఉందనుకుంటున్నారా? ఎందుకు?
జవాబు:
అవును. ఈ రంగాలలో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

10th Class Social Textbook Page No.130

ప్రశ్న 12.
మొబైల్ ఫోన్లు లేదా వాహనాలు వంటి ఏదో ఒక దానిని తీసుకోండి. మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్లను గుర్తించండి. వాటి యజమానులు ఎవరు? అవి భారతదేశంలో తయారవుతున్నాయా? మీ తల్లిదండ్రులతో లేదా ఇతర పెదవాళ్లతో చర్చించి 30 సంవత్సరాల క్రితం ఎన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి.
జవాబు:
సెల్ ఫోన్లు ఉదాహరణగా తీసుకుంటే జపాన్ దేశానికి చెందిన నోకియా వంటి కంపెనీలు భారతదేశ మార్కెట్ను పాలిస్తున్నాయి. జపాన్ మాత్రమే కాక అనేక బహుళజాతి కంపెనీలు వివిధ వస్తువులను భారతీయ మార్కెట్లో అమ్ముతున్నారు. 30 సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రధానమంత్రి వంటి ప్రముఖుల వద్దనే ఇలాంటి బ్రాండ్లు ఉండేవి. జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు చేతి గడియారాలను భారతదేశంలో మార్కెట్ చేశాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 13.
ఫోర్డ్ మోటర్స్ వంటి బహుళజాతి కంపెనీలు భారతదేశంలో ఉత్పత్తి చేసే కర్మాగారాలను నెలకొల్పటం వల్ల ఇటువంటి దేశాలు అందించే పెద్ద మార్కెట్టునే కాకుండా తక్కువ ఉత్పత్తి ఖర్చు వల్ల కూడా లాభపడతాయి. ఈ వాక్యాన్ని వివరించండి.
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ వంటి బహుళజాతి కంపెనీలు భారతదేశంలో తమ కంపెనీలు నెలకొల్పడం ద్వారా అత్యధిక జనాభా గల ఈ దేశంలో తమ మార్కెట్ ను సులభంగా విస్తరించగలుగుతారు. అదే సమయంలో భారత ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి యిస్తున్న వివిధ రాయితీలు, సరళీకృత ఆర్థిక విధానాలు ద్వారా సులభంగా అనుమతులను పొందడం, శ్రమ , శక్తి, నైపుణ్యం గల కార్మికులు చౌకగా లభించడం వంటి అనుకూల అంశాలతో ఉత్పత్తి ఖర్చు కూడా వీరికి తగ్గుతుంది.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 14.
ప్రపంచవ్యాప్త కార్ల ఉత్పత్తికి భారతదేశం విడి భాగాలను అందించేలా అభివృద్ధి చెయ్యాలని కంపెనీ ఎందుకు అనుకుంటోంది? కింది అంశాలను చర్చించండి.
అ) భారతదేశంలో కార్మికులు, ఇతర వనరుల ఖర్చు.
ఆ) ఫోర్డ్ మోటరకు వివిధ విడి భాగాలను అందించే పలు స్థానిక ఉత్పత్తిదారులు ఉండటం,
ఇ) భారతదేశం, చైనాలలోని అధిక సంఖ్యాక కొనుగోలుదారులకు దగ్గరగా ఉండటం.
జవాబు:
ప్రపంచ వ్యాప్తంగా కార్ల ఉత్పత్తికి భారతదేశం విడి భాగాలను అందించేలా అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తుంది.
దీనికి కారణం :
అ) భారతదేశంలో కార్మికులు, ఇతర వనరుల ఖర్చులు తక్కువగా ఉండుట.
ఆ) ఫోర్డ్ మోటరు వివిధ విడి భాగాలను ఇతర దేశాలలోని ఉత్పత్తి కేంద్రాలకు అందుబాటులోకి తేవాలనుకుంటుంది.
ఇ) భారతదేశం, చైనా వేగంగా ప్రపంచంలోని ముఖ్య మార్కెట్లకు విస్తరించడం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 15.
నైక్, కోకాకోలా, పెప్సి, హోండా, నోకియా వంటి బహుళజాతి కంపెనీలు దాదాపుగా అమెరికా, జపాను, లేదా ఐరోపా దేశాలకు చెందినవే. ఎందుకో ఊహించగలరా?
జవాబు:
అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముందంజలో ఉండటం, సరళీకృత ఆర్థిక విధానాలు పెట్టుబడిదారి వ్యవస్థ చాలాకాలం నుండి అమలులో ఉండటం వలన నైక్, కోకాకోలా, పెప్సి, హోండా, నోకియా వంటి బహుళజాతి సంస్థలు ఈ దేశాలలోనే ఉద్భవించాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 16.
గతంలో దేశాలను కలిపిన ప్రధాన అంశం ఏమిటి? గతానికి, ప్రస్తుత పరిస్థితికి తేడా ఏమిటి?
జవాబు:
గతంలో దేశాలను కలిపిన ప్రధాన అంశం వాణిజ్యం . ప్రస్తుతం కూడా పరిస్థితులు ఏమంతగా మారలేదు. గతంలో యూరోపియన్ దేశాలు భారతదేశంతోను, ఇతర దక్షిణాసియా దేశాలతోను సముద్ర మార్గాలు ద్వారా వాణిజ్యం నిర్వహించేవారు. ప్రజలు స్థానికంగా తయారయిన వస్తువుల కంటే స్థానికేతర వస్తువుల పట్లనే ఆసక్తి కనబరచేవారు. కాని ప్రస్తుతం మన భారతీయ కంపెనీలు చౌక ధరలకే అవే వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి మరియు ఆ వస్తువులు స్థానిక మార్కెట్లలో అందుబాటులో ఉంటున్నాయి. మన దేశ వాణిజ్యంలో బహుళజాతి సంస్థల ఆగమనం కూడా మరొక అంశం.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 17.
విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు మధ్య తేడా ఏమిటి?
జవాబు:

విదేశీ వాణిజ్యం విదేశీ పెట్టుబడి
1) ఒక కంపెనీ ఇతర దేశాలతో నిర్వహించే వాణిజ్యం. 1) ఇది బహుళజాతి సంస్థలు భూములు, భవనాలు, యంత్రాలు మరియు ఇతర సామగ్రి కొనేందుకు ఖర్చు చేసే ధనం.
2) వస్తువుల ఉత్పత్తి ఒక దేశంలో జరుగుతుంది మరియు అవి ఇతర దేశాలలో విక్రయించబడతాయి. 2) ఒక దేశంలో ఇతర దేశాల వ్యాపారులు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది మరియు వస్తువులు అధిక ధరలకు ఎగుమతి అవుతాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 18.
చైనాలోకి భారత ఉక్కును దిగుమతి చేసుకోవటం వల్ల రెండు దేశాల ఉక్కు మార్కెట్లు ఎలా అనుసంధానమౌతాయి?
జవాబు:
చైనాకు భారతదేశంలో సమృద్ధిగా ఉన్న ఉక్కు మరియు ఇతర ముడి సరకుల ఆవశ్యకత చాలా ఉంది. భారతదేశం నుండి కొనుగోలు చేసిన ఉక్కు మరియు ఇతర ముడి సరుకుల సహాయంతో చైనా అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తోంది మరియు భారతదేశానికి వాటిని ఎగుమతి చేస్తోంది. ఇది ఈ రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య బంధాన్ని ఏర్పరచింది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.137

ప్రశ్న 19.
ఈ ఉదాహరణలో ఉత్పత్తిలో సాంకేతిక విజ్ఞాన ఉపయోగాన్ని తెలియజేసే పదాల కింద గీత గీయండి.
జవాబు:
2వ లైన్ డిజైన్
3వ లైన్ ఇంటర్నెట్
4వ లైన్ టెలికమ్యూనికేషన్
5వ లైన్ డిజైన్
6వ లైన్ డిజైనింగ్
7వ లైన్ కంప్యూటర్, ముద్రించిన
8వ లైన్ డిజైనింగ్
9వ లైన్ ముద్రణకు
10వ లైన్ ఇంటర్నెట్ (e- Banking)

10th Class Social Textbook Page No.138

ప్రశ్న 20.
దిగుమతులపై పన్ను వాణిజ్య అవరోధానికి ఒక ఉదాహరణ. దిగుమతి చేసుకునే సరుకుల సంఖ్య మోతాదుపై కూడా ప్రభుత్వం పరిమితి విధించవచ్చు. దీనిని కోటాలు అంటారు. చైనా బొమ్మల ఉదాహరణలో కోటాలను ఉపయోగించి వాణిజ్య అవరోధాన్ని ఎలా విధించవచ్చో వివరించండి. ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలా? చర్చించండి.
జవాబు:
భారతదేశంలో చైనా బొమ్మల దిగుమతి ఉదాహరణకు మరొకసారి వద్దాం – బొమ్మల దిగుమతిపై భారతీయ ప్రభుత్వం పన్ను విధించిందనుకుందాం. పన్ను కారణంగా కొనుగోలుదారులు దిగుమతి చేసుకున్న బొమ్మలకు అధిక ధరలు చెల్లించాల్సివస్తుంది. అప్పుడు భారతీయ మార్కెట్లో చైనా బొమ్మలు మరీ అంత చవకగా ఉండవు, దాంతో చైనా నుంచి దిగుమతులు తగ్గిపోతాయి. భారతదేశ ఉత్పత్తిదారులు పుంజుకుంటారు.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 21.
ఖాళీలను పూరించండి.
…………. దేశాల చొరవతో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలయ్యింది. ఈ సంస్థ ఉద్దేశం ………. . ప్రపంచ వాణిజ్య సంస్థ ………….. కు సంబంధించి నియమాలు రూపొందించి ……….. చూస్తుంది. అయితే, ఆచరణలో దేశాల మధ్య వాణిజ్యం ………… లేదు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ………… . కానీ అనేక సందర్భాలలో అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తిదారులకు మద్దతు కొనసాగిస్తున్నాయి.
జవాబు:
అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలయ్యింది. ఈ సంస్థ ఉద్దేశం అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పాటు. ప్రపంచ వాణిజ్య సంస్థ అంతర్జాతీయ వాణిజ్యాలకు సంబంధించి నియమాలు రూపొందించి అవి పాటింపబడేలా చూస్తుంది. అయితే ఆచరణలో దేశాల మధ్య వాణిజ్యం న్యాయపూరితంగా లేదు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అవరోధాలను కలిగిస్తున్నాయి. కానీ అనేక సందర్భాలలో అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తిదారులకు మద్దతు కొనసాగిస్తున్నాయి.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 22.
పై ఉదాహరణలో అమెరికా ప్రభుత్వం ఉత్పత్తి చెయ్యటానికి రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తుందని చూశాం. కొన్నిసార్లు ప్రభుత్వాలు కొన్ని రకాల వస్తువుల, ఉదాహరణకు పర్యావరణ అనుకూలమైన వాటి ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి. ఇది న్యాయమైనదో కాదో చర్చించండి.
జవాబు:
ఈ ఉదాహరణలో అమెరికా ప్రభుత్వం పంటలకు పెద్ద మొత్తంలో డబ్బులు యిచ్చినంతవరకు ఎవరికీ అభ్యంతరముండదు. తద్వారా వారు ఆహార ఉత్పత్తులను పెంచుకోవచ్చు. కానీ వాటిని చౌకగా విదేశాలలో అమ్మటం న్యాయసముచితం కాదు. దీనిమూలంగా యితర దేశాల రైతులు యిబ్బంది పడుతున్నారు. పర్యావరణమైన అనుకూల ఉత్పత్తికి మద్దతు యివ్వడం న్యాయసమ్మతమైనదే. మనదేశంలో కూడా వంట చెఱకు కోసం అడవులను నరకకుండా ఉండేందుకు గ్యాస్ వినియోగం ప్రోత్సహించటానికి గ్యాస్ కు సబ్సిడీలు యిస్తున్నాం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 23.
భారతదేశ ప్రజలు పోటీవల్ల ఏ విధంగా లాభపడ్డారు?
జవాబు:
భారతదేశ అతి పెద్ద కంపెనీలలో అనేకం పెరిగిన పోటీవల్ల ప్రయోజనం పొందాయి. వాళ్లు కొత్త సాంకేతిక విజ్ఞానంలోనూ, ఉత్పత్తి పద్ధతులలోనూ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి ప్రమాణాలను పెంచారు. విదేశీ కంపెనీలతో కలిసి పనిచెయ్యటం ద్వారా కొన్ని కంపెనీలు లాభపడ్డాయి.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 24.
మరిన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలుగా ఎదగాలా ? దేశంలోని ప్రజలకు దానివల్ల ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా ‘బహుళజాతి సంస్థలుగా ఎదిగాయి. టాటా మోటర్స్ (వాహనాలు), ఇన్ఫోసిస్ (IT), రానాలాక్సీ (మందులు), ఏషియన్ పెయింట్స్ (రంగులు), సుందరం ఫాసెనర్స్ (నటులు, బోల్టులు) వంటి భారతీయ కంపెనీలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లావాదేవీలు కలిగి ఉన్నాయి.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 25.
మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి?
జవాబు:
పన్నుల రూపంలో ప్రభుత్వాదాయం పెరుగుతుంది. తద్వారా ప్రజలకు మరిన్ని సేవలనందజేయవచ్చు.
భారతీయులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. తద్వారా తలసరి, జాతీయాదాయాలు పెరుగుతాయి.
దేశ, విదేశీ వాణిజ్యం పెరుగుతుంది. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించవచ్చు.

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 26.
ఇతర దేశాలతో పోలిస్తే తమ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కాబట్టి రవిలాంటి వాళ్ళు ఉత్పత్తిని నిలిపివెయ్యాలా? మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో ఉత్పత్తి ఖర్చు ఎక్కువేమీ కాదు. అయితే బహుళజాతి సంస్థలు అధునాతన , సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసిన వస్తువులను మనం స్థానిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న యూనిట్లలో ఉత్పత్తి చేస్తే ప్రామాణికం గానీ, ధరలోగానీ పోటీపడలేం. ఈ వాస్తవాన్ని రవిలాంటివారు గుర్తించాలి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 27.
వీటిల్లో పెట్టుబడులు పెట్టటానికి బహుళజాతి సంస్థలు ఆసక్తి చూపిస్తాయా? ఎందుకు?
జవాబు:
ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి స్వంతంగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా మార్గాల ఏర్పాటు వంటి అంశాలలో బహుళ జాతి సంస్థలు తమ పరిశ్రమల వరకు మాత్రమే పరిమితమవుతాయి. విద్యుత్, రవాణా మార్గాలు వంటివి ప్రఖ్యాత రంగంలో ఉన్నాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 28.
ఇతర కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

కంపెనీలు బహుళ జాతి సంస్థలు
1. 20వ శతాబ్దం మధ్య భాగం వరకు జరిగిన పారిశ్రామికీకరణ, వాణిజ్యం, ఉత్పత్తి. 1. 20వ శతాబ్దం రెండో అర్ధభాగం నుండి జరిగిన పారిశ్రామికీకరణ, వాణిజ్యం, ఉత్పత్తి.
2. మనదేశంలో పరిశ్రమలను నెలకొల్పి ఉత్పత్తి చేసేవారు. 2. ఒకటి కంటే ఎక్కువ దేశాలలో కంపెనీలు స్థాపించి ఉత్పత్తి చేయటం.
3. విడిభాగాల తయారీ నుండి ఉత్పత్తి తుదిరూపం వరకు ఒకే చోట జరిగేది. 3. విడిభాగాలు ఒక దేశంలో, అసెంబ్లింగ్ మరో దేశంలో, మార్కెటింగ్ వేరు వేరు దేశాలలో నిర్వహిస్తున్నారు.
4. శ్రామికులు నుండి సమ్మెలు, ఆందోళనలు వంటి సమస్యలు ఎదుర్కొనే వారు. 4. అవసరమైతే సమస్యాత్మక ప్రాంతంలో యూనిట్ మూసివేసి ఈ వేరే ప్రాంతానికి తరలిస్తారు.
5. మార్కెట్ పరిధి తక్కువ. 5. మార్కెట్ కు పరిధిలేదు. విశ్వవ్యాప్తం.
6. ఉద్యోగావకాశాలు తక్కువ. 6. బహువిధ ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 29.
ఇటీవలి కాలంలో భారతదేశం నుంచి చైనా ఉక్కును దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతులు వీటిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పండి :
అ) చైనాలోని ఉక్కు కర్మాగారాలు,
ఆ) భారతదేశంలోని ఉక్కు కర్మాగారాలు,
ఇ) చైనాలో ఇతర పారిశ్రామిక వస్తువులు తయారుచేయటానికి ఉక్కును కొనుగోలు చేసే పరిశ్రమలు
జవాబు:
భారతదేశ ఉక్కు తయారీదారులు చైనాకు, ఉక్కు మరియు ముడి సరకులను ఎగుమతి చేయడం ప్రారంభించారు. చైనాలోని కొనుగోలుదారులు ఇప్పుడు చైనా ఉక్కు మరియు భారతదేశ ఉక్కులలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవలసి వచ్చింది. చౌకధరల కారణంగా భారతదేశ ఉక్కు చైనాలో బాగా ప్రాచుర్యం పొందింది. అందువలన చైనా ఉక్కు -స్థానంలో భారతదేశ ఉక్కును వాడటం జరుగుతోంది. ఇది భారతీయ ఉక్కు తయారీదారులకు తమ వాణిజ్యం విస్తరింపచేసుకొనేందుకు అవకాశం కల్పించింది. అయితే చైనా ఉక్కు తయారీదారులు అందుకు వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొన్నారు. పోటీ కారణంగా కొందరు ఉక్కు తయారీదారులు సృజనాత్మకతతో అభివృద్ధి సాధించగా మరికొందరు చతికిలపడ్డారు.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 30.
ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి విధ్వంసం కావచ్చని మనం ఇదివరకే చదివాం. ఆర్థిక మండళ్లను నెలకొల్పటాన్ని భారతదేశంలోని కొంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వీళ్లు ఎవరో, ఎందుకు వాటిని వ్యతిరేకిస్తున్నారో తెల్పండి.
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలుల ఏర్పాటును అనేక వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు.

కారణాలు:

  1. ఇది పెట్టుబడి వ్యవస్థను సమర్ధిస్తుంది. అందుచే సామ్యవాదులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
  2. దేశీయ కంపెనీలను దెబ్బతీస్తుంది. కాబట్టి స్థానిక వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.
  3. విదేశీ సంస్కృతులను ప్రోత్సహిస్తుంది. అందుచే సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.
  4. కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి. అందుచే కార్మికులు వ్యతిరేకిస్తున్నారు.
  5. స్థానికులకు ఉద్యోగావకాశాలు నామమాత్రం. అందుచే స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
  6. వీటికి కేటాయించి భూములు సాధారణ రైతులు, బడుగువర్గాలకు చెందినవి కావటంతో ఈ వర్గాలు భూమిలేని వారై కూలీలుగా మారిపోతున్నారు. అందుచే వీరు వ్యతిరేకిస్తున్నారు.
  7. ప్రధానంగా వీరు పెట్టే పరిశ్రమలు పర్యావరణ నాశనం చేస్తున్నాయి. అందుచే ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 31.
భారతదేశ చిన్న ఉత్పత్తిదారులు మార్కెట్లో పోటీకి తట్టుకోవాలంటే మూడు అవసరాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు పేర్కొన్నాయి :
అ) మెరుగైన రోడ్లు, విద్యుత్తు, నీళ్లు, ముడిసరుకులు, మార్కెటింగ్, ఇన్ఫమేషన్ నెట్వర్క్
ఆ) సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి, ఆధునికీకరణ,
ఇ) తక్కువ వడ్డీకి సకాలంలో రుణాల అందుబాటు. ఈ మూడు అంశాలు భారతీయ ఉత్పత్తిదారులకు ఎలా సహాయపడతాయో వివరించండి.
జవాబు:
భారతదేశ చిన్న ఉత్పత్తిదారులు మార్కెట్లో పోటీని తట్టుకోవాలంటే వారికి కొన్ని కనీస సదుపాయాలు కల్పించాలి. ముడి సరుకులు వినియోగానికి గల అవరోధాలను తొలగించి అందుబాటులోకి తేవాలి. వీటిని తమ పరిశ్రమలోకి తేవడానికి, ఉత్పత్తులను సమీప ప్రధాన నగరాలు, ఓడరేవులు, రైల్వేస్టేషన్లకు చేర్చడానికి రోడ్డు మార్గాలను విస్తరించాలి. ఉత్పత్తికి కావలసిన నిరంతర నీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలి. మార్కెటింగ్ చేయడానికి కావలసిన ప్రోత్సాహకాలు అందజేయాలి. అన్ని రంగాలకు చెందిన ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్ సదుపాయాలు అందుబాటులోకి తేవాలి. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, ఇవి తమ పరిశ్రమ ఆధునికీకరణకు ఏ విధంగా తోడ్పడగలవో సూచననివ్వగల సాంకేతిక నిపుణుల సహకారం అందివ్వాలి. బహుళ జాతి సంస్థల పోటీని తట్టుకొనే విధంగా పరిశ్రమలను ఆధునికీకరించే వీలుగా తక్కువ వడ్డీకి సకాలంలో రుణాలను అందజేయాలి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 32.
ప్రభుత్వం తీసుకోగల ఇతర చర్యల గురించి ఆలోచించండి. తరగతిలో చర్చించండి.
జవాబు:
ప్రభుత్వ విధానాలు ధనికులు, అధికారం ఉన్న వాళ్ళవే కాక దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి. ప్రభుత్వం చేపట్టగలిగిన కొన్ని చర్యల గురించి మీరు తెలుసుకున్నారు. ఉదాహరణకు కార్మిక చట్టాలు సరిగా అమలు అయ్యేలా చూసి కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి. చిన్న ఉత్పత్తిదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకుని పోటీపడగల శక్తి వచ్చేంతవరకు వాళ్లకు సహాయపడాలి. అవసరమైతే ప్రభుత్వం వాణిజ్య, పెట్టుబడి అవరోధాలను ఉపయోగించుకోవచ్చు. మరింత న్యాయపూరిత నియమాల కోసం ప్రపంచ వాణిజ్య సంస్థతో సంప్రదింపులు జరుపవచ్చు. ఇవే ఆసక్తులు ఉన్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో ‘కలసి, ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందిన దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

SCERT AP 10th Class Social Study Material Pdf 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Studies 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భారతదేశంలోని ప్రతి గ్రామాన్ని ప్రతి పదేళ్ళకు ఒకసారి జనాభా గణనలో సర్వేచేసి కింద ఇచ్చిన విధంగా వివరాలను పొందుపరుస్తారు. రాంపురానికి సంబంధించిన సమాచారం ఆధారంగా కింది వివరాలను నింపండి. (AS3)
అ. ఎక్కడ ఉంది (ఉనికి) :
ఆ. గ్రామ మొత్తం విస్తీర్ణం :
ఇ. భూ వినియోగం హెక్టార్లలో :
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 1
జవాబు:
అ. ఎక్కడ ఉంది (ఉనికి) :
పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రునేలల్లో రాంపురం, ఉంది.

ఆ. గ్రామ మొత్తం విస్తీర్ణం : 290 హెక్టార్లు

ఇ. భూ వినియోగం హెక్టార్లలో : సాగులో ఉన్న భూమి.

ప్రశ్న 2.
రాంపురంలోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలీ ఎందుకు లభిస్తోంది? (AS1)
జవాబు:
రాంపురంలో పనికోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది, కాబట్టి తక్కువ కూలీకైనా పనిచేయ్యటానికి ప్రజలు సిద్ధపడతారు. పెద్దరైతులు ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, పంటకోత యంత్రాలపై ఆధారపడటం పెరగటంతో గ్రామీణ “ప్రాంతాలలో కూలీలకు లభించే పని దినాలు తగ్గిపోతున్నాయి. అందుచే రాంపురంలోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలీ లభిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 3.
మీ ప్రాంతంలోని ఇద్దరు కూలీలతో మాట్లాడండి. ఇందుకు వ్యవసాయ కూలీలనుగానీ, భవన నిర్మాణంలో పని చేసేవాళ్ళనుగానీ ఎంచుకోండి. వాళ్ళకు ఎంత కూలీ లభిస్తోంది? వాళ్ళకు నగదు రూపంలో చెల్లిస్తారా, వస్తు రూపంలోనా? వాళ్ళకు క్రమం తప్పకుండా పని దొరుకుతుందా? వాళ్ళు అప్పుల్లో ఉన్నారా? (AS3)
జవాబు:
మా ప్రాంతంలో భవన నిర్మాణ కూలీలకు రోజుకు రూ. 300/- లభిస్తుంది. దీనిని నగదు రూపంలో చెల్లిస్తారు. వీరికి సుమారుగా క్రమం తప్పకుండా పని దొరుకుతుంది. మా ప్రాంతంలో కూలీ పనిచేసే ప్రతివారికి అప్పు ఉంటుంది.

ప్రశ్న 4.
ఒకే విస్తీర్ణం ఉన్న భూమి నుంచి ఉత్పత్తిని పెంచటానికి ఉన్న వివిధ పద్ధతులు ఏమిటి ? కొన్ని ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
ఒకే విస్తీర్ణంలో ఉన్న భూమి నుంచి ఉత్పత్తిని పెంచడానికి ఉన్న వివిధ పద్ధతులు :

  1. బహుల పంటల సాగు విధానంలో నిరంతరం పంటలు పండించడం.
  2. ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉండేటట్లు సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడం.
  3. భూమి సారాన్ని పోగొట్టకుండా ఉండేందుకు పంట మార్పిడి విధానం అమలు చేయటం.
  4. అధిక దిగుబడినిచ్చే వంగడాలు వినియోగం, సస్యరక్షణ చర్యలు చేపట్టడం.
  5. అనువైన చోట అంతర్ పంట సాగు చేయటం.

ప్రశ్న 5.
మధ్యతరగతి, పెద్ద రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి ఎలా సమకూరుతుంది? చిన్న రైతులకూ, వీళ్ళకు మధ్య ఉన్న తేడా ఏమిటి? (AS1)
జవాబు:
మధ్య తరగతి, పెద్ద రైతులకు వ్యవసాయంలో మిగులు ఉంటుంది. దీనిని తదుపరి పంటలకు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు కొనుగోలుకు ఖర్చు చేస్తారు. వీరు చిన్న రైతులకు వడ్డీకి అప్పులు యివ్వడం, ట్రాక్టర్లు అద్దెకు యివ్వడం, వ్యాపారాలు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతారు. అందుచే వీరికి పెట్టుబడి ఓ సమస్య కాదు. చిన్న రైతులు పండించే పంట తమ కుటుంబ అవసరాలకే సరిపోతుంది. అందుచే వీరు పెట్టుబడి కోసం అప్పులు చేస్తుంటారు.

ప్రశ్న 6.
ఏ షరతుల మీద తేజ్ పాల్ నుండి సవిత అప్పు పొందింది? తక్కువ వడ్డీకి బ్యాంకు నుంచి రుణం లభిస్తే సవిత పరిస్థితి . భిన్నంగా ఉండేదా? (AS1)
జవాబు:
సవిత అనే చిన్న రైతు గోధుమ పంట పండించడానికి పెట్టుబడికై తేజ్ పాల్ అనే రైతు వద్ద నాలుగు నెలల్లో తిరిగి యివ్వాలన్న షరతు మీద 36% వడ్డీకి 6000 రూపాయలు అప్పు తీసుకుంది. కోత సమయంలో రోజుకు వంద రూపాయల కూలీకి తేజ్ పాల్ పొలంలో పనిచేయడానికి కూడా ఈమె అంగీకరించింది. తక్కువ వడ్డీకి రుణం లభిస్తే సవిత తన మిగులు పంట నుండి అప్పు తీర్చేది. తాను చేసిన పనికి న్యాయమైన కూలీ లభించేది.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 7.
మీ ప్రాంతంలోని పెద్దవాళ్ళతో మాట్లాడి గత 30 సంవత్సరాలలో సాగునీటి విధానాలలోనూ, వ్యవసాయ పద్ధతులలోనూ వచ్చిన మార్పుల గురించి ఒక నివేదిక రాయండి. (AS3)
జవాబు:
గత 30 సంవత్సరాలుగా సాగునీటి విధానంలో కొత్తగా కాలువలు, చెరువులు సమకూరలేదు. అనేక వ్యవసాయ చెరువులు ఆక్రమణలకు గురై, మరమ్మతులు లేక నిరుపయోగంగా మారాయి. చెరువులలోకి రావలసిన వర్షపు నీరు రావలసిన మార్గాలు గృహ నిర్మాణాలు, రహదారుల నిర్మాణం మూలంగా మూతపడ్డాయి. భూగర్భ జలాలు తగ్గడంతో బోరుబావులు లోతుగా తీయవలసి వస్తోంది. దగ్గర దగ్గరగా బోరుబావులు త్రవ్యడంతో నీరు అందుబాటులోకి రావటం లేదు. నిరంతర విద్యుత్ కోతల మూలంగా సాగునీరు సరిగ్గా అందటంలేదు. అంతరాష్ట్ర జల వివాదాల కారణంగా వర్షాభావ స్థితిలో ఆనకట్టలు నిండక కాలువలు’ ప్రవహింపక కాలువ చివరి భూములకు సాగునీరు అందడం లేదు.

కొత్త రకం వంగడాలు, క్రిమి సంహారక మందులు రావటంతో ఉత్పత్తి పెరిగింది. కానీ వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం, వ్యవసాయేతర పనులలో ఆదాయం బాగుండటంతో చిన్న చిన్న రైతులు వ్యవసాయంపై శ్రద్ధ తగ్గించారు.

ప్రశ్న 8.
మీ ప్రాంతంలోని ప్రధాన వ్యవసాయేతర పనులు ఏమిటి? ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎంచుకుని ఒక చిన్న నివేదిక తయారు చేయండి. (AS3)
జవాబు:
మా ప్రాంతం పట్టణానికి సమీపంలో ఉన్నందున నిర్మాణ కార్యక్రమాలలో ఎక్కువ మంది శ్రామికులు పనిచేస్తున్నారు. చద్దన్నం తిని మధ్యాహ్న భోజనం కేరేజిలో పట్టుకొని కూలీలందరూ ఆటోలలో బయలుదేరి గుత్తేదారు సూచించిన స్థలానికి ఉదయం 9 గంటల భోజన విరామం తరువాత 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తారు. ఇంటికి కావలసిన సరుకులను కొనుగోలుచేసి తిరిగి శ్రామికులందరూ ఆటోలో ఇంటికి చేరుతారు. రోజు కూలీ రూ. 300/- చెల్లిస్తున్నారు. ఈ కార్మికులు ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాల లబ్ధిదారులుగా స్వగృహాన్ని ఏర్పరచుకొని పిల్లలను తమ గ్రామంలోని ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. ఈ శ్రామికులలో చాలా మంది అక్షరాస్యులు. మహిళలు కూడా పురుషులతో సమానంగానే పనిచేస్తారు.

ప్రశ్న 9.
ఉత్పత్తికి భూమి కాకుండా శ్రమ కొరతగా ఉండే పరిస్థితిని ఊహించుకోండి. అప్పుడు రాంపురం కథ ఇందుకు భిన్నంగా ఉండేదా? ఎలా? తరగతిలో చర్చించండి. (AS1)
జవాబు:
ఉత్పత్తికి భూమి కాకుండా శ్రమ కొరతగా ఉంటే రాంపురం కథ ఇందుకు భిన్నంగా ఉండేది. వ్యవసాయ కూలీలకు ఇప్పటికంటే ఎక్కువ కూలీ లభించేది. చిన్న రైతులు తమ మిగులు కాలంలో వ్యవసాయకూలీ ద్వారా ఎక్కువ ఆదాయం పొంది దానిని తమ వ్యవసాయానికి పెట్టుబడిగా పెట్టేవారు. దీంతో పెద్దరైతుల నుండి అధిక వడ్డీలకు అప్పులు తేవడం, వారు చెప్పిన రేటుకు పనిచేయడం లాంటి సమస్యల నుండి బయటపడేవారు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 10.
గోసాయిపూర్, మణాలి అనేవి ఉత్తర బీహార్‌లోని రెండు గ్రామాలు. రెండు గ్రామాలలోని 860 కుటుంబాల నుంచి 250 కంటే ఎక్కువ మగవాళ్ళు పంజాబ్ లేదా హర్యానా గ్రామీణ ప్రాంతాలలో, లేదా ఢిల్లీ, ముంబయి, సూరత్, హైదరాబాదు, నాగపూర్ వంటి నగరాలలో పనిచేస్తున్నారు. ఇలా వలస వెళ్ళటం భారతదేశమంతటా గ్రామాలలో సాధారణమే. ప్రజలు ఎందుకు వలస వెళతారు? (గత అధ్యాయానికి మీ ఊహను జోడించి) గోసాయిపుర్, మజాలి గ్రామల నుంచి వలస వెళ్ళినవాళ్లు ఆయా ప్రాంతాలలో ఏ పని చేస్తారో రాయండి. (AS4)
జవాబు:
ఉత్తర బీహార్‌లోని గోసాయిపూర్, మజాలి గ్రామాల నుండి వలసలు వెళ్ళుటకు బహుశా క్రింది కారణాలు కావచ్చును.

  1. ఆ గ్రామాలలో తగినంత పని దొరకపోవడం.
  2. పని దొరికినా తగినంత కూలీ లభించక పోవటం.
  3. సంవత్సరంలో ఎక్కువ భాగం పనిలేకుండా ఉండటం.
  4. గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకాకపోవటం.
  5. ప్రజలు అధిక ఆదాయాలు పొందాలనుకోవటం తద్వారా జీవన ప్రమాణాలను పెంచుకోవాలని ఆశించండం.
  6. సమీప పట్టణాలలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేకపోవటం.

ఢిల్లీ, ముంబయి, సూరత్, హైదరాబాదు, నాగపూర్ వంటి నగరాల్లో వలస వెళ్లేవారు చేయుపనులు.

రవాణా, నిర్మాణరంగం, పెయింటింగ్స్, వాచ్ మెన్ వంటి ఉద్యోగాలు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, గృహోపకరణాలు అమ్మటం, కర్మాగారాలలో పనిచేయడం, కార్పెంటరీ, బొంతలు కుట్టడం వంటివి.

ప్రశ్న 11.
పట్టణ ప్రాంతాలలో వస్తువుల ఉత్పత్తికి కూడా భూమి అవసరం. గ్రామీణ ప్రాంతంలో భూ వినియోగానికీ, పట్టణ ప్రాంతాలలో భూ వినియోగానికి మధ్య గల తేడా ఏమిటి? (AS1)
జవాబు:

పట్టణ ప్రాంతంలో భూ వినియోగం గ్రామీణ ప్రాంతంలో భూ వినియోగం
1) పట్టణ ప్రాంతాలలో వస్తువుల ఉత్పత్తికి వినియోగించే భూమి రేట్లు అత్యధికం. 1) గ్రామీణ ప్రాంతాలలో భూముల రేట్లు సాధారణంగా ఉంటాయి.
2) పట్టణ ప్రాంతాలలో స్వంత భూమి లేకున్న అద్దెకు/లీజుకు భూమి తీసుకొని వస్తు ఉత్పత్తి చేస్తారు. 2) గ్రామీణ ప్రాంతాలలో సాధారణంగా భూమి కొనుగోలు చేసి వినియోగిస్తారు.
3) పరిమిత స్థలంలో ప్రణాళికాబద్ధంగా వస్తూత్పత్తి జరుపుకోవాలి. 3) అవసరమైన స్థలం లభిస్తుంది.
4) పట్టణ ప్రాంతాల్లో భూమి గృహ నిర్మాణాలకు, వ్యాపార సంబంధ నిర్మాణాలకు వినియోగిస్తారు. 4) గ్రామీణ ప్రాంతాలల్లో భూమి పంటలు పండించడానికి, తోటల పెంపకానికి వినియోగిస్తారు.

ప్రశ్న 12.
ఉత్పత్తి ప్రక్రియలో “భూమి” అన్న దాని అర్థం మరొకసారి చదవండి. వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తి ప్రక్రియలో భూమి ముఖ్యమైన అవసరంగా ఉన్న మరొక మూడు ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తి ప్రక్రియలో భూమి ముఖ్యమైన అవసరం ఉన్న వాటికి ఉదాహరణలు.

  1. పౌల్టీల ఏర్పాటు నిర్వహణ.
  2. ఇటుక బట్టీల ఏర్పాటు, విక్రయం.
  3. ఈమూ పక్షుల పెంపక కేంద్రం ఏర్పాటు.
  4. ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు.
  5. కుండీల తయారీ.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 13.
ఉత్పత్తికి, ప్రత్యేకించి వ్యవసాయానికి అవసరమైన నీరు ఒక సహజ వనరు. ఇప్పుడు నీటిని పొందటానికి దీని వినియోగానికి , ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతోంది. ఈ వాక్యాలను వివరించండి. (AS2)
జవాబు:
ఉత్పత్తికి, ప్రత్యేకించి వ్యవసాయానికి అవసరమైన నీరు ఒక సహజ వనరు. ఇప్పుడు నీటిని పొందడానికి, దీని వినియోగానికి ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతోంది. నీరు సహజ వర్షం నుండి లభిస్తుంది. అయితే కొండలులో చెట్లు నరికివేయటం, గ్రానైట్, క్వారీలకై వాటి రూపాలే లేకుండా చేయడంతో సహజంగా పడాల్సిన వర్షాలు తుఫానులు వస్తే కానీ రావటం లేదు. వర్షాలు సకాలంలో కురవకపోవటంతో విత్తులు నాటిన నుండి పంటకోసే వరకు సాగు నీటిపైన ఆధారపడాల్సి ఉంటుంది. వర్షాలు సరిగా కురవకపోవటంతో సహజ నీటివనరులైన నదీ కాలువలు, చెరువులు, బావుల నుండి సకాలంలో సాగునీరు లభించటం లేదు. దీంతో విద్యుత్ మోటర్లుతో నడిచే బోరుబావుల ద్వారా సాగునీరు పొందవలసి వస్తోంది. భూగర్భ జలాలు లోలోతుకు పోతుండటంతో వాటి త్రవ్వకం, నిర్వహణ ఖర్చుతో కూడినదైపోయింది.

10th Class Social Studies 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ InText Questions and Answers

10th Class Social Textbook Page No.117

ప్రశ్న 1.
రాష్ట్ర లేక జిల్లా భౌగోళిక పటాలను చూసి బాగా సాగునీటి సదుపాయం ఉన్న ప్రాంతాలను గుర్తించండి. మీరు ఉంటున్న ప్రాంతం దీని కిందికి వస్తుందా?
జవాబు:
అట్లాసు చూసి సాగునీటి సదుపాయం గల ప్రాంతాలను గుర్తించగా, మేము నివాసం ఉంటున్న ప్రాంతం కూడా దీని కిందకే వచ్చింది. అనగా మా ప్రాంతం కూడా సాగునీటి సదుపాయం కలిగి ఉంది.

10th Class Social Textbook Page No.126

ప్రశ్న 2.
ఈ పనికి మిశ్రిలాలకు ఏ భౌతిక పెట్టుబడులు అవసరం అయ్యాయి?
జవాబు:
చెరకు తయారీకి మిశ్రిలాలకు బెల్లం తయారీ యూనిట్ (చెరకు రసం తీసే యంత్రం, చెరకు రసం వేడిచేసే పెద్ద పెనం, మట్టి కుండలు, షెడ్ మొదలైనవి)కు అయ్యే ఖర్చును భౌతిక పెట్టుబడిగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 3.
దీనికి శ్రమ ఎవరిద్వారా అందుతోంది?
జవాబు:
దీనికి శ్రమ కూలీల ద్వారా అందుతుంది. విద్యుత్ తో యంత్రం నడుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 4.
బెల్లాన్ని మిశ్రిలాల్ తన ఊళ్లో కాకుండా జహంగీరాబాదులోని వ్యాపారస్తులకు ఎందుకు అమ్ముతున్నాడు?
జవాబు:
మిశ్రిలాల్ గ్రామంలో బెల్లం పెద్ద మొత్తంలో ఒకేసారి కొనేవారుండరు. అందుచే ఆయన జహంగీరాబాదులోని వ్యాపారులకు బెల్లం అమ్ముతున్నాడు.

ప్రశ్న 5.
ఎవరి స్థలంలో దుకాణాలను నెలకొల్పుతారు?
జవాబు:
బస్టాండుకు దగ్గరగా ఉన్న ఇళ్లల్లో కొన్ని కుటుంబాల వారు తమకున్న స్థలంలో కొంత భాగాన్ని దుకాణాలు తెరవడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
తినే వస్తువులు అమ్మే ఈ దుకాణాలలో శ్రమ ఎవరిది?
జవాబు:
కుటుంబంలోని మహిళలు, పిల్లలు.

ప్రశ్న 7.
ఇటువంటి దుకాణాలకు ఎలాంటి నిర్వహణ పెట్టుబడి అవసరం అవుతుంది?
జవాబు:
ఇలాంటి దుకాణాలు సాధారణంగా స్వయం ఉపాధితో పెట్టినవే.

ప్రశ్న 8.
భౌతిక పెట్టుబడి కిందికి వచ్చే వాటిని పేర్కొనండి.
జవాబు:
భౌతిక పెట్టుబడి కింద వచ్చేవి – పిండిమర మొదలైనవి.

ప్రశ్న 9.
మీ ప్రాంతంలో బజారులో తిరుగుతూ సరుకులు అమ్మేవాళ్లల్లో ఒకరి నుంచి వాళ్ల రోజువారీ అమ్మకాలు ఎంతో తెలుసుకోండి. ఏమైనా పొదుపు చేస్తున్నారో, లేదో ఎలా తెలుస్తుంది ? టీచరుతో చర్చించండి.
జవాబు:
మా ప్రాంతంలో బజారులో తిరుగుతూ సరుకులు అమ్మేవారు తమ ఆదాయంలో కొంత మేరకు స్వయంశక్తి సంఘాల పొదుపుల్లోనో, గ్రామాల్లో వేసే చీటీ (చిట్స్)లోనో పొదుపు చేస్తున్నారు.

10th Class Social Textbook Page No.127

ప్రశ్న 10.
కిశోర్ స్థిర పెట్టుబడి ఏమిటి ? అతడి నిర్వహణ పెట్టుబడి ఏమై ఉంటుంది?
జవాబు:
గేదె, బండి – కిశోర్ యొక్క స్థిర పెట్టుబడి. గేదె దానా, బండి మరమ్మతులు, కందెన వంటివి నిర్వహణ పెట్టుబడి.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 11.
కిశోర్ ఎన్ని ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొంటూ ఉన్నాడు?
జవాబు:
కిశోర్ పాల ఉత్పత్తి, రవాణా అనే రెండు రకాల ఉత్పత్తి కార్యకలాపాలలలో పాల్గొన్నాడు.

ప్రశ్న 12.
రాంపురంలో మెరుగైన రోడ్ల వల్ల కిశోర్ లాభపడ్డాడా?
జవాబు:
కిశోర్ తన గేదెతో నడిచే బండి సులువుగా నడపడానికి రాంపురంలోని మెరుగైన రోడ్లు ఉపయోగపడ్డాయి.

10th Class Social Textbook Page No.115

ప్రశ్న 13.
వ్యవసాయం గురించి మీకు ఏం తెలుసు ? వివిధ కాలాల్లో పంటలు ఎలా మారుతూ ఉంటాయి? వ్యవసాయం మీద ఆధారపడిన అధిక శాతం ప్రజలకు భూమి ఉందా, లేక వాళ్లు వ్యవసాయ కూలీలా?
జవాబు:
భూమి సాగుచేసి పంటలు పండించడాన్ని వ్యవసాయం అంటారు.. పంటలు కాలము, సాగునీటి సదుపాయం వంటి సౌకర్యాల ఆధారంగా పండుతాయి. ఉదా : వరి పంటకు 25°C ఉష్ణోగ్రత, మొదలలో నీరు నిలువ ఉండాలి. గోధుమ పంటకు తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. కాబట్టి కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి పంటలు మారుతుంటాయి. వ్యవసాయం మీద ఆధారపడిన వారిలో అధిక శాతం మందికి భూమిలేదు. వారంతా వ్యవసాయ కూలీలు.

10th Class Social Textbook Page No.117

ప్రశ్న 14.
కింది పట్టిక భారతదేశంలో సాగుకింద ఉన్న భూమిని మిలియన్ హెక్టార్లలో చూపిస్తుంది. పక్కన ఉన్న గ్రాఫ్ లో వీటిని పొందుపరచండి. గ్రాఫ్ ఏం తెలియచేస్తోంది? తరగతి గదిలో చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
జవాబు:
గ్రాఫ్ ను పరిశీలించగా 1950లో భారతదేశంలో గల సాగుభూమి 120 మిలియన్ హెక్టార్లు, 1960లో 130, 1970లో 110 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. అయితే గత 4 దశాబ్దాలుగా సాగుభూమి స్థిరంగా ఉండిపోయింది. ఏ మాత్రము పెరగలేదు. జనాభా మాత్రం దశాబ్దానికి దశాబ్దానికి పెరుగుతూనే ఉంది. కాబట్టి భవిష్యత్తులో తిండి గింజలు (ఆహార) కొరత ఏర్పడవచ్చు. కావునా, అందుబాటులో గల సాగుభూమికి సాగునీరందివ్వడానికి ప్రాజెక్టులను నిర్మించి బహుళ పంటల పద్ధతి అమలు చేయటం, పంట దిగుబడికి నూతన విధానాలు అమలు చేయటం వంటివి చేయాలి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 4

ప్రశ్న 15.
‘రాంపురంలో పండించిన పంటల గురించి తెలుసుకున్నారు. మీ ప్రాంతంలో పండించే పంటల ఆధారంగా కింది పట్టికను నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 5
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 6

ప్రశ్న 16.
గ్రామీణ ప్రాంతాలలో ‘బహుళ పంటలు’ సాగు చెయ్యటానికి దోహదపడే కారణాలు ఏమిటి?
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో బహుళ పంటలు సాగుచేయుటకు దోహదపడే అంశాలు :

  1. వ్యవసాయ కూలీల అందుబాటు
  2. సాగునీరు లభ్యత
  3. సారవంతమైన నేల
  4. కాలానుగుణంగా పంటలు మార్చే నేర్పుగల అనుభవనీయులైన రైతులు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Textbook Page No.119

ప్రశ్న 17.
ఈ క్రింది పటంలో చిన్న రైతులు సాగుచేసే భూమిని గుర్తించి రంగులు నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 7
పటం : ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో సాగుభూమి పంపిణీ

ప్రశ్న 18.
అనేక మంది రైతులు ఇంత చిన్న కమతాలను ఎందుకు సాగుచేస్తున్నారు?
జవాబు:
అనేక మంది చిన్న చిన్న కమతాలను సాగుచేయుటకు గల కారణాలు.

  1. రైతుగా సామాజిక హోదా.
  2. తన పొలంలో పండే పంట తింటున్నాననే తృప్తి.
  3. ఈ భూమి రైతుకు పరపతినేర్పాటు చేస్తుంది.
  4. ఈ చిన్న కమతాలలో రెండు, మూడవ పంటలుగా వాణిజ్య పంటలు వేసి ఆర్థికంగా అవసరాలు తీర్చుకుంటాడు.
  5. చిన్న కమతాలలో వ్యవసాయం చేసుకుంటూ, మిగతా సమయాలలో ఇతరుల పనికి కూలీకి వెళ్లటం, వ్యాపారాలు చేయటం వంటివి చేస్తారు.

10th Class Social Textbook Page No.119

ప్రశ్న 19.
భారతదేశంలో రైతులు, వాళ్లు సాగుచేసే భూముల వివరాలు కింద ఇచ్చిన పట్టికలోనూ, ‘పై’ చార్టులోనూ ఉన్నాయి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 8
గమనిక : ఈ గణాంకాలు రైతులు సాగుచేస్తున్న భూమి వివరాలను తెలియజేస్తున్నాయి. ఈ భూమి సొంతం కావచ్చు లేదా కౌలుకు తీసుకున్నది కావచ్చు.
1) బాణం గుర్తులు ఏమి సూచిస్తున్నాయి?
2) భారతదేశంలో సాగుభూమి పంపిణీలో అసమానతలు ఉన్నాయని మీరు అంగీకరిస్తారా?
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 9
జవాబు:

  1. భారతదేశంలో సాగుభూమి పంపిణీలో అసమానతలను బాణం గుర్తులు సూచిస్తున్నాయి.
  2. రైతు జనాభాలో కేవలం 13% గల మధ్య తరగతి, భూస్వాముల చేతిలో మొత్తం భూమిలో సగం కంటే ఎక్కువ అనగా 52% భూమి ఉంది. 87%, చిన్న రైతుల వద్ద కేవలం 48% భూమి మాత్రమే ఉంది. అనగా దేశంలోని అత్యధిక సాగుభూమి కొద్ది మంది రైతుల చేతులలోనే ఉంది.

10th Class Social Textbook Page No.120

ప్రశ్న 20.
దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా ఎందుకు ఉన్నారు?
జవాబు:
దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా ఉండుటకు కారణాలు :
రాంపురంలో పనికోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది. కాబట్టి తక్కువ కూలీకైనా పని చేయుటకు ప్రజలు సిద్ధపడుతున్నారు. అందుచే దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా మిగిలిపోతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Textbook Page No.121

ప్రశ్న 21.
తమ కోసం వ్యవసాయ కూలీలు పనిచెయ్యటానికి రాంపురంలోని మధ్యతరగతి, పెద్ద రైతులు ఏం చేస్తారు? మీ ప్రాంతంలోని పరిస్థితిని దీనితో పోల్చండి.
జవాబు:
తమ కోసం వ్యవసాయ కూలీలు పనిచెయ్యటానికి రాంపురంలో మధ్యతరగతి పెద్ద రైతులు పేదవారికి, చిన్న రైతులకు అప్పులిచ్చి తామిచ్చే కూలీకి తమ పొలాల్లో తప్పనిసరిగా పనిచేయాలనే నిబంధన విధిస్తారు. మా ప్రాంతంలో అటువంటి పరిస్థితులు లేవు. వ్యవసాయేతర పనులు లభించడంతో వ్యవసాయ పనులపైనే ఆధారపడవలసిన అవసరం లేదు.

10th Class Social Textbook Page No.121

ప్రశ్న 22.
కింది పట్టికను నింపండి :

ఉత్పత్తి ప్రక్రియలో శ్రమ ఒక్కొక్కదానికి మూడు భిన్నమైన ఉదాహరణలు ఇవ్వండి.
యజమాని / కుటుంబం కూడా అవసరమైన పని చేస్తారు.
పని చెయ్యటానికి యజమాని కూలీలను నియమిస్తాడు.

జవాబు:

ఉత్పత్తి ప్రక్రియలో శ్రమ ఒక్కొక్కదానికి మూడు భిన్నమైన ఉదాహరణలు ఇవ్వండి.
యజమాని / కుటుంబం కూడా అవసరమైన పని చేస్తారు. తమ స్వంత పొలంలో వ్యవసాయ పనులు. ఇంటి మైనర్ రిపేర్లు, పంటలేని సమయంలో పొలాన్ని సిద్ధం చేయటం.
పని చెయ్యటానికి యజమాని కూలీలను నియమిస్తాడు. పొలానికి ఎరువు వేయించటం, పంట కాలంలో పనులు – ఉడుపు, కలుపుతీత, గొప్పు, కోత వంటివి. పొలానికి సాగునీరు రావలసిన కాలువలు త్రవ్వించుట మొదలైనవి.

ప్రశ్న 23.
మీ ప్రాంతంలో వస్తువుల, సేవల ఉత్పత్తిలో ఏ ఏ రకాలుగా శ్రమను పొందుతారు?
జవాబు:
మా ప్రాంతంలో వస్తువుల, సేవల ఉత్పత్తిలో శ్రమను పొందు రకాలు:

  1. పనిచేసే కూలీలు
  2. పంటను సమీప మార్కెట్ కు తరలించే వాహనాల డ్రైవర్లుగా
  3. వాహనాలు నుంచి సరుకు దించే కూలీలుగా
  4. విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులు
  5. పేపరు మిల్లుల ఏజంట్లుగా

10th Class Social Textbook Page No.122

ప్రశ్న 24.
క్రింది పట్టికను పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 10

1) పైన ఇచ్చిన కూలిరేట్లతో మీ ప్రాంతంలో ఏదైనా పనికి అమలులో ఉన్న కూలిరేట్లను పోల్చండి.
జవాబు:
మా ప్రాంతంలో రోజువారీ కూలీలు పైన పేర్కొన్న విధంగానే ఉన్నాయి. పురుషులకు కనీస కూలీ రూ. 200 కాగా, స్త్రీలకు రూ. 150. దత్తాంశంలో చాలా వ్యత్యాసాలున్నాయి.

