AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం

Students get through AP Inter 2nd Year Botany Important Questions 10th Lesson అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Botany Important Questions 10th Lesson అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
DNA పాకేజింగ్ హిస్టోన్ల విధి ఏమిటి?
జవాబు:

  1. హిస్టోన్ అణువుల విధి ప్రమాణంగా అమరి ఉన్న నిర్మాణాత్మక DNA ను చుట్టుకొని ‘న్యూక్లియోసోమ్’ అనే నిర్మాణాన్ని ఏర్పరచటం.
  2. హిస్టోన్లు ‘క్రొమాటిన్’ యొక్క ముఖ్య ప్రోటీనులు. ఇవి కణ కేంద్రకం యొక్క అంశాలు.
  3. DNA, హిస్టోన్ అణువులతో చుట్టుకోబడి ‘జన్యు నియంత్రణ’లో పాత్ర వహిస్తుంది.

ప్రశ్న 2.
హెటిరోక్రొమాటిన్, యూక్రొమాటిను ఉన్న భేదాన్ని తెల్పండి. అనులేఖనం రీత్యా ఏది క్రియాత్మకంగా ఉంటుంది. [AP MAR-20][TS MAY-22]]
జవాబు:
హెటిరోక్రొమాటిన్

  1. ఈ క్రొమాటిన్ ధృడంగా ఉండి, ఎక్కువ అభిరంజనాన్ని తీసుకుంటుంది.
  2. ఇది ‘క్రియారహితం’.

యూక్రొమాటిన్

  1. ఈ క్రొమాటిన్ వదులుగా ఉండి, తక్కువ అభిరంజనాన్ని తీసుకుంటుంది.
  2. ఇది అనులేఖనం రీత్యా ‘ఉత్తేజంగా’ ఉంటుంది.

ప్రశ్న 3.
DNA జన్యుపదార్ధం అని ఎవరు ఋజువు చేశారు? ఏ జీవిపైన తమ నిర్ధారణ పరీక్షలను కొనసాగించారు? [TS M-19][AP MAY-17]
జవాబు:

  1. ‘ఆల్ఫ్రెడ్ హెర్షీ మరియు మార్ధాచేజ్’, DNA ను జన్యుపదార్ధంగా నిర్ధారించారు.
  2. వీరు బాక్టీరియమ్లకు వ్యాధిని సంక్రమింపచేసే బాక్టీరియో ఫాజ్లనే వైరస్ల పై పరిశోధనలు జరిపారు.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం
ప్రశ్న 4.
DNA పాలిమరేజ్ విధి ఏమిటి?
జవాబు:

  1. DNA పాలిమరేజ్ ఎన్ఎమ్ చాలా శక్తివంతమైనది. ఇది తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలోని న్యూక్లియోటైడ్ పాలిమరైజేషన్ పుంజీకరణను ఉత్ప్రేరితం చేస్తుంది.
  2. ఇది అధికస్థాయి స్పష్టతతో చర్యను ఉత్ప్రేరితం చేస్తుంది.

ప్రశ్న 5.
న్యూక్లియోటైడ్లో గల అనుఘటకాలు ఏవి? [APMAY-19,22][TS MAR-18,20,22][APMAR-17,18]
జవాబు:
న్యూక్లియోటైడ్లో మూడు అనుఘటకాలు ఉంటాయి. అవి: నత్రజని క్షారం, పెంటోస్ చక్కెర, ఫాస్పేట్ అణువు.

ప్రశ్న 6.
క్రొమాటిన్ నిర్మాణాన్ని వ్రాయండి?
జవాబు:

  1. క్రొమాటిన్ పదార్థం ‘ DNA ‘ మరియు ‘హిస్టోన్ ప్రోటీన్’ ల సమ్మేళనం.
  2. ఇది కణం యొక్క కేంద్రకంలో ఉంటుంది . ఇది అనువంశికతకు సంబంధించినది.
  3. లేతవర్ణంలో, వదులుగా బంధించబడిన క్రొమాటిన్ పదార్థాన్ని ‘యూక్రొమాటిన్’ అంటారు.
  4. ముదురు వర్ణంలో, ధృడంగా బంధించబడి ఉన్న క్రొమాటిన్ పదార్థాన్ని ‘హెటిరోక్రొమాటిన్’ అంటారు.

ప్రశ్న 7.
DNAలో ఒక మూస ఫలకానికి సంపూరకంగా కొత్త DNA పోచ ఏర్పడేటపుడు, ప్రాథమిక దశలో విచ్ఛిన్న ఖండితాలుగా ఎందుకు ఏర్పడతాయి. ఏర్పడిన కొత్త ఖండితాలు చివరిగా ఎలా రూపొందుతాయో వివరించండి.
జవాబు:

  1. శక్తి అవసరం వల్ల పొడవైన DNA అణువుల యొక్క రెండు పోచలు ఒకేసారి కొన నుంచి చివరిదాకా విడిపోవడం జరగదు. కావున ప్రాథమిక దశలో ‘విచ్ఛిన్న ఖండితాలు’ ఏర్పడతాయి.
  2. కొత్తగా ఏర్పడిన ఈ విచ్ఛిన్న ఖండితాలు ‘ఒఖజాకి’ ఖండితాలుగా రూపొంది, DNA లైగేజ్ ఎన్ఎమ్ ద్వారా
    అతికించబడతాయి.

ప్రశ్న 8.
అనులేఖనం ప్రమాణంలో DNA లో గల న్యూక్లియోటైడ్ల వరుస క్రమం 5′ నుండి 3 కొనకు కింది తెల్పబడింది.
5’AATGCAGCTATTAGG-3′
పై న్యూక్లియోటైడ్ వరుస క్రమానికి (2) సంపూరక పోచ (b) రాయబారి mRNAలోని న్యూక్లియోటైడ్ వరుస క్రమాన్ని రాయండి.
జవాబు:
a) 3′-TTACGTCGATAATCC-5′.
b) 3′-UUACGUCGAUAAUCC-5′

ప్రశ్న 9.
కేంద్రకంలో డీ ఆక్సీరైబో న్యూక్లియోసైడో ట్రైఫాస్ఫేట్ లకు 10 రెట్లు రైబో న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్లు కలవు. అయితే DNA ప్రతికృతి సమయంలో, డీ ఆక్సీరైబో న్యూక్లియోటైడ్లను మాత్రమే చేర్చారు. దీని ఫలితంగా ఏ రకమైన యాంత్రికం జరుగుతుందో సూచించండి.
జవాబు:

  1. రైబోన్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్లో ‘థైమిన్ క్షారం’ ఉండదు.
  2. ప్రతికృతి సమయంలో, నూతనంగా ఏర్పడిన ప్రతి DNA పోచ, DNA మూస ఫలకం నుండి ఏర్పడుతుంది. ఈ చర్య DNA ‘పాలిమరేజ్’ ఎన్ఎమ్ సమక్షంలో ‘డీ ఆక్సీరైబో న్యూక్లియోటైడ్’ యొక్క ‘పాలిమరైజేషన్’ వలన జరుగుతుంది.

ప్రశ్న 10.
RNA జన్యుపదార్ధంగా ఉన్న ఏవైనా మూడు రకాల వైరస్ల పేర్లను తెల్పండి. [AP MAR-16]
జవాబు:

  1. ఇన్ఫ్లూయెంజా
  2. పోలియోవైరస్
  3. HIV

ప్రశ్న 11.
క్రింద తెలపబడిన జన్యువులలో ఒక న్యూక్లియోటైడ్ను తొలగించడం లేదా చొప్పించడం చేసినప్పుడు, జన్యువులో కల న్యూక్లియోటైడ్ వరుస క్రమాన్ని రాయండి.
THE CAT ATE THE FAT RAT
జవాబు:

  1. ‘B’ అక్షరంను CAT మరియు ATE మధ్య చొప్పించినప్పుడు ఏర్పడే వరుస క్రమం “THE CAT BAT ETH EFA TRAT” గా ఏర్పడుతుంది.
  2. ‘T’ అక్షరంను CAT నుండి తొలగించినప్పుడు ఏర్పడే వరుసక్రమం “THE CAA TET HEF ATR AT”.

