AP Inter 2nd Year Botany Notes Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

Students can go through AP Inter 2nd Year Botany Notes 6th Lesson మొక్క పెరుగుదల, అభివృద్ధి will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 6th Lesson మొక్క పెరుగుదల, అభివృద్ధి

→ పెరుగుదల అనగా ఒక జీవి యొక్క ఆకారంలో అనుక్రమణీయ శాశ్వత పెరుగుదల.

→ జంతువులలో పరిపక్వత చెందిన తరువాత పెరుగుదల ఆగిపోతుంది.

→ కాని ఉన్నతశ్రేణి మొక్కలలో వేర్లు, కాండాలు మరియు శాఖలు నిరంతర పెరుగుదలను చూపుతాయి.

→ ఇతర భాగాలైన పత్రాలు, పుష్పాలు మరియు ఫలాలు తక్కువ (లేదా) నిర్ణీత పెరుగుదలను మాత్రమే కలిగి ఉంటాయి.

→ కాంతి, ఉష్ణోగ్రత, పోషణ, ఆక్సిజన్ మొదలైనవి మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి.

→ వేరు మరియు కాండం యొక్క కణవిభజన ఆధారంగా పెరుగుదల అనేది, అంకగణితంగా (లేదా) జ్యామితియంగా ఉంటుంది.

→ పెరుగుదల కాలంలోని మూడు ప్రధాన దశలు: విభజన దశ, ధైర్ఘ్యవృద్ధి మరియు పరిపక్వదశ. [IPE]

→ మొక్కల యొక్క పుష్పాలు కాలానుగుణంగా అనగా పగలు/రాత్రి సమయంలో పుష్పించడాన్ని ‘కాంతి కాలావధి’ అంటారు.

AP Inter 2nd Year Botany Notes Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

→ ఆక్సిన్లు ప్రభావవంతమైన పెరుగుదల హర్మోనులు. ఇవి కాండం కొనల నుంచి ఉత్పత్తి అవుతాయి. [IPE]

→ జిబ్బరెల్లిన్లు పెరుగుదల హర్మోనులు. ఇవి ఫలాలపక్వాన్ని, కాండం పెరుగుదల, పుష్పించటం మరియు ఆగిపోవటం, ‘లింగ నిర్ధారణ, ఎన్జైమ్ల ప్రేరణ, పత్రాలు మరియు ఫలాల వార్ధక్యాన్ని ప్రేరేపిస్తాయి.

→ సైటోకైనిన్లు కూడా మొక్కల పెరుగుదల హర్మోనులే. ఇది మొక్కల వేర్లు యొక్క కణవిభజనను ప్రేరేపిస్తుంది. [IPE]

→ ‘ఇథలిన్’ ఒక సరళమైన వాయువు రూపంలో ఉంటూ మొక్క పెరుగుదలను నియంత్రించే హర్మోను. [IPE]

→ విత్తనాలు మొలకెత్తుట (లేదా) పెరుగుదల అనేది అసామర్థ్యం (లేదా) ఆలస్యం వలన జరిగితే దానిని ‘విత్తన సుప్తావస్థ’ అంటారు. [IPE].

→ క్విసెన్స్: బాహ్య వాతావరణ పరిస్థితులు బాగా పొడిగా (లేదా) వేడిగా (లేదా) చల్లగా వుంటే విత్తన అంకురం అనేది ఆలస్యం అవుతుంది. దీని వలన మొలకెత్తుట విఫలమవుతుంది. [IPE]

Leave a Comment