AP Inter 2nd Year Botany Important Questions Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

Students get through AP Inter 2nd Year Botany Important Questions 14th Lesson మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Botany Important Questions 14th Lesson మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఎందువల్ల ‘స్విస్ జున్ను’ పెద్ద రంధ్రాలను కలిగి ఉంటుంది. దీనికి కారణమైన బాక్టీరియమ్ పేరును తెలపండి. [TS MAR-18,20][TS MAY-17][AP MAR-16,18,20]
జవాబు:

  1. స్విస్ జున్ను యందు పెద్ద రంధ్రాలు ఏర్పడుటకు గల కారణం అధిక మొత్తంలో CO2 ఉత్పత్తి అగుట.
  2. దీనికి కారణం ప్రోపియోని బాక్టీరియమ్.

ప్రశ్న 2.
ఫెర్మెంటర్స్ (Fermentors) అనేవి ఏమిటి? [TS MAY-22] [AP MAY-22] [APMAY-17]
జవాబు:
‘ఫెర్ మెంటర్స్’ అనేవి చాలా పెద్ద పాత్రలు. వీటిని పానీయాలు మరియు యాంటీబయాటిక్లలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయటానికి ఉపయోగిస్తారు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

ప్రశ్న 3.
స్టాటిన్ ఉత్పత్తి కోసం ఉపయోగించే సూక్ష్మజీవి పేరును తెలపండి. రక్తంలోని కొవ్వు స్థాయిని తగ్గించడానికి ఈ స్టాటిన్లు ఏ విధంగా ఉపయోగపడతాయి? [TS MAY-22] [AP MAR-15] [TS M-16,18]
జవాబు:

  1. ‘స్టాటిన్’ల ఉత్పత్తికి ఉపయోగించే సూక్ష్మజీవి ‘మొనాస్కస్ పర్ప్యూరస్’ అనే ఈస్ట్.
  2. ఈ ‘స్టాటిన్’ రక్తంలో క్రొవ్వును తగ్గించి, కొలెస్ట్రాల్ సంశ్లేషణకు సంబంధించిన ఎన్జైమ్ చర్యకు పోటీపడే నిరోధకంగా పనిచేస్తుంది.

ప్రశ్న 4.
మురుగునీటి ద్వితీయ శుద్ధి విధానాన్ని, జీవశాస్త్ర విధానమని పిలవడానికి మనం ఎందుకు ఎక్కువ ప్రధాన్యతనిస్తారు?
జవాబు:
నీటి యొక్క ద్వితీయ శుద్ధి విధానం నందు, గాలి ప్రవహించుట వలన వాయుసహిత సూక్ష్మజీవుల గుంపులు పెరుగుతాయి. ఇది BOD (జీవరసాయన ప్రాణ వాయువు అవసరం) ను తగ్గిస్తుంది.

ప్రశ్న 5.
న్యూక్లియోపాలి హెడ్రోవైరస్ (Nucleopoly hedro virus) లను ఈ రోజుల్లో ఎందుకు వాడుతున్నారు? [TS MAR-17,20]
జవాబు:

  1. ‘న్యూక్లియోపాలి హెడ్రోవైరస్’ కీటకాల జీవనియంత్రణకారి.
  2. ఇది ఒక కోరదగిన కీటక సంరక్షణ నిర్వహణ పధకం (లేదా) ఒక సున్నితమైన ఆవరణ ప్రదేశాన్ని పరీక్షా నిమిత్తం గురిచేసినప్పుడు ఇది చాలా అవసరం.

ప్రశ్న 6.
యాంటీ బయోటిక్ లను కనుగొనుట వల్ల వైద్య రంగంలో మానవ సంక్షేమానికి ఏవిధంగా ఉపయోగపడినది?
జవాబు:

  1. యాంటీ బయోటిక్లు కొన్ని సూక్ష్మజీవులచే ఉత్పత్తి చేయబడిన ‘రసాయన పదార్థాలు’.
  2. ఇవి వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను ‘చంపటం లేదా వాటి ‘పెరుగుదలను’ అదుపు చేయుట చేస్తాయి.
  3. ఎంతో ప్రాణాంతక వ్యాధులైన ప్లేగు, కోరింతదగ్గు, డీప్తీరియా మరియు కుష్టు వ్యాధి వంటివి భూమిపై కొన్ని లక్షల మందిని నశింపజేస్తున్నాయి. యాంటిబయోటిక్ల ద్వారా వీటన్నింటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందగలిగాం.