2) కనీస కూలీరేట్ల గురించి తెలుసుకొని వాటితో పోల్చండి.
జవాబు:
1) నూర్పిడి చేసినందుకు స్త్రీలకు (పైన పేర్కొన్న విధంగా) కనీస కూలీ రూ. 118 లభిస్తుంది.
2) కాగా మా ప్రాంతంలో నూర్పిడి చేసినందుకు స్త్రీలకు రూ. 200ల కనీస కూలీ ఇస్తున్నారు.

3) ఒక పనికి ఆడవాళ్ల కంటే మగవాళ్లకు ఎక్కువ కూలీ ఎందుకు లభిస్తోంది? చర్చించండి.
జవాబు:
ఆడవారికంటే మగవారు ఎక్కువ పనిచేయగలరనే భావన వలన ఒక పనికి ఆడవారికంటే మగవారికి ఎక్కువ కూలి ఇస్తున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Textbook Page No.126

ప్రశ్న 25.
మిశ్రిలాల్ తన లాభాన్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నాడు? అతడికి నష్టాలు వచ్చే సందర్భాలు ఏమిటో ఆలోచించండి.
జవాబు:
మిశ్రిలాల్ బెల్లం తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నాడు. పెద్ద ఎత్తున చెరుకు కొని యంత్రాల సంఖ్య పెంచడం, శ్రామికులను వినియోగించడం ద్వారా ఆయన బెల్లం ఉత్పత్తిని పెంచి అధిక లాభాలను ఆర్జించగలడు. అయితే వ్యాపారంలో పోటీ, మార్కెట్ రిల మూలంగా నష్టాలు కూడా రావచ్చు.

10th Class Social Textbook Page No.124

ప్రశ్న 26.
ముగ్గురు రైతులను తీసుకోండి. ముగ్గురూ గోధుమలు పండించారు. అయితే వాళ్ళు ఉత్పత్తి చేసిన దానిలో తేడా ఉంది (రెండవ నిలువు వరుస). వివిధ రైతులు ఎదుర్కొనే పరిస్థితిని విశ్లేషించటానికి కొన్ని అంశాలు అందరికీ సమానమని అనుకోవాలి. తేలికగా లెక్క కట్టటానికి ఈ అంశాలను అనుకుందాం :
1) ప్రతి రైతు కుటుంబం వినియోగించే గోధుమల మొత్తం సమానం (మూడవ నిలువు వరుస).
2) ఈ సంవత్సరంలో మిగిలిన గోధుమనంతా వచ్చే సంవత్సరం విత్తనంగా రైతులందరూ ఉపయోగించుకుంటారు. అందుకు వాళ్లకు తగినంత భూమి ఉంది.
3) అందరికి ఉపయోగించిన విత్తనం కంటే రెట్టింపు దిగుబడి వస్తుందనుకుందాం. ఉత్పత్తిలో ఎటువంటి అకస్మాత్తు నష్టాలు లేవు.
పట్టికను పూర్తి చేయండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 11

• మూడు సంవత్సరాలలో ముగ్గురు రైతుల గోధుమ ఉత్పత్తిని పోల్చండి.
• 3వ రైతు పరిస్థితి 3వ సంవత్సరంలో ఏమవుతుంది ? అతడు ఉత్పత్తిని కొనసాగించగలడా ? ఉత్పత్తిని కొనసాగించటానికి అతడు ఏం చెయ్యాలి?
జవాబు:
1వ రైతు
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 12 AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 13

వినియోగం కంటే ఉత్పత్తి రెట్టింపుతో ప్రారంభించిన 2వ రైతు మిగులునే వచ్చే సంవత్సరానికి పెట్టుబడిగా పెట్టి పంట కొనసాగిస్తున్నాడు.

వినియోగానికి రెట్టింపు కంటే ఎక్కువ ఉత్పత్తితో ప్రారంభించిన 1వ రైతు పెట్టుబడిని పెంచుకుంటూ మిగులును పెంచుకుంటున్నాడు.

3వ రైతుకు 2వ సంవత్సరానికే మిగులు లేకపోవడంతో 3వ సంవత్సరం ఉత్పత్తి సాధ్యంకాని స్థితి నెలకొంది. కాబట్టి 3వ రైతు సాగుభూమిని పెంచి ఉత్పత్తిని పెంచుకోవలసి ఉంది.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

SCERT AP 10th Class Social Study Material Pdf 8th Lesson ప్రజలు – వలసలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 8th Lesson ప్రజలు – వలసలు

10th Class Social Studies 8th Lesson ప్రజలు – వలసలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాటితో ఒక పట్టిక తయారుచేసి వలస కార్మికుల వివిధ ఉదాహరణలను క్రోడీకరించండి. (AS3)
1) వలస కార్మికులు
2) వలసల కారణాలు
3) వలస వెళ్లిన వాళ్ల జీవన ప్రమాణాలు
4) వాళ్ల జీవితాల ఆర్థిక స్థితిపై ప్రభావం
5) వాళ్లు వలస వచ్చిన ప్రాంత ప్రజల జీవితాల ఆర్థిక స్థితిపై ప్రభావం.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 1

ప్రశ్న 2.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసల మధ్య పోలికలు, తేడాలు రాయండి. (AS1)
జవాబు:

గ్రామీణ ప్రాంతం నుండి గ్రామీణ ప్రాంతానికి వలసలు గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతానికి వలసలు
1) భౌగోళికంగా పెద్దగా తేడా ఉండదు. అందుచే కనీస సదుపాయాలతో సర్దుకుపోతారు. 1) మురికివాడలు, త్రాగునీరు, విద్యుత్ సదుపాయాలు లేని ప్రాంతాలలో నివసించవలసి ఉంటుంది.
2) సంవత్సరంలో కొంతకాలం మాత్రమే ఉపాధి లభిస్తుంది. 2) వేర్వేరు ఉపాధి అవకాశాలుండటంతో ఎక్కువ కాలం పట్టణాలలో ఉపాధి పొందవచ్చు.
3) పిల్లల చదువులకు ఆటంకం కలుగవచ్చు. 3) పిల్లలను చదివించుకొనేందుకు పాఠశాలలు అందు బాటులో ఉంటాయి.
4) అవ్యవస్థీకృత రంగానికే పరిమితం. 4) నైపుణ్యం, కృషి ఉంటే వ్యవస్థీకృత రంగంలో అవకాశాలు లభిస్తాయి.
5) కార్మికులు అసంఘటితంగా ఉన్నందున పనిగంటలు, సెలవులు, బీమా, సరియైన వేతనాలు లభించవు. 5) పట్టణ వాతావరణంలో కార్మికులు సంఘటితమై పరిమిత పనిగంటలు, కనీస సెలవులు, మెరుగైన వేతనాలు (కూలీ) వంటివి పొందుతారు.
6) సామాజిక స్థాయిలో మార్పుండదు. 6) సామాజిక స్థాయి పెరుగుతుంది.
7) జీవనం గడపడానికే ప్రాధాన్యత. 7) కొత్త నైపుణ్యాలను నేర్చుకొని జీవనాన్ని మెరుగు పరచుకోవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 3.
వీటిల్లో దేనిని కాలానుగుణ వలసగా పరిగణించవచ్చు? ఎందుకు? (AS1)
అ) వివాహం కారణంగా తల్లిదండ్రుల ఇంటినుంచి భర్త ఇంటికి స్త్రీ వెళ్లటం.
ఆ) తమిళనాడులో పసుపుదుంప తీయటానికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి మూడు నెలలపాటు వెళ్లటం.
ఇ) సంవత్సరంలో ఆరునెలల కోసం ఢిల్లీలో రిక్షా తోలటానికి బీహారు గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్లటం.
ఈ) హైదరాబాదులో ఇళ్లల్లో పనిచెయ్యటానికి నల్గొండ జిల్లా నుంచి ఆడవాళ్లు రావటం.
జవాబు:
(ఆ) దీనిని మనం కాలానుగుణమైన వలసగా పరిగణించవచ్చు. ఎందువలననగా వీరి వలస కాలం ఆరు నెలలలోపు ఉండుటే.

ప్రశ్న 4.
వలస వెళ్లిన వాళ్లు ఆ ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తారా / సమస్యలకు కారణం అవుతారా? మీ, సమాధానానికి కారణాలు ఇవ్వండి. (AS4)
జవాబు:
వలస వెళ్లిన వారు ఆ ప్రాంతాలలో సమస్యలు సృష్టించరు. సమస్యలకు కారణం అవ్వరు. ఎందువలననగా వీరు కేవలం ఉపాధి కోసం వలస వెళ్లిన వారు. అయితే శాశ్వత వలసలు వెళ్లి వ్యవస్థీకృత రంగంలో స్థిరపడిన కార్మికులు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తారు. కొన్నిసార్లు ఈ పోరాటాలు ఆయా పరిశ్రమలు లాకౌట్లకు కూడా దారితీస్తాయి.

ప్రశ్న 5.
కింద వివిధ రకాల వలన ఉదాహరణలు ఉన్నాయి. వాటిని అంతర్గత, అంతర్జాతీయ వలసలుగా వర్గీకరించండి.
అ) సాంకేతిక పనివాళ్లుగా పనిచెయ్యటానికి భారతదేశం నుంచి సౌదీ అరేబియాకి వెళ్లటం.
ఆ) బీహారు నుంచి పంజాబ్ కి వెళ్లే వ్యవసాయ కూలీలు.
ఇ) ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఇటుక బట్టీలలో పనిచెయ్యటానికి వెళ్లటం.
ఈ) భారతీయ పిల్లలకు చైనీస్ భాష నేర్పటానికి చైనా నుంచి వచ్చే టీచర్లు.
జవాబు:
అ) అంతర్జాతీయ వలస
ఆ) అంతర్గత వలస
ఇ) అంతర్గత వలస
ఈ) అంతర్జాతీయ వలస

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 6.
వలస కుటుంబాలలోని అధికశాతం పిల్లలు బడి మధ్యలోనే మానేస్తారు. దీనితో మీరు ఏకీభవిస్తారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS2)
జవాబు:
వలస కుటుంబాలలోని అధికశాతం మంది పిల్లలు బడి మధ్యలోనే మానేస్తారు. దీనితో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే – వలస వెళ్లినప్పుడు తల్లిదండ్రులతో పాటు వెళ్లే చిన్నపిల్లలకు శిశు సంరక్షణ కేంద్రాలు ఉండవు. పెద్ద పిల్లలు కొత్త ప్రదేశంలో చదువు కొనసాగించే వీలు ఉండదు. వాళ్లు స్వగ్రామాలకు తిరిగి వెళ్లినప్పుడు అక్కడి పాఠశాలలు కూడా వాళ్లని మళ్లీ చేర్చుకోవు. చివరికి వాళ్లు బడికి వెళ్లటం మానేస్తారు. కుటుంబంలో కేవలం మగవాళ్లే వలసకి వెళ్లినప్పుడు కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం అంతా ఆడవాళ్ల మీద పడుతుంది. ఇటువంటి కుటుంబాలలోని ఆడపిల్లల మీద తమ్ముళ్లు, చెల్లెళ్లను, చూసుకోవాల్సిన భారం ఉండి చివరికి చాలామంది బడి మానేస్తారు.

ప్రశ్న 7.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లటం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది? (AS1)
జవాబు:
భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మూడింట ఒక వంతు కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి. కాలానుగుణంగా వలస వెళ్లే వాళ్లల్లో చాలామంది ఇంటికి డబ్బు పంపిస్తారు, లేదా మిగుల్చుకున్న డబ్బు తమతో తీసుకెళతారు. వలస వెళ్లటం వల్ల ఆస్తులు అమ్ముకోకుండా అప్పులు తీర్చటానికి, ఇతర కార్యక్రమాలకు డబ్బు సమకూరుతుంది. వలస వెళ్లిన కుటుంబాలు ఇల్లు, భూమి, వ్యవసాయ పరికరాలు, వినియోగ వస్తువులు కొనటం సాధారణంగా చూస్తూ ఉంటాం.

ప్రశ్న 8.
వృత్తి నైపుణ్యం ఉన్నవాళ్లే అభివృద్ధి చెందిన దేశాలకు ఎందుకు వలస వెళ్లగలుగుతున్నారు? నైపుణ్యం లేని కార్మికులు ఈ దేశాలకు ఎందుకు వెళ్లలేరు? (AS1)
జవాబు:
అభివృద్ధి చెందిన దేశాలకు సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తుల కొరత ఎక్కువగా ఉంది. అందువలనే భారతదేశం నుండి ఐ.టి. నిపుణులు, డాక్టర్లు, మేనేజ్మెంట్ నిపుణులు అమెరికా, కెనడా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలస వెళుతున్నారు.

ప్రశ్న 9.
పశ్చిమ ఆసియా దేశాలలో భారతదేశం నుంచి నైపుణ్యం లేని కార్మికులనే ఎందుకు కోరుకుంటున్నారు? (AS1)
జవాబు:
పశ్చిమ ఆసియా దేశాలైన సౌదీ అరేబియా, యు.ఏ.ఇ వంటి దేశాలలో భవన నిర్మాణం, మరమ్మతుల నిర్వహణ, సేవలు, రవాణా టెలికమ్యూనికేషన్ రంగాలలో కార్మికుల కొరత ఎక్కువగా ఉంది. అందుచే వీరు భారతదేశం నుండి నైపుణ్యంలేని కార్మికులనే కోరుకుంటున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 10.
మూడు రాష్ట్రాల ప్రజలు చాలా దూరంలోని పశ్చిమ ఆసియాకు ఎలా వెళ్లగలుగుతున్నారు? (AS1)
జవాబు:
పశ్చిమ ఆసియా దేశాలకు భారతదేశంలోని కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి ప్రతి ఏడాది 3 లక్షల మంది కార్మికులు తాత్కాలిక వలసలు వెళ్లి తిరిగి వస్తుంటారు. నైపుణ్యంలేని కార్మికులు మధ్యవర్తుల సహకారంతో , సుదూర ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నారు.

ప్రశ్న 11.
అంతర్గత, అంతర్జాతీయ వలసల ప్రభావాల మధ్య పోలికలను, తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
అంతర్గత వలసలు అంతర్జాతీయ వలసలు పోలికలు : రెండింటిలోను శాశ్వత, తాత్కాలిక వలసలుంటాయి. విద్య, ఉపాధి, వివాహం, మంచి ఆదాయం కొరకే రెండింటిలోను వలసలుంటాయి.
తేడాలు :

అంతర్గత వలసలు అంతర్జాతీయ వలసలు
1) మన దేశంలో ఒక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు లేదా ఇతర రాష్ట్రాలకు జరిగే వలసలు. 1) భారతదేశం నుండి ఇతర దేశాలకు జరిగే వలసలు.
2) ఆర్థిక లాభం తక్కువ. సాధారణంగా జీవనోపాధికై జరిగే వలసలు. 2) ఆర్ధికలాభం ప్రధాన లక్ష్యంగా సాగే వలసలు.
3) సాంస్కృతిక మార్పుకు అవకాశాలు తక్కువ. 3) సాంస్కృతిక మార్పుకు అవకాశాలున్నాయి.
4) కుటుంబం కొంతమేరకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. 4) వలస వెళ్లిన వారి ప్రాంతం, రాష్ట్రం కూడా వారు పంపిన ధనంతో ముందంజ వేయవచ్చు. కేరళ రాష్ట్రంలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే 40 శాతం ఎక్కువ కావటానికి కారణం వీరు ఇతర దేశాలు వలసలు పోయి ధనార్జన చేసి రాష్ట్రంలో వాటిని మదుపు పెట్టడమే.
5) తమ వృత్తి నైపుణ్యాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తారు. 5) విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడతారు.
6) తమ ప్రాంత విశిష్టతను, సాంప్రదాయాలను గౌరవాన్ని ఇతర ప్రాంతాలలో విస్తరిస్తారు. 6) తమ వృత్తి నైపుణ్యాలను ఇతర దేశాలకు వ్యాపింపజేస్తారు. సాంప్రదాయాలను, దేశ గౌరవాన్ని విదేశాలలో విస్తరిస్తారు.

10th Class Social Studies 8th Lesson ప్రజలు – వలసలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.108

ప్రశ్న 1.
గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్లు పట్టణ ప్రాంతంలో ఉపాధి పొందే ఆర్థిక రంగాలు ఏవి ? దీనికి కొన్ని – కారణాలను పేర్కొనండి.
జవాబు:
గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు ఎక్కువగా నైపుణ్యం లేని కార్మికులు తాత్కాలిక వలసలకు వెళుతుంటారు. వీరు ఉపాధి పొందే ఆర్థిక రంగాలు – గృహనిర్మాణ రంగం, పరిశ్రమలు, మెకానిక్ షాపులు మొదలగునవి.

10th Class Social Textbook Page No.102

ప్రశ్న 2.
ఇక్కడ కొంతమంది జాబితా ఉంది. వాళ్లని వలస వెళ్లిన వాళ్లు, వెళ్లని వాళ్లుగా వర్గీకరించండి. వలస తీరుని పేర్కొని, వలసకు కారణం ఏమై ఉంటుందో చెప్పండి.
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 2
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 3

10th Class Social Textbook Page No.103

ప్రశ్న 3.
కింది పటం పరిశీలించి ఢిల్లీకి ఏ ఏ రాష్ట్రాల నుండి వలసలు వస్తున్నారు?
జవాబు:
1) బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీకి వలసలు వస్తున్నారు.
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 5-1

10th Class Social Textbook Page No.105

ప్రశ్న 4.
కింది పటం పరిశీలించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఏ ఏ రాష్ట్రాల నుండి ప్రజలు వలస వస్తున్నారు?
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 6-1
ఆంధ్రప్రదేశ్ కు కర్ణాటక నుండి వలస వస్తున్నారు. కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్ నుండి వలసలు లేవు.

10th Class Social Textbook Page No.105

ప్రశ్న 5.
కింది పటం పరిశీలించి తమిళనాడు రాషంలో. పటం : ప్రధాన అంతర రాష్ట్ర వలస మార్గాల అంచనా, 2001-2011 అంతర, బాహ్య వలసలకు కారణాలు కనుగొనండి.
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 4
జవాబు:

  1. కొత్త నైపుణ్యాలు సాధించటానికి, కొత్త ఉద్యోగాలు, చలనచిత్ర పరిశ్రమలో ఉపాధి అవకాశాలు మరియు మెరుగైన వేతనాలు పొందటానికి ప్రజలు తమిళనాడుకు ‘వలస వెళ్ళారు.
  2. పర్యాటక పరిశ్రమ (టూరిజం ఇండస్ట్రీ) లో ఉపాధి అమలుచేసిన స్థానం – వన గమ్యస్థానం అవకాశాల కోసం ప్రజలు తమిళనాడు నుండి కేరళకు వలస వెళ్ళారు.

10th Class Social Textbook Page No.106

ప్రశ్న 6.
పట్టణంలో అసంఘటిత రంగంలో రోజుకూలీగా లేదా ఇంటి పనులు చేసే మహిళగా పట్టణానికి వలస వచ్చిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి ఆమె కథ రాయండి. (పైన ఇచ్చిన రామయ్య కథనాన్ని చూడండి).
జవాబు:
శ్రీమతి బూరా సరోజిని హైదరాబాదులో ఒక ఆఫీసర్ గారి ఇంట్లో పని చేయడానికి వచ్చింది. ఆమె భూపాలపల్లి (మండలం) వరంగల్ లో జన్మించింది. అక్కడ 8వ తరగతి వరకు చదివిన తరువాత ప|గోదావరికి నర్సాపురానికి చెందిన రంగాజీతో వివాహం జరిగింది. తరువాత 25 సం||రాలకి ఆమె భర్త చనిపోయారు. ఆమె ఇద్దరి కుమార్తెలకు వివాహం చేసి, ఆ అప్పులు తీర్చే నిమిత్తం పనికి చేరింది. ఆమె సంపాదించిన దానిలో ఖర్చులు పోగా మిగిలినవి. తన సోదరునికి పంపి అతని ద్వారా అప్పు తీర్చింది. ఆమె తన స్వంత ఊరును 6 నెలల కొకసారి దర్శిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

10th Class Social Textbook Page No.106

ప్రశ్న 7.
మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటుంటే పట్టణంలో అసంఘటిత రంగంలో పనిచేస్తూ పండగకు ఊరొచ్చిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి అతడి కథ రాయండి. (పైన ఇచ్చిన రామయ్య కథనాన్ని చూడండి).
జవాబు:
చోరగుడి పద్మనాభం (20 సం||రాలు) భిలాయ్ ఛత్తీషుడు తాపీ పని చేస్తున్నాడు. అతను మా ఊరు నందమూరు టంగుటూరు మండలానికి వచ్చాడు. పద్మనాభం మా జిల్లాలోనే గుడివాడలో జన్మించాడు. అతను సెలవులకి తన నాయనమ్మ యింటికి వచ్చాడు. అతని తల్లి ఆరోగ్యానికి చెల్లెలి వివాహానికి చాలా అప్పు చేశాడు. ఆ అప్పులన్నీ పద్మనాభమే తీర్చాలి. అందుకే అతను భిలాయ్ వెళ్ళాడు. అతనికి రోజుకి రూ. 300/- ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. ఆరోగ్య భీమా కూడా కల్పించారు. కాబట్టి అతను ఆనందంగానే కొంత భాగాన్ని సాగిస్తున్నాడు. తన సంపాదనలో కొంత భాగాన్ని తన తండ్రికి పంపి అప్పులు తీరుస్తున్నాడు. అతను తన కుటుంబానికి దూరంగా ఉండటానికి దిగులు పడుతున్నాడు.

10th Class Social Textbook Page No.106

ప్రశ్న 8.
పైన పేర్కొన్న రెండు పరిస్థితుల మధ్య పోలికలు, తేడాలు పేర్కొనండి.
జవాబు:
పోలికలు, తేడాలు :
వీరిరువురూ వేర్వేరు ప్రాంతాలకి వలసకి వెళ్ళారు. ఇద్దరు అవ్యవస్థీకృత రంగంలోనే పని చేస్తున్నారు. ఇద్దరూ వారి జీవనానికి, అప్పులు తీర్చడానికి పని చేస్తున్నారు.

శ్రీమతి బి. సరోజిని చాట్రగడ్డ పద్మనాభం
1. ఈమె స్వంత రాష్ట్రంలోనే వలసకి వెళ్ళింది. 1. ఇతను వేరే రాష్ట్రానికి వలస వెళ్ళాడు.
2. ఆమె కొద్ది పాటి వసతులను మాత్రమే పొందుతోంది. 2. ఇతను చాలా లాభాలను పొందుతున్నాడు.
3. ఆమె ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోంది. 3. ఇతను బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతున్నాడు.

10th Class Social Textbook Page No.107

ప్రశ్న 9.
పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరకటానికి పరిచయాలు, సంబంధాలు ఎందుకు అవసరం?
జవాబు:
పట్టణాలలో ఉద్యోగాలు దొరకటానికి పరిచయాలు, సంబంధాలు చాలా కీలకమైనవి. ఒక్కొక్కసారి తమ పరిచయాలు, సంబంధాల ద్వారా ముందుగా ఉద్యోగం దొరకబుచ్చుకున్న తరువాతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వస్తారు. అనేక కారణాల వల్ల వాళ్లు తమ గ్రామీణ ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటారు.

10th Class Social Textbook Page No.108

ప్రశ్న 10.
1961-2011 మధ్యకాలంలో వలసల ప్రభావాన్ని చూపటానికి ఒక పట్టిక తయారుచేయండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 7

10th Class Social Textbook Page No.108

ప్రశ్న 11.
గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వలస వెళ్లినప్పుడు గ్రామీణ రంగంలోని ఏ ఆర్థిక రంగం ఎక్కువ మందిని కోల్పోతుంది? ఎందుకని?
జవాబు:
గ్రామీణ ప్రాంతం నుంచి ప్రజలు వలస వెళ్లినప్పుడు గ్రామీణ రంగంలోని వ్యవసాయరంగం ఎక్కువ మందిని కోల్పోతుంది. ఎందుకనగా వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం కన్నా పట్టణ ప్రాంతంలో పనిచేయడం వలన వచ్చే ఆదాయం ఎక్కువ. కాబట్టి పట్టణ ప్రాంతాలలో పనిచేయుటకు గ్రామీణులు వలసలు పోతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

10th Class Social Textbook Page No.109

ప్రశ్న 12.
పశ్చిమ మహారాష్ట్రలో చెరకు కొట్టేవాళ్ల కొరత ఎందుకుంది?
జవాబు:

  1. భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చిన తరువాత పంచవర్ష ప్రణాళికల ద్వారా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందినది.
  2. వ్యవసాయ రంగంలో సరియైన ప్రణాళికలు అమలు కాకపోవటం మూలంగా వ్యక్తుల కూలీల వలసలు ఎక్కువయ్యాయి.
  3. మహారాష్ట్రలో ప్రాంతీయ అసమానతలు అనేవి రాజకీయ ఆర్థిక, సాంఘిక పరమైనవి. రాజకీయంగా ఉన్నతిని సాధించిన
  4. పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో నీటి పారుదల వసతులు, పరపతి అవకాశాలు ఇతర వ్యవసాయానూకూల అంశాలు అభివృద్ధి చెందినవి. కాని ఇతర ప్రాంతాలు ఈ అంశాలలో చాలా వెనుకబడి ఉన్నాయి.
  5. కాబట్టి ప్రతి సం||రం కొన్ని వేల మంది వ్యక్తులు ఈ ప్రాంతానికి పని కొరకు వలస పోవుచున్నారు.

10th Class Social Textbook Page No.109

ప్రశ్న 13.
తల్లిదండ్రులతో పాటు వలస వచ్చిన వాళ్ల పరిస్థితి ఏమిటి ? వీళ్లను బడిలో చేర్పించవచ్చా? ఇటువంటి పిల్లలకు చదువు చెప్పటానికి ప్రభుత్వ చట్టాలలో ఏమైనా అంశాలు ఉన్నాయా?
జవాబు:
తల్లిదండ్రులు వలస వచ్చినపుడు సాధారణంగా బడి ఈడు గల వీరి పిల్లలను కూడా తమతో తీసికొని వస్తారు. అయితే తాత్కాలిక వలసల కారణంగా వీరు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించక బాల కార్మికులుగా ఆదాయం వచ్చే మార్గాల వైపు మళ్ళిస్తారు. కానీ విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం 14 సం||లోపు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలి. వలస ప్రాంతాల్లోని విద్యార్థులు తమకు దగ్గరలోని పాఠశాలలో చేరాలి. లేదా ఆడపిల్లలైతే కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చేరవచ్చు. వీటిలో విద్యాబోధనతో పాటు వసతి, భోజన సదుపాయాలుంటాయి. భాషా సమస్య ఏర్పడితే వీరి కోసం విద్యాశాఖాధికారులు తాత్కాలిక రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్సులను ఏర్పాటు చేస్తారు.

10th Class Social Textbook Page No.109

ప్రశ్న 14.
చెరకు నరికే వాళ్లకు ఆ పనిలో ఆరు నెలలు మాత్రమే ఎందుకు ఉపాధి లభిస్తుంది ? మిగిలిన ఆరునెలల్లో వాళ్లు ఏ పనులు చేస్తూ ఉంటారు?
జవాబు:
చెరకు సంవత్సరకాల పంట. మహారాష్ట్రలో చెరుకు విస్తారంగా పండటం వలన చెరుకు నరికే కాలం సుమారుగా ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. పంచదార మిల్లులు, బెల్లం క్రషర్లు ఈ సీజన్లోనే పనిచేస్తాయి. అందుకే వలస కూలీలకు ఈ ప్రాంతంలో 6 నెలలు మాత్రమే పని లభిస్తుంది. మిగతా ఆరు నెలలు వీరు తమ స్వగ్రామాలకు పోయి ఉపాధి పొందుతారు.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

10th Class Social Textbook Page No.109

ప్రశ్న 15.
ఇటువంటి కూలీల జీవన పరిస్థితులను ఏ విధంగా మెరుగుపరచవచ్చు?
జవాబు:
ఆరు నెలలు మాత్రమే కూలీ లభించే చెరుకు వలస కూలీల జీవనస్థితి మెరుగుపరచడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యాశాఖవారు అనేక కార్యక్రమాలు అమలుచేయాలి. వీరు పనిచేసే చోట నివసించేందుకు గృహ సముదాయాలను ఏర్పాటు చేసి విద్యుత్, త్రాగునీటి సదుపాయాలు కల్పించాలి. వీరి పిల్లల కోసం పాఠశాలలను ఏర్పాటు చేయాలి. మిగతా 6 నెలలు వీరికి ఉపాధి పథకాలను అమలుచేయాలి. వైద్య సదుపాయాలను కల్పించాలి.

10th Class Social Textbook Page No.111

ప్రశ్న 16.
వలస వెళ్లిన వాళ్లకు ఆహారం, వైద్య కుటుంబ సంరక్షణ కార్యక్రమాలు అందటానికి ఏం చెయ్యాలి?
జవాబు:
వలస వెళిన వారు కొత ప్రాంతంలో, కొత వాతావరణంలో పనిచేయవలసి ఉంటుంది. మరోవైపు వృదులైన తల్లిదండ్రులు చదువుకొనే పిల్లలకు దూరంగా వీరు సంపాదనకోసం, జీవన భృతి కోసం వలస వచ్చినవారు. వీరికి యజమానులు, గుత్తేదారులు కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఉదయం, మధ్యాహ్నం పనిచేసే చోటనే పౌష్టికాహారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరి నివాసాల సమీపంలో వైద్య సదుపాయం కల్పించాలి. పని గంటలు నిర్ణయం వారంలో కనీసం ఒక రోజు సెలవు, వైద్య ఖర్చులు యజమానులే భరించడం, వీరి పిల్లలకు పాఠశాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలి.

10th Class Social Textbook Page No.102

ప్రశ్న 17.
నంద్యాల పట్టణంతో కర్నూలు జిల్లాను చూపించే పటం గీయండి. ఈ ఉదాహరణలలో పేర్కొన్న గ్రామాలను కలుపుతూ బాణం గుర్తులు గీయండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 8

10th Class Social Textbook Page No.103

ప్రశ్న 18.
క్రింది పట్టికను పరిశీలించండి. భారతదేశంలో వలస (2001 జనాభా లెక్కలు)
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 9-1
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 10

10th Class Social Textbook Page No.109

ప్రశ్న 19.
పశ్చిమ మహారాష్ట్రలోని ఏడు జిల్లాలయిన నాసిక్, అహ్మద్ నగర్, పూనా, సతారా, సాంగ్లి, కొల్హాపూర్, షోలాపూర్లు “పంచదార పట్టి”గా పిలవబడతాయి. ఈ పట్టీ ఉత్తరాన సూరత్ (గుజరాత్)లోకి, దక్షిణాన బెల్గాం (కర్నాటక)లోకి విస్తరిస్తుంది. వర్షాధార మెట్ట భూములున్న మరట్వాడాలోని అయిదు జిల్లాలయిన బీడ్, జల్గావ్, అహ్మద్ నగర్, నాసిక్, జల్నాలు చెరకు నరకటానికి సంవత్సరంలో ఆరు నెలలపాటు వలస కార్మికులను పంపిస్తాయి.
ఒక పటంలో వలస మొదలయిన జిల్లాలు, వలస చేరుకునే జిల్లాలను చూపిస్తూ బాణం గుర్తులు గీయండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 11
కార్మికుల వలస ప్రాంతాలు
1) బీడ్
2) జల్గావ్
3) అహ్మద్నగర్
4) నాసిక్
5) జల్నా

కార్మికులు వలస వెళ్లిన ప్రాంతాలు
1) నాసిక్
2) అహ్మద్ నగర్
3) పూనా
4) సతారా
5) సాంగ్లి
6) కొల్హాపూర్
7) షోలాపూర్

10th Class Social Textbook Page No.110

ప్రశ్న 20.
మీ ప్రాంతంలో కాలానుగుణ వలస వెళ్లే వాళ్ల పరిస్థితిని వివరించండి.
జవాబు:
సాధారణంగా మా ప్రాంతంలో వ్యవసాయ పనులు లేని కాలంలో బహుళ పంటలు వేసే ప్రాంతాలకు లేదా పట్టణాలకు వలసలు పోతుంటారు. మా ప్రాంతంలోని కొందరు గుత్తేదార్లు వలస వెళ్ల వలసిన ప్రాంతంలోని పెద్ద రైతులు, గుత్తేదార్లుతో ముందుగా ఒప్పందం కుదుర్చుకుంటారు. గుత్తేదారులు చెప్పిన నిబంధనలు నచ్చితే వారితో పాటు వలసలు పోతారు. సాధారణంగా వీరు వృద్ధులైన తల్లిదండ్రుల వద్ద చదువుకుంటున్న తమ పిల్లలను వదిలి వెళతారు. గుత్తేదారు నుండి తీసుకున్న ముందస్తు సొమ్మును కొంత తల్లిదండ్రులకు ఇస్తారు. ప్రధానమైన పండుగలు, గ్రామంలో బంధువుల వివాహాలు వంటి శుభకార్యాలకు వీరు వచ్చి పోతుంటారు. మా ప్రాంతంలో వ్యవసాయ పనులు ప్రారంభం కాగానే తిరిగి వీరు మా గ్రామానికి వస్తారు.

10th Class Social Textbook Page No.111

ప్రశ్న 21.
కింది చిత్రాలలో చూపిన విధంగా వలస వ్యక్తులు రాకుండా జాతీయ సరిహద్దులను కాపాడుతుంటారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం :
1) మెక్సికో సరిహద్దు వెంట అమెరికాలో,
2) ఉత్తర కొరియా సరిహద్దు వెంట దక్షిణ కొరియాలో
3) బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భారతదేశంలో ఇలా దేశ సరిహద్దులను దాటేవాళ్ల గురించి మీ అభిప్రాయం ఏమిటి?
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 12
జవాబు:
ఈ చిత్రాలలో మెక్సికో – అమెరికా, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ – భారతదేశం సరిహద్దులు చూపబడ్డాయి. అంతర్జాతీయ రేఖ వెంబడి ఇరు దేశాల మధ్య కంచె వేయడం, ఇరు దేశాల సైనికులు వారి సరిహదులలో నిరంతరం పహారా కాయడం జరుగుతుంటుంది. అయితే అనేక కారణాల వలన విభిన్న రకాల వ్యక్తులు సరిహద్దులు దాటి ప్రక్క దేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. వీరిలో కొందరు ఆయా దేశాల ప్రేరణతో శత్రు దేశాలలో హింసాకాండ నిర్వహించడానికి సరిహద్దులు దాటే ఉగ్రవాదులు. వీరిని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులంటాం.

మెక్సికో కంటే అమెరికా ఉపాధి, సదుపాయాలు పరంగా ఆకర్షణీయమైన దేశం. అందుకనే కొందరు దొడ్డి దారిలో ఆ దేశంలో ప్రవేశిస్తుంటారు. దక్షిణ, ఉత్తర కొరియాలు భిన్న సైద్ధాంతికతలను కలిగిన ప్రభుత్వాలు. ఒకటి కమ్యూనిస్టు అయితే, మరొకటి కేపటలిస్ట్ ఆయా దేశాలతో సిద్ధాంతాలు నచ్చనివారు, గూఢచర్య నిమిత్తం కొందరు ఒక దేశం నుండి మరో దేశానికి దొంగతనంగా సరిహద్దులు దాటుతుంటారు.

బంగ్లాదేశ్ లో సుదీర్ఘకాలం నియంతృత్వ పాలన సాగుతుండటంతో, ప్రజలు దుర్భర జీవనం సాగిస్తుండటంతో ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి సరిహద్దులు దాటి వస్తుంటారు. పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాలలో బంగ్లా వలస జీవుల సమస్య అధికంగా ఉంది.

ఈ రకంగా అనధికారంగా సరిహద్దులు దాటి వెళ్ళటం చట్టరీత్యా నేరం. మరియు వీరు చేరిన దేశానికి సమస్యగా మారుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు

10th Class Social Textbook Page No.112

ప్రశ్న 22.
పై పేరాలలో పేర్కొన్న భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళుతున్న వలసలను చూపిస్తూ ప్రపంచ పటంలో బాణం గుర్తులు గీయండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 13

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Studies 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
నివాసప్రాంతం అంటే ఏమిటి? (AS1)
జవాబు:
ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్దతినే నివాసప్రాంతం అంటాం. ఇది మనం నివసించే, పనిచేసే భౌగోళిక ప్రదేశం. నివాస ప్రాంతంలో విద్య, మతపర, వాణిజ్యం వంటి విభిన్న కార్యకలాపాలు ఉంటాయి.

ప్రశ్న 2.
స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటంతో మానవ జీవనశైలి ఎలా మారింది? (AS1)
(లేదా)
స్థిర జీవనం వల్ల మానవ జీవనశైలిలో వచ్చిన మార్పులను వివరించండి.
జవాబు:
స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటంతో మానవ జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఆహారం సంపాదించుకోడానికి వాళ్లు చాలాదూరం తిరగాల్సిన పని తప్పింది. ఇప్పుడు ఎక్కువ కాలం ఉండడానికి వీలు కావడంతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకున్నారు. ప్రకృతి రీతులను బాగా అర్థం చేసుకోగలిగారు. ఆకాశంలో గ్రహాల కదలికలు వంటివి గమనించడానికి వీరికి తీరిక దొరికింది. జనాభా కూడా పెరిగింది. రవాణా సౌకర్యాలు విస్తరించాయి.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 3.
ప్రదేశం, పరిస్థితి అంశాలను నిర్వచించండి. మీరు ఉంటున్న ప్రాంతం నుంచి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి. (AS1)
జవాబు:
ప్రదేశం ఒక ప్రాంత లక్షణాలను తెలియజేస్తుంది. మెట్టపల్లాలు, సముద్రానికి ఎంత ఎత్తులో ఉందో, నీటి వనరులు, నేల రకాలు, భద్రత, ప్రకృతి శక్తుల నుండి రక్షణ వంటివి ప్రదేశం కిందకి వస్తాయి. విశాఖపట్టణాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఇది బంగాళాఖాతం తీరంలో ఉంది. సహజ ఓడరేవు, విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నత విద్య, వైద్య సదుపాయాలున్నాయి. పరిస్థితి : ప్రాంతాలు ఒంటరిగా ఉండవు. ఏదో ఒక విధంగా ఇతర ప్రాంతాలతో సంబంధం ఉంటుంది. పరిస్థితి ఇతర ప్రాంతాలతో గల సంబంధాలను తెలియజేస్తుంది.

విశాఖపట్నం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు, రైలు, విమాన, నౌకా సదుపాయాలున్నాయి.

ప్రశ్న 4.
వివిధ ప్రాంతాలను భారతదేశ జనాభా గణన విభాగం ఎలా నిర్వచిస్తోంది ? పరిమాణం, ఇతర అంశాల రీత్యా వాటిని ఎలా వ్యవస్థీకరిస్తోంది? (AS1)
జవాబు:
భారత జనాభా గణన విభాగం కొన్ని ప్రామాణికాల ఆధారంగా నివాసప్రాంతాలను వర్గీకరిస్తుంది.

నివాస ప్రాంత రకం ఉపయోగించిన ప్రామాణికాలు ఉదాహరణలు
మహానగరాలు కోటి జనాభాకి మించి ఉన్న నగరాలు * ముంబై మహానగర ప్రాంతం (1.84 కోట్లు)
* ఢిల్లీ మహానగరం (1.63 కోట్లు)
* కోల్‌కతా మహానగరం (1.41 కోట్లు)
మెట్రోపాలిటన్ నగరాలు/పదిలక్షలు దాటిన నగరాలు పది లక్షలు – కోటి మధ్య జనాభా ఉన్న నగరాలు * చెన్నై (86 లక్షలు) నగరాలు/పదిలక్షలు .
* హైదరాబాదు (78 లక్షలు) దాటిన నగరాలు
* అహ్మదాబాదు (62 లక్షలు)
క్లాసు 1 నగరాలు ఒక లక్ష – పది లక్షల మధ్య పట్టణ ప్రాంతాలు * విశాఖపట్టణం (2.03 మిలియన్లు) ఉన్న
* తిరుపతి (0.46 మిలియన్లు)
* వరంగల్ (0.76 మిలియన్లు)
పట్టణాలు 5000 నుంచి ఒక లక్ష మధ్య గల * ప్రొద్దుటూరు (1,50,309)
* తెనాలి (1,53,756)
* సిద్దిపేట (61,809)
రెవెన్యూ గ్రామాలు నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామం * పెదకాకాని (18,947)
* కొల్లూరు (16,025)
* బండారుపల్లి (4,863)
ఆవాస ప్రాంతాలు రెవెన్యూ గ్రామం (హామ్లెట్) లోపల కొన్ని ఇళ్ల సముదాయం * గోసాలపురం తండా (1570)

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 5.
విమానాశ్రయ నగరం అంటే ఏమిటి ? దాని నిర్మాణ స్వరూపం ఏమిటి? (AS1)
జవాబు:
భారతదేశంతో సహా అనేక దేశాలలో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి. అందుకనే వీటిని విమానాశ్రయ నగరాలు (లేదా ఏరోట్రిపోలిస్) అంటున్నారు.

విమానాశ్రయ నగరాలలో విమానాశ్రయమే ఒక నగరంగా పనిచేస్తుంది. అనేక సదుపాయాలు (హోటళ్లు, దుకాణాలు, వినోదం, ఆహారం, వ్యాపార సమావేశ సదుపాయాల వంటివి) అక్కడ కల్పిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు విమానాలలో వచ్చి తమకు అవసరమైన వాళ్లతో అక్కడే వ్యవహారాలు పూర్తి చేసుకుని తిరిగి విమానాల్లో వెళ్లిపోతారు. ట్రాఫిక్ వంటి సమస్యలు ఏమీ లేకుండా నగరంలోని సదుపాయాలన్నింటినీ పొందుతారు.
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 1

10th Class Social Studies 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 1.
విమానాశ్రయ నగర కేంద్రం ఏమిటి?
జవాబు:
పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ కొత్తగా ఏర్పడే నగరాన్ని విమానాశ్రయ నగర కేంద్రం అంటారు.

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 2.
విమానాశ్రయ నగర కేంద్రంలో, లేదా దాని దగ్గర ఉండే రెండు సదుపాయాలను పేర్కొనండి.
జవాబు:
విమానాశ్రయ నగర కేంద్రంలో ఉండే సదుపాయాలు :

  1. హోటళ్లు
  2. వ్యాపార సమావేశ సదుపాయాలు

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 3.
మొహుదా గ్రామ ప్రజలు ఏ విషయం పట్ల ఆందోళన చెందుతున్నారు?
జవాబు:
తమ గ్రామం వద్ద చెత్త శుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేయడం వల్ల మొహుదా గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 4.
చెత్త శుద్ధి కర్మాగారం వల్ల ఎంత మంది ప్రజలు, పశువులు ప్రభావితం కానున్నారు?
జవాబు:
మొహుదా గ్రామం వద్ద చెత్త శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుచేస్తే ఆ ప్రాంతంలోని 30,000 మంది ప్రజలే కాకుండా 10,000 పశువులు కూడా ప్రభావితం అవుతాయి.

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 5.
సర్వే నివేదిక ప్రకారం బరంపురం ఎంత ఘన వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేసింది?
జవాబు:
2009 లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం బరంపురంలో ప్రతిరోజు 150 టన్నుల ఘన వ్యర్థపదార్థాలు ఉత్పన్నం అవుతాయి.

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 6.
బరంపురం నగరపాలక సంస్థ అధికారులు “గత మూడు సంవత్సరాలలో ఉత్పత్తి అవుతున్న చెత్త పెరిగి ఉండవచ్చని” అంటున్నారు. వీళ్ల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా, లేదా ? మీ కారణాలు పేర్కొనండి.
జవాబు:
అవును, బరంపురం నగరపాలక సంస్థ అధికారులతో ఏకీభవిస్తున్నాను. నగర ప్రజల జీవనశైలి మారుతూ ఉండటంతో ఘన వ్యర్థ పదార్థాలు కూడా పెరగవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.94

ప్రశ్న 7.
నిలువు వరుస ‘అ’లో ఒక ప్రదేశం యొక్క అంశాలు ఉన్నాయి. ‘ఆ’ నిలువు వరసలో అది ప్రదేశానికి సంబంధించిన అంశమో, పరిస్థితికి సంబంధించిన అంశమో రాయండి. అది పరిస్థితికి సంబంధించిన అంశమైతే ‘ఇ’ నిలువు వరసలో దీని ప్రభావం ఎలా ఉంటుందో రాయండి.

1. బంకమట్టి నేల
2. వర్షపాతం చాలా ఎక్కువ.
3. దాని ప్రధానమైన మార్కెట్టు తీరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
4. నేల చాలా తక్కువ వాలు కలిగి ఉంటుంది.
5. అది ప్రధాన రైలు మార్గంలో ఉంది.
6. ఆసుపత్రి లేదు.
7. వ్యవసాయ భూములు ఎక్కువ.
8. మొబైల్ టవర్లతో అన్ని ప్రదేశాలతో
సంబంధం కలిగి ఉంది.
9. నది నుండి పది నిమిషాలు నడవాలి.
10. ఒక వడ్ల మిల్లు ఉంది.

జవాబు:

1. బంకమట్టి నేల ప్రదేశం ఇటుక, కుండల తయారీకి అనుకూలం.
2. వర్షపాతం చాలా ఎక్కువ. ప్రదేశం ప్రదేశం పంటలు పండవు, నీటి సమస్య ఉండును.
3. దాని ప్రధానమైన మార్కెట్టు తీరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరిస్థితి
4. నేల చాలా తక్కువ వాలు కలిగి ఉంటుంది. ప్రదేశం పంటలకు అనుకూలం. ఇండ్ల నిర్మాణానికి అనుకూలం.
5. అది ప్రధాన రైలు మార్గంలో ఉంది. పరిస్థితి అనుకూలమైనది.
6. ఆసుపత్రి లేదు. ప్రదేశం అనుకూలం కాదు.
7. వ్యవసాయ భూములు ఎక్కువ. ప్రదేశం జనాభా ఎక్కువగా ఉంటారు.
8. మొబైల్ టవర్లతో అన్ని ప్రదేశాలతో
సంబంధం కలిగి ఉంది.
పరిస్థితి అనుకూలమైనది.
9. నది నుండి పది నిమిషాలు నడవాలి. పరిస్థితి అనుకూలమైనది.
10. ఒక వడ్ల మిల్లు ఉంది. ప్రదేశం అనుకూలమైనది.

10th Class Social Textbook Page No.94

క్షేత్ర పరిశీలన :

ప్రశ్న 8.
మీరు గీసిన పటంలో గుర్తించిన ఉత్పత్తి ప్రదేశాలలో (వ్యవసాయ క్షేత్రాలు, కర్మాగారాలు, కార్యాలయాలు, దుకాణాలు, గనులు వంటివి) ఒకటి, రెండింటిని సందర్శించండి. వాళ్లకి కావలసిన ముడిసరుకులు/ఉత్పాదకాలు ఎక్కడి నుంచి వస్తాయో, ఉత్పత్తి చేసిన సరుకులు ఎక్కడ అమ్ముతారో తెలుసుకోండి. ఏ ముడిసరుకులు మీ నివాస ప్రాంతం నుంచి , వస్తాయి ? అదే విధంగా ఉత్పత్తి చేసిన సరుకులను మీ నివాస ప్రాంతంలోనే అమ్ముతున్నారో లేక ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారో (ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నట్లయితే, ఎక్కడికి పంపిస్తున్నారో) తెలుసుకోండి. ఇక్కడ ఉత్పత్తి ఎందుకు చేపట్టారు?
1) ఈ ప్రాంతంలో ఉత్పత్తిని ప్రభావితం చేసిన ఆ ప్రదేశం అంశాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఇచ్చట వ్యవసాయ క్షేత్రాలు సారవంతమైనవి. నదీ ప్రవాహంతో వచ్చి ఒండ్రుమట్టితో చక్కని వరి, పెసర, జనుము, నువ్వులు పండుతాయి. నదీ తీర ప్రాంతం కావడంతో కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. నదిలో నీరు లేనపుడు తక్కువ లోతులోనే బోరుబావులకు నీరు లభ్యమౌతుంది.

2) ఈ ప్రాంతంలో ఉత్పత్తిని ప్రభావితం చేసిన పరిస్థితి అంశాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
గ్రామంలో వ్యవసాయేతర వృత్తులవారు, సమీప పట్టణ వ్యాపారులు వచ్చి పంటలను కొనుగోలు చేస్తారు. సమీప పట్టణానికి రహదారి సౌకర్యం ఉండటంతో రైతులే స్వయంగా పంటలను తీసుకొనిపోయి అమ్ముకొనే సదుపాయం కలదు. వేసవికాలంలో పండే కూరగాయలకు మార్కెట్ సౌకర్యం కలదు.

3) ఉత్పత్తిని ఆ ప్రాంత చరిత్ర ఎలా ప్రభావితం చేసింది?
జవాబు:
వ్యవసాయ క్షేత్రాలు, మార్కెట్ ఒకే జిల్లాలోనివి కావడం.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.95

ప్రశ్న 9.
మీ ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోండి…….

ఒక ప్రాంతం ఎంత పెద్దగా ఉంటే అక్కడ అన్ని ఎక్కువ సేవలు లభ్యం అవుతాయి. ఉదాహరణకు విద్య సదుపాయాలను తీసుకోండి. దీని ద్వారా పెద్ద ప్రదేశాలలో (అంటే పై స్థాయిలో ఉన్న ప్రాంతాలలో) ప్రత్యేక సేవలు విరివిగా లభ్యమవడాన్ని గమనించవచ్చు.
1) మీ ప్రాంతంలో ఏ స్థాయి వరకు విద్యా సదుపాయం ఉంది ? ఉదా : ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్, కళాశాల విద్య (డిగ్రీ, పీజి).
జవాబు:
ఉన్నత పాఠశాల విద్య

2) మీ ఊరిలో ఉన్న సదుపాయానికి మించి మీరు చదువు కొనసాగించదలుచుకుంటే మీరు ఎక్కడికి వెళ్లవలసి వస్తుంది?
జవాబు:
సమీప పట్టణానికి,

3) మీ ప్రాంతంలో ఎటువంటి వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి? ఉదా : ఇంజినీరింగ్, మెడిసిన్, కామర్స్, సాంకేతిక డిప్లామా వంటివి.
జవాబు:
మా గ్రామానికి 10 కి.మీ. పరిధిలో ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, కామర్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

4) మీకు వేరే వృత్తి విద్యలో ఆసక్తి ఉంటే మీరు ఎక్కడికి వెళ్లవలసి ఉంటుంది?
జవాబు:
సమీప పట్టణానికి.

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 10.
ఈ అధ్యాయం కోసం మీరు అధ్యయనం చేసిన ప్రదేశానికి దగ్గరలో విమానాశ్రయ నగరం ఏర్పడిందని ఊహించుకోండి. అప్పుడు ఆ ప్రాంత స్థలంలో వచ్చే మూడు మార్పులను పేర్కొనండి. అదే విధంగా ఆ ప్రాంత పరిస్థితులలో వచ్చే మూడు మార్పులను పేర్కొనండి.
జవాబు:
విమానాశ్రయ నగరం ఏర్పడితే వచ్చే మార్పులు :
ఎ) ఆ ప్రాంత స్థలంలో :

  1. గదులు అద్దెకిచ్చే హోటళ్లు, టాక్సీలు వెలుస్తాయి.
  2. వ్యాపారవేత్తలు, అధికారులు సమావేశాలు నిర్వహించేందుకు సమావేశ మందిరాలు నిర్మితమవుతాయి.
  3. అంతర్జాలం (Internet) వంటి సదుపాయాలతో కేస్లు కూడా వెలుస్తాయి.

