AP Inter 2nd Year Botany Important Questions Chapter 7 బ్యాక్టీరియమ్లు

Students get through AP Inter 2nd Year Botany Important Questions 7th Lesson బ్యాక్టీరియమ్లు which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Botany Important Questions 7th Lesson బ్యాక్టీరియమ్లు

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
సూక్ష్మజీవుల ఉనికి గురించి క్లుప్తంగా రాయండి. [TS MAR-17]
జవాబు:

  1. సూక్ష్మజీవులైన బాక్టీరియా మరియు వైరస్లు అన్ని రకాల వాతావరణాలలో కనిపిస్తాయి.
  2. కావున ఇవి సర్వాంతర్యాములు.

ప్రశ్న 2.
సూక్ష్మ జీవశాస్త్రాన్ని నిర్వచించండి.
జవాబు:
సూక్ష్మజీవులైన బాక్టీరియాలు, వైరస్ మరియు ప్రోటోజోవాలను గురించి అధ్యయనం చేసే జీవశాస్త్ర శాఖను సూక్ష్మజీవ శాస్త్రం అని అంటారు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 7 బ్యాక్టీరియమ్లు

ప్రశ్న 3.
మానవుని పేగుల్లో సాధారణంగా నివసించే బాక్టీరియమ్ ఏది? దానిని జీవసాంకేతిక శాస్త్రంలో ఎలా ఉపయోగిస్తారు?
జవాబు:

  1. మానవుని పేగులలో ఈశ్చరీషియాకోలై అనే సాధారణ బాక్టీరియా నివసిస్తుంది.
  2. దీనిని పునఃసయోజకDNA సాంకేతికతలో వినియోగిస్తారు.

ప్రశ్న 4.
బహురూప బాక్టీరియమ్లు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. [TS MAR-18,20][AP MAY-17,22]
జవాబు:

  1. వాతావరణ పరిస్థితి, లభ్యమయ్యే పోషకాలను బట్టి ఆకారాలను మార్చుకోగలిగే సామర్ధ్యం గల బాక్టీరియాలను బహురూప బాక్టీరియాలు అంటారు.
  2. ఉదా: ఎసిటోబాక్టర్

ప్రశ్న 5.
లైంగిక పైలస్ అంటే ఏమిటి? వాటి విధిని తెలపండి.
జవాబు:

  1. సంయుగ్మ ప్రక్రియకు బాక్టీరియమ్ల మధ్య ఏర్పడే పరికరాన్నే సంయుగ్మనాళం (లేదా) లైంగిక పైలస్ అంటారు.
  2. F+ అనే దాతకణం పైలస్ ను ఉత్పత్తి చేసి గ్రహీతకణం F-ను తాకుతుంది.

ప్రశ్న 6.
జీనోఫోర్ అంటే ఏమిటి? [AP MAR-19]
జవాబు:
జీనోఫోర్: బాక్టీరియమ్ కణంలో ఉండే ప్రధానమైన జన్యు పదార్ధంను (బాక్టీరియల క్రోమోసోమ్లు) జీన్ఫోర్ అంటారు.

ప్రశ్న 7.
ప్లాస్మిడ్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి? [TS MAY-17][TS M-19]
జవాబు:

  1. ప్లాస్మిడ్ : స్వయం ప్రతిపత్తి కలిగిన, నగ్న, గుండ్రటి, ద్విసర్పిలాకారా DNA అణువును ‘ప్లాస్మిడ్’ అంటారు.
  2. ప్రాముఖ్యత: వీటిని వాహకాలుగా జన్యు సాంకేతిక శాస్త్రంలో వినియోగిస్తారు.

ప్రశ్న 8.
సంయుగ్మం అంటే ఏమిటి? [AP MAY-19] [AP MAR-17]
జవాబు:

  1. సంయుగ్మం: సంయుగ్మం అంటే రెండు బాక్టీరియా కణాల ప్రత్యక్ష తాకిడి వల్ల, వాటి మధ్య జరిగే జన్యుపదార్ధ మార్పిడి. దాత బాక్టీరియా ప్రత్యక్షంగా గ్రహీత బాక్టీరియా కు DNA ను అందిస్తుంది.
  2. లెడర్ బర్గ్ మరియు టాటమ్ అనే శాస్త్రవేత్తలు ‘ఈశ్చరీషియా కోలై’ నందు సంయుగ్మాన్ని కనుగొన్నారు.

