AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

Students get through AP Inter 2nd Year Chemistry Important Questions 10th Lesson నిత్యజీవితంలో రసాయనశాస్త్రం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Chemistry Important Questions 10th Lesson నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మందులు అంటే ఏమిటి?
జవాబు:
పెద్ద అణుభారాలు గల లక్ష్యాలపై చర్య జరిపి జీవనప్రక్రియలో మార్పు తెచ్చేందుకు వాడే 100 నుండి 500u ల వరకు తక్కువ అణుభారాలు గల 8.

ప్రశ్న 2.
రసాయనాలను మందులు అంటారు.
జవాబు:
మందులను ఔషధాలుగా ఎప్పుడు పరిగణిస్తారు? పెద్ద అణుభారాలు గల లక్ష్యాలపై చర్య జరిపి జీవన ప్రక్రియలో మార్పు తెచ్చేందుకు వాడే రసాయనాలు వ్యాధులను గుర్తించడానికి, నిరోధించడానికి, అందుకు 9. అవసరమైన చికిత్స చేయడానికి ఉపయోగపడతాయో వాటిని ‘ఔషధాలు’ అంటారు.

ప్రశ్న 3.
‘కీమోథెరపీ’ పదాన్ని నిర్వచించండి.
జవాబు:
రసాయన పదార్థములను ఉపయోగించి వ్యాధికి చికిత్స మరియు వ్యాధిని నివారించుటను కీమోథెరపి అంటారు. లేదా రసాయనాల చికిత్స అంటారు.

ప్రశ్న 4.
మందుల లక్ష్యాలుగా పరిగణించబడే బృహత్ అణువులను తెల్పండి.
జవాబు:
జీవ అణువులైన కార్బొహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీనులు, న్యూక్లియిక్ ఆమ్లాలు మందులతో చర్య జరుపును. ఈ జీవ అణువులను మందుల లక్ష్య పదార్థాలు (లేదా) లక్ష్య అణువులు అంటారు.

ప్రశ్న 5.
ఎంజైమ్లు, గ్రాహకాలు అంటే ఏమిటి?
జవాబు:
శరీరంలో జీవ సంబంధమైన ఉత్ప్రేరకాలుగా పని చేసే ప్రోటీన్లను‘ఎంజైమ్’లు అంటారు. శరీరంలోని సమాచార బదిలీ వ్యవస్థలలో పాల్గొనే ప్రధాన పదార్థాలను ‘గ్రాహకాలు’ అంటారు.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్రశ్న 6.
ఎంజైమ్ క్రియాశీల స్థానాల వద్ద మందును ఏ బలాలు నిలిపి ఉంచుతాయి?
జవాబు:
అయానిక బంధాల ద్వారా లేదా హైడ్రోజన్ బంధాల ద్వారా లేదా వాండర్ వాల్స్ బలాల ద్వారా లేదా ద్విధ్రువ-ద్విధ్రువ అణువుల మధ్య జరిగే పరస్పర చర్యల ద్వారా ఎంజైమ్ క్రియాశీల స్థానాల వద్ద క్రియాధార అణువులు బంధితమౌతాయి.

ప్రశ్న 7.
ఎంజైమ్ నిరోధకాలు అంటే ఏమిటి?
జవాబు:
ఎంజైమ్లలోని క్రియాశీల స్థానాలను మందులు మెరుగుపరచవచ్చు. ఫలితంగా ఎంజైమ్తో క్రియాధార అణువు ఏర్పరచే బంధం ఏర్పడకపోవచ్చు లేదా ఎంజైమ్ జరిపే ఉత్ప్రేరణ చర్య నిరోధించబడవచ్చు. కాబట్టి ఈ మందులను ఎంజైమ్ నిరోధకాలు అంటారు.

ప్రశ్న 8.
ఎలోస్టీరిక్ స్థానం అంటే ఏమిటి? [AP 19]
జవాబు:
కొన్ని మందులు, ఎంజైమ్ క్రియాశీల స్థానాల వద్ద బంధితం కావు. ఇవి ఎల్లోస్టీరిక్ స్థానం అనే వేరొక ఎంజైమ్ స్థానం వద్ద బంధితమవుతాయి. దీనిని ఎల్లోస్టీరిక్ స్థానం అంటారు.

ప్రశ్న 9.
ఏంటగొనిష్టులు, ఎగొనిష్టులు అంటే ఏమిటి?
జవాబు:
గ్రాహకం బంధన స్థానానికి బంధితమై ఉండి గ్రాహకం జరిపే సహజ క్రియలను నిరోధించే మందులను అంతర్ విరుద్ధకాలు(antagonists) అంటారు. సహజ సమాచార వాహకాలను అనుకరణం చేసి గ్రాహకాన్ని తెరిపించే ఇతర రకం మందులు కూడా ఉన్నాయి. వీటిని అంతర్ సహాయకులు (agonists) అంటారు.

ప్రశ్న 10.
ఎందుకు మందులను, భిన్న పద్ధతులలో వర్గీకరణం చేయవలసిన అవసరం ఏర్పడింది.
జవాబు:
కింద పేర్కొన్న లక్షణాల ఆధారంగా మందులను వర్గీకరిస్తారు.
ఎ) వ్యాధి సంబంధ ఔషధాలుగా వర్గీకరణం :
నిబంధనల ఆధారంగా మందులను వర్గీకరిస్తారు. ఈ వర్గీకరణ వైద్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకమైన రోగ చికిత్సల విషయంలో ప్రతి వ్యాధి చికిత్సకు అందుబాటులో ఉండే మందుల గురించి ఈ వర్గీకరణ తెలుపుతుంది.

బి) మందులు జరిపే చర్యల ఆధారంగా వర్గీకరణ :
ప్రత్యేక జీవరసాయన ప్రక్రియపై మందు జరిపే చర్య ఆధారంగా ఈ వర్గీకరణ ఉంటుంది. ఉదాహరణకు శరీరంలో వాపును కలిగించే హిస్టమిన్ పదార్థం జరిపే చర్యను నిరోధించే మందులను యాంటీ హిస్టమిన్లు లేదా హిస్టమిన్ వ్యతిరేకులు అంటారు.

సి) ఔషధాల లక్ష్య అణువుల ఆధారంగా వర్గీకరణ :
కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు లాంటి చాలా జీవాణువులతో మందులు చర్య జరుపుతాయి. ఈ జీవాణువులనే ‘లక్ష్య అణువులు లేదా మందుల లక్ష్యాలు’ అంటారు. వైద్య రసాయన శాస్త్రవేత్తలకు లక్ష్య అణువుల ఆధారంగా చేసిన మందుల వర్గీకరణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

(డి) మందులలోని రసాయన పదార్థాల నిర్మాణాల ఆధారంగా వర్గీకరణ :
ఈ వర్గీకరణ మందులలోని రసాయన పదార్థాల నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. ఈ వర్గీకరణలో చోటుచేసుకొన్న మందులన్నింటిలోను ఉండే రసాయన పదార్థాలకు ఒకే రకమైన నిర్మాణం ఉంటుంది. అంతే కాకుండా వీటన్నింటికి ఔషధ శాస్త్ర సంబంధమైన చర్యలు ఒకే విధంగా ఉంటాయి.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్రశ్న 11.
ఆమ్ల విరోధులు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. [TS 16,20][AP19]
జవాబు:
ఉదరము నందలి ఆమ్లాన్ని తగ్గించి, సాధారణ PHను నియంత్రించు రసాయనాలను యాంటాసిడ్లు అంటారు.
ఉదా: ఓమప్రజోల్, లాన్సె ప్రజోల్

ప్రశ్న 12.
యాంటీ హిస్టమిన్లు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఉదరం గోడలకు ఉండే అభిగ్రాహకాల వద్దకు హిస్టిమెన్ వెళ్ళకుండా నిరోధించే రసాయనాలను యాంటీ హిస్టమైన్లు అంటారు. వీటి వలన అతి తక్కువ ఆమ్లం ఉత్పత్తి అగును.

ప్రశ్న 13.
ఆమ్ల విరోధులు, యాంటీ ఎలర్జిక్ మందులు, హిస్టమన్ల చర్యలలో అడ్డుపడతాయి. అయితే ఇవి రెండూ వాటి చర్యలలో ఒకదానితో మరొకటి ఎందుకు అడ్డుపడవు?
జవాబు:
యాంటీ ఎలర్జిక్, యాంటాసిడ్ (ఆమ్ల విరోధులు) మందులు భిన్న గ్రాహకాలపై పనిచేయటం వలన వాటి చర్యలలో ఒకదానితో మరొకటి అడ్డుపడవు. ఉదాహరణకు హిస్టమిన్ విడుదల ఎలర్జీని కలిగిస్తుంది. అంతే కాకుండా ఉదరంలో హైడ్రోక్లోరికామ్లం విడుదలగుట వలన ఆమ్లత్వాన్ని కల్గిస్తుంది. యాంటీ ఎలర్జిక్ మరియు యాంటాసిడ్ మందులు వేర్వేరు గ్రాహకాలపై పనిచేయటం వలన, యాంటీ హిస్టమీన్లు ఎలర్జీని, యాంటాసిడ్లు ఆమ్లత్వాన్ని తొలగిస్తాయి.

ప్రశ్న 14.
ట్రాంక్విలైజర్లు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. [TS 16]
జవాబు:
సైకోసిస్, న్యూరోసిస్ వంటి మానసిక వ్యాధులు నివారణకు ఉపయోగించే మందులను ట్రాంక్విలైజర్లు అంటారు. ఉదా:ల్యుమినాల్, సెకనాల్ మొ||నవి.

