AP Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

Access to a variety of AP Inter 2nd Year Telugu Model Papers Set 10 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థ, తాత్పర్యాలను రాయండి. (1 × 8 = 8)

1. నుతజల పూరితంబులగు నూతులు నూఱిటి కంటె సూనృత .
వ్రత ! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్ర్కతువది మేలు; తత్రతు శతంబునకంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్.
జవాబు:
ప్రతిపదార్థం :
సూనృతవ్రత ! = సత్యం మాట్లాడటమే నియమంగా కలిగిన ఓ రాజా !
నుతజల పూరితంబులగు –
నుతజల = మంచినీటి చేత
పూరితంబులు + అగు = నిండినవైన
నూతులు = చేదుడు బావులు
నూఱిటికంటెన్ = వంద కంటే
ఒక బావి = ఒక దిగుడు బావి
మేలు = ఉత్తమమైనది
మఱి = అంతేకాక
బావులు = దిగుడుబావులు
నటి కంటెన్ = వంద కంటే
ఒక్క = ఒక
సత్ + క్రతువు + అది = మంచి యజ్ఞం
మేలు = ఉత్తమమైనది
తత్ + క్రతుశతంబున
కంటెన్ = అటువంటి నూరు యజ్ఞల కంటే
సుతుండు = ఒక్క కొడుకు
మేలు = మేలు
తత్, సుతశతకంబుకంటెన్ = అటువంటి కొడుకులు వందమంది కంటే
చూడఁగన్ = పరిశీలించగా
ఒక = ఒక
సూనృత వాక్యము = సత్యవాక్యం
మేలు = ఉత్తమమైనది

తాత్పర్యం : సత్య వాక్పాలనమే వ్రతంగా కలిగిన ఓ రాజా ! మంచి నీటితో నిండిన చేదుడు బావులు నూరింటికంటే ఒక దిగుడుబావి మేలు. అంతేకాక నూరు దిగుడుబావులకంటే ఒక మంచి యజ్ఞం మేలు. అటువంటి నూరు, యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి పుత్రులు నూరుమందికంటే ఒక సత్యవాక్యం మేలైనది అని తాత్పర్యం.

2. ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
డున్నాఁడిదె కపులఁగూడి, యురుగతి రానై
యున్నాడు, నిన్ను గొని పో
నున్నాఁడిది నిజము నమ్ము ముర్వీతనయా !
జవాబు:
ప్రతిపదార్థము :
ఉర్వీ తనయా = ఓ సీతాదేవీ !
ఉన్నాడు లెస్స = క్షేమంగా ఉన్నాడు
రాఘవుడు = శ్రీ శ్రీరాముడు
ఇ కుల + కూడి = వానరములతో కలసి
ఉరుగతి = వేగంగా
రానై యున్నాడు = రావటానికి సిద్ధంగా ఉన్నాడు.
నిన్నున్ + కొని = నిన్ను తీసుకొని వెళ్ళటానికి
ఉన్నాడు = రానున్నాడు.
ఇది = ఇలా జరుగుట
నిజము = సత్యము
నమ్ము = విశ్వసించు

తాత్పర్యము : ఓ సీతాదేవీ ! శ్రీరామచంద్రుడు వానరసేనతో కలిసి నిన్ను రక్షించటానికి ఇక్కడికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడి నుండి నిన్ను తీసుకొని వెళ్ళడం నిజము. నా మాటలను నమ్ము తల్లీ !

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. ‘శాంతి కాంక్ష’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే కావ్యం నుంచి గ్రహించబడింది. ఇందులో మలిదేవరాజు తరపున నలగామరాజు కొలువుకు రాయబారిగా వెళ్ళిన భట్టు పలికిన శాంతి వచనాలను వర్ణించబడ్డాయి. కలిసి ఉంటే కలిగే మేలు, యుద్ధం వల్ల కలిగే కీడులను కవి హృద్యంగా వర్ణించాడు.

నలగామరాజుకు ప్రశంస: భట్టు గుర్రం మీద వచ్చి నలగామరాజు కొలువులో ప్రవేశించాడు. రాజు ఎదుట నిలిచి నమస్కరించాడు. రాజును ఇట్లా ప్రశంసించాడు. ఓ రాజా ! నీవు రాజులలో కెల్లా గొప్పవాడివి. ప్రకాశించే కీర్తి కలవాడివి. రాజవేశ్యలను రంజింప జేయగలవాడివి. శూరులకే శూరుడవు అనే బిరుదు కలవాడివి. ధైర్యంలో మేరు పర్వతాన్ని జయించినవాడివి. శౌర్య పరాక్రమాలలో నిండు చంద్రుడవు. సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడివి. గొప్పగుణాలకు నిలయమైన వాడివి. అభిమాన ధనుడవు. మైలమ్మదేవికి ప్రియమైన కుమారుడవు. అనుగురాజుకు పెద్ద కుమారుడవు. సుందరుడవు. రాజులలో వీరుడవు, వైభవంలో దేవేంద్రుడవు.

యుద్ధానికి సిద్ధం: రాయబారం కోసం మలిదేవరాజు మీ దగ్గరకు పంపించిన అలరాజును అల్లుడని కూడా చూడకుండా చంపివేశారు. దానితో మలిదేవరాజు ఎంతో కోపించాడు. తన తమ్ములు, బంధువులు, వీరులు అయిన నాయకులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఖరదూషణులు మొదలైన రాక్షసులు సంహరించబడిన శ్రీశైల ప్రాంతంలో గొప్పదైన పవిత్రమైన కార్యమపురిలో సైన్యంతో తన పరాక్రమాన్ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నాడు.

రాజనీతి : ఓ రాజా ! అలరాజుతోపాటే వీరమరణం పొందాలని వీరులైన నాయకులు ఎంతో ఆవేశంతో ఉన్నప్పటికీ రాజనీతిని పాటించిన మలిదేవరాజు నన్ను మీ దగ్గరకు రాయబారిగా పంపించాడు. పగను పెంపొందించే దుష్టులేకానీ అణచివేసే నిపుణులు ఈ భూమిమీద లేరు, కనుక మీ తమ్ముడైన నరసింహరాజును మలిదేవరాజు దగ్గరకు రాయబారిగా పంపించండి. ఇరువురూ ఒక్కటై ఈ పగను నశింపజేయండి. పల్నాడు మొత్తాన్ని ఎదురులేకుండా కలిసిమెలసి ఏలండి. కనుక మలిదేవునితో సఖ్యత కోసం నరసింగరాజును పంపించు అని భట్టు రాజుకు సూచించాడు.

పోరునష్టం : భూమిమీద ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధం మంచిది కాదు. పగలు పెరిగితే దేశం నాశనమైపోతుంది. ఎంతోమంది ప్రజలు మరణిస్తారు. మిగిలినవారు భయంతో పారిపోతారు. ధనాగారం ఖాళీ అవుతుంది. సైన్యానికి కూడా యుద్ధం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. జీతగాళ్ళు ఎదురు తిరుగుతారు. తమ జీతపు బకాయిల కోసం పట్టుబడతారు. రాజు, బంటు అనే తేడాలు ఉండవు, సేవకులు చెప్పిన మాట వినరు.

అదను కనిపెట్టిన శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించజూస్తారు. శత్రువుల కదలికలు కనిపెట్టడం కష్టమౌతుంది. మీలో మీరే కొట్లాడుకుంటే చూసేవారికి చులకన అవుతారు. శత్రువులు మీ. రహస్యాలను పసిగడతారు. దుష్టులు మీ పక్కన చేరి చెప్పుడు మాటలతో పగను ఇంతకింత పెంచి పోషిస్తారు. పగవల్ల ఐకమత్యం నశిస్తుంది. బలం, భాగ్యం రెండూ నశిస్తాయి. కీర్తి, పరాక్రమం కూడా నశిస్తాయి. రాజ్యం సర్వనాశనమౌతుంది. అన్నీ క్షీణించాక దేశం శత్రురాజుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది.

పారతంత్ర్యం : యుద్ధం వల్ల స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో పరిపాలన సాగించినవారు ఇతర రాజుల చెరలో బతకవలసి వస్తుంది. శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను గురించి పరమేశ్వరుడు కూడా వర్ణించలేడు. ప్రజలు పంజరంలో బంధించిన పక్షులలాగా బతకాలి. పాములవాడు పట్టుకొని బుట్టలో పెట్టిన పాములా పడి ఉండాలి. గంగిరెద్దుల వాడు ముకుతాడు పొడిచి పొగరు అణఛిన మదపుటెద్దులా జీవించాలి. బోనులో ఉంచిన పులులలాగా స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉండాలి.

బానిస బతుకు : మనసు, మాట, శరీరం – అనే మూడింటిలో మొదటిదైన మనసును బంధించటం ఎవరి తరమూ కాదు. శత్రువుల పాలనలో మాట (వాక్కు) శరీరం (కాయం) – రెండూ బంధింపబడతాయి. ఎవరూ బంధించలేని మనసులో పుట్టిన మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. అట్లా చేయలేనపుడు మానవ జన్మకు సార్ధకత ఉండదు. ప్రయోజనం లేని జీవనం కన్నా మరణమే మేలు. మంచి పనులు చేయకపోతే క్రిమి కీటకాలు, పశుపక్ష్యాదులు మొదలైన జీవుల కడుపులలో లెక్కలేనన్ని సార్లు పుట్టి ఎంతో పుణ్యం వల్ల లేకలేక పొందిన కష్టసాధ్యమైన మానవజన్మ నిందలపాలౌతుంది. కనుక ఓ రాజా ! ఇటువంటి బానిస బతుకు పగవారికి కూడా వద్దు.