ప్రశ్న 7.
కొన్ని మత్తు పదార్థాల తయారీలో కాచి వడబోయుట అనునది ఎందుచేత అవసరం?
జవాబు:

  1. మత్తు పదార్థాల తయారీ ‘కిణ్వ ప్రక్రియ’ విధానంలో జరుగుతుంది. ఈ ప్రక్రియకు ఉపయోగించే ముడి పదార్థం రకాన్ని బట్టి మరియు ప్రక్రియను బట్టి (స్వేదనం వల్ల లేదా స్వేదనం లేకుండా) మద్యపానీయాలను తయారు చేస్తారు.
  2. సూప్ లాంటి పదార్థ కిణ్వనం ద్వారా ఏర్పడే వైన్, బీర్ ప్రత్యక్షంగా స్వేదనం లేకుండా వడబోయకుండా తయారవుతాయి.
  3. విస్కి, బ్రాంది మరియు రమ్ లాంటివి స్వేదనం (వడబోత) ద్వారా ఉత్పత్తి చేయబడతాయి.

ప్రశ్న 8.
ఆస్పరిజిల్లస్ నైజర్, క్లాస్ట్రీడియమ్ బొట్యులినమ్, లాక్టోబాసిల్లస్లు, ఒకే రకంగా చూపే ముఖ్యమైన లక్షణం ఏది?
జవాబు:

  1. ఆస్పరిజిల్లస్ నైజర్, క్లాస్ట్రీడియమ్ బొట్యులినమ్ మరియు లాక్టోబాసిల్లస్ అన్నీ కూడా ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి.
  2. ఆస్పరిజిల్లస్ నైజర్, ‘సిట్రిక్ ఆమ్లాన్ని’ ఉత్పత్తి చేస్తుంది.
  3. క్లాస్ట్రీడియమ్ బొట్యులినమ్ ‘బ్యూటరిక్ ఆమ్లాన్ని’ ఉత్పత్తి చేస్తుంది.
  4. లాక్టోబాసిల్లస్ ‘లాక్టిక్ ఆమ్లాన్ని’ ఉత్పత్తి చేస్తుంది.

ప్రశ్న 9.
బయోటెక్నాలజీలో ఉపయోగించే రెండు సూక్ష్మ జీవులను తెల్పండి.
జవాబు:

  1. ఈశ్చరీషియా కోలై: ఇది ఒక ప్లాస్మిడ్ ప్రయోగశాలలయందు వీటిని ‘క్లోనింగ్ వాహకంగా’ ఉపయోగిస్తారు.
  2. ఎగ్రోబాక్టీరియం ట్యూఫికెన్స్: ఇది Ti ప్లాస్మిడ్ వీటిని మొక్కలలో ‘జన్యు రవాణా వాహకంగా’ ఉపయోగిస్తారు.

ప్రశ్న 10.
ఏవైనా రెండు జన్యురూపాంతరం చెందిన పంటల పేర్లను పేర్కొనండి.
జవాబు:
Bt-ప్రత్తి మరియు Bt- వంగ.

ప్రశ్న 11.
నీలి ఆకుపచ్చ శైవలాలు ఎందుచేత జీవ ఎరువులుగా ప్రఖ్యాతి చెందలేదు?
జవాబు:

  1. నీలిఆకుపచ్చశైవలాలు (నాస్టాక్, అనబినా) వాతావరణ నత్రజనిని కర్బన పద్ధతిలో మాత్రమే స్థాపిస్తాయి.
  2. నీలి ఆకుపచ్చ శైవలాలు జిగురు వంటి నిర్మాణాలు ఇవి పంటభూములను జారుడుగా మారుస్తాయి.
  3. కావున నీలి ఆకుపచ్చ శైవలాలు జీవ ఎరువులుగా ప్రఖ్యాతి చెందలేదు.

ప్రశ్న 12.
ఏ జాతికి చెందిన పెన్సిలియం ‘రాకీఫోర్ట్ జున్ను’ తయారు చేస్తుంది. [AP MAR-19][AP, TS MAR-17]
జవాబు:

  1. ‘పెన్సిలియం రాకీఫోర్ట్’ రాకీఫోర్ట్ జున్నును ఉత్పత్తి చేస్తుంది.
  2. ఇది ‘రాకీఫోర్ట్ జున్ను’ పై పెరిగి పండిన తరువాత ఒక ప్రత్యేకమైన సువాసనను ఇస్తుంది.

ప్రశ్న 13.
పారిశ్రామికంగా ఉపయోగపడే రెండు ఎన్జైమ్లు తెలపండి. [TS MAY-22] [AP MAY -22]
జవాబు:
ఎమైలేజ్, లైపేజ్, స్ట్రెప్టోకైనేజ్లు.

