AP Inter 1st Year Zoology Notes Chapter 8 జీవావరణం – పర్యావరణం

Students can go through AP Inter 1st Year Zoology Notes 8th Lesson జీవావరణం – పర్యావరణం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Zoology Notes 8th Lesson జీవావరణం – పర్యావరణం

→ పర్యావరణం అనునది పరిణామక్రమానికి మరియు జీవ అనుక్రమానికి ప్రధాన కారకం. ‘జీవావరణం’ అనగా జీవులకు, పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేయు శాస్త్రం.

→ శక్తి లేకుండా జీవులు మనుగడ సాగించలేవు.

→ ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని ‘సౌరశక్తి’ అన్ని జీవులకు ప్రధాన మూలాధారవనరు.

→ పరిణామ క్రమంలో ‘పత్రహరితం ద్వారా గ్రహించుట మరియు నిల్వచేసుకోవటం’ అనేది ఒక ప్రధాన సోపానం.

→ వాతావరణ బాహ్య పొరలలో ఉండే ఓజోన్ ఎంతో ఉపయుక్తమైనది. ఇది సూర్యుడు నుంచి వచ్చే UV కిరణాల నుంచి జీవులను కాపాడుతుంది.

→ కాలుష్యకాలు భూమి ప్రారంభం నుంచి వున్నవి, కాని అవి ‘కాలుష్యకాలు కానివాటి’తో సమతుల్యం చేయబడినవి.

AP Inter 1st Year Zoology Notes Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

→ ప్రస్తుతం మానవుడే కాలుష్యకాల అసమతుల్యతకు ప్రధాన బాధ్యుడు అవుతున్నాడు. సరైన నివారణ చర్యలను చేపట్టకపోతే తన నాశనానికి తనే బాధ్యుడవుతాడు.

→ UV కిరణాలు సూక్షజీవులను నశింపచేస్తాయి. UV కిరణాలు చర్మంనందుకల స్టిరాల్స్ ను విటమిన్ D గా మారుస్తాయి. [IPE]

→ ‘అన్యోన్యాశ్రయ సహజీవనం’ రెండు భిన్నజాతుల మధ్య సహజీవనం. దీని యందు రెండు జాతులు లాభపడతాయి. ఉదా: తేనేటీగలు మరియు పుష్పించే మొక్కలు [IPE]

→ గ్రీష్మస్తరీభవనం: వేసవికాలం నందు సమశీతోష్ణ సరస్సులలో నీరు మూడు పొరలుగా ఏర్పడుటను గ్రీష్మస్తరీ భవనం అంటారు. [IPE]

→ DFC అనునది డెట్రిటస్ ఆహారపు గొలుసు. డెట్రైటస్ కుళ్ళిన ఆకులు, మృత కళేబరాలు మరియు జంతువుల విసర్జితాల ద్వారా ఏర్పడుతుంది. [IPE]

→ హరిత గృహ ప్రభావం:భూ ఉపరితలాన్ని మరియు వాతావరణాన్ని వేడేక్కించటంలో ప్రకృతి పరంగా సంభవించే దృగ్విషయమే ‘హరిత గృహ ప్రభావం’. [IPE]

→ భూతాపం: వాతావరణంలో సాధారణ స్థాయి కంటే అధికంగా ఉష్ణోగ్రత స్థాయి ఉండటాన్ని ‘భూతాపం’ [IPE] అంటారు.ఇది హరిత గృహ ప్రభావం నుంచి విడుదలయ్యే వాయువుల వలన సంభవిస్తుంది.

→ సరస్సు జీవావరణవ్యవస్థ మండలాలు: [IPE]

  1. వేలాంచల మండలం
  2. లిమ్నెటిక్ మండలం
  3. ప్రొఫండల్ మండలం

→ ఆవరణవ్యవస్థ యొక్క ఆహరపు గొలుసు: [IPE]

  1. మేసే జీవుల ఆహార గొలుసు
  2. పరాన్న జీవుల ఆహార గొలుసు
  3. డెట్రైటస్ ఆహార గొలుసు

AP Inter 1st Year Zoology Notes Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

→ ప్రధాన వాయు కాలుష్యకాలు: [IPE]

  1. కార్బన్మెనాక్సైడ్
  2. కార్బన్ డై ఆక్సైడ్
  3. సల్ఫర్ డై ఆక్సైడ్
  4. నైట్రోజన్ ఆక్సైడ్
  5. రేణురూప పదార్థాలు
  6. శబ్ద కాలుష్యం

Leave a Comment