AP Inter 2nd Year Telugu Question Paper March 2023

Access to a variety of AP Inter 2nd Year Telugu Model Papers and AP Inter 2nd Year Sanskrit Question Paper March 2023 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 2nd Year Telugu Question Paper March 2023

గమనిక : ప్రశ్న పత్రము ప్రకారము సమాధానాలు వరుస క్రమంలో రాయాలి.

1. ఈ క్రింది పద్యాలలో ఒక దానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1) నుతజల పూరితంబులగు నూతులు నూఱిటి కంటె సూనృత .
వ్రత ! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్ర్కతువది మేలు; తత్రతు శతంబునకంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్.

2) ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
డున్నాఁడిదె కపులఁగూడి, యురుగతి రానై
యున్నాడు, నిన్ను గొని పో
నున్నాఁడిది నిజము నమ్ము ముర్వీతనయా !

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) సీతాదేవి తన సందేశాన్ని హనుమతో ఏమని వివరించింది ?
2) రాజు కన్యకను చెరపట్టడానికి ఎలా ప్రయత్నించాడు ?

III. “ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) అర్ధ సంకోచ, వ్యాకోచాల గురించి తెల్పండి.
2) రావూరి భరద్వాజ బాల్యాన్ని గురించి తెల్పండి.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానాలు రాయండి. (2 × 5 = 10)

1) ‘గవేషణ’ నాటిక సారాంశాన్ని తెల్పండి.
2) ‘తెరచిన కళ్ళు’ నాటికలో డాక్టరు పాత్ర స్వభావాన్ని తెలియజేయండి.
3) ‘ఆశ ఖరీదు అణా’లో కృష్ణవేణి పాత్ర స్వభావాన్ని విశ్లేషించండి.
4) ‘తెరచిన కళ్ళు’ నాటికలో డాక్టరు కళ్ళను సత్యం తెరపించిన విధానం వివరించండి.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1) పోరు మంచిదిగాదు భూమినెక్కడను
2) వసుధాస్థలి వర్ధిలు బ్రహ్మకల్పముల్
3) నీవొక పట్టయేలే రాజుదట !
4) నా ముందు నిలబడ్డాడు కొత్త మానవుడు.

VI. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) శకుంతల బాధపడిన విధమెట్టిది ?
2) శ్రీనాథుని గురించి రాయండి.
3) కన్యక ప్రజల కిచ్చిన సందేశమేమిటి ?
4) కలేకూరి ప్రసాద్ గురించి రాయండి.

VII. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) చదరంగం గురించి రాయండి.
2) వేములవాడ భీమకవి గురించి తెల్పండి.
3) అహింస గురించి వేమన అభిప్రాయం ఏమిటి ?
4) చిలకమర్తి తెలిపిన ఆనాటి పన్నులను పేర్కొనండి.

VIII. ఈ క్రింది ప్రశ్నలలో ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1) నన్నయ ఎవరి ఆస్థాన కవి ?
2) అన్ని జన్మలలో దుర్లభమైంది ఏది ?
3) శ్రీరాముడు ఉన్న పర్వతం పేరేమిటి ?
4) గురజాడ రాసిన కొత్త ఛందస్సు పేరేమిటి ?
5) కర్మభూమిలో పూసిన ఓ పువ్వా. పాట రచయిత ఎవరు ?
6) అమ్మతనం ముందు ఏది ఓడిపోతుంది ?

IX. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1) గుర్రపు స్వారిలో ఉద్దండుడైన రెడ్డిరాజు ఎవరు ?
2) నేటికాలమున నారదుడు అంటే అర్థమేమిటి ?
3) ‘చాటువు’ అంటే ఏమిటి ?
4) వేమన పద్యాలలోని ఛందస్సు ఏది ?
5) పాకుడురాళ్ళు నవలా రచయిత ఎవరు ?
6) ‘మా కొద్దీ తెల్లదొరతనం’ గీతం ఎవరు రాశారు ?

X. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1) సర్వనామం అంటే ఏమిటి ?
2) భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి – క్రియ ఏది ?
3) తెలుగులో భాషా భాగాలు ఎన్ని రకాలు ?
4) గులాబి అందమైన పువ్వు – దీనిలో విశేషణమేది ?
5) అవ్యయం అంటే ఏమిటి ?

XI. ఈ క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1) వాక్యాలు స్థూలంగా ఎన్ని రకాలు ?
2) కొన్ని అప్రధాన వాక్యాలు ఒక ప్రధాన వాక్యంతో కలిసి ఏర్పడే వాక్యమేది ?
3) సామాన్య వాక్యానికి ఉదాహరణ ఇవ్వండి.
4) యోగ్యత అంటే ఏమిటి ?
5) రెండు సమప్రాధాన్యం గల వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే అది ఏ వాక్యం ?

XII. క్రింది వానిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1) చంపకమాల
2) ద్విపద
3) ఆటవెలది

XIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)

1) ‘మత్తేభం’లో యతిస్థానం ఏది ?
2) కంద పద్యంలో బేసి స్థానంలో ఏ గణం ఉండకూడదు ?
3) ఉత్పలమాల పద్యంలో ఎన్నో అక్షరానికి యతిస్థానం ఉంటుంది ?
4) ప్రాస అంటే ఏమిటి ?
5) ఉపజాతుల్లో ఏ నియమం ఉండదు ?
6) శార్దూలంలోని గణాలేవి ?

XIV. క్రింది వానిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1) వృత్త్యానుప్రాస
2) రూపకం
3) అతిశయోక్తి

XV. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)

1) ఉపమేయం అంటే ఏమిటి ?
2) రెండు హల్లులు వెంట వెంటనే వస్తూ అర్థభేదం కలిగి ఉండే అలంకారమేది ?
3) అలంకారాలు ఎన్ని రకాలు ? అవి ఏవి ?
4) ఊహ ప్రధానంగా ఉండే అలంకారమేది ?
5) వలె, పోలె, అట్లు, లాగ – ఈ పదాలను ఏమంటారు ?
6) ‘నీలమేఘచ్ఛాయ బోలు దేహమువాడు’ ఈ పద్యంలోని అలంకారమేది ?

XVI. క్రింది గద్యాన్ని 1/3 వంతుకు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

ఆదిమ కాలం నుంచి తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూ, కొండకోనల్లో, అడవుల్లో నివసిస్తూ ఆదిమ సంస్కృతిని పాటించేవారు గిరిజనులు, గొండులు, కోయలు, సవరలు, జాతాపులు, చెంబులు, తొడలు, భగతలు మొదలైన వారు మనదేశంలో నివసిస్తున్న కొన్ని గిరిజన సమూహాలు. గిరులపై జీవిస్తున్నందువల్ల వీరిని గిరిజనులు అని పిలుస్తారు. వీరిని హిందీలో ‘ఆదివాసి’ లేదా ‘జన్ జాతి’ అనీ, ఆంగ్లంలో ‘ట్రైబ్’ అని పిలుస్తారు. సాధారణంగా వీరు నాగరికులకు దూరంగా నివసిస్తుంటారు. లిపిలేని భాషను మాట్లాడుతారు. వీరు పోడు వ్యవసాయం చేస్తూ, అటవీ ఉత్పత్తుల్ని సేకరించి జీవనాన్ని సాగిస్తారు. ఆదివాసీల జీవితంలో మరొక ప్రధానవృత్తి వేట. గిరిజనుల జీవన విధానంలో నమ్మకాలు, జంతుబలులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆటలు, పాటలు, సామూహిక నృత్యాలు వీరి జీవితంలో ఒక భాగం.

Leave a Comment