ప్రశ్న 14.
ఒక రోగనిరోధకతను అణచివేసే కారకం పేరును తెలపండి. [TS M-19][AP MAR-16]
జవాబు:

  1. ‘సైక్లోస్పోరిన్’ ను ‘రోగ నిరోధకత బహిరంగం కాకుండా’ ఉండే సహకరిగా ఉపయోగిస్తారు.
  2. ‘ట్రైకోడెర్మా పాలిస్పోరమ్’ అనేశిలీంధ్రం దీనిని ఉత్పత్తి చేస్తుంది.

ప్రశ్న 15.
ఒక దండాకారవైరస్కి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పొగాకు మొజాయిక్ వైరస్ (TMV) దండాకార వైరస్.

ప్రశ్న 16.
పశువుల జీర్ణాశయం, మురుగు నీటి అడుగునుండే ముద్ద మట్టి ఏ రకమైన బాక్టీరియమ్ల సమూహాన్ని కలిగి ఉంటాయి?
జవాబు:
మిథనోజన్లు

ప్రశ్న 17.
వరి పొలాలలో సయానోబాక్టీరియమ్లు ఎందువల్ల ఉపయోగకరమైనవని తలుస్తారు?
జవాబు:

  1. సయానోబాక్టీరియాలు వాతావరణ నైట్రోజనిని స్థాపన చేస్తాయి.
  2. వీటిని ముఖ్యమైన జీవ ఎరువులుగా వినియోగిస్తారు.
  3. ఇవి నేల సారాన్ని పెంచడానికి సేంద్రియ పదార్థాలను సమకూరుస్తాయి.
    ఉదా: అనబీనా నాస్టాక్, ఆసిల్లటోరియా
  4. నిస్సారంగా మారిన పొలాలను సారవంతం చేస్తాయి.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

ప్రశ్న 18.
ఏ ఆహార పదార్థంలో మీరు లాక్టిక్ ఆమ్ల బాక్టీరియమ్ను గుర్తిస్తారు? ఆ బాక్టీరియమ్ పేరును తెల్పండి.
జవాబు:

  1. లాక్టిక్ ఆమ్ల బాక్టీరియాను ‘పాలలో’ గుర్తిస్తారు.
  2. బాక్టీరియమ్ పేరు ‘లాక్టోబాసిల్లస్’.

ప్రశ్న 19.
యాంటీబయోటిక్లల ఉత్పత్తి కొరకు ఉపయోగించే ఏవైనా రెండు శిలీంధ్రాల పేర్లను పేర్కొనుము.
జవాబు:

  1. పెన్సిలియం నొటాటమ్ పెన్సిలిన్
  2. పెన్సిలిన్ గ్రెసోఫ్లావస్ – గ్రెసోఫల్విన్

ప్రశ్న 20.
పెనిసిలిన్ను యాంటీబయాటిక్గా గా ఉపయోగించే కార్యవిధానం చూపించిన శాస్త్రవేత్తల పేర్లను తెలపండి. [TS M-19]
జవాబు:

  1. ‘అలెగ్జాండర్ ఫ్లెమింగ్’ పెన్సిలిన్ మందును కనుగొన్నాడు.
  2. ‘ఎర్నెస్ట్రన్ మరియు హోవార్డ్ ఫ్లోరీలు’ పెన్సిలిన్ను అమోఘమైన యాంటిబయాటిక్గా నిరూపించారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
జీవశాస్త్ర విధానంతో వ్యర్ధ జలాలను శుద్ధి చేసే ప్రక్రియలో సూక్ష్మజీవుల సమూహాల(Flocs) ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
వాయుసహిత బాక్టీరియా సమూహాలు శిలీంధ్ర తంతువులుగా కలిసి ఒక వల వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. వీటినే సూక్ష్మజీవుల సమూహాలు (గుంపులు) అంటారు.
ప్రాముఖ్యత:

  1. ప్రాథమిక ద్రవ వ్యర్థాన్ని పెద్దవిగా, గాలి ప్రవహించే టాంక్లలోకి ప్రవహింపజేస్తారు. ఇక్కడ వాయుసహిత సూక్ష్మజీవులు గుంపులుగా పెరుగుతాయి.
  2. ఇవి వ్యర్థంలోని కర్బన పదార్థాన్ని వినియోగించుకోవటం వలన జీవరసాయన ప్రాణవాయువు అవసరం (BOD) తగ్గిపోతుంది.
  3. BOD తగ్గిన వ్యర్ధద్రవపదార్థాన్ని బాక్టీరియామ్ గుంపులుగా ఉన్న ట్యాంక్ లోనికి పంపించినపుడు అవి ముద్దగా అడుగుకు చేరతాయి. దీనినే ‘చురుకైన ఘనపదార్థం’ (activated sludge) అంటారు.
  4. అవాయు సహిత ఘనపదార్థ జీర్ణసహాయకారులను ఈ ట్యాంక్ లోనికి ప్రవేశపెడతారు. అవాయుసహితంగా పెరిగే బాక్టీరియాలు మట్టి పదార్థంలోని బాక్టీరియాలను మరియు శిలీంధ్రాలను జీర్ణం చేస్తాయి.
  5. బయోగ్యాస్ వాయువుల విడుదల జరుగుతుంది. ద్వితీయ శుద్ధి తరువాత వ్యర్థాన్ని సాధారణ నీటి వనరులలోకి విడుదల చేస్తారు. ఈవిధంగా వ్యర్ధజలాల శుద్ధికి సూక్ష్మజీవుల సమూహాలు సహాయపడతాయి.