పొందులాభం : మల్లెపూలు, తెల్లతామర, చంద్రుడు, తారలు, నురుగు, మంచు, చందనం, రాజహంస మొదలైన వాటి కాంతులను మించే గొప్పకీర్తి సైతం పగ వల్ల వేగంగా నశిస్తుంది. లోకంలో అపకీర్తి పెరిగిపోతుంది. రెండు పక్షాలవారూ ఒక్క టైతే అన్ని కార్యాలు సమకూర్చుకోవచ్చు. ప్రజలంతా సుఖంగా ఉంటారు. పంటలు బాగా పండుతాయి. రెండు పక్షాల వారూ కలసిమెలసి సంపదలు పెంచుతూ ఉంటే సేవకులంతా కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటారు. బలం పెరగటం వల్ల శత్రురాజ్యాలపై దండెత్తి అమిత ధనరాశులను సాధించవచ్చు. ఆ ధనంతో ధర్మబద్ధ పాలన సాగించవచ్చు. అప్పుడు మీ కీర్తి లోకంలో శాశ్వతమై నిలుస్తుంది.

ముగింపు ఓ రాజా ! కలహం వల్ల పూర్వం కౌరవులు నాశనమై పడిన కష్టాల గురించి విన్నాం కదా ! కనుక పగ పెరిగేటట్లు చేయటం భావ్యం కాదు. మీ రెండు పక్షాలవారూ . అన్నదమ్ములే కనుక పరిష్కార మార్గం చెప్పాను. నామాట వినండి అంటూ మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుకు సంధికోసం శాంతివచనాలు వినిపించాడు.

2. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! పాఠం ద్వారా కవి వివరించిన వరకట్న దురాచారాన్ని విశ్లేషించండి?
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అను పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్చే వ్రాయబడింది. ఇది మహిళలపై జరుగుతున్న గృహహింసలు, స్త్రీల వరకట్నపు చావులపై స్పందన. ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే కొత్త పెళ్ళికూతురు వరకట్న దురాచారానికి బలి అయింది. ఆ విషాద సంఘటనే ఈ పాటకు ప్రేరణ అయింది.

దేశంలో ఆడదాని కన్నా అడవిలో చెట్టుకు ఎక్కువ విలువనిస్తున్నారు. ఆడ పిల్లలకు పెళ్ళి చేయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. వరకట్న దురాచారం రోజు రోజుకు పెరిగిపోతుంది. కట్న పిశాచాలు జీవనం సాగిస్తున్న ఈ ‘నరకంలాంటి సంఘంలో రాక్షసత్వం రాజ్యమేలుతుంది. స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారుతున్నది. అడిగినంత కట్నం ఇవ్వలేదని, ఇచ్చినా లాంఛనాలు, అదనపు కట్నాలు ఆశించి అత్తింటివారు సాధింపులు పెడుతున్నారు. కొందరు దుర్భుద్ధితో. కట్నం కోసం ఇంటికి వచ్చిన నవవధువులను కడతేర్చి ఇంకో పెళ్ళికి సిద్ధం చేస్తున్నారు. అత్త ఒకింటి కోడలే నన్న జ్ఞానం లేకుండా ఆడపిల్లలతో ఆటలాడుకుంటున్నారు.
పిశాచాల వంటి అత్తమామల ఆనందం కోసం నవ వధువులు ఆత్మ బలిదానాలు చేయవలసివస్తుంది. స్త్రీల జీవననాదం ఆర్తనాదమయ్యింది. వారి కళ్ళలో నీరు సెలయేరులై పారుతున్నాయి. స్త్రీలంతా ఈ వరకట్న దురాచారంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయాలి. స్త్రీకి స్త్రీయే శత్రువు కాకూడదు. మంచి మనసుతో ఆలోచన చేసి నవ వధువుల ఆత్మహత్యలను
ఆపవలసి వుంది.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. పూర్వకాలంలో వేడుకలు, వినోదాలను గురించి వ్రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వముల నుండి గ్రహించబడినది. తెలుగు సంస్కృతిలో భాగాలైన వివిధ రకాల ఆటలు, వేడుకలను ఈ వ్యాసం ద్వారా యువతకు పరిచయం చేయటం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.

తెలుగు దేశాన పూర్వకాలంలో వేడుకలు వినోదాలు ఎలా ఉండేవో, పండుగలు పబ్బాలతో ఎలా కాలక్షేపం చేసేవారో తెలుసుకొనుటకు ఆధారాలు అంతగా దొరకవు. కాకపోతే మన ప్రబంధముల ద్వారా కొన్ని తెలుస్తున్నాయి. వాటిలో వసంతోత్సవం, శరదుత్సవం గొప్ప వేడుకలుగా వివరింపబడ్డాయి. వసంతోత్సవం వేయి సంవత్సరములకు పూర్వం నుండి ఉన్నప్పటికి రెడ్డి రాజుల కాలం నుండి మంచి ప్రాచుర్యం వచ్చింది. ఇక వసంతోత్సవం తరువాత చెప్పదగిన వేడుక శరదుత్సవం. దీనిని మహా లక్ష్మీపండుగలని, దేవీ నవరాత్రులని పిలిచేవారు. మన పండుగలు, వేడుకలు మత సంబంధమైనవే! గ్రామాలలోని దేవుని కళ్యాణం, గ్రామదేవతల జాతరలు దీనికి ఉదాహరణలు. మనకున్న పండుగలలో వసంతోత్సవం శరదుత్సవాలతోపాటుగా మకర సంక్రమణం (సంక్రాంతి) పండుగ కూడా ఒకటి. దీనిని ‘పెద్ద పండుగ’ అని పేరు… |

సంక్రాంతి పండుగ దినాలలో జరుపుకొనే వేడుకలలో కోడిపందెములు ఒకటి. కోడిపందాలు వేయి సంవత్సరములకు పూర్వం నుండి ఉన్నట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. పూర్వపు సంస్థానాధీశులకు కోడిపందాలు ఒక వేడుకగా ఉండేవి. పల్నాటి యుద్ధమునకు కారణం ఈ కోడి పందాలేనని చరిత్ర వలన తెలుస్తుంది. పూర్వ గ్రంథాలైన క్రీడాభిరామం, భోజరాజీయం మొదలగు గ్రంథాల వలన తెలుగు నేలపై వృషభపోరు, మేషయుద్ధము, దున్నపోతుల పోరు, గజయుద్ధము, పొట్టేళ్ళ పోరు మొదలగు ప్రజావినోదపు వేడుకలున్నట్లు తెలుస్తుంది. కుంతలదేశ రాజైన సోమేశ్వర భూపతి తాను రచించిన ‘అభిలషితార్థ చింతామణి’ అను మారు పేరుతో ఉన్న ‘మానసోల్లాసం’ అనే విజ్ఞానకోశంలో ఈ వినోదవర్ణలకు ఒక ప్రకరణాన్నే వ్రాశాడు. దానిలో మల్లయుద్ధము, గజయుద్ధము, అశ్వయుద్ధాలు, ఆబోతుల దున్నపోతుల పోరాటములు, పొట్టేళ్ళ, కోళ్ళ పోరాటాలను వర్ణించాడు. పూర్వకాలంలో ‘వేట’ కూడా ఒక క్రీడవేడుక వలె ఉండేది. దీనిలో పాదివేట, విడివేట, తెరవేట, దామెనవేట అని పలు రకములు ఉండేవి. పూర్వకాలమున ఈ వేడుకలు వినోదములు నేడు చాలా వరకు అంతరించిపోయాయి.

2. వేమన నీతులను వివరించండి ?
జవాబు:
వేమన కవిత్వము అను పాఠ్యభాగము ‘రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వేమనపై చేసిన ఉపన్యాసపరంపరలోని “వేమన కవిత్వము, హాస్యము, నీతులు అను ఏడవ ఉపన్యాసము నకు సంక్షిప్తరూపము.

వేమన కవిత్వం తెలుగు సాహిత్యంలోను, తెలుగు నేలపైన ఇంతకాలం నిలవడానికి ప్రజాదరణ పొందడానికి అసలు కారణం ఆయన బోధించిన నీతి. లోకములో ఇతరులకు, తనకు సౌఖ్యమును కలిగించేవి నీతులు. ఈ నీతులు రెండు రకాలు. ఒకటి స్వార్థములు, రెండు పరార్థములు. వేమన మంచి చెడులను రెండింటిని తాను చూసి అందులోని తత్త్వాన్ని తెలుసుకొని లోకానికి తెలియజేశాడు. కావుననే సామాన్య నీతి గ్రంథాలలో లేని తీవ్రత ఇతని పద్యాలలో కన్పిస్తుంది.

ధానమునకు తగినవాడెవరు అన్న అంశాన్ని చర్చిస్తూ కులము, జాతి, గుణము దానమును గ్రహించుట పరిగణలోనికి తీసుకోకూడదని పేదరికాన్ని మాత్రమే తీసుకోవాలన్న నీతిని వివరించాడు.

దోసకారియైన దూసరికాఁడైన
పగతుఁడైన వేదబాహ్యుఁడైన
వట్టిలేని పేదవాని కీఁదగు నీవి
ధనికునకు నొసంగఁదగదు వేమ

దాన విషయాన్ని చెప్తూ అన్ని దానములతో పాటు కన్యాదానమును కూడా చేయాలన్నాడు. అహింసను గూర్చి చెప్తూ ‘
“జీవి జీవిఁజంప శివుని జంపుటె యగు
జీవుఁడరసి తెలియ శివుఁడు కాఁడె”
అంటాడు. చంపదగిన శత్రువు తన చేత చిక్కి అతనికి కీడు చేయకుండా ఎంతో కొంత మేలు చేసి పంపించాలని వివరించాడు. శత్రుత్వము చావాల్సిందీ శత్రువు చావాలనుకోవటం నీతికాదంటాడు.
నీతిని చెప్పటం ఒక తీరు. వాటిని ఆచరించిన చెప్పటం మంచి తీరు. వేమన తానన్నింటిని ఆచరించి నీతి ప్రబోధాన్ని చేశాడు.
“ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి
వేళె పోవువాఁడు వెట్టివాఁడు
కుక్క తోఁక బట్టి గోదావరీఁదునా ?”
ఇలా ధర్మాన్ని, తత్వాన్ని, పరమత ఖండన మంచిది కాదని లోక సహజమైన నీతులను వేమన తన రచనల ద్వారా తెలియజేశాడు.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 5 = 10)

1. ‘గవేషణ’ నాటికలో మరణించిన వ్యక్తి ఆవేదనను తెల్పండి ?
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతని ఆత్మను వేరు చేసి న్యాయమూర్తికి అప్పగించాలని వెళుతుంటారు. మానవునికి మెలకువ వచ్చి తనని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు ? నేను చచ్చిపోలేదు బ్రతికే వున్నాను. నన్ను వదిలి పెట్టండి మా యింటికి వెళ్ళిపోతాను అని ఎంత అరిచినా భటులు మానవుని మాటలను పట్టించుకోరు. ఏది పుణ్యం ఏది పాపం అని ఆవేదనతో తనకు అన్యాయం జరుగుతోందని నరకం చూపిస్తున్నారని రోదిస్తాడు. బ్రతికుండగానే కాల్చేస్తున్నారని త్వరగా న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడతాడు. భూలోకంలో లాగానే మరో లోకంలో కూడా అన్యాయపు అధికారులున్నారని వాపోతాడు.