ప్రశ్న 15.
బార్బిట్యురేట్లు అంటే ఏమిటి?
జవాబు:
బార్బిట్యురేట్లు అనగా ట్రాంక్విలైజర్లు. ఎందుకనగా ఇవి బార్బిట్యూరిక్ ఆమ్లం యొక్క ఉత్పన్నాలు.
ఉదా : వెరోనాల్, ఎమిటాల్, నెమ్ బుటాల్, లూమినాల్, సెకోనాల్. బార్బిట్యురేట్లు నిద్ర తెప్పించే హిప్నోటిక్లలు.

ప్రశ్న 16.
ఎనాల్జెసిక్లు అంటే ఏమిటి? వీటిని ఎలా వర్గీకరిస్తారు? [AP-19][TS-18]
జవాబు:
ఇవి నొప్పి తగ్గించును లేదా నాడీ వ్యవస్థకు హాని చేయకుండా నొప్పిని పూర్తిగా తొలగించును. ఇవి స్పృహ కోల్పోవడం, మానసిక ఆందోళన, పక్షవాతం వంటి నరాల వ్యవస్థకు సంబంధించిన ప్రభావాలను కల్గించవు. ఇవి ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు.
i. నాన్ నార్కోటిక్ ఎనాల్జెసిక్లు
ii. నార్కోటిక్ ఎనాల్జెసిక్లు

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్రశ్న 17.
నార్కోటిక్ ఎనాల్జెసిక్ లు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నార్కొటిక్ మందులు వైద్యపరంగా చాలా శక్తివంతమైనవి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను బలహీన పరచి బలమైన ఎనాల్జిసిక్లుగా పనిచేయును. ఇవి ఎడిక్టివ్లు అనగా వశపరచుకొను మందులు.
ఉదా : మార్ఫిన్, కొడీ.

ప్రశ్న 18.
నార్కోటిక్ ఎనాల్జెసిక్లలు కాని ఎనాల్జెసిక్ లు ఏవి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఇవి చిన్న చిన్న నొప్పులను, బాధలను తగ్గించు మందులు. కాని ఇవి వశపరచుకొనే ధర్మం లేని పదార్థాలు. తలనొప్పి లాంటి వాటికి ఉపయోగపడును.
ఉదా : ఆస్పరిన్, ఐబూప్రొఫెన్.

ప్రశ్న 19.
యాంటీమైక్రోబియల్స్ అంటే ఏమిటి?
జవాబు:
వ్యాధిని కలుగచేయు సూక్ష్మజీవులను నాశనం చేయుటకు లేదా వాటి పెరుగుదలను నివారించు మందులను యాంటిమైక్రోబియల్ మందులు అంటారు. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించును.
ఉదా : లైసోజోమ్, లాక్టిక్ ఆమ్లం మొదలగునవి.

ప్రశ్న 20.
యాంటీ బయోటిక్ లు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. [AP 16,18][TS 19]
జవాబు:
ఇవి సూక్ష్మజీవులను ఉత్పన్నం చేయగా అవి ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిర్మూలించుటకు లేదా నిరోధించుటకు ఉపయోగపడును.
ఉదా : పెన్సిలిన్, క్లోరమ్ ఫినకాల్, సల్ఫాడైజీన్

ప్రశ్న 21.
యాంటీసెప్టిక్ లు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించట లేదా నాశనం చేయుటకు ఉపయోగించు మందులను యాంటీ సెప్టిక్లు అంటారు. [AP,TS 15,19]

ప్రశ్న 22.
క్రిమిసంహారిణులు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. [AP 17]
జవాబు:
సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించుటకు లేదా నాశనం చేయుటకు వాటిని వాడుతారు. వీటిని జీవరహిత వ్యవస్థలైన మురుగు కాలువలలో ఉపయోగిస్తారు.
ఉదా :
i. 4% ఫార్మాల్డిహైడ్ జల ద్రావణాన్ని ఫార్మాలిన్ అంటారు. ఇది క్రిమి సంహారిణి.
ii. 0.3 ppm గాఢత గల క్లోరిన్ ద్రావణం క్రిమి సంహారిణిగా వాడుతారు.

ప్రశ్న 23.
యాంటీ సెప్టిక్ గాను, క్రిమి సంహారిణి గాను ఉపయోగపడే పదార్థాన్ని తెల్పండి.
జవాబు:
గాఢతను మార్చినట్లైతే కొన్ని పదార్థాలు యాంటీ సెప్టిక్లుగాను, క్రిమి సంహారిణులుగా కూడా పనిచేస్తాయి. ఉదాహరణకు 0.2% ఫినాల్ ద్రావణం యాంటీ సెప్టిక్గా ఉంటే, 1% ఫినాల్ ద్రావణం క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్రశ్న 24.
యాంటీ సెప్టిక్ కు, క్రిమిసంహారిణులకు మధ్య భేదం ఏమిటి?
జవాబు:

  1. సూక్ష్మజీవులను చంపేవి లేదా వాటి పెరుగుదలను నిరోధించేవి అయిన రసాయన పదార్థాలను యాంటీ సెప్టిక్లు, క్రిమిసంహారిణులు అంటారు.
  2. యాంటీ సెప్టిక్ ను గాయాలు, కోతలు, రణాలు, 30. రోగానికి గురైన చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణజాలాలకు పూతగా పూస్తారు. క్రిమిసంహారిణులను నేలలు, కాలువలు, పరికరాలు మొదలైన నిర్జీవ పదార్థాలకు పూస్తారు.
  3. యాంటీ సెప్టిక్లు జీవకణజాలాలకు ఎటువంటి హాని చేయవు కానీ క్రిమిసంహారిణులు జీవకణజాలాలకు హాని కల్గిస్తాయి.

ప్రశ్న 25.
డెట్టాల్లోని ప్రధాన అనుఘటకాలు ఏవి?
జవాబు:
క్లోరోక్సీలెనోల్ మరియు Q-టెర్ఫినియోల్ (తగిన ద్రావణిలో).

ప్రశ్న 26.
అయోడిన్ టింక్చర్ అంటే ఏమిటి? దీని ఉపయోగం ఏమిటి? [AP 20]
జవాబు:
ఆల్కహాల్-నీరు మిశ్రమంలో కరిగించిన 2-3శాతం అయోడిన్ ద్రావణాన్ని అయోడిన్ టింక్చర్ అంటారు. దీనిని గాయాలపై పూస్తారు. ఇది ఒక శక్తివంతమైన యాంటీ సెప్టిక్.

ప్రశ్న 27.
గర్భనిరోధక మందులు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఇవి సాధారణ స్టెరాయిడ్లు. ఇవి గర్భ నిరోధక పదార్థాలుగా పనిచేయును. ఈ మందులు స్త్రీలో ఋతుచక్రములను నియంత్రించును.
ఉదా : నాస్ఇథిన్డ్రోన్, మిఫెప్రిస్టోన్, ఇథైనిలెస్ట్రాడియోల్ (నోవెస్టోల్)

ప్రశ్న 28.
ఆహారానికి రసాయన పదార్థాలను ఎందుకు చేరుస్తారు?
జవాబు:
ఆహారాన్ని (i) చెడిపోకుండా నిల్వ వుంచడానికి
(ii) దాని బాహ్యరూపాన్ని ఆకర్షణీయంగా ఉంచటానికి,
(iii) దాని పౌష్టిక విలువలను పెంచడానికి ఆహారానికి కొన్ని రసాయన పదార్థాలను కలుపుతారు.

ప్రశ్న 29.
ఆహార సంకలితాల భిన్న వర్గాలను తెల్పండి.
జవాబు:
ఆహారానికి కలిపే ముఖ్య సంకలితాలు

  1. ఆహారపు రంగులు
  2. సుగంధాలు, తీపి రుచినిచ్చే పదార్థాలు
  3. కొవ్వు పదార్థాలను ఎమల్సీకరణం చేసే పదార్థాలు, ఆహారాన్ని నిల్వ చేయడంలో స్థిరంగా పదార్థాలు.
  4. ఆహారానికి మెత్తదనాన్ని కలిగించే పదార్థాలు, వివర్ణకారకాలు
  5. యాంటీ ఆక్సీకరణులు
  6. పరిరక్షక పదార్థాలు
  7. ఖనిజాలు, విటమిన్లు, ఎమైనో ఆమ్లాలు లాంటి పౌష్టిక విలువలను పెంచే పదార్థాలు.

ప్రశ్న 30.
కృత్రిమ తీపి కారకాలు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. [AP 15,16,17, 20][TS-15]
జవాబు:
సహజ చక్కెరల స్థానంలో ఉపయోగించు కృత్రిమ రసాయనాలు. ఇవి కాలరీలను తగ్గించును. మరియు చక్కెర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువ తీపిగలవి.
ఉదా : ఆస్పర్టేమ్, సాకరీన్, సుక్రలోజ్ మొ||నవి.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్రశ్న 31.
మనకు కృత్రిమ తీపి కారకాల అవసరం ఏమిటి?
జవాబు:
సుక్రోజ్ (చక్కెర) వంటి తీపి రుచిని కలిగించే సహజ పదార్థాలు సేవిస్తే ఆహార పదార్థాలు శరీరానికి అందించే కేలరీల పరిమాణం కూడా పెరుగుతుంది. కాబట్టి మధుమేహ రోగులు కృత్రిమ తీపి కారకాలు వాడటానికి ఇష్టపడతారు. ఇవి ఆహారం అందించే కేలరీలను నియంత్రిస్తాయి.

ప్రశ్న 32.
శీతల ఆహార పదార్థాలకు, శీతల పానీయాలకు మాత్రమే ఆస్పర్డమ్ను ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
ఆహారం వండే ఉష్ణోగ్రతల వద్ద ఆస్పర్జేమ్ అస్థిరంగా వుంటుంది. అందువల్ల దీనిని శీతల ఆహార పదార్థాలలో, శీతల పానీయాలలో మాత్రమే ఉపయోగిస్తారు.