బి) ఆ ప్రాంత పరిస్థితిలో మార్పులు :

  1. సమీప నగరానికి చక్కని రహదారులు వేస్తారు.
  2. రవాణా సౌకర్యం సమకూర్చుతారు.
  3. కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడుతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 11.
చెత్త శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పటానికి గుర్తించిన ఇతర ప్రదేశం ఏది ? దానిని ఎందుకు ఉపయోగించుకోలేదు?
జవాబు:
అంతకు ముందు ఈ చెత్త శుద్ధి కర్మాగారాన్ని నగర శివార్లలోని చందానియా కొండపైన ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాంతం అటవీ భూమి కిందకి వస్తుందని గుర్తించారు. దీనిని ముందుగా రెవెన్యూశాఖకు, ఆ తరువాత బరంపురం నగరపాలక సంస్థకు బదిలీ చేయవలసి రావటంతో ఈ ప్రతిపాదన విరమించారు.

10th Class Social Textbook Page No.88

క్షేత్ర పని

ప్రశ్న 12.
మీ ఊరు, పట్టణం లేదా నగరాన్ని పరిశీలించండి. ఇంతకుముందు నేర్చుకున్న పద్ధతుల ఆధారంగా ఎంపిక చేసిన ఒక చిన్న ప్రాంతం పటం గీయండి. మీ పటంలో ఈ కింద సూచించినవి ఉండాలి.
రోడ్లు, ఇళ్లు, బజారు, దుకాణాలు, వాగులు, మురికి కాలవలు, ఆసుపత్రి, పాఠశాల, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి కొన్ని ప్రదేశాలు.
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 2

1) ప్రజా సౌకర్య ప్రదేశాలు అధికశాతం ప్రజలకు వీలుగా ఉండే ప్రదేశంలో ఉన్నాయా?
జవాబు:
ప్రజా సౌకర్యాలు అధికశాతం ప్రజలకు వీలుగా ఉండే ప్రదేశంలో లేవు. గ్రామాలు, పట్టణాలు విస్తరించడంతో ప్రభుత్వ భూమి లభ్యమైన చోట ముఖ్యంగా గ్రామం చివరిలో లేదా ప్రారంభంలో వీటిని నిర్మిస్తున్నారు. ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు ప్రజలు చేరుకోలేనంత దూరంలో నిర్మిస్తున్నారు.

2) స్థానిక బజారులను కనుగొనడంలో ఏమైనా పద్దతి ఉందా?
జవాబు:
స్థానిక బజారులను గుర్తించడంలో ప్రత్యేక పద్ధతులు ఏమీ లేవు. ఇవి స్థానికులకు, పరిసర గ్రామస్థులకు సుపరిచయమైనవి అయినందున వీటి ఉనికిని చాటే నామ ఫలకాలు (Name Boards) లేవు. మార్కెట్ల స్థలంలో మాత్రం వాటి పేర్లుంటాయి.
ఉదా : రైతు బజారు, పొట్టి శ్రీరాములు మార్కెట్, పూర్ణా మార్కెట్.

3) ఇళ్లు గుంపులుగా ఉన్నాయా? వాటికి, ప్రధాన రహదారులకు మధ్య అనుసంధానం ఉందా?
జవాబు:
ఇళ్లు గుంపులుగా కాక వరుసలలోనే ఉన్నాయి. వీటికి, ప్రధాన రహదారులకు మధ్య అనుసంధానం కలదు.

4) ఎంపిక చేసిన ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడి గత 20 సంవత్సరాలలో చోటుచేసుకున్న మార్పులు, వాటికి గల కారణాలు తెలుసుకోండి.
జవాబు:
గత 20 సంవత్సరాలలో మార్పులు – కారణాలు :
గత 20 సంవత్సరాలలో గ్రామాలు, పట్టణాలు బాగా విస్తరించాయి. గ్రామ, పట్టణ శివారులలో కాలనీలు, వాంబే గృహసముదాయాలు, ఇందిరమ్మ ఇండ్ల కాలనీలు, హౌసింగ్ బోర్డు కాలనీలు విపరీతంగా పెరిగాయి. పట్టణ ప్రాంతాలలో సమీప గ్రామాలు కలసిపోయేంతగా విస్తరించాయి. పంచాయతీలకు నేరుగా కేంద్రప్రభుత్వ నిధులు రావడంతో బురదమయమైన రహదారులన్నీ సిమెంటు రోడ్లుగా మారాయి. గ్రామీణ ప్రాంతంలో కూడా కాలువల నిర్మాణం చేయడంతో రోడ్లపై నీరు నిలువ ఉండకపోవటం వల్ల శుభ్రంగా కనిపిస్తున్నాయి. అనేక గ్రామాలను పట్టణాలతో కలుపుతూ తారు రోడ్లు నిర్మించడంతో గ్రామాలు పట్టణాలతో అనుసంధానించబడ్డాయి.

5) ఉండవలసిన సదుపాయాలు ఏవి లేవు?
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో రక్షిత మంచినీటి పథకాలు నెలకొల్పినా, పలు గ్రామాల్లో అవి అనేక కారణాలతో పనిచేయడం లేదు. వీధి కొళాయిలనేర్పాటు చేసి ఇంటింటికి శుభ్రమైన తాగునీటి సదుపాయం కల్పించాలి.

పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మరుగుదొడ్లు నిర్మించి వాటిని ఉపయోగించే స్థితిలో ఉంచాలి. గ్రామీణ ప్రాంతంలో ఇండ్లలో ప్రభుత్వ సహాయంతో నిర్మించిన మరుగుదొడ్లు అత్యధిక నిరుపయోగంగా ఉన్నందున బహిరంగ మలవిసర్జన కొనసాగుతుంది.

నిర్మించిన రహదారులు సకాలంలో మరమ్మతులు లేక పాడైపోతున్నాయి. ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో డాక్టర్ల సంఖ్య పెంచాలి. మందులు అందుబాటులోకి తేవాలి.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.89

ప్రశ్న 13.
పోలికలు, తేడాలు పేర్కొనండి. పై సమాచారం ఆధారంగా సంచార, స్థిర జీవన శైలులలోని పోలికలు, తేడాలు పేర్కొనండి. మీరు ఎన్ని అంశాలు గుర్తించగలిగారో చూడండి. (ఇక్కడ పట్టిక సరిపోకపోతే మరొక పట్టిక తయారుచేయండి).
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 3
జవాబు:

సంచార జీవన విధానం స్థిర జీవన విధానం
1) తొలి మానవులు వేట, సేకరణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకొనేవారు. 1) వ్యవసాయం, పశుపోషణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకుంటున్నారు.
2) ఆహార సేకరణకు, వేటకు సంచార జీవనం సాగించేవారు. 2) స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.
3) మొదట రాళ్లను ఆయుధాలుగా చేసుకొని వేటాడేవారు. 3) వేట అవసరం తక్కువ. అవసరమైతే ఆధునిక ఆయుధాలు వాడుతున్నారు.
4) వారికి వ్యవసాయం తెలియదు. 4) వ్యవసాయమే అధిక జనాభాకు జీవనాధారం.
5) గుహలలో, చెట్టు తొర్రలలో నివసించేవారు. 5) ఇండ్లు నిర్మించుకొని వాటిల్లో నివసిస్తున్నారు.
6) జంతు చర్మాలను, చెట్ల బెరడులను ధరించేవారు. 6) వస్త్రాలు ధరిస్తున్నారు.
7) కుటుంబ వ్యవస్థ లేదు. 7) కుటుంబ వ్యవస్థీ ప్రధానమైనది.
8) మానవుడు ఎక్కువ సమయం ఆహార సేకరణ, వేటలో గడిపేవాడు. 8) శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి వైపు దృష్టి పెట్టే విశ్రాంతి లభించింది.
9) వీరు ఎటువంటి కళాత్మకమైన అంశాలను నేర్వలేదు. 9) వీరు కళాత్మక దృష్టితో గృహాలు, దేవాలయాలు మొ||నవి నిర్మించారు.
10) వీరికి రాతరాయటం తెలియకపోయినా భాష నేర్చా రు. 10) వీరు రాతని నేర్చారు. పన్ను విధానాలు వ్యాపారం మొ||నవి నేర్చారు.

10th Class Social Textbook Page No.92

ప్రశ్న 14.
మీరు నివసించే ప్రాంతాన్ని గత 10 సంవత్సరాల నుండి ఏ ఏ కారకాలు ప్రభావితం చేశాయో కనుక్కోండి.
జవాబు:

  1. జనాభా పెరగడంతో కుటుంబాల సంఖ్య, ఇండ్ల సంఖ్య పెరిగాయి.
  2. దీంతో గ్రామాలు, పట్టణాలు విస్తరించాయి.
  3. బీదవారు ప్రభుత్వ స్థలాలు, చెరువు గర్భాలు, నదీ తీరాలలో ఇండ్ల నిర్మాణం చేయడంతో అధిక వర్షాలు, వరదల సమయాల్లో ముంపునకు గురవుతున్నాయి.
  4. కాలనీలు విస్తరించడంతో మౌలిక సదుపాయాల కల్పనలో పాలకవర్గాలు విఫలమవుతున్నాయి.
  5. పాఠశాలలు, ఆసుపత్రులను గ్రామాలకు దూరంగా నిర్మిస్తున్నారు.
  6. బోరుబావులు, నందనూతులు పెరగడంతో భూగర్భజలాలు త్వరితంగా అంతరించిపోతున్నాయి.
  7. ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయి, ఇవి భూమి పై పొరలను ఆక్రమించడం వల్ల నీరు భూమిలో ఇంకడం లేదు.
  8. ఉపాధి కోసం గ్రామాల నుండి పట్టణాలకు, బహుళ పంటలు పండే ప్రాంతాలకు వలసలు ఎక్కువైపోయాయి.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.93

ప్రశ్న 15.
క్రింది పట్టికను పరిశీలించండి.
విశాఖపట్టణం జనాభా

సంవత్సరం జనాభా మార్పు శాతంలో
1901 40,892
1911 43,414 +6.2%
1921 44,711 +3.0%
1931 57,303 +28.2%
1941 70,243 +22.6%
1951 1,08,042 +53.8%
1961 2,11,190 +95.5%
1971 3,63,467 +72.1%
1981 6,03,630 +66.1%
1991 7,52,031 +24.6%
2001 13,45,938 +78.97%
2011 20,35,690 +51.2%

విశాఖపట్టణ జనాభా మార్పు :
1) పైన ఇచ్చిన జనాభా వివరాలలో అన్ని దశకాల గణాంకాలు ఉన్నాయా ? ఒకవేళ లేకపోతే ఏ దశకం గణాంకాలు ఇక్కడ లేవు?
జవాబు:
విశాఖపట్టణం జనాభా వివరాలలో 1901 నుండి 2011 వరకు అన్ని దశాబ్దాల గణాంకాలు ఉన్నాయి.

2) ఏ దశకం నుంచి ఏ దశకానికి జనాభా పెరుగుదల (శాతంలో) అత్యధికంగా ఉంది?
జవాబు:
1951-1961 దశకంలో విశాఖపట్టణం జనాభా 95.5% అత్యధిక శాతం పెరిగింది.
(సూచన : 93వ పేజీలో పట్టిక 2 లో 1991 – 2001 మధ్య 123% పెరిగినట్లు తప్పుగా ముద్రించారు. వాస్తవంగా ఇది 78.97% మాత్రమే.)

3) ఏ దశకం నుంచి ఏ దశకానికి జనాభా పెరుగుదల (శాతంలో) అతి తక్కువగా ఉంది?
జవాబు:
1911-1921 దశకానికి జనాభా పెరుగుదల (3 శాతం) అతి తక్కువగా ఉంది.

4) 1901-2011 విశాఖపట్టణం జనాభాకి లైన్ గ్రాఫ్ తయారుచేయండి. జనాభా సంఖ్యలో ఏ మార్పులను మీరు పరిశీలించారు?
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 4
గ్రాఫ్ విశ్లేషణ : 1961 వరకు క్రమేపీ పెరుగుతున్న విశాఖపట్నం జనాభా 1991 వరకు పెరుగుదల శాతం తగ్గుతూ వచ్చింది. అయితే 1991-2001 మధ్యకాలంలో జనాభా పెరుగుదల శాతం పెరిగినా 2001-2011లో పెరుగుదల శాతం తగ్గింది. పెరుగుదల శాతాలను పక్కకు పెడితే గత దశాబ్దంలో జనాభా అత్యధికంగా 6.89, 752 మంది పెరిగారు. దీనికి ఇతర ప్రాంతాల నుండి వలసలు ఎక్కువ కావడమే ప్రధాన కారణం.

10th Class Social Textbook Page No.95

• అట్లాస్ పని :
ప్రశ్న 16.
మీ అట్లాస్ లో భారతదేశ పటాన్ని చూడండి. వివిధ ప్రదేశాలను వివిధ ఆకృతులు, పరిమాణాలు ఉన్న గుర్తులతో సూచించటాన్ని గమనించండి. ఉదా : దేశ రాజధాని, రాష్ట్ర రాజధాని, ఇతర నగరాలు మొదలైనవి. వివిధ సంకేతాలను ఉపయోగించి ఎన్ని స్థాయిలను చూపించారు ? చిన్న చిన్న గ్రామాలను అట్లాస్లో చూపించారా ? మీరు సొంతంగా ఒక పట్టిక తయారు చేసి ప్రదేశాలను స్థాయిని బట్టి పై నుంచి కిందికి (అవరోహణ) క్రమంలో పేర్కొనండి. ఇక్కడ ఒక పట్టిక ఉదాహరణగా ఇచ్చాం. అందులో రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఇతర ప్రదేశాలు ఇచ్చి వివరాలను నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 5
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 6

10th Class Social Textbook Page No.96

ప్రశ్న 17.
పాఠ్యపుస్తకం 97వ పేజీలో ఇవ్వబడిన పిరమిడ్ లోని కింది భాగం భారతదేశ జనాభా గణన ప్రకారం అతిచిన్న నివాసప్రాంతాలను సూచిస్తుంది. పైభాగం అతి పెద్ద నివాసప్రాంతాలను సూచిస్తుంది. క్రింది ఉన్న ఖాళీలను నింపండి.
1) ఒక ప్రత్యేక నివాసప్రాంత స్థాయికి ఇచ్చిన పేరు (రెండు ఉదాహరణలు ఉన్నాయి).
2) వివిధ నివాస ప్రాంతాలకు ఒక ఉదాహరణను ఆంధ్రప్రదేశ్ నుంచి పేర్కొనండి. (మహా నగరాలవి కాకుండా. ఎందుకు?)
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 7

4) నివాస ప్రాంతాలను కేవలం జనాభా ఆధారంగానే వర్గీకరించాలా? ఆలోచించండి. ఇతర విధానాలు ఏమైనా ఉన్నాయా? మీ టీచరుతో చర్చించి అటువంటి వర్గీకరణకు ప్రామాణికాలను గుర్తించంది.
జవాబు:
1)
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 8
2) ఆంధ్రప్రదేశ్ నుండి విజయవాడ ఒక నివాస ప్రాంతం. కారణం, ఆంధ్రప్రదేశ్ లో మహానగరము లేనందున.
3) నేను కలిసిపూడిలో నివసిస్తున్నాను. ఆకివీడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. కలిసిపూడి మా స్వగ్రామము. నాకు తెలిసిన వాటిలో ఆకివీడులోని జిల్లాపరిషత్ పాఠశాల మంచిది.
4) నివాస ప్రాంతాల వర్గీకరణ జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. మరియు ఈ వర్గీకరణ సౌలభ్యాలు, చారిత్రక విషయాలపై ఆధారపడుతుంది.

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 18.
ప్రపంచ పటంలో పక్కన ఉదాహరణగా ఇచ్చిన నగరాలను గుర్తించండి. విమానాశ్రయాలు, దేశాల పేర్లను కూడా పటంలో వేరు వేరుగా రాయండి. దీనివల్ల ఏవి దేశాలో, ఏవి నగరాలో, ఏవి విమానాశ్రయాలో గుర్తించటం తేలిక అవుతుంది.
జవాబు:

  1. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం
  2. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఢిల్లీ)
  3. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాదు)
  4. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం (బ్యాంకాక్, థాయ్ లాండ్)
  5. దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం (దుబాయి, యుఎఇ)
  6. కైరో అంతర్జాతీయ విమానాశ్రయం (కైరో, ఈజిప్టు )
  7. లండన్ హీఛీ అంతర్జాతీయ విమానాశ్రయం (లండన్, యుకె)

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 9

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 19.
మీ అట్లాసు ఉపయోగించి బరంపురాన్ని గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 10

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

SCERT AP 10th Class Social Study Material Pdf 6th Lesson ప్రజలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 6th Lesson ప్రజలు

10th Class Social Studies 6th Lesson ప్రజలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను గుర్తించి వాటిని సరిచేయండి. (AS1)
అ) ప్రతి పది సంవత్సరాలకు జనాభా గణన చేపడతారు.
ఆ) జనాభాలోని పెద్దవాళ్లలో ఆడవాళ్ల సంఖ్యను లింగ నిష్పత్తి తెలియజేస్తుంది.
ఇ) వయస్సును బట్టి జనాభా విస్తరణను వయస్సు సమూహం తెలియజేస్తుంది.
ఈ) కొండ ప్రాంతాలలోని వాతావరణాన్ని ప్రజలు ఇష్టపడతారు కాబట్టి అక్కడ జనాభా సాంద్రత ఎక్కువ.
జవాబు:
అ) ఒప్పు
ఆ) జనాభాలోని ఆడవాళ్ల సంఖ్యను లింగ నిష్పత్తి తెలియజేస్తుంది. ఇ) ఒప్పు
ఈ) కొండ ప్రాంతాలలోని వాతావరణాన్ని ప్రజలు ఇష్టపడరు కాబట్టి అక్కడ జనసాంద్రత తక్కువ.

ప్రశ్న 2.
దిగువ పట్టిక ఆధారంగా కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. (AS3)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు
ఎ) ప్రపంచ జనాభా మొదటిసారి రెట్టింపు కావటానికి సుమారుగా ఎన్ని శతాబ్దాలు పట్టిందో తెలుసుకోండి.
జవాబు:
ప్రపంచ జనాభా రెట్టింపు కావడానికి సుమారు మూడు శతాబ్దాలు పట్టింది.

బి) ఇంతకు ముందు తరగతులలో మీరు వలస పాలన గురించి చదివారు. పట్టిక చూసి 1800 నాటికి ఏ ఖండాలలో జనాభా తగ్గిందో తెలుసుకోండి.
జవాబు:
1800 సం|| నాటికి ఓషియానియాలో జనాభా తగ్గింది.

సి) ఏ ఖండంలో ఎక్కువ కాలంపాటు అధిక జనాభా ఉంది?
జవాబు:
ఆసియా ఖండంలో ఎక్కువ కాలంపాటు అధిక జనాభా ఉంది.

డి) భవిష్యత్తులో జనాభా గణనీయంగా తగ్గనున్న ఖండం ఏదైనా ఉందా?
జవాబు:
భవిష్యత్తులో ఉత్తర అమెరికా ఖండంలో జనాభా గణనీయంగా తగ్గనుంది.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

ప్రశ్న 3.
లింగ నిష్పత్తి చాలా ఎక్కువగాని, లేదా చాలా తక్కువగాని ఉంటే సమాజంపై పడే ప్రభావాలను పేర్కొనండి. (AS4)
జవాబు:

  1. లింగ నిష్పత్తి చాలా ఎక్కువగాని, తక్కువగాని ఉంటే సామాజికంగా చాలా తేడా వస్తుంది.
    ఉదా : కాలేజీల విద్యార్థుల సంఖ్య.
  2. ఈ నిష్పత్తి సంపద పంపిణీని, అధికార హోదాలను, ఎగ్జిక్యూటివ్ స్థాయిని, ప్రభుత్వ పని గంటలను అన్నింటినీ ప్రభావితం చేస్తుంది.
  3. ఈ నిష్పత్తి నేర రేటును కూడా ప్రభావితం చేస్తుంది.
  4. స్త్రీల సంఖ్య మరీ తక్కువగా ఉంటే సాధారణ పురుషులకు వివాహం జరగటం కష్టమవుతుంది. అన్ని రకాలుగా ముందున్న వారినే స్త్రీలు భర్తలుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది.
  5. లింగ నిష్పత్తిలో అసమానతలు జనన రేటును ప్రభావితం చేస్తాయి.

ప్రశ్న 4.
భారతదేశ అక్షరాస్యతను ఇతర దేశాలతో పోల్చండి : (AS1)
బ్రెజిల్, శ్రీలంక, దక్షిణ ఆఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్, నార్వే, చిలి, ఇండోనేషియా.
ఎటువంటి సారూప్యాలు, తేడాలు మీరు గమనించారు?
జవాబు:

  1. భారతదేశ అక్షరాస్యత శాతం : 74.04% (82.1% – 65.5%)
  2. బ్రెజిల్ : 90.04% (90.1% – 90.7%)
  3. చిలీ : 98.6% (98.6% – 98.5%)
  4. బంగ్లాదేశ్ : 57.7% (62% – 53.4%)
  5. ఇండోనేషియా : 90.4% (94% – 86.8%)
  6. నార్వే : 100% (100% – 100%)
  7. నేపాల్ : 66% (75.1% – 57.4%)
  8. శ్రీలంక : 91.2% (92.6% – 90%)
  9. దక్షిణ ఆఫ్రికా : 93% . (93.9% – 92.2%)

పోలికలు మరియు భేదాలు :

  1. దాదాపు అన్ని ఆసియా దేశాలు సమాన అక్షరాస్యతా రేటును కలిగి ఉన్నాయి. ఒకటి రెండు దేశాలలో మాత్రము యివి తక్కువగా ఉన్నాయి.
  2. పురుషుల అక్షరాస్యత శాతం బ్రెజిల్, నార్వేలలో తప్ప మిగతా దేశాలలో అధికంగానే ఉంది.
  3. స్త్రీ, పురుషుల అక్షరాస్యత శాతం మధ్య తేడా భారతదేశం, నేపాల్ లో అధికంగా ఉంది.
  4. ఒక్క నార్వే మాత్రం 100% అక్షరాస్యతను సాధించింది.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతాలలో జన సాంద్రత ఎక్కువగా ఉంది, దానికి కారణాలు ఏమిటి? (AS1)
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా 519, పశ్చిమ గోదావరి 508, తూర్పు గోదావరి 477, గుంటూరు 429 జనసాంద్రతలతో మొదటి నాలుగు స్థానాలలో ఉన్నాయి.

కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలలో అధిక జనసాంద్రతకు గల కారణాలు :
ఎ) కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉండటం వలన వ్యవసాయానికి అనుకూలత.
బి) వ్యవసాయాధారిత పరిశ్రమలు వృద్ధి.
సి) వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

ప్రశ్న 6.
జనాభా పెరుగుదల, జనాభా మార్పు మధ్య తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:

  1. జనాభా పెరుగుదల జననాల, మరణాల రేటుపై ఆధారపడి ఉంటుంది. జనగణన కాలంనాటి జనాభా మరియు దశాబ్దం క్రిందటి జనగణన కాలంనాటి జనాభాల తేడానే “జనాభా పెరుగుదల” అంటాం.
  2. జనాభా మార్పు అనేది వలసల ప్రాధాన్యత గల అంశం.
  3. జనాభా మార్పు = (జననాల సంఖ్య + ఆ ప్రాంతం / దేశంలోని వలస వచ్చిన వారి సంఖ్య) – (మరణాల సంఖ్య + ఆ ప్రాంతం / దేశం నుండి బయటకు వలస వెళ్ళిన వారి సంఖ్య)
  4. జనాభా పెరుగుదల దేశం మొత్తానికి దశాబ్దానికోసారి లెక్కిస్తాం.
  5. జనాభా మార్పు నిరంతర ప్రక్రియ. . ఉదాహరణకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో వర్షాధార భూములు గల ప్రాంత కూలీలు వ్యవసాయ పనులు లేనపుడు బహుళపంటలు వేసే ప్రాంతాలకు వలసపోతారు.
  6. సాగర తీరప్రాంత మత్స్యకారులు చేపలవేట నిషేధకాలంలో వీరావల్ వంటి ప్రాంతాలకు వలసపోతారు.
  7. ఇవి కాలానుగుణ వలసలు. కాగా ఉపాధి కోసం శాశ్వతంగా పట్టణాలకు వలసలు పోయే కుటుంబాలెన్నో !
  8. ఈ రకంగా వలసల వలన ఓ ప్రాంతంలో జనసాంద్రత తగ్గి, మరో ప్రాంతంలో జనసాంద్రత పెరుగుతుంది. అయితే ఈ జనాభా మార్పు జనాభా పెరుగుదలను ప్రభావితం చేయలేదు.
  9. అంతర్జాతీయ శాశ్వత వలసలు మాత్రమే జనాభా పెరుగుదలపై ప్రభావితం చూపుతాయి.

ప్రశ్న 7.
క్రింద ఇచ్చిన స్వీడన్, కెన్యా, మెక్సికో దేశాల వయస్సు సమూహాన్ని పోల్చండి. (AS3)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 2 AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 3
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 4
ఎ) ఈ దేశాల్లో జనాభా పెరుగుదల ఎలా ఉంటుంది?
బి) ఏ దేశాల జనాభా ఇంకా తగ్గవచ్చు?
సి) అన్ని దేశాలలో లింగ నిష్పత్తి సమతుల్యంగా ఉందా?
డి) ఈ దేశాల కుటుంబ సంక్షేమ పథకాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
ఎ) స్వీడన్లో జనాభా పెరుగుదల అధిక హెచ్చు తగ్గులతో ఉంది.
కెన్యా, మెక్సికోలలో జనాభా పెరుగుదల నిదానంగా ఒక పద్ధతిలో ఉన్నది.

బి) స్వీడన్

సి) స్వీడన్లో లింగ నిష్పత్తి – 980 పురుషులు 1000 స్త్రీలు
కెన్యాలో లింగ నిష్పత్తి – 1000 పురుషులు/1000 స్త్రీలు
మెక్సికోలో లింగ నిష్పత్తి – 960 పురుషులు 1000 స్త్రీలు

డి) ఈ 3 దేశాలలోకెల్లా కెన్యాలో కుటుంబ సంక్షేమ పథకాలు చక్కగా నిర్వహించబడుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

ప్రశ్న 8.
పటం పని (AS5)
అ) రాష్ట్రాలను సూచించే భారతదేశ పటంలో 2011 జనాభా గణాంకాల ఆధారంగా అయిదు స్థాయిలలో జనాభా సాంద్రతను సూచించండి.

స్థాయి – I:
1) ఉత్తరప్రదేశ్ – 199,581,477 (16.49%)
2) మహారాష్ట్ర – 112,372,972 (9.28%) 12 (9.28%)
3) బీహార్ – 103,804,637 (8.58%)
4) పశ్చిమబెంగాల్ – 91,374,736 (7.55%)
5) ఆంధ్రప్రదేశ్ – 49,368,776 (4.07%)
6) తెలంగాణ – 35,286,757 (2.91%)
7) మధ్య ప్రదేశ్ – 72,597,565 (6.00%)
8) తమిళనాడు – 72,138,958 (5.96%)

స్థాయి – II :
9) రాజస్థాన్ – 68,621,012 (5.67%)
10) కర్ణాటక – 61,130,704 (5.05%)
11) గుజరాత్ – 60,383,628 (5.00%)
12) ఒడిశా – 41,947,358 (3.47%)
13) కేరళ – 33,387,677 (2.76%)
14) జార్ఖండ్ – 32,966,238 (2.72%)
15) అసోం – 31,169,272 (2.58%)
16) పంజాబు – 27,704,236 (2.30%)
17) ఛత్తీస్ గఢ్ – 25,540,196 (2.11%)
18) హర్యా నా – 25,353,081 (2.09%)

స్థాయి – III :
19) జమ్ము , కాశ్మీర్ – 12,548, 926 (1.04%)
20) ఉత్తరాఖండ్ – 10,116,752 (0.84%)
21) హిమాచల్ ప్రదేశ్ – 6,856,509 (0.57%)

స్థాయి – IV:
22) త్రిపుర – 3,671,032 (0.30%)
23) మేఘాలయ – 2,964,007 (0.24%)
24) మణిపూర్ – 2,721,756 (0.22%)
25) నాగాలాండ్ – 1,980,602 (0.16%)
26) గోవా – 1,457,723 (0.12%)
27) అరుణాచల్ ప్రదేశ్ – 1,382,611 (0.11%)
28) మిజోరాం – 1,091,014 (0.09%)

స్థాయి – V:
29), సిక్కిం – 607, 6881 (0.05%)
30) ఢిల్లీ – 16,753,235 (1.38%) (NCT)
31) పుదుచ్చేరి – 1,244,464 (0.10%)(UTI)
32) చండీఘర్ – 1,054,686 (0.09%) (UTI)
33) అండమాన్,నికోబార్ దీవులు – 379,944 (0.03%)(UTI)
34) దా ద్రా నగర్ హవేలి – 342,853 (0.03%)(UTI)
35) డామన్, డయ్యు – 242,911 (0.02%)(UTI)
36) లక్షద్వీప్ – 64,429 (0.01%)(UTI)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 5

ఆ) జిల్లాలను సూచించే ఆంధ్రప్రదేశ్ పటంలో చుక్కల పద్ధతిని ఉపయోగించి (ఒక చుక్క పదివేల జనాభాను సూచిస్తుంది) జనాభా విస్తరణను చూపించండి.
జవాబు:

  1. చిత్తూరు – 4,170, 468 = [417]
  2. అనంతపురం : 4,083,315 = [408]
  3. కడప – 2,884,524 = [288]
  4. కర్నూలు – 4,046,601 = [405]
  5. నెల్లూరు – 2,966,082 = [297]
  6. ప్రకాశం – 3,392,764 = [339]
  7. గుంటూరు : 4,889,230 = [489]
  8. కృష్ణ – 4,529,009 = [453]
  9. తూర్పు గోదావరి – 5,151,549 = [515]
  10. పశిమ గోదావరి – 3,934,782 = [393]
  11. విశాఖపట్నం – 4,288,113 = [429]
  12. శ్రీకాకుళం – 2,699,471 = [270]
  13. విజయనగరం – 2,342,868 = [234]

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 6
గమనిక : విద్యార్ధులు పట్టికలోని బ్రాకెట్లలో చూపిన విధంగా చుక్కలను ఆయా జిల్లాలలో పెట్టవలయును.

10th Class Social Studies 6th Lesson ప్రజలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.71

ప్రశ్న 1.
మీ చుట్టుప్రక్కల గల వేరు వేరు జీవనోపాధులు, ఆదాయాలు ఉన్న వ్యక్తులతో మాట్లాడండి. ఎంతమంది పిల్లలు ఉండటం సరైనదో వాళ్లని అడగండి.
జవాబు:
మా చుట్టుప్రక్కల గల వేరు వేరు జీవనోపాధులు, ఆదాయాలు ఉండే వ్యక్తులతో మాట్లాడగా ఒకరు లేదా ఇద్దరు సంతానం సరియైనదని అభిప్రాయపడ్డారు.

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 2.
పై చదువులకు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు అవకాశాలు లభిస్తున్నాయా?
జవాబు:
పై చదువులకు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు అవకాశాలు లభిస్తున్నాయి. కానీ తల్లిదండ్రుల వైఖరి కారణంగా కొద్దిమంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నతవిద్య నభ్యసించగలుగుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 3.
పెళ్లిన మహిళలకు ఇంటి బయట పని చేయటానికి, ప్రయాణాలు చేయటానికి అవకాశాలు ఉన్నాయా?
జవాబు:
పెళైన మహిళలకు ఇంటి, బయట పనిచేయడానికి, ప్రయాణాలు చేయడానికి అవకాశాలున్నాయి. అయితే సరియైన రక్షణ లేకపోవడం, పనిచేసే ప్రదేశాలలో మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 4.
మహిళలు వారి పుట్టింటితో సంబంధాలు పెట్టుకోకూడదా? వాళ్లకు ఆస్తులపై హక్కు ఉండకూడదా? భద్రత ఉండకూడదా?
జవాబు:
మహిళలు వారి పుట్టింటితో సంబంధాలు పెట్టుకోవచ్చు. వారికి ఆస్తులపై చట్టపరంగా హక్కులున్నాయి. భద్రత తప్పనిసరిగా ఉండాలి.

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 5.
మీ ప్రాంతంలో మగ పిల్లలను ఎక్కువగా కోరుకుంటారా?
జవాబు:
మా ప్రాంతంలో మగ పిల్లలను, ఆడపిల్లలను ఇద్దరినీ కోరుకుంటారు. అయితే మగసంతానం తప్పనిసరి అని భావిస్తారు. అయితే క్రమేపీ ఈ అభిప్రాయాల్లో మార్పు వస్తుంది. ఆడైనా, మగైనా ఇద్దరు చాలు అనే భావన ఎక్కువ మందిలో ఉంది.

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 6.
మీ ఊళ్ళో, పట్టణంలో నిరక్షరాస్యులు ఉన్నారేమో తెలుసుకోండి. మీ సర్వే ఏం చెపుతోంది?
జవాబు:
మా గ్రామంలో నిరక్షరాస్యులున్నారు. మేం చేసిన సర్వే కూడా ఈ విషయాన్నే తెలిపింది. విద్యాహక్కు చట్టం వచ్చిన తరువాత శతశాతం నమోదు, నిలకడను చూడవచ్చు. అయితే వయోజనులైన నిరక్షరాస్యులు వారికి ఏర్పాటుచేసిన అక్షరభారత కేంద్రాలను పూర్తిగా సద్వినియోగపరచుకోవడం లేదు.

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 7.
ఫెర్టిలిటీ శాతం 2 కి దగ్గరగా ఉంటే ఏమిటి అర్థం ? చర్చించండి.
జవాబు:
ఫెర్టిలిటీ శాతం 2 కి దగ్గరగా ఉంటే జంటలు ఇద్దరు పిల్లలను కనాలని కోరుకుంటున్నారని అర్ధం.

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 8.
మీరు బృందాలలో చేసిన సర్వేలో 45 సంవత్సరాలు పైబడిన మొత్తం మహిళల సంఖ్య, వారి పిల్లల సంఖ్య తెలుసుకోండి. మీ సర్వేలో సగటున ప్రతి మహిళకు ఎంత మంది పిల్లలు ఉన్నారు?
జవాబు:
ఇద్దరు

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 9.
పిల్లల విషయంలో ఉమేర్ సింగ్ ని ఏ అంశాలు ప్రభావితం చేశాయి ? అతని కూతురు కూడా అలాగే ఆలోచిస్తోందా?
జవాబు:
ఉమేర్ సింగ్ కు అబ్బాయి కావాలనే కోరిక వలన సంతానం ఆరుకు చేరింది. అతని కూతురు తండ్రిలా కాకుండా ముగ్గురు పిల్లలను మాత్రమే కావాలనుకుంది.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 10.
ఏ సంవత్సరం నాటికి ఊరిలోని భూమి అంతా సాగులోకి వచ్చింది?
జవాబు:
1950 నాటికి ఊరిలోని భూమి అంతా సాగులోకి వచ్చింది.

10th Class Social Textbook Page No.71

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో, ఊరిలో, దేశమంతటిలో ఉంటున్న ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ఎలా సేకరిస్తారో, నమోదు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? జనగణనలో తమ అనుభవాలను చెప్పమని మీ టీచరుని అడగండి.
జవాబు:
భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకోసారి జనాభాను సేకరిస్తారు. జనాభా సేకరణకు ఒక ఏడాది ముందు మే నెలలో ఆవాస ప్రాంతాల గుర్తింపు, నివాసాలు, కుటుంబాలు గుర్తించటం వాటి వివరాలు నమోదుచేస్తారు. వీటి చిత్తుపటాలను రూపొందిస్తారు. ఇంటింటికి వెళ్ళి ప్రతి వ్యక్తి పూర్తి వివరాలు మరుసటి సంవత్సరం ఫిబ్రవరిలో వివరంగా సేకరించి నమోదుచేస్తారు.

10th Class Social Textbook Page No.73

ప్రశ్న 12.
కుటుంబాన్ని ఎలా నిర్వచిస్తారు ? ఎవరెవరిని కుటుంబం కింద పరిగణిస్తారు?
జవాబు:
కుటుంబాలు 2 రకాలు :

1) సాధారణ కుటుంబాలు :
ఒకే ప్రాంగణంలో నివసిస్తూ ఉమ్మడిగా వంట చేసుకొనే సభ్యులను కుటుంబంగా పేర్కొంటాం. కుటుంబంలోని వారు అనగా తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు, తాత, నాన్నమ్మతో పాటు కుటుంబంలోని వారందరినీ కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తారు.

2) సంస్థాగత కుటుంబాలు :
బంధుత్వాలు లేకపోయినా ఉమ్మడిగా వండిన వంటను తినేవారు, ఒకే ప్రాంగణంలో నివసించేవారిని “సంస్థాగత కుటుంబాలు” అంటాం.
ఉదా :
వసతి గృహాలు, జైలు మొ||నవి.

10th Class Social Textbook Page No.73

ప్రశ్న 13.
విద్యకు ఎటువంటి వర్గీకరణను ఉపయోగిస్తారు? ఉదాహరణకు : 6 సంవత్సరాలలోపు పిల్లలు, పాఠశాల/కళాశాలలో చదువుతున్నారు, తరగతి…..; బడిలో ఉండాలి కాని పేరు నమోదు కాలేదు. ……. తరగతి వరకు చదివారు; బడికి అసలు వెళ్లలేదు.
జవాబు:
విద్య – వర్గీకరణ : 6-14 సం||ల పిల్లల వర్గీకరణ :

  1. పేరు
  2. వయస్సు
  3. పాఠశాల పేరు
  4. తరగతి
  5. పాఠశాలలో నమోదు కాకపోతే కారణం
  6. బడిలో చేరి మానివేస్తే కారణం ఏడో తరగతిలో మానివేశాడు
  7. ప్రత్యామ్నాయ పాఠశాలల్లో చేరుటకు (ఉదా : RBC/ KG స్కూల్సు) సిద్ధమా?

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.73

ప్రశ్న 14.
వృత్తికి ఎటువంటి వర్గీకరణను ఉపయోగిస్తారు?
ఉదాహరణలు : గృహిణి, విద్యార్థి, ……….. స్వయం ఉపాధి, ఉద్యోగం, నిరుద్యోగి, పదవీ విరమణ, వృద్ధులు.
జవాబు:
వృత్తి – వర్గీకరణ : గృహిణి | వ్యవసాయం / విద్యార్థి / శ్రామికుడు / వ్యవసాయ కూలీ / ఉద్యోగి / నిరుద్యోగి / వ్యాపారం / స్వయం ఉపాధి / ఆస్తిపై వచ్చే అద్దెలు / వడ్డీలతో పోషణ ………….

సర్వే తరువాత :
ఎ) సర్వే చేసిన కుటుంబాలలోని మనుషుల లెక్కను చూపించటానికి ప్రతి బృందమూ కింద చూపిన విధంగా పట్టిక తయారుచేయాలి:

పురుషులు స్త్రీలు మొత్తం జనాభా

జవాబు:

పురుషులు స్త్రీలు మొత్తం జనాభా
330 315 645

బి) మీ బృందంలో స్త్రీ : పురుషుల నిష్పత్తి ఏమిటి? వివిధ బృందాలలో ఈ నిష్పత్తిలో తేడా ఉందా? చర్చించండి.
6 – 14 సంవత్సరాల పిల్లలకు :
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 7
జవాబు:
6 – 14 సంవత్సరాల పిల్లలకు : (156 మంది)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 8

సి) అన్ని బృందాలకు కలిపి మొత్తం పిల్లల్లో అసలు బడిలో చేరనివాళ్లు, బడి మానేసినవాళ్ల శాతం ఎంత? దీనికి కారణాలు ఏమిటి?
జవాబు:
అన్ని బృందాలకు కలిపి మొత్తం పిల్లల్లో అసలు బడిలో చేరనివాళ్లు, బడి మానేసినవాళ్ల శాతం = 8%

కారణాలు:

  1. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి
  2. వారి మూఢ నమ్మకాలు
  3. బోధనా పద్ధతులు మరియు
  4. ఆంగ్లం, గణితం వంటి సబ్జెక్టులు మొదలగునవి.

డి) 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో బడిలో గడిపిన సగటు సంవత్సరాలు ఎంత? వివరాలు తెలుసుకోండి. ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందా?
జవాబు:
20 సంవత్సరాలు పైబడినవాళ్ళల్లో బడిలో గడిపిన సగటు సంవత్సరాలు 12 సంవత్సరాలు.
ఈ సమాచారం ప్రతి వ్యక్తి పాఠశాల, కళాశాల విద్య గురించి అంచనా వేయడానికి ఉపకరిస్తుంది.

ఇ) 15-59 సంవత్సరాల వాళ్లకు :

వృత్తి సంఖ్య శాతం
స్వయం ఉపాధి
గృహిణి
ఉద్యో గి
నిరుద్యో గి
విద్యార్థి
మొత్తం

మీ నమూనా గణనలో ‘పనిచేస్తున్న వారు’, ‘ఇతరులపై ఆధారపడేవారు’ అనే అంశాలను ఏ విధంగా వర్గీకరిస్తారు?
జవాబు:

వృత్తి సంఖ్య శాతం
స్వయం ఉపాధి 92 19%
గృహిణి 196 40%
ఉద్యో గి 846 17%
నిరుద్యో గి 38 8%
విద్యార్థి 81 16%
మొత్తం 491 100%

10th Class Social Textbook Page No.74

ప్రశ్న 15.
క్రింది గ్రాఫ్ ను పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 9-1
భారతదేశ జనాభా పిరమిడ్, 2011
పైన ఇచ్చిన జనాభా పిరమిడ్ ఆధారంగా జనాభాలో పిల్లల శాతం ఎంతో ఉజ్జాయింపుగా లెక్కగట్టండి.
జవాబు:
పిల్లల శాతం – 31%
పురుషులు – 190,075,426
స్త్రీలు – 172,799,553

10th Class Social Textbook Page No.74

ప్రశ్న 16.
మీరు చేసిన సర్వే ఆధారంగా ప్రతి బృందం పట్టికలో కింది వివరాలను పొందుపరచాలి. వయస్సు, ప్రజల సంఖ్య, పిల్లలు, పనిచేస్తున్నవాళ్లు, వృద్ధులు.
జవాబు:

పిల్లలు (0-6) 12
బడి ఈడు పిల్లలు (6-14) 15
పనిచేస్తున్నవారు 20
వృద్ధులు 25

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 17.
మీ సర్వేలో కనుగొన్న శ్రామికులను, జనాభా గణనలో నమోదైన వివిధ పనుల వారితో పోల్చండి.
జవాబు:
సర్వేలో కనుగొన్న శ్రామికులు ఒక ప్రాంతంలో గల పరిమిత రంగాలకు చెందినవారు ఉంటారు. జనాభా గణనలో నమోదైన శ్రామికులు దేశంలోని అన్ని రంగాలకు చెందినవారు ఉంటారు.

10th Class Social Textbook Page No.79

ప్రశ్న 18.
కింది విదేశాలకు సంబంధించిన రెండు పోస్టర్లు ఇవ్వబడ్డాయి. వాటిలో ఇవ్వబడిన సందేశాన్ని ఊహించగలరా? ఇటువంటి పోస్టర్లను భారతదేశంలో ఎప్పుడైనా చూశారా? చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 10
జవాబు:
మొదటి పోస్టర్ :
బిడ్డ ఆడైనా, మగైనా సమానమే అనే భావనను చెబుతుంది.

రెండో పోస్టర్ :
మొదటి అపరిమిత సంతానం వల్ల పడే ఇబ్బందులను, కొరతను తెలియజేస్తున్నది. రెండవది పరిమిత సంతానం ద్వారా పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు. దుస్తులు, విద్య వైద్య సదుపాయాలు కల్పించవచ్చు అనేది తెలుస్తున్నది.

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 19.
ఇటీవల పెళ్లి జరిగి ఇంకా పిల్లలు లేని దంపతులతో మాట్లాడండి. వాళ్లు ఎంత మంది పిల్లల్ని కనాలనుకుంటున్నారు? దానికి కారణాలు ఏమిటి?
జవాబు:
ఇటీవల పెళ్లి జరిగి ఇంకా పిల్లలు లేని దంపతులలో ఎక్కువ మంది ఒకరు లేదా ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలను కుంటున్నారు. పరిమిత సంతానమైతే వారిని చక్కగా పెంచి మంచి భవిష్యత్తు అందివ్వవచ్చును అని భావిస్తున్నారు.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 20.
పెరుగుతున్న కుటుంబ పరిమాణానికి భూమి ఉన్నవాళ్లు ఎలా స్పందించారు?
జవాబు:
వర్షాధారమైన తన భూమిలో మరిన్ని పంటలు (బహుళ పంటలు) పండించటానికి బోరుబావులు త్రవ్వించి ఉత్పత్తిని పెంచారు. వ్యవసాయం లేని రోజులలో ఇతర పనులకు కూడా వెళ్లేవారు.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 21.
కుటుంబ పరిమాణం పెరిగినప్పుడు గోవిందులాంటి చిన్న రైతులు ఎలా స్పందించారు? బోరుబావిలో సాగునీరు ఎంతవరకు ఉపయోగపడింది?
జవాబు:
కుటుంబ పరిమాణం పెరిగినపుడు గోవిందు లాంటి చిన్నరైతులు ప్రత్యామ్నాయాలు ఆలోచించారు. వర్షాధార భూములలో బోరుబావులు త్రవ్వడం ద్వారా సాగునీటి సౌకర్యం పొందారు. బహుళ పంటలను పండించి ఆదాయాన్ని పెంచుకున్నారు. ఖాళీ సమయాల్లో ఇతర పనులకు వెళ్లి ఆదాయం పెంచుకున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.71

ప్రశ్న 22.
నమూనా సేకరణ, జన గణన ద్వారా సమాచారం సేకరించటంలో తేడాలు ఏమిటి ? కొన్ని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:
నమూనా సేకరణ, జన గణన ద్వారా సమాచారం సేకరించటంలో తేడాలు :

నమూనా సేకరణ ద్వారా జన గణన ద్వారా
1) సేకరించిన సమాచారం ఎంపికచేసిన ప్రాంతానికే పరిమితం. 1) దేశం మొత్తానికి సంబంధించింది.
2) ఒక ప్రాంతానికి చెందిన నమూనా సేకరణ సులభం. 2) జన గణన ద్వారా సమాచార సేకరణ సంక్లిష్టమైనది.
3) నమూనా సేకరణలో సమాచార సేకరణ కొన్ని అంశాలకే పరిమితం. ఉదా : ఆ ప్రాంతంలోని వారందరూ వ్యవసాయ కూలీలే కావచ్చు. 3) అన్ని అంశాలపై సమాచార సేకరణకు వీలుంటుంది. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమాచారం సేకరిస్తాం.
4) దీనికి కొద్దిమంది సిబ్బంది చాలును. 4) లక్షల సంఖ్యలో సిబ్బంది అవసరం అవుతారు.
5) ఆర్థిక ఖర్చు పరిమితం. 5) జనగణనకు కోట్లాది రూపాయలు ఖర్చవుతాయి.

సర్వే నిర్వహణ

10th Class Social Textbook Page No.72

ప్రశ్న 23.
ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు గల సర్వే నిర్వహణ బృందం తమ ప్రాంతంలోని 10 కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించాలి. సర్వేకు ఉపయోగించాల్సిన పత్రం కింద ఉంది.
• ప్రతి బృందం కింద ఇచ్చిన పట్టికను పూరించాలి.
• అన్ని బృందాల పట్టికల ఆధారంగా ప్రశ్నలను తరగతి గదిలో చర్చించాలి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 11
జవాబు:
విద్యార్థి ఈ కృత్యాన్ని స్వయంగా నిర్వహించాలి.

సర్వే చేయటానికి ముందు:
• సర్వే ఫారంలో ఉపయోగించిన పదాలన్నింటిని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోటానికి తరగతి గదిలో చర్చించాలి. లేకపోతే సర్వే చేసేటప్పుడు గందరగోళం ఏర్పడి ఒక బృందం ఫలితాలను మరొక బృందంతో పోల్చటం కష్టమౌతుంది. మీ ఉపాధ్యాయుని సహాయంతో ఈ కింది పదాల గురించి చర్చించండి.

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 24.
అభివృద్ధిని అక్షరాస్యత ఎలా ప్రభావితం చేస్తుంది? చర్చించండి.
జవాబు:
అభివృద్ధిని అక్షరాస్యత ప్రభావితం చేసే అంశాలు.

  1. అక్షరాస్యులు మూఢ నమ్మకాలను వదలి శాస్త్రీయంగా ఆలోచిస్తారు.
  2. వ్యవసాయ/వస్తూత్పత్తిలో నూతన విధానాలను అవలంబించి జాతీయ ఉత్పత్తిని పెంచెదరు.
  3. అధిక ఆదాయాన్ని పొంది జాతీయ ఆదాయాన్ని పెంచుతారు.
  4. ఉత్తమ పౌరులుగా బాధ్యతలను నిర్వర్తించగలరు.
  5. ఉత్తమ సమాజ రూపకల్పనకు కృషి చేస్తారు.
  6. తమ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు.
  7. వృత్తిని దైవంగా భావించి ఇతరులకు ఆదర్శంగా ఉంటారు.
  8. నూతన పరికరాలు / విధానాలు కనుగొనేందుకు దోహదపడతారు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 25.
వ్యవసాయ భూమిని సాగుచేసే వ్యక్తికి, వ్యవసాయ కూలీకి మధ్య గల తేడాలేమిటి?
జవాబు:

వ్యవసాయ భూమి సాగుచేసే వ్యక్తి వ్యవసాయ కూలీ
1) తాను పండించే పంటపై ఆధారపడతాడు. 1) లభించే కూలీపై ఆధారపడతాడు.
2) సమాజంలో గౌరవం ఉంటుంది. 2) సాధారణ వ్యక్తిగా జీవిస్తాడు.
3) ఆదాయం ఎక్కువ. 3) ఆదాయం పరిమితం.
4) ఆదాయంలో కొంత మిగులు ఉంటుంది. 4) పరిమిత ఆదాయంతో కుటుంబ పోషణ అంతంత మాత్రంగా ఉంటుంది.
5) ఆదాయానికి కొంత మేర హోదా / పరపతి ఉంటాయి. 5) పని దొరుకుతుందో లేదో అనే చింతన ఉంటుంది.
6) పంట పండుతుందో లేదో అనే భయం ఉంటుంది. 6) రిస్కు ఉండదు.
7) వ్యవసాయభూమి సాగుచేస్తూనే విరామకాలంలో ఏదైనా వృత్తి, వ్యాపారం చేయవచ్చు. 7) వ్యవసాయపనులు లేనప్పుడు ఇతర పనులకు వెళతారు.

10th Class Social Textbook Page No.78

ప్రశ్న 26.
క్రింది (ను పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 12
i) పైన ఇచ్చిన ను పరిశీలించి ఏ దశాబ్ద కాలంలో జనాభా తగ్గిందో చెప్పండి.
జవాబు:
1911-1921 దశాబ్దంలో జనాభా తగ్గింది.

ii) ఏ సంవత్సరం నుంచి జనాభా నిరంతరంగా పెరుగుతోంది?
జవాబు:
1921 సంవత్సరం నుండి జనాభా నిరంతరంగా పెరుగుతోంది.

iii) భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జనాభా వేగంగా పెరగటానికి కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కరవు, సహాయం, ఆహారధాన్యాల తరలింపు, చౌకధరల దుకాణాలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుకుగా పాల్గొనడం వంటి వాటి వల్ల కరవుల ప్రభావం తగ్గిపోయింది. అదే విధంగా కర, ప్లేగు, కొంతవరకు మలేరియా వంటి అంటురోగాలను నియంత్రించగలిగారు. అనేక రోగాలకు కలుషిత నీరు, ఇరుకు ఇళ్లల్లో ఉండటం, పారిశుద్ధ్య లోపం వంటివి ప్రధాన కారణాలు. ఈ రోగాలను ఎదుర్కోవాలంటే మెరుగైన పారిశుద్ధ్యం, శుభ్రమైన నీళ్లు, పోషకాహారం అందించాలని అందరూ గుర్తించసాగి ఆ దిశగా అనేక చర్యలు చేపట్టారు. ఆ తరువాత వైద్యరంగంలో పురోగమనం వల్ల ప్రత్యేకించి టీకాలు, యాంటిబయాటిక్స్ వల్ల మెరుగైన ఆరోగ్యం సాధ్యమయ్యింది. 1900తో పోలిస్తే మరణాల శాతం గణనీయంగా తగ్గింది. జననాల శాతం ఎక్కువగా ఉండటానికి తగ్గుతున్న మరణాల శాతం తోడై జనాభా వేగంగా పెరగసాగింది.