ప్రశ్న 12.
అనేక రకాల జీవులలో RNA కంటే, DNA ఎందుకు జన్యు పదార్థంగా ఎన్నుకోబడింది?
జవాబు:

  1. ‘DNA’ అణువు కంటే RNA రసాయనికంగా తక్కువ చర్యనొందుతుంది.
    న్యూక్లియోటైడ్స్ ‘2 OH’ సమూహన్ని కలిగి ఉండనందు వలన DNA నిర్మాణాత్మకంగా ధృడమైనది.
  2. థైమిన్ స్థానంలో యురాసిల్ను కలిగి ఉండటం కూడా DNA కి అదనపు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. కావున DNA అనేది RNA కంటే అధికంగా జీవులలో జన్యు పదార్ధంగా ఎన్నుకోబడింది.

ప్రశ్న 13.
అనులేఖనం ప్రమాణంలో గల అనుఘటకాలు ఏవి ? [TS MAR, MAY-17][AP MAR-16,19]
జవాబు:
అనులేఖనం ప్రమాణంలోని అనుఘటకాలు: i) ప్రమోటర్ ii) నిర్మాణత్మకజన్యువులు iii) టెర్మినేటర్

AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం

ప్రశ్న 14.
ఎక్సాన్లకు, ఇన్క్ట్రాన్లకు గల భేదం ఏమిటి? [TS MAY-22] [TS MAR-15,18]
జవాబు:

  1. ఎక్సాన్లు: ఇవి సంకేతపు అనుక్రమాలు. ఇవి పరిపక్వ RNA లో కనిపిస్తాయి.
  2. ఇన్ఫ్రాన్లు: ఇవి సంకేతపు అనుక్రమాలు కాదు. ఇవి పరిపక్వ RNAలో కనిపించవు.

ప్రశ్న 15.
కేపింగ్, పాలిఅడినలైజేషన్ అంటే ఏమిటి? [AP MAR-17] [ TS M-16]
జవాబు:

  1. కేపింగ్: hnRNA యొక్క 5′ కొనకు అసాధారణ న్యూక్లియోటైడ్ (మిధైల్ గ్వానోసైన్ ట్రై ఫాస్పేట్ ను చేర్చడాన్ని కేపింగ్ అంటారు.
  2. పాలిఅడినలైజేషన్: 3′ కొనలో (200-300) అడినైలేట్ అవశేషాలు కలిగిన పాలి A తోక ఏర్పడుటను టైలింగ్ (లేదా) పాలి అడినలైజేషన్ అంటారు.

ప్రశ్న 16.
బిందు ఉత్పరివర్తనం అంటే ఏమిటి? ఉదాహరణతో తెలపండి. [AP MAR-18]
జవాబు:

  1. DNA అణువులోని నత్రజని క్షారాలలో కలిగే ఉత్పరివర్తనాలను బిందు ఉత్పరివర్తనాలు అంటారు.
  2. ఉదా: సికెల్ సెల్ ఎనిమీయా.

ప్రశ్న 17.
పెప్టైడ్ బంధాన్ని నిర్వచించండి. ప్రోటీన్లను పాలిపెప్టైడ్లుగా ఎందుకు గుర్తిస్తారు.
జవాబు:

  1. పెప్టైడ్ బంధం: కార్బాక్సిల్ సముదాయంలోని అమైనోఆమ్లాలకు మరియు అమైనో సముదాయంలోని అమైనో ఆమ్లాల మధ్య డీహైడ్రేషన్ వలన ఏర్పడిన బంధాన్ని ‘పెప్టైడ్ బంధం’ అంటారు.
  2. ప్రోటీనులు పొడవైన అమైనో ఆమ్లాల గొలుసులతో ఏర్పడిన పెప్టైడ్ బంధాలతో బంధింపబడి ఉంటాయి. కావున వీటిని ‘పాలిపెప్టైడ్లు’ అంటారు.

ప్రశ్న 18.
tRNA ను ఆవేశితం చేయడం అంటే ఏమిటి?
జవాబు:
tRNA: ATP సమక్షంలో అమైనో ఆమ్లమును ఉత్తేజపరిచి దానిని అసైలేషన్ ప్రక్రియ ద్వారా సంబంధిత tRNAకు అనుసంధానించడాన్ని tRNA ను ఆవేశితం చేయడం అంటారు.

ప్రశ్న 19.
రెగ్యులేటర్, ప్రమోటర్లు అంటే ఏమిటి?
జవాబు:

  1. రెగ్యులేటర్: ఇది DNA లో ఒక భాగం. ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిర్మాణాత్మక జన్యువుల వ్యక్తీకరణపై నియంత్రణను కలిగి ఉంటుంది
  2. ప్రమోటర్ : ఇది DNA లో ఒక భాగం. ఈ భాగానికి పాలిమరేజ్ బంధితమై ‘అనులేఖనం’ ప్రారంభమవుతుంది.

ప్రశ్న 20.
DNA ప్రతికృతి జరిగే సమయంలో పూర్తి DNA అణువు ఒక వైపుకు ఎందుకు విడిపోదు ప్రతికృతి పాయను వివరించండి.
జవాబు:

  1. DNA ప్రతికృతికి అధిక మొత్తంలో శక్తి అవసరం.
  2. దీనివలన పొడవైన DNA అణువుల యొక్క రెండు పోచలు ఒకేసారి ఒకే వైపుకు విడిపోవును.
  3. ప్రతికృతి, DNA ద్విసర్పిలంలో చిన్న ప్రదేశం నుంచి జరుగుతుంది. దీనినే “ప్రతికృతి పాయ”(Replication fork)అంటారు.
  4. ప్రతికృతి పాయలో ఒక పోచ అవిచ్ఛన్నంగా (3′ → 5′) మరియు రెండోవ పోచ విచ్ఛిన్నంగా(5′ 3′) ప్రతికృతి జరుపుతాయి. విచ్ఛిన్నంగా సంశ్లేషించబడే ఖండితాలను ‘ఖజాకి’ ఖండితాలు అంటారు. ఇవి లైగేజ్ ఎన్ఎమ్ ద్వారా అతికించబడతాయి.

ప్రశ్న 21.
“AUG” సంకేతం విధి ఏమిటి? [AP MAY-22][AP,TS MAR-20]
జవాబు:
AUG యొక్క రెండు విధులు:

  1. రాయబారి mRNAలో ఆరంభ సంకేతంగా ఉపయోగపడుట.
  2. ఇది అమైనో ఆమ్లం యైన మిథియోనైన్కు సంకేతంగా ఉపయోగపడుట.

ప్రశ్న 22.
ఆపుదల సంకేతం అంటే ఏమిటి? వాటి సంకేతాలను రాయండి. [AP,TS MAR-19][AP MAR-15]
జవాబు:

  1. ప్రోటీన్ల సంశ్లేషణను నిలుపుదల చేయు కోడాన్లను ‘ఆపుదల సంకేత కోడాన్’ లు అంటారు.
  2. అవి UAA, UAG, UGA.
  3. ఇవి ఏ అమైనో ఆమ్లానికి కూడా సంకేతాలుగా పని చేయవు.

ప్రశ్న 23.
DNA అణువులో మూస ఫలకానికి, సంకేతపు పోచకు ఉన్న భేదమేమిటి?
జవాబు:

  1. అనులేఖనం విధానంలో DNA యొక్క రెండు పోచలు విడిపోవటం జరుగుతుంది.
  2. mRNA సంశ్లేషణ లో సంపూరక పోచగా పనిచేయు పోచను ‘మూస పోచ’ అని అంటారు.
  3. DNA యొక్క వేరొక పోచ ఏటువంటి సంకేతాలను కోడ్ చేయదు. దీనినే ‘సంకేతపు పోచ’ అంటారు.

ప్రశ్న 24.
DNA కి, RNA కి మధ్య గల ఏవైనా రెండు రసాయనిక భేదాలను రాయండి. [AP MAY-19][AP MAR-17] [TS MAY-22]
జవాబు:

  1. DNA ఆక్సీరైబోజ్ చక్కెరను కలిగి వుంటుంది. ఇది స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది.
  2. RNA ఆక్సీరైబోజ్ చక్కెరను కలిగి వుంటుంది. ఇది స్వయం ప్రతిపత్తిని చూపించదు.