ప్రశ్న 33.
మధుమేహ రోగి వాడే తీపి పదార్థాల తయారీలో వాడే కృత్రిమ తీపి కారకాన్ని తెల్పండి.
జవాబు:
సాకరీన్.

ప్రశ్న 34.
ఆలిటేమ్ను, కృత్రిమ తీపి కారకంగా వాడటంలోని ఇబ్బందులు ఏమిటి?
జవాబు:
ఇది అత్యధిక తియ్యదనాన్ని అందించే కృత్రిమ తీపి కారకం. ఆస్పార్టేమ్ కంటే ఇది స్థిరంగా ఉండే పదార్థం. అయితే దీనిని వాడినప్పుడు అది అందించే తియ్యదనాన్ని నియంత్రించడం చాలా కష్టం.

ప్రశ్న 35.
ఆహారపదార్థాల పరిరక్షకాలు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. [AP-17,18]
జవాబు:
పదార్థాలు కంటికి ఇంపుగా కనబడుటకు, ఎక్కువ కాలం నిల్వ ఉండుటకు వీటిని ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి సూక్ష్మజీవుల వృద్ధి ద్వారా ఆహార పదార్థాలు చెడిపోకుండా కాపాడతాయి. ఉదా: సోడియం ” బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ మొ||నవి.

ప్రశ్న 36.
ఆహార పదార్థంలో సంకలితాలుగా వాడే రెండు పరిచయమున్న యాంటీ ఆక్సీకరణులను తెల్పండి.
జవాబు:
బ్యుటైలేటెడ్ హైడ్రాక్సీటోలీన్ (BHT) మరియు
బ్యుటైలేటెడ్ హైడ్రాక్సీ అవిసోల్ (BHA). [AP 20]

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్రశ్న 37.
సబ్బు తయారీ అంటే ఏమిటి?
జవాబు:
కొవ్వు పదార్థాన్ని సోడియం హైడ్రాక్సైడ్ జలద్రావణంతో కలిపి వేడి చేసి సోడియం లవణాలు గల సబ్బులను తయారుచేస్తారు. దీనిని సబ్బు ఏర్పడే చర్య (saponi- fication) అంటారు.

ప్రశ్న 38.
రసాయనికంగా సబ్బులు అంటే ఏమిటి?
జవాబు:
ఫాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాలే సబ్బులు.
ఉదా : సోడియం పాల్మిటేట్

ప్రశ్న 39.
కఠినజలంలో సబ్బులు ఎందుకు పనిచేయవు?
జవాబు:
కఠిన జలంలో కాల్షియం, మెగ్నీషియం అయాన్లు ఉంటాయి. కఠినజలంలో సోడియం లేదా పొటాషియం సబ్బులను కరిగిస్తే ఇవి వరసగా కరగని కాల్షియం, మెగ్నీషియం సబ్బులను ఏర్పరుస్తాయి. ఈ కరగని సబ్బులు మడ్డి రూపంలో వేరుపడతాయి. కాబట్టి ఇవి శుభ్రపరిచే కారకాలుగా పనిచేయవు. ఎందుకంటే ఈ అవక్షేపాలు వస్త్రాలపై జిగురు పదార్థాలుగా అతుక్కుపోతాయి.

ప్రశ్న 40.
సంక్లిష్ట డిటర్జెంట్లు అంటే ఏమిటి?
జవాబు:
సబ్బుల ధర్మాలన్నీ ఉండి, వాటిలో మాత్రం సబ్బులు లేని శుభ్రపరిచే కారకాలను సంక్లిష్ట లేదా కృత్రిమ డిటర్జెంట్లు అంటారు. ఇవి కఠినజలంలో కూడా నురుగును ఇవ్వడం కారణంగా వీటిని కఠినజలంలోను, మృదుజలంలోను కూడా ఉపయోగిస్తారు.

ప్రశ్న 41.
సబ్బుకు, సంక్లిష్ట డిటర్జెంటుకు గల భేదం ఏమిటి? [AP 18][IPE’14]
జవాబు:
సబ్బులను మృదుజలంలో మాత్రమే ఉపయోగిస్తారు. సంక్లిష్ట డిటర్జెంట్లను కఠినజలంలోను, మృదుజలంలోను కూడా ఉపయోగిస్తారు.

ప్రశ్న 42.
సబ్బులతో పోలిస్తే సంక్లిష్ట డిటర్జెంట్లు మంచివిగా ఉంటాయి. ఎందుకు?
జవాబు:
సంక్లిష్ట డిటర్జెంట్లు కఠినజలంలోను, మృదు జలంలోను ఉపయోగపడతాయి. ఇవి కఠినజలంలో కూడా నురుగును ఇస్తాయి. దీనికి కారణం సల్ఫోనిక్ ఆమ్లాలు మరియు వాటియొక్క కాల్షియం, మెగ్నీషియం లవణాలు కఠినజలంలో కరుగుతాయి. కానీ ఫాటీ ఆమ్లాలు వాటి యొక్క కాల్షియం, మెగ్నీషియం లవణాలు కఠినజలంలో కరుగవు.

ప్రశ్న 43.
సంక్లిష్ట డిటర్జెంట్ల భిన్న రకాలను తెల్పండి.
జవాబు:
సంక్లిష్ట డిటర్జెంట్లను 3 రకాలుగా విభజిస్తారు. అవి
(i) ఆనయానిక డిటర్జెంట్లు
(ii) కాటయానిక డిటర్జెంట్లు
(iii) అయానేతర డిటర్జెంట్లు.

ప్రశ్న 44.
నీటి కఠినత్వాన్ని నియంత్రించడానికి సబ్బులను, సంక్లిష్ట డిటర్జెంట్లను వాడవచ్చా?
జవాబు:
కఠినజలంలో కాల్షియం, మెగ్నీషియం అయాన్లు ఉంటాయి. కఠినజలంలో సోడియం లేదా పొటాషియం సబ్బులను కరిగిస్తే ఇవి వరుసగా కరగని కాల్షియం, మెగ్నీషియం సబ్బులను ఏర్పరుస్తాయి. కానీ డిటర్జెంట్లు ఏర్పరచవు. సంక్లిష్ట డిటర్జెంట్లు మృదుజలంలోను, కఠిన జలంలోను నురుగును ఏర్పరుస్తాయి. కావున సబ్బులు సంక్లిష్ట డిటర్జెంట్లు కావు. నీటి కఠినత్వాన్ని నియంత్రించడానికి సబ్బులను, సంక్లిష్ట డిటర్జెంట్లను వాడకూడదు.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్రశ్న 45.
నీటిలో కాల్షియం హైడ్రోజన్ కార్బొనేట్ కరిగి ఉన్నట్లైతే సబ్బులు, సంక్లిష్ట డిటర్జెంట్లలో దేనిని వస్త్రాలు ఉతకడానికి వాడతారు? ఎందువల్ల?
జవాబు:
కాల్షియం హైడ్రోజన్ కార్బొనేట్ నీటిలో కరిగి ఉండటం వలన నీరు కఠిన జలంగా మారుతుంది. సబ్బులు మృదుజలంలో మాత్రమే నురుగును ఇస్తాయి. సంక్లిష్ట డిటర్జెంట్లు కఠినజలంలోను, మృదుజలంలోనూ నురుగును ఇస్తాయి. కాబట్టి నీటిలో కాల్షియం హైడ్రోజన్ కార్బొనేట్ కరిగి ఉన్నట్లైతే సంక్లిష్ట డిటర్జెంట్లను వస్త్రాలు ఉతకడానికి వాడతారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
వైద్య రసాయన శాస్త్రంలో వాడే లక్ష్య అణువులు లేదా మందుల లక్ష్యాలు అనే పదాన్ని వివరించండి.
జవాబు:
కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు లాంటి చాలా జీవాణువులతో మందులు చర్య జరుపుతాయి. ఈ జీవాణువులనే లక్ష్య అణువులు లేదా మందుల లక్ష్యాలు అంటారు. జీవ సంబంధమైన బృహదణువులు శరీరంలో పలు రకాల జీవ ప్రక్రియలను జరుపుతాయి. శరీరంలో జీవసంబంధమైన ఉత్ప్రేరకాలుగా పనిచేసే ప్రోటీన్లను ఎంజైమ్లు అంటారు. శరీరంలోని సమాచార బదిలీ వ్యవస్థలలో పాల్గొనే ప్రధాన పదార్థాలను గ్రాహకాలు అంటారు. వాహక ప్రోటీన్లు పోలార్ అణువులను జీవకణం పొరలోకి తీసుకొని పోతాయి. న్యూక్లియిక్ ఆమ్లాలు జన్యుసంబంధమైన సమాచారాన్ని సంహితరూపంలో జీవకణాలకు అందజేస్తాయి. లిపిడ్లు, కార్బోహైడ్రేట్లు జీవకణం పొరల నిర్మాణ భాగాలుగా ఉన్నాయి.

ప్రశ్న 2.
మందుల లక్ష్యాలుగా ఎంజైమ్ల ఉత్ప్రేరణ చర్యను వివరించండి.
జవాబు:
ఉత్ప్రేరణ చర్యలలో ఎంజైమ్లు రెండు ముఖ్యమైన క్రియలను జరుపుతాయి.
i) రసాయన చర్య జరగడానికి వీలు కల్పించే విధంగా క్రియాధార అణువు లేదా సబ్ట్ ఎంజైమ్ తనలో నిలుపుకొని ఉంచడం అనేది ఎంజైమ్ జరిపే క్రియలలో మొదటి చర్య. ఎంజైమ్లు వాటిలోని క్రియాశీల స్థానాలలో సరైన దృగ్విన్యాసంలో క్రియాధార అణువులను నిలుపుకొని ఉంచుతాయి. ఎందుకంటే ఈ ప్రక్రియలో క్రియాధార అణువు కారకం చేత సరయిన పద్ధతిలో చురుకుగా చర్యలో పాల్గొనగలుగుతుంది. అయానిక బంధాల ద్వారా హైడ్రోజన్ బంధాల ద్వారా లేదా వాండర్వాల్స్ బలాల ద్వారా. లేదా ద్విధ్రువ-ద్విధ్రువ అణువుల మధ్య జరిగే పరస్పర చర్యల ద్వారా ఎంజైమ్ల క్రియాశీల స్థానాల వద్ద క్రియాధార అణువులు బంధితమవుతాయి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 1

ii) చర్యలో క్రియాధార అణువుతో తలపడే ప్రమేయ వర్గాలను సమకూర్చి రసాయన చర్యను ప్రోత్సహించడం అనేది ఎంజైమ్ల రెండవ చర్య.