10th Class Social Textbook Page No.80

ప్రశ్న 27.
భారతదేశ జనాభా పెరుగుదల స్వరూపం, శాతం, ఖాళీలను పూరించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 13
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 14

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 28.
మీ కుటుంబంలో మూడు తరాలపాటు ప్రతి మహిళకు ఎంతమంది సంతానమో తెలుసుకోండి. మీకు ఎటువంటి మార్పులు కనపడ్డాయి?
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 15
రెండవ తరంలోనే కుటుంబ నియంత్రణ పాటించడం నేను గమనించాను. కనుక ప్రస్తుతం పెరుగుదల శాతం తగ్గుతోంది.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 29.
కింద ఉన్న భారతీయ పటాన్ని చూడండి. భారతదేశ భౌగోళిక స్వరూపానికి, జనాభా సాంద్రతకు మధ్య ఏమైనా సంబంధం ఉందేమో చూడండి. దేశంలోని ప్రధాన నగరాలను గుర్తించగలరా? నగరాలలోని అధిక జనాభా సాంద్రతను ఎలా వివరిస్తారు?
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 16
జవాబు:
దేశంలోని ప్రధాన నగరాలను గుర్తించగలం.
సూచికలో చూపిన సూచనల ఆధారంగా నగరాలలోని అధిక జనసాంద్రతను వివరించగలం.

  1. భూమి సహజ స్వరూపాన్ని భౌగోళిక స్వరూపం అంటాం. చదరపు కిలోమీటరుకు సగటున నివసించే ప్రజలను జనసాంద్రత అంటాం.
  2. బాగా పంటలు పండే ప్రాంతాలు, పారిశ్రామికవాడలైన ‘గంగా-సింధు మైదానం’ లో జనసాంద్రత ఎక్కువ.
  3. థార్ ఎడారి ప్రాంతం ప్రజల జీవనానికి ఏమాత్రం అనుకూలంగా లేనందున అచ్చట జనసాంద్రత అత్యల్పం.
  4. తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో వర్షపాతం ఎక్కువ. పంటలు బాగుగా పండును. అందుచే ఈ ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువ.
  5. హిమాలయ పర్వత ప్రాంతం సుందరమైనదైనప్పటికీ ఈ ప్రాంతం ఎప్పుడూ మంచుచే కప్పబడియుండుటచే జన జీవనానికి అనుకూలంగా ఉండదు. అందుచే ఇచ్చట జనసాంద్రత తక్కువ.
  6. ఈశాన్య భారతదేశం కొండలతో నిండియున్నందున జనసాంద్రత తక్కువ.

10th Class Social Textbook Page No.83

ప్రశ్న 30.
ఈ క్రింది పటమును పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 17
ఇక్కడ 2011కి ఆంధ్రప్రదేశ్ జన సాంద్రత గణాంకాలు ఉన్నాయి. జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ పటంలో వివిధ జన సాంద్రత స్థాయిలను సూచించండి.
అధిక జన సాంద్రత ఉన్న ఒక జిల్లాను తక్కువ సాంద్రత ఉన్న మరొక జిల్లాతో కింది అంశాలలో పోల్చండి.

అ) భూ ఉపరితలం, వ్యవసాయ అభివృద్ధికి అవకాశాలు.
ఆ) ఆ ప్రాంతంలో వ్యవసాయ చరిత్ర – భూమి, నీరు, ఇతర సహజ వనరుల వినియోగం.
ఇ) ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రాంతంలోకి వలసలు, దీనికి కారణాలు.
జవాబు:
అ) అధికం – కృష్ణా
అల్పం – వై.యస్.ఆర్. కడప

అ)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 18

ఇ) 1) వై.యస్.ఆర్. కడప జిల్లాకు వలసలు దాదాపు శూన్యం .
2) విద్య ఉద్యోగాల నిమిత్తం వై.యస్. ఆర్. కడప నుండి వలస వెళుతున్నారు.
3) విద్య, ఉద్యోగాల నిమిత్తం కృష్ణాజిల్లా నుండి మరియు కృష్ణాజిల్లాకు వలస వెళుతున్నారు.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 19

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

SCERT AP 10th Class Social Study Material Pdf 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Studies 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భారతదేశంలోని ప్రధాన నదీవ్యవస్థలను వివరించటానికి కింది అంశాల ఆధారంగా ఒక పట్టిక తయారుచేయండి. నది ప్రవహించే దిశ, అవి ఏ రాష్ట్రాలు లేదా దేశాల గుండా ప్రవహిస్తున్నాయి, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు. (AS3)
(లేదా)
భారతదేశంలోని ఏవేని నాలుగు ప్రధాన నదీ వ్యవస్థలను పట్టిక రూపంలో వివరించండి.
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 1
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 2 AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 3

ప్రశ్న 2.
వ్యవసాయం, పరిశ్రమలు వంటి వివిధ సందర్భాలలో భూగర్భజలాల వినియోగాన్ని సమర్థించే, వ్యతిరేకించే వాదనలను పేర్కొనండి. (AS2)
జవాబు:

  1. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రధాన నీటివనరు భూగర్భజలమే.
  2. వ్యవసాయం, పరిశ్రమలు మరియు ఇతర అవసరాలకు కూడా ఈ నీరే ప్రధాన వనరు.

భూగర్భజల వినియోగాన్ని సమర్థించే వాదనలు :

  1. అధిక ఉత్పత్తికి, అన్ని రకాల రైతులకు సమానస్థాయిలో నీరు అందడానికి, కరవు పరిస్థితులను అధిగమించడానికి, వ్యవసాయ ఉత్పత్తిని క్రమబద్ధం చేయడానికి మరియు ఉద్యోగాల కల్పనకు భూగర్భజల వినియోగం అవసరం.
  2. యంత్రాలను చల్లబరచడానికి, ఇతర పారిశ్రామిక అవసరాలకి కూడా ఇది అవసరం.
  3. భారతదేశ ఆర్థిక ప్రగతికి ఈ నీరే అధిక అవసరం.

భూగర్భ జల వినియోగాన్ని వ్యతిరేకించే వాదనలు :

  1. భారతదేశం భూగర్భజల వినియోగంలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్నది.
  2. ఈ వినియోగం భూగర్భ జలాలను తగ్గించివేస్తుంది. సముద్రపు నీరు తీరప్రాంతాలలోనికి చొచ్చుకుని వచ్చేలా చేస్తుంది.
  3. పరిశ్రమలలో ఉపయోగించిన నీరు భూగర్భజలాలను కలుషితం చేస్తుంది.

ప్రశ్న 3.
నీటి వనరుల విషయంలో అంతర్గత, బాహ్య ప్రవాహాల ప్రక్రియలను వివరించండి. (AS1)
జవాబు:
అంతర్గత ప్రవాహాలు : ఏ ప్రాంతానికైనా. అంతర్గత ప్రవాహాలు = అవపాతం + ఉపరితల ప్రవాహం + భూగర్భ ప్రవాహం. ఉపరితల ప్రవాహం అంటే భూమి మీద వాగులు, కాలువలు, నదులు వంటి వాటిల్లోని నీటి ప్రవాహం. భూగర్భ జల ప్రవాహాన్ని అంచనా వేయవచ్చు కానీ అది కొంచెం కష్టమైన పని. అవపాతం అంటే వాన ఒక్కటే కాకుండా వడగళ్లు, హిమము, పొగమంచు కూడా ఉంటాయి. అవపాతం అన్ని సంవత్సరాలు ఒకేలాగా కాకుండా ప్రతీ సంవత్సరం మారుతూ ఉంటుంది. అందువలన అవపాతాన్ని లెక్కించడానికి కొన్ని సంవత్సరాల అవపాతం యొక్క సగటును పరిగణలోనికి తీసుకుంటారు.

ఉపరితల, భూగర్భ నీటి ప్రవాహాలు :
మీ ప్రాంతానికి, అది చిన్న గ్రామమైనా, పట్టణమైనా నదులు, సాగునీటి పథకాల కాలువలు వంటి వాటి ద్వారా దిగువకు వచ్చే నీటి ప్రవాహాల జాబితా తయారుచేయండి.

ఒక గ్రామంలాంటి ఒక చిన్న ప్రాంతానికి కాలువలు, పైపులు వంటి వాటి ద్వారా నీళ్లు రావచ్చు – ఇటువంటి బయటి వనరులన్నింటినీ పేర్కొనండి. అవపాతానికి దీనిని జోడిస్తే ఆ ప్రాంతం లోపలికి మొత్తం ఎంత నీళ్లు వస్తాయో తెలుసుకోవచ్చు. భూగర్బం ద్వారా లోపలికి వచ్చే నీటిని అంచనా వేయటం కొంచెం కష్టం. అయితే నేల వాలుని బట్టి భూగర్భ జలం ఎటు ప్రవహిస్తుందో కొంత ఊహించవచ్చు.

బాహ్య ప్రవాహాలు :

బాష్పోత్సేకం :
అన్ని నీటి మడుగుల నుంచి నీరు ఆవిరిగా మారుతుంటుంది. చెరువులు, నదులు, సముద్రాలు వంటి అన్ని ఉపరితల నీటి వనరుల నుంచి నీరు ఆవిరి అవుతుంది. అన్ని జీవులు శ్వాస ప్రక్రియ ద్వారా గాలిలోకి నీటిని విడుదల చేస్తాయి.

ఉపరితల ప్రవాహాల ద్వారా, భూగర్భ ప్రవాహాల ద్వారా బయటకుపోయే నీళ్లు :
ఒక గ్రామంలాంటి ప్రాంతాన్ని ఊహించుకోండి. కొంత నీళ్లు వాగులగుండా ఉపరితల ప్రవాహం ద్వారా బయటకు ప్రవహిస్తాయి. వానాకాలంలో ఈ ఉపరితల ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. వర్షపాతంలో కొంత నేలలోకి, భూమి లోపలి పొరల్లోకి ఇంకి భూగర్భ జలాలను’ తిరిగి నింపుతాయి. దీంట్లో కొంత బావులు, బోరు బావులలోకి ప్రవహించి తిరిగి వినియోగానికి వస్తుంది, కొంత చాలా లోతైన నీటి ఊటలను చేరి మళ్లీ అందుబాటులోకి రాదు. భూగర్భ జలంలో కొంత భూగర్భ ప్రవాహాలను చేరి తిరిగి బయటకు వచ్చి వాగులు, నదులలో కలుస్తుంది.

వ్యవసాయానికి నీళ్లు :
పంటల వేళ్లు ఉండే ప్రాంతంలోకి నీళ్లు వర్షపాతం ద్వారాగానీ, సాగునీటి ద్వారాగానీ చేరుతుంది. నేలకి తేమని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వరద వంటి పరిస్థితుల్లో ఎక్కువ నీళ్లు ఉండి, అది నేల లోపలి పొరల్లోకి ఇంకకపోతే మొక్కల వేళ్లు దెబ్బతింటాయి. ఇంకొకవైపు కరవు పరిస్థితులలో వేళ్ల ప్రాంతంలో తగినంత తేమ లేకపోతే పంటలు వడిలిపోతాయి.

గృహ అవసరాలకు, పశువులకు నీటి వినియోగం :
తాగునీటికి, వంటకి, స్నానానికి, శుభ్రపరచడానికి, పశువులకు ఉపయోగించే నీరు చాలా ముఖ్యమైనది. ఆదాయాలతో సంబంధం లేకుండా అందరికీ ఈ అవసరాల కోసం తగినంత నీళ్లు అందేలా చూడటానికి ప్రణాళికలు తయారుచేయాలి.

పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం :
ఉత్పత్తి ప్రక్రియలకు కూడా నీళ్లు అవసరమవుతాయి. అయితే దీనికీ వ్యవసాయ, గృహ వసతి అవసరాలకూ మధ్య వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యం పెరుగుతోంది, కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకోవాలి. పారిశ్రామిక అవసరాల కోసం నీటి వినియోగంలో కాలుష్య నివారణ, నీటిని తిరిగి వినియోగించుకోవడం అన్నవి ముఖ్యమైన సవాళ్లు.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 4.
భూగర్భ జల వనరులను అంతర్గత, బాహ్య ప్రవాహాలలో ఏ ప్రక్రియ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? (AS1)
జవాబు:
భూగర్భ జల వనరులను వర్షపాతం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

ప్రశ్న 5.
తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో నీటి వనరులకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్ల జాబితా తయారుచేయండి. ఈ అధ్యాయంలో కానీ, లేదా ఇతర తరగతులలో కానీ ఈ సమస్యలకు సంబంధించి చర్చించిన పరిష్కారాలను పేర్కొనండి. (AS4)
జవాబు:
ద్వీపకల్ప నదులలో ఒకటైన కృష్ణానదికి ఉపనది తుంగభద్ర.

తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో నీటి వనరులకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్ళ జాబితా :

  1. పట్టణీకరణ, పెరుగుతున్న నీటి అవసరాలు : ఈ నదీ పరీవాహక ప్రాంతంలో జనాభా పెరుగుదల, పారిశ్రామిక అవసరాలు పెరగడం మొదలైన వాటి వలన నీటి అవసరం పెరిగింది.
  2. తక్కువగా లభించే తాగునీటిని సరిగా వినియోగించుకోలేకపోవడం.
  3. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం.
  4. అన్ని వర్గాల వారికి పారిశుద్ధ్యం, తాగునీరు అందించడం.
  5. అంతరాష్ట్ర వివాదాలు.
  6. జలాశయాలు పూడికకు గురి అవడం.
  7. నీటి వనరుల పంపకానికి సరైన ప్రణాళికలు లేకపోవడం మొదలగునవి.

ప్రశ్న 6.
నీటి వనరులలో అనేక రకాల మార్పులు సంభవించాయి. ఈ అధ్యాయంలో చర్చించిన సానుకూల, ప్రతికూల మార్పులను వివరించండి. (AS1)
జవాబు:

సానుకూల మార్పులు వ్యతిరేక మార్పులు
1) వ్యవసాయ రంగంలో సాంకేతిక అభివృద్ధి. 1) పట్టణీకరణ
2) పారిశ్రామిక వ్యర్థాలను తిరిగి ఉపయోగించేలా చేయడం. 2) జనాభా పెరుగుదల
3) ఆనకట్టల నిర్మాణం. 3) పరిశ్రమల పెరుగుదల
4) వ్యవసాయ భూమి పెరుగుదల. 4) నీటి తగాదాలు
5) జల విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులను నిర్మించడం. 5) నీటి కాలుష్యం

ప్రశ్న 7.
నీటి సంరక్షణను మెరుగుపరచటానికి హి బజారులో వ్యవసాయంలో ఏ పద్ధతులపై నియంత్రణలు విధించారు? (AS1)
జవాబు:
గ్రామ పరీవాహక, సమగ్రాభివృద్ధికి ‘ఆదర్శ గ్రామ పథకం’ కింద హివారే బజారుని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో హివారే బజార్ ఉంది. మహారాష్ట్ర నుంచి కోస్తా కొంకణ తీర ప్రాంతాన్ని వేరు చేస్తూ ఉత్తర-దక్షిణంగా ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణికి (వర్షచ్ఛాయ ప్రాంతంలో) తూర్పువైపున గల వర్షచ్ఛాయా ప్రాంతంలో ఈ జిల్లా ఉంది. అందుకే అహ్మద్ నగర్ జిల్లా 400 మి.మీ వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది. అందువల్ల ఆ గ్రామంలో కొన్ని నిషేధాలు విధించారు. అవి : సాగునీటికి బోరు బావులు తవ్వటం, చెరకు, అరటి సాగు చేయటం, బయటి వాళ్లకు భూమి అమ్మటం మొదలగునవి.

ప్రశ్న 8.
నీటి వనరుల విషయంలో ప్రజల కార్యాచరణ, చట్టాల ప్రాముఖ్యత ఏమిటి ? ఈ అధ్యాయంలోని చివరి రెండు భాగాలలో చర్చించిన అంశాలను క్లుప్తంగా రాయండి. (AS1)
జవాబు:

  1. నీటి వనరులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ అసంబద్ధమైనవి, చెల్లనివి అని చెప్పుకోవచ్చు.
  2. భూమిపై యాజమాన్యానికి ఆ నేలలో లభ్యమయ్యే నీటి వనరులకు మధ్య సరియైన సంబంధం లేదు. భూమి యజమాని నీరు తోడటంపై ఎటువంటి నియంత్రణ లేదు.
  3. నీరు అందరికీ చెందిన వనరుగా గుర్తించబడాలి.
  4. ఇలా గుర్తించి నియంత్రించడానికి సరియైన చట్టాలు, నియమాలు రూపొందించాలి.
  5. నీటి వనరుల వినియోగ నియంత్రణకు స్థానిక స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ చట్టాలను చేయాలి.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 9.
మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే www.aponline.gov.in కి వెళ్లి ఆంధ్రప్రదేశ్ నీళ్లు, భూమి, చెట్ల సంరక్షణ (Andhra Pradesh WALTA Act.) చట్టం గురించి మరింత తెలుసుకోండి. (AS3)
జవాబు:
ఆంధ్రప్రదేశ్ నీళ్ళు, భూమి, చెట్ల సంరక్షణ చట్టం 2002 :
ఇది ఒక సమగ్రమైన చట్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తోంది. ఈ చట్టం 19.04.2002 నుండి అమలులోనికి వచ్చింది. ఈ చట్టంలో 6 చాప్టర్లు, 47 సెక్షన్లు, 30 నియమాలు ఉన్నాయి.

లక్ష్యాలు :

  1. నీటి సాగును, చెట్లున్న ప్రాంతాన్ని పెంచడం.
  2. నీటి వనరుల సాగును అభివృద్ధిపరిచి, రక్షించడానికి భూమికి సంబంధించిన విషయాలను సరిచూచుట,
  3. భూగర్భ, భూ ఉపరితల నీటి వినియోగాన్ని క్రమబద్దీకరించుట.

ప్రశ్న 10.
మీ ప్రాంతంలో ఏ ఏ అవసరాలకు నీటి కొనుగోలు, అమ్మకం జరుగుతోంది? దీనిపై ఏమైనా నియంత్రణలు ఉండాలా? చర్చించండి. (AS1)
జవాబు:

  1. మా ప్రాంతంలో నీరు ఎక్కువగా మా కార్పొరేషన్ చే సరఫరా చేయబడుతుంది. వారు నీటిని పంపుల ద్వారా సరఫరా చేస్తారు. ఈ నీరు త్రాగడానికి, ఇతర గృహ వినియోగాలకు ఉపయోగపడుతుంది.
  2. శుభ్రపరచబడిన త్రాగునీరు ఇతర ప్రైవేటు కంపెనీలచే బాటిల్ నీరును (2లీ.) రూ. 15/-ల నుండి రూ. 30/-ల వరకు తీసుకుని సరఫరా చేస్తారు.

వీటి మీద కొన్ని నియంత్రణలు ఉండాలని నేను భావిస్తున్నాను. కార్పొరేషను ట్యాంకులు తరుచూ శుభ్రం చేయాలి. నీటిని వివిధ మార్గాల ద్వారా శుద్ధి చేయాలి. సరఫరా చేయబడే సీసాలను శుభ్రపరచాలి. వారి యూనిట్ తరచూ సందర్శించి శుభ్రపరిచే విధానాన్ని పరిశీలించాలి.

10th Class Social Studies 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు InText Questions and Answers

10th Class Social Textbook Page No.61

ప్రశ్న 1.
వాటర్ షెడ్ అన్న పదాన్ని చర్చించండి.
జవాబు:
ఒక ఎత్తైన ప్రాంతంలో ఒక వైపు నీటి ప్రవాహాలు ఒక నదిలోనూ, మరో వైపు నీటి ప్రవాహాలు మరో నదిలోనూ కలిస్తే . దానిని “వాటర్ షెడ్” అని అంటారు. ఈ నీటిని భూమిలోకి ఇంకేలా చేయడానికి చెట్లు నాటవచ్చు లేదా చెరువులు లాంటివి త్రవ్వించవచ్చు. ఇలా చేయడాన్ని “వాటర్ షెడ్ అభివృద్ధి పథకం” అని అంటారు.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.61

ప్రశ్న 2.
మొక్కలు వేళ్లనుంచి తీసుకున్న నీరు ఏమవుతుందో విజ్ఞానశాస్త్ర పాఠాలలో తెలుసుకుని ఉంటారు. అది మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
చెట్ల వేర్లు నీటిని సమతుల్యం చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అవి అవసరమైనపుడు మాత్రమే నీటిని తీసుకుంటాయి. అవసరం లేనపుడు వాటిని తీసుకోవు.

10th Class Social Textbook Page No.69

ప్రశ్న 3.
హివారే బజారులాగానే భూగర్భజలాల నియంత్రణ ప్రధానంగా ప్రజలే చేయాలా?
జవాబు:
హివారే బజారులలో భూగర్భజలాల నియంత్రణ చాలా విజయవంతం అయింది. దీనికి కారణం ప్రజల సహకారమే కాబట్టి ప్రజలు పూనుకొని భూగర్భజలాల నియంత్రణ చేయటమే సరియైన పని.

10th Class Social Textbook Page No.69

ప్రశ్న 4.
‘భూగర్భజలాల చట్టాలు పాతబడిపోయాయి మరియు ప్రస్తుత కాలానికి తగవు’. వివరించండి.
జవాబు:
ప్రస్తుతం నీటి వినియోగంపై ఉన్న చట్టాలు బ్రిటీషు వారి కాలంనాటివి. అవి ఈ కాలానికి సరిపోయేవి కావు. పైగా అసంబద్ధమైనవి కూడా, అవి భూగర్భజలాలను అన్ని వనరులతో కలిపి వాడుకున్నపుడు తయారుచేసినవి. అవి ఇప్పటి వాడకానికి సరిపోవు. కాబట్టి అవి పాతపడిపోయాయి అని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 6.
భారతదేశంలో 40 మిలియన్ల ఎకరాల భూమి వరదకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతే విస్తీర్ణం కరవుకి గురయ్యే అవకాశం ఉంది. దీనికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైఋతి ఋతుపవనాల మూలంగా వస్తుంది.
  2. ఈ ఋతుపవనాలలోని అనిశ్చితే వరదలకు, కరవుకు ప్రధాన కారణం.
  3. వరదలు అధిక వర్షం మూలంగా సంభవిస్తే, కరవులు వర్షాలు లేకపోవడం వలన సంభవిస్తాయి.
  4. అడవుల నిర్మూలన, నేలకోత మొదలైనవి ఈ విపత్తులకు మూల కారణాలు.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.60

ప్రశ్న 7.
ఇక్కడ ఇచ్చిన పటం, అట్లాన్ల సహాయంతో ఈ కిందివి వివరించండి.
1) గోదావరి …………….. వద్ద పుడుతుంది.
2) తూర్పుకి ప్రవహించే ద్వీపకల్ప నదులలో కృష్ణానదికి రెండవ స్థానం. ఇది ………….. వద్ద పుడుతుంది.
3) మహానది ఛత్తీస్ గఢ్ లోని నిహావా దగ్గర పుట్టి …………… గుండా ప్రవహిస్తుంది.
4) నర్మదానది మధ్యప్రదేశ్ లోని …………… వద్ద పుడుతుంది.
5) తపతీనది …………… వద్ద పుట్టి ………… దిశగా పయనిస్తుంది.
జవాబు:
1) నాసిక్, త్రయంబకం
2) మహాబలేశ్వరం
3) ఒడిశా
4) అమరకంటక్
5) ముల్తాయ్, పశ్చిమ

10th Class Social Textbook Page No.61

ప్రశ్న 8.
మీ సమీప మండల కార్యాలయం నుంచి గత 5 సంవత్సరాలకు మొత్తం వార్షిక వర్షపాతం ఎంతో తెలుసుకోండి.
జవాబు:
నేను కృష్ణాజిల్లా పెనమలూరు గ్రామంలో నివసిస్తున్నాను. మా ఊరిలో సరాసరి వర్షపాతం ఈ క్రింది విధంగా ఉన్నది.
2013 – 107 సెం.మీ.
2014 . 103 సెం.మీ.
2015 – 100 సెం.మీ.
2016 – 98 సెం.మీ.
2017 – 104 సెం.మీ.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.65

ప్రశ్న 9.
నీటి వినియోగ ప్రణాళికల కోసం ప్రభుత్వ నదీ పరీవాహక ప్రాధికార సంస్థ ఉంటే ఎలా ఉపయోగకరంగా ఉంటుంది?
జవాబు:

  1. నదీ పరీవాహక ప్రాధికార సంస్థ గనక ఉన్నట్లయితే ఆ సంస్థ ఆ నది నీటి వినియోగదారులందరికీ న్యాయం చేస్తుంది.
  2. నీటి వనరుల అభివృద్ధికి, పర్యవేక్షణకు అన్ని స్థాయిల్లోనూ సహకరిస్తుంది.
  3. కమ్యూనిటీ సహకారాన్ని కూడా పెంపొందిస్తుంది.
  4. నీటి వనరుల కొరత వలన రాబోయే రోజుల్లో ఏర్పడే ఇబ్బందులను అధిగమించేలా చూస్తుంది.
  5. నీటి సాగును, నిర్వహణను సాంప్రదాయక పద్ధతులలో జరిగేలా చూస్తుంది. నీరు అందరికి చెందినదని గ్రహించేలా చేస్తుంది.

10th Class Social Textbook Page No.65

ప్రశ్న 10.
తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో నీటికి పరస్పర విరుద్ధ వినియోగాలు ఏమిటి?
జవాబు:

  1. గత కొన్ని దశాబ్దాల నుండి నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది.
  2. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో నేలకోత ఎక్కువయ్యి సాంప్రదాయ చెరువులు, చిన్న జలాశయాలు, తుంగభద్ర జలాశయాలు పూడికకు గురి అవుతున్నాయి.
  3. అంతరాష్ట్ర జల వివాదాలు కూడా వీటిని ప్రభావితం చేస్తున్నాయి.
  4. జనాభా పెరుగుదల వలన, పారిశ్రామికీకరణ వలన కాలుష్యం పెరిగింది. వీటి మూలంగా ప్రజల జీవన ప్రమాణాలు, కొన్ని కమ్యూనిటీల జీవితాలు దెబ్బతింటున్నాయి.

10th Class Social Textbook Page No.67

ప్రశ్న 11.
నీటి అందుబాటును బట్టి వ్యవసాయ ప్రణాళిక తయారు చేయటానికి ఎటువంటి ప్రయత్నం జరిగింది?
జవాబు:

  1. భారతదేశం లాంటి దేశాలలో దాదాపు 70% నీటి వినియోగం వ్యవసాయ రంగంలోనే జరుగుతోంది. ఇది అధిక వినియోగం అని చెప్పుకోవచ్చు.
  2. ఆనకట్టలు, చెక్ డ్యామ్ లు మొదలైనవి నీటిని సద్వినియోగం చేయడానికి రైతులకు సహకరిస్తాయి. పంట దిగుబడులను అధికం చేస్తాయి.
  3. బిందు సేద్యము లాంటి ఆధునిక పద్ధతులు నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి.

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 12.
గృహ అవసరాలకు 5% నీటిని ఉపయోగిస్తున్నారు. అయినా కానీ జనాభాలో ఎక్కువ మందికి నీళ్లు అందటం లేదు. దీని గురించి చర్చించండి.
జవాబు:

  1. నీటిని సరఫరా చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత.
  2. భారతదేశంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసింది.
  3. భూగర్భజల వనరులు తగ్గిపోవడం, వాటి నాణ్యత క్షీణించిపోవడం మొదలగునవి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నీటి సరఫరాను దెబ్బతీస్తున్నది.
  4. భూ ఉపరితల నీటి వనరులను కాలుష్యం వలన, కొరత వలన, జల వివాదాల వలన సరిగా సరఫరా చేయలేకపోతున్నారు.
  5. తీర ప్రాంతాలలో సముద్రపు నీరును ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చుటకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  6. భారతదేశంలో జనాభా పెరుగుదల, పరిశ్రమల పెరుగుదల మూలంగా నీటి అవసరాలు పెరిగాయి. దీని మూలంగా నీటి సరఫరా అనేక యిబ్బందులను ఎదుర్కొంటుంది.
  7. వీటన్నింటి రీత్యా భారతదేశంలో నదుల అనుసంధానం అత్యంత ఆవశ్యకం.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 13.
ఉపరితల నీటి వనరులలో 70% కలుషితం అయ్యా యి. కారణాలు ఏమిటి?
జవాబు:
అనేక వ్యర్థాలను నీటిలోనికి వదలడం వలన నీటి వనరులు కాలుష్యం అవుతున్నాయి. ఈ కాలుష్యం నీటిలోని మొక్కలను, జంతువులనే కాక, వాటిని ఉపయోగించే మానవులను కూడా నష్టపరుస్తోంది. ఈ కాలుష్యం పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నది.

నీటి కాలుష్యానికి కారణాలు :

  1. మురికినీరు, వ్యర్థ పదార్థాలు, చెత్త, చెదారం నీటిలో కలవటం మూలంగా నీరు విషతుల్యమవుతుంది.
  2. నీటి వనరులున్న ప్రాంతాలలో మలవిసర్జన చేయటం నీటిని కలుషితం చేస్తోంది.
  3. పారిశ్రామిక వ్యర్థాలు నీళ్ళలోకి వదలడం మూలంగా నీరు అధికస్థాయిలో కలుషితమవుతుంది.
  4. సముద్రంలో ప్రయాణం చేసే ఓడలు, ట్యాంకర్లు చమురును వదిలి ఆ నీటిని కలుషితం చేస్తున్నాయి.
  5. ఆమ్ల వర్షాల మూలంగా ఉపరితల నీరు కలుషితమవుతుంది.

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 14.
భారతదేశ పటంలో హిమాలయాలను, పశ్చిమ కనుమలను గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 4

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 15.
పటంలోని రంగుల సూచికను బట్టి నదులు పుట్టిన పర్వతాలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకోండి. అట్లాస్, ఉబ్బెత్తు భౌగోళిక పటం సహాయంతో నదీ గమనాన్ని అనుసరిస్తూ వాటి ప్రవాహ దిశను గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 5

10th Class Social Textbook Page No.59

ప్రశ్న 16.
అట్లాస్ సహాయంతో భారతదేశం, పాకిస్తాన్ లో సింధూనది ప్రవాహ మార్గాన్ని గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 6

10th Class Social Textbook Page No.59

ప్రశ్న 17.
గంగానది పటాన్ని (5.2) చూసి అది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందో చెప్పండి.
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 7
గంగా, బ్రహ్మపుత్రల సంగమం
జవాబు:
గంగానది ప్రవహించే రాష్ట్రాలు :

  1. ఉత్తరాఖండ్
  2. ఉత్తరప్రదేశ్
  3. బీహార్
  4. జార్ఖండ్
  5. పశ్చిమబెంగాల్

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.59

ప్రశ్న 18.
పై పటం చూసి గంగానది ఉపనదులలో ఉత్తర దిశగా ప్రవహించేవి ఏవో, దక్షిణ దిశగా ప్రవహించేవి ఏవో చెప్పండి.
జవాబు:
ఉత్తరంగా ప్రవహించే ఉపనదులు : కోసి, గండక్, గాగ్రా, గోమతి, శారద, యమున, రామ్ గంగా నదులు.

దక్షిణంగా ప్రవహించే ఉపనదులు : సన్, రిహార్డ్, కెన్, బెట్వా, తన్నా నదులు.

10th Class Social Textbook Page No.63

ప్రశ్న 19.
భారతదేశ పటంలో తుంగభద్ర నది ప్రవాహ మార్గాన్ని గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 8

10th Class Social Textbook Page No.67

ప్రశ్న 20.
సవారే బజారులో నీటి సంరక్షణకు చేపట్టిన పనులను సూచించే వాక్యాల కింద గీత గీయండి.
జవాబు:
స్వయం కృత్యం.

10th Class Social Textbook Page No.67

ప్రశ్న 21.
మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే హివారే బజారుకు సంబంధించిన వీడియో చిత్రాన్ని ఈ లింకులో చూడండి. http://bit.ly/koth LI
జవాబు:
స్వయం కృత్యం.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.69

ప్రశ్న 22.
భూగర్భజలాలు అందరికీ చెందిన వనరులు – మీ అభిప్రాయాన్ని వివరించండి.
జవాబు:
భూమిమీద హక్కుకి, భూగర్భ జలాలమీద హక్కుకి సంబంధం ఉన్నప్పుడు నీటిని సక్రమంగా వినియోగించటంపై వ్యక్తిగత భూ యజమానులపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. అదే విధంగా పర్యావరణానికి, విస్తృత ప్రజానీకానికి ప్రయోజనం కలిగించేలా విధానాలను అమలు చేసే మార్గమేమీ లేదు. దాదాపుగా ఎటువంటి నియంత్రణలేని ఈ వ్యవస్థలో ఒక ప్రాంతంలో ఎన్ని చేతి పంపులు, బావులు, బోరుబావులు ఉండవచ్చో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి నీటిని ప్రజలందరికీ ఉద్దేశించిన ఉమ్మడి వనరుగా పరిగణించాలి. రోడ్లు, నదులు, ఉద్యానవనాలు, అంతర్భూజలం అందరికీ చెందే ‘ప్రజా ఆస్తి’ గా భావించాలి. దీనిని ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, కాని అంతగా విస్తృతం కాలేదు.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

SCERT AP 10th Class Social Study Material Pdf 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Studies 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాక్యాలు చదివి అవి వాతావరణానికి లేదా శీతోష్ణస్థితికి, ఏ అంశానికి ఉదాహరణో చెప్పండి.
అ) హిమాలయాల్లోని అనేక మంచుపర్వతాలు గత కొద్ది సంవత్సరాలలో కరిగిపోయాయి.
ఆ) గత కొన్ని దశాబ్దాలలో విదర్భ ప్రాంతంలో కరవులు ఎక్కువగా సంభవించాయి. (AS1)
జవాబు:
ఈ రెండూ వాతావరణానికి ఉదాహరణలు.

ప్రశ్న 2.
కింది వాటిని జతపరచండి. అవసరమైతే పటాలను చూడండి. (ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండవచ్చు) (AS5)
అ) తిరువనంతపురం భూమధ్యరేఖకు దూరంగా ఉండి శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
ఆ) గ్యాంక్ భూమధ్యరేఖకు దగ్గరగా ఉంది, కాని సముద్రానికి దగ్గరగా లేదు, వర్షపాతం తక్కువ.
ఇ) అనంతపురం సముద్రానికి దగ్గరగా ఉంది, శీతోష్ణస్థితిపై సముద్ర ప్రభావం ఎక్కువ.
జవాబు:
అ) తిరువనంత పురం : సముద్రానికి దగ్గరగా ఉంది, శీతోష్ణస్థితిపై సముద్ర ప్రభావం ఎక్కువ.
ఆ) గ్యాంగ్ టక్ : భూమధ్యరేఖకు దూరంగా ఉండి శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
ఇ) అనంతపురం : భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది, కాని సముద్రానికి దగ్గరగా లేదు, వర్షపాతం తక్కువ.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 3.
భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలను వివరించండి. (AS1)
జవాబు:
శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే వాటిని శీతోష్ణస్థితి కారకాలు అంటారు. అవి.

  1. అక్షాంశం
  2. భూమికి – నీటికి మధ్య గల సంబంధం
  3. భౌగోళిక స్వరూపం
  4. ఉపరితల గాలి ప్రసరణ.

1) అక్షాంశం లేదా భూమధ్యరేఖ నుంచి దూరం :
భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్యరేఖకి దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలోని శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండటానికి శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండటానికి ఇది ఒక కారణం. భారతదేశం సుమారుగా 8° ఉత్తర -37° ఉత్తర రేఖాంశాల మధ్య ఉంది. భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తుంది. కర్కటరేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది. కర్కటరేఖ ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది.

2) భూమికి – నీటికి గల సంబంధం :
దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు, రాత్రుల ఉష్ణోగ్రతలలో, అదే విధంగా వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. దీనిని “సమ శీతోష్ణస్థితి” అంటారు. ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం ఏమిటో బాగా తెలుస్తుంది.

3) భౌగోళిక స్వరూపం :
సముద్ర మట్టం నుండి ఎత్తుకి వెళుతున్న కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.

4) వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ :
భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను “జెట్ ప్రవాహం ” అంటారు. నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేఖలలో వేగంగా ప్రవహించేగాలులు ఇవి. ఈ గాలుల వేగం గంటకి వేసవిలో 110 కిలోమీటర్లు. శీతాకాలంలో 184 కిలోమీటర్లు మధ్య ఉంటుంది. 25° ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇటువంటి జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. తూర్పు జెట్ స్లీం యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి.

ప్రశ్న 4.
కొండ ప్రాంతాలలోని, ఎడారులలోని శీతోష్ణస్థితులను ప్రభావితం చేసే అంశాలను వివరించండి. (AS1)
జవాబు:
కొండ ప్రాంతాలు : సాధారణంగా సముద్ర మట్టం నుండి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతి 1000మీ|| ఎత్తుకి పోయేకొలదీ 6°C ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి కొండ ప్రాంతాలలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఎడారి ప్రాంతాలు : ఎడారి ప్రాంతాలు ఎక్కువ ఉష్ణోగ్రతతోనూ, తక్కువ వర్షపాతంతోనూ ఉంటాయి. ఇవి భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటాయి. వీటికి అవతలవైపున అధిక పీడన ప్రాంతాలు ఉంటాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య జరిగే గాలుల ప్రసరణ ఇక్కడి వాతావరణంలో అనిశ్చితిని ఏర్పరుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 5.
భూగోళం వేడెక్కడంలో మానవుని పాత్రను తెలపండి. (AS4)
జవాబు:
అనేక మానవజనిత కారణాల వలన భూమి వేడెక్కడం, భౌమ్య వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతుంది. మనం మండించే ఇంధనాల వలన విడుదలయ్యే CO, దీనికి ముఖ్యకారణం. అడవులను నరికివేత
మరో కారణం. పారిశ్రామిక విప్లవం తరువాత భూమి అతి త్వరగా వేడెక్కడానికి కారణం మానవుడే.

ప్రశ్న 6.
AGW విషయంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలేమిటి? (AS1)
జవాబు:
ముఖ్యంగా “అభివృద్ధి చెందిన” (ప్రధానంగా పాశ్చాత్య పారిశ్రామిక, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన) దేశాలు “అభివృద్ధి చెందుతున్న” (అంతగా పారిశ్రామికీకరణ చెందని) దేశాల మధ్య విభేదాలు తల ఎత్తాయి. వాతావరణంలోని హరితగృహ వాయువులను పెంచే బొగ్గు వినియోగం, ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం ద్వారానే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నది ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన. శిలాజ ఇంధనాలు (ప్రధానంగా బొగ్గు) వినియోగించకపోతే తమ ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రగతిని సాధించటానికి ప్రత్యామ్నాయాలను చూపడంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు పాత్ర పోషించాలని ఇవి కోరుతున్నాయి.

ప్రశ్న 7.
భూగోళం వేడెక్కడంలో శీతోష్ణస్థితిలో మార్పులు ఏ విధంగా కారణమవుతాయి? భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి కొన్ని చర్యలను సూచించండి. (AS4)
జవాబు:

  1. మానవజనిత కారణాల వలన భూమి వేడెక్కడం, భౌమ్యవ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతోంది.
  2. భూగోళం వేగంగా వేడెక్కడం వల్ల ఈ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది.
  3. ఉష్ణ పునః ప్రసరణ గందరగోళం కావటంతో వాతావరణ, శీతోష్ణస్థితుల సరళిలో మార్పులు వస్తాయి. స్వల్పకాలిక (వాతావరణ) మార్పులు ఒకదానికొకటి తోడై దీర్ఘకాలికంగా (శీతోష్ణస్థితిలో) మారతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 8.
భారతదేశ భౌగోళిక పటంలో కింది వానిని గుర్తించండి. (AS5)
i) 40° సెం.గ్రే. కన్నా ఎక్కువ సంవత్సర సగటు ఉష్ణోగ్రతను నమోదు చేసిన ప్రాంతాలు.
ii) 10° సెం.గ్రే, కన్నా తక్కువ సంవత్సర సగటు ఉష్ణోగ్రతను నమోదు చేసిన ప్రాంతాలు.
iii) భారతదేశంపై వీచే నైరుతి ఋతుపవనాల దిశమార్గం.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 1

ప్రశ్న 9.
కింది కైమోగ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది?
ii) ఏ నెలలలో అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి?
iii) జూన్, అక్టోబర్ మధ్య గరిష్ట వర్షపాతం ఎందుకు సంభవిస్తుంది?
iv) మార్చి, మే నెలల మధ్య అత్యధిక ఆ ఉష్ణోగ్రత ఎందుకు ఉంటుంది?
v) ఉష్ణోగ్రత, వర్షపాతాలలో మార్పులకు కారణమయ్యే భౌగోళిక అంశాలను పేర్కొనండి.
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 2
జవాబు:
i) ఆగష్టు
ii) డిశంబరు – మే
iii) ఋతుపవన కాలం
iv) సూర్యపుటం అధికంగా ఉంది.
v) సముద్ర మట్టానికి ఎత్తులో ఉంది.

10th Class Social Studies 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి InText Questions and Answers

10th Class Social Textbook Page No.44

ప్రశ్న 1.
44వ పేజీలో ఇచ్చిన వార్తాకథనం లాంటివే మరికొన్ని వార్తాకథనాలను సేకరించండి.
జవాబు:
స్వయం అభ్యాసం.

10th Class Social Textbook Page No.46

ప్రశ్న 2.
లెహ్ లో బాగా వేడిగా, బాగా చలిగా ఉండే నెలలు ఏవి?
జవాబు:
వేడినెల – జూన్ ; చలిగా ఉండే నెల – డిశంబరు

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Textbook Page No.46

ప్రశ్న 3.
చెన్నెలో వర్షాకాల నెలలను గుర్తించండి. దీనిని జైపూర్ తో పోలిస్తే ఏవిధంగా భిన్నమైనది?
జవాబు:
చెన్నైలో వర్షాకాల నెలలు – జూన్ – ఆగష్టు, సెప్టెంబర్ – నవంబర్.
జైపూర్‌లో వర్షాకాల నెలలు – జూన్ – ఆగష్టు

10th Class Social Textbook Page No.48

ప్రశ్న 4.
సిమ్లా, ఢిల్లీలు వేరు వేరు అక్షాంశాల మీద ఉన్నాయా ? మీ అట్లాసు చూసి చెప్పండి. వేసవిలో ఢిల్లీ కంటే సిమ్లాలో చల్లగా ఉంటుందా?
జవాబు:
సిమ్లా 31°611″ ఉ అక్షాంశంపై ఉన్నది. ఢిల్లీ, సిమ్లా వేర్వేరు అక్షాంశాలపై ఉన్నాయి. (3° తేడా) కాని సిమ్లా, ఢిల్లీ కన్నా చల్లగా ఉండటానికి కారణం అది బాగా ఎత్తైన ప్రాంతంలో ఉండటమే.

10th Class Social Textbook Page No.49

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ లో జనవరిలో సగటు ఉష్ణోగ్రతల పరిధి ఏమిటి ?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో జనవరిలో సగటు ఉష్ణోగ్రతల పరిధి 15°C – 28°C.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Textbook Page No.49

ప్రశ్న 6.
మీ అట్లాను ఉపయోగించి 15° సెం ఉష్ణోగ్రత ఉండే కొన్ని ప్రదేశాలను గుర్తించంది.
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్

10th Class Social Textbook Page No.49

ప్రశ్న 7.
సగటు ఉష్ణోగ్రతలు 25° సెం ఉండే ప్రాంతాలకు దగ్గరగా 200 సెం ఉష్ణోగ్రత ఉండే చిన్న వృత్తాకార ప్రాంతం ఉంది. ఇది ఎలా సాధ్యం?
జవాబు:
ఆ ప్రాంతం ఎత్తైన కొండలపై నుండటంవలన అది సాధ్యం.

10th Class Social Textbook Page No.54

ప్రశ్న 8.
అడవుల నిర్మూలన అంటే ఏమిటి?
జవాబు:
మానవులు తమ అవసరాలకు పెద్ద పెద్ద అడవులను నరకడము అటవీ ప్రాంతాలను నాశనం చేయటము మొదలైన వాటిని “అడవుల నిర్మూలన” అంటారు.

10th Class Social Textbook Page No.54

ప్రశ్న 9.
భూగోళం వేడెక్కటాన్ని ప్రభావితం చేసే ఇతర మానవ కార్యకలాపాలు ఏమిటి?
జవాబు:
భూగోళం వేడెక్కటాన్ని ప్రభావితం చేసే ఇతర మానవ కార్యకలాపాలు :

  1. ఇంధన వనరులని మండించడం
  2. అడవుల నరికివేత

10th Class Social Textbook Page No.55

ప్రశ్న 10.
లక్షలాదిమంది ప్రభావితమైతే అప్పుడు ఆ పరిస్థితులను ఎట్లా ఎదుర్కోగలమో ఊహించండి. పునరావాసానికి వీళ్లకు భూమి ఎక్కడ దొరుకుతుంది?
జవాబు:
ఇది చాలా కష్టసాధ్యమైన పని. లక్షలాది మందికి భూమి, ఉద్యోగాలు దొరకటం దుర్లభం.

10th Class Social Textbook Page No.46

ప్రశ్న 11.
పై పట్టిక (పట్టిక కొరకు ఈ పుస్తకంలోని పేజీ నెం. 115 చూడండి.) లోని ఉష్ణోగ్రతల పరిధి ఆధారంగా లెహ్ కంటే జైపూర్ వేడిగా ఉంటుందని చెప్పవచ్చా? మీ సమాధానానికి వివరణ ఇవ్వండి.
జవాబు:
జైపూర్ లెహ్ కంటే వేడిగా ఉంటుంది. కారణాలు :

  1. జైపూర్ కంటే లెహ్ అధిక ఎత్తులో ఉన్నది.
  2. జైపూరు వాతావరణంపై థార్ ఎడారి ప్రభావం ఉన్నది.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Textbook Page No.46

ప్రశ్న 12.
ఢిల్లీ, చెన్నెల శీతోష్ణ స్థితులను పోల్చండి. వాటిల్లో తేడాలు ఏమిటి?
జవాబు:

  1. ఢిల్లీలో వేసవి, చలికాలాల మధ్య, వర్షపాతాల మధ్య అనేక మార్పులున్నాయి. ఢిల్లీ వాతావరణాన్ని, హిమాలయాలు, థార్ ఎడారి ప్రభావితం చేస్తున్నాయి.
  2. చెన్నె వాతావరణంను సముద్రం ప్రభావితం చేయుచున్నది.

10th Class Social Textbook Page No.46

ప్రశ్న 13.
లెహ్ లో వర్షపాత తీరును జాగ్రత్తగా పరిశీలించండి. మిగిలిన ప్రాంతాలకు దీనికీ మధ్య తేడా ఏమిటి? మీ అట్లాసు సహాయంతో ఇదే వర్షపాత తీరును కనపరిచే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:
లెహ్ మంచు ఎడారి వాతావరణంను కలిగి ఉన్నది. ఇక్కడ చలికాలం దుర్భరంగా ఉంటుంది. చలికాలంలో ఇక్కడ మంచు పొడిగా కురుస్తుంది. ఇక్కడి సంవత్సర సగటు వర్షపాతం 102 mm మాత్రమే లెహ్లా ఎత్తైన ప్రాంతాలలో ఉన్న ప్రాంతాలు ఈ విధమైన వర్షపాతాన్ని కలిగి ఉంటాయి.

10th Class Social Textbook Page No.47

ప్రశ్న 14.
గ్లోబుని ఉపయోగించి ఇంతకు ముందు చదివింది మళ్లీ మననం చేసుకోండి. వివిధ అక్షాంశాల వద్ద సూర్య కిరణాల కోణాలలో ఏ తేడా ఉంటుంది? దీని ప్రభావం ఎలా ఉంటుంది?
జవాబు:
వివిధ అక్షాంశాల వద్ద సూర్య కిరణాల కోణాలలో తేడా – దాని ప్రభావం :

  1. భూమి యొక్క అక్షం 2372° వాలి ఉండటం.
  2. ఈ అక్షం భూపరిభ్రమణ మార్గాన్ని నిర్దేశిస్తుంది.
  3. దీని మూలంగా భూమిపై ఋతువులు ఏర్పడతాయి.

10th Class Social Textbook Page No.48

ప్రశ్న 15.
మీ అట్లాను ఉపయోగించి ముంబయి, నాగపూర్‌లో శీతాకాలం, వేసవికాలాల ఉష్ణోగ్రతలను పోల్చండి. వాటిల్లో పోలికలు ఏమిటి, తేడాలు ఏమిటి? సముద్రం నుంచి దూరాన్ని ఇది ఎలా తెలియచేస్తుంది?
జవాబు:

ముంబయి నాగపూర్‌లలో సగటు ఉష్ణోగ్రతలు
జనవరి 24°C – 21°C
ఫిబ్రవరి 25°C – 23°C
మార్చి 27°C – 28°C
ఏప్రిల్ 29°C – 33°C
మే 31°C – 35°C
జూన్ 29°C – 32°C
జూలై 28°C – 30°C
ఆగష్టు 23°C – 30°C
సెప్టెంబరు 28°C – 32°C
అక్టోబరు 29°C – 32°C
నవంబరు 28°C – 30°C
డిశంబరు 26°C – 28°C

సంవత్సరం పొడవునా రెండు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే సగటు ఉష్ణోగ్రత చాలా వరకు – దగ్గరగా పోలి ఉన్నది. ఇది మనకు సముద్ర తీరాన్నుండి దూరాన్ని తెలియజేస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Textbook Page No.48

ప్రశ్న 16.
క్లైమోగ్రాఫీలను ఉపయోగించి జైపూర్, చెన్నైల మధ్య ఉష్ణోగ్రతలలో తేడాలను వివరించండి.
జవాబు:
తేడాలు :

జైపూర్ చెన్నె
1) ఇది సముద్ర తీరానికి దూరంగా ఉన్నది. 1) ఇది సముద్ర తీరంలో ఉన్నది.
2) ఈ ప్రాంతంపై థార్ ఎడారి ప్రభావం కలదు. 2) ఈ ప్రాంతంపై ఏ ఎడారి ప్రభావాలు లేవు.

10th Class Social Textbook Page No.48

ప్రశ్న 17.
వేసవి కాలంలో కోల్‌కతాతో పోలిస్తే డార్జిలింగ్ లో వాతావరణం ఆహ్లాదకరంగా ఎందుకు ఉంటుంది?
జవాబు:
కలకత్తా సముద్ర మట్టానికి 6 మీటర్ల ఎత్తులో ఉండగా, డార్జిలింగ్ 2,645మీ|| ఎత్తులో ఉన్నది. రెండూ ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ డార్జిలింగ్ ఎత్తైన ప్రాంతంలో ఉండటం వలన తక్కువ ఉష్ణోగ్రతలుండి కలకత్తా కన్నా ఆహ్లాదకరంగా ఉంటుంది.