ప్రశ్న 2.
కీటక చీడలను నియంత్రించడంలో బాసిల్లస్ థురింజియన్సిస్ ఏవిధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:

  1. ‘జన్యుపరంగా రూపాంతరం చెందిన జీవులు కలిగిన’ సూక్ష్మజీవుల నియంత్రణ సహకారులకు ‘బాసిల్లస్ థురింజియన్సిస్’ బాక్టీరియాను ఉదాహరణగా చెప్పవచ్చు.
  2. దీని ద్వారా సీతాకోకచిలుకల గొంగళిపురుగులను నియంత్రించవచ్చు. ఇవి ఎండిన సూక్ష్మబీజములుగా ప్యాకెట్ల రూపంలో దొరుకుతాయి. వీటిని నీటిలో కలిపి పండ్ల చెట్లపై మరియు బ్రాసికా మొక్కలపై పిచికారి చేయడం వలన కీటక లార్వాలు భుజిస్తాయి.
  3. లార్వా జీర్ణకోశంలో విషపూరిత పదార్థం విడుదల అవడం ద్వారా లార్వా చనిపోతుంది.
  4. ఈ బాక్టీరియమ్ వ్యాధి గొంగళిపురుగులను మాత్రమే చంపివేస్తుంది, మిగతా కీటకాలకు హాని చేయదు.
  5. జన్యుఇంజనీరింగ్ పద్ధతి ద్వారా శాస్త్రజ్ఞులు ‘బాసిల్లస్ థురింజియన్సిస్’ లోని విషపూరిత జన్యువులను మొక్కలలో ప్రవేశపెట్టారు. అటువంటి మొక్కలు కీటకాలు, చీడలకు ఎదురు నిలుస్తాయి.
    ఉదా: Bt-ప్రత్తి, Bt-వంగ.

ప్రశ్న 3.
మైకోరైజా శిలీంధ్రాలు మొక్కలను అంటిపెట్టుకొని ఏ విధంగా వాటికి సహాయపడతాయి?
జవాబు:

  1. శిలీంధ్రాలు ప్రసరణ కణజాలం కల మొక్కల వేర్లతో సహజీవనం చేస్తాయి. ఇటువంటి సహవాసాన్ని ‘మైకోరైజా’ (శిలీంధ్ర మూలం) అంటారు.
  2. ‘గ్లోమస్’ ప్రజాతికి చెందిన అనేక శిలీంధ్రాలు ‘శిలీంధ మూలాన్ని’ ఏర్పరుస్తాయి.
  3. సహజీవన సహవాసంలోని శిలీంధ్రం, మొక్కచేత మృత్తిక నుంచి ఫాస్ఫరసన్ను శోషించే విధంగా చేస్తుంది.
  4. ఇటువంటి సహవాసాలతో కూడిన మొక్కలు వేరు తొలిచే వ్యాధి జనకం నుంచి నిరోధకత ఉప్పునీటికి, నీటి కొరతకు ఓర్చుకొనుట, మొక్క పెరుగుదల మరియు అభివృద్ధి మొత్తంగా జరిగేలా చూడటం లాంటి లాభాలను పొందుతాయి.

ప్రశ్న 4.
పెన్సిలిన్ ను ఏవిధంగా కనుగొన్నారు?
జవాబు:

  1. పెన్సిలిన్ ను మొదటగా ‘అలెగ్జాండర్ ఫ్లెమింగ్’ కనుగొన్నాడు.
  2. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్టాఫిలోకోకై బాక్టీరియా మీద పరిశోధన చేస్తున్నప్పుడు ‘వర్ధన పళ్ళెం’ చుట్టూ ఒక రకం శిలీంధ్రం పెరగడం వల్ల ‘స్టాఫిలోకోకై’ పెరగలేదు.
  3. శిలీంధ్రం ఒక రసాయన పదార్థాన్ని ఉత్పత్తి చేయడం వలన బాక్టీరియా పెరగలేదు.
  4. ‘పెనిసిలియం నోటేటం’ అనే శిలీంధ్రం వలన ఆ రసాయన పదార్ధానికి ‘పెన్సిలిన్’ అని నామకరణం చేసాడు.
  5. ‘ఎర్నస్ట్ చైన్’ మరియు ‘హోవార్ట్ ఫ్లోరె’ రెండవ ప్రపంచ యుద్ధంలో గాయపడిన సైనికుల చికిత్స కొరకు దీన్ని విరివిగా ఉపయోగించారు.
  6. ఈ ఆవిష్కరణకు ఫ్లెమింగ్, చైన్ మరియు ఫ్లోరెలకు 1945లో నోబెల్ బహుమతిని ఇచ్చారు.
  7. పెన్సిలిన్ తరువాత, అనేక ఇతర యాంటీబయాటిక్లను ఇతర సూక్ష్మజీవుల నుంచి శుద్ధి చేసారు. వీటి ద్వారా ప్రాణాంతక వ్యాధులైన ప్లేగు, కోరింతదగ్గు, డిప్తీరియా మరియు కుష్ఠువ్యాధి వంటి వాటికి చికిత్స చేసారు.

ప్రశ్న 5.
మానవుల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో శిలీంధ్రాల మూలమైన జీవసామర్థ్య అణువులు ఏవిధంగా సహాయపడతాయి?

  1. సైక్లోస్పోరిన్ ఎ, ఒక క్రియాత్మక అణువు. ఇది అవయవమార్పిడి జరిగే రోగులకు రోగనిరోధకత బహిరంగంగా కాకుండా ఉండే సహాకారిగా ఉపయోగిస్తారు. దీనిని ‘ట్రైకోడర్మా పాలిస్పోరమ్’ అనే శిలీంధ్రం ఉత్పత్తి చేస్తుంది.
  2. ‘మొనాస్కస్ పర్ఫ్యూరస్’ అనే ఈస్ట్, రక్తంలో క్రొవ్వును తగ్గించే “స్టాటిన్ల”ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ సంశ్లేషణకు సంబంధించిన ఎన్జైమ్ చర్యకు పోటీపడే నిరోధకంగా పని చేస్తుంది.

ప్రశ్న 6.
బయోగ్యాస్ రసాయనిక స్వభావాన్ని తెలపండి. బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను వివరించండి.
జవాబు:
బయోగ్యాస్ నందు మీథేన్ (CH4), CO2, కొద్ది మొత్తంలో హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు తేమను కలిగి ఉంటాయి. ఇది విసర్జక పదార్ధాల విచ్ఛిన్నం (లేదా) ఆవు పేడ (సాధారణంగా గోబర్ అంటారు. ), గృహల మొక్క వ్యర్థాలు, పారిశ్రామిక మరియు వ్యవసాయం మురుగులలో అవాయుసహిత బాక్టీరియా వలన కలుగుతుంది.

a) మురుగు నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి:

  1. ఈ చురుకైన మట్టి పదార్ధంలోని కొంత భాగాన్ని వాయుపూరిత ట్యాంక్లో నికి అంతర్నివేశంగా పనిచేయడానికి ఉపయోగిస్తారు.
  2. గాలి ప్రవహించే ట్యాంక్లలోని అవాయు సహిత బాక్టీరియాయైన మిధనోజన్లు, మురుగులోని బాక్టీరియా మరియు శిలీంధ్రాలను జీర్ణం చేస్తాయి.
  3. ఈ జీర్ణక్రియలో బాక్టీరియాలు మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు CO2 లాంటి మిశ్రమ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. వీటినే ‘బయోగ్యాస్ వాయువులు’ అంటారు.

b) పేడ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి:

  1. బయోగ్యాస్ ప్లాంట్లోని ఒక సిమెంట్ ట్యాంక్( 14 -15 అడుగుల లోతు) లోకి జీవ వ్యర్థాలను సేకరించి దానికి పలుచగా ఉండే పేడను కలుపుతారు.
  2. ఈ పలుచని పేడ భాగంపై తేలుతూ ఒక పొర ఏర్పడుతుంది. ఇది సూక్ష్మజీవుల చర్యవలన ట్యాంక్ అడుగున గ్యాస్ ఉత్పత్తిని పెంచుతుంది.
  3. బయోగ్యాస్ ప్లాంట్కు ఉన్న బయటకు పోవు మార్గం పైపు ద్వారా దగ్గరలోని నివాస గృహాలను కలుపుతూ బయోగ్యాస్ ను సరఫరా చేస్తుంది.
  4. వేరొక మార్గం ద్వారా వినియోగించబడిన పేడను బయటకుపంపుతుంది. దీన్ని ఎరువుగా వినియోగిస్తారు.