ప్రశ్న 3.
మందు-ఎంజైమ్ మధ్య అన్యోన్య చర్యను వివరించండి.
జవాబు:
ఎంజైమ్లలోని క్రియాశీల స్థానాలను మందులు మరుగుపరచవచ్చు. ఫలితంగా ఎంజైమ్తో క్రియాధార అణువు ఏర్పరచే బంధం ఏర్పడకపోవచ్చు. లేదా ఎంజైమ్ జరిపే ఉత్ప్రేరణ చర్య నిరోధించబడవచ్చు. కాబట్టి ఈ మందులను ఎంజైమ్ నిరోధకాలు అంటారు. ఎంజైమ్ల క్రియాశీల స్థానాల వద్ద, క్రియాధార అణువు అతుక్కునే చర్యను మందులు 2 విధాలుగా నిరోధిస్తాయి.

i) ఎంజైమ్ల క్రియాశీల స్థానాల వద్ద బంధితమవడానికి సహజ క్రియాధార అణువులతో పాటు మందులు కూడా పోటీపడతాయి. ఈ రకం మందులను పోటీ నిరోధకాలు అంటారు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 2

ii) కొన్ని మందులు, ఎంజైమ్ క్రియాశీల స్థానాల వద్ద బంధితం కావు. ఇవి ఎల్లోస్టీరిక్ స్థానం అనే వేరొక ఎంజైమ్ స్థానం వద్ద బంధితమవుతాయి. ఈ విధంగా ఎల్లోస్టీరిక్ స్థానం వద్ద నిరోధకం బంధితమవడం కారణంగా క్రియాశీల స్థానం ఆకారంలో మార్పు వస్తుంది. ఫలితంగా క్రియాధార అణువు దీనిని గుర్తించడం అసాధ్యం అవుతుంది.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 3

ఎంజైమ్కు, నిరోధకానికి మధ్య ఏర్పడిన బంధం బలమైన సమయోజనీయ బంధం అయితే అది సులభంగా విచ్ఛిన్నం కాదు. ఈ పరిస్థితులలో ఎంజైమ్ చర్యను పూర్తిగా అడ్డుకుంటుంది. అటువంటప్పుడు ఎంజైమ్ -నిరోధకం సంక్లిష్టాన్ని శరీరం క్రమపతనం చేసి, కొత్త ఎంజైము ఏర్పరుస్తుంది.

ప్రశ్న 4.
సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ లేదా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లేదా అల్యూమినియం హైడ్రాక్సైడ్, వీటికంటే సిమెటిడీన్, రెనిటిడీన్ ఎందుకు మంచి ఆమ్ల విరోధులుగా పనిచేస్తాయి?
జవాబు:
సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ లేదా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లేదా అల్యూమినియం హైడ్రాక్సైడ్లను అధికంగా వాడినట్లైతే జీర్ణకోశం క్షారత్వాన్ని సంతరించుకొంటుంది. దీని ప్రభావం ద్వారా జీర్ణకోశంలో ఆమ్లం ఇంకా అధికంగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా జీర్ణకోశంలో పుండ్లు (అల్సర్లు) ఏర్పడతాయి. సిమెటిడీన్, రెనిటిడీన్లు జీర్ణకోశం గోడలలో గల గ్రాహకాలతో హిస్టమిన్ జరిపే చర్యను నిరోధిస్తాయి. తద్వారా ఆమ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. కాబట్టి సియెటిడీన్, రెనిటిడీన్లు మంచి ఆమ్ల విరోధులుగా పనిచేస్తాయి.

ప్రశ్న 5.
అల్ప పరిమాణాలలో ఉండే నార్ ఎడ్రినలీన్ ద్వారా మనోవ్యాకులత కలుగుతుంది. ఈ సమస్య చికిత్సకు ఏ రకం మందులు అవసరం అవుతాయి? రెండు మందులను పేర్కొనండి.
జవాబు:
నార్ ఎడ్రినలీన్ పరిమాణం తక్కువగా ఉన్నట్లైతే సంకేతాలను పంపించే దీని క్రియాశీలత కూడా తగ్గిపోతుంది. ఈ పరిస్థితులలో వ్యక్తి వ్యాకులతకు గురవుతాడు. ఈ పరిస్థితులలో యాంటీడిప్రసెంట్ మందులు అవసరం అవుతాయి. ఈ మందులు నార్ఎడ్రినలీన్ క్రమ పతన క్రియను ఉత్ప్రేరణం చేసే ఎంజైమ్ను నిరోధిస్తాయి. ఈ ఎంజైమ్ నిరోధించబడితే ముఖ్య నాడీ ప్రసారిణి జీవక్రియ మందగిస్తుంది. ఈ పరిస్థితులలో తన గ్రాహకాన్ని దీర్ఘకాలం ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా వ్యాకులత స్థితిని వ్యతిరేకిస్తుంది. ఇస్రోనియజిడ్, ఫెనాలైన్ అనేవి రెండు ముఖ్యమైన మందులు.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్రశ్న 6.
ఎనాల్జిసిక్లు అంటే ఏమిటి? వాటిని ఎలా వర్గీకరిస్తారు? ఉదాహరణలు ఇవ్వండి. [AP 15]
జవాబు:
స్పృహ కోల్పోవడం, మానసిక ఆందోళనకు గురి కావడం, మతిస్థిమితం లేని పనులు చేయడం, పక్షవాతంతో బాధపడటం లేదా ఇతర రకాల నరాల వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలను కలిగించకుండా ఇవి నొప్పిని లేదా బాధను మాత్రము తగ్గించడం లేదా పూర్తిగా నయం చేయడం చేస్తాయి. వీటిని కింది విధంగా వర్గీకరిస్తారు.
i) నార్కోటిక్ మందులు :
ఇవి మగతను కల్గించు పదార్థములు. నార్కొటిక్ మందులు అనగా వశపరచుకొను మందులు అని అర్థం. ఇవి ఎక్కువగా తీసుకొనిన, నాడీవ్యవస్థను బలహీన పరచి వణుకు రోగము వచ్చి చివరకు మరణం కలుగవచ్చు.
ఉదా : మార్ఫిన్, కొడైన్ మొ||నవి.

ii) నాన్-నార్కోటిక్ మందులు :
ఇవి నొప్పులను తగ్గించు మందులు. ఇవి వశపర్చుకొనే ధర్మాన్ని కల్గి ఉండవు. సాధారణంగా వీటిని తలనొప్పి, వెన్నునొప్పి మొదలగు వాటికి ఉపయోగిస్తారు.
ఉదా: ఆస్పరిన్, ఐబుప్రొఫెన్.

ప్రశ్న 7.
యాంటీమైక్రోన్ మందుల రకాలు ఏమిటి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఇంకా ఇతర వ్యాధి కారకాలు లాంటి ఎన్నో రకాల సూక్ష్మజీవుల ద్వారా మానవులలోను, జంతువులలోను వ్యాధులు కలుగుతాయి. వ్యాధిని కలుగచేయు సూక్ష్మజీవులను నాశనం చేయుటకు లేదా వాటి పెరుగుదలను నివారించు మందులను యాంటి మైక్రోబియల్ మందులు అంటారు. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించును.
ఇవి చాలా రకాలు.
a. యాంటీ బయోటిక్స్ – పెన్సిలిన్, ఎరిత్రోమైసిన్
b. యాంటీ సెప్టిక్లు – ఫ్యూరసీన్, సోఫ్రామైసీన్,
c. క్రిమిసంహారిణులు – 1% ఫినాల్ ద్రావణం, 0.2-0.4 ppm గాఢతలో గల క్లోరిన్ జలద్రావణం

ప్రశ్న 8.
యాంటీబయోటిక్లల అభిలాక్షణిక ధర్మాలను తెలపండి.
జవాబు:
యాంటీ బయోటిక్ల అభిలాక్షణిక ధర్మాలు

  1. యాంటీ బయోటిక్ జీవులు జీవక్రియలలో ఏర్పడే క్రియాజన్యం అయి ఉండాలి.
  2. యాంటీ బయోటిక్ కు అల్ప పరిమాణాలలోనే క్రియాశీలత ధర్మం ఉండాలి.
  3. యాంటీ బయోటిక్, సూక్ష్మజీవుల పెరుగుదలను లేదా బతుకు ప్రక్రియలను మందిత పరచాలి.
  4. సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్తో నిర్మాణంలో సారూప్యత ప్రదర్శించే సంక్లిష్ట పదార్థంగా యాంటీ బయోటిక్ ఉండాలి. యాంటీ బయోటిక్లకు సూక్ష్మజీవులను చంపే ధర్మాన్ని లేదా సూక్ష్మజీవులను నిరోధించే ధర్మం ఉండాలి.