10th Class Social Textbook Page No.54

ప్రశ్న 18.
ఇది కేవలం అటవీ ప్రాంతాలలోనే జరుగుతుందా ? మీ ప్రాంతాంలో అడవి లేకపోయినా సరే ఏం జరుగుతోంది?
జవాబు:
అడవుల నిర్మూలను ఒక అటవీ ప్రాంతంలోనే గాక పారిశ్రామిక ప్రాంతాలలోనూ, గనుల వద్ద, నగరాలలోనూ జరుగుతున్నది. మానవజాతికి అడవుల ఉనికి అత్యంత ఆవశ్యకం, ఒకప్పుడు 60% భూమి అడవులతో కప్పబడి ఉండేది. నాగరికత, పట్టణీకరణ అడవులను అంతరించిపోయేలా చేశాయి. అడవులు, చెట్లు లేకపోతే మనకి ప్రాణవాయువు ఉండదు. అధికంగా వరదలు వచ్చే అవకాశాలుంటాయి. ‘జలచక్రం’ కుంటుపడుతుంది. ప్రస్తుతం మా ప్రాంతంలో ఈ విధంగానే జరుగుతోంది.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Textbook Page No.54

ప్రశ్న 19.
భూగోళం వేడెక్కటాన్ని అడవులు అంతరించిపోవటం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? (విజ్ఞానశాస్త్రం తరగతిలో కిరణజన్య సంయోగక్రియ గురించి చదివింది గుర్తుకు తెచ్చుకోండి.)
జవాబు:
అడవుల నిర్మూలన → కొద్ది చెట్లు → ఎక్కువగా CO2 → గ్రీన్ హౌస్ వాయువుల పై ప్రభావం – భూగోళం వేడెక్కడం. అడవులలోని చెట్లు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా CO2 ను తీసుకుని O2 ను విడుదల చేస్తాయి. వీటిని నరకడం మూలంగా వాతావరణంలో CO2 పెరిగిపోతుంది. దీని మూలంగా భూగోళం వేడెక్కుతుంది.

10th Class Social Textbook Page No.45

ప్రశ్న 20.
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రత, వర్షపాతాలలో తేడా ఉందని కింది క్లెమోగ్రాలు తెలియచేస్తున్నాయి. మీ అట్లాసు చూసి కింది ప్రాంతాలు ఏ భౌగోళిక ప్రదేశంలో ఉన్నాయో తెలుసుకోండి. కింది పటాలను చదివి, తరువాత పేజీలోని పట్టిక నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 3
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 4
ఉష్ణోగ్రతా వ్యాప్తి అత్యధికం నుండి అత్యల్పం
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 5

10th Class Social Textbook Page No.50

ప్రశ్న 21.
ఇంతకు ముందు ఇచ్చిన కైమోగ్రాఫ్ (4.1 – 4.4) ఆధారంగా నాలుగు పట్టణాలలో మే నెలలో సగటు ఉష్ణోగ్రతలు తెలుసుకుని వాటిని పై పటంలో గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 6

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

SCERT AP 10th Class Social Study Material Pdf 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Studies 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రాకెట్టులో ఇచ్చిన వాటి నుంచి సరైన వాటితో ఖాళీలు పూరించండి. (AS1)
i) ఉత్పత్తితో సమానంగా సేవారంగంలో ఉపాధి ……… (పెరిగింది / పెరగలేదు)
ii) ……………….. రంగంలోని కార్మికులు వస్తువులను ఉత్పత్తి చెయ్యరు. (సేవా / వ్యవసాయం)
iii) …………… రంగంలోని అధిక శాతం కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంది. (వ్యవస్థీకృత / అవ్యవస్థీకృత)
iv) భారతదేశంలోని కార్మికులలో ………………. శాతం అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్నారు. (ఎక్కువ / తక్కువ)
v) పత్తి …………………. ఉత్పత్తి, గుడ్డ ……………….. ఉత్పత్తి. (సహజ / పారిశ్రామిక)
జవాబు:
i) పెరగలేదు.
ii) సేవా
iii) వ్యవస్థీకృత
iv) ఎక్కువ
v) సహజ, పారిశ్రామిక

ప్రశ్న 2.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి. (AS1)
అ) ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించుకుని ……………….. రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు.
i) ప్రాథమిక
ii) ద్వితీయ
iii) తృతీయ
iv) సమాచార సాంకేతిక
జవాబు:
i) ప్రాథమిక

ఆ) స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన ……………. మొత్తం విలువ.
i) అన్ని వస్తువులు, సేవలు
ii) అన్ని అంతిమ వస్తువులు, సేవల
iii) అన్ని మాధ్యమిక వస్తువులు, సేవల
iv) అన్ని అంతిమ, మాధ్యమిక వస్తువులు, సేవల
జవాబు:
ii) అన్ని అంతిమ వస్తువులు, సేవల

ఇ) 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో సేవా రంగం వాటా ………….
i) 20-30 శాతం మధ్య
ii) 30-40 శాతం మధ్య
iii) 50-60 శాతం మధ్య
iv) 70 శాతం
జవాబు:
iii) 50-60 శాతం మధ్య

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 3.
వేరుగా ఉన్నదానిని గుర్తించండి, కారణం చెప్పండి. (AS1)
i) టీచరు, డాక్టరు, కూరగాయలు అమ్మే వ్యక్తి, న్యాయవాది.
ii) పోస్టుమాన్, చెప్పులుకుట్టే వ్యక్తి, సైనికుడు, పోలీసు కానిస్టేబులు.
జవాబు:
1) కూరగాయలు అమ్మే వ్యక్తి:
– మిగతా మూడు విద్యావంతులైన, నైపుణ్యం కల వృత్తులు చేస్తున్నవారు.
– వీరు సేవా రంగానికి చెందినవారు.

ii) చెప్పులు కుట్టే వ్యక్తి : ఇతను ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు.

ప్రశ్న 4.
ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించటం ఉపయోగకరమేనా ఎందుకో వివరించండి. (AS1)
(లేదా)
ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించటం ఉపయోగకరమేనా? ఏవేని రెండు ఉపయోగాలు తెల్పుము.
జవాబు:

  1. ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక (వ్యవసాయ), ద్వితీయ (పరిశ్రమలు), తృతీయ (సేవా) రంగాలుగా విభజించడం ఉపయోగకరమే.
  2. జాతీయాదాయం, తలసరి ఆదాయం మొదలగునటువంటివి గణించటానికి సులభంగా ఉంటుంది.
  3. ఏ రంగంలో ఎంత ఉత్పత్తి, ఉపాధి జరిగిందో తెలుసుకోవచ్చు. దానికనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించవచ్చును.
  4. సౌకర్యాల ఏర్పాటుకు, అభివృద్ధి చర్యలు చేపట్టుటకు ఇది ఉపయోగపడుతుంది.
  5. ఆదాయ, సంపద పంపిణీల్లో అసమానతలను తెలుసుకోవచ్చు. వాటిని రూపుమాపడానికి తగిన చర్యలు తీసుకోవచ్చు.
  6. జాతీయ ఉత్పత్తిలోని ఈ అంశాలు ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని తెలియచేస్తుంది. దేశంలోని ఆర్ధిక స్థితిగతులను తెలుసుకోవచ్చు.
  7. జాతీయ విధానాల రూపకల్పనకు, ప్రజల జీవన ప్రమాణస్థాయి తెలుసుకొనుటకు, మెరుగుపర్చుటకు.

ప్రశ్న 5.
ఈ అధ్యాయంలో మనం చూసిన ప్రతి రంగంలో స్థూల జాతీయోత్పత్తిలోనూ, ఉపాధిలోనూ దృష్టి ఎందుకు కేంద్రీకరించాలి? ఇంకా పరిశీలించాల్సిన ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? చర్చించండి. (AS4)
జవాబు:

  1. ఆర్థిక వ్యవస్థ (దేశం) అభివృద్ధి పథంలో ఉందో లేదో తెలుసుకొనుటకుగాను స్థూల జాతీయోత్పత్తిలోనూ, ఉపాధిలోనూ దృష్టి కేంద్రీకరించాలి. ఇంకా
  2. ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి తెలుసుకొనుటకు, అభివృద్ధిపరచుటకు
  3. అభివృద్ధి ప్రణాళికలను వ్యూహాలను రూపొందించుటకు, ప్రణాళికల్లో ఏ రంగానికి ప్రాధాన్యతనివ్వాలో నిర్ణయించుటకు.
  4. పేదరికం, నిరుద్యోగ స్థాయిలు తెలుసుకొనుటకు, వాటిని రూపుమాపుటకు.
  5. సమన్యాయ పంపిణీ కోసం (జాతీయాదాయం), సమతౌల్య అభివృద్ధి సాధించుటకు,
  6. అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించుటకు ; ఉత్పత్తి, ఉపాధిపై దృష్టి పెట్టాలి.

ఇతర అంశాలు:

  1. సాంకేతిక, వైజ్ఞానిక నైపుణ్యం
  2. ఆధునిక సమాచార, ప్రసార అభివృద్ధి
  3. ఎగుమతులు, దిగుమతులు
  4. ప్రాంతీయాభివృద్ధి
  5. విద్య, వైద్యం, విద్యుత్, రవాణా, త్రాగునీరు, సాగునీరు మొదలయిన అవస్థాపన సౌకర్యాలు.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 6.
సేవా రంగం ఇతర రంగాలకంటే ఎలా భిన్నమైనది? కొన్ని ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
సేవా రంగం ఇతర రెండు రంగాల కంటే భిన్నమైనది.

  1. దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి సేవల రంగం ప్రాణవాయువులాంటిది.
  2. ఒక ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక, ద్వితీయ రంగాలు పుష్టినిస్తే, సేవల రంగం ఆధునికీకరణ చేస్తుంది.
  3. ఇతర రంగాలలాగా నేరుగా వస్తువులను తయారుచేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు మాత్రమే ఈ రంగం అందిస్తుంది.
    ఉదా : వస్తువులు, ప్రయాణీకులను రవాణా చేయటం.
  4. సేవారంగం ఇతర రంగాల అభివృద్ధికి పరిపూరక రంగంగా పనిచేస్తూ ఉంటుంది.
    ఉదా : ఉత్పత్తి పెరుగుదలకు అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను సేవా రంగం అందిస్తుంది.
  5. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే సాగునీరు, విద్యుత్తు, పరపతి, రవాణా సౌకర్యాలు, రసాయనిక ఎరువులు మొదలయిన సేవలు అవసరం.
  6. పరిశ్రమల రంగం అభివృద్ధి చెందాలంటే యంత్ర పరికరాలు, విద్యుత్ (శక్తి వనరులు), బీమా సౌకర్యాలు, రవాణా, మార్కెట్ సౌకర్యాలు, బ్యాంకులు మొదలయిన సేవలు అవసరం.
  7. మిగతా రెండు రంగాల కంటే ఈ రంగం విశ్వవ్యాప్తంగా అతి పెద్ద రంగంగా అభివృద్ధి చెందుతుంది.
  8. మిగతా రెండు రంగాల కంటే ఈ రంగం ఎక్కువ భాగం ఉపాధిని, ఉత్పత్తిని కలిగిస్తోంది.

ప్రశ్న 7.
అల్ప ఉపాధి అంటే ఏమి అర్థం చేసుకున్నారు ? పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక్కొక్క ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:

  1. ఎవరికీ తమ పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా మరియు తగినంతగా పని దొరకని స్థితిని అల్ప ఉపాధి అనవచ్చును. తక్కువ ఉత్పాదకత గల వ్యవసాయ, సేవల రంగంలో పనిచేస్తున్న శ్రామికులను “అల్ప ఉద్యోగులు” అంటారు. కనపడని ఈ రకమైన అల్ప ఉపాధినే “ప్రచ్ఛన్న నిరుద్యోగం” అంటారు.
  2. సిరిపురం గ్రామంలోని సాంబయ్య అనే రైతుకు 5 ఎకరాల వర్షాధార భూమి ఉంది. మిరప, ప్రత్తి, మొక్కజొన్న వంటి పంటలు పండిస్తాడు. కుటుంబంలోని ‘6’ గురు సభ్యులు సంవత్సరమంతా అందులోనే పనిచేస్తారు. కారణం వాళ్ళకు చెయ్యటానికి వేరే పనిలేదు. వారి శ్రమ విభజింపబడుతోంది. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు కానీ ఎవరికీ పూర్తి పని లేదు. ఈ కుటుంబంలోని ఇద్దరి ముగ్గురు వేరే పనికి వెళ్ళిన ఉత్పత్తి తగ్గదు.
  3. పట్టణ ప్రాంతంలో సేవా రంగంలో రోజుకూలీ కోసం వెతుక్కునేవాళ్లు వేలాదిగా ఉన్నారు. రంగులు వేయటం, నీటి పైపుల పని, మరమ్మతులు చేయటం వంటి పనులు చేస్తారు. వీళ్లల్లో చాలామందికి ప్రతిరోజూ పని దొరకదు.

ప్రశ్న 8.
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఈ కింది అంశాలలో రక్షణ కావాలి. (AS1)
కూలీ, భద్రత, వైద్యం : ఉదాహరణలతో వివరించండి. –
జవాబు:
అవ్యవస్థీకృతరంగంలో చిన్నచిన్న సంస్థలు అక్కడక్కడా ఉంటాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నియమ నిబంధనలు ఉంటాయి కానీ వాటిని అనుసరించరు. స్వయం ఉపాధి పొందే చిన్నచిన్న (మరమ్మతులు) పనులు చేసేవారు కూడా కష్టంగానే జీవితం వెల్లబుచ్చాల్సి వస్తుంది. అందుకని అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు కూలీ, భద్రత, వైద్యం మొదలగు వాటిల్లో రక్షణ కల్పించాలి.

1) కూలి :
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు జీతం తక్కువగా ఉంటుంది, పని ఎక్కువ, వేతనం తక్కువ, ఆర్జిత సెలవు, సెలవులు, అనారోగ్యమప్పుడు సెలవులు వంటివి ఉండవు. వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ కూలీలు అధికశాతం మంది చాలా తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు. వీళ్లు తరచు దోపిడికి గురవుతుంటారు, వీళ్లకు న్యాయమైన – వేతనం చెల్లించబడదు. సంపాదన తక్కువ అది క్రమం తప్పకుండా ఉండదు.

ఈ రంగంలోని కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే, వీరి యొక్క కొనుగోలు శక్తి పెరగాలన్నా, ఆర్థిక, సామాజిక అభివృద్ధి పొందాలన్నా వీరికి రక్షణ, మద్దతు అవసరం.

2) భద్రత :
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు, అలాగే జీవితానికి భద్రత ఉండదు. ఏ కారణం లేకుండా ఉద్యోగస్తులను మానుకోమనవచ్చు. పని తక్కువగా ఉండే కాలాల్లో కొంతమందిని పని మానిపించవచ్చు. మారుతున్న మార్కెటు పరిస్థితి, ఉపాధి కల్పిస్తున్న వాళ్ల మానసిక స్థాయిపై ఆధారపడి ఉంటుంది. మరింత పని అవసరంతో పాటు అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం.

3) వైద్యం :
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు వైద్య ప్రయోజనాలు అందవు, అనారోగ్యమప్పుడు సెలవులు వంటివి కూడా ఉండవు. అనారోగ్యం పాలైతే వారి కుటుంబ జీవనం దుర్భరంగా మారుతుంది. కనుక ఖచ్చితంగా వీరికి జీవితబీమా, ఆరోగ్యబీమా మొదలయినటువంటి సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే వారి కుటుంబాలకు, వారికి రక్షణ ఉంటుంది.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 9.
అహ్మదాబాదు నగరంలో జరిపిన అధ్యయనంలో 15 లక్షలమంది కార్మికులు ఉండగా అందులో 11 లక్షలమంది అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్నారని తెలిసింది. ఆ సంవత్సరం (1997-98)లో నగరం మొత్తం ఆదాయం 6000 కోట్ల రూపాయలు. అందులో వ్యవస్థీకృత రంగం వాటా 3200 కోట్ల రూపాయలు. ఈ గణాంకాలను ఒక పట్టిక రూపంలో ఇవ్వండి. పట్టణంలో మరింత ఉపాధి కల్పించే మార్గాలు ఏమిటి?
జవాబు:
అహ్మదాబాదు నగరంలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల వాటాలు (1997-98) :

రంగం ఉద్యోగస్తులు ఆదాయం (కోట్లలో)
వ్యవస్థీకృత 4,00,000 ₹ 3200/-
అవ్యవస్థీకృత 11,00,000 ₹2800/-
మొత్తం 15,00,000 ₹ 6000/-

పట్టణంలో మరింత ఉపాధి కల్పించే మార్గాలు :

  1. ప్రభుత్వం వివిధ పథకాలను, ప్రణాళికలను రూపొందించి అమలుచేయడం.
    ఉదా : TRVSEM, SHG లు
  2. స్వయం ఉపాధి పొందేవారికి ఆర్థిక మరియు ఇతరత్ర సహాయమందించడం.
    ఉదా : పన్నుల మినహాయింపు
  3. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహమందించాలి.
    ఉదా : సులభ లైసెన్సింగ్ విధానం, పరపతి సౌకర్యం కల్పించటం.
  4. విద్యావిధానం, మానవ వనరులను అభివృద్ధిపర్చే విధంగా ఉండాలి.
    ఉదా : వృత్తి విద్యా కళాశాలల ఏర్పాటు.
  5. అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు కల్పించాలి.
    ఉదా : కనీస వేతనాల చట్టం అమలుచేయటం.

ప్రశ్న 10.
మన రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలలో ఉపాధి అవకాశాల గురించి క్రింది పట్టికలో రాయండి. (AS3)

ప్రాంతం వ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు అవ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు
1. ఉత్తరాంధ్ర
2. దక్షిణ కోస్తా
3. రాయలసీమ

జవాబు:

ప్రాంతం వ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు అవ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు
1. ఉత్తరాంధ్ర 1. ప్రభుత్వ రంగంలో రవాణా, వైద్యం విద్య ఆరోగ్యం మొదలైనవి.
2. ప్రైవేటు రంగంలో
1. వ్యవసాయ రంగం
2. మత్స్య పరిశ్రమ
3. చేతి వృత్తులు
4. పారిశ్రామిక రంగం
2. దక్షిణ కోస్తా 1. ప్రభుత్వ రంగంలో
2. ప్రైవేటు రంగంలో
1. వ్యవసాయ రంగం
2. మత్స్య పరిశ్రమ
3. చేతి వృత్తులు
4. పారిశ్రామిక రంగం
5. నిర్మాణ రంగం
3. రాయలసీమ 1. ప్రభుత్వ రంగంలో
2. ప్రైవేటు రంగంలో
1. వ్యవసాయ రంగం
2. చేతి వృత్తులు

10th Class Social Studies 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి InText Questions and Answers

10th Class Social Textbook Page No.28

ప్రశ్న 1.
దిగువ తెలిపిన వివిధ వృత్తుల వారిని వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల కింద వర్గీకరించండి. మీ వర్గీకరణకు కారణాలు ఇవ్వండి.

వృత్తి వర్గీకరణ
బట్టలు కుట్టేవారు
బుట్టలు అల్లేవారు
పూల సాగు చేసేవారు
పాలు అమ్మేవారు
చేపలు పట్టేవారు
మత బోధకులు / పూజారులు
ఉత్తరాలు బట్వాడా చేసే కొరియర్
అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు
వడ్డీ వ్యాపారి
తోటమాలి
కుండలు చేసేవారు
తేనెటీగలను పెంచేవారు
వ్యోమగామి
కాల్ సెంటర్ ఉద్యోగులు

జవాబు:

వృత్తి వర్గీకరణ
బట్టలు కుట్టేవారు సేవా రంగం
బుట్టలు అల్లేవారు పరిశ్రమల రంగం (కుటీర పరిశ్రమ)
పూల సాగు చేసేవారు వ్యవసాయ రంగం
పాలు అమ్మేవారు వ్యవసాయ రంగం
చేపలు పట్టేవారు వ్యవసాయ రంగం
మత బోధకులు / పూజారులు సేవా రంగం
ఉత్తరాలు బట్వాడా చేసే కొరియర్ సేవా రంగం
అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు పరిశ్రమల రంగం
వడ్డీ వ్యాపారి సేవా రంగం
తోటమాలి వ్యవసాయ రంగం
కుండలు చేసేవారు పరిశ్రమల రంగం (కుటీర పరిశ్రమ)
తేనెటీగలను పెంచేవారు వ్యవసాయ రంగం
వ్యోమగామి సేవా రంగం
కాల్ సెంటర్ ఉద్యోగులు సేవా రంగం

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Textbook Page No.29

ప్రశ్న 2.
కింది పట్టిక భారతదేశంలో 1972-73 లోనూ, తిరిగి 2009-10 అంటే 37 ఏళ్ల తర్వాత ఏ రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారో తెలియచేస్తుంది.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 1
(అ) పై పట్టిక ద్వారా మీరు గమనించిన ప్రధాన మార్పులు ఏమిటి?
జవాబు:
1972-73 నుండి 2009-10 సం||ల మధ్య (దాదాపు 37 సం||లు) ఉపాధిలో వచ్చిన మార్పులు

  1. వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారి శాతం 21% తగ్గింది.
  2. పరిశ్రమ రంగంలో ఉపాధి పొందుతున్నవారి శాతం 11% పెరిగింది.
  3. సేవల రంగంలో ఉపాధి పొందుతున్నవారి శాతం 10% పెరిగింది.
  4. ప్రాథమిక రంగం (వ్యవసాయ రంగం) లో ఉపాధి శాతం తగ్గటం, ద్వితీయ (పరిశ్రమ) తృతీయ (సేవల) రంగాలు అభివృద్ధి చెందటం ఆర్థికాభివృద్ధి సూచికగా చెప్పవచ్చు.

ఆ) ఇంతకుముందు మీరు చదివిన దాని ఆధారంగా ఈ మార్పులకు కారణాలు ఏమిటో చర్చించండి.
జవాబు:
ఈ మార్పులకు కారణాలు :

  1.  పారిశ్రామిక విప్లవం ద్వారా పరిశ్రమ అభివృద్ధి చెందడం వలన ఆ రంగంలో ఉపాధి పెరిగింది.
  2. ఉత్పత్తి పెరగడం, మార్కెట్స్ పెరగడం, వ్యాపారం, వాణిజ్యం పెరగడం (రవాణా పెరగడం) వలన సేవారంగంలో ఉపాధి పెరిగింది.
  3. ప్రభుత్వ విధానాలు (1991 పారిశ్రామిక విధానం, గ్లోబలైజేషన్ మొదలగునవి) ప్రణాళికలు కూడా ఈ మార్పుకు దోహదం చేశాయి.
  4. పెరుగుతున్న వైజ్ఞానిక, సాంకేతిక సమాచార వ్యవస్థ సేవారంగంలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది.

10th Class Social Textbook Page No.29

ప్రశ్న 3.
ఈ దిగువ చిత్రాలను పరిశీలించి అవి ఏ రంగాలకు చెందినవో పేర్కొనండి.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 2
జవాబు:

  1. వ్యవసాయ రంగం
  2. (గనులు) ప్రాథమిక రంగం
  3. సేవల రంగం
  4. పారిశ్రామిక రంగం

10th Class Social Textbook Page No.30

ప్రశ్న 4.
ఈ కింది గ్రాఫ్ రెండు వేరు వేరు సంవత్సరాలు, 1972-73, 2009-10 లకు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి విలువను చూపిస్తుంది. సంవత్సరాలలో మొత్తం ఉత్పత్తి పెరిగిన తీరును మీరు చూడవచ్చు.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 3
గ్రాఫ్ : వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల వారీగా స్థూల దేశీయోత్పత్తి
గ్రాఫ్ ను చూసి కింది ప్రశ్నలకు జవాబులివ్వండి :
(1) 1972-78లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది?
జవాబు:
1972-73లో వ్యవసాయం రంగం అధిక ఉత్పత్తి కలిగి ఉన్నది. మొత్తం GDP 5,86,346 కోట్లలో వ్యవసాయరంగం 2,43,082 కోట్లు కలిగి ఉంది.

(2) 2009-10 లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది?
జవాబు:
2009-10 లో సేవా రంగం అధిక ఉత్పత్తి కలిగి ఉన్నది. మొత్తం GDP 45,16,071 కోటలో సేవా రంగం 26,78,165 కోట్లు మిగిలిన వ్యవసాయ రంగం 7,64,817 కోట్లు మరియు పరిశ్రమల రంగం 11,73,089 కోట్లు వాటా కలిగి ఉన్నాయి.

(3) 1972-73, 2009-10 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తువులు, సేవల ఉత్పత్తి సుమారుగా …….. రెట్లు పెరిగింది.
జవాబు:
8 రెట్లు పెరిగింది.

10th Class Social Textbook Page No.31

ప్రశ్న 5.
ప్రతి దశలో మొత్తం వస్తువుల విలువ :
మొదటి దశ (రైస్ మిల్లర్‌కు రైతు వడ్లు అమ్మడం) రూ. 2500
రెండవ దశ (మాటలు యజమానికి ఊక, బియ్యం అమ్మడం) రూ. 3600
మూడవ దశ (ఇడ్లీ, దోశలు అమ్మడం) రూ. 5000
– చర్చించండి : ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల విలువను తెలుసుకోటానికి వీటన్నిటి మొత్తాన్ని జోడించాలా?
జవాబు:
అవసరం లేదు. ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల విలువను తెలుసుకోటానికి వీటన్నిటి మొత్తాన్ని జోడించనవసరం లేదు.

  • అంతిమ వస్తు ధరలో (విలువలో) ఆ వస్తువు తయారీలో వాడిన మాధ్యమిక వస్తువుల విలువ కలిసి ఉంటుంది.
  • అలా కనక జోడిస్తే ఆ వస్తువు ధరను రెండుసార్లు లెక్కించినట్లవుతుంది.
  • పై ఉదాహరణలో వడ్లు, బియ్యం, ఊక అనేవి మాధ్యమిక వస్తువులు, ఇడ్లీ, దోశ అనేవి అంత్య వస్తువులు.
  • ప్రతి దశలో ఉత్పత్తిదారులు ఉత్పాదకాలు తయారుచేసినవారికి మొత్తం విలువ చెల్లించారు.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Textbook Page No.31

ప్రశ్న 6.
పై ఉదాహరణలో వడ్లు, బియ్యం మధ్య దశలోని ఉత్పాదకాలు కాగా, ఇడ్లీ, దోశ వంటివి తుది ఉత్పాదకాలు. మనం నిత్యజీవితంలో ఉపయోగించే కొన్ని వస్తువులను దిగువ సూచించడమైనది. వాటికి ఎదురుగా ఆయా వస్తువుల మధ్య దశ ఉత్పాదకాలను రాయండి.

తుది ఉత్పాదకాలు మధ్యదశ ఉత్పాదకాలు
నోటు పుస్తకం
కారు
కంప్యూటర్

జవాబు:

తుది ఉత్పాదకాలు మధ్యదశ ఉత్పాదకాలు
నోటు పుస్తకం కాగితపు గుజ్జు, కాగితం, కార్డ్ బోర్డు, బంక, పిన్నులు
కారు టైర్లు, లైట్స్, మెటల్ షీట్స్, రంగులు, సీట్లు, పెట్రోలు/డీసెల్
కంప్యూటర్ సిలికాన్ చిప్స్, మానిటర్, కేబుల్స్, సాఫ్ట్ వేర్స్, సర్క్యుట్స్

10th Class Social Textbook Page No.32

ప్రశ్న 7.
మొదటి దశ (రైస్ మిల్లర్ కు రైతు వడ్లు అమ్మటం) = రూ. 2500 లోంచి కొనుగోలు చేసిన ఉత్పాదకాల విలువ ‘0’ రూపాయలు తీసేస్తే, జోడించిన విలువ 2500 రూపాయలు
రెండవ దశ (మాటలు యజమానికి ఊక, బియ్యం అమ్మటం) = రూ. 3600 లోంచి కొనుగోలు చేసిన ఉత్పాదకాల విలువ 2500 తీసేస్తే, జోడించిన విలువ 1100 రూపాయలు
మూడవ దశ (ఇడ్లీ, దోశల అమ్మకం) = రూ. 5000 లోంచి కొనుగోలు చేసిన విలువ 3600 తీసేస్తే, జోడించిన విలువ 1400 రూపాయలు.
ప్రతి దశలోనూ జోడించిన విలువ = 2500+ 1100 + 1400 = 5000
చర్చించండి : రెండు పద్ధతులలోనూ ఒకే సమాధానం ఎందుకు వచ్చింది?
జవాబు:

  1. ప్రతి దశలోనూ జోడించిన విలువ = (2500 + 1100 + 1400) = 5000
  2. అంతిమ వస్తువు ధర (దోశ ధర) = 5000. రెండు పద్ధతుల్లోను ఒకే సమాధానం వచ్చింది. కారణం
  3. జోడించిన విలువలు మాత్రమే లెక్కించడం వలన (మాధ్యమిక వస్తువులు జోడించిన విలువ)
  4. మొదటి పద్ధతిలో అంత్య వస్తువు (ఇడ్లీ) లోనే ఇవి అన్నీ ఇమిడి ఉంటాయి.
  5. రెండు పద్ధతుల్లో అంతిమ వస్తువుల విలువ ఒక్కటే కాబట్టి,
  6. రెండు పద్ధతుల్లోనూ ఒకే సమాధానం వచ్చింది.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Textbook Page No.32

ప్రశ్న 8.
కింది పట్టికలో స్థూల జాతీయోత్పత్తి విలువ ఇవ్వబడింది. 2010-2011 సంవత్సరానికి లెక్కించిన విధంగా స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటును మిగతా సంవత్సరాలకు గణించండి.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 4
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 5

10th Class Social Textbook Page No.34

ప్రశ్న 9.
వ్యాపారం, టళ్లు, రవాణా, ప్రసారాలకు కొన్ని ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:

  1. వివిధ రకాల వస్తువులు అమ్మే అన్నీ రకాల దుకాణాలు, ఎగుమతులు దిగుమతులు, సూపర్ మార్కెట్లు, మాల్స్
  2. చిన్న హెూటళ్ల నుండి స్టార్ హోటళ్లు దాకా.
  3. రోడ్డు, రైల్వే, విమానయాన, ఓడల ద్వారా రవాణా ఈ కోవ కిందకి వస్తాయి.
  4. రేడియో, టి.వి., వార్తాపత్రికలు, వివిధ మాస వార పత్రికలు, ఇంటర్నెట్ సౌకర్యం, టెలికమ్యూనికేషన్స్ (టెలిఫోన్, సెల్ ఫోన్) ఉపగ్రహ సాంకేతికత మొదలగునవి.

10th Class Social Textbook Page No.35

ప్రశ్న 10.
పట్టిక : భారతదేశంలో పరిశ్రమలవారీగా కార్మికుల వివరాలు, 2009-2010 (%)
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 6
పట్టికని జాగ్రత్తగా అధ్యయనం చేసి కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1) వ్యవసాయ రంగంలోని అత్యధిక మంది కార్మికులు ………………………… లో నివసిస్తున్నారు.
2) చాలామంది ………………………. పనివారు వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు.
3) 90% కంటే అధికంగా పట్టణ ప్రాంత పనివారు ……………., ……………… రంగాలలో ఉపాధి పొందుతున్నారు.
4) స్త్రీ, పురుషుల నిష్పత్తి పోలిస్తే స్త్రీలు ………………., ………………….. రంగాలలో కొద్ది శాతం మాత్రమే ఉపాధి పొందుతున్నారు.
జవాబు:
1) గ్రామప్రాంతం
2) మహిళ (స్త్రీ)
3) పారిశ్రామిక, సేవా
4) పారిశ్రామిక, సేవా

10th Class Social Textbook Page No.36 & 37

ప్రశ్న 11.
‘పై’ చార్టు : మూడు రంగాలలో ఉపాధి వాటా
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 8 AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 9 AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 10
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 11

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

SCERT AP 10th Class Social Study Material Pdf 2nd Lesson అభివృద్ధి భావనలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 2nd Lesson అభివృద్ధి భావనలు

10th Class Social Studies 2nd Lesson అభివృద్ధి భావనలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
వివిధ దేశాలను వర్గీకరించటంలో ప్రపంచ బ్యాంకు ఉపయోగించే ముఖ్యమైన ప్రామాణికాలు ఏమిటి? పై ప్రామాణికాలలో ఏమైనా పరిమితులు ఉంటే వాటిని పేర్కొనండి. (AS1)
జవాబు:
వివిధ దేశాలను వర్గీకరించటంలో ప్రపంచ బ్యాంకు ఉపయోగించే ముఖ్యమైన ప్రామాణికాలు.

  1. తలసరి ఆదాయం (అమెరికన్ డాలర్లలో) ను ముఖ్య ప్రామాణికంగా తీసుకుంది.
  2. దేశం మొత్తం ఆదాయాన్ని (జాతీయాదాయం ) దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది.
  3. తలసరి ఆదాయంను ‘సగటు ఆదాయం ” అని కూడా అంటారు.

పరిమితులు:
ఎ) పోలికకు “సగటు” ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.
బి) ప్రజల మధ్య ఈ ఆదాయం ఎలా పంపిణీ అయిందో తెలియదు.
సి) వాస్తవ అభివృద్ధిని తెలియచేయకపోవచ్చు.

ప్రశ్న 2.
ప్రతి సామాజిక అంశం వెనుక ఒకటి కాక అనేక కారణాలు ఉంటాయి. ఇక్కడ కూడా అది వర్తిస్తుంది. మీ అభిప్రాయంలో హిమాచల్ ప్రదేశ్ లో ఏ ఏ అంశాలు పాఠశాల విద్యకు దోహదం చేశాయి? (AS1)
(లేదా)
హిమాచల్ ప్రదేశ్ లో మెరుగైన అక్షరాస్యతను సాధించడానికి దోహదపడిన అంశాలు ఏవి?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విద్యకు లేదా మెరుఅక్షరాస్యతకు దోహదం చేసిన అంశాలు.

  1. పాఠశాలలు తెరిచి చాలా వరకు విద్య ఉచితంగా ఉండేలా లేదా తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు అయ్యేలా ప్రభుత్వం చూసింది.
  2. పాఠశాలలో ఉపాధ్యాయులు, తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీరు వంటి కనీస సదుపాయాలు ఉండేలా చూసింది.
  3. భారతదేశ రాష్ట్రాలలో ప్రభుత్వ బడ్జెటులో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి.
  4. ఆడపిల్లల పట్ల అంతగా వివక్షత లేకపోవటం అనేది హిమాచల్ ప్రదేశ్ లో చెప్పుకోదగిన విషయం
  5. కొడుకుల లాగానే కూతుళ్లు కూడా చదువుకోవాలని అక్కడి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
  6. లింగ వివక్షత తక్కువగా ఉండటం.
  7. మహిళా సాధికారిత (మహిళలు బయట ఉద్యోగాలు చేయటం).
  8. సామాజిక జీవితంలోనూ, గ్రామ రాజకీయాలలోనూ మహిళల పాత్ర ఎక్కువగా ఉండటం.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 3.
అభివృద్ధిని కొలవటానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే ప్రామాణికాలకూ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ఉపయోగించే వాటికి తేడా ఏమిటి? (AS1)
జవాబు:

ప్రపంచ బ్యాంక్ ప్రామాణికాలు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రామాణికాలు
1) ప్రపంచ బ్యాంక్ తలసరి ఆదాయం (సగటు ఆదాయం ) ను ప్రధాన ప్రామాణికంగా ఉపయోగిస్తుంది. 1) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) తలసరి ఆదాయంతోపాటు విద్యాస్థాయి, ఆయుః ప్రమాణం రేటును ప్రామాణికంగా ఉపయోగిస్తుంది.
2) ప్రపంచ బ్యాంకు అభివృద్ధి వేదికను “ప్రపంచ అభివృద్ధి నివేదిక” గా పిలుస్తారు. 2) UNDP నివేదికను ‘మానవాభివృద్ధి నివేదిక’ అని పిలుస్తారు.
3) ప్రజల ఆదాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొంటుంది. జీవిత ప్రమాణ స్థాయిని పరిగణనలోకి తీసుకోదు. 3) ప్రజల ఆదాయాలతో పాటు జీవన ప్రమాణ స్థాయిని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
4) ప్రజల సంక్షేమాన్ని దీనిద్వారా తెలుసుకోలేం. 4) ప్రజల సంక్షేమాన్ని వీని ద్వారా తెలుసుకోగలం.
5) ఇవి ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. 5) ఇవి ప్రజల (అభివృద్ధి) మధ్య అంతరాలను తెలియజేస్తుంది.
6) ఇవి పరిమాణాత్మకమైనవి. 6) ఇవి పరిమాణాత్మకం మరియు గుణాత్మకమైనవి.

ప్రశ్న 4.
మానవ అభివృద్ధిని కొలవటానికి మీ దృష్టిలో ఇంకా ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? (AS4)
(లేదా)
మానవాభివృద్ధిని కొలవడానికి ముఖ్యమైన అంశాలను ఉదహరించుము.
జవాబు:
మానవ అభివృద్ధిని కొలవటానికి పరిగణనలోకి తీసుకున్న అంశాలు :

  1. తలసరి ఆదాయం (కొనుగోలు శక్తి తెలుసుకోవటం కోసం)
  2. విద్యాస్థాయి
  3. ఆరోగ్య స్థితి

పరిగణనలోకి తీసుకోవాల్సిన మరికొన్ని అంశాలు :

  1. సామాజిక న్యాయం
  2. పంపిణీ న్యాయం
  3. త్రాగునీటి సౌకర్యాల ఏర్పాటు
  4. విద్యుత్ సౌకర్యం
  5. ఉద్యోగిత స్థాయి
  6. జీవన ప్రమాణ స్థాయి
  7. పర్యావరణం, పరిశుభ్రత
  8. అవినీతి రహితం
  9. సాంకేతిక ప్రగతి
  10. మెరుగైన రవాణా వ్యవస్థ

ప్రశ్న 5.
‘సగటు’ ఎందుకు ఉపయోగిస్తాం? దీనిని ఉపయోగించటంలో ఏమైనా పరిమితులు ఉన్నాయా? అభివృద్ధికి సంబంధించి మీ సొంత ఉదాహరణను తీసుకుని దీనిని వివరించండి. (AS1)
జవాబు:

  1. పోలికకు ‘సగటు’ను ఉపయోగిస్తాం.
  2. జాతీయాదాయం (మొత్తం) కన్నా తలసరి ఆదాయం (సగటు) మెరుగైన సూచిక.
  3. “సగటు” ను లెక్కించటం సులువు.

పరిమితులు :

  1. సగటు ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.
  2. ఇది పరిమాణాత్మకమైనదే కాని గుణాత్మకమైనది కాదు.
  3. పంపిణీ ఎలా జరిగిందో తెలియదు.
  4. వాస్తవ అభివృద్ధి తెలియజేయకపోవచ్చు.
  5. జీవన ప్రమాణ స్థాయిని ఖచ్చితంగా నిర్వచించలేకపోవచ్చు

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు 1

  1. పై ఉదాహరణలో రెండు దేశాల సగటు (20,000) ఒకే విధంగా ఉంది. అయితే,
  2. రెండు దేశాల అభివృద్ధి స్థాయి ఒకే విధంగా లేదు.
  3. ‘ఇ’ దేశంలో ఒక వ్యక్తి అత్యంత ధనవంతుడు, మిగతా నలుగురు పేదలు కాని సగటును తీసుకుంటే ఈ విషయం వెల్లడి కాదు. అంటే ఆదాయం ఎలా పంపిణీ అయిందో తెలియదు.
  4. సగటును తీసుకుంటే ‘ఇ’ దేశంలో వాస్తవ అభివృద్ధి జరిగిందో లేదో తెలియకపోవచ్చు.
  5. సగటును తీసుకుని ‘ఇ’ దేశంలో వ్యక్తులందరి కొనుగోలు శక్తి ఒకేలా ఉందని అనుకోవచ్చు కాని వాస్తవంలో అది కరెక్ట్ కాకపోవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 6.
హిమాచల్ ప్రదేశ్ లో తలసరి ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ పంజాబ్ కంటే మానవ అభివృద్ధి సూచికలో ముందుండటం అన్న వాస్తవం నేపథ్యంలో ఆదాయం యొక్క ప్రాముఖ్యత గురించి ఎటువంటి నిర్ధారణలు చేయవచ్చు? (AS1)
జవాబు:

  1. పౌరులు ఉపయోగించుకోగల భౌతిక వస్తువులు, సేవలను కేవలం ఆదాయం సూచించలేదు.
  2. డబ్బు కాలుష్యం లేని వాతావరణాన్ని కొనివ్వలేదు. కలీలేని మందులు దొరుకుతాయన్న హామీ ఇవ్వలేదు.
  3. ప్రజలందరూ నివారణ చర్యలు చేపడితే తప్పించి అంటురోగాల నుంచి (ఆదాయం) రక్షించలేకపోవచ్చు.
  4. మానవ అభివృద్ధి సూచికలో దిగువన ఉండటం ప్రజల జీవితాలలోని కొన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్న సంకేతాన్ని ఇస్తోంది.
  5. ప్రభుత్వమూ, ప్రజలూ అభివృద్ధి (మానవ వనరులు) పై ఆసక్తి కలిగి ఉంటే ఆదాయం (తలసరి) అంత ప్రాముఖ్య అంశం కాకపోయినప్పటికీ, అవసరమైన మేర ఉండాలి.
    ఉదా : హెచ్.పి. ప్రభుత్వం విద్యపై సగటున 2,005 రూపాయలు ఖర్చు పెడుతోంది, ఇది భారతదేశ సగటు (1049) కన్నా ఎక్కువ.
  6. తలసరి ఆదాయ అభివృద్ధి కన్నా, మానవ వనరుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన హిమాచల్ ప్రదేశ్ లో ఇది (HDI లో ముందుండటం) సాధ్యమయ్యింది.
  7. సామాజిక అంశాలు (లింగ వివక్షత, పురుషాధిక్యత మొదలయినవి) మానవ వనరుల అభివృద్ధిలో ఆదాయం కన్నా ముఖ్యపాత్ర పోషిస్తాయి.
    ఉదా : లింగ వివక్షత లేకపోవడం వలన హిమాచల్ ప్రదేశ్ లో బాలికలు అందరూ చదువుకోవడం జరుగుతుంది.
  8. మహిళా సాధికారత మానవాభివృద్ధిలో ప్రముఖ అంశంగా తోడ్పడుతుంది.
    ఉదా : హిమాచల్ ప్రదేశ్ లో సామాజిక జీవితంలో, గ్రామ రాజకీయాలలోను మహిళల పాత్ర ఎక్కువ. అలాగే పలు గ్రామాలలో చురుకుగా పనిచేస్తున్న మహిళా మండలులు ఉన్నాయి.

ప్రశ్న 7.
పట్టిక : హిమాచల్ ప్రదేశ్ లో ప్రగతి
AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు 2

పై పట్టికలో ఉన్న వివరాల ఆధారంగా కింది వాటిని పూరించండి : (AS3)
ఆరు సంవత్సరాలు పైబడిన ప్రతి 100 మంది ఆడపిల్లల్లో హిమాచల్ ప్రదేశ్ లో 1993లో ….. ఆడపిల్లలు ప్రాథమిక స్థాయి దాటి చదివారు. 2006 నాటికి ఇది వందలో ………… మందికి చేరుకుంది. భారతదేశం మొత్తం మీద 2006లో ప్రాథమిక స్థాయి దాటి చదివిన మగపిల్లల సంఖ్య వందలో …….. మాత్రమే.
జవాబు:
ఆరు సంవత్సరాలు పైబడిన ప్రతి 100 మంది ఆడపిల్లల్లో హిమాచల్ ప్రదేశ్ లో 1993లో …. 39 మంది…. ఆడపిల్లలు ప్రాథమిక స్థాయి దాటి చదివారు. 2006 నాటికి ఇది వందలో …60 ….. మందికి చేరుకుంది. భారతదేశం మొత్తం మీద 2006లో ప్రాథమిక స్థాయి దాటి చదివిన మగపిల్లల సంఖ్య వందలో … 57….. మాత్రమే.

ప్రశ్న 8.
హిమాచల్ ప్రదేశ్ లో తలసరి ఆదాయం ఎంత? అధిక ఆదాయం ఉన్నప్పుడు పిల్లల్ని బడికి పంపటం తల్లిదండ్రులకు తేలిక అవుతుందా? చర్చించండి. హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం పాఠశాలలు నడపటం ఎందుకు అవసరమయ్యింది? (AS1)
జవాబు:
ఎ) హిమాచల్‌ ప్రదేశ్ తలసరి ఆదాయం (2012 సం||లో) 74,000 రూపాయలు.
బి)

  1. అధిక ఆదాయం ఉన్నప్పుడు పిల్లల్ని బడికి పంపటం తల్లిదండ్రులకూ ఖచ్చితంగా తేలిక అవుతుంది. అయితే తలసరి ఆదాయం అధికంగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఆదాయ పంపిణీ ఎలా జరిగిందో చెప్పలేం కనుక.
  2. తక్కువ ఆదాయం కలిగి ఉన్న తల్లిదండ్రులు విద్యపై డబ్బు ఖర్చు పెట్టడం కష్టం. అలాగే పిల్లలను కూడా చదువు మాన్పించి కూలీకి (బాలకార్మికులుగా) పంపటం జరుగుతుంది.
  3. అధిక ఆదాయం ఉన్న తల్లిదండ్రులకు ఆ అవసరం ఉండదు కనుక పిల్లలను చక్కగా చదివిస్తారు.

సి) హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం పాఠశాలలు నడపటం ఎందుకు అవసరమయ్యిందంటే.

  1. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు హిమాచల్ ప్రదేశ్ లో విద్యాస్థాయి తక్కువగా ఉండటం.
  2. కొండ ప్రాంతం కావటంతో జనసాంద్రత చాలా తక్కువ. పాఠశాల విస్తరణ, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో విస్తరించటం పెద్ద సవాలుగా ఉండింది.
  3. చాలావరకు విద్య ఉచితంగా లేదా తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు అయ్యేలా ప్రభుత్వం చూసింది.
  4. అక్కడి ప్రజలు విద్యపై ఎంతో ఆసక్తి చూపడం వలన.
  5. విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం వలన.

ప్రశ్న 9.
అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల చదువుకు తల్లిదండ్రులు తక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? తరగతిలో చర్చించండి. (AS4)
జవాబు:
అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల చదువుకు తల్లిదండ్రులు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

కారణాలు :

  1. అమ్మాయిల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రధాన కారణం “లింగ వివక్షత”.
  2. “బాల్య వివాహాలు” (అమ్మాయిలకు తొందరగా పెళ్ళి చేసి పంపించేయాలని భావించటం),
  3. అమ్మాయిలను అబ్బాయిలకంటే తక్కువగా చూస్తూ వారిని ఇంటిపని, వంట పనులకు బాధ్యుల్ని చేయటం, చిన్నపిల్లల సంరక్షణను అప్పగించటం.
  4. అమ్మాయి ఎక్కువగా చదువుకుంటే తగిన పెళ్ళి సంబంధం కుదర్చాలంటే ఎక్కువ ఖర్చు మరియు కష్టంతో కూడుకున్నదని పెద్దలు అభిప్రాయపడటం.
  5. ఉద్యోగం పురుషలక్షణం అంటూ, అమ్మాయి చదివి ఏం ఉద్యోగం చేయాలని అంటూ అమ్మాయిల విద్యను నిరుత్సాహపరచటం. (ఒక విధమైన ‘పురుషాధిక్యత’)
  6. మనది “పితృస్వామ్య కుటుంబా”లవ్వటం వలన అబ్బాయిలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.
  7. అమ్మాయిలను “సరైన భద్రత” లేకుండా బయటకు (పాఠశాలలు మొ||నవి) పంపటం శ్రేయస్కరం కాదని భావించడం. సరైన సౌకర్యాలు (రవాణా, మరుగుదొడ్లు మొ||నవి) అందుబాటులో లేకపోవటం.
  8. మగపిల్లల చదువు (ఖర్చును) పెట్టుబడిగా, బాలికల చదువు (ఖర్చు) ఖర్చుగాను భావించడం. అబ్బాయిలకయ్యే ఖర్చును ఇతరత్రా రూపంలో తిరిగి పొందవచ్చని భావించడం.
  9. కొన్ని సామాజిక దురాచారాలు, పురుషాధిక్య సమాజం, మహిళా సాధికారత లోపించడం వలన అమ్మాయిల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 10.
ఆడవాళ్ళు ఇంటిబయట పనిచెయ్యటానికి, లింగ వివక్షతకూ మధ్య గల సంబంధం ఏమిటి? (AS1)
జవాబు:
ఆడవాళ్ళు ఇంటిబయట పనిచెయ్యటానికి, లింగ వివక్షతకూ విలోమ (వ్యతిరేక) సంబంధం ఉంది.

  1. బయట ఉద్యోగాలు చేసే మహిళలు స్వతంత్రంగా ఉంటారు, ఆత్మవిశ్వాసం కనబరుస్తారు.
  2. ఇంటిలో తీసుకునే నిర్ణయాలలో అంటే పిల్లల చదువు, ఆరోగ్యం, పిల్లల సంఖ్య, గృహ నిర్వహణ వంటి వాటిల్లో ఆడవాళ్ళ మాటకు ప్రాధాన్యత ఉంటుంది.
  3. ఉద్యోగాల్లో ఉన్న మహిళలు పెళ్ళి అయిన తరువాత తమ కూతుళ్లు ఉద్యోగాలు చేయాలని తల్లులు కోరుకుంటారు, కాబట్టి చదువుకు ప్రాధాన్యత ఇవ్వటం సహజం.
  4. ఆడవాళ్లు ఉద్యోగం (బయటపని) చేయటం వలన ఆర్థిక స్వాతంత్ర్యం పొందుతారు, అలాగే ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. తద్వారా మహిళా సాధికారత పొందుతారు.
  5. మహిళలు సాధికారత సాధించిన తర్వాత లింగ వివక్షతకు అసలు చోటే ఉండదు. (పూర్తి అనాగరిక సమాజాలలో తప్ప) ఈ విషయాన్ని మనం అభివృద్ధి చెందిన దేశాలలో చూస్తున్నాం కూడా !

ప్రశ్న 11.
ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకంలో మీరు విద్యాహక్కు చట్టం (వి.హ.చ) గురించి చదివారు. 6-14 సంవత్సరాల బాలలకు ఉచిత విద్యకు హక్కు ఉందని ఈ చట్టం పేర్కొంటోంది. పరిసర ప్రాంతాలలో తగినన్ని పాఠశాలలు నిర్మించేలా, అర్హులైన టీచర్లను నియమించేలా, అవసరమైన సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చూడాలి. మీరు ఈ అధ్యాయంలో చదివినది, మీకు తెలిసిన దాన్నిబట్టి (1) బాలలకు (II) మానవ అభివృద్ధికి ఈ చట్టం ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉందో చర్చించండి, గోష్టి నిర్వహించండి. (AS2)
జవాబు:
(i) విద్యాహక్కు చట్టం – బాలలకు కలిగి ఉన్న ప్రాధాన్యత.

  1. దీని ప్రకారం 6 నుండి 14 సం|| మధ్య వయస్సు గల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ప్రభుత్వం అందిస్తుంది.
  2. పిల్లల పరిసరాలలోనే తగిన సంఖ్యలో కనీస సౌకర్యాలు కలిగిన పాఠశాలలు నిర్మించడం, తగినంతమంది ఉపాధ్యాయుల నియామకం చేయడం జరుగుతుంది.
  3. పిల్లలకు భయం, ఆందోళన లేకుండా (శారీరక, మానసిక హింసలేకుండా) కృత్యాల ద్వారా బోధన ద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుంది.
  4. బాలల హక్కులు (అభివృద్ధి, భూస్వామ్య హక్కు మొ॥నవి) కాపాడబడటానికి ఈ చట్టం ఎంతో అవసరం.
  5. బాలకార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరి, బాల్య వివాహాలు మొ||న సామాజిక దురాచారాల నుండి (బాలలను) విముక్తి కల్పిస్తుంది.

