AP Inter 2nd Year Botany Notes Chapter 4 ఉన్నత మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ

Students can go through AP Inter 2nd Year Botany Notes 4th Lesson ఉన్నత మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 4th Lesson ఉన్నత మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ

→ ఆకుపచ్చని మొక్కలు ‘కిరణజన్య సంయోగ క్రియను’ జరుపుతాయి.

→ ఈ చర్యనందు పత్రాలు, పత్ర రంధ్రాల ద్వారా వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తాయి.

→ కిరణజన్య సంయోగక్రియ నందు మొక్కలు కాంతిశక్తిని వినియోగించుకొని, కార్బోహైడ్రేట్లను సంశ్లేషణ చేస్తాయి.

→ భూమిపై ఉన్న అన్ని జీవరాశులు ప్రత్యక్షంగా (లేదా) పరోక్షంగా మొక్కలపై ఆధారపడతాయి.

→ కిరణజన్య సంయోగక్రియ సమస్త జీవరాశులకు ఆహరాన్ని మరియు దానితో పాటుగా వాతావరణంలోని ఆక్సిజన్ను విడుదల చేస్తుంది.

→ పత్రాల యందు ఉన్న పత్రాంతర కణాలలోని హరితరేణువులు CO2 స్థాపనకు ముఖ్య ఆధారం.

→ హరిత రేణువుల యందు Chl ‘a’, Chl ‘b’, జాంధోఫిల్ మరియు కెరోటినాయిడ్స్ అనే ‘వర్ణద్రవ్యాలు’ ఉంటాయి.

→ Chl ‘a’ నందు (i) PSI (ii) PSII అనే రెండు కాంతి వ్యవస్థలు ఉంటాయి.

→ కాంతి రసాయన చర్య నందు విడుదలైన ATP మరియు NADPH శక్తిని ‘స్వాంగీకరణ శక్తి’ అంటారు.

AP Inter 2nd Year Botany Notes Chapter 4 ఉన్నత మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ

→ ఈ స్వాంగీకరణ శక్తి నిష్కాంత చర్యలో కార్బోహైడ్రేట్స్ల సంశ్లేషణలో వినియోగించుకోబడుతుంది.

→ హరితరేణువు యొక్క ఆవర్ణిక నందు ‘నిష్కాంతి చర్య’ జరుగుతుంది.

→ నిష్కాంతి చర్యనందు ఏర్పడిన మొదటి అధస్ధ పదార్ధం ఆధారంగా రెండు మార్గాలను గుర్తించారు.

→ అవి (i) కాల్విన్ వలయం (C3 వలయం) (ii) హచ్ మరియు స్లాక్ వలయం (C4 వలయం). [IPE)

→ కాల్విన్ వలయం నందు కార్బాక్సిలేషన్, క్షయకరణం మరియు పునరుత్పత్తి ఉంటాయి.

→ కాల్విన్ వలయంలో మొదటగా ఏర్పడే స్థిర ఉత్పన్న పదార్ధం PGA (ఇది C3 పదార్ధం).

→ C4 వలయం రెండు కిరణజన్య సంయోగ క్రియా కణాలలో జరుగుతుంది. అవి పత్రాంతర కణాలు మరియు పుంజతొడుగు కణాలు.

→ ‘హచ్ మరియు స్లాక్ ‘ మార్గం యొక్క మొదటి స్థిర ఉత్పన్న పదార్ధం OAA ( ఇది C4 పదార్ధం).

Leave a Comment