ప్రశ్న 9.
అధిక విస్తృత యాంటీ బయోటిక్ అంటే ఏమిటి? వివరించండి.
జవాబు:
గ్రామ్-పాజిటివ్ లేదా గ్రామ్-నెగెటివ్ బ్యాక్టీరియాను నాశనం చేసే లేదా నిరోధించే యాంటీబయోటిక్లను అధిక క్రియాత్మక విస్తృతి యాంటీ బయోటిక్లు అంటారు. టెట్రాసైక్లిన్, ఓఫ్లోక్సాసిన్, క్లోరామ్ ఫెనికోల్ వంటి హానికర బ్యాక్టీరియాలను అధిక విస్తృతి యాంటీ బయోటిక్లు నాశనం చేస్తాయి. క్లోరామ్ ఫెనికోల్ని టైఫాయిడ్, రక్తవిరోచనాలు, అధిక జ్వరం, మూత్రానికి సంబంధించిన కొన్ని రకాల సంక్రమణాలు, మెనిన్రైజైటిస్, నిమోనియా వ్యాధులు గల వారికి దీనిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 10.
అధిక విస్తృతి యాంటీ బయోటిక్లు స్వల్ప విస్తృతి యాంటీ బయోటిక్ లు అంటే ఏమిటి? ప్రతిదానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గ్రామ్-పాజిటివ్ లేదా గ్రామ్-నెగెటివ్ బ్యాక్టీరియాను నాశనం చేసే లేదా నిరోధించే యాంటీబయోటిక్ లను అధిక క్రియాత్మక విస్తృతి యాంటీ బయోటిక్లు అంటారు. ఉదా : ఏంపిసిలీన్, ఏమాక్సీసిలీన్ మరియు క్లోరామ్ ఫెనికోల్.

గ్రామ్-పాజిటివ్ లేదా గ్రామ్-నెగెటివ్లో ఒక రకం సూక్ష్మజీవులపై మాత్రమే ప్రభావం ప్రదర్శించే యాంటీ బయోటిక్లను అల్పక్రియాత్మక విస్తృతి యాంటీ బయోటిక్లు అంటారు.
ఉదా : పెన్సిలీన్ – G

ప్రశ్న 11.
యాంటీ సెప్టిక్లు, క్రిమిసంహారిణులపై లఘు వ్యాఖ్యను రాయండి. [TS 15,17,19]
జవాబు:
యాంటీ సెప్టిక్లు :
సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించుట లేదా నాశనం చేయుటకు ఉపయోగించు మందులను యాంటీ సెప్టిక్ లు అంటారు. ఇవి జీవకణజాలాలకు ఎటువంటి హాని చేయవు. యాంటీ సెప్టిక్లను గాయాలు, కోతలు, రణాలు, రోగానికి గురైన చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణజాలాలకు పూతగా పూస్తారు.
ఉదా : డెట్టాల్, బితినోల్, సోమైసిన్, ఫ్యూరాసీన్లు యాంటీ సెప్టిక్లు.

క్రిమిసంహారిణులు :
సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించుటకు లేదా నాశనం చేయుటకు వీటిని వాడుతారు. వీటిని జీవరహిత వ్యవస్థలైన మురుగు కాలువలలో, నేలలు, పరికరాలు మొదలైన నిర్జీవ పదార్థాలకు పూస్తారు. ఇవి జీవకణజాలాలకు హాని చేస్తాయి.
ఉదా : 1% ఫినాల్ ద్రావణం, 0.2 0.4ppm గాఢతలో గల క్లోరిన్ జలద్రావణం, అల్పగాఢతలలో గల సల్ఫర్ డై ఆక్సైడ్ ద్రావణం క్రిమిసంహారిణులుగా పని చేస్తాయి.

ప్రశ్న 12.
క్రిమిసంహారిణులను, యాంటీసెప్టిక్ లు ఏవిధంగా భేదిస్తాయి?
జవాబు:
యాంటీ సెప్టిక్లు :
సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించుట లేదా నాశనం చేయుటకు ఉపయోగించు మందులను యాంటీ సెప్టిక్ లు అంటారు. ఇవి జీవ కణజాలాలకు ఎటువంటి హాని చేయవు. యాంటీ సెప్టిక్లను గాయాలు, కోతలు, రణాలు, రోగానికి గురైన చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణజాలాలకు పూతగా పూస్తారు.

క్రిమిసంహారిణులు :
సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించుటకు లేదా నాశనం చేయుటకు వీటిని వాడుతారు. వీటిని జీవరహిత వ్యవస్థలైన మురుగు కాలువలలో, నేలలు, పరికరాలు మొదలైన నిర్జీవ పదార్థాలకు పూస్తారు. ఇవి జీవకణజాలాలకు హాని చేస్తాయి.

గాఢతను మార్చినట్లైతే కొన్ని పదార్థాలు యాంటీ సెప్టిక్లుగాను, క్రిమిసంహారిణులుగా కూడా పనిచేస్తాయి. ఉదాహరణకు 0.2 శాతం ఫినాల్ ద్రావణం యాంటీ సెప్టిక్గా ఉంటే 1% ద్రావణం క్రిమిసంహారిణిగా పని చేస్తుంది.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్రశ్న 13.
ఆహార పదార్థ సంకలితాలలో ముఖ్య రకాలు ఏవి?
జవాబు:
ఆహారానికి కలిపే ముఖ్య సంకలితాలు

  1. ఆహారపు రంగులు
  2. సుగంధాలు, తీపి రుచినిచ్చే పదార్థాలు
  3. కొవ్వు పదార్థాలను ఎమల్సీకరణం చేసే పదార్థాలు, ఆహారాన్ని నిల్వ చేయడంలో స్థిరంగా ఉంచే పదార్థాలు.
  4. ఆహారానికి మెత్తదనాన్ని కలిగించే పదార్థాలు, వివర్ణకారకాలు
  5. యాంటీ ఆక్సీకరణులు
  6. పరిరక్షక పదార్థాలు
  7. ఖనిజాలు, విటమిన్లు, ఎమైనో ఆమ్లాలు లాంటి పౌష్టిక విలువలను పెంచే పదార్థాలు.

ప్రశ్న 14.
ఆహార పదార్థాలలో యాంటీ ఆక్సీకరణుల గురించి లఘు వ్యాఖ్య రాయండి.
జవాబు:
ఇవి ముఖ్యమైన, అవసరమైన ఆహార పదార్థాల సంకలితాలు. ఇవి ఆహారపదార్థాలపై ఆక్సిజన్ జరిపే చర్య వేగాన్ని తగ్గించి, ఆహార పదార్థాల సంరక్షణకు తోడ్పడతాయి. ఇవి తాము సంరక్షించే ఆహార పదార్థాలతో కంటే ఆక్సిజన్తో అధిక చర్యాశీలతను ప్రదర్శిస్తాయి.
ఉదా: బ్యుటెలేటెడ్ హైడ్రాక్సీటోలీన్ (BHT), బ్యుటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్ (BHA)

ప్రశ్న 15.
సబ్బుల భిన్న రకాలను తెల్పండి.
జవాబు:

  1. శరీర శుద్ధికి వాడే సబ్బులు
  2. నీటిలో తేలే గుణం గల సబ్బులు
  3. పారదర్శకత గల సబ్బులు
  4. వైద్య ప్రాముఖ్యం గల సబ్బులు
  5. షేవింగ్ సబ్బులు
  6. లాండ్రీ సబ్బులు
  7. సబ్బు చిప్స్
  8. గరుకుగా ఉండే సబ్బులు
  9. సబ్బు చూర్ణాలు
  10. సబ్బు కణికలు

ప్రశ్న 16.
సరైన ఉదాహరణలతో కింది వాటిని వివరించండి.
(i) కాటయాన్ డిటర్జెంట్లు
(ii) ఆనయాన్ డిటర్జెంట్లు.
(iii) అయానేతర డిటర్జెంట్లు
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 4
(i) కాటయాన్ డిటర్జెంట్లు :
ఎసిటేట్లు, క్లోరైడ్లు, బ్రోమైడ్లు ఆనయాన్లుగా గల ఎమీన్ల క్వాటర్నరీ అమ్మోనియం లవణాలే కాటయానిక డిటర్జెంట్లు. కాటయాన్ భాగంలో పొడవైన హైడ్రోకార్బన్ -గొలుసు ఉంటుంది. నైట్రోజన్పై ధనావేశం ఉంటుంది. కాబట్టి వీటిని కాటయానిక డిటర్జెంట్లు అంటారు. సిటైల్ ట్రై మిథైల్ అమోనియమ్ బ్రోమైడ్ చాలా ఎక్కువగా వాడకంలో ఉన్న కాటయాన్ డిటర్జెంటు. దీనిని హెయిర్ కండిషనర్లలో వాడతారు. వీటికి క్రిములను నాశనం చేసే ధర్మం ఉంది. ఇవి చాలా ఖరీదైనవి. కాబట్టి ఇవి తక్కువ స్థాయిలోనే వాడకంలో ఉన్నాయి.

(ii) ఆనయాన్ డిటర్జెంట్లు :
పొడవైన కార్బన్ గొలుసు నిర్మాణాలు గల సల్ఫోనేటెడ్ ఆల్కహాల్ల లేదా సల్ఫోనేటెడ్ హైడ్రోకార్బన్ల సోడియం లవణాలే ఆనయానిక డిటర్జెంట్లు. పొడవైన కర్బన గొలుసుల నిర్మాణాలు గల ఆల్కహాల్లను, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపించి, తర్వాత క్షారంతో తటస్థీకరణ చర్యకు గురి చేసినప్పుడు ఆనయానిక డిటర్జెంట్లు ఏర్పడతాయి. ఇదే విధంగా ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లాలను క్షారాలతో తటస్థీకరణం చెందించినపుడు కూడా ఇవి ఏర్పడతాయి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 5

ఆనయానిక డిటర్జెంట్లలో అణువులోని ఆనయాన్ భాగం మాత్రమే శుభ్రపరిచే ప్రక్రియలో పాల్గొంటుంది. ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్ల సోడియం లవణాలు అతి ముఖ్యమైన ఆనయానిక డిటర్జెంట్లు. ఇవి మన ఇండ్లలో విరివిగా వాడతారు. ఆనయాన్ డిటర్జెంట్లను టూత్ పేస్టులో కూడా వాడతారు.