(II) మానవ అభివృద్ధికి ప్రాధాన్యత :

  1. మానవాభివృద్ధి సూచికలో ‘విద్యాస్థాయి’ ప్రధానమైన సూచిక. విద్యాస్థాయిని పెంపొందించటానికి ఈ విద్యాహక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుంది.
  2. సగటున బడిలో గడిపే సంవత్సరాలు ఈ చట్టం ద్వారా ఖచ్చితంగా పెరుగుతాయి.
  3. అలాగే పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో నమోదు నిష్పత్తి కూడా ఈ చట్టం ద్వారా గణనీయంగా పెరుగుతుంది.
  4. ఈ చట్టం ద్వారా విద్యాభివృద్ధి తద్వారా మానవాభివృద్ధి ఆశించిన రీతిలో జరుగుతుంది.
  5. విద్యాభివృద్ధి అనేది ఆదర్శవంతమైన (మానవాభివృద్ధి) సూచిక.

10th Class Social Studies 2nd Lesson అభివృద్ధి భావనలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.20

ప్రశ్న 1.
ప్రపంచ అభివృద్ధి నివేదిక 2012 ప్రకారం మధ్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం ఎంతో పైన ఉన్న భాగం చదివి చెప్పండి.
జవాబు:
ప్రపంచ అభివృద్ధి నివేదిక 2012 ప్రకారం మధ్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం 1,035 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ, 12,600 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ.

10th Class Social Textbook Page No.14 & 15

ప్రశ్న 2.
పట్టిక : వివిధ వర్గాల ప్రజలు, అభివృద్ధి లక్ష్యాలు

వివిధ వర్గాల ప్రజలు అభివృద్ధి లక్ష్యాలు/ఆకాంక్షలు
1) భూమిలేని గ్రామీణ కార్మికులు మరిన్ని రోజుల పని, మెరుగైన కూలీ; స్థానిక పాఠశాల తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలగటం; సామాజిక వివక్షత లేకపోవటం, వాళ్లు కూడా గ్రామంలో నాయకులు కాగలగటం.
2) ధనిక రైతులు తమ పంటలకు అధిక మద్దతు ధరల ద్వారా, తక్కువ కూలీకి బాగా కష్టపడే కూలీల ద్వారా అధిక ఆదాయాన్ని ఖచ్చితంగా పొందగలగటం; తమ పిల్లలు విదేశాలలో స్థిరపడగలగటం.
3) వర్షాధార రైతులు
4) భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ
5) పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత
6) పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి
7) పట్టణ ప్రాంతంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి తన సోదరుడికి లభించే స్వేచ్చ తనకీ కావాలి, తన జీవితంలో ఏం చేయాలో తాను నిర్ణయించుకోగలగాలి. విదేశాలలో పై చదువులు చదువుకోవాలి.
8) గనుల తవ్వకం ప్రాంతంలోని ఆదివాసి
9) తీరప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తి

జవాబు:
పట్టిక : వివిధ వర్గాల ప్రజలు, అభివృద్ధి లక్ష్యాలు వివిధ వర్గాల ప్రజలు

వివిధ వర్గాల ప్రజలు అభివృద్ధి లక్ష్యాలు/ఆకాంక్షలు
1) భూమిలేని గ్రామీణ కార్మికులు మరిన్ని రోజుల పని, మెరుగైన కూలీ; స్థానిక పాఠశాల తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలగటం; సామాజిక వివక్షత లేకపోవటం, వాళ్లు కూడా గ్రామంలో నాయకులు కాగలగటం.
2) ధనిక రైతులు తమ పంటలకు అధిక మద్దతు ధరల ద్వారా, తక్కువ కూలీకి బాగా కష్టపడే కూలీల ద్వారా అధిక ఆదాయాన్ని ఖచ్చితంగా పొందగలగటం; తమ పిల్లలు విదేశాలలో స్థిరపడగలగటం.
3) వర్షాధార రైతులు సకాలంలో రుతుపవనాలు వచ్చి వర్షాలు బాగా పడాలి. పొలాలకు సాగునీరు అందాలి. పంట దిగుబడి పెరగాలి. ఆ పంటకు మంచి గిట్టుబాటు ధర రావాలి. పిల్లలకు మంచి విద్యనందించటం.
4) భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ పంట దిగుబడి పెరగాలి. పంటకు మంచి ధర రావాలి. నలుగురిలో (ఊరిలో) దర్పంగా ఉండాలి. మంచి బంగారు నగలు కొనుక్కోవాలి. ఇంట్లోవారు తన మాట వినాలి. పిల్లలకు ఉన్నతమైన సంబంధాలు తేవాలి.
5) పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత చిన్నదో, పెద్దదో ఒక మంచి స్థిరమైన ఉద్యోగం (ప్రభుత్వ ఉద్యోగం) పొందాలి. స్థిరమైన ఆదాయం వచ్చే స్వయం ఉపాధిని వెతుక్కోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ సకాలంలో వెలువడాలి, వాటికి ప్రిపేరయ్యి ఉద్యోగం సాధించాలి.
6) పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి విదేశాలలో చదువుకోవాలి, ఉద్యోగం పొందాలి. స్వేచ్ఛావాతావరణంలో విహరించాలి. తండ్రి వ్యాపారం చేయటం ఇప్పుడే ఇష్టం లేదు, లేదా తండ్రి వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యాలి. కొత్త మోడల్ కారు, బైక్ కొనుక్కోవాలి.
7) పట్టణ ప్రాంతంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి తన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకీ కావాలి. తన జీవితంలో ఏం చేయాలో తాను నిర్ణయించుకోగలగాలి. విదేశాలలో పై చదువులు చదువుకోవాలి.
8) గనుల తవ్వకం ప్రాంతంలోని ఆదివాసి తమ భూములు తమకిచ్చేయాలి. ప్రమాదానికి గురికాకుండా రోజు గడవాలి. పర్యావరణాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటే బాగుండు, మార్చే శక్తి తమకుంటే బాగుండు.
9) తీరప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తి వేట బాగా జరిగి ఎక్కువ చేపలు దొరకాలి. ఎటువంటి అంతరాయం, ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి చేరాలి. చేపలకు మంచి ధర రావాలి. మంచి మర పడవ కొనుక్కోవాలి.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

10th Class Social Textbook Page No.16 & 17

ప్రశ్న 3.
క్రింద ఇచ్చిన వార్తాపత్రిక కథనం చూడండి.
“ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను చెత్త పడవేసే బహిరంగ ప్రదేశంలోనూ, పక్కన ఉన్న సముద్రంలోనూ పారబోసింది. ఆఫ్రికాలోని ఐవరీకోస్ట్ దేశంలోని అబిద్ జాన్ అనే పట్టణంలో ఇది జరిగింది. అత్యంత విషపూరితమైన ఈ వ్యర్థ పదార్థాల నుండి వెలువడిన వాయువుల వల్ల తల తిప్పటం, చర్మంపై దద్దురులు, స్పృహతప్పి పడిపోవటం, విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడ్డాయి. ఒక నెల రోజులలో ఏడుగురు చనిపోయారు. ఇరవై మంది ఆసుపత్రిలో ఉన్నారు. విష ప్రభావానికి గురైన లక్షణాలకు 26,000 మంచి చికిత్స పొందారు. లోహాలు, ముడి చమురులతో వ్యాపారం చేసే ఒక బహుళజాతి కంపెనీ తన ఓడలోని వ్యర్థ పదార్థాలను పడవెయ్యటానికి ఐవరీకోస్టు చెందిన ఒక స్థానిక కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకుంది.” (ది హిందూ పత్రికలో 2006 సెప్టెంబరు 16న వైజు నరవనె రాసిన వార్త ఆధారంగా)
ఎ) దీనివల్ల ప్రయోజనం పొందినవాళ్లు ఎవరు, పొందని వాళ్లు ఎవరు?
జవాబు:

  1. దీనివల్ల (కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం) ప్రయోజనం పొందినవాళ్లు భారతదేశ ప్రజలు అందరూ. దీని ప్రధాన ఉద్దేశం నిరంతరం పెరుగుతున్న దేశ విద్యుచ్ఛక్తి అవసరాలు తీర్చడం.
  2. ఈ ప్రాంతం ప్రజలు, మత్స్యకారులు వారి భద్రత, రక్షణ, జీవనోపాధులు దెబ్బతింటాయని దీనివల్ల తమకు ప్రయోజనం ఉండదని భావించారు.
  3. రెండో ఉదాహరణలో బహుళ జాతి కంపెనీ లాభం పొందింది, ఐవరీకోస్ట్ తీరప్రాంత ప్రజలు నష్టపోయారు.

బి) ఈ దేశానికి అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉండాలి?
జవాబు:
ఈ దేశానికి అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉండాలి అంటే –

  1. అవసాపనా సౌకర్యాల (రోడు, రవాణా, విద్యుత్, నీరు మొ||నవి) లోటు లేకుండా ఏర్పాటు చేయడం.
  2. ఆధునిక సమాచార, సాంకేతిక రంగాలలో స్వయం సమృద్ధి సాధించుట.
  3. దేశ అభివృద్ధి లక్ష్యాలు ప్రజలందరి అభివృద్ధికి, అభ్యున్నతికి కృషి చేసేవిలా, దేశం స్వయం సమృద్ధి సాధించేలా, సుస్థిరమైన అభివృద్ధి సాధించేలా ఉండాలి.

సి) మీ గ్రామానికి, పట్టణానికి లేదా ప్రాంతానికి కొన్ని అభివృద్ధి లక్ష్యాలను పేర్కొనంది.
జవాబు:
మా గ్రామానికి / పట్టణానికి / ప్రాంతానికి కొన్ని అభివృద్ధి లక్ష్యాలు :

  1. రక్షిత మంచినీటి సౌకర్యం (అందరికి) కల్పించటం.
  2. విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయటం.
  3. పర్యావరణం, పరిశుభ్రతను కాపాడటం.
  4. వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించటం.
  5. మెరుగైన (రోడ్లు) రవాణా సౌకర్యాలను కల్పించటం.
  6. 100%, విద్యుదీకరణ, కోతలు లేని విద్యుత్ సౌకర్యం ఏర్పాటు.
  7. వ్యవసాయ కూలీలకు, ఇతర నిరుద్యోగులకు సంవత్సరమంతా ఉపాధి కల్పించే ప్రణాళికలు చేయడం.
  8. వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం.

డి) ప్రభుత్వానికి, అణువిద్యుత్ కేంద్ర ప్రాంతాలలో నివసించే ప్రజలకు మధ్య గల వివాదాలేవి?
జవాబు:

  1. భారత ప్రభుత్వం అణువిద్యుత్ కేంద్రాన్ని పెరుగుతున్న దేశ విద్యుచ్ఛక్తి అవసరాలు తీర్చు ప్రధాన ఉద్దేశముతో స్థాపించింది.
  2. కాని ఆ ప్రాంత ప్రజలు వారి భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణ కోసం ఉద్యమించారు.
  3. పెరుగుతున్న విద్యుచ్ఛక్తి అవసరాలు తీరాలంటే అణువిద్యుత్ శక్తి ఉత్పత్తి తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది.
  4. కాని ఆ ప్రాంత ప్రజలు తీరప్రాంతం, దేశం రేడియోధార్మిక వినాశక ప్రమాదం నుండి రక్షించబడాలని కోరుకుంటు ఉద్యమిస్తున్నారు.
  5. ఆ ప్రాంత ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (సౌర విద్యుచ్ఛక్తి, పవన విద్యుచ్ఛక్తి మొ||నవి) గురించి ఆలోచించమంటూ, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపాలంటున్నారు.
  6. ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణానికి తగిన భద్రతా చర్యలన్నీ తీసుకుంటున్నామని ప్రకటించి, ఉద్యమాలకు అతీతంగా నిర్మాణం కొనసాగిస్తోంది.

ఇ) ఇటువంటి అభివృది విధానాలకు చెందిన వివాదాలు మీకేమైనా తెలుసా? ఇరుపక్షాల వాదనలు పేర్కొనండి.
జవాబు:

  1. పశ్చిమగోదావరి జిల్లా (ఆంధ్రప్రదేశ్) లో గోదావరి నదిపై నిర్మిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పై అనేక వివాదాలు ఉన్నాయి.
  2. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే అనేక లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది, అలాగే జలవిద్యుచ్ఛక్తి కూడా ఉత్పత్తవుతుంది.
  3. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వలన అనేక గ్రామాలు ముంపునకు గురవుతాయి. పెద్ద మొత్తంలో అటవీ ప్రాంతం మునిగిపోతుంది, పర్యావరణం దెబ్బతింటుందని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.
  4. మరో ఉదాహరణ నర్మదానదిపై నిర్మించతలపెట్టిన (సర్దార్ సరోవర్) ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇలాంటి వివాదాలే తలెత్తితే, మేధాపాట్కర్ నాయకత్వాన ‘నర్మదా బచావో’ ఆందోళన సాగిస్తున్నారు.

10th Class Social Textbook Page No.19

ప్రశ్న 4.
ఉదాహరణకు క, గ అనే రెండు దేశాలను తీసుకుందాం. సంక్లిష్టంగా లేకుండా ఉండటానికి రెండు దేశాలలోనూ అయిదుగురే ప్రజలు ఉన్నారనుకుందాం. పట్టికలో ఇచ్చిన వివరాల ఆధారంగా రెండు దేశాల సగటు ఆదాయాన్ని లెక్కగట్టండి.
పట్టిక : రెండు దేశాలను పోల్చటం
AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు 5
జవాబు:
ఎ) దేశం ‘క’ సగటు ఆదాయం = 10000
బి) దేశం ‘గ’ సగటు ఆదాయం = 10000

10th Class Social Textbook Page No.20

ప్రశ్న 5.
ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ కాకుండా పోలికకు సగటును ఉపయోగించే మరో మూడు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

  1. ఒక పరిశ్రమలోని ఉత్పత్తి, ఉద్యోగులు (ధరలు, వ్యయం) అనుసరించి సగటు ఉత్పత్తి, సగటు వ్యయం మొదలైనవి ఉపయోగించి పోలుస్తారు.
  2. తరగతిలోని వివిధ మార్కుల సగటు. .
    ఉదా : తరగతి మార్కుల సగటు, సబ్జెక్ట్ మార్కుల సగటు, జి.పి.ఎ. (గ్రేడ్ పాయింట్ సగటు)
  3. జనాభాను పోల్చుటకు “సగటు జనసాంద్రత” (ఒక చదరపు కిలోమీటరులో నివసించే జనాభా) ను ఉపయోగిస్తున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

10th Class Social Textbook Page No.18

ప్రశ్న 6.
విభిన్న వ్యక్తులకు అభివృది పట్ల విభిన్న భావనలు ఎందుకుంటాయి? కింద ఇచ్చిన వివరణల్లో ఏది ముఖ్యమైనది, ఎందుకు?
(అ) వ్యక్తులు వేరు కాబట్టి
(ఆ) వ్యక్తుల జీవన పరిస్థితులు వేరు కాబట్టి
(లేదా)
వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలు భిన్నంగా ఉంటాయనడానికి ఉదాహరణలివ్వండి.
AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు 4-1
జవాబు:

  1. విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఎందుకుంటాయంటే వ్యక్తుల జీవన పరిస్తితులు వేరు కాబట్టి.
  2. వ్యక్తులు వారి వారి పరిస్థితులను బట్టి వారి అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలు కలిగి ఉంటారు.
  3. ఇద్దరు వ్యక్తులకు లేదా బృందాలకు పరస్పర విరుద్ధమైన కోరికలు ఉండవచ్చు.
  4. వ్యక్తులు తామున్న జీవన పరిస్థితుల్లో వివిధ కోరికలు లక్ష్యాలు/ఆకాంక్షలు కలిగి ఉంటారు. ఇవి వారి జీవన పరిస్థితులకు అనుగుణంగానే ఉంటాయి.
  5. ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు, అది విధ్వంసం కూడా కావచ్చు.

10th Class Social Textbook Page No.18

ప్రశ్న 7.
కింది రెండు వాక్యాల అర్థం ఒకటేనా ? మీ సమాధానాన్ని ఎలా సమర్థించుకుంటారు?
(అ) ప్రజల అభివృద్ధి లక్ష్యాలు వేరు వేరుగా ఉంటాయి.
(ఆ) ప్రజల అభివృద్ధి లక్ష్యాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి.
జవాబు:

  1. రెండు వాక్యాల అర్థం ఒకటి కాదు, వేరు వేరు.
  2. ప్రజల అభివృద్ధి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి అంతేకాని పరస్పర విరుద్ధంగా ఉండాలని లేదు.
  3. కొన్ని సందర్భాలలో ఒకరికి అభివృద్ధి అనుకున్నది మరొకరికి (కాకపోవచ్చు) విధ్వంసం కావచ్చు కాని అన్ని సందర్భాలలో కాదు.
    ఉదా : విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు మరిన్ని ఆనకట్టలు కోరుకోవచ్చు. కాని ముంపునకు గురయ్యే నిర్వాసితులు ఆనకట్టలకు బదులు చెక్ డ్యాములు కోరుకోవచ్చు. కాని ప్రజలందరూ ఇలా కోరుకోటం లేదు కదా !
  4. ఒక అమ్మాయి తన సోదరుడికి లభించే స్వేచ్చ తనకూ కావాలని ఆశించవచ్చు. ఈ కోరిక సోదరుడి కోరికకు విరుద్ధం కాదు కదా !

10th Class Social Textbook Page No.18

ప్రశ్న 8.
మన జీవితంలో ఆదాయం కంటే ముఖ్యమైన ఇతర అంశాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
మన జీవితంలో ఆదాయం కంటే ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి.

  1. డబ్బు లేదా అది కొనగలిగిన వస్తువులు మన జీవితంలో ఒక అంశం మాత్రమే.
  2. భౌతికం కాని అంశాలపైన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది.
  3. సమానత, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం.
  4. ఇతరుల స్నేహాన్ని కోరుకోవటం, అభిమానాన్ని పొందడం.
  5. మన కుటుంబానికి ఉండే సదుపాయాలు, పని పరిస్థితులు, నేర్చుకోవటానికి గల అవకాశాలు.
  6. ఉద్యోగ భద్రత ఉండటం.
  7. కుటుంబానికి దగ్గరగా పనిచేయడం.
  8. సురక్షితమైన వాతావరణం.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

10th Class Social Textbook Page No.18

ప్రశ్న 9.
పై భాగంలోని ముఖ్యమైన అంశాలను మీ సొంత మాటలలో వివరించండి.
జవాబు:
1) ఉద్యోగ భద్రత :
తక్కువ జీతమైనా క్రమం తప్పకుండా పని దొరికి అది భద్రతా భావాన్ని కలిగిస్తుంది. మరొక ఉద్యోగంలో ఎక్కువ జీతం ఉండవచ్చు కానీ అందులో ఉద్యోగ భద్రత లేకపోతే (అభద్రతాభావం) దానిని కోరుకోకపోవచ్చు.

2) కుటుంబానికి దగ్గరగా ఉండటం :
వ్యక్తులు ఎక్కువగా తమ కుటుంబాలతో సమయం గడపాలని ఆశిస్తారు. తక్కువ జీతం అయినా, కుటుంబానికి దగ్గరగా ఉండే ఉద్యోగాలవైపు మొగ్గు చూపుతారు.

3) సురక్షిత వాతావరణం :
భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణం ఉంటే మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేపట్టటానికి, వ్యాపారాలు నిర్వహించటానికి అవకాశం ఉంటుంది.

4) సమానత (వివక్షతలు లేకపోవడం) :
వివక్షత లేని సమానత్వ వాతావరణంలో పనిచేయటానికి ఇష్టపడతారు, ఆదాయం కోసం వివక్షతను ఎదుర్కొనటానికి ఇష్టపడరు.

5) స్వేచ్ఛా వాతావరణం :
అభివృద్ధి చెందటానికి అవకాశం ఉన్న స్వేచ్ఛా వాతావరణంలో పనిచేయటానికి యువకులు ఇష్టపడతారు, ఆదాయం ముఖ్యమని భావించకపోవచ్చు.

10th Class Social Textbook Page No.20

ప్రశ్న 10.
అభివృద్ధికి సగటు ఆదాయం ముఖ్యమైన ప్రామాణికమని ఎందుకంటున్నారు? వివరించండి.
జవాబు:
ఒక దేశ (ప్రాంత, రాష్ట్ర అభివృద్ధిని తెలుసుకునేందుకు సగటు ఆదాయం (తలసరి ఆదాయం ) ముఖ్యమైన ప్రామాణికంగా భావిస్తున్నారు.

  1. తలసరి ఆదాయం (సగటు ఆదాయం ) ఆ దేశ ప్రజల కొనుగోలు శక్తిని తెలియజేస్తుంది.
  2. సగటు ఆదాయం , దేశం మొత్తం ఆదాయము (ఉత్పత్తుల మొత్తం) ను కూడా తెలియజేస్తుంది.
  3. ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మనం సగటు ఆదాయాన్ని పోలుస్తాం.
  4. ప్రజలు తమకు ఇష్టమైనవి, అవసరమైనవి ఎక్కువ ఆదాయాలతో సమకూర్చుకోగలుగుతారు. కాబట్టి అధిక ఆదాయం ఉండటం ఒక ముఖ్యమైన ప్రామాణికంగా పరిగణిస్తారు.
  5. మొత్తం ఆదాయంలో పెరుగుదల దేశాలను పోల్చటానికి అంతగా ఉపయోగపడదు ఎందుకంటే వివిధ దేశాల జనాభాలో తేడా ఉంటుంది కాబట్టి.
  6. అయితే పోలికకు “సగటు” ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.

10th Class Social Textbook Page No.20

ప్రశ్న 11.
కొంతకాలంగా ఒక దేశ సగటు ఆదాయం పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయని అనుకుందాం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితం మెరుగయ్యిందని దీని ఆధారంగా చెప్పగలమా ? మీ జవాబుకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. ఒక దేశ సగటు ఆదాయం పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితం మెరుగయ్యిందని దీని ఆధారంగా “చెప్పలేం*.
  2. ఉదాహరణకు దేశంలోని కొన్ని ఉన్నత వర్గాల ప్రజల (ధనవంతుల) ఆదాయం పెరిగినా సగటు ఆదాయం పెరిగినట్లు గణాంకాలు చెబుతాయి, కాని నిజంగా ప్రజలందరి ఆదాయం (పేద, బి.పి.ఎల్. వర్గాలందరి) పెరిగి ఉండకపోవచ్చు.
  3. అలాగే ఒక దేశంలోని మొత్తం ఆదాయం పెరగకపోయినా దానికంటే జనాభా తగ్గినట్లయితే (పెరుగుదల రేటు) తలసరి (సగటు) ఆదాయం పెరిగినట్లుగా గణాంకాలు చూపుతాయి. కాని ఇక్కడ ఆదాయాలు పెరగలేదు, జనాభా తగ్గరు.
  4. సగటు ఆదాయం పెరిగినా ప్రజల మధ్య ఈ ఆదాయం ఎలా పంపిణీ జరిగిందో తెలియదు.
  5. సగటు ఆదాయం ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

10th Class Social Textbook Page No.20

ప్రశ్న 12.
అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి మీకు గల ఆలోచన ప్రకారం భారతదేశం ఏం చెయ్యాలో, లేదా ఏం సాధించాలో ఒక పేరా రాయండి.
జవాబు:
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఇవి సాధించాలి.

  1. సంపూర్ణ (100%) అక్షరాస్యత సాధించాలి.
  2. వైద్యం, ఆరోగ్యం అందరికి అందుబాటులో ఉండాలి.
  3. వ్యవసాయంలో అధిక దిగుబడి (ఆధునిక వ్యవసాయ పద్ధతులు, హరిత విప్లవం) సాధించేలా కృషి చేయాలి.
  4. దేశంలో ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకుని పారిశ్రామిక వృద్ధి (ఉత్పత్తి) సాధించాలి.
  5. శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి.
  6. మెరుగైన రవాణా మరియు ఆధునిక సమాచార (వ్యవస్థలు) సౌకర్యాలు కల్పించాలి.
  7. విద్యుత్, త్రాగునీరు, రోడ్లు మొదలైన అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపర్చాలి.
  8. పొదుపు, పెట్టుబడుల సక్రమ నిర్వహణకై పటిష్టమైన బ్యాంకింగ్, ద్రవ్య వ్యవస్థ కలిగి ఉండాలి.
  9. పటిష్టమైన, పారదర్శకమైన, అవినీతిరహిత పాలన వ్యవస్థ కలిగి ఉండాలి.

10th Class Social Textbook Page No.22

ప్రశ్న 13.
క్రింది పట్టికలలోని వివరాలు చూడండి. తలసరి ఆదాయాలలో బీహార్ కంటే పంజాబు ముందున్నట్లుగా అక్షరాస్యత వంటి వాటిల్లో కూడా ఉందా?
పట్టిక : కొన్ని రాష్ట్రాల తలసరి ఆదాయం

రాష్ట్రం 2012 సం||లో
తలసరి ఆదాయం (రూ.లో)
పంజాబ్ 78,000
హిమాచల్ ప్రదేశ్ 74,000
బీహార్ 25,000

పట్టిక : కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని తులనాత్మక గణాంకాలు
AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు 3
జవాబు:

  1. తలసరి ఆదాయంలో పంజాబు (₹ 78,000) బీహార్ (₹ 25,000) కంటే ముందుంది.
  2. అక్షరాస్యత పంజాబులో 77% ఉంటే బీహార్లో 64% మాత్రమే ఉంది.
  3. నికర హాజరు పంజాబులో 76% ఉంటే బీహార్‌లో 56% మాత్రమే ఉంది.
  4. అలాగే శిశుమరణాలరేటు పంజాబులో 42 ఉంటే బీహార్ 62 కలిగి ఉంది. ఈ వివరాలు గమనించినట్లైతే పంజాబు, బీహార్ కంటే తలసరి ఆదాయాలలోనే కాకుండా అక్షరాస్యత మొదలైన వాటిల్లో కూడా ముందు ఉందని అవగాహనవుతుంది.

10th Class Social Textbook Page No.22

ప్రశ్న 14.
వ్యక్తులుగా సమకూర్చుకోవటం కంటే సామూహికంగా వస్తువులు, సేవలు సమకూర్చుకోవటానికి తక్కువ ఖర్చు అయ్యే మరికొన్ని ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:
వాస్తవానికి ఎన్నో ముఖ్యమైన వాటిని అందించటానికి (సమకూర్చుకోవటానికి), తక్కువ ఖర్చుతో చెయ్యాలంటే వస్తువులను,
సేవలను సామూహికంగా అందించాలి. ఉదాహరణకు

  1. ఇంటి ముందు (రహదారి) రోడ్డు ఒక్కరే వేసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది, రోడ్డులోని ఇళ్ళవారందరూ కలసి వేసుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది (విద్యుత్ లైన్, డ్రైనేజి వ్యవస్థ మొదలైనవి కూడా).
  2. అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఒక లిఫ్ట్ పెట్టుకోవాలంటే ఖర్చు పెరుగుతుంది. కనుక సామూహికంగా ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసుకుంటున్నారు (మంచినీటి సరఫరా, భద్రత సిబ్బంది మొదలైనవి కూడా).
  3. ప్రతి ఒక్కరూ అన్నీ పుస్తకాలు కొనుక్కొని చదవాలంటే ఖర్చు పెరుగుతుంది. అదే లైబ్రరీ ఏర్పాటు చేసుకుని సామూహికంగా వాడుకుంటే ఖర్చు చాలా తగ్గుతుంది.
  4. ఆట స్థలమును వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవటం వ్యయంతో కూడుకున్నది, సామూహికంగా అయితే ఖర్చు తగ్గుతుంది. (స్విమ్మింగ్ పూల్, పార్క్ మొదలైనవి కూడా)
  5. ‘షేర్ ఆటో’ దగ్గర నుంచి ‘ఎయిర్ బస్’ వరకు సామూహికంగా వినియోగించుకోవటం వల్ల వాటి వినియోగ సేవల ఖర్చు తగ్గుతుందని తెలుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 2 అభివృద్ధి భావనలు

10th Class Social Textbook Page No.22

ప్రశ్న 15.
ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుపైనే మెరుగైన సేవలు అందుబాటులో ఉండటం ఆధారపడి ఉందా? ఇంకా ఏయే అంశాలు ప్రధానపాత్ర పోషిస్తాయి?
జవాబు:

  1. అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన (వెనకబడిన) దేశాలలో ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం ఖర్చుపెట్టే డబ్బుపైనే మెరుగైన సేవలు అందుబాటులో ఉండటం ఆధారపడి ఉంది.
  2. అలాగే ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ఇతర సామాజిక అంశాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి.
  3. ప్రజల యొక్క చైతన్యం, సేవా దృక్పథం. (విద్యను పొందాలని, ఆరోగ్యం బాగుండాలని ప్రజల్లో చైతన్యం వస్తే ప్రజలు సేవా దృక్పథం కలిగి ఉంటే మెరుగైన సేవలు అందుతాయి.)
  4. మానవ వనరుల అభివృద్ధి, అందుబాటు. (డాక్టర్లు, ఉపాధ్యాయులు ఎక్కువగా లభ్యమయితే, మెరుగైన సేవలు అందుతాయి.)
  5. స్వచ్చంద సంస్థలు, (NGOS) (వీరి సేవలు అందించుట వల్ల మెరుగైన ఆరోగ్యం , విద్య అందుతుంది)
  6. యువజన సంఘాలు, మత సంస్థలు మొదలైనవి.

10th Class Social Textbook Page No.22

ప్రశ్న 16.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతంలోని కుటుంబం 2009-10 లో చౌకధరల దుకాణాల నుంచి తమకు అవసరమైన దాంట్లో 53 శాతం, 33 శాతం కొనుక్కున్నాయి. మిగిలిన బియ్యం బజారు నుంచి కొనుక్కుంటారు. పశ్చిమ బెంగాల్, అసోంలలో 11 శాతం, 6 శాతం బియ్యం మాత్రమే పౌర సరఫరా దుకాణాల నుంచి కొనుక్కుంటున్నాయి. ఏ రాష్ట్రాల ప్రజలు మెరుగ్గా ఉన్నారు? ఎందుకు?
జవాబు:
పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల ప్రజలు మెరుగ్గా ఉన్నారు. కారణం :

  1. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతంలోని కుటుంబాలు 2009-10 లో చౌకధరల దుకాణాల నుంచి 53% మరియు 33% వరుసగా కొనుక్కున్నాయి.
  2. అంటే 47% మరియు 67% (బియ్యం) బజారు నుంచి కొనుగోలు చేశారు.
  3. పశ్చిమ బెంగాల్, అస్సాంలు చౌకధరల దుకాణాల నుంచి 11 శాతం, 6 శాతం బియ్యం మాత్రమే కొనుక్కుంటున్నాయి.
  4. అంటే 89% మరియు 94% బియ్యం బజారు నుంచి కొనుక్కుంటున్నారు.
  5. బియ్యం బజారు నుంచి పశ్చిమబెంగాల్, అసోం రాషాల కుటుంబాలు ఎక్కువగా కొంటున్నాయి. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ప్రజల కొనుగోలు శక్తి అధికంగా ఉంది. కనుక వీరు మెరుగ్గా ఉన్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

10th Class Social Studies 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పశ్చిమాన ఉన్న గుజరాత్ లో కంటె అరుణాచల్ ప్రదేశ్ లో సూర్యోదయం రెండు గంటల ముందు అవుతుంది. కానీ, గడియారాలు ఒకే సమయం చూపిస్తాయి. ఎందుకని? (AS1)
జవాబు:
సూర్యుడు తూర్పున ఉదయించి, పడమరన అస్తమిస్తాడు. ఒక్కో రేఖాంశం పశ్చిమం నుండి తూర్పునకు తిరగటానికి ‘4’ నిమిషాలు పడుతుంది. గుజరాత్ లోని కచ్ 68°7′ తూర్పు రేఖాంశం వద్ద, అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతం 97°25′ తూర్పు రేఖాంశం వద్ద కలదు. అంటే దాదాపు 30 డిగ్రీల మేర విస్తరించి ఉంది. కావున, రెండు ప్రదేశాల మధ్య రెండు గంటలు (30 x 40 ని = 120 ని||) తేడా ఉంటుంది.

కానీ భారత స్థానిక కాలరేఖగా 82° 30′ తూర్పు రేఖాంశం తీసుకోవటం జరిగింది. దేశంలో వివిధ ప్రదేశాల స్థానిక కాలాల్లోని భేదాన్ని తొలగించడానికిగాను దీనివద్ద కాలాన్ని లెక్కించి, దానినే భారతదేశ ప్రామాణిక కాలం (IST- Indian Standard Time) గా వ్యవహరిస్తున్నారు. కావున సూర్యుడు తూర్పున, పశ్చిమం కన్నా రెండు గంటలు ముందుగా ఉదయించినా గడియారాలు ఒకే సమయం చూపిస్తాయి.

ప్రశ్న 2.
హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే భారత ఉపఖండ శీతోష్ణస్థితులు ఎలా ఉండేవి? (AS1)
(లేదా)
భౌగోళికంగా భారతీయ శీతోష్ణస్థితి హిమాలయ పర్వతాల వల్ల ఏ విధంగా ప్రభావితమౌతున్నది?
జవాబు:
హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేనట్లయితే భారత ఉపఖండ శీతోష్ణస్థితులు ఇలా ఉండేవి –

  1. హిమాలయాల వల్ల శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది.
  2. భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటిగాలులను అడ్డుకుంటాయి. ఇవే లేనట్లయితే తీవ్ర చలిగాలులు వీస్తాయి.
  3. వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తరువాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. ఇవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. ఋతుపవన శీతోష్ణస్థితి లేనట్లయితే భారతదేశం ఉష్ణమండల ఎడారిగా మారి ఉండేది.
  4. హిమాలయాలలోని సతతహరిత అరణ్యాలు ఆవరణ సమతౌల్యతను కాపాడటానికి దోహదం చేస్తున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

ప్రశ్న 3.
ఇక్కడ పేర్కొన్న వాటిల్లో ఏ ఏ రాష్ట్రాలలోనికి హిమాలయాలు విస్తరించి లేవు? (AS1)
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, ఉత్తరాంచల్,
జవాబు:
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలోనికి హిమాలయాలు విస్తరించి లేవు.

ప్రశ్న 4.
భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు ఏవి? హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి. (AS1)
జవాబు:
A) భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు :
i) హిమాలయాలు
ii) గంగా-సింధూనది మైదానం
iii) ద్వీపకల్ప పీఠభూమి
iv) తీరప్రాంత మైదానాలు
v) ఎడారి ప్రాంతం
vi) దీవులు

B) హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చుట :

హిమాలయ ప్రాంతం ద్వీపకల్ప పీఠభూమి
i) హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పునకు విస్తరించి ఉన్నాయి. i) ద్వీపకల్ప పీఠభూమి మెట్టపల్లాలతో, విడివిడి భాగాలుగా విస్తరించి ఉంది.
ii) హిమాలయాలు నవీన ముడుత పర్వతాలు. ఇవి అవక్షేప శిలలతో ఏర్పడినవి. ii) ద్వీపకల్ప పీఠభూమి ‘గోండ్వానా భూమి’లో భాగం. ఇది పురాతన స్ఫటికాకార, కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలతో కూడి ఉన్నది.
iii) హిమాలయాలు సమాంతరంగా ఏర్పడిన శ్రేణులు. వీని మధ్య లోయలు (డూన్లు) ఉన్నాయి. iii) ద్వీపకల్ప పీఠభూమి తూర్పువైపునకు కొద్దిగా వాలి ఉంది. నదులు, భ్రంశాలు మరియు నిట్ర వాలులు దీనిని వేరు చేస్తున్నాయి.
iv) ఇక్కడ జీవనదులు ప్రవహిస్తున్నాయి. నిత్యం మంచుతో కప్పబడి ఉంటాయి. iv) జీవనదులు లేవు. వర్షధార నదులే ఉన్నాయి. మంచుతో కప్పబడి అస్సలు ఉండవు.
v) ఖనిజ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. v) లోహ, అలోహ ఖనిజాల వనరులు పెద్ద మొత్తంలో ఉన్నాయి.
vi) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలకు హిమాలయాలు ప్రసిద్ధి. ఉదా : ఎవరెస్ట్, కాంచనజంగా, నందాదేవి, కైలాష్ మొదలగునవి. vi) సాధారణ పర్వతాలు, కొండలకు మాత్రమే ప్రసిద్ధి. ఉదా : అనె ముడి, దొడబెట్ట, అరోమకొండ మొ॥వి.
vii) ఎవరెస్ట్ (8848 మీ|| శిఖరం ప్రపంచంలో మరియు హిమాలయాల్లో ఎత్తైన శిఖరం vii) అనైముడి (2695 మీII) శిఖరం దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం.
viii) గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులకు జన్మస్థలం. viii) నర్మదా, తపతి, గోదావరి, కృష్ణా, మహానదులు ప్రవహిస్తున్నాయి.

ప్రశ్న 5.
భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి? (AS1)
జవాబు:
భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయి :

  1. భారతదేశ ఉత్తర సరిహద్దులో సహజ రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను గంగా-సింధూ మైదానాలకు తగలకుండా అడ్డుకుంటున్నాయి. ఆ ప్రాంతంలోని పంటలకు నష్టం వాటిల్లకుండా చేస్తున్నాయి.
  2. రుతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. రుతుపవనాలే లేకపోతే భారతదేశం ఉష్ణమండల ఎడారిగా మారిపోయేది. ఏ పంటలు పండే అవకాశం ఉండేది కాదు.
  3. హిమనీనదాల నుంచి నీళ్లు అందటంతో హిమాలయ నదులు సం||రం పొడవునా నీళ్లు కలిగి ఉండి సంవత్సరంలో అన్ని పంటకాలాల్లో కూడా నీరు సమృద్ధిగా అందిస్తున్నాయి.
  4. హిమాలయ నదులు కొండల నుంచి కిందికి తెచ్చే ఒండ్రు మట్టి వల్ల, మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారి అధిక దిగుబడికి కారణమవుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

ప్రశ్న 6.
గంగా-సింధూ నది మైదానంలో జనసాంద్రత ఎక్కువ. కారణాలను తెలపండి. (AS1)
జవాబు:
గంగా-సింధూ నది మైదానంలో జనసాంద్రత ఎక్కువగా ఉండుటకు కారణాలు :

  1. భారతదేశంలో సుమారు 70%. మందికి వ్యవసాయమే ప్రధాన వృత్తి. కావున అధిక ఉత్పత్తులనిచ్చే సారవంతమైన ‘ఒండ్రు మృత్తికలు’ కలిగి ఈ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ.
  2. మైదాన ప్రాంతాలు ‘ప్రాచీన కాలం నుండి’ (సింధూ నాగరికత) మానవ ఆవాసాలకు నిలయం.
  3. ఆ మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన ‘నగరాలకు’ ప్రసిద్ధి.
    ఉదా : చండీగఢ్, లక్నో, పాట్నా, 4) మైదాన ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన ‘సాగునీరు, తాగునీరు’ వసతులు కలిగి ఉంది.

ప్రశ్న 7.
భారతదేశ సరిహద్దులను చూపించే పటంలో కింది వాటిని గుర్తించండి. (AS5)
i) కొండలు, పర్వత శ్రేణులు – కారకోరం, జస్కార్, పాట్ కాయ్, జైంతియా, వింధ్య పర్వతాలు, ఆరావళి, కార్డమం కొండలు.
ii) శిఖరాలు – K2, కాంచనగంగ, నంగ పర్వతం, అనైముడి.
iii) పీఠభూములు – చోటానాగ్ పూర్, మాల్వా.
iv) భారత ఎడారి, పశ్చిమ కనుమలు, లక్షద్వీప దీవులు.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 1

ప్రశ్న 8.
అట్లాసు ఉపయోగించి కింది వాటిని గుర్తించండి. (AS5)
i) అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల ఏర్పడిన దీవులు
ii) భారత ఉపఖండంలోని దేశాలు
iii) కర్కటరేఖ పోయే రాష్ట్రాలు
iv) భారత భూభాగంలో అన్నిటికంటే ఉత్తరాన ఉన్న అక్షాంశం, డిగ్రీలలో
v) భారత భూభాగంలో అన్నిటికంటే దక్షిణాన ఉన్న అక్షాంశం, డిగ్రీలలో
vi) అన్నిటికంటే తూర్పున, పడమరన ఉన్న రేఖాంశాలు, డిగ్రీలలో
vii) మూడు సముద్రాలు ఉన్న ప్రదేశం
viii) భారతదేశం నుండి శ్రీలంకను వేరుచేస్తున్న జలసంధి
ix) భారతదేశ కేంద్రపాలిత రాష్ట్రాలు
జవాబు:
i) అండమాన్, నికోబార్ దీవులు
ii) భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు.
iii) గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, త్రిపుర, మిజోరం, రాజస్థాన్.
iv) 37°6
v) 8°4
vi) 97°25′ మరియు 68°7′
vii) కన్యాకుమారి
viii) పాక్ జలసంధి
ix) ఢిల్లీ, చండీగఢ్, పాండిచ్చేరి, అండమాన్ & నికోబార్, లక్షద్వీప్, డామన్ & డయ్యు, దాద్రానగర్ హవేలి.
AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 2

ప్రశ్న 9.
తూర్పు మైదాన ప్రాంతాలు, పడమటి మైదాన ప్రాంతాల మధ్య పోలికలు, తేడాలు ఏమిటి ? (AS1)
జవాబు:
తూర్పు మైదాన ప్రాంతాలు, పడమటి మైదాన ప్రాంతాల మధ్య పోలికలు, తేడాలు :

తూర్పు తీరమైదాన ప్రాంతాలు పడమటి తీరమైదాన ప్రాంతాలు
1) తూర్పు కనుమలకు, బంగాళాఖాతానికి మధ్య తీరం వెంబడి ఉన్నాయి. 1) పశ్చిమ కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్య తీరం వెంబడి ఉన్నాయి.
2) మహానది డెల్టా నుండి కావేరి డెల్టా వరకు విస్తరించి ఉన్నాయి. 2) రాణ్ ఆఫ్ కచ్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి.
3) ఇవి వెడల్పుగా, బల్ల పరుపుగా ఉన్నాయి. 3) ఇవి సన్నగా, అసమానంగా ఉన్నాయి.
4) ఇవి చాలా సారవంతమైనవి, డెల్టాలు ఉన్నాయి. 4) ఇవి అంత సారవంతమైనవి కావు, డెల్టాలు ఎక్కువ లేవు.
5) ఇక్కడ గోదావరి, కృష్ణ, మహానది మొ|| వదులు ప్రవహిస్తున్నాయి. 5) ఇక్కడ పెద్ద నదులు ప్రవహించడం లేదు.
6) చిల్కా కొల్లేరు, పులికాట్ లాంటి సరస్సులు ఉన్నాయి. 6) ఈ తీర మైదానంలో సరస్సులు లేవు. లాగూన్లు, వెనుక జలాలు కలిగి ఉన్నాయి.
7) ఉత్కళ్ తీరం, సర్కార్ తీరం, కోరమండల్ తీరం అని పిలుస్తారు. 7) కొంకణ్ తీరం, కెనరా తీరం, మలబార్ తీరాలుగా విభజించారు.

AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

ప్రశ్న 10.
భారతదేశంలోని మైదాన ప్రాంతాలు వ్యవసాయానికి దోహదపడినంతగా పీఠభూమి ప్రాంతాలు తోడ్పడవు – దీనికి కారణాలు ఏమిటి ? (AS3)
జవాబు:
భారతదేశంలోని మైదాన ప్రాంతాలు వ్యవసాయానికి దోహదపడినంతగా పీఠభూమి ప్రాంతాలు తోడ్పడవు – దీనికి కారణాలు :

  1. పీఠభూమి ప్రాంతాలు మైదాన ప్రాంతాలంత సారవంతమైనవి కావు. మైదాన ప్రాంతాల్లోని ఒండ్రునేలలు అధిక దిగుబడికి, భూసారానికి పెట్టింది పేరు.
  2. పీఠభూమి ప్రాంతాలలోని నదులు జీవనదులు కావు. గంగా మైదాన ప్రాంతంలోని నదులు జీవనదులు కావటం వలన సంవత్సరమంతా సాగునీరు అందుతుంది. వ్యవసాయానికి అనుకూలం.
  3. మైదాన ప్రాంతాలు నదులు తీసుకువచ్చిన మెత్తని, సారవంతమైన మట్టితో ఏర్పడినవి. పీఠభూములు అగ్నిపర్వత శిలలతో ఏర్పడినవి.

10th Class Social Studies 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.2

ప్రశ్న 1.
అట్లాసులో ‘ఇందిరా పాయింటీ’ ని గుర్తించండి. దీని ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
అట్లాసులో, భారతదేశ పటంలో ఇందిరా పాయింట్ ని గుర్తించాము. దీని ప్రత్యేకత : ఇది భారతదేశపు దక్షిణ అంచు, -నికోబార్ దీవుల్లో ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపునకు గురి అయ్యింది.

10th Class Social Textbook Page No.2

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ ……. ఉత్తర అక్షాంశాల మధ్య, …….. తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.
జవాబు:
12°41′ – 19°07′ ఉత్తర అక్షాంశాలు,
77° – 84°40′ తూర్పు రేఖాంశాలు

10th Class Social Textbook Page No.2

ప్రశ్న 3.
మీ అట్లాసులో ఇచ్చిన స్కేలు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ తీర పొడవును కనుక్కోండి.
జవాబు:
దాదాపు 970 కి.మీ.

10th Class Social Textbook Page No.4

ప్రశ్న 4.
హిమాలయాలు ఎ) ……. కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడగా, వేట- సేకరణపై ఆధారపడిన తొలి మానవులు బి) ………. లక్షల సం||రాల క్రితం భూమి మీద ఆవిర్భవించారు.
జవాబు:
ఎ) 20
బి) 5

10th Class Social Textbook Page No.1 & 2

ప్రశ్న 5.
ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించటానికి అక్షాంశ, రేఖాంశాలను ఉపయోగిస్తారు. అట్లాసు ఉపయోగించి కింది వాక్యాన్ని సరిచేయండి.
“భారతదేశం చాలా విశాలమైన దేశం, ఇది పూర్తిగా దక్షిణార్ధ గోళంలో ఉంది. దేశం 8° – 50° ఉత్తర రేఖాంశాల మధ్య 68° – 9° తూర్పు అక్షాంశాల మధ్య ఉంది.”
జవాబు:
భారతదేశం చాలా విశాలమైన దేశం, ఇది పూర్తిగా ‘ఉత్తరార్ధ’ గోళంలో ఉంది. 8° – 4′ ‘ఉత్తర అక్షాంశాల’ మధ్య 68° -7′ తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.

10th Class Social Textbook Page No.2

ప్రశ్న 6.
“భారతదేశ ద్వీపకల్పం” అన్న పదాన్ని తరచుగా ఎందుకు ఉపయోగిస్తాం?
జవాబు:
భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా సముద్రం మరియు దక్షిణం వైపున హిందూ మహాసముద్రం ఉన్నాయి. మూడువైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉన్న భూభాగాన్ని “ద్వీపకల్పం” అంటారు. భారతదేశానికి మూడువైపులా సముద్రాలు (నీరు) ఉన్నాయి కాబట్టి భారతదేశ ద్వీపకల్పం అన్న పదాన్ని తరచుగా (దక్షిణ భారతదేశాన్ని ఉద్దేశించి) ఉపయోగిస్తారు.

10th Class Social Textbook Page No.2

ప్రశ్న 7.
కింద ఇచ్చిన పరిశీలనలలో అహ్మదాబాద్, ఇంఫాల్ సూర్యోదయ, సూర్యాస్తమయాలను తెలిపేవి ఏవి ? కారణాలను వివరించండి.
AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 3
జవాబు:
ప్రదేశం : ఇంఫాల్ ప్రదేశం : అహ్మదాబాద్
కారణాలు :

  1. ఇంఫాల్ భారతదేశానికి తూర్పుగా, అహ్మదాబాద్ పశ్చిమంగా ఉన్నాయి.
  2. ఇంఫాల్ 93°54′ తూర్పు రేఖాంశంపై, అహ్మదాబాద్ 72° 36′ తూర్పు రేఖాంశంపై ఉన్నాయి. ముందుగా 93°54 తూ.రే. పై సూర్యోదయం జరుగుతుంది. తర్వాత 72° 36′ పై సూర్యోదయం అవుతుంది.

(లేదా)

  1. భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. కనుక సూర్యోదయం భూగోళానికి తూర్పున, సూర్యాస్తమయం పడమర అవుతుంది.
  2. భారతదేశానికి తూర్పున ఉన్న ఇంఫాల్ లో పడమర ఉన్న అహ్మదాబాద్ కంటే ముందుగా సూర్యోదయం అవుతుంది. అలాగే సూర్యాస్తమయం ఇంఫాల్ లో ముందుగాను, అహ్మదాబాయ్ తరువాత అవుతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

10th Class Social Textbook Page No.4

ప్రశ్న 8.
భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడిన హిమాలయ, ద్వీపకల్ప నదులను పేర్కొనండి.
జవాబు:
భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడిన నదులు :
1) హిమాలయ నదులు : గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు మరియు వాటి ఉపనదులు.

2) ద్వీపకల్ప నదులు : నర్మదా, మహానది మొ||వి.

10th Class Social Textbook Page No.1

ప్రశ్న 9.
పైన ఇచ్చిన ప్రపంచ పటాన్ని పరిశీలించి భారతదేశ ఉనికిని గురించి కొన్ని వాక్యాలు రాయండి.
AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 4
జవాబు:
భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణభాగాన ఉంది.

  1. భారతదేశం ఉత్తరార్ధ, పూర్వార్ధ గోళాలలో పాక్షికంగా విస్తరించి ఉంది.
  2. భౌగోళికంగా 8°4′ – 37°6′ ఉత్తర అక్షాంశాల మధ్య, 68°7′ – 97°25′ తూర్పు రేఖాంశాలకు మధ్యన ఉంది.
  3. అక్షాంశాల పరంగా ఉత్తర, దక్షిణాలుగా 30 డిగ్రీల పొడవున, రేఖాంశాల పరంగా కూడా తూర్పు, పడమరలుగా అన్నే డిగ్రీల వెడల్పున వ్యాపించి ఉంది.
  4. భూగోళంపై భారత ఉపఖండం హెచ్చు భూభాగ విస్తీర్ణంతో వ్యాపించి ఉంది.

10th Class Social Textbook Page No.2

ప్రశ్న 10.
పై పటం చూసి ఆర్కిటిక్ వృత్తంలో భారతదేశం ఉందని ఊహించుకోండి. అప్పుడు మీ జీవితంలో ఏ ఏ తేడాలు ఉంటాయి?
జవాబు:
భారతదేశం ఆర్కిటిక్ వృత్తంలో ఉందనుకుంటే మా జీవితంలో ఉండే తేడాలు :
1) ఆహారం : తీసుకునే ఆహారంలో తేడా ఉంటుంది. ధ్రువప్రాంత ప్రజలు ఎక్కువగా మాంసం, చేపలు తీసుకుంటారు. కనుక మేము కూడా అవే తీసుకోవాల్సి ఉంటుంది. (వరి, గోధుమ పంటలు పండవు కనుక)

2) ఆవాసం : ఆర్కిటిక్ ప్రాంతవాసులు మంచుతో నిర్మించిన ‘ఇగ్లూ’లలో, జంతుచర్మాలతో నిర్మించిన గుడారాలలో నివసిస్తారు. మేము ఇప్పటిలాగా డాబాల్లో ఉండలేము. కనుక ఆవాసంలో తేడా ఉంది.

3) దుస్తులు : ఆర్కిటిక్ ప్రాంతవాసులు చలి నుండి రక్షణకై జంతు చర్మాలతో తయారైన బట్టలను ధరిస్తారు. మనలాగా నూలు, సిల్కు దుస్తులు ధరించరు. కనుక వేసుకునే దుస్తులలో తేడా ఉంటుంది.

4) వృత్తి : ప్రస్తుతం మేము వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం మొ||న వృత్తులలో ఉపాధి పొందుతున్నాం. కానీ ఆర్కిటిక్ ప్రాంతంలో వేట, చేపలు పట్టడమే ప్రధాన వృత్తులు. కాబట్టి ఎంచుకునే వృత్తిలో కూడా తేడా ఉంటుంది.

