AP Inter 2nd Year Telugu Question Paper April 2022

AP Inter 2nd Year Telugu Question Paper April 2022

గమనిక : ప్రశ్న పత్రము ప్రకారము సమాధానాలు వరుస క్రమంలో రాయాలి.

1. ఈ క్రింది పద్యాలలో ఒక దానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1) విమలయశోనిధీ! పురుషవృత్త మెఱుంగుచునుండుఁ జూవె వే
దములును బంచ భూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముఁడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా
ర్థములివి యుండఁగా నరుఁడు దక్కొన నేర్చునె తన్ను మ్రుచ్చిలన్

2) ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
డున్నాఁడిదె కవులఁ గూడి, యురుగతి రానై
యున్నాఁడు, నిన్నుఁ గొని పో
నున్నాఁడిది నిజము నమ్ము ముర్వీ తనయా !

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) రాజును – కన్యక ప్రతిఘటించిన విధానాన్ని వివరించండి.
2) సమాజంలో వచ్చిన మార్పుల పట్ల అద్దేపల్లికి కలిగిన ఆవేదనను తెల్పండి.

III. “ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) అర్థ సంకోచ, వ్యాకోచాల గురించి తెల్పండి.
2) రావూరి భరద్వాజ బాల్యాన్ని గురించి రాయండి.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానాలు రాయండి. (2 × 5 = 10)

1) ‘తెరచిన కళ్లు’ నాటికలో డాక్టరు పాత్ర స్వభావాన్ని వివరించండి.
2) ‘ఆశ ఖరీదు అణా’ నాటిక సారాంశాన్ని రాయండి.
3) ‘ఆశ ఖరీదు అణా’ లో తాత పాత్ర స్వభావాన్ని వివరించండి.
4) ‘తెరచిన కళ్ళు’ నాటికలో డాక్టరు కళ్ళను సత్యం తెరిపించిన విధానం వివరించండి.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1) ఒక నూనృత వాక్యము మేలు సూడగన్
2) వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు
3) నీవొక పట్టమేలే రాజువట
4) అమ్మతనం ముందు అమ్మకం తనం ఓడిపోతుంది.

VI. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) సత్య వాక్యం వేటికంటే గొప్పది ?
2) శ్రీరాముడు రూపాన్ని హనుమ ఏ విధంగా వర్ణించాడు ?
3) కన్యక ప్రజలకిచ్చిన సందేశమేమిటి ?
4) అద్దేపల్లి దర్శించిన కొత్తమానవుడు ఎలా ఉన్నాడు?

VII. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) అర్థ విపరిణామంలో సంకేతార్థం గురించి రాయండి.
2) వేములవాడ భీమకవి గురించి తెల్పండి.
3) “పాకుడు రాళ్ళు” నవల గురించి రాయండి.
4) చిలకమర్తి తెలిపిన ఆనాటి పన్నులను పేర్కొనండి.

VIII. ఈ క్రింది ప్రశ్నలలో ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1) శకుంతలను పెంచిన తండ్రి ఎవరు ?
2) హనుమంతుని తల్లి పేరేమిటి ?
3) “ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి రచిస్తారు” అన్న కవి ఎవరు ?
4) పట్టమేలే రాజు గర్వం ఏమైంది ?
5) బియ్యంలో రాళ్ళులా కనిపించేవేవి ?
6) “ఈ దారి ఎక్కడికి పోతుంది?” పాఠ్యభాగ రచయిత ఎవరు ?

IX. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1) స్ఫూర్తిశ్రీ అసలు పేరేమిటి ?
2) చాటువు అంటే ఏమిటి ?
3) శ్రీనాథుడు ఏ విజయనగర రాజును దర్శించాడు ?
4) “పాకుడు రాళ్ళు” నవలకు వచ్చిన అత్యున్నత పురస్కారమేది ?
5) రావూరి భరద్వాజ భార్య పేరేమిటి ?
6) “మాకొద్దీ తెల్ల దొరతనం” గీతం ఎవరు రాశారు ?

X. ‘ క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1) విశేషణానికి ఉదాహరణ రాయండి.
2) సర్వనామం అంటే ఏమిటి ?
3) తెలుగులో భాషా భాగాలు ఎన్ని రకాలు ?
4) భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి – క్రియ ఏది ?
5) ఆహా! తెలుగు భాష ఎంత బాగుందో ! – దీనిలో అవ్యయమేది ?

XI. ఈ క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1) అరుణ్ ఇంటికి వెళ్ళి వంట చేశాడు. ఇది ఏ రకమైన వాక్యం.
2) వాక్యాలు స్థూలంగా ఎన్ని రకాలు ?
3) సామాన్య వాక్యానికి ఉదాహరణ ఇవ్వండి.
4) రైలు వచ్చినా చుట్టాలు రాలేదు – ఇది ఏ రకమైన వాక్యం ?
5) క్రియారహిత వాక్యానికి ఉదాహరణ రాయండి.

XII. క్రింది వానిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1) ఉత్పలమాల
2) కందం
3) తేటగీతి

XIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)

1) చంపకమాలలో ఎన్నో అక్షరానికి యతి స్థానం ఉంటుంది ?
2) కంద పద్యంలో బేసి స్థానంలో ఏ గణం ఉండకూడదు ?
3) ముత్యాలసరం నాలుగో పాదంలో ఎన్ని మాత్రలుంటాయి ?
4) ఇంద్ర గణాలేవి ?
5) ప్రాస అంటే ఏమిటి ?
6) శార్దూలంలోని గణాలేవి ?

XIV. క్రింది వానిలో ఒక దానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1) వ్యత్యానుప్రాస
2) ఉపమాలంకారం
3) అతిశయోక్తి

XV. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)

గోదావరి జిల్లాలో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణగానూ ప్రసిద్ధిగాంచిన వ్యక్తి డొక్కా సీతమ్మ. ఈమె తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో క్రీ.శ.1841లో జన్మించింది. ఈమె తండ్రి అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. ఆ రోజుల్లో స్త్రీ విద్యకు అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈమె చదువుకోలేదు. గోదావరి పరివాహక ప్రాంతంలోని లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న పంతులు అనే ధనవంతునితో వివాహమైంది. జోగన్న, సీతమ్మగార్లది అన్యోన్య దాంపత్యం, శుచి, శుభ్రతలతోపాటు అప్యాయత ఆదరణలకు వారిల్లు పెట్టింది పేరు. ఎవరు ఏ వేళలో వచ్చి భోజనమడిగినా తేదనకుండా వండి వడ్డించిన అన్నపూర్ణ ఆమె. సీతమ్మ కేవలం అన్నదానమే కాదు. ఎన్నో పెళ్ళిళ్ళకు, శుభ కార్యాలకు చేయూత నందించిన వితరణశీలి. డొక్కా సీతమ్మ కీర్తి ప్రతిష్ఠలు భారతదేశంలోనే కాక ఇంగ్లాండు దేశం వరకూ వ్యాపించాయి.

Leave a Comment