ప్రశ్న 25.
DNA అణువులో థయమిస్ 30%, ఉన్నట్లైతే మిగిలిన నత్రజని క్షారాల శాతాన్ని రాయండి. [TSMHG APMAR15]
జవాబు:
ఎడినైన్ 30%; గ్యానైన్ 20%; సైటోసిన్ 20% (మొత్తం 70%)

ప్రశ్న 26.
అడినైన్ 18%, గ్వానైన్ 30%, సైటోసిన్ 42%, యురాసిల్ 10%. ఉన్నట్లైతే, ఇది ఏ రకమైన కేంద్రకామ్లమో తెలిపి అందులో పోచల సంఖ్యను తెలపండి. [AP MAR-18][TS MAR-17]
జవాబు:
(a) RNA (b) ఒకే ఒక పోచ

ప్రశ్న 27.
రాయబారి RNA లోని సంకేతంలో క్షారాలు వరుసక్రమం (5′ AUG 3′) అయినట్లైతే దానితో జతగూడే బదిలీ t RNA లో ఏ వరుస క్రమం ఉంటుంది?
జవాబు:
3′ UAC – 5′

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
గ్రిఫిత్ పరిశోధనలలోని పరివర్తనను నిర్వచించండి. DNA ను జన్యుపదార్ధంగా గుర్తించడానికి, ఇది ఏ విధంగా ఉపయోగపడిందో వివరించండి.
జవాబు:
1) పరివర్తన: పరిసరాల నుంచి కణత్వచం ద్వారా జన్యు పదార్థాన్ని ప్రత్యక్షంగా గ్రహించడం మరియు ప్రతిక్షేపించుకోవడం వలన కణంలో జరిగే జన్యు అంతరాలను గురించి తెలియజేయు విధానాన్ని పరివర్తన అంటారు.

2) 1928 లో, ఫ్రెడ్రిక్ గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త స్ట్రెప్టోకోక్కస్ న్యూమోనియా అనే బాక్టీరియమ్ పై విస్తృత ప్రయోగాలు జరిపారు. ఇది ‘న్యూమోనియా’ వ్యాధిని కలిగిస్తుంది.

3) అతడు పరిశోధనలలో బాక్టీరియా దాని యొక్క భౌతిక రూపంలో మార్పులకు గురి అవుతుందని గుర్తించాడు. బాక్టీరియాను ‘వర్ధనం’ లో పెంచారు.

4) బాక్టీరియా రెండు అభిరంజకాలను కలిగివున్నదని గుర్తించారు. ఒకటి నునుపు, సహనివేశాలుగా, గుళిక యుతంగా (S-రకం) మరియు వేరొకటి గరుకు, సహనివేశాలుగా, గుళిక రహితంగా (R-type) అని పేర్కొన్నారు.

5) S-రకం కణాలు విరులెంట్, అదే R-రకం విరులెంట్కాని రకాలు.

6) S-రకం కణాలను చిట్టెలుక లోనికి ప్రవేశపెట్టగా, అది న్యూమోనియాతో బాధపడి మరణించింది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం

7) R-రకం కణలను చిట్టెలుక లోనికి ప్రవేశపెట్టగా, వ్యాధి కనిపించలేదు. అది సజీవంగా ఉంది.

8) S-రకం కణాలను వేడిచేసి, చిట్టెలుక లోనికి ప్రవేశపెట్టగా వ్యాధి కనిపించలేదు.

9) వేడిచేసిన S-రకం కణాలను, జీవించి ఉన్న R-రకం కణాలతో కలిపి చిట్టెలుక లోనికి ప్రవేశపెట్టగా, అది న్యూమోనియాతో మరణించింది. దాని నుండి జీవించి ఉన్న S-రకం కణాలను గుర్తించారు.

10) రెండు R-రకాలను వేడి చేయగా అవి S-రకాలుగా మార్చబడినాయి అని తీర్మానించారు.

11)పరివర్తన సూత్రం వలన జన్యుపదార్ధం మార్పుచెందడం వలన ఇది జరిగినది.

ప్రశ్న 2.
పరివర్తన కారకం యొక్క జీవ రసాయన స్వభావాన్ని ఎవరు, ఏ విధంగా కనుగొన్నారు.
జవాబు:
1) ఆస్వాల్డ్ అవేరీ, కోలిన్ మాక్లియాడ్, మెర్లిన్ మెకార్టి శాస్త్రవేత్తలు, గ్రిఫిత్ ప్రయోగాలలో పరివర్తన సూత్రం యొక్క జీవరసాయనిక స్వభావం పై పరిశోధనలు చేశారు.

2) వీరు తమ ప్రయోగాలలో వేడి చేసి చంపిన S – విభేదం బాక్టీరియమ్ కణాల నుంచి (ప్రోటీన్ల, DNA, RNA లు మొదలైనవి) జీవ రసాయనిక పదార్థాలను వేరుచేసి R – కణాల నుంచి S – కణాలకు జరిగే బదిలీని గుర్తించారు.

3) S – కణాల నుంచి R కణాలుకు DNA మాత్రమే బదిలీ చెందినట్లు గుర్తించారు. ప్రోటియేజ్లు మరియు RNases వలన కూడా జన్యుపరివర్తనానికి ఎటువంటి ఆటంకం కల్గలేదని గుర్తించారు.

4) కావున పరివర్తనలో పాల్గోనే జీవరసాయన పదార్ధం ప్రోటీన్ లేదా RNA కాదని గుర్తించారు. DNase తో జీర్ణింపజేసినపుడు పరివర్తన నిరోధించబడింది. కావున DNA పరివర్తనను కల్గిస్తుంది.

ప్రశ్న 3.
మెసల్సన్, స్టాల్ ప్రయోగంలో నైట్రోజన్ యొక్క భార ఐసోటోప్ ప్రాధాన్యత ఏది?
జవాబు:
‘మాధ్యూ మెసల్సన్’ మరియు ‘ఫ్రాంక్లిన్ స్టాల్ ‘అనే శాస్త్రవేత్తలు E.కోలైపై ప్రయోగాలు జరిపి DNA అర్ధసంరక్షక ప్రతికృతిని జరుపుతుందని నిరూపించారు.

  1. ఈ ప్రయోగాలలో భార ఐసోటైప్ అయిన నత్రజని 15N ను వినియోగించారు.
  2. అవికిరణధార్మికత లేనిది మరియు సాంద్రత మీద ఆధారపడి మాత్రమే 14 నుండి దానిని వేరు చేయగలిగారు.
  3. E.కోలై యొక్క DNA ప్రతికృతి 20 నిమిషాలలోనే పూర్తి అయ్యింది.
  4. E.కోలైని 15NH4Cl కలిగిన వర్ధనంలో అనేక తరాల వరకు పెంచవచ్చు.
  5. ఫలితంగా కొత్తగా సంశ్లేషణం చెందిన DNA లో 15N ను అనుసంధానం చేయవచ్చు.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం 1

ప్రశ్న 4.
సిస్ట్రాన్ అంటే ఏమిటి? తగిన ఉదాహరణతో మోనోసిస్ట్రానిక్, పాలిసిస్ట్రానిక్ అనులేఖన ప్రమాణాల తేడాలను గుర్తించండి.
జవాబు:
సిస్ట్రాన్: ఒక పాలిపెప్టైడ్ శృంఖలానికి సంకేతాన్నిచ్చే DNA అనుక్రమాన్ని ‘సిస్ట్రాన్’ అంటారు.
మోనోసిస్ట్రానిక్

  1. అనులేఖన ప్రమాణంలో నిర్మాణాత్మక జన్యువులు అంతరాయాలతో కూడిన సంకేత క్రమాలలో ఉంటాయి
  2. ఉదా: నిజకేంద్రక జీవులు

పాలిసిస్ట్రానిక్

  1. mRNA అణువులో అనేక ప్రారంభపు, సంకేత క్రమాలతో కూడిన అనులేఖన ప్రమాణం ‘పాలిపెప్టైడ్’గా మారుతుంది.
  2. ఉదా: కేంద్రక పూర్వ జీవులు.

ప్రశ్న 5.
DNA జన్యుపదార్ధం అని నిరూపించిన ఫ్రెడ్రిక్ గ్రిఫిత్ ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని, DNA కు ప్రత్యామ్నాయంగా జన్యు పదార్ధం అయినట్లైతే వేడి చేయించబడిన నిమోకోకస్ యొక్క R రకం పరివర్తన చెందగలదా? వివరించండి?
జవాబు:
కాదు, చెందలేదు.