ప్రశ్న 9.
జన్యు పరివర్తన అంటే ఏమిటి? దాన్ని ఎవరు, ఏ జీవిలో కనుక్కున్నారు?
జవాబు:
[AP MAR-20]

  1. జన్యు పరీవర్తన అనగా పరిసర వాతావరణం నుంచి నగ్న DNA ఖండితాలను స్వీకరించటం.
  2. ఈ ప్రక్రియలో ముందు లేనటువంటి వాంఛిత లక్షణాన్ని పొందడం జరుగుతుంది.
  3. దీనిని ఫ్రెడిరిక్ గ్రిఫిత్, ‘స్ట్రెప్టోకోకస్ న్యుమోనియ’ లో కనుగొన్నారు.

ప్రశ్న 10.
జన్యువహనం అంటే ఏమిటి? దాన్ని ఎవరు, ఏ జీవిలో కనుక్కున్నారు. [AP MAR-16,18]
జవాబు:

  1. జన్యువహనం: ఒక బాక్టీరియా నుంచి వేరొక బాక్టీరియాకు బాక్టీరియోఫాజ్ ద్వారా జన్యుపదార్ధాన్ని రవాణా చేయు పద్ధతిని ‘జన్యువహనం’ అంటారు.
  2. లెడర్ బర్గ్ మరియు జండర్ అనే శాస్త్రవేత్తలు సాల్మోనెల్లా టైఫిమ్యూరియర్లో జన్యువహనాన్ని కనుగొన్నారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
సూక్ష్మజీవశాస్త్రం ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
1) సూక్ష్మజీవులు చనిపోయిన మొక్కలు మరియు జంతుకళేబరాలను జీవక్రియా విధానంలో విచ్ఛిన్నం చేస్తాయి. దీని వలన పోషకాలతో నిండిన హ్యూమస్ ఏర్పడి నేల సారవంతమవుతుంది. బాక్టీరియా మరియు శిలీంధ్రాలు మురుగునీటిని శుద్ధి చేస్తాయి.

2) సూక్ష్మజీవులను ఆర్థికపరంగా ఆహార ఉత్పత్తులైన పెరుగు, ఎన్జైమ్లు, అమైనో అమ్లాలు, విటమిన్లు, ఆల్కహాల్ మరియు సూవాసన కారకాల తయారీలో ఉపయోగిస్తారు.

3) సూక్ష్మజీవులను వాణిజ్యపరంగా జనపనార రెట్టింగ్, పొగాకు క్యూరెంగ్ మరియు వివిధ రకల వ్యాక్సిన్లు, యాంటిబయోటిక్లు మందుల తయారీకి ఉపయోగిస్తున్నారు.

4) కొన్ని సూక్ష్మజీవులను రాతి నుండి యూరేనియంను సేకరించుట కొరకు వినియోగిస్తున్నారు. ఈ విధానాన్ని ‘బయోమైనింగ్’ అంటారు.

5) బ్యాక్టీరియా కారకాలను జీవక్రియా ఉత్తేజ కాలుష్యకారులను గుర్తించే ‘బయోసెన్సార్’లుగా వినియోగిస్తున్నారు.

6) సూక్ష్మజీవులు సేంద్రీయ వ్యర్థాల అవాయు శ్వాసక్రియ జరిపి బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి.

7) నత్రజని స్థాపనకు సూక్ష్మజీవులు సహాయపడతాయి. దీని వలన నేల అధిక సారవంతమవుతుంది.

8) జన్యుసాంకేతిక శాస్త్రంలో, బాక్టీరియాలను DNA పునఃసంయోజక విధానంలో వినియోగిస్తారు. దీని ద్వారా జన్యు రూపాంతరం మరియు వర్ధనం పెద్ద మొత్తంలో వాణిజ్యపరంగా జరుగుతున్నవి.