5) వినోదం : ఆర్కిటిక్ ప్రాంతంలో ఇక్కడిలా సినిమాలు, టీవీలూ, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు లేవు. కావున వినోద సాధనాల్లో, వినోద కార్యక్రమాల్లో తేడా ఉంటుంది.

6) కాలాలు : ఇప్పటిలాగా వేసవి, వర్ష, చలికాలం వంటివి ఉండవు. ఆర్కిటిక్ ప్రాంతం 6 నెలలు వేసవి, 6 నెలలు శీతాకాలం. కావున కాలాల్లో కూడా తేడా ఉంటుంది.

7) రవాణా సాధనాలు : ఇప్పుడు మేము వాడుతున్న రవాణా సాధనాలు (కారు, బైక్, బస్సు, విమానం మొ||నవి) ఇవి అక్కడ అందుబాటులో ఉండవు. స్లెడ్జ్ బండ్లు లాంటివి తప్ప.

AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

10th Class Social Textbook Page No.2

ప్రశ్న 11.
ఈ కింది పటాన్ని పరిశీలించండి. భారతదేశ సరిహద్దును గుర్తించండి. రంగులతో నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 5
పటంలో ఉన్న స్కేలు ఆధారంగా బంగ్లాదేశ్ తో భారతదేశ సరిహద్దు పొడవును అంచనా వేయండి.
జవాబు:
బంగ్లాదేశ్ తో భారతదేశ సరిహద్దు పొడవు సుమారు 4,096.70 కి. మీ.లు

10th Class Social Textbook Page No.3

ప్రశ్న 12.
పటం 2 ను, మీ పాఠశాలలోని ఉబ్బెత్తు నిమ్నోన్నత పటాన్ని చూడండి. మీ వేలితో కింద పేర్కొన్న వాటిని గుర్తించండి :
AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 6
ఎ) దక్కను పీఠభూమి వాలు ఎటు ఉందో : తెలుసుకోటానికి గోదావరి, కృష్ణా నదుల ప్రవాహం వెంట మీ వేలు పోనివ్వండి.
బి) భూస్వరూపాలు, ఎత్తులు, దేశాలను పేర్కొంటూ బ్రహ్మపుత్ర నదీ మార్గం మొత్తాన్ని వర్ణించండి.
జవాబు:
ఎ) దక్కన్ పీఠభూమి కొద్దిగా తూర్పునకు వాలి ఉంది. గోదావరి, కృష్ణా నదులు పశ్చిమం నుండి తూర్పు వైపునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.

బి) బ్రహ్మపుత్రానది టిబెట్ పీఠభూమి లోని ‘మానస సరోవరం’ (సరస్సు) దగ్గర కైలాస్ పర్వతాలలో జన్మించింది. (సింధు, సట్లెజ్ నదులు కూడా ఇక్కడే జన్మించాయి).

  1. టిబెట్లో బ్రహ్మపుత్రానదిని ‘సాంగ్ పో’ (Tsangpo) అంటారు.
  2. హిమాలయాలకు సమాంతరంగా తూర్పు వైపునకు ప్రవహిస్తుంది.
  3. అరుణాచల్ ప్రదేశ్ లో నైరుతి దిశగా పెద్దమలుపు తిరుగుతుంది. ఇక్కడ దీనిని “సియాంగ్” అనీ, “దిహాంగ్” అనీ అంటారు.
  4. తరువాత అసోం లోయలోకి వచ్చినపుడు దిబంగ్, లోహిత్ అనే రెండు ఉపనదులు కలుస్తున్నాయి.
  5. అసోం లోయ నుండి బంగ్లాదేశ్ లోకి ప్రవేశించి, పద్మానదితో కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది.

10th Class Social Textbook Page No.5

ప్రశ్న 13.
ఎ) మీ అట్లాసులో ఈ మూడు (హిమాద్రి, నిమ్న హిమాలయాలు, పిరే పంజాల్) పర్వతశ్రేణులను గుర్తించండి.
బి) ఉబ్బెత్తు పటంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను కొన్నింటిని గుర్తించండి.
జవాబు:
ఎ) 1) ఉన్నత హిమాలయాలు ( హిమాద్రి)
2) నిమ్న హిమాలయాలు ( హిమాచల్)
3) శివాలిక్ శ్రేణి
AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 7

బి) ఎవరెస్ట్ శిఖరం, K2 శిఖరం, కాంచనగంగ, గౌరీశంకర్, నంగపర్బత్, ధవళగిరి మరియు నందాదేవి
AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 8

10th Class Social Textbook Page No.5

ప్రశ్న 14.
ఎ) కింద పేర్కొన్న ప్రాంతాలపైన గోడ పటంలోనూ, ఉబ్బెత్తు నిమ్నోన్నత పటంలోనూ మీ వేలిని పోనివ్వండి.
బి) మీ అట్లాసులోని భారతదేశ భౌతిక పటంలో కింద పేర్కొన్న ప్రాంతాలను గుర్తించండి. సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేత్.
జవాబు:
ఎ) విద్యార్థి కృత్యము.
బి)
AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 9

10th Class Social Textbook Page No.7

ప్రశ్న 15.
మీ అట్లాసులోని భారతదేశ భౌతిక పటంలో ఈ కింది వాటిని గుర్తించండి.

కొండలు రాష్ట్రం / రాష్ట్రాలు
పూర్వాంచల్
పాట్ కాయ్
నాగా కొండలు
మణిపురి కొండలు

జవాబు:

కొండలు రాష్ట్రం / రాష్ట్రాలు
పూర్వాంచల్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం
పాట్ కాయ్ అరుణాచల్ ప్రదేశ్
నాగా కొండలు నాగాలాండ్
మణిపురి కొండలు మణిపూర్

AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

10th Class Social Textbook Page No.9

ప్రశ్న 16.
మీ అట్లాసులోని, భారతదేశ భౌతిక పటంలోనూ, ఉబ్బెత్తు నిమ్నోన్నత పటంలోనూ ఈ కిందివాటిని గుర్తించండి.
1. మాల్వా పీఠభూమి, 2. బుందేల్‌ఖండ్, 3. భాగేల్ ఖండ్, 4. రాజమహల్ కొండలు, 5. చోటానాగపూర్ పీఠభూమి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 10

10th Class Social Textbook Page No.9

ప్రశ్న 17.
అట్లాసు సహాయంతో టిబెట్ పీఠభూమితో పోలిస్తే పైన పేర్కొన్న పీఠభూములు ఎంత ఎత్తులో ఉన్నాయో పేర్కొనండి.
జవాబు:
టిబెట్ పీఠభూమి – 4950 మీటర్లు
మాల్వా పీఠభూమి – 300 – 600 మీ||
బుందేల్ ఖండ్ పీఠభూమి – 2 150 – 300 మీ||
భాగేఖండ్ పీఠభూమి – 300 – 600 మీ||
చోటానాగపూర్ – 600 – 900 మీ||
టిబెట్ పీఠభూమితో పోలిస్తే మిగతా పీఠభూములు అన్నీ తక్కువ ఎత్తులోనే ఉన్నాయి.

10th Class Social Textbook Page No.10

ప్రశ్న 18.
భారతదేశ ఉబ్బెత్తు నిమ్నోన్నత పటంలో తూర్పు, పశ్చిమ కనుమల ఎత్తులను టిబెటన్ పీఠభూమి, హిమాలయ శిఖరాలతో పోల్చండి.
జవాబు:

టిబెటన్, హిమాలయ శిఖరాలు తూర్పు, పశ్చిమ కనుమల శిఖరాలు
1) టిబెటన్, హిమాలయ శిఖరాలు హిమాలయ పర్వతాలకు ఉత్తరభాగంలో ఉన్నాయి. 1) తూర్పు, పశ్చిమ కనుమల శిఖరాలు ద్వీపకల్ప పీఠభూమిలో తూర్పు, పశ్చిమంగా ఉన్నాయి.
2) ఇవి సముద్రమట్టానికి 6000 మీ|| పైన ఎత్తు కలిగి ఉన్నాయి. 2) వీటి ఎత్తు 3000 మీ|| దాటిలేదు.
3) ఇవి ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. 3) మంచుతో కప్పబడి (అస్సలు) ఉండవు.
4) ఎవరెస్ట్, కాంచనజంగ, K2, నంగప్రభాత్, నందాదేవి, నామ్చాబార్వ మొ||న వాటితోపాటు ప్రధాన శిఖరాలు ఉన్నాయి. 4) అనైముడి, (నీలగిరి) దొడబెట్ట, అరోమకొండ మొ||న ప్రధాన శిఖరాలు ఉన్నాయి.
5) ఎవరెస్ట్ శిఖరం (8848 మీ.) హిమాలయాల్లోనూ మరియు ప్రపంచంలోనూ ఎత్తైన శిఖరం. 5) అనైముడి (2695 మీ.) భారత ద్వీపకల్పంలో ఎత్తైన శిఖరం

AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

10th Class Social Textbook Page No.12

ప్రశ్న 19.
భారతదేశ భౌతిక పటంలో డెల్టా ప్రాంతాలను గుర్తించండి. వాటి ఎత్తులలో తేడాలు ఏమిటి ? గంగా-సింధూ మైదానాలతో వీటిని పోల్చండి.
జవాబు:
డెల్టా ప్రాంతాలన్నీ దాదాపు ఒకే ఎత్తులో ఉన్నాయి.
AP Board 10th Class Social Solutions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 11
గంగా-సింధు మైదానాలతో డెల్టా ప్రాంతాలను పోల్చడం :

గంగా – సింధూ మైదానాలు డెల్టా ప్రాంతాలు
1) భారతదేశ ఉత్తర ప్రాంతంలో ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూమికి, హిమాలయాలకు మధ్యన ఉన్నాయి. 1) ద్వీపకల్ప పీఠభూమికి తూర్పుగా ఉన్నాయి. బంగాళాఖాతానికి, తూర్పు కనుమలకు మధ్యన ఉన్నాయి.
2) గంగా, సింధూ, బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడ్డాయి. 2) మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల వల్ల ఏర్పడ్డాయి.
3) ఇవి చాలా సారవంతమైనవి మరియు వ్యవసాయానికి చాలా అనుకూలం. 3) ఇవి కూడా చాలా సారవంతమైనవి. మరియు వ్యవసాయానికి అనుకూలం.
4) భాబర్, భంగర్, ఖాదర్, టెరాయి లాంటి భూస్వరూపాలు ఉన్నాయి. 4) చిల్కా, కొల్లేరు, పులికాట్ లాంటి సరస్సులు ఉన్నాయి.
5) ఇవి చాలా విస్తారమైనటువంటివి. దాదాపు 7 లక్షలు చ.కి.మీ. విస్తరించి ఉన్నాయి. 5) ఇవి అంత విశాలమైనవి కావు.
6) వీనిలో జీవనదులు ప్రవహిస్తున్నాయి. 6) వీనిలో జీవనదులు లేవు.

AP SSC 10th Class Telugu Grammar Question Answers

AP SSC 10th Class Telugu Grammar Question Answers

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Questions and Answers, Notes.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Questions and Answers

సమాపక – అసమాపక క్రియలు

ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.
1) ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
2) వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది.
3) అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు.

అ) సమాపక క్రియలు :
పై వాక్యాలలో ప్రతివాక్యం చివర ఉన్న వెళ్ళాడు, పెట్టాడు వంటి క్రియలు, పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని సమాపక క్రియలు అంటారు.

అసమాపక క్రియలు :
వాక్యం మధ్యలో ఉన్న ‘చేసి’, ‘గీసి’, ‘చదివి’ – అన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. వీటిని అసమాపక క్రియలు అంటారు.

ఇ) అసమాపక క్రియా – భేదాలు
1) క్వార్ధకం : (భూతకాలిక అసమాపక క్రియ)
భాస్కర్ ఆట ఆడి, అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఈ వాక్యంలో ‘భాస్కర్’ అనేది కర్త. ‘వచ్చాడు’ అనేది కర్తృ వాచకానికి చెందిన ప్రధాన క్రియ.

ఇక ఆడి, అలసి అనేవి కర్తృవాచక పదానికి చెందిన ఇతర క్రియలు. ఆడి, అలసి అనేవి క్రియలే కాని, వాటితో పూర్తి భావం తెలియడం లేదు. ఆడి, అలసిపోయి అనే క్రియల తర్వాత, “ఏమి చేస్తాడు ?” అనే ప్రశ్న వస్తోంది. ఆడి, అలసిపోయి అనే క్రియలు, భూతకాలంలోని పనిని సూచిస్తున్నాయి. వీటిని భూతకాలిక అసమాపక క్రియలనీ, ‘క్త్వార్థకం’ అని పిలుస్తారు.

ఈ క్రియలన్నీ ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే చివర – ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం ‘క్వార్థం’.
ఉదాహరణలు :
పుష్ప అన్నం తిని నిద్రపోయింది. ఇందులో ‘తిని’ అనేది “క్వార్ధకం” (అసమాపక క్రియ).

2) శత్రర్థకం: (వర్తమాన అసమాపక క్రియ)
అఖిలేశ్ మధుకర్‌తో ‘మాట్లాడుతూ’ నడుస్తున్నాడు. ఈ వాక్యంలో ‘నడుస్తున్నాడు’ అనే ప్రధానక్రియకు, ‘మాట్లాడుతూ’ అనే ఉపక్రియ వర్తమాన కాలంలో ఉండి, అసమాపక క్రియను సూచిస్తుంది.

ఈ విధంగా ‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల వర్తమాన అసమాపక క్రియగా మారుతుంది. వర్తమాన అసమాపక క్రియను ‘శత్రర్థకం’ అంటారు.
ఉదా :
1) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది.
2) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.

గమనిక : పై వాక్యాలలో 1) చదువుతూ 2) ఆలోచిస్తూ అనేవి శత్రర్థకాలు.

3) చేదర్థకం :
(ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.) కింది వాక్యం చదవండి.
“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది.”

పై వాక్యంలో ప్రధాన క్రియ ‘వస్తుంది’ – ఇది ఫలితాన్ని సూచిస్తుంది. ఈ ఫలితం రావాలంటే షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ, చేస్తే ఇది కారణం. అది కార్యం. ఈ విధంగా సంక్లిష్ట వాక్యాల్లో ప్రధాన క్రియ సూచించే పని జరగటానికి షరతును సూచించే క్రియను ‘చేదర్థకం’ అంటారు. చేత్ అర్థాన్ని ఇచ్చేది – చేదర్థకం. వీటిలో ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :
మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.

అభ్యాసం :
ఈ కింది వాక్యంలోని అసమాపక క్రియలను రాయండి.
1) రమ రోడ్డు మీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి దగ్గరలో ఉన్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
జవాబు:
తీసి, వేసి, ఎక్కి అనేవి ‘క్వార్ధకం’ అనే అసమాపక క్రియలు.

AP SSC 10th Class Telugu Grammar Question Answers

అ) తద్ధర్మ క్రియలు :
ఒక వస్తువు స్వభావాన్నీ , ధర్మాన్నీ తెలిపే క్రియలనూ, నిత్య సత్యాలను తెలిపే వాటినీ, ‘తధ్ధర్మ క్రియలు’ అంటారు.
ఉదా :
1) సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
2) సూర్యుడు పడమట అస్తమిస్తాడు.
3) పక్షి ఆకాశంలో ఎగురుతుంది.

ప్రశ్నా వాక్యాలు :
ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నా వాక్యంగా మార్చవచ్చు.
ఉదా :
1) మీరు బడికి వెళతారా?
2) దైన్య స్థితిని చూస్తారా?

అభ్యాసం :
కింది వాటిని జతపరచండి.

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి అ) చేదర్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే ఇ) ప్రశ్నార్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? ఈ) క్వార్ధకం

జవాబు:

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి ఈ) క్వార్ధకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో అ) చేదర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే ఆ) శత్రర్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? ఇ) ప్రశ్నార్థకం

ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు

1) భూతకాలిక అసమాపక క్రియను ఏమంటారు?
A) చేదర్థకం
B) శత్రర్థకం
C) క్వార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు:
C) క్వార్థకం

2) కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది. గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
A) క్వార్థకం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) ఆశీరార్థకం
జవాబు:
A) క్వార్థకం

3) వర్తమాన అసమాపక క్రియను ఏమంటారు?
A) క్వార్థకం
B) శత్రర్థకము
C) చేదర్థకం
D) అభ్యర్థకం
జవాబు:
B) శత్రర్థకము

AP SSC 10th Class Telugu Grammar Question Answers

4) షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ ఏది?
A) చేదర్థకం
B) క్వార్థకం
C) శత్రర్థకం
D) విధ్యర్థకం
జవాబు:
A) చేదర్థకం

5) ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరే అసమాపక క్రియను ఇలా పిలుస్తారు?
A) క్వార్థకం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) నిషేధార్థకం
జవాబు:
B) చేదర్థకం

6) శత్రర్థక క్రియను గుర్తించండి.
A) చేసి
B) చేయక
C) చేయుచున్
D) చేస్తే
జవాబు:
C) చేయుచున్

వాక్య భేదాలు

వాక్యాలు మూడు రకాలు :
1) సామాన్య వాక్యం
2) సంక్లిష్ట వాక్యం
3) సంయుక్త వాక్యం

1) ఉష పాఠం చదువుతున్నది.
2) మురళి మంచి బాలుడు.

1) సామాన్య వాక్యం :
గమనిక : మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియ లేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా, ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.

2) సంక్లిష్ట వాక్యం :
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.
ఉదా :
1) శ్రీకాంత్ అన్నం తిన్నాడు.
2) శ్రీకాంత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)

గమనిక :
పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అసమాపక క్రియలు ఉంటాయి. ఇటువంటి వాక్యాలను ‘సంక్లిష్ట వాక్యాలు’ అంటారు.

3) సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను ‘సంయుక్త వాక్యాలు’ అంటారు.
ఉదా :
1) సీత చదువుతుంది, పాడుతుంది.
2) అతడు నటుడు, రచయిత.
3) అశ్విని, జ్యోతి అక్కాచెల్లెండ్రు.

సామాన్య వాక్యాలు :
అ) రాజు అన్నం తిన్నాడు.
ఆ) గోపి పరీక్ష రాశాడు.
ఇ) గీత బడికి వెళ్ళింది.

గమనిక :
పై వాక్యాల్లో తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు. ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది. ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే, ఆ వాక్యాలను “సామాన్య వాక్యాలు’ అంటారు.

కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని.

సామాన్య వాక్యాలు :
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.

గమనిక :
పై సామాన్య వాక్యాలలో రెంటిలోనూ ‘గీత’ అనే నామవాచకం ఉంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి, మొదటి వాక్యంలోని ‘వెళ్ళింది’ లోని క్రియను ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.

సంక్లిష్ట వాక్యం ఉదా : గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. (సంక్లిష్ట వాక్యం )

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

AP SSC 10th Class Telugu Grammar Question Answers

అ) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
విమల వంట చేస్తూ పాటలు వింటుంది. (సంక్లిష్ట వాక్యం )

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
అమ్మ నిద్రలేచి ముఖం కడుక్కుంది. (సంక్లిష్ట వాక్యం )

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.

1) తాత భారతం చదివి నిద్రపోయాడు. (సంక్లిష్ట వాక్యం )
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. (సామాన్య వాక్యాలు)

2) చెట్లు పూత పూస్తే కాయలు కాస్తాయి. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
చెట్లు పూత పూయాలి. చెట్లు కాయలు కాయాలి. (సామాన్య వాక్యాలు)

3) రాముడు నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. రాముడు తన ఊరు చేరాడు. (సామాన్య వాక్యాలు)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
శర్వాణి పాఠం చదివి నిద్రపోయింది. (సంక్లిష్ట వాక్యం )

2) మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మహతి ఆట ఆడి అన్నం తిన్నది. (సంక్లిష్ట వాక్యం)

3) నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్లు తాగుతాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతాడు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు. (సామాన్య వాక్యాలు)

2) రజియా పాటపాడుతూ ఆడుకుంటున్నది. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రజియా పాట పాడుతుంది. రజియా ఆడుకుంటున్నది. (సామాన్య వాక్యాలు)

సంయుక్త వాక్యం:
కింది వాక్యాలను గమనించండి.
విమల తెలివైనది. విమల అందమైనది – విమల తెలివైనది, అందమైనది.
ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి, ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు.
సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు వచ్చే మార్పులు :

అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది, అందమైనది. (రెండు నామపదాల్లో ఒకటి లోపించడం)

ఆ) అజిత అక్క. శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కాచెల్లెళ్లు. (రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది. )

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా? ప్రొఫెసరా? (రెండు సర్వనామాల్లో ఒకటి లోపించింది. )

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

1) ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణా తీరమున పుట్టినవాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు. (సంయుక్త వాక్యం)

2) మోహన కూచిపూడి నృత్యం నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మోహన కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు. (సంయుక్త వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

1) చుక్క పొడుపుతో సీత లేచింది. సీత గడపను పూజించింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీత చుక్క పొడుపుతో లేచి గడపను పూజించింది. (సంక్లిష్ట వాక్యం)

2) బంధుమిత్రులంతా వచ్చేశారు. కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
బంధుమిత్రులంతా వచ్చి కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సంక్లిష్ట వాక్యం)

AP SSC 10th Class Telugu Grammar Question Answers

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

1) సీతక్క నిశ్చితార్థం జరిగింది. నాగయ్య సంబరపడ్డాడు. ఈ (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతక్క నిశ్చితార్థం జరిగింది కాబట్టి నాగయ్య సంబరపడ్డాడు. (సంయుక్త వాక్యం)

2) సీతమ్మ పెళ్ళికి ఏర్పాటు చేశారు. సీతమ్మ పెండ్లి పెటాకులయ్యింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతమ్మ పెళ్ళికి ఏర్పాటు చేశారు కాని పెండ్లి పెటాకులయ్యింది. (సంయుక్త వాక్యం)

సామాన్య వాక్యాలను సంయుక్త సంక్లిష్ట వాక్యాలుగా మార్పు

గమనిక :
గత పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన కొన్ని వాక్యాలు (గమనించండి.)

1. ఈ కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
రాముడు అడవికి వెళ్ళెను. రాముడు తండ్రి మాట నెరవేర్చెను.
జవాబు:
రాముడు అడవికి వెళ్ళి, తండ్రి మాట నెరవేర్చెను. (సంక్లిష్ట వాక్యం)

2. ఈ కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
‘పద్మ గ్రంథాలయమునకు వెళ్ళింది. పద్మ పుస్తకము చదివింది.
జవాబు:
పద్మ గ్రంథాలయమునకు వెళ్ళి పుస్తకము చదివింది. (సంక్లిష్ట వాక్యం)

3. పద్యం ఆనందాన్ని ఇస్తుంది. పద్యం మధురమైంది.
(పై సామాన్యవాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చండి)
జవాబు:
పద్యం మాధుర్యంగా ఉండి, ఆనందాన్ని ఇస్తుంది. (సంక్లిష్ట వాక్యం)

4. ఈ కింది సామాన్యవాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
మంచి రచనలు వ్రాయండి. మంచి మెప్పు పొందండి.
జవాబు:
మంచి రచనలు వ్రాసి, మెప్పు పొందండి. (సంక్లిష్ట వాక్యం)

5. ఈ కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
శ్రీనివాస్ అన్నం తిన్నాడు. శ్రీనివాస్ బడికి వచ్చాడు
జవాబు:
శ్రీనివాస్ అన్నం తిని, బడికి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)

6. ఈ క్రింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
వేటకు సంబంధించిన పద్యం చదివాడు. తన భార్య కొరకు చూశాడు.
జవాబు:
వేటకు సంబంధించిన పద్యం చదివి, తన భార్య కొరకు చూశాడు. (సంక్లిష్ట వాక్యం)

7. ఈ కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
సుమన్ పాట పాడుతున్నాడు. సుమన్ స్నానం చేస్తున్నాడు.
జవాబు:
సుమన్ పాట పాడుతూ స్నానం చేస్తున్నాడు. (సంక్లిష్ట వాక్యం)

8. ఈ కింది సామాన్య వాక్యాలను, సంయుక్త వాక్యంగా మార్చండి.
శ్రీరామశర్మ శ్రీరామభక్తుడు. శ్రీరామ శర్మ స్వయంగా పదకర్త.
జవాబు:
శ్రీరామశర్మ రామభక్తుడు మరియు స్వయంగా పదకర్త.

9. ఈ కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
మేము కష్టపడి చదువుకుంటున్నాము. మేము ఎక్కువ మార్కులు పొందుతాము.
జవాబు:
మేము కష్టపడి చదువుకుంటూ ఎక్కువ మార్కులు పొందుతాము. (సంక్లిష్ట వాక్యం)

10. ఈ కింది వాక్యాలను, సంయుక్త వాక్యంగా మార్చండి.
గుజ్రాన్ని చెరువు దగ్గరకు తీసుకువెళ్ళవచ్చు. గుర్రాన్ని నీరు త్రాగించలేము.
జవాబు:
గుబ్దాన్ని చెరువు దగ్గరకు తీసుకువెళ్ళవచ్చు. కాని, నీరు త్రాగించలేము.

11. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. ఈ సంవత్సరం పంటలు పండలేదు. (సంయుక్త వాక్యంగా మార్చండి.)
జవాబు:
ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కాని పంటలు పండలేదు. (సంయుక్త వాక్యం)

12. వేసవికాలం వచ్చింది. మామిడిపండ్లు రాలేదు. (సంయుక్తవాక్యంగా మార్చండి)
జవాబు:
వేసవికాలం వచ్చింది కానీ మామిడిపండ్లు రాలేదు. (సంయుక్త వాక్యం)

13. కవిత బాగా పాటలు పాడింది. ఆమెకు బహుమతి రాలేదు. (సంయుక్త వాక్యంగా మార్చండి.)
జవాబు:
కవిత బాగా పాటలు పాడింది కాని బహుమతి రాలేదు. (సంయుక్త వాక్యం)

14. పశుబలంతో నాయకత్వాన్ని సాధింపవచ్చు. పశుబలంతో నాయకత్వాన్ని నిలబెట్టుకోలేం. (సంయుక్త వాక్యంగా మార్చండి.)
జవాబు:
పశుబలంతో నాయకత్వాన్ని సాధింపవచ్చు కాని నిలబెట్టుకోలేం. (సంయుక్త వాక్యం)

15. మా టీచరుకు నాపై ఎనలేని ప్రేమ ఉండేది. మా టీచరుకు నాపై ఎనలేని సానుభూతి ఉండేది. (సంయుక్త వాక్యంగా మార్చండి.)
జవాబు:
మా టీచరుకు నాపై ఎనలేని ప్రేమ, సానుభూతి ఉండేది. (సంయుక్త వాక్యం)

16. నా సైకిలు దొరికింది. దొంగ దొరకలేదు. (సంయుక్త వాక్యంగా మార్చండి.) .
జవాబు:
నా సైకిలు దొరికింది కాని దొంగ దొరకలేదు.

కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు

1) కింది వాక్యాలను పరిశీలించి మార్పులను గమనించండి.
అ) సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.
గమనిక :
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కానీ వాక్య నిర్మాణంలో తేడా ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య భేదం ఇది.
1) “సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.”

1) కర్తరి వాక్యం :
ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ కర్తను సూచిస్తుంది. కర్మకు ద్వితీయా విభక్తి చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం’ అంటారు.

2) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. అనే రెండవ వాక్యంలో
1) కర్తకు తృతీయా విభక్తి ఉంది.
2) క్రియకు ‘బడు’ అనే ధాతువు చేరింది.
3) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

2) కర్మణి వాక్యం :
వాక్యంలో క్రియకు ‘బడు’ ధాతువు చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని ‘కర్మణి వాక్యం’ అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Question Answers

అభ్యాసం – 1 :
కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.

అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 2 :
కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచింపబడిన గ్రంథం, నేతాజీ చరిత్ర, (కర్మణి వాక్యం)
జవాబు:
నేను రచించిన గ్రంథం, నేతాజీ చరిత్ర, (కర్తరి వాక్యం )

అభ్యాసం – 3 :
కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
ఆళ్వారుస్వామి చిన్నప్పుడే కథ రాశారు. (కర్తరి వాక్యం )
జవాబు:
చిన్నప్పుడే ఆళ్వారు స్వామిచే కథ రాయబడింది. (కర్మణి వాక్యం)

అ) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఉసిరికాయ తీసి లింగయ్య చేత నాయకునికి ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పిల్లలతో నాయకులచేత అరగంట కాలం గడుపబడింది. (కర్మణి వాక్యం)

ఇ) వాద్యాల చప్పుడు విన్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 4 :
కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని తీసుకుపోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని తీసుకుపోయారు. (కర్తరి వాక్యం)

ఆ) కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
కాయలు అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)

ఇ) బాలురచే సెలవు తీసికోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసికొన్నారు. (కర్తరి వాక్యం)

కర్తరి, కర్మణి వాక్యాలు – విశేషాలు

కర్తరి వాక్యం :
జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు.

కర్మణి వాక్యం :
ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి.

గమనిక :
పై రెండు వాక్యాలలో కర్తరి వాక్యం మనకు సూటిగా అర్థం అవుతుంది. ఇది సహజంగా ఉంటుంది. కర్మణి వాక్యం చుట్టు తిప్పినట్లు ఉంటుంది. మన తెలుగుభాషలో వాడుకలో ప్రధానంగా కర్తరి వాక్యమే ఉంటుంది.

కర్మణి వాక్యప్రయోగాలు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చాయి. ఇంగ్లీషు వాక్య పద్ధతి ఇలాగే ఉంటుంది.
1) కర్తరి వాక్యాన్ని ఇంగ్లీషులో యాక్టివ్ వాయిస్ (Active voice) అంటారు.
2) కర్మణి వాక్యాన్ని ఇంగ్లీషులో పాసివ్ వాయిస్ (Passive voice) అంటారు.

అభ్యాసం :
కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.

1) రమేష్ భారతాన్ని చదివాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
రమేష్ చే భారతం చదువబడింది. (కర్మణి వాక్యం)

2) నేనెన్నో పుస్తకాలు రాశాను. (కర్తరి వాక్యం)
జవాబు:
ఎన్నో పుస్తకాలు నాచేత రాయబడ్డాయి. (కర్మణి వాక్యం )

పాఠ్యపుస్తకంలో కర్తరి – కర్మణి వాక్యాలు.

1) కర్తరి వాక్యం :
కర్త ఆధారంగా రూపొందించిన వాక్యాలు కర్తరి వాక్యాలు.

2) కర్మణి వాక్యం :
కర్మ ప్రధానంగా రూపొందించిన వాక్యాలను కర్మణి వాక్యాలు అంటారు.

అభ్యాసము – 1 :
కింది వాక్యాలలో ఏవి కర్తరి వాక్యాలో, ఏవి కర్మణి వాక్యాలో గుర్తించండి. కారణాలతో సమన్వయించండి.
ఉదా :
రామకృష్ణారావు ఆమోదముద్ర వేశారు. (కర్తరి వాక్యం )
రామకృష్ణారావుచే ఆమోదముద్ర వేయబడింది. (కర్మణి వాక్యం )

గమనిక :
ఆమోదముద్ర వేయడం – కర్తకు సంబంధించిన క్రియ. ఆమోదముద్ర వేయబడడం – కర్మకు సంబంధించిన క్రియ.

అ) దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారయ్యింది.
జవాబు:
ఇది కర్మణి వాక్యం. ‘తయారయ్యింది’ అనే క్రియ, హక్కు అనే కర్మను సూచిస్తోంది. కాబట్టి ఇది “కర్మణి వాక్యం”.

ఆ) బూర్గుల మంచి నిర్ణయాలు తీసుకున్నారు.
జవాబు:
ఇది కర్తరి వాక్యం. ‘తీసుకున్నారు’ అనే క్రియ బూర్గుల అనే కర్తను తెలుపుతోంది. కాబట్టి “కర్తరి వాక్యం”.

ఇ) వారి న్యాయవాద పటిమ ఇతరులను అబ్బురపరచింది.
జవాబు:
ఇది కర్తరి వాక్యం . ‘అబ్బురపరచింది. అనే క్రియ, ‘న్యాయవాద పటిమ’ అనే కర్తను తెలుపుతోంది. కాబట్టి ఇది “కర్తరి వాక్యం .”

ఈ) రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.
జవాబు:
ఇది “కర్మణి వాక్యం”. పొందుపరచబడినవి “భావాలు” అనే కర్మను తెలుపుతున్నాయి. కాబట్టి “కర్మణి వాక్యం.”

ఉ) పర్షియన్ ట్యూటర్ గా ఆయన కొంతకాలం పనిచేశారు.
జవాబు:
ఇది కర్తరి వాక్యం . పని చేసినవాడు ఆయన అనే కర్త కాబట్టి ఇది కర్తరి వాక్యం.

ఊ) ఆయన కన్ను మూసిన విషయం వ్రాశారు.
జవాబు:
ఇది కర్తరి వాక్యం . వ్రాసిన వాడు ‘ఆయన’ కర్త. కాబట్టి “కర్తరి వాక్యం.”

గమనిక :
గత పబ్లిక్ పరీక్షలలో వాక్యాలు గమనించండి.

ఋ) అది నవీన పరికరములతో నిర్మింపబడిన ఆదర్శ గృహము. (కర్మణి వాక్యం)
జవాబు:
అది నవీన పరికరములతో నిర్మించిన ఆదర్శ గృహము. (కర్తరి వాక్యం)

1. కృష్ణారావుగారు ఆమోదముద్ర వేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
కృష్ణారావుగారిచే ఆమోదముద్ర వేయబడింది. (కర్మణి వాక్యం)

2. నేనెన్నో పుస్తకాలు చదివితిని. (కర్తరి వాక్యం)
జవాబు:
నాచే ఎన్నో పుస్తకాలు చదువబడ్డాయి. (కర్మణి వాక్యం)

ఋ) ఆ పద్యం పూర్తి కాకముందే పై కప్పీలో ఇరుక్కున్న తీగ సవరింపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
ఆ పద్యం పూర్తి కాకముందే పై కప్పీలో ఇరుక్కున్న తీగను సవరించారు. (కర్తరి వాక్యం)

ఎ) వాల్మీకిచే రామాయణం రచింపబడింది.. (కర్మణి వాక్యం)
జవాబు:
రామాయణాన్ని వాల్మీకి రచించాడు. (కర్తరి వాక్యం)

ఏ) తెలుగులో మహాభారతము కవిత్రయముచే రచింపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
తెలుగులో కవిత్రయము మహాభారతాన్ని రచించారు. (కర్తరి వాక్యం)

ఐ) నేను బడికి రాకముందే గంట కొట్టబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను బడికి రాకముందే గంటను కొట్టారు. (కర్తరి వాక్యం)

ఒ) సీతాకోకచిలుక కుర్రవానిచే పట్టుకోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
సీతాకోకచిలుకను కుర్రవాడు పట్టుకొన్నాడు. (కర్తరి వాక్యం)

ఓ) హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి వేషం ధరింపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి వేషాన్ని ధరించెను. (కర్తరి వాక్యం)

ఔ) కవిత్రయము వారు ఆంధ్ర మహాభారతమును రచించారు. (కర్తరి వాక్యం)
కవిత్రయము వారిచే ఆంధ్ర మహాభారతము రచింపబడింది. (కర్మణి వాక్యం) .

క) మహాభారతమును వ్యాసుడు రచించెను. (కర్తరి వాక్యం)
జవాబు:
వ్యాసునిచే మహాభారతము రచింపబడింది. (కర్మణి వాక్యం)

ఖ) వివిధ కవులచే సుభాషితాలు రచింపబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
వివిధ కవులు సుభాషితాలను రచించారు. (కర్తరి వాక్యం)

గ) రాజు సీతాకోకచిలుకను పట్టుకున్నాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
రాజుచే సీతాకోకచిలుక పట్టుకోబడింది. (కర్మణివాక్యం)

ప్రత్యక్ష, పరోక్ష కథనాలు

ప్రత్యక్ష కథనం :
కింది వాక్యాలు చదవండి.
1. “నన్ను ఉపన్యాసరంగము నొద్దకు దీసికొనిపోయిరి.”
2. “నేనిట్లు ఉపన్యసించితిని.”
3. “నాయనలారా ! నేను మీ సభా కార్యక్రమమునంతయు జెడగొట్టితిని.”
4. “నన్ను మీరు క్షమింపవలయును.”

పై వాక్యాలన్నీ జంఘాలశాస్త్రి నేరుగా చెబుతున్నట్లు ఉన్నాయి కదా !

నేను, మేము, …… ఇలా ఉండే వాక్యాలు అనగా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెబుతున్నట్లుగా ఉంటాయి.

అట్లే కింది వాక్యాలను చదవండి.
1) “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాల శాస్త్రి.
2) “నేను రాను” అని నరేశ్ రఘుతో అన్నాడు.
(లేదా)
“నేను రా”నని నరేశ్ రఘుతో అన్నాడు.
పై వాక్యాలలో గీత గీసిన మాటలను ఎవరు అన్నారు?

మొదటి దాంట్లో జంఘాలశాస్త్రి అన్న మాటలను, రెండవదాంట్లో నరేశ్ అన్న మాటలను “ఉద్దరణ చిహ్నాలు” (ఇన్వర్టడ్ కామాలు) ఉంచి చెప్పారు కదా !

ఇలా నేరుగా చెప్పదల్చుకున్న అంశాలను ఉద్దరణ చిహ్నాలు ఉంచి చెప్పినపుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లుగా ఉంటుంది.

ఈ విధంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.
అభ్యాసం – 1 : పరోక్ష కథనంలోకి మార్చండి.

1) “ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త” అని అతడినే బెదిరించింది మెల్లీ. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
మెల్లీ అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందని అతడినే బెదిరించింది. (పరోక్ష కథనం)

2) “చిన్నప్పటి నుండి నాకు బోటనీ విషయం అభిమాన విషయం” అన్నాడు రచయిత. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
రచయిత చిన్నప్పటి నుండి తనకు బోటనీ విషయం అభిమాన విషయమని అన్నాడు. (పరోక్ష కథనం)

పరోక్ష కథనం :
కింది వాక్యాలు చదవండి.
1. నరేశ్ తాను రానని రఘుతో అన్నాడు.
2. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు.
3. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు.

పై వాక్యాలను చదివారు కదా ! ఇవి నేరుగా చెబుతున్నట్లుగా ఉన్నాయా?
ఉత్తమ పురుషలో కాకుండా, ఇంకొకరు చెబుతున్నట్లుగా ఉన్నాయా?
ఇలాంటి వాక్యాలను పరోక్ష కథనం అంటారు. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు.

ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి మార్చడం.
కింది వాక్యాలను చదవండి. ఏం మార్పు జరిగిందో చెప్పండి.
1. “నేనొక్కడినే అదృష్టవంతుడినా ?” అన్నాడు జంఘాలశాస్త్రి.
2. తానొక్కడే అదృష్టవంతుడనా అని జంఘాలశాస్త్రి అన్నాడు.

మొదటి వాక్యంలో జంఘాలశాస్త్రి మాట్లాడిన మాటలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి రాశారు. రెండో వాక్యంలో జంఘాల శాస్త్రి అన్నమాటలను ఇంకొకరు చెప్పినట్లుగా రాశారు. ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసివేసి “అని” చేర్చి వాక్యాన్ని రాశారు. కాబట్టి మొదటి వాక్యం ప్రత్యక్ష కథనంలో ఉంటే, రెండవ వాక్యం పరోక్ష కథనంలోకి మారింది.

ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు పరోక్ష కథనంలోకి మారేటపుడు కింది మార్పులు చోటు చేసుకుంటాయి.

మాటలు / వాక్యంలోని భావాన్ని స్వీకరిస్తారు.
ఉద్ధరణ చిహ్నాలు తొలగించి ‘అని’ చేరుస్తారు.

ఉత్తమపురుష పదాలు అనగా, నేను, మేము వంటివి, ప్రథమ పురుషలోకి అనగా తను, తమ, తాను, తాముగా మారతాయి.

అభ్యాసం :
కింది వాక్యాలను ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చండి.

1) “నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను” అని అమ్మతో అన్నాను. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
“నేటి సినిమాలను చూడలేకపోతున్నానని” నేను అమ్మతో అన్నాను. (పరోక్ష కథనం)

2) “నీకివ్వాల్సింది ఏమీలేదు” అని నాతో అతడన్నాడు. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
“నాకివ్వాల్సింది ఏమీ లేదని” నాతో అతడన్నాడు. (పరోక్ష కథనం)

3) సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. (పరోక్ష కథనం)
జవాబు:
“సుందరకాండ చదువు” నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. (ప్రత్యక్ష కథనం)

4) వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడని. (పరోక్ష కథనం)
జవాబు:
వాళ్ళమ్మ చెప్పింది “భానుప్రకాశ్ ఊరికెళ్ళాడు” (ప్రత్యక్ష కథనం)

5) చెన్నయ్య పద్యాలు బాగా పాడాడని అందరనుకుంటున్నారు. (పరోక్ష కథనం)
జవాబు:
అందరనుకుంటున్నారు “చెన్నయ్య పద్యాలు బాగా పాడాడు” (ప్రత్యక్ష కథనం)

6) “ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది” అని అందరూ అన్నారు. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరూ అన్నారు. (పరోక్ష కథనం)

7) “నాకు ఆశ్చర్యం కలిగించినది వేరొక విషయం’ అని రచయిత పలికాడు. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
తనకు ఆశ్చర్యం కలిగించినది వేరొక విషయమని రచయిత పలికాడు. (పరోక్ష కథనం)

AP SSC 10th Class Telugu Grammar Question Answers

8) “నేను మా ఊరిలో పదవతరగతి వరకూ చదివాను” అన్నాడు రవి. (ప్రత్యక్ష కథనం)జవాబు:
తాను తన ఊరిలో పదవతరగతి వరకూ చదివానని రవి అన్నాడు. (పరోక్ష కథనం)

9) వాళ్ళ నాన్న అవేశపరుడని రచయిత చెప్పాడు. (పరోక్ష కథనం)
జవాబు:
‘మా నాన్న ఆవేశపరుడు’ అని రచయిత చెప్పాడు. (ప్రత్యక్ష కథనం)

10) “నాకు కోపం ఎక్కువ. ప్రేమ కూడా ఎక్కువే” అని రాజు రవితో అన్నాడు. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
తనకు కోపం ఎక్కువని, ప్రేమకూడా ఎక్కువే అని రాజు రవితో అన్నాడు. (పరోక్ష కథనం)

11) తన రచనలలో తన జీవితం ఉంటుందని, ఒక రచయిత తన మిత్రునితో అంటున్నాడు. (పరోక్ష కథనం)
జవాబు:
“నా రచనలలో నా జీవితం ఉంటుంది” అని ఒక రచయిత తన మిత్రునితో అంటున్నాడు. (ప్రత్యక్ష కథనం)

12) వాళ్ళ నాన్న ఆవేశపరుడని రచయిత చెప్పాడు. (పరోక్ష కథనం)
జవాబు:
‘మా నాన్న ఆవేశపరుడు అని రచయిత చెప్పాడు. (ప్రత్యక్ష కథనం)

13) ‘నీవు ఎక్కదలచిన ట్రైను, ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు, అని చెప్పాడు ఆరుద్ర. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
వాడు ఎక్కదలచిన ట్రైను ఎప్పుడూ ఒక జీవితకాలం లేటని ఆరుద్ర చెప్పాడు. (పరోక్ష కథనం)

14) “నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు. స్వార్థానికి నేను ఏ పాపం చేయలేదు” అని అన్నాడు. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
తాను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదనీ, స్వార్థం కోసం తాను ఏ పాపం చేయలేదని అన్నాడు. (పరోక్ష కథనం)

వాక్య భేదాలు

కింది వాక్యాల్ని చదివి అర్థం చేసుకోండి.
అ) ఆహా! ఎంత బాగుందో!
ఆ) చేతులు కడుక్కో!
ఇ) చాలా సేపు టీవీ చూడొద్దు.
ఈ) ఏం! ఎప్పుడొచ్చావ్?
ఉ) వర్షాలు లేక పంటలు పండలేదు.

గమనిక :
పై వాక్యాలు, ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అదెలాగో చూద్దాం.

ఆశ్చర్యార్థక వాక్యం :
ఉదా :
ఆహా ! ఎంత బాగుందో! ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తున్నది. కాబట్టి ఈ వాక్యం “ఆశ్చర్యార్థక వాక్యం”.

ఆ) విధ్యర్థక వాక్యం :
ఉదా :
చేతులు కడుక్కో! ఇది విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయవలసిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని “విధ్యర్థక వాక్యం” అని పిలుస్తున్నాము.

ఇ) నిషేధార్థక వాక్యం :
ఉదా :
చాలా సేపు టీవీ చూడొద్దు. ఈ వాక్యం చూడటాన్ని నిషేధిస్తున్నది. కాబట్టి ఇది “నిషేధార్థక వాక్యం” అని పిలవబడుతుంది.

ఈ) ప్రశ్నార్థక వాక్యం :
ఉదా :
ఏం ! ఎప్పుడొచ్చావ్ ? ఈ వాక్యం ప్రశ్నిస్తున్నట్లు ఉంది. అంటే ఇది ప్రశ్నార్థక వాక్యం. ఒక వాక్యానికి ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని “ప్రశ్నార్థక వాక్యం” అంటాము.

ఉ) హేత్వర్థక వాక్యం :
ఉదా :
వర్షాలు లేక పంటలు పండలేదు. ఈ వాక్యం మనకు రెండు విషయాలను తెలుపుతోంది. ఒకటి వర్షాలు లేవని. రెండు పంటలు పండలేదని. ఐతే పంటలు పండకపోవడానికి కారణం మొదటి విషయం. వర్షాలు లేకపోవడం అనే మొదటి విషయం, రెండో విషయానికి కారణం అవుతోంది. అంటే హేతువు అవుతోంది. ఇలా హేతువు అర్థాన్ని సూచించే వాక్యం “హేత్వర్థక వాక్యం.”

AP SSC 10th Class Telugu Grammar Question Answers

అభ్యాసం 1 :
కింది వాక్యాలు ఏ అర్థాన్ని సూచించే వాక్యాలో రాయండి.

అ) ఎవరా పైడి బొమ్మ?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం.

ఆ) నీరు లేక పంటలు పండలేదు.
జవాబు:
హేత్వర్థక వాక్యం.

ఇ) దయచేసి సెలవు ఇవ్వండి.
జవాబు:
ప్రార్థనాద్యర్థక వాక్యం.

ఈ) కిషన్ చదువుతాడో లేదో?
జవాబు:
సందేహార్థక వాక్యం.

ఉ) మీకు శుభం కలగాలి.
జవాబు:
ఆశీర్వాద్యర్థక వాక్యం.

అభ్యాసం 2 :
కింది వాక్యాలు, భావాన్ని అనుసరించి ఏ వాక్యాల్లో గుర్తించండి.
ఉదా :
ఎంత బాగుందో!
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం.

అ) నువ్వు చదువు.
జవాబు:
విధ్యర్థక వాక్యం.

ఆ) అల్లరి చేయవద్దు.
జవాబు:
నిషేధార్థక వాక్యం.

ఇ) పరీక్షలు రాయవచ్చు.
జవాబు:
అనుమత్యర్థక వాక్యం

ఈ) తనూ బొమ్మలు వేయగలడు.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం .

వ్యతిరేకార్థక వాక్యాలుగా రాయండి

గమనిక :
ఇవి గత సంవత్సరాల పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన వాక్యాలు

1) గ్రంథ పఠనానికి ఎక్కువ సమయం ఆయన వినియోగించాడు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
గ్రంథ పఠనానికి ఎక్కువ సమయం ఆయన వినియోగంచ లేదు.

2) కొందరికి నీటిలో ప్రయాణం అంటే ఆనందంగా ఉంటుంది. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
కొందరికి నీటిలో ప్రయాణం అంటే ఆనందంగా ఉండదు.

3) అంబటి రాయడు క్రికెట్ బాగా ఆడగలడు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
అంబటి రాయుడు క్రికెట్ బాగా ఆడలేడు.

4) అందరూ ఒక్కసారిగా మాట్లాడుతున్నారు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
అందరూ ఒక్కసారిగా మాట్లాడడం లేదు.

5) వాడు రేపు రావచ్చును. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
వాడు రేపు రాకపోవచ్చును.

6) విద్యార్థులు నేడు రాజకీయాలలో ఎంతో ఆసక్తి కలిగియున్నారు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
విద్యార్థులు నేడు రాజకీయాలలో ఎంతో ఆసక్తి కలిగి లేరు.

7) వర్తకులు ఓడలలో ప్రయాణమౌతారు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
వర్తకులు ఓడలలో ప్రయాణము కారు.

8) వర్షము కుండపోతగా కురియుచున్నది. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
వర్షము కుండపోతగా కురియడం లేదు.

9) ప్రభుత్వానికి డాలర్లు కావాలి. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
ప్రభుత్వానికి డాలర్లు అక్కరలేదు.

10) చెత్తకుండీలను ఏర్పాటు చేశారు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
చెత్తకుండీలను ఏర్పాటు చేయలేదు.

11) కపిల్ టెన్నిస్ ఆడుటలేదు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
కపిల్ టెన్నిస్ ఆడుతున్నాడు.

12) పిల్లలకు ఇష్టమైన పదార్థాలు కొన్ని ఉంటాయి. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
పిల్లలకు ఇష్టమైన పదార్థాలు కొన్ని ఉండవు.

13) పెద్దలు చీటికీ మాటికీ తిడుతూ ఉంటారు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
పెద్దలు చీటికీ మాటికీ తిడుతూ ఉండరు.

14) రైతు బజార్లలో కూరగాయలు చౌక ధరకు లభించుచున్నవి. (క్రియను మార్చి వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
రైతు బజార్లో కూరగాయలు చౌకధరకు లభించడం లేదు.

15) అతను రేపు రావచ్చు. (క్రియను మార్చి వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
అతను రేపు రాకపోవచ్చు.

16) రేవతికి సంగీతమంటే ఇష్టం లేదు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
రేవతికి సంగీతమంటే ఇష్టం.

17) మీ కృషి మీకు రాజ్యా ధికారము నిస్తుంది. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
మీ కృషి మీకు రాజ్యా ధికారమును ఇవ్వదు.

18) కవులకు కొన్ని అభిమాన పదాలుంటాయి. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
కవులకు కొన్ని అభిమాన పదాలు ఉండవు.

19) రవి నిన్న వచ్చాడు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
రవి నిన్న రాలేదు.

20) రాజకీయవేత్తలు నైతిక విలువలను కాపాడుతున్నారు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
రాజకీయవేత్తలు నైతిక విలువలను కాపాడటం లేదు.

21) సముద్రతీరాలలో పిల్లలు ఆడుకుంటున్నారు. (వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి.)
జవాబు:
సముద్రతీరాలలో పిల్లలు ఆడుకోవడం లేదు.

మరికొన్ని వాక్య భేదాలు

1) సందేహార్థక వాక్యం :
ఉదా :
రవి, పనిచేస్తాడో, చెయ్యడో? పై వాక్యం చదివితే, రవి పని చేయటం అనే విషయంలో అనుమానం, అంటే సందేహం కలుగుతున్నది కదా! ఇలా సందేహాన్ని తెలిపే వాక్యాలను “సందేహార్థక వాక్యాలు” అంటారు.

2) ఆశీర్వాద్యర్థక వాక్యం
ఉదా :
నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు. ఈ వాక్యము ఏ అర్థాన్ని సూచిస్తున్నది? ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నట్లు కనబడుతోంది కదా! ఇలా ఆశీర్వదిస్తున్నట్లు అర్థాన్ని సూచించే వాక్యాలను “ఆశీర్వాద్యర్థక వాక్యాలు” అంటారు.

3) ప్రార్థనాద్యర్థక వాక్యం :
ఉదా :
దయచేసి పని చేయండి. ఈ వాక్యం ఒక పనిని చేయుమని ప్రార్థిస్తూ ఉంది. అంటే ప్రార్థన అర్థాన్ని సూచిస్తున్నది. కాబట్టి ఇది “ప్రార్థనాద్యర్థక వాక్యం .”

4) అనుమత్యర్థక వాక్యం :
ఉదా :
లోపలికి రావచ్చు. ఈ వాక్యం ఒక వ్యక్తికి అనుమతిని సూచిస్తున్నది. అంటే ఇది “అనుమత్యర్థక వాక్యం”. ఏదైనా ఒక పనిని చేయటానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం.”