న్యాయమూర్తికి అప్పగించి మృత్యుదూతలు వెళ్ళిపోతారు. న్యాయమూర్తి ఎక్కడో పొరపాటు జరిగినట్లు గ్రహిస్తాడు. ఒక చిన్న ఉద్యోగి తప్పు లెక్క వల్ల యమదూతలు నిన్ను ఇక్కడకు తెచ్చారు. అనగానే మానవుడు తాను బ్రతికున్నట్లా? చచ్చినట్లా? అని తన ఆవేదనను నందేహాన్ని అడుగుతాడు. జరిగిన పొరపాటుకు క్షమించమని నీకు ఇంకా 5 సంవత్సరాల ఆయుష్షు ఉందని భూలోకానికి పంపించాడు న్యాయమూర్తి. బ్రతుకు జీవుడా అనుకొని తిరిగి భూలోకానికి చేరిన మానవునికి శరీరం లేదు. బంధువులు దహనం చేశారు. శరీరం లేని ఈ ఆత్మతో ఎలా బ్రతకాలి అని శోకించాడు మానవుడు. తిరిగి మరో ప్రపంచం చేరి ధర్మదేవతకు తన బాధను వివరించాడు.

ధర్మదేవత మానవుని అవస్థకు జాలిపడింది. కాని జన్మరాహిత్యాన్ని గాని, సృష్టించే శక్తి గాని తనకు లేవని ఏదో ఒక శరీరంలో ప్రవేశించి నూతన జీవితాన్ని ప్రారంభించమని చెప్పింది. దేవతల వల్ల జరిగిన తప్పుకి మానవుణ్ణి క్షమాపణ కోరి పూర్ణ. ఆయుర్ధాయాన్ని వరంగా ఇస్తుంది. ఇంతలో భూలోకంలో అప్పుడే వైద్యశాలలో మృతశిశువును ఒక అమ్మాయి ప్రసవించింది. తన జీవితం కానిది ఏది అయితే నేమి ఏదో ఒక బ్రతకు తప్పదని ఆ శిశువు శరీరాన్ని చేరింది ఆ ఆత్మ. అంతవరకు మృత శిశువుని చూసి దుఃఖించిన తల్లి ఆనందించింది. ఎవరో చేసిన పొరపాటుకు ఈ మానవుడు తనదైన జీవితం లేక నూతన జీవితాన్ని ప్రారంభించాడు.

2. ‘తెరచిన కళ్ళు’ నాటికలో రచయిత అందించిన సందేశాన్ని వివరించండి ?
జవాబు:
‘తెరచిన కళ్ళు’ నాటిక విద్య, జ్ఞానం వంటి విషయాలను తెలియజేసే రచన. అందరి కళ్ళను తెరిపించే రచన, విద్య, జ్ఞానం బంగారంతో సమానము. మెరుగుపెట్టే కొద్దీ వాటి ప్రకాశం, కాంతి అధికమౌతుంది. పదిమందికి పంచిపెట్టాల్సిన జ్ఞానం, విద్య దాచుకోకూడదు. సమయానికి అవి పంచలేకపోతే కళావిహీనం అవుతాయి. ఈ సత్యాన్ని రచయిత ఈ నాటిక ద్వారా చక్కని సందేశాన్ని ఇచ్చారు.

విద్యారంగంలో నేడు కార్పొరేటీకరణ అధికమయిపోయి వికసించవలసిన విద్యార్థి మనసు కుంచించుకుపోతోంది. స్వార్థచింతన పెరిగిపోతూ ఉంది. నేటి బాలలే రేపటి పౌరులన్నట్లు నేటి విద్యార్థులే భావితరాలకు పట్టుగొమ్మలు. అటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మానవీయ విలువలు కలిగి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలన్న సందేశాన్ని అందించారు ఆత్రేయ.

ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సుదర్శన్ ఎంతో పేరు ప్రసిద్ధి పొందినవాడు. తన వద్దకు వచ్చిన ఎంతోమందికి చూపును ప్రసాదించిన ప్రత్యక్ష దైవం. తన దగ్గర పనిచేస్తూ ఎంతో సహకారాన్ని అందించిన వ్యక్తి సత్యం. అసిస్టెంట్ డాక్టర్. సత్యం డాక్టర్ సుదర్శన్ తో తనకు వైద్యంలో మెళకువలు, నైపుణ్యాన్ని నేర్పమని ఎంతగానో ప్రాధేయ పడతాడు. డాక్టర్ సుదర్శన్ అందులకు అంగీకరించడు. తన విద్య తన వారసులకే అందాలనుకుంటాడు. ఎన్నిసార్లు అడిగినా విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడు. ఈ విద్య నేర్పితే వచ్చేది కాదని స్వయం ప్రతిభ ఉండాలని ఉద్దేశపడతాడు. ఈ విద్యను మీతోనే అంతరించకుండా చూడమని బాధపడతాడు. ” ఇంతలో డాక్టర్ భార్య తల్లి కాబోతున్నట్లు తెలుసుకొని ఆనందపడతాడు. ఇంతలో జయపురం రాజావారికి ఆపరేషన్ అని ప్రయాణమౌతాడు. రైలులో ప్రమాదవశాత్తు

భూలోకానికి చేరిన మానవునికి శరీరం లేదు. బంధువులు దహనం చేశారు. శరీరం లేని ఈ ఆత్మతో ఎలా బ్రతకాలి అని శోకించాడు మానవుడు. తిరిగి మరో ప్రపంచం చేరి ధర్మదేవతకు తన బాధను వివరించాడు. ధర్మదేవత మానవుని అవస్థకు జాలిపడింది. కాని జన్మరాహిత్యాన్ని గాని, సృష్టించే శక్తి గాని తనకు లేవని ఏదో ఒక శరీరంలో ప్రవేశించి నూతన జీవితాన్ని ప్రారంభించమని చెప్పింది. దేవతల వల్ల జరిగిన తప్పుకి మానవుణ్ణి క్షమాపణ కోరి పూర్ణ . ఆయుర్ధాయాన్ని వరంగా ఇస్తుంది. ఇంతలో భూలోకంలో అప్పుడే వైద్యశాలలో మృతశిశువును ఒక అమ్మాయి ప్రసవించింది. తన జీవితం కానిది ఏది అయితే నేమి ఏదో ఒక బ్రతకు తప్పదని ఆ శిశువు శరీరాన్ని చేరింది ఆ ఆత్మ. అంతవరకు మృత శిశువుని చూసి దుఃఖించిన తల్లి ఆనందించింది. ఎవరో చేసిన పొరపాటుకు ఈ మానవుడు తనదైన జీవితం లేక నూతన జీవితాన్ని ప్రారంభించాడు.

2. ‘తెరచిన కళ్ళు’ నాటికలో రచయిత అందించిన సందేశాన్ని వివరించండి ?
జవాబు:
‘తెరచిన కళ్ళు’ నాటిక విద్య, జ్ఞానం వంటి విషయాలను తెలియజేసే రచన. అందరి కళ్ళను తెరిపించే రచన, విద్య, జ్ఞానం బంగారంతో సమానము. మెరుగుపెట్టే కొద్దీ వాటి ప్రకాశం, కాంతి అధికమౌతుంది. పదిమందికి పంచిపెట్టాల్సిన జ్ఞానం, విద్య దాచుకోకూడదు. సమయానికి అవి పంచలేకపోతే కళావిహీనం అవుతాయి. ఈ సత్యాన్ని రచయిత ఈ నాటిక ద్వారా చక్కని సందేశాన్ని ఇచ్చారు.

విద్యారంగంలో నేడు కార్పొరేటీకరణ అధికమయిపోయి వికసించవలసిన విద్యార్థి మనసు కుంచించుకుపోతోంది. స్వార్థచింతన పెరిగిపోతూ ఉంది. నేటి బాలలే రేపటి పౌరులన్నట్లు నేటి విద్యార్థులే భావితరాలకు పట్టుగొమ్మలు. అటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మానవీయ విలువలు కలిగి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలన్న సందేశాన్ని అందించారు ఆత్రేయ.

ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సుదర్శన్ ఎంతో పేరు ప్రసిద్ధి పొందినవాడు. తన వద్దకు వచ్చిన ఎంతోమందికి చూపును ప్రసాదించిన ప్రత్యక్ష దైవం. తన దగ్గర పనిచేస్తూ ఎంతో సహకారాన్ని అందించిన వ్యక్తి సత్యం. అసిస్టెంట్ డాక్టర్. సత్యం డాక్టర్ సుదర్శన్తో తనకు వైద్యంలో మెళకువలు, నైపుణ్యాన్ని నేర్పమని ఎంతగానో ప్రాధేయ పడతాడు. డాక్టర్ సుదర్శన్ అందులకు అంగీకరించడు. తన విద్య తన వారసులకే అందాలనుకుంటాడు. ఎన్నిసార్లు అడిగినా విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడు. ఈ విద్య నేర్పితే వచ్చేది కాదని స్వయం ప్రతిభ ఉండాలని ఉద్దేశపడతాడు. ఈ విద్యను మీతోనే అంతరించకుండా చూడమని బాధపడతాడు. ‘ ఇంతలో డాక్టర్ భార్య తల్లి కాబోతున్నట్లు తెలుసుకొని ఆనందపడతాడు. ఇంతలో జయపురం రాజావారికి ఆపరేషన్ అని ప్రయాణమౌతాడు. రైలులో ప్రమాదవశాత్తు

నిప్పురవ్వలు పడి కళ్ళు పోతాయి డాక్టర్ సుదర్శన్క. విద్యంతా నా సొత్తే అని విర్రవీగాను. అహంకారం, అహంభావంతో కళ్ళుండీ గుడ్డివాడినయ్యాను. ఇప్పుడు కళ్ళులేని ఈ జీవితాన్ని ఎలా జీవించాలో అని దుఃఖిస్తాడు.

చీకట్లో ఉన్నవారికి చూపునిచ్చిన డాక్టర్కి ఇలా జరిగిందని తెలుసుకుని అందరూ వచ్చి తమ కళ్ళను ఇచ్చి తిరిగి చూపును పొందమని అంటారు. దానికి ప్రతిగా డాక్టర్ ఇదంతా నా స్వయం కృతం. విద్యను దాచాను. ఇతరులకు ఇవ్వటానికి నిరాకరించాను. ఫలితం అనుభవిస్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా ప్రాధేయపడిన సత్యానికి విద్య నేర్పి ఉంటే నాకీ అవస్థ వచ్చేది కాదని తన అజ్ఞానానికి క్షమించమంటాడు డాక్టర్.

భయపడకండి డాక్టర్ గారు భగవంతుడున్నాడని తానే డాక్టర్కి ఆపరేషన్ చేస్తానని అంటాడు. సరేనంటాడు డాక్టర్. కట్లు విప్పుతూ ఆశీర్వదించమంటాడు. చూపు వచ్చిన తరువాత డాక్టర్ సత్యాన్ని అభినంధించి ఎలా నేర్చుకున్నావని అడుగుతాడు సుదర్శన్. తాను ముందుగా డాక్టర్ గారిని క్షమాపణ అడిగి తాను ఎలా నేర్చుకున్నాడో వివరిస్తాడు. మిమ్మల్ని మోసం చేసి మీకు తెలియకుండా నేర్చుకున్నందుకు మన్నించమంటాడు. డాక్టర్ సత్యం లాంటి వాళ్ళుంటే ప్రజాసేవకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని మెచ్చుకుంటాడు సుదర్శన్. కళ్ళతో పాటు తనకు మనోనేత్రాన్ని తెరిపించావని సత్యాన్ని ఆశీర్వదిస్తాడు సుదర్శన్.

3. ‘ఆశ ఖరీదు అణా’ కృష్ణవేణి పాత్ర స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
కృష్ణవేణి ఈ నాటికలో మధ్యతరగతి అమ్మాయి. ఇంటిని పోషించడం కోసం ఉద్యోగం చేస్తుంటుంది. తల్లి, అన్నయ్యలను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది. తెల్లారి లేస్తూనే ఇంట్లో చాకిరీ, తరువాత ఆఫీసులో పని, తిరగి ఇంటికి వచ్చాక వంట మొదలైన పనులతో నిరంతరం విసుగు లేకుండా పనిచేస్తూ ఉంటుంది.
ధైర్య సాహసాలు గల వ్యక్తిగా కనబడినా. ఎక్కడో ఆడపిల్లనని గుర్తుచేసే సందర్భాల వల్ల కొంత బెరుకుతనం గల స్త్రీమూర్తి.

మేడమీద అద్దెకు దిగిన వ్యక్తి మీరేనా అంటూ పరిచయం చేసుకుంటుంది. గోడకు మేకులు కొట్టి మాకు నిద్రాభంగం కలిగించారని నిర్మొహమాటంగా చెప్తుంది. ఇంటిగలాయన మేకులు కొడితే ఊరుకోడు. బంగారు గోడలు పాడయిపోతాయని బాధ పడతాడని అంటుంది. చల్లగాలికి ఆహ్లాదంగా సినిమాకు వెళ్ళితే బాగుంటుందని మనసులో మాట బయటకే అనేస్తుంది.. పాటలంటే మీకు ఇష్టమా ? అయితే మా ఇందిర బాగా పాడుతుందని యువకునితో అంటుంది. గల్లీలో ఎవరో పోయిన సందర్భంలో శవాలంటే భయం అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పేరు అడగలేదని యువకుడు అనుకుంటూ అంత ధైర్యంలోనూ పిరికితనం ఇదే మానవ నైజం అని అనుకుంటాడు.

పై గదిలో అద్దెకు వచ్చిన అబ్బాయి పేరేమిటని అన్నయ్యను అడుగుతుంది. అందుకు అన్నయ్య విసుక్కుంటాడు. పనిపాట లేక వాళ్ళ పేరేమిటి ? వీళ్ళ పేరేమిటి అని ఇటువంటి ఆలోచనలు ఎందుకు. తనకే గనక ఉద్యోగం దొరికితే ముందు చెల్లెల్ని ఉద్యోగం మానిపించేస్తానని అంటాడు. అందుకు చాలా బాధపడుతుంది. నా ఉద్యోగం మానిపించేంత వరకు నీకు మనశ్శాంతి ఉండదా ? ఏం మనుషులో ఏ మాత్రం సంతృప్తిగా ఉన్నా సహించలేరు. అదంతా అభిమానమేననుకుంటారు. అంత ప్రేమలేక పోయినా కాస్త సుఖపడేదాన్ని అని బాధపడుతుంది కృష్ణవేణి. నిద్రపట్టక కృష్ణవేణి ఇందిర, ఆనందలక్ష్మిల ఇంటికి వస్తుంది. ఇంత రాత్రివేళ వచ్చావేంటి అంటుంది ఇందిర. పగలంతా ఆఫీసులో పని. ఇంట్లో మళ్ళీ వండి వార్చినా నీకు నిద్ర రాకపోవటం ఏమిటి అని లక్ష్మీ అడుగుతుంది.

మా అన్నయ్య రెండు వందల ఏళ్ళ క్రిందట పుట్టవలసినవాడు. వాడికి ఉద్యోగం దొరకటం లేదన్న కసితో నా ఉద్యోగాన్ని మానిపించేయాలని అంటూ ఉంటాడు. నా జీతం మీద ప్రేమే మళ్ళీ. ఎంత అభిమానంగా చేసినా ఈ మాటలు పడలేకపోతున్నాను. ఎంతకాలం మాటలు పడను చెప్పు. ఎవరి కోసం, ఎందుకోసం ఈ త్యాగం అని స్నేహితురాళ్ళతో తన బాధనంతటినీ చెప్పుకుంటుంది. జీవితంపై విరక్తిని పెంచుకొని నిరాశలో బ్రతుకుతుంది. చివరకు తాతగారి ఉపదేశం వల్ల మళ్లీ కొత్త ఆశలతో ధైర్యంగా తన పని ఏదో తాను చేసుకోగలుగుతుంది కృష్ణవేణి.

4. ‘గవేషణ’ నాటికలో న్యాయమూర్తికి, మరణించిన వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణను తెలుపండి ?
జవాబు:
మరణించిన మానవుని ఆత్మను మరో ప్రపంచపు న్యాయస్థానానికి చేర్చారు మృత్యు దూతలు. అక్కడ రక్షకభటులు ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి సమక్షంలో హాజరు పరిచారు ఆ మానవుణ్ణి. న్యాయమూర్తి వయస్సులేని, నేత్రాలు లేని ఒక స్త్రీ మూర్తి. ఎదురుగా ఉన్న మానవున్ని ఉద్దేశించి “నాకు కళ్ళు లేవు అయినా చూడగలను. భూలోకంలో నీకింకా ఐదు సంవత్సరాల ఆయుర్ధాయం ఉంది. మా కార్యాలయంలో ఉన్న చిన్న ఉద్యోగి తప్పు లెక్కవల్ల మృత్యుదూతలు నిన్ను ఇక్కడకు తెచ్చారు” అని అనగా “మీరు ధర్మప్రభువులు దేవతల పొరపాటువల్ల మానవులు బాధ పడుతున్నారు నేను బ్రతికున్నట్టా ? చనిపోయినట్టా ? ఈ సందేహం నన్ను బాధిస్తోంది” అని మానవుడు ప్రశ్నించాడు. “మృత్యురాజ్యపు చట్ట ప్రకారం నీవు మృతి చెందావు. కనుకనే మా మృత్యుదూతలు నీ శరీరం నుండి ఆత్మను తొలగించారు. నీ కాగితాలు- తెప్పించి పై అధికారులతో నీ విషయమై వాదించాను. ఇక్కడ వ్యవస్థలో ఏదో : పొరపాటు జరిగిందనే అందరూ అనుకుంటున్నారు. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయదలిచాను. నువ్వింక భూలోకానికి వెళ్ళిపోవచ్చు. జరిగిన పొరపాటుకు సిగ్గు పడుతున్నాను” అని న్యాయమూర్తి అన్నాడు. భగవంతుడు కూడా నీకు జరిగిన అన్యాయానికి బాధపడుతూ ఉంటాడని అన్నాడు న్యాయమూర్తి. మీరు ధర్మదేవతను చూడలేదా అన్నాడు మానవుడు. భగవంతుడు కూడా ధర్మానికి అతీతుడు అయినా ఈ చర్చ అవసరం అని న్యాయమూర్తి సభ చాలించాడు.