ప్రశ్న 7.
“క్లాట్ బస్టర్”గా ఏ బాక్టీరియమ్ను ఉపయోగిస్తారు? దీని చర్యావిధానం ఎలా ఉంటుంది?
జవాబు:

  1. “స్ట్రెప్టోకోకస్ బాక్టీరియమ్లు” ను “క్లాట్ బస్టర్”గా ఉపయోగిస్తారు.
  2. ఈ బాక్టీరియమ్లు ఉత్పత్తి చేసే స్ట్రెప్టోకైనేజ్ ఎన్జైము జెనెటిక్ ఇంజినీరింగ్ పద్ధతిలో రూపాంతరం చేసి హృదయ కణజాలాల సంక్రమణం కలిగిన రోగులలో గుండెపోటు రాకుండా, వీరి రక్తనాళాలలో ఏర్పడే గడ్డలను తొలగించుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
జీవఎరువులు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలను ఇచ్చి జీవ ఎరువులుగా వాటి పాత్రను చర్చించండి.
జవాబు:
మృత్తిక పోషణ, సహజగుణాన్ని పెంచే జీవులనే ‘జీవ ఎరువులు’ అంటారు. బాక్టీరియా, శిలీంధ్రాలు మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు జీవ ఎరువులకు ముఖ్య వనరులు.

  1. లెగ్యుమినస్ మొక్క వేర్ల బుడిపెలలో కల రైజోబియం, వాతావరణ నత్రజని స్థాపించే మొక్కలు వినియోగించుకునే పోషణలను అందిస్తుంది.
  2. నీలి ఆకుపచ్చ శైవలాలు అనేవి స్వయం పోషక సూక్ష్మజీవులు. ఇవి వరి పంటలో జీవన ఎరువులుగా ముఖ్యపాత్రను పోషిస్తాయి. ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు మృత్తికను సారవంతం చేయుటకు కర్బన పదార్థాలను కూడా అందిస్తాయి. ఉదా: అనబినా, నాస్టాక్, ఆసిల్లాటోరియా

AP Inter 2nd Year Botany Important Questions Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

ప్రశ్న 9.
మనం ఉతికే బట్టలకు ఉపయోగించే డిటర్జెంట్ లోని ఎన్జైమ్ల పాత్ర ఎటువంటిది? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
డిటర్జెంట్ లోని ఎన్ఎమ్ల పాత్ర:

  1. లైపేజ్లను సబ్బుల తయారీ సూత్రంలో మరియు ‘బట్టలపై నూనె మరకలను తొలగించడంలో ఉపయోగిస్తారు.
  2. అమైలేజ్ ‘పిండి ఆధారిత మరకలను’ చిన్న చిన్న భాగాలుగా విచ్ఛిన్నం చేస్తుంది.
  3. ప్రోటియేజ్లు ‘ప్రోటీన్ ఆధారిత మరకలు’ అయిన రక్తం, గ్రుడ్లు మొదలైనవి విచ్ఛిన్నం చేస్తుంది.
  4. డిటర్జెంట్లోని ఎన్జైమ్లు ‘వేడి నీటి’ యందు ప్రభావితమైన ఉతుకును మరియు బట్టల రంగు పాడవకుండా
    ఉంచుతాయి.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
(a) శుద్ధి పరచని మురుగు నీటిని ఎక్కువ మొత్తంగా నదులలోకి విడుదల చేస్తే ఏమి జరుగుతుంది? [TS M-22]
(b) ఏ విధంగా అవాయుపూరిత మురుగు మట్టిని జీర్ణింపచేయుట అనేది మురుగునీటి శుద్ధి విధానంలో ముఖ్యమైనది?
జవాబు:
నగరాలు మరియు పట్టణాలలో ప్రతిరోజు అధిక మొత్తంలో పనికిరాని వ్యర్ధమైన నీరు ఉత్పత్తి అవుతుంది. మునిసిపాలీటీల యొక్క వ్యర్ధనీరును ‘మురుగునీరు’ అని అంటారు. ఈ మురుగును నదులు మరియు కాలువలోనికి విడుదల చెయ్యటానికి ముందే మురుగు నీరు పరిశుద్ధ పరిచే యంత్రాల (STPs) ద్వారా శుద్ధి చేయడం వల్ల అది తక్కువ కాలుష్యం కలుగజేస్తుంది. ఈ శుద్ధి విధానం రెండు దశలుగా జరుపబడుతుంది.
I) ప్రాధమిక శుద్ధి విధానం:

  1. ఈ విధానంలో భౌతికంగా కనిపించే పెద్ద మరియు చిన్న పదార్ధల భాగాల వడపోత మరియు అవసాదనం
    జరుగుతుంది.
  2. ముందుగా తేలుతున్న వ్యర్ధపదార్ధాలను వరుస వడపోతలతో తీసివేస్తారు.
  3. తరువాత గ్రిట్ (మట్టి మరియు చిన్న రాళ్ళు) ను అవసాదనం ద్వారా తీసి వేస్తారు.
  4. అడుగున ఉండిపోయిన వ్యర్ధం ప్రాధమిక ఘనపదార్ధాన్ని ఏర్పరుస్తుంది. ఇది ద్రవ వ్యర్ధాన్ని ఏర్పరుస్తుంది.
  5. ప్రాధమిక ఘనపదార్థంలోని ద్రవ వ్యర్ధాన్ని ‘ద్వితీయశుద్ధి విధానము’కు తీసుకుంటారు.