(iii) అయానేతర డిటర్జెంట్లు :
వీటి నిర్మాణంలో అయాన్లు ఉండవు. పాలి ఇథైల్ గ్లైకాల్, స్టియారిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు అటువంటి ఒక డిటర్జెంటు ఏర్పడుతుంది.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 6
పాత్రలను శుభ్రం చేసే ద్రవ రూపంలో ఉండే డిటర్జెంట్లు అయానేతర డిటర్జెంట్ల రకానికి చెందినవి.

ప్రశ్న 17.
జీవక్రమ పతన క్రియకు గురయ్యే డిటర్జెంట్లు, జీవక్రమ పతన క్రియకు గురికాని డిటర్జెంట్లు అంటే ఏమిటి? ప్రతిదానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
డిటర్జెంట్లులోని హైడ్రోకార్బన్ శృంఖలం అతిగా శాఖాయుతమై ఉంటే బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వీటిని సులభంగా క్రమ పతన క్రియకు గురి చేయలేవు. కావున వీటిని జీవక్రమ పతన క్రియకు గురికాని డెటర్జెంట్లు అంటారు. (డిటర్జెంట్లులోని) శాఖాయుతం కాని హైడ్రోకార్బన్ శృంఖలం గల డిటర్జెంట్లు జీవక్రమ పతన క్రియకు లోనవుతాయి. కావున వీటిని జీవక్రమ పతన క్రియకు గురయ్యే “డిటర్జెంట్లు” అంటారు. వీటి ద్వారా కాలుష్యం ఏర్పడదు. జీవక్రమ పతన క్రియకు గురికాని డిటర్జెంట్లు అవశేషాలు ఉన్న మురుగునీరు నదులలోకి, జలాశయాలలోకి చేరుతుంది. వాటిలోని నీరు కాలుష్యానికి గురి అవుతుంది.

జీవక్రమ పతన క్రియకు గురయ్యే డిటర్జెంట్లు: ఉదా: సోడియం లారైల్ సల్ఫేట్, సోడియమ్-4-(1-డోడెకైల్) బెంజీన్ సల్ఫోనేట్ మరియు సోడియం-4-(2-డోడెకైల్) బెంజీన్ సల్ఫోనేట్.

జీవక్రమ పతన క్రియకు గురికాని డిటర్జెంట్లు: ఉదా:సోడియం 4-(1,3,5,7 టెట్రా మిథైల్ లాక్టైల్) బెంజీన్ సల్ఫోనేట్.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్రశ్న 18.
సబ్బులు జరిపే శుభ్రపరిచే ప్రక్రియను వివరించండి.
జవాబు:
సబ్బులు మురికిని తొలగించే ప్రక్రియలో సబ్బు అణువుల మిసెల్ను మురికి బిందువు వద్ద ఏర్పరుస్తాయి. ఈ చర్యలో స్టియరేట్ అయాన్లోని హైడ్రోఫోబిక్ భాగం మురికి బిందుకలోకి, హైడ్రోఫిలిక్ భాగం నిక్కబొడిచిన వెంట్రుకల్లాగా మురికి బిందుక నుంచి బయట భాగానికి ప్రక్షేపణం చెందుతాయి. పోలార్ గ్రూపులు నీటితో చర్యలో పాల్గొంటాయి. కాబట్టి స్టియరేట్ అయాన్తో పరివేష్టితమై ఉండి మురికి బిందుక నీటిలోనికి లాగబడుతుంది. ఫలితంగా మురికి ఉపరితలం నుంచి తొలగించబడుతుంది. ఈ విధంగా సబ్బు ఎమల్షన్ ఏర్పాటుకు సహాయపడి, నూనెలు, క్రొవ్వులు ఏర్పరచే మురికిని తొలగిస్తుంది. గోళికల చుట్టూ రుణావేశిత తొడుగు ఉండడం కారణంగా ఈ గోళికలు దగ్గరగా చేరి సముచ్ఛయాలు ఏర్పడవు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 7

ప్రశ్న 19.
కింది సమ్మేళనాలలో హైడ్రోఫిలిక్ భాగాలను హైడ్రోఫోబిక్ భాగాలను గుర్తించండి.
i) CH3(CH2)10CH2OSO3 Na+
(ii) CH3(CH2)15 N+(CH3)3Br
iii) CH3(CH2)16COO(CH2CH2O)n CH2CH2OH
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 8

ప్రశ్న 20.
కింది వాటి నిర్మాణాలను రాయండి.
(i) సెరోటోనిన్ (ii) బితియోనోల్ (iii) క్లోరామ్ ఫెనికోల్ (iv) సాకరీన్
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 9

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మందులను భిన్న వర్గాలుగా వర్గీకరించండి.
జవాబు:
కింద పేర్కొన్న లక్షణాల ఆధారంగా మందులను వర్గీకరిస్తారు.
ఎ) వ్యాధి సంబంధ ఔషధాలుగా వర్గీకరణం :
నిబంధనల ఆధారంగా మందులను వర్గీకరిస్తారు. ఈ వర్గీకరణ వైద్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకమైన రోగ చికిత్సల విషయంలో ప్రతి వ్యాధి చికిత్సకు అందుబాటులో ఉండే మందుల గురించి ఈ వర్గీకరణ తెలుపుతుంది.

బి) మందులు జరిపే చర్యల ఆధారంగా వర్గీకరణ :
ప్రత్యేక జీవరసాయన ప్రక్రియపై మందు జరిపే చర్య ఆధారంగా ఈ వర్గీకరణ ఉంటుంది. ఉదాహరణకు శరీరంలో వాపును కలిగించే హిస్టమిన్ పదార్థం జరిపే చర్యను నిరోధించే మందులను యాంటీ హిస్టమిన్లు లేదా హిస్టమిన్ వ్యతిరేకులు అంటారు.

సి) ఔషధాల లక్ష్య అణువుల ఆధారంగా వర్గీకరణ :
కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు లాంటి చాలా జీవాణువులతో మందులు చర్య జరుపుతాయి. ఈ జీవాణువులనే ‘లక్ష్య అణువులు లేదా మందుల లక్ష్యాలు’ అంటారు. వైద్య రసాయన శాస్త్రవేత్తలకు లక్ష్య అణువుల ఆధారంగా చేసిన మందుల వర్గీకరణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

(డి) మందులలోని రసాయన పదార్థాల నిర్మాణాల ఆధారంగా వర్గీకరణ :
ఈ వర్గీకరణ మందులలోని రసాయన పదార్థాల నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. ఈ వర్గీకరణలో చోటుచేసుకొన్న మందులన్నింటిలోను ఉండే రసాయన పదార్థాలకు ఒకే రకమైన నిర్మాణం ఉంటుంది. అంతే కాకుండా వీటన్నింటికి ఔషధ శాస్త్ర సంబంధమైన చర్యలు ఒకే విధంగా ఉంటాయి.

ప్రశ్న 2.
భిన్న వర్గాల మందుల చికిత్సా చర్యలను స్థూలంగా వర్ణించండి.
జవాబు:
a. ఆమ్ల విరోధులు :
ఉదరము నందలి ఆమ్లాన్ని తగ్గించి, సాధారణ PH ను నియంత్రించు రసాయనాలను యాంటాసిడ్లు అంటారు.
ఉదా : ఓమప్రజోల్, లాన్సెప్రజోల్.

b. యాంటీ హిస్టమీన్లు :
ఉదరం గోడలకు ఉండే అభిగ్రాహకాల వద్దకు హిస్టిమీన్ వెళ్ళకుండా నిరోధించే రసాయనాలను యాంటీహిస్టమైన్లు అంటారు. వీటి వలన అతి తక్కువ ఆమ్లం ఉత్పత్తి అగును.
ఉదా : డైమిథీన్, సెల్డీన్.

c. ట్రాంక్విలైజర్లు :
సైకోసిన్, న్యూరోసిన్ వంటి మానసిక వ్యాధుల నివారణకు ఉపయోగించే మందులను ట్రాంక్విలైజర్లు అంటారు.
ఉదా : ల్యుమినాల్, సెకనాల్ మొ||నవి.

d. అనాల్జెసిక్ు :
ఇవి నొప్పి తగ్గించును లేదా నాడీవ్యవస్థకు హాని చేయకుండా నొప్పిని పూర్తిగా తొలగించును. ఇవి స్పృహ కోల్పోవడం, మానసిక ఆందోళన, పక్షవాతం వంటి నరాల వ్యవస్థకు సంబంధించిన ప్రభావాలను కల్గించవు.
ఉదా :ఆస్పరిన్, ఐబుప్రొఫెన్

e. నార్కొటిక్ ఎనాల్జిసిక్లు :
నార్కొటిక్ మందులు వైద్యపరంగా చాలా శక్తివంతమైనవి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను బలహీనపరచి బలమైన ఎనాల్జెసిక్లుగా పనిచేయును.
ఉదా : మార్ఫిన్, కొడీన్.

f. నార్కొటిక్ ఎనాల్జెసిక్ లు కాని ఎనాల్జెసిక్ లు :
ఇవి చిన్న చిన్న నొప్పులను, బాధలను తగ్గించు మందులు. కాని ఇవి వశవరచుకొనే ధర్మంలేని పదార్థాలు తలనొప్పి లాంటి వాటికి ఉపయోగపడును.
ఉదా : ఆస్పరిన్, ఐబూప్రొఫెన్.