పల్లెటూల్లో మానవుని ఆత్మను దిగవిడిచారు మృత్యుదూతలు. తన శరీరం కనిపించక ఆ మానవుని ఆత్మ అల్లాడిపోయింది. తిరిగి మరో ప్రపంచంలో తన శరీరం గురించి అడగడానికి నిశ్చయించుకుంది ఆత్మ. మరో ప్రపంచపు గోడల దగ్గర తచ్చాడుతున్న ఆత్మను అక్కడ ఒక భటుడు చూస్తాడు. ఆ ఆత్మ వివరాలడిగి సాయం చేయదలచి న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళతాడు. తిరిగి ఎందుకొచ్చావని న్యాయమూర్తి మానవుని ఆత్మను ప్రశ్నించాడు. ధర్మదేవత నా జీవితం ప్రసాదించినా నా శరీరాన్ని నా బంధువులు దహనం చేశారు. ఏ చెట్టు కొమ్మనో పట్టుకొని వేలాడలేను. నిన్న రాత్రంతా చాలా యాతనపడ్డాను. గబ్బిలం శరీరంలో ప్రవేశించాను. కాని గబ్బిలం బ్రతుకు దుర్భరం అనిపించింది. ఒక కప్పలో ప్రవేశించాను కాని బావిలో కప్ప జీవితం ఉక్కిరిబిక్కిరి అనిపించింది. మీరిచ్చిన ఐదేళ్ళు మీరే తీసుకోండి అని మానవుడు న్యాయదేవతకు విన్నవించుకున్నాడు. కొత్త జీవితం ప్రారంభిస్తావా ? అని అడిగాడు న్యాయమూర్తి తిరిగి భూలోకానికి ప్రయాణమయ్యాడు.

మృత్యుదూతలు తిరిగి మానవుణ్ణి పల్లెటూరికి తీసుకొనివెళ్ళారు. కాని అప్పటికే బంధువులు అతని శరీరాన్ని దహనం చేశారు. ఇంకా ఐదు సంవత్సరాలు ఆత్మకి శరీరం లేకుండా ఎలా జీవించాలో అర్థం కాలేదు. మళ్ళీ ధర్మదేవత దర్శనం అయితే బాగుండుననిపించింది. కాని ఈ లోకంలో ఉన్నతాధికారుల దర్శనం కావాలంటే ఎన్నెన్నో తిప్పలు పడాలి. ఇంక ఆ లోకంలో అధికారుల దర్శనం అంటే మాటలా ? ఇదేమిటీ ఉపద్రవం ? అని బాధపడ్డాడు మానవుడు. అయినా ఎక్కడో ఎవరో చేసిన పొరపాటుకి తానెందుకు బాధపడాలి ? మరల తన శరీరాన్ని తిరిగి ఇప్పించమని న్యాయమూర్తికి ఫిర్యాదు చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. జీవన్మరణాల మధ్య అల్లాడుతున్న ఆత్మగా మిగిలిపోయానే అని దుఃఖిస్తూ మరో ప్రపంచం దగ్గరకు చేరుకుంది ఆత్మ. ఆ మానవుని దీనావస్థతో న్యాయమూర్తీ అన్న పిలుపుకి ఒక వ్యక్తి నవ్వు వినబడింది. ఆ నవ్విన వ్యక్తి ఎవరవయ్యా నీవు అనగా ఇంకా 5 ఏళ్ళు ఆయుర్ధాయం ఉన్న ఆత్మను అని సమాధానం ఇచ్చాడు మానవుడు. సరే నీకేం సాయం కావాలి అన్నాడు నవ్విన వ్యక్తి. న్యాయమూర్తి చేసేది లేక మానవునికి పూర్ణ ఆయుష్షుని ఇచ్చాడు.

ఐదేళ్ళ కాలపరిమితిని తొలగిస్తూ నీ ఇష్టం వచ్చిన శరీరంలో ప్రవేశించి బ్రతక మంటాడు న్యాయమూర్తి. ‘నన్ను జన్మదుఃఖపు చెర విడిపించండి అని వేడుకుంటాడు మానవుడు. తనకు జన్మరాహిత్యం గాని సృష్టించడంగాని తెలియవని అశక్తుడనని అంటాడు దేవతలే తమ అశక్తతను మానవుని దగ్గర తెలియజేస్తుంటే ఏమనాలో అర్థం కాలేదు మానవునికి జరిగిందేదో జరిగింది

ఏదో ఒక బ్రతుకు, ఎలాగో ఒక లాగా బ్రతుకుతాను భూలోకానికి వెళ్ళిపోతాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వస్తాను. నేను మీ చేతిలో ఆటవస్తువును. మీరు మరొకరిచేతిలో ఆటవస్తువులు. ఇది అంతం లేనిది అంటాడు మానవుడు. ఇదే సృష్టి రహస్యం అని తెలియజేస్తాడు. న్యాయమూర్తి

దేవతల్లోను మానవులపైనా నాకు నమ్మకం పోతోందని మానవుడంటే దేవతలపై నమ్మకం లేకపోయినా మానవులపై, మానవత్వంపై విశ్వాసం సడలనీయకు అని న్యాయమూర్తి అంటూ జరిగిన మా పొరపాటుకు క్షమించమని మానవుణ్ణి కోరుకుంటాడు. ఇక భూలోకంలో ఒక స్త్రీ అప్పుడే ప్రసవించిన శిశువును చూపిస్తాడు. ఆ మృతశిశువు శరీరంలో ప్రవేశిస్తాడు మానవుడు. అంతవరకు ఆరాటపడ్డ డాక్టర్లు, చనిపోయిన శిశువుని చూసి బోరుమన్న తల్లి తిరిగి శిశువు క్యారుమనడంతో ఆనందిస్తారు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. పోరు మంచిది కాదు భూమినెక్కడను.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు యుద్ధం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నలగామరాజుతో భట్టు పలికిన సందర్భంలోనివి.
భావము : ఈ భూమిమీద ఎక్కడైనా సరే యుద్ధం మంచిది కాదు అని భావం.
వ్యాఖ్య : ‘ఓ రాజా ! అన్నదమ్ములైన మీరిరువురూ కలిసిమెలసి ఉంటే రాజ్యానికి ఎంతో లాభం. కనుక స్నేహం కోసం నీ తమ్ముడైన మలిదేవరాజు దగ్గరకు నీకు ఉంతో నమ్మకస్తుడైన నరసింగరాజును పంపించు. ఈ భూమిమీద ఎక్కడైనా సరే కలహం ఎప్పటికీ మంచిది కాదు అని రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో అన్నాడు.

2. రాజునేలే దైవముండదొ ?
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన ‘ముత్యాల సరాలు’ అనే కవితా సంపుటి నుంచి గ్రహించిన ‘కన్యక’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు గుడిలో అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు సందేశం ‘ ఇస్తూ కన్యక పలికిన సందర్భంలోవి.
భావం : పట్టణాన్ని ఏలడానికి రాజు ఉంటే ఆ రాజును ఏలడానికి దైవం ఉండడా ? అని భావం.
వ్యాఖ్య : కన్యక గుడిలో అమ్మవారిని పూజించింది. అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు హితబోధ చేసింది. అన్నలారా! తండ్రులారా ! ఒక్కమాట వినండి. ప్రజలకు తమ భార్యాబిడ్డలను కాపాడుకొనే ఆశ లేదా ? పట్టణాన్ని పాలించడానికి రాజు ఉంటే ఆ రాజును పాలించడానికి దైవం ఉండడా ? అని కన్యక పలికింది.

3. నేడు నేను నా స్థాయి కోసం వస్తువులు కొంటున్నాను.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము డా॥ అద్దేపల్లి రామమోహనరావుగారిచే రచించబడిన “పొగచూరిన ఆకాశం” అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ దారి ఎక్కడికి. పోతుంది అను పాఠ్యభాగంలోనిది.
సందర్భం : నేటి సమాజంలో మనుషులు తోటి మనిషిని గౌరవించటం మాని వస్తువులను గౌరవిస్తున్నారు. పూర్వం అవసరాల కోసం వస్తువులను కొనేవారు ఇప్పుడు గొప్పతనం చూపించటానికి వస్తువులు కొంటున్నారని కవి ఆవేదనను వెల్లడించిన సందర్భంలోనిది.
భావము : ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యాపారం తుఫానులా వ్యాపిస్తుంది. మనుషులు అవసరం ఉన్నా లేకపోయినా డాబు కోసం, దర్జా కోసం సాటిమనిషికి గౌరవం ఇవ్వటం మాని వస్తువులకు గౌరవం ఇస్తున్నారని ఇది చాలా బాధాకరమైన విషయమని ఇందలి భావం.

4. కోకిల మేధం సాగుతున్నది.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము ‘కలేకూరి ప్రసాద్’ రచించిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అను గేయం నుండి గ్రహించబడింది.
సందర్భము :- అత్తింటివారు కట్నం కోసం ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘ఇందిర’ అనే నవవధువును హత్య చేశారు. ఆ విషయాన్ని గురించి తెలుసుకున్న కవి ఈ గేయం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భంలోనిది.
భావము : ఆడదానికంటే అడవిలో మానుకే విలువనిస్తున్న సమాజం మనది. కట్నం కోసం కోడలి బ్రతుకును నాశనం చేసిన అత్తమామలు రాక్షసులా? పిశాచాలా? ఆకలి తీర్చుకోవటానికి లేళ్ళను చంపే పులులున్న ఈ దేశంలో, కట్నం కోసం కోకిలల వంటి కోడళ్ళను పొట్టన పెట్టుకుంటున్నారని ఇందలి భావం.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. పురుషుని కార్యాలు ఎప్పుడు చూసేవి ఏవి ?
జవాబు:
ఋక్, యజుర్, సామ, అధర్వణ అనే వేదాలు; నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలు; ధర్మం; ఉదయం, సాయంత్రం అనే రెండు సంధ్యలూ; హృదయం; యముడు; చంద్రుడు; సూర్యుడూ; రాత్రీ, పగలూ అనే మహాపదార్థాలు పురుషుని కార్యాలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాయి.