II) ద్వితీయ శుద్ది విధానం (లేదా) జీవశాస్త్ర విధానం:

  1. ప్రాధమిక ద్రవ వ్యర్ధాన్ని చాలా పెద్దవిగా ఉన్న గాలి ప్రవహించే టాంక్ల లోనికి ప్రవేశపెడతారు. ఇక్కడ అదేపనిగా యంత్రాలు కదులుతూ ఉండటం వల్ల గాలి వ్యర్ధంలోనికి ప్రసారం అవుతుంది.
  2. ఇది వాయుసహిత సూక్ష్మజీవులు గుంపులుగా (బాక్టీరియా సముహలు శిలీంధ్ర తంతువులుగా కలిసి ఒక వల నిర్మాణాన్ని ఏర్పరచడం) ఏర్పడేలా చేస్తుంది.
  3. ఈ సూక్ష్మజీవులు పెరుగుతూ ద్రవ వ్యర్ధం నుంచి ఎక్కువ శాతం కర్బన పదార్థాన్ని వినియోగించుకుంటూ, BOD ను తగ్గిస్తాయి.
  4. ఈ ద్రవ వ్యర్ధంను ట్యాంక్ లోనికి ప్రవేశపెట్టగా, సూక్ష్మజీవులు గుంపులుగా, ముద్దలుగా అడుగున చేరతాయి.
  5. ముద్దగా ఉండే ఈ భాగాన్ని ‘చురుకైన ఘనపదార్ధం’ అంటారు.
  6. ఈ చురుకైన మట్టి పదార్ధం లోని కొంత భాగం తిరిగి వాయుపూరిత ట్యాంక్లోనికి అంతర్నివేశంగా పనిచేయడానికి పంపిస్తారు.
  7. మిగిలిన భాగాన్ని అవాయు సహిత ఘనపదార్ధ జీర్ణ సహకారులు ట్యాంక్ లోనికి పంపుతారు.
  8. ఇక్కడ ఇతర అవాయు సహితంగా పెరిగి బాక్టీరియాలు మట్టి పదార్ధంలోని బాక్టీరియమ్లను, శిలీంధ్రాలను జీర్ణం చేస్తాయి.
  9. ఈ జీర్ణక్రియలో బాక్టీరియమ్లు మిశ్రమ వాయువులైన మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ లను ఉత్పత్తి చేస్తాయి.
  10. ఈ వాయువులు ‘బయోగ్యాస్’ ను ఉత్పత్తి చేస్తాయి. దీనికి మండేగుణం ఉండటం వలన దీనిని శక్తివనరుగా వినియోగిస్తారు.
  11. ద్వితీయ శుద్ధి విధానం ద్వారా ఏర్పడిన ద్రవవ్యర్ధ పదార్ధాన్ని సాధారణంగా ప్రకృతి సిద్ధమైన నీటి వనరులైన నదులు మరియు సరస్సుల్లోకి విడుదల చేస్తారు.

ప్రశ్న 2.
లాక్టిక్ ఆమ్ల బాక్టీరియమ్లు ఏ రకమైన ఆహారాలలో ఉంటాయి? దీని ఉపయోగాల గురించి చర్చించండి.
జవాబు:
లాక్టిక్ ఆమ్ల బాక్టీరియమ్లు(LAB) ఉన్న ఆహారపదార్థాలు : పాలు, ఫలాలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, వైన్ మరియు మాంసం.

  1. LAB (లాక్టిక్ ఆమ్ల బాక్టీరియా) పాలను పెరుగుగా మారుస్తుంది.
  2. LAB ఆమ్లాలను ఉత్పత్తి చేసి, గట్టిగా మార్చి పాల ప్రోటీన్లను కొంతభాగం జీర్ణం చేస్తుంది.
  3. LAB పెరుగులో విటమిన్ B12 అభివృద్ధి చెందించడం వలన పోషక విలువలు పెరుగుతాయి.
  4. LAB మానవుల ప్రేగు నందలి వ్యాధి కారక బాక్టీరియాలను గుర్తించి ‘ప్రోబయోటిక్స్’ అనే భావనను అభివృద్ధి చేసింది.
  5. LAB ప్రతిసూక్ష్మజీవికారిగా పని చేస్తుంది.
  6. LAB హెక్సోజ్ చక్కెరలను కిణ్వనం చెందించి, లాక్టిక్ ఆమ్లంను ఏర్పరుస్తుంది.
  7. LAB పాలఉత్పత్తులు, మాంసాహార ఉత్పత్తులలో పులియపెట్టే పదార్థాల తయారీ (బేకింగ్, వైన్) మొదలైన వాటిలో కిణ్వనకారిగా వినియోగిస్తారు.