ప్రశ్న 2.
స్వరూపం ఆధారంగా బాక్టీరియమ్లను ఏ విధంగా వర్గీకరించవచ్చు?
జవాబు:
స్వరూప లక్షణాల ఆధారంగా బాక్టీరియాలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చును.:
1) కోకై(కోకస్ ఏకవచనం): గోళాకార బాక్టీరియాలను కోకై అంటారు. కణాల సంఖ్య మరియు అమరిక ఆధారంగా కోకై ను ఆరు రకాలుగా వర్గీకరించారు.

  • మోనోకోకస్: ఒకే ఒక గోళాకార కోకస్
  • డిప్లోకోకస్: ఒక జత గోళాకార బాక్టీరియాలు.
  • టెట్రాకోకస్: నాలుగు గోళాకార బాక్టీరియమ్ల సమూహం
  • స్ట్రెప్టోకోకస్: ఒకే వరుసలో అమరి ఉండే గొలుసు వంటి గోళాకార బాక్టీరియమ్లు
  • సార్సినా:ఎనిమిది కణాలతో ఘనాకారంలో అమరి ఉండే కోకై
  • స్టాఫిలోకోకస్: క్రమ రహితంగా అమరి ఉండే గోళాకార బాక్టీరియమ్ల సమూహం

2. బాసిల్లై (బాసిల్లస్ ఏకవచనం): దండాకార బాక్టీరియాలను ‘బాసిలె’ అంటారు. ఇవి మూడు రకాలు

  • మోనోబాసిల్లస్: ఒంటరిగా ఉండే దండాకార బాసిల్లస్, దీనినే సూక్ష్మ బాసిల్లస్ అని కూడా అంటారు.
  • డిప్లోబాసిల్లస్: జతలుగా అమరి ఉండే దండాకార బాక్టీరియమ్లు
  • స్ట్రెప్టోబాసిల్లస్: ‘స్ట్రాల వలె వరుసలో గొలుసులాగా అమరి ఉండే దండాకార బాక్టీరియమ్లు

3) సర్పిల రూపాలు:ఇవి మూడు రకాలు.

  • విబ్రియాయిడ్: ఒక పూర్తి మెలిక కంటే తక్కువ మెలికలు ఉన్న బాక్టీరియా కణాలు.
  • స్పైరిల్లమ్: ఒక పూర్తి మెలిక కంటే ఎక్కువ మెలికలు ఉన్నవి. ఒక స్పష్టమైన సర్పిల ఆకారం కలవి.
  • స్పైరోకీట్: సన్నని, పొడవైన, మరియు కార్క్ స్కూ ఆకారం కల బాక్టీరియా కణాలు.

4) బహురూపక బాక్టీరియమ్లు: వాతావరణ పరిస్థితి, లభ్యమయ్యే పోషకాలను బట్టి ఆకారాలను మార్చుకోగలిగే సామర్ధ్యం కల బాక్టీరియాలను బహురూప బాక్టీరియాలు అంటారు. ఉదా: ఎసిటోబాక్టర్
AP Inter 2nd Year Botany Important Questions Chapter 7 బ్యాక్టీరియమ్లు 1

ప్రశ్న 3.
కశాభాల సంఖ్య, వాటి అమరికలను బట్టి బాక్టీరియమ్లను ఏ విధంగా వర్గీకరించారు? [TS MAR-16]
జవాబు:
కశాభాల సంఖ్య మరియు అమరిక ఆధారంగా బాక్టీరియాలను నాలుగు రకాలుగా వర్గీకరించారు.

  1. మోనోట్రైకస్ (లేదా) ఏకతంతుకం:బాక్టీరియా కణానికి ఒక వైపు మాత్రమే ఒక కశాభం ఉంటుంది. ఉదా: జాంథోమోనాస్
  2. లోఫోట్రెకస్:బాక్టీరియా కణానికి ఒకవైపు మాత్రమే గుంపులుగా కశాభాలు అమరి ఉంటాయి. ఉదా: విబ్రియో
  3. ద్విధృవతంతుకం (లేదా) ఆంఫీట్రెకస్: బాక్టీరియా కణంకు రెండు వైపులా గుంపుగా కశాభాలు అమరి ఉంటాయి. ఉదా: నైట్రసోమోనాస్
  4. పరితంతుకం (లేదా) పెరిట్రైకస్: అనేక కశాభాలు కణం ఉపరితలం అంతటా ఆవరించి ఉంటాయి.
    ఉదా: ఈశ్చరీషియా