2. శ్రీనాథుని గురించి వ్రాయండి ?
జవాబు:
15వ శతాబ్దంలో జీవించిన శ్రీనాథుడు కొండవీడును పరిపాలించిన రెడ్డిరాజుల ఆస్థానకవి, విద్యాధికారి. శ్రీనాథుని తల్లి భీమాంబిక, తండ్రి మారయ. ‘కవి సార్వభౌముడు’ గా ప్రసిద్ధుడైన శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో పురాణయుగానికీ ప్రబంధయుగానికీ వారధిగా నిలచిన మహాకవి.

శ్రీనాథుడు సకల శాస్త్రాలలో పండితుడు. కవితా సృష్టిలో బ్రహ్మవరం పొందినవాడు. నిత్యం పరమేశ్వరుణ్ణి పూజించే పరమభక్తుడు. పిన్న వయసులోనే ‘మరుత్తరాట్చరిత్ర’ అనే కావ్యాన్ని రచించాడు. ఇంకా శ్రీనాథుడు రచించిన శాలివాహన సప్తశతి, శృంగార నైషథం, కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీరచరిత్ర అనే కావ్యాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి..

శ్రీనాథుడు విజయనగర సామ్రాజ్యంలో ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును వాదంలో ఓడించాడు. అతని కంచుఢక్కను పగులగొట్టించాడు. అక్కడి ముత్యాల శాలలో కనకాభిషేక గౌరవం పొందాడు.
ఎంతో వైభవంగా జీవించిన శ్రీనాథుడు చివరి దశలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆదరించే ‘ రాజులు లేకపోవటంతో వేరే దారి లేక వ్యవసాయం చేశాడు. కృష్ణాతీరంలోని బొడ్డుపల్లె అనే గ్రామంలో పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయాడు. శిస్తు కూడా చెల్లించలేక అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.

తెలుగుజాతి శౌర్యపరాక్రమాల చరిత్రను అజరామరంగా నిలబెట్టాలనే సంకల్పంతో శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను దేశీయమైన మంజరీ ద్విపద చంధస్సులో రచించాడు. ఈ కావ్యాన్ని మాచర్లలో కొలువై ఉన్న చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు.

3. కలేకూరి ప్రసాద్ స్త్రీలలో ఆశించిన చైతన్యం ఏమిటి?’
జవాబు:
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! అను పాఠ్యభాగము కలేకూరి ప్రసాద్ రచించబడింది. ఇది స్త్రీలపై జరుగుతున్న వరకట్న దురాచారం కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలపై స్పందన.
ఈ దేశంలో స్త్రీ జాతికన్నా అడవిలో పుట్టిన చెట్టుకే విలువ ఎక్కువ. స్త్రీకి స్త్రీయే శత్రువు అవుతుంది. స్త్రీలలో నవచైతన్యం రావాలి. కట్నకానుకల కోసం పీడించే ఈ సమాజాన్ని స్త్రీలే మార్చుకోవాలి. స్త్రీ, పురుష వివక్షత లేకుండా అందరూ సమానమనే భావన రావాలి. ఇంటికి వచ్చిన నవవధువును మాటలతో, చేతలతో వేధించే ఆడపడుచులు తమకు కూడా అత్తవారింట్లో ఇలాంటి పరిస్థితే ఎదురౌతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోడలి బ్రతుకులో నిప్పులు పోసే అత్తగారు తన కూతురికి కూడా అత్తవారింట్లో ఇలాంటి బాధలే కలుగుతాయేమో నన్న ఆలోచన రావాలి. స్త్రీ జాతి అంతా తమని తాము సంస్కరించుకోవాలి. నవవధువులను అత్తమామలు, ఆడపడుచులు రాక్షసుల వలే పీడిస్తున్నారని, ఈ దుస్థితి బావితరాలకుండకూడదని, స్త్రీ జాతి ఏకమై తమకు తాము చేసుకుంటున్న ద్రోహాన్ని ఎదిరించాలని కలేకూరి ప్రసాద్ ఆశించాడు.

4. గురజాడ రచనలను పేర్కొనండి
జవాబు:
ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడగా నిలిచిన గురజాడ అనేక రచనలు చేశారు. భావకవిత్వం ఒరవడిలో మాటల మబ్బులు, పుష్పలావికలు, మెరుపులు అనే ఖండకావ్యాలను, రచించాడు. అంతేకాక సుభద్ర అనే అసంపూర్ణ కావ్యాన్ని కూడా రచించారు. ఇంకా ఋతుశతకం, నీలగిరి పాటలు రచించారు. కన్యాశుల్కం, బిల్హణీయం, కొండుభట్టీయం అనేవి గురజాడ రచించిన నాటకాలు. వీటిలో ‘కన్యాశుల్కం’ ఎంతో ప్రసిద్ధి చెందినది. మీ పేరేమిటి ? మెటిల్డా, పెద్ద . మసీదు, సంస్కర్త హృదయం అనేవి గురజాడ కథానికలు. ఆధునికతను సంతరించుకొన్న కథానికగా గురజాడ ‘దిద్దుబాటు’కు గొప్ప గుర్తింపు ఉంది.

కర్ణాటక భాషలోని ఒక షట్పది, పారసీ భాషలోని ఒక గజల్, వృషభగతి రగడ మొదలైనవి గురజాడలో ఒక కొత్త లయకు స్ఫూర్తినిచ్చాయి. ఫలితంగా ముత్యాల సరాలు అనే మాత్రాఛందస్సులో, కొత్త పాటల మేలు కలయికతో ‘ముత్యాలసరాలు’ కావ్యాన్ని కూర్చాడు. ముత్యాల సరాల సంపుటిలో దేశభక్తి, ముత్యాలసరాలు, కాసులు, లవణరాజు కల, పూర్ణమ్మ, కన్యక, మనిషి, దేశభక్తి వంటి ప్రసిద్ధ గేయ ఖండికలు ఉన్నాయి.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. గెలుపెద్దుల మాన్యమును గురించి వ్రాయండి ?
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వ సంపుటం నుండి గ్రహించబడింది.
తెలుగుదేశం వ్యవసాయం ప్రధానవృత్తిగా అనుసరించటం వలన ప్రజల జీవనం పాడిపంటలపై, పశుసంపదపై ఆధారపడింది. వ్యవసాయమునకు బలిష్ఠమైన ఎద్దుల అవసరం ఉన్నది. అందుకు మేలుజాతి ఎద్దులను తయారుచేయుటకు గ్రామస్థులు ఒక మాన్యమును ఏర్పాటు చేసుకునేవారు. దీనినే గెలుపెద్దుల మాన్యం అంటారు. కనుమపండుగనాడు పశు ప్రదర్శన ఎడ్ల పందెములు జరిగేవి. ఆ పందెములో ఎవరి ఎద్దు గెలుస్తుందో ఈ గెలుపెద్దుల మాన్యం ఆ ఏడాది ఆయన ఆధీనంలో ఉంటుంది. ఇది ఈనాటి ‘రోలింగ్ కప్’ వంటిది. అలా అని అన్ని గ్రామాలలోనూ గెలుపెద్దుల మాన్యాలుండవు. కనుమనాడు పశువులతో వేడుకలను జరుపుకొనుట మాత్రం ప్రతి గ్రామంలో ఉండేవి.

2. వేములవాడ భీమ కవిని గురించి తెల్పండి ?
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి. నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి. నారాయణ. రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.
చాటుపద్యాలు చెప్పిన ప్రాచీనాంధ్ర కవులలో భీమకవి ఒకరు. వేములవాడ భీమకవి తెలుగు సాహిత్యంలో కేవలం చాటువుల వలననే ఇప్పటికీ బతికి ఉన్నాడు. ఇతడి పేర -చలామణిలో ఉన్న చాటువులలో ఒక్కొక్కటి ఒక్కొక్క చారిత్రక వృత్తానికి ఒక గుప్త సత్యానికి నిదర్శనంగా నిలుస్తాయి.

“గడియ లోపల తాడి గడగి ……… వేములవాడ భీమకవిని అన్న పద్యంలో తిట్టుకవుల పట్టిక ఉంది. మేధావి భట్టు, కవి మల్లుడు, కవి భానుడు, బడబాగ్ని భట్టు ఈ నలుగురూ ఒకరిని మించిన వారింకొకరు. భీమకవి ఇతర చాటువులలో పేర్కొన్న సాగి పోతరాజు, మైలమ భీముడు, కళింగ గంగు లాంటి వ్యక్తులు కూడా చారిత్రక పరిశోధనాంశాలుగా మిగిల్చాడు.

3. వేమన తెలిపిన దానగుణాన్ని వివరించండి ?
జవాబు:
వేమన కవిత్వము’ అను పాఠ్యభాగము ‘రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ’ వేమనపై చేసిన ఉపన్యాస పరంపరలోని “వేమన కవిత్వము, హాస్యము, నీతులు అను ఏడవ ఉపన్యాసమునకు సంక్షిప్తరూపము.
దాన విషయంలో వేమనది స్పష్టమైన ఆలోచన. ఎవడు దానమును పుచ్చుకొనుటకు తగినవాడు అనిన పేదరికంతో ఉన్నవాడు దానమును స్వీకరించుటకు అర్హుడు అని అన్నాడు. అతడి కులము, జాతి, గుణములను కూడా ఆలోచించనవసరం లేదంటాడు. పేదరిక మొక్కటి ఉంటే చాలంటాడు.
“దోసకారియైన దూసరికాఁడైన
పగతుఁడైన వేదబాహ్యుఁడైన
వట్టిలేని పేదవాని ‘కీఁదగు నీవి
ధనికునకు నొసంగఁదగదు వేమ”
పేదయైనవాడు దోషము చేసిన వాడైనా, తిరస్కరింపదగినవాడైనా శత్రువు అయినా, వేదములు తెలియనివాడైనా, వానికి తప్పక దానమివ్వవలెనని వేమన ఆలోచన.
వేమనకు అన్నదానము కన్నా కన్యాదానము పట్ల అభిమానమెక్కువ. పూర్వం పేదవారికి పెళ్ళి అవటం కష్టంగా ఉండేది. అందువలనే కన్యాదానం కూడా పేదవారికే చేయాలని వేమన శాసించాడు.