ప్రశ్న 3.
జీవనియంత్రణ వాహకాలైన సూక్ష్మజీవుల గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
జీవనియంత్రణ అనేది మొక్కల వ్యాధులు మరియు కీటకాలను జీవశాస్త్ర పద్ధతిలో నియంత్రించే విధానం.
వ్యాధులు మరియు కీటకాల నియంత్రణకు రసాయానాలను వినియోగించుట వలన అవి మానవులకు, జంతువులకు, వాతావరణం (నేల, భూగర్భజలం), పండ్లు, కాయగూరలు, పంట మొక్కలను కాలుష్యానికి గురి చేస్తున్నాయి. కలుపు మొక్కల నివారణకు వాడే కలుపు నాశకముల ద్వారా కూడా నేల కాలుష్యానికి గురి అవుతుంది. చీడలు, వ్యాధుల

జీవశాస్త్ర నియంత్రణ:
జీవవైవిధ్యం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని జీవసంరక్షక వ్యవసాయదారుని లేదా సేంద్రీయ వ్యవసాయదారుని (Organic Farmer) బలమైన నమ్మకం.

వ్యవసాయదారుడు పచ్చికలో వైవిధ్యం, సజీవ ఉత్తేజమైన జీవావరణ వ్యవస్థ మరియు “సాంప్రదాయ” సిద్ధ వ్యవసాయ పద్ధతులను వినియోగిస్తూ, రసాయనాల వాడకంను తగ్గించుకుంటూ, జీవరాశుల వ్యత్యాసం లేకుండా చేసే వ్యవసాయాన్ని ‘సేంద్రీయ వ్యవసాయం’ లేదా ‘జీవ సంరక్షక వ్యవసాయం’ అంటారు.

జీవ సంరక్షక వ్యవసాయదారుని ఉద్దేశంలో చీడలుగా చెప్పబడే జీవులను పూర్తిగా నాశనం చేయడం జరగదు. కాని వాటిపై ఆధారపడి జీవించే భక్షిత జీవులు మనుగడ సాగించలేవు.

జీవనియంత్రణ సహకారులుగా సూక్ష్మజీవులను ఉపయోగించుట:
‘జన్యుపరంగా రూపాంతరం చెందిన జీవులు కలిగిన’ సూక్ష్మజీవుల నియంత్రణ సహకారులకు ‘బాసిల్లస్ థురింజియన్సిస్’ బాక్టీరియాను ఉదాహరణగా చెప్పవచ్చు.

దీని ద్వారా సీతాకోకచిలుకల గొంగళిపురుగులను నియంత్రించవచ్చు. ఇవి ఎండిన సూక్ష్మబీజములుగా ప్యాకెట్లలో దొరుకుతాయి. వీటిని నీటిలో కలిపి పండ్ల చెట్లపై మరియు బ్రాసికా మొక్కలపై పిచికారి చేయడం వలన కీటకు లార్వాలు భూజిస్తాయి.

లార్వా జీర్ణకోశంలో విషపూరిత పదార్థం విడుదల అవడం ద్వారా లార్వా చనిపోతుంది.

ఈ బాక్టీరియమ్ వ్యాధి గొంగళిపురుగులను మాత్రమే చంపివేస్తుంది, మిగతా కీటకాలకు హాని చేయదు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

జన్యుఇంజనీరింగ్ పద్ధతి ద్వారా శాస్త్రజ్ఞులు ‘బాసిల్లస్ థురింజియన్సిస్’ లోని విషపూరిత జన్యువులను మొక్కలలో ప్రవేశపెట్టారు. అటువంటి మొక్కలు కీటకాలు, చీడలకు ఎదురు నిలుస్తాయి. ఉదా: Bt-ప్రత్తి, Bt-వంగ.

‘ట్రైకోడర్మా’ మొక్కలోని వ్యాధి చికిత్సా పద్ధతి కోసం అభివృద్ధి చేసిన శిలీంధ్రం. ఇవి స్వేచ్ఛగా జీవించే శిలీంధ్రాలు. అనేక వృక్ష వ్యాధి జనకాలకు ఇవి సమర్థవంతమైన జీవనియంత్రణకారులు.

Leave a Comment