AP Inter 2nd Year Botany Important Questions Chapter 7 బ్యాక్టీరియమ్లు
ప్రశ్న 4.
శక్తి, కార్బన్ మూలాల ఆధారంగా బాక్టీరియమ్లలో పోషణ సముదాయాలు ఏవి? [AP MAR-15]
జవాబు:
కర్బనం మరియు శక్తి వనరుల ఆధారంగా బాక్టీరియమ్లో నాలుగు ప్రధాన పోషక సముదాయాలు కలవు.
AP Inter 2nd Year Botany Important Questions Chapter 7 బ్యాక్టీరియమ్లు 2

ప్రశ్న 5.
రసాయన పరపోషిత బాక్టీరియమ్లు, వాటి ఆవశ్యకతను గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. రసాయన పరపోషిత బాక్టీరియమ్లు శక్తిని మరియు కార్బన్ రెండింటిని కర్బన సంయోగ పదార్థాల నుండి పొందుతాయి. వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
  2. పూతికాహారులు: ఇవి చనిపోయిన మరియు కుళ్ళిన సేంద్రీయ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఉదా: బాసిల్లస్ జాతులు
  3. పరాన్న జీవులు: ఇవి అతిధేయి కణజాలలను ఆహారంగా తీసుకుంటాయి. ఉదా: జాంథోమోనాస్, సాల్మోనెల్లా
  4. ప్రాముఖ్యత: ఇవి బయోమెడికల్ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. డెల్లోవిబ్రియా బాక్టీరియా వైరస్ కొన్ని హానికరమైన బాక్టీరియమ్ల మీద పరాన్న జీవిగా పెరుగుతుంది. ఇది గంగా నదీ జలాల పరిశుద్ధికారిణిగా చేస్తుంది.

ప్రశ్న 6.
బాక్టీరియమ్లలోని సంయుగ్మాన్ని గురించి వివరించండి [TS MAR-15]
జవాబు:

  1. సంయుగ్మం: రెండు సజీవ బాక్టీరియమ్ల మధ్య జరిగే జన్యుపదార్ధ మార్పిడిని ‘సంయుగ్మం’ అంటారు.
  2. ఈ విధానాన్ని మొట్టమొదటగా ఈశ్చరీషియాకోలై బాక్టీరియాలో కనుగొన్నారు.
  3. E. కోలై బాక్టీరియాలో జీవపదార్ధం నందు ఒక చిన్న, గుండ్రటి DNA పోచ అంటి పెట్టుకుని ఉంటుంది. దీనినే ‘F ప్లాస్మిడ్’ అని అంటారు.
  4. F ప్లాస్మిడ్ ఉన్న కణాన్ని F+ కణం అని మరియు F ప్లాస్మిడ్ లేని కణాన్ని F కణం అని అంటారు.
  5. సంయుగ్మం నందు, F+ మరియు F కణాలు ఒక లైంగిక పిలై ద్వారా ఒక దానితో ఒకటి అంటి పెట్టుకుని సంయుగ్మనాళాన్ని ఏర్పరుచుకుంటాయి.
  6. F ప్లాస్మిడ్ ప్రతికృతి చెంది, DNA అణువును సంయుగ్మ నాళం ద్వారా F కణంకు రవాణా చేస్తుంది.
  7. F కణం F ప్లాస్మిడ్ను గ్రహించి తరువాత F+ కణంగా మారుతుంది.
  8. సంయుగ్మం తరువాత, రెండు కణాలు ఒకదాని నుంచి మరొకటి విడిపోతాయి.
  9. సంయుగ్మం అనేది ఒక సంరక్షణ ప్రక్రియ.
  10. సంయుగ్మం నందు దాత బాక్టీరియా జన్యుపదార్ధం బదిలీ జరగడానికి ముందే దాని నకలును తనయందు నిలిపి ఉంచుకుంటుంది.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
బాక్టీరియమ్లలో జరిగే వివిధ రకాల లైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులను వివరించండి.
జవాబు:
బాక్టీరియా నందు లైంగిక ప్రత్యుత్పత్తి: బాక్టీరియాలలో నిజమైన ప్రత్యుత్పత్తి జరగదు. లైంగిక ప్రత్యుత్పత్తిలో జరగవలసిన జన్యుపదార్ధ వినిమయం (జన్యు పునఃసంయోజనం) మూడు విధాలుగా జరుగుతుంది.
అవి 1) సంయుగ్మం 2) జన్యు పరివర్తన 3) జన్యువహనం
1. సంయుగ్మం:

  1. దాత బాక్టీరియమ్ నుంచి ప్రత్యక్షంగా గ్రహిత బాక్టీరియాకు జన్యుపదార్ధ (DNA) మార్పిడి సంయుగ్మనాళం ద్వారా జరుగుతుంది. దీనినే సంయుగ్మం అంటారు.
  2. ఈ విధానాన్ని మొదటగా 1946 లో లెడర్ బర్గ్ మరియు టాటమ్ అనే శాస్త్రవేత్తలు ‘ఈశ్చరీషియా కోలై’లో కనుగొన్నారు.
  3. సంయుగ్మం విధానం నందు ప్రత్యేక సంయుగ్మ పరికరం ఉంటుంది. దీనినే లైంగిక పిలై అంటారు.
  4. కణం నుంచి కణంకు తాకడం కొరకు దాతకణం F+ పిలైను ఏర్పరుస్తుంది.
  5. దీని ద్వారా ఇది గ్రహితకణం F-కణం తో బంధనం ఏర్పరుచుకుంటుంది.
  6. బంధనం తరువాత, పిలై చిన్నదిగా మారుతూ బాక్టీరియా కణాలను బాగా దగ్గరిగా చేరుస్తూ సంయుగ్మనాళాన్ని ఏర్పరుస్తుంది.
  7. F ప్లాస్మిడ్ ప్రతికృతిని ప్రారంభిస్తుంది.
  8. ప్రతికృతి చెందిన DNA అణువు, పిలై ఏర్పరిచిన సంయుగ్మనాళం ద్వారా గ్రహీత కణంకు చేరుతుంది.
  9. సంయుగ్మం అనేది ఒక సంరక్షణ ప్రక్రియ.
  10. సంయుగ్మం నందు దాత బాక్టీరియా, జన్యుపదార్ధం బదిలీ జరగడానికి ముందు దాని నకలును తనయందు
    నిలిపి ఉంచుకుంటుంది.

2) జన్యు పరివర్తన: దీనిని మొదటిసారిగా ఫ్రెడిరిక్ గ్రిఫిత్ ‘స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే’లో కనుగొన్నారు. జన్యు పరివర్తన అంటే నగ్న DNA మొక్కలను చుట్టూ ఉన్న పరిసర వాతావరణం నుంచి స్వీకరించి, గ్రహీత కణంలోకి ప్రవేశపెట్టడం వలన గ్రహీతకణము అంతకు ముందులేని లక్షణాన్ని పొందడం.

3) జన్యు వహనం: జన్యుపదార్ధం ఒక బాక్టీరియమ్ నుంచి వేరొక బాక్టీరియామ్కు, బాక్టీరియోఫాజ్ ద్వారా బదిలీ చెందడాన్ని ‘జన్యువహనం’ అంటారు. దీనిని లెడర్బర్గ్ మరియు జిండర్లు అనే శాస్త్రవేత్తలు ‘సాల్మోనెల్లా టైఫిమ్యూరియమ్’లో కనుగొన్నారు.

ప్రశ్న 2.
“బాక్టీరియమ్లు మానవాళికి మిత్రులుగాను, శత్రువులుగాను ఉంటాయి”-. ” చర్చించండి.
జవాబు:
కొన్ని బాక్టీరియాలు మొక్కలు, జంతువులు మరియు మానవులలో వ్యాధులను కలుగచేస్తాయి. మరికొన్ని బాక్టీరియాలు ప్రత్యక్షంగా (లేదా) పరోక్షంగా మానవులకు ప్రయోజనకరంగా ఉంటాయి. కావున వీటిని ‘మానవాళికి మిత్రులుగాను మరియు శత్రువులుగాను’ చెప్పవచ్చును.
1) ప్రయోజనకర అంశాలు:

  1. ఈరోజుల్లో సూక్ష్మజీవులను శిలల నుంచి యూరేనియం వంటి లోహలు గ్రహించుటకు వాడుతున్నారు. ఈ విధానాన్ని బయోమైనింగ్ అంటారు. సూక్ష్మ జీవులను ఉపయోగించడం వలన గనులు తవ్వడంలో అయ్యే ఖర్చును 50% కంటే పైగా తగ్గించుకోవచ్చు.
  2. బాక్టీరియాల DNA అనుఘటకాలను బయోసెన్సర్స్ ఉపయోగించటం వలన జీవక్రియావంతమైన విషపూరిత కాలుష్య కారకాలను గుర్తించవచ్చును.
  3. వైద్యంలో రోగ నిర్ధారణ కొరకు, ఆహారం మరియు కిణ్వ ప్రక్రియలకు కూడా వీటిని వినియోగిస్తున్నారు.
  4. జెనిటిక్ ఇంజనీరింగ్ విధానం ద్వారా బాక్టీరియాలలో జన్యు మార్పిడి జరిపే జీవసాంకేతిక ప్రక్రియ అతి ముఖ్యమైన ప్రగతిగా చెప్పవచ్చు.
  5. పోషకాల పునఃచక్రీయం మరియు ప్రకృతి పరిసరాల శుభ్రతలో బాక్టీరియాలు సహాయపడుతున్నాయి. కావున వీటిని ప్రకృతి శుద్దికారులుగా చెప్పవచ్చును.
  6. అమ్మోనీకరణం, నత్రీకరణం మరియు నత్రజని స్థాపనలో బాక్టీరియా చాలా ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఇలా నేల యొక్క సారాన్ని పెంచుటకు బాక్టీరియాలు సహాయపడుతున్నాయి.
  7. పొగాకు క్యూరింగ్లోను, నారతీయుటలోను మరియు పాలను పెరుగుగా మార్చుటకు బాక్టీరియా ఉపయోగకరంగా ఉన్నది.
  8. పేడ నుంచి కిణ్వన ప్రక్రియ ద్వారా మిథేన్ (లేదా) గోబర్ గ్యాస్ ను తయారు చేయవచ్చును.
  9. డిప్తీరియా మరియు న్యుమోనియా టీకా మందులను బాక్టీరియాల నుంచి ఉత్పత్తి చేస్తున్నారు.
  10. స్ట్రెప్టోమైసిన్ మరియు నియోమైసిన్ లాంటి సూక్ష్మజీవనాశకాలను పెద్దమొత్తంలో బాక్టీరియాల నుంచి ఉత్పత్తి చేస్తున్నారు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 7 బ్యాక్టీరియమ్లు
2) హానికారక అంశాలు:

  1. ఆహరపదార్ధాలను పాడుచేయుట :క్లాస్ట్రీడియమ్ బొట్యులినమ్ బాక్టీరియా అత్యంత హానికర విషపదార్థమైన ‘బొట్యులిన్’ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆహారాన్ని పాడుచేసే ఒక రకమైన విషం.
  2. మానవ వ్యాధులు:’సాల్మానెల్లాటైఫి బాక్టీరియా’ టైఫాయిడ్ జ్వరాన్ని, ‘మైక్రో బాక్టీరియమ్ లెప్రె’ కుష్ఠు వ్యాధిని మానవులలో కలుగజేస్తాయి. ఇంకా అనేక రకాల బాక్టీరియాలు మానవులలో అనేక వ్యాధులను కలుగజేస్తాయి.
  3. జంతువ్యాధులు: గొర్రెలలో ఆంధ్రాక్స్, కుక్క మరియు ఆవులలో ‘మైక్రో బాక్టీరియన్ ట్యూబర్ క్యూలోసిస్ ‘ లాంటి జంతు వ్యాధులు బాక్టీరియాల వలన కలుగుతాయి.
  4. మొక్కల వ్యాధులు: వరిలోని బ్రైట్ తెగులు, జాంథోమోనాస్ ఒరైజా వలన సిట్రస్ కాంకర్ తెగులు, జాంథోమోనాస్ ఆక్సనోపోడిస్ సిట్రి లాంటి కొన్ని మొక్కల వ్యాధులు బాక్టీరియాల వలన కలుగుతాయి.

Leave a Comment