4. పాకుడు రాళ్ళు నవల గురించి వ్రాయండి ?
జవాబు:
‘నా జీవిత యాత్ర’ పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు ‘మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్తరూపం.
భరద్వాజ అంతగా చదువుకోలేదు. ఆయన 8వ తరగతిలోనే చదువుకు కుటుంబ దారిద్ర్యం వల్ల స్వస్తి చెప్పాడు. తనకు తన వూరిలో జరిగిన అవమానం వలన చదువుపై శ్రద్ధపెట్టి తన వూరి గ్రంథాలయంలోని ప్రాచీన గ్రంథాలను ఔపోసన పెట్టారు. తనకు గ్రంథాలయంలో చదువుకునేందుకు సహాయం చేసిన కొల్లూరు వెంకటేశ్వర్లు గారి ఋణం తీర్చుకోవటం కోసం 1965సం||లో ‘పాకుడు రాళ్ళు’ నవల వ్రాసి ఆయనకు అంకితం చేశాడు. భరద్వాజ 1956లో మద్రాసు వెళ్ళారు. అక్కడ ఆయన చాలా నేర్చుకున్నారు. వందలాది మంది రచయితలతో కవులతో పత్రికా సిబ్బందితో, సినీరంగ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఊహకు అందని విషయాలను కూడా అక్కడ ఆయన ఎదుర్కొన్నారు. ఆ సినీరంగం ఆధారంగా చేసికొని అక్కడ ఉండే ప్రతి మనసును అర్థం చేసుకుని “పాకుడు రాళ్ళు” నవలను రచించారు. ఆ నవలలోని అన్ని పాత్రలు ఆయనకు పరిచయం అయినవే. అన్ని సంఘటనలు ఆయనకు తెలిసిన వారి జీవితాలలో నుండి ఎన్నుకున్నవే! చివరకు ఆ నవలే ఆయనకు జ్ఞానపీఠ అవార్డును అందించింది. దురదృష్ట మేమంటే ఆయన ఆ మెమెంటోను కళ్ళారా చూసుకోక మందే అక్టోబరు 18, 2013న కాలం చేశారు.

VIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. శకుంతలను దుష్యంతుడు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు.
జవాబు:
గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు.

2. అన్ని జన్మలలో దుర్లభమైనది ఏది ?
జవాబు:
మానవ జన్మ.

3. అర్క సంభవుడెవరు ?
జవాబు:
సుగ్రీవుడు.

4. పట్టమేలే రాజు గర్వం ఏమైంది ?
జవాబు:
మట్టిలో కలిసిపోయింది.

5. అమ్మతనం ముందు ఏది ఓడిపోతుంది.
జవాబు:
అమ్మకతనం ఓడిపోతుంది.

6. ‘చీర’ అను పదానికి పూర్వకాలంలో గల అర్థమేమిటి ?
జవాబు:
వస్త్రము అన్న విస్తృతార్థం ఉండేది.

IX. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. విజయనగర రాజుల కాలం వరకు దక్షిణ హిందూదేశంలో ఏ క్రీడ ఉంది.
జవాబు:
మల్లయుద్ధం.

2. ‘దీపం ఆరిపోయింది’ అన్న మాటలను సౌమ్యంగా ఎలా చెప్తారు.
జవాబు:
దీపం కొండెక్కిందని సౌమ్యంగా చెప్తారు.

3. రాళ్ళపల్లి ఎవరి కీర్తనలను స్వరకల్పన చేశారు ?
జవాబు:
అన్నమయ్య సంకీర్తనలను.

4. జ్ఞానపీఠ అవార్డును అందించిన భరద్వాజ నవల ఏది ?
జవాబు:
పాకుడు రాళ్ళు.

5. జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు కారకులెవరు ?
జవాబు:
జనరల్ డయ్యర్.

6. ఖడ్గ తిక్కన ఎవరి తరపున యుద్ధం చేశాడు ?
జవాబు:
మనుమసిద్ధి తరపున యుద్ధం చేశాడు.

X. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. తెలుగులో భాషాభాగాలు ఎన్ని రకాలు ?
జవాబు:
తెలుగులో భాషాభాగాలు 5 రకాలు. నామవాచకము, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం.

2. సర్వనామం అంటే ఏమిటి ?
జవాబు:
నామవాచకానికి బదులుగా వాడబడుతున్న పదం.

3. క్రియ అంటే ఏమిటి.?
జవాబు:
పనిని సూచించే పదాన్ని క్రియ అంటాము.

4. గులాబి అందమైన పువ్వు – దీనిలో విశేషణం ఏది ?
జవాబు:
అందమైన దీనిలో విశేషణం.

5. ఆహా ! తెలుగు భాష ఎంత బాగుందో – దీనిలో అవ్యయం ఏది ?
జవాబు:
‘ఆహా’ అను పదం అవ్యయం..

XI. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

1. వాక్యానికి ఉండే లక్షణాలు ఏమిటి ?
జవాబు:
యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి.

2. సామాన్య వాక్యం అంటే ఏమిటి ?
జవాబు:
ఒకే సమాపక క్రియ కలిగిన వాక్యము.

3. కొన్ని అప్రధానమైన వాక్యాలు ఒక ప్రధాన వాక్యంగా ఏర్పడితే ఏ వాక్యం అంటారు ?
జవాబు:
సంక్లిష్ట వాక్యం.

4. పాపాలరావు అవినీతిపరుడు. పాపాలరావు నీతిని గురించి మాట్లాడతాడు సంయుక్త వాక్యంలో వ్రాయండి ?
జవాబు:
పాపాలరావు అవినీతిపరుడు కాని నీతిని గురించి మాట్లాడతాడు..

5. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ వ్రాయండి ?
జవాబు:
రాజు అహంకారి.

XII. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. మత్తేభము
జవాబు:
మత్తేభాన్ని ‘మత్తేభ విక్రీడితం’ అని కూడా అంటారు. మత్తేభం అంటే మదించిన ఏనుగు అని అర్థం. దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోను వరుసగా ‘స, భ, ‘ ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి 1-14 అక్షరాలకు ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది.
AP Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions 1

యతి మైత్రి : 1వ అక్షరమైన ‘క’ లోని అ కు 14వ అక్షరమైన ‘క్ష’ లోని క కు యతి చెల్లింది.
ప్రాసాక్షరం : ‘డ’ కారం ప్రాసగా ఉంది.

2. కందం
జవాబు:
కందం చిన్న పద్యమైనా ఎక్కువ లక్షణాలు గలది. అందుకే ‘కందం రాసినవాడే కవి’ అనే నానుడి వచ్చింది. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ఒకటి, మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు ఐదేసి గణాలు ఉంటాయి. మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, మూడు నాలుగు పాదాలను ఒక భాగం గాను పేర్కొంటారు. కంద పద్యంలో ‘భ, జ, స, న, ల, గ, గ’ అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే వాడాలి. బేసి సంఖ్య గల గణాలలో (1, 3, 5, 7 గణాలలో) ‘జ’ గణం రాకూడదు. ఆరవ గణం ‘జ’ గణం కానీ ‘నల’ కానీ ఉండాలి. యతి మైత్రి రెండు, నాలుగు పాదాలలో 1 – 4 గణాల మొదటి అక్షరాలకు ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. రెండు, నాలుగు పాదాల చివరి అక్షరం విధిగా గురువై ఉండాలి. మొదటి పాదం గురువుతో ప్రారంభమైతే, మిగిలిన పాదాలన్నీ గురువుతోనే ప్రారంభం కావాలి. లేదా మొదటి పాదం లఘువుతో ప్రారంభమైతే, మిగిలిన పాదాలన్నీ లఘువుతోనే ప్రారంభం కావాలి.
AP Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions 2
యతి మైత్రి : రెండో పాదంలో ‘న’ అనే అక్షరం లో సంధిగతంగా ఉన్న ‘అ’ కారానికీ, నాలుగో గణంలో సంధిగతంగా ఉన్న ‘య’లోని ‘అ’ కారానికీ చెల్లింది.
ప్రాసాక్షరం : ‘క్క’ అనే అక్షరం అంటే ద్విత్వ కకారం ప్రాసగా ఉంది.

3. ముత్యాల సరాలు
జవాబు:
గురజాడ అప్పారావు 1910లో ముత్యాలసరాలు అనే ఖండికను ‘ముత్యాల సరాలు’ అనే ఛందస్సులో రాశాడు. ఒక ఫారసీ గజల్ విని స్ఫూర్తిపొంది ముత్యాలసరాలు ఛందస్సును కూర్చినట్టు గురజాడ చెప్పుకున్నారు. వృషభగతి రగడ, భామినీ షట్పది వంటి ఛందస్సులలోనూ ముత్యాలసరాలకు మూలాలు కన్పిస్తున్నాయి. ముత్యాల సరాలు మాత్రా ఛందస్సుతో కూడిన గేయ ప్రక్రియ.
లక్షణాలు :
1. ఇది మాత్రా గణాలతో ఏర్పడుతుంది.
2. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
3. ప్రతి పాదంలోనూ 3 + 4; 3 + 4 క్రమంలో మొత్తం 14 మాత్రలుంటాయి.
4. 4వ పాదంలో మాత్రం 7 నుంచి 14 మాత్రలు దాకా ఉండవచ్చు.
5. నాల్గవ పాదంతో భావం పూర్తి కావాలి.
6. నాలుగు పాదాలలో భావం పూర్తికానపుడు ఒకొక్కసారి ఐదవ పాదం దాకా పెరుగుతుంది.
దీనిని తోక ‘ముత్యాల సరము’ అని వ్యవహరిస్తారు. ‘కన్యక’ ఖండికలోనూ ఈ తోక ముత్యాలసరాలు కొన్ని ఉన్నాయి. గమనించవచ్చు.
ఉదాహరణ: ముత్యాల సరం
AP Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions 3

ఉదాహరణ: తోక ముత్యాల సరం
AP Inter 2nd Year Telugu Model Paper Set 10 with Solutions 4

XIII. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. (6 × 1 = 6)

1. ఛందస్సు అంటే ఏమిటి ?
జవాబు:
పద్య లక్షణాలను చెప్పే శాస్త్రాన్ని ఛందస్సంటారు.