5) సామర్థ్వార్థక వాక్యం :
ఉదా :
గోపాల్ చెట్టు ఎక్కగలడు. ఇది గోపాల్ కు చెట్టును ఎక్కే సామర్థ్యాన్ని సూచిస్తున్నది. కాబట్టి ఇది “సామర్థ్యార్థక వాక్యం.”

ఒక వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని, లేదా యంత్రానికి గాని ఉన్న సమర్థతను సూచించే అర్థం గల వాక్యాన్ని “సామర్థ్యార్థక వాక్యం” అని పిలుస్తాము.

అభ్యాసం 1 :
కింది వాక్యాలు వాటిలోని భావాన్ని అనుసరించి, ఏ వాక్యాలు అవుతాయో గుర్తించి రాయండి.

అ) సీత కలెక్టరైందా?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం.

ఆ) మీరు తర్వాత తినవచ్చు.
జవాబు:
అనుమత్యర్థక వాక్యం.

ఇ) అక్క చెప్పేది విను.
జవాబు:
ప్రార్థనాద్యర్థక వాక్యం.

ఈ) రసాభాస చేయకండి.
జవాబు:
నిషేధార్థక వాక్యం.

ఉ) నీవు ఇంటికి వెళ్ళవచ్చు.
జవాబు:
అనుమత్యర్థక వాక్యం.

AP SSC 10th Class Telugu Grammar Question Answers

అభ్యాసం 2 :
కింది వాక్యాలు ఏ రీతి వాక్యాలో గుర్తించి రాయండి.

అ) దయచేసి నన్ను కాపాడు.
జవాబు:
ప్రార్థనాద్యర్థక వాక్యం

ఆ) మీరు రావద్దు.
జవాబు:
నిషేధక వాక్యం.

ఇ) వారందరికి ఏమైంది?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం.

ఈ) నేను తప్పక వస్తాను.
జవాబు:
నిశ్చయార్థక వాక్యం.

ఉ) ఆహా! ఎంత బాగుందీ!
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం.

ఊ) వారు వెళ్ళవచ్చా?
జవాబు:
సందేహార్థక వాక్యం.

పేపర్ – II లో Part – B

1. ‘బాలుకు పాటలు పాడటం చాలా ఇష్టం’ – దీనికి వ్యతిరేక వాక్యం ఏది?
A) బాలుకు పాటలు పాడటం అసలే ఇష్టం లేదు
B) బాలుకు పాటలు పాడటం ఇష్టం
C) బాలుకు పాటలు పాడటం ఇష్టం లేదు
D) బాలుకు పాటలు పాడటం తప్పితే ఇంకేది ఇష్టం లేదు
జవాబు:
C) బాలుకు పాటలు పాడటం ఇష్టం లేదు

2. ‘చూడాకర్ణుడు, వీణాకర్ణుడు అను సన్యాసులు కలరు’ – ఇది ఏ వాక్యం?
A) సంక్లిష్ట వాక్యం
B) సంయుక్త వాక్యం
C) సామాన్య వాక్యం
D) కర్తరి వాక్యం
జవాబు:
B) సంయుక్త వాక్యం

3. ‘బాగా చదివితే, మార్కులు బాగా వస్తాయి’ – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
A) శత్రర్థకం
B) విధ్యర్థక వాక్యం
C) చేదర్థక వాక్యం
D) అష్యర్థక వాక్యం
జవాబు:
C) చేదర్థక వాక్యం

4. మీరంతా ఉదయాన్నే లేవండి – ఇది ఏ రకమైన సామాన్య వాక్యం?
A) విధ్యర్థకం
B) సంభావనార్థకం
C) అనుమత్యర్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
A) విధ్యర్థకం

5. మీరు లోపలికి రావచ్చు – ఇది ఏ రకమైన సామాన్య వాక్యం?
A) సందేహార్ధకం
B) విధ్యర్ధకం
C) అనుమత్యర్థకం
D) ఆత్మార్థకం
జవాబు:
C) అనుమత్యర్థకం

6. ‘జ్యోతిర్మయి ఆలోచిస్తూ సైకిలు తొక్కుతోంది’ – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
A) క్వార్థక వాక్యం
B) శత్రర్థక వాక్యం
C) చేదర్థక వాక్యం
D) అష్యర్థక వాక్యం
జవాబు:
B) శత్రర్థక వాక్యం

7. ‘కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుంది’ – ఇది ఏ రకమైన ఇది సంక్లిష్ట వాక్యం?
A) అష్యర్థక వాక్యం
B) శత్రర్థక వాక్యం
C) చేదర్థక వాక్యం
D) ఆనంతర్యార్థకం
జవాబు:
C) చేదర్థక వాక్యం

8. వాడు కష్టపడినా ఫలితం పొందలేదు – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
A) శత్రర్థక వాక్యం
B) అష్యక వాక్యం
C) చేదర్థక వాక్యం
D) విధ్యర్థక వాక్యం
జవాబు:
B) అష్యక వాక్యం

9. మొక్కలు నాటితే పర్యావరణానికి మేలు చేస్తాయి – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
A) చేదర్థక వాక్యం
B) అష్యక వాక్యం
C) ప్రార్థనాద్యర్థక వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
A) చేదర్థక వాక్యం

10. తాత భారతం చదివి నిద్రపోయాడు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంయుక్త వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామాన్య వాక్యం
D) కర్తరి వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

11. అశ్విని జ్యోతి అక్కాచెల్లెండ్రు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంక్లిష్ట వాక్యం
B) సంయుక్త వాక్యం
C) కర్మణి వాక్యం
D) సామాన్య వాక్యం
జవాబు:
D) సామాన్య వాక్యం

12. ‘నారాయణ అన్నం తింటూ నీళ్ళు త్రాగుతాడు’ ఇది ఏ రకమైన వాక్యం?
A) సంక్లిష్టవాక్యం
B) సంయుక్త వాక్యం
C) సామాన్యవాక్యం
D) కర్తరి వాక్యం
జవాబు:
A) సంక్లిష్టవాక్యం

AP SSC 10th Class Telugu Grammar Question Answers

13. ఆయన డాక్టరా? ప్రొఫెసరా? – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంయుక్త వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం
జవాబు:
A) సంయుక్త వాక్యం

14. కింది కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చండి. వాల్మీకి రామాయణాన్ని రచించారు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)

15. బాలురచే సెలవు తీసుకోబడింది – దీన్ని కర్తరి వాక్యంగా మార్చండి.
జవాబు:
బాలురు సెలవు తీసికొన్నారు. (కర్తరి వాక్యం)

16. ‘సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు’ – దీన్ని కర్మణి వాక్యంగా మార్చండి.
జవాబు:
సంఘసంస్కర్తలచే దురాచారాలు నిర్మూలించబడ్డాయి. (కర్మణి వాక్యం)

వాక్య భేదాలు

1. ‘మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది’ ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
A) శత్రర్థకం
B) అష్యర్థకం
C) విధ్యర్థకం
D) చేదర్థకం
జవాబు:
A) శత్రర్థకం

2. ‘సీత సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నది’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) సామాన్య వాక్యం
B) సంయుక్త వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) మహావాక్యం
జవాబు:
B) సంయుక్త వాక్యం

3. ‘నువ్వు పరీక్ష రాయవచ్చు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) ప్రశ్నార్థకం
B) సంభావనార్థకం
C) అనుమత్యర్థకం
D) నిషేధార్థకం
జవాబు:
C) అనుమత్యర్థకం

4. ‘వారందరికీ ఏమైంది’ ? ఇది ఏ రకమైన వాక్యం?
A) నిషేధార్థకం
B) విధ్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) సామర్ధ్యార్థకం
జవాబు:
D) సామర్ధ్యార్థకం

5. ‘ఆహా! ఎంత బాగుందో!’ – ఇది ఏ రకమైన సామాన్య వాక్యం?
A) విధ్యర్థకం
B) సంభావనార్థకం
C) విధ్యర్థకం
D) ఆశ్చర్యార్ధకం
జవాబు:
C) విధ్యర్థకం

6. ‘ఏం? ఎప్పుడొచ్చావ్?” ఇది ఏ రకమైన సామాన్య వాక్యం?
A) ప్రశ్నార్థక వాక్యం
B) అనుమత్యర్థకం
C) సంభావనార్థకం
D) హేత్వర్ధకం
జవాబు:
A) ప్రశ్నార్థక వాక్యం

7. ‘చాలాసేపు నీవు టి.వి. చూడవద్దు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) నిషేధార్ధక వాక్యం
B) విధ్యర్థక వాక్యం
C) ప్రశ్నార్థక వాక్యం
D) ఆత్మార్థకం
జవాబు:
A) నిషేధార్ధక వాక్యం

8. ‘బడికి వెళ్ళు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) విధ్యర్థక వాక్యం
B) నిషేధార్ధక వాక్యం
C) అనుమత్యర్థక వాక్యం
D) ప్రశార్థక వాక్యం
జవాబు:
A) విధ్యర్థక వాక్యం

9. కిషన్ చదువుతాడో? లేదో ? – ఇది ఏ రకమైన వాక్యం?
A) సందేహార్థక వాక్యం
B) అనుమత్యర్థక వాక్యం
C) ఆశీరర్ధకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
A) సందేహార్థక వాక్యం

10. ‘వాడు చెట్టు ఎక్కగలడు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) సామర్ధ్యార్ధకం
B) అనుమత్యర్థకం
C) ఆశ్చర్యార్థకం
D) సందేహార్ధకం
జవాబు:
A) సామర్ధ్యార్ధకం

11. ‘నీరు లేక పంటలు పండలేదు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) హేత్వర్థకం
B) అనుమత్యర్థకం
C) నిషేధార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
C) నిషేధార్థకం

12. నీవు తరగతిలోకి రావచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సామర్ధ్యార్థకం
B) అనుమత్యర్థకం
C) నిషేధార్ధకం
D) విధ్యర్థకం
జవాబు:
B) అనుమత్యర్థకం

13. ‘రేపు వాడు స్కూలుకు వెడతాడో లేదో!’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) ప్రశ్నార్థకం
B) ఆత్మార్థకం
C) అభ్యర్థకం
D) సందేహార్థకం
జవాబు:
D) సందేహార్థకం

14. ‘దయచేసి నన్ను కాపాడు’ – ఇది ఏ రకమైన సామాన్య వాక్యం?
A) అనుమత్యర్థక వాక్యం
B) ప్రార్థనాద్యర్థక వాక్యం
C) సందేహార్థక వాక్యం
D) నిషేధక వాక్యం
జవాబు:
B) ప్రార్థనాద్యర్థక వాక్యం

వచనంలో శైలిభదం

కింది వాక్యాలు చదవండి. భేదాలు గమనించండి.
అ) అని యా పరివ్రాజకుడు సెప్పగా విని, మిక్కిలి ఖిన్నుడనయితిని.
ఆ) అని ఆ సన్యాసి చెప్పగా విని, చాలా బాధపడ్డాను.
ఇ) అని ఆ సన్యాసి జెప్పింది యిని, శానా దుక్కమొచ్చింది.
గమనిక :
1) మొదటి వాక్యం, “ప్రాచీన శైలి”ని తెలుపుతున్నది.
2) రెండవ వాక్యం “శిష్టవ్యవహార శైలి”ని అనుసరించి ఉంది.
3) ఇక మూడవ వాక్యం “మాండలిక పద్ధతి”కి లోబడి ఉన్నది.
గమనిక :
కాలాన్ని అనుసరించి, ప్రాంతాన్ని అనుసరించి, సందర్భాన్ని బట్టి భాషను ఉపయోగించే విధానంలో మార్పు జరుగుతుంది. ఇది భాషలో వైవిధ్యమే కాని అందులో ఒకటి అధికము, మరొకటి అల్పము అనే సంకుచిత దృష్టితో చూడకూడదు.

అభ్యాసం :
కింది వాక్యాలను ఆధునిక వ్యవహార శైలిలోకి మార్చండి. (ఈ మార్పులు చేసేటప్పుడు “ము” వర్ణాలు, బిందు పూర్వక ‘బు’ కారాలు, అంబు) యడాగమాలు, క్రియా స్వరూపాలు (చేయును, జరుగును, చూడుము వంటివి మారతాయి. గమనించండి.)
అ) వివేక హీనుడయిన ప్రభువును సేవించుట కంటె వనవాస ముత్తమము. (ప్రాచీన వచన శైలి)
జవాబు:
వివేకం లేని రాజసేవ చేయడం కన్న, అడవిలో ఉండడం మంచిది. (ఆధునిక వచన శైలి)

ఆ) ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీది కెగిరి పాత్రము నందున్న యన్నము భక్షించి పోవుచున్నది. (ప్రాచీన వచన శైలి)
జవాబు:
ఎలుక రోజూ చిలక్కొయ్య పైకి ఎక్కి పాత్రలో అన్నం తిని పోతోంది. (ఆధునిక వచన శైలి)

ఇ) బుద్ధిహీనత వల్ల సమస్త కార్యములు నిదాఘనదీ పూరములట్లు వినాశము నొందును. (ప్రాచీన వచన శైలి)
జవాబు:
తెలివి తక్కువ వల్ల అన్ని పనులూ వేసవికాలంలో నదిలో నీళ్ళల్లా ఎండిపోతాయి. (ఆధునిక వచన శైలి)

ఆధునిక వచనంలోకి మార్చడం

గమనిక : ఇవి గత సంవత్సరాల పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన వాక్యాలు

1. ఆ పరివ్రాజకుడు సెప్పగా విని మిక్కిలి భిన్నుడనయితిని.
జవాబు:
ఆ సన్యాసి చెప్పింది విని చాలా బాధపడ్డాను. (ఆధునిక భాష)

2. యాచించుకొని బ్రతుకుట కంటె మరణము మేలు.
జవాబు:
అడుక్కొని బతకడం కంటె చావడం మంచిది. (ఆధునిక భాష)

3. ధనమును బాసిన క్షణముననే లాతివాడగును.
జవాబు:
డబ్బు పోయిన వెంటనే పరాయి వాడవుతాడు. (ఆధునిక భాష)

4. యేనే పాపాత్ముని ముఖంబు నీక్షించితినో?
జవాబు:
నేనే పాపాత్ముడి ముఖాన్ని చూశానో? (ఆధునిక భాష)

5. ప్రాణభయంబున గగనంబునకెగసి చనెను. (ఆధునిక వచనంగా మార్చండి.)
జవాబు:
ప్రాణభయంతో ఆకాశానికి ఎగిరిపోయింది. (ఆధునిక వచన శైలి)

AP SSC 10th Class Telugu Grammar Question Answers

6. కావున నీవు మెచ్చిన చోటికి బోవనోపము. (ఆధునిక వచనంగా మార్చండి.)
జవాబు:
కాబట్టి నువ్వు మెచ్చిన చోటుకు పోలేం. (ఆధునిక వచన శైలి)

7. కొందరు పన్యాముల మూలమున నాపని చేయుదురు. (ఆధునిక వచనంగా మార్చండి.)
జవాబు:
కొంతమంది ఉపన్యాసాల ద్వారా, ఆ పని చేస్తారు. (ఆధునిక వచన శైలి)

8. గుండము చినదైనను నీటికి కొదవ ఉండదు. (ఆధునిక వచనంగా మార్చండి.)
జవాబు:
గుండం చిన్నదైనా, నీళ్ళకు లోటుండదు. (ఆధునిక వచన శైలి)

9. పురుషుడు న్యాయము తప్పక విద్యాధనములు గడింపవలెను. (ఆధునిక వచనంగా మార్చండి.)
జవాబు:
పురుషుడు న్యాయంగా విద్యాధనాలు గడించాలి. (ఆధునిక వచన శైలి)

10. అక్కడనున్న నౌకరులందరునూ నవ్వారు. (ఆధునిక వచనంగా మార్చండి.)
జవాబు:
అక్కడున్న నౌకర్లంతా నవ్వారు. (ఆధునిక వచన శైలి)

11. మా వలని మోహంబు విడిచి యరుగుము. (ఆధునిక వచనంగా మార్చండి.)
జవాబు:
మాపై మోహం విడిచి వెళ్లు. (ఆధునిక వచన శైలి)

పద విజ్ఞానం
అర్థాలు

(అ)
అంకురించు (క్రి) – మొలకెత్తు, పుట్టు
అఖిలం = అశేషం, అంతా
అంగలార్చు (క్రి) = దుఃఖించు
అంఘ్రులు = పాదాలు
అంభోధి = సముద్రం, కడలి
అణా = రూపాయిలో పదహారోవంతు విలువగల నాణెం
అతిథి = తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా ఇంటికి వచ్చేవాడు
అధిగమించు (క్రి) = (తెలియు, పొందు) దాటు, మించు
అనంతరం = తరవాత
అనవుడు = అనగా, అన్నప్పుడు
అనృతం = అసత్యం
అపూపం = పిండివంట, అప్పం
అభిఘరించు (క్రి) = వడ్డించిన అన్నంమీద నెయ్యిచల్లు, చిలకరించు
అభిరమ్యం = చాలా అందమైన
అభీప్సితం = కోరినది, అభీష్టం
అమాంతం = అకస్మాత్తుగా, హఠాత్తుగా
అర్థం = ధనం
అర్ఘ్యపాద్యములు = చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు
అర్ధాంగలక్ష్మి = శరీరంలో సగభాగమైన లక్ష్మీ సమానురాలు (భార్య)
అల్పము = సూక్ష్మం, కొంచెం
అవసరం = సమయం , వేళ
అసద్యస్తులై = ఉనికి కోల్పోయినవారై (సర్వం చెదరగొట్టుకొన్నవారై)
అస్మచ్చమూధవులు = మా సైన్యాధిపతులు
అహరహం = ప్రతిదినం

(ఆ)
ఆకంఠం = గొంతుదాకా
ఆగ్రహం = కోపం
ఆప్యాయత = ప్రీతి, ఇష్టం
ఆయతి = ప్రభావం
ఆయత్తం = సిద్ధం
ఆయువు = జీవితకాలం
ఆవరణ = ఆచ్ఛాదనం, మూత
ఆవేశపరులు = తొందరపాటు గలవారు,
ఆస్పందితోష్ఠం = అదిరే పెదవి

(ఇ)
ఇందుబింబాస్య = చంద్రబింబం వంటి ముఖం కలది, చంద్రముఖి
ఇనాం = బహుమతి, మాన్యం
ఇనుడు = సూర్యుడు

(ఈ)
ఈప్సితం = కోరిక

(ఉ)
ఉదరం = పొట్ట
ఉద్యమం = ప్రయత్నం
ఉద్వృత్తి = ఉద్ధతి, గర్వం
ఉపద్రవం = ఆపద
ఉపస్పర్శ = స్నాన, ఆచమనాదికాలు
ఉపార్జితం = సంపాదించినది
ఉల్లాసం = సంతోషం, ప్రకాశం

(ఎ)
ఎల్లి = రేపు

(ఏ)
ఏమరుపాటు = అజాగ్రత్త

(ఓ)
ఓర్పు = సహనం
ఓష్ఠం = పెదవి

(ఔ)
ఔద్ధత్యం = ఉద్ధతత్వం, గర్వం, పొగరు

(క)
కంకణములు = వర్తులాకారాభరణాలు
కటకట = అయ్యయ్యో
కటకటపడు (క్రీ) = బాధపడు
కడ = చివర
కందభోజులు = దుంపలు తినేవాళ్ళు
కన్నుగవ = కన్నులజంట
కమ్రకరములు = ఇంపైన చేతులు
కరంబులు = చేతులు
కరవటంబు = బరిణె, గిన్నె
కలభాష = అవ్యక్త మధురభాష
కలమధాన్యం = ఒకజాతి, వరిపంట
కళవళం = తొట్రుపాటు
కల్పనము = ఊహ
కాడు = అడవి
కాణాచి = చిరకాల వాసస్థానం, ఆదిమస్థానం
కుందాడు (క్రి) = బాధపెట్టినట్లు మాట్లాడడం
కుడుచు (క్రి) = తాగు, భుజించు
కుముదిని = తెల్లకలువతీగా
కురిడీ = కొబ్బరికాయలో ఎండిన కొబ్బరి
కులిశం = వజ్రాయుధం
కుసుమస్తబకం = పూలగుత్తి, పూలగుచ్ఛం
కూడలి = నాలుగుదారులు కలిసే చోటు
కూర్మం = తాబేలు
కృశించు (క్రి) = బక్కటిల్లు, సన్నగిల్లు
కేసరములు = పూవులోని పుప్పొడి గల భాగాలు
కైరవం = తెల్లకలువ
కైరవషండం = తెల్లకలువల సమూహం
కైలుచేయు (క్రి) = ధాన్యాన్ని తూర్పారబట్టి యజమానికి అప్పగించడానికి సిద్ధం చేయు
కొడిగట్టిన దీపాలు = ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపాలు
కొండాడు (క్రి) = పొగడు, స్తుతించు

(ఖ)
ఖలుడు = దుర్జనుడు, దుష్టుడు, చెడ్డవాడు
ఖిన్నుడు = దుఃఖితుడు
ఖేదం = శోకం

(గ)
గరిమ = శ్రేష్ఠత, గొప్ప
గ్రక్కున = వెంటనే
గుద్దలి = వేర్లు మొదలైనవి పెళ్ళగించే సాధనం
గురి = లక్ష్యం
గొడుగు పాగలు = గొడుగులు గల పావుకోళ్ళు, కర్రచెప్పులు
గోమయం = ఆవుపేడ
గోరంతదీపం = చిన్నగా వెలిగే దీపం

(ఘ)
ఘన వనజాతలోచన = విశాలమైన తామర రేకుల వంటి కన్నులు గలది
ఘాతం = దెబ్భ

(చ)
చందనం = గంధం
చట్టువం = గరిటె
చమత్కారం = నేర్పు
చయ్యన = వెంటనే, త్వరగా
చరణద్వంద్వం = పాదాలజంట
చాడ్పు = విధం
చిగురుబోడి = చిగురుటాకు వంటి శరీరం గల స్త్రీ
చిరంతనుడు = శాశ్వతుడు
చెక్కెర్లు = అదేపనిగా చుట్టుతిరగడం
చౌకబారు = తక్కువ విలువ గలిగిన

(ఛ)
ఛాత్రులు = శిష్యులు, విద్యార్థులు
ఛిన్నభిన్నమవు = ముక్కలు ముక్కలు ఆవు, చెల్లాచెదురవు, తునాతునకలవు

(జ)
జానపదులు = మనుష్యులు, పల్లెటూళ్ళవాళ్ళు
జేవురు = ఎర్రనిది, ఎరుపు
జ్వలనం = మంట, మండటం
జంఘ = కాలిపిక్క

(ఝ)
ఝరి = సెలయేరు

(త)
తడయు = ఆలస్యంచేయు
తడవ = మారు, మాటు, సారి (మొదటిసారి)
తంత్రం = ఉపాయం
తన్మయులు = తత్స్వరూపమైనవారు, తమను తాము మరచినవారు
తమం = చీకటి
తర్కం = ఊహ, కారణం, కోరిక, ఒక శాస్త్రం
తాపసులు = తపస్సుచేసుకునేవారు
తారక = చుక్క
తారాడడం తిరుగులాడడం, జీరాడడం
తాల్మి = క్షమ, ఓర్పు
తిమిరం = చీకటి
తుల్యం = సమము, సరి
తొంటి = తొల్లి, మొదటి, తొలుత
తొఱగు (క్రి) = విడుచుట, త్యజించుట

(ద)
దమ్మిడీ = అన్నిటికంటె తక్కువ విలువ గల నాణెం, (రెండు కాసుల నాణెం)
దిక్పతి = దిక్పాలుడు
దివసం = రోజు, పగలు
దివసేంద్రుడు = సూర్యుడు
దివి = ఆకాశం
దీధితి = కిరణం, వెలుగు, కాంతి
దుశ్చరితాలోచన = చెడుతలపు (చెడ్డ ఆలోచన)
దేవుళ్ళాట = వెదుకులాట
ద్వాఃకవాటం = ద్వారబంధం, తలుపు

(న)
నలిరేగి = విజృంభించి
నిక్కం = నిజం, వాస్తవం
నిఖిల = సమస్త, అన్ని
నిచయం = సమూహం
నిదాఘం = వేసవి, ఎండాకాలం
నిదానం = మూలకారణం, నెమ్మది
నిమిత్తం = కారణం
నిర్జనం = జనంలేనిది
నిశ = రాత్రి
నిష్ణాతుడు = నేర్పరి
నిస్తంద్రుడు = కునికిపాటు లేనివాడు
నీవార ముష్టింపచుల్ = సహజంగా పండే నివ్వరిధాన్యాన్ని పిడికెడు తీసుకొని కడుపునింపు కొనేవాళ్ళు
నుతి = పొగడ్త, స్తుతి
నెట్టుకొను = పెరుగుతున్న
నొక్కి = అదిమిపట్టి

(ప)
పంచజనుడు = పాంచభౌతిక శరీరం కలవాడు (మనిషి) తీరుబడి తీరిక
పగిది = విధం
పనిచి = నియమించి, పంపి
పరహితార్ధం = ఇతరుల మేలుకోసం
పరాభవం = అవమానం
పరామర్శ = చక్కగా విచారించు
పరివారం = పరిజనం
పరివ్రాజకుడు = సన్న్యాసి, సంచారం చేసేవాడు
పాత్ర = గిన్నె, కథలో నాటకంలో వచ్చే ఒక వ్యక్తి
పారావారం = సముద్రం
పారాశర్యుడు = పరాశరుని కుమారుడు (వ్యాసుడు)
పుట్టకురుపు = క్యాన్సర్ ప్రణం, రాచపుండు
పుయిలోడు (క్రి) = వెనుదీయు, సంకోచించు, జంకు
పురంధ్రి = కుటుంబ స్త్రీ
పులస్త్య బ్రహ్మ = బ్రహ్మమానస పుత్రుడు
పెక్కండ్రు = చాలామంది
పొదలు (క్రి) = వృద్ధిచెందు, పెరుగు, వర్ధిల్లు
ప్రణమిల్లు (క్రి) = నమస్కరించు
ప్రజ్ఞానం = విశేష ప్రతిభతో కూడిన జ్ఞానం
ప్రక్షాళితంబు = చక్కగా కడిగినది

(బ)
బంతి = వరుస, పంక్తి, సామూహిక భోజనానికి కూర్చున్న వాళ్ళ వరస
బస్తీజనం = పట్టణవాసులు
బుద్బుదం = నీటిబుడగ
బృహత్తర = గొప్పదైన

(భ)
భత్యాలు = ప్రతిరోజు భోజనానికి ఇచ్చే ద్రవ్యం
భక్షణం = తిండి
భక్షించు (క్రి) = తిను
భాసిల్లు (క్రి) = ప్రకాశించు
భుక్తిశాల = భోజనశాల
భూరుహం = భూమి నుండి పుట్టినది (చెట్టు)
భృంగం = తుమ్మెద
బీబు + ఎండ = అధికమైన ఎండ

(మ)
మందకొడి = సోమరి, జడుడు, చురుకుగా సాగకపోవడం
మంద్రం = గంభీరధ్వని
మచ్చెకంటి = మీనాక్షి, చేపలవంటి కన్నులు గల స్త్రీ
మతిహీనులు = తెలివిలేనివాళ్ళు
మదీయ = నా సంబంధమైన
మననం = చింతన
మనోహరం = ఇంపైన
మహాప్రస్థానం = దీర్ఘప్రయాణం, లోకాంతర యాత్ర, మరణం
మాధుకరభిక్ష = ఇల్లిల్లూ తిరిగి అన్నం సేకరించు కోడం
మిక్కుటం = ఎక్కువ
మీలనము = కళ్ళు మూయడం
ముక్కంటి = మూడు కనులు కలవాడు (శివుడు)
ములుగర్ర = ఎడ్లను తోలడానికి వాడే ములుకోలు
ములుకి = మొనదేలిన భాగం
మూర్ధం = ఉన్నతమైనది
మెండు = అధికం, ఎక్కువ
మోడు = ఆకురాలిన వృక్షం
మోహం = అజ్ఞానం
మోక్షలక్ష్మి = మోక్షమనే లక్ష్మి (ముక్తి)
మౌళి = సిగ

(య)
యాతన = తీవ్రమైన వేదన, నరకదుఃఖం

(ర)
రజని = రాత్రి
రవళి = ధ్వని, చప్పుడు
రుగ్ధత = జబ్బు
రుచిరం = కాంతి
రేగి = ఎగసి, విజృంభించి
రోదసి = భూమ్యాకాశాలు, భూమి, ఆకాశం

(ల)
లలామ = శ్రేష్ఠురాలు, స్త్రీ
లసత్ = ప్రకాశిస్తున్న
లాతి = అన్యుడు, అన్యము
లోచనం = కన్ను

(వ)
వర్ణభరితం = రంగులతో నిండినది
వసించు = నివసించు, ఉండటం, కాపురం ఉండటం
వాటిక = వీథి
వాలం = తోక
వాసము = ఇల్లు
వ్యాసంగం = కృషి, పని
విచ్ఛిత్తి = విభజించడం, వేరుచేయడం
విప్రులు = బ్రాహ్మణులు
వీడు = పట్టణం
వెఱుపు = భయం
వెల్లి = ప్రవాహం
వేదోక్తం = వేదంలో చెప్పిన

(శ)
శతాబ్దం = నూరు సంవత్సరాల కాలం
శాంతుడు = శాంతిగలవాడు
శిలోంఛప్రక్రములు = శిలప్రక్రములు (పొలాల్లో రాలిన కంకుల (గింజల) ను ఏరుకొని బ్రతికేవాళ్ళు) ఉంఛప్రక్రములు (రోళ్ళ దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు)

(ష)
షండం = సమూహం

(స)
సంచయం = సమూహం, కూడిక
సంక్షిప్తం = కుదించినది
సద్దు = శబ్దం, చప్పుడు
సరభసోత్సాహం = అధికమైన కోరిక, అధికమైన వేగముతో కూడిన పూనిక
సర్వం = మొత్తం
సత్త్వం = దేహబలం
సత్కృతి = సత్కారం, సన్మానం
సరిత్తు = నది
సహస్రాబ్దం = వేయి సంవత్సరాల కాలం
సాంధ్య = సంధ్యా సమయ సంబంధమైన
సాధ్వి = పతివ్రత, శీలవతి
సాన్నిధ్యం = సమీపం, దగ్గర, సన్నిధి
సుంత = ఇంచుక, ఇసుమంత, కొంచెం
సుధాకరుడు = చంద్రుడు
సూడిగములు = చేతిగాజులు
సేచనం = అభిషేకం
సైరించుట (క్రి) = క్షమించు, ఓర్చు
సౌదామిని = మెరుపు
సౌరభం = సువాసన
స్మరణ = తలపు
స్మితం = చిరునవ్వు, హాసం
స్నిగ్ధం = దట్టమైనది, చిక్కనైనది

(హ)
హితైషులు = మేలుకోరేవాళ్ళు

(క్ష)
క్షుత్పిపాసలు = క్షుత్తు (ఆకలి), పిపాస (దప్పిక), ఆకలిదప్పులు

నానార్థాలు

అనృతం = అసత్యం, సేద్యం, వాణిజ్యం
అమృతం – సుధ, నీరు, ముక్తి
ఆశ = కోరిక, దిక్కు
కంకణం = తోరం, నీటి బిందువు, స్త్రీలు చేతికి ధరించే ఆభరణం
కన్ను = నేత్రము, చూపు, బండిచక్రము
కళ = చదువు, శిల్పం, చంద్రునిలో పదహారోవంతు
కాలం = సమయం, నలుపు, చావు
కుండలి = పాము, నెమలి, వరుణుడు
కులం = వంశం, జాతి, ఇల్లు
కృషి = సేద్యము, యత్నము
గుణం = స్వభావం, వింటినారి
గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, పురోహితుడు, బృహస్పతి
చరణము = పాదము, పద్యపాదము, కిరణము
నిట్టవొడుచు (క్రి)= ఉప్పొంగు, విజృంభించు, రోమాంచితమగు
ఫలం = పండు, ప్రయోజనం, సుఖం
మిత్రుడు = స్నేహితుడు, సూర్యుడు
ముద్ర = గుర్తు, అచ్చువేయడం, ఒక అలంకారం
రాజు = ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు
లెస్స = శ్రేష్ఠం, యుక్తం, కుశలం
వనం = తోట, అడవి, జలం
వాసం = ఇల్లు, వస్త్రం, కాపురం
వివరము = వివరణము, రంధ్రము, దోషము
వీడు = ఇతడు, పట్టణము
వెల్లి = ప్రవాహం , పరంపర, తెలుపు
శరము = బాణము, నీరు, రెల్లు
శాఖ = కొమ్మ, చెయ్యి, వేదభాగము
సమయము = కాలము, ప్రతిజ్ఞ, సిద్ధాంతము
సూత్రము = నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు
హరి = కోతి, ఇంద్రుడు, విష్ణువు

పర్యాయపదాలు

అంభోధి = సముద్రం, కడలి, సాగరం
అనలం = అగ్ని, నిప్పు, జ్వలనం
అరణ్యం = విపినం, అడవి, అటవి, వనం
అనృతం = అసత్యం, అబద్ధం, బొంకు
అన్నం = బువ్వ, కూడు, బోనం
అర్ధాంగి = భార్య, పత్ని, ఇల్లాలు
అహిమకరుడు = సూర్యుడు, భానుడు, రవి, భాస్కరుడు
ఆగ్రహం = కోపం, క్రోధం, అలుక
ఆజ్ఞ = ఆదేశం, ఆన, ఉత్తరువు, నిర్దేశం
ఆస్యం = ముఖం, ఆననం, మోము
ఎలుక = మూషికం, ఖనకం
కన్ను = అక్షి, చక్షువు, నేత్రం, నయనం
కప్ప = భేకం, దగ్గురం, మండూకం
కరి = ఏనుగు, గజము
కమలము = పద్మము, నళినము
కార్ముకం = విల్లు, ధనుస్సు, శరాసనం, సింగిణి
కైరవం = కలువ, కలారం, కుముదం, ఇందీవరం
కొండాడి = పొగడి, స్తుతించి, నుతించి
కోరిక = వాంఛ, తృష్ణ, ఈప్సితం
కౌముది = వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న
గిరి = కొండ, పర్వతం, అద్రి
గృహం = ఇల్లు, గేహం, నికేతం
చంద్రుడు = ఇందుడు, శశాంకుడు, నిశాకరుడు
చాడ్పు = విధం, భంగి, రీతి, తీరు
చెట్టు – వృక్షం, తరువు, భూరుహం
తమస్సు/తమం = చీకటి, అంధకారం, ఇరులు
దయ = కృప, కనికరం, కరుణ
దేహం = శరీరం, తనువు, కాయం
ధరణి = భూమి, ధరిత్రి, పృధ్వి
నరుడు = మానవుడు, మనిషి, మర్త్యుడు
నలిరేగు = విజృంభించు, చెలరేగు, విజృంభించు
నిక్కం = నిజం, సత్యం
పల్లె = ఊరు, గ్రామం
పవనము = గాలి, వాయువు, మారుతము
పసిడి = బంగారం, కాంచనం, పుత్తడి
పారాశర్యుడు = వ్యాసుడు, బాదరాయణుడు, కానీనుడు
పూవు = కుసుమం, పుష్పం, విరి
బ్రాహ్మణులు = ద్విజులు, విప్రులు, భూసురులు
భాగీరథి = గంగానది, జాహ్నవి, పావని
భోజనం = తిండి, ఆహారం, భోగం
మరణం = మృత్యువు, నిర్యాణం, చావు
మిన్ను = ఆకాశం, గగనం, నింగి
యశస్సు = కీర్తి, ఖ్యాతి
రవి = సూర్యుడు, దినకరుడు, ప్రభాకరుడు
రాత్రి = నిశ, రజని, యామిని
రుగ్ణత = జబ్బు, వ్యాధి, రోగం
వనిత = మహిళ, స్త్రీ, పడతి
వివరం = రంధ్రం, బిలం, కలుగు
వృక్షము = తరువు, చెట్టు, భూరుహం
వెల్లి = ప్రవాహం, వెల్లువ
శివుడు = శంకరుడు, రుద్రుడు, భవుడు
సంఘం = సమూహం, బృందం, గుంపు
సుంత = ఇంచుక, ఇసుమంత, కొంచెం
సూర్యుడు = రవి, అహిమకరుడు, భానుడు
స్మరణ = తలపు, ఆలోచన, బుద్ధి

వ్యుత్పత్యర్థాలు

అంగన = శ్రేష్టమైన అవయవములు కలది (స్త్రీ)
అమృతం = మరణం పొందింపనిది (సుధ)
ఈశ్వరుడు = స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు – (శివుడు)
కరి = తొండం (కరము) కలది (ఏనుగు)
గురువు = అంధకారమనే అజ్ఞానమును భేదించువాడు (ఉపాధ్యాయుడు)
చిత్రగ్రీవం = చిత్రమైన (వివిధ) వర్ణాలతో కూడిన కంఠం గలది (పావురం)
ఝరి = కాలక్రమంలో స్వల్పమైపోయేది (ప్రవాహం)
తాపసుడు = తపస్సు చేసేవాడు (ముని)
దేహుడు = దేహము కలవాడు (ప్రాణి)
పతివ్రత = పతిని సేవించుటయే నియమంగా కలిగినది (సాధ్వి)
పక్షి = పక్షాలు (రెక్కలు) కలది (పిట్ట)
పవనజుడు = పవనుని వలన (వాయువునకు) పుట్టినవాడు (హనుమంతుడు)
పార్వతి = హిమవంతుడనే పర్వతరాజు కూతురు (పార్వతి)
పుత్రుడు = పున్నామనరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు (కుమారుడు)
పురంధి = గృహాన్ని ధరించేది (ఇల్లాలు)
భవాని = భవుని (శివుని) భార్య (పార్వతి)
మిత్రుడు = సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు (సూర్యుడు)
ముని = మౌనం దాల్చి ఉండేవాడు (ఋషి)
మూషికం = అన్నాదులను దొంగిలించేది (ఎలుక)
మోక్షం = జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది (ముక్తి)
వనజం = వనం(నీరు)లో పుట్టినది (పద్మం)
శివుడు = సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు, మంగళప్రదుడు (ఈశ్వరుడు)
సన్న్యాసి = సర్వమూ న్యాసం (వదిలివేసిన) చేసినవాడు]
సముద్రం = చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది (వాణ్ణి)

ప్రకృతి – వికృతి

అంబ – అమ్మ
ఆజ్ఞ – ఆన
ఆర్యుడు – అయ్య
ఆసక్తి – ఆసత్త
ఆహారం – ఓగిరం
ఉపాధ్యాయుడు – ఒజ్జ
ఈశ్వరుడు – ఈసరుడు
కష్టం – కస్తి
కవి – కయి
కవిత – కైత
కార్యము – కర్జము
కావ్యం – కబ్బం
కుడ్యం – గోడ
కులం – కొలం
గుణం – గొనం
గుహ – గొబ
గృహం – గీము
గౌరవం – గారవం
ఛాయ – చాయ
జ్యోతి – జోతి
దోషం – దోసం
ధర్మం – దమ్మం
నిద్ర – నిదుర, నిద్దుర
నిత్యము – నిచ్చలు, నితాము
పక్షం – పక్క
పక్షి – పక్కి
పంక్తి – బంతి
పట్టణం – పట్టం
పుణ్యం – పున్నెం
పుత్రుడు – బొట్టెడు
పుస్తకము – పొత్తము
పుష్పం – పూవు
ప్రాణం – పానం
బంధువు – బందుగు
భాష – బాస
బిక్ష – బిచ్చం
భక్తి – బత్తి
భాగ్యం – బాగైం
బ్రహ్మ – బొమ్మ, బమ్మ
యాత్ర – జాతర
లక్ష్మి – లచ్చి
లేఖ – లేక
రత్నం – రతనం
రాట్టు – ఱేడు
రాశి – రాసి
రాజ్జి – రాణి
వాటిక – వాడ
విజ్ఞానం – విన్నాణం
విద్య – విద్దె, విద్య
శక్తి – సత్తి
శాస్త్రము – చట్టము
శ్రీ – సిరి
సుఖం – సుకం
స్వామి – సామి

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.

1) లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు.” ఇవి హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.

2) గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె, ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు.”

గురులఘువుల గుర్తులు

లఘువు అని తెలుపడానికి గుర్తు : I ‘ల’
గురువు అని తెలుపడానికి గుర్తు : U ‘గ’

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

గురులఘువుల నిర్ణయం

ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధానము.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 1

బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 2

గమనిక : గురువులు కాని అక్షరాలన్నీ లఘువులు

1) ఋ కారంతో కూడిన అక్షరం సంయుక్తాక్షరం కాదు. ‘ఋ’ అనేది అచ్చు. అందువల్ల అది లఘువు. దానికి ముందు అక్షరం కూడా లఘువే.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 3

2) సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని ఊది పలికితేనే, అది గురువు అవుతుంది. లేకపోతే లఘువు అవుతుంది.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 4

3) ఏకపదంలోనూ, సమాసంలోనూ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఊది పలకబడుతుంది. కాబట్టి అది గురువు అవుతుంది.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 5

గణ విభజన

1) ఒకే అక్షరం గణాలు : ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 6

2) రెండక్షరాల గణాలు : రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 7

అభ్యాసము : రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 8

మూడక్షరాల గణాలు

మూడక్షరాల గణాలు మొత్తం ఎనిమిది (8).
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 9
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 10

అ) మూడక్షరాల గణాలను గుర్తించే సులభ మార్గము :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 11

య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణం పేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ గురు లఘువులు ఏ క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి.

ఉదా : మీకు ‘య’ గణం యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా వ్రాయండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 12

ఆ) మూడక్షరాల గణముల నిర్ణయంలో మరో పద్ధతి :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 13

అని వ్రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణం పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువులు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా :
1) య గణం = యమాతా = I U U = ఆది లఘువు
2) మ గణం = మాతారా = U U U = సర్వ గురువు
3) త గణం= తారాజ = U U I = అంత్య లఘువు
4) ర గణం = రాజభా = U I U = మధ్య లఘువు
5) జ గణం = జభాన = I U I = భాన మధ్య గురువు
6) భ గణం = భానస = U I I = ఆది గురువు
7) న గణం = నసల = I I I = సర్వ లఘువులు
8) లగము (లేక ‘వ’ గణం) = I U (లఘువు, గురువు)

నాలుగు అక్షరాల గణాలు
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 14

సూర్య గణాలు – ఇంద్ర గణాలు
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 15

యతి – ప్రాసలు

I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి : పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
2. ప్రాస : పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

II. గమనిక : నియమం చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికి, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ — సౌకర్యం కలుగుతుంది.

3. యతిమైత్రి :
పద్యపాదం యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యంలో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరం మైత్రి కలిగి ఉండడాన్ని యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.

1. ఉత్పలమాల
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 16 AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 17

గమనిక :
పై పాదాల్లో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.

యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గానీ ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతిమైత్రి’ లేదా యతిస్థానం అంటారు.

పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – అని జే – సి) యతి.

ప్రాస :
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘య’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.

ఉత్పలమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రాస నియమం ఉంటుంది.
  5. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

2. చంపకమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 18

చంపకమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో అ – య).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. శార్దూలం
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 19

శార్దూల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో ఆ – యం).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.

4. మత్తేభం:
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు 1

మత్తేభ పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో ప – పా).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

5. తేటగీతి

తేటగీతి పద్య లక్షణాలు :

  1. ఇది ‘ఉపజాతి’ పద్యం.
  2. ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
  4. నాలుగో గణం మొదటి అక్షరం యతి స్థానం.
  5. ప్రాస యతి చెల్లుతుంది.
  6. ప్రాస నియమం లేదు.

ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు 2
పై పద్యంలో 1 సూర్య గణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యపాదం.
ఇక్కడ ‘ప్రాసయతి’ వాడబడింది.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

6. ఆటవెలది

ఆటవెలది పద్య లక్షణాలు :
1) ఇది ‘ఉపజాతి’ పద్యం.
2) ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
3) 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్య గణాలు, రెండు ఇంద్ర గణాల చొప్పున ఉంటాయి.
4) 2, 4 పాదాల్లో ఐదూ సూర్య గణాలే ఉంటాయి.
5) ప్రతి పాదంలోనూ నాల్గవ గణంలోని మొదటి అక్షరం యతి. యతిలేనిచోట ప్రాసయతి చెల్లుతుంది.
6) ప్రాస నియమం పాటింపనవసరం లేదు.
ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు 3

7. సీసం : (ఉపజాతి పద్యాలంటే తేటగీతి, ఆటవెలది, సీసం)
సీసము పద్య లక్షణాలు :

  1. సీస పద్యంలో నాలు పెద్ద పాదాలు ఉంటాయి. ఈ పెద్ద పాదం రెండు భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలోనూ నాలుగేసి గణాల చొప్పున, ఒక్కొక్క పెద్ద పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లో మొదట ఆరు ఇంద్ర గణాలు, చివర రెండు సూర్య గణాలు ఉంటాయి.
  2. సీస పద్యపాదంలోని రెండు భాగాల్లోనూ, ప్రతి భాగంలోనూ మూడవ గణం మొదటి అక్షరంతో యతిమైత్రి ఉండాలి. యతిలేని చోట ప్రాసయతి ఉండవచ్చు.
  3. సీస పద్యంలో నాల్గు పెద్ద పాదాల తరువాత ఒక తేటగీతి గాని, ఆటవెలది గాని చేర్చాలి.

ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 20

8. ద్విపద
ద్విపద పద్య లక్షణాలు:

  1. ‘ద్విపద’ పద్యంలో రెండు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదంలోనూ వరుసగా మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం ఉంటాయి.
  3. మూడవ గణం మొదటి అక్షరంతో యతి.
  4. ప్రాసయతి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం పాటింపబడుతుంది.

గమనిక :
ప్రాస నియమం లేని ద్విపదను ‘మంజరీ ద్విపద’ అంటారు.
ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 21

9. కందం
కందం పద్య లక్షణాలు :

  1. ఈ ‘కందం’ పద్యములో గగ, భ, జ, స, నల అనే గణాలు ఉంటాయి.
  2. మొదటి పాదం ‘లఘువు’తో మొదలయితే అన్ని పాదాల్లోనూ మొదటి అక్షరం లఘువుగానే ఉండాలి. మొదటి . పాదము ‘గురువు’తో మొదలయితే, అన్ని పాదాల్లోనూ మొదటి అక్షరం గురువుగానే ఉండాలి. 3) రెండవ, నాల్గవ పాదాల్లోని చివరి అక్షరం గురువుగా ఉండాలి.
  3. 1, 2 పాదాలలో (3 + 5) 8 గణాలు; 3, 4 పాదాల్లో (3 + 5) = 8 గణాలు ఉంటాయి.
  4. 1, 2 పాదాలు, 3, 4 పాదాలు కలిసిన మొత్తం 8 గణాల్లో 6వ గణం “నలము” గాని ‘జగణం’ కాని కావాలి.
  5. బేసి గణం జగణం ఉండరాదు.
  6. ప్రాస నియమం ఉండాలి.

ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 22

వృత్తాలు – లక్షణాలు – సులభంగా గుర్తు పట్టడం

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 23

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

పద్యపాదాలను గుర్తించి, గణ విభజన చేయడం

ఈ క్రింది పద్యపాదాలకు గణ విభజన చేసి, అవి ఏ పద్యపాదాలో గుర్తించి, యతిని పేర్కొనండి.
1) వెన్నెల వెల్లి పాల్కడలి వ్రేక దనంబున బేర్చి దిక్కులన్
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 24
గమనిక : పై పద్యపాదంలో “భ, ర, న, భ, భ, ర, వ” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్య పాదం. యతిస్థానం 10వ అక్షరం (వె – వే).

2) దెసలను కొమ్మ లొయ్యనతి దీర్ఘములైన కరంబులన్ బ్రియం
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 25
పై పద్యపాదంలో “న, జ, భ, జ, జ, జ, ర” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం. యతి స్థానం 11వ అక్షరం (దె – దీ)

3) ఆ యేమీ యొక రాణి వాసమును బుణ్యవాసమున్ దెచ్చినా
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 26

పై పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది శార్దూల పద్యపాదం.. యతి స్థానము 13వ అక్షరం (ఆ – ణ్యా)

4) శివరాజంతట మేల్ము సుంగుఁదెరలో స్నిగ్దాంబుద చ్చాయలో
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 27

పై పద్యపాదంలో “స, భ, ర, న, మ, య, వ” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది మత్తేభ పద్యపాదం. యతి స్థానం 14వ అక్షరం (శి – స్ని).

ఛందస్సుపై ప్రశ్నలు

1) ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు, ఏ పద్యానికి చెందినవి ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
A) ఉత్పలమాల

2) ‘న జ భ జ జ జ ర’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) శార్దూలము
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) చంపకమాల
జవాబు:
D) చంపకమాల

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3) ‘మసజసతతగ’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
D) శార్దూలం

4) ‘సభరనమయవ’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) ఉత్పలమాల
B) మత్తేభము
C) శార్దూలము
D) చంపకమాల
జవాబు:
B) మత్తేభము

5) 14వ అక్షరంతో యతి గల పద్యము
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
D) మత్తేభము

6) ఉత్పలమాల పద్యానికి ఈ అక్షరంతో యతి
A) 11వ అక్షరం
B) 10వ అక్షరం
C) 13వ అక్షరం
D) 14వ అక్షరం
జవాబు:
B) 10వ అక్షరం

7) చంపకమాల పద్యానికి ఈ అక్షరంతో యతి
A) 10వ అక్షరం
B) 13వ అక్షరం
C) 14వ అక్షరం
D) 11వ అక్షరం
జవాబు:
D) 11వ అక్షరం

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

8) 13వ అక్షరంతో యతి గల పద్యం ఇది
A) శార్దూలము
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) చంపకమాల
జవాబు:
A) శార్దూలము

9) ‘అతడు’ – ఇది ఏ గణమో గర్తించండి?
A)త గణం
B) ర గణం
C) భ గణం
D) య గణం
జవాబు:
C) భ గణం

10) ‘మీయయ్య’ – ఇది ఏ గణమో గుర్తించండి?
A) ర గణం
B) త గణం
C) న గణం
D) మ గణం
జవాబు:
B) త గణం

11) ‘శ్రీరామా’ అనే పదం ఈ గణానికి చెందింది.
A) మ గణం
B) న గణం
C) ర గణం
D) స గణం
జవాబు:
A) మ గణం

12) ‘సీస పద్యం ‘ మీద చేరే పద్యాలలో ఇది ఒకటి
A) కందము
B) తేటగీతి
C) ఉత్పలమాల
D) ద్విపద
జవాబు:
B) తేటగీతి

13) ‘తేటగీతి’ పద్యంలో యతి ఏది?
A) 3వ గణాద్యక్షరం
B) రెండవ గణాద్యక్షరం
C) నాల్గవ గణాద్యక్షరం
D) ఐదవ గణాద్యక్షరం
జవాబు:
C) నాల్గవ గణాద్యక్షరం

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

14) పద్యంలో ప్రాసాక్షరము ఏది?
A) 4
B) 2
C) 3
D) 1
జవాబు:
B) 2

15) ‘యతి’ అంటే ఎన్నవ అక్షరము?
A) మూడవ
B) రెండవ
C) ఒకటవ
D) నాల్గువ
జవాబు:
C) ఒకటవ

16) ‘ఆటవెలది’ పద్యానికి గల పాదాలు
A) 2
B) 4
C) 5
D) 6
జవాబు:
B) 4

17) “అనయము దోషమే పరులయందు కనుంగొనునట్టియా’ – ఈ పాదంలో గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 28
ఇది చంపకమాల పద్యపాదము.

18 ‘పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో’ – ఈ పాదంలో గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 29
ఇది ఉత్పలమాల పద్యపాదము.

19) సురుచిర తారకా కుసుమ శోభి నభోంగణ భూమిఁ గాలమన్’ – ఈ పాదానికి గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి. పేర్కొనండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 30
ఇది చంపకమాల పద్యపాదము.