g. యాంటీ మైక్రోబియల్స్ :
వ్యాధిని కలుగచేయు సూక్ష్మజీవులను నాశనం చేయుటకు లేదా వాటి పెరుగుదలను నివారించు మందులను యాంటిమైక్రోబియల్ మందులు అంటారు. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించును.
ఉదా: లైసోజోమ్, లాక్టిక్ ఆమ్లం మొదలగునవి.

h. యాంటీ బయోటిక్లు: ఇవి సూక్ష్మజీవులను ఉత్పన్నం చేయగా అవి ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిర్మూలించుటకు లేదా నిరోధించుటకు ఉపయోగపడును.
ఉదా : పెన్సిలిన్, క్లోరమ్ ఫినకాల్, సల్ఫాడైజీన్.

i. యాంటీ సెప్టిక్లు :
సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించుట లేదా నాశనం చేయుటకు ఉపయోగించు మందులను `యాంటీ సెప్టిక్లు అంటారు.
ఉదా : డెట్టాల్, బితినోల్, టింక్చర్ ఆఫ్ అయోడిన్.

j. క్రిమి సంహారిణులు :
సూక్ష్మ క్రిముల పెరుగుదలను నిరోధించుటకు లేదా నాశనం చేయుటకు వీటిని వాడుతారు. వీటిని జీవరహిత వ్యవస్థలైన మురుగుకాలువలలో ఉపయోగిస్తారు.
ఉదా: i) 4% ఫార్మాల్డిహైడ్ జలద్రావణాన్ని ఫార్మాలిన్ అంటారు. ఇది క్రిమి సంహారిణి.
ii) 0.3 ppm గాఢత కల క్లోరిన్ ద్రావణం క్రిమి సంహారిణిగా వాడుతారు.

k. గర్భనిరోధక మందులు :
ఇవి సాధారణ స్టెరాయిడ్లు ఇవి గర్భ నిరోధక పదార్థాలుగా పనిచేయును. ఈ మందులు స్త్రీలో ఋతు చక్రములను నియంత్రించును.
ఉదా : నార్ఆథిన్డ్రోన్, మిఫెప్రిస్టోన్, ఇథైనిలెస్ట్రాడియోల్ (నోవెస్ట్రోల్)

ప్రశ్న 3.
యాంటీ మైక్రోబ్ మందుల గురించి వ్యాసం రాయండి.
జవాబు:
బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఇంకా ఇతర వ్యాధి కారకాలు లాంటి ఎన్నో రకాల సూక్ష్మజీవుల ద్వారా మానవులలోను, జంతువులలోను వ్యాధులు కలుగుతాయి. వ్యాధిని కలుగచేయు సూక్ష్మజీవులను నాశనం చేయుటకు లేదా వాటి పెరుగుదలను నివారించు మందులను యాంటి మైక్రోబియల్ మందులు అంటారు. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించును.

ఇవి చాలా రకాలు.
a. యాంటీ బయోటిక్స్ – పెన్సిలిన్, ఎరిత్రోమైసిన్
b. యాంటీ సెప్టిక్లు – ఫ్యూరసీన్, సోఫ్రామైసీన్, డెట్టాల్
c. క్రిమిసంహారిణులు – 1% ఫినాల్ ద్రావణం, 0.2-0.4 ppm గాఢతలో గల క్లోరిన్ జలద్రావణం

యాంటీ బయోటిక్ల అభిలాక్షణిక ధర్మాలు

  1. యాంటీ బయోటిక్ జీవుల జీవక్రియలలో ఏర్పడే క్రియాజన్యం అయి ఉండాలి.
  2. యాంటీ బయోటిక్కు అల్ప పరిమాణాలలోనే క్రియాశీలత ధర్మం ఉండాలి.
  3. యాంటీ బయోటిక్, సూక్ష్మజీవుల పెరుగుదలను లేదా బతుకు ప్రక్రియలను మందిత పరచాలి.
  4. సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్ నిర్మాణంలో సారూప్యత ప్రదర్శించే సంక్లిష్ట పదార్థంగా యాంటీ బయోటిక్ ఉండాలి. యాంటీ బయోటిక్లకు సూక్ష్మజీవులను చంపే ధర్మాన్ని లేదా సూక్ష్మజీవులను నిరోధించే ధర్మం ఉండాలి.

గ్రామ్-పాజిటివ్ లేదా గ్రామ్-నెగెటివ్ బ్యాక్టీరియాను నాశనం చేసే లేదా నిరోధించే యాంటీ బయోటిక్లను అధిక క్రియాత్మక విస్తృతి యాంటీ బయోటిక్లు అంటారు. టెట్రాసైక్లిన్, ఓఫ్లోక్సాసిన్, క్లోరామ్ ఫెనికోల్ వంటి హానికర బ్యాక్టీరియాలను అధిక విస్తృతి యాంటీ బయోటిక్లు నాశనం చేస్తాయి. క్లోరామ్ ఫెనికోల్ని టైఫాయిడ్, రక్తవిరోచనాలు, అధిక జ్వరం, మూత్రానికి సంబంధించిన కొన్ని రకాల సంక్రమణాలు, మెనినైజైటిస్, నిమోనియా వ్యాధులు గల వారికి దీనిని ఉపయోగిస్తారు.

గ్రామ్-పాజిటివ్ లేదా గ్రామ్-నెగెటివ్ ఒక రకం సూక్ష్మజీవులపై మాత్రమే ప్రభావం ప్రదర్శించే యాంటీ బయోటిక్లను అల్పక్రియాత్మక విస్తృతి యాంటీ బయోటిక్లు అంటారు.
ఉదా : పెన్సిలీన్ – G

సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించుట లేదా నాశనం చేయుటకు ఉపయోగించు మందులను యాంటీ సెప్టిక్లలు అంటారు. ఇవి జీవకణజాలాలకు ఎటువంటి హాని చేయవు. యాంటీ సెప్టిక్ ను గాయాలు, కోతలు, రణాలు, రోగానికి గురైన చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణజాలాలకు పూతగా పూస్తారు.
ఉదా : డెట్టాల్, బితినోల్

క్రిమిసంహారిణులు :
సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించుటకు లేదా నాశనం చేయుటకు వీటిని వాడుతారు. వీటిని జీవరహిత వ్యవస్థలైన మురుగు కాలువలలో, నేలలు, పరికరాలు మొదలైన నిర్జీవ పదార్థాలకు పూస్తారు. ఇవి జీవకణజాలాలకు హాని చేస్తాయి. ఉదా : 1% ఫినాల్ ద్రావణం, 0.2 – 0.4 ppm గాఢతలో గల క్లోరిన్ జలద్రావణం, అల్పగాఢతలలో గల సల్ఫర్ డై ఆక్సైడ్ ద్రావణం క్రిమిసంహారిణులుగా పని చేస్తాయి.

గాఢతను మార్చినట్లైతే కొన్ని పదార్థాలు యాంటీ సెప్టిక్లుగాను, క్రిమిసంహారిణులుగా కూడా పనిచేస్తాయి. ఉదాహరణకు 0.2% ఫినాల్ ద్రావణం యాంటీ సెప్టిక్గా ఉంటే 1% ద్రావణం క్రిమిసంహారిణిగా పని చేస్తుంది.

ప్రశ్న 4.
కింది వాటిని గురించి లఘువ్యాఖ్యలు రాయండి.
i) కృత్రిమ తీపి కారకాలు ii) నిల్వ ఉంచే ఆహార పదార్థాల పరిరక్షకాలు iii) యాంటీ ఆక్సీకరణులు [TS-16,18]
జవాబు:
i) కృత్రిమ తీపి కారకాలు :
సహజ చక్కెరల స్థానంలో ఉపయోగించు కృత్రిమ రసాయనాలు. ఇవి కాలరీలను తగ్గించును. మరియు చక్కెర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువ తీపి గలవి.
ఉదా : ఆస్పర్టేమ్, సాకరీన్, సుక్రోజ్ మొ||నవి.

సుక్రోజ్ వంటి తీపి రుచిని కల్గించే సహజ పదార్థాలు సేవిస్తే ఆహార పదార్థాలు శరీరానికి అందించే కేలరీల పరిమాణం కూడా పెరుగుతుంది. కాబట్టి మధుమేహ రోగులు కృత్రిమ తీపి కారకాలు వాడటానికి ఇష్టపడతారు. ఇవి ఆహారం అందించే కేలరీలను నియంత్రిస్తాయి. సాకరిన్, గడ చక్కెర (పంచదార) కంటే 550 రెట్లు తియ్యగా ఉంటుంది. సాకరీస్ శరీరం నుంచి మూత్రం ద్వారా రసాయనికంగా ఎటువంటి మార్పు చెందకుండా బహిష్కృతమవుతుంది. మధుమేహ రోగులకు దీని ఉపయోగం చాలా విలువైంది.

ఆస్పార్టేమ్ :
ఇది మిక్కిలి ప్రయోజనకరమైన, విస్తృతంగా వాడకంలో ఉండే కృత్రిమ తీపి కారకం. గడ చక్కెర (పంచదార) కంటే ఇది 100 రెట్లు తియ్యగా ఉంటుంది. ఇది ఆస్పార్టిక్ ఆమ్లం, ఫినైల్ ఎలనీన్ కలిసి ఏర్పరచిన డై పెప్టైడ్ మిథైల్ ఎస్టర్. ఆహారం వండే ఉష్ణోగ్రతల వద్ద ఇది అస్థిరం. అందువల్ల దీనిని శీతల ఆహార పదార్థాలలో, .శీతల పానీయాలలో మాత్రమే ఉపయోగిస్తారు.

అలిటేమ్ :
ఇది అత్యధిక తియ్యదనాన్ని అందించే కృత్రిమ తీపి కారకం ఆస్పర్టేమ్ కంటే ఇది స్థిరంగా ఉండే పదార్థం అయితే దీనిని వాడినపుడు అది అందించే తియ్యదనాన్ని నియంత్రించడం చాలా కష్టం.

