AP Inter 2nd Year Botany Notes Chapter 5 మొక్కలలో శ్వాసక్రియ

Students can go through AP Inter 2nd Year Botany Notes 5th Lesson మొక్కలలో శ్వాసక్రియ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 5th Lesson మొక్కలలో శ్వాసక్రియ

→ మొక్కల దేహానికి శ్వాసక్రియ శక్తిని అందిస్తుంది. ఆహార ఆక్సీకరణ ద్వారా ఇది జరుగుతుంది.

→ శ్వాసక్రియ నందు ఆక్సీకరణం గావించబడే పదార్థాలను శ్వాసక్రియా పదార్ధాలు అంటారు.

→ ‘గ్లూకోజ్’ శ్వాసక్రియ మొక్క ముఖ్య అధస్ధ పదార్ధం.

→ శ్వాసక్రియా పదార్ధాల నందు ఉన్న శక్తి మొత్తం ఒకేసారి స్వేచ్ఛగా కణాన్ని చేరదు. ఇది రసాయనిక శక్తియైన ATP గా బంధించబడుతుంది.

→ జీవి తన యొక్క వివిధ శక్తి అవసరాలకు ఈ బంధించిన ATP ని వినియోగించుకుంటుంది.

AP Inter 2nd Year Botany Notes Chapter 5 మొక్కలలో శ్వాసక్రియ

→ మొక్కలలో శ్వాసక్రియ రెండు విధానాలలో జరుగుతుంది.

  1. పత్రరంధ్రాలు మరియు వాయువుల వినిమయం
  2. కణశ్వాసక్రియ

→ కణశ్వాసక్రియలో రెండు రకాలు కలవు (i) వాయు శ్వాసక్రియ (ii) అవాయు శ్వాసక్రియ

→ ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను ‘వాయుశ్వాసక్రియ’ అంటారు.
ఉదా: గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం.

→ ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను ‘అవాయు శ్వాసక్రియ’ అంటారు. ఉదా: కిణ్వన ప్రక్రియ

→ గ్లైకాలసిస్:

  1. జీవులన్నింటిలో శ్వాసక్రియ యొక్క మొదటి దశ గ్లైకాలసిస్ .
  2. ఇది కణాలలోని కణద్రవ్యంలో జరుగుతుంది.
  3. గ్లైకాలసిస్ లో గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం జరిగి శక్తి విడుదలవుతుంది. [IPE]
  4. గ్లైకాలసిస్ లో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెంది 2 అణువుల పైరూవిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది.

AP Inter 2nd Year Botany Notes Chapter 5 మొక్కలలో శ్వాసక్రియ
→ క్రెబ్స్ వలయం:

  1. క్రెబ్స్ వలయం అనేది వాయుసహిత జీవులన్నీంటిలో శక్తిని ఉత్పత్తి చేసే చర్యల వలయం.
  2. ఇది మైటోకాండ్రియాలో జరుగుతుంది.
  3. ఎసిటైల్ కో-ఎన్జైమ్ (Co.A) ఆక్సీకరణం చెంది CO2 మరియు H2O లను ఏర్పరుస్తుంది.
  4. అంతేకాకుండా ADP అధికశక్తి ఉండే ATP గా మారుతుంది. [IPE]

Leave a Comment