2. సీస పద్యానికి అనుబంధంగా ఏ పద్యాలను వ్రాస్తారు ?
జవాబు:
ఆటవెలది, తేటగీతి

3. ఉత్పలమాలలో యతి స్థానం ఎంత ?
జవాబు:
10వ అక్షరం.

4. ప్రాస అంటే ఏమిటి ?
జవాబు:
పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

5. ఇంద్ర గణాలేవి ?
జవాబు:
నల, నగ, సల, భ, ర, త,

6. ఉపజాతులలో ఏ నియమం ఉండదు ?
జవాబు:
‘ప్రాస’ నియమం ఉండదు.

XIV. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించండి. (1 × 6 = 6)

1. లాటానుప్రాస
జవాబు:
అర్థభేదం లేకుండా, తాత్పర్య భేదం కలిగిన పదాలు వెనువెంటనే వస్తే అది లాటానుప్రాసాలంకారం. అర్థం అంటే పదానికి ఉన్న సామాన్యమైన అర్థం. తాత్పర్యం అంటే ఆ పదానికి సందర్భానుసారంగా మనం విశేషంగా తీసుకొనే అర్థం. ఈ క్రింది ఉదాహరణలను చూడండి.
‘అమ్మ చూపించే ప్రేమ ప్రేమ !’
మొదటి వాక్యంలో ‘ప్రేమ’ అనే మాట రెండు సార్లు వచ్చినప్పటికీ, మొదటి సారి వచ్చిన ప్రేమ అనే మాటకు ‘ప్రేమ, వాత్సల్యం’ అని అర్థాలు. ‘అదే పదం వెనువెంటనే వచ్చినప్పటికీ, దాన్ని మనం ‘నిజమైన ప్రేమ’ అనే తాత్పర్యాన్ని తీసుకుంటాం. ఇక్కడ ప్రేమ అనే మాటకు అర్థం వేరు, తాత్పర్యం వేరు. దీన్నే మనం లాటానుప్రాసం అని పిలుస్తున్నాం.
మరికొన్ని ఉదాహరణలు :
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి ! హరిఁ జేరుమనియెడి తండ్రి తండ్రి !

2. ఉపమాలంకారము
జవాబు:
ఉపమాలంకారాన్ని ఉపమానాలంకారం అని కూడా అంటారు. ఉపమ అంటే సామ్యం లేదా పోలిక అని అర్థం. ఉపమేయానికి ఉపమానానికి మనోహరమైన పోలిక చెపితే అది ఉపమాలంకారం. ఒక వస్తువును మరొక వస్తువుతో మనోహరంగా పోల్చడం. ఇందులో నాలుగు భాగాలుంటాయి.
1. ఉపమేయం : మనం దేన్నయితే వర్ణిద్దామనుకుంటామో ఆ వస్తువు. అంటే వర్ణింపబడే వస్తువు.
2. ఉపమానం : ఉపమేయాన్ని వర్ణించడానికి దేన్నయితే పోలికగా తీసుకొస్తామో అది ఉపమానం.
3. సమానధర్మం : పై రెండింటిలో అంటే ఉపమేయ ఉపమానాల్లో సమానంగా ఉండే ధర్మం లేదా గుణం సమాన ధర్మం.
4. ఉపమావాచకం : ఉపమేయ ఉపమానాల ధర్మ సామ్యాన్ని కలిపే అవ్యయ పదం.
ఉదాహరణ : వలె, పోలె, పట్టె, కైవడి, కరణి, భంగి, చూపె,
క్రియన్, లా/లాగ మొదలైనవి.
‘మా అమ్మ భూదేవిలా గొప్ప సహనవంతురాలు’ .
ఈ వాక్యంలో అమ్మ గురించి చెపుతున్నాం కాబట్టి అమ్మ ఉపమేయం. అమ్మని భూదేవితో పోలుస్తున్నాం కాబట్టి భూదేవి ఉపమానం. సహనం అనే విషయంలో చెప్తున్నాం కాబట్టి అది సమాన ధర్మం. (అమ్మలోనూ, భూదేవిలోనూ ఇద్దరిలోనూ సహనం ఉంది కాబట్టి). ఉపమేయాన్ని, ఉపమానాన్ని అనుసంధానించడానికి వాడిన పదం కాబట్టి ఇది ఉపమాలంకారం.
– లా, ఇది ఉపమావాచకం.
ఈ పాఠ్యపుస్తకంలోని సత్య ప్రాశస్త్యములో ఈ క్రింది పద్యాలలో ఉపమాలంకారం ఉంది.
1. ‘విను గార్హపత్యమను నయ్యనలము
2. ‘తాన తననీడ నీళ్ళలలో నేర్పడఁ జూచునట్లు

3. స్వభావోక్తి
జవాబు:
జాతి గుణ క్రియాదుల చేత ఒక వస్తువును ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం.
‘ఒడలందెల్ల విభూతిపూత, పులితోలొడ్డాణ, మల్లాడు కెం
జడ, లాత్మైక విచార నిశ్చల దృగఙ్ఞాతంబు, లచ్చెన క.
చ్చడ మంసంబున, రుండమాల, గళదేశ స్థాణువుం గ్రాలగా
పై పద్యంలో పరమశివుని రూపం యథాతథంగా వర్ణించబడింది. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం.
ఈ పాఠ్యపుస్తకంలోని పాఠ్యభాగాల్లో ఈ క్రింది పద్యాలలో గల స్వభావోక్తులను గమనించండి..
1. “నీలమేఘచ్ఛాయ బోలు దేహమువాడు – ధవళాబ్జ పత్ర నేత్రములవాడు ఈ పద్యంలో కవయిత్రి మొల్ల శ్రీరాముని అత్యంత సహజంగా అద్భుతంగా వర్ణించింది.
2. ‘నిడుద పెన్నెరి వేణి జడలుగా సవరించి మలిన జీర్ణాంబరంబొలియగట్టి.
ఈ పద్యంలో సీతాదేవి స్థితి అత్యంత సహజంగా చిత్రించబడింది.

XV. క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. (6 × 1 = 6)

1. చుక్కలు తలపూవులుగా…
జవాబు:
అతిశయోక్తి అలంకారం.

2. అలంకారాల ప్రయోజనం ఏమిటి ?
జవాబు:
పద్యంలో ఉన్న అలంకారమేమిటి ?
అందంగా అర్థమయ్యేలా చెప్పటానికి అలంకారాలు ఉపయోగపడతాయి.

3. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుకృష్ణు – దీనిలో అలంకారమేది ?
జవాబు:
వృత్యనుప్రాసాలంకారము.

4. శబ్దాలంకారమంటే ఏమిటి ?
జవాబు:
శబ్ద ప్రాధాన్యంగల అలంకారం శబ్దాలంకారం.

5. ఊహాప్రధానంగా ఉండే అలంకారం ?
జవాబు:
ఉత్ప్రేక్ష.

6. ఉపమేయం అంటే ఏమిటి ?
జవాబు:
వర్ణించబడే వస్తువును ఉపమేయం అంటారు.

XVI. క్రింది గద్యాన్ని 1/3 వంతుకు సంక్షిప్తీకరించండి. (1 × 6 = 6)

రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా, నైతికంగా అణచివేతకు గురయింది స్త్రీ. మహిళల ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని సాహిత్యం ద్వారా అక్షరీకరిస్తే దాన్ని ‘స్త్రీవాద సాహిత్యం’ అంటారు. తమ తల్లిదండ్రులే తమను చిన్న చూపు చూడటం, సోదరులు తమ మీద పెత్తనం చెలాయించడం, సమాజం విధించే ఆంక్షలు, అత్త వారింటికి పంపాలనే తల్లిదండ్రుల ఆరాటం, అత్తింట్లో అవమానాలు, ఇంటి చాకిరీ, పిల్లల ఆలనా పాలనా, భర్త వేధింపులు, అత్తమామల సాధింపులు, ఆడబిడ్డల ఆరళ్ళు; చివరకు తమ పిల్లలు కూడా తమను పనికి రాని వారిగా జమకట్టడం స్త్రీల జీవితాన్ని దుర్భరం చేశాయి. మన దేశంలో ఆంగ్లేయుల పాలన వల్ల వచ్చిన కొన్ని పరిణామాలు, కొంతమంది భారతీయ సంఘసంస్కర్తల కృషి వల్ల భారతీయ మహిళల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కోగల స్థైర్యం, పురుషాధిపత్య భావజాలాన్ని ధిక్కరించే ధైర్యం స్త్రీలకు కొంత అలవడింది.
జవాబు:
సమాజంలో స్త్రీ అణచివేతకు గురి అయింది. స్త్రీల ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని సాహిత్యం ద్వారా చెప్తే దానిని స్త్రీవాద సాహిత్యమంటారు. తల్లిదండ్రుల, సోదరుల, అత్తమామల, భర్త, చివరకు తమకు పుట్టిన సంతానం కూడా వారిని పనికిరాని వారిగా చూస్తుంది. విదేశీ పాలన వల్ల, సంఘసంస్కర్తల కృషి వలన మహిళల ఆలోచనల్లో మార్పు వచ్చింది. తమ సమస్యలను తామే పరిష్కరించుకొని పురుషాధిక్యాన్ని ఎదుర్కొనే ధైర్యం నేర్చుకున్నారు.

Leave a Comment