సుక్రలోజ్ :
ఇది సుక్రోజ్ ట్రైక్లోరో ఉత్పన్నం. దీని రూపం, రుచి రెండూ గడ చక్కెరను (పంచదార) పోలి ఉన్నాయి. ఇది ఆహారం వండే ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరంగానే ఉంటుంది. దీనిని సేవించినప్పటికీ ఇది శరీరానికి కేలరీలను అందించదు.

ii. నిల్వ ఉంచే ఆహార పదార్థాల పరిరక్షకాలు :
సూక్ష్మజీవుల వృద్ధి ద్వారా ఆహార పదార్థాలు చెడిపోయే ప్రమాదం నుంచి ఇవి ఆహారపదార్థాలను సంరక్షిస్తాయి. సాధారణ ఉప్పు, పంచదార, వంటనూనెలు, సోడియం బెంజోయేట్ (C6H5COONa) ఇవన్నీ మనం సామాన్యంగా ఉపయోగించే ఆహార పదార్థాల సంరక్షకాలు. తక్కువ పరిమాణాలలో కూడా ఉపయోగించే అతి ముఖ్యమైన సంరక్షక పదార్థం, సోడియం బెంజోయేట్. ఇది జీవక్రియలో హిప్యూరిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ ఆమ్లం మూత్రం ద్వారా బహిష్కృతమవుతుంది. సార్బిక్ ఆమ్లం, ప్రొపనోయిక్ ఆమ్ల లవణాలను కూడా సంరక్షక పదార్థాలుగా వాడతారు.

iii.యాంటీ ఆక్సీకరణులు :
ఇవి ముఖ్యమైన, అవసరమైన ఆహార పదార్థాల సంకలితాలు. ఇవి ఆహార పదార్థాలపై ఆక్సిజన్ జరిపే చర్య వేగాన్ని తగ్గించి, ఆహార పదార్థాల సంరక్షణకు తోడ్పడతాయి. ఇవి తాము సంరక్షించే ఆహార పదార్థాలతో కంటే ఆక్సిజన్తో అధిక చర్యాశీలతను ప్రదర్శిస్తాయి. బ్యుటైలేటెడ్ హైడ్రాక్సీటోలీన్ (BHT), బ్యుటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్ (BHA) లు రెండూ అతి ప్రాచుర్యం గల యాంటీ ఆక్సీకరణులు. వెన్నకు BHA ను కలిపినట్లైతే వెన్న చెడిపోకుండా ఉండే నిల్వ కాలం నెలల నుంచి సంవత్సరాలకు పెరుగుతుంది.

కొన్ని సందర్భాలలో BHT, BHA లను సిట్రిక్ ఆమ్లంతో కలిపి అధిక ప్రభావం కోసం వాడతారు. వైను, బీరు, చక్కెర, సిరప్పులు, ముక్కలుగా కోసిన లేదా తొక్కలు తీసిన పండ్లు, ఎండబెట్టిన పండ్లు, కూరగాయలు మొదలైన వాటిలో సల్ఫర్ డై ఆక్సైడ్ను, సల్ఫైట్ను యాంటీ ఆక్సీకరణులుగా వాడతారు.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్రశ్న 5.
(ఎ) సబ్బులు (బి) కృత్రిమ డిటర్జెంట్లు గురించి లఘువ్యాఖ్యలు రాయండి.
జవాబు:
(ఎ) సబ్బులు :
పొడవాటి కర్బన గొలుసులు గల ఫాటీ ఆమ్లాల యొక్క సోడియం లేదా పొటాషియం లవణాలే సబ్బులు. కొవ్వు పదార్థాన్ని (కొవ్వు ఆమ్లాల గ్లిసరైల్ ఎస్టర్లు) సోడియం హైడ్రాక్సైడ్ జలద్రావణంతో కలిపి వేడి చేసి సోడియం లవణాలు గల సబ్బులను తయారుచేస్తారు. దీనిని సబ్బు ఏర్పడే చర్య (saponification) అంటారు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 10

ఈ చర్యలో కొవ్వు ఆమ్లాల ఎస్టర్లు జలవిశ్లేషణం చెంది అప్పుడు ఏర్పడిన సబ్బు కొల్లాయిడ్ రూపంలో ఉంటుంది. ఈ చర్యా ద్రావణానికి, సోడియం క్లోరైడ్ను కలిపితే సబ్బు అవక్షేపణం చెందుతుంది. ఈ ద్రావణం నుంచి సబ్బును వేరు పరచినట్లైతే మిగిలిన ద్రావణంలో గ్లిసరాల్ కరిగి ఉంటుంది. దీనిని అంశిక స్వేదనం ప్రక్రియ ద్వారా వేరుపరుస్తారు. సోడియం, పొటాషియం సబ్బులు మాత్రమే నీటిలో కరుగుతాయి. వీటినే శుభ్రపరిచే ప్రక్రియలలో ఉపయోగిస్తారు.

సబ్బులను కఠిన జలంలో ఉపయోగించరు. ఎందుకనగా కఠినజలంలో సోడియం లేదా పొటాషియం సబ్బులను కరిగిస్తే ఇవి వరసగా కరగని కాల్షియం, మెగ్నీషియం సబ్బులను ఏర్పరుస్తాయి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 11

ఈ కరగని సబ్బులు మడ్డి రూపంలో వేరుపడతాయి. కాబట్టి ఇవి శుభ్రపరిచే కారకాలుగా పనిచేయవు. ఎందుకంటే ఈ అవక్షేపాలు వస్త్రాలపై జిగురు పదార్థాలుగా అతుక్కుపోతాయి. ఈ జిగురు అవక్షేపం కారణంగానే కఠినజలంతో శుభ్రపరచిన తలవెంట్రుకలు కాంతిహీనంగా ఉంటాయి. కఠినజలంలో సబ్బుతో శుభ్రపరిచిన వస్త్రాలపై రంగులు సజాతీయంగా అభిశోషించబడవు. ఈ జిగురుగా ఉండే అవక్షేపమే దీనికి కారణం.

(బి) సంక్లిష్ట లేదా కృత్రిమ డిటర్జెంట్లు :
సబ్బుల ధర్మాలన్నీ ఉండి, వాటిలో మాత్రం సబ్బులు లేని శుభ్రపరిచే కారకాలను సంక్లిష్ట లేదా కృత్రిమ డిటర్జెంట్లు అంటారు. ఇవి కఠినజలంలో కూడా నురుగును ఇవ్వడం కారణంగా వీటిని కఠినజలంలోను, మృదుజలంలోను కూడా ఉపయోగిస్తారు. సంక్లిష్ట డిటర్జెంట్లను 3 రకాలుగా విభజిస్తారు. అవి :
(i) కాటయానిక డిటర్జెంట్లు
(ii) ఆనయానిక డిటర్జెంట్లు
(iii) అయానేతర డిటర్జెంట్లు.

(i) కాటయాన్ డిటర్జెంట్లు :
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 12
ఎసిటేట్లు, క్లోరైడ్లు, బ్రోమైడ్లు ఆనయాన్లుగా గల ఎమీన్ల క్వాటర్నరీ అమ్మోనియం లవణాలే కాటయానిక డిటర్జెంట్లు. కాటయాన్ భాగంలో పొడవైన హైడ్రోకార్బన్ గొలుసు ఉంటుంది. నైట్రోజన్పై ధనావేశం ఉంటుంది. కాబట్టి వీటిని కాటయానిక డిటర్జెంట్లు అంటారు. సిటైల్ ట్రై మిథైల్ అమోనియమ్ బ్రోమైడ్ చాలా ఎక్కువగా వాడకంలో ఉన్న కాటయాన్ డిటర్జెంటు. దీనిని హెయిర్ కండిషనర్లలో వాడతారు. వీటికి క్రిములను నాశనం చేసే ధర్మం ఉంది. ఇవి చాలా ఖరీదైనవి. కాబట్టి ఇవి తక్కువ స్థాయిలోనే వాడకంలో ఉన్నాయి.

(ii) ఆనయాన్ డిటర్జెంట్లు :
పొడవైన కార్బన్ గొలుసు నిర్మాణాలు గల సల్ఫోనేటెడ్ ఆల్కహాల్ లేదా సల్ఫోనేటెడ్ హైడ్రోకార్బన్ల సోడియం లవణాలే ఆనయానిక డిటర్జెంట్లు. పొడవైన కర్బన గొలుసుల నిర్మాణాలు గల ఆల్కహాల్లను, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపించి, తర్వాత క్షారంతో తటస్థీకరణ చర్యకు గురి చేసినప్పుడు ఆనయానిక డిటర్జెంట్లు ఏర్పడతాయి. ఇదే విధంగా ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లాలను క్షారాలతో తటస్థీకరణం చెందించినపుడు కూడా ఇవి ఏర్పడతాయి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 13

ఆనయానిక డిటర్జెంట్లలో అణువులోని ఆనయాన్ భాగం మాత్రమే శుభ్రపరిచే ప్రక్రియలో పాల్గొంటుంది. ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్ల సోడియం లవణాలు అతి ముఖ్యమైన ఆనయానిక డిటర్జెంట్లు. ఇవి మన ఇండ్లలో విరివిగా వాడతారు. ఆనయాన్ డిటర్జెంట్లను టూత్ పేస్టులో కూడా వాడతారు.

(iii) అయానేతర డిటర్జెంట్లు :
వీటి నిర్మాణంలో అయాన్లు ఉండవు. పాలి ఇథైల్ గ్లైకాల్, స్టియారిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు అటువంటి ఒక డిటర్జెంటు ఏర్పడుతుంది.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం 14
పాత్రలను శుభ్రం చేసే ద్రవ రూపంలో ఉండే డిటర్జెంట్లు అయానేతర డిటర్జెంట్ల రకానికి చెందినవి.

Leave a Comment