  1. అవేరి, మాక్లియాడ్ మరియు మెకార్టిలు పరివర్తన సూత్రం యొక్క జీవరసాయనిక స్వభావంను కనుగొనుటకు పరిశోధనలు సాగించారు.
  2. వీరు తమ ప్రయోగాలలో వేడి చేసి చంపిన S – విభేదం బాక్టీరియమ్ కణాల నుంచి (ప్రోటీన్ల, DNA, RNA లు మొదలైనవి) జీవ రసాయనిక పదార్థాలను వేరుచేసి R – కణాల నుంచి S – కణాలకు జరిగే బదిలీని గుర్తించారు.
  3. S – కణాల నుంచి R – కణాలకు DNA మాత్రమే బదిలీ చెందినట్లు గుర్తించారు. ప్రోటియేజ్లు మరియు RNases వలన కూడా జన్యుపరివర్తనానికి ఎటువంటి ఆటంకం కల్గలేదని గుర్తించారు.
  4. కావున పరివర్తనలో పాల్గోనే పదార్ధం ప్రోటీన్ లేదా RNA కాదని గుర్తించారు. DNase తో జీర్ణింపజేసినపుడు పరివర్తన నిరోధించబడింది, కావున DNA పరివర్తనను కల్గిస్తుంది.
  5. కావున పరివర్తన ఒక ప్రోటీన్ లేదా RNA కాదు. ఇది DNA పదార్థంలో జరుగుతుంది.

ప్రశ్న 6.
ప్రతిపాదిత న్యూక్లియోటైడ్లను పరిశీలించినట్లైతే అమైనో ఆమ్ల క్రమం నుంచి బహుళ న్యూక్లియోటైడ్ క్రమమును పొందవచ్చు. ఈ దృగ్విషయాన్ని వివరించండి?
జవాబు:

  1. కొన్ని అమైనో ఆమ్లాలు ఒకటి కంటే ఎక్కువ సంకేతాలచే సూచించబడతాయి.
  2. ఒక న్యూక్లియోటైడ్ క్రమాన్ని అమైనో ఆమ్ల అనుక్రమం నుంచి ప్రతిపాదించినపుడు, అనేక న్యూక్లియోటైడ్ క్రమాలను పొందవచ్చు. ఉదా: Ile, AUU,AUC,AUA
  3. ఒక డైపెప్టైడ్ Met – IIe ఈ క్రింది న్యూక్లియోటైడ్ క్రమాలను కలిగి ఉంటుంది.
    (i) AUG – AUU
    (ii) AUG – AUC
    (iii) AUG – AUA
    అమైనో ఆమ్ల క్రమాన్ని ప్రతిపాదించినపుడు, పైన పేర్కోన్న మూడు న్యూక్లియోటైడ్ క్రమాల్ని Met – I/e కి సంకేతాలుగా సూచించవచ్చును.

ప్రశ్న 7.
ఒక క్షారంలో జరిగిన ఉత్పరివర్తన వల్ల జన్యుచర్యలో లోపంగాని, అదనపు చర్యకాని జరగదు. ఈ వ్యాఖ్య సరియైనదేనా? మీ సమాధానాన్ని సరియైన రీతిలో వివరించండి.
జవాబు:

  1. ఈ వాఖ్య సరియైనది కాదు.
  2. బిందు ఉత్పరివర్తనాలకు సంబంధించి ఒక శాస్త్రీయ ఉదాహరణగా ఒక జత న్యూక్లియోటైడ్ మార్పు అనేది ‘బీటా గొలుసు వలన’ జరుగుతుంది అని చెప్పవచ్చును. (మానవుల హీమోగ్లోబిన్)
  3. దీని ఫలితంగా అమైనో ఆమ్లం అయిన ‘గ్లూటమేట్’ స్థానంలో వాలిన్ చేరుతుంది.
  4. దీని ఫలితంగా ‘సికిలెసెల్ అనిమియా’ అనే వ్యాధి సంభవిస్తుంది.
  5. పాలిపెప్టైడ్ శృంఖలంలో అమైనో ఆమ్లాలకు ఒక న్యూక్లియోటైడ్ మార్పు సంభవిస్తుంది.
  6. ఉదాహరణకు క్రింద ఇచ్చిన వాక్యంలో ప్రతిపదానికి మూడు అక్షరాలు జన్యుసంకేతంలా ఇవ్వబడినాయి..
  7. RAM HAS RED CAP
  8. HAS మరియు REDలకు మధ్య B అనే అక్షరాన్ని చేర్చి, వాక్యాన్ని మరల త్రిపద రూపంలో వ్రాస్తే అది ఈ క్రింది విధంగా ఉంటుంది.
  9. RAM HAS BRE DCA P
  10. R, అనే పదాన్ని తొలగించగా, ఆ వాక్యం ఈ విధంగా AMH ASE DCA P గా మారుతుంది.
  11. ఇలా ఒకటి లేదా రెండు క్షారాలను చేర్చడం లేదా తొలగించడం వల్ల అలా చేర్చిన లేదా తొలగింపు ప్రదేశం నుంచి రీడింగ్ ఫ్రేములో మార్పులోస్తాయి.
  12. ఇది ప్రోటీన్ నిర్మాణాన్ని మరియు విధులకు అఘాతం కల్గిస్తుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం

ప్రశ్న 8.
లాక్ ఒపెరాన్ స్వల్ప వ్యక్తీకరణ ఎల్లప్పుడు ఉంటుంది. ఈ దృగ్విషయంలోని తర్కాన్ని వివరించండి?
జవాబు:

  1. లాక్టోజ్, β – గాలక్టోజిడేజ్ ఎన్జైమ్కు అధస్థ పదార్థం. ఇది ఒపెరాన్ చర్యను ప్రారంభిస్తుంది లేదా ఆపివేస్తుంది. కాబట్టి దీనిని ‘ప్రేరకం’ అంటారు.
  2. గ్లూకోజ్ లేనపుడు, వర్ధన యానకంలోని బాక్టీరియామ్లకు లాక్టోజ్ను అందించినట్లైతే, పర్మియేజ్ చర్యల ద్వారా ఇది కణాలలోకి ప్రవేశిస్తుంది.
  3. అన్ని సమయాలలో లాక్ ఒపెరాన్ యొక్క వ్యక్తీకరణ స్వల్పంగా జరుగుతుంది, లేనిచో లాక్టోజ్ కణాలలోకి ప్రవేశించలేదు.
  4. జన్యువు చర్య వల్ల ఒపెరాన్ యొక్క ‘రెప్రెసార్’ నిరంతరంగా సంశ్లేషించబడుతుంది.
  5. కావున, ఎన్జైమ్ ఉత్పత్తిని అధస్ధ పదార్ధం నియంత్రణ చేయడం వలన ‘లాక్ ఒపెరాన్ స్వల్ప’ వ్యక్తీకరణ ఎల్లప్పుడు జరుగుతుండాలి.

ప్రశ్న 9.
DNA నమూనాను అభివృద్ధి చేయడంలో వాట్సన్, క్రిక్ లు ఎవరి సమాచారం పై ఆధారపడ్డారు. వారు కనుగొన్న అంశాలను వివరించండి?
జవాబు:

  1. కేంద్రకంలో ఉన్న DNA పదార్థం ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంటుందని, 1869 లో ఫ్రెడ్రిక్మెయిషర్ గుర్తించారు. దీనికి ‘న్యూక్లిన్’ అని నామకరణం చేశాడు.
  2. ‘మేరీస్ విల్కిన్స్’ మరియు ‘రోసలిండ్ ఫ్రాంక్లిన్’ X – కిరణ వివర్తన మూల సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ‘ఎర్విన్ చార్ఫ్’ ప్యూరైన్లు మరియు పిరమిడైన్లు 1:1 నిష్పత్తిలో ఉంటాయి అని ప్రతిపాదించారు.
  3. పై సమాచరం ఆధారంగా ‘జేమ్స్ వాట్సన్’ మరియు ‘ఫ్రాన్సిస్ క్రిక్ ‘లు అతిసాధారణ మరియు ప్రఖ్యాతిగాంచిన DNA ‘ద్విసర్పిల’ అణునిర్మాణాన్ని ప్రతిపాదించారు.

అంశాలు:

  1. ద్విసర్పిల DNA అణునిర్మాణంలో ఉన్న రెండు పాలిన్యూక్లియోటైడ్ గొలుసులు ఒకదానికొకటి నత్రజని క్షార జతల అణువులతో బంధితమై ఉంటాయి.
  2. ప్యూరిన్ మరియు పిరమిడిన్ల మధ్య దూరం 20Å ఉంటుందని గుర్తించారు.
  3. రెండు శృంఖలాలు సవదిశవైపు కుండలి ఆకారంలో ఉంటాయి. ప్రతి కుండలి 3.4 pm, కుండలిలోని ప్రతి రెండు జతల మధ్య దూరం సుమారు 0.34 nm గా గుర్తించారు.

ప్రశ్న 10.
ఈ క్రింది వాని విధులను పేర్కోనండి.
(i) మిథైలేషన్ చెందిన గ్వానోసైన్ కాప్
(ii) పక్వ RNA లోని బహుళ A వాలము (Poly A – tail)
జవాబు:
(i) మిథైలేషన్ చెందిన గ్వానోసైన్ కాప్ : hn – RNA యొక్క 5′ కొనకు అసాధారణ న్యూక్లియోటైడ్ ను చేర్చబడటం. దీనినే ‘కాపింగ్’ అంటారు.

(ii) పక్వ RNA లోని బహుళ A వాలము (Poly – A – tail) : 3′ కొనలోని అడినైలేట్ అవశేషాలను సంపూరక స్వతంత్ర విధానంలో hn – RNA కు చేర్చబడటం. దీనినే “పాలి అడినలైజేషన్”(tailing) అంటారు. ఈ విధంగా రూపాంతరం చెందిన hn – RNA ను m – RNA అంటారు.

ప్రశ్న 11.
కణాలలో ఎన్ని రకాల RNA పాలిమరేజ్లు ఉంటాయి? వాటి పేర్లు, విధులను వివరించండి. ITS MAR-17] జవాబు: కేంద్రకంలో RNA పాలిమరేజ్లు మూడు రకాలు (అదనంగా RNA పాలిమరేజ్)
జవాబు:

  1. RNA పాలిమరేజ్ I : ఇది rRNAs (28S, 18S మరియు 5,8S) ను అనులేఖనం చేస్తుంది.
  2. RNA పాలిమరేజ్ II : ఇది పూర్వగామ mRNA, విషమజాతీయ కేంద్రక RNA (hnRNA) లను అనులేఖనం చేస్తుంది.
  3. RNA పాలిమరేజ్ III: ఇది tRNA, 5srRNA మరియు snRNAs (చిన్న కేంద్రక RNAs)లను అనులేఖనం చేస్తుంది.

ప్రశ్న 12.
DNA పాలిమరేజ్ను గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. DNA పాలిమరేజ్ ఎన్ఎమ్ అత్యంత సమర్ధవంతమైనది. ఇవి తక్కువ కాలంలో అసంఖ్యాక న్యూక్లియోటైడ్ పుంజీకరణను ఉత్ప్రేరితం చెయ్యగలవు.
  2. DNA ప్రతికృతికి, DNA మరమ్మత్తుకి, జన్యుపునఃసంయోజన విలోమ అనులేఖనం మరియు ప్రతిదేహాల పునరుత్పత్తి వైవిధ్యానికి ఇది చాలా అవసరం.
  3. అణుజీవశాస్త్ర ప్రయోగశాలలో, PCR & DNA క్రమాలలో మరియు అణువుల శుద్ధిలో పాలిమరేజ్ను విరివిగా ఉపయోగిస్తున్నారు.

ప్రశ్న 13.
జన్యు సంకేతం విశ్లేషణలో జార్జ్మెవ్, H.G.ఖొరానా, మార్సల్ నెరెన్బర్గ్ కృషిని వివరించండి. [TS M-19]
జవాబు:

  1. జార్జ్మెవ్ ఒక భౌతిక శాస్త్రవేత్త.
  2. అతడు 20 అమైనో ఆమ్లాలకు గాను 4 క్షారాలు మాత్రమే సంకేతం చేస్తాయి అని ప్రతిపాదించాడు.
  3. ప్రతి సంకేతం ఈ నాలుగు క్షారాల యొక్క కలయికతో వుంటుంది.
  4. ప్రతి సంకేతం మూడు న్యూక్లియోడ్లను కలిగి వుంటుంది. (త్రికసంకేతాలు)
  5. ఈ సంకేతల కలయిక వలన విభిన్న 43 (4 x 4 x 4) త్రికసంకేతాలు ఏర్పడతాయి.
  6. ‘హరగోవింద ఖొరానా’ అభివృద్ధి పరచిన రసాయన పద్ధతి నిర్ధిష్ట సంయోజనాలు ఉన్న RNA అణువులు సంశ్లేషణకు (హామోపాలిమర్ అయిన UUU మరియు కోపాలిమర్లు అయిన UUC, CCA) లు ముఖ్యపాత్ర వహిస్తాయి. మార్షలో నెరెన్ బర్గ్ ప్రోటీన్ల సంశ్లేషణను కణరహిత వ్యవస్ధలో నిర్వహించారు.

ప్రశ్న 14.
tRNA ద్వితీయ నిర్మాణానికి చెందిన పటంలోని కింద పేర్కొన్న భాగాల స్థానాలను గుర్తించండి:
a) ప్రతిసంకేతం
b) స్వీకరణకాండం
c) ప్రతిసంకేత కాండం
d) 5′ కొన
e) 3’కొన
జవాబు:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం 2

ప్రశ్న 15.
ఒక DNA అణువులో 2.9 × 109 చుట్లు ఉన్నట్లైతే, దాని పొడవును లెక్కించండి. (ఆంగ్ స్ట్రామ్ 1A=10°cm)
జవాబు:
ఒక DNA చుట్టు = 3.4 nm = 3.4 x 10-9 m
పూర్తి చుట్లు = 2.9 × 109
DNA అణువు యొక్క పొడవు 2.9 × 109 x 3.4 × 10-9 = 0.986 మీ.

ప్రశ్న 16.
లాక్ ఒపెరాన్ నమూనా/పటాన్ని గీయండి. [TS MAY-22] [APMAY-19][APMAR-15][TSMAR-16]
జవాబు:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం 3

ప్రశ్న 17.
DNA, RNA మధ్య తేడాలను తెలపండి. [AP,TS MAR-20][TS MAY-22] [TS MAY-17]
జవాబు:
DNA

  1. DNA అనగా ‘డీ ఆక్సీరైబో న్యూక్లిక్ ఆమ్లం’.
  2. DNA ద్విసర్పిల, ద్విపోచయుతల నిర్మాణం
  3. క్షార స్థితిలో DNA స్థిరంగా ఉంటుంది.
  4. DNA నందు డీ ఆక్సీరైబోజ్ చక్కెర వుంటుంది.
  5. DNA నందు 4 మిలియన్ల వరకు న్యూక్లియోటైడ్లు ఉంటాయి.
  6. DNA స్వయం ప్రతికృతి చెందుతుంది.
  7. DNA అనేది జన్యు పదార్ధం.
  8. DNA ప్రత్యక్షంగా ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొనదు.
  9. జీవక్రియా పరంగా DNA ఒకే ఒక రకం
  10. నత్రజని క్షారాలు A=T మరియు G=C

RNA

  1. RNA అనగా ‘ రైబోన్యూక్లిక్ ఆమ్లం’.
  2. RNA ఏకపోచయుత నిర్మాణం.
  3. క్షార స్థితిలో RNA అస్థిరంగా ఉంటుంది.
  4. RNA నందు రైబోజ్ చక్కెర ఉంటుంది.
  5. RNA నందు 75-2000 న్యూక్లియోటైడ్లు ఉంటాయి.
  6. RNA స్వయం ప్రతికృతి చెందదు.
  7. RNA అనేది జన్యు పదార్ధం కాదు.
  8. RNA ప్రత్యక్షంగా ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గోంటుంది.
  9. జీవక్రియా పరంగా RNA మూడు రకాలు
  10. నత్రజని క్షారాలు A=U మరియు G=C

AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం

ప్రశ్న 18.
జన్యు సంకేతంలోని ప్రధాన లక్షణాలను వివరించండి. [AP MAR-16,17,18][TS MAR-15,18] [TS MAY-22] [AP MAY-22]
జవాబు:
జన్యు సంకేతం యొక్క ప్రధాన లక్షణాలు:

  1. జన్యు సంకేతం అనేది ఒక జత నిర్ధేశకాలు. ఇవి DNA అణువు 20 అమైనో ఆమ్లాలుగా అనులేఖనం చెందడంలో సహాయపడతాయి.
  2. జన్యు సంకేతంలో న్యూక్లియోటైడ్ యొక్క 64 త్రికాలు ఉంటాయి.
  3. 61 త్రికాలు అమైనో ఆమ్లాలకు సంకేతాలుగా వ్యవరిహస్తాయి. మూడు త్రికాలు ఎటువంటి అమైనో ఆమ్లాలకు త్రికసంకేతాలుగా ఉండవు, కావున వీటిని నిలుపుదల (లేదా) ఆపుదల సంకేతాలు అంటారు.
  4. ఒక సంకేతం ఒక ఆమైనో ఆమ్లంకు మాత్రమే సంకేతంగా ఉంటుంది. కావున ఇది నిస్సందేహంగా విశిష్టమైనది.
  5. కొన్ని అమైనో ఆమ్లాలు ఒక సంకేతం కంటే ఎక్కువ సంకేతాలతో సూచించబడతాయి. దీనినే ‘డీ జనరేట్ కోడ్’ అంటారు.
  6. ఒక కోడాన్కు మరొక కోడాన్కు మధ్య కామా లేదా సెమికోలన్ లేదా బిందువుల వంటి ఏ విరామ చిహ్నాలు ఉండవు.
  7. జన్యు సంకేతం సార్వత్రికమైనది.
  8. ఉదా: బాక్టీరియా నుంచి మానవుల వరకు, UUU అనేది త్రికం ఫికైల్ అలనిన్కు సంకేతంగా వ్యవహరిస్తుంది.

ప్రశ్న 19.
DNA ప్రతికృతిలోని ప్రధాన లక్షణాలను వివరించండి?
జవాబు:

  1. DNA ద్విసర్పిల పోచలు పాలిమరేజ్ ఎన్జైమ్ వలన రెండు DNA పోచలుగా ఏర్పడతాయి.
  2. బంధవిచ్ఛిన్నం జరిగిన ప్రదేశాన్ని ‘ప్రతికృతి పాయ’ అంటారు. ఇక్కడి నుండే ప్రతికృతి ప్రారంభమవుతుంది.
  3. ఏకపోచయుత బంధన ప్రోటీనులు DNA పోచలను కలవనివ్వకుండా ఉంచుతాయి.
  4. ప్రతికృతి ప్రారంభానికి చిన్న RNA ఖండితం కావాలి, దీనినే ‘RNA ప్రైమర్’ అంటారు. దీని సహాయంతో ఒకపోచ మూసఫలకంగా వ్యవహరిస్తూ DNA పోచను 5 3′ దిశలో సంశ్లేషణ చేస్తుంది.
  5. DNA ఆధారిత DNA పాలిమరేజ్లు మాత్రమే పోచను ఒక దిశలోనే (5′ – 3) నిర్వర్తిస్తాయి.
  6. DNA మూసఫలకాన్ని బంధించిన RNA పాలిమరేజ్లు, RNA జలవిశ్లేషణ ద్వారా తొలగించబడతాయి.
  7. RNA జలవిశ్లేషణ వలన ఏర్పడిన ఖాళీలను DNA పాలిమరేజ్ పూరిస్తుంది.
  8. DNA ముక్కలు లేదా ఖాళీలు డీఆక్సీరైబో న్యూక్లియోటైడ్స్ ద్వారా భర్తీ చేయబడి లేదా లైగేజ్ ఎన్ఎమ్ అతికించబడతాయి. ఈప్రక్రియను ‘ప్రతికృతి’ అంటారు.

ప్రశ్న 20.
బాక్టీరియమ్ కణంలోని అనులేఖన ప్రక్రియపటాన్ని గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం 4

ప్రశ్న 21.
స్యూక్లియోసోమ్లను క్లుప్తంగా వివరించండి. [TS MAY-22][AP MAY-17][AP MAR-19]
జవాబు:

  1. న్యూక్లియోసోమ్ అనేది క్రోమోసోమ్లో ఒక ‘పూస’ వంటి నిర్మాణం.
  2. ఇది ఎనిమిది హిస్టోన్ అణువుల ప్రమాణంగా (హిస్టోన్ ఆక్టామర్) 150 నత్రజని క్షారాల జతలు ఉన్న ఒక DNA ను కల్గి ఉంటుంది.
  3. ఋణావేశం ఉన్న DNA, ధనావేశం ఉన్న హిస్టోన్ ఆక్టామర్ చుట్టూ చుట్టుకొని న్యూక్లియోసోమ్ అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం 5
  4. DNA అణువు చుట్టుకొని దగ్గరగా ఉండేలా చేయడంలో న్యూక్లియోజోమ్లు సహయపడతాయి.
  5. DNA మరియు హిస్టోన్ ప్రోటీనులు కలిసి క్రోమాటిన్ పదార్ధాన్ని ఏర్పరుస్తాయి.
  6. న్యూక్లియోసోమ్లు, కేంద్రకం నుందు ఒకదానితో ఒకటి బంధితమై ‘క్రోమాటినన్ను’ ఏర్పరుస్తాయి.
  7. క్రోమాటినన్ను ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో పరిశీలించినపుడు న్యూక్లియోసోమ్లు ఒకదారపు పోచలో పూసలు కూర్చినట్లుగా ఉంటాయి.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
హెర్షీ, ఛేజ్ ప్రయోగాన్ని వివరించండి. దీనివల్ల ఏమి నిరూపించబడుతుంది? DNA, ప్రోటీన్లు రెండింటిలోనూ ఫాస్పరస్, సల్ఫర్ ఉన్నట్లైతే ప్రయోగ ఫలితాలు అదే విధంగా ఉండేవా?
జవాబు:

  1. ఆల్ఫ్రెడ్ హెర్షీ మరియు మార్గా ఛేజ్ (1952) లు DNA జన్యుపదార్ధంగా బాక్టీరియమ్లకు వ్యాధిని సంక్రమింపజేసేవి ‘బాక్టీరియా ఫేజ్లనే’ వైరస్లు అని నిరూపించారు.
  2. జన్యుపరంగా బాక్టీరియోఫేజ్లు బాక్టీరియాల పై దాడి జరిపి అనేక వైరస్ అణువులను తయారు చేస్తాయి.
  3. హెర్షీ మరియు ఛేజ్లు వైరస్లలో ప్రోటీన్ లేదా DNA పదార్ధంలో ఏది బాక్టీరియా కణంలోకి ప్రవేశిస్తుందని కనుక్కోవడానికి ప్రయోగాలను చేసారు.
    AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం 6
  4. వీరు కొన్ని వైరస్ల ను ఫాస్పరస్ రేడియో ఐసోటోప్ లు ఉన్న యానకంలో మరికొన్ని వైరస్లను సల్ఫర్ రేడియో ఐసోటోప్లు ఉన్న యానకంలో వృద్ధి చేసారు.
  5. ఫాస్ఫరస్ రేడియో ఐసోటోప్ యానకంలో వృద్ధి చేసిన వైరస్లలో ఉన్న DNA లో ఫాస్ఫరస్ రేడియో ఐసోటోప్ ఉన్నట్లు, ప్రోటీన్ తొడుగు లేనట్లు గుర్తించాడు. DNA లో ఫాస్ఫరస్ ఉంటుంది, కాని ప్రొటీన్లో ఉండదు.
  6. అదే విధంగా సల్ఫర్ ఉన్న రేడియో ఐసోటోప్ యానకంలో వృద్ధి చేసిన వైరస్లలో ప్రోటీన్లో రేడియో ఐసోటోప్ సల్ఫర్ ఉన్నట్లు, DNA లో రేడియో ఐసోటోప్ సల్ఫర్ లేనట్లు గుర్తించారు. DNA లో సల్ఫర్ ఉండదు.
  7. వైరస్ల వలన సంక్రమితమైన బాక్టీరియాలలో రేడియో ఐసోటోప్ DNA ఉన్నది. అది కిరణధార్మిక DNA.
  8. వైరస్ల వలన సంక్రమితమైన బాక్టీరియాలలో ప్రోటీన్లు కిరణధార్మికతను కల్గి ఉంటాయి, కాని బాక్టీరియా మేలు కిరణధార్మికతను ప్రదర్శించవు.
  9. కావున వైరస్ల నుండి బాక్టీరియమ్లకు సంక్రమించే జన్యుపదార్ధం.
  10. DNA ప్రోటీన్లు రెండింటిలోనూ ఫాస్ఫరస్, సల్ఫర్ ఉన్నట్లైతే ప్రయోగం ఫలితాలు అదే విధంగా ఉండవు.

ప్రశ్న 2.
నిజకేంద్రక RNA లో అనులేఖనం తరువాత జరిగే మార్పులను వివరించండి.
జవాబు:
కణకేంద్రంలో జరిగే అనులేఖనం ప్రాథమిక అనులేఖనం తరువాత ప్రత్యేకంగా మార్పులకు లోనవుతుంది. అవి
1) “కాపింగ్” hn – RNAయొక్క మొదటి చర్య. m – RNA యొక్క 5′ కొనకు 7 – మిథైల్గ్వానోసిన్, ట్రైఫాస్ఫేట్ ద్వారా అతకబడుతుంది.

2) పాలి – A తోకచేర్చబడటం : అధిక m – RNA లు,40 నుంచి 200 వరకు అడినైన్ న్యూక్లియోటైడ్లను గొలుసు వంటి నిర్మాణంతో 3 కొనకు కలిగి ఉంటాయి. ఈ పాలి – A తోక DNA నుంచి అనువాదం చెందదు. కాని అనులేఖనం తరువాత చేర్చబడుతుంది. ఇది m మరియు చెందటానికి సహాయపడుతుంది. m-RNA కణద్రవ్యంలోకి చేరిన తరువాత పాలి – A తోక నెమ్మదిగా చిన్నదవుతుంది.

3) స్పైసింగ్ ఇట్రాన్ల తొలగింపు: నిజకేంద్రక జీవులు పరిపక్వత తరువాత m – RNA, ప్రాథమిక అనులేఖనంలో ప్రోటీన్లకు సంకేతం కానటువంటి RNA అనుక్రమాల్ని తొలగిస్తుంది.

  1. మిగిలిన అనుక్రమాలైన ఎక్సాన్లు’ స్పైసింగ్ ప్రక్రియ’ ద్వారా పరిపక్వత చెందిన m – RNA లను ఏర్పరుస్తాయి.
  2. అనులేఖన రూపాంతరాలు అన్నింటిని m – RNA తరువాత కేంద్రకం నుండి ‘అనువాదం’ కొరకు బయటకి రవాణా చేయబడుతుంది.

AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం

ప్రశ్న 3.
అనువాదం ప్రక్రియను క్లుప్తంగా వివరించండి?
జవాబు:
అనువాదం : అమైనో ఆమ్లాల పుంజీకరణ జరిగి పాలి పెప్టైడ్ శృంఖలం ఏర్పడటాన్ని ‘అనువాదం’ అంటారు. m – RNA లో క్షారాల సంకేత క్రమం పాలిపెప్టైడ్ శృంఖలంలో అమైనో ఆమ్లాల క్రమాన్ని ఏర్పరుస్తుంది. ఇది మూడు దశలలో జరుగుతుంది.

  1. ప్రారంభంలో, tRNA ATP ను వినియోగించుకుని అమైనో ఆమ్లాలతో బంధనం ఏర్పరుచుకొని ఉత్తేజితమవుతుంది.
  2. m – RNA పై ఉన్న ప్రారంభ సంకేతం AUG ని ఈ ఉత్తేజిత tRNA మాత్రమే గుర్తిస్తుంది.
  3. అనువాదం ప్రక్రియకు రైబొసోమ్లు ఖచ్చితమైన స్థానాలు.
  4. రైబోసోమ్ యొక్క పెద్ద ఉప ప్రమాణం రెండు వేరు వేరు స్థానాలను అమైనో అమ్లాల బంధనం కొరకు కలిగి ఉంటుంది.
  5. చిన్న ఉపప్రమాణం m – RNA ప్రారంభపు సంకేతం (AUG) వద్ద బంధిస్తుంది, దీనికి అనుగుణంగా పెద్ద ఉప ప్రమాణం అనుసరిస్తుంది.
  6. దీర్ఘత ప్రక్రియలో, రైబోసోమ్ తో సహా ఒక సంకేతం చేరుతుంది. కావున వేరొక ఉత్తేజిత బంధనం కొరకు ఖాళీ ఏర్పడుతుంది.
  7. tRNA ద్వారా వచ్చిన అమైనో ఆమ్లం పూర్వపు అమైనో ఆమ్లం ‘పెప్టైడ్ బంధనంతో బంధాన్ని ఏర్పరుచుకుంటుంది.
  8. ఈ ప్రక్రియ ‘పాలిపెప్టైడ్ గొలుసు’ లను ఏర్పరుస్తుంది.
  9. రైబోసోమ్లు ఏదైన ఒక ముగింపు సంకేతంను (UAA, UAG మరియు UGA) చేరగానే ‘అనువాదం ప్రక్రియ’ పూర్తవుతుంది.
  10. అపుడు పాలిపెప్టైడ్ గొలుసు విడుదల చేయబడుతుంది. రైబోసోమ్లు m- RNA నుండి విడిపోతాయి.

ప్రశ్న 4.
స్ట్రెప్టోకోక్కస్ నిమోనియేపై గ్రిఫిత్ పరిశోధన, ఫలితాలను వివరించండి.
జవాబు:
1) పరివర్తన: పరిసరాల నుంచి కణత్వచం ద్వారా జన్యు పదార్థాన్ని ప్రత్యక్షంగా గ్రహించడం మరియు ప్రతిక్షేపించుకోవడం వలన కణంలో జరిగే జన్యు అంతరాలను గురించి తెలియజేయు విధానాన్ని పరివర్తన అంటారు.

2) 1928 లో ఫ్రెడ్రిక్ గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త స్ట్రెప్టోకోక్కస్ నిమోనియా అనే బాక్టీరియమ్ పై విస్తృత ప్రయోగాలు జరిపారు. ఇది ‘న్యూమోనియా’ వ్యాధిని కలిగిస్తుంది.

3) అతడు పరిశోధనలలో బాక్టీరియా దాని యొక్క భౌతిక రూపంలో మార్పులకు గురి అవుతుందని గుర్తించాడు. బాక్టీరియాను ‘వర్ధనం’ లో పెంచారు.

4) బాక్టీరియా రెండు అభిరంజకాలను కలిగివున్నదని గుర్తించారు. ఒకటి నునుపు, సహనివేశాలుగా, గుళిక యుతంగా (S-రకం) మరియు వేరొకటి గరుకు, సహనివేశాలుగా, గుళిక రహితంగా (R-type)అని పేర్కొన్నారు.

5) S-రకం కణాలు విరులెంట్, అదే R-రకం ‘విరులెంటా కాని’ రకాలు.

6) S-రకం కణాలను చిట్టెలుక లోనికి ప్రవేశపెట్టగా, అది న్యూమోనియాతో బాధపడి మరణించింది.

7) R-రకం కణలను చిట్టెలుక లోనికి ప్రవేశపెట్టగా, వ్యాధి కనిపించలేదు. అది సజీవంగా ఉంది.

8) S-రకం కణాలను వేడిచేసి, చిట్టెలుక లోనికి ప్రవేశపెట్టగా వ్యాధి కనిపించలేదు.

9) వేడిచేసిన S-రకం కణాలను, జీవించి ఉన్న R-రకం కణాలతో కలిపి చిట్టెలుక లోనికి ప్రవేశపెట్టగా, అది న్యూమోనియాతో మరణించింది. దాని నుండి జీవించి ఉన్న S-రకం కణాలను గుర్తించారు.

10) రెండు R-రకాలను వేడి చేయగా అవి S-రకాలుగా మార్చబడినాయి అని తీర్మానించారు.

11) పరివర్తన సూత్రం వలన జన్యుపదార్ధం మార్పుచెందడం వలన ఇది జరిగినది.

12) జన్యుపదార్థ స్థిరత్వాన్ని ‘గ్రిఫిత్ ‘ తన పరివర్తన సూత్రం ప్రయోగాల ద్వారా నిరూపించాడు.

13) బాక్టీరియాను చంపినటువంటి వేడి, జన్యుపదార్థ లక్షణాలను నష్టపరచలేదు.

14) RNA న్యూక్లియోటైడ్లో ఉన్న ప్రతి 2’-OH సముదాయం కూడా ఒక ‘చర్యా సముదాయం’.

15) ఇది RNA కారకంను సులువుగా క్షీణింపచేస్తుంది.

16) కావున RNA కంటే కూడా DNA ఒక సమర్థవంతమైన జన్యుపదార్థంగా చెప్పబడింది.

17) RNAను ప్రయోగంలో ఉపయోగించినపుడు, వేడి చేసి చంపిన, బాక్టీరియమ్ R విభేదం తీవ్ర రకం లేదా విషపూరిత బాక్టీరియాగా మార్పు చెందదు.

ప్రశ్న 5.
ఒపేరాను నిర్వచించి, ఒక ఉదాహరణ ఇవ్వండి. ప్రేరణాత్మక ఒపెరాన్ ను వివరించండి.
జవాబు:
1) ప్రోటీన్ల సంశ్లేషణలో సమన్విత నియంత్రణ చేయు ప్రమాణాన్ని ‘ఒపెరాన్’ అంటారు. ఇందులో నిర్మాణాత్మక ‘జన్యువులు, రెగ్యులేటర్ జన్యువులు, ఆపరేటర్ జన్యువులన్నీ కలిసి ఒక ప్రమాణంగా ఏర్పడి, సమన్విత నియంత్రణ చర్యలలో పాల్గొంటాయి.

2) లాక్ ఒపెరాన్ లోని ఒక అణువు. ఇది మూడు నిర్మాణాత్మక జన్యువులతో ఏర్పడి ఉంటుంది.
అవి (i) ఆపరేటర్ జన్యువు (ii) ప్రమోటర్ జన్యువు మరియు (iii) రెగ్యులేటర్ జన్యువు.
AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం 7

3) లాక్ ఒపెరాన్ సమన్విత నియంత్రణలో పద్ధతిని లాక్టోజ్ను గ్లూకోజ్ మరియు గాలక్టోజ్ జీవక్రియనందిస్తుంది.

4) లాక్ ఒపెరాన్లో ‘లాక్టోజ్’ ప్రేరకంగా వ్యవహరిస్తుంది.

5) లాక్ ఒపెరాన్ ‘నిరోధానికి’ బంధించబడి, చర్యను నిరోధిస్తుంది. లాక్టోజ్ ‘నిరోధకానికి’ బంధింపబడగానే, RNA పాలిమరేజ్ ‘ప్రమోటర్ ‘ ప్రాంతానికి బంధింపబడుతుంది.

6) మూడు నిర్మాణాత్మక జన్యువులు వాటి ఉత్పన్నాలను మరియు సంబంధిత ఎన్ఎమ్లను విడుదల చేస్తాయి.

7) ఈ ఎన్జైమ్లు లాక్టోజ్పై చర్యను జరిపి గ్లూకోజ్ మరియు గాలక్టోజ్న ఏర్పరుస్తాయి. కొంత సమయం తరువాత ‘ప్రేరకం’ స్థాయి తగ్గుతుంది. దీని వలన రెగ్యూలేటర్ జన్యువు నుండి ‘నిరోధకాన్ని’ (రెప్రసార్) సంశ్లేషణను జరుపుతుంది.

8) ఈ ప్రోటీన్ రెప్రసార్ ఒపెరాన్లోని ఆపరేటర్ ప్రదేశంలో కలిసి RNA పాలిమరేజ్ ‘ఒపెరాన్ను’ ‘అనులేఖనం’ చేయకుండా నిరోధిస్తుంది.

ప్రశ్న 6.
DNA ద్విసర్పిల నిర్మాణానికి చెందిన ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు:
వాట్సన్ మరియు క్రిక్లు ప్రతిపాదించిన ద్విసర్పిల DNA నిర్మాణానికి చెందిన ప్రధాన లక్షణాలు.
(i) ఇది రెండు పాలిన్యూక్లియోటైడ్ గొలుసులతో ఏర్పడినది.
దీనిలో ఫాస్ఫేట్ అణువులు వెన్నెముక అణువులుగా ఉంటాయి. నత్రజని క్షారాలు వెన్నెముక అణువుల లోపలి వైపుకు ప్రక్షేపమై ఉంటాయి.

(ii) న్యూక్లియోటైడ్ డీఆక్సీరైబోచక్కెరలు, నత్రజని క్షారాలు మరియు ఒక ఫాస్ఫేట్ అణువును కలిగి ఉంటుంది.

(iii)రెండు పోచలు ప్రతి సమాంతర ధృవత్వాన్ని కలిగి ఉంటాయి. అంటే ఒక పోచ 5’3′ ధృవత్వం వైపు, మరొకటి 3’→5’ ధృవత్వం వైపు ఉంటుంది.
AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం 8

(iv) రెండు పోచలలో ఉన్న నత్రజని క్షారాల మధ్య హైడ్రోజన్ బంధాలు ఏర్పడి నత్రజని క్షార జతలను ఏర్పరుస్తాయి. ఎడినైన్, థయామిన్తో రెండు హైడ్రోజన్ బంధాలతో బంధితమై ఉంటుంది. గ్వానిన్, సైటోనిన్తో మూడు బంధాలతో బంధితమై ద్విసర్పిల పోచల మధ్య దూరం 20Å ఉంటుంది. (పూర్తైన్లు – ఎడినైన్ మరియు గ్వానైన్, పిరమిడైన్లు – థైయామిన్ మరియు సైటోసిన్)

AP Inter 2nd Year Botany Important Questions Chapter 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం

(v) రెండు శృంఖలాలు ‘సవ్య దిశ’ వైపు కుండలి ఆకారంలో తిరిగి ఉంటాయి. ప్రతి కుండలి పొడవు 3.4nm మరియు ప్రతి సుమారుగా 10bp ఉంటాయి. కావున కుండలిలోని ప్రతి రెండు జతల మధ్య దూరం సుమారు 0.34nm ఉంటుంది.

(vi) ద్విసర్పిలంలో ప్రతిక్షారజత, దానిపై సమతలంలో మరొక క్షార జతకు బంధితమై ఉంటుంది. క్షారాల మధ్య హైడ్రోజన్ బంధాలు ఏర్పడుట వల్ల, హెలికల్ నిర్మాణానికి ఒక నిర్ధిష్టమైన ‘స్థిరత్వం’ ఏర్పడుతుంది.

ప్రశ్న 7.
DNA లైగేజ్కు ఉత్పరివర్తితమైన ఎ.కోలై కిరణ ధార్మిక డీఆక్సీ న్యూక్లియోటైడ్ల సమక్షంలో ప్రతికృతి చెందినట్లైతే కొత్తగా ఏర్పడిన కిరణధార్మిక DNA శుద్ధి చేసినపుడు ఏ రూపంలో ఉంటుంది?
జవాబు:

  1. పొడవైన DNA అణువులో ప్రతికృతి ద్విసర్పిలంలో ఒక చిన్న ప్రదేశం నుంచి ప్రారంభమవుతుంది. దీనినే ‘ప్రతికృతి పాయ’ (replication fork) అంటారు.
  2. ఒక పోచలో( 3′–5′)ధృవ మూసఫలకం ప్రతికృతి అవిచ్ఛిన్నం గా మరియు రెండవ పోచలో ప్రతికృతి విచ్ఛిన్నంగా జరుగుతుంది. విచ్ఛిన్నంగా సంశ్లేషించబడే ఖండితాలను “ఒఖజాకి” ఖండితాలు అంటారు.
  3. ఈ ‘ఒఖజాకి’ ఖండితాలు DNA లైగేజ్ ఎన్జైమ్ ద్వారా అతికించబడతాయి.
  4. కాని ఎ.కొలై, DNA లైగేజ్ ఎన్ఎమ్ ఉత్ప్రేరకం ఈ ‘ఒఖజాకీ’ ఖండితాలను బంధించలేదు.
  5. DNA పోచ ‘సాంద్రత ప్రవణత అపకేంద్రం’ ద్వారా శుద్ధి చేయబడినపుడు, సహజత్వాన్ని కోల్పోయి అధిక అణుభార ముక్కలు (ప్రధాన పోచ) మరియు అల్ప అణుభార ముక్కలు (వెనకబడిన పోచ) ఏర్పడతాయి